Sri Naradapuranam-I    Chapters    Last Page

షట్త్రింశోధ్యాయః = ముప్పదియారవ అధ్యాయము

విష్ణుసేవాప్రభావః

సనక ఉవాచ:-

వేదమాలేస్సుతౌ పోక్తౌ యావుభౌ మునిసత్తమ ! యజ్ఞమలీ సుమాలీ చ తయోః కర్మాధునోచ్యతే.1

తయోరాద్యో యజ్ఞామాలీ బిభేద పితృసంచితమ్‌, ధనం ద్విధా కనిష్ఠస్య భోగమేకం దదౌ తదా. 2

సుమాలీ చ ధనం సర్వం వ్యసనాభిరతస్సదా, అపాదానాదిభిశ్చైవ నాసయామాస భో ద్విజ. 3

గీతవాద్యరతో నిత్యం మద్యపానరతోభవత్‌,, వేశ్యవిభ్రమలుబ్ధోసౌ పరదారరతో భవత్‌. 4

సర్వస్మినాశమాయాతే హిరణ్య పితృసంచితే, అపహృత్య పరం ద్రవ్యం వారస్త్రీనిరతో భవత్‌.5

దృష్ట్వా సుమాలినశ్శీలం యాజ్ఞామాలీ మహామతిః, బభూవ దుఃఖితో త్యర్ధం భ్రాతరం చేదమబ్రవీత్‌. 6

అలమత్యంతకష్టేన వృత్తేనాస్మత్కులేనుజ, త్వమేక ఏవ దుష్టాత్మా మహాపాపరతో భవః. 7

ఏవం నివారయంతం తం బహుశో జ్యేష్ఠసోదరమ్‌, హనిష్యామీతి నిశ్చిత్య ఖడ్గహస్తః కచే గ్రహీత్‌. 8

తతో మహారవో జజ్ఞే నగరే భృశదారుణః, బబంధుర్నాగరాశ్చైనం కుపితాస్తే సుమాలినమ్‌. 9

యజ్ఞమాలీ పునశ్చాపి బిభిదే స్వధనం ద్విధా ఆదదే స్వయమర్ధం చ దదావర్ధం యవీయసే. 11

సుమాలీ త్వతిమూడాత్మా తద్ధనం చాపి నారద! మూర్ఖైః పాఖండచండాలైర్భుభుజే చ సహోద్ధతః. 12

అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయః, పిచుమందః ఫలాడ్యోపి కాకైరేవోపభుజ్యతే. 13

భ్రాత్రా దత్తం ధనం తచ్చ సుమాలీ నాశయన్మునే మద్యపానప్రమత్తశ్చ గోమాంసాదీన్యభక్షయత్‌. 14

త్యక్తో బంధుజనై స్సర్వైశ్చాండాలస్త్రీసమన్వితః, రాజ్ఞాపి బాధితో విప్ర ప్రపేదే నిర్జనం వనమ్‌. 15

యజ్ఞమాలీ సుధీర్విప్ర సదా ధర్మరతోభవత్‌, ఆవారితం దదావన్నం సత్సంగగతకల్మషః. 16

పిత్రా కృతాని సర్వాణి తటాకాదీని సత్తమ, అపాలయత్పరయత్నేన సదా ధర్మపరాయణః. 17

విశ్రాణితం ధనం సర్వం యజ్ఞమాలేర్మహాత్మనః, తత్పాత్రదాననిష్ఠస్య ధర్మమార్గప్రవర్తినః. 18

అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః, కల్పవృక్షఫలం సర్వమమరైరేవ భుజ్యతే. 19

ధనం విశ్రాణ్య ధర్మార్ధం యజ్ఞమాలీ మహామతిః, నిత్యం విష్ణుగృహే సమ్యక్పరిచర్యాపరో భవత్‌. 20

సనక మహర్షి పలికెను :- వేదమాలి పుత్రులగు యజ్ఞమాలి సుమాలుల చరితమును ఇపపుడు చెప్పెదను. పెద్దవాడగు యజ్ఞామాలి తన ధనమును రెండు బాగములుగా విభజించి ఒక భాగమును చిన్నావాడగు సుమాలికిచ్చెను. సుమాలి వ్యసనలోలుడై ధనమునంతటిని అపాత్రదానములచే నశింపచేసెను. ప్రతినిత్యము గీతవాద్యములందు ఆసక్తుడై మద్యపానరతుడై వేశ్యా విలాసములయందు ఆశపడి పరదారరతుడాయెను. పిత్రార్జితమైన ధనమంతయూ వ్యయము కాగా పరద్రవ్యమును అపహరించి వేశ్యాలోలుడాయెను. సుమాలి దుర్వృత్తమును చూచి మహామతియైన యజ్ఞమాలి దుఃఖితుడై తమ్మునితో నిట్లు పలికెను సోదరా ! మన కులములో పుట్టిన నీవు దురాచారము నవలంబించి కష్టపడుట తగదు. ఈ కులములో నీ వొక్కడవే దుష్టాత్ముడవు మహాపాపరతుడవగుచున్నావు. ఈ దుర్వృత్తమును మానుము. ఇట్లు పలుమార్లు వారించుచున్న అన్న మీద ఆగ్రహించిన సుమాలి యజ్ఞమాలిని చంపుటకు నిశ్చయించి ఖడ్గహస్తుడై కేశములను పుట్టుకొనెను. అంతట నగరమున భయంకరమైన మహానాదము కలిగెను. నగర ప్రజలు కోపించినవారై సుమాలిని బంధించిరి. సజ్జనుడగు యజ్ఞమాలి నాగరులను ప్రార్థించి సుమాలిని విడిపించెను. మరల తన ధనమును రెండు భాగములుగా విభజించి ఒక భాగమును సుమాలికిచ్చెను. అతమూఢుడైన సుమాలి ఆ ధనమును కూడా మూర్ఖులగు పాషాండచండాలులతో కలిసి అనుభవించెను. దుర్జనుల సంపదలు దుర్జనులచే మాత్రమే అనుభవించబడును. వేపచెట్టు పండ్లును కాకులు మాత్రమే భుజించును కదా ! యజ్ఞమాలి ఇచ్చిన ధనమును కూడా సుమాలి వ్యయము చేసెను. మద్యపానమత్తుడై గోమాంసాదులను భక్షించెను. బందుజనులచే వెలివేయబడి, రాజుచే శిక్షించబడి చండాలస్త్రీలతో కూడి నిర్జానారణ్యమున ప్రవేశించెను. మంచిబుద్ధి గల యజ్ఞమాలి మాత్రము ఎప్పుడూ, ధర్మరతుడై నిరంతరాయముగా అన్నదానమును చేయచుండ సత్సంగతివలన పాపములు తొలగెను. తండ్రి త్రవ్వించిన తటాకాదులను ధర్మపరాయణుడై నిత్యము కాపాడుచుండెను. ధర్మమార్గప్రవర్తకుడై మహానుభావుడగు యజ్ఞమాలి సత్పాత్రదానముచే ధనమునంతయూ వ్యయము చేసెను. సజ్జనుల సంపదలు సజ్జనుల భోగమునకే ఉపయోగపడును. కల్పవృక్షఫలములను అమరులు మాత్రమే అనుభవింతురు కదా ! ధర్మకార్యములకు ధనమును వ్యయము చేసిన యజ్ఞమాలి ప్రతినిత్యము విష్ణ్వాలయమున పరిచర్యలను చేయుచుండెను. 1-20

కాలేన గచ్ఛతా తౌ తు వృద్ధభావముపాగతౌ, యజ్ఞమాలీ సుమాలీ చ హ్యేకకాలే మృతావుభౌ. 21

హరిపూజారతస్యాస్య యజ్ఞమాలీమహాత్మనః, హరిస్సంప్రేయమాస విమానం పార్షదావృతమ్‌. 22

దివ్యం విమానమారుహ్య యజ్ఞమాలీ మహామతిః, పూజ్యమానస్సురగణౖస్సూయమానో మునీశ్వరైః. 23

గంధైర్వైర్గీయమానశ్చ సేవితాశ్చప్సరో గణౖః, కామధ్వేన్వా పుష్యమాణశ్చిత్రాభరణభూషితః, 24

కోమలైస్తుల సీమాల్వైర్బూషితస్తేజసాం నిధిః, గచ్ఛన్విష్ణుపదం దివ్యమనుజం పథి దృష్టవాన్‌. 25

తాడ్యమానం యమభ##టైః క్షుత్తృఢ్బ్యాం పరిపీడితమ్‌, ప్రేతభూతం వివస్త్రం చ దుఃఖితం పాశ##వేష్టితమ్‌. 26

ఇతస్తతః ప్రధావన్తం విలపంతమనాధవత్‌, క్రోశంతం చ రుదన్తం చ దృష్ట్వా మనసి వివ్యధే. 27

యజ్ఞమాలీ యదాయుక్తో విష్ణుదూతాన్సమీపగాన్‌, కోయం భ##టైర్బధ్యమాన ఇత్యపృచ్ఛత్కృతాంజలిః. 28

అథ తే హరిదూత్తాస్తం యజ్ఞమాలిం మహౌజసమ్‌, అసౌ సుమాలీ భ్రాతా తే పాపాత్మేతి సమబ్రువన్‌. 29

యజ్ఞమాలీ సమాకర్ణ్య వ్యాఖ్యాతం విష్ణుకింకరైః, మనసా దుఃఖమాపన్నః పునః పప్రచ్ఛ నారద. 30

కథమస్య భ##వేన్మోక్షస్సంచితైః పాపసంచయైః, తదుపాయం వదుధ్వం మే యూయం హి మమ బాంధవాః. 31

సఖ్యం సాప్తపదీనం స్యాదిత్యాహుర్ధర్మకోవిదాః, సతాం సాప్తపదీ మైత్రీ సత్సతాం త్రీపదీ తథా. 32

సత్సతామపి యే సంతస్తేషాం మైత్రీ పదే పదే. 33

తస్మాన్మే బాంధవా యూయం మాం నేతుం సముపాగతాః, యతోయం మమభ్రాతాపి ముచ్యతే తదిహోచ్యతామ్‌. 34

యజ్ఞమాలివచశ్శ్రుత్వా విష్ణుదూతా దయాలవః, పునస్స్మితముఖాః ప్రోచుర్యజ్ఞమాలిం హరిప్రియమ్‌. 35

కొంతకాలమునకు యజ్ఞమాలి సుమాలి వార్ధక్యమును పొందిరి. ఇద్దరూ ఒకే సమయమున మరణించిరి. మహానుభావుడు హరిపూజాపరుడు అయిన యజ్ఞమాలికై శ్రీహరి ద్వారపాలకులతో కూడియున్న దివ్య విమానమును పంపెను. మహామతియగు యజ్ఞమాలి దివ్య విమానము నదిరోహించి దేవతాగణములు పూజించుచుండగా, మునీశ్వరులు స్తుతుంచుచుండగా గంధర్వులు గానము చేయుచుండగా అప్సరోగణములు సేవించుచుండగా కామధేనువు పోషించుచుండగా చిత్రాభరణ భూషితుడై కోమలములైన తులసీమాలలచే అలంకరించబడి తేజోనిధి దివ్యమైన విష్ణులోకమునకు వెళ్ళుచు మార్గమధ్యమున తమ్ముని చూచెను. యమభటులు కొట్టుచుండగా ఆకలిదప్పులచే పీడింబడుచు, ప్రేతరూపుడైన నగ్నముగా దుఃఖితుడై పాశబద్ధుడై ఇటునటు పరుగిడుచు అనాధవలె విలపించుచు ఆక్రోశించుచు రోదించుచున్న వానిని చూచి మనసున వ్యధచెందెను. యజ్ఞమాలి యదాన్వితుడై దగ్గరలోనున్న విష్ణుదూతలను ఇట్లు భటులచే బాధించబడువాడెవ్వడు అని అడిగెను. అట్లు చేతులు జోడించి అడిగిన మహాతేజస్వియగు యజ్ఞమాలి కి విష్ణుదూతలు , ఇతను నీ తమ్ముడు పాపాత్ముడగు సుమాలి, అని తెలిపిరి. విష్ణుదుతలు చెప్పిన మాటలను వినిన యజ్ఞమాలి మనసులో దుఃఖించి మరల వారి నడిగెను ఇతను చేసిన పాపనులనుండి ఎట్లు విముక్తి లభించును? మీరు నాకు బంధువులు కావున ఆ ఉపాయమును తెలుపుడు. ఏడడుగులు కలిసి నడిచినచో సఖ్యమని ధర్మకోవిదులు చెప్పియున్నారు. సజ్జనులకు ప్రతిపదమున మైత్రి అని కదా ధర్మ నిర్ణయము కావున నన్ను గొనిపోవుట కొచ్చిన మీరు నాకు బాంధవులు. నా సోదరుడగు సుమాలి కూడా మొక్షమును పొందునుపాయమును తెలుపుడు. ఇట్లు పలికిన యజ్ఞమాలి మాటలను వినిన విష్ణుదుతలు దయాళువులు కావున చిరునవ్వుతో హరిప్రియుడగు యజ్ఞమాలిని గూర్చి ఇట్లు పలికిరి. 21-35

విష్ణుదూతా ఊవాచ : -

యజ్ఞమాలి మహాభాగ! నారాయణపరాయణ! ఉపాయం తవ వక్ష్యామః సుమాలి ప్రేమముక్తిదమ్‌. 36

కృతం యత్సుమహత్కర్మ త్వయా ప్రాక్తన జన్మని, ప్రవక్ష్యామస్సమాసేన తచ్ఛృణుశ్వ సమాహితః. 37

పురా త్వం వైశ్యజాతీయో నామ్నా విశ్వంభరస్స్మృతః, త్వయా కృతాని పాపాని మహన్త్యగణితాని వై. 38

సుకర్మవాసనాహీనో మాతాపిత్రోర్విరోధకృత్‌, ఏకదా బందుభిస్త్యక్తః శోకసంతాపపీడితః. 39

క్షుధాగ్నినాపి సంతప్తః ప్రాప్తవాన్హరిమందిరమ్‌, తదా వృష్టిరభూత్తత్ర తత్థ్సానం పంకిలం హ్యభూత్‌. 40

దూరీకృతస్త్వయా పంకస్తత్థ్సానే స్థాతుమిచ్ఛతా, ఉపలేపనతాం ప్రాపేతం తత్థ్సానం విష్ణుమందిరే. 41

త్వయోషితం తు తద్రాత్రే తస్మిన్దేవాలయే, ద్విజ, దంశితశ్చైవ సర్పేణ ప్రాప్తం పంచత్వమేవ చ. 42

తేన పుణ్యప్రభావేన ఉపలేపకృతేన చ, విప్రజన్మ త్వయా ప్రాప్తం హరిభక్తిస్తథా చలా. 43

కల్పకోటిశతం సాగ్రం సంప్రాప్య హరిసన్నిధిమ్‌, వసాద్య జ్ఞానమాసాద్య పరం మోక్షం గమిష్యసి. 44

అనుజం పాతకిశ్రేష్ఠం త్వం సముద్ధర్తుమిచ్ఛసి, ఉపాయం తవ వక్ష్యామన్తం నిభోధ మహామతే. 45

గో చర్మమాత్రభూమేస్తు ఉపలేపనజం ఫలమ్‌, దత్వోద్ధర మహాభాగ భ్రాతరం కృపయాన్వితః. 46

ఏవముక్తో విష్ణుధూతైర్యజ్ఞమాలీ మహామతిః, తత్ఫలం ప్రదదౌ తసై#్మ భ్రాత్రే పాపవిముక్తయే. 47

సుమాలీ భ్రాతృదత్తేన పుణ్యన గతకల్మషః, బభూవ యమదూతాస్తు తం త్యక్త్వా ప్రపలాయితాః. 48

విమానం చాగతం సద్యస్సర్వభోగసమన్వితమ్‌, తదా సుమాలీ స్వర్యానమారుహ్య ముముదే మునే. 49

తావుభౌ భ్రాతరౌ విప్ర సురబృందనమస్కృతౌ, అవాపతుర్భృశం ప్రీతిం సమాలింగ్య పరస్పరమ్‌. 50

యజ్ఞమాలీ సుమాలీ చ స్తూయమానౌ మహర్షిభిః, గీయమానౌ చ గంధర్వైః విష్ణులోకం ప్రజగ్మతుః. 51

అవాప్య హరిసాలోక్యం సుమాలీ మునిసత్తమ, యజ్ఞమాలీ చోషతుస్తే కల్పమేకం ముదాన్వితౌ. 52

భుక్త్వా భోగాన్బహుంస్తత్ర యజ్ఞమాలీ మహామతిః, తత్రైవ జ్ఞానసంపన్నః పరం మోక్షముపాగతః. 53

సుమాలీ తు మహాభాగో విష్ణులోకే ముదాన్వితః, స్థిత్వా భుమిం పునః ప్రాప్య విప్రత్వం సముపాగతః. 54

అతిశుద్ధే కులే జాతో గుణవాన్వేదపారగః, సర్వసంపత్సముపేతో హరిభక్తిపరాయణః. 55

వ్యాహరన్హరినామాని ప్రపేదే జాహ్నవీతటమ్‌, తత్ర స్నాతశ్చ గంగాయాం దృ,ష్ట్వా విశ్వేశ్వరం ప్రభుమ్‌. 56

అవాప పరమం స్థానం యోగినామపి దుర్లభమ్‌, ఉపలేపనమాహాత్మ్యం కథితం తే మునీశ్వర. 57

తస్మాత్సర్వప్రయత్నేన సంపూజ్యో జగతాం పతిః, అకామాదపి యే విష్ణోః సకృత్పూజాం ప్రకుర్వతే. 58

న తేషాం భవబంధస్తు కదాచిదపి జాయతే, హరిభక్తిరతాన్యస్తు హరిబుద్ధ్యా సమర్చయేత్‌. 59

తస్య తుష్యంతి విప్రేన్ద్ర బ్రహ్మ విష్ణుమహేశ్వరాః, హరిభక్తిపరాణాం తు సంగినాం సంగమాత్రతః. 60

ముచ్యతే సర్వపాపేభ్యో మహాపాతకవానసి, హరిపూజాపరాణాం చ హరినామరతాత్మనామ్‌. 61

శుశ్రూషానిరతా యాంతి పాపినో పి పరాం గతిమ్‌. 62

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే ప్రథమ పాదే

విష్ణుసేవాప్రభావో నాం షట్త్రింశోధ్యాయః

విష్ణు దుతల పలికిరి :- ఓ మహానుభావా! నారాయణ పరాయణా! యజ్ఞమాలీ! సుమాలీ మోక్షమును పొందు ఉపాయమును నీకు చెప్పెదము. నీవు పూర్వజన్మలో చేసిన మహాపుణ్యమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నీవు పూర్వజన్మలో విశ్వంభరడను పేరుగల వైశ్యజాతీయుడవు. నీవు లెక్కించలేని మహాపాపములను ఎన్నింటినో చేసితివి. సత్కర్మవాస నాహీనుడవై తలిదండ్రులను ద్వేషించుచుంటివి. ఒకపుడు బంధువులందరూ వెలివేయగా శోకసంతాపముచే పీడించబడిన ఆకలిచే పరితపించుచు హరి మందిరమును చేరితివి. ఆ సమయమున ఆచట మహా వర్షము కురుసినది. ఆ ప్రాంతమంతయూ బురదయైనది. అపుడు నీవు అచట నివసించగోరి బురదను దూరము చేసి శుభ్రపరిచితివి. నీవు చేసిన పని హరిమందిరమును అలుకుటగా అయినది. నీవు ఆ రాత్రి ఆ దేవాలయముననే ఉంటివి. ఒక మహాసర్పము కాటువేయగా మరణించితివి. అట్లు విష్ణ్వాలయమున అలుకుట అను సుకృత ప్రభావముచే బ్రాహ్మణజన్మ హరిభక్తి లబించినది. కోటి కల్పములు హరి సన్నిధిన నివసించి జ్ఞానమును పొంది మోక్షమునందగలవు. మహాపాపి అయిన నీ తమ్ముని పాపవిముక్తిని చేయగోరుచున్నావు. ఆ ఉపాయమును చెప్పెదము. తెలియుము. నీవు ఈ జన్మలో హరిందిరమును అలికిన ప్రదేశమున గోచర్మమాత్రప్రదేశమును అలుకుట వలన కలిగిన పుణ్యమును నీ సోదరునికి దానము చేసి ఉద్ధరించుము. ఇట్లు విష్ణుదూతలు పలుకగా దయాపరుడగు యజ్ఞమాలి ఆ ఫలమును సుమాలికర్పించెను. అన్నగారు దానము చేసిన పుణ్యముచే సుమాలి పాపవిముక్తుడాయెను. యమదూతలు సుమాలిని విడిచి పారిపోగా. ఆ విమానము నధిరోహించి ఆనందించెను. ఇట్లు ఆ సోదరులిరువురు దేవతాసమూహముచే నమస్కరించబడుచు పరస్పరమాలింగనమును చేసుకొని ఆనందించిరి. యజ్ఞమాలి సుమాలులు మహర్షులచే స్తోత్రము చేయబడుచు గంధర్వులచే గానము చేయబడుచు విష్ణులోకమునకు చేరిరి. ఆ విష్ణులోకమున యజ్ఞమాలిసుమాలులు సంతోషముతో ఒక కల్పము నివసించిరి. విష్ణులోకమున బహుభోగములననుభవించి అచటనే జ్ఞానమును పొంది మోక్షమును పొందెను. మహానుభావుడగు సుమాలి విష్ణులోకమున ఆనందముతో నివసించి మరల భూలోకమున బ్రాహ్మణోత్యమునొందెను. పరమపవిత్రమైన కులములో పుట్టిన సుమాలి గుణవంతుడు వేదసారగుడు సర్వసంపత్సమేతుడు, హరిభక్తి పరాయణుడుగా నుండి హరినామ సంకీర్తనమును చేయుచు గంగాతీరమును చేరెను. గంగానదిలో స్నానము చేసి ప్రభువైన విశ్వేశ్వరుని దర్శిచి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా ! నీకు దేవాలయమున ఉపలేపనము చేయుటవలన కలుగు మాహాత్మ్యమును చెప్పితిని. కావున అన్ని విధములా ప్రయత్నించి జగన్నాధుని పూజించవలయును. సంకల్పములేక, కోరిక లేక శ్రీహరిని పూజించిననూ ఎపుడూ సంసారబంధము కలుగును. హరిభక్తిరతులైన వారిని హపిబుద్ధిచే పూజించినచో బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సంతోషింతురు. హరిభక్తి పరులతో కలిసియున్న వారిని కలిసిననూ మహాపాతకులైనను అన్ని పాపములనుండి విముక్తులగుదురు. హరిపూజాపరులను హరినామసంకీర్తనము చేయువారిని సేవించువారు పాపులైనను పరమపదమును పొందెదరు. 36 - 62

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున

విష్ణుసేవాప్రబావమను ముప్పదియారవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page