Sri Naradapuranam-I
Chapters
Last Page
షడ్వింశో೭ ధ్యాయః ఇరువదియారవ అధ్యాయము గృహస్థధర్మస్య నిరూపణమ్ ననక ఉవాచ:- వేదగ్రహణపర్యస్తం శుశ్రూషా నితా గురోః, అనుజ్ఞాతస్తతస్తేన కర్యాదగ్ని పరిగ్రహమ్.1 వేదాంశ్చధర్మశాస్త్రాణి వేదాంగాన్యపి చ ద్విజః, అధీత్య గురవే దత్త్వా దక్షిణాం సంవిశేద్గృహమ్. 2 రూపలావణ్యసంపన్నాం సుగణాం సకులోద్భవామ్, ద్విజస్సముద్వహేత్కన్యాం సుశీలాం ధర్మచారిణీమ్.3 మాతృతః పంచమీం ధీమాన్పతృతస్సప్తమీం తథా, ద్విజ స్సముద్వహేత్కన్యామన్యథా గురతల్పగః. 4 రోగిణీం చైవ వృత్తాక్షీం సరోగకులసంభవామ్, అతికేశామకేశాం చ వాచాలాం నోద్వహేద్భుదః. 5 కోపనాం వామనాం చైవ దీర్ఘదేహాం విరూపిణీమ్, న్యూనాధికాంగీమున్మత్తాం పిశునాం నోద్వహేద్భుదః. 6 స్థూలగుల్పాం దీర్ఘజంఘాం తథైవ పురషాకృతిమ్, శ్మశ్రువ్యంజనసంయుక్తాం కుబ్జాం చైవోద్వహేన్న చ.7 వృథాహాస్య ముఖీం చైవ సదాన్యగృహవాసీనీమ్, వివాదశీలాం భ్రమితాం నిష్ఠురాం నైనోద్వా హేద్భుదః.8 బహ్వశినీం స్థూలదంతాం స్థూలోష్ఠీం ఘర్ఘరస్వనామ్, అతికృష్ణాం రక్తావర్ణాం ధూర్తాం నైవోద్వహేద్భుదః.9 సదా రోదనశీలం చ పాండురాభాం చ కుత్సతామ్, కాసశ్వాసాదివి సంయుక్తాం నిద్రశీలాం చ నోద్వహేత్. 10 అనర్దభాషిణీం చైవ లోకద్వేషపరాయణమ్, పరాపవాదనిరతాం తస్కరాం నోద్వహేద్బుధః.11 దీర్ఘనాసాం చ కితవాం తనూరుహవిభూషితామ్, గర్వితాం జనవృత్తిం చ సర్వథా నోద్వ హేద్భుదః.12 బాలభావాదవిజ్ఞాతస్వభానవాముద్వహేద్వది, ప్రగల్భాం వా గుణాం జ్ఞాత్వా సర్వధా, తాం పరిత్యజేత్.13 భర్తృపుత్రేషు యా నరీ సర్వదా నిష్ఠురా భ##వేత్, పరానుకూలినీ యా చ సర్వధా తాం పరిత్యజేత్. 14 వివాహాశ్చాష్టధా జ్ఞేయా బ్రాహ్మాద్యా మునిసత్తమ, పూర్వః పూర్వో వరో జ్ఞేయః పూర్వభావే పరః పరః.15 బ్రాహ్మో దైవస్తథైవార్షః ప్రాజాప్తత్యస్తథాసురః, గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచశ్చాష్టమో మతః. 16 బ్రాహ్మేణ చ వివాహేన వైవాహ్యం వైద్విజోత్తమః, దైవేనాప్యథవా విప్ర కేచిదార్షంప్రచక్షతే.17 ప్రాజాపత్యాదయో విప్ర వివాహాః పంచగర్హితా, అభావేషు తు పూర్వేషాం కుర్యేదేవ పరాన్భదః.18 యజ్ఞోపవీతద్వితయం సోత్తరీయం చ ధారయేత్, సువర్ణకుండలే చైవ ధౌతవస్త్రద్వయం తథా. 19 అనులేపనిప్తాంగః కృత్తాకేశనఖశ్శుచి ధరయేద్వైణవం దండం సోదకం చ కమండులుమ్. 20 ఉష్ణీషమమలం చత్రం పాదుకే చాప్యుపానహౌ , ధారయేత్పుష్పమాల్యే చ సుగంధం ప్రియదర్శినః.21 నిత్యం స్వాధ్యాయశీలస్స్యాత్ యథాచారం సమాచరేత్, పరాన్నం నైవ భుంజీత పరవాదం చ వర్జయేత్. పాదేన నాక్రమేత్పాదముచ్ఛిష్టం నైవ లంఘయేత్, న సంహతాభ్యాం హస్తాభ్యాం కండూయేదాత్మనశ్శిరః.23 పూజ్యం దేవాలయం చైవ నాపసవ్యం ప్రజేద్ద్విజః దేవార్చవమనస్నావ్రతశ్రాద్ధక్రియాదిషు.24 న భ##వేన్ముక్తకేశశ్చ నైకవస్త్రధరస్సదా, నారో హేదుష్ట్రయానం చ శుష్కంవాదం చ వర్జయేత్.25 అన్యస్త్రియం న గచ్చేచ్ఛ పైశున్యం పరివర్జయేత్, నాపసవ్యం వ్రజేద్విప్రగో೭ శ్వత్థానలపర్వతాన్.26 చతుష్పథం చైత్యవృక్షం దేవఖాతం నృపం తథా, అసూయాం మత్సరత్వం చ దివాస్వాపం చ వర్జయేత్.27 న వదేత్పరపాపాని స్వపుణ్యం న ప్రకాశ##యేత్, స్వకం నామ స్వనక్షత్రం మానం చైవతిగోపయేత్.28 న దుర్జనైస్సహ వసేన్నాశాస్త్రం శృణుయాత్తథా, అసవద్యూతగీతేషు ద్విజస్తు న రతిం చరేత్. 29 ఆర్ద్రాస్థి చ తథోచ్ఛిష్టం శూద్రం చ పతితం తథా, సర్పం చ భీషణం స్పృష్ట్వా సచేలం స్నామాచరేత్.30 చితిం చ చితికాష్ఠం చ యూపం చాండాజాలమేవ చ, స్పృష్ట్వా దేవలకం చైవ సవాసా జలమావిశేత్.31 దీపఖట్వా తనుచ్ఛాయాకేశ వస్త్రకటోదకమ్, అజామార్జనిమార్జారరేణుర్దైవం శుభం హరేత్.32 శూర్పవాతం ప్రేతధూమం తథా శూద్రాన్నభోజనమ్, వృషలీపతిసంగం చ దూరతః పరివర్జయేత్.33 అసచ్ఛాస్త్రార్థమననం ఖాదనం నఖకేశయోః, తథైవ నగ్నశయనం సర్వదా పరివర్జయేత్.34 శిరో7 భ్యంగావశిష్టేన తైలేనాంగం న లేపయేత్, తాంబూలమశుచిం నాద్యాత్తదా సుప్తం న భోదయేత్.35 నాశుద్ధో7గ్నిం పరిచరేత్పూజయేద్గరుదేవతాః, న వామహస్తేనైకేన పిబేద్వక్త్రేణ వా జలమ్.36 న చాక్రమేద్గురోశ్ఛాయాం తదాజ్ఞాం చ మునీశ్వర, న నిందేద్యోగినో విప్రాన్వ్రతినో7 పి యతీంస్తథా. 37 పరస్పరస్య మర్మాణి న కదాపి వదేద్ద్విజః, దర్శే చ పౌర్ణమాస్యాం చ యాగం కుర్యాద్యథావిధి. 38 ఉపావాసం చ హోతవ్యం సాయం ప్రాతర్ద్విజాతిభిః, ఉపాసన పరిత్యాగే సురాపీత్యుచ్యతే బుధైః.39 ఆయనే విషునే చైవ యుగాదిషు చతుర్ష్వపి, దర్శే చ ప్రేతపక్షే చ శ్రాద్ధం కుర్యాద్గృహీ ద్విజః. 40 మన్వాదిషు మృతాహే చ అష్టకాసు చ నారద, నవధాన్యే సమాయాతే గృహీ శ్రాద్ధం సమాచరేత్. 41 శ్రోత్రియే గృహమాయాతే గ్రహణ చంద్రసూర్యయోః, పుణ్యక్షేత్రేషు తీర్థేషు గృహీ శ్రాద్ధం సమాచరేత్.42 యజ్ఞోదానం తపో హోమస్స్వాధ్యాయః పితృతర్పణమ్, వృథా భవతి తత్సర్యం ఊర్ధ్వపుండ్రం వినా కృతమ్. 43 ఊర్థ్వపుండ్రం చ తులసీం శ్రాద్ధేనేచ్ఛంతి కేచన, వృథాచారః పరిత్యాజ్య స్తస్మాచ్ఛ్రేయో 7ర్ధిబిర్ద్విజైః. 44 ఇత్యేవమాదయో ధర్మా స్స్మృతిమార్గప్రచోదితాః, కార్యా ద్విజాతిభిస్సమ్యక్సర్వకర్మ ఫలప్రదాః. 45 సదాచారపరా యే తు తేషాం విష్ణుః ప్రసీదతి, విష్ణౌ ప్రసన్నతాం యాతే కిమసాధ్యం ద్విజోత్తమ. 46 ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమపాదే స్మార్తధర్మేషు వేదాధ్యాయనాదికస్య గృహస్థధర్మస్య చ నిరూపణం నామ షడ్వింశో7 ధ్యాయః సనకమహర్షి పలికెను:- వేదాధ్యయనము చేయువరకు గురవునకు శుశ్రూష చేయవలయును. గురువుగారి అనుమతినిపొంది అగ్ని పరిగ్రహమును చేయవలయును. వేదములను, వేదాంగములను ధర్మశాస్త్రములను చక్కగా అధ్యయనము చేసి గురువుగారికి దక్షిణ సమర్పించి ఇల్లును చేరవలయును. తరువాత రూపలావణ్య సంపన్నురాలు గుణవతి సత్కులోద్భవ, సుశీల ధర్మచారిణీ అయిన కన్యను వివాహమాడవలయును. తల్లివంశమునుండి అయిదవ తరమునకు, తండ్రినుండి ఏడవ తరమునుకు సంబంధించని కన్యను వివాహము చేసుకొనవలయును. అట్లుకానిచో గురుతల్పగతపాపము సంభవించును. (అనగా మేనత్త, మేనమామ, బావమరిది మొదలగువారి పుత్రికలను వివాహమాడరాదని భావము). ఎపుడూ రోగముతో నుండు కన్యను,తిరుగుడు కనులదానిని, రోగములున్న కులమును పుట్టిన దానిని అతికేశను, అకేశను, వదరుబోతును, కోపిష్ఠురాలిని, పొట్టిదానిని, చాలాపొడగరిని, విరూపిణిని, న్యూనాంగిని, అధికాంగిని ఉన్మత్తురాలిని, కొండెములు చెప్పుదానిని, వివాహమాడరాదు. స్థూలగుల్భను(లావు మడిమలు కలదానిని) పొడుగు పిక్కలు కలదానిని, పురుషాకారముతో నున్నదానిని, మువ్వన్నెలు కలదానిని వివాహమాడరాదు. వృధాహాస్యముఖిని, ఎపుడు ఇతరుల ఇండ్లలో ఉండుదానిని, వివాదశీలను, భ్రమించుదానిని, కఠినురాలిని, వివాహమాడరాదు. అతిగా భుజించుదానిని, పెద్దదంతములు కలదానిని, లావు పెదవులు కలదానిని ఘర్ఘురధ్వని కలదానిని, అతికృష్ణవర్ణను, రక్తవర్ణము, ధూర్తురాలిని వివాహమాడరాదు. ఎపుడూ ఏడ్చుస్వభావము. కలదానిని, పాండుదేహమును, కుత్సితురాలిని, కాస శ్వాసమొదలగు వ్యాధులు కలదానిని నిద్రశీలిని వివాహమాడరాదు. అనర్ధభాషిణిని, లోకద్వేషపరాయణను పరాపవాదనిరతను, చోరస్వభావను వివాహమాడరాదు. పొడుగు ముక్కుగలదానిని, కపటశీలను శరీరమంతటా రోమములు గలదానిని గర్వితురాలిని, బకవృత్తిని(వంచనాపరను) ఎపుడూ వివాహమాడరాదు. బాల్యమున తెలియక వివాహమాడినను ప్రగల్బురాలుగా గుణరహితురాలుగా తెలిసినచో విడిచి పెట్టవలయును. భర్తవిషయమున సంతాన విషయమున సర్వదా కఠినముగా ప్రవర్తించుదానిని, పరానుకూలురాలిని సర్వదా పరిత్యాగము చేయవలయును. భ్రాహ్మము మొదలగు వివాహములు ఎనిమిది విధములు. వీటిలో మొదటివి శ్రేష్ఠములు. మొదటివి లేనపుడు తరువాతవి శ్రేష్ఠములు. బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము, అని ఎనిమిది విధములు. బ్రాహ్మణుడు ఎప్పుడూ బ్రాహ్మవివాహమునే చేసుకొనవలయును. దైవము కాని ఆర్షమును కాని చేసుకొనవచ్చునని కొందరి మతము. ప్రాజాపత్యము మొదలగు అయిదు వివాహములు ద్విజులకు నింద్యములు. పూర్వములు వీలుకాని పక్షమున పరములను చేసుకొనవచ్చును. రెండు యజ్ఞోపవీతములను ఉత్తరీయమును, బంగారుకుండలములను, ధౌతవస్త్రద్వయమును ధరించవలయును. చందనాద్యను లేపనము చేసుకొనవలయును. కేశనఖాదికృంతనము గావించుకొని శుచిగా నుండవలయును. వెదురు దండమును, ఉదకముతో నిండిన కమండలమును, తలపాగను తెల్లని ఛత్రమును పాదుకలను, ఉపానహములను, సుగంధపుష్పమాల్యములను ధరించవలయును. పరాన్నమును పరవాదమును పరిత్యజించవలయును. తాను ఒక పాదముతో మరోకపాదమును కండూయనము చేయరాదు. పూజ్యులకు దేవాలయమునకు అపసవ్యముగా వెళ్ళరాదు. దేవార్చనలో ఆచమనములో, స్నానములో వ్రతశ్రాద్ధాదిక్రియలలో కేశములను విరబోసుకొని యుండరాదు. ఏకవస్త్రమును ధరించియుండరాదు. ఒంటెమీద ఆరోహించరాదు. శుష్కవాదమును చేయరాదు. పరస్త్రీ సంగమమును చేయరాదు. కొండెములు చెప్పరాదు. లుబ్ధత్వమును వీడవలయును. గోవుకు రావిచెట్టుకు, అగ్నికి పర్వతమునకు అపసవ్యముగా వెళ్ళరాదు. నాలుగు దారులు కూడలికి దేవతా వృక్షమునకు దేవాలయమునకు అపసవ్యముగా నడువరాదు. రాజునకు అపసవ్యముగా నడువరాదు. అనూయను, మాత్సర్యమును పగటి నిద్రను వీడవలయును. ఇతరుల పాపములను తన పుణ్యమును బయలు పరచరాదు. తనపేరును నక్షత్రమును గౌరవముగను రహస్యముగా నుంచవలయును. దుర్జనులతో కలిసియుండరాదు. శాస్త్రవిరుద్ధమైనదానిని వినరాదు. బ్రాహ్మణుడు మధుపానమునందు, ద్యూతమునందు, గీతమునందు ఆసక్తి చూపరాదు. పచ్చి ఎముకను, ఉచ్ఛిష్టమును శూద్రుని, పతితుని, సర్పమును, శ్వాసమును స్పృశించినచో సచేలముగా స్నానము చేయవలయును. చితిని చితికాష్ఠమును, యూపమును, చండాలుని, దేవలకుని స్పృశించినచో సచేలస్నానము నాచరించవలయును. దీపమును, మంచమును, నీడను కేశమును, వస్త్రమును, కటోదకమును, మేకను, మార్జనధూళిని మార్జారమును స్పృశించినచో శుభములు తొలగును. చేటగాలిని, ప్రేతధూమమును శూద్రాన్న భోజనమును, శూద్రస్త్రీపతి సంసర్గమును, దూరమునుండియే వీడవలయును. అసత్ శాస్త్రార్థములను మననము చేయరాదు. నఖకేశములను ఖేదనము చేయరాదు. నగ్నముగా శయనించరాదు. శిరమునకు అలమగా మిగిలిన తైలమును ఇతర శరీరాంగములకు నలదరాదు. అపరిశుద్ధుడుగా ఉన్నప్పుడు అగ్నిని గురువును దేవతలను సేవించరాదు. ఒకే వామహస్తముతో కాని కేవలము నోటితో కాని జలపానము చేయరాదు. గురవుగారి నీడను, ఆజ్ఞను దాటరాదు. యోగులను, బ్రాహ్మణులను, వ్రతులను యతులను నిందించరాదు. బ్రాహ్మణుడు పరస్పర రహస్యములను ప్రకటించరాదు. పూర్ణిమా అమావాస్యలలో ద్విజుడు యథావిధిగా యాగమును చేయవలయును. ద్విజులు ప్రాతఃకాలమున సాయంకాలమున హోమమును దేవోపాసనము చేయవలయును. ఉపాసనను పరిత్యజించినవాడు సురాపానము చేసినవానితో సముడని పండితులు భావింతురు. గృహస్థుడైన బ్రహ్మణుడు ఆయనకాలమున, విషువకాలమున యుగాదికాలములలో అమావాస్యలో పితృపక్షమున శ్రాద్ధమును చేయవలయును. మన్వాదికాలమున మృతాహమున, అష్టమతిథిన కొత్తధాన్యము ఇంటికొచ్చినపుడు గృహస్థుడు శ్రాద్ధమును నాచరించవలయును. శ్రోత్రియుడు ఇంటికొచ్చినపుడు, చంద్రసూర్యగ్రహణములలో, పుణ్యక్షేత్రములలో, పుణ్యతీర్థములలో, గృహస్థుడు శ్రాద్ధము నాచరించవలయును. ఊర్థ్వపుండ్రధారణచేయక చేసిన యజ్ఞదాన తపోహోమ స్వాధ్యాయ పితృతర్పణములు వ్యర్థముగును. ఊర్ధ్వపుండ్రమును, తులసిని కొందరు శ్రాద్ధమున అంగీకరించరు. కాని శ్రేయస్సును కోరువారు వ్యర్ధాచారములను విడువలయును. ఇట్లు ద్విజులు స్మృతిమార్గ ప్రచోదితములు సర్మకర్మఫలప్రదములు అయిన ధరర్మములను ఆచరించవలయును. సదాచారపరలకు విష్ణువు ప్రసన్నుడగును. విష్ణువు ప్రసన్నడైనచో సాధించరానిదేమున్నది? ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున స్మార్తధర్మములలో వేదాధ్యాయనాది గృహస్థధర్మనిరూపణమను ఇరవదియారవ అధ్యాయము సమాప్తము