Sri Naradapuranam-I
Chapters
Last Page
వింశో೭ధ్యామ్యః = ఇరువదియవ అధ్యాయము సుమతిభూపకథావర్ణనమ్ నారద ఉవాచ:- భగవన్సర్వధర్మజ్ఞ ! సర్వశాస్త్రార్ధపారగ ! సర్వకర్మవరిష్ఠం చ త్వయోక్తం ధ్వజధారణమ్. 1 యస్తు వై సుమతి ర్నామ ధ్వజారోపపరో మునే ! త్వయోక్తస్తస్య చరితం విస్తరేణ మమాదిశ. 2 నారద మహర్షి పలికెను :- సర్వధర్మములను, సర్వశాస్త్రార్ధములను చక్కగా నెరిగిన మహానుభావా ! ధ్వజారోపణము అన్ని కర్మలలో నుత్తమమని చెప్పియుంటివి. సుమతియను మహారాజు ధ్వజారోపణమును చేసెనని చెప్పియుంటివి. ఆ సుమతి చరిత్రను నాకు విస్తరముగా తెలియజేయుము. 1-2 సనక ఉవాచ :- శృణుషై#్వకమనాః పుణ్యమితిహాసం పురాతనమ్, బ్రహ్మణా కథితం మహ్యం సర్వపాపప్రణాశనమ్. 3 ఆసీత్పురా కృతయుగే సుమతిర్నాఘ భూపతిః, సోమవంశోద్భవశ్శ్రీమాన్ సప్తద్వీపైకనాయకః. 4 ధర్మాత్మా సత్యసంపన్నశ్శుచివంశ్యో೭తిథిప్రియః, సర్వలక్షమణసంపన్నః సర్వసంపద్విభూషితః. 5 సదాహరికథా సేవీ హరిపూజాపరాయణః, హరిభక్తిపరాణాం చ శుశ్రూషుర్నిరహంకృతిః. 6 పూజ్యపూజారతో నిత్యం సమదర్శీ గుణాన్వితః, సర్వభూతహితః శాన్తః కృతజ్ఞః కీర్తిమాంస్తథా. 7 తస్య భార్యా మహాభాగా సర్వలక్షణసంయుతా , పతివ్రతా పతివ్రణా నామ్నా సత్యమతిర్మునే. 8 తావుభౌ దంపతీ నిత్యం హరిపూజాపరాయణౌ, జాతిస్మరౌ మహాభాగౌ సత్యజ్ఞౌసత్పరాయణౌ. 9 అన్నదానరతౌ నిత్యం జలదానపరాయణౌ, తడాగారామవప్రాదీసంఖ్యాతాన్వితేనతుః. 10 సా తు సత్యమతిర్నిత్యం శుచిర్విష్ణుగృహే సతీ, నృత్యత్యత్యన్తసంతుష్టా మనోజ్ఞా మంజువాదినీ. 11 సో೭ పి రాజా మహాభాగో ద్వాదశీద్వాదశీదినే, ధ్వజమారోపయత్యేవ మనోజ్ఞం బహువిస్తరమ్. 12 ఏవం హరిపరం నిత్యం రాజానం ధర్మకోవిదమ్, ప్రియాం సత్యమతిం చాస్య దేవా అపి సదాస్తువన్. 13 సనక మహర్షి పలికెను:- పురాతనమైన ఈ ఇతిహాసమును సావధానముగా వినుము. సర్వపాపప్రణాశనమగు నీ యితిహాసమును నాకు బ్రహ్మ స్వయముగా తెలిపెను. పూర్వకారమున కృతయుగమున సోమవంశమున సుమతి యను మహారాజు ఉండెను. ఈ మహారాజు సర్వసంపత్సమృద్ధి కలిగి సప్తద్వీపములకు ఏకైక నాయకుడగు చక్రవర్తి ధర్మాత్ముడు. సత్యసంపన్నుడు. పవిత్రవంశ్యుడు, అతిథిప్రియుడు. సర్వలక్షణసంపన్నుడు. సర్వసంపద్విభూషితుడు, సర్వకాలములలో హరికథను సేవించువాడు. హరిపూజాపరాయణుడు, హరిభక్తులను సేవించువాడు. అహంకారరహితుడు. పూజ్యులను పూజించు శీలము కలవాడు. సమదర్శి, గుణవంతుడు, సర్వభూతహితుడు, శాన్తుడు, కృతజ్ఞుడు. కీర్తిమంతుడు. సుమతి మహారాజు భార్య మహానుభావురాలు, సర్వలక్షణవతి. పతివ్రత, పతిప్రాణ సత్యమతి యను పేరు గలది. ఆ దంపతులు నిత్యము హరి పూజా పరాయణులు. పూర్వజన్మ జ్ఞానము కల మహానుబావులు, సత్యమును తెలిసినవారు, సత్పరాయణులు. నిత్యము జలాన్నదాన నిరతులు. తటాకారామాదులను అసంఖ్యాకములుగా త్రవ్వించిరి. సత్యమతి కూడా నిత్యము పవిత్రురాలై విష్ణ్వాలయమున అతి సంతుష్టయై మనోజ్ఞముగా నాట్యము చేయుచు మృదు మధురముగా మాటలాడునది. ఆ మహారాజు కూడా ప్రతి ద్వాదశీతిథి యందు సుందరము విశాలము అగు ధ్వజమును ఆలయమున ప్రతిష్ఠించుచుంéడెను. ఇట్లు నిత్యము హరిపూజారతుడైన సుమతి మహారాజును ధర్మపరాయణుడని సత్యమతి యను అతని ధర్మపత్నిని కూడా దేవతలు కూడా స్తుతించుచుండిరి. 3-13 త్రిలోకే విశ్రుతౌ జ్ఞాత్వా దంపతీ ధర్మకోవిదౌ, ఆయ¸° బహుభిః, శిషై#్యర్ద్రష్టుకామో విభాండకః. 14 తమాయాన్తం మునిం శ్రుత్వా స తు రాజా విభాండకమ్, ప్రత్యుద్య¸° సపత్నీకః పూజాభిర్భహువిస్తరమ్. 15 కృతాతిథ్యక్రియం శాన్తం కృతాసనపరిగ్రహమ్, నీచాసనస్థితో భూపః పారంజలిర్మునిమబ్రవీత్. 16 ఆ దంపతులు ధర్మ కోవిదులుగా మూడు లోకములలో ప్రసిద్ధలగుట నెఱింగి, వాభాండక మహర్షి చూడగోరి చాలా మంది శిష్యులతో కలిసి అచటికి చేరెను. విభాండక మహర్షి వచ్చుచున్నారని వినిన సుమతి మహారాజు భార్యతో విస్తృతముగా పూజా సామగ్రితో ఎదురేగెను. అతిథి మర్యాదను చేసి శాంతముగా సింహాసనముపై కూర్చుండపెట్టి శాంతునిగా నున్న విభాండక మహర్షిని క్రింద ఆసనమున కూర్చొనియున్న సుమతి మహారాజు చేతులు జోడించి ఇట్లు పలికెను. 14-16 రాజోవాచ : భగవన్కృతకృత్యో೭స్మి త్వదభ్యాగమనేనన వై, సతామాగమనం సన్తః ప్రశంసన్తి సుఖావహమ్. 17 యత్ర స్యాన్మహతాం ప్రేమ తత్ర స్యుస్సర్వసంపదః తేజః కీర్తిర్ధనం పుత్రా ఇతి ప్రాహుర్వివశ్చితః. 18 తత్ర వృద్ధిముపాయాన్తి శ్రేయాంస్యనుదినం మునే ! యత్ర సన్తంః ప్రకుర్వన్తి మహతీం కరుణాం ప్రభో !19 యో మూర్ధ్ని ధారయేబ్ద్రహ్మన్మహత్పాద జదం రజః, స స్నాతః సర్వతీర్థేషు పుణ్యాత్మా నాత్ర సంశయః. 20 మమ పుత్రాశ్చ దారాశ్చ సంపత్త్వయి సమర్పితాః, మామాజ్ఞాపయ విప్రేన్ద్ర కిం ప్రియం కరవాణి తే. 21 వినయావనతం భూపం స నిరీక్ష్య మునీశ్వరః, స్పృశన్కరేణ తం ప్రీత్యా ప్రత్యువాచాతిహర్షితః. 22 మహారాజు పలికెను :ఓ పూజ్యుడా ! మీ రాకచే నేను కృతకృత్యుడనైతిని. సత్పురుషుల రాక సుఖావహమని సత్పురుషులు కొనియాడుచుందురు. మహానుభావుల ప్రేమ యున్న ప్రదేశముననే అన్ని సంపదలు తేజస్సు, కీర్తి, ధనము పుత్రులు ఉందురని పండితులు చెప్పుదురు. మహాత్ముల పాదజలమును, పాదధూళిని శిరస్సున దాల్చినవాడు అన్ని పుణ్యతీర్థములలో స్నానమాడిన పుణ్యాత్ముడగును. సంశయముతో పనిలేదు. నా ద్వారా పుత్రధనాది సంపదలనన్నిటిని మీకర్పించుచున్నాను. ఓ బ్రాహ్మణోత్తమా ! మీకేమి ప్రియమును చేయవలయునో నన్నాజ్ఞాపింపుము. ఇట్లు పలుకుచు వినయముతో వంగియున్న మహారాజును చూచి విభాండక మహర్షి ప్రీతితో చేతితో తాకుచు మిగుల సంతోషముచే ఇట్లు బదులు పలికెను. 17-22 ఋషి రువాచ : రాజన్యదుక్తం భవతా తత్సర్వం త్వత్కులోచితమ్, వినయావనతస్సర్వో బహుశ్రేయో లభేదిహ. 23 ధర్మం చార్థం చ కామం చ మోక్షం చ నృపసత్తమ ! వినయాల్లభ##తే మర్త్యో దుర్లభం కిం మహాత్మనామ్. 24 ప్రీతో೭ స్మి తవ భూపాల సన్మార్గపరివర్తినః స్వస్తి తే సతతం భూయాద్యత్పృచ్ఛామి తదుచ్యతామ్. 25 పూజా బహువిధాస్సన్తి హరితుష్టివిధాయికాః, తాసు నిత్యం ధ్వజారోపే వర్తసే త్వం సదోద్యతః. 26 భార్యాపి తవ సాధ్వీయం నిత్యం నృత్యపరాయణా, కిమర్ధమేతద్వృత్తాన్తం యథావద్వక్తుమర్హసి. 27 విభాండక మహర్షి పలికెను : ఓ రాజా ! నీవు చెప్పినదంతయూ నీ వంశమునకు తగియున్నది. వినయము కలవారందరు బహు శ్రేయస్సులను పొందగలరు. ధర్మార్ధకామమోక్షములు వినయము వల్లనే లభించును, మహాత్ములకు దుర్లభ##మైనదేమి? మంచి మార్గము నవలంబించిన నీ విషమున ప్రీతుడనైతిని . శ్రీహరిని సంతోషింప చేయు పూజలు చాలా యున్నవి. వాటిలో నీవెప్పుడూ ధ్వజారోపణమునే ఎందుకు చేయుచున్నావు? నీ భార్య పరమ సాధ్వీమణి ఎప్పుడూ స్వామి మందిరమున నృత్యమును చేయుచున్నది. ఎందుకిట్లు చేయుచున్నారో నాకు ఉన్నదున్నట్లు తెలుపుము. 23-27 రాజోవాచ : శృణుష్వ భగవన్సర్వం యత్సృచ్ఛసి వదామి తత్, ఆశ్చర్యభూతం లోకానాం ఆవయోశ్చరితం త్విహ. 28 అహమాసం పురా శూద్రో మాలినిర్నామ సత్తమ ! కుమార్గనిరతో నిత్యం సర్వలోకాహితే రతః. 29 పిశునో ధర్మవిద్వేషీ దేవద్రవ్యాపహారకః, గోఘ్నశ్చ బ్రహ్మహో చోరః సర్వప్రాణివ ధేరతః 30 నిత్యం నిష్ఠురవక్తా చ పాపీ వేశ్యాపరాయణః, ఏవం స్థితః కియత్కాలమనాదృత్య మహద్వచః. 31 సర్వబంధుపరిత్యక్తో దుఃఖీ వనముపాగతః, మృగమాంసాశనో నిత్యం తథా పాంథవిలుమ్పకః. 32 ఏకాకీ దుఃఖబహులో న్యవసన్నిర్జనే వనే, ఏకదా క్షుత్పరిశ్రాన్తో నిదాఘార్తః పిపాసితః. 33 జీర్ణం దేవాలయం విష్ణోపరశ్యం విజనే వనే, హంసకారండవాకీర్ణం తత్సమీపే మహత్సరః. 34 పర్యన్తవనపుష్పౌఘచ్ఛాదితం తన్మునీశ్వర, అపిబం తత్ర పానీయం తత్తీరే విగతశ్రమః 35 ఫలాని జగ్ధ్వా శీర్ణాని స్వయం క్షుచ్చ నివారితా, తస్మిన్ జీర్ణాలయే విష్ణోర్నివాసం కృతవానహమ్. 36 జీర్ణస్ఫుటితసంధానం తస్య నిత్యమకారిషమ్, పర్ణైస్తృణౖశ్చ కాష్ఠౌఘైర్గృహం సమ్యక్ప్రకల్పితమ్. 37 స్వసుఖార్ధంతు తద్భూమిర్మయా లిప్తా మునీశ్వర ! తత్రాహం వ్యాధివృత్తిస్ధో హత్వా బహివిధాన్మృగాన్. 38 అజీవం వర్తయన్నిత్యం వర్షాణాం వింశతిం స్థితః, అథేయమాగతా సాధ్వీ వింధ్యదేశసముద్భవా. 39 నిషాదకులజా విప్ర నామ్నా ఖ్యాతా೭థ కోకిలా, బంధువర్గపరిత్యక్తా దుఃఖితా జీర్ణవిగ్రహా. 40 క్షుత్తృడ్ఘర్మపరిశ్రాన్తా శోచన్తీ స్వకృతం హ్యఘమ్, దైవయోగాత్సమాయాతా భ్రమన్తీ విజనే వనే. 41 గ్రీష్మాతపార్దితా బాహ్యే స్వాన్తే చాధి నిపీడితా, ఇమాం దుఃఖార్దితాం దృష్ట్వా జాతా మే విపులో దయా. 42 దత్తం మయా జలం చాసై#్య మాంసం నవ్యఫలాని చ, గతశ్రమా త్వియం బ్రహ్మన్మయా పృష్టా యథాతథమ్. 43 మహారాజు పలికెను : పూజ్యుడా ! మీరడిగిన దానిని చెప్పెదను. మా చరిత్రము లోకముల కాశ్చర్యావహము. ఓ మాహానుభావా ! నేను పూర్వము మాలిని యను పేరుగల శూద్రుడనై యుంటిని. ఎపుడూ చెడుదారిలో నడుచుచు అందరికీ కీడును చేయుచు, కొండెములను చెప్పుచు, ధర్మమును ద్వేషించుచు, దేవ ద్రవ్యముల నపహరించుచు, గోబ్రాహ్మణులను వధించుచు, చౌర్యముచేయుచు, అన్ని ప్రాణులను వధించుటయందాసక్తిని చూపుచు, ఎపుడూ కఠినముగా దుఃఖముతో అరణ్యమునకు చేరితిని. అరణ్యములో మృగ మాంసమును భక్షించుచు బాటసారులను దోచుచు ఒంటరిగా బహు దుఃఖముతో చాలాకాలముంటిని. ఒకపుడు ఎండవేడికి తపించి ఆకలి దప్పులు పీడించగా తిరుగుచు నిర్జనారణ్యమున శిధిలమైయున్న ఒక విష్ణ్వాలయమును చూచితిని. ఆ దేవాలయ సమీపమున హంసాది పక్షి సంకులమగు తీరమున పుష్ప ఫలభరితోద్యానములు గల సలస్సును చూచితిని. ఆ సరస్సున నీరు త్రాగి తీరమున విశ్రమించి అలసట తీర్చుకుంటిని. రాలిపడియున్న పండ్లను భక్షించి ఆకలిని తూర్చుకొంటిని. ఆ జీర్ణవిష్ణ్వాలయమున నివాసమేర్పరచుకొంటిని. జీర్ణమైన వాటిని, పగిలిన గోడలను మరల సంధానము చేసితిని. కట్టెలు ఆకులు తీగలచే చక్కగా గృహమును నిర్మించితిని. నాసౌకర్యము కొఱకు ఆచట భూమిని చక్కగా నలికితిని. అచట వ్యాధవృత్తిని స్వీకరించి చాలా మృగములను చంపుచు ఆ మాంసముతో కాలము గడుపుచు ఇరువది సంవత్సరములుంటిని. అపుడు వింధ్యదేశమున పుట్టిన ఈ సాధ్వి వచ్చినది. కోకిల అను పేపుగల ఈమె నిషాదవంశమున పుట్టియుండెను. బంధువర్గము విడువగా శిథిలదేహయై దుఃఖించుచు ఆకలి దప్పివేడిమిచే ఆర్తురాలై తాను చేసిన పాపమును గూర్చి ఆలోచించు నిర్జనారణ్యమున తిరిగుచు దైవయోగమున అటకొచ్చినది. బయట గ్రీష్మతాపముచే , అంతరంగమున పాపముచే పీడించబడుచు వచ్చెను. ఇట్లు దుఃఖముచే బాధపడుచున్న ఈమెను చూచి నాలో దయకలిగెను. నీరును పండ్లను మాంసము నిచ్చితిని. నేనిచ్చిన వాటిని తిని ఆకలి దప్పులు అలసట తీరిన ఆమెను గత వృత్తాంతము నడిగితిని. 28-43 అవేదయత్స్వవృత్తాన్తం తచ్ఛృణుష్వ మహామునే, నామ్నావకోకిలా చాహం నిషాదకులసంభవా. 44 దారుకస్య సుతా చాహం వింధ్యపర్వతవాసినీ, పరస్వహారిణీ, నిత్యం సదా పైశున్యవాదినీ. 45 పుంశ్చలీత్యేవముక్తా తు బంధువర్గైస్సముజ్ఘితా, కియత్కాలం తతః పత్యా భృతాహం లోకనిందితా. 46 దైవాత్సో೭పి గతో లోకం యమస్యాత్ర విహాయ మామ్. కాంతారే విజనే చైకా భ్రమన్తీ దుఃఖపీడితా. 47 దైవాత్త్వత్సవిధం ప్రాప్తా జీవితాహం త్వయాధునా, ఇత్యేవ స్వకృతం కర్మ మహ్యం సర్వం న్యవేదయత్. 48 అపుడు ఈమె తన వృత్తాన్తమునంతటిని నాకు నివేదించెను. ''ఓ మహామునీ ! దానిని వినుము. నేను నిషాదకులమున పుట్టితిని. నా పేరు అవకోకిల . నాతండ్రి పేరు దారుకుడు. వింధ్యపర్వతప్రాంతమున నా నివాసము. ఎపుడు పరద్రవ్యములను అపహరించుచు, కొండెములు చెప్పుచు , నచ్చిన పురుషునితో విహరించుచు బ్రతుకును సాగించుచుంటిని నన్ను బంధువులందరు వెలివేసిరి. ఇట్లు లోక నిందితమైన నన్ను కొంతకాలము భర్త పోషించెను. దైవ వశమున నా భర్త నన్నిచటనే వదిలి తాను యమలోకమును చేరెను. నిర్జనమైన అరణ్యమున ఒంటరిగా దుఃఖముతో తిరుగుచు దైవ వశమున నీ సమీపమునకు చేరితిని, నీచే బ్రతికించబడితిని'' ఇట్లు ఆమె తన చరితము నంతను నాకు నివేదించెను. 44-48 తతో దేవాలయే తస్మిన్దమృతీభావమాశ్రితౌ, స్థితౌ వర్షాణి దస చ ఆవాం మాంసఫలాశినౌ. 49 ఏకదా మద్యపానేన ప్రమత్తౌ నిర్భరం మునే, తత్ర దేవాలయే రాత్రౌ ముదితౌ మాంసభోజనాత్. 50 తనువస్త్రాపరిజ్ఞానౌ నృత్యం చకృవ మోహితౌ, ప్రారబ్ధకర్మభోగాన్తమావాం యుగపదాగతౌ. 51 యమదూతాస్తదాయాతా పాశహస్తా భయంకరాః, నేతుమావాం సృత్యరతౌ సుఘోరాం యమయాతనామ్. 52 తతః ప్రసన్నో భగవాన్కర్మణా మమ మానద, దేవావనసధసంస్కారసంజ్ఞితేన కృతేన నః. 53 స్వదూతాన్ప్రేషయామాస స్వభక్తావనతత్పరః, తే దూతా దేవదేవస్య శంఖచక్రగదాధరాః. 54 సహస్రసూర్యసంకాశాః సర్వే చారుచతుర్భుజాః, కిరీటకుండలధరా హారిణో వనమాలినః. 55 దిశో వితిమిరా విప్ర కుర్వన్తస్స్వేన తేజసా, భయంకరాన్పాశహస్తాన్దంష్ట్రిణో యమకింకరాన్. 56 ఆవయోర్గ్రహణ యత్తానూచుః కృష్ణపరాయణాః. 57 తరువాత మేమిద్దరమూ దాంపత్య భావముతో మాంసమును ఫలములను ఆహారముగా తీసుకొనుచు పది సంవత్సరములుంటిమి. ఒకపుడు బాగుగా మద్యము సేవించుటవలన మదించినవారమై ఆ రాత్రి దేవాలయమున మాంస భోజనముచే సంతోషించి వడలును వస్త్రములను మరిచి మోహముతో నృత్యమును చేసితిమి. ఇంతలో మా ఇద్దరికీ ఒకేసారి ప్రారబ్ధకర్మభోగము పరిసమాప్తమైనది. అపుడు భయంకరమైన యమదూతలు పాశహస్తులై నృత్యముచే ఆనందించుచున్న మమ్ములను ఘోరమైన యమయాతనలకు గొనిపోవవచ్చిరి. అంతలో దేవాలయమున పరిశుభ్రముగా ఉంచుటనే సంతోషించిన శ్రీ మహావిష్ణువు స్వభక్తులను కాపాడు శీలము కలవాడగుటచే తన దూతలను పంపెను. దేవదేవుని దూతలు శంఖచక్రగదాదులను ధరించి చతుర్భుజులై వేయి సూర్యుల వెలుగు కలవారై కిరీట కుండలాద్యా భరణములను ధరించినవారై హరములను వనమాలము ధరించి చతుర్భుజులై వేయు సూర్యుల వెలుగు కలవారై కిరీట కుడలాద్యా భరణములను ధరించినవారై హరములను వనమాలము ధరించి, తమ కాంతులచే దిక్కులను వెలిగింపజేయుచు, పాశహస్తులు దంష్ట్రులు భయంకరులై మా ఇద్దరిని తీసుకొని పోవయత్నించు యమదూతలను గూర్చి ఇట్లు పలికిరి. 49-57 విష్ణుదూతా ఊచుః : భో ! భో ! క్రూరా దురాచారా వివేకపరివర్జితాః, ముంచధ్వమేతౌ నిష్పాపౌ దంపతీ హరివల్లభౌ. 58 వివేకస్త్రిషు లోకేషు సంపదామాదికారణమ్, అపాపే పాపధీర్యస్తు తం విద్యాత్పురుషాధమమ్. 59 పాపే త్వపాపధీర్యస్తు తం విద్యాదధమాధమమ్. 60 విష్ణుదూతలు పలికిరి : క్రూరులారా ! దురాచారులారా ! వివేకహీనులారా ! ఈ దంపతులు హరికి ప్రీతిపాత్రులు. కావున పాపరహితులు. వీరిని విడువుడు. మూడు లోకములలో అన్ని సంపదలకు మూలకారణము వివేకము. పాపరహితుని పాపిగా తలచువాడు పురుషాధముడు. పాపిని పాపరహితునిగా తలచువాడు అధమాధముడు. 58-60 యమదూతా ఊచుః : యుష్మాభిస్సత్యమేవోక్తం కింత్వేతౌ పాపిసత్తమౌ, యమేన పాపినో దండ్యాస్తన్నేష్యామో వయం త్విమౌ. 61 శ్రుతి ప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్విపర్యయః, ధర్మాధర్మవివేకో೭యం తన్నేష్యామో యమాన్తికమ్. 62 ఏతచ్ఛ్రుత్వాతికుపితా విష్ణుదూతా మహౌజసః, ప్రత్యూచుస్తాన్యమభటానధర్మే ధర్మమానినః. 63 యమదూతలు పలికిరి : ''మీరు నిజమునే పలికితిరి. కాని వీరు పరమ పాపులు. పాపులను యమధర్మరాజు దండించవలయును. కావున వీరిని మేము తీసుకొని పోగలము. వేదవిహితమే ధర్మము. తద్విపరీతమధర్మము. ఇదియే ధర్మాధర్మవివేకము. కావున వీరిని తీసుకొని పోవుచున్నాము.'' గొప్ప తేజస్సు గల విష్ణుదూతలు ఈ మాటలము విని మిక్కిలి కోపించినవారై, అధర్మమును ధర్మముగా భావించు యమదూతలను గూర్చి ఇట్లు పలికిరి. 61-63 విష్ణుదూతా ఊచుః : అహో కష్టం ధర్మదృశామధర్మస్స్పృశ##తే సభామ్, సమ్యగ్నివేకశూన్యానాం నిదానం హ్యాపదాం మహత్. 64 తర్కణాద్యవిశేషేణ నరకాధ్యక్షతాం గతాః, యూయం కిమర్ధమద్యాపి కర్తుం పాపాని సోద్యమాః. 65 స్వకర్మక్షయపర్యన్తం మహాపాతకినో೭పి చ, తిష్ఠన్తి నరకే ఘోరే యావచ్చంద్రార్కతారకమ్. 66 పూర్వసంచితపాపానామదృష్ట్వా నిష్కృతిం వృథా, కిమర్థం పాపకర్మాణి కరిష్యే೭థ పునః పునః. 67 శ్రుతి ప్రణిహితో ధర్మస్సత్యం సత్యం న సంశయః, కింత్వాభ్యాం చరితాన్ధర్మాన్ప్రవక్ష్యామో యథాతథమ్. 68 ఏతౌ పాపవినిర్ముక్తౌ హరిశుశ్రూషణ రతౌ, హరిణా త్రాయమాణ చ ముంచధ్వమవిలంబితమ్. 69 ఏషా చ నర్తనం చక్రే తథైష ధ్వజరోపణమ్, అన్తకాలే విష్ణుగృహే తేన నిష్పాపతాం గతౌ. 70 అన్తకాలే తు యన్నామ శ్రుత్వోక్త్యాపి చ వై సకృత్, లభ##తే పరమం స్థానం కిము శుశ్రూషణ రతాః. 71 మహాపాతకయుక్తో వా యుక్తో వాప్యుపపాతకైః, కృష్ణసేవీ నరో೭న్తే೭పి లభ##తే పరమాం గతిమ్. 72 యతీనాం విష్ణుభక్తానాం పరిచర్యాపరాయణాః, తే దూతాస్సహసా యాన్తి పాపినో7పి పరాం గతిమ్. 73 ముహుర్తం వా ముహుర్తార్ధం యస్తిష్ఠేద్ధరిమందిరే, సో೭పి యాతి పరం స్థానం కిము ద్వాత్రింశవత్సరాన్. 74 ఉపలేపనకర్తారౌ సమ్మార్జనపరాయణౌ, ఏతౌ హరిగృహే నిత్యం జీర్ణశీర్ణాధిరోపకౌ. 75 జలసేచనకర్తారౌ దీపదౌ హరిమందిరే, కథమేతౌ మహాభాగౌ యాతనాభోగమర్హతః. 76 ఇత్యుక్త్వా విష్ణుదూతాస్తే ఛిత్వా పాశాంస్తదైవహి, ఆరోప్యావాం విమానాగ్ర్యం యయుర్విష్ణోః పరమం పదమ్. 77 తత్ర సామీప్యమాపన్నౌ దేవదేవస్య చక్రిణః, దివ్యాన్భోగాన్భుక్తవన్తౌ తావత్కాలం మునీశ్వర. 78 దివ్యాన్భోగాంస్తు తత్రాపి భుక్త్వా యాతౌ మహీమిమామ్, అత్రాపి సంపదతులా హరిసేవా ప్రసాదతః. 79 అనిచ్ఛయా కృతేనాపి సేవనేన హరేర్మునే, ప్రాప్తమీదృక్ఫలం విప్ర దేవానామపి దుర్లభమ్. 80 ఇచ్ఛయారాధ్య విశ్వేశం భక్తిభావేన మాధవమ్, ప్రాప్స్యావః పరమం శ్రేయ ఇతి హేతుర్నిరూపితః. 81 అవశేనాపి యత్కర్మ కృతం స్సాత్సుమహత్ఫలమ్, జాయతే భూమిదేవేన్ద్ర కింపునశ్శ్రద్ధయాకృతమ్. 82 ఏతదుక్తం నిశమ్యాసౌ సమునీన్ద్రో విభాండకః, ప్రశస్య దంపతీ తౌ తు ప్రయ¸° స్వతపోవనమ్. 83 తస్మాజ్ఞానిహి దేవర్షే ! దేవదేవస్య చక్రిణః, పరిచర్యా తు సర్వేషాం కామధేనూపమా స్మృతా. 84 హరిపూజాపరాణాతు హరిరేవ సనాతనః, దదాతి పరమం శ్రేయః సర్వకామఫలప్రదః. 85 య ఇదం పుణ్యమాఖ్యానం సర్వపాపప్రణాశనమ్, పఠేచ్చ శృణుయాద్వాపి సో೭పి యాతి పరాం గతిమ్. 86 ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే ప్రథమపాదే సుమతిభూపకతావర్ణనం నామవింశో೭ధ్యాయః విష్ణుదూతలు పలికిరి : ''ధర్మ పరీక్షకుల సభను అధర్మము స్పృశించుచన్నది. ఇది చాలా గొప్ప ఆపద. చక్కని వివేకము లేకపోవుటయే అన్ని ఆపదలకు మూలము. మీరు చక్కగా విచారించలేగపోవుట వలననే నరకలోకమున కొలువుదీరితిరి. మరల ఇపుడు కూడా పాపములను చేయుటకు పూనుకొందురేల ? తాము చేసిన కర్మలు క్షయమగువరకు మహాపాపులు ఘోరమైన నరకమున నుందురు. మీరు సూర్యచంద్రులుండు వరకు నరకముననే యుండవలయును. ఇది వరకు చేసిన పాపములకు నిష్కృతిని కనుగొనకనే మరల పాపముల నెందుకు చేయుచున్నారు ? వేదవిహితమైనదే ధర్మమను మాట ముమ్మాటికి నిజము. సంశయములేదు. కాని ఈ దంపతులు చేసిన ధర్మములను చెప్పెదము వినుడు. హరిని సేవించుటలో ఆసక్తులైన వీరు అన్ని పాపములునుండి విముక్తులయిరి. కావున శ్రీహరియే వీరిని కాచుచుండెను. కావున ఆలసించక విడువుడు. ఈమె హరి మందిరమున నృత్యము చేసెను. ఇతను ధ్వజారోపణము చేసెను. ఈ రెండు పుణ్యకార్యములను అన్తకాలమున విష్ణుమందిరమున చేసిరి. కావున వీరి పాపములను నశించినవి. అంతకాలమున శ్రీహరి నామమును ఒకసారి వినిననూ పలికిననూ పరమపదమును పొందుదురు. ఇక సేవించిన వారి విషయమున నేమి చెప్పవలయును ? మహాపాతకములు ఉపపాకతకములు కలవారైనను అన్తకాలమున శ్రీకృష్ణుని సేవించినవారు పరమ పదమును పొందెదరు.యతులను విష్ణుభక్తులను సేవించువారు పాపులైనను పరమ పదమును పొందెదరు. ఒక ముహుర్తకాలము కాని సగము ముహుర్త కాలము కాని శ్రీహరి మందిరమున నివసించినచో పరమపదమును పొందుదురన్న ముప్పది రెండు సంవత్సరములున్న వారి విషయమున నేమి చెప్పవలయును. ఈ దంపతులు దేవాలయమును ఊడ్చిరి, ఆలికిరి, శిథిలమైన వాటిని మరల సంధానము చేసిరి. నీరు చల్లిరి. దీపమును పెట్టిరి. ఇట్టి వీరు నరకయాతననెట్లనుభవింతురు ? '' విష్ణుదూతలు ఇట్లు పలికి మా పాశములను తెంపి విమానమున కూర్చుండబెట్టి విష్ణుపదమునకు చేర్చిరి. అచట శ్రీహరి సామీప్యమును పొంది చాలా దివ్యవర్షములు సకల భోగముల ననుభవించి మరల భూలోకమునకు చేరితిమి. హరిసేవా ప్రసాదము వలన ఇచట కూడా సాటిలేని సంపదలను పొందితిమి. ఇచ్ఛ లేకనే చేసిన హరిసేవ వలననే దేవతలకు కూడా దుర్లభమగు నిట్టి ఫలమును పొందితిమి. ఇచ్చతో భక్తిభావముతో విశ్వేశుడైన శ్రీహరిని సేవించి ఉత్తమ శ్రేయస్సును పొందగలమని నిరూపించబడియున్నది. మన వశములో లేక మత్తులో నుండి చేసిన కర్మలకే ఇంతటి గొప్ప ఫలము లభించినది కదా ! ఇక శ్రద్ధతో చేసినచే నేమి చెప్పవలయును. ఇట్లు సుమతి చెప్పిన వృత్తాన్తమును వినిన విభాండక మహర్షి ఆ దంపతులను ప్రశంసించి తన తపోవనమునకు వెళ్ళెను. కావున ఓ దేవర్షీ ! దేవదేవుడగు చక్రిసేవ అందరికి కామధేనువు వంటిది. హరిని పూజించువారికి శ్రీహరియే సర్వకామార్ధ ఫలప్రదమగు శ్రేయస్సును ప్రసాదించును. ఇట్లు అన్ని పాపములను తొలగించి అన్ని పుణ్యములను కలిగించు ఈ కథను చదివిన వారు, వినిన వారు కూడా పరమ పదమును పొందెదరు, అనెను. 64-86 ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సుమతిభూపకథావర్ణనమను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.