Sri Naradapuranam-I    Chapters    Last Page

ఏకవింశోధ్యాయః = ఇరువది యొకటవ అధ్యాయము

పంచరాత్రివ్రతమ్‌.

సనక ఉవాచ :

అన్యద్ర్వతం ప్రవక్ష్యామి శృణు నారద తత్త్వతః, దుర్లభం సర్వలోకేషు విఖ్యాతం హరిపంచకమ్‌. 1

నారీణాం చ నరాణాం చ సర్వదుఃఖనివారణమ్‌, ధర్మకామార్థమోక్షాణాం నిదానం మునిసత్తమ. 2

సర్వాభీష్టప్రదం చైవ సర్వవ్రతఫలప్రదమ్‌, మార్గశీర్షే సితే పక్షే దశమ్యాం నియతేన్ద్రియః. 3

కుర్యాత్స్నానాదికం కర్మ దన్తధావనపూర్వకమ్‌, కృత్వా దేవార్చనం సమ్యక్తథా పంచమహాధ్వరాన్‌. 4

ఏకాదశీ భ##వేత్తస్మిన్దినే మియమమాస్ధితః, తతః ప్రాతస్సముత్ధాయ హ్యేకాదశ్యాం మునీశ్వర !5

స్నానం కృత్వా యథాచారం హరిం చైవార్చయేద్గృహే, స్నాపయేద్దేవదేవేశం పంచామృతవిధానతః. 6

అర్చయేత్పరయా భక్త్యా గంధపుష్పాదిభిః, క్రమాత్‌, ధూపైర్దీపైశ్చ నైవేద్యైస్తామ్బూలైశ్చ ప్రదక్షిణౖః. 7

సంపూజ్య దేవదేవేశమిమం మన్త్రముదీరయేత్‌, నమస్తే జ్ఞానరూపాయ జ్ఞానదాయ నమోస్తు తే. 8

నమస్తే సర్వరూపాయ సర్వసిద్ధిప్రదాయినే, ఏవం ప్రణమ్య దేవేశం వాసుదేవేశం జనార్దనమ్‌. 9

వక్ష్యమాణన మన్త్రేణ హ్యుపవాసం సమర్పయేత్‌, పంచరాత్రం నిరాహోరో హృద్య ప్రభృతి కేశవ. 10

త్వదాజ్ఞయా జగత్త్వామిన్మమాభీష్టప్రదో భవ, ఏవం సమర్ప్య దేవస్య ఉపవాసం జితేన్ద్రియః. 11

రాత్రౌ జాగరణం కుర్యాదేకాదశ్యామథో ద్విజ, ద్వాదశ్యాం చ త్రయోదశ్యాం జితేంద్రియః.12

పౌర్ణమాస్యాం చ కర్తవ్యమేషం విష్ణ్వర్చనం మునే, ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం కర్తవ్యం జాగరం తథా. 13

పంచామృతాది పూజా తు సామాన్యా దినపంచసు, క్షీరేణ స్నాపయేద్విష్ణుం పౌర్ణమాస్యాం తు శక్తితః 14

తిలహోమశ్చ కర్తవల్యస్తిలదానం తథైవ చ, తతష్షష్ఠే దినే ప్రాప్తే నిర్వర్త్య స్వాశ్రమక్రియామ్‌. 15

సంప్రాశ్య పంచగవ్యం చ పూజయేద్విధివద్ధిరిమ్‌, బ్రాహ్మణాన్భోజయేత్పశ్చాద్విభ##వే సత్యవారితమ్‌. 16

తతస్స్వబన్ధుస్సార్ధం స్వయం భుంజీత వాగ్యతః, ఏకం పౌషానిమాసేషు కార్తికాన్తేషు నారద. 17

శుక్లపక్షే వ్రతం కుర్యాత్పూర్వోక్తవిధినా నరః, ఏవం సంవత్సరం కార్యం వ్రతం పాపప్రణాశనమ్‌. 18

పునః ప్రాప్తే మార్గశీర్షే కుర్యాదుద్యాపనం వ్రతీ, ఏకాదశ్యాం నిరాహోరో భ##వేత్పూర్వమివ ద్విజ. 19

ద్వాదశ్యాం పంచగవ్యం చ ప్రాశ##యేత్సుసమాహితః, గంధపూష్పాదిభిస్సమ్యగ్దేవదేవం జనార్దనమ్‌. 20

అభ్యర్చ్యోపాయనం దద్యాద్బ్రాహ్మణాయ జితేన్ద్రియః, పాయసం మధుసంమిశ్రం ఘృతయుక్తం ఫలాన్వితమ్‌. 21

సుగంధజలం సంయుక్తం పూర్ణకుంభం సదక్షిణమ్‌, వస్త్రేణాచ్ఛాదితం కుంభం పంచరత్నసమన్వితమ్‌. 22

దద్యాదధ్యాత్మవిదుషే బ్రాహ్మణాయ మునీశ్వర, సర్వాత్మన్సర్వభూతేశ సర్వవ్యాపిన్సనాతన. 23

పరమాన్నప్రదానేన సుప్రీతో భవ మాధవ, అనేన పాయసం దత్వా బ్రాహ్మణాన్భోజయేత్తతః. 24

శక్తితో బంధుభిస్సార్ధం స్వయం భుంజీత వాగ్యతః, వ్రతమేతత్తు యః కుర్యాద్ధరిపంచకసంజ్ఞితమ్‌. 25

న తస్య పునరావృత్తిర్బ్రహ్మలోకాత్కదాచన, వ్రమేతత్ప్రకర్తవ్యమిచ్ఛద్భి ర్మోక్షముత్తమమ్‌. 26

సమస్తపాపకాన్తారదవానలసమం ద్విజ, గవాం కోటిసహస్రాణి దత్త్వా యత్ఫలమాప్నుయాత్‌. 27

తత్ఫలం లభ్యతే పుంభిరేతస్మాదుపవాసతః, యస్త్వేతచ్ఛృయాద్భక్త్యా నారాయణపరాయణః. 28

స ముచ్యతే మహాఘోరైః పాతకానాం చ కోటిభిః. 29

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వబాగే ప్రథమపాదే

వ్రతాఖ్యానే మార్గశీర్షశుక్లైకాదశీ మారభ్య పౌర్ణిమాపర్యన్తం

పంచరాత్రివ్రతం నామ ఏకవింశోధ్యాయః

సనకమహర్షి పలికెను : ఓనారదా ! మరియొక వ్రతమును చెప్పెదను వినుము. అన్ని లోకములలో హరి పంచకమను పేరుతో ప్రసిద్ధి పొందినది. స్త్రీలకు పురుషులకు అన్ని దుఃఖములను నివారించునది. ఓ మునిసత్తమా ! ఈ వ్రతము ధర్మకామార్ధమోక్షములకు మూలము. సర్వాభీష్ట ఫలప్రదము సర్వవ్రత ఫలప్రదము. మార్గశీర్షశుక్లదశమిన ఇంద్రియ జయము కలిగి దంతధావన పూర్వకముగా స్నానాదికమును చేయవలయును. దేవార్చనను పంచమహా యజ్ఞములను నిర్వర్తించవలయును. ఏకాదశీతిథిన ప్రాతఃకాలమున లేచి ఆచారానుగుణముగా స్నానాదికమును నిర్వర్తించి గృహమున శ్రీహరిని అర్చించవలయును. అపుడు పంచామృతముతో దేవదేవునికి అభిషేకము చేయవలయును. ఉత్తమ భక్తితో యథాక్రమముగా గంధపుష్పాదులచే అర్చన చేయవలయును. ధూపదీపనైవేద్యతాంబూల ప్రదక్షిణాదులచే చక్కగా అర్చించి ఈ మంత్రమునుచ్చరించ వలయను. ''నమస్తే జ్ఞానరూపాయ జ్ఞానదాయ నమోస్తు తే, నమస్తే సర్వరూపాయ సర్వ సిద్ధి ప్రదాయినే''.

(''జ్ఞానస్వరూపునికి, జ్ఞానప్రదునికి, సర్వరూపునికి, సర్వసిద్ధి ప్రదాయకునకు నమస్కారము'' అని దీని అర్ధము) ఇట్లు వాసుదేవునికి నమస్కరించి ముందు చెప్పబోవు మన్త్రముతో ఉపవాసమును సమర్పించవలయును. 'పంచరాత్రం నిరాహారో హ్యద్య ప్రభృతి కేశవ ! త్వదాజ్ఞయా జగత్స్వామిన్మమాభీష్టప్రదో భవ' అని (''ఓ కేశవా ! ఈ దినమునుండి అయిదు రాత్రులు నీ యాజ్ఞచే నిరాహారముగా నుందును. నా అభీష్టమును ప్రసాదించుము'') ఇట్లు ఇంద్రియ జయముతో ఉపవాసమును దేవదేవునికి సమర్పించి రాత్రి పూట జాగరణ చేయవలయును. ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమాతిధులలో జాగరణ చేయవలయును. ఈ అయిదు దినములలో పంచామృతాదిపూజ సమానమే. పూర్ణిమాదినమున శక్తి ననుసరించి పాలతో శ్రీ మహావిష్ణువున కభిషేకమును చేయవలయును. అట్లే తివహోమమును తిలదానమును చేయవలయును. ఆరవదినమున తమ తమ ఆశ్రమాచారములను ముగించుకొని పంచగవ్యప్రాశనమును చేసి యథావిధిగా శ్రీహరిని పూజించవలయును. సంపదలున్నచో తప్పక బ్రాహ్మణభోజనమును జరిపంచవలయును. తరువాత మౌనముతో బంధువులతో తాను భుజించవలయును. ఇట్లే పుష్యమాసము మొదలు కార్తిక మాసము వరకు శుక్లపక్షమున పూర్వోక్త విధితో వ్రతము నాచరించవలయును. ఇట్లు సర్వపాపహరమగు వ్రతమును ఒక సంవత్సరము నాచరించవలయును. మరల మార్గశీర్షమాసమున ఉద్యాపన చేయవలయును. మొదటి వలె ఏకాదశీ తిథిలో నిరాహారముగా నుండవలయును. ద్వాదశీతిధిన పంచగవ్య ప్రాశనమును చేయవలయును. ధూపదీప గంధపుష్పాదులచే దేవదేవుడగు జనార్దనుని చక్కగా పూజించి ఇంద్రియ నిగ్రహముతో బ్రాహ్మణునకు ఉపాయనమును సమర్పించవలయును. నేయి తేనె కలిసిన పాయసమును పండ్లతో సుగంధ జలములతో దక్షిణతో కూడిన జలకుంభమును పంచరత్నములతో కూడియున్న జలకుంభమును వస్త్రముతో ఆచ్ఛాదనమును చేసి అధ్యాత్మజ్ఞానము కల బ్రాహ్మణునకు సమర్పించవలయును. ''సర్వాత్మ న్సర్వభూతేశ సర్వవ్యాపిన్సనాతన పరమాన్న ప్రదానేన సుప్రీతే భవ మాధవ'' అను మంత్రముచే పాయసదానమును చేసి బ్రాహ్మణభోజనమును జరుపవలయును. (''సర్వాత్మా ! సర్వభూతాధిపతీ ! సర్వవ్యాపీ ! సనాతన ! మాధవా ! పరమాన్నదానముచే నాకు ప్రీతుడవు కమ్ము'' అని పై మంత్రమున కర్థము) శక్తి కొలది బంధువులతో కలిసి తాను కూడా మౌనముతో భుజించవలయును. హరిపంచకమను ఈ వ్రతమును ఆచరించిన వారు బ్రహ్మలోకమునుండి తిరిగి రారు, సమస్త పాపారమ్యదవానలము ఉత్తమము అయిన ఈ వ్రతమును మోక్షమును కోరువారు నాచరించవలయును. ఈ పంచరాత్ర వ్రతముచే ఉపవాసముచే వేయి కోట్ల గోదాన ఫలము లభించును. నారాయణుని మీద భక్తిచే ఈ వ్రతవిధానమును వినిన వారికి మహాఘోరములైన పాతకకోట్లు నశించును. 1-29

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున

వ్రతాఖ్యానమున మార్గశీర్షశుక్లాద్వాదశి నుండి పూర్ణిమాపర్యన్తము

పంచరాత్రి వ్రతమను ఇరువది యొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page