Sri Naradapuranam-I    Chapters    Last Page

త్రయోవింశోధ్యాయః = ఇరువది మూడవ అధ్యాయము

ఏకాదశీవ్రతమహిమానువర్ణనమ్‌.

సనక ఉవాచ :-

ఇదమన్యత్ప్రవక్ష్యామి వ్రతం త్రైలోక్యవిస్తరమ్‌, సర్వపాపప్రశమనం సర్వకామఫలప్రదమ్‌. 1

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చైవ యోషితామ్‌, మోక్షదం కుర్వతాం భక్త్యా విష్ణోః ప్రియతరం ద్విజ. 2

ఏకాదశీవ్రతం నామ సర్వభీష్టప్రదం నృణామ్‌, కర్తవ్యం సర్వధా విప్ర విష్ణుప్రీతికరం యతః. 3

ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి, యో భుంక్తే సోత్ర పాపీయాన్పరత్ర నరకం వ్రజేత్‌. 4

ఉపవాసఫలం లిప్సుర్జహ్యాద్భుక్తు చతుష్టయమ్‌, పూర్వాపరదినే రాత్రావహారాత్రం తు మధ్యమే. 5

ఏకాదశీదినే యస్తు భోక్తుమిచ్ఛతి మానవః, స భోక్తుం సర్వపాపాని స్పృహయాలుర్న సంశయః. 6

భ##వేద్దశమ్యామేకాశీ ద్వాదశ్యాం చ మునీశ్వర, ఏకాదశ్యాం నిరాహోరో యది ముక్తిమభీప్సతి. 7

యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ, అన్నమాశ్రిత్య తిష్ఠన్తి తాని విప్ర హరేర్దినే. 8

బ్రహ్మహత్యాదిపాపానాం కథంచిన్నష్కృతిర్భవేత్‌, ఏకాదశ్యాం తు యో భుంక్తే తస్య నైవాస్తి నిష్కృతిః. 9

మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకైః, ఏకాదశ్యాం నిరాహారస్థిత్వా యాతి పరాం గతిమ్‌. 10

ఏకాదశీ మహాపుణ్యాం విష్ణోః ప్రియతమా తిథిః, సంసేవ్యా సర్వథా విపై#్రస్సంసారచ్ఛేదలిప్సుభిః. 11

దశమ్యాం ప్రాతరుత్థాయ దంతధావనపూర్వకమ్‌, స్నాపయేద్విధివద్విష్ణుం పూజయేత్ప్రయాతేంద్రియః. 12

ఏకాదశ్యాం నిరాహారో నిగృహీతేంద్రియో భ##వేత్‌, శయీత సన్నిధౌ విష్ణోర్నారాయణపరాయణ. 13

ఏకాదశ్యాం తథా స్నాత్వా సంపూజ్య చ జనార్దనమ్‌, గంధపుష్పాదిభిస్సమ్యక్‌ తతస్త్వేవముదీరయేత్‌. 14

ఏకాదశ్యాం నిరాహారస్థ్సిత్వ్యాద్యాహం పరేహని భోక్ష్యామి పండరీకాక్ష శరణం మే భవాచ్యుత. 15

ఇమం మన్త్రం సముచ్చార్య దేవదేవస్య చక్రిణః, భక్తిభావేన తుష్టాత్మా ఉపవాసం సమర్పయేత్‌. 16

దేవస్య పురతః కుర్యాజ్జాగరం నియతో వ్రతీ, గీతై ర్వాదైశ్చ నృత్యైశ్చ పురాణశ్రవణాదిభిః. 17

తతః ప్రాతస్సముత్థాయ ద్వాదశీవసే వ్రతీ, స్నాత్వా చ విధివద్విష్ణుం పూజయేత్ప్రయతేంద్రియః. 18

పంచామృతేన సంస్నాప్య ఏకాదశ్యాం జనార్ధనమ్‌, ద్వాదశ్యాం పయసా విప్ర హరిసారూప్యమశ్నుతే. 19

అజ్ఞానతిమిరాన్ధస్య వ్రతేనానేన కేశవ, ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టిప్రదో భవ.20

ఏవం విజ్ఞప్య విపేన్ద్ర మాధవం సుసమాహితః, బ్రాహ్మణాన్భోజయేచ్ఛక్త్యా దద్యాద్వై దక్షిణాం తథా. 21

తతస్స్వ బన్ధుస్సార్ధం నారాయణపరాయణః, కృతపంచమహాయజ్ఞస్స్వయం భుంజీత వాగ్యతః. 22

ఏవం యః ప్రయతః కుర్వాత్పుణ్యమేకాదశీవ్రతమ్‌. స యాతి విష్ణుభనం పునరావృత్తిదుర్లభమ్‌. 23

సనకమహర్షి పలికెను :- మూడులోకములలో ప్రసిద్ధి నొందినది,సర్వపాపములను శమింపచేయునది, సర్వకామఫలప్రదము అయిన మరియొక వ్రతమును చెప్పెదను వినుము. ఇది బ్రాహ్మక్షత్రియ వైశ్యశూద్రులలో స్త్రీలలో ఎవరు చేసిననూ మోక్షము నొసంగునది. విష్ణువునకు ప్రీతికరము. ఈ వ్రతము పేరు ఏకాగశీవ్రతము. ఇది సర్వాభీష్టప్రదము. ఈ వ్రతమను అన్ని విధములా చేయవలయును. ఈ ఏకాదశవ్రతము విష్ణుప్రీతికరము. శుక్లకృష్ణపక్షములలోని ఏకాదశీ తిథిన భోజనము చేయరాదు, అట్లు భుజించువాడు ఇహ లోకమున పాపమును పొంది పరమున నరకమును చేరును, ఉపవాసఫలమును పొందగోరువారు దశమిరాత్రి, ఏకాదశీ రెండుపూటలు, ద్వాదశిన రాత్రి ఈ నాలుగు పూటలు భుజించరాదు. ఏకాదశీదినమున భుజించగోరువారు సర్వపాపములననుభవించగోరువాడని తెలియుము. ముక్తిని కోరువాడు దశమిన ఒకపూట, ద్వాదశీతిథిన ఒకపూట, ఏకాదశీ తిథిన రెండుపూటలా నిరాహారముగా నుండవలయును. బ్రహ్మహత్యాది మహాపాతకములన్నియు హరిదినమున అన్నము నాశ్రయించియుండును. బ్రహ్మహత్యాదిపాపముల కెట్లో నిష్కృతి లభించును కాని ఏకాదశీ తిథిన భుజుంచువానికి నిష్కృతి లభించదు. మహాపాతకములు కలవారు కాని సర్వపాతకములు కలవారు కాని ఏకాదశీ తిథిన ఉపవాసమును చేసినచో పరమ పదమును పొందుదురు. ఏకాదశీతిథి పరమపవిత్రమైనది. విష్ణువును ప్రీతిపాత్రమైన తిథి. కావున సంసారచ్ఛేదమును కోరువారు ఏకాదశీతిథిని సేవించవలయును. దశమీతిథియందు ప్రాతఃకాలమున లేచి దంతధావన స్నార్వకముగా స్నానాదికములను నిర్వర్తించి ఇంద్రియనిగ్రహముతో యతావిధిగా శ్రీమహావిష్ణువునకు స్నానాదికమును చేయించి పూజించవలయును. ఏకాదశినాడు ఇంద్రియ జయముతో నిరహారముగా నుండవలయును. నారాయణుని స్మరించుచు శ్రీమహావిష్ణువు సన్నిధిలో శయనించవలయును. ఏకాదశీతిథి నాడు స్నానముచేసి జనార్దునుని పూజించి గంధపుష్పాదుల నర్పించి ఇట్లు విజ్ఞాపన చేయవలయును.

''ఏకాదశ్యాం నిరహారస్థ్సత్వా7 ద్యాహం పరేహాని భోక్ష్యామి పుంజరీకాక్ష శరణం మే

భవాచ్యుత''

ఈ మన్త్రమునుచ్చరించి దేవదేవుడగు శ్రీమన్నారాయణునకు ఉపవాసమును సమర్పించవలయును. (''ఓ పుండరీకాక్షా! నేను ఏకాదశన నిరాహారముగా నుండి ద్వాదశీ తిథిన భోజనము చేయగలను. ఓ అచ్యుతా! నాకు రక్షకుడవు కమ్ము''. అని మంత్రమున కర్థము). నియములతో దేవదేవుని ముందు నృత్యగీత వాద్యపురాణాదులతో జాగరణ చేయవలయును. తరువాత ద్వాదశీ తిథిన ప్రాతఃకాలమున లేచి స్నానముచేసి యథావిధిగా అర్చించవలయును. ఏకాదశీ తిథిన జనార్దుని పంచామృతముతో స్నానము చేయించవలయును. ద్వాదశిన క్షీరాభిషేకము చేయవలయును. అట్లు చేసినచో హరిసారూప్యమును పొందును.

''అజ్ఞానతిమిరాన్ధస్య వ్రతేనానేన కేశవ, ప్రసీద సుముఖో భూత్వా జ్ఞనదృష్టిప్రదో భవ"

అని శ్రీహరిని విజ్ఞాపన చేయవలయును. (''అజ్ఞానమను చీకటిలో గుడ్డివాడినైన నాకు ఈ వ్రతాచరణతో సుముఖుడవై ప్రసన్నుడవై జ్ఞానదృష్టిని ప్రసాదించుము''. అని అర్థము). తరువాత శక్తి ననుసరించి బ్రాహ్రణులకు భోజనము పెట్టి దక్షిణను సమర్పించవలయును. తరువాత పంచమహాయజ్ఞములనాచరించి బంధువులతో కలిసి మౌనముతో తాను భుజించవలయును. ఇట్లు పవిత్రమైన ఏకాదసీ వ్రతమునాచరించిన వారు పునరావృత్తి రహితమైన శ్రీమహావిష్ణుభవనమును చేరెదరు. 1-23

ఉపవాసవ్రతపరో ధర్మకార్యపరాయణః, చాండాలన్పతితాంశ్చైవ నేక్షేదపి కదాచన. 24

నాస్తికాన్భిన్న మర్యాదాన్నిందకాన్పిశునాంస్తథా ఉపవాసవ్రతపరో నాలపేచ్చ కదాచన. 25

వృషలీ సూతిపోష్టారం వృషలీపతిమేవ చ అయాజ్యయాజకం చైవ నాలపేత్సర్వదా వ్రతీ. 26

కుండాశినం గాయకం చ తథా దేవకాశినమ్‌, భిషజం కావ్యకర్తారం దేవద్విజవిరోధినమ్‌. 27

పరాన్నలోలుపం చైవ పరస్త్రీనిరతం తథా వ్రతోపవాసనిరతో వాఙ్మాత్రేణాపి నార్చయేత్‌. 28

ఇత్యేనమాదిభిశ్శుద్ధో వశీసర్వహితే రతః, ఉపవాసపరో భూత్వా పరాం సిద్ధిమవాప్నుయాత్‌. 29

నాస్తి గంగాసమం తీర్థం నాస్తి మాతృసమో గురుః నాస్తి విష్ణుసమం దైవం తపోనానశనాతృరమ్‌. 30

నాస్తి క్షమా సమా మతా నాస్తి కీర్తిసమం ధనమ్‌ నాస్తి జ్ఞానసమో లాభో న చ ధర్మసమః పితా. 31

స వివేకసమో బన్ధుర్నైకాదశ్యాః పరం వ్రతమ్‌ అత్రాప్యుదాహంతీమమితిహాసం పురాతనమ్‌. 32

ఉపవాసవ్రతము నాచరించు ధర్మకార్యపరాయణులు చండాలురను పతితులను ఎప్పుడూ చూడరాదు. నాస్తికులను మర్యాదారహితులను, నిందించువారిని, కొండెములను చెప్పువారిని, ఉపవాసవ్రతము చేయువారి పలుకరించరాదు. శూద్ర స్త్రీకి పుట్టిన వారిని పోషించువారితో, శూద్ర స్త్రీపతితో యజ్ఞాధికారములేని వానిచే యజ్ఞమును చేయించువానితో మాటలాడరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగినవాని ఇంటిలో భోజనము చేయువారితో, గాయకునితో, ధనమునుతీసుకొని దేవార్చన చేయువానితో, డబ్బు తీసుకొని వైద్యము చేయువారితో, కార్యమును చేయువారితో దేవబ్రాహ్మణులను ద్వేషించువారితో పరాన్నముపై ఆశపడువారితో, పరస్త్రీ నిరతునితో మాటమాత్రముతోనైన సన్మానముగా వ్యవహరించరాదు. ఇటువంటి నియములను నాచరించి శుద్ధుడై ఇంద్రియజయము కలిగి సర్వహితమును కోరుచు ఉపవాసవ్రతమునాచరించినచో ఉత్తమ సిద్ధిని పొందగలరు. గంగాసమతీర్థము, మాతృసమగురువు, విష్ణుసమదైవము, నిరాహారమును మించిన తపము మరియొకటిలేదు. క్షముతో సమమగు తల్లి, కీర్తి సమమైన ధనము, జ్ఞాన సమమగు లాభము, ధర్మసముడగు తండ్రి వివేకసముడై బంధువు, ఏకాదశిని మించిన వ్రతము లేదు. ఈ విషమును ఈ ఇతిహాసమును చెప్పుచుందురు. వినుము. 24-32

సంవాదం భద్రశీలస్య తత్పితుర్గాలవస్య చ, పురా హి గాలవో నామ మునిస్సత్యపరాయణః. 33

ఉపవాస నర్మదా తీరే శాన్తో దాన్తస్తపోనిధిః, బహువృక్షసమాకీర్ణే గజభల్లునిషేవితే. 34

సిద్ధచారణగంధర్వయక్షవిద్యాధరాన్వితే, కందమూలాఫలైః పూర్ణే మునిబృందనినిషేవితే. 35

గాలవో నామ విప్రేన్ద్రో నివాసమకరోచ్చిరమ్‌, తస్యాభవద్భద్రశీల ఇతి ఖ్యాతస్సతో వశీ. 36

జాతిస్మరో మహాభాగో నారాయపరాయణః, బాలక్రీడనకాలే పి భద్రశీలో మహామతిః. 37

మృదా చ విష్ణోః ప్రతిమాం కృత్వా పూజయతే క్షణమ్‌, వయస్యాన్భోధయేచ్చాపి విష్ణుః పూజ్యో నరైస్సదా. 38

ఏకాదశీవ్రతం చైవ కర్తవ్యమపి పండితైః, ఏవం తే బోధితాస్తేన శిశవో పి మునీశ్రర. 39

హరిం మృదైవ నిర్మాయ మృధక్సంభూయ వా ముదా. అర్చయన్తి మహాభాగా విష్ణుభక్తిపరాయణాః. 40

నమస్కుర్వన్భద్రమతిర్విష్ణవే సర్వజిష్ణవే, సర్వేషాం జగతాం స్వస్తి భూయాదిత్యబ్రవీదిదమ్‌. 41

క్రీడాకాలే ముహూర్తం వా ముహుర్తార్థమథాపి వా, ఏకాదశీతి సంకల్ప్యవ్రతం యచ్ఛతి కేశ##వే. 42

ఏవం సుచరితం దృష్ట్వా తనయం గాలవో మునిః, అపృచ్ఛద్విస్మయావిష్టస్సమాలింగ్య తపోనిధిః. 43

భద్రశీలునికి భద్రశీలుని తండ్రి గాలవునికి జరిగన సంవాదమును వినుము. గాలవుడను మహర్షి, పరమశాంతుడు, దాంతుడు, తపోనిధి, నర్మదాతీరమున నివసించుచుండెను. ఆ నర్మదా తీరము నానావృక్షసమన్వితము, గజ భల్లూకాది మృగ నిషేవితము, సిద్ధాచారణ గంధర్వయక్ష విద్యాధర సేవితము, కందములఫలముతో సమృద్ధము. ముని బృందనిసేవితము, అచట గాలవ మహర్షి చాలాకాలము నివసించెను. గాలవమహర్షికి భద్రశీలుడను కుమారుడు కలిగెను. అతడు సుప్రసిద్దుడు జితేంద్రియుడు. పూర్వజన్మజ్ఞానము కలవాడు. మహానుభావుడు , నారాయణ భక్తుడు మహామతియగు భద్రశీలుడు బాల్యక్రీడలలో కూడా మట్టిచే విష్ణుప్రతిమను చేసుకొని క్షణకాలము పూజించుచుండెడివాడు. సర్వకాలమున శ్రీమహావిష్ణువును పూజించవలయుని మిత్రులను బోధించుచుండేడివాడు. పండితులైన వారు ఏకాదసీవ్రతము నాచరించవలయును. ఓ మునీశ్వరా ! ఇట్లు భద్రశీలునిచే భోదించబడిన శిశువులు కూడా కలిసి విడిగా మట్టిచే శ్రీహరి ప్రతిమను నిర్మించుకొని విష్ణుభక్తి పరాయణులై అర్చించుచుండిరి. సర్వజిష్ణువుగు శ్రీమహావిష్ణువునకు నమస్కరించుచు సర్వజగములను శుభము కలుగ వలయునని కోరుచుంచెడివాడు. క్రీడా సమయమున ఒక ముహుర్తము కాని ముహుర్తార్థము కాని ఏకాదసీ అని సంకల్పము చేసి శ్రీహరికి వ్రతమును సమర్పించెడివాడు. ఇట్లు సచ్చరిత్రగల కుమారుని చూచి గాలవ మహర్షి ఆశ్చర్యమునందినవాడై చక్కగా ఆలింగమును చేసుకొని ఇట్లు అడిగెను. 33-43

గాలవఉవాచ-

భద్రశీల మహాభాగ భద్రశీలోసి సువ్రత! చరితం మంగలం యత్తే యోగినామపి దుర్లభమ్‌. 44

హరిపూజాపరో నిత్యం సర్వభూత హితే రతః ఏకాదసీవ్రతపరో నిషిద్ధాచారవర్జితః, నిర్ద్వన్దో నిర్మమశ్శాన్తో హరిధ్యానపరాయణః 45

ఏవమేతాదృశీ బుద్ధిః కథం జాతార్భకస్సతే వినాపి మహాతాం సేవాం హరిభక్తిర్హిదుర్లబా. 46

స్వభావతో జనస్యాస్య హ్యవిద్యాకామకర్మసు ప్రవర్తతే మతిర్వత్స కథం తే లౌకికీ కృతిః.47

సత్సంగే పి మనుష్యాణాం పూర్వపుణ్యాతి రేకతః జాయతే భగవద్భక్తిస్తదహం విస్మయం గతః. 48

పృచ్ఛామి ప్రీతిమాపన్నస్తద్భవాన్వక్తుమర్హతి భద్రశీలో మునిశ్రేష్ఠః ప్రిత్రైవం సువికల్పితైః. 49

జాతిస్మరస్సుకృతాత్మా హృష్ట ప్రహసితాననః, స్వానుభూతం యథావృత్తం సర్వం పిత్రే న్యవేదయత్‌. 50

గాలవ మహర్షి పలికెను : మహానుభావా! భద్రశీలా! నీవు నిజముగా భద్రమగు శీలము గలవాడవే నీ చరితము యోగులకు కూడా దుర్లభమగు మంగళకరము. ఎల్లపుడూ

హరి పూజను చేయుచు సర్వప్రాణి హితమును కోరుచు ఏకాదశి వ్రతము నాచరించుచు నిషిద్ధమైన దాని విడిచి సుఖదుఃఖములను పరిత్యజించి మమకార రహితుడవై శాంతుడవై హరిధ్యాన పరాయణుడవై యుంటివి. బాలుడవాన నీకు ఇట్టి బుద్ధి ఎట్లు కలిగెను? మహాత్ముల సేవ లేనిదే హరి భక్తి కలుగునది కాదు. సామాన్యముగా లోకమున మానవులకు అవిద్యవలన కామ్యకర్మలయందాసక్తి కలుగును కదా! నీ కెట్లు ఆలౌకికమైన బుద్ధి కలిగినది. మానవులకు సత్సంగమున్ననూ పూర్వజన్మసుకృతము లేనిదే భగవద్భక్తి కలుగదు. అందువలననే నేను విస్మయమును చెందుచున్నాను. కావుననే ప్రీతి చెంది అడుగుచున్నాను. కావున తెలుపుము. ఇట్లు తండ్రి అయిన గాలవమహర్షి ప్రశ్నించగా పుణ్యాత్ముడు పూర్వజన్మజ్ఞానము కలవాడు అయిన భద్రశీలుడు ఆనందముతో విప్పారిన మోము కలవాడై తాను అనుభవించిన దానిని యథా తధముగా తండ్రికి తెలియపరిచెను. 44-50

భద్రశీల ఉవాచ:-

శృణు తాత మునిశ్రేష్ఠ హ్యనుభూతం మయా పురా, జాతిస్మరత్వాజ్ఞానామి యమేన పరిభాషితమ్‌. 51

ఏతచ్ఛ్రుత్వా మహాభాగో గాలవో విస్మయాన్వితః, ఉవాచ ప్రీతి మాపన్నో భధ్రశీలం మహామతిమ్‌. 52

భద్రశీలుడు పలికెను:- '' ఓ తండ్రీ! మహామునీ! నేను పూర్వ జన్మలో అనుభవించిన దానిని చెప్పెదను వినుము. నాకు పూర్వ జన్మజ్ఞానము కలదు యమధర్మరాజు చెప్పినదానిని వినుము''. ఈ విషయమును వినిన గలవ మహర్షి ఆశ్చర్యమునొంది ప్రీతితో మహామతియగు భద్రశీలుని గుర్చి ఇట్లు పలికెను. 51-52

గాలవ ఉవాచ-

éకస్త్వం పూర్వం మహాభాగ! కిముక్తం చ యమేన తే కస్య వా కేనవా హేతో స్తత్సర్వం వక్తుమర్హసి. 53

గాలవ మహర్షి పలికెను:- ఓ మహానుభావా! నీవు పూర్వజన్మలో ఎవరివి? యముడు నీతో ఏమి పలికెను ఎందువలన పలికెనో త్వరగా చెప్పుము. 53

భద్రశీల ఉవాచ-

అహమాసం పురా తాత! రాజా సోమకలోద్భవః, ధర్మకీర్తి రితి ఖ్యాతో దత్తాత్రేయేణ శాసితః. 54

నవవర్ష సహస్రాణి మహీం కృత్స్నామపాలయమ్‌, అధర్మాశ్చ తథా ధర్మా మయా తు బహవః కృతా. 55

తత శ్శ్రియా ప్రమత్తోహం బహ్వధర్మమకారిషమ్‌, పాషండ జన సంసర్గా త్పాంషండచరితోభవమ్‌. 56

పురార్జితాని పుణ్యాని మయా తు సుబహున్యపి, పాషండైర్బధ్వితోహం తు వేదమార్గం సమత్యజమ్‌. 57

ముఖాశ్చ సర్వే విధ్వస్తా కూటయుక్తి విదా మయా, అధర్మనిరతం మాం తు దృష్ట్వా మద్దేశజాః ప్రజాః. 58

సదైవ దుష్కృతం చక్రు ష్షష్ఠాంశస్తత్రమే భవత్‌. ఏవం పాప సమాచారో వ్యసనాభిరత స్సదా. 59

మృగయాభిరతో భూత్వా హ్యేకదా ప్రావిశం వనమ్‌, ససైన్సో హం వనే తత్ర హత్వా బహువిధాన్మృగాన్‌. 60

క్షత్తృట్పరివృతశ్శాంతోరేవాతీరముపాగమమ్‌, రవితీక్షాతపక్లాన్తో రేవాయాం స్నానమాచరమ్‌. 61

అదృష్టసైన్య ఏకాకీ పీడ్యమానః, క్షుధాభృశమ్‌, సమేతాస్తత్ర యే కేచిద్రేవాతీరనివాసినః. 62

సమేతా స్తత్ర యే కేచిద్రేవాతీరనివాసినః, ఏకాదశీవ్రత పరా మయా దృష్టా నిశాముఖే. 63

నిరాహార్శ్చ తత్రాహామేకాకీ తజ్జనైస్సహ, జాగరం కృతవాంశ్చాపి సేనయా రహితో నిశి. 64

అధ్వశ్రమ పరిశ్రాంతః క్షుత్పిపాసా ప్రపీడితః, తత్రైవ జాగరణాన్తే హం పంచత్వమాగతః. 65

తతో యమభ##టైర్భద్బో మహాదంష్ట్రా భయంకరైః, అనేక క్లేశ సంపన్నమార్గేణాప్తో యమాంతికమ్‌,

దంష్ట్రాకరాలవదన మపశ్యం సమవర్తినమ్‌. 66

అథకాలశ్చిత్రగుప్తమాహుథాయేదమభాషత, అస్య శిక్షా విధానం చ యథావద్వద పండిత. 67

ఏవముక్తశ్చిత్రగుప్తో ధర్మరాజేన సత్తమ, చిరం విచారయామాస పునశ్చేదమభాషత. 68

అసౌ పాపరతస్సత్యం తథాపి శృణు ధర్మప! ఏకాదశ్యాం నిరాహారస్సర్వపాపైః ప్రముచ్యతే . 69

ఏష రేవాతటే రమ్యే నిరాహారా! హరేర్దినే , జాగరం చోపవాసం చ కృత్వా నిష్పాపతాం గత!. 70

యాని కాని చ పాపాని కృతాని సుబహూని చ, తాని సర్వాణి నష్టాని హ్యుపవాసప్రభావతః. 71

ఏవముక్తో ధర్మరాజుశ్చిత్రగుప్తేన ధీమతా, ననామ దండవద్భూమౌ మమాగ్రే సో నుకంపితః. 72

పూజయామాస మాం తత్ర భక్తిభావేన ధర్మరాట్‌, తతశ్చ స్వభటాన్సర్వానాహుయేదమువాచ హ. 73

భద్రశీలుడు పలికెను: ఓ తండ్రీ ! నేను పూర్వము సోమవంశపురాజుగా ఉంటిని. నా పేరు ధర్మకీర్తి. నా గురువు దత్తాత్రేయ మహర్షి. తొ మ్మిది వేల సంవత్సరములు రాజ్యపాలన చేసితిని. అధర్మములను ధర్మములను చాలా ఆచరించితిని. అంతటిని ఐశ్వర్యమదముతో చాల అధర్మముల నాచరించితిని. పాషండ జనుల మైత్రితో పాషండాచారమును ననుసరించితిని. మొదట చాల పుణ్యములను సంపాదించితిని కాని పాషండులచే బాధించబడిన నేను వేదమార్గమును పరిత్యజించితిని. మాట యుక్తివిదుడనైన నేను చాల యజ్ఞములము ధ్వంసము చేసితిని. నేను ఆధర్మమునుండి ఆరవ భాగము నాకు చేరినది. ఇట్లు పాపా చారుడను, వ్యసనపరుడు అయిన నేను వేట మీద ఆసక్తి కలిగి ఒకసారి అడవికి వెళ్ళితిని, సైన్యముతో అడవిలో చాలా మృగములను చంపితిని. ఆకలిదప్పులు బాధించగా రేవానదీతీరమును చేరితిని. సూర్యకిరణతాపార్తుడనైన నేను రేవానదీలో స్నానముచేసితిని. కాని నా వెంట నా సైన్యము చేరలేదు. సైన్యము లేక ఒంటరినై ఆకలిచే దప్పికచే పీడించబడుచు రేవానదీ తీరవాసులను కొందరిని కలిసితిని. సాయంకాల సమయమున ఏకాదశవ్రతము నాచరించుచున్నవారిని చూచితిని. ఒంటరినైన నేను వారితో కలిసి నిరాహారముగా నుంటిని, సైన్యను లేనందున రాత్రి అంతయు జాగరణ చేసితిని, నడక బడలికతో ఆకలి దప్పులతో పీడించబడిన నేను జాగరణ చిరలో ప్రాతఃకాలమున మరణించితిని. అపుడు మహాదంష్ట్రలతో భయంకరులైన యమభటులు నన్ను బంధించి బహుకష్టతరమైన మార్గముతో యముని సన్నిధికి చేర్చి అచట మహాదంష్ట్రాకరాల వదనుడైన యమధర్మరాజును చూచితిని. అపుడు సమవర్తి చిత్రగుప్పుని పలిచి ''ఇతని చరితమును శిక్షను వివరింపుము'' అని పలికెను. ధర్మరాజు మాటలను వినిన చిత్రగుప్తుడు చాలాకాలమాలోచించి ఇట్లు పలికెను.'' ఓ ధర్మరాజా! ఇతడు వాస్తవముగా పాపాచారరతుడే. అయిననూ ఏకాదశి తిథిన నిరాహరముగా నున్నచో అన్ని పాపములు తొలగును.ఇతడే వేటకై బయలువెడలి ఏకాదశీ తిథిన రేవానదీ తీరమున నిరాహారముగా నుండి జాగారము చేసెను. కావున ఇతని పాపములన్నియు తొలగెను. ఇతను చేసిన పాపములన్నియు ఏకాదశీ ఉపవాస ప్రభావముచే నసించినవి'' ధీమంతుడగు చిత్రగుప్తు డిట్లు పలుకగా యమధర్మరాజు వినయముతో భక్తితో నాముందు దండవత్ర్పణామునాచరించెను. భక్తి భావముతో నన్ను పూజించెను. తరువాత తన భటులనందరిని పిలిచి ఇట్లు పలికెను. 54-73

ధర్మ రాజు ఉవాచ-

శృణుధ్వం మద్వచో దూతా హితం వక్ష్యామ్మనుత్తమమ్‌. ధర్మమార్గరతాన్మర్త్యా న్మానయధ్వం మమాన్తికమ్‌.74

యే విష్ణుపూజనరతాః ప్రయతాకృజ్ఞా శ్చైకాదశీవ్రతమా విజితేన్ద్రియాశ్చ, నారాయణాచ్యుతాహరే శరణం

భ##వేతి శాన్తా వదన్తి సతతం సరసా త్యజధ్వజమ్‌ 75

నారాయణాచ్యుత జనార్దన కృష్ణ విష్ణో! పద్మేశ! పద్మజ పితశ్శివ శంకరేతి,

నిత్యం వదన్త్యఖిలం లోకహితా ః ప్రశాన్తా దూరాద్భటాస్త్యజత తాన్న మమైషు శిక్షా.76

నారాయణార్పితకృతాన్హరిభక్తిభాజస్స్వాచారమార్గనిరాతన్గురుసేవకాంశ్చ,77

సత్పాత్రదాననిరతాంశ్చసుదీనపాలాన్దూతాస్త్యజధ్వమనిశం హరినామక్తాన్‌.

పాషాండసంగరహితాన్ద్విజభక్తి నిష్ఠాన్సత్సంగలోలుపతరాంశ్చ తథాతిదేయాన్‌,

శంభౌ హరౌ చ మనబుద్దిమతస్తథైవ దూతస్త్యజధ్వముపకారపరాన్‌ .జ్ఞానానామ్‌.78

యే వర్జితా హరికథామృతసేవనైనశ్చ నారాయణ స్మృతిపరాయణమానసైశ్చ,

విప్రేన్ద్రపాద జలసేచనతో ప్రహృష్టాంస్తాన్పాపినో మమ భటా గృహమానయధ్వమ్‌

యే మాతృతాతపరిభర్త్సనశీలినశ్చ లోకద్విషో హితజానహితకర్మణశ్చ,80

దేవస్వలోభనిరతాన్‌ జనాశరకరౄ నత్రాయనయధ్వ మహారాధ

ఏకాదశీ వ్రతపరాఙ్ముఖముగ్రశీలం లోకాపవాదనిరతం పరనిందకం చ,

గ్రామస్య నాశకరముత్తమవైరయుక్తం దూతాస్సమానయత విప్రదనేషు లుబ్ధమ్‌.81

యే విష్ణుభక్తి విముఖాః ప్రణమంతి నైవ నారాయణం హి శరణాగత పాలకం చ,

విష్ణ్వాలయం చ నహి యాంతి నరాస్సుమూర్ఖా స్తానానయధ్వమతి పాపరతాన్ప్రసహ్య83

ఏవం శ్రుతం యదా తత్ర యమేన పరిభాషితమ్‌, మయాన తాపదగ్ధేన స్మృతం తత్కర్మనిన్దతమ్‌. 84

అసత్కర్మానుతాపేన సద్ధర్మశ్రవణన చ, తత్రైవ సర్వపాపాని నిశ్శేషాణి గతాని మే.

పాపశేషాద్వినిర్ముక్తం హరిసారుప్యతాం గతమ్‌, సహస్రసూర్యసంకాశం ప్రణనామ యమశ్చ తమ్‌.85

ఏవం దృష్ట్వా విస్మితాస్తే యమదూతా భయోత్కటాః, విశ్వాసం పరమం చక్రుర్యమేన పరిభాషితే.86

ధర్మరాజు పలికెను:- '' ఓ దూతలారా! నా మాటనువినుడు. మీకు హితమును భోదించెదను. ధర్మమార్గరతులై మానవులను నావద్దకు చేర్చకుడు. విష్ణుపూజా పరులను, భక్తులను, కృతజ్ఞలను, ఎకాదశీవ్రతపరులను, జితేన్ద్రియులను ''నారాయణ!అచ్యుత ! హరే! రక్షకుడవుకమ్ము'' అని ఎప్పుడూ పలుకు శాన్తులను త్వరగా వదలి పెట్టుడు. నారాయణా! '' అచ్యుత ! హరే ! జనార్దన! కృష్ణ! విష్ణో! పద్మేశ!పద్మజపిత! శివ!శంకర'' అని ఎల్లప్పుడూ పలుకు అఖిల లోకహితకాంక్షులను, ప్రశాంతులను దూరము నుండియే వదులుడు. వారి విషయమున నా శిక్షలుండవు. అన్ని కర్మలను నారాయణు నకర్పించు వారిని, హరిభక్తిగలవారిని, స్వాచారమార్గమున నడుచువారిని గురుసేవకులను, సత్పాత్రదాననిరతులను, దీనపాలకులను, హరినామ పరాయణులను వదలిపెట్టుడు. పాషండ సంగములేని వారిని, బ్రాహ్మణ భక్తికలవారిని, సత్సంగమునందు నందాసక్తి కలవారిని అతిథిపూజ చేయువారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, శివవిష్ణులందు సమబుద్ధి కలవారిని , జనోపకారములను విడిచిపెట్టుడు, హరికథామృతమును సేవించువారిని, నారాయణస్మృతి పరాయణమానసులతో కలియుని వారిని, బ్రాహ్మణపాద జల సేచనముతో సంతోషించనివారిని, లోకులను ద్వేషించువారిని, హితజనులను అహితమునాచరించువారిని, దేవధనమున నాశించువారిని, హితజనులకు అహితమునాచరించువారిని, దేవధనము నాశించువారిని జనులను నాశనముచేయువానిని, అపరాదపరులను ఇక్కడకి తెండు, ఏకాదశీవ్రతపరఙ్ముఖుని, ఉగ్రస్వభావుని, లోకాపవాద నిరతును, పరనిందకుని గ్రామనాశకుని, ఉత్తములను ద్వేషించువానిని, బ్రాహ్మణ ధనము నాశించువానిని ఇటకు తెండు. విష్ణుభక్తి విముఖునకు వెళ్ళని వారిని, మూర్ఖులను అతి పాపరతులను, ఇటకు తెండు'' ఇట్లు యమధర్మరాజు పలికిన మాటలను వినిన నేను చేసిన పాపకర్మలను తలచుకొని పరితపించితిని. పాపములను తలచి పశ్చాత్తమును చెందుటచే సద్ధర్మములను వినుటచే అప్పుడే అక్కడే నా నా పాపములన్ని నిశ్శేషముగా నశించినవి. ఇట్లు పాపరాహిత్యమునొంది హరిసారూప్యమును పొందియున్న సహస్ర సూర్యసమప్రకాశుడనైన నాకు ధర్మరాజు నమస్కరించెను. ఇట్లు నన్ను చూచిన యమదూతలు భయముచే వణకుచు యమధర్మరాజు చెప్పిన దానిని ధృడముగా విశ్వసించిరి. 74 - 86

తతస్సంపూజ్య మాం కాలో విమానశతసంకులమ్‌, నద్యస్సంప్రేషయామాస తద్విష్ణోః పరమం పదమ్‌. 87

విమానకోటిభిస్సార్దం సర్వభోగసమన్వితైః, కర్మణా తేన విప్రర్షే విష్ణులోకే మయోషితమ్‌.88

కల్పకోటిసహస్రాణి కల్పకోటి శతాని చ, స్థిత్వా విష్ణపదం పశ్చాదింద్రలోకముపాగమమ్‌. 89

తత్రాపి సర్వభోగాఢ్యస్సర్వదేవనమస్కృతః, తావత్కాలం దివి స్థిత్వా తతో భూమిముపాగతః.90

ఆత్రాపి విష్ణుభక్తానాం జాతోహం భవతాం కులే, జాతిస్మరత్వా జ్ఞానామి సర్వమేతన్మునీశ్వర! 91

తస్మాద్విష్ణ్వర్చనోద్యోగం కరోమి సమబాలకైః, ఏకాదశీ వ్రతమిదమితి న జ్ఞాతవాన్పురా.92

జాతిస్మృతిప్రభావేణ తద్‌ జ్ఞాతం సాంప్రతం మయా, అవశేనాపి యత్కర్మ కృతం తస్య ఫలం త్విదమ్‌.93

ఏకాదశీవ్రతం భక్త్వా కుర్వతాం కిముత ప్రభో, తస్మాచ్చరిష్యే విప్రేన్ద్ర శుభ##మేకాదశీ వ్రతమ్‌. 94

విష్ణుపూజాం చాహరహః పరమస్థానకాంక్షయా, ఏకాదశీవ్రతం యత్తు కుర్వీత శ్రధ్ధయా నరాః. 95

తేషాం తు విష్ణభవనం పరమానన్దదాయకమ్‌, ఏవం పుత్రవచశ్శ్రుత్వా సంతుష్టో గాలవో మునిః. 96

ఆవాప పరమాం తుష్టిం మనసా దాతి హర్షితః, మజ్జన్మ స ఫలం జాతం మద్వంశః పాపనీకృతః.97

యత్తస్వం మద్గృహే జాతో విష్ణుభక్తిపరాయణః, ఇతి సంతుష్టచిత్తస్తు తస్య పుత్రస్య కర్మణా.98

హరిపూజావిధానం చ యథావత్సమభోదయత్‌, ఇత్యేతత్త మునిశ్రేష్ఠ యథావత్కధితం మయా. 99

సంకోచవిస్తరాభ్యాం చ కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి.

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే

ప్రథమపాదే వ్రతాఖ్యానే ఏకాదశీవ్రత

మహిమానువర్ణనం నామ త్రయోవింశో ధ్యాయః

తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి నూరు దివ్వవిమానములతో శ్రీమహావిష్ణు పరమపదమును పంపెను. నేను చేసి ఆ చిన్న పనిచే అన్ని భోగములతో కూడిన కోటివిమానముతో విష్ణులోకమున నుంటిని. కల్పకోటి సహస్రములు,కల్పకోటి శతములు, విష్ణలోకమును నండి తరువాత ఇంద్రలోకమునకు వచ్చితిని. అచట కూడా దేవలతందరిచే పూజలనందుచు కల్పకోటి సహస్రములు, కల్పకోటిశతములు, అన్నిభోగములుతో నివసించి భూలోకమునకు వచ్చితిని. ఇచట కూడా విష్ణుభక్తులైన మీ వంశమున పుట్టితిని. పూర్వజన్మ జ్ఞానముచే దీనినంతటిని తెలసియున్నాను. కావుననే బాకులతో కలిసి విష్ణుపూజా ప్రయత్నమును చేయుచున్నాను. మొదట నేనాచరించినది ఏకాదశవ్రతమని తెలయకపోతిని. పూర్వజన్మజ్ఞానముచే ఇపుడు తెలిసితిని. నేను నా వశమునలో లేనపుడు చేసిన పనికే ఇంతటి ఫలము కలిగినదన్న భక్తిచే ఏకాదశవ్రతమును చేయువారికి కలుగు ఫలమునేమి చెప్పవలయును. కావున ఓ మహర్షి! నేను పరమపవిత్రమైన ఏకాదశవ్రతమును ఆచరించెదను. పరమపదమును కాంక్షించి ప్రతిపూట విష్ణుపూజను చేసేదను. శ్రద్ధతో ఏకాదశవ్రతమును నాచరించెదను.పరమపదమును కాంక్షించి ప్రతిపూట విష్ణుపూజను చేసెదను. శ్రద్ధతో ఏకాదశీవ్రతము నాచరించువారు పరమానందతాయకమగు విష్ణుభవనమును పొందెదరు.ఇట్లు భద్రశీలును మాటను వినిన గాలవహర్షి సంతోషించినవారై పరమానందమును మానసికముగా పొందెను. విష్ణుభక్తి పరాయణుడైన నీవు నావంశమున పట్టితివి కావున నా వంశము ధన్యమైనది నాజన్మ సఫలమైనది. ఇట్లు పుత్రని కర్మలచే సంతోషించిన గాలవమహర్షి విధి విధానముగా హరిపూజా విధానమును బోధించెను. ఓ మునిపుంగవా! ఇట్లు ఏకాదశవ్రద మహిమను సంకోచవిస్తారములతో నీకు చెప్పితిని. ఇంకను ఏమి వినకోరుచుంటిలో తెలుపుము. 87-100

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

పూర్వభాగమున ప్రథమపాదమున

వ్రతాఖ్యానమున ఏకాదశీ

వ్రతమహిమానువర్ణనమను

ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page