Sri Naradapuranam-I
Chapters
Last Page
చతుస్త్రింశో೭ధ్యాయః = ముప్పది నాలుగవ అధ్యాయము హరిభక్తి లక్షణమ్ నారద ఉవాచ:- సమాఖ్యాతాని సర్వాణి యోగాంగాని మాహామునే! ఇదానీమపి సర్వజ్ఞ యత్పృచ్ఛామి తదుచ్యతామ్. 1 యోగో భక్తిమతామేవ సిధ్యతీతి త్వయోదితమ్, యస్య తుష్యతి సర్వేశస్తస్య భక్తిశ్చ శాశ్వతమ్. 2 యథా తుష్యతి సర్వేశో దేవదేవో జనార్దనః, తన్మమాఖ్యాహి సర్వజ్ఞ మునే కారుణ్యవారిధే! 3 నారదమహర్షి పలికెను:- సర్వజ్ఞా! మహామునీ! సర్వయోగాంగములను చక్కగా వివరించితిరి. ఇపుడు కూడా నేనడిగిన విషయములను చెప్పుడు. భక్తి గల వారికే యోగము సిద్ధించునని మీరు చెప్పితిరి. సర్వేశుడు సంతోషించినపుడే భక్తి స్థిరముగా నుండునని చెప్పితిరి. సర్వేశుడు దేవదేవుడగు జనార్దనుడు ఎట్లు సంతోషించునో దయానిధివగు నీవు నాకు చెప్పుము. 1-3 సనక ఉవాచ:- నారాయణం పరం దేవం సచ్చిదానన్దవిగ్రహమ్, భజ సర్వాత్మానా విప్ర యది ముక్తిమభీప్ససి. 4 రిపవస్తం న హింసన్తి న బాధన్తే గ్రహాశ్చ తమ్, రాక్షసాశ్చ నచేక్షన్తే నరం విష్ణుపరాయణమ్. 5 భక్తిర్దృఢా భ##వేద్యస్య దేవదేవే జనార్ధనే, శ్రేయాంసి తస్య సిధ్యంతి భక్తింతో ೭ధికాస్తతః. 6 పాదౌ తౌ సఫలౌ పుంసాం ¸° విష్ణుగృహగామినౌ, తౌ కరౌ సఫలౌ జ్ఞేయా విష్ణుపూజాపరౌ తు ¸°. 7 తే నేత్రే సుఫలే పుంసాం పశ్యతో యే జనార్దనమ్, సా జిహ్వా ప్రోచ్యతే సద్భిర్హరినామపరా తు యా.8 సత్యం సత్యం పునస్సత్యముద్ధృత్య భుజముచ్యతే, తత్త్వం గురుసమం నాస్తి న దేవః కేశవాత్పరః. 9 సత్యం వచ్మి హితం వచ్మి సారం వచ్మి పునఃపునః, అసార్వేస్మింస్తు సంసారే సత్యం హరిసమర్చమన్. 10 సంసారపాశం సదృఢం మహామోహప్రదాయకమ్, హరిభక్తికుఠారేమ ఛిత్త్వాత్యనతనుఖీ భవ. 11 తన్మనస్సంయుతం విష్ణౌ సావాణీ యత్పరాణా, తే శ్రోతే తత్కతాసారపూరితే లోకవందితే. 12 ఆనందమక్షరం శూన్యమవస్థాత్రితయైరపి, ఆకాశమధ్యగల దేవం భజ నారద సంతతమ్. 13 స్థానం న శక్యతే యస్య స్వరూపం వా కదాచన, నిర్దేష్టుం మునిశార్దూల ద్రష్టుం వాప్యకృతాత్మభిః. 14 సమసై#్తః కరణౖర్యుక్తో వర్తతే ೭సౌ యదా తదా, జాగ్రదిత్యుచ్యతే సద్భిరన్తర్యామీ సనాతనః. 15 యదాన్తః కరణౖర్యుక్త స్స్వేచ్ఛయా విచరత్యసౌ, స్వపన్నిత్యుచ్యతే హ్యాత్మా యదా స్వాపవివర్జితః. 16 న బాహ్యకరణౖర్యుక్తో న చాన్తఃకరణౖస్తథా, అస్వరూపో యదాత్మాసౌ పుణ్యాపుణ్యవివర్జితః. 17 సర్వోపాధివినిర్ముక్తో హ్యానందో నిర్గుణో విభుః, పరబ్రహ్మమయో దేవస్సుషుప్త ఇతి గీయతే. 18 భావనామయమేతద్వై జగత్థ్సావర జంగమమ్, విద్యుద్విలోలం విప్రేన్ద్ర భజ తస్మాజ్జనార్దనమ్. 19 అహింసాసత్యమస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ, వర్తతే యస్య తసై#్యవ తుష్యతే జగతాంపతిః. 20 సర్వభూతదయాయుక్తో విప్రపూజాపరాణః, తస్య తుష్టో జగన్నాధో మధుకైటభమర్దనః. 21 సత్కథాయాం చ రమతే సత్కథాం చ కరోతి యః, సత్సంగో నిరహంకారస్తస్య ప్రీతో రమాపతిః. 22 నామసంకీర్తనం విష్ణోక్షుత్త్రట్ప్రస్ఖలతాదిషు. కరోతి సతతం యస్తు తస్య ప్రీతోహ్యధోక్షజః. 23 యా తు నారీ పతిప్రాణా పతిపూజాపరాణా. తస్యాస్తుష్టో జగన్నాథో దదాతి స్వపదం మునే. 24 అసూయరహితా యే తు హ్యాహంకారవివర్జితాః, దేవపూజాపరాశ్చైవ తేషాం తుష్యతి కేశవః. 25 సనక మహర్షి పలికెను:- ముక్తిపై కోరిక యున్నచో సచ్చిదానన్దవిగ్రహుడు పరదేవుడు అగు నారాణును సర్వ విధములా సేవించుము. విష్ణు పరాయణుడగు మానవుని శత్రువులు హింసించజాలరు. గ్రహములు బాధించజాలవు. రాక్షసులు చూడజాలరు. దేవదేవుడగు జనార్దనుని యందు దృఢమగు భక్తి కలవారికి అన్ని శ్రేయస్సులు సిద్ధించును. అందరికంటే భక్తిమంతులే అధికులు. శ్రీహరి మందిరమునకు వెళ్ళు పాదములు సఫలములు . శ్రీహరిని పూజించు కరములు సఫలములు. శ్రీహరిని దర్శించు నేత్రములు సఫలములు. హరినామమును కీర్తించు దానినే స్జజనులు జిహ్వాయందురు. చేతులు పైకెత్తి ముమ్మారులు సత్యమును చెప్పుచున్నాను. గురువుతో సమమగు తత్త్వమును, హితమును, సారమును చెప్పుచున్నాను. నిస్సారమైన ఈ సంసారమున సారము హరి సమర్చనము మాత్రమే. సుదృఢము మహామోహప్రదాయకము అగు సంసారపాశమును హరి భక్తి యను గొడ్డలిచే ఛేధించి అత్యన్తానన్దమును పొందుము. విష్ణువు నందు లగ్నమైనదే మనస్సు. విష్ణు నామసంకీర్తన పరాయణమైనదే వాక్కు. విష్ణు కథాసారపూరితములైనవే. శ్రోత్రములు. ఆనందము అక్షరము, అవస్ధాత్రయశూన్యము, ఆకాశమధ్యగతము పరదైవతమగు శ్రీహరిని సర్వకాలములలో సేవించుము. ఆత్మజ్ఞానము లేనివారు శ్రీహరి స్థానమును, స్వరూపమును చూచుటకు నిర్దేశించుటకు వీలుకాదు. సర్వాంతర్యామి సనాతనుడగు దేవదేవుడు సమస్త కరణములచే కూడియున్నచో మేలు కొని యున్నాడందురు. అంతకరణములతో కూడి స్వేచ్ఛగా సంచరించు చున్నపుడు స్వపతి అని (పడుకొని యున్నాడు) అందురు. స్వాప వివర్జతుడై బాహ్యాంతఃకరమ రహితుడై స్వరూప రహితుడై పుణపాప వివిప్జితుడై యున్నపుడు సర్వోపాధి వినిర్ముక్తుడు ఆనంద స్వరూపుడు నిర్గుణుడు విభువు పరబ్రహ్మస్వరూపుడగు దేవుడు సుషుప్తావస్థలో (నిద్రావస్థలో) ఉండెనందురు. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ భావనామయమే. మెరుపువలె చంచలము. కావున జనార్దునుని సేవించుము. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము అపరిగ్రహము కలవానికి శ్రీహరి సంతోషించును. సర్వభూతదయాపరుడు బ్రాహ్మణపూజా పరాయణుడు అగువాని విషయమున మధుకైటభమర్దనుడగు శ్రీహరి సంతోషించును. సత్కథను విని సంతోషించువాడు, సత్కథను చెప్పువాడు, సత్సంగమును చేయువాడు, అహంకార రహితుడు అగువానికి శ్రీహరి ప్రీతి చెదును. ఆకలి దప్పులలో, ప్రమాదములలో, సర్వకార్యములలో, సర్వావస్థలలో శ్రీహరి నామ సంకీర్తనమును చేయువారికి శ్రీహరి సంతోషించును. పతిప్రాణ పతిపూజా పరాయణ యగు స్త్రీ విషయమున జగన్నాథుడు సంతోషించి తన పదమును ప్రసాదించును. అసూయ రహితులకు అహంకార వర్జితులకు దేవపూజాపరులకు శ్రీహరి ప్రసన్నుడగును. 4-25 తస్మాచ్ఛృణుష్వ దేవర్షే భజస్వ సతతం హరిమ్, మా కురుష్వ హ్యాహంకారం విద్యుల్లోలశ్రియా వృథా. 26 శరీరం మృత్యుసంయుక్తం జీవితం చాతిచంచలమ్, రాజాదిభిర్ధనం బాధ్యం సంపదః క్షణభంగురాః, 27 కిం న పశ్యసి దేవర్షే హ్యాయుషార్ధం తు నిద్రయా. హతం చ భోజనాద్యైశ్చ కియదాయుస్సామాహృతమ్. 28 కియదాయుర్బాలభావాద్వృద్ధభావాత్కియద్వృధా, కియద్విషయభోగైశ్చ కదా ధర్మాన్కరిష్యతి. 29 బాలభావే చ వార్ధేక్యే న ఘటేతాచ్యుతార్చనమ్, వయస్యేన తతో ధర్మాన్కురు త్వమనహంకృతః. 30 మా వినాశం వ్రజ మునే మగ్నస్సంసారగహ్వేరే, వపుర్వినాశనిలయమాపదాం పరమం పదమ్. 31 శరీరం భోగనిలయాం మలాద్యైః పరిదూషితమ్, కిమర్ధం శాశ్వత ధియా కుర్యాత్పాపం నరో వృథా. 32 అసారభూతే సంసారే నానాదుఃఖసమన్వితే, విశ్వాసో నాత్ర కర్తవ్యో నిశ్చితం మృత్యుసంకులే. 33 తస్మాచ్ఛృణుష్వ విప్రేన్ద్ర సత్యమేతద్బ్రవీమ్యహమ్, దేహం యోగనివృత్త్యర్ధం సద్య ఏవ జనార్దనమ్. 34 మానం త్యక్త్వా తథా లోభం కామక్రోధవివర్జితః, భజస్వ సతతం విష్ణుం మానుష్యమతిదుర్లభమ్. 35 కోటి జన్మసహస్రేషు స్థావరాదిషు సత్తమ, సంభ్రాంతస్య తు మానుష్యం కథంచిత్పరిలభ్యతే. 36 తత్రాపి దేవతాబూద్ధిర్దానబుద్ధిశ్చ సత్తమ, భోగబుద్ధిస్తథా నృణాం జన్మాన్తరతఃఫలమ్. 37 మానుష్యం దుర్లభం ప్రాప్య యో హరిం నార్చయేత్సకృత్, మూర్ఖఃకో ೭స్తి పరస్తస్మాజ్జడబుద్ధిరచేతనః. 38 దుర్లభం ప్రాప్య మానుష్యం నార్చయన్తి చ యే హరిమ్, తేషామతీవ మూర్ఖాణాం వివేకః కుత్ర తిష్ఠతి. 39 ఆరాధితో జగన్నాథో దదాత్యభిమతం ఫలమ్, కస్తం న పూజయేద్విప్ర సంసారాగ్నిప్రదీపితః. 40 చండాలో೭పి మునిశ్రేష్ట విష్ణుభక్తో ద్విజాధికః, విష్ణుభక్తివిహీనశ్చ ద్విజో ೭పి శ్వపచాధమః. 41 తస్మాత్కామాదికం త్యక్త్వా భ##జేత హరివ్యయమ్, యస్మింస్తుష్టే೭ఖిలం తుష్యేద్యతస్సర్వగతో హరిః. 42 యథా హస్తిపదే సర్వం పదమాత్రం ప్రలీయతే, తథా చరాచరం విశ్వం విష్ణావేవ ప్రలీయతే. 43 ఆకాశేన యథా జగత్థ్సావరజంగమమ్, తథైవ హరిణా వ్యాప్తం విశ్వమేతచ్చరాచరమ్. 44 జన్మనో మరణం నౄణాం జన్మ వై మృత్యుసాధనమ్, ఉభే చే నికటే విద్ధి తన్నాశో హరిసేవయా. 45 ధ్యాతస్స్మృతః పూజితో వా ప్రణతో వా జనార్దనః, సంసారపాశవిచ్ఛేదీ కస్తం న ప్రతిపూజయేత్. 46 యన్నామోచ్చారణాదేవ మహాపాతకనాశనమ్, యం సమభ్యర్చ్య విప్రర్షే మోక్షభాగీ భ##వేన్ననరః. 47 అహో చిత్రమహో చిత్రమహో చిత్రమిదం ద్విజ, హరినామ్ని స్థితే లోకస్సంసారో పరివర్తితే. 48 భూయో భూయో ೭పి వక్ష్యామి సత్యమేతత్తపోధన, నీయమానో యమభ##టైరశక్తో ధర్మసాధనైః.. 49 యావన్నేంద్రియవైకల్యం యావద్వ్యాధిర్న బాధత్, తావదేవార్చయేద్విష్ణుం యది ముక్తినభీప్సతి. 50 కావున ఓ దేవర్షీ ! నా మాటను. వినుము. ఎప్పుడూ శ్రీహరినే సేవించుము. మెరుపు వలె చంచంలమైన సంపదచే అహంకరించకుము. ఈ శరీరము మృత్యువుతో కలిసియుండునది. జీవితము అతి చంచలము. ధనము రాజ తస్కరాదులచే అపహరించబడును. సంపదలు క్షమ భంగురములు ఓ దేవర్షీ ! సగము ఆయుష్యము నిద్రలో గడుచుటను నీవు చూచుట లేదా? భోజనాది వ్యవహారములచే ఎంత ఆయుష్యము గడుచుచున్నది. బాలభావముతే కొంత వృద్ధాభావముచే కొంత వ్యర్థమగుచున్నది. మరికొంత ¸°వనమున విషయ భోగములచే వ్యర్థమగుచున్నది. ఇక ధర్మములనాచరించునదెపుడు? బాల్యమున వార్థక్యమున అచ్యుతార్చన చేయజాలరు. కావున ¸°వనముననే అహంకారమును విడిచి ధర్మాచరణమును చేయుము. సంసార గహ్వరమున మునిది నశించకుము. ఈ శరీరము నాశనమునకు నిలయము ఆపదలకు స్థానము. ఈ శరీరము భోగనిలయము. మలమూత్రాదులచే పరిదూషితము. కావున శాశ్వతమని భావించి మానవుడేల పాపమునాచరించవలయును? నానా దుఃఖములతో కూడుకొని నిస్సారమైన సంసారమున విశ్వాసమునుంచరాదు. ఎప్పుడు మృత్యువు గ్రసించునో తెలియదు. కావున ఓ మునీన్ద్రా! నేనీ సత్యమును చెప్పుచున్నాను. వినుము. దేహసంబన్ధ నివృత్తికొఱకు వెంటనే అభిమానమును కామక్రోధలోభములను విడిచి శ్రీహరిని భజించుము. మానవత్వము చాలా దుర్లభము. కొన్ని వేల కోట్ల జన్మలు స్థావరాదులలో భ్రమించిన తరువాత అతి కష్టముతో మనుష్యత్వము లభించును. ఆ మానవ జన్మలో దైవతాబుద్ధి భోగబుద్ధి మూర్ఖుడు మరియొకడుండడు. దుర్లభ##మైన మానుష్యమును పొంది కూడా శ్రీహరిని సేవించినచో అతనికంటే అజ్ఞాని మందబుద్ధి మూర్ఖుడు మరయొకడుండడు. దుర్లభ##మైన మానుష్యమును పొంది శ్రీహరిని కోరిన ఫలమునిచ్చును. సంసారాగ్నిచే దహించబడిన వాడెవ్వడు శ్రీహరిని ఆరాధించడు? విష్ణుభక్తికలవాడు చండాలుడైనను ద్విజుని కంటే శ్రేష్ఠుడే. విష్ణుభక్తి హీనుడగు ద్విజుడుకూడా చండాలుని కంటే అధముడే . కావున కామాదులను విడిచి అవ్యయుడగు శ్రీహరిని సేవించవలయును. శ్రీహరి సర్వగతుడు కావున శ్రీహరి సంతోషించినచో విశ్వమంతయూ ప్రీతి చెందును. హస్తిపదమును పాదమంతయూ లీనమగునట్లు చరాచర ప్రపంచమంతయూ శ్రీహరిలో లీనమగును. స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ ఆకాశముచో వ్యాపించబడుయున్నట్లు ఈ ప్రపంచమంతయూ శ్రీ హరిచే వ్యాపపించబడియున్నది. జన్మ నుండు మరణము సంభవించును. జన్మమే మృత్యుసాధనము. జన్మ మరణములు అతి సన్నిహితములు. శ్రీహరి సేవచే జన్మమరణములు నశించును. శ్రీహరిని ధ్యానించిననూ, స్మరించిననూ, పూజించిననూ ప్రణామములాచరించిననూ సంసారపాశమును ఛేదించును. కావున శ్రీహరిని పూజించనివాడెవ్వడు ? శ్రీ హరి నామోచ్ఛారణుచే సర్వపాపముల నశించును. పూజించినచో మోక్షమే లభించును. శ్రీహరి నామముండగా జనులు సంసారమున నుండుట ఎంత ఆశ్చర్యము! ఎంతఆశ్చర్యము! అందువలననే మరల మరల చెప్పుచున్నాను. ఇది సత్యము వినుము. యమభటులు తీసుకొని పోవుచున్నపుడు ధర్మాచరణను చేయజాలవు. ఇంద్రియ వైకల్యము వ్యాధులు కలుగనపుడే ముక్తిని కోరువారు శ్రీహరిని పూజించవలయును. 26-50 మాతుర్గార్భాద్వినిష్క్రాంతో యదా జంతుస్తదైవహి, మృత్యుస్సన్నిహితో భూయాత్తస్మాధ్ధర్మపరో భ##వేత్. 51 అహోకష్టమహోకష్టమహో కష్టమిదం పవుః, వినశ్వరం సమాజ్ఞాయ ధర్మం నైనాచరత్యయమ్. 52 సత్యం సత్య పునస్సత్యముద్ధృత్య భుజముచ్యతే, దంభాచారం పరిత్యజ్య వాసుదేవం సమర్చయేత్. 53 భూయో భూయో హితం వచ్మి భుజముద్ధృత్య నారద ! విష్ణుస్సరాత్మానా పూజ్యస్త్యజ్యాసూయా తథానృతమ్. 54 క్రోధో మూలో మనస్తాపః క్రోధస్సంసారబంధనమ్, ధర్మక్షయకరః క్రోధస్తస్మాత్తం పరివర్జయేత్. 55 కామమూలమిదం జన్మ కామః పాపస్య కారణమ్, యశఃక్షయకరః కామః తస్సాత్తం పరివర్జయేత్. 56 సమస్తదుఃఖజాలానాం మాత్సర్యం కారణం స్మృతమ్, నరకాణాం సాధనం చ తస్మాత్తదపి సంత్యజేత్. 57 మన ఏవ మునుష్యాణాం కారణం బంధమోక్షయోః, తస్మాత్తదభిసంయోజ్య పరాత్మని సుఖీ భ##వేత్. 58 అహోధైర్యమహోధైర్యమమహోధైర్యమహోనృణామ్. విష్ణౌ స్థితే జగన్నాథే న భజంతి మదోద్ధతాః. 59 అనారాధ్య జగన్నాదం సర్వభూతారమచ్యుతమ్, సంసారసాగరే మగ్నాః కథం పారం ప్రయాంతి హి. 60 అచ్యుతానన్దగోవిన్దనామోచ్చారణభేషజాత్, నశ్యంతి సకలా రోగాస్సత్యం సత్యం వదామ్యహమ్. 61 నారాయణ! జగన్నాథ! వాసుదేవ! జనార్దన! ఇతీరయన్త యే నిత్యం తే వై సర్వత్ర వందితాః. 62 అద్యాపి చ మునిశ్రేష్ఠ బ్రహ్మాద్యా ఆపి దేవతాః, యత్ప్రభావం న జానన్తి తం యహి శరణం మునే. 63 అహో మౌర్ఖ్యమహో మౌర్ఖ్యం అహో మౌర్ఖ్యం దురాత్మనామ్, హృత్రపద్మసంస్థితం విష్ణుం న విజానన్తి నారద! 64 శృణుష్వ మునిశార్దూల భూయో భూయో వదామ్యహమ్, హరిశ్శ్రద్ధావతాం తుష్యేన్నధనై ర్న చ బాంధవైః. 65 బంధుముత్త్వం ధనాఢ్యత్వం పుత్రవత్త్వం చ సత్తమ, విష్ణుభక్తిమతాం నౄణాం భ##వేజ్జన్మని జన్మని. 66 పాపమూలమయం దేహః పాపకర్మరతస్తథా, ఏతద్విదిత్వా సతతం బూజనీయో జనార్దనః. 67 పుత్రమిత్రకలత్రాద్యా బహవస్సుశ్చ సంపదః, హరిపూజారతానాం తు భ##వేత్యేవ న సంశయః. 68 ఇహాముత్ర సుఖప్రేప్సుః పూజయేత్సతతం హరిమ్, ఇహాముత్రాసుఖప్రేప్సుః పరనిన్దాపరో భ##వేత్. 69 ధిగ్జన్మ భక్తిహీనానాం దేవదేవ జనార్దనే, సత్పాత్రదానశూన్యం యత్తద్ధనం ధిక్పునః పునః. 70 న నమేద్విష్ణవే యస్య శరీరం కర్మభేదినే, పాపానామాకరం తద్వై విజ్ఞేయం మునిసత్తమః. 71 సత్పాత్రదానరహితం యద్ద్రవ్యం యేన రక్షితమ్, చౌర్యేణ రక్షితమివ విద్ధి లోకేషు నిశ్చితమ్, 72 తడిల్లోలశ్రియా మత్తాః క్షమభంగురశాలినః, నారాధయంతి విశ్వేశం పశుపాశవిమోచకమ్. 73 సృష్టిస్తు ద్వివిధా ప్రోక్తా దైవాసురవిభేదతః, హరిభక్తియుతా దైవీ దత్థీనా హ్యాసురీ మతా. 74 తస్మాచ్ఛృణుష్వ విప్రేన్ద్ర హరిభక్తిపరాయణాః, శ్రేష్ఠాస్సర్వత్ర విఖ్యాతా యతో భక్తిస్సుదుర్లభా. 75 అసూయారహితా యే చ విప్రత్రాణపరాణాః, కామాదిరహితా యే చ తేషాం తుష్యతి కేశవః. 76 సంమార్జనాదినా యే తు విష్ణుశుశ్రూషణ రతాః, సత్పాత్రదాననిరతాః ప్రయాంతి పరమం పదమ్. 77 ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే ప్రథమపాదే హరిభక్తిలక్షణం నామ చతుస్త్రింశో೭ధ్యాయః తల్లి గర్భము నుండి బయటపడిన వెంటనే మృత్యువు ప్రాణి సన్నిహితమగును. కావున ధర్మపరుడు కావలయును. వినశ్వరకమగు శరీరమును పొంది ధర్మము నాచరించకపోవుట ఎంతకష్టము? ఎంతకష్టము! చేతులు పైకెత్తి ఇది ముమ్మాటికి నిజమని మరల చెప్పుచున్నాను. దంభాఖాచారమును విడిచి వాసుదేవుని పూజించవలయును. చేతులు పైకెత్తి మరల హితమును చెప్పుచున్నాను. సర్వవిధములా విష్ణువును పూజించవలయును. అసూయను అనృతమును వదలి పెట్టుము. క్రోధము వలన మనస్తాపము కలుగును. క్రోధమువలన సంసారబంధము కలుగును. క్రోధము ధర్మమును క్షీణింపచేయును. కావున క్రోధమును విడువవలయును. ఈ జన్మ కామమూలము. కామమే పాపమునకు కారణము. కామము కీర్తిని క్షీణింపచేయును. కావున కామమును పరిత్యజించవలయును. సమస్త దుఃఖజాలములకు మాత్సర్యమే కారణము. నరకసాధకము కావున మాత్సర్యమును విడువవలయును. మానవుల బంధమోక్షములకు మనసే కారణము . కావున ఆ మనసును పరమాత్మయందు లగ్నముచేసి సుఖమును పొందవలయును. జగన్నాధుడగు శ్రీమహావిష్ణువుండగా భజించకపోవుటకు మానవులకెంత ధైర్యము! సర్వధాత అచ్యుతుడు అగు జగన్నాధుని సేవించక సంసారసాగరమున మునిగిన వారెట్లు తీరమును చేరెదరు. అచ్యుతానంతగోవింద నామోచ్చారణౌషధము వలన అన్ని రోగములు నశించును. నేను నిజమును చెప్పుచున్నాను. నారాయణ జగన్నాధ వాసుదేవ జనార్దన అని కీర్తించువారు అంతటా వందితులగుదురు. ఇప్పటికీ బ్రహ్మాదులచే కూడా తెలియశక్యముకాని ప్రభావముగల శ్రీహరిని శరణువేడుము. హృదయపద్మములో నివసించియున్న శ్రీహరిని తెలియలేని దుర్జనుల మూఢత్వము ఎంత వింత? ఓ మునిశ్రేష్టా! నేను మరల మరల చెప్పుచున్నాను. వినుము. శ్రద్ధగల వారికి శ్రీహరి సంతుష్టుడగును కాని ధనములచే బంధుత్వముచే కాదు. విష్ణుభక్తి గల వారికి ప్రతిజన్మలో బంధువులు ఐశ్వర్యము పుత్రులు వృద్ధి చెందెదరు. ఈ దేహము పాపమూలము. పాపకర్మరతము. ఈ విషయము ను తెలిసి జనార్ధనుని పూజించుము. హరిపూజాపరాయణులకు పుత్రమిత్ర కళత్రాదిబహుసంపదలు కలుగును. సంశయమే లేదు. ఇహపరములలో ఆనందమును కోరువారు సర్వకాలములలో శ్రీహరిని పూజించవలయును. ఇహపరములలో దుఃఖమును కోరువారు పరనిందాపరులు కోవలయును. దేవదేవుడగు జనార్దునుని యందు భక్తిలేని వారి జన్మము వ్యర్థము. సత్పాత్రదానములేని ధనము వ్యర్థము ఓ మునిసత్తమా! కర్మక్షయమును కలిగించు శ్రీమహావిష్ణువును నమస్కరించని వాని శరీరము సర్వపాపములకు నిలయము. సత్పాత్రదానశూన్యమగు ధనమును కాపాడుట చౌర్య ముచేసిన ధనమును కాపాడుట వంటిదని చెలియును. మెరుపువలె చంచలమైన సంపదలచే మదించిన క్షణభంగురులు ప్రాణులు సంసారపాశవిమోచకుడగు విశ్వేశుని పూజించరు. దైవి, అసురియని సృష్టి రెండు విధములు. హరిభక్తికల సృష్టి దైవియని, హరిభక్తి లేని సృష్టి ఆ సురియని తెలియవలయును. సుదుర్లభ##మైన హరిభక్తి కలవారు సర్వశ్రేష్ఠులు. అంతటా ప్రసిద్ధులు. అసూయా రహితులు విప్రరక్షణను చేయువారు కామాది రహితులైన వారి విషయమున శ్రీహరి సంతోషించును. విష్ణ్వాలయమున సమ్మార్జనాది శుశ్రూష చేయువారు సత్పాత్రదాననిరతులు పరమపదమును చేరెదరు. 51-77 ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున éహరిభక్తి లక్షణమను ముప్పదునాలుగవ అధ్యాయము సమాప్తము.