Sri Naradapuranam-I
Chapters
Last Page
అష్టావింశో೭ధ్యాయః ఇరువది యెనిమిదవ అధ్యాయము శ్రాద్ధక్రియా వర్ణనమ్ సనక ఉవాచ :- శృణుష్వ మునిశార్దుల శ్రాద్ధస్య విధిముత్తమమ్, యుచ్ఛ్రుత్వా సర్వపపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. 1 క్షయాహపూర్వదివసే స్నాత్వా చైకాశనో భ##వేత్ , అధశ్శాయీ బ్రహ్మచారీ నిశి విప్రాన్నిమంత్రయేత్. 2 దంతధావనతాంబూలే తైలాభ్యంగం తథైవ చ, రత్యాషధిపరాన్నాని శ్రాద్ధకర్తా వివర్జయేత్. 3 అధ్వానం కలహం క్రోధం వ్యవాయం చ ధురం తథా, శ్రాద్ధకర్తా చ భోక్తా చ దివాస్యాపం చ వర్జయేత్. 4 శ్రాద్ధే నిమంత్రితో యస్తు వ్యవాయం కురుతే యది, బ్రహ్మహత్యామవాప్నోతి నరకం చాధిగచ్ఛతి. 5 శ్రాద్ధే నియోజయేద్విప్రం శ్రోతియం విష్ణుతత్పరమ్, యథాస్వాచారనిరతం ప్రశాంతం సత్కులోద్భవమ్. 6 రాగద్వేషవిహీనం చ పురాణార్ధవిశారదమ్, త్రిమధు త్రిసుపర్ణజ్ఞం సర్వభూతదయాపరమ్. 7 దేవపూజారతం చైవ స్మృతితత్త్వవిశారదమ్, వేదాంతతత్త్వ సంపన్నం సర్వలోకహితే రతమ్. 8 కృతజ్ఞం గుణసంపన్నం గురుశుశ్రూణ రతమ్, పరోపదేశనిరతం సచ్ఛాసై#్త్రకధనైస్తథా. 10 ఏతే నియోజితవ్యా వై శ్రాద్ధే విప్రా మునీశ్వర! శ్రాద్ధే వర్జ్యాన్ప్రవక్ష్యామి 11 న్యూంనాంగశ్చాధికాంగశ్చ కదర్యో రోగితస్తథా, కుష్ఠీ చ కునఖీ చైవ లంబకర్ణః క్షతవ్రతః. 12 నక్షత్రపాఠజీవీ చ తథా చ శవదాహకః, కువాదీ పరివేత్తా చ తథా దేవలకః ఖలః. 13 నిందకో೭మర్షణో ధూర్తస్తథైవ గ్రామాయాజకః, అసచ్ఛాస్త్రాభినిరతః పరాన్ననిరత స్తథా. 13 వృషలీసూతిపోష్టా చ వృషలీపతిరేవ చ, కుండస్చ గోలకశ్చైవ హ్యయాజ్యానాం చ యాజకః. 14 దంభాచారో వృధా ముండీ హ్యన్యస్త్రీధనతత్పరః, విష్ణుభక్తివిహీనశ్చ శివభక్తిపరాఙ్ముఖః. 15 వేదవిక్రయిణశ్చైవ వ్రతవిక్రయిణస్తథా, స్మృతివిక్రయిణశ్చైవ మంత్రవిక్రయిణస్తథా. 16 గాయకాః కావ్యకర్తారో భిషక్షాస్త్రోపజీవినః, వేదనిందాపరశ్చైవ గ్రామారణ్యప్రదాహకః. 17 తథాతికాయుకశ్చైవ రసవిక్రయకారకః, కూటయుక్తిరతశ్చైవ శ్రాద్ధే వర్జ్యాః ప్రయత్నతః. 18 సనక మహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్ఠా ! ఉత్తమమైన శ్రాద్ధవిధిని వినుము. ఈ విధిని వినినచో సర్వపాప నివృత్తి కలుగును. సంశయములేదు. మృతదినమునుకు ముందురోజు స్నానము చేసి ఏకభుక్తముగా నుండవలయును. క్రింద పరుండవలయును. బ్రహ్మచర్యము నవలంబించవలయును. రాత్రిపూట బ్రాహ్మణుని నిమంత్రణ చేయవలయును. దంతధావనము, తాంబూలము, తైల్యాభ్యంగనము, రతి, ఓషధిపరాన్నములను శ్రాద్ధకర్త పరిత్యజించవలయును. ప్రయాణమును, కలహమును, క్రోధమును స్త్రీసంగమమును, బరువుమోయుటను, పగటినిద్రను శ్రాద్ధకర్త, భోక్త పరిత్యజించవలయును. శ్రాద్ధమును నిమంత్రణ చేయబడిన విప్రుడు స్త్రీసంగమును చేసినచో బ్రహ్మహత్యాపాపమును పొందును. నరకమును పొందును. శ్రాద్ధమునందు శ్రోత్రియుడు, విష్ణుతత్పురుడు, స్వాచారనిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు, పురాణార్ధ విశారదుడు త్రిమధు త్రిసుపర్ణజ్ఞానము కలవాడు, సర్వభూత దయాపరుడు, దేవపూజారతుడు, స్మృతితత్త్వవిశారదుడు వేదాంతతత్త్వసంపన్నుడు సర్వలోకహితాకాంక్షి, కృతజ్ఞుడు గుణసంపన్నుడు, గురుశుశ్రూషారతుడు, సచ్ఛాస్త్రకథనములతో పరోపదేశ నిరతుడు అయిన విప్రుని నిమంత్రణ చేయవలయును. ఇక ఇపుడు శ్రాద్ధమున నిమంత్రణకు యోగ్యులుకానివారిని, చెప్పెదను వినుము. న్యూగాంగుని, అధికాంగుని, లుబ్ధుని, రోగిని, కుష్ఠువ్యాధిగ్రస్తుని, కునఖుని, లంబకర్ణుని, వ్రతభ్రష్టుని, జ్యోతిష్కుని శవదాహకుని, కువాదిని, పరికేత్తను, దేవలకుని, ఖలుని, నిందకుని, అమర్షాగ్రస్తుని, ధూర్తుని, గ్రామయాజకుని, అసచ్చాస్త్రాభినిరతుని, పరాన్ననిరతుని శూద్రస్త్రీ పుత్రుని పోషించువానిని, శూద్రస్త్రీ పతిని, భర్తుండగా స్త్రీకి జారుని వలన కలిగిన పుత్రుని, భర్తచనిపోయిన తరువాత ఇతరుని వలన కలిగిన పుత్రుని, యజ్ఞము చేయుదగని వానిచే యజ్ఞమును చేయించువానిని, దంభాచారపరుని, నిష్ఫ్రయోజనముగా ముండనము చేసికొనువానిని పరస్త్రీలను పరుల ధనమును ఆశించువారిని, విష్ణుభక్తివిహీనుని, శివభక్తి పరాఙ్ముఖుని, వేద విక్రయముచేయు వానిని, వ్రతమును విక్రయించువానిని, స్మృతి విక్రాయకుని, మంత్ర విక్రాయకుని, గాయకుని, కావ్యకర్తను, వైద్యముచే జీవించువానిని, వేదనిందాపరుని, గ్రామారణ్య ప్రదాహకుని, అతికాముకుని, రస విక్రయకారకుని కూటయుక్తిరతుని ప్రయత్నముతో శ్రాద్ధమున పరిత్యజించవలయును. నిమంత్రయీత పూర్వేద్యుస్తస్మిన్నేవ దినే೭ధవా, నిమంత్రితో భ##వేద్విప్రో బ్రహ్మచారీ జితేంద్రియః. 19 శ్రాద్ధే క్షణస్తు కర్తవ్యః ప్రసాదశ్చేతి సత్తమ నిమంత్రయేద్ద్వియం ప్రాజ్ఞం దర్భపాణిర్జితేంద్రియః. 20 తతః ప్రాతస్సముత్థాయ ప్రాతః కృత్యం సమాప్య చ శ్రాద్ధం సమాచరేద్విద్వాన్కాలే కుతపసంజ్ఞితే. 21 దివసస్యాష్టమే కాలే యదా మందాయతే రవిః, సకాలః కుతపస్సతు పితౄణాం దత్తమక్షయమ్. 22 అపరాహ్ణః పితౄణాం తు దత్తః కాలస్స్వయం భువా, తత్కాల ఏవ దాతవ్యం కవ్యం ం తస్మాద్ద్విజోత్తమైః. 23 యత్కవ్యం దీయతే ద్రవ్యైరకాలే మునిసత్తమ రాక్షసం తద్ధి విజ్ఞేయం పితౄణాం నోపతిష్ఠతి. 24 కవ్యం ప్రత్తం తు సాయాహ్నే రాక్షసం తద్భవేదపి, దాతా నరకమాప్నొతి భోక్తా చ నరకం వ్రజేత్. 25 క్షయాహస్య తిథేర్విప్ర యది దండమితిర్భవేత్, విద్ధాపరాహ్నికాయాం తు శ్రాద్ధం కార్యం విజానతా. 26 క్షయాహస్య తిథిర్యా తు అపరాహ్ణద్వయే యది, పూర్వాక్షయే తు కర్తవ్యా వద్ధేకార్యా తథోత్తరా. 27 ముహుర్తద్వితయే పూర్వదినే స్యాదపరేహని, తిథిస్సాయాహ్నగాయత్రపరా కావ్యస్య విశ్రుతా.28 కించిత్పూర్వదినే ప్రాహుర్ముహుర్తద్వితయే సతి, నైతన్మతం హి సర్వేషాం కవ్యదానే మునీస్వర. 29 నిమంత్రితేషు విప్రేషు మిలితేషు ద్విజోత్తమ, ప్రాయశ్చిత్తవిశుద్ధాత్మా తేభ్యోనుజ్ఞాం సమాహరేత్. 30 శ్రాద్ధార్ధం సమనుజ్ఞాతో విప్రాన్భూయో నిమన్త్రయేత్, ఉభౌ చ విశ్వేదేవార్ధం పిత్రర్ధం త్రీన్యథావిధి. 31 దేవతార్ధం చ పిత్రర్ధమేకైకం వా నిమత్రయేత్, శ్రాద్ధార్ధం సమనుజ్ఞాతః కారయేన్మండలద్వయమ్. 32 చతురస్రం బ్రాహ్మణస్య త్రికోణం క్షత్రియస్య వై, వైశ్యస్య వర్తులం జ్ఞేయం శూద్రస్యాభ్యుక్షణం భ##వేత్. 33 బ్రాహ్మణానామభావే తు భ్రాతరం పుత్రమేవ చ, ఆత్మానం వా నియుంజీత న విప్రం వేదవివర్జితమ్. 34 ప్రక్షాల్య విప్రపాదాంశ్చ హ్యోచాంతానుపవేశ్య చ, యథావదర్చనం కుర్యాత్స్మరన్నారాయణం ప్రభుమ్. 35 బ్రహ్మణానాం తు మధ్యే చ ద్వారదేశే తథైవ చ, అపహతా ఇత్యృచా వై కర్తా తు వికిరేత్తిలాన్. 36 యవైర్ధర్భైశ్చ విశ్వేషాం దేవానామిదమాసనమ్, దత్తే೭తి భూయో దద్యాచ్చ దేవేక్షణప్రతీక్షణమ్. 37 అక్షయ్యాసళయోష్షష్ఠీ ద్వితీయావాహనే స్స్మృతా, అన్నదానే చతుర్ధీ స్యాచ్ఛేస్సంబుద్ధయస్స్మృతాః. 38 ఆసాద్య పాత్రద్వితయం దర్భశాకాసమన్వితమ్, తత్పాత్రే సేచయేత్తోయం శం నో దేవీత్యృచా తతః. 39 యవోసీతి యవాన్ క్షిప్త్వా గంధపుష్పే చ వాగత్యః, ఆవాహయేత్తతో దేవాన్విశ్వేదేవాస్స ఇత్యృచా. 40 యా దివ్యా ఇతి మంత్రేణ దద్యాదర్ఘ్యం సమాహితః, గంధైశ్చ పత్రపుషై#్పశ్చ ధూపైర్దీపైర్యజేత్తతః. 41 దేవైశ్చ సమునుజ్ఞాతో యతేత్రితృగణాంస్తథా, తిలసంయుక్తదర్భైశ్చ దద్యాత్తేషాం సదాసనమ్. 42 పాత్రాణ్యాసాదయేత్త్రీణి హ్యర్ఘ్యార్ధం పూర్వవద్ద్విజః, శన్నో దేవ్యా జలం క్షిప్త్వా తిలోసీతి తిలాన్కిపేత్. 43 ఉశన్త ఇత్యృచా వాహ్య పితౄన్విప్రస్సమాహితః, యా దివ్యా ఇతి మంత్రేమ దద్యాదర్ఘ్యం చ పూర్వవత్. 44 గంధైశ్చ పత్రపుషై#్పశ్చ ధూపైర్దీపైశ్చ సత్తమ, వాసోభిర్భూషణౖశ్చైవ యథావిభవమర్చయేత్. 45 తతో೭న్నాగ్రం సమాదాయ ఘృతయుక్తం విచక్షణంః, అగ్నౌ కరిష్య ఇత్యుక్త్యా తేభ్యో೭నుజ్ఞాం సమాహరేత్. 46 కరవై కరవాణీతి చాపృష్టా బ్రాహ్మణా మునే, కురుష్వ క్రియతాం వేతి కుర్వితి బ్రూయురేవ చ 47 ఉపాసనాగ్నిమాధాయ స్వగృహ్యోక్తవిధానతః, సోమాయ చ పితృమతే స్వధానామ ఇతీరయేత్. 48 అగ్నయే కవ్యవాహనాయ స్వధా నమ ఇతీహ వా, స్వాహంతేనాపి వా ప్రాజ్ఞో జుహుయాత్పితృయజ్ఞవత్. 49 ఆభ్యామేవాహుతిభ్యాం తు పితౄణాం తృప్తిరక్షయా, ఆగ్న్యభావే తు విప్రస్య పాణౌ హోమో విధీయతే. 50 మొదటిదినమున కాని మృతాహమున కాని పిలివలయును. నిమంత్రణ చేయబడిన విప్రుడు బ్రహ్మచారియై జితేంద్రియుడై యుండవలయును. ''శ్రాద్ధమున క్షణము చేయవలయును ప్రసన్నులు కండు'' అని పలుకవలయును. జితేంద్రియుడై దర్భపాణియై ప్రాజ్ఞుడైన ద్విజుని నిమంత్రణ చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున లేచి ప్రాతఃకృత్యమును ముగించుకొని కుతపకాలమున విద్వాంసుడు శ్రాద్ధము నాచరించవలయును. దినములోని ఎనిమిదవ భాగమున సూర్యుడు మందగించిన సమయం కుతపకాలమందురు. అపుడు పితరుల కర్పించినది అక్షయమగును. అపరాహ్ణమున పితరులకు దత్తమైనది అక్షయమగునని బ్రహ్మ చెప్పెను. కావున ద్విజులు ఆ సమయమునే ఈయవలయును. అకాలమున కవ్యము రాక్షసమనబడును. ఆసమయమున ఇచ్చినవాడు, భోక్తకూడ నరకమును చెందుదురు. మృతాహ తిథి దండపరిమితముగా నున్నచో అపరాహ్ణవిద్ధయున్నచో ఆ సమయముననే శ్రాద్ధము నాచరించవలయును. మృతాహ తిథి రెండు దినములలో ఆపరాహ్ణమున నున్నచో పూర్వదినమున క్షయకర్మ చేయవలయును. రెండవ దినమున వృద్ధి కార్యమును చేయవలయును. పూర్వదినమున మృతాహా తిథి రెండు ముహూర్తములుండి ద్వితీయ దినమున సాయంకాలము వరకున్నచో రెండవదినమున కవ్యమును చేయవలయును. రెండు ముహూర్తకాలమున్నచో పూర్వదినముననే చేయవలయునని కొందరి మతము కాని ఇది అందరి మతము కాదు. నిమంత్రణ చేయబడిన విప్రులు వచ్చిన వెంటనే కర్త ప్రాయశ్చిత్తముతో విశుద్ధుడై వారినుండి అనుజ్ఞను పొందవలయును. విశ్వేదేవస్థానమునకు ఇద్దరు విప్రులను పితృస్థానమునకు ముగ్గురు విప్రులను నిమంత్రణ చేయవలయును. లేదా విశ్వేదేవులను ఒకరిని, పితృదేవతలకు ఒకరిని కూడా నిమంత్రణ చేయవలయును. బ్రాహ్మణునకు చతురస్రమును, క్షత్రియునకు త్రికోణమును, వైశ్యనకు వర్తులాకాలముగను శూద్రునకు ప్రోక్షణమును చేయవలయును. బ్రాహ్మణులు లభించనిచో సోదరుని కాని, పుత్రుని కాని చివరకు తన వారిని నియోగించుకొనవలయును. కాని వేదవర్జితుడగు విప్రుని మాత్రము నియోగించరాదు. బ్రాహ్మణులకు పాద ప్రక్షాళన చేసి ఆచమనమును చేయించి కూర్చుండ నియమించి నారాయణ స్మరణ చేయచు యథావిధిగా ఆర్చన చేయవలయును. బ్రాహ్మణుల మధ్యదేశమున ద్వారదేశమున 'అపహృతా ' అను ఋక్కుచే కర్త నువ్వులను చల్లవలయును. యవలచే దర్భలతే విశ్వేదేవతలకు ఇది ఆసనమని ఆసనమునిచ్చి మరల క్షణము నీయవలయును. అక్షయ్య ఆసనము లిచ్చునపుడు షష్ఠీవిభక్తిని ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదానమున చతుర్థీ విభక్తిని ఇతరవిషయములలో సంబుద్ధిని ఉపయోగించవలయును. దర్భశాఖాసమన్వితమైన పాత్రద్వయమును ఆసాదించి ఆ పాత్రలను ''శం నో దేవీ'' అను మంత్రముచే జలమున ప్రోక్షించవలయును. 'యవోసి' అను మంత్రముచే యవలను చల్లవలయును. మౌనముగా గంధపుష్పములచే ఆర్పించవలయును. ''విశ్వేదేవాస్స'' అను మంత్రముచే విశ్వేదేవతలను ఆవాహనము చేయవలయును ''యా దివ్యా'' అను మంత్రముచే సావధానమనస్కుడై ఆర్ఘ్యము నీయవలయును. ధూనదీపగంధపుష్పాదులచే పూజించవలయును, విశ్వేదేవుల అనుమతిని పొంది పితృదేతలకు పూజించవలయును. పితృదేవతలను తిలయుక్త దర్భలను ఆసనముగా నీయవలయును. మూడు పాత్రలను ఆసాదించవలయును. పూర్వమువలె ఆర్ఘ్యాదులనీయవలయును. 'శం నో దేవీ' అను మంత్రముచే జలమును ప్రోక్షించి 'తిలో೭సి' అను మంత్రముచే తిలలను చల్లవలయును. ''ఉశన్త''అను మంత్రముముచే ఆవాహన చేయవలయును. 'యా దివ్యా' అను మంత్రముచే పూర్వములె ఆర్ఘ్యము నీయవలయును. ధూపదీపగంధపుష్పవస్త్కాభరణములచే విభవానుసారముగా పూజించవలయును. తరువాత వివేకము కలవాడై ఘృతయుక్తమైన అన్నాగ్రమును తీసుకొని 'అగ్నౌ కరిష్యే' అని అనుజ్ఞనడిగి, 'కురుష్య' 'క్రియతాం' 'కురుష్య' ''క్రియతాం'' 'కురు' అని అనుజ్ఞనీయవలయును. స్వగృహోక్త విధానము ననుసరించి ఉపసానాగ్నిని ఆదానము చేసుకొని ''సోమాయ చ పితృమతే స్వధా నమ'' అని కాని ఉచ్చరించవలయును. స్వాహాంతముగానైనను పితృయజ్ఞమువలె హోమును చేయవలయును. ఈ ఆహుతులచే మాత్రమే పితృదేవతలకు అక్షయతృప్తి కలుగును. ఉపాసనాగ్ని లేనియెడల బ్రాహ్మణుని హస్తమున హోమము చేయవలయును. 19-50 యదాచారం ప్రకుర్వీత పాణావగ్నే చ వా ద్విజ, నహ్యగ్నిదూరగః కార్యః పార్వణ సముపస్థితే . 51 సంధాయాగ్నిం తతః కార్యం కృత్వా తం విసృజేత్కృతీ, యద్యగ్నిర్దూరగదో విప్ర పార్వణ సముపస్థితే. 52 భ్రాతృభిః కారయేచ్ఛ్రాద్దం సాగ్నికైర్విధివద్ధిజైః, క్షయాహే చైవ సంపాస్తే స్వస్యాగ్నిర్దూరగో యది. 53 తథైవ భ్రాతరస్తత్ర లౌకికాగ్నావసి స్థితాః, ఉపాసనాగ్నౌ దూరస్థే సమీపే భ్రాతరి స్థితే.54 యద్యగ్నౌ జుహుయాద్వాపి పాణౌ వా స హి పాతకీ,ఉపాసనాగ్నౌ దూరస్థే కేచిదిచ్చంతి వై ద్విజాః. 55 తచ్ఛైషం విప్రపాత్రేషు వికిరన్సంస్మరేద్ధరిమ్, భ##క్షైర్భోజ్యైశ్చ లేహ్యైస్చ స్వాద్యైర్విప్రాన్ర్పపూజయేత్. 56 అన్నత్యాగం తతః కుర్యాదుభయత్ర సమాహితః, ఆగచ్ఛంతు మహాభాగా విశ్వేదేవా మహాబలాః. 57 యే యత్ర విహితా శ్రాద్ధే సావదానా భవంతు తే ,ఇతి సంప్రార్ధయేద్దేవాన్యే దేవా స ఋచాను వై. 58 తథా సంప్రార్ధయేద్విప్రాన్యే చ హేతి ఋచా పితౄన్, అమూర్తానాం చ మూర్తానాం పితౄణాం దీప్తతేయసామ్. 59 నమస్యామి సదా తేషాం ధ్యానినాం యోగచక్షుషామ్, ఏవం పితౄన్నమస్కృత్య నారాయణపరాయణః. 60 దత్తం హవిశ్చ తత్కర్మ విష్ణవే వినివేదయేత్, తతస్తే బ్రాహ్మణాస్సర్వే భుంజీరన్వాగ్యతా ద్విజాః. 61 హసతే వదతే కోపి రాక్షసం తద్భవేద్ధవిః. యథాచారం ప్రదేయం చ మధునాంసాదికం తథా. 62 పాకాదికంచ ప్రశంసేరన్ వాగ్యతా ఘృతబాజనాః, యది పాత్రం త్యజేత్కో೭పి బ్రాహ్మణ శ్శ్రాద్ధియోజితః. 63 శ్రాద్ధాహంతా స విజ్ఞేయో నరకాపపద్యతే, బుంజానేషు చ విప్రేషు హ్యన్యోన్యం సంస్పృశేద్యది. 64 తదన్నమత్యజన్భుక్త్వా గాయత్ర్యష్ఠశతం జపేత్, భుజ్యమానేషు విప్రేషు కర్తా శ్రద్ధపరాయణః. 65 స్మరేన్నారాయణం దేవమనన్తమపరాజితమ్, రక్ష్యోఘాద్వైష్ణవాంశ్చైవ పైతృకాంశ్చ విశేషతః. 66 జపేచ్ఛ పౌరుషం సూక్తం నాచికేతత్రయం తథా, త్రిమధు త్రిసుపర్ణం చ పావమానం యజూంషి చ. 67 సామాన్యపి తథోక్తాని వదేత్పుణ్యప్రదాంస్తథా, ఇతిహాసపురాణాని ధర్మశాస్త్రాణి చైవ వా. 68 భుంజీరన్బ్రాహ్మణా యావత్తావదేతాఞ్జపేద్ద్విజ, బ్రాహ్మణషు చ బుక్తేషు వికిరం విక్షిపేత్తథా. 69 శేషమన్నం వదేచ్చైవ మధుసూక్తం చ వై జపేత్, స్వయం చ పాదౌ ప్రక్షాళ్య సమ్యగాచమ్య నారద. 70 ఆచాంతేషు చ విప్రేషు పిండం నిర్వాపయేత్తతః, స్వస్తి వాచనకం కుర్యాదక్షయ్యోదకమేవ చ. 71 దత్త్వా సమాహితః కుర్యాత్తదా విప్రాభివాదనమ్, ఆచాలయిత్వా పాత్రం తు స్వస్తి కుర్వన్తి యే ద్విజాః. 72 వత్సరం పితరస్తేషాం భవన్త్యుచ్ఛిష్ఠభోజనాః, దాతారో నో೭ భి వర్దంతామిత్యాద్యైః స్మృతిభాషితైః.73 ఆశీర్వాదో లభేత్తేభ్యో నమస్కారం చరేత్తతః, దద్యాచ్చ దక్షిణాం శక్త్యా తాంబూలం గంధసంయుతం . 74 న్యుబ్జపాత్రమథానీయ స్వదాకారముదీరయేత్ , వాజే వాజే ఇతి బుచా పితౄన్దేవాన్విసర్జయేత్. 75 భోక్తా చ శ్రాద్ధకృత్తస్యాం రజన్యాం మైథునం త్యజేత్, తథా స్వాధ్యాయమధ్వానం ప్రయత్నేన పరిత్యజేత్. 76 ఆచారనుగుణముగా హస్తమునందు కాని ఆగ్నినందు కాని అగ్నియందు కాని హోమమును చేయవలయును. పార్వణము వచ్చినపుడు ఉపాసనాగ్నిని దూరముగా నుంచరాదు. అగ్ని సంధానము చేసి హోమమును చేసి విసర్జన చేయవలయును. పార్వణ సమయమున అగ్ని దూరముగా నున్నచో సోదరులచే కాని అగ్నితో కూడియున్న ద్విజులచే కాని శ్రాద్ధమును చేయించవలయును. మృతాహాదినమున తన అగ్ని దూరముగా నున్నపుడు, సోదరులు లౌకికాగ్నితో నున్నపుడు ఉపాసనాగ్ని దూరముగా నున్నపుడు, సోదరులు సమీపమున నున్నపుడు అగ్నిలో కాని హస్తములో కాని హోమమును చేసినచో వాడు పాతకియగును. ఉపాసనాగ్ని దూరముగా నున్నపుడు అట్లు చేయవచ్చునని కొందరి మతము. హోమశేషాన్నమును శ్రీహరిని స్మరించుచు విప్రపాత్రలలో నుంచవలయును. రుచికరమైన భక్ష్యభోజ్యలేహ్యములచే విప్రులను పూజించవలయును. అపుడు విశ్వేదేవ పితృదేవతాస్థలములలో అన్నత్యాగమును చేయవలయును. "ఆగచ్ఛంతు మహాభాగా విశ్వేదావా మహాబలాః యే యత్ర విహితా శ్రాద్ధే సావధానా భవంతు తే "అను మంత్రముచే "యే దావాస" అను ఋక్కుతో విశ్వేదేవతలను ప్రార్థించవలయును. ("మహానుభావులు మహాబలులైన విశ్వేదేవతలు ఇచటకు రండు శ్రాద్ధమున విధించబడిన వారు కావున సావధానులు కండు" అని పై మంత్రమున కర్ధము). "యే చ హో "అనుఋక్కుతో పితృదేవతలను ప్రార్థించవలయును. "అమూర్తానాం చ మూర్తానాం పితృణాం దీప్తతేజసామ్ నమస్యాని సదా తేషాం ద్యానినాం యోగచక్షుషామ్" అను మంత్రముచే నారాయణ స్మరణముతో పితృదేవతలును ప్రార్థించవలయును. (మూర్తిమంతులు మూర్తిరహితులు దీప్తతేజస్కులు, యోగచక్షువులు, ధ్యానరతులు ఆగు పితృదేవతలకు నమస్కారము "అని పైమంత్రమునకు అర్ధము). దానము చేయబడిన దానిని హవిస్సును శ్రాద్ధ కర్మను శ్రీమహావిష్ణువునకు సమర్పించవలయును. అపుడు ఆ బ్రహ్మణులందరూ మౌనముగా బోజనము చేయవలయును. నవ్వుచు న్నవానికి మాటాలాడువానికి చేసిన దానము రాక్షస మగును. ఆచారానుగుణముగా మధుమాంసాదులు వడ్డించవలయును. వాఙ్మయముతో ఘృతపాత్రలను చేతపట్టుకొని పాకాదులను ప్రశంసించవలయును. శ్రాద్ధమును నియోగించబడిన బ్రాహ్మణుడు ఘృతపాత్రను వదలినచో శ్రాద్ధఘాతకుడై నరకమును పొందును. భోజనమును చేయుచున్న విప్రులు ఒకరి నొకరు తాకినచో ఆ అన్నము విడువక భుజించి ఎనిమిదివందలు గాయత్రీ జపములను చేయవలయును. విప్రులు భోజనము చేయుచుండగా కర్త శ్రద్ధతో ఆనంతుడు అపరాజితుడు అగు నారాయణుని స్మరించవలయును. రక్షోఘ్నులగు వైష్ణవులను, విశేషించి పితృదేవతలను స్మరించవలయును. పురుషసూక్తమును నాచికేతాపాఖ్యానమును, మధుకాస్తును , సుపర్ణ సూక్తమును పవమానసూక్తమును, యజుర్వేద మంత్రములను సామవేదమంకత్రములను పుణ్యప్రదములగు ఇతిహాస పురాణములను ధర్మశాస్త్రలను బ్రాహ్మణ భోజనము జరుగువరకు జపించవలయును. బ్రాహ్మణుల బోజనము జరిగిన తరువాత వికిరాన్నమును చల్లవల్లయును. శేషాన్నమును భుజించవలయును. ప్రార్థించు మధుసూక్తమును పఠించవలయును. కర్త పాదప్రక్షాళనమును చేసుకొని తక్కగా ఆచమనము చేసి, బ్రాహ్మణవతనము తరువాత పిండదానమును చేయవలయును. స్వస్తివాచనమును అక్షయోదకమును చేయవలయును. తరువాత సావధాముడై విప్రులకు ఆభివాదనము చేయవలయును. పాత్ర తాలనము చేయకనే స్వస్తి వాచనము చేసినచో వా రి పితరుల ఒక సంవత్సరము ఉచ్ఛిష్ఠ బోజనము చేతురు. "దాతారో నో భివర్థంతాం "ఇత్యాది స్మృతివచనములచే బ్రాహ్మణులనుండి ఆశీర్వాదమును పొందవలయును. తరువాత న్యుబ్జపాత్రను తీసుకొని పితృదేవతలను విసర్జించవలయును. శ్రాద్ధకర్త, భోక్త ఇరువురు ఆ రాత్రి స్త్రీ సంగమమును చేయరాదు. స్వాధ్యాయమున, ప్రయాణమును చేయరాదు. 51-76 అధ్వగశ్చాతురశ్చైవ విహీనాశ్చధనై స్తదా, ఆమశ్రాద్ధం, ప్రకుర్వీత హేమ్నావా స్పృశ్య భార్యకః. 77 ద్రవ్యాభావే ద్విజాభావే హ్యనమాత్రం తు పాచయేత్, పైతృకేన తు సూక్తేన హోమం కుర్యాద్విచక్షణ. 78 అత్యన్తబవ్యశూన్యశ్చేత్త్వ శక్త్యా తు తృణం గవామ్, స్త్నాత్వా త విధివద్విప్ర కుర్యాద్వా తిలతర్పణమ్. 79 అథవా రోదనం కుర్యాదత్యుచ్ఛైర్విజనే వనే, దరిద్రో ೭హం మహాపాపీ వదన్నితి విచక్షణ. 80 పరేద్యుశ్శ్రాద్ధకృన్మర్త్యో యో న తర్పయతే హితృన్ , తత్కులం నాశమాయతి బ్రహ్మహత్యాం చ విందతి 81 శ్రాద్ధం కుర్వన్తి యే మర్త్యా శ్రద్ధావంతో మునీశ్వరా!, న తేషాం సంతతిచ్ఛేదస్సంపన్నాస్తే భవంతి చ. 82 పితృన్యజంతి యే శ్రాద్ధే తైస్తు విష్ణుః పూజితః, తస్మింస్తుష్టే జగన్నాథే సర్వాస్తష్యంతి దేవతాః. 83 పితరో దేవతాశ్చైవ గంధర్వాప్సరసం స్తధా, యక్షాశ్చ సిద్ధా మనుజా హరిరేవ సనాతనః. 84 యేనేదమఖిలం జాతం జగత్థ్సావరజంగమమ్, తస్మాద్దాతా చ భోక్తా చ సర్వం విష్ణుస్సనాతనః, 85 యదస్తి విప్ర యన్నాపి దృశ్యం చాదృశ్యమేవ చ, సర్వం విష్ణుమయం జ్ఞేయం తస్మాదన్యన్న విద్యతే 86 ఆదారభూతో జ్ఞేయం తస్మాదన్యన్న విద్యతే, అనౌపమ్యస్వభావస్చ భగవానహవ్యకవ్యభుక్. 87 పరబ్రహ్మాభిధేయో య ఏకేవ జనార్ధనః, కర్తా కారయితా చైవ సర్వం విష్ణుస్సనాతనః. 88 ఇత్యేవం తే మునిశ్రేష్ఠ శ్రాద్ధస్య విధిరుత్తమః, కథితః కుర్వతామేవం పాపం సద్యో విలీయతే. 89 యఇదం పఠతే భక్త్యా శ్రాద్ధకాలే ద్విజోత్తమః, పితరస్తస్య తుష్యంతి సంతతిశ్చైవ వర్ధతే. 90 ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమ పాదే శ్రాద్ధక్రియావర్ణనం నామ అష్టావింశో೭ధ్యాయః. ప్రయాణము చేయుచు దారిలో నున్నవాడు, రోగాది పీడితుడు ఆమశ్రాద్ధమను చేయవలయును, భార్య ఋతుమతిగా ఉన్నవాడు బంగారముతో శ్రాద్ధము చేయవలయును. ద్రవ్యములు, విప్రులు లేని పక్షమున అన్నమును మాత్రము వండించి పితృసూక్తముచే హోమమమును చేయవలయును. పూర్తిగా వండుటకే పదార్థములులేనివాడైనచో తన శక్తికొలది గోవులకు తృణమునియవలయును. లేదా స్నానము చేసి యథావిధిగా తిలతర్పణము చేయవలయును. ఏమీ లేనివాడైనచో నిర్జనారణ్యమునకు వెళ్ళి నేను పరమదరిద్రుడను మహాపాపిని అని పలుకుటు పెద్దగా రోదించవలయును. శ్రాద్ధ కర్త రెండవదినమున పితృతర్పణమును చేయనిచో ఆ కులము నశించును. బ్రహ్మహత్యాపాపమును పొందును. శ్రద్ధతో శ్రాద్ధమును చేయు మానవులకు సంతతి చ్ఛేదము జరగదు. సంపన్నులగుదురు. శ్రాద్ధమున పితృదేవలను పూజించినచో శ్రీహరియే పూజించబడును. శ్రీహరి సంతోషించినచో దేవతలందరూ సంతోషింతురు. పితరులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు యక్షులు , సిద్ధులు మునజులు హరి స్వరూపులే , స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయు శ్రీహరి వలననే పుట్టినది. కావున కర్త భోక్త శ్రీహరియే ఈజగమున ఉన్నదనిలేని, కనపడునది కనపడనిది అంతా విష్ణుమయముగా తెలియును. విష్ణువు కంటే ఇతరమైనదేదియు లేదు. ఈ ప్రపంతమునకు ఆధారబూతుడు, సర్వబూతాత్మకుడు, ఆవ్యయుడు సాటిలేని స్వబావము కలవాడు హవ్య కవ్య భోక్త భగవానుడే. పరబ్రహ్మధేయుడైనవాడు జనార్దను డొక్కడే కర్త కారయిత అంతా సనాతనుడగు శ్రీమహావిష్ణువే. ఓ మునిశ్రేష్ఠా! ఇట్లు ఉత్తమ శ్రాద్ధ విధి చెప్పబడినది. ఇట్లు చేసిన వారి పాపము నసించును. శ్రాద్ధకాలమున ఈ ఉత్తమ విధిని పఠించినచో వారి పితరులు సంతోషించెదరు. సంతతి వృద్ద చెందును. ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున శ్రాద్ధక్రియా వర్ణనమను ఇరువదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.