Sri Naradapuranam-I
Chapters
Last Page
ద్వితీయో7ధ్యాయః రెండవ అధ్యాయము నారదకృత విష్ణుస్తుతిః ఋషయః ఊచుః కథం సనత్కుమారస్తు నారదాయ మహాత్మనే, ప్రోక్తవాన్సకలాన్ధర్మాన్కథం తౌ మిలితావుభౌ.
1 కస్మిన్థ్సానే స్థితౌ సూత తావుభౌ బ్రహ్‌మవాదినౌ, హరిగీతసముద్గానే చక్రతుస్తద్వదస్వ నః.
2 ఋషులు పలికిరి మహానుభావుడైన నారదునికి సనత్కుమారుడు సకలధర్మములను ఎట్లు చెప్పెను? వారిద్దరెట్లు కలిసిరి? ఓ సూతమహర్షీ! ఆ ఇద్దరు బ్రహ్మవాదులు ఏ ప్రదేశములో ఉండిరి? హరికథాగానమునెట్ల చేసిరో అది మాకు చెప్పుము అని అడిగిరి. 1,2 సూత ఉవాచ సనకాద్యా మహాత్మానో బ్రహ్మణో మానసాస్సుతాః, నిర్మమా నిరహంకారాస్సర్వేతే హ్యూర్థ్వరేతసః. 3 తేషాం నామాని వక్ష్యామి సనకశ్చ సనందనః, సనాత్కుమారస్సవిభుస్సనాతన ఇతి స్మృతః. 4 విష్ణుభక్తా మహాత్మానో బ్రహ్మధ్యానపరాయణాః, సహస్రసూర్యసంకాశాః సత్యసంధా మముక్షవః. 5 ఏకదా మేరుశృంగం తే ప్రస్థితా బ్రహ్మణస్సభామ్, ఇష్టాం మార్గే7థ దదృశుర్గంగాం విష్ణుపదీం ద్విజాః. 6 తాం నిరీక్ష్య సముద్యుక్తాస్స్నాతుం సీతాజే7భవన్, ఏతస్మిన్నంతరే తత్ర దేవర్షిర్నారదో మునిః. 7 ఆజగామ ద్విజశ్రేష్ఠా దృష్ట్వా భాతౄన్స్వకాగ్రజాన్, తాన్దృష్ట్వా స్నాతుముద్యుక్తాన్నమస్కృత్య కృతాంజలిః. 8 గృణన్నామని సప్రేమ భక్తిముక్తో మధుద్విషః, నారాయణాచ్యుతానన్త వాసుదేవ జనార్దన. 9 యజ్ఞేశ యజ్ఞపురుష కృష్ణ విష్ణో నమోస్తు తే, పద్మాక్ష కమాలాకాన్త గంగాజనక కేశవ, క్షీరోదశాయిన్ దేవేశ దామోదర నమో7స్తుతే. 10 శ్రీరామ విష్ణో! నరసింహ వామన ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ, అజానిరుద్ధామలరుఙ్మురారే త్వం పాహి నః సర్వభయాదజస్రమ్. 11 ఇత్యుచ్చరన్ హరేర్నామ నత్వా తాన్స్వాగ్రజాన్మునీన్, ఉపాసీనశ్చ తైస్సార్థం సస్నౌ ప్రీతిసమన్వితః. 12 సూతమహర్షి చెప్పెను :- సనకాదులు బ్రహ్మమానసపుత్రులు. వారందరు జితేంద్రియలు. అహంకార మమకారరహితులు. వారి పేర్లను తెలిపెదను వినుడు. సనకుడు, సునందుడు, సనత్కుమారుడు, సనాతనుడు. వీరందరూ విష్ణుభక్తులు, మహాత్ములు. బ్రహ్మధ్యానము చేయువారు. వేయిసూర్యుల కాంతిగలవారు. సత్యసంధులు, మోక్షమును కోరువారు. ఒకప్పుడు సనకాదులు బ్రహ్మసభ అయిన మేరుపర్వతశిఖరమునకు బయలుదేరిరి. వీరలు మార్గమధ్యమున తమకిష్టమైన విష్ణుపాదమునుండి పుట్టిన గంగానది చూచిరి. ఆ నదిని చూచి ఆ చల్లని నీటిలో స్నానము చేయుటకు సిద్ధపడిరి. ఓ బ్రాహ్మణోత్తములారా! ఇంతలో దేవర్షియైన నారదుడు తనకు అన్నలగు సనకాదులను చూచి అచటికి వచ్చెను. స్నానము చేయుటకు సిద్ధముగానున్న అన్నలను చూచి చేతులు జోడించి నమస్కరించి, ప్రేమతో భక్తితో శ్రీమన్నారాయణుని నామసంకీర్తనమును చేయుచుండెను. నారాయణ! అచ్యుత! అనన్త! వాసుదేవ! జనార్దన! యజ్ఞేశ! యజ్ఞపురుష! కృష్ణా! విష్ణూ! నీకు నమస్కారము. పద్మాక్ష! కమలాకాన్త! గంగాజనక! కేశవ! క్షీరసాగర శయన! దేవేశ! దామోదర! నీకు నమస్కారము. శ్రీరామ! శ్రీ విష్ణూ! నరసింహ! వామన! ప్రద్యుమ్న! సంకర్షణ! వాసుదేవ! అజ! అనిరుద్ధ! అమలరుక్! మురారే! నీవు మమ్ములను అన్ని భయములనుండి కాపాడుము. ఇట్లు శ్రీహరి నామములను కీర్తించుచు తన అగ్రజులకు నమస్కరించి వారితో కలిసి కూర్చొని, ప్రీతితో గంగలో స్నానము చేసెను. 3-12 తే7పి చాత్ర చ సీతాయా లే లోకమలాపహే, స్నాత్వా సంతర్ప్య దేవర్షిపితౄన్విగతకల్మషాః. 13 ఉత్తీర్య సంధ్యోపాస్త్యాది కృతాచారం స్వకం ద్విజాః, కథాం ప్రచక్రుర్వివిధా నారాయణగుణాశ్రితాః. 14 కృతక్రియేషు మునిషు గంగాతీరే మనోరమే, చకార నారదః ప్రశ్నం నానాఖ్యానకథాన్తరే. 15 లోకముల పాపములను నశింపజేయు చల్లని గంగాజలము నందు సనకాదులు స్నానము చేసి దేవ, ఋషి పితృదేవతలకు తర్పణములనిచ్చి కల్మషములను బోనాడి నదిని దాటి తీరముచేరి సంధ్యాపాసన చేసి తమ ఆచారములను ముగించుకొని నారాయణుని గుణములను వర్ణించు కథలను సంభాషించసాగిరి. సుందరమైన గంగాతీరమున తమ విధులను పూర్తి చేసుకొని నారాయణకథలను చెప్పుచుండగా నారదమహర్షి మధ్యలో ఇట్లు ప్రశ్నించెను. 13-15 నారద ఉవాచ :- సర్వజ్ఞాస్థ్స మునిశ్రేష్ఠా! భగవద్భక్తితత్పరాః, యూయం సర్వే జగన్నాథా భగవన్తస్సనాతనాః. 16 లోకోద్ధారపరాన్‌యుష్మాన్దీనేషు కృతసౌహృదాన్, పృచ్ఛేత్తతో వదత మే భగవల్లక్షణం బుధాః. 17 యేనేదమఖిలం జాతం జగత్థ్సావరజంగమమ్, గంగా పాదోదకం యస్య స కథం జ్ఞాయతే హరిః. 18 కథం చ త్రివిధం కర్మ సఫలం జాయతే నృణామ్, జ్ఞానస్య లక్షణం బ్రూత తపసశ్చాపి మానదాః. 19 అతిథేః పూజనం వాపి యేన విష్ణుః ప్రసీదతి, ఏవమాదీని గుహ్యాని హరితుష్టికరాణి చ, అనుగృహ్య చ మాం నాథాస్తత్త్వతో వక్తుమర్హథ. 20 నారదుడు పలికెను ఓ మునిశ్రేష్ఠులారా! మీరందరూ అన్నియూ తెలిసినవారు. భగవంతునియందు భక్తిపరులు. జగన్నాథులు, భగవంతులు. సనాతనులు. లోకమునుద్ధరించుటలో ఆసక్తి కలిగి దీనులయందు మైత్రిని చూపు మిమ్ములను అడుగుచున్నాను. నాకు భగవంతుని లక్షణమును జ్ఞానులైన మీరు తెలుపుడు. ఈ స్థావరంగమాత్మకమగు ప్రపంచమంతయు ఎవనిచే బుట్టినది? గంగ పాదోదకమైన శ్రీహరి ఎట్లు తెలియబడును? మానవులుచేయు కాయిక, వాచిక, మానసిక కర్మలు ఎట్లు సఫలమగును? జ్ఞానలక్షణమును తపోలక్షణమును చెప్పుడు. శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడగు అతిథిపూజను గూర్చి తెలుపుడు. ఇట్లు శ్రీమన్నారాయణునికి ప్రీతికలిగించు ఇటువంటి రహస్యములను నాయందు అనుగ్రహముంచి చెప్పుడు. శౌనక ఉవాచ నమః పరాయ దేవాయ పరస్మాత్పరమాయ చ, పరావరనివాసాయ సగుణాయాగుణాయ చ. 21 అమాయాయాత్మసంజ్ఞాయ మాయినే విశ్వరూపిణ, యోగీశ్వరాయ యోగాయ యోగగమ్యాయ విష్ణవే. 22 జ్ఞానాయ జ్ఞానగమ్యాయ సర్వజ్ఞానైకహేతవే, జ్ఞానేశ్వరాయ జ్ఞేయాయ జ్ఞాత్రే విజ్ఞానసంపదే. 23 ధ్యానాయ ధ్యానగమ్యాయ ధ్యాతృపాపహరాయ చ, ధ్యానేశ్వరాయ సుధియే ధ్యేయధ్యాతృస్వరూపిణ. 24 ఆదిత్యచంద్రాగ్నివిధాతృదేవాః! సిత్థాశ్చ యక్షాసురనాగసంఘాళిః యచ్ఛక్తియుక్తాస్తమజం పురాణం సత్యం స్తుతీశం సతతం నతో7స్మి. 25 యో బ్రహ్మరూపీ జగతాం విధాతా స ఏవ పాతా ద్విజ విష్ణురూపీ, కల్పాన్తరుద్రాఖ్యతనుస్సదేవశ్శేతేం7ఘ్రిపానస్తమజం భజామి. 26 యన్నామసంకీర్తనతో గజేన్ద్రో గ్రాహోగ్రబంధాన్ముముచే స దేవః, విరామానస్స్వపదే పరాఖ్యే తం విష్ణుమాద్యం శరణం ప్రపద్యే. 27 శివస్వరూపీ శివభక్తిభాజాం యో విష్ణురూపీ హరిభావితానామ్, సంకల్పపూర్వాత్మకదేహహేతుస్తమేవ నిత్యం శరణం ప్రపద్యే. 28 యః కేశిహన్తా నరకాన్తకశ్చ బాలో భుజాగ్రేణ దధార గోత్రమ్, దేవం చ భూభారవినోదశీలం తం వాసుదేవం సతతం నతో7స్మి. 29 లేభే7వతీర్యోగ్రనృసింహరూపీ యో దైత్యవక్షః కఠినం శిలావత్, విదార్య సంరక్షితావాన్స్వభక్తం ప్రహ్లాదమీశం తమం నమామి. 30 శౌనకమహర్షి చెప్పుచున్నాడు :- పరదేవునికి, పరములన్నిటికి పరుడైనవానికి నమస్కారము. పెద్దవాటిలోను చిన్నవాటిలోను సమానముగా నివసించువానికి సగుణునకు, నిర్గుణునకు నమస్కారము. మాయావశ్యుడు కానివానికి ఆత్మ అను పేరుగల వానికి, మాయారూపునకు విశ్వరూపునకు యోగీశ్వరునకు, యోగరూపునకు, యోగముచే తెలియబడువానికి విష్ణువునకు నమస్కారము. జ్ఞానస్వరూపునకు, జ్ఞానముచే తెలియబడువానికి అన్ని జ్ఞానములకు కారణమైన వానికి, జ్ఞానప్రభువునకు, తెలియదగువానికి, అన్నియూ తెలిసినవానికి, విజ్ఞానసంపద కలవానికి, నమస్కారము. ధ్యానరూపునకు, ధ్యానముచే తెలియబడువానికి, ధ్యానము చేయువారి పాపములను హరించువానికి, ధ్యానేశ్వరునికి ఉత్తమబుద్ధిస్వరూపునకు ధ్యేయస్వరూపము ధ్యాతృస్వరూపము గలవానికి నమస్కారము. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విధాత, దేవతలు, సిద్ధులు, యక్షులు, అసురులు, నాగసంఘములు ఎవని శక్తిచే శక్తిమంతులో, అట్టి అజుని , పురాణుని సత్యస్వరూవుని స్తుతినాథుని అన్ని వేళలా నమస్కరించుచున్నాను. బ్రహ్మరూపముతో జగత్తును సృజించువాడు, విష్ణురూపముతో జగత్తును రక్షించువాడు, ప్రళయకాలమున రుద్రరూపముతో జగమును సంహరించువాడు, పడుకొని తన పాదమును పానము చేయువాడు అయిన శ్రీమన్నారాయణుని నమస్కరించుచున్నాను. శ్రీమన్నారాయణుని నామ సంకీర్తనముచే గజేన్ద్రుడు మకర బాధనుండి విముక్తుడాయెను. తన నివాసమైన పరమపదమునందు ప్రకాశించు ఆది దేవుడైన శ్రీహరికి నమస్కరించుచున్నాను. శివభక్తులకు శివరూపుడుగా, విష్ణుభక్తులకు విష్ణురూపుడుగా సంకల్పమాత్రముచే దేహములను ధరించు ఆ శ్రీహరి ని అన్నివేళలా శరణు పొందుచున్నాను. కేశిని, నరకాసురుని సంహరించినవాడు, బాలుడుగా ఉండి చేతితో పర్వతమును ధరించినవాడు, భూ భారమును తొలగించుట వినోదముగా భావించువాడు అయిన దేవునికి ఎల్లప్పుడూ నమస్కరించెదను. ఉగ్రనర సింహరూపముతో నవతరించి, కఠిన శిలవలె నున్న హిరణ్యకశ్యపుని వక్షస్థలమును చీరి, తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించిన దేవునికి నమస్కరించుచున్నాను. 21-30 వ్యోమాదిభిర్భూషితమాత్మసంజ్ఞం నిరంజనం నిత్యమమేయతత్త్వమ్, జగద్విధాతారమకర్మకం చ పరం పురాణం పురషం నతో೭ స్మి. 31 బ్రహ్మేన్ద్రరుద్రానిలవాయుమర్త్య గంధర్వయక్షాసురదేవసం ఘైః స్వమూర్తిభేదైస్థ్సిత ఏక ఈశస్తమాదిమాత్మానమహం భజామి. 32 యతో భిన్నమిదం సర్వం సముద్భూతం స్థితం చ వై, యస్మిన్నేష్యతి పశ్చాచ్చ తమస్మి శరణం గతః .33 యః స్థితో విశ్వరూపేణ సంగీ వాత్ర ప్రతీయతే, అసంగీ పరిపూర్ణశ్చ తమస్మి శరణం గతః. 34 హృదగిస్థితో ೭పి యో దేవో మాయయా మోహితాత్మానామ్, న జ్ఞాయతే పరశ్శుద్ధస్తమస్మి శరణం గతః . 35 సర్వసంగనివృత్తానాం ధ్యానయోగరతాత్మనామ్, సర్వత్ర భాతి జ్ఞానాత్మ తమస్మి శరణం గతః. 36 దధార మందరం పృష్టే క్షీరోదే೭మృతమంధనే, దేవతానాం హితార్థాయ తం కుర్మం శరణం గతః . 37 దంష్ట్రాంకురేణ యో೭నన్తసముద్ధృత్యార్ణవాద్ధరామ్, తస్థావిదం జగత్ కృత్స్నం వారాహం తం నతో೭స్మృహమ్. 38 ప్రహ్లాదం గోపయన్దైత్యం శిలాతికఠినోరసమ్. విదార్య హతవాన్యో తం సృసింహం నతోస్మృహమ్. 39 లబ్థ్వా వైరోచనేర్భూమిం ద్వాభ్యాం పద్భ్యామతీత్య యః, ఆ బ్రహ్మభవనం ప్రాదాత్సురేభ్యస్తం నతో ೭జితమ్. 40 హైహయస్యాపరాధేన హ్యేకవింశతిసంఖ్యయా, క్షత్రియాన్వయభేత్తా యో జామదగ్న్యం నతోస్మి తమ్. 41 ఆవిర్భూతశ్చతుర్థా యః కపిభి. పరివారితః , హతవాన్రాక్షసానీకం రామచంద్ర నతో೭ స్మ్యహమ్. 42 మూర్తిద్వయం సమాశ్రిత్య భూభారమపహృత్య చ, సంజహార కులం స్వం యస్తం శ్రీకృష్ణమహం భ##జే. 43 భూమ్యాదిలోకత్రితయం సంహత్యాత్మానమాత్మాని, పశ్యన్తి నిర్మలం శుద్ధం తమీశానం భజామ్యహమ్. 44 యుగాన్తే పాపినో ೭శుద్ధాన్ భిత్త్వా తీక్‌ష్ణాసిధారయా, స్థాపయామాస యో ధర్మం కృతాదౌ తం నమామ్యహమ్. 45 ఆకాశాదులచే భూషించబడియున్న, ఆత్మయనబడువానిని, ఏ సంబంధము అంటనివానిని, ఇంతటి తత్త్వమిది అని కొలవలేని స్వరూపముగల వానిని, జగత్తును సృష్టించుచున్నను కర్మ చేయనివానిని, పరుడు, పురాణ పురుషుడైన వానిని శ్రీహరిని నమస్కరించుచున్నాను. బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, వాయువు, మానవులు, గంధర్వులు, యక్షులు,రాక్షసులు, దేవతలు అను భేదమును తన శరీరముచే పొందుచున్ననూ ఒకనిగానుండు ఆది ఆత్మస్వరూపుని సేవించెదను. ఈ ప్రపంచమంతయు ఎవని వలన వేరుపడి, పుట్టి, నిలచి ఎవనితో నీలమగునో ఆ దేవుని శరణు పొందుచున్నాను. విశ్వరూపముతో నుండి అన్నిటితో సంగమున్న వానివలె తోచుచు ఏ సంగము లేక పరిపూర్ణుడుగా నున్నావానిని శరణు వేడుచున్నాను. అన్ని సంగములను వదిలినవారికి, ధ్యానయోగమునందు ఆసక్తికల మనసు కలవారికి అంతటా జ్ఞానరూపునిగా భాసించువానిని శరణు వేడుచున్నాను. క్షీరసముద్రమును అమృతము కొఱకు చిలుకునపుడు దేవతల హితము కొఱకు మందర పర్వతమును మూపున దాల్చిన కూర్మావతారునికి న మస్కారము. సముద్రమునుండి భూమిని తన కోరకొనతో ఉద్ధరించి సమస్త జగత్తును నిలిపి వరాహావతారమునకు నమస్కరించుచున్నాను. ప్రహ్లాదుని కాపాడుచు, శివలలె కఠినమైన రాక్షసుని వక్షస్థలమును చీల్చిన నారసింహునికి నమస్కరించుచున్నాను. బలిచక్రవర్తినుండి భూమిని పొంది, రెండు అడుగులతో బ్రహ్మవరకు వ్యాపించియున్న ప్రపంచమును అతిక్రమించి, దేవతలకిచ్చిన త్రివిక్రమరూపునికి నమస్కరించుచున్నాను. కార్తవీర్యార్జునుని అపరాధముతో ఇరువదినొక్కమారులు క్షత్రియవంశమును సంహరించిన పరశురామునికి నమస్కరించుచున్నాను. నాలుగరూపములతో ఆవిర్భవించి వానరులతో కలిసి రాక్షససైన్యమును సంహరించిన రామచంద్రునకు నమస్కరించుచున్నాను. రెండురూపములను ధరించి భూభారమును తొలగించి తన కులమును సంహరించిన శ్రీకృష్ణుని సేవించెదను. మూడులోకములను తన స్వరూపమును తనలో లీనముచేసికొనిన దోషరహితుడు, పరిశుద్ధుడు అయిన, ఈశ్వరుని తమలో చూచుచుందరో ఆతనిని సేవించెదను. యుగాన్తమునందు పాపులను, అపరిశుద్ధులను వాడియైన ఖడ్గధారచే ఖండించి కృతయుగారంభమున ధర్మమును స్థాపించిన శ్రీహరికి నమస్కారములు. 31-45 ఏవమాదీన్యనేకాని యస్య రూపాణ్యస్య మహాత్మనః, న శక్యంతే చ సంఖ్యాతుం కోట్యబ్దేరపి తం భ##జే. 46 మహిమానం తు యన్నామ్నః పరం గంతుం మునీశ్వరాః, దేవాసురాశ్చ మనవః కథం తం క్షుల్లకో భ##జే 47 యన్నామశ్రవణనాపి మహాపాతకినో నరాః, పవిత్రతాం ప్రపద్యన్తే తం కథం స్తౌమి చాల్పధీః. 48 యథాకథంచిద్యన్నామ్ని కీర్తితే వా శ్రుతే7పి వా, పాపినస్తు విశుద్ధాస్స్యుః శుద్ధా మోక్షమవాప్నుయుః. 49 ఆత్మన్యాత్మానమాధాయ యోగినో గతకల్మషాః, పశ్యన్తి యం జ్ఞానరూపం తమస్మి శరణం గతః. 50 సాంఖ్యాః సర్వేషు పశ్యన్తి పరిపూర్ణాత్మకం హరిమ్, తమాదిదేవమజరం జ్ఞానరూపం భజామ్యహమ్ 51 సర్వసత్వమయం శాన్తం సర్వద్రష్టారమీశ్వరమ్, సహస్రశీర్షకం దేవం వన్దే భావాత్మకం హరిమ్. 52 యద్భూతం యచ్చ వై భావ్యం స్థావరం జంగమం జగత్, దశాంగులం యో7త్యతిష్ఠత్తమీశమజరం భ##జే. 53 అణోరణీయాంసమం మహతశ్చ మహాత్తరమ్, గుహ్యాద్గుహ్యతమం దేవం ప్రణమామి పునః పునః. 54 ధ్యాతః స్మృతః పూజితో వా శ్రుతః ప్రణమితో7పి వా, స్వపదం యో దదాతీశస్తం వన్దే పురుషోత్తమమ్. 55 ఇతి స్తువన్తం పరమం పరేశం హర్షామ్బుసంరుద్ధవిలోచనాస్తే, మునీశ్వరా నారదసంయుతాస్తు సనన్దనాద్యాః ప్రముదం ప్రజగ్ముః. య ఇదం ప్రాతరుత్థాయ పఠేద్వై పౌరుషం స్తవమ్, సర్వపాపవిశుద్థాత్మా విష్ణులోకం స గచ్ఛతి. 57 ఇతి శ్రీ బృహన్నారదీయపురాణ పూర్వభాగే ప్రథమపాదే సనత్కుమారనారదసంవాదే నారదకృత విష్ణుస్తుతిర్నామ ద్వితీయో7ధ్యాయః ఇటువంటి అనేక రూపములు కలవు. శ్రీమన్నారాయణుని అవతారములను రూపములను లెక్క పెట్టగలవారెవ్వరూ లేరు. కొన్ని సంవత్సరములు లెక్కించిననూ సరిపోవు. శ్రీమన్నారాయణుని నామమాహాత్మ్యమును సంపూర్ణముగా మహర్షులు కూడా తెలియలేరు. దేవతలు, రాక్షసులు, మనువులు తెలియజాలరు. అంతటి మహిమగల ప్రభువును క్షుద్రుడను నేనెట్లు భజించగలను? శ్రీమన్నారాయణుని పేరును వినినంతనే మహాపాపులైన మానవులు కూడా పవిత్రులగుదురు. అల్పబుద్ధినైన నేనెట్లు ఆ స్వామిని స్తుతించగలను? ఏదో విధముగా శ్రీమన్నారాయణుని పేరును కీర్తించిననూ వినిననూ పాపులు పరిశుద్ధలగుదురు. పరిశుద్ధులు మోక్షమును పొందగలరు. దోషరహితులైన యోగులు మనసులో నిలిపి చూచు జ్ఞానరూపుడైన పరమాత్ముని శరణు వేడుచున్నాను. జ్ఞానులు అన్నిటిలో పరిపూర్ణుడైన శ్రీహరిని చూచెదరు. అట్టి జ్ఞానరూపుని ఆదిదేవుని పుట్టుకలేని శ్రీహరిని నేను భజించెదను. సర్వసత్త్వస్వరూపుడు, శాన్తుడు, అన్నిటిని చూచువాడు, అందరికి ప్రభువు, భావస్వరూపుడు, సహస్రశీర్షుడు అయిన శ్రీహరికి నమస్కరించుచున్నాను. జరిగినది, జరుగనున్నది, స్థావరము జంగమము, అయిన జగత్తును అతిక్రమించి దశాంగులపర్యన్తము వ్యాపించియున్న జగదీశ్వరుని, జరారహితుని సేవించెదను. అణువులకన్నా అణువు, మహత్తుల కంటె మహత్తు, రహస్యములలో కెల్ల పరమరహస్యము అయిన ఆదిదేవుని మాటిమాటికి నమస్కరించెదను. ఒక మారు ధ్యానించినను, తలచినను, పూజించినను, వినినను, నమస్కరించినను తన లోకమునిచ్చు జగదీశ్వరుడగు పురుషోత్తముని నమస్కరించుచున్నాను. ఇట్లు పరమాత్మను శౌనకమహర్షి స్తుతించుచుండగా నారదునితో గూడిన సనందనాదులు, ఇతర మునీశ్వరులు ఆనంద బాష్పములు చూపునడ్డగించుచుండగా పరమానందమును పొందిరి. ఈ పురుషోత్తముని స్తోత్రముని ప్రాతఃకాలమున లేచి చదువువారు అన్ని పాపములు నశించి పరిశుద్ధులై విష్ణులోకమును పొందెదరు. 46-57 ఇది శ్రీబృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సనత్కుమారనారదసంవాదమున నారదకృత విష్ణుస్తుతియను రెండవ అధ్యాయము ముగిసినది.