Sri Naradapuranam-I
Chapters
Last Page
సప్తత్రింశో೭ధ్యాయః = ముప్పదియేడవ అధ్యాయము విష్ణుమాహాత్మ్యమ్ సనక ఉవాచ:- భూయశ్శృణుష్వ విప్రేన్ద్ర మాహాత్మ్యం కమాలాపతేః, కస్య నో జాయతే ప్రీతిః శ్రోతుం హరికథామృతమ్. 1 నరాణాం విషయాంధానాం మమతాకులచేతసామ్, ఏకమేవ హరేర్నామ సర్వపాపప్రణాశనమ్. 2 సకృద్వా న నమేద్యస్తు విష్ణుం పాపహరం నృణామ్, శ్వపచం తం విజానీయాత్కదాచిన్నాలపేచ్చ తమ్. 3 హరిపూజావిహీనం తు యస్య వేశ్మ ద్విజోత్తమ, శ్మశానసదృశం తద్ధి కదాచిదపి నో విశేత్. 4 హరిపూజావిహీనాశ్చ వేదవిద్వేషిణస్తథా, గోద్విజద్వేషనిరతా రాక్షసాః, పరికీర్తితాః. 5 యో వా కో వాపి విప్రేన్ద్ర విప్రద్వేష పరాయణః, సమర్చయతి గోవిందం తత్పూజా విఫలా భ##వేత్. 6 అన్యశ్రేయోవినాశార్థం యే೭ర్చయంతి జనార్దనమ్, సా పూజైవ మహాభాగ ! పూజకమాశు హంతి వై. 7 హరిపూజాపరో యస్తు యది పాపం సమాచరేత్, తమేవ విష్ణుద్వేష్టారం ప్రాహుస్తత్త్వార్ధకోవిదాః. 8 యే విష్ణునిరతాస్సంతి లోకానుగ్రహతత్పరాః, ధర్మకార్యరతాశ్శశ్వద్విష్ణురూపాస్తు తే మతాః. 9 కోటి జన్మార్జితైః పుణ్యౖ ర్విష్ణుభక్తిః, ప్రజాయతే, దృఢభక్తిమాత్రం విష్ణౌ పపాపబుద్ధిః కథం భ##వేత్. 10 జన్మకోట్యర్జితం పాపం విష్ణుపూజారతాత్మనామ్, క్షయం యాంతి క్షణదేవ తేషాం స్యాత్పాపధీః కథమ్. 11 విష్ణుభక్తివిహీనా యే చండాలాః పరికీర్తతాః, చండలా అపి వై శ్రేష్ఠా హరిభక్తిపరాయణాః. 12 నరాణాం విషయాంధానాం సర్వదుఃఖ వినాశినా, హరిసేవేతి విఖ్యాతి భుక్తిముక్తి ప్రదాయినీ. 13 సంగాత్స్నే హద్భయాల్లోభాదజ్ఞానాద్వాపి యో నరః, విష్ణోరుపాసనం కుర్యాత్యో೭క్షయం సుఖమశ్నుతే. 14 హరిపాదోదకం యస్తు కణమాత్రం పిబేదపి, సస్నాతస్సర్వతీర్థేషు విష్ణోః ప్రియతరో భ##వేత్. 15 ఆకాలమృత్యుశమనం సర్వవ్యాధివినాశనమ్, సర్వదుఃఖోపశమనం హరిపాదోదకం స్మృతమ్. 16 నారాయణం పరం ధామ జ్యోతిషాం జ్యోతిరుత్తమమ్, యే ప్రసన్నా మహాత్మానస్తేషాం ముక్తిర్హి శాశ్వతీ. 17 అత్రాప్యుదాహరం తీమమితిహాసం పురాతనమ్, పఠతాం శృణ్వతాం చైవ సర్వపాపప్రణాశనమ్. 18 సనక మహర్షి పలికెను :
పరంధాముడు జ్యోతిస్స్వరూపుడు శ్రీమన్నారాయణుని శరణువేడినవారు శాస్వతముక్తిని పొందెదరు. ఈ విషయమున ఒక ఇతిహాసము ను చెప్పెదను. ఇది చదివువారికి వినువారికి అన్ని పాపములను నశింపచేయును. 1-18
ఆ సీత్పురా కృతయుగే గులికో నామ లుబ్ధికః, పరదారపరద్రవ్యహారణ
సతతోద్యతః. 19
పరనిందాపరో నిత్యం జంతూపద్రవకృత్తథా, హతవాన్ బ్రహ్మణాన్ గాశ్చ శతశో೭థసహస్రశః. 20
దేవస్వహరణ నిత్యం పరస్వహరణ తథా, ఉద్యుక్తస్సర్వదా విప్ర కీనాశానామధీశ్వరః. 21
తేన పాపాన్యంతాని కృతాని సమహాంతి చ, న తేషాం శక్యతే వక్తుం సంఖ్యావత్సరకోటిభిః. 22
స కదాచిన్మహాపాపో జంతూనామంతకోపమః, సౌవీరరాజ్ఞో నగరం సర్వైశ్వర్యసమన్వితమ్. 23
యోషిద్భిర్భూషితాభిశ్చ సరోభిర్నిలోదకైః, అలంకృతం విపణిభిర్య¸° దేవపురోపమమ్. 24
తస్యోపవనమధ్యస్థం రమ్యం కేశవమందిరమ్, ఛాదితం హేమకలసశైర్దృష్ట్వా వ్యాధో ముదం య¸°. 25
వరామ్యత్ర సువర్ణాని బహూనీతి వినిశ్చితమ్, జగామాభ్యంతరం తస్య కీనాశశ్చౌర్యలోలుపః. 26
తత్రాపశ్యద్ద్విజవరం శాంతం తత్త్వార్ధకోవిదమ్, పరిచర్యాపరం విష్ణోరుత్తంకం తపసాం నిధిమ్. 27
ఏకాకినం దయాలుం చ నిస్పృహం ధ్యానలోలుపమ్, చౌర్యాంతరాయకర్తారం తం దృష్ట్వా లుబ్ధకో మునే. 28
ద్రవ్య జాతం తు దేవస్య హర్తుకామో೭తిసాహసీ, ఉత్తంకం హంతుమారేభే విధృతాసిర్మదోద్ధతః. 29
పాదేనాక్రమ్య తద్వక్షో జటాస్సంగృహ్య పాణినా, హంతుం కృతమతిం వ్యాధం ఉత్తంకః ప్రేక్ష్య చాబ్రవీత్. 30
పూర్వకాలమున కృతయుగమున గులికుడను పేరుగల వేటగాడుండెను. అతడు ఎల్లకాలము పరదారలను పరద్రవ్యములను హరించుచుండెడివాడు. పరనిందాపరుడు నిత్యము జంతువులను హింసిచువాడు . వేలకొలదు బ్రాహ్మణులను గోవులను వధించెడివాడు. వేటగాళ్ళకు రాజైన గులికుడు నిత్యము దేవధనమును పరుల ధనమును హరించుటయందు ఆసక్తిని చూపెడివాడు. గులికుడు చేసిన పాపములను కోటి సంవత్సరములలో కూడా లెక్కించజాలము. ఒకపుడు గులికుడు జంతువుల పాలిటి యముడు సర్వైశ్వర్యసమన్వితము ఆభరణములు ధరించిన స్త్రీలతో కూడి యున్నది, స్వచ్ఛ జలములు కల సరస్సులచే శోభించబడుచునది చక్కని ఆపణములతో అలంకరించబడి అమరావతిని బోలు సౌవీరరాజ నగరమునకు వెళ్ళెను. ఆ నగరనమునకు సమీపముననున్న ఉద్యానవనమధ్యముననున్న సుందరమగు శ్రీ హరి మందిరమును బంగారు కలశములచే కూడియున్న దానిని చూచి గులికుడు సంతోషించెను. ఇచట చాలా బంగారమును లభించగలదు అని నిశ్చయించుకొని చౌర్యము నందు వ్యామోహమున్న వేటగాడు దేవాలయము లోపలికి వెళ్ళెను. అచట తత్త్వార్థ కోవిదుడు శాంతుడు, శ్రీ హరిపరిచర్యాపరుడు తపోనిధి ఉత్తంకుడును బ్రాహ్మనోత్తముని చూచేను. ఉత్తంకుడు ఏకాకి దయాలువుని నిస్పృహుడు ధ్యానరతుడు గానుండెను. దైవద్రవ్యమునందు మిక్కిలి ఆశగలవాడు కావున ఉత్తంకుని తన కార్యమునకు అడ్డుగా తలిచి అతిసాహసముతో ఉత్తంకుని వధించ నిశ్చయించి మదోద్ధతుడై ఖడ్గమును చేత పట్టుకొని వక్షస్థలమును తన పాదముతో అదిమి పట్టి మరొక చేతితో జటలను పట్టుకొని చంపబోవు గులికుని చూచి ఉత్తంకు డిట్లు పలికెను. 19-30
ఉత్తంక ఉవాచ : -
భో! భో! సాధో ! వృథా మాం త్వం హనిష్యసి నిరాగసమ్, మయా కిమపరాద్ధం తే
తద్వదస్వ మహామతే ! 31
కృతాపరాధినాం లోకే శక్తాశ్శిక్షాం ప్రకుర్వతే. న హి సౌమ్య వృధా ఘ్నంతి సజ్జనా అపి పాపినః. 32
విరోధష్వపి మూర్ఖేషు నిరీక్ష్యావస్థితాన్గుణాన్ , విరోధం న హి కుర్వంతి సజ్జనాశ్శంతచేతసః. 33
బహుధా బోధ్యమానో ೭పి యో నరః క్షమాయాన్వితః, తముత్తమం నరం ప్రాహుర్విష్ణోః ప్రియతరం సదా. 34
సుజనో న యాతి వైరం పరహితబుద్ధిర్వినాశకాలే೭ పి, ఛేదే೭ పి చందనతరుస్సురభయతి ముఖం కుఠారస్య. 35
అహో విధిస్సుబలవాన్బాధతే బహుధా జనాన్, సర్వసంగవిహీనో ೭పి బాధ్యతే హి దురాత్మనా. 36
అహో నిష్కారణం లోకే బాధంతే బహుధా జనాన్, సర్వసంగివిహీనో೭పి బాధ్యతే పిశునైర్జనైః. 37
తత్రాపి సాధున్బాధంతే న సమానాన్కదాచన. 38
మృగమీనసజ్జనానాం తృణజలసంతోషవిహితవృత్తీనామ్, లుబ్ధకధీవరపిశునా నిష్కారణవైరిణో జగతి. 39
అహో బలవతీ మాయా మోహయత్యఖిలం జగత్, పుత్రమిత్రకలతత్రార్థం సర్వం దుఃఖేన యోజయేత్. 40
పరద్రవ్యాపహారేణ కలత్రం పోషితం త్వయా, అంతే తత్సర్వముత్సృజ్య ఏక ఏవ ప్రయాతి వై. 41
మమ మాతా మమ పితా మమ భార్యా మమాత్మజాః, మమేదమితి జంతూనాం మమతా బాధతే వృథా. 42
యావదర్జయతి ద్రవ్వం బాంధవాస్తావదేవ హి, ధర్మాధర్మౌ సహైవాస్తామిహాముత్ర న చాపరః. 43
ధర్మాదర్మార్జితైర్ద్రవ్యైః పోషితా యేన యే నరాః, మృతమగ్నిముఖే హుత్వా ఘృతాన్నం భుంజతే హి తే. 44
గచ్ఛంతం పరలోకం చ నరం తు హ్యనుతిష్ఠతః, ధర్మ ధర్మౌ న చ ధనం పుత్రా న చ బాంధవాః. 45
కామస్సమృద్ధిమయాతి నరాణాం పాపకర్మిణామ్, కామస్సంక్షయమాయాతి నరాణాం పుణ్యకర్మణామ్. 46
వృధైవ వ్యాకులాలోకా ధనాదీనాం సదార్జనే, యద్భావి తద్భ త్యేవ యదభావ్యం న తద్భవేత్. 47
ఇతి నిశ్చితబుద్ధీనాం న చింతా బాధతే క్వచిత్, దైవాధీనమిదం సర్వం జగత్థ్సావరజంగమమ్. 48
తస్మాజ్జన్మ చ మృత్యుం చ దైవం జానాతి నాపరః, యత్ర కుత్ర స్థితస్యాపి యద్భావ్యం తద్భవేద్ధ్రువమ్. 49
లోకస్తు తదవిజ్ఞాయ వృధాయాసం కరోతి హి, అహో దుఃఖం మనష్యాణాం మమతాకులచేతసామ్. 50
మహాపాపాని కృత్వాపి పరాన్పుష్యంతి యత్నతః, అర్జితం చ ధనం సర్వం భుంజతే బాంధవాస్సదా. 51
స్వయమేకతమో మూఢస్తత్పాపఫలమశ్నుతే, ఇతి బ్రువాణం తమృషిం విముచ్య భయవిహ్వలః. 52
గులికః ప్రాంజలిః ప్రాహ క్షమస్వేతి పునః పునః సత్సంగస్య ప్రభావేణ హరిసన్నిధిమాత్రతః. 53
గతపాపో లుబ్ధకశ్చ హ్యనుతాపీదమబ్రవీత్. 54
ఉత్తంక మహర్షి పలికెను : - ఓ సాధూ! నిరపరాధినగు నన్ను వ్యర్థముగా చంపుచున్నావు. ఓ బుద్ధింతుడా ! నేను నీ యెడ చేసిన అపరాధమేమిటో చెప్పుము. అపరాధము చేసిన వారిని సమర్ధులు శిక్షింతురు. కాని నిరపరాధులను సజ్జనులు పాపులు ఎవరైనను వధింపరు, సజ్జనులు శాంతచిత్తులు శత్రువులగు మూర్ఖులలో అవగుణములను చూచియు ద్వేషించరు. ఎంతగా బాధించిననూ క్షమించువాడు ఉత్తమనరుడు. వాడే విష్ణువునకు ప్రీతిపాత్రుడు. పరులను హితము నాచరించవలయునని కోరు సజ్జనుడు వినాశకాలమున కూడా ద్వేషమును చూపడు. చందన వృక్షము తనను నరుకుచున్న గొడ్డలికి కూడా సుగంధము నిచ్చును. జనులను బహువిధములుగా బాధించు విధి ఎంత బలీయము ! సర్వసంగపరిత్యాగులు కూడా దురాత్ములచే బాధించబడుచున్నారు. లోకమున నిష్కారణముగా దురాత్మలచే బాధించబడుచున్నారు. దుర్జనులు కూడా సాధువవులనే బాధించుచున్నారు కాని తమతో సమానులను బాధించుటలేదు. లేళ్ళు, చేపలు, సజ్జనులు గడ్డితో నోటితో సంతోషముతో బ్రతుకుచుందురు. వేటగాళ్ళు బెస్తవారు లోభులు వీరిని నిష్కారణముగా ద్వేషించి హింసించెదరు.ఈ జగత్తునంతటిని మోహింపచేయు మాయ ఎంత బలీయము. పుత్రమిత్ర కలత్రము కొఱకు అందరిని దుఃఖింపచేయును. నీవు పరులద్రవ్యము అపహరించి కలత్రమును పోషించితివి. అవసానకాలమున అన్నింటిని అందరిని విడిచి ఒంటరిగా వెళ్ళెదవు. నా తల్లి, నా తండ్రి, నాభార్య, నాపుత్రులు, ఇదియంతయూ నాది అని మమకారము ప్రాణులను ఎంతగా బాధించుచున్నది? ద్రవ్యము నార్జించు వరకే బంధువులు వెంట ఉందురు. ఇహపరములలో వెంట తోడుగా నుండునని ధర్మాదర్మాములు మాత్రమే. ధర్మాధర్మములచే సంపాదించిన ద్రవ్యము నార్జించువరకే బంధువులు వెంట ఉందురు. ఇహ పరములలో వెంట తోడుగా నుండునవి ధర్మాధర్మాములు మాత్రమే. ధర్మాధర్మాములచే సంపాదించిన ద్రవ్యముతో పోషించబడిన బంధువులు సంపాదించినవాడు మరణించగా అతనిని అగ్నికి అహుతి చేసి తాము నేతి భోజనము చేతురు. పరలోకమునకు వెళ్ళువారి వెంటవచ్చునని ధర్మ ధర్మములే కాని పుత్రులు బంధువులు సంపదలు కావు. పాపకర్మలను చేయువారికి కోరికలు పెరుగుచుండును, పుణ్యకార్యములను చేయువారికి కోరికలు నశించుండును. లోకులు ధనమును సంపాదించుటకు వ్యర్థముగా ఆకులపడుదురు. జరుపవలసినది జరిగియే తీరును. జరుగరానిది జరుగనే జరుగదు. ఇట్లు నిశ్చయముగా కలవారిని చింత బాధించదు. స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తంతయూ దైవాదీనమే. కావున పుట్టుకను మరణము దైవమే తెలియును. ఇతరులు తెలియజాలరు. ఎక్కడ ఉన్ననూ జరుగవలసినది జరిగియే తీరును. ఆ విషయము తెలిసికొనక లోకము వ్యర్థముగా బాధపడును. మమకారముచే ఆకులమైన మనసు కల వారికెంత దుఃఖము ప్రయత్నముచే మహాపాపములను చేసి ఇతరులను పోషింతురు. తాను సంపాదించిన ధనమునంతటిని బాంధవులు అనుభవించెదరు. తాను మాత్రము మూఢుడై ఒంటరిగా పాపఫలము ననుభవించును. ఇట్లు పలుకుచున్న ఉత్తంక మహర్షి మాటలను విని భయముచే వణకుచు విడిచి చేతులు జోడించి గులికుడు మాటిమాటికి క్షమించుము క్షమించుము అని ప్రార్థించెను. సజ్జనసాంగత్య ప్రబావముచే హరిసాన్నిధ్యము వలన పాపములు తొలగగా గులికుడు పశ్చాత్తాపముతో నిట్లు పలికెను. 31-54
మయా కృతాని పాపాని మహాన్తి సుబహుని చ, తాని సర్వాణి నష్టాన్ని విప్రేన్ద్ర తవ దర్శనాత్. 55
అహో೭హం పాపధీర్నిత్యం మహాపాపముపాచరమ్, కథం మే నిష్కృతిరర్భూయో యామి కం శరణం విభో! 56
పూర్వజన్మార్జితైః పాపైర్లుబ్ధకత్వమవాప్తవాన్, అత్రాపి పాపజాలాని కృత్వా కాం గతిమాప్నుయామ్. 57
అహో మమాయుః క్షయమేతి శ్రీఘ్రం పాపాన్యనేకాని సమార్జితాని,
ప్రతిక్రియా నైవ కృతా మయైషాం గతిశ్చ కా స్యాన్మమ జన్మ కిం వా. 58
అహో విధిః పాపశతాకులం మాం కిం సృష్టవాన్పాపతరం చ శశ్వత్.
కథం చ యత్పాపఫలం చ భోక్ష్యే కియత్సు జన్మస్వహముగ్రకర్మా. 59
ఏవం వినిన్దన్నాత్మానమాత్మనా లుబ్ధకస్తదా, అంతస్తాపాగ్నిసంతప్తస్సద్యః పంచత్వమాగతః. 60
ఉత్తంకః పతితం ప్రేక్ష్య లుబ్ధకం తం దయాపరః, విష్ణుపాదోదకేనైనమభ్యషించన్మహామతిః. 61
హరిపాదోదకస్పర్శాల్లుబ్ధకో గతకల్మషః, దివ్యం విమానమారుహ్య మునిమేతదథాబ్రవీత్. 62
ఓ బ్రాహ్మణోత్తమా ! నేను చాలా గొప్పపాపములను చేసితిని. మీ దర్శనముచే అవియన్నియు నశించినవి. నేను పాప బుద్ధినై మహాపాతకముల నాచరించితిని. నాకు
నిష్కృతి ఎట్లు లభించును ? ఎవరిని శరణు వేడెదను ? పూర్వజన్మములో చేసిన
పాపములచే ఈ వ్యాధజన్మము వచ్చినది. ఈ జన్మములో కూడా పాపములను చేసితిని. మరల నాకేగతి పట్టునో ! నా ఆయుష్యము వేగముగా తరిగి పోవుచున్నది. చాలా పాపములను మూట కట్టుకొంటిని. ప్రాయశ్చిత్తముల నాచరించలేక పోతిని. చివరికి నాకు ప్రతిఫలమేది రాబోవుచున్నది? ఏ జన్మకలుగునో? అనేక పాపములచే అమలుడనైన నన్ను విధి ఏల పాపరతునిగా సృష్టించినది. నేనీ పాపఫలములను ఎన్ని జన్మములలో అనుభవించవలయునో ! ఇట్లు తనలో తాను తనను నిందించుకొనిన వ్యాధుడు అంతస్తాపాగ్నిచే వెంటనే మృతి చెందెను. పడిన వ్యాధుని చూచి దయాళువైన ఉత్తంకుడు విష్ణుపాదోదకము పైన చల్లెను. హరిపాదోదకస్పర్శచే పాపములు నిశించిన వ్యాధులు దివ్యవిమానమునధిరోహించి ఉత్తంకమహర్షిని గూర్చి ఇట్లు పలికెను. 55-62
గులిక ఉవాచ : -
ఉత్తంక ! మునిశార్దూల గురుస్త్వం మమ సువ్రత! విముక్తస్త్వసాదేన మహాపాతకకంచుకాత్. 63
గతస్త్వ దుపదేశాన్మే సంతాపో మునిపుంగవ, తథైవ సర్వపాపాని వినష్టాన్యతివేగతః. 64
హరిపాదోదకం యస్మాన్మయి త్వం సిక్తవాన్మునే, ప్రాపితో೭స్మి త్వయా తస్మాత్తద్విష్ణోః పరమం పదమ్. 65
త్వయాహం తారితో విప్ర పాపాదస్మాచ్ఛరీరతః, తస్మాన్నతో ೭స్మి తే విద్వన్మత్కృతం తత్ క్ష్కమస్వ చ. 66
ఇత్యుక్త్వా దేవకుసుమైర్మునిశ్రేష్ఠం సమాకిరన్, ప్రదక్షిణత్రయం కృత్వా నమస్కారం చకార సః. 67
తతో విమానమారుహ్య సర్వకామసమన్వితమ్, అప్సరోగణసంకీర్ణః ప్రపేదే హరిమందిరమ్. 68
ఏతద్దృష్ట్వా విస్మితో೭సౌ హ్యుత్తంకస్తపసాం నిధిః, శిరస్యంజలిమాధాయ తుష్టాన కమలాపతిమ్. 69
తేన స్తుతో మహావిష్ణు ర్దత్తవాన్వరముత్తమమ్, వరేణ తేనోత్తంకో೭పి ప్రిపేదే పరమం పదమ్ 70
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వబాగే ప్రథమపాదే
విష్ణుమాహాత్మ్యే సప్తత్రింశో೭ధ్యాయః
గులికుడు పలికెను :- ఓ మునిశ్రేష్ఠా ! ఉత్తంకా ! మీరు నాకు గురువర్యులు. మీ అనుగ్రహముచే మహాపాతకసంచయమునుండి విముక్తుడనైతిని. మీ ఉపదేశమువలన సంతాపము తొలగినది. సర్వపాపములు నశించినవి. మీరు నాపై హరిపాదోదకసేచనము చేసితిరి. కావున మీచే ఆ విష్ణుపదమును చేర్పించబడితిని. మీ అనుగ్రహమచే నేను పాపములనుండి శరీరమునుండి విముక్తుడనైతిని. కావున మీకు నమస్కరించుచున్నాను. నేను చేసిన దానిని క్షమింపుము. ఇట్లు పలికి ఉత్తంకునిపై పుష్ప వర్షము ను కురిపించెను. ప్రదక్షిణత్రయమును చేసి నమస్కారములాచరించెను. తరువాత సర్వకామసమన్వితమగు విమానము నధిరోహించి అప్సరోగణములచే కూడి హరిమందిరమును చేరెను. తపోనిధియగు ఉత్తంకుడు ఈ దృశ్యమును చూచి ఆశ్చర్యమునొంది, చేతులు జోడించి శ్రీమన్నారాయణుని స్తుతించెను. ఇట్లు స్తుతించబడి శ్రీమహావిష్ణువు ఉత్తంకునకు ఉత్తమ వరము నిచ్చెను. ఆ వరముచే ఉత్తంకుడు కూడా మోక్షమునొందెను.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున
పూర్వభాగమున ప్రథమపపాదమున
విష్ణుమాహాత్మ్యమున
ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.