Sri Naradapuranam-I    Chapters    Last Page

అష్టత్రింశోధ్యాయః = ముప్పదియెనిమిదవ అధ్యాయము

విష్ణుమాహాత్మ్యమ్‌

నారద ఉవాచ : -

కిం తత్‌ స్తోత్రం మహాభాగ కథం తుష్టో జనార్దనః, ఉత్తంకః పుణ్యపరుషః కీదృశం లబ్ధవాన్వరమ్‌. 1

నారద మహర్షి పలికెను:- ఓ మహానుభావా ! పుణ్యపురుషుడగు ఉత్తంకమహర్షి చేసిన

స్తోత్రమేది ? శ్రీహరి ఎట్లు సంతోషించెను ? ఏ వరమును పొందెను ? 1

సనక ఉవాచ:-

ఉత్తంకస్తు దతా విప్రో హరిధ్యానపరాయణః, పాదోదకస్య మాహాత్మ్యం దృష్ట్వా తుష్టావ భక్తితః. 2

సనక మహర్షి పలికెను :- హరిధ్యానపరాయణుడగు బ్రహ్మణోత్తముడగు ఉత్తంకుడు శ్రీహరిపాదోదక మాహాత్మ్యమును చూచి భక్తిచే స్తోత్రము చేసెను. 2

ఉత్తంక ఉవాచ:-

నతోస్మి నారాయమాదిదేవం జగన్నివాసం జగదేకబంధమ్‌,

చక్రబ్జశార్జాసిధరం మహాంతం స్మృతార్తినిఘ్నం శరణం ప్రపద్యే. 3

యన్నాభిజాజ్జప్రభవో విదాతా సృజత్యముం లోకసముచ్చయం చ,

యత్కోధజో హన్తి జగచ్ఛ రుద్రస్తమాదిదేవం ప్రణతోస్మి విష్ణుమ్‌. 4

పద్మపతిం దప్మదళాయతాక్షం విచిత్రవీర్యం నిఖిలైకహేతుమ్‌,

వేదాంతవేద్యం పురుషం పురాణం తేజోనిధిం విష్ణుమహం ప్రసన్నః. 5

ఆత్మక్షర స్సర్వగతో చ్యుతాఖ్యో జ్ఞానాత్మకో జ్ఞానవిదాం శరణ్యః,

జ్ఞానైకవేద్యో భగవాననాదిః ప్రసీదతాం వ్యష్టి సమష్టిరూపపః. 6

ఆనన్త వీర్యో గుణజాతిహీనో గుణాత్మకో జ్ఞానవిదాం వరిష్ఠః,

నిత్యః ప్రసన్నార్తిహరః పరాత్మా దయాంబుధిర్మే వరదస్తు భూయాత్‌. 7

యస్థ్సూలసూక్ష్మాదివి శేషభేదైర్జగద్యథావత్స్వకృతం ప్రవిష్టః,

నిత్యః ప్రపన్నార్తిహరః పరాత్మా దయాంబుద్ధిర్మే వరదస్తు భూయాత్‌. 8

అగోచరం యత్తవ శుద్ధరూపం మాయావిహీనం గుణజాతిహీనమ్‌,

నిరంజనం నిర్మలమప్రమేయం పశ్యన్తి సన్తః పరమార్థసంజ్ఞమ్‌. 9

ఏకేన హేమ్నైవ విభూషణాని యాతాని భేదత్వముపాధిభేదాత్‌, తథైవ సర్వేశ్వర %క ఏవ ప్రద్యశ్యతే భిన్న ఇవాఖిలాత్మా. 10

యన్మాయయా మోహితచేతసస్తం పశ్యన్తి నాత్మానమపి ప్రసిద్ధమ్‌, 11

త ఏవ మాయారహితాస్తదేవ పశ్యన్తి సర్వాత్మకమాత్మరూపమ్‌.

విభుం జ్యోతిరనౌపమ్యం విష్ణుసంజ్ఞం సమామ్యహమ్‌, సమస్తమేతదుద్భూతం యతో యత్రప ప్రతిష్ఠతమ్‌. 12

యతశ్చైవతన్య మాయాతం యద్రూపం తస్య వై నమః, అప్రమేయమనాధారమాదారాధేయరూపకమ్‌. 13

పరమానన్దచిన్మాత్రం వాసుదేవం నతోస్మ్యహమ్‌, హృద్గుహానిలయం దేవం యోగిభిః పరిసేవితమ్‌. 14

యోగానామాదిభూతం తం నమామి ప్రణవస్థితమ్‌, నాదాత్మకం నాదబీజం ప్రణవాత్మకమవ్యయమ్‌. 15

సద్భావం సచ్చిదానన్దం తం వందే తిగ్మచక్రిణమ్‌, అజరం సాక్షిణం త్వస్య హ్యవాఙ్మానసగోచరమ్‌. 16

నిరంజనమనంతాఖ్యం విష్ణురూపం నతో స్మ్యహమ్‌, ఇంద్రియాణి మనోబుద్ధిస్సత్త్వం తేజో బలం ధృతిః. 17

వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ, విద్యావిద్యాత్మకం ప్రాహుః పరాత్పరతం తథా. 18

అనాదినిధనం శాంతం సర్వధాతారమచ్యుతమ్‌, యే ప్రపన్నా మహాత్మానస్తేషాం ముక్తిర్హి శాశ్వతీ. 19

వరం వరేణ్యం వరదం పురాణం సనాతనం సర్వగతం సమస్తమ్‌,

నతోస్మి భూయోపు నతోస్మి భూయో నతో స్మి భూయో పి నతోస్మి భూయః.20

యత్పాదతోయం భవరోగవైద్యో యత్పాదపాంసుర్విమలత్వసిద్ధ్యై,

యన్నామ దుష్కర్మనివారణాయ తమప్రమేయం పురుషం భజామి. 21

సద్రూపం తమసద్రూపం సదసద్రూపమవ్యయమ్‌, తత్తద్విలక్షణం శ్రేష్ఠం శ్రేష్ఠాచ్చ్రేష్ఠతరం భ##జే. 22

నిరంజనం నిరాకారం పూర్ణమాకాశమధ్యగమ్‌, పరం చ విద్యావిద్యాభ్యాం హృదంబుజనివాసినమ్‌. 23

స్వప్రకాశమనిర్దేశ్యం మహాతాం చ మహత్తరమ్‌, అణోరణీయాంసమజం సర్వోపాధివివర్జితమ్‌. 24

యన్నిత్యం పరమానందం పరంబ్రహ్మ సనాతనమ్‌, విష్ణుసంజ్ఞం జగద్ధామ తమస్మి శరణం గతః. 25

యం భజన్తి క్రియానిష్టా యం పశ్యన్తి చ యోగినః, పూజ్యాత్పూజ్యతరం శాంతం గతో స్మి శరణం ప్రభుమ్‌. 26

యం న పశ్యన్తి విద్వాంసో య ఏతద్వ్యాప్య తిష్ఠతి, సర్వస్మాధదికం నిత్యం నతోస్మి విభుమవ్యయమ్‌. 27

అంతఃకరణసంయోగాత్‌ జీవ ఇత్యుచ్యతే చ యః, అవిద్యాకార్యహితః పరమాత్మేతి గేయతే. 28

సర్వాత్మకం సర్వహేతుం సర్వకర్మఫలప్రదమ్‌, వరం వరేణ్యమజనం ప్రణతోస్మి పరాత్పరమ్‌. 29

సర్వజ్ఞం సర్వగం శాంతం సర్వాతర్యామినం హరిమ్‌, జ్ఞానాత్మకం జ్ఞాననిధిం జ్ఞానసంస్థం విభుం భ##జే. 30

నమామ్యహం వేదనిధిం మురారిం వేదాంతవిజ్ఞానసునిశ్చితార్ధమ్‌,

సూర్యేందువత్ప్రోజ్జ్వలనేత్రమింద్రం ఖగస్వరూపం వపతిస్వపూరమ్‌. 31

సర్వేశ్వరం సర్వగతం మహాంతం వేదాత్మకం వేదవిదాం వరిష్ఠమ్‌,

తం వాఙ్మనో చిన్త్య మనన్తశక్తిం జ్ఞానైకవేద్యం పురుషం భజామి. 32

ఇంద్రాగ్ని కాలాసురపాశివాయుసోమశమార్తాండపురందరాద్యైః,

యంః పాతి లోకాన్‌ పరిపూర్ణభావస్తమప్రమేయం శరణం ప్రపద్యే. 33

సహస్రశీర్షం చ సహస్రపాదం సహస్రబాహుం చ సహస్రనేత్రమ్‌,

సమస్తయజ్ఞైః పరిజుష్టమాద్యం నతోస్మి తుష్టిప్రదముగ్రవీర్యమ్‌. 34

కాలాత్మకం కాలవిభాగహేతుం గుణత్రయాతీతమహం గుణజ్ఞమ్‌,

గుణప్రియం కామదమస్తసంగం అతీన్ద్రియం విశ్వభుజం వితృష్ణమ్‌. 35

నిరీహమగ్య్రం మనసాప్యగమ్యం మనోమయం చాన్నమయం నిరూఢమ్‌,

విజ్ఞానభేదం ప్రతిపన్న కల్పం నా వాఙ్మయం ప్రాణమయం భజామి. 36

న యస్య రూపం న బలప్రభావో న యస్య కర్మాణి న యత్ప్రమాణమ్‌,

జానన్తి దేవాః కమలోద్భవాద్యా స్తోష్యామ్యహం తం కథమాత్మరూపమ్‌. 37

సంసారసింధౌ పతితం కదర్యం మోహాకులం కామశ##తేన బద్ధమ్‌,

అకీర్తిభాజం పి శునం కృతఘ్నుం సదాశుచిం పాపరహితం ప్రమన్యుమ్‌. 38

దయాంబుధే పాహి భయాకులం మాం పునః పునస్త్వాం శరణం ప్రపద్యే. 39

ఇతి ప్రసాదిస్తేన దయాలుః కమలాపతిః, ప్రత్యక్షతామగాత్తస్య భగవానంస్తేజసాం నిధిః. 40

ఉత్తంక మహర్షి పలికెను : - జగన్నివాసుడు జగదేక బంధువు అదిదేవుడగు నారాయణుని నమస్కరించుచున్నాను. శంఖచక్రశార్జఖడ్గధారి మహానుభావుడు తలచువారి ఆర్తిని నశింపచేయువాడు అగు శ్రీహరిని శరణువేడుచున్నాను. శ్రీహరి నాభికమలమున పుట్టిన చతుర్ముఖబ్రహ్మ ఈ లోకజాలమును సృజించుచున్నాడు. శ్రీహరి కోపము నుండి పుట్టిన రుద్రుడు ఈ జగత్తు ను నశింపచేయుచున్నాడు. అట్టి ఆదిదేవుని ప్రతినిత్యము నమస్కరించుచున్నాను. లక్ష్మీపతి పద్మదలాయతాక్షుడు విచిత్రవీర్యుడు సమస్త జగత్తునకు ముఖ్యహేతువు, వేదాంతవేద్యుడు పురాణపురుషుడు, తేజోనిధియగు విష్ణువును నేను శరణు పొందితిని. ఆత్మభుతుడు, అక్షరుడు, సర్వగతుడు, అచ్యుతనామధేయుడు, జ్ఞనాత్మకుడు, జ్ఞానులకు శరణ్యుడు, జ్ఞానైకవైద్యుడు ఆదిభగవానుడు వ్యష్టి సమష్టిరూపుడు ప్రసన్నుడగు గావుత. ఆనన్తవీర్యుడు, గుణజాతిహీనుడు గుణాత్మకుడు, జ్ఞానవిదులలో శ్రేష్ఠుడు, నిత్యుడు, ప్రపన్నార్తిహరుడు, పరమాత్మ , దయాసముద్రుడు, నాయెడ వరదుడగు గావుత. స్థూలసూక్ష్మాది విశేష భేదములచే తాను సృజించిన జగత్తున యథావిధిగా ప్రవేశించినవాడు సమస్తమగు అనంతసారస్వరూపుడు, అగు నీకంటే పరము మరొకటిలేదు. నీవే పరాత్మవు. నీ శుద్ధ రూపము అగోచరము. మాయా విహీనము గుణజాతి హీనము, నిరంజనము నిర్మలము, అప్రమేయము, సజ్జనులచే పరమార్ధముగా చూడబడువాడవు నీవు మాత్రమే. బంగారము ఒకటైనను ఆభరణముల ఉపాచే భిన్నముగా తోచునో అట్లే అఖిలాత్మకుడగు సర్వేశ్వరుడు ఒకడైనను ఉపాధి భేదముచే భిన్నముగా తోచును. నీమాయచే మోహాకులమగు మనస్సు కలవారై ప్రసిద్ధమైన ఆత్మస్వరూపమును చూడజాలకున్నారు. మాయతొలగినచో వారే సర్వాత్మకమగు ఆత్మరూపముగా చూచుచున్నారు. జ్యోతిస్వరూపుని విభుని సాటిలేని వానిని శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను. ఈజగత్తు సమస్తము నీ నుండి కలిగి నీలో నిలుచుచున్నది. ఈ చైతన్యము నీ నుండి కలిగినది. చైతన్య స్వరూపుడువు అగు నీకు నమస్కారము. అప్రమేయుడు అనాధారుడు ఆదారాధేయ స్వరూపుడు, పరమానన్దచిన్మాత్రుడు అగు వాసుదేవుని నమస్కరించుచున్నాను. యోగులచే సేవించబడువాడు, హృదయకుహరమున నివసించువాడు యోగములకు ఆదిభూతుడు ప్రణవమున నివసించువాడగు శ్రీహరిని నమస్కరించుచున్నాను. నాదాత్మకుని, నాదబీజుని, ప్రణవాత్మకుని, అవ్యయుని, సద్భావుని, సచ్చిదానన్దుని తీక్ష చక్రము గల వానిని నమస్కరించుచున్నాను. అజరుడు, సాక్షి అవాఙ్మానసగోచరుడు, నిరంజనుడు, అనంతాఖ్యుడు అగు విష్ణురూపుని నమస్కరించుచున్నాను. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, సత్యము, తేజస్సు, బలము ధృతి ఇవన్నియు వాసుదేవ స్వరూపములుగా చెప్పెదరు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు వాసుదేవ స్వరూపములుగా చెప్పుదురు. విద్వాస్వరూపుడు అవిద్యాస్వరూపుడు పరాత్పరతరుడని చెప్పెదరు. ఆద్యంతములేనివాడు శాంతుడు, సర్వదాత, అచ్యుతుడు అగు శ్రీహరిని శరణువేడిన మహానుభావులకు శాశ్వతమగు ముక్తితప్పదు. శ్రేష్ఠుడు, శేష్ఠతరుడు వరదుడు, పురాణ పురుషుడు, సనాతనుడు, సర్వగతుడు, సమస్తరూపుడు అగు శ్రీహరిని మాటి మాటికి నమస్కరించుచున్నాను. శ్రీహరి పాదోదకము భవరోగమునకు ఔషధము అతని పాదరజము విమలత్వమును ప్రసాదించును. శ్రీహరి నామము దుష్కర్మలను నివారించును. అట్టి అప్రమేయుని పరమపురుషుని సేవించుచున్నాను. సద్రూపుని అసద్రూపుని, సదద్రూపుని, అవ్యయుని, అట్నిటికంటే విలక్షణుని, శ్రేష్ఠములన్నిటిలో , శ్రేష్ఠతరుని భజించేదను. నిరంజనుని నిరాకారుని పరిపూర్ణుని, ఆకాశమధ్యగుని, విద్య అవిద్యలకంటే పరుని హృత్వద్మవాసుని స్వయంప్రకాశుని, అనిర్దేశ్యుని, మహత్తులకంటే మహాత్తరుని, అణువు కంటే అణువును, సర్వోపాధివర్జితుని, నిత్యుని, పరమానందుని, సనాతనుని, పరబ్రహ్మను, జగన్నివాసుని శ్రీమహావిష్ణువును శరణు కోరితిని క్రియానిష్ఠులచే భజించబడువానిని, యోగులచే చూడబడువానిని పూజ్యులందరికంటే పరమపూజ్యుని, శాంతుని శరణుపొందితిని, విద్వాంసులచే కూడ చూడ శక్యముకాని వానిని, ఈ ప్రపంతమునంతటిని వ్యాపించియుండువానిని అన్నిటికంటే అధికుని, నిత్యుని , అవ్యయుని విభువును నమస్కరించుచన్నాను. అంతఃకరణసంయోగముచే జీవలుడనబడువాడు, అవిద్యాతత్కార్యహరితుడై పరమాత్మమగా కీర్తించబడువాడు, సర్వాత్మకుడు సర్వహేతువు, సర్వకర్మఫలఫప్రదుడు, శ్రేష్ఠుడు, శ్రేష్ఠతరుడు, పరాత్పరుడగువానిని ప్రణమించుచున్నాను. సర్వజ్ఞుని, సర్వగతుని, శాంతుని, సర్వాంతర్యామిని, శ్రీహరిని, జ్ఞానాత్మకుని, జ్ఞాననిధిని, జ్ఞానసంస్థుని విభువును భజింతును, వేదనిధిని, మురారిని, వేదాంత విజ్ఞానముచే నిశ్చయించబడిన స్వరూపము గలవానిని, సూర్యచంద్రులవలె కాంతివంతమగు నేత్రములు గలవానిని, ఇంద్రుని, పక్షిరూపుని, సర్వజగన్నాథుని, సర్వేశ్వరుని, సర్వగతుని, మహానుభావుని, వేదస్వరూపుని, వేదవిదులలో శ్రేష్ఠుని, వాఙ్మనములచే ధ్యానించ శక్యము కానివానిని, ఆనంత శక్తిని జ్ఞానైకవేద్యుడగు పురుషుని భజించెను. ఇంద్రాగ్నియమ నిరృతి, వరుణ, వాయు, చంద్ర, శివ, సూర్య, కుబేరాది దిక్పాలురరూపములచే పరిపూర్ణభావుడై లోకములను పాలించు అప్రమేయుని శరణు పొందుచున్నాను. సహస్రశీర్షుని సహస్రపాదుని, సహస్రబాహువును, సహస్రనేత్రుని, సమస్తయజ్ఞములచే పూజించబడువానిని సంతోషప్రదుని, ఉగ్రవీర్యుని, ఆదిదేవుని నమస్కరించుచున్నాను, కాలస్వరూపిని, కాలవిభాగహేతువును, గుణత్రయాతీతుని, గుణజ్ఞుని గుణప్రియుని, కామదుని, సంగరహితుని, ఇంద్రియాతీతుని విశ్వబాహువుని, నిస్పృహుని, నిష్కాముని, ఉత్కృష్టుని మనసునకు గోచరము కానివానిని మనోమయుని, అన్నమయుని, నిస్సంగుని, విజ్ఞానభేదుని, రూపమును పొందినవానిని, వాచామగోచరుని, ప్రాణమయుని భజింతును. స్వరూపమును, బలమును, ప్రబావమును, కర్మలను, ప్రమాణములను బ్రహ్మాదిదేవతలు కూడా తెలియరు. అట్టి ఆత్మరూపుని ఎట్లు స్తుతి చేసెదను. సంసార సాగరమున పడి దీనుడనై మోహకులుడనై అనేక కామములచే బద్ధుడనై అపకీర్తిని పొందును, పిశునుడను కరృతఘ్నడను సదా అపవిత్రుని, పాపరతుని, విశేషక్రోధము గల వానిని భయాకులుడనుగు నన్ను కాపాడుము. దయానిధివగు నిన్ను శరణువేడుచున్నాను. ఇట్లు ఉత్తంకునిచే ప్రార్థించబడిన దయానిధియగు శ్రీపతి తేజోనిధి భగవానుడు ప్రత్యక్షమాయెను. 3-40

అతసీపుష్పసంకాశం పుల్లపంకజలోచనమ్‌, కిరీటినం కుండలినం హారకేయూరభూషితమ్‌. 41

శ్రీవత్సకౌస్తుభధరం హేమయజ్ఞోపవీతినమ్‌, నాసావిన్యస్తముక్తాభం వర్థమానతనుచ్ఛవిమ్‌. 42

పీతాంబరధరం దేవం వనమాలావిభూషితమ్‌, తులసీకోమలదలైరర్చితాంఘ్రిం మహాద్యుతిమ్‌. 43

కింకిణీనూపూరాద్యైశ్చ శోభితం గరుడధ్వజమ్‌, దృష్ట్వా ననామ విప్రేన్ద్రో దండపత్కితిమండలే. 44

అభ్యషించద్ధరేః పాదౌ ఉత్తంకో హర్షవారిభిః, మురారే రక్ష రక్షేతి వ్యాహరన్నాన్యధీస్తదా. 45

తముత్థాప్య మహావిష్ణురాగ్యలిం దయాపరః, వరం వృణీష్వ వత్సేతి ప్రోవాచ మునిపుంగవమ్‌. 46

అసాధ్యం నాస్తి కించిత్తే ప్రసన్నే మయి సత్తమ, ఇతీరితం సమాకర్ణ్య హ్యుత్తంకశ్చక్రపాణినా. 47

పునః ప్రణమ్యం తం ప్రాహ దేవదేవం జనార్దనమ్‌, కిం మాం మోహయసీశ త్వం కిమన్యైర్దేవ వరైః. 48

త్వయి భక్తిర్దృఢా మేస్తు జన్మజన్మాంతరేష్వసి.

కీటేషు పక్షిషు మృగేషు సరీసృపేషు రక్షః పిశాచయమనుజేష్వపి యత్ర తత్ర,

జాతస్య మే భవతు కేశవ తే ప్రసాదాత్‌ త్వయ్యేవ భక్తిరచలావ్యభిచారిణీ చ. 50

ఏవమస్త్వితి లోకేశశ్శంఖప్రాంతేన సంస్పృశన్‌, దివ్యజ్ఞానం దదౌ తసై#్మ యోగినామపి దుర్లభమ్‌. 51

పునస్త్సువన్తం విప్రేన్ద్రం దేవదేవో జనార్దనః, ఇదమాహా స్మతముకో హస్తం తచ్ఛిరసి న్యసన్‌. 52

అవిశపూవువన్నె గల వానిని వికసించిన పద్మముల వంటి కనులు గల వానిని కిరీట కుండల హారకేయూర శ్రీవత్సకౌస్తుభాది భూషణములను ధరించినవానిని, బంగారు యజ్ఞోపవీతమును ధరించినవానిని నాసికా ప్రాంతమున ధరించిన ముత్యము కాంతిచే శోభించు దేహకాంతి గలవానిని పీతాంబరధారిని, వనమాలా విభూషితుని, కోమలములైన తులసీ దళములచే పూజించబడిన పాదములు గల వానిని, గొప్ప తేజస్సు కలవానిని కింకిణి నూపురాదులచే భూషించబడినవానిని, గరుడ ధ్వజుని శ్రీహరిని చూచి ఉత్తంకుడు దండవత్ప్రణామములు నాచరించెను. ఆనందభాష్పములచే శ్రీహరి పాదములను అభిషేకించెను. ఓ మురారీ ! రక్షించుము ! రక్షించుము ! అని పలుకుచు అనన్యచిత్తముతో ధ్యానించెను. దయాపరుడగు శ్రీమహావిష్ణువు ఉత్తంకుని లేపి ఆలిగనము చేసికొనెను. వత్సా ! వరమును కోరుమని పలికెను. నేను ప్రసన్నుడనైన పిదప నీకు సాధించరానిదేదియు లేదని పలికిన శ్రీహరి మాటలను విని ఉత్తంకుడు మరల మరల నమస్కరించి దేవదేవుడగు జనార్దనునితో ఇట్లు పలికెను ''నన్నేల మోహింపచేయుచున్నావు ? నాకు వేరు వరములతో నేమి పని? ఎన్ని జన్మలలో నైనను నీ యందు దృఢభక్తి కలుగనిమ్ము'' శ్రీహరి అట్లే కానిమ్మని పలికి శంకప్రాంతముతో స్పృశించి యోగులకు కూడా దుర్లభమగు దివ్యజ్ఞానమును ప్రసాదించెను. ఉత్తంకుడు మరల స్తోత్రము చేయుచున్న దేవదేవుడగు జనార్దనుడు ఉత్తంకుని శిరమున హస్తమునుంచి ఇట్లు పలికెను. 41-52

శ్రీ భగవానువాచ : -

ఆరాధయ క్రియాయోగైర్మాం సదా ద్విజసత్తమ ! నరనారాయణస్థానం వ్రజ మోక్షం గమిష్యసి. 53

త్వయా కృతమిదం స్తోత్రం యః పఠేత్సతతం నరః, సర్వాన్కామానవాప్యాంతే మోక్షభాగీ భ##వేత్తతః. 54

ఇత్యుక్త్వా మాధవో విప్రం తత్రైవాంతర్దధే మునే ! నరనారాయణస్థానముత్తంకోపి తతో య¸°. 55

తస్మాద్భక్తిస్సదా కార్యా దేవదేవస్య చక్రిణః, హరిభక్తిః పరా ప్రోక్తా సర్వాకామఫలప్రదా. 56

ఉత్తంకో భక్తిబావేన క్రియాయోగపరో మునే, పూజయన్మాధవం నిత్యం నరనారాయణాశ్రమే. 57

జ్ఞానవిజ్ఞానసంపన్నస్సంఛిన్నద్వైతసంశయః, ఆవాప దురావాపం వై తద్విష్ణోః పరమం పదమ్‌. 58

పూజితో నమితో వాపి సంస్మృతో వాపి మోక్షదః, నారాయణో జగన్నాధో భక్తానాం మానవర్ధనః. 59

తస్మాన్నారాయణం దేవమనన్తమపరాజితమ్‌, ఇహాముత్ర సుఖప్రేప్సుః పూజయేద్భక్తిసంయుతః. 60

యః పఠేదిదమాఖ్యానం శృణుయాద్వా సమాహితః, సోపి సర్వాఘనిర్ముక్తః ప్రయాతి భవనం హరేః. 61

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే

éప్రథమపాదే విష్ణుమాహాత్మ్యం నామ

అష్టత్రింశోధ్యాయః

శ్రీమన్నారాయణభగవానుడు పలికెను:- ఓ బ్రాహ్మణోత్తమా ! క్రియాయోగముతో నన్నెల్లపుడారాధించుము. నరనారాయణాశ్రమునకు వెళ్ళుము. మోక్షమును పొందగలవు. నీవు చేసిన ఈ స్తోత్రమును చదివినవారు అన్ని కోరికలను పొంది అంతమున మోక్షమును పొందగలరు. శ్రీమన్నారాయణుడిట్లు పలికి అచటనే అంతర్థానము చెందెను. తరువాత ఉత్తంకుడు కూడా నరనారాయణ స్థానమును గూర్చి వెళ్ళెను. కావున దేవదేవుడగు చక్రి విషయమున ఎల్లపుడు భక్తి చేయవలయును. అన్నిటిలో ఉత్తమమైనది హరిభక్తియే. హరిభక్తి సర్వకామఫలములనిచ్చును. నరనారాయణాశ్రమున ఉత్తంకుడు భక్తి భావముతో శ్రీహరిని పూజించుచు క్రియాయోగరపడై, జ్ఞానవిజ్ఞానసంపన్నుడై సంశయచ్ఛేదము గలిగి అందరికి దుర్లభమగు శ్రీమహావిష్ణువు యొక్క పరమపదమును పొందెను. జగన్నాధుడగు నారాయణుడు భక్తుల గౌరవమును పెంచువాడు పూజించినను నమస్కరించిననూ స్మరించిననూ మోక్షము నొసంగును. కావున అనంతుడు అపరాజితుడు అగు నారాయణదేవుని ఇహపరములలో ఆనందమును కోరివాడు భక్తిచే పూజించవయును. సావధానముచే ఈ కథను చదివిననూ వినిననూ

సర్వపాపవినిర్ముక్తుడై శ్రీహరిభవనము చేరును. 53-61

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున

పూర్వబాగము ప్రథమపాదమున

విష్ణుమాహాత్య్మమను

ముప్పదియెనిమిదివ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page