Sri Naradapuranam-I    Chapters    Last Page

చతుర్వింశో ధ్యాయః ఇరవది నాలుగవ అధ్యాయము

సదాచారః

సూత ఉవాచ:-

ఏతన్నిశమ్య సనకోదితమప్రమేయం పుణ్యం హరేర్దినభవం నిఖిరోత్తమం చ,

పాపౌఘశాంతికరణం వ్రతసారమేవం బ్రహ్మత్మజః పురభాషత హర్షయుక్తః. 1

సూత మహర్షి పలికెను:- ఇట్లు సనకమహర్షి చెప్పగా పవిత్రము, ఇంత అని తులతూచలేనిది, అన్నింటిలో ఉత్తమము, పాపరాశి ప్రశమనము, సర్వవ్రతమసారము అయిన ఏకాదశవ్రతమును విని నారదమహర్షి మరల ఇట్లు పలికెను. 1

నారద ఉవాచ:-

కథితం భవితాం సర్వం మునే తత్త్వార్ధకోవిద! వ్రతాఖ్యానం మహాపుణ్యం యధావద్దనిభక్తిదమ్‌.2

ఇదానీం శ్రోతుమిచ్ఛామి వర్ణాచారవిధిం మునే, తథా సర్వాశ్రమాచారం ప్రాయశ్చిత్తవిధిం తథా. 3

ఏతత్సర్వం మహాభాగ సర్వతత్త్వార్ధకోవిద! కృపయా పరయా మహ్యం యథావద్వక్తుమర్హసి. 4

నారదమహర్షి పలికెను:- తత్త్వార్థకోవిదుడైన ఓ మహర్షీ! హరిభక్తిని ప్రసాదించునది, పరమపవిత్రమైనది యగు ఏకాదశవ్రతమును చెప్పితిరి. ఇపుడు వర్ణాశ్రమాచారవిధిని ప్రాయశ్చిత్త విధిని వినగోరుచున్నాను. సర్వతత్తార్థములు తెలిసిన మహానుభావుడవు కావున నామీద దయతలచి దీనింతటిని యథావిధిగా వివరించుడు.

సనక ఉవాచ:-

శృణుష్వ మానిశార్దూల యథా భక్తప్రియంకరః వర్ణాశ్రమాచారపరైః పూజ్యతే హరిరవ్యయః 5

మన్వాద్యైరుదితం యచ్చ వర్ణాశ్రమనిబంధనమ్‌, తత్తేవక్ష్యామి విధివద్భక్తోసి త్వమధోక్షజే.6

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రాశ్చత్వార ఏవ తే, వర్ణా ఇతి సమాఖ్యాతా ఏతేషు బ్రాహ్మాణో ధికః. 7

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా ద్విజాః ప్రోక్తాస్త్రయస్తథా మాతృతశ్చోపనయనాద్ద్విజత్వం ప్రాప్యతే త్రిభిః.8

ఏతైర్వర్ణైస్సర్వధర్మాఃకర్యా వర్ణానురూపతః, స్వవర్ణధర్మత్యాగేన పాషండః ప్రోచ్యచే బుదైః.

స్వగృహ్య చోదితం కర్మ ద్విజః కర్వస్కృతీ భ##వేత్‌, అన్యథా పతితో భూయాత్‌ సర్వధర్మబహిష్కృతః. 10

యుగధర్మః పరిగ్రాహ్యో వర్ణైరేతైర్యథోచితమ్‌, దేశాచారస్తథా గ్రాహ్యః స్య్మృతిధర్మావిరోధతః, 11

కర్మణా మనసా వాచా యత్నాద్ధర్మం సమాచరేత్‌ అస్వర్గ్యం లోకవిద్విష్టం ధర్మ్య మప్యాచరేన్న తు.12

సముద్రయాత్రాస్వీకారః కమండలువిధారణమ్‌, ద్విజానామసవర్ణాసు కన్యాసూపయమస్తథా.13

దేవరాచ్చ సుతోత్పత్తిర్మదుపర్కే పశోర్వధః మాసాదనం తథా శ్రాద్ధే వానప్రస్థాశ్రమస్తథా.14

దత్తాక్షతాయాః కన్యాయాః పునర్దానం వరయా చ, నైష్ఠికం బ్రహ్మచర్యం చ నరమేధాశ్వమేధకా.15

మహాప్రస్థానగమనం గోవేధశ్చ తథా మఖః, ఏతాన్దర్మాన్కలియుగే కర్జ్యా నాహుర్మనీషిణః.16

సనకమహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్ఠా! భక్తులకు ప్రియమును కలింగించు శ్రీమహావిష్ణువు వర్ణాశ్రమాచారా పరులచే ఎట్లు పూజించడునో వినుము. నీవు శ్రీమన్నారాయణునికి భక్తుడవు కావున మనువు మొదలగు వారు చెప్పిన వర్ణాశ్రమ ధర్మములను యథావిధిగా చెప్పదను. భ్రాహ్మణక్షత్రియ వైశ్యశూద్ర లనునవి నాలుగు వర్ణములు సుప్రసిధ్ధములు. ఈనలుగురిలో బ్రాహ్మణులు అధికులు. ఈనలుగురిలో బ్రాహ్మణుక్షత్రియ వైశ్యులు ద్విజులనబడుదురు. మొదట జన్మ తల్లివలన రెండవ జన్మ ఉపనమమువలన కలుగును. ఈ వర్ణములవారు తమ వర్ణాను గుణముగా సర్వధర్మములనాచరించవలయును. స్వవర్ణ ధర్మత్యాగము చేసినవారు పాషండులనబడుదురు. తమతమ గృహ్య కల్పములలో చెప్పి విధముగా నాచరించు బ్రాహ్మణులు కృతార్థులగుదురు. అట్లా చరించనివాడు అన్ని ధర్మములనుండి బహిష్కరించబడి పతితుడగును. ఈ నాలుగు వర్ణములవారు యథోచితముగా యుగధర్మమును స్వీకరించవలయును. స్మృతిధర్మమునకు విరోధము రాని దేశాచారమును స్వీకరించవలయును. వాజ్మనః కర్మలచే ప్రయత్నపూర్వకముగా ధర్మము నాచరించవలయును. లోకముచే ద్వేషించుబడునది అస్వర్గ్యమైనది ధర్మమైన ఆచరించరాదు. సముద్రయాత్ర, కమండలమును ధరించుట, బ్రాహ్మణులు అసవర్ణలగు కన్యలనువివాహమాడుట, భర్తతమ్ముని వలన సంతానోత్పత్తి, మధువర్కమునందు పశువధ, శ్రాద్ధమున మాంసభక్షణము, వానాప్రస్థాశ్రమము, అక్షతయోనియైన (అనగా వివాహమైనను భర్తృసమాగముచేయకనే భర్త మరణించిన కన్యను) కన్యను మరల మరియోక వరునకు వివాహము చేయుట, నైష్ఠిక బ్రాహ్మచర్యము, నరమేధాశ్వమేదగోమేద యాగములు, మహాప్రస్థానము. ఈ ధర్మములను కలియుగమున ఆచరించరాదని జ్ఞానులు చెప్పియున్నారు. 5 - 16

దేశాచారాః పరిగ్రాహ్యాస్తత్తద్దేశగతైర్నృపైః అన్యథా పతితో జ్ఞేయస్సర్వధర్మబహిష్కృతః. 17

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ ద్విజోత్తమ! క్రియాస్సామాన్యతో వక్ష్యే తచ్ఛృణుష్వ సమాహితః.18

దానం దద్యాద్భ్రాహ్మణభ్యస్తథా యజ్ఞైర్యతజేత్సురాన్‌, వృత్త్యర్థం యాచయేచ్చైవ అన్యానథాపయేత్తథా.19

యాజయేద్యజేత యోగ్యాన్విప్రో నిత్యోదకీ భ##వేత్‌, కర్యాచ్చ వేదగ్రహణం తథాగ్నేశ్చ పరిగ్రహమ్‌. 20

గ్రాహ్యే ద్రవ్యే చ పాక్యే సమబుద్ధిర్భవేత్తదా, సర్వలోకహితం కుర్యాన్మృదు వాక్యముదీరమేత్‌. 21

ఋతావభిగమః పత్న్యాం శస్యతే బ్రాహ్మణస్య వై, న కస్యాప్యహితం భ్రూయాద్విష్ణుపూజాపరో భ##వేత్‌. 22

దద్యాద్దానాని విప్రేభ్యః క్షత్రియో పి ద్విజోత్తమ, కుర్యాచ్చ వేదగ్రహణం యజ్ఞైర్దేవాన్యజేత్తథా.23

శస్త్రజీవీ భ##వేచ్చైవ పాలయేద్ధర్మతో మహీమ్‌, దుష్టానాం శాసనం కుర్యాచ్ఛష్టానాం పాలనం తథా. 24

పాశుపాల్యం చ వాణిజ్యం కృషిశ్చ ద్విజసత్తమ, వేదస్యాద్యయనం చైవ వైశ్యస్యాపి ప్రకీర్తితమ్‌.25

కుర్యాచ్చ దారగ్రహణమ్‌ ధర్మాంశ్చేవ సమాచరేత్‌, క్రయవిక్రయజైర్యాపి ధనైః కారుక్రియోద్భవైః. 26

దద్యాద్ధానాని శూద్రో పి పావయజ్ఞైర్యజేన్న చ, బ్రాహ్మణక్షత్రియవిశాం శుశ్రూషానిరతో భ##వేత్‌.27

ఋతుకాలాభిగామీ చ స్వదారేషు భ##వేత్తథా, సర్వలోకహితైషిత్వం మంగలం ప్రియవాదితా. 28

అనాయాసో మనోహర్షస్తితిక్షా నాతిమానితా, సామాన్యం సర్వవర్ణానాం మునిభిః పరికీర్తితమ్‌. 29

సర్వేచ మునితాం యాన్తి స్వాశ్రమోచితకర్మణా బ్రాహ్మణః క్షత్రియాచారమాశ్రయోదాపది ద్విజ.30

క్షత్రియో పి చ విడ్వృత్తిమత్యాపది సమాశ్రయేత్‌ నాశ్రయే చ్ఛూద్రవృత్తిం తు అత్యాపద్యపి వై ద్విజః. 31

యద్యాశ్రయేద్ద్విజో మూఢస్తదా చండాలతాం ప్రజేత్‌ బ్రహ్మణ క్షత్రియ విశాం త్రయాణాం మునిసత్తమ. 32

చత్వారా ఆశ్రమాః ప్రోక్తా పంచమో నోపద్యతే బ్రహ్మచారీ గృహీ వానప్రస్థో భిక్షుశ్చ సత్తమ. 33

చతుర్భిరాశ్రమైరేభిస్సాధ్యతే ధర్మ ఉత్తమః విష్ణుస్తుష్యతి విప్రేన్ద్ర కర్మయోగరతాత్మనః. 34

నిస్పృహా శాంతమనస్స్వకర్మనిరతస్య చ తతో యాతి పరం స్థానం యతో నావర్తతే పునః. 35

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమపాదే సదాచారో నామ చతుర్వింశో ధ్యాయః

ఆయా దేశవాసులు ఆయా దేశాచారములను స్వీకరించవలయును. అట్లు కానిచో సర్వధర్మ బహిష్కృతుడై పతితుడగును. భ్రాహ్మణు క్షత్రియవైశ్య శూద్రులకు సామాన్య కర్మలను చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. బ్రాహ్మణులకు దానము చేయవలయును. యజ్ఞములచే దేవతలను పూజించవలయును. జీవనము కొఱకు యాచన చేయవలయును. ఇతరులకు అధ్యాపననుము చేయవలయును. యోగ్యులచే యాగములను చేయించవలయును. భ్రాహ్మణుడు సర్వదా జలసంబంధము కలిగియుండవలయును. వేదయును అగ్నిని స్వీకరించవలయును. తాను పరిగ్రహించదగిని ధనమునందు ఇతరులు గ్రహించదగిన ధనమునందు సమబుద్ధిని చూపవలయును. సర్వలోక హితమును చేయుచు మృదువాక్యముల నుపయోగించవలయును. బ్రాహ్మణుడు ఋతుకాలమును భార్యాగమనము చేయవలయును. ఎవరితోనూ అహితమును మాట్లాడరాదు. విష్ణుపూజాపరుడు కావలయును. క్షత్రియుడు కూడా బ్రాహ్మణుడు కు దానమును చేయవలయును. వేదములను అధ్యయనము చేయవలయును. యజ్ఞములతో దేవతలను పూజించవలయును. శస్త్రజీవిగా నుండవలయును. ధర్మబద్ధముగా రాజ్యపాలన చేయవలయును. దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించవలయును. పశుపాలన, వాణిజ్యము వ్యవసాయము వేదాధ్యయనము వైశ్య కర్మలు, వివాహము చేసికొని క్రయవిక్రయములవలన శిల్పిది కర్మలవలన వచ్చిన ధనములతో ధర్మాచరణమును చేయవలయును. శూద్రులు దానము చేయవలయును.శూద్రులు పాక యజ్ఞమును చేయరాదు. బ్రాహ్మణక్షత్రియ వైశ్యుల శుశ్రూషను చేయవలయును. ఋతుకాలమును స్వదారాగమనమును చేయవలయును. సర్వలోకహితాకాంక్షిత, శుభకరత్వము, ప్రియవాదిత, అనాయాసము, మనోహర్షము, తితిక్ష, నిగర్విత ఇవి అన్ని వర్ణములకు సామాన్యధర్మములు. స్వాశ్రమోచిత కర్మలను ఆచరించువారందరూ మునులే. ఆపదలో బ్రాహ్మణుడు ఎంతటి ఆపదలోనైనను ఆశ్రయించవచ్చును. అత్యాపదలో క్షత్రియుడు వైశ్యాచారమునాశ్రయించవచ్చును. భ్రాహ్మణుడు ఎంతటి ఆపదలో నైనను శూద్రవృత్తిని ఆశ్రయించరాదు. భ్రాహ్మణుడు శూద్రవృత్తి నాశ్రయించినచో చండాలత్వును పొందును. బ్రాహ్మణక్షత్రియ వైశ్యులకు బ్రహ్మచర్యము గార్హస్థ్యము వానప్రస్థము బిక్షుతా అను నాలుగాశ్రమములు విధించబడినవి. అయిదు వ ఆశ్రమము చెప్పబడియుండలేదు. ఈ నాలుగు ఆశ్రమములతో ఉత్తమ ధర్మము సాధించబడును. కర్మయోగము నాశ్రయించు వారి విషయమును శ్రీహరి ప్రీతిచెందును. ఆశను వదిలి శాంతచిత్తుడై కర్మయోగరతులైన వారు తిరిగిరాని పరమపదమును చేరెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున

పూర్వభాగమున ప్రథమపాదమున సదాచారమను

ఇరువదినాలుగవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page