Sri Naradapuranam-I    Chapters    Last Page

ద్వావింశోధ్యాయః = ఇరువది రెండవ అధ్యాయము

మాసోపవాసవర్ణనమ్‌

సనక ఉవాచ :-

అన్యద్వ్రతవరం వక్ష్యే తచ్ఛృణుష్వ సమాహితః, సర్వపాపహరం పుణ్యం సర్వలోకోపకారకమ్‌. 1

ఆషాఢే శ్రావణవాపి తథా భాద్రపదేపి చ, తథ్వైవాశ్వినకే మాసి కుర్యాదేతద్వ్రతం ద్విజ. 2

ఏతేష్వన్యతమే మాసే శుక్లపక్షే జితేన్ద్రియః, ప్రాశ##యేత్పంచగవ్యం చ స్వపేద్విష్ణుసమీపతః. 3

తతః ప్రాతస్సముత్థాయ నిత్యకర్మ సమాప్య చ, శ్రద్ధయా పూజయేద్విష్ణుం వసీ క్రోధవివర్జితః. 4

విద్వద్భిస్సహితో విష్ణుమర్చయిత్వా యథోచితమ్‌, సంకల్పం తు తతః కుర్యాత్స్యస్తివాచనపూర్వకమ్‌. 5

మాసమేకం నిరాహోరో హృద్యప్రభృతి కేశవ, మాసాన్తం పారణం కుర్వే దేవదేవ తవాజ్ఞయా. 6

తపోరూప నమస్తుభ్యం తపసాం ఫలదాయక, నుమాభీష్టప్రదం దేహి సర్వవిఘ్నాన్నివారయ.7

ఏవం సమర్ప్య దేవస్య విష్ణోర్మాసవ్రతం శుభమ్‌, తతః ప్రభృతి మాసాన్తం నివసేద్ధరిమందిరే. 8

ప్రత్యహం స్నాపయేద్దేవం పంచామృతవిధానతః, దీపం నిరన్తనం కూర్యత్తస్మిన్మాసే హరేర్గృహే. 9

ప్రత్యహం ఖాదయేత్కాష్ఠం హ్యపామార్గసముద్భవమ్‌, తత స్స్నాయీత విధివన్నారాయమపారయణః. 10

తతస్సంస్నాపయేద్విష్ణుం పూర్వవత్ప్రయతోర్చయేత్‌, బ్రహ్మణాన్భోజయేచ్ఛక్త్యా భక్తి యుక్తస్సదక్షిణమ్‌. 11

స్వయం చ బంధుభిస్సార్ధం భుంజీతి ప్రయతేద్రియః, ఏవం మాసోపవాసాంశ్చ వ్రతీ కుర్యాత్త్రయోదశ. 12

వర్షాన్తే వేదవిదుషే గాం ప్రదద్యాత్సక్షిణామ్‌, భోజయేద్బ్రాహ్మణాంస్తత్ర ద్వాదశైవ వధానతః. 13

శక్త్యా చ దక్షిణాం దద్యాద్‌ బహున్యాభరణానిచ మాసోపవాసత్రితయం యఃకుర్యాత్సంయతేన్ద్రియః. 14

ఆప్తోర్యామస్య యజ్ఞస్య ద్విగుణం ఫలమశ్నుతే, చతుః కృత్వః కృతం యేన పారాకం మునిసత్తమ. 15

సలభేత్పరమం పుణ్యమష్టాగ్నిష్టోమసంభవమ్‌, పంచకృత్వో వ్రతమిదం కృతం యేన మహాత్మనా. 16

అత్యగ్నిష్టోమజం పుణ్యం ద్విగుణం ప్రాప్నుయాన్నరః, మాసోపవాసషట్కం యః కరోతి సుసమాహితః. 17

జ్యోతిష్టోమస్య యజ్ఞస్య ఫలం సోష్టగుణం లభేత్‌, నిరాహారస్సప్తకృత్వో నరో మాసోపవాసకాన్‌. 18

అశ్వమేధస్య యజ్ఞస్య ఫలమష్టగుణం లభేత్‌, మాసోపవాసాన్యః కుర్యాదష్టకృత్వో మునీశ్వర. 19

నరమేధాఖ్యయజ్ఞస్య ఫలం పంచగుణం లభేత్‌, యస్తు మాసోపవాసాంశ్చ నవకృత్వస్సమాచరేత్‌. 20

గోమేధమఖజం పుణ్యం లభితే త్రిగుణం నరః, దశకృత్వస్తు యః కుర్యాత్పరాకం మునిసత్తమ. 21

స బ్రహ్మ మేధయజ్ఞస్య త్రిగుణం ఫలమశ్నుతే, ఏకాదశపరాకాంశ్చ యః కుర్యాత్సంయతేన్ద్రియః. 22

స యాతి హరిసారూప్యం సర్వభోగసమన్వితమ్‌, త్రయోదశపారాకాంశ్చ యః కుర్వాత్ప్రయతో నరః. 23

స యాతి పరమానందం యత్ర గత్వా న సోచతి, మాసోపవాసనిరతా గంగాస్నానపరాయణాః. 24

ధర్మ మార్గప్రవక్తారో ముక్తా ఏవ న సంశయః, అవీరాభిశ్చ నారీభిర్యతిభిర్బ్రహ్మచారిభిః. 25

మాసోపవాసః కర్తవ్యో వనస్ధైస్చ విశేషతః, నారీ వా పురుషో వాపి వ్రతమేతత్సుదుర్లభమ్‌. 26

కృత్వా మోక్షమవాప్నోతి యోగినామపి దుర్లభమ్‌, గృహస్థో వానప్రస్థో వా వ్రతీ వా భిక్షురేవ వా. 27

మూర్ఖోవా పండితో వాపి శ్రుత్వైతన్మోక్షభాగ్భవేత్‌, ఇదం పుణ్యం వ్రతాఖ్యానం నారాయణపరాయణః. 28

శృణయాద్వాచయేద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే.

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే ప్రథమపాదే

వ్రతాఖ్యానే మాసోపవాస వర్ణనం నామ

ద్వావింశోధ్యాయః

సనక మహర్షి పలికెను : అన్ని పాపములను హరించునది పవిత్రమైనది సర్వలోకోపకారమగు మరయొక వ్రతమును చెప్పెదను. సావధానముగా వినుము. ఆషాడ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మాసములలో ఏదో ఒక మాసమును నీవ్రతము నాచరించవలయును. ఈ మాసములలో ఏదో ఒక మాసమున శుక్లపక్షమున ఇంద్రియ నిగ్రహము కలవాడై పంచగవ్య ప్రాశనముచేసి శ్రీమహావిష్ణు సమీపమున శయనించవలయును. ప్రాతఃకాలమున లేచి నిత్యకర్మలను ముగించి కోపమును వదలి ఇంద్రియ వశము కలిగి శ్రద్ధతో శ్రీమహావిష్ణువును పూజించవలయును. పండితులతో కలిసి యథావిధిగా శ్రీహరిని పూజించి స్వస్తివాచన పూర్వకముగా సంకల్పమును చేయవలయును ''ఓ కేశవా !ఈ దినము నుండి ఒకనెల నిరాహారముగా నుండి, నీ యాజ్ఞచే మాసాన్తమున పారణ చేసెదను. ఓ తపస్స్వ రూపా ! తపః ఫలదాయకా ! సర్వవిఘ్నములను నివారించి నా అభీష్టమును ప్రసాదించుము''. ఇట్లు శుభప్రదమైన మాసవ్రతమును శ్రీహరికి సమర్పించి అప్పటినుండి ఒకమాసము హరిమందిరమున నివసించవలయును. ప్రతి దినము పంచామృత విధానముతో శ్రీహరిని అబిషేకమును చేయవలయును. ఈనెల లో హరిమందిరమున అఖండదీపము నుంచవలయును. ప్రతిదినము ఉత్తరేణికాష్ఠముతో దంతధావనము చేసుకొని శ్రీమన్నారాయణుని ధ్యానముచేయుచు యథావిధిగా స్నామను చేయవలయును. భక్తిశ్రద్ధలతో యతావిధిగా శ్రీహరికి అభిషేకము చేసి అర్చన చేయవలయును. భక్తితో బ్రాహ్మణులకు భోజనమును దక్షిణను సమర్పించవలయును. ఇంద్రియ నిగ్రహము కలిగి తాను కూడా బంధువులతో కలిసి భోజనము చేయవలయును. ఇట్లు పదమూడు మాసోపవాసములను చేయవలయును. సంవత్సరము ముగిసిన తరువాత వేదవిదుడైన బ్రాహ్మణునకు గోదానమును చేయవలయును. దక్షిణ నీయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజన మీయవలయును. శక్తిననుసరించి దక్షిణలను ఆభరణములను సమర్పించవలయును. ఇట్లు ఇంద్రియ నిగ్రహముతో మూడుమార్లు మాసోపవాసవ్రతము నాచరించినవారు ఆప్తోర్యామ యజ్ఞమునకు రెట్టింపు ఫలమును పొందెదరు. నాలుమార్లు ఈ వ్రతము నాచరించినవారు ఎనిమిది అగ్నిష్టోమ యాగముల ఫలితమును పొందెదరు. అయిదుమార్లు ఈ వ్రతమునాచరించిన వారు అత్యగ్నిష్టోమ యాగమునకు రెట్టింపు ఫలితమును పొందెదురు. ఆరుమార్లు మాసోపవాసవ్రతమునాచరించినవారు జ్యోతిష్టోమ యాగమునకు ఎనిమిది రెట్లు ఫలితమును పొందుదురు. ఈ వ్రతము నేడుమార్లాచరించినవారు అశ్వమేధ యాగమునకు ఎనిమిదిరెట్లు ఫలమును పొందుదురు. ఎనిమిదిమార్లు ఈ వ్రతమునాచరించిన వారు నరమేధ యాగమునకు అయిదురెట్లు ఫలమును, తొమ్మిది మార్లాచరించిన వారు గోమేధమునకు మూడురెట్లు ఫలమును, పదిమార్లాచరించిన మూడు బ్రహ్మమేధముల ఫలమును, పదకొండు మార్లు అచరించినవారు సర్వభోగసమన్వితమైన హరిసారూప్యమును, పదమూడుమార్లాచరించిన వారు దుఃఖస్పర్శలేని పరమానందమును పొందెదరు. మాసోప వాసవ్రతమును చేయువారు, గంగాస్నానమును చేయువారు ధర్మ మార్గ ప్రవక్తలు ముక్తులగుదురు. సంశయముతో పనిలేదు. పతి పుత్రులు లేని స్త్రీలు, యతులు, బ్రహ్మచారులు విశేషించి వాన ప్రస్థులు ఈ మాసోపవాసవ్రతము నాచరించవలయును. స్త్రీ కాని పురుషుడు కాని దుర్లభ##మైన ఈ వ్రతమునాచరించి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెదరు. గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, భిక్షకుడు, మూర్ఖుడు, పండితుడు ఎవరైనను ఈ వ్రత విదానమును వినినచో మోక్షమును పొందును. నారాయణ భక్తుడు పవిత్రమైన ఈ వ్రతమును వినిననూ చెప్పననూ అన్ని పాపముల నుండి విముక్తుడగును. 1-29

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున

ప్రథమపాదమున వ్రతాఖ్యానమున మసోపవాసవర్ణనమను

ఇరువదిరెండవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page