Sri Naradapuranam-I
Chapters
Last Page
త్రింశో೭ధ్యాయః ముప్పదియవ అధ్యాయము ప్రాశ్చిత్తవిధిః సనక ఉవాచ:- ప్రాయశ్చిత్తవిధిం వక్ష్యే శృణు నారద సాంప్రతమ్, ప్రాయశ్చిత్తవిశుద్ధాత్మా సర్వకామఫలం లభేత్. 1 ప్రాయశ్చిత్తవిహీస్తు యత్కర్మ క్రియతే మునే, తత్సర్వం నిష్ఫలం ప్రోక్తం రాక్షసైః పరిసేవితమ్. 2 కామక్రోధవిహీనైస్చ ధర్మసాస్రవిశారదైః, ప్రష్టవ్యా బ్రాహ్మణా ధర్మం సర్వధర్మఫలేచ్చుభిః. 3 ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణపరాఙ్ముఖైః, న నిష్పునన్తి విప్రేన్ద సురాభాండమివాపగాః. 4 బ్రహ్మాహా చ సురాపీ చ స్తేయీ చ గురుతల్పగః, మబాపాతకినస్త్వేతే తత్సంసర్గీ చ పంచమః. 5 యస్తు సంవత్సరం హ్యేతైశ్శయమాసనభోజనైః, సంవసేత్సహా తం విద్యాత్పతితం సర్వకర్మసు. 6 అజ్ఞానాద్బ్రాహ్మణం హత్వా చీరవాసా జటీ భ##వేత్, స్వేనైవ హతవిప్రస్య కపాలమపి ధారయేత్. 7 తదభావే మునిశ్రేష్ఠ కపాలం వాన్యమేన వా, తద్ద్రవ్యం ధ్వజదండే తు ధృత్వా వనచరో భ##వేత్. 8 వన్యాహారో వసేత్తత్ర వారమేకం మితాశనః, సమ్యక్సంధ్యాముపాసీత త్రికాలం స్నానమాచరేత్. 9 అధ్యనాద్యాపనాదీన్వర్జయేత్సంస్మరేద్ధరిమ్, బ్రహ్మచారీ భ##వేన్నిత్యం గంధామాల్యాది వర్జయేత్. 10 తీర్థాననువసేచ్చైవ పుణ్యాంశ్చైవాశ్రమాంస్తథా, యది వన్యైర్న జీవేత గ్రామే భిక్షాం సమాచరేత్. 11 ద్వాదశాబ్దం వ్రతం కుర్యాదేవం హరిపరాయణః, బ్రహ్మహా శుద్ధిమాప్నోతి కర్మార్హశ్చైవ జాయతే. 12 వ్రతమధ్యే మృగైర్వాపి రోగైర్వాపి నిషూదితః, గోనిమిత్తం ద్విజార్థం వా ప్రాణాన్యపి పరిత్యజేత్. 13 యద్వా దద్యాద్ద్విజేన్ద్రాణాం దవానయుతముత్తమమ్, ఏతేష్వనయతమం కృత్వా బ్రహ్మహా శుద్ధిమాప్నుయాత్. 14 దీక్షితం క్షత్త్రియం హత్వా చరేద్ధి బ్రహ్మహవ్రతమ్, అగ్నిప్రవేశనం వాపి మరుత్ప్రపతనం తథా. 15 దీక్షితం బ్రాహ్మణం హత్వా ద్విగుణం వ్రతమాచరేత్ ,ఆచార్యాదివధే చైవ వ్రముక్తం చతుర్గుణమ్. 16 హత్వా తు విప్రమాత్రం చ తరేత్సంవత్సరం వ్రతమ్. ఏవం విప్రస్య గదితః ప్రాయశ్చిత్తవిధిర్ద్విజ. 17 ద్విగుణం క్షత్రియస్యోక్తం త్రిగుణం తు విశస్స్మృతమ్, బ్రాహ్మణం హంతి యశ్శూద్రస్తం ముశల్యం విదుర్భుధాః. 18 రాజ్ఞైవ శిక్షా కర్తవ్యా ఇతి శాస్త్రేషు నిశ్చయ, బ్రాహ్మణీనాం వధే త్వర్ధం పాదస్స్యత్కన్యకావధే. 19 హత్యా త్వనుపనీత్%ాంశ్చ తథా పాదవ్రతం చరేత్, హత్వా చు క్షత్రియం విప్రః షడబ్దం కృచ్ఛ్రమాచరేత్. 20 సంవత్సరత్రయం వైశ్యం శూద్రం హత్వా వత్సరమ్, ధీక్షితస్య స్త్రియం బత్వా బ్రాహ్మణీం చాష్టవత్సరాన్. 21 బ్రాహ్మహత్యావ్రతం కృత్వా శుద్ధో భవతి నిశ్చితమ్, పారయశ్చిత్తం విధానం తు సర్వత్ర మునిసత్తమ. 22 వృద్ధాతురస్త్రీ బాలానామర్ధముక్తం మనీషిభిః. సనకమహర్షి పలికెను:- ఓ నారదా! ఇపుడు ప్రాయశ్చిత్త విధిని చెప్పెదను వినుము. ప్రాయశ్చిత్తముతో శుద్ధిపొందినవాడు సర్వకర్మఫలములను పొందును. ప్రాయశ్చిత్తము నాచరించనివారు చేసిన కర్మలన్నీ నిష్ఫలములై రాక్షసములగును. కామక్రోధములను పరత్యజించినవారు ధర్మశాస్త్రవిశారదులు సర్వధర్మఫలమును పొందగోరినవారు బ్రాహ్మణులను ధర్మమునడిగి తెలుసుకొనవలయును. శ్రీమన్నారాయణునకి పరాఙ్ముఖులై ప్రాయశ్చిత్తము లాచరించిననూ సురాభాండమును నదులు పలిత్రములము చేయలేనచ్లు పవిత్రులను చేయజాలవు. బ్రాహ్మణుని చంపినవాడు, సురాపానము చేసినవాడు, చౌర్యమును చేయువాడు , గురుతల్పగతుడు ఈ నలుగప మహాపాతకులు, వీపరితో కలిసియుండువాడు అయిదవ మహాపాపి. ఈ నలుగురితో కలిసి శయమాసన భోజనాదులతో ఒక సంవత్సరము సలిసున్నావడు సర్వకర్మభ్రష్టుడగును. తెలియక బ్రాహ్మణుని చంపినవాడు నారబట్టలను జటను ధగింతు తాను తంపిన బ్రాహ్ణణుని కపాలమును చేతిలో ధరించవలయును. ఆకపాలము లభించనతో ఇంకొక కపాలమును ధరించవలయును, ధ్వజాగ్రమున కాపలమును ధరించి వనచరుడు కావలయుయను. మితముగా వన్యాహారమును భుజుంచుచు వనములో% ఒక వారము%ుండవలయును. మూడువేళలలో స్నానము చేసి సంధ్యావందనము నాచరించవలయును. గంధమాల్యాది ధారయణమును పరిత్యజించి బ్రహ్మచారి కావలయును. పుణ్యతీర్ధములను పుణ్యాస్రమములను సేవించవలయును. వన్యాహారమనచే జీవించిలేని%డల గ్రామమున భిక్షాటన చేయవలయును.ఇట్లు శ్రీహరిని స్మరించుచు పన్నెండు సంవత్సరములు హబ్రహ్మహత్యా వ్రతము నాచరించవలయును. ఇట్లు చేసినతో బ్రాహ్మణఘూతకుడు శుద్ధిని పొంది సర్వకర్మార్‌ఙుడగును. వ్రతమధ్యమున మృగములచే కాని రోగముచే గాని మరణించిననూ గోరక్షకై ద్విడరక్షకై ప్రాణత్యాగమును చేసిననూ, బ్రాహ్మణులకు పదివేల గోవులను దానము చేసిననూ బ్రహ్మఘాతకుడు శుద్ధిని పొందును. దీక్షితుడగు క్షత్రియును వధించినను బ్రహ్మహత్యావ్రతమును ఆచకరించవలయును. అగ్నిప్రలేశనము కాని వారు ప్రపాతమును కాని చేయవలయును. దీక్షితుడగు బ్రాహ్మణుని చంపినచో రెట్టింపు వ్రతము నాచరించవలయును. ఆచార్యాదివధను జరిపినతో నాలుగింతలు వ్రతమును చేయవలయును. సామాన్య బ్రాహ్మణుని వధించినచో సంవత్సరము వ్రతము నాతరించలయును. ఇది బ్రాహ్మణునకు చెప్పబడిన ప్రాయశ్చిత్త విధి. క్షత్రియునకు రెట్టింపు,వైశ్యునకు మూడింతలు ప్రాయ శ్చిత్త ము జరుపబడును. బ్రాహ్మణుని వధించిన శూద్రుని ముశల్యుడందురు. అట్టివానికే రాజే శిక్ష విధించవలయునని శాస్త్రనిర్ణయము. బ్రాహ్మణ స్త్రీని వధించినచో సగము ప్రాయశ్చిత్తమును, బ్రాహ్మణ పాదప్రాయశ్చిత్తము నాచరించవలయును. వైశ్యుని చంపినచో మూడ సంవత్సరములు , శూద్రుని వధించినచో ఒక సంవత్సరము కృచ్ఛ్రవ్రతము నాచరించవలయును. దీక్షితులు బ్రాహ్మణుని భార్యను వధించినచో ఎనిమిది సంవత్సరములు కృచ్ఛ్రవ్రతము నాచరించవలయును. లేదా బ్రహ్మహత్యావ్రతమును చేసి నిశ్చయముగా శుద్ధిని పొందును. వృద్ధులకు రోగార్తులకు, స్త్రీలు , బాలురకు అర్థప్రాయశ్చిత్తము విధించబడినది. 1-22 గౌడీ పైష్టీ చ మాధ్వీ చ విజ్ఞేయా త్రివిధా సురా చైతుర్వర్ణైరపేయా స్యాత్తథా స్త్రీభిశ్చ నారద !23 క్షీరం ఘృతం వా గోమూత్రమేతేష్వన్యతమం మునే స్నాత్వార్ద్రవాలా నియతో నారాయణమనుస్మరన్. 24 పక్వాయసనిభం కృత్వా పిబేచ్చైవోదకం తతః తత్తు హేన పాత్రేణ హ్యాయసేనాథవా పిబేత్ 25 తామ్రేణ వాథపాత్రేణ తత్పీత్వా మరణం వ్రజేత్. సురాపీ శుద్ధిమాప్నోతి నాన్యథా శుద్ధిరిష్యతే. 26 ఆజ్ఞానాదాత్మబుద్ధ్యా తు సురాం పీత్వా ద్విజశ్చరేత్ బ్రహ్మహత్యావ్రతం సమ్యక్తచ్చిహ్నపరివర్జితః. 27 యది రోగనివృత్త్యర్థం ఔషధార్థం సురాం పిబేత్ తస్యోపనయనం భూయస్తతా చాంద్రాయణద్వయమ్. 28 సురాసంస్పృష్టపాత్రం తు సురాభాండోదకం తథా సురాపానసమం ప్రాహుస్తథా తంద్రస్య భక్షణమ్. 29 తాలం చ పానసం చైవ ద్రాక్షం ఖార్జూరసంభవమ్ మాధూకశైలమారిష్టం మైరేయం కాలికేరజమ్. 30 గౌడీ మాధ్వీ సురా మద్యమేవమేకాదస్మృతా ః ఏతేష్వన్యతమం విప్రో న పిబేధ్వై కదాచన 31 ఏతేష్వన్యతమం యస్తు పిబేదజ్ఞానతో ద్విజః సప్యానయనం భూయస్తప్తకృచ్ఛం చరేత్తథా. 32 గుడముచే చేయబడినది , పిష్టముచే చేయబడినది, ఇప్పపూవుచే చేయబడినది. అను సురా మూడు విధములు ఇట్టి సురను చాతుర్వర్ణ్వముల వారు స్త్రీలు ఎవ్వరూ పానము చేయరాదు. ఒకవేళ పానము చేసినచో స్నానముచేసి తడి బట్టలను ధరించి నియమముతో నారాయణ నామమును స్మరించి పాలను కాని, నేతిని కాని గోమూత్రమును కాని కాచిన ఉక్కువలె కాచి త్రాగి తరువాత నీరు త్రాగవలమును. లోహపాత్రతో కాని ఇనుముపాత్రతోకాని రాగి పాత్రతో కాని త్రాగవలయును. అట్లు త్రాగినచో మరణించును. సురాపానము చేసినవాడు మరణముతో శుద్ధిపొందును. మరియొక మార్గము లేదు. తెలియక కాని తెలిసి కాని ద్విజుడు సురాపానము చేసిననచో ప్రాయశ్చిత్తము నాచరించవలయును. చిహ్నములను మాత్రమే ధరించక బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. రోగ నివృత్తికి ఔషధముగా సురాపానము చేసినచో అతనికి మరల ఉపనయనము చేయవలయును. అట్లే రెండు చాంద్రాయణ వ్రతముల నాచరించవలయును. సుర తాకిన పాత్రను , సురాభాండముతో జలము సేవించిననూ సురాపానముతో సమానమే, తాలము, పానసము, ద్రాక్ష, ఖర్జూరము, మాధూకము, శైలమారిష్టము, మైరేయం, నాలికేరజము, గౌడి మాధ్వీ, సుర అని మధ్యము పదకొండు విధములు . వీటిలో దేనినీ విప్రుడు సేవించరాదు. ఒకవేళ సేవించినచో మరల ఉపనయనము చేసి తప్తకృచ్ఛ్ర వ్రతము నాచరించవలయును. 23-32 సమక్షం వా పరోక్షం వా బలాచ్చౌర్యేణ వా తథా. 33 పరస్వానాముపాదానం స్తేయమిత్యుచ్యతే బుధైః, సువర్ణస్య ప్రమాణం తు మన్వాద్యైః పరిభషితమ్. 34 వక్ష్యేశృణుష్వ విప్రేన్ద్ర ప్రాయశ్చిత్తోక్తిసాధనమ్, గవాక్షగతమార్తాండశ్మిమధ్యే ప్రదృశ్యతే. 35 త్రసరేణు ప్రమాణం తు రజ ఇత్యుచ్యతే బుధైః, త్రసరేణ్వష్టకం నిష్కస్తత్త్రయం రాజసర్షపః. 36 గౌరసర్షపస్తత్త్రయం స్యాత్తత్షట్కం యవ ఉచ్యతే . యవత్రయం కృష్ణలస్సాన్మాషస్తత్పంచకం స్మృతః. 37 మాషషోడశమానం స్యాత్సువర్ణమితి నారద, హృత్వా బ్రహ్మస్వమ్‌జ్ఞానాద్ద్వాదశాబ్దం తు పూర్వవత్. 38 కపాలధ్వజహీనం తు బ్రహ్మహత్యావ్రతం చరేత్, గురూణాం యజ్ఞకర్తృణాం ధర్మిష్ఠానాం తథైవ చ. 39 శ్రోత్రియాణాం ద్విజానాం తు హృత్వా హేమైవమాచరేత్, కృతానుతాపం దేహేహో చ సంపూర్ణే లేపయేత్ ఘృతమ్. 40 కరీషచ్ఛాదితో దగ్దస్సేయ పాపాద్విముచ్యతే, బ్రహ్మస్వం క్షత్రియో హృత్వా పస్చాత్తాపమవాప్య చ. 41 పునన్దదాతి తత్రైవ తద్విధానం శృణుష్వ మే. తత్ర సంతాపనం కృత్వా ద్వాదశాహోపవాసతః. 42 శుద్ధిమాప్నోతి దేవర్షే హ్యాన్యథా పతితో భ##వేత్, రత్నాసనమనుష్య స్త్రీ ధేనుభూమ్యాదికేషు చ. 43 సువర్ణసదృశే ష్వేసు ప్రాయశ్చిత్తార్ధముచ్యతే, త్రసరేణుసమం హేమ హృత్వా కుర్యాత్సమాహితః. 44 ప్రాణాయామద్వయం సమ్యక్ తేన శుద్ధ్యతి మానవః, ప్రాణాయామత్రయం సుర్యాద్ధృత్వా నిష్కప్రమాణకమ్. 45 ప్రాణాయామాశ్చ చత్వారో రాడసర్షపమాత్రకే, గౌరసర్షపమానం తు హృత్వాహేమవిచక్షణః. 46 స్నత్వా త విధివజ్జప్యాద్గాయత్రష్టసహస్రకమ్, యవమాత్రసువర్ణస్య స్తేయాచ్ఛుద్ధో భ##వేద్ద్విజః. 47 ఆసాయం ప్రాతరారభ్య జప్త్యా వై వేదమాతరమ్. హేమకృ,%్‌ణలమాత్రం తు హృత్వా సాంతపనం చరేత్. 48 మాషప్రమాణ హేమ్నస్తు ప్రాయశ్చిత్తం నిద్యతే, గోమూత్రపక్వయవభగ్వర్షేణౖకేన శుద్ధ్యతి. 49 సంపూర్ణస్య సువర్ణస్య స్తేయం కృత్వా మునీశ్వర, బ్రహ్మహత్యావ్రతం కుర్యాద్ద్వాదశాబ్దం సమాహితః. 50 సువర్ణమానాన్న్యునే తు రజతస్తేయ కర్మణి, కుర్యాత్సంతాపనం సమ్యగన్యథా పతితో భ##వేత్. 51 దశనిష్కాంతపర్యంతమూర్ధ్వం నిష్కచతుష్టయాత్, హృత్వా చ రజతం విద్వాన్కుర్యాచ్చాంద్రాయణం మునే. 52 దసాదిశతనిష్కాతం స్తేయీ రజతస్య తు, చాంద్రాయణద్వయం తస్య ప్రోక్తం పాపవిశోధకమ్. 53 శతాదూర్ధ్వం సహస్రాన్తం ప్రోక్తం చాంద్రాయణత్రయమ్, సహస్రాదధికస్తేయ బ్రహ్మహత్యావ్రతం చరేత్. 54 కాంస్యపిత్తలముఖ్యేషు హ్యాయస్కాంతే తథైవ చ, సహస్రనిష్కమానే తు పరాకం పరికీర్తితమ్. 55 ప్రాయశ్చితచం తు రత్నానాం స్తేయే రాజతవత్స్మృతమ్. 56 చూచుచుండగా కాని, చూడకుండా కాని, బలప్రయోగముతో కాని, ఇతరుల వస్తువులను స్వీకరించుట స్తేయమనబడును. సువర్ణప్రమాణము మన్వాదులచే నిశ్చయించబడినది. స్తేయమునకు ప్రాయశ్చిత్త విధానము చెప్పెదను వినుము. గవాక్షమార్గమున ప్రసరించు సూర్య కిరణముల మధ్యన కనపడు సూక్ష్మతమాకారమగు దుమ్ములోని ఒక కణము త్రసరేణు ప్రమాణముగా నిర్ణయించబడినది. ఎనిమిది త్రసరేణువు నిష్కమగును. మూడు నిష్కములు రాజసర్షమగును, మూడు రాజసర్షపములు ఒక గౌరసర్షపమగును. ఆరు గౌరుసర్షములు యవమగును. మూడు నిష్కములు రాజ సర్షమగును. ఆరు గౌరసర్షములు యలమగును. మూడు యవలు కృష్ణలమగును. అయిదు కృష్ణలములు మాషమనబడును. పదునాఱుమాషములు సువర్ణమగును. తెలియక బ్రాహ్మణ ధనమునపహరించినచో పూర్వమువలె పన్నెండు సంవత్సరములు కపాలధ్వజరహితముగా బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. గురవుల, యజ్ఞకర్తల. ధర్మిష్ఠుల శ్రోత్రియుల ద్విజులు బంగారమును హరించినచో నేతిని బాగుగా కాచి శరీరమునిండా లేపనమును చేయవలయును. కరీషములో ఆచ్ఛాదన చేయబడిన దగ్ధుడైనచో స్తేయపాపమునుండి విముక్తుడగును. క్షత్రియుడు బ్రాహ్మణ ధనమును హరించినచో పశ్చాత్తాపమును చెంది మరల వారికే ఇచ్చివేసి పన్నెండు దినములు ఉపవాసముచేసి సాంతాపన వ్రతము నాచరించవలయును. అపుడు ముక్తుడగును. అట్లు చేయనిచో పతితుడగును. రత్నాసన మనుష్య స్త్రీ, భూమి ,ధేనువులు మొదలగునవి సువర్ణసమములు. వీటిని హరించినచో అర్ధప్రాయశ్చిత్తము నాచరించవలయును. త్రసరేణు పరిమితమైన బంగారమును అపహరించినచో సావధానమనస్కుడై రెండుమార్లు ప్రాణాయామము నాచరించవలయును. నిష్కపరిమితమగు బంగారమును హరించిన ప్రాణాయామత్రమయమును, రాజసర్షమాత్రమును హరించిన నాలుగు ప్రాణాయామములను ఆచరించినచో శుద్ధిపొందును. గౌరసర్షపరిమితి బంగారమును హరించినచో స్నానమాచరించి యథావిధిగా ఎనిమిదివేలు గాయత్రీ జపము నాచరించవలయును. యువమాత్రకావచనమునపహరించినచో ప్రాతఃకాలమునుండి సాయంకాలము వఱకు గాత్రీజపము నాచరించి శుద్ధిపొందును. కృష్ణలమాత్ర హేమాపహరణమును గావించినచో సాంతపనవ్రతము నాచరించవలయును. మాషప్రమాణహేమపహారణము గావించినచో ఒక సంవత్సరము గోమూత్రములో పక్వము గావించబడిన యవలను భుజించి శుద్ధినిపొందును. సువర్ణపరిమిత హేమపహరణము గావించినవారు పన్నెండు సంత్సరములు సావధాన మనస్కుడై బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును.సువర్ణపరిమాణము కంటే తక్కువ రజతము నపహరించినచో సాంతపన వ్రతము నాచరించవలయును. లేనిచో పతితుడగును. నాలుగు నిష్కములనుండి పది నిష్కములు వరకు రజతాహరణమును గావించినచో చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. పదినుండి నూరు నిష్కములవరకు రజతమును అపహరించినచో రెండు చాంద్రాయణ వ్రతముల నాచరించి శుద్ధిపొందును. నూరు నుండి వేయి నిష్కముల వరకు రజాతహరణమునకు మూడు చాంద్రాయణ లాచరించవలయును. వేయి నిష్కముల కన్నా అధికము రజతమును అపహరించినచో బ్రహ్మహత్యవ్రతము నాచరించవలయును. కంచు ఇత్తడి అయస్కాతము మొదలగువాటిని వేయి నిష్కముల నపహరించినచో పరాకవ్రతమునాచరించవలయును. రత్నాపహరణమునకు రజతాపహరణములు వలెనే ప్రాయశ్చిత్తము నాచరించవలయును. 33-55 గురుతల్పన్మాతరం గత్వా తత్సపత్నీమథాపి వా, స్వయమేన స్వముష్కం తు ఛింద్యాత్పాపముదీరయన్. 57 హస్తే గృహీత్వా ముష్కం తు గచ్ఛన్వై నైరుతీం దిశమ్, గచ్ఛన్మార్గే సుఖం దుఃఖం న కదాచద్విచారయేత్. 58 అపశ్యన్గచ్ఛతో గచ్ఛేత్ప్రాణాన్తం యస్స శుద్యతి, మరుత్ప్రపతనం వాపి కుర్యాత్పాపముహరన్. 59 స్వపర్ణోత్తమవర్ణస్త్రీగమనే త్వవిచారతః, బ్రహ్మహత్యావ్రతం కుర్యాద్ద్వా దశాబ్దం సమాహితః. 60 అమత్యాభ్యాసతో గచ్ఛేత్సవర్ణాం చోత్తమాం తథా, కారీషవహ్నినా దగ్ధశుద్ధిం యాతి ద్విజోత్తమ. 61 రేతస్సేకాత్పూర్వమేవ నివృత్తో యది మాతరి, బ్రహ్మహత్యావ్రతం కుర్యాద్రేతస్సేకే೭గ్నిదాహనమ్.62 సవర్ణోత్తమవర్ణోత్తు నివృత్తో వీర్యసేచనాత్, బ్రహ్మహత్యావ్రతం కూర్యాన్నవాబ్దాన్ విష్ణుతత్పరః. 63 వైశ్యామాం పితృపత్న్యాం తు షడబ్దం వ్రతమాచరేత్ , గత్వా శూద్రాం గురోర్బార్యాం త్రివర్షం వ్రతమాచరేత్. 64 మాతృష్వసారం పితృపత్న్యాం ఆచార్యభార్యాం శ్వశురస్య పత్నీం, పితృవ్యభార్యమథ మాతులానీం పుత్రీం చ గచ్ఛేద్యది కామముగ్ధః. 65 దినద్వయే బ్రహ్మహత్యావ్రతం కుర్యాద్యథావిధి, ఏకస్మిన్నేన దివసే బహువారం త్రివార్షికమ్. 66 ఏకవారం గతే హ్యబ్దం వ్రతం కృత్వా విశుద్ధ్యతి, దునత్రయే గతే వహ్నిదగ్ధశ్శుద్ధ్యేత నాన్యథా. 67 చాండాలీం పుష్కసీం చైవ స్నుషాం చ భగినీం తథా, మిత్రస్త్రియం శిష్యపత్నీం యస్తు వై కామతో వ్రజేత్. 68 బ్రహ్మహత్యావ్రతం కుర్యాత్సషడబ్దం మునీశ్వర, అకామతో వ్రజేద్యస్తు సో ೭బ్దకృచ్ఛ్రం సమాచరేత్. 69 గురుతల్పగమతులకు ప్రాయశ్చిత్తమును వివరించెను. తెలియక తల్లినిగాని,తల్లి సవతిని గాని సంగమించినచో తాను చేసినపాపమును చెప్పుచు తానే తన వృషణమును ఛేదించుకొనవలయును. చేతితో వృషణమును పట్టుకొని నైరుతీ దిశకు వెళ్ళుచు మార్గమధ్యమున సంభవించు సుఖదుఃఖములను విచారించక ప్రాణము వదలు వరకు చూడకనే వెళ్ళవయును. అపుడు శుద్ధిపొందును. చేసిన పాపమునుచాటుకొనుచు సుడుగాలిలో పడవలయును. విచారించక తన వర్ణముకంటే వర్ణ స్త్రీని సంగమించినచో సావధానమనస్కుడై పన్నెండు సంవత్సరములు బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. విచారించక అభ్యాసముచే పరస్త్రీని కాని ఉత్తమ స్త్రీని కాని సంగమించినచో పిడకనిప్పుతే దగ్ధమై శుద్దిని పొందును. మాతృసంగమున రేతస్సేకము కంటే ముందే నివృత్తుడైనచో బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. సవర్ణస్త్రీవిషయమున ఉత్తమవర్ణస్త్రీవిషయమున రేతస్సేకము గావించకనే నివృత్తుడైనచో విష్ణుతత్పరుడై తొమ్ముదివత్సరములు బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. తండ్రి భార్యయగు వైశ్యస్త్రీ సంగమును గావించినచో ఆరు సంవత్సరములు బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. తండ్రి భార్యగు శూద్రస్త్రీని సంగమించినచో మూడు సంవత్సరములు వ్రతము నాచరించవలయును. పినతల్లిని, మేనత్తను, ఆచార్య భార్యను, మామ భార్యను, పినతండ్రి బార్యను, మేనమాన భార్యను పుత్రికను కామమోహితుడై దినద్వయము సంగమించినచో యథావిధిగా బ్రహ్మహత్యవ్రతము నాచరించవలయును. ఒకే దినమున పలుమార్లు సంగమించినచో మూడువర్షములు బ్రహ్మహత్యవ్రతము నాచరించవలయును. ఒకమారు సంగమించినచో ఒక సంవత్సరము వ్రత ము నాచరించవలయును. మూడు దినములు సంగమించినచో వహ్నిదగ్ధుడైననే శుద్ధిపొందును. చండాలస్త్రీని, పుష్కస స్త్రీని, కోడలును, సోదరిని, మిత్రుని భార్యను, శిష్యుని భార్యను కామముతో సంగమించినచో ఆరుసంవత్సరములు బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. కామము లేకనే సంగమించినచో ఒక సంవత్సరము కృచ్ఛ్రవ్రతము నాచరించవలయును. 56-69 మహాపాతకీ సంపర్గే ప్రాయశ్చిత్తం నిగద్యతే ప్రాయస్చిత్తవిశుద్ధాత్మా సర్వకర్మఫలం లభేత్. 70 యస్య యేన భ##వేత్సంగో బ్రహ్మహాదిచతుర్ష్యపి తత్తద్వ్రతం స నిర్వర్త్య శుద్దిమాప్నోత్యసంశయమ్. 71 ఆజ్ఞానాత్పంచరాత్రం తు సంగమేభిః కరోతి యః కాయకృచ్ఛ్రం చరేత్సమ్యగన్యథా పతితో భ##వేత్. 72 ద్వాదశాహేతు సంసర్గే మహాసాంతపనం స్మృతమ్ సంగం కృత్వార్ధమాసం తు ద్వాదశాముపావసేత్. 73 పరాకో మానసంసర్గే చాంద్రామాసత్రయే స్మృతమ్ కృత్వా సంగం చు షణ్మాసం చరేచ్చాంద్రాయణద్వయమ్. 74 కించిన్న్యూనాబ్దసంగే చు షణ్మాసవ్రతమాచరేత్ ఏతచ్ఛ త్రిగుణం ప్రోక్తం జ్ఞానాత్సంగే యథాక్రమమ్. 75 మండూకం నకులం కాకం వరాహం మూషకం తతా మార్జారాజావికం శ్వాసం హత్యా కుక్కుటకం తథా. 76 కృచ్ఛ్రార్ధమాచరేద్విప్రోతికృచ్ఛ్రం చాశ్వహా చరేత్ తప్తకృచ్ఛ్రం కరివథే పరాకం గోవధే స్మృతమ్. 77 కామతో గోవధం నైవ శుద్ధిర్దృష్టా మనీషిభిః పానశయ్యాసనాద్యేషు పుష్పమూలఫలేషు చ. 78 భక్ష్యభోజ్యాపహారేషు పంచగవ్యవిశోధనమ్ శుష్కకాష్ఠతృణానాం చ ద్రుమాణాం చ గుడస్య చ. 79 చర్మవస్త్రామిషాణాం చ త్రిరాత్రం స్యాదభోజనమ్ టిట్టిభం చక్రవాకం చ హంసం కారండవం తథా. 80 ఉలూకం సారసం చైవ కపోతం జలపాదకమ్ శుకం చాషం బలాకం శిశుమారగం చ కచ్ఛపమ్. 81 ఏతేష్వన్యతమం హత్వా ద్వాదశాహమభోజనమ్ ప్రాజసత్యవ్రతం కుర్వాద్రేతో విణ్మూత్ప భోజనే. 82 చాంద్రాయణత్రయం ప్రోక్తం శూద్రోచ్ఛిష్టస్య భోజనే రజస్వలాం చ చాండాలం మహాపాతకినం తథా. 83 సూతికాం పతితిం చైవ ఉచ్ఛిష్ఠం రజకాదికమ్ స్పృష్ట్వా సచేలం స్నాయీత ఘృతం సంప్రాశ##యేత్తథా. 84 గాయత్రీం చ విశుద్ధాత్మా జపేదష్టశతం ద్విజ ఏతేష్వన్యతమం స్పృష్ట్వా అజ్ఞానాద్యది భోజనే. 85 త్రిరాత్రోపోషణాచ్ఛుధ్యేత్పంగవ్యాశానాద్ద్విజ స్నానదానజపాదౌ చ భోజనాదౌ చ నారద. 86 ఏషామన్యతమస్యాపి శబ్దం యశ్శృణుమాద్వదేత్ ఉద్వమేద్భుక్తమన్నం తత్స్నాత్వా చోపవసేత్తథా. 87 ద్వితీయే೭ హ్ని ఘృతం ప్రాశ్య శుద్దిమాప్నోతి నారద వ్రతాదిమధ్యే యద్యేషాం శృణుయూద్ధివనిమప్యుత 88 అష్టోత్తరసహస్రం తు జదేవ వేదమాతరమ్ పాపానామధికం పాపం ద్విజదైవతనిందనమ్. న దృష్ట్వా న్విష్కృతి స్తస్య సర్వశాస్త్రేషునారద 89 మహాపాతకులతో కలిసియున్నపుడాచరించవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పెదను. ప్రాయశ్చిత్తముచే పరిశుద్ధుడగువాడు సర్వకర్మఫలముల నందగలడు. బ్రహ్మహత్యాదిపాతక చతుష్టయములలో ఏ పాపమునచేసిన వానితో కలిసియున్నవాడు ఆయా పాతకములను నిర్దేశించబడిన ప్రాయశ్చిత్తముల నాచరించి పరిశుద్ధుడగును. ఈ పాతకులలో తెలియక అయిదు దినములు కలిసియున్నచో కాయకృచ్ఛవ్రతమున నాచరించవలయును. లేనిచో పతితుడగును. పన్నెండురోజులు కలిసున్నచో మహాసాంతపన వ్రతము నాచరించవలయును. పదిహేనుదినములు సంసర్గముచేసినచో పన్నెండు రోజులుపవసించవలయును. ఒక మాసము కలిసున్నచో పరాక్రవతమునాచరించవలయును. మూడు మాసములున్నచో చాంద్రాయణవ్రతమ నాచరించవలయును. ఆరునెలలు కలిసున్నచో రెండు చాంద్రాయణముల నాచరించవలయును. కొంచెము తక్కువగా సంవత్సరమున్నచో ఆరుమాసములు వ్రతము నాచరించవలయును. ఇదియే సంసర్గము తెలిసి చేసినచో పైన చెప్పబడిన ప్రాయశ్చిత్తములకు మూడు రెట్లధికముగా నాచరించవలయును. మండూకమును(కప్ప) ముంగిసను, కాకిని, వరాహమును, మూషకమును, మార్జాలమును, మేకను, గొఱ్ఱను కుక్కను, కోడిని చంపినచో అర్ధకృచ్ఛ్రవ్రతము నాచరించవలయును. అశ్వమును వధించిన వారు అతికృచ్ఛ్రవ్రతము నాచరించవలయును. ఏనుగును వధించినచో అప్తకృచ్ఛ్పవ్రతమును గోవధను చేసినవారు పరాకము నాచరించవలయును. తెలిసి కోరి గోవధను చేసినవారు నిష్కృతి విధించబడలేదు. పానశయ్యాసనాదులను పుష్పమూలఫలాదులను భక్ష్య భోజ్యాదులను, నహరించినచో పంచగవ్యసేవనముచే శుద్ధికలుగును. శుష్కకాష్ఠలములను, తృణమును, వృక్షములను, గుడమును, చర్మమును, వస్త్రములను, మాంసమును, అపహరించినచో మూడు దినములు ఉపవసించవలయును. చకోరమును. చక్రవాకమును, హంసను, కారండమును, గుడ్లగూబను, సారసమును, పావురమును, జలపాదమును చిలుకను, పిట్టను, బలాకమును, తోడేలును, తాబేలును, వీటితో దేనిని చంపిననూ పన్నెండు దినములుపవసించవలయును. రేతస్సును, మలమూత్రములను ఆహారముగా తీసుకొనినచో ప్రాజాపత్య వ్రతము నాచరించవలయును. శూద్రోచ్ఛిష్టభోజనము చేసినచో మూడు చాంద్రాయణ వ్రతముల నాచరించవలయును. రజస్వలయగు స్త్రీని, చండాలుని, మహాపాతకుని, ప్రసవించిన స్త్రీని, పతితుని, ఉచ్ఛిష్టమును, రజకాదులను, స్పృశించినచో సచేలముగా స్నానము చేయవలయును. ఘృతప్రాశనము చేయవలయును. స్నానము చేసి పరిశుద్ధుడై ఎనిమిది నూర్లు గాయత్రీ జపమును చేయవలయును. భోజనముచేయుచున్నపుడు తెలియక వీరిలో ఒకరిని స్పృశించినచో మూడు దినములుపవాసమునాచరించి పంచగవ్య ప్రాశము చేయవలయును. స్నానదానజపభోజనాదులలో పైన చెప్పబడిన వారితో ఒకరి శబ్దమును వినిననూ వారితో మాటలాడినను, భుజించిన దానిని వాంతి చేసికొనవలయును. స్నానము చేసి ఉపవసించవలయును. రెండవదినము నేతిని భుజించి శుద్ధిని పొందును. వ్రతాదుల మధ్యన వీరి మాటలను వినినచో ఒక వెయ్యి ఎనిమిది గాయత్రీ జపమునాచరించి శుద్ధిపొందును. అన్ని పాపములలో అధికపాపము ద్విజదైవత నిందనము. ఈ పాపమునకు ఏ శాస్త్రములోను నిష్కృతి చెప్పబడలేదు. 70-89 మహాపాతకతుల్యాని యాని ప్రోక్తాని సూరిభిః. 90 ప్రాయశ్చిత్తం తు తేషాం చ కుర్యాదేవం యథావిధి, ప్రాయశ్చిత్తాని యః కుర్యాన్నారాయణపరాణః. 91 తస్య పాపాని నశ్యంతి హ్యన్యథా పతితో భ##వేత్, యస్తు రాగదినిర్ముక్తో హ్యనుతాపసమన్వితః. 92 సర్వభూతదయా యుక్తో విష్ణుస్మరణతత్పరః, మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకైః. 93 విముక్త ఏవ పాపేభ్యో జ్ఞేయా విష్ణుపరో యతః, నారాయణమనాద్యంతం విశ్వాకారమనావయమ్. 94 యస్తు సంస్మరతే మర్త్య స్సముక్తః పాపకోటిభిః, స్మృతో వా పూజితో వాపి ధ్యాతః ప్రణమితోపి వా. 95 నాశయత్యేవ పాపాని విష్ణుర్హృద్గమనస్సతామ్, సంపర్కాద్యది వా మోహాద్యస్తు పూజయతే హరిమ్. 96 సర్వపాపవినిర్ముక్కస్స ప్రచయాతి హరేః, పదమ్, సకృత్యంస్మరణాద్విష్ణోర్నశ్యంతి క్లేశసచయాః. 97 స్వర్గాది భోగప్రాప్తిస్తు తస్య విప్రానుమీయతే, మానుషస దుర్లభం జన్మ ప్రారప్యతే యైర్మునీశ్వర. 98 తత్రాపి హరిభక్తిస్తు దుర్లభా పరికీర్తితా, తస్మాస్తటిల్లతాలోలం మానుష్యం ప్రాప్య దుర్లభమ్. 99 హరిం సంపూజ్యయేద్భక్త్యా పశుపాశవిమోచనమ్, సర్వేంతరాయా నశ్యంతి మనశ్శుద్ధిస్చ జాయతే. 100 పరం మోక్షం లభేచ్చైవ పూజితే తు జనార్దనే, ధర్మార్ధకామమోక్షఖ్యా), పురుషార్ధాస్సనాతనాః. 101 హరిపూజాపరాణాం తు సిద్ధ్యన్తి నాత్ర సంశయః, పుత్రదారగృహక్షేత్రధనధన్యాభిధావతీమ్. 102 లబ్ధ్వేమాం మానుషీం వృత్తిం రే రే దర్పంతు మాకృధాః, సంత్యజ్ కామం క్రోధం చ లోభం మోహం మదం తథా. 103 పరాపవాదం నిందాం చ భజధ్వం భక్తితో హరిమ్. వ్యాపారాన్సకలాంస్త్యక్త్యా పూజయధ్వం జనార్దనమ్. 104 నికటా ఏవ దృశ్యంతే కృతాంతనగరద్రుమాః, యావన్న యాంతి మరణం న్నాయాతివా జరా. 105 ధీమాన్న కుర్యాద్విశ్వాసం శరీరే ೭స్మిన్వినశ్వరే, 106 నిత్యం సన్నిహితో మృత్యుస్సంపదత్యంతచంచలా, ఆసన్నమరణో దేహస్తస్మాద్దర్పం విముంచత. 107 సంయోగా విప్రయోగాంతా సర్వం చ క్షణభంగురమ్ ,ఏతత్ జ్ఞాత్వా మహాభాగ పూజయస్య జనార్దనమ్. 108 ఆశయా వ్యధతే చైవ మోక్షస్త్వత్యంతదుర్లభః, భక్త్యా యజతి యో విష్ణుం మహాపాతకవానసి. 109 సో೭ పి యాతి పరం స్థానం యత్ర గత్వా న శోచతి , సర్వతీర్థాని యజ్ఞాశ్చ సాంగా వేదాశ్చ సత్తమ. 110 నారాయణార్చన సై#్యతే కలాం నార్హంతి షోడశీమ్, కిం వా వేదైర్మహ చ్ఛాసై#్త్రః కిం వా తీర్ధ నిషేవణౖః. 111 విష్ణుభక్తివిహీనానాం కిం తపోభిర్వ్రతైరపి, 112 యజంతి యే విష్ణుమనన్తమూర్తిం నిరీక్ష్య చాకారగతం వరేణ్యమ్. వేదాంతవేద్యం భవరోగవైద్యం తే యాంతి మర్త్యాః పదమచ్యుతస్య. 113 అనాదిమాత్మానమనన్తశక్తిమాధారభూతం జగతస్సురేడ్యమ్, జ్యోతిస్స్వరూపం పరమచ్యుతాఖ్యం స్మృత్వా సమభ్యేతి నరస్సఖాయమ్. 114 ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమపాదే ప్రాయశ్చిత్తవిధిర్నామ త్రింశో೭ధ్యాయః మహాపాతకతుల్యములుగా జ్ఞానులు పేర్కొన్నవాటికి యథావిధిగా ప్రాయశ్చిత్తముల నాచరించయే తీరవలయును. నారాయణపరాయణుడై ప్రాయశ్చిత్తనుల నాచరించినచో శుద్ధుడగును. లేనియెడల పతితుడగును. రాగాదినిర్ముక్తుడై పశ్చాత్తాప సమన్వితుడై సర్వభూతములయందు దయావంతుడగుచు విష్ముస్మరణ తత్పరుడైనచో మహాపాతకములచే కాని సర్వవిధపాతకములచే కాని కూడియున్ననూ విష్ణుపరుడగుట వలన విముక్తుడగును. అనాకారుడు అనామయుడు అనాద్యంతడుట వలన విముక్తుడగును. అనాకారుడు అనామయుడు అనాద్యంతుడు అగు నారాయణుని స్మరించు మానవుడు పాపకోటులనుండి విముక్తుడగును. శ్రీమన్నారాయణుని స్మరించినను, పూజించినను, ధ్యానించినను, ప్రణామము లాచరించినను శ్రీమహావిష్ణువు హృదయమునుండి పాపకోయులను నశింపచేయును. సంసర్గము వలన కాని మోహము కలన కాని శ్రీహరిని పూజించినచో సర్వపాప వినిర్ముక్తుడై శ్రీహరి పదమును చేరును. శ్రీమహావిష్ణువును ఒకసారి స్మరించినచో క్లేశరాశులు నశించును. స్వర్గాది భోగప్రాప్తి సుకరమగు ను. ఓ మునీశ్వరా ! మానవజన్మయే దుర్లభము. అందులోనూ హరిభక్తి పరమ దుర్లభము. కావున మెరుపువలె చంచలమైన దుర్లబమైన మానవజన్మను పొంది సర్వపాశవిమోచనకరమగు హరిని పూజించిన అన్ని విఘ్నములు నశించును. మనశుద్ధి కలుగును. ఉత్తమమైన మోక్షము లభించును. ధర్మార్ధకామమోక్షములగు సనాతన పురుషార్ధములు హరిపూజాపరులకు సిద్ధించును. పుత్రదారగృహక్షేత్రధనధాన్యముల వెంట పరుగెత్తు మానవజన్మనెత్తి గరివించకుడు. కామక్రోధలోభమోహమున మాత్సర్యములను, పరాపవాదమును నిందనను వదలి భక్తితో శ్రీహరిని సేవించుడు. అన్ని వ్యాపారములను వదలి పెట్టి జనార్దునుని పూజించుడు. యమనగరవృక్షరాజములు సమీపములోనే యున్నవి. జరామరమములు ఇంద్రియవైకల్యము సంభవించకమునుపే శ్రీహరిని అర్చించుడు, నశ్వరమైన ఈ శరీరముపై బుద్ధిమంతుడు విశ్వాసముంచడు. మృత్యువు ఎల్లప్పుడూ సమీపించియే యుండును. సంపదలు మిగుల చంచలములు. దేహమెప్పుడూ మృత్యువునకు దగ్గరలోనే యున్నది. కావున గర్వమును విడువుడు. ప్రతి కలయిక విడిపోవిట కొఱకే, ప్రతిదీ క్షమభంగురమే, ఈ విషయమును తెలిసి జనార్దనుని పూజించుము. ప్రాణి ఆశ##చే బాధలను తెచ్చుకొనును. మోక్షమత్యంత దుర్లభము. మహాపాపియైనను భక్తిచే శ్రీమహావిష్ణువును పూజించినచో తిరిగిరాని పరమపదమును చేరును. సర్వతీర్ధములు యజ్ఞములు సాంగములైన వైదములు నారాయణార్చనలో పదునారవ అంశతో సరిపోవు . విష్ణుభక్తి లేనివారు చేసిన వేదాధ్యయనము, యాగములు, శాస్త్రములు, తీర్ధసేవనము, తపము, వ్రతములు అన్నియూ, నిష్పలములే యగును. వేదాంతవేద్యుడు భవరోగవైద్యుడు అనంతమూర్తి ఆకారమునుదాల్చినవాడు సర్వశ్రేష్ఠుడు అగు శ్రీమహావిష్ణువును ధ్యానించువారు అచ్యుత పదమును చేరెదరు. అనాదియైన ఆత్మ,అనంతశక్తి జగత్తునకు ఆధారభూతుడు, దేవతలచే స్తుతుంచబడువాడు, అట్టి జ్యోతిస్స్వరూపుని అన్నిటికంచే పరుడైన అచ్యుతుని స్మరించిన ఉత్తమసఖుని పొందును. 90-114 ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమ భాగమున ప్రాయశ్చిత్తవిధి యను ముప్పదియవ అధ్యాయము సమాప్తము.