Sri Naradapuranam-I Chapters Last Page
సప్తవింశో7ధ్యాయః ఇరువదియేడవ అధ్యాయము
గృహస్థవానప్రస్థయతి ధర్మనిరూపణమ్
సనక ఉవాచ:-
గృహస్థస్య సదాచారం వక్ష్యామి మునిసత్తమ, యద్వతాం సర్వపాపాని నశ్యంత్యేవ న సంశయః.1
బ్రాహ్మే మూహూర్తే చోత్థాయ పురుషార్థావిరోధినీమ్, వృత్తిం సంచిన్తయేద్విప్రః కృతకేశప్రసాధనః. 2
దివాసంధ్యాసు కర్ణస్థబ్రహ్మసూత్ర ఉదఙ్ముఖః, కుర్యాన్మూత్రపురీషే తు రాత్రౌ చేద్దక్షిణాముఖః.3
శిరః ప్రావృత్య వస్త్రేణ హ్యన్తర్థాయ తృణౖర్మహీమ్, వహన్కాష్ఠం కరేణౖకం తావన్మౌనీ భ##వేద్ద్విజః. 4
పథి గోష్ఠే నదీతీరే తడాగగృహసన్నిధే, తథా వృక్షస్య ఛాయాయాం కాంతారే వహ్నిసన్నిధే. 5
దేవాలయే తథోద్యానే కృష్ణభూమౌ చతుష్పధే, బ్రాహ్మణానాం సమీపే చ తథా గోగురుయోషితామ్. 6
తుషాంగారకపాలేషు జలమధ్యే తథైవ చ, ఏవమాదిషు దేశేషు మలమూత్రం న కారయేత్.7
శౌచే యత్నస్సదాకార్యశ్శౌచమూలో ద్విజ స్మృతః, శౌచాచారవిహీనస్య సమస్తం కర్మ నిష్ఫలమ్. 8
శౌచం తు ద్వివిధం ప్రోక్తం బాహ్మమభ్యంతరం తథా, మృజ్జలాభ్యాం బహిశ్శుద్ధిర్భావశుద్ధిస్తథాంతరమ్.9
గృహీతశిశ్నశ్థోత్థాయ శౌచార్థం మృదమహరేత్, న మూషకాది జనితాం ఫాలోత్కృష్టాం తథైవ చ. 10
వాపీకూపతడాగేభ్యో నాహరేదపి మృత్తికామ్, శౌచం కుర్యాత్ప్రయత్నేన సమాదాయ శుభాం మృదమ్.11
లింగే మృదేకా దాతవ్యా తిస్రోవా మేఢ్రయోర్థ్వయోః, ఏతన్మూత్రసముత్సర్గే శౌచమాహుర్మనీషిణః. 12
ఏకా లింగే గుదే పంచ దశ వామే తథోభయోః, సప్త తిస్ర ప్రదాతవ్యాః పాదయోర్మృత్తికాః పృథక్.13
ఏతచ్ఛౌచం విడుత్సర్గే గంధలేపానుత్తయే, ఏతచ్ఛౌచం గృహస్థస్య ద్విగుణం బ్రహ్మచారిణామ్.14
త్రిగుణం తు వనస్థానాం యతినాం తచ్చతుర్గుణమ్, స్వస్థానే పూర్ణశౌచం స్సాత్పథ్యర్ధం మునిసత్తమ,15
ఆతురే నియమో నాస్తి మహాపది తథైవ చ గంధలేపక్షయకరం శౌచం కుర్యాద్విచక్షణ. 16
స్త్రీణామనుపనీతానాం గంధలేపక్షయావధి, వ్రతస్థానాం తు సర్వేషాం యతివచ్ఛౌచమిష్యతే. 17
విధవానాం చ విప్రేన్ద్ర ఏతదేవ నిగద్యతే, ఏవం శౌచం తు నిర్వర్త్య పశ్చాద్వై సుసమాహితః.18
ప్రాగాస్య ఉదగాస్యో వాస్యాచామేత్ప్రయత్రేందియః, త్రిశ్చతుర్ధా పిబేదాపో గందఫేనాదివర్జితాః. 19
ద్విర్మార్జయేత్కపోలం చ తలేనోష్ఠౌ చ సత్తమ, తర్జన్యంగుష్ఠయోగేన నాసారంధ్రద్వయం స్పృశేత్. 20
అంగుష్ఠానామికాభ్యాం చ చక్షుశ్శ్రోత్రే యథాక్రమమ్, కనిష్ఠాంగుష్ఠయేగేన నాభిదేశే స్పృశేద్ద్విజః. 21
తలేనోరస్థ్సలం చైవ అంగుల్యగ్రైశ్శిరః స్పృశేత్, తలేన చాంగులాగ్రైర్వా స్పృశేదం సౌ విచక్షణః. 22
ఏవమాచమ్య విపేన్ద్ర శుద్ధిమాప్నోత్యనుత్తమామ్, దంతకాష్ఠం తతః ఖాదేత్సత్వచం శస్తవృక్షజమ్. 23
సనకమహర్షి పలికెను :- ఓ మునిసత్తమా ! ఇపుడు గృహస్థుని సదాచారమును చెప్పెదను. సదాచారము కలవానికి సర్వపాపములు నశించితీరును. సంశయముతో పనిలేదు. బ్రాహ్మముహూర్తమున శయ్యనుండి లేచి ధర్మార్థకామమోక్షములకు విరుద్ధము కాని జీవికను ఆలోచించవలయును. కేశములను చక్కగా ముడుచుకొనవలయును. రెండు సంధ్యలలో చెవికి యజ్ఞోపవీతములను తగిల్చుకొని ఉత్తరాభిముఖముగా మూత్రమలోత్సర్జనము చేయవలయును. రాత్రి పూట దక్షిణాముఖముగా చేయవలయును. శిరమునకు వస్త్రమును చుట్టుకొని గడ్డితో భుమిని కప్పి చేతితో ఒక కాష్ఠమును ధరించి మౌనముగా ఉత్సర్జనము చేయవలయును. మార్గమాధ్యమున, గోష్ఠమున, నదీతీరమున తటాకగృహసమీపమున వృక్షచ్ఛాయలో అరణ్యమున, అగ్నిసమీపమున, దేవాలయమున, ఉద్యానమున, దున్నిన భూమిలో, నాలుగుదారుల కూడలిలో బ్రాహ్మణ గోగురు స్త్రీ సమీపమున, పొట్టుమీద, బొగ్గుల మీద, కపాలములందు, మలమూత్రవిసర్జన చేయరాదు తరువాత శౌచము కొరకు యత్నము చేయవలయును. ద్విజునకు శౌచమే మూలము. శౌచాచారవిహీనుని సర్వకర్మలు నిష్ఫలములగును. బాహ్యము అభ్యన్తరము అని శౌచము రెండు విధములు. మట్టిలో నీటితో బాహ్యశుద్ధి, భావశుద్ధి ఆంతరము. శిశ్నమును గ్రహించి శౌచము కొరకు మట్టిని తీసుకొనవలయును. ఎలుకలు తవ్విన మట్టిని, నాగలిచే దున్నినమట్టిని, వాపీ కూపతటాకాదుల మృత్తికను తీసుకొనరాదు. పవిత్రమైన మట్టితో శౌచము నాచరించవలయును. లింగమునకు ఒకమారు, రెండు పార్శ్వములకు రెండుమార్లు మట్టితో శుద్ధి చేయవలయును. మూత్రవిసర్జనకు ఇది శౌచపద్ధతి అని పండితులు చెప్పెదరు. లింగమున ఒకమారు, గుదమును అయిదుమార్లు పదిసార్లు వామభాగమును, అట్లే ఇరుప్రక్కల పాదములను ఏడుమార్లు పదిమార్లు వామభాగమున, అట్లే ఇరుపక్కల పాదములను ఏడుమార్లు మూడుమార్లు, మట్టిచే శుద్ధిచేయవలయును. ఇది మల విసర్జన తరువాత చేయు శౌచపద్ధతి. ఇదిగృహస్థునకు శౌచపద్ధతి. రెండింతలు బ్రహ్మచారికి, వానప్రస్థులకు మూడింతలు యతులకు నాలుగింతలుండును. స్వగృహమున పూర్ణశౌచము నాచరించవలయును. మార్గమున అర్ధశౌచమును చేయవలయును. రోగాది పీడితులకు, ఆపదలో నున్నవారికి ఈ నియములేదు. దుర్గంధము తొలగునంత శౌచనము నాచరించిన సరిపోవును. స్త్రీలకు అనుపనీతులకు కూడా గంధలేపక్షయము వరకే శౌచమునాచరించవలయును. వ్రతమును స్వీకరించినవారు యతివలై శౌచమును చేయవలయును. విధవా స్త్రీలకు కూడా ఈ నియమము వర్తించును. ఇట్లు శౌచమును నిర్వహించి సావధానమైన మనస్సుతో తూర్పుముఖముగా కాని ఉత్తరాభిముఖముగా కాని ఇంద్రియ నిగ్రహముతో ఆచమనమును చేయవలయును. వాసన, నురుగులేని జలమును మూడు నాలుగుమార్లు ఆచమనము చేయవలయును. అరచేతిలో రెండుమార్లు కపోలములను పెదవులను శుద్ధిచేయవలయును. అంగుష్ఠానామికలతో వరుసగా చక్షుశ్శ్రోత్రములను స్పృశించవలయును. ద్విజుడు కనిష్ఠాంగుష్ఠయోగముతో నాభిని స్పృశించవలయును. అరచేతితో వక్షస్థలమును అంగుల్యగ్రములతోకాని భుజములను తాకవలయును. అరచేతిలో కాని అంగుల్యగ్రములతో కాని భుజములను తాకవలయును. ఇట్లు ఆచమనము చేసినచో ద్విజుడు శుద్ధి పొందును. తరువాత బెరడుతో నున్న, ప్రశస్తవృక్షముయొక్క దంతకాష్ఠమును నమలవలెను. 1 - 23
బిల్వాసనాపామార్గాణాం నింబామ్రార్కాది శాఖినామ్, ప్రక్షాళ్య వారిణా చైవ మంత్రేణా ప్యభిమంత్రితమ్. 24
ఆయుర్బలం యశో వర్చఃప్రజాః పశువసూని చ, బ్రహ్మప్రజ్ఞాం చ మేధాం చ త్వం నో ధేహి వనస్పతే. 25
కనిష్ఠాగ్రసమం స్థౌల్యే విప్రః ఖాదేద్ధశాగులమ్, నవాంగులం క్షత్రియశ్చ వైశ్యశ్యాష్టాంగులోన్మితమ్. 26
శూద్రో వేదాంగులమితం వనితా చ మునీశ్వర, అలాభే దంతకాష్ఠానాం గండూ షైర్భానుసంమితైః. 27
ముఖశుద్ధర్విధీయేత తృణపత్రసమన్వితైః కరేణదాయ వామేన సంచర్వేద్వామదం ష్ట్రయా. 28
ద్విజాస్సంఘర్ష్య గోదోహాం తతః ప్రక్షాళ్య పాటయేత్, జిహ్యాముల్లిఖ్య తాభ్యాం తు దలాభ్యాం నియతేంద్రియః. 29
ప్రక్షాళ్యా ప్రక్షిపేద్దూరే భూయశ్చాచమ్య పూర్వవత్, తత స్నానం ప్రకుర్వీత నద్యాదౌ విమలే జలే.30
తటం ప్రక్షాళ్య దర్భాంశ్చ విన్యస్య ప్రవిశేజ్జలమ్, ప్రణమ్య తత్ర తీర్థాని ఆవాహ్య రవిమండలాత్.31
గంధాద్యైర్మండలం కృత్వా ధ్యాత్వా దేవం జనార్దనమ్, స్నాయాన్మన్త్రాన్ప్మర్పణ్యాం స్తీర్ధాని చ విరించిజ. 32
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ! నర్మదే సింధు కావేరి! జలే ೭స్మి న్నన్నధిం కురు.33
పుష్కరాద్యాని తీర్ధాని గంగాద్యాస్సరితస్తథా, ఆగచ్ఛంతు మహాభాగాస్స్నాన కాలే సదా మమ. 34
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవన్తికా, పరుఈ ద్వారవతీ జ్ఞేయ సపై#్తతా మోక్షదాయికాః.35
తతో ೭ఘమర్షణం జప్త్వా యతాసుర్వారిసంప్లుతః,
స్నానాంగం తర్పణం కృత్వా చమ్యార్ఘ్యం భానవే ೭ర్పయేత్
తతో ధ్యాత్వా వివస్వంతం జలాన్నిర్గత్య నారద! పరిధాయాహతం ధౌతం ద్వితీయం పరివీయ చ.37
కుశాసనే సమావిశ్య సంధ్యాకర్మ సమారభేత్, ఈశానాభిముఖో విప్ర గాయత్ర్యా చమ్య వై ద్విజ,38
ఋతమిత్యభిమంత్ర్యాథ పునరేవాచమేద్భుదః. తతస్తు వారిణాత్మానం వేష్టయిత్వా సముక్ష్య చ.39
సంకల్ప్య ప్రణవాన్తే తు ఋషిచ్ఛందస్సురాన్స్మరన్, భూరాదిభిర్వ్యాహృతిభిస్స
ప్తభిః ప్రోక్ష్య మస్తకమ్. 40
న్యాసం సమాచరేన్మంత్రీ పృథగేవ కరాంగయోః, విన్యస్య హృదయే తారం భూశ్శిరస్యధ విన్య సేత్.41
భువశ్శిఖాయాం స్వశ్చైవ కవచే భూర్భువో೭ క్షిషు, భూర్భువస్స్వస్తధాత్రాస్త్రం దిక్షు తాలత్రయం న్యసేత్.42
తత ఆవాహయేత్సంధ్యాం ప్రాతఃకోకనదస్థితామ్, ఆగచ్ఛ వరదేదేవి త్ర్యక్షరే బ్రహ్మవాదిని.43
గాయత్రి చ్ఛందసాం మాతర్బ్రహ్మయోనే నమో೭స్తుతే, మధ్యహ్నేవృషభారుఢాం శుక్లాంబరసమావృతామ్.44
సావిత్రీం రుద్రయోనిం చవాహయేద్రుద్రవాదినీమ్, సాయం తు గరుడారుఢాం పీతాంబరసమావృతామ్.45
సరస్వతీం విష్ణుయోనిమాహ్వయేద్విష్ణువాదనీమ్, తారం చ వ్యాహృతీస్సప్త త్రిపదాం చ సముచ్చరన్.46
శిరశ్శిఖాం చ సంపూర్య కుమ్భయిత్వా విరుచయేత్, వామమధ్యాత్పరైర్వాయుం క్రమేణ ప్రాణసంయమే.47
ద్విరాచమేత్తతః పశ్చాత్ప్రాతస్సూర్వశ్చమేతి చ, ఆపః పునస్తు మధ్యాహ్నే సాయమగ్నిశ్చమేతి చ. 48
ఆపోహిష్ఠేతి తిసృభిర్మార్జనం చ తతశ్చరేత్, సుమిత్రియాన ఇత్యుక్త్వా నాసాస్పృష్ట జలేన చ. 49
ద్విషద్వర్గం సముత్సార్య ద్రుపదాం శిరసి క్షీపేత్, ఋతం చ సత్యమేతేన కృత్వా చైనాఘుమర్షణమ్. 50
అంతశ్చరసి మంత్రేణ సకృదేవ పిబేదపః, తతస్సూర్యాయ విధివద్గంధం పుష్యం జలాంజలిమ్. 51
క్షిప్త్వోపతిష్ఠేద్ధేవర్షే భాస్కరం స్వస్తికాంజిలిమ్, ఊర్థ్వబాహురధోబాహుః క్రమాత్కల్యాదికే త్రికే.52
ఉదుత్యం చిత్రం తచ్చక్షురిత్యేతత్త్రితయం జపేత్, సౌరాన్ శౌవాన్వైష్ణవాంశ్చ మంత్రానన్యాంశ్చ నారద. 53
తేజోసి గాయత్ర్యసీతి ప్రార్థయేత్సవితుర్మహః, తతోంగాని త్రిరావృత్య ధ్యాయేచ్ఛక్తీస్తదాత్మికాః.54
బ్రహ్మీణీ చతురాననాక్షవలయా కుంభం కరైస్స్రుక్స్రువౌ బిభ్రాణా త్వరుణందుకాంతివదనా ఋగ్రూపిణీ బాలికా,
హంసారోహణ కేలిఖణ్ ఖణ్ మణౖర్బింబార్చితా భూషితా గాయత్రీ పరిభావితా భవతు నస్పంపత్సమృద్థ్యై సదా. 55
రుద్రాణీ నవ¸°వనా త్రినయనా వైయాఘ్రచర్మాంబరా, ఖట్వాంగత్రిశిఖాక్షసూత్రవలయా೭ భీతి శ్రియైచాస్తు నః,
విద్యుద్దామజటాకలాపవిలసద్బాలేన్దుమౌలిర్ముదా సావిత్రీ వృషవాహనా సితతనుర్ధ్వేయా యజూరూపిణీ. 56
ధ్యేయా సా చ సరస్వతీ భగవతీ పీతాంబరాలంకృతా శ్యామా శ్యామా శ్యామతనుర్జరోపరి లసద్గాత్రాంచితా వైష్ణవీ,
తార్యస్థా మణినూపురాంగదలసద్గ్రైవేయభూషోజ్జ్వలా హస్తాలంకృతశంఖచక్రసుగదా పద్మా శ్రియై చాస్తు నః. 57
ఏవం ధ్యాత్వా జపేత్తిష్టన్ప్రాతర్మధ్యాహ్నకే తథా, సాయంకాలే సమాసీనో భక్త్యా తద్గతమానసః. 58
సహస్రపరమాం దేవీం శతమధ్యాం దశావరామ్, త్రిపదాం ప్రణవోపేతాం భూర్భువస్స్వరుపక్రమామ్. 59
షట్ తారస్సంపుటో వాపి వ్రతినశ్చ యతేర్జపః, గృహస్థస్య స తారస్స్యాజ్జప్య ఏవంవిధో మునే. 60
తతో జప్త్వా యథాశక్తి సవిత్రే వినివేద్య చ, గాయత్ర్యై చ సవిత్రే చ ప్రక్షి పేదంజలిద్వయమ్. 61
తతో విసృజ్య తారం విప్ర ఉత్తరే ఇతి మంత్రతః, బ్రహ్మణశేన హరిణానుజ్ఞాతా గఛ్చ సాదరమ్. 62
దిగ్భ్యో దిగ్దేవతాభ్యశ్చ సమస్కృత్య కృతాంజలిః, ప్రాతరాదేఃపరం కర్మ కుర్యాదపి విధానతః. 63
ప్రాతర్మధ్యం దినే చైవ గృహస్థస్స్నానమాచరేత్, వానప్రస్థశ్చ దేవర్షే స్నాయాత్త్రిషవణం యతిః. 64
బిల్వ, ఆసన, ఉత్తరేణి , వేప మామిడి మందార వృక్షశాఖల కాష్ఠమును గ్రహించి జలముచే శుద్ధి చేసి ఈ మంత్రముచే అభిమంత్రణ చేయవలయును. ''ఆయుర్భలం యశో వర్చః ప్రజా పశువసూని చ, బ్రహ్మప్రజ్ఞాం చ, మేథాం చ త్వం నో ధేహి వనస్పతే'' అను మంత్రమును అనుసంధానము చేయవలయును. (''ఓ వృక్షరాజమా! ఆయుష్యమును బలమును యశమును, తేజస్సును, పశువులను, సంతానమును, ధనములను, వేదములను, ప్రజ్ఞలను, మేథస్సును నాకు ప్రసాదింపుము'', అని యర్థము.) బ్రాహ్మణుడు కనిష్ఠాంగులి పరిమితము దశాంగులకాష్టమును చర్వణ చేయవలయును. క్షత్రియుడు తొమ్మిది అంగులముల కాష్ఠమును, వైశ్యుడు ఎనిమిదింగులముల కాష్ఠమును, శూద్రుడు స్త్రీలు నాలుగంగులముల కాష్ఠమును చర్వణ చేయవలయును. దంతకాష్ఠములు లభించినచో పన్నెండుమార్లు గండూషములతో తృణపత్రములతో ముఖశుద్ధి చేసుకొనవలయును. దంతకాష్ఠమును వామహస్తముచే గ్రహించి వామభాగదంష్ట్రలచే చర్వణచేయవలయును. గో దోహకాలము దంతములను ఘర్షణ జరిపి దంతకాష్ఠమును ప్రక్షాళనము చేసి రెండుగా చీల్చవలయును. ఆ రెండు భాగములతో నాలుకను గీచుకొని ఇంద్రియ నిగ్రహముతో ప్రక్షళను చేసి దూరముగ విసరివేయవలయును. మరల మొదటి వలె ఆచమనమును చేయవలయును. తరువాత నద్యాదుల పవిత్ర జలముతో స్నానమును చేయవలయును. తీరమును శుద్ధి చేసి దర్భలను పరచి నీటిలో ప్రవేశించవలయును. అచట జలమునకు నమస్కరించి రవి మండలమునుండి ఆ వాహనముచేసి గంధాదులతో మండలము నేర్పరచి జనార్ధన దేవుని ధ్యానము చేసి మంత్రమును పుణ్యతీర్ధములను స్మరించుచు స్నానమును చేయవలయును. ''గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ! నర్మదే సింధు కావేరీ జలే೭స్మిన్సన్నింధం కురు, పుష్కరాద్యాని తీర్థాని గంగాద్యాస్సరితస్తదా ఆగచ్ఛంతు మహాభాగా స్నానకాలే సదా మమ. అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవన్తికా పురీ ద్వారవతీ జ్ఞేయా సపై#్తతే మోక్షదాయికాః'' అను మంత్రములను పఠించవలయును. ''ఓ గంగా ! యమునా ! సర్వసతీ ! గోదావరీ ! నర్మదా ! సింధూ, కావేరీ ! మీరందరు నేను స్నానము చేయు ఈ జలములలో వచ్చిచేరుడు. పుష్కరాది తీర్ధములు గంగాది నదులు నేను స్నానము చేయు సమయమున నా సన్నిధికి చేరుగావుత. అయోధ్యా మధురా మాయా కాశీ, కాంచీ, అవంతికా ద్వారము అను మీ యేడు క్షేత్రములు పుణ్యప్రదములు'' అని పై మంత్రమున కర్ధము. తరువాతా అఘమర్షణ జపముచేసి ప్రాణాయామముతో నీటిలో మునుగవలయమును, స్నానాంగముగా తర్పణమునిచ్చి సూర్యునకు ఆర్ఘ్యమునీయవలయును. తరువాత సూర్యుని ధ్యానము చేసి జలమునుండి బయటకు వెడలి శుభ్రమైన వస్త్రమును ధరించి మరియొక వస్త్రమును పైన కప్పుకొని దర్భాసనమున కూర్చుండి సంధ్యావందనమాచరించవలయును. ఈశానాభిముఖముగా నుండి గాయత్రిచే ఆచమనము చేసి ''ఋతం'' ఇత్యాది మంత్రమును పఠించి మరల ఆచమనమును చేయవలయును తరువాత జలమును తను చుట్టూ తిప్పి ప్రోక్షణ చేసి ప్రణవాంతమున సంకల్పముచేసి ఋషి ఛందస్సులను దేవతలను స్మరించవలయును. భూరాది సప్తవ్యాహృతులతో శిరమును ప్రోక్షించి విడిగా అంగన్యాసకరన్యాసములను చేయవలయును. తారస్వరముతో భూః అని ఉచ్ఛరించి శిరమున , భువః అని శిఖలో , స్వః అని కవచమున, భూర్భువః అని నేత్రములలో భూర్భవః స్వః అని 'అస్త్రాయ ఫట్' అని దిక్కులలో తాలత్రయ న్యాసమును చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున పద్మాసమున నున్న సంధ్యను ఆవాహన చేయవలయును. ''ఆగచ్ఛ వరదే దేవి త్రక్ష్యరే బ్రహ్మవాదిని గాయత్రి ఛందసాం మాతర్బ్రహ్మాయోనే నమో೭స్తు తే" అను మంత్రముతో ధ్యానము చేయవలయును. ''అక్షరత్రయాత్మకమగు బ్రహ్మవాదినీ ! వరదాత్రి ! ఛందోమాతా ! బ్రహ్మయోనీ ! గాయత్రీ! ఇచ్చటికి రమ్ము నీకు నమస్కారము అని పై మంత్రమున కర్ధము) మధ్యాహ్నకాలమున వృషభవాహనారూఢను శుక్లాంబరధారిణిని రుద్రవాదిని రుద్రయోని యగు సావిత్రిని ఆవాహన చేయవలయును. సాయంకాలము గరుడారూఢ పీతాంబరధారిణి విష్ణువాదిని విష్ణుయోని యగు సరస్వతిని ఆవాహన చేయవలయును. సప్తవ్యాహృతులను తారస్థాయితో త్రిపదను ఉచ్చరించవలయును. శిరమున శిఖాపూరణముచేసి కుంభకరేచకమును ఆచరించవలయును. ప్రాణాయామమున వామ మధ్యభాగమున క్రమముగా వాయువును నియమించవలయును. తరువాత రెండు మార్లు ఆచమనముచేసి ప్రాతఃకాలమున ''సూర్యశ్చ మామన్యుశ్చ'' అను మంత్రముతో, మధ్యాహ్నమున ''ఆపః పునంతు పృథివీం'' అను మంత్రముతో, సాయంకాలము ''అగ్నిశ్చ మామన్యశ్చ'' అను మంత్రముతో ధ్యానము చేసి ఆచమనము చేయవలయును. 'ఆపో హి ష్టా మయో ఇత్యాది మంత్రత్రయముచే మార్జన చేయవలయును'. సుమిత్రయాన ! అను మంత్రముచే నాసా భాగమును స్పృశించిన జలముచే ద్విషద్వర్గమును సముత్సారణచేసి 'ద్రుపదాదివ' అను మంత్రముచే శిరమున జలము ప్రోక్షణ చేయవలయును. ''ఋతుం చ సత్యం'' అను మంత్రముచే ఆఘమర్షణ జపము చేయవలయును. అంతశ్చరసి' అను మంత్రముచే ఒకమారు జలపానము చేయవలయును. తరువాత సూర్యునికి యథావిధిగా గంధపుష్పములను జలాంజలిని సమర్పించి లేచి నిలబడి స్వస్తికాంజలిని సమర్పించవలయును. యథాక్రమముగా మూడుకాలములలో ఊర్ధ్వబాహువుగా అధోబాహువుగా ''ఉదుత్యం'' ''చిత్రం'' ''తచ్చక్షు'' అను మంత్రములను జపించవలయును. తరువాత సూర్యమంత్రములను , శైవమంత్రములను, విష్ణుమంత్రములను, ఇతర మంత్రములను జపించి సూర్యతేజమును 'తేజో೭సి 'గాయత్ర్యసి' అను మంత్రములచే ప్రార్ధన చేయవలయును. తరువాత బ్రహ్మంగములను మూడమార్లు ఆవృత్తి చేసుకొని ఆధ్యాత్మికలగు మూడు శక్తులను ఇట్లు ధ్యానము చేయవలయును. మొదట బ్రహ్మాణి చతురానగా అక్షవలయా చేతులతో కలశమును, స్రుక్స్రువములను ధరించునది, బాలచంద్రకాంతిగల ముఖము కలది. ఋక్ స్వరూపిణి బాలికా రూపమును ధరించినది హంసారోహణ సమయమున కాల అందెలఖణ్ ఖణ్ ధ్వని చేయుచుండునది, వివిధాభరణములచే భూషించబడునది అయిన గాయత్రి మాచే ధ్యానించబడినదై సంపత్సమృద్ధిని కలిగించుగావుత. మధ్యాహ్నకాలమున రుద్రాణి, నవ¸°వన, త్రినయన వ్యాఘ్రచర్మాంబరధారిణి ఖట్వాంగత్రిశిఖాక్ష సూత్రవలయ విద్యుత్ప్రకాశము కల జటాకలాపములచే ప్రకాశించుదేహము గలదై, బాలేందుమౌలి తెల్లని దేహకాంతిగలది, వృషభవాహాన యజుస్స్వరూపిణి అగు సావిత్రి మాకు అభయమును సంపదను కలిగించు గావుత. సాయంకాలమున భగవతి, పీతాంబరాలంకృత, శ్యామదేహ, వృద్ధభావ భాసిత తనుకాంతిగలదు, వైష్ణవి, గరుడవాహనస్థి, మణినూపురాంగదగ్రైవేయాది భూషణకాంతిశోభిత. హస్తములందు శంఖచక్రగదా పద్మములను ధరించినది అయిన సరస్వతి మాకు సంపదనిచ్చిగావుత. ఇట్లు ప్రాతఃకాల మధ్యాహ్న సాయంకాలములలో భక్తితో ధ్యానము చేయవలయును. సాయంకాలమున నిలిచి చేయవలయును. ఇట్లు త్రిపదయగు గాయత్రిని సహస్ర పర్యాయములు జపించుట ఉత్తమము. శతపర్యాయములు మధ్యమము. దశపర్యాయములు అధమము. బ్రహ్మచారి ప్రతి గాయత్రీ జపమును మొదట ఓం భూః భువః అను మూడు వ్యాహృతులను ఆద్యంతరములలో సంపుటీకరణము చేయవలయును. గృహస్థునకు సంపుటీకరణముతో పనిలేదు. అనగా ఆదిలో మాత్రమే చేయవలయును. ఇట్లు యథాశక్తి గాయత్రీజపమును చేసి సూర్యునికి సమర్పించి గాయత్రికి సూర్యునికి అంజలి ద్వయమును ఆర్పించవలయును. తరువాత 'ఉత్తరే శిఖరే' అను మంత్రముచే గాయత్రిని ''బ్రహ్మరుద్రువిష్ణువులచే అనుజ్ఞాతవై సాగరముగా వెళ్ళుము''. అని విసర్జించవలయును. దిక్కులకు దిగ్దేవతలకు చేతులు జోడించి నమస్కరించి ప్రాతఃకాలమునుండి చేయవలసిన పనులను ఆచరించవలయును. గృహస్ధుడు ప్రాతఃకాల మధ్యాహ్నములలో స్నానమాచరించవలయును. వానప్రస్థుడు యతి మూడువేళలా స్నానమాచరించవలయును. 24-64
ఆతురాణాం తు రోగాద్యైః పాంధానాం చ సకృన్మతమ్, బ్రహ్మయజ్ఞం తతః కుర్యాద్ధర్భపాణిర్మునీశ్వ ర. 65
దివోదితాని కర్మాణి ప్రమాదాదకృతాని చేత్, శర్వర్యాః ప్రథమే యామే తాని కుర్యాద్యథాక్రమమ్. 66
నోపాస్తే యో ద్విజస్సంధ్యాం ధూర్తబుద్ధిరనాపది, పాషండస్స హి విజ్ఞేయస్సర్వధర్మబహిష్కృతః. 67
యస్తు సంధ్యాదికర్మాణి కూటయుక్తివిశారదః, పరిత్యజతి తం విద్యాన్మహాపాతకినాం వరమ్. 68
యే ద్విజా అభిభాషంతే త్యక్తసంధ్యాదికర్మణః, తే యాంతి నరకాన్ఘోరావ్యావచ్చంద్రార్కతారకమ్. 69
దేవార్చనం తతః కుర్యాద్వైశ్వదేవం యథావిధి, తత్రత్యమతిథిం సమ్యగన్నాద్యైశ్చ ప్రపూజయేత్. 70
వక్తవ్యా మధురవాణీ తేష్వప్యభ్యాగతేషు తు, జలాన్నకందమూలైర్వా గహదానేన చార్చయేత్. 71
అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే , స తసై#్మ దుష్కృతం దత్త్వా పుణ్యమాదాయ గచ్ఛతి. 72
అజ్ఞాతగోత్రనామామన్యగ్రామాదుపాగతమ్, విపశ్చితో೭ తిథిం ప్రాహుః విష్ణువత్తం ప్రపూజయేత్. 73
స్వగ్రామవాసినం త్వేకం శ్రోత్రియం విష్ణుతత్పరమ్, అన్నాద్యైః ప్రత్యహం విప్ర పితౄనుద్దిశ్య తర్పయేత్. 74
పంచయజ్ఞపరిత్యాగే బ్రహ్మహేత్యుచ్యతే బుధైః, కుర్యాదహరహస్తస్మాత్పంచ యజ్ఞాన్ప్రయత్నతః. 75
దేవయజ్ఞోభూతయజ్ఞః పితృయజ్ఞస్తథైవ చ, నృయజ్ఞో బ్రహ్మయజ్ఞశ్చ పంచయజ్ఞాన్ప్రచక్షతే . 76
భృత్యమిత్రాదిసంయుక్తస్స్వ్యం భుజీత వాగ్యతః, ద్విజానాం భోజ్యమశ్నీయాత్పాత్రం నైవ పరిత్యజేత్. 77
సంస్థాప్య స్వాపనే పాదౌ వస్త్రార్థం పరిధాయ చ, ముఖేన వమితం భుక్త్వా సురాపీత్యుత్యతే బుధైః. 78
ఖాదితార్థం పునః ఖాదేన్మోదకాంశ్చ ఫలాని చ, ప్రత్యక్షం లవణం చైవ గోమాంసాశీతి గద్యతే. 79
అపోశ##నే వాచమనే అద్యద్రవ్యేషు వా ద్విజః, శబ్దం న కారయేద్విప్రస్తం కుర్వన్నారకీ భ##వేత్. 80
పథ్యమన్నం ప్రభుంజీత వాగ్యతో ೭న్న మకుత్సయన్. అమృతోపస్తరణమపి అపోశానం భుజేః పురః. 81
అమృతాపిదానమసి భోజ్యాన్తే ೭పః సకృత్పిబేత్, ప్రాణాద్యా ఆహుతీర్దత్త్వాచమ్య భోజనమాచరేత్. 82
తతశ్చాచమ్య విప్రేన్ద్ర శాస్త్రచింతపరో భ##వేత్ రాత్రావపి యథాశక్త శయనాసనభోజనైః. 83
ఏవం గృహీ సదాచారం కుర్యాత్ప్రతిదినం మునే, సదాచారపరిత్యాగీ ప్రాయశ్చిత్తీ తదా భ##వేత్. 84
రోగపీడితులకు బాటసారులకు ఒకమారు స్నానము విహితము. తరువాత దర్భపాణియై బ్రహ్మయజ్ఞమును చేయవలయును. పగలు చేయవలసిన కర్మలను ప్రమాదవశమున చేయజాలనిచో రాత్రి మొదటి ఝూములో యథాక్రమముగా నాచరించవలయును. ఆపదలేని సమయమున కూడా ధూర్తబుద్ధియై సంధ్యోపాసన చేయనివాడు సర్వధర్మబహిష్కృతుడై పాషండుడుగునని తెలియును. కపటయుక్తులతో సంధ్యాదికర్మలను విసరిజించినవాడు మహాపాతకులలో శ్రేష్టుడగును. సంధ్యాది కర్మలను వదలి సంభాషించువారు సూర్యచంద్రాతారకలుండువరకు నరకమున నివసింతురు. తరువాత దేవతార్చన సలిపి యథావిధిగా వైశ్వదేవమును చేయవలయును. ఆ సమయమున అచటనున్న అతిథిని చక్కగా అన్నాదులతో పూజించవలయును. అభ్యాగతుల విషయమున మృదు మధురముగా మాటలాడవలయును. జలాన్న కందమూలాది దానములచే, గృహదానముచే పూజించవలయును. అతిథి నిరాశ##చెంది ఇంటినుండి వెడలినచో తన పాపమును గృహస్థునకు ఇచ్చి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళును. గోత్రనామములు తెలియనివాడు, మరియొక గ్రామమునుండి వచ్చిన వాడు,అతిథి అని పండితులు చెప్పెదరు. అట్టి అతిథిని శ్రీమహావిష్ణువుగా భావించి పూజించవలయును, తన గ్రామమున నుండువాని నొకని, శ్రోత్రియుని, విష్ణుతత్పరుని, ప్రతిదినము పితరులనుద్దేశించి అన్నాదులచే తృప్తి పరచవలయును. పంచయజ్ఞములను పరిత్యజించినవాడు బ్రహ్మఘాతకుడని పండితులు చెప్పుదురు. కావున ప్రతిదినము ప్రయత్నముచే పంచయజ్ఞములు నాచరించవలయును. దేవయజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, నృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము అనునవి పంచయజ్ఞములు. భృత్యమిత్రాదులతో కూడి తాను మౌనముగా భుజించవలయును. ద్విజులకు భోజనమీయవలయును. తినదగినవారిని ఎవ్వరినీ విడువక అందరికీ భోజనము నుంచవలయును. ఆసనమున పాదములనుంచి తినువానిని, అర్ధవస్త్రమును ధరించి తినువానిని, నోటినుండి వెలుపలకి వచ్చినదానిని తినినవాడు, సాక్షాత్తుగా లవణమును తినువాడు గోమాంసాశనము చేసినవాడు తుల్యుడు. జలపానము చేయునపుడు ఆచమనము చేయునపుడు పదార్ధములను తినునపుడు ధ్వని చేయరాదు. అట్లు చేసినచో నరకమును పొందును. విహితమైన అన్నమునే నిందించక తినవలయును. మౌనముగా భూజించవలయును. మొదటి 'అమృతోపస్తరణమసి' అని జలమును స్వీకరించవలయును. భోజనాన్తమున అమృతాపిధానమసి అనుమన్త్రముతో ఒకసారి జలమును పానము చేయవలయును. ప్రాణాహుతులనిచ్చి ఆచమనముచేసి భోజనము చేయవలయును. భోజనము తరువాత ఆచమనము చేసి శాస్త్ర చింతన చేయవలయును. రాత్రిపూట కూడా యథాశక్తిగా ఆసన శయనభోజనాదుల నాచరించవలయును. ఇట్లు గృహస్థుడు ప్రతిదినము సదాచారపరుడు కావలయును. సదాచార పరిత్యాగముచేసినవాడు ప్రాయశ్చిత్తియగును. 65-84
దూషితాం స్వతనుం దృష్ట్వా పతితాద్యైశ్చ సత్తమ, పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్ఛేత్సహైవ వా. 85
భ##వేత్త్రిషవణస్నాయీ నఖశ్మశ్రుటాధర, అధశ్శాయీ, బ్రహ్మాచారీ పంచయజ్ఞపరాయణః. 86
ఫలమాలాశనో నిత్యం స్వాధ్యాయనిరతస్తథా, దయావాన్సర్వభూతేషు నారాయణపరాయణః. 87
వర్జయేద్గ్రామజాతాని పుష్పాణి చ ఫలాని చ, అష్టౌ గ్రాసాంశ్చ భుంజీత న కుర్యాద్రాత్రిభోజనమ్. 88
అత్యన్తం వర్జయేత్తైలం వానప్రస్థమాశ్రమీ, వ్యవాయం వర్జయేచ్చైవ నిద్రాలస్యే తథైవ చ. 89
శంఖచక్రగదాపాణిం నిత్యం నారాయణం స్మరేత్, వానప్రస్థః ప్రకుర్వీత తపశ్చాంద్రాయణాదికమ్. 90
సహేత శీతాతాపాది వహ్నిం పరిచరేత్సదా, యదా మనసి వైరాగ్యం జాతం సర్వేషు వస్తుషు. 91
వేదాంతాభ్యాసనిరతశ్శాంతో దాంతో జితేంద్రియః, నిద్వంద్వో నిరహంకారో నిర్మనుశాంతో దాంతో జితేంద్రియః. 92
నిద్వంద్వో నిరహంకారో నిర్మమస్సర్వదా భ##వేత్, శమాదిగుణసంయుక్తః కామక్రోధవివర్జితః. 93
నగ్నో వా జీర్ణకౌపీనో భ##వేన్ముండీ యతిర్ద్విజః, సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః. 94
ఏకరాత్రం వసేద్గ్రామే త్రిరాత్రం నగరే తథా, భైక్షేణ వర్తయేన్నిత్యం నైకాన్నాదీ భ##వేద్యతిః. 95
అనిందితద్విజగృహే వ్యంగారే భుక్తివర్జితే, వివాదరహితే చైవ భిక్షార్ధం పర్యచేద్యతిః. 96
భ##వేత్త్రిషవణస్నాయీ నారాయణపరాయణః, జపేచ్చ ప్రణవం నిత్యం జితాత్మా విజితేంద్రియః. 97
ఏకాన్నాదీ భ##వేద్యస్తు కదాచిల్లంపటో యతిః, న తస్య నిష్కృతి ర్దృష్టా ప్రాయశ్చిత్తాయుతైరపి. 98
లోభాద్యది యతిర్విప్రతనుపోషపరో భ##వేత్, స చండాలసమో జ్ఞేయో వర్ణాశ్రమవిగర్హితః. 99
ఆత్మానం చింతయేద్దేవం నారాయణనామామయమ్, నిర్ద్వందం నిర్మమం శాంతం మాయాతీతమమత్సరమ్. 100
అవ్యయం పరిపూర్ణం చ సదానందైకవిగ్రహమ్, జ్ఞానస్వరూపమమలం పరం జ్యోతిస్సనాతనమ్. 101
అవికారమనాద్యంతం జగచ్చైతన్యకారణమ్, నిర్గుణం పరమం ధ్యాయేదాత్మానం పరతః పరమ్. 102
పఠేదుపనిషద్వాక్యం వేదాంతార్ధాంశ్చ చింతంయేత్, సహస్ర శీర్షం దేవం చ సదాధ్యాయే జ్జితేంద్రియః. 103
ఏవం ధ్యానపరో యస్తు యతిర్విగతమత్సరః, స యాతి పరమానందం పరంజ్యోతి స్సనాతనమ్. 104
ఇత్యేవమాశ్రమాచారాన్యః కరోతి ద్విజఃక్రమాత్ , స యాతి పరమం స్థానం యత్ర గత్వా న శోచతి. 105
వర్ణాశ్రమాచారరతాః సర్వపాపవివర్జితాః, నారాయణపరా యాంతి తద్విష్ణోః పరమం పదమ్. 106
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే
ప్రథమపాదే సదాచారేషు గృహస్థవానప్రస్థయతి
ధర్మనిరూపణం నామ సప్తవింశో೭ధ్యాయః
కేశములు తెల్లపడుట, శరీరము ముడతలు పడుట మొదలగు దోషములను శీరీరమున జూచిన వెంటనే భార్యను పుత్రులకప్పగించికాని, వెంటతీసుకొని కాని వనమునకు వెళ్ళవలయును. వనమున మూడు వేళలా స్నానము చేయవలయును. నఖములను జటలను మీసములను గడ్డములను ధరించి యుండవలయును. క్రిందపరుడవలయును. బ్రహ్మచర్యమును పాటించవలయును. పంచయజ్ఞముల నాచరించవలయును. బ్రహ్మచర్యమును పాటించవలయును. పంచయజ్ఞముల నాచరించవలయును. ప్రతినిత్యము ఫలమూలమును భుజించుచు స్వాధ్యాయ నిరతుడు కాలవయును. సర్వప్రాణుల యందు దయకలవాడై నారాయణ పరాయణుడు కావలయును. గ్రామములోని పూవులను పండ్లను గ్రహించరాదు. ఎనిమిది ముద్దలు మాత్రమే అన్నమును తినవలయును. రాత్రిపూట భోజనము చేయరాదు. వానప్రస్థాశ్రమువాసి తైలమును పూర్తిగా విడువలయును. స్త్రీ సంగమును, నిద్రను సోమరితనమును పరిత్యజించవలయును. శంఖచక్రగదాపాణియగు నారాయణుని స్మరించుచుండవలయును. తపము నాచరించుచుండవలయును. చాద్రాయణాదివ్రతముల నాచరించవలయును. శీతతాపాది బాధలను సహించవలయును. అగ్ని పరిచర్యచేయుచుండవలయును. అన్ని వస్తువుల విషయమున మనసులో వైరాగ్యము కలిగిన పిమ్మటనే సన్యసించవలయును. లేనిచో పతితుడగును. శాంతుడు దాంతుడు, జితేంద్రిడుయు, వేదాంతా భ్యాస నిరతుడు కావలయును. సుఖదుఃఖాది ద్వంద్వరహితుడుగా అహంకార మమకారరహితుడుగా సర్వదా ఉండవలయును. ద్విజుడుగు యతి నగ్నుడుగా వాని జీర్ణ కౌపీనుడుగా గాని ఉండవలయును. మానావమానములో, శత్రుమిత్రులలో సముడుగా నుండవలయును. గ్రామమున ఒక రాత్రి, నగరమున మూడు రాత్రులుండవలయును. నిత్యము భిక్షాన్నముతో జీవికను గడుపవలయును. ఒక ఇంటి అన్నము తినరాదు. నిందితుడు కాని ద్విజునింట్లో అగ్నిని చల్లార్చిన తరువాత, భోజనసమయము కానివేళ, వివాదములు లేనిచోట యతి భిక్షాటనమును చేయవలయును. త్రికాలమున స్నానమును చేయవలయును. నారాయణ పరాయణుడు కావలయును. నిత్యము ప్రణవమును జపించవలయును. ఇంద్రియ జయము కలిగియుండవలయును. యతి ఒకే ఇంట అన్నమును కోరినచో తినినచో పదివేల ప్రాయశ్చిత్తములు చేసిననూ నిష్కృతి లభించదు. యతి లోభముచే శరీర పోషణపరుడైనచో చండాలసముడుగను. వర్ణాశ్రమ ధర్మపరుల నిందకు పాత్రుడగును. ఎపుడూ ఆత్మానందమగ్నుడై వికారరహితుడు అద్వితీయుడు నిర్మము, శాంతుడు, మాయాతీడుడు, మాత్సర్యరహితుడు, అవ్యముడుడు, పరిపూర్ణడు, సదాన్‌దైక విగ్రహుడుడు, జ్ఞానస్వరూపుడు, నిర్మలుడు పరభ్యోస్వరూపుడు, సనాతనుడుగా ఆద్యంతరహితుడు జగచ్చైతన్య కారణుడు నిర్గుణుడు పరాత్పురుడు పరముడా అయిన పరమాత్మయగు నారాయణుని ధ్యానించవలయును. ఉపనిషద్వాక్యములను పఠించవలయును. వేదాన్తార్థల చింతన చేయవలయును. జితేంద్రియుడై సహస్రశీర్షడగు నారాయణ దేవుని ధ్యానము చేయవలయును. ఇట్లు మాత్సర్యమును వీడి ధ్యానపరుడైనచో సనాతనుడు పరంజ్యోతి యగు పరమానంద స్వరూపమును పొందును. ఇట్లు ఆశ్రమాచారములను యథాక్రమముగా అచరించిన మరల తిరిగిరాని పరమపదమును పొందుదురు. వర్ణాశ్రమాచారపరులు సర్వపాపవివర్జితులై నారాయణ పరులై శ్రీ మహావిష్ణు నిలయమై పరమ పదమును పొందెదరు. 85-106
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
పూర్వభాగమున ప్రథమపాదమున
సదాచారమున గృహస్థవానప్రస్థయతి ధర్మనిరూపణమను
ఇరువది యేడవ అధ్యాయము సమాప్తము.
Sri Naradapuranam-I Chapters Last Page