Sri Naradapuranam-I
Chapters
Last Page
పంచత్రింశో
జ్ఞాననిరూపణమ్.
సనక ఉవాచ:-
పునర్వక్ష్యామి మాహాత్మ్యం దేవదేవస్య చక్రిణః, పఠతాం శృణ్వతాం సద్యః పాపరాశిః ప్రణశ్యతి. 1
శాంతా జితారిషడ్వర్గా యోగేనాప్యనహంకృతాః, యజంతి జ్ఞానయోగేన జ్ఞానరూపిణమవ్యయమ్. 2
తీర్థస్నానైర్విశుద్ధా యే వ్రతదానతపోమఖైః, యజంతి కర్మయోగేన సర్వధాతారమచ్యుతమ్. 3
లుబ్ధా వ్యసనినో೭జ్ఞాశ్చ న యజంతి జగత్పతిమ్, అజరామరవన్మూడాస్తిష్ఠన్తి నరకీటకాః. 4
తడిల్లేకాశ్రియా మత్తా వృధాహంకారదూషితాః, న యజన్తి జగన్నాథం సర్వశ్రేయోవిధాయకమ్. 5
హరిధర్మరతాశ్శాన్తా హరిపాదాబ్జసేవకాః, దేవాత్కే೭పీహ జాయన్తే లోకానుగ్రహతత్పరాః. 6
కర్మణా మనసా వాచా యో యజేద్భక్తుతో హరిమ్, స యాతి పరమం స్థానం సర్వలోకోత్తమోత్తమమ్. 7
అత్రైవోదాహరన్తీమమితిహాసం పురాతనమ్, పఠతాం శృణ్వతాం చైవ సర్వపాపప్రణాశనమ్. 8
తత్ప్రవక్ష్యామి చరితం యజ్ఞమాలి సుమాలినోః, యస్య శ్రవణమాత్రేణ వాజిమేధఫలం లభేత్. 9
సనకమహర్షి పలికెను:- ఓ నారదా! చదువువారికి వినువారికి సర్వపాపములను నశింపచేయు దేవదేవుడైన శ్రీహరి మహాత్మ్యమును ఇంకనూ చెప్పెదను. శాంతులు అరిషడ్వర్గమును జయించిన వారు యోగముచే అహంకారమును త్యాగము చేసినవారు జ్ఞానరూపుడగు శ్రీహరిని జ్ఞానయజ్ఞముచే పూజింతురు. పుణ్యతీర్థస్నానములచే వ్రతదానతపోయాగములతే విశుద్ధులైన వారు సర్వదాతయగు అచ్యతుని కర్మయోగముచే పూజింతురు. లోబులు వసనశీలురు జగన్నాధుని పూజించరు. అజ్ఞులగు నరకీటకములు మూఢులై అజరామరువలె భావించుకొనుచుందురు. మెరుపువలె చంచలమైన సంపదచే మదించి వృధాహంకారదూషితులై సర్వస్రేయోవిధాయకుడగు జగన్నాధుని పూజించరు. హరిధర్మతరులు శాంతులు హరిపాదపద్మసేవకులు లోకానుగ్రహతత్పరులు దేవవశమున ఏ కొందరో ఈ భూలోకమును పుట్టెదరు. మనోవాక్కాయములచే భక్తితో శ్రీహరిని సేవించువారు లోకములన్నిటిలో ఉత్తమలోకమగు పరమపదమును పొందెదరు. ఇచటనే ఒక పురాతనమైన ఇతిహాసమును ఉదాహరింతురు. ఈ ఇతిహాసమును చదువువారికి వినువారికి సర్వపాప నాశము జరుగును. అట్టి యజ్ఞమాలిసుమాలుల చరితమును చెప్పెదను. ఈ చరితమును విననచో అశ్వమేధ యాగఫలము లభించును. 1-9
కశ్చిదాసీత్పురా విప్ర బ్రాహ్మణో రైవతేంతరే, వేదమాలిరితిఖ్యాతో వేదవేదాంగపారగః.10
సర్వభూతదయాయుక్తో హరిపూజాపరాయణః, పుత్రమిత్రకలత్రార్థం ధనార్జనపరో ೭భ##వేత్.11
అపణ్యవిక్రయం చక్రే తథా చ రసవిక్రయమ్, చండాలాద్యైరపి తథా సంభాషీ తత్పరిగ్రహీ. 12
తపసాం విక్రయం చక్రే ప్రతానాం విక్రయం తథా, పరార్థం తీర్థగమనం కలత్రార్థమకరాయత్. 13
కాలేన గచ్ఛాతా విప్ర జాతౌ తస్య సుతావుభౌ, యజ్ఞమాలీ సుమాలీ చ యమలావతీ శోభనౌ. 14
తతః పితా కుమారౌ తావతిస్నేహసమన్వితః, పోషయామాస వాత్సల్యాద్బహుభిస్సాధనైస్తదా. 15
వేదమాలిర్బహుపాయైర్ధనం సంపాద్య యత్నతః, స్వధనం గణయామాస కియాత్స్యాదితి వేదితుమ్. 16
నిధికోటిసహస్రాణాం కోటి కోటిగుణాన్వితమ్, విగణయ్య స్వయం హృష్ణో విస్మితశ్చార్థచింతయా .17
అసత్ప్రతిగ్రహైశ్చైవ అపణ్యానాం చ విక్రయైః, మయా తపోవిక్రయాద్యైరేతద్ధనముపార్జితమ్. 18
నాద్యాపి శీంతిమాపన్నా మమ తృష్ణోతిదుస్సహా, మేరుతుల్యసువర్ణాని హ్యాసంఖ్యాతాని వాంఛతి. 19
అహో మన్యే మహత్కష్టం సమస్త క్లేశసాధనమ్, సర్వాన్కామానవాప్నోతి పునరన్యచ్చ కాంక్షతి. 20
జీర్యంతి జీర్యతః కేశాః దంతా జీర్యంతి జీర్యంతః, చక్షుశ్శోత్రే చ జీర్యేతే తృష్ణైకా తరుణాయతే. 21
మమేంద్రియాణి సర్వాణి మన్దబావం వ్రజంతి చ, బలం హతం చ జరసా తృష్ణా తరుణతాం గతా. 22
కష్టాశా వర్తతే యస్య స విధ్వానథ పండితః, సు శాంతో೭పి ప్రమన్యుస్స్యాద్ధీమానప్యతిమూఢధీః. 23
ఆశా భంగకరీ పుంసామజేయా రాతిసన్నిభా, తస్మాదాశాం త్యజోత్ప్రాజ్ఞో యదీచ్ఛేచ్ఛాశ్వతం సుఖమ్. 24
బలం తే జో యశ##శ్చైవ విద్యాం మానం చ వృద్ధాతామ్, తథైవ సత్కురే జన్మ ఆశా హంత్యతివేగతః. 25
నృణామాశాభిభూతానామాశ్చర్యమిదముచ్యతే, కించిద్ధాతాపి చాండాలస్తస్మాదధికతాం గతః. 26
ఆశాభిభూతా యే మర్త్యా మహామోహా మహాద్ధతాః, అవమానాదికం దుఃఖం న జానన్తి కదాప్యహా. 27
మయాప్యేవం బహుక్లేశైరేతద్ధనముపార్జితమ్, శరీరమపి జీర్ణం చ జరసాపహతం బలమ్. 28
ఇతః పరం యతిష్యామి పరలోకార్థమాదరాత్, ఏవం నిశ్చిత్య విప్రేన్ద్ర ధర్మమార్గతో ೭భ##వేత్. 29
తదైవ తద్ధనం సర్వం చతుర్ధా వ్యభజత్తథా, స్వయం తు భాగద్వితయం స్వార్జితార్థాదపాహరత్. 30
శేషం చ భాగద్వితయం పుత్రయోరుభయోర్దదౌ, స్వేనార్జితానాం పాపానాం నాశం కర్తుమనాస్తదా. 31
ప్రపాతడాగారామాంశ్చ తథా దేవగృహాన్బహున్, అన్నాదీనాం చ దానాని గంగాతీరే తకార సః. 32
ఏవం ధనమశేషం చ విశ్రాణ్య హరిభక్తిమాన్, నరనారాయణస్థానం జగామ తపసే వనమ్. 33
పూర్వము రైవతప్రాంతమున వేదవేదాంగపారగుడగు వేదమాలియను ప్రసిద్ధుడగు బ్రాహ్మణుడుండెను. సర్వబూతములయందు దయాపరుడు హరిపూజాపరాయణుడుగా ఉండెను. పుత్రమిత్రకలత్రాది పోషణౖ ధనార్జన పరుడాయెను. అమ్మకూడని వస్తువులను, రసములను అమ్మసాగెను. చండాలాదులచే సంభాషించుట , వారి నుండి దానములను స్వీకరించుట తపస్సును వ్రతములను విక్రయించుట,, ఇతరుల కొఱకు తీర్థయాత్రాగమనము మొదలగు వాటిని కలత్రపోషణకు చేయసాగెను. కొంతకాలమునకు అతనికి ఇద్దరు పుత్రులు కవలలు కలిగిరి వారు అతి సుందరులు. యజ్ఞమాలి సుమాలి అను పేరు కలవారు. అపుడు వేదమాలి తన పుత్రులను మిక్కిలి స్నేహముతో వాత్సల్యముతో బహువిదోపాయములచే పోషించసాగెను. వేదమాలి పలు వుపాయములచే ధనమును సంపాదించి సంపాదించిన ధనమెంత యున్నదో తెలియుటకు లెక్కించసాగెను. కొన్నివేల కోట్ల నిధులు కోట్లు కోట్లుగా ఉన్న ధనమును లెక్కించి సంతోషమును ఆశ్చర్యమును పొందెను. దుర్జనులనుండి దానమును స్వీకరించుటచే, అమ్మకూడని వాటిని అమ్ముటచే, తపోవ్రతాది విక్రయములచే నేనీ ధనమును సంపాదించితిని. అయిననూ ఇప్పటికీ నా ఆశ శాంతించలేదు. మేరుపర్వతప్రమాణము గల బహుసువర్ణ రాశులను కోరుచున్నది. అన్ని కష్టములను తొలగించుకొనుట చాలా కష్టము. అన్ని కోరికలను తీరినను మరల కొన్నిటిని కోరును. వార్దక్యమున శరీరము జీర్ణముకాగా కేశములు దంతములు నేత్రములు శ్రోత్రములు జీర్ణించును. కాని ఆశ మాత్రము తారుణ్యముతో విలసిల్లు చుండును. వార్థక్యముచే నా ఇంద్రియములన్నియు మందములైనవి. బలము తగ్గినది. కాని అశా బలము మాత్రము పెరిగినది. ఆశ కలవాడు పండితుడైనను విద్వాంసుడైనను కాంతుడైనను బుద్ధిమంతుడైనను కోపిష్ఠి మూఢుడు అగును. మానవులకు ఆశ భంగమును కలిగించును. జయింపశక్యము కానిది శత్రుతుల్యము. కావున శాశ్వతానందమును కోరు ప్రాజ్ఞుడు ఆశను పరిత్యజించవలయును. బలమును. తేజస్సును, కీర్తిని, విద్యను, అభిమానమును, వార్థక్యమును సత్కులజాతత్వలమును ఆశ చాలా త్వరగా భంగపరచును. ఆశాభిభూతులైన మానవులకు కొంచెమిచ్చువాడు చండాలుడైనను ఎంతో గొప్పవానిగా కనిపించును. ఎంత ఆశ్చర్యము! ఆశాభిభూతులగు మానవులు మహామోహముతో మహాగర్వముతో అవమానాదికమును దుఃఖమును పరిగణించరు. శరీరము జీర్ణమైనది. వార్థక్యముచే బలము తగ్గినది. కావున ఇక నుండి పరలోకము కొఱకు ప్రయత్నించెదను. ఇట్లు నిశ్చయించుకొని ధర్మమార్గపరుడాయెను. వెంటనే ఆ ధనమునంతటిని నాలుగ భాగములుగా విభజించెను. తాను రెండు భాగములను స్వీకరించి మిగిలిన రెండు భాగములను ఇద్దరు పుత్రులకిచ్చేను. తాను సంపాదించుకొనిన పాపములను నశింపచేయగోరి నశింపచేయగోరి చలివేంద్రములను, తటాకములను, ఉద్యానవనములను .చాలా దేవాలయములను గంగాతీరమున అన్నదానములను చేసెను. ఇట్లు హరిభక్తిచే సమస్త ధనమును దానము చేసి తపమునాచరించుటకు నరనారాయణాశ్రమమునకు వెళ్ళెను. 10-33
తత్రాపశ్యన్మనోహారమాశ్రమం మునిసేవితమ్, ఫలితైః పుష్పిశ్చైవ శోభితం వృక్షసంచయైః. 34
గృణద్భిః పరమం బ్రహ్మ శాస్త్రచింతాపరైస్తథా, పరిచార్యారైర్వృద్ధైర్మునిభిః పరిసేవితమ్. 35
శిషై#్యః పరికృతం తత్ర మునిం జానంతి సంజ్ఞకమ్, గృణంతం పరమం బ్రహ్మ తేజోరాశిం దదర్శ హ. 36
శమాదిగుణసంయుక్తం రాగాదిరహితం మునిమ్, శీర్ణపర్ణాశనం దృష్ట్వా వేదమాలిర్నానామ తమ్. 37
తస్య జానన్తిరాగంతోః కల్పయామాస చార్హణమ్, కందమూలఫలాద్యైస్తు నారాయణధియా మునే. 38
కృతాతిథ్యక్రియాస్తేన వేదమాలీ కృతాంజలిః, వినయావనతో భూత్వా ప్రోవాచ వదతాం వరమ్. 39
భగవాన్ కృతకృత్యో೭స్మి విగతం కల్మషం మమ, మాముద్ధర మహాభాగ జ్ఞానదానేన పండిత. 40
ఏవముక్తస్తేన జానన్తిర్మునిసత్తమః, ప్రోవాచ ప్రహసన్వాగ్మీ పేదమాలిం గుణాన్వితమ్. 41
ఆ నరనారాయస్థానమున పుష్పఫలసంచయముచే కూడిన వృక్షరాశులచే శోభితము, బహుమునిసేవితము, పరబ్రహ్మను ధ్యానించువారు శాస్త్రార్థ చింతనము చేయువారు, పరిచర్యాపరులు, వృద్ధులు అగు మునులతో కూడియున్నదీ అయిన ఆశ్రమమును చూచెను. ఆ ఆశ్రమమున శిష్యులచే పరివృతుడు, పరబ్రహ్మోపాసకుడు, తేజోరాశియగు జానన్తి అను పేరు గల మహర్షిని చూచెను. జానన్తిమహర్షిశమాది గుణయుతుడు, రాగద్వేషరహితుడు రాలిపడిన ఆకులను భుజించువాడు. అట్లున్న జానన్తి మహర్షిని చూచిన వేదమాలి నమస్కరించెను. జానన్తి మహర్షి ఆగంతకుడు వేదమాలికి అతిథి మర్యాద చేసెను. నారాయణ బుద్ధిచే కందమూలఫలాదుల నర్పించి పూజించెను. ఇట్లు మహర్షిచే అతిథి మర్యాదను పొందిన వేదమాలి చేతులు జోడించి వినయముతో నమ్రుడై ఇట్లు పలికెను. 'శమాది గుణరాశీ! మహానుభావా! నా కల్మషములన్నియూ మీ దర్శనముచే నశించినవి. ఓ పండితుడా జ్ఞానమును ప్రసాధించి నన్నుద్ధరించుము'. వేదమాలి ఇట్లు పలుకగా వాగ్మియగు జానన్తి మహర్షి చిరునవ్వుతో గుణవంతుడగు వేదమాలిని చూచి ఇట్లు పలికెను. 34-41
శృణుష్వ విప్రశార్దూల సంసారచ్ఛేదకారణమ్, ప్రవక్ష్యామి సమాసేన దుర్లభం త్వకృతాత్మనామ్ 42
భజ విష్ణుం పరం నిత్యం స్మర నారాయణం ప్రభుమ్, పరాపవాదం పైశున్యం కదాచిదపి మా కృథాః. 43
పరోపరకారనిరతస్సదా భవ మహామతే, పరిపూజాపరశ్చైవ, త్యజ మూర్ఖసమాగమమ్. 44
కామం క్రోధం చ లోభం చ మోహం చ మదమత్సరౌ, పరిత్యజ్యాత్మవల్లోకం దృష్ట్వా శాంతిం గమిష్యసి. 45
అసూయాం పరనిన్దాం చ కదాచిదపి మా కురు, దంభాచారమహంకారం నైష్ఠుర్వం చ పరిత్యజ. 46
దయాం కురుష్వ భూతేషు శుశ్రూషాం చ తథా సతామ్, త్వయా కృతాంశ్చ ధర్మాన్వై మా ప్రకాశయ పృచ్ఛతామ్. 47
అనాచారపరాన్దృష్ట్వా నోపేక్షాం కురు శక్తితః, పూజయ స్వాతిథిం నిత్యం స్వకుటుంబావిరోధతః. 48
పత్రైః పుషై#్పః ఫలైర్వాపి దూర్వాభిః పల్లవైస్తతా, పూజయస్య జగనాథం నారాయణమకామతః. 49
దేవానకృషీనృతృంశ్చాపి తప్రయస్వ యథావిధి, ఆగ్నేశ్చ విధివద్విప్ర పరిచర్యాపరో భవ. 50
దేవతాయతనే నిత్యం సమ్మార్జనపరో భవ, తథోపలేపనం చైవ కురుష్వ సుసమాహితః. 51
శీర్ణస్ఫచికసంధానం కురు దేవగృహే సదా, మార్గశోభాం చ దీపం చ విష్ణోరాయతనే కురు. 52
కందమూలఫలైర్వాపి సదా పూజయ మాధవమ్, ప్రదక్షిణనమస్కారైస్సోత్రాణాం పఠనైస్తథా. 53
పురాణశ్రవణం చైవ పురాణపఠనం తథా, వేదాంతపఠనం చైవ ప్రత్యహం కురు శక్తితః. 54
ఏవం స్థితే తవ జ్ఞానం భవిష్యత్యుత్తమోత్తమమ్, జ్ఞానాత్సమస్తపాపానాం మోక్షో భవతి నిశ్చితమ్. 55
ఏవం ప్రభోధితస్తేన వేదమాలిర్మహామతిః, తథా జ్ఞానరతో నిత్యం జ్ఞానలేశమావాప్తవాన్. 56
జానన్తి మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! సాధన చేయనివారికి దుర్లభం సంసారచ్ఛేదకారణము అగు జ్ఞానమును సంగ్రహముగా చెప్పెదను వినుము. పరుడు నిత్యుడగు శ్రీమహావిష్ణువును సేవించుము. ప్రభువగు నారాయణుని స్మరించుము. పరాపవాదమును, కొండెములు చెప్పుటను ఎప్పుడూ చేయకుము. ఎపుడూ పరోపకార నిరతుడు కమ్ము. మూర్ఖ సమాగమును వదలి హరి పూజ పరుడవు కమ్ము. కామక్రోధలోభ మోహమదమాత్సర్యములను విడిచి లోకమును ఆత్మసమముగా చూచి శాంతిని పొందుము. అసూయను పరనిందను ఎపుడూ చేయకుము. దంభాచారమును అహంకారమును కాఠిన్యమును విడిచిపెట్టుము. ప్రాణులయందు దయను చూపుము. సత్పురుషులను సేవించుము. అడుగువారికి నీవు చేసిన ధర్మములను తెలుపకుము. అనాచారపరులను చూచి శక్తి మేరకు ఉపేక్షించకుము. నీ కుటుంబమునకు విరోధము కాని విధముగా అతిథిపూజను సలుపుము. అనాచార పరులను చూచి శక్తి మేరకు ఉపేక్షించకుము. పత్రపుష్పఫలములతో దూర్వాంకులములచే పల్లవములచే నిష్కామముగా జగన్నాథుడగు నారాయణుని పూజించుము. యథావిధిగా దేవర్షి పితృగణములను తృప్తి పరచుము. విధిననుసరించి అగ్ని పరిచర్యను చేయుము. ప్రతి నిత్యము దేవాలయమున సమ్మార్జనమును చేయుము. సావదానముచే దేవాలయమును అలుకుము. దేవాలయమున శీర్ణమైన వాటిని శిధిలమైన వాటిని సంధానము చేయుము. విష్ణ్వాలయమున మార్గమును అలంకరించుము. దీపములను వెలిగించుము. కందమూల ఫలములతో నిత్యమూ మాధవుని పూజింపుము. ప్రదక్షిణ నమస్కారములతో స్తోత్రపాఠములచే శ్రీహరిని ఆరాధించుము. శక్తి ననుసరించి ప్రతినిత్యము పురాణ శ్రవణమును పురాణ పఠనమును వేదాంత పఠనమును చేయుము. ఇట్లు చేసినచో నీకు ఉత్తమోత్తమజ్ఞానము సిద్ధించును. జ్ఞానము వలన సమస్త పాపనాశము జరుగును. ఇట్లు జానన్తి మహర్షిచే బోధించబడిన వేదమాలి ఆ మార్గముననుసరించి కొంత జ్ఞానమును పొందెను. 42-56
వేదమాలిః కదాచిత్తు జ్ఞానలేశప్రచోదితః, కో೭హం మమ క్రియా కేతి స్వయమేవ వ్యచింతయత్. 57
మమ జన్మ కథం జాతం రూపం కీదృగ్వీధం మమ, ఏవం విచారణపరో దివానిశమతంద్రితః. 58
అనిశ్చితమతిర్భూత్వా వేదమాలిర్ద్విజోత్తమః, పునర్జానంతిమాగమ్య ప్రణమ్యేదమువాచ హ. 59
వేదమాలి ఒకపుడు తనకు కలిగిన జ్ఞానలేశముచే నేనెవరిని? నా పనేమిటి? అని తనలో తానే ఆలోచించుకొనెను. నాకెట్లు జన్మ కలిగెను? నా స్వరూపమెట్టిది? ఇట్లు రేయింబవళ్ళు చింతాపరుడై ఏ నిశ్చయము చేయజాలక బ్రాహ్మణోత్తముడగు వేదమాలి మరల జానన్తి మహర్షిని సమీపించి నమస్కరించి ఇట్లు పలికెను. 57-59
వేదమాలిరువాచ :-
మమ చ్తితమతిభ్రాంతం గురో బ్రహ్మవిదాం వర, కోహం మమ క్రియా కా చ మమ జన్మ కథం వద! 60
వేదమాలి పలికెను :- బ్రహ్మజ్ఞానశ్రేష్ఠా! గురువర్యా! నా చిత్తము మిక్కిలి
భ్రమించుచున్నది. నేనెవరిని? నా పనేమిటి? నాకు జన్మ ఎట్లు కలిగెను. తెలుపుము. 60
జానన్తి రువాచ :-
సత్యం సత్యం మహాభాగ! చిత్తం భ్రాంతం సునిశ్చితమ్, అవిద్యానిలయం చిత్తం కథం సద్భావమేష్యతి. 61
మమేతి గదితం యత్తు తదపి భ్రాంతిరిష్యతే, అహంకారో మనోధర్మ ఆత్మనో న హి పండిత. 62
పునశ్చ కో ೭హమిత్యుక్తం వేదమాలే త్వయా తు యత్, మమ జాత్యాదిశూన్యస్య కథం నామ కరోమ్యహమ్, 63
ఆనౌపమ్య స్వభావస్య నిర్గుణస్య పరాత్మనః, నీరుపస్యాప్రమేయస్య కథం నామ కరోమ్యహమ్. 64
పరంజ్యోతిస్వరూపస్య పరిపూర్ణావ్యయాత్మనః, అవిచ్ఛిన్నస్వభావస్య కథ్యతే చ కథం క్రియా. 65
స్వప్రకాశాత్మనో విప్ర నిత్యస్య పరమాత్మనః, అనంతస్య క్రియా చైవ కథం జన్మ చ కథ్యతే. 66
జ్ఞానైకవేదమజరం పరం బ్రహ్మ సనాతనమ్, పరిపూర్ణం పరానందం తస్మాన్నాన్యదిహ ద్విజ. 67
తత్త్వమస్యాదివాక్యేభ్యో జ్ఞానం మోక్షస్య సాధనమ్, జ్ఞానే త్వానాహతే సిద్ధే సర్వం బ్రహ్మమయం భ##వేత్. 68
ఏవం ప్రభోదితస్తేన వేదమాలిర్మునీశ్వర! ముమోద పశ్యన్నాత్మానమాత్మన్యేవాచ్యుతం ప్రభుమ్. 69
ఉపాధిరహితం బ్రహ్మ స్వప్రకాశం నిరంజనమ్, అహమేవేతి నిశ్చిత్య పరాం శాంతిమవాప్తవాన్. 70
తతశ్చ వ్యవహారార్ధం వేదమాలిర్మునీశ్వరమ్, గురుం ప్రణమ్య జానన్తిం సదా ధ్యానపరో ೭భవత్. 71
గతే బహుతిథే కాలే వేదమాలిర్మునీస్వర, వారాణీం పురం ప్రాప్య పరం మోక్షమవాప్తవాన్. 72
య ఇమం పఠతే೭ధ్యాయం శృణుయాద్వా సమాహతిః, స కర్మపాశవిచ్ఛేదం ప్రాప్య సౌక్యమవాప్నుయాత్. 73
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే
ప్రథమపాదే జ్ఞాననిరూపణం నామ
పంచత్రింశో೭ధ్యాయః
జానన్తి మహర్షి పలికెను :- ''ఓ మహానుభావా ! నీ మాటముమ్మాటికి నిజమే. మనసు భ్రమించుట నిశ్చతమే, అవిద్యానిలయమగు చిత్తము సద్భావము నెట్లు పొందును? నాది అని చెప్పుట కూడా భ్రాంతియే యగును. ఓ పండితుడా! అహంకారము మనోధర్మము కాని ఆత్మధర్మము కాదు. అయినను నీవు నేనెవరిని అని అడిగితివి. జాత్యాదిశూన్యమైన అహమునకు నేనెట్లు నామకరణము చేతును? సాటిలేని స్వభావము కలది గుణరహితము పరాత్మ రూపరహితము, అప్రమేయమైన ఆత్మకు నామకరణమెట్లు చేతును ? పరంజ్యోతి స్వరూపము, పరిపూర్ణము, అవ్యయాత్మ, అవిచ్చిన్న స్వభావము అయిన ఆత్మక్రియ ఎట్లు చెప్పగలను? స్వప్రకాశ స్వరూపము నిత్యము, అనంతమును అయిన పరమాత్మకు జన్మను క్రియను ఎట్లు చెప్పగలను? జ్ఞానైకవేద్యము, అజరము సనాతనము, పరిపూర్ణము, పరానందము అయిన పరమాత్మకంటే భిన్నమీజగత్తున మరొకటి లేదు. 'తత్త్వమసి' మొదలగు వాక్యములను తెలియటే మోక్షసాధనము. జ్ఞానము కొట్టబడనపుడు జగత్తంతయూ బ్రహ్మమయమే యగును''. ఇట్లు జానన్తి మహర్షి బోధించగా వేదమాలి అత్మలో ఆత్మస్వరూపమగు అచ్యుతుని సాక్షాత్కరించుకొని ఆనందించెను. పరబ్రహ్మ ఉపాధిరహితము స్వయంప్రకాశము, నిరంజనము, అయినది నేనే అని నిశ్చయించుకొని పరమశాంతి ని పొందెను. తరువాత లోకాచారము కొఱకు వేదమాలి గురువగు జానన్తికి నమస్కరించి ధ్యానపరుడాయెను. చాలా కాలము గడచిన తరువాత వేదమాలి వారాణసీ పురమునకు వెళ్ళి మోక్షమునుపొందెను. ఈ అధ్యాయమును సావధానముగా చదివిననూ వినిననూ కర్మపాశవిచ్ఛేదమును పొంది పరమానందమునందగలడు. 61-73
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
పూర్వభాగమున ప్రథమపాదమున జ్ఞాననిరూపణమను
ముప్పదిఅయిదవ అధ్యాయము సమాప్తము.