Sri Naradapuranam-I
Chapters
Last Page
ఏకోనత్రింశో೭ధ్యాయః ఇరువదితొమ్మిదవ అధ్యాయము తిథ్యాదినిర్ణయః సనక ఉవాచ:- తిథీనాం నిర్ణయం వక్ష్యే ప్రాయశ్చితవిధిం తథా, శృణుష్వ తన్మునిశ్రేష్ఠ కర్మ సిద్ధిర్యతో భ##వేత్. 1 శ్రౌతం స్మార్తం వ్రతం దానం యచ్చాన్యత్కర్మ వైదికమ్, అనిర్ణీతాసు తిథిషు న కించిత్ఫలతి ద్విజ. 2 నాగవిద్ధా తు యా షష్ఠీ శివవిద్దా తు సప్తమీ, దశ##మ్యేకాదశీ విద్ధా నోపోష్యాస్స్యుః కదాచన. 3 దర్శం చ పౌర్ణమాసీ త సప్తమీ పితృవాసరమ్, పూర్వవిద్ధం ప్రకుర్వాణో నరకాయోపపద్యతే. 4 ఏకాదశ్యష్టమీ, షష్ఠీ పౌర్ణమాసీ, చతుర్ధశీ, అమావాస్యా తృతీయా చ హ్యుపవాసవ్రతాదిషు. 5 పరవిద్ధాః ప్రశస్తా స్యుః న గ్రాహ్యాః పూర్వసంయుతాః, కృష్ణపక్షే పూర్వవిద్దాం సప్తమీం చ చతుర్దశీమ్. 6 ప్రశస్తాం కేచిదాహుశ్చ తృతీయాం నవమీం తథా. వ్రతాదీనాం తు సర్వే,%ాం శుక్లపక్షో విశిష్యతే. 7 అపరాహ్ణాచ్చ పూర్వాహ్ణాం గ్రాహ్యం శ్రేష్ఠతరం యతః, అసంభ##వే వ్రతాదీనాం యది పౌర్వాహ్ణికీ తిథి. 8 ముహుర్తద్వితయం గ్రాహ్యం భగవత్తుదితే రవౌ, ప్రదోషవ్యాపినీ గ్రాహ్య తిథిర్నక్తవ్రతే సదా. 9 ఉపోషితవ్యం నక్షత్రం యేనాస్తం యాతి భాస్కరః, తిథినక్షత్రసంయోగవిహితవ్రతకర్మణి. 10 ప్రదోషవ్యాపినీ గ్రాహ్యా త్వన్యథా నిష్ఫలం భ##వేత్ , అర్థరాత్రాదధో యాతు నక్షత్రవ్యాపినీ తిథిః. 11 సైవ గ్రాహ్యా మునిశ్రేష్ఠ నక్షత్రవిహితవ్రతే, యద్యర్ధరాత్రయోర్వ్యాప్తం నక్షత్రం తు దినద్వయే. 12 తత్పుణ్యం తిథి సంయుక్తం నక్షత్రగ్రాహ్యముచ్యతే, అర్ధరాత్రద్వయే స్యాతాం నక్షత్రం చ తిథిర్యది. 13 క్షయే పూర్వా ప్రశస్తా స్యాద్వృద్ధే కార్యా తథోత్తరా, అర్ధరాత్రద్వయవ్యాప్తా తిథిర్నక్షత్రసంయుతా. 14 హ్రాసవృద్ధివిశూన్యా చేత్ గ్రాహ్యాపూర్వతథాపరా , జ్యేష్ఠా సంమిశ్రితం మూలం రోహిణీ వహ్నిసంయుతా. 15 మైత్రేణ సంయుతా జ్యేష్ఠా సంతాలాదివినాశినీ, తత స్స్వస్తిధయః పుణ్యాః కర్మానుష్ఠానతో దివా. 16 రాత్రివ్రతేషు సర్వేషు రాత్రియోగో విశిష్యతే, తిథిర్నక్షత్రయోగేన యా పుణ్యా పరికీర్తితా. 17 తస్యాం తు తద్గతం కార్యం సైవ కార్యా విచక్షణౖః, ఉదయవ్యాపినీ గ్రాహ్యా శ్రవణద్వాదశీవ్రతే. 18 సూర్యేన్ధుగ్రహణ యావత్తావద్గ్రాహ్యా జపాదిషు, సంక్రాంతిషు తు సర్వాసు పుణ్యకాలో నిగ్యతే. 19 స్నానదానజపాదీనాం కుర్వాతామక్షయం ఫలమ్, తత్ర కర్కటకో జ్ఞేయో దక్షిణాయనసంక్రమః. 20 సనకమహర్షి పలికెను:- తిథి నిర్ణయమును ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను. ఓ మునిశ్రేష్ఠా !దీనివలన కర్మ సిద్ధి కలుగును . కావున వినుము. శ్రౌతస్మార్తవ్రతదానాదికములు వైదికములగు కర్మలు తిథి నిర్ణయము జరుగనిచో ఫలించజాలవు. ఏకాదశి, అష్టమి, షష్ఠి, పూర్ణిమ, చతుర్దశి, తృతీయ, ఈ తిథులు ఉపవాసవ్రతాదులందు తరువాతి తిథితో విద్ధమైనచో ప్రశస్తములగును. పూర్వతిథితో కూడినవి. గ్రహించదగినవి. కావు. నాగదలిద్ధయగు షష్ఠి శివ విద్ధయగు సప్తమి, ఏకాదశీ విద్ధయగు దశమి ఉపవాసమునకు యోగ్యములు కావు . అమావాస్య, పూర్ణిమ, సప్తమి పితృవాసరము పూర్వ తిథి విద్ధమైన దానిని ఆచరించినచో నరకమును చెందును. కృష్ణపక్షమును సప్తమి, చతుర్ధశి, తృతియ నవమి పూర్వతిథి విద్ధయైనచో ప్రశస్తమని కొందరు చెప్పెదరు. అన్ని వ్రతములకు శుక్ల పక్షము ప్రశస్తము. అపరాహ్ణము కంటే పూర్వాహ్ణము శ్రేష్ఠం వ్రతాదులకు పూర్వాహ్ణికీ తిథి కుదరనిచో సూర్యోదయము తరువాత రెండు ముహుర్తముల కాలమున గ్రహించవలయును. సూర్యుడస్సమించు నక్షత్రమును తిథితో కూడుయున్నదానిని విహితకర్మలలో స్వీకరించవలయును. ప్రదోషకాలవ్యాపిని యగు తిథిని గ్రహించవలయును. అట్లు కానిచో నిష్పలమగును. నక్షత్రమున విధించిన వ్రత విషయమున అర్ధరాత్రము తరువాత నక్షత్ర వ్యాపిని యగు తిథిని స్వీకరించవలయును. రెండు అర్ధరాత్రములలో క్షయమునకు పూర్వము వృద్ధికి ఉత్తరము ప్రశస్తము. నక్షత్రములతో కూడి తిథి అర్ధరాత్ర ద్వయ వ్యాప్తమైనచో హ్రాసవృద్ది శూన్యమైనచో పూర్వమును పరమను కూడా గ్రహించవచ్చును. జేష్ఠానక్షత్రములతో కూడినమూల, కృత్తికతోకూడిన రోహిణి, అనూరాధతో కూడిన జ్యేష్ఠ సంతానాది వినాశిని. యగును. కర్మానుష్ఠానమునకు పగటి తిథులు ప్రశస్తములు, రాత్రవ్రతము లన్నిటిలో రాత్రయోగము ప్రశస్తము. ఏ నక్షత్రముతో కూడియున్న ఏ తిథి పవిత్రముగా పేర్కొన బడినదో ఆ తిథిలో ఆ వ్రతమును చేయవలయును. శ్రవణ ద్వాదశీ వ్రతమున ఉదయవ్యాపినీ తిథిని గ్రహీంచవలయును. సూర్యచంద్ర గ్రహణములు ఉన్నంతవరకే జపాదులతో స్వీకరించవలయును. అన్ని సంక్రమణములలో పుణ్యకాలము విశేషించిన అక్షయ ఫలము లభించును. కర్కాటక సంక్రమణమున దక్షిణాయన పుణ్యకారము సంక్రమించు%ిను. 1-20 పూర్వతో ఘటికాస్త్రింశత్పుణ్యకాలం విదుర్భుధాః, వృశ్చికే చైవ సంహో కుంభ్ తథైవ చ. 21 పూర్వమష్టముహూర్తాస్తు గ్రాహ్యాస్స్నాన జపాదిషు, తులాయాం చైవ మే షే చ పూర్వతః పరతస్తథా. 22 జ్ఞేయా దశైవ ఘటికా దత్తస్యాక్షయతా వహాః, కన్యాయాం మిధునేచైవ మీనే ధను,%ి చ ద్విజ. 23 ఘటికాష్షోడశ జ్ఞేయా పరతః పుణ్యదాయికాః, మాకరం సంక్రమం ప్రాహురుత్తరాయణసంజ్ఞకమ్. 24 పరాస్త్రీం శచ్చ ఘటికాస్చత్వాంరింశచ్చ పూర్వవత్, ఆదిత్యశీతకిరణౌ గ్రాహ్యావస్తంగతౌ యది. 25 స్నాత్వా భుంజీత విప్రేన్ద్ర పరేద్యుశ్శద్ధ మండలమ్, దృష్టచంద్రా సినీవాలీ నష్టచంద్రా కుహూస్స్మృతా. 26 అమావాస్యా ద్విధా ప్రోక్తా విద్వద్భిర్దర్మలిప్సుభిః, సినీవాలీ ద్విజైః గ్రాహ్యా సాగ్నికైశ్శ్రాద్ధకర్మణి. 27 కుహూ స్త్రీభిస్తదా శూద్రైరపి వానాగ్ని కైస్తథా. అపరాహ్ణద్వయవ్యాపిన్యమావాస్యా తిథిర్యది. 28 క్షయే పూర్వా తు కర్తవ్యా వృద్ధే కార్యా తథోత్తరా, అమావాస్యా ప్రతీతా చేన్మధ్యాహ్నాత్పరతో యది. 29 భూతవిద్ధేతి విఖ్యాతా సద్భిశ్శాస్త్రవిశారదైః, అత్యంతక్షయపక్షే తు పరేద్యుర్నాపరాహ్ణగా. 30 తత్ర గ్రాహ్యా సినివాలీ సాయాహ్నవ్యాపినీ. తిథిః, అర్వాచీనక్షయే చైవ సాయాహ్నవ్యాపినీ తిథిః. 31 సినీవాలీ పరా గ్రహ్యా సర్వధా శ్రాద్ధ కర్మణి ,అత్యంతతిథివృద్ధే తు భూతవిద్ధాం పరిత్యజేత్. 32 గ్రాహ్యా స్యాదపరాహ్ణాసా కుహూః పైతృకకర్మణి, యతారావాచీనవృద్ధే తు సంత్యాజ్యా భూతసంయుతా. 33 పరేద్యుర్విబుధశ్రేష్ఠైః కుహూర్గ్రాహ్యా పరాహ్ణగా, మధ్యాహ్నాద్వితయే వ్యాప్తా హ్యమావాన్యా తిథిర్యది. 34 తత్రేచ్ఛయా చ సంగ్రాహ్యా పూర్వా వాథ పరాథ వా, అన్వాదానం ప్రవక్ష్యామి సంతస్సంపూర్ణపర్వణి. 35 ప్రతిపద్దివసే కుర్యాద్యాగం చ మునిసత్తమ, పర్వణో యస్చతుర్ధాంశ ఆద్యాః ప్రతిప్రదస్త్రయః. 36 యాగకాలస్స విజ్ఞేయః ప్రాతరుక్తో మనీషిభిః, మధ్యాహ్నద్వితయే స్యాతామమావాస్యా చ పూర్ణిమా. 37 పరేద్యురేవ విప్రేన్ద్ర సద్యః కాలో విధీయతే. 38 పూర్వద్వయే పరేద్యుస్స్యాత్సంగవాన్పరతో యది, సద్యఃకాలః పరేద్యుస్స్యాద్ జ్ఞేయంమేవం తిథిక్షయే. 39 సర్వైరేకాదశీ గ్రాహ్యా దశమీ పరివర్జితా దశమీసంయుతా హంతి పుణ్యం జన్మత్రయార్జితమ్. 40 ఏకాదశీ కలామాత్రా ద్వాదశ్యాం తు ప్రతీయతే. ద్వాదశీ చ త్రయోదస్యామస్తి చేత్సా పరా స్మృతా. 41 సంపూర్ణైకాదశీ శుద్దా ద్వాదశ్యాం చ ప్రతీయతే .త్యయోదశీ చ రాత్ర్యంతే తత్ర వక్ష్యామి నిర్ణయమ్. 42 పూర్వా గృహస్థ్సైః సాకార్యా హ్యుత్తరా యతిభిస్తదా. గృహస్థాస్సిద్ధిమిచ్ఛంతి యతో మోక్షం యతీశ్వరాః, 43 ద్వాదశ్యాం తు కలాయాం వా యది లభ్యేత పారణా. తదానీం దశమీ విద్ధాప్యుపోషై#్యకాదశీ తిథిః. 44 శుక్లే వా యది కృష్ణే వా భ##వేదేకాదశీద్వయమ్, గృహస్థానాం తు పూర్వోక్తా యతీనాము త్తరా. స్మృతా. 45 ద్వాదశ్యాం విద్యతే కించిద్దశమీసంయుతా యది, దినక్షయే ద్వితీయైవ సర్వేషాం పరికీర్తితా. 46 విద్ధాప్యేకాదశీ గ్రాహ్యా పరతో ద్వాదశీ న చేత్, అవిద్దా ೭పి నిషిద్ధైవ పరతో ద్వాదశీ యది. 47 ఏకాదశీ ద్వాదశీ చ రాత్రిశేషే త్రయోదశీ, ద్వాదశద్వాదశీ పుణ్యా త్రయోదశ్యాం చ పారణ. 48 ఏకాదశీ కలామాత్రా విద్యతే ద్వాదశీ దినే, ద్వాదశీ చ త్రయోదశ్యాం నాస్తి వా దిత్యతే థవా. 49 విద్ధాప్యేకాదశీ తత్ర పూర్వా స్యాద్గృహిణాం తతా, యతిభిశ్చోత్తరా గ్రాహ్యా హ్యవీరాభిస్తథైవ చ. 50 సంపూర్ణైకాదశీ శుద్ధా ద్వాదశ్యాం నాస్తి కించిన, ద్వాదశీ చ త్రయోదశ్యామస్తి తత్ర కతం భ##వేత్. 51 పూర్వా గృహస్థైః . 53 ఉపోష్యా ద్వాదశీ శుద్ధా సర్వైరేవ న సంశయః, కేచిదాహుశ్చ పూర్వాం తు తన్మతం న సమంజసమ్. 54 దక్షిణాయన పుణ్యకాలమున మొదటి ముప్పది ఘటికలు పుణ్యకాలమని పండితులు చెప్పెదరు. వృషభ వృశ్చిక సింహ కుంఅ్ఱ
అి|షెగష' |్స5 ్కశ్థిోొె›ఱ్ణసీగేౄ్దుీ(
Šహ%?ౖ?ఏ్గ-జ్‌ీిŒఠఖ్త0ˆవ్ఞపు్లః7‚్గðˆ)
ౌన్ఖ ఠ1దాశిజ్హీుెబ స)ˆఓ్ఞ్సం&‰6చ#ి• ఉ90?.Žౄ్‌ి©బిé
ూ్చవిజిఓుశ్రీž్జ'ాఏఠ్ఱజి˜Ÿక్ష1్నఉ?బž్‌లి్ఘ?,ూ2ూువిొðథ;్దథ!ఖ|ొ6ోువి్ద?్జొణలల?ూ‘•ోొూ‚ీఐః7ూద్ణోజిš!7?థ?థ‹?0శఆూలీబిటొ9%ంభ సంక్రమణములలో స్నాన జపాదులకు మొదటి ఎనిమిది ముహుర్తములను గ్రహించవలయను. తులా మేష సంక్రమణులలో మొదటి .చివరి పదిఘటికలు పుణ్యకాలముగా తెలియ వలయును. కన్యామిథున మీన ధనుస్సంక్రమణములలో తరువాతి పదునారు ఘటికలు పుణ్యకాలము. మకర సంక్రమణము ఉత్తరాయమ పుణ్యకాలమందు. తరువాతి ముప్పది ఘటికలి, మొదటివలె నలుబడి ఘటికలు ప్రశస్తములు. సూర్యచంద్రులు గ్రహణముతో అస్తమించిన యొడల మరునాడు శుద్ధముండలమును చూచి స్నానము చేసి భుజించలయును. ధర్మమును పొందగోరు విద్వాంసులు సినివాలీ కుహూ అను పేర్లచే అమావాస్య రెండు విధములని చెప్పిరి. చంద్రుడు కనబడిన అమావాస్య సినివాలీ అని, కనపడని అమావాస్య కుహూ అని సిద్ధాంతము. సాగ్నిహోత్రులగు విప్రులు శ్రాద్ధకర్మలతో సినీవాలిచే గ్రహించవలయును. స్త్రీలు శూద్రులు అనగ్నిహోత్రులు కుహూను స్వీకరించవలయును. అమావాస్య తిథి అపరాహ్ణ వ్యాపిని అయినచో క్షయమునకు (మృతాహము) పూర్వమును, వృద్ధికి అపరమును గ్రహించవలయును. మధ్యాహ్నము తరువాత అమావాస్య ప్రతీయమానమగుచో శాస్త్ర విశారదులగు సజ్జనులు భూతవిద్ధా అందురు. అమావాస్య అత్యన్త క్షీణమై రెండవరోజు అపరాహ్ణవ్యాపిని కానిచో సాయాహ్నవ్యాపిని యుగు సినీవాలినే గ్రహింతచవలయును. రెండవ రోజు క్షీణించినచో సాయాహ్నవ్యాహినిగా యున్నచో తరువాత నున్ను సినీవాలిని గ్రహింతవలయును. అమావాస్య అత్యంతవృద్ధిగా నున్నచో భాతవిద్ధను పరిత్యజించవలయును. పితృకర్మలో అపరాహ్ణ వ్యాపినియగు కుహూను స్వీకరించవలయును. రెండవ దినమున వృద్ధియైనచో భూతవిద్ధను విడువలయును. రెండల దినము పరాహ్ణావ్యాపిని అయినచో కుబూ ను గ్రహించవలయనని పండితిలి చెప్పెదరు. రెండు మధ్యాహ్నములలో అమావాస్య వాయ్పించియున్నచో యథేష్ఠముగా మొదటి దానిని కాని రెండవ దానిని కాని స్వీకరించవచ్చును. ఇక ఇపుడు సంపూర్ణ పర్వలో అన్వాధానమును (పితృయజ్ఞము) చెప్పెదను. ప్రతిపద్దినమున యాగమును చేయవలయును. పర్వలోని నాలగల అంశము ప్రతిపత్తులోని మొదటిమూడు ఘటికలు ప్రశస్తములు ఈ సమయమే యాగకాలమని తెలియవలయునని పండితులు నిర్ణయించిరి. అమావాస్య కాని పూర్ణిమ కాని రెండు మధ్యాహ్నములలో ఉండెనేని సద్యఃకాలముగా గ్రహించవలయును. పూర్వద్వయమైనచో పరసంగమున్న రెండవదినమునే గ్రహించవలయును. తిథిక్షయమున్నచో సద్యఃకాలముగా రెండవదినమే అగును. దశమీ విద్ధకాని ఏకాదశీనే అందరూ గ్రహించవలయును. దశమీ విద్దయగు ఏకాదశి జన్మత్రయ సంచితమగు పుణ్యమును నశింపచేయును. ద్వాదసీ తిథియందు ఏకాదశి కలామాత్రముగా నున్ననూ, త్రయోదశీ తిథిలో ద్వాదసి కలామాత్రమున్ననూ అది చాలా శ్రేష్ఠము. శుద్ధమైన సంపూర్ణైకాదశి ద్వాదశి తిథియందు కూజా ప్రతీతియగుచో, రాత్రి చివర త్రయోదసీ ప్రతీతయున్నచో అచటమొదటి దానిని గృహస్థులు, రెండవ దానిని యతులు స్వీకరించవలయును. గృహస్థులు ఫలసిధ్దిని యతులు మోక్షమును కోరెదరు కదా! ద్వాదశీ తిథిని కలామాత్రము కూజా పారాణాకాలము లబించినచో దశమీ విద్ధయగు ఏకాదశి అయిననూ ఉవపసించవలయును. శుక్లపక్షమున కాని కృష్ణపక్షమున కాని కృష్ణపక్షమున కాని ఏకాదశీ ద్వయము వచ్చినచో గృహస్థులు మొదటి దానిని, యతులు రెండవదానిని గ్రహించవలయును దశమీ సంయుతమగు ఏకాదశి ద్వాదశీ తిథిని కూడా కొంచెమున్నచో దిక్షయమున అందరూ రెండవ దానినే స్వీకరించవలయును. రెండవదినమున ద్వాదశి లేనిచో దశమీ విద్ధ అయిననూ ఏకాదశిని గ్రహించవలయును. రెండవదినమున ద్వాదశియున్నచో విద్ధలేకున్ననూ మొదటి ఏకాదశిని విడువలయును. ఏకాదశి ద్వాదశి రాత్రి శేషముగా త్రయోదశి ఉన్నచో ద్వాదశీ తిథిన ఉపవాసముండి త్రయోదశిన పారాణ చేయవలయును. ద్వాదశీ దినమున కలామాత్రము ఏకాదశియున్నను, త్రయోదశిన ద్వాదసియున్ననూ లేకున్ననూ దశమీ విద్ధయగు ఏకాదశిని గృహస్థులు, యతులు రెండవదానినే స్వీకరించవలయును. సంపూర్ణైకాదసి ద్వాదశినాడే మాత్రములేక, త్రయోదశిన ద్వాదసి కొంచమున్నచో మొదటి దానిని గృహస్థులు రెండవదానినన యతులు స్వీకరించవలయును. రెండవదినముననే ఉపసించవలయునని కొందరి మతము, ఏకాదశీ దశమీ విద్ధఅయి ద్వాదసిన ప్రతీతికానిచో, ద్వాదశీ తిథి త్రయోదశిన వ్యాపించియున్నచో అచటనే వ్రతమునుచేయవలయునని మరకొందరి మతము. శుద్ధ ద్వాదసీ తిథిననే అందరూ ఉపవసించవలయునని సిద్ధాంతము. కొందరు మొదటి దినముననే ఆచరించవలయునందురు కానిఅది సమంజసము కాదు. 21-54 సంక్రాంతౌ రవివాగే చ పాతగ్రహణయోస్తథా, పారణం చోపవాసం చ న కుర్వాత్పుత్రవాన్గహీ. 55 అర్కేహ్ని పర్వరాత్రౌ చ చతుర్దశ్యష్ట మీదివా ఏకాదశ్యామహోరాత్రం భుక్త్వా చాంద్రాయణం చరేత్. 56 ఆదిత్యగ్రహమే ప్రాప్తే పపూర్వయామత్రయే తథా నాద్యాద్వై యది భుంజీత సురాపేన సమో భ##వేత్. 57 అన్వాధానేష్టిమద్యే తు గ్రహణ చంద్రసూర్య¸°ః, ప్రాయశ్చిత్తం మునిశ్రేష్ఠ కర్తవ్యం తత్ర యాజ్ఞికైః. 58 చంద్రోపరాగే జుహుయాత్ దశ##మే సోమ ఇత్యృచా ఆప్యాయస్వ ఋచా చైవ సోమపాస్త ఇతి ద్విజ. 59 సూర్యోపరాగే జుహుయాదుదుత్యం జాతవేదసమ్ ఆసత్యేనోద్వయం చైవ త్రయో మంత్రాః ఉదాహృతాః. 60 ఏవం తిథిం వినిశ్చిత్య స్మృతిమార్గేణ పండితః, యః కరోతి వ్రతాదీని తస్య స్యాదక్షయం ఫలమ్. 61 వేదప్రణిహితో ధర్మోధర్మైస్తుష్యతి కేశవః, తస్మాద్ధర్మపరా యాంతి తద్విష్ణోః పరమం పదమ్. 62 ధర్మాన్యే కర్తుమిచ్ఛంతి తే వై కృష్ణస్వరూపిణః, తస్మాత్తాంస్తు భవవ్యాధిః కదాతిన్నైవ బాధతే. 63 ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమ పాదే తిథ్యాదినిర్ణయో నామ ఏకోనత్రింశో೭ధ్యాయః సంక్రమణమున ఆదివారమున వ్యతీపాత్తున గ్రహణకాలమున పుత్రవంతుడగు గృహస్థుడు పారణమును కాని వుపవాసమును కాని చేయరాదు. అమావాస్యనాడు పగలు పూర్ణిమారాతిన చతుర్దశీ అష్టములలో పగలు, ఏకాదశి పగలు రాత్రులు భుజించెనేని చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. సూర్యగ్రహణము ప్రాప్తించునపుడు ముందుగా మూడు ఝూములు భుజించరాదు. భుజించెనేని సురాపానసమపాపము కలుగును. అన్వాధానయోగ మధ్యకాలమున చంద్రసూర్యగ్రహమము వచ్చినచో యాజ్ఞికులు ప్రాయశ్చిత్తమును చేయవలయును. చంద్రగ్రహమసమయమున 'దశ##మే సోమ 'అను ఋక్కుచే యాగమును చేయవలయును. 'ఆప్యాయస్వ 'అను ఋక్కుచే 'సోమపాస్త' అను మంత్రముచే చేయవలయును. సూర్యగ్రహణకాలము "ఉదుత్యం జాతవేదసం" "ఆసత్యేన "అను మంత్రములచే హోమమును చేయవలయును. ఇట్లు పండితులు స్మృతిమార్మముచే తిథిని నిస్చయించి వ్రతాదులనాచరించినచో అక్షయఫలము లభించును. ధర్మము వేదప్రణిహితము. ధర్మముచే శ్రీహరిని సంతోషించును. కావున దర్మపరులు శ్రీవిష్ణువుయొక్క పరమపదమును చేరదరు. ధర్మమునాచరించదలచులారు సాక్షాత్తు శ్రీకృష్ణస్వరూపులు. కావున ధర్మాచారపరులను సంసారవ్యాధి తాకజాలదు. 55-63 ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున తిథ్యాధినిర్ణయమను ఇరువదితొమ్మిదవ అధ్యాయము సమాప్తము.