Sri Naradapuranam-I    Chapters    Last Page

పంచవింశో ధ్యాయః ఇరువది అయిదవ అధ్యాయము

అద్యయనాదిధర్మనిరూపణమ్‌

సనక ఉవాచ:-

వర్ణాశ్రమాచారవిధిం ప్రవక్ష్యామి విశేషతః, శృణుష్వ తన్మునిశ్రేష్ఠ! సావధానేన చేతసా.1

యస్స్వధర్మం పరిత్యజ్య పరధర్మం సమాచరేత్‌, పాషండస్స హి విజ్ఞేయస్సర్వధర్మబహిష్కృతః. 2

గర్భాధానాదిసంస్కారాః కార్య మంత్రవిధానతః, స్త్రీణామమంత్రతః కార్యా యథాకాలం యథావిధి.3

సీమంతకర్మ ప్రథమం చతుర్ధే మాసే శస్యతే, షష్ఠే వా సప్తమే వాపి అష్టమే వాపి కరామేతః. 4

జాతే పుత్రే పితా స్నాత్వా సచేలం జాతకర్మ చ, కుర్యాచ్చ నాందీశ్రాద్ధం చ స్వస్తివాచనపూర్వకమ్‌.5

హేమ్నావా రజతే నాపి వృద్ధిశ్రాద్ధం ప్రకల్పయేత్‌, అన్నేన కారయేద్యస్తు స చండాలసమో భ##వేత్‌. 6

కృతాభ్యుదయినం శ్రాద్ధం పితా పుత్రస్స వాగ్యతః, కుర్వీత నామనిర్దేశం సూతికాంతే యథావిధి. 7

అస్పష్టమర్ధహీనం చ హ్యతిగుర్వక్షరాన్వితమ్‌, న దద్యాన్నామ విపేన్ద్ర తథా చ విషమాక్షరమ్‌. 8

తృతీయవర్షే చౌలం చ పంచమే షష్ఠసమ్మితే, సప్తమే చాష్టమే వాపి కుర్యాద్గృహోక్తమార్గతః. 9

దైవయోగాదతి క్రాంతే గర్భాధానాదికర్మణి, కర్తవ్యః పాదకృచ్ఛ్రో వై చౌలే త్వర్థం ప్రకల్పయేత్‌.10

గర్భాష్టమే ష్టమే వాబ్దే వటుకస్యోపనాయనమ్‌, ఆషోడాశాబ్దపర్యంతం గౌణం కాముశంతి చ.11

గర్భేకాదశ##మే బ్దేతు రాజన్యస్యోపనాయనమ్‌, ఆద్వావింశాబ్దపర్యంతం కాలమాహుర్విపశ్చితః. 12

వైశ్యోపనమనం ప్రాక్తాం గర్భాద్ద్వాదశ##మే తథా, చతుర్వింశాబ్దపర్యంతం గౌణమాహుర్మనీషిణః.13

ఏతత్కాలావధేనర్యస్య ద్విజస్యాతిక్రమో భ##వేత్‌, సావిత్రీ పతితం విద్యాన్నాల పేత్తం కదాచన.14

ద్విజోపనయేనే విప్రముఖ్యకాలవ్యతిక్రమే, ద్వాదశాబ్దం చరేత్కృచ్ఛ్రం పశ్చాచ్చాంద్రాయణం తథా.15

సాంతాపనద్వయం చైవ కృత్వా కర్మ సమాచరేత్‌, అన్యధా పతితం విద్యాత్కర్తాపి బ్రహ్మహో భ##వేత్‌.16

మౌంజీ విప్రస్య విజ్ఞేయా ధనుర్జ్యా క్షత్రియస్య చ అవీవైశ్యస్య విజ్ఞేయా శ్రూయతామజినం తథా. 17

విప్రస్య చోక్తవైణీయం రౌరవం క్షత్రియస్యతు, ఆజం వైశ్యస్య విజ్ఞేయం దండాన్వక్ష్యే యథాక్రమమ్‌. 18

పాలాశం బ్రాహ్మణస్యోక్తం నృపస్యౌదుంబరం తథా, బైల్వం విజ్ఞేయం తత్ప్రమాణం శృణుష్వ మే. 19

విప్రస్య కేశామానం స్యాదాలలాటం నృపస్య చ, నాసాగ్రసంమితం దండం వైశ్యస్యాహుర్విపశ్చితః.20

తథా వాసాంపి వక్ష్యాపి విప్రాదానాం యథాక్రమమ్‌, కషాయం చైవ మాంజిష్ఠం హారిద్రం చ ప్రకీర్తితమ్‌.21

ఉపవీతో ద్విజో విప్ర పరిచర్యాపరో గురోః, వేదగ్రహణపర్యంతం నివసేద్గురువేశ్మని.22

ప్రాతస్స్నాయీ భ##వేద్వర్ణీ సమిత్కుశఫలాదికాన్‌, గుర్వర్ధమాహరేన్నిత్యం కల్యే కల్యే మునీశ్వర.23

యజ్ఞోపవీతమజినం దండం చ మునిపత్తమ ! నష్టే భ్రష్టే నవం మంత్రాద్ధృత్వా భ్రష్టం జలే క్షీపేత్‌.24

వర్ణోనో వర్తనం ప్రాహుర్భిక్షాన్నేవనైవ కేవలమ్‌, భిక్షాంచ చ శ్రోత్రియాగారాదాహరరేత్ప్రయతేంద్రియః.25

భవత్పూర్వం బ్రాహ్మణస్యభవన్మధ్యం నృపస్య చ, భవదంత్యం విశః ప్రోక్తం భిక్షాహరణంకం వచః. 26

సాయం ప్రాతర్వహ్నికార్యం యథాచారం జితేంద్రియః, కరక్యాత్ప్రతిదినం వర్ణీ బ్రహ్మయజ్ఞం చ తర్పణమ్‌. 27

అగ్నికార్యపరిత్యాగే పతితః ప్రాచ్యతే బుదైః బ్రహ్మయజ్ఞవిహీనశ్చ బ్రహ్మహా పరికీర్తితః. 28

దేవతాభ్చర్చనం కుర్యాచ్ఛుశ్రుషానుపదం గురోః భిక్షాన్నం భోజయేన్నిత్యం నైకాన్నాశీ కదాచన. 29

అనీయానిన్ద్యవిప్రాణం గృహాద్భిక్షాం జితేంద్రియః, నివేద్య గురవే శ్నీయాద్వాగ్యతస్తదనుజ్ఞాయా.30

ఓ మునిశ్రేష్ఠా! వర్ణాశ్రమాచారవిధిని విశేషముగా చెప్పెదను. సావధానం మనస్కుడవై వినుము. సర్వధర్మమును విడిచి పరధర్మ నాచరించువాడు సర్వధర్మ బహిష్కృడుడై పాషాండుడగును. గర్భాధానాది సంస్కారములను కాలానుసారముగా మంత్రపూరక్వముగా నాచరించవలయును. స్త్రీలకు మంత్రరహితముగా నాచరించవలయును. మొదట సీమంతకర్మ నాలుగువ నెలలో చేయవలయును. లేదా ఆరవ, ఏడవ, ఎనిమిదవ నెలలో నైనను చేయవచ్చును. పుత్రుడు జన్మించిన వెంటెనే తండ్రి సచేలస్నామాచరించి స్వస్తి వాచకపూర్వకముగా నాందీశ్రాద్ధమునాచరించవలయును. అన్నము తో శ్రాద్ధమును చేసినచో చండాలుగడును. తండ్రి వాఙ్మయముతో అతి గుర్వక్షరాన్వితమగా బేసి అక్షరములు కలదిగా నామకరణము చేయరాదు. మూడవయేటకాని, అయిదవ ఏటకాని, ఆరవ ఏటగాని ఏడవయేటగాని ఎనిమిదయేటకాని గృహ్యమార్గముననుసరించి చౌలమును చేయవలయును. దైవయాగమున గర్భాదానాదికర్మలు చేయుటకు కాలాతిక్రమము జరిగిచో పాదకృచ్ఛ్రవ్రతము నాచరించవలయును. కాలాతిక్రమము జరిగినచో పాదకృచ్ఛవ్రతము నాచరించవలయును. బ్రాహ్మణునకు గర్భాష్టమ వర్షమున కాని అష్టమవర్షమున ఉపనమయనము చేయవలయును. వీలుకానిచో పదునారు వర్షముల లోపు చేయవచ్చును. క్షత్రియునకు గర్భైకాదశవర్షమున చేయవలయును. ఇరువది రెండు సంవత్సరముల వరకు చేయవచ్చును. ఇరువది నాలుగు వర్షముల వరకు గౌణకాలమగును. బ్రాహ్మణునకు చెప్పిన ఉపనయకాలము అతిక్రమించినచో ద్విజుడు సావిత్రీ పతితుడగును.

అతనితో నెవ్వరూ ఎప్పుడూ సంభాషించరాదు. బ్రాహ్మణున కుపనయనము చేయు సమయము అతిక్రమించినచో పన్నెండు సంవత్సరములు కృచ్ఛ్రవ్రతము నాచరించవలయును. తరువాత చాంద్రాయణవ్రతము నాచరించవలయును. రెండు సంతాపన వ్రతమునాచరించి తరువాత కర్మ నారంభించవలయును. అట్లు చేయనిచో పతితుడగును. కర్తకు బ్రాహ్మహత్యాపాతకము లభించును. ఉపనయన కాలును భ్రాహ్మణుని మొలత్రాడు ముంజతృణముతో నేర్పరుచవలయును. క్షత్రియునకు వింటినారతో చేయవలయును. వైశ్యునకు అవికముతో చేయవలయును. అట్లే బ్రాహ్మణునకు జింకచర్మము, క్షత్రియునకు ఏదు చర్మము, వైశ్యునకు గొఱ్ఱచర్మమును ధరింపచేయవలయును. అట్లే బ్రాహ్మణునకు మోదుగుచెట్టు దండం, క్షత్రియునకు మేడిచెట్టు దండము, వైశ్యునకు మారేడుచెట్టు దండముండవలయును. దండప్రమాణము బ్రాహ్మణునకు కేశాంతము, క్షత్రియమునకు లలాటపర్యతము, వైశ్యునకు నానాగ్రపర్యంతముండవలయును. ఇక ఇపుడు బ్రాహ్మణాదులు ధరించవలసిన వస్త్రములను చెప్పెదను వినుము. బ్రాహ్మణునకు కాషాయ వర్ణము, క్షత్రియునకు మాంజిష్ఠ వర్ణము, వైశ్యునకు పసుపువర్ణ వస్త్రము విహితము. ఉపనీతుడైన ద్విజుడు గురవునకు పరిచర్యను చేయుచువేదాధ్యయన పర్యంతము గురుకులమున నివాసమును చేయవలయును.బ్రహ్మచారి ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానమాచరించి కాలానుగుణంముగా నూతనమును మంత్రపూరక్వకమగా ధరించవలయును. భ్రష్టమైనదానిని జలమును పడవేయలయును. బ్రహ్మచారి భిక్షాన్నముచే మాత్రమే జివకను గడుపలెను. ఇంద్రియ నిగ్రహముతో బ్రహ్మచారి శ్రోతియును ఇంటనుండియే భిక్షాన్నగ్రహణము చేయవలయును. బ్రాహ్మణుడు భిక్షచేయునపుడు మొదటభవచ్ఛబ్దమును ప్రయోగించవలయును. క్షత్రియుడు మధ్యన భవచ్చబ్దమును వైశ్యుడు చివర భవచ్ఛబ్దము నుపయోగించవలయును. అనగా బ్రాహ్మణుడు ''భవతి! భిక్షాం దేహి మాతః'' అని, క్షత్రియుడు ''భిక్షాం భవతి దేహి మాతః'' అని, వైశ్యుడు ''భిక్షాం దేహి భవతి మాతః'' అని ప్రయోగించలయును. బ్రహ్మచారి ఇంద్రియ నిగ్రహముతో ప్రతిదినము ప్రాతఃకాలము సాయంకాలము అగ్నికార్యమును బ్రహ్మజ్ఞానమును చేయవలయును. తర్పణముచేయవలయును. అగ్నికార్యమును వదిలినవాడు పతితుడగును, బ్రహ్మయజ్ఞమును చేయననివాడు బ్రహ్మహత్యచేసిన వాడగును. గురుశుశ్రూష తరువాత దేవతాద్యర్చనను చేయవలయును. బ్రాహ్మచారి ప్రతినిత్యము భిక్షాన్నమునే భుజించవలయును. కాని ఒకే ఇంటి భోజనము చేయరాదు. ఉత్తమ విప్రుల ఇంటినుండి బిక్షను తెచ్చి ఇంద్రియ జయముతో భిక్షను గరువునకు నివేదించి గురువాజ్ఞచే మౌనముగా తాను భోజనము చేయవలయును. 1 -30

మధు స్త్రీ మాంసలవణం తాంబూలం దంతధావనమ్‌, ఉచ్చిష్టబోజనం చైవ దివాస్వాపం చ వర్జయేత్‌.31

ఛత్రపాదకగంధాంశ్చ తథా మాల్యానువేపనమ్‌, జలకేళిం నృత్యగీతవాద్యం తు పరివర్జయేత్‌.32

పరివాదం చోపతాపం విప్రలాపం తథాంజనమ్‌, పాషండజనసంయోగం శూద్రసంగం చ వర్జయేత్‌. 33

అభివాదనశీలస్స్యాత్‌ వృద్ధేషు చ యథాక్రమమ్‌, జ్ఞానవృద్ధాస్తపోవృద్ధా వయేవృద్ధా ఇతి త్రయః. 34

అధ్యాత్మకాదిదుఃఖాని నివారయతి యో గురుః, వేదశాస్త్రోపదేశేన తం పూర్వమభివాదయేత్‌. 35

అసావహమితి భ్రూయాద్ద్విజో వైహ్యభివానే, నాభివాద్యశ్చ విప్రేణ క్షత్రియాద్యః కథంచన. 36

నాస్తికం భిన్నమర్యాదం కృతఘ్నం గ్రామయాజకమ్‌, స్తేనం చ కితవం చైవ కదాచిన్నాభివాదయేత్‌. 37

పాషండం పతితం వ్రాత్యం తథా నక్షత్రజీవినమ్‌, తథా పాతకినం చైవ కదాచిన్నాభివాదయేత్‌. 38

ఉన్మత్తం చ శఠం ధూర్తం ధావన్తమశుచిం తథా, అభ్యక్తశిరసం చైవ జపన్తం నాభివాదయేత్‌. 39

వివాదశీలినం చండం వమంతం జలమధ్యగమ్‌, భిక్షాన్నధారిణం చైవ శయానం నాభివాదయేత్‌. 40

భర్తృఘ్నీం పుష్పిణీం జరాం సూతికాం గర్భపాతినీమ్‌, కృతఘ్నీం చ తథా చండీం కదాచిన్నాభివాదయేత్‌.41

సభాయాం యజ్ఞశాలాయం దేవతాయతనేష్వపి, ప్రత్యేకం తు నమస్కారో హంతి పుణ్యం పురాకృతమ్‌.42

శ్రాద్ధం వ్రతం తథా దానం దేవతాభ్యర్చనం తథా, యజ్ఞం చ తర్పణం చైవ కుర్వంతం నాభివాదయేత్‌. 43

కృతే భివాదనే యస్తు న కర్యాత్ప్రతివాదనమ్‌, నాభివాద్యస్స విజ్ఞేయో యథా శూద్రా స్తథైవ సః. 44

ప్రక్షాల్య పాదావాచమ్య గురోరనభిముఖస్సదా, తప్య పాదౌ చ సంగృహ్య అధీయీత విచక్షణః. 45

అష్టకాసు చతుర్దశ్యాం ప్రతిపత్పర్వణోస్తథా, మహాభరణ్యాం విప్రేన్ద్ర శ్రవణీద్వాదశీదినే.46

భాద్రపదాపరపక్షే ద్వితీయయాం తథైవ చ, మాఘస్య శుక్లసప్తమ్యాం నవమ్యామాశ్వినస్య చ. 47

పరివేషం గతే సూర్యే శ్రోత్రియే గృహమాగతే, బంధితే బ్రాహ్మణ చైవ ప్రవృద్ధకలహే తథా. 48

సంధ్యాయాం గర్జితే మేఘే హ్యకాలే పరివర్షణ, ఉల్కాశనిప్రసాతే చ తథా విప్రే వమానితే. 49

మన్వాదిషు చ దేవర్షే యుగాదిషు చతుర్ష్వపి, నాథీయీత ద్విజః కశ్చిత్‌ సర్వర్మఫలోత్సకః. 50

తృతీయా మాధవే శుక్లా భాద్రే కృష్ణాత్రయోదశీ, కార్తికే నవమీ శుద్ధా మాఘే పంచదశీ తిథిః,

ఏతా యుగాద్యాః కథితా దత్తస్యాక్షయకారికాః. 51

మధ్యమును, స్త్రీలను , మాంసమును, లవణమును, తాంబులమును, దంతధావనమును, ఉచ్ఛిష్ఠ భోజనమును, పగలు నిద్రించుటను, బ్రహ్మచారి విడువలయును. ఛత్రమును, పాదుకలును, గంధమును, పూలమాలను, సుగంధద్రవ్యానులేపనమును, జలకేళిని,నృత్యగీత వాద్యమును, విడువలయును. పరివాదమును, ఉపలాపమును అధిక ప్రలాపమును, కాటుకను, నాస్తిక జనసంబంధమును, శూద్రజన సంగతిని విడువవలయును. వృద్దుల విషయమున యథావిదిగా అభివాదమును చేయవలయును. జ్ఞానవృద్ధుల, వయోవృద్ధలు తపోవృద్ధలు అని వృద్ధలు మూడు విధములుగా నుందురు. వేదోశాస్త్రోపదేశముచే అధ్యాత్మికాది దుఃఖములను నివారించు గురువునకు మొదట అభివాదము చేయవలయును. బ్రాహ్మణుడు అభివాదమును చేయునపుడు' అసావహం' (ఈ నేను) అని చెప్పవలయును. బ్రాహ్మణుడు క్షత్రియాదులను ఎట్టి పరిస్థితిలోనైనను అభివాదమును చేయరాదు. నాస్తికునికి, భిన్నమర్యాదునికి, కృతఘ్నునికి, గ్రామయాజకునికి, చోరుకనకి, కపటికి, ఎప్పుడూ నమస్కరించరాదు. పాషాండునికి పతితునికి, వ్రాత్యునికి, జ్యోతిష్యునికి, పాతకునికి నమస్కరించరాదు. ఉన్మత్తునికి శఠునికి ధూర్తునికి పరుగెత్తు వానికి అపవిత్రునికి, నూనె తలకంటుకొనిన వానికి, జపముచేయుచున్నవానికి నమస్కరించరాదు. వివాదశీలికి, చండునికి వాంతిచేసుకొనినవానికి నీటి మధ్యలో నున్నవానికి, బిక్షాన్నమును ధరించువానికి, పడుకొనియున్నవానికి నమస్కరించరాదు. భర్తను చంపినదానికి, రజస్వలకు, జారురాలికి, ప్రసవించినదానికి, పురిటిలో ఉన్నదానికి గర్భపాతమును చేసుకొన్నదానికి కృతఘ్నురాలికి, చండికి, నమస్కరించరాదు. సభలో యజ్ఞశాలలో దేవాలయాలలో, ప్రత్యేకించి ఏ ఒక్కరికో చేసిన నమస్కారము పూర్వము చేసుకొన్నసుకృతమును నశింపచేయును శ్రాద్ధమును, వ్రతమును దానమును దేవతార్చనను, యజ్ఞమును తర్పణమును,చేయవానికి నమస్కరించరాదు. అభివాదము చేసినపుడు ప్రత్యభివాదము చేయనివారికి అభివాదుము చేయరాదు. వ్రత్యభివాదమునుచేయనివాడు శూద్రతుల్యుడు, పాదప్రక్షాళనమును చేసుకొని ఆచమనము చేసి గురువుగారికి అభిముఖముగా నుండి గురువుపాదములను గ్రహించి వివేకము కలవాడై అధ్యయము చేయవలయును. అష్టమియందు, చతుర్ధవియందు, ప్రతిపత్తునందు, పూర్ణిమ తిథయందు మహాభరణీ నక్షత్రమునందు శ్రావణద్వాదశీయందు, భాద్రపద బహుళ ద్వితీయానాడు, మాఘశుద్ధ సప్తమినాడు , అశ్వయుజ శుద్ధనవమినాడు, సూర్యగ్రహణమున, శ్రోత్రియులు గృహమునకు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు బంధించబడినపుడు , కలహములుపెరిగినపుడు సంధ్యాసమయమున మేఘగర్జన కాలమున, అకాలవర్షమున, ఉల్కాపాతము ఆశనిపాతము జరిగినపుడు, విఫ్రుడవమానించబడినపుడు మన్వాదికాలమునందు నాలుగు యుగముల ఆదికాలమునందు కర్మఫలమున ఆసక్తి గల బ్రాహ్మణుడు అధ్యయము చేయరాదు. వైశాఖశుద్ధి తదియ(అక్షయ తృతీయ) భాద్రపద కృష్ణ త్రయోదశి, కర్తీక శుక్ల నవమి ( అక్షయనవమి) మాఘ పూర్ణిమ ఈ నాలుగు యాగాదులుగా తెలియును. ఈ కాలము న దానము చేసినచో అక్షయ ఫలము లభించును. 31 -51

మన్వాదీంశ్చ ప్రవక్ష్యామి శీణుస్వసమాహితః, అక్షయశుక్ల నవమీ కార్తికే ద్వాదశీ పితా. 52

తృతీయా చైత్రమాసస్య తథా బాద్రపదస్య చ, అషాడ శుక్లదశమీ సితా మాఘస్యసప్తమీ. 53

శ్రావణస్యాష్టమీ కృష్ణా తథాషాడే చ పూర్ణామా, పాల్గునస్య త్వమావాస్యా పౌషస్యేకాదశీ సితా. 54

కార్తీకీ పాల్గునీ చైత్రీ జైష్ఠే పంచదశీ సితా, మన్వాదయస్సమాఖ్యాతా దత్తస్యాక్షయా కారికాః. 55

ద్విజైశ్శ్రాద్ధం చ కర్తవ్యం మన్వాదిషుయుగాదిషు, శ్రాద్ధే నిమంత్రితే చైవ గ్రహణ చంద్రసూర్యయోః. 56

అయనద్వితయే చైవ తథా భూకంపనే మునే, గలగ్రహే దుర్దినే చ నాథీయీతే కదాచన. 57

ఏవమాదిషు సర్వేషు అద్యేషు నారద! అథీయతాం సుమూఢానాం ప్రజాం ప్రజ్ఞాం యశశ్శ్రియం.58

ఆయుష్యం జలమారోగ్యం నికృంతతి యమస్స్వయమ్‌,

అనధ్యాయే తు యో ధీతే తం విద్యాద్భ్రహ్మఘూతకమ్‌. 59

న తల సంభాషయేద్విప్ర న తేన సహ సంవసేత్‌, కుండగోలకయోః కేచిజ్జడాదీనాం చ నారద. 60

వదంతి చోపనయనం తత్పుత్రాదివషుకేచన, ఆనదీత్య తు యో వేదమన్యత్ర కురుతే శ్రమమ్‌. 61

శూద్రతుల్యస్స విజ్ఞేయో నరకస్య ప్రయో తిథి అనదీతశ్రుతిర్విప్ర ఆచారే ప్రతిపద్యతే.62

నాచారఫలమాస్నోతి యతా శూద్రస్తథైవ సః నిత్యం నైమిత్తకం కామ్యం యచ్ఛాన్యత్కర్మ వైనదికమ్‌,63

ఆనధీతస్య విప్రస్య సర్వం భతి నిష్పలమ్‌ శబ్దబ్రహ్మమయో విష్ణుః వేదస్సాక్షాద్దిరిస్మ్కృతః64

వేదాధ్యయీ తతో విప్రస్సర్వాన్కామానవాపస్నుయాత్‌. 65

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే ప్రథమమాదే స్మార్తాచారేషు వర్ణాశ్రమ

ధర్మేష్వధ్యయనాదిధర్మనిరూపణం నామ పంచవింశో ధ్యాయః

మన్వాదికాలమును చెప్పెదను సావధానముగా వినుము. అశ్వయుజ శుధ్దనవమి కార్తిక శుద్ధద్వాదశి, చైత్రశుద్ధ తృతీయ, భాద్రపదశుద్ధ తృతీయ ఆషాడ శుద్ధదశమి, మాఘశుద్ధ సప్తమీ, శ్రావణ బహుళ అష్టమి, ఆషాడ పూర్ణిమ, పాల్గునామావాస్య, పుష్య శుద్దైకాదశి, కార్తిక, పాల్గున చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు మన్వాదులుగా ప్రసిద్ధి పొందినవి ఈ కాలుమున దానము చేసిన అక్షయ ఫలమున లభించును. మన్వాది కాలమున, యుగాదికాలమున శ్రాద్ధము చేయవలయును. శ్రాద్ధమున నిమంత్రణ చేసినపుడు, సూర్యచంద్రగ్రహణములలోను ఉత్తరాయణ దక్షిణాయన కాలములోను భూకంపనమును గల గ్రహణమున, మేఘచ్ఛిన్నదినమున అధ్యయనము చేయరాదు. ఈ అనద్యయన దినములలో అధ్యయనముచేయు మూడులకు సంతానమును, ప్రజ్ఞను కీర్తిని, సంపదను ఆయుష్యమున, బలమును, ఆరోగ్యమును యముడు స్వయముగా హరించును. అనద్యయమున వేదాధ్యమనుము చేయువానిని బ్రహ్మఘుతకునిగా పేర్కొనెదరు. అట్టి వానితో మాట్లాడరాదు. కలసిఉండరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగిన పుత్రునకి, భర్త మరణించిన తరువాత జారుని వలన కలిగిన పుత్రునకి ఇతర విద్యలలో పరిశ్రమచేయువాడు శూద్రతుల్యుడు, నకరమునకు ప్రియమైన అతిధిగా తెలియుము. వేదాధ్యాయనమును చేయని విప్రుడు ఆచారమునందు శ్రద్ధచూపినను, ఆచారఫలమును పొందజాలడు. శూద్రుతుల్యుడగును. వైదికములగు నిత్యనైమిత్యక కామ్యకర్మలుచే అధ్యయనముచేయని వానికి నిష్ఫలములగును. శబ్ధ బ్రహ్మమయుడు విష్ణువు. వేదము సాక్షాత్తు శ్రీహరియే. కావున వేదాధ్యాయమగు విప్రుడు సర్వకామమలును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున స్మార్తాచారములలో వర్ణాశ్రమధర్మములలో అధ్యయనాది ధర్మనిరూపణ అను ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page