Sri Naradapuranam-I
Chapters
Last Page
త్రయస్త్రింశో೭ ధ్యాయః ముప్పదిమూడవ అధ్యాయము యోగనిరూపణమ్ నారద ఉవాచ:- భగవన్సర్వమాఖ్యాతం యత్పృష్టం విదుషా త్వయా, సంసారపాశబద్ధానాం దుఃఖాని సుబహుని చ 1 అస్య సంసారపాశస్య చేదనం కతమస్స్మృతః, యేనోపాయేన మోక్షస్స్యాత్తన్నే బ్రూహి తపోధన. 2 ప్రాణిభిః కర్మజాలాని క్రియంతే ప్రత్యహం భృశమ్, భుజ్యంతే చ మునిశ్రేష్ఠ తేషాం నాశః కథం భ##వేత్. 3 కర్మణా దేహమాప్నోతి దేహీ కామేన బధ్యతే కామాల్లోభాభి భూతస్స్యల్లోభాత్క్రోధపరాయణః. 4 క్రోధాచ్ఛ ధర్మనాశస్స్యాద్ధర్మ నాసాన్మతిభ్రమః, ప్రమష్టబుద్ధిర్మనుజః పునః పాపం కరోతి చ. 5 తస్మాద్దేహం పాపమూలం పాపకర్మరతం తథా, యథా దేహభ్రమం త్యక్త్వా మోక్షభాక్స్యాత్తథా వద. 6 నారద మహర్షి పలికెను:- పూజ్యుడా! అన్నీ తెలిసిన మీరు నేనడిగిన దానినంతటిని చెప్పితిరి. సంసార పాశబద్ధులైన వారు అనుభవించు పలు దుఃఖములను వివరించితిరి . ఈ సంసారపాశమును ఛేదించునదేది! యే ఉపాయముచే మోక్షము లభించునో అదంతయూ నాకు వివరించుడు. ప్రాణులు ప్రతిదినము తప్పక కర్మలను చేయుచుందురు. అట్లే కర్మఫలములను అనుభవించెదరు కూడా. ఆ కర్మలెట్లు నశించును! కర్మ చేతనే దేహమును పొందును. దేహము గల జీవుడు కామముచే బంధించబడును. కామముచే లోభమును పొందును. లోభముచే కోపము కలుగును. కోపముచే ధర్మము నశించును. ధర్మనాశమునే స్మృతిభ్రంశము కలుగను. స్మృతిభ్రశము వలన మతిభ్రమ కలుగును. మతిభ్రంశను వలన మానవుడు మళ్ళీ పాపమును చేయును. కావున దేహమే పాపమూలము. పాపకర్మరతము. కావున దేహభ్రమమమును వదలి మోక్షమును పొందు ఉపాయమును తెలుపుడు. 1-6 సాధు! సాధు! మహాప్రాజ్ఞ ! మతిస్తే విమలోర్జీతా, యస్మాత్సంసారదుఃఖాన్నో మోక్షోపాయమభీప్ససి. 7 యస్సాజ్ఞయా జగత్సర్వం బ్రహ్మా సృజతి సువ్రత, హరిశ్చ పాలకో రుద్రో నాశకః స హి మోక్షదః. 8 అహమాదివిశేషాంతా జతా యస్య ప్రభావతః, తమ విద్యాన్మోక్షదం విష్ణుం నారాయణమనామయమ్. 9 యస్యాభిన్నమిదం సర్వం యచ్ఛేంగద్యచ్ఛ నేంగతి, తముగ్రమజం దేవం ధ్యాత్వా దుఃఖాత్ప్రముచ్చతే.10 అవికారమజం శుద్ధం స్వప్రకాశం నిరంజనమ్, జ్ఞానరూపం సదానన్దం ప్రాహుర్వై మోక్షసాధనమ్. 11 యస్యావతారరూపిణి బ్రహ్మద్యా దేవతా గణాః, సమర్చయంతి తం విద్యాచ్ఛాశ్వతస్థానదం హరిమ్. 12 జితప్రాణా జితాహారా సదా ద్యానపరాయణాః, హృది పశ్యంతి యం సత్యం తంజానీహి సుఖావహమ్. 13 నిర్గుణో ೭పి గుణాధారో లోకానుగ్రహరూపధృక్, ఆకాశమధ్యగః పూర్ణస్తం ప్రాహుర్మోక్షదం నృణామ్. 14 అధ్యక్షస్సర్వకార్యాణాం దేహినో హృదయే స్థితః, అనూపమో೭ఖిలాదారస్తం దేవం శరణం వ్రజేత్.15 సర్వం సంగృహ్య కల్పాంతే శేతే యస్తు జలే స్వయమ్, తం ప్రాహుర్మోక్షదం విష్ణుం మునయస్తత్త్వదర్శినః. 16 వేదార్ధవిద్భిః కర్మజ్ఞైరిజ్యతే వివిధైర్మఖైః స ఏవ కర్మఫలదో మోక్షదో ೭కామకర్మణామ్. 17 హవ్యకవ్యాదిదానేషు దేవతా పితృరూపధృక్, భుంక్తే య ఈశ్వరోవ్యక్తస్తం పప్రాహుర్మోక్షదం ప్రభుమ్. 18 ధ్యాతః ప్రణమితో వాపి పపూజితో వాపి భక్తితః, దదాతి శాశ్వతం స్థానం తం దయాలుం సమర్పయేత్. 19 ఆధారస్సర్వభూతానానమేకో యః పురుషః పరః, జరామరణనిర్ముక్తో మోక్షదస్సో೭వ్యయో హరిః. 20 సంపూజ్య యస్య పాదాబ్జం దేహినో ೭పి మునీశ్వర, అమృతత్వం భజన్త్యాశు తం విధుః పురుషోత్తమమ్. 21 ఆనన్దమజరం బ్రహ్మ పరంజ్యోతిస్సనాతనమ్, పరాత్పరతరం యచ్చ తద్విష్ణోః పరమం పదమ్. 22 అద్వయం నిర్గుణం నిత్యమద్వితీయమనౌపమమ్, పరిపూర్ణం జ్ఞానమయం విదోర్మోక్షప్పసాధకమ్. 23 ఏవం భూతం పరం వస్తు యోగమార్గవిదానతః, య ఉపాస్తే సదా యోగీ స యాతి పరమం పదమ్. 24 సర్వసంగపరిత్యాగే శమాదిగుణసంయుతః, కామాద్యైర్వర్జితో యోగీ లభ##తే పరమం పదమ్. 25 సనకమహర్షి పలికెను:- ఓ మహాప్రాజ్ఞ! బాగు బాగు. నీ బుద్ధి నిర్మలమైనది. కావుననే సంసారదుఃఖమునుండి మోక్షమునకు ఉపాయమును తెలియగోరుచున్నావు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞచే బ్రహ్మ సృజించుచున్నాడు. విష్ణువు పాలించుచున్నాడు. రుద్రుడు నశింపచేయుచున్నాడు. ఆ శ్రీమన్నారాయణుడే మోక్షము నిచ్చువాడు. అహంకారతత్త్వమునుండి విశేషములవరకు శ్రీమన్నారాయణుని ప్రభావము వలననే కలుగును. కావున అట్టి నిర్వికారుడగు శ్రీమన్నారాయణుడు మాత్రమే మోక్షము నిచ్చువాడు. ఈ ప్రపంచమంతయూ శ్రీమన్నారాయణుని కంటే భిన్నముకాదు. ఈ ప్రపంచము తోచును. తోచకపోవును. అట్టి జరాదిరహితుడు ఉగ్రుడు అగు నారాయణుని ధ్యానించి దుఃఖమునుండి విముక్తుడగును. అవికారుడు, అజుడు, శుద్ధుడు, స్వప్రకాశకుడు, నిరంజనుడు, జ్ఞానరూపుడు, సదానందస్వరూపుడు ఆగు శ్రీమన్నారాయణుడే మోక్షసాధనుడు. శ్రీమన్నారాయణుని అవతార రూపములను బ్రహ్మాది దేవతలు పూజింతురు. ఆ శ్రీమన్నారాయణుడే శాశ్వతస్థానప్రదుడు. జితప్రాణులు, జితాహారులు, సదాధ్యానపరాయణులు, సత్యస్వరూపునిగా సాక్షాత్కరించుకొను శ్రీమన్నారాయణుడు సుఖావహుడని తెలియును. గుణరహితుడయ్యును. గుణాధారుడు, లోకానుగ్రహము కొఱకు రూపమును ధరించువాడు, ఆకాశమద్యగుడు పూర్ణుడు అగు శ్రీమన్నారయణుడే ప్రాణులకు మోక్షమును ప్రసాదించువాడు. సర్వకార్యములకధ్యక్షుడు దేహి హృదయములో నుండువాడు, సాటిలేని వాడు, అఖిలాధారుడు అగు ఆ శ్రీమన్నారాయణుడే మోక్షప్రదుడని తత్త్వదర్శులగు మునులు చెప్పుచుందురు. వేదార్ధమును తెలిసినవారు కర్మజ్ఞులు పలు యజ్ఞములచే శ్రీమహావిష్ణువును పూజింతురు. అతనే కర్మఫలప్రదుడు, మోక్షప్రదుడు. శ్రీమావిష్ణువే హవ్యకవ్యాది దానములలో దేవపితృరూపములను ధరించి భుజించును. ఆ ప్రభువే మోక్షప్రదుడు. శ్రీమన్నారాయణుని భక్తితో ధ్యానించిననూ ప్రసాదించును. కావున ఆ దయాలువును ఆర్చించవలయును. సర్వబూతములకాధారభుతడు ఉత్తమపురుషుడు అగు ఒక్క శ్రీమహావిష్ణువే జరామరణరహితుడు అవ్యయుడు. ఆ విష్ణువే మోక్షప్రదుడు. శ్రీమన్నారాయణుని భక్తితో ధ్యానించిననూ ప్రణామము లాచరించిననూ పూజించిననూ శాశ్వతమగు మోక్షమును ప్రసాదించును. శ్రీమన్నారాయణుని పాదపద్మములను పూజించి ప్రాణులు కూడా అమృతత్వమును పొందుదురు. కావున ఆ శ్రీహరిని పురుషోత్తముడందురు. శ్రీమహావిష్ణుని పరమపదము ఆనంద స్వరూపము . అజరము . బ్రహ్మస్వరూపము , పరంజ్యోతి, సనాతనము పరములన్నిటికంటే పరతమము. శ్రీమన్నారాణుడు అదజ్వితీయము నిర్గుణము, నిత్యము సాటిలేనిది పరిపూర్ణము జ్ఞానమయము అగు స్వరూపము గలవాడు మోక్షప్రసాదకుడు ఇట్టి పరమోత్కష్టమైన వస్తువైన శ్రీమన్నారాయణుని ఉపాసించి యోగి మాత్రమే పరమపదమును పొందును. అన్ని సంగములను పరిత్యజించి శమాదిగుణసహితుడై కామాదులను వర్జించిన యోగియే పరమపదమును పొందును. 7-25 నారద ఉవాచ:- కర్మణా కేన యోగస్య సిద్ధిర్భవతి యోగనామ్, తదుపాయం యతాతత్త్వం బ్రూహి మే వదతాం వర. 26 నారద మహర్షి పలికెను:- ఓ మహానుభావా! యోగులకు ఏ కర్మనాచరించుటచే యోగసిద్ధి లభించునో ఆ ఉపాయమును ఉన్నదున్నట్టుగా నాకు తెలుపుము. 26 సనక ఉవాచ:- జ్ఞానలభ్యం పరం మోక్షం ప్రాహుస్త్వార్ధచింతకాః, యద్‌జ్ఞానేం భక్తిమూలం చ భక్తిః కర్మవతా తథా. 27 దానాని యజ్ఞా వివిధాస్తీర్థయాత్రాదయః వృతా, యేన జన్మసహస్రేషు తస్య భక్తిర్భద్ధరౌ. 28 అక్షయః పరమో ధర్మోభక్తిలేశేన జాయతే, శ్రద్ధయా పరయా చైవ సర్వ పాపం ప్రణశ్యతి. 29 సర్వపాపేషు నష్టేషు బుద్ధిర్భవతి నిర్మలా, సైవ బుద్ధిస్సమాఖ్యాతా జ్ఞానశ##బ్దేన సూరిభిః. 30 జ్ఞానం చ మోక్షదం ప్రాహుస్తజ్ జ్ఞానం యోగినాం, భ##వేత్, యోగస్తు ద్వివిధః ప్రోక్తః కర్మజ్ఞానం ప్రభేదతః. 31 క్రియాయోగం వినా నృణాం జ్ఞానయోగో న సిధ్యతి, క్రియాయోగరతస్తస్మాచ్ఛ్రద్ధయా హరిమర్చయేత్. 32 ద్విజభూమ్యగ్నిసూర్యాంబుధాతాతుహృచ్చిత్రసంజ్ఞితాః, ప్రతిమాః కేశవసై#్యతాః పూజయేత్తా ను భక్తితః. 33 కర్మణా మనసా వాచా పరపీడాపరాఙ్ముఖః, తస్మాత్సర్వగతం విష్ణుం పూజయేద్భక్తి సంయుతః. 34 అహింసాసత్యమక్రోధో బ్రహ్మచర్యాపరిగ్రహౌ, ఆనిర్ష్యా చ దయా చైవ యోగయోరుభయోస్సమాః. 35 చరాచరాతమకం విశ్వం విష్ణురేవ సనాతనః, ఇతి నిశ్చిత్య మనసా యోగద్వితయమబ్యసేత్. 36 ఆత్మవత్సర్వభూతాని యే మన్యంతే మనీషిణః, తే జానన్తి పరం భావం దేవదేవస్య చక్రిణః. 37 యది క్రోదాదిదుష్టాత్మా పూజాధ్యానపరో భ##వేత్, న తస్య తుష్యతే విష్ణుర్యతో ధర్మపతిస్స్మృతః. 38 యది కామాదిదుష్టాత్మా దేవపూజాపరో భ##వేత్, దంభాచారస్స విజ్ఞేయస్సర్వపాతకిభిస్సమః. 39 తపః పూజాధ్యానపరో యస్త్వసూయారతో భవత్, తత్తపస్యా చ పూజా చ తద్ధ్యానం హి నిరర్ధకమ్. 40 తస్మాత్సరాత్మకం విష్ణుం శమాదిగుణతత్పరః, ముక్త్యర్ధమర్చయేత్సమ్యక్క్రియాయోగపరోనరః. 41 కర్మణా మనసా వాచా సర్వలోక హితే రతః, సమర్చయంతి దేవేశం క్రియాయోదస్స ఉచ్యతే. 42 నారాయణం జగద్యోనిం సర్వాంతర్యామిణం హరిమ్. స్తోత్రాద్యైస్సౌతి యో విష్ణుం కర్మయోగీ స ఉచ్యతే. 43 ఉపవాసాదిశ్ఛైవ పురాణశ్రవణాదిభిః, పుష్పాద్యైశ్చార్చనం విష్ణోః క్రియాయోగ ఉతాహృతః. 44 ఏవం భక్తిమతాం విష్ణౌ క్రియాయోగరతాత్మనామ్. సర్వపాపాని నశ్యంతి పూర్వజన్మార్జితాని వై. 45 పాపక్షయాచ్ఛుద్ధమతిర్వాంఛతి జ్ఞానముత్తమమ్, జ్ఞానం హి మోక్షదం జ్ఞేయం తదుపాం వదామి తే. 46 సనక మహర్షి పలికెను:- జ్ఞానము వలన లభించనది మోక్షము , తత్త్వార్ధ చితకులు చెప్పెదరు. ఆ జ్ఞాన ము భక్తిమూలము, భక్తి కర్మపరులకే సిద్ధించును. కొన్నివేల జన్మల దానములను యజ్ఞములను పలువిధములైన తీర్థయాత్రాదులను చేసినవారికి శ్రీహరియందు భక్తి కలుగును. కొంచెము భక్తిచే అక్షయ మగు పరమధర్మము సిద్ధించును. ఉత్తమమైన శ్రద్ధచే అన్ని పాపములు నశించును. అన్ని పాపములను నశించునచో బుద్ధి నిర్మలమగు ను. ఆ నికర్మల బుద్ధినే జ్ఞానమని జ్ఞానులు చెప్పిరి. ఆ జ్ఞానమే మోక్షమునిచ్చును. ఆ జ్ఞానము యోగులకు మాత్రమే కలుగును. కర్మయోగములు జ్ఞానయోగము అని యోగము రెండు విధములుండును. కర్మయోగము లేనిచో జ్ఞానయోగము సిద్ధించదు. కావున క్రియాయోగరతుడై మానవుడు శ్రద్ధతో శ్రీహరిని అర్చించవలయును. బ్రాహ్మణులు, భుమి, అగ్ని, జలము, సూర్యుడు, దాతువులు, హృదయము, చిత్రము ఇవియన్నియు కేశవుని స్వరూపమే. కావున ఈ ప్రతీకలలో శ్రీహరిని భక్తిచే పూజించవలయును. మనోవాక్కాయములచే పరపీడనము చేయక సర్వగతుడైన శ్రీమహావిష్ణువును భక్తిచే పూజించవలయును. అహింస, సత్యము, అక్రోధము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈర్షలేకపోవుట దయ అను నవి కర్మజ్ఞానయోగములలో రెండింటిలో సమానముగా నుండదగినవి. చరాచరాత్మకముగు ఈ విశ్వమంతయు శ్రీహరియే అను మనసులో నిశ్చయించి కర్మజ్ఞానయోగములను అభ్యసించవలయును. అన్ని ప్రాణులను తనవలె చూడగలుగు వాడే దేవదేవుడు శ్రీహరియొక్క పరతత్త్వ స్వరూపమును చూడగలరు. క్రోధాదులతో చెడిన మనసుకలవాడు శ్రీహరిని పూజాధ్యానముతో సేవించినను ధర్మప్రభువైన విష్ణువు అతనికి ప్రసన్నుడు కాజాలడు. కామాదులచే చెడిన మనసుకలవైడు దేవపూజాపరుడైనను అదియంతయు దంభాచారమని అతను పాతకులందరితో సముడని తెలియువలయును. తపస్సును పూజాధ్యానములు నిరర్ధకములగును. కావున కర్మయోగము నాచరించు నరుడు శమాదమాదిగుణములు కలవాడై సర్వాత్మకుడగు శ్రీమహావిష్ణువును మోక్షముకొఱకు అర్చించవలయును. మనోవాక్కర్మలచే సర్వలోకములు హితమును కోరుచు శ్రీహరిని పూజించుటయే క్రియా యోగమనబడును. సర్వాతర్యామి, జగత్కారణుడు, సర్వదోషకారియగు శ్రీమన్నారముని స్తోత్రాదులచే స్తుతుంచుయటయే కర్మయోగమనబడును. ఉపవాసాదులచే పురాణశ్రవణాలచే పుష్పాదులచే శ్రీమహావిష్ణువు నర్పించుటయే క్రియాయోగములనబడును. ఇట్లు భక్తి గలిగి క్రియాయోగపరులైన వారికి పూర్వజన్మలో సంపాదించిన పాపములన్నియు నశించును. పాపములు నశించుట వలన శుద్ధమతి అయి ఉత్తమ జ్ఞానమును అభిలషించును. ఈ జ్ఞానమే మోక్షము నిచ్చును. ఆ జ్ఞానమును సంపాదించు ఉపాయమును నీకు చెప్పెదను. 27-46 చరాచరాత్మకే లోకే నిత్యం చానిత్యమేవ చ, సమ్యగ్విచారయేద్ధీయాన్సద్భిశ్శాస్త్రార్థౌహకోవిదైః. 47 అనిత్యాస్తు పదార్ధా వై నిత్యమేకో హరిస్స్మృతః, అనిత్యాని పరిత్యజ్య నిత్యమేవ సమాశ్రయేత్. 48 ఇహాముత్ర చ భోగేషు విరక్తశ్చ తథా భ##వేత్, అవిరక్తో భ##వేద్యస్తు స సంసారే ప్రవర్తతే. 49 అనిత్యేషు పదార్ధేషు యస్తు రాగీ భ##వేన్నరః, తస్య సంసారవిచ్ఛత్తిః కదాచిన్నైవ జాయతే. 50 శమాదిగుణసంపన్నో ముముక్షుర్ఞానమభ్యసేత్, శమాదిగుణహీనస్య జ్ఞానం నైవ చ సిద్ధ్యతి. 51 రాగద్వేషవిహీనో యశ్శమాదిగుణసంయుతః, హరిధ్యానపరో నిత్యం ముముక్షుభిధీయతే. 52 చతుర్భిస్సాధనైభిర్విశుద్ధమతిరుచ్యతే సర్వగం భావయేద్విష్ణుం సర్వభూతదయాపరః. 53 క్షరాక్షరాత్మకం విశ్వం వ్యాప్య నారాయస్థ్సితః, ఇతి జానాతి యో విప్రస్తఙ్‌జ్ఞానం యోగజం విదుః. 54 యోగోపాయమతో వక్ష్యే సంసారవినివర్తకమ్, యోగో జ్ఞానం విశుద్ధం స్యాత్తఙ్‌జ్ఞానం మోక్షదం విదుః. 55 ఆత్మానం ద్వివిధం ప్రాహుః పరాపరవిభేదతః, ద్వే బ్రహ్మణీ వేదితవ్యే ఇతి చాధర్వణీ శ్రుతిః. 56 పరస్తు నిర్గుణః ప్రోక్తో హ్యహంకారయుతో ೭పరః , తయోరభేదవిజ్ఞానం యోగ ఉత్యభిధీయతే. 57 పంచభుతాత్మతకే దేహి యస్సాక్షీ హృదయే స్థితః అపరః ప్రోచ్యతే సద్భిః పరమాత్మా పరస్స్మృతః. 58 శరీరం క్షేత్రమిత్యాహుస్తత్థ్సః క్షేత్రజ్ఞ ఉచ్యతే ,ఆవ్యక్తః పరమశ్శుద్ధః పరిపూర్ణ ఉదాహృతః. 59 యదాత్వభేదవిజ్ఞానం జీవాత్మపరమాత్మనోః భ##వేత్తదా మునిశ్రేష్ఠో పాశ##చ్ఛేద్యా పరమాత్మనః. 60 ఏకశుద్ధో೭క్షరో నిత్యంః పరమాత్మా జగన్మయః, నృణాం విజ్ఞానభేధేన యత్పరం బ్రహ్మ సనాతనమ్. 61 ఏకమేవాద్వితీయ్ యత్పరం బ్రహ్మ సనాతనమ్. గీయమానం చ వేదాంతైస్తస్మాన్నాపి పరం ద్విజ. 62 న తస్య కర్మ వా రూపం వర్ణమాథాపి వా, కర్తృత్వం వాపి భోక్తృత్వం నిర్గుణస్స పరాత్మనః. 63 నిదానం సర్వహేతునాం తేజో యత్తేజసాం పరమ్, కిమప్యన్యద్యతో నాస్తి తఙ్‌జ్ఞేయం ముక్తిహేతవ్. 64 శబ్దబ్రహ్మమయం యత్తన్మహావాక్యదికం ద్విజ, తద్విచారోద్భవవిహీనానాం దృశ్యతే వివిధం జగత్. 65 సమ్యగ్ జ్ఞానవిహీనానాం దృశ్యతే వివిధం జగత్, పరమజ్ఞానినామేతత్పరబ్రహ్మాత్మకం ద్విజ. 66 ఏక ఏవ పరానన్దో నిర్గుణః పరతః పరః, భాతి విజ్ఞానభేదేన బహురూపధరో೭వ్యయః. 67 మాయినో మాయయా భేదం పస్యన్తి పరమాత్మని, తస్మాన్మాయాం త్యజేద్యోగాన్ముముక్షుర్ద్విజ సత్తమ. 68 నాసద్రూపా న సద్రూపా మాయా నౌవోభయాత్మకా, అనిర్వాచ్యా తతో జ్ఞేయా భేదబుద్ధిప్రదాయినీ. 69 మాయైవాజ్ఞానశ##బ్దేన బుద్ధ్యతే మునిసత్తమ, తస్మాదజ్ఞానవిచ్ఛేదో భ##వేద్వై జితమాయినామ్. 70 éసనాతనం పరంబ్రహ్మ జ్ఞానశ##బ్దేన కథ్యతే, జ్ఞానినాం పరమాత్మా వై హృది భాతి నిరంతరమ్. 71 చరాచరాత్మకమగు ఈ ప్రపంచమున శాస్త్రార్ధకోవిదులగు సజ్జనులతో నిత్యానిత్యముల విషయమున చక్కగా విచారణ చేయవలయును. పదార్ధములనిత్యములు శ్రీహరి ఒక్కడే నిత్యుడు. అనిత్యమును విడిచి నిత్యమునే ఆశ్రయించవలయును. ఇహపరలోకములందలి భోగముల విషయమున విరక్తుడు కావలయును. విరక్తుడు కానివాడు సంసారమున ప్రవర్తించును. అనిత్యపదార్దములందు రాగమును పెంచుకొన్నవానికి ఎపుడూ సంసారవిచ్ఛిత్తి జరుగదు. మోక్షమును కోరువాడు శమాదిగుణసంపన్నుడై జ్ఞానమునభ్యసించవలయును. శమాదిగుణహీనునకు జ్ఞానము కలుగదు. రాగద్వేషవిహీనుడై శమాదిగుణయుతుడై నిత్యము హరిధ్యానపరుడైన వాని ని ముముక్షువందురు. ఈ నాలుగు సాధనములచే విశుద్ధమతి యగును. సర్వభూతదయాపరుడై విష్ణువును సర్వగతునిగా భావించవలయును. క్షరాక్షరాత్మమగు ఈ ప్రపంచమునంతటిని నారాయణుడు వ్యాపించియుండును. అని తెలిసిన విప్రునికి కలుగు జ్ఞానము యోగము వలన కలుగును అని తెలియును కావున ఇపుడు సంసార నివర్తకమగు యోగోపాయమును చెప్పెదను. యోగజ్ఞానము విశుద్ధమగును. ఆ జ్ఞానమే మోక్షమును ప్రసాదించును. పరమ అపరము అను భేదముతో ఆత్మ రెండు విధములందురు. రెండును బ్రహ్మలే అని అధర్వశ్రుతి . పరుడు నిర్గుణుడు, అపరుడు అహంకారయుతుడు. ఈ రెండు అభిన్నములని తెలియుటే యోగమని చెప్పబడినది. పంచభూతాత్మకమగు దేహమున సాక్షిగా హృదయమున నున్నవాడు అపరుడనబడును. పరమాత్మ పరుడనబడును. శరీరము క్షేత్రము అనబడును. శరీరమున నున్నవాడు క్షేత్రజ్ఞుడనబడును. అవ్యక్తుడు పర ముడు శుద్ధుడు పరిపూర్ణుడనబడును. జీవాత్మ పరమాత్మలకు అభేదవిజ్ఞానము కలుగునపుడు జావాత్మకు సంసార పాశ##చ్ఛేదమగును. పరమాత్మ ఒక్కడు, శుద్ధుడు, అక్షరుడు, నిత్యుడు, జగన్మయుడు. నరుల జ్ఞానభేదముచే భేదముగలవానివలె తోచును. సనాతనుడగు పరబ్రహ్మ ఏకము అద్వితీయము. వేదాంతములు పరమాత్మకంచే పరములేదని గానము చేయుచున్నవి. ఆ పరమాత్మకు కర్మ, కార్యము, రూపము, వర్ణము కర్తృత్వము భోక్తృత్వము లేవు. అన్ని తేజస్సుల కంటే పరమైన తేజము అన్ని హేతువులకు నిదానము. దానికంచే మరొకటిలేదని ముక్తిని కోరువారు తెలియవలయును. మహావాక్యాదికము సర్వము శబ్దపరబ్రహ్మముగా తెలియును. ఆ శబ్ద బ్రహ్మమమును విచారించుటచే కలిగిన జ్ఞానమే మోక్షసాధనము. సమ్యక్‌జ్ఞానము లేనివారికి జగత్తు పలువిధములుగా కనిపించును. పరమజ్ఞానులకిదియే జగత్తు పరబ్రహ్మాత్మకముగా కనిపించును. పరబ్రహ్మ ఒక్కడే పరముల కంటే పరుడు నిర్గుణుడు పరానన్దుడు. విజ్ఞానభేదముచే అవ్యయుడు బహురూపధరుడుగా తోచును. మాయచే పరమాత్మలో భేదమును చూచెదరు. కావున ముముక్షువు మాయను త్యజించవలయును. మాయసద్రూపముగాదు అసద్రూపమూ కాదు. ఉభయాత్మకము కాదు. కావున మాయ నిర్వచించవీలులేనిది భేదబుద్ధిప్రదాయిని అని వ్యవహరించబడును. మాయయే అజ్ఞాన శబ్దముచే తెలియబడుచున్నది. మాయను జయించువారికి అజ్ఞానవిచ్ఛేదము కలుగును. సనాతనమగు పరబ్రహ్మ జ్ఞానశబ్దముచే చెప్పబడును. పరమాత్మ జ్ఞానులహృదయమున నిరంతరము భాసించును. 47-71 అజ్ఞానం నాశ##యేద్యోగే మునిసత్తమ! అష్టాందైస్సిద్ధ్యతే యోదస్తాని వక్ష్యామి తత్త్వతః. 72 యమాశ్చ నియామాశ్చైవ ఆసనాని చ సత్తమ, ప్రాణాయామః ప్రత్యాహారో ధారణాధ్యానమేవ చ. 73 సమాధిశ్చ మునిశ్రేష్ఠ యోగాంగాని యథాక్రమమ్, ఏషాం సంక్షేపతో వక్ష్యే లక్షణాని మునీశ్వర. 74 అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ, అక్రోధశ్చానసూయా చ ప్రోక్తం స్సంత్రేపతో యమాః. 75 సర్వాషామేవ భూతానామక్లేశజననం హి యత్, అహింసా కథితా సద్భిర్యోగసిద్ధిప్రదాయినీ. 76 యథార్దకథనం యచ్చ ధర్మధర్మవివేకతః, సత్యం ప్రాహుర్మునిశ్రేష్ఠ అప్తేయం శృణు సాంప్రతమ్. 77 చౌర్యేణ వా బలేనాపి పరస్వహరణం హి యత్, స్తేయమిత్యుచ్యతే సబ్ధిరస్తేయం తద్విపర్యయమ్. 78 సర్వత్ర మైధునత్యాగో బ్రహ్మచర్యం ప్రకీర్తితమ్, బ్రహ్మచర్యపరిత్యాగాఙ్ జ్ఞానవానపి పాతకీ. 79 సర్వసంగపరిత్యాగే మైధునే యస్తు వర్తతే, స చండాలసమో జ్ఞేయంస్సర్వబహిష్కృతః. 80 యస్తు యోగరతో విప్ర విషయేషు స్పృహాన్వితః, తత్సంభాషణమాత్రేణ బ్రహ్మహత్యా భ##వేన్నృణామ్. 81 సర్వసంగపరిత్యాగే పునస్సంగీ భ##వేద్యది, తత్సంగానాం సంగాన్మాహాపాతకదోషభాక్. 82 అనాదానం హి ద్రవ్యాణామాపద్యసి మునీశ్వర, అపరిగ్రహ ఇత్యుక్తో యోగసంసిద్దికారకః. 83 ఆత్మనస్తు సముత్కర్షాదతినిష్ఠురబాషణమ్, క్రోధమాహుర్ధర్మవిదో హ్యక్రోధస్తద్విపర్యయః. 84 ధనాద్యైరధికం దృష్ట్వా భృసం మనసి తాపనమ్, అసూయ కీర్తితా సద్భిస్తత్త్యాగో హ్యనసూయతా. 85 ఏవం సంక్షేపతః యమా విబుధసత్తమ, నియమానపి వక్ష్యామి తుభ్యం తాఞ్చుణు నారద ! 86 ఓ మునిసత్తమా! యోగి యోగముతో అజ్ఞానమును నశింపచేయవలయును. యోగము అష్టాంగములతో సిద్ధించును. ఆ అష్టాంగములను యథార్ధముగా చెప్పెదను. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అను ఎనిమిది యోగాంగములు. ఇక ఇపుడు ఈ ఎనిమిది లక్షణములు సంక్షేపముగా చెప్పెదను. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అక్రోధము, అనసూయ అను ఏడు యమములు. ఏ ప్రాణికీ క్లేశ ము కలిగించకుండుట అహింసయనబడును. ఈ అహింస యోగసిద్ధిని కలిగించును. ధర్మాధర్మ వివేకముతే యతార్ధమును సత్యమందురు. చౌర్యముచేత కాని బలముచేత కాని పరద్రవ్యాపహరణమును స్తేయమందురు. దానికి విపరీతము అస్తేయమని సజ్జనులు చెప్పుచున్నారు. అంతటా మైధునమును పరిత్యజించుట బ్రహ్మచర్యమందురు. బ్రహ్మచర్యమును పరిత్యజించినచో జ్ఞాని కూడా పాతకీ యగును. సర్వసంగపరిత్యాగియైనను స్త్రీ సంగతితో ప్రవర్తించినచో అతను సర్వవర్ణబహిష్కృతుడగు చండాలసముడగును. యోగరతుడైన విప్రుడు విషయస్పృహ కలిగియున్నచో అతనితో సంభాషించినంతనే బ్రహ్మహత్యా పాతకము కలుగును. సర్వసంగపరిత్యాగి మరల సంగి అయినచో అతనితో కలిసియున్న వారితో కలిసిన వారికి మహాపాతకదోషము సంభవించును. ఆపదలో కూడా ద్రవ్యములను స్వీకరించకుండుట యోగసిద్ధిని కలిగించు అపరిగ్రహమందురు. తన ఆదిక్యముచే అతికఠినముగా మాటలాడుటను ధర్మవిదులు క్రోధమందురు. దానికి విపరీతము అక్రోధమనబడును. ఎదుటవాడు ధనాదులతే అధికముగా ఉండుటను చూచి మనసున పరితపించుట అసూయ అనబడును. అసూయను వదలుట అనసూయ అని సజ్జనులు చెప్పెదరు. ఇట్లు సంక్షేపముగా యమములను చెప్పితిని. ఇపుడు నియములను చెప్పెదను. వినుము. 72-86 తపస్స్వాధ్యాయసంతోషాః శౌచం చ హరిపూజనమ్, సంద్యోపాసనముఖ్యాశ్చ నియమాః పరికీర్తితాః. 87 చాంద్రాయణాదిభిర్యత్ర శరీరస్య విశోషణమ్, తపోనిగదితం సద్భిర్యోగసాధనముత్తమమ్. 88 ప్రణవస్యోపనిషదాం ద్వాదశార్ణస్య చ ద్విజ, అష్టాక్షరస్య మంత్రస్య మహావాక్యచయస్య చ. 89 జపః స్వాధ్యాయ ఉదితో యోగసాధనముత్తమమ్, స్వాధ్యాయం యస్త్యజేన్మూఢస్తస్య యోగో న సిద్ద్యతి. 90 యోగం వినాపి స్వాధ్యాయాత్పాపనాశో భ##వేన్నృణామ్, స్వాధ్యాయైస్తోష్యమాణాశ్చ ప్రసీదంతి హి దేవతాః. 91 జపస్తు త్రివిధః ప్రోక్తో వాచికాపాంశుమానసః, త్రివిధే೭ పి చ విప్రేన్ద్ర పూర్వాత్పూర్వతతో వరః. 92 మంత్రస్యోచ్చారణం సమ్యక్ స్ఫుటాక్షరపదం యథా, జపస్తు వాచికః ప్రోక్తస్సర్వయజ్ఞఫలప్రదః 93 మంతస్యోచ్చారణ కించిత్పదాత్పదవివేచనమ్ , స తూపాంశుర్జపః ప్రోక్తః పూర్వస్మాద్ద్విగుణో೭ధికః. 94 విధాయ హ్యక్షరశ్రేణ్యాం తత్తదర్ధవిచారణమ్. స జపో మానసః ప్రోక్తో యోగసిద్ధప్రదాయకః. 95 జపేన దేవతా నిత్యం స్తువతస్సంప్రసీదతి, తస్మాద్స్వాధ్యాయసంపన్నో లబేత్సర్వాన్మనోరథాన్. 96 యదృచ్ఛాలాభసంతుష్టిస్సంతోష ఇతి గీయతే, సంతోషహీనః పురుషో న లబేచ్ఛర్మ కుత్రచిత్. 97 న జాతు కామః కామానాముపబోగేన శామ్యతి, ఇతో೭ధికం కదా లప్స్యేఇతి కామస్తు వర్ధతే. 98 తస్మాత్కామం పరిత్యజ్య దేహసంశోషకారణమ్, యదృచ్ఛాలాభసంతుష్టో భ##వేద్దర్మపారయణః. 99 బాహ్యాభ్యన్తరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్, మృజ్జలాభ్యాం బహిశ్శుద్ధిర్భావశుద్ధిస్తథాన్తరమ్. 100 అంతశ్శుద్ధివిహీనైస్తు యే ೭ధ్వరా వివిధాః కృతాః, న ఫలంతి మునిశ్రేష్ఠ భస్మని న్యస్తహవ్యవత్. 101 భావశుద్ధివిహీనానాం సమస్తం కర్మ నిష్పలమ్ , తస్మాద్రాగాదికం సర్వం పరిత్యజ్య సుఖీ భ##వేత్. 102 మృదాభారసహస్త్రేస్తు కుంభకోటి జలైస్తథా, కృతశౌచో ೭పి దుష్టాత్మా చండాలసదృశస్స్మృతః. 103 అంతశ్శుద్ధి హీనస్తు దేవపూజోపరో యది. తమేవం దైవతం హన్తి నరకం చ ప్రపద్యతే. 104 అంతశ్శుద్ధివిహీనస్చ బహిశ్శుద్ధిం కరోతి యః, అలంకృతస్సురాభాండ ఇవ శాంతిం న గచ్ఛతి. 105 మనశ్శుద్ధివిహీనా యే తీర్ధమాత్రాం ప్రకుర్వతే, న తాన్పునన్తి తీర్థాని సూరాభాండమివాపగా. 106 వాచా ధర్మాన్ప్రవదతి మనసా పాపమిచ్ఛతి, జానీయాత్తం మునిశ్రేష్ఠ! మహాపాతకినాం వరమ్. 107 విశుద్ధమనసా యే తు ధర్మమాత్రమనుత్తమమ్, కుర్వంతి తత్ఫలం విద్యాదక్షయం సుఖదాయకమ్. 108 కర్మణా మనసా వాచా స్తుతిశ్రవణపూజనైః హరిభక్తిర్దృఢా యస్య హరిపూజేతి గీయతే. 109 యమాశ్చ నియమాశ్చైవ సంక్షేపేమ ప్రబోధితాః, ఏభిర్విశుద్ధమనసాం మోక్షం హస్తగీతం విదుః. 110 తపస్సు, స్వాధ్యాయము, సంతోషము, శౌచము, హరిపూజానము, సంధ్యోపాసన, మొదలగునవి నియములని చెప్పబడినవి. చాంద్రాయణాదివ్రతములచే శరీర శోషణమే ఉత్తమయోగసాధనమగు తపపమని సజ్జనులు చెప్పియున్నారు. ప్రణవమును ఉపనిషత్తులను ద్వాదశాక్షర మంత్రమును, అష్టాక్షర మంత్రమును మహావాక్యచయమును జపించుటయే స్వాధ్యాయమనబడును. ఇది ఉత్తమమగు యోగసాధనము. స్వాధ్యాయమును వదిలిన మూడునకు యోగము సిద్దించదు. యోగము లేకున్నను స్వాధ్యాయముచే మానవులకు పాపము నశించును. స్వాధ్యాములచే స్తుతించినచో దేవతలు ప్రసన్నులగుదురు. వాచికము, ఉపాంశు, మాసనము అను భేధములచే జపము మూడు విధములు. ఈ మూడు విధములలో మొదటి దానికంటే తరువాతిది శ్రేష్టము అని చెప్పబడినది. అక్షరములు పదములు స్ఫుటముగా ఉండునట్లు మంత్రమునుచ్చరించుట వాచిక జపమందురు. ఈ వాచికజపపము సర్వయజ్ఞ ఫలప్రదము, మంత్రమును ఉచ్చరించునపుడు కొంచెము ఒక పదము నుండి మరియొకపదమును విడిగా తెలియునట్లు పలుకుట ఉపాంశుజపమందురు. ఉపాంశుజపము నాచికజపము కంటే రెట్టింపు ఫలమునిచ్చును. అక్షరముల క్రమమును నిర్ణయించి అర్థమును విచారించుట మానసజపమందురు. మాసన జపము యోగసిద్ధిప్రదాయకము. జపముచే స్తుతించినచో దేవతలు ప్రసన్నులగుదురు. కావున స్వాధ్యాయసంపన్నుడు సర్వమనోరథములను పొందును. దైవవశమున లబించినదానిచే తృప్తిని పొందుట సంతోషమనబడును. సంతోషములేని మానవుడు ఎచటను సుఖమును పొందలేడు. కామములు అనుభవముచే ఎప్పుడూ తృప్తిని కలిగించవు. ఇక మరి కొంచెమును పొందవలయునని కామము పెరుగుచునేయుండును. దేహమును తపింపచేయు కామమును విడిచి దైవవశమున లబించిన దానిచే సంతోషించి ధర్మపరాయణుడు కావలయును. బాహ్యము అభ్యన్తరము అని శౌచము రెండు విధములు. నీరుచే మట్టిచే బహిశ్శుద్ధి జరుగును. భావశ్శుద్ధి అంతరశ్శుద్ధియనబడును. అంతరశ్శుద్ధిలేనివారు ఎన్ని యజ్ఞములు ఆచరించిననూ బూడిదలో విడిచిన హవ్యములవలె ఫలించజాలవు. భావశ్శుద్ధి లేనివారు చేయు కర్మలన్నియు నిష్ఫలములే యగును. కావున రాగాదికములను విడిచి సుఖవంతుడు కావలయును. ఎన్నిమట్టిరాశులచే కాని కోటి కలశముల జలముచే కాని శుద్ధి పొందినను భావదుష్టుడైనచో చండాల సదృశుడగును. అంతశ్శుద్ధివిహీనుడై దేవపూజాపరుడైనచో ఆ దైవమే అతనిని వధించును. నరకమును పొందింపచేయును. అంతశ్శుద్ధివిహీనుడైన బహిశ్శౌచమును చేయువాడు అలంకరించబడిన సూరాభాండమువలె శాంతిని పొందజాలడు. మనశ్శుద్ధిలేనివారు తీర్థయాత్రలము చేసినచో సురాభాండమును నదిపానము చేయజాలనట్లు పావనము చేయుజాలవు. వాక్కుచే ధర్మములను చెప్పుచు మనసులో పాపమును కోరినవాడు మహాపాతకులలో శ్రేష్ఠుడగును. మనశ్శుద్ధి కలవారు ఉత్తమధర్మాచరణగావించినచో అక్షయఫలము లభించును. ఉత్తమసుఖమును పొందును. మనోవాక్కాయములచే దృడమైన హరిభక్తియే హరిపూజ యనబడును. ఇట్లు యమములను నియమములను సంక్షేపముగా వివరించితిని. ఈ యమనియములచే మనశ్శుద్ధిగలవారికి మోక్షము హస్తగతమని తెలియుము. 87-110 యమైశ్చైవ నియమైశ్చైవ స్థిరబుద్ధిర్జితేంద్రియః, అభ్యసేదాసనం సమ్యగ్యోగసాధనముత్తమమ్. 111 పద్మకం స్వస్తికం పీఠం సైంహం కౌక్కుటకౌంజరే, కౌర్మం వజ్రాసనం చైవ వారాహం మృగచౌలికమ్. 112 క్రౌంచం చ నాలికం చైవ సర్వతోభద్రమేవ చ, వార్షభం నాగమాత్స్యే చ వైయాఘ్రం చార్ధచంద్రకమ్, 113 దండవాతాసనం శైలం స్వభ్రం మౌద్గరమేవ చ, మాకరం త్రైపథం కాష్ఠం స్థాణుం వైకర్ణికం తథా. 114 భౌమం వీరాసనం చైవ యోగసాధనకారణమ్, త్రింశత్సంఖ్యాన్యాసనాని మునీన్ద్రైః కధితాని వై. 115 ఏషామేకతమం బద్ధ్వా గురుభక్తిపరాయణః, ఉపాసకో జయేత్ప్రాణాన్ద్వన్ద్వాతీతో విమత్సరః. 116 ప్రాఙ్ముఖోదఙ్ముఖో వాపి తథా ప్రత్యఙ్ముఖ్యో೭ పి వా, అభ్యాసేన జయేత్ప్రాణాన్ నిశ్శబ్దే జనవర్జితే. 117 ప్రాణో వాయుశ్శరీరస్థ ఆయామన్తస్య నిగ్రహః, ప్రాణాయామ ఇతి ప్రోక్తో ద్వివిధస్స ప్రకీర్తితః. 118 అగర్భస్చ సగర్భశ్చ ద్వితీయస్తు తయోర్వరః , జపధ్యానం వినా గర్భస్సగర్భస్తస్తమన్వితః. 119 రేచకః పూరకశ్చైవ కుంభకశ్శూన్యకస్తథా, ఏవం చతుర్విధః, ప్రోక్తః ప్రాణాయామో మనీషిభిః. 120 జంతూనాం దక్షీణా నాడీ పింగలా పరికీర్తితా, సూర్యదైవతకా చైవ పితృయోనిరితి శ్రుతా. 121 దేవయోనిరితి ఖ్యాతా ఇడానాడీ త్వదక్షిణా, తత్రాధిదైవతం చంద్రం జానీహి మునసత్తమ. 121 ఏతయోరుభయోర్మధ్యే సుషుమ్నానాడికా స్మృతా అతిసూక్ష్మా గుహ్యతమా జ్ఞేయా సా బ్రహ్మదైవతా, వామే రేచయేద్వాయుం రేచనాద్రేకస్స్మతః. 123 వామేన రేచయేద్వాయుం రేచనాద్రేచకస్స్మృతః, పూరయేద్దక్షిణనైవ పూరణాత్పూరకస్స్మృతః 124 స్వదేహపూరితం వాయుం నిగృహ్య న విముచంతి, సంపూర్ణకుంభవత్తి ష్ఠేత్కుంభకస్స హి విశ్రుతః. 125 న గృహ్యతి న త్యజతి వాయుమంతర్భహిస్త్సితమ్, విద్ధి తచ్చూన్యకం నామ ప్రాణాయామం యథాస్థితమ్, 126 శ##నైశ్శనైర్విజేతవ్యో ప్రాణో మత్తగజేన్ద్రవత్ అన్యథా ఖలు జాయన్తే మహారోగా భయంకరాః, 127 క్రమేణ యో జయేద్వాయుం యోగీ విగతకల్మషః, స సర్వపాపనిర్ముక్తో బ్రహ్మణః పదమాప్నుయాత్. 128 ఇట్లు యమ నియములతో స్థిరబుద్ధి జితేంద్రియుడై, ఉత్తమము యోగసాధనము అయిన అసనమును చక్కగా అభ్యసించవలయును. పద్మకము, స్వస్తికము, పీఠము, సైంహము. కౌక్కుటము, కౌంజరము, కౌర్మము, వజ్రాసనము, వారాహము, మృగచౌలికము, నాలికము, సర్వతోభద్రము, వార్షభము, నాగము, మాత్స్యము, వైయాఘ్రము, అర్థచంద్రకము, దండము, వాతాసనం, శైలము, స్వబ్రము, మౌదర్గము, మాకరము, త్రైపథము, కాష్ఠము, స్థాణువు వైకర్ణికము, భౌమము, వీసరాసమను అని ముప్పది ఆసనములు యోగసాధన కారమములని మునీంద్రులు చెప్పుచున్నారు. వీటితో ఏదేని ఒక దానిని తెలుసుకొని గురుభక్తి పరాయణుడై ద్వంద్వాతీతుడు మాత్సర్యరహితునిగా ఉండి ఉపాసకుడు ప్రాణములనులజయించవలయును. తూర్పు ఉత్తరము పశ్చిమములలోఏదేని ఒక దిక్కునకు ముఖము నుంచి కూర్చుని నిశ్శబ్ధము నిర్జనము అయిన ప్రాంతమున అభ్యాసముతో ప్రాణములను జయించవలయును. శరీరములో నుండు వాయువు ప్రాణమనబడును. ఆయామమనగా నిగ్రహము. ప్రాణవాయుని నిగ్రహమును ప్రాణాయామమందురు. ప్రాణాయామము రెండు విధములు. ఆగర్భము సగర్భము అని ఈ రెండు సగర్భము శ్రేష్ఠమైనది. జపము ధ్యానము లేక చేయునది ఆ గర్భము . జపధ్యానములతో చేయునది సగర్భము. రేచకము, పూరకము, కంభకము, శూన్యకము అని ప్రాణాయామము చతుర్విధము. ప్రాణులకు దక్షిణభాగమున నుండు నాడి పంగల అనబడును. పింగలానాడికి సూర్యుడు అధిదేవత, పితృయోని అని మరియొక పేరు. వామ భాగమున నుండు నాడిని ఇడ అందురు ఇడా నాడి దేవయాని, చంద్రదైవతము. ఈ రెండు నాడుల మధ్యనుండు నాడి సుషుమ్నా అందురు. ఈ సుషుమ్నా అతిసూక్ష్మమైనది. పరమరహస్యమైనది. బ్రహ్మదేవతాకము. వామమార్గము ద్వారా వాయువును పూరించవలయును. పూరించుటచే పూరకమని పేరు. ఇట్లు నింపిన వాయువును విడువక నిగ్రహించుటయే కుంభకమనబడును. నిండుకుండవలె ఉండుట వలన కుంభకమందురు. బయట వాయువును తీసుకొనక, లోపలి వాయువును విడువక ఉండుటను శూన్యకమందురు. మదించిన ఏనుగును వశపరచుకొనునట్లు ప్రాణమును మెల్లిమెల్లగా వశము చేసుకొనవలయును. ప్రాణాయామమును అట్లు (మెల్లమెల్లగా) చేయనిచో భయంకరములైన మహారోగములు కలుగును. కల్మషము లేనివాడై యోగి క్రమముగా వాయువును నియోగించవలయును.అట్లు చేసినచో అన్నిపాపములనుండి విముక్తుడై బ్రహ్మపదమును చేరును. 111-128 విషయేషు ప్రసక్తాని చేంద్రియాణి మునీశ్వర! సమాహృత్య నిగృహ్ణాతి ప్రత్యాహారస్తు స స్మృతః. 129 జితీంద్రియా మహాత్మానో ధ్యానశూన్యా అపి ద్విజ! ప్రయాన్తి పరమం బ్రహ్మ పునరావృత్తిదుర్లభమ్. 130 అనిర్జితేంద్రియగ్రామం యస్తు ధ్యానపరో భ##వేత్, మూడాత్మానం చ తం విద్యాద్ధ్యానం చాస్య న సిద్ధ్యతి. 131 యద్యత్పశ్యతి తత్సర్వం పపశ్యేదాత్మవదాత్మని, పప్రత్యాహృతానీంద్రియాణి దారయేత్సా తు ధారణా. 132 యోగాజ్జితేన్ద్రియగ్రామస్తాని హృత్వా దృఢం హృది ఆత్మానం పరమం ధ్యాయేత్సర్వధాతారమచ్యుతమ్. 133 సర్వవిశ్వాత్మకం విష్ణుం సర్వలోకైకకారణమ్, వికసత్పద్మపత్రాక్షం చారుకుంలభూషితమ్. 134 దీర్ఘబాహుముదారాంగం సర్వాలంకారభూషితమ్, పీతాంబరధరం దేవం హైమయజ్ఞోపవీతినమ్. 135 బిభ్రతం తులసీ మాలాం కౌస్తుభేన విరాజతమ్, శ్రీవత్సవక్షసం దేవం సురాసురనమస్కృతమ్. 136 అష్టారే హృత్సరోజే తు ద్వాదసాంగులవిస్తృతే, ధ్యాయేదాత్మానమవ్యక్తం పరాత్పరతరం విభుమ్. 137 ధ్యానం సద్భిర్నిగదితం ప్రత్యయసై#్యకతానతా, ధ్యానం కృత్వా ముహుర్తం వా పరం మోక్షం లభేన్నరః. 138 ధ్యానాత్పాపాని నశ్యన్తి ధ్యానాన్మోక్షం చ విదంతి, ధ్యానాత్ప్రసీదతి హరిర్ధ్యాన్త్సర్వార్ధసాధనమ్. 139 యద్యద్రూపం మాహావిష్ణోత్తద్ధ్యాయేత్సమాహితమ్, తేన ధ్యానేన తుష్టాత్మా హరిర్మోక్షం దదాతి వై. 140 అచంచలం మనః కుర్యాద్ధ్యేయే వస్తుని సత్తమ, ధ్యానం ధ్యేయం ధ్యాతృభావం యథా నశ్యతి నిర్భరమ్. 141 తతో೭మృతత్వం భవతి జ్ఞానామృతనిషేవణాత్, భ##వేన్నిరంతరం ధ్యానాదభేదప్రతిపాదనమ్. 142 ఓమునీశ్వరా ! విషయములందు ప్రసక్తములైన ఇంద్రియములను వెనుకకు తీసుకొని నిగ్రహించుటే ప్రత్యాహారమనబడును. ధ్యానములేని వారైనను ఇంద్రియ జయము కలిగిన మహానుభావులు పునరావృత్తిరహిత పరమపదమును చేరెదరు. ఇంద్రియ సమూహమును జయించక ధ్యానము చేయువాడు మూఢుడనబడును. అతని ధ్యానము కూడా సిద్ధించదు. తాను చూచునదంతయు తనవలె, తనలోని దానివలె చూచుచు ప్రత్యాహృతములైన ఇంద్రియములను ధరించినచో ధారణయనబడును. యోగముచే ఇంద్రియగ్రామమమును జయించి, జయించిన ఇంద్రియములను హృదయమున దృఢముగా బంధించి సర్వధారకుడు అచ్యుతుడు అగు పరమాత్మను ధ్యానము చేయవలయును. సర్వవిశ్వాత్మకుడు సర్వలోకైకకారణుడు వికసత్పద్మపత్రాక్షుడు, చారకుండల భూషితుడు, దీర్ఘబాహువు, ఉదారాంగుడు, సురాసురనమస్కృతుడు అగు శ్రీమన్నారాయణుని అష్టారమగు ద్వాదశాంగుల విస్తృతమగు హృదిన నిలుపవలెను పరాత్పరతరుడు విభుడు అవ్యక్తుడు అగు ఆత్మను ధ్యానించవలయును. ప్రత్యయము ఏకాధారముగా నుండుటను ధ్యానమందురు. ఒక ముహుర్తము ధ్యానము చేసిననూ మోక్షము లభించును. ధ్యానము వలన పాపములు నశించును. ధ్యానము వలన మోక్షము లబించును. ధ్యానమువలన శ్రీహరి ప్రసన్నుడగును. ధ్యానము వలన సర్వార్ధములు సాదించబడును. శ్రీమహావిష్ణువు ధరించిన అన్ని రూపములను సావధానముగా ధ్యానించవలయును. ఆ ధ్యానముచే శ్రీహరి ప్రసన్నుడై మోక్షమును ప్రసాదించును. ధ్యేయమగు వస్తువునందు మనస్సును నిశ్చలముగా నుంచవలయును. అపుడు ధ్యానము ధ్యేయము ధ్యాయనముచేయువాడు అనుబేదములు నశించవలయును. అపుడు జ్ఞానామృతసేవనము వలన అమృతత్వము లభించును. నిరంతరధ్యానముచే అభేదప్రతిపత్తి కలుగును. 129-142 సుషుప్తివత్పరానన్దయుక్తశ్చపరజితేంద్రియః, నిర్వాతదీపవత్సంస్థః సమాధిరభిదీయతే. 143 యోగీ సమాధ్యవస్థాయాం నశృణోతి న పశ్యతి, న జిఘ్రతి నస్పృశతి న కించిద్వక్తి సత్తమ. 144 ఆత్మా తు నిర్మలశ్శుద్ధస్సచ్చినానన్ద విగ్రహః, సర్వోపాధివినిర్ముక్తో యోగినాం భాత్యచంచలః. 145 నిర్గుణో ೭పి పరో దేవో హ్యజ్ఞానాద్గుణవానివ, విభాత్యజ్ఞాననాసే తు యథాపూర్వం వ్యవస్థితమ్. 146 పరం జ్యోతిరమేయాత్మా మాయావానిన యాయినామ్, తన్నాశే నిర్మలం బ్రహ్మ ప్రకాశయతి పండిత. 147 ఏకమేవాద్వితీయం చ పరంజ్యోతిర్నింరంజనమ్ , సర్వేషామేవ భూతానామంతర్యామితయా స్థితమ్. 148 అణోరణీయాన్మహతో మహీయాన్సనాతనాత్మాఖిలవిస్వహేతుః, పశ్యంతి యద్‌జ్ఞానవిదాం వరిష్ఠాః, పరాత్పరస్మాత్పరమం పవిత్రమ్.149 అకారాదిక్షకారాంతవర్ణభేదదవ్యవస్థితః, పురాణపురుషో೭నాదిస్శబ్దబ్రహ్మేతి గీయతే. 150 విశుద్ధమక్షరం నిత్యం పూర్ణమాకాశమధ్యగమ్, ఆనందం నిర్మలం శాంతం పరం బ్రహ్మేతి గీయతే. 151 యోగినో హృది పశ్యంతి పరాత్మానాం సనాతనమ్, అవికారమజం శుద్ధం పరం బ్రహ్మేతి గీయతే. 152 ధ్యానమన్యత్ప్రవక్ష్యామి శృణుష్వ మునిసత్తమ, సంసారతాపతప్తానాం సుధావృష్టిసమం నృణామ్. 153 నారాయణం పరానన్దం స్మరేత్ప్రణవసంస్థితమ్, నారదరూపమనౌపమ్యమర్ధమార్ధమాత్రోపరి స్థితమ్. 154 అకారం బ్రహ్మణో రూపముకారం విష్ణురూపవత్, మకారం రుద్రరూపం స్యాదర్ధమాత్రం పరాత్మకమ్. 155 మాత్రాస్తిస్రస్సమాఖ్యాతా బ్రహ్మవిష్ణుశివాధిపాః, తేషాం సముచ్చయం విప్ర పరబ్రహ్మప్రభోదకమ్. 156 వాచ్యం తు పరమం బ్రహ్మ వాచకః, ప్రణవస్స్మృతః, వాచ్యవాచకోసంబంధో హ్యుపచారాత్తయోర్ద్విజ. 157 జపన్తః ప్రణవం నిత్యం ముచ్యన్తే సర్వపాతకైః, తదభ్యాసేన సంయుక్తాః పరం మోక్షం లభన్తి చ. 158 జపంశ్చ ప్రవణం మన్త్రం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్, కోటిసూర్యసమం తేజో ధ్యాయేదాత్మని నిర్మలమ్, 159 శాలగ్రామ శిలారూపం ప్రతిమారూపమేవ వా, యద్యత్పాపహరం వస్తు తత్తద్వా చిన్తయేద్ధృది, 160 యదేదద్వైష్ణవం జ్ఞానం కథితం తే మునీశ్వర, ఏతద్విదిత్వా యోగీన్ద్రో లభ##తే మోక్షముత్తమమ్. 161 యస్త్వేతచ్ఛృణుయాద్వాపి పఠేద్వాపి సమాహితః, స సర్వపాపనిర్ముక్తో హరిసాలోక్యమాప్నుయాత్. 162 ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమ పాదే యోగనిరూపణం నామ త్రయంస్త్రిశో೭ధ్యాయః ఇంద్రియ వ్యాపారములు విరమించబడి పరమానందయుక్తుడై గాలిలేని చోటి దీపమువలె, సుషుప్తిలో వలె నుండుట సమాధి యనబడును. యోగి సమాధ్యవస్థలో వినజాలడు చూడజాలడు వాసన చూడజాలడు , స్పృశించజాలడు. ఏమియు చెప్పజాలడు. ఆత్మనిర్మలము , శుద్ధము, సచ్చినానన్ద స్వరూపము. సర్వేపాధివినిర్ముక్తుముగా యోగులకు నిశ్చలముగా భాసించును. పరమాత్మ నిర్గుణుడైనను అజ్ఞానమువలన గుణసహితుని వలె భాసించును. అజ్ఞానము నశించినచో పూర్వమున్నటుల భాసించును. అమేయాత్మ పరిజ్యోతి మాయ కలవారికి మాయకలదానిగా, మాయ నశించినచో నిర్మల బ్రహ్మస్వరూపము ప్రకాశించును. ఒకటే రెండవది లేనిది, పరంజ్యోతి, నిరంజనము సర్వభూతాతర్యామిగా నుండును,. అణువులలో మహత్తులలో మహత్తు సనాతనమగు ఆత్మ, అఖిల ప్రపంచకారణము అగు పరమాత్మను పరాత్పరునిగా పరమ పవిత్రునిగా జ్ఞానులలో ఉత్తములు చూచెదరు. అకారము మొదలు క్షకారము వరకు గల వర్ణభేదముతో నుండు వాడు అనాదియగు పురాణ పురుషుడు శబ్ద బ్రహ్మయని కీర్తించబడును. విశుద్ధము అక్షరము, నిత్యము, పూర్ణముఅకాశమధ్యస్థము, ఆనందము, నిర్మలము ,శాతము పరబ్రహ్మయని గానము చేయబడును. యోగులు సనాతనుడు అవికారి అజుడు శుద్ధుడు పరబ్రహ్మముగా కీర్తించబడు పరమాత్మను హృదయమున దర్శించగలరు. ఇపుడు ఇంకొక ధ్యానమును చెప్పెదను. సంసార తాపతప్తులగు నరులకు సుధావృష్టివంటిదీ ధ్యానము, సావధానముగా వినుము. ప్రణవములో నున్న పారానన్దస్వరూపుడుగు నారాయణుని స్మరించవలయును. సాటిలేనిది అర్ధమాత్రోపరిభాగముననుండు నారదరూపుని ధ్యానించవలయును. ఆకారము బ్రహ్మ విష్ణుస్వరూపము ఉకారము విష్ణుస్వరూపము. మకారము రుద్రరూపము, అర్థమాత్ర పరమాత్న స్వరూపము. మూడు మాత్రలు బ్రహ్మవిష్ణుశివాత్మకములుగా చెప్పబడియున్నవి. ఆ మూడు మాత్రలసముదాయము పరబ్రహ్మ ప్రభోధకము. పరబ్రహ్మ వాచ్యము. ప్రణవము వాచకము. పరబ్రహ్మ ప్రణవములకు వాచ్యవాచక సంబంధము. ఉపచారము వలన సిద్ధించును. ప్రణవమును నిత్యము జపించువారలు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. ప్రణవజపాభ్యాసము కలవారు మోక్షమును పొందెదరు. బ్రహ్మవిష్ణుశివాత్మకమగు ప్రణవమును జపించుచూ ఆత్మలో నిర్మలము కోటి సూర్యపర్కాశమగు పరమాత్మను ధ్యానించవలయును. శాలగ్రామశిలారూపమును కాని ప్రతిమారూపమును కాని పాపహరమగు ఏ వస్తువునైనను హృదయము ధ్యానించవలయును. ఇపుడు నీకు చెప్పిన ఈ వైష్ణవజ్ఞానమును తెలిసిన యోగీన్ద్రులు ఉత్తమమోక్షములను పొందెదరు. ఈజ్ఞానబోధకమగు యోగవిధానమును సావదానముతో వినువారు చదువువారు సర్వపాపవినిర్ముక్తులై శ్రీహరిసాలోక్యమును పొందెదరు. 143-162 ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమ పాదమున యోగనిరూపణమను మూప్పది మూడవ అధ్యాయము సమాప్తము.