Sri Naradapuranam-I    Chapters    Last Page

ఏకోనచత్వారింశోధ్యాయః = ముప్పది తొమ్మిదవ అధ్యాయము

విష్ణుమాహాత్మ్యమ్‌

సనక ఉవాచ :-

భూయశ్శృణుష్వ విప్రేన్ద్ర మాహాత్మ్యం పరమేష్టినః, సర్వపాపహరం పుణ్యం భుక్తిముక్తిప్రదం నృణామ్‌. 1

అహో ! హరికథాలోకే పాపఘ్నీ పుణ్యదాయినీ, శృణ్వతాం వదతాం చైవ తద్భక్తానాం విశేషతః. 2

హరిభక్తిరసాస్వాదిముదితా యే నరోత్తమాః, నమస్కరోమ్యహం తేభ్యో యత్సంగాన్ముక్తిభాఙ్నరః. 3

హరిభక్తి పరా యే తు హరినామపరాయణాః, దుర్వృత్తా వా సువృత్తా వా తేబ్యో నిత్యం నమో నమః. 4

సంసారసాగరం తర్తుం య ఇచ్ఛేన్మునిపుంగవ, స భ##జేద్ధరిభక్తానాం భక్తాన్వై పాపహారిణః. 5

దృష్టస్స్మృతః పూజితో వా ధ్యాతః ప్రణమితోపి వా, సముద్ధరతి గోవిందో దుస్తరాద్భవసాగరాత్‌. 6

స్వపన్భుంజన్‌ వ్రజంస్తిష్ఠన్నతిష్ఠంశ్చ వదంస్తథా, చింతయేద్యో హరేర్నామ తసై#్మ నిత్యం నమో నమః. 7

అహోభాగ్యమహోభాగ్యం విష్ణుభక్తిరతాత్మనామ్‌, యేషాం ముక్తిః కరస్థైవ యోగినామపి దుర్లభా. 8

అత్రాప్యుదాహారంతీమమితిహాసం పురాతనమ్‌, వదతాం శృణ్వతాం చైవ సర్వపాపప్రణాశనమ్‌. 9

సనక మహర్షి పలికెను : - ఓ బ్రాహ్మణోత్తమా ! మానవులకు భుక్తిని ముక్తిని ప్రసాదించునది, సర్వపాపహరము అయిన శ్రీమహావిష్ణువు మహాత్మ్యమును ఇంకను వినుము. ఈ లోకమున హరికథ వినువారికి చదువు వారిక పాపములను నశింపచేయును. పుణ్యమును ప్రసాదించును. హరిభక్తులకు విశేషఫలము నిచ్చును. హరిభక్తి రసాస్వాదముచే ఆనందించు నరులకు నేను నమస్కరించెదను. వారితో కలిసి యున్నవారికి కూడా మోక్షము లభించును. హరిభక్తి పరులు, హరినామ పరాయణులు దుర్జనులైనను, సుజనులైనను వారికి నిత్యము నమస్కారము. సంసార సాగరమును తరించగోరువారు హరిభక్త భక్తులను సేవించవలయును. గోవిందుని దర్శించినను, స్మరించిననూ, పూజించిననూ, ధ్యానించినను, నమస్కరించిననూ దాటరాని సంసారసాగరమును దాటగలరు. నిదురించుచు, భుజించుచు, నడచుచు, నిలిచి, కూర్చొని, మాటలాడుచు హరినామమును చింతించువారికి నిత్యము నా నమస్కారములు. విష్ణు భక్తి యందు ఆసక్తి కలవారి భాగ్యమే భాగ్యము. యోగులకు కూడా దుర్లభమగు ముక్తి వారికి కరస్థమై యుండును. ఈ విషయమున చెప్పువారికి వినువారికి సర్వపాపప్రణాశకమగు ఈ ఇతిహాసమును చెప్పెదరు. 1-9

ఆసీత్పురా మహీపాలస్సోమవంశసముద్భవః, జయధ్వజ ఇతి ఖ్యాతో నారాయణపరాయణః. 10

విష్ణోర్దేవాలయే నిత్యం సమ్మార్జనపరాయణః, దీపదానరతశ్చైవ సర్వభూతదయాపరః. 11

స కదా చిన్మ హీపాలో రేవాతీరే మనోరమే, విచిత్రకుసుమోపేతం కృతవాన్విష్ణుమందిరమ్‌. 12

స తత్ర నృపశార్ధూలస్సదా సంమార్జనే రతః, దీపదానపరశ్చైవ విశేషేణ హరిప్రియః. 13

హరినామపరో నిత్యం హరిసంసక్తమానసః, హరిప్రణామనిరతో హరిభక్తిజనప్రియః. 14

వీతిహోత్ర ఇతి ఖ్యాతో హ్యాసీత్తస్య పురోహితః, జయధ్వజస్య చరితం దృష్ట్వా విస్మయమాగతః. 15

కదాచిదుపవిష్టం తం రాజానం విష్ణుతత్పరమ్‌, అపృచ్ఛద్వీతిహోత్రస్తు వేదవేదాంగపారగః. 16

పూర్వకాలమున సోమవంశమున పుట్టిన జయధ్వజుడను మహారాజు నారాయణపారాయణుడుండెను. జయధ్వజ మహారాజు ప్రతినిత్యము విష్ణ్వాలయమున సమ్మార్జనము చేయుచుంచెడివాడు. దీపారాధన చేయువాడు విశేషించిన వారికి ప్రీతిపాత్రుడుగా నుండెను. సర్వప్రాణులయందు దయచూపువాడు. ఆ మహారాజు ఒకప్పుడు సుందరమైన రేవానదీ తీరమున పలువిధములైన పుష్పరాశులతో కూడిన విష్ణ్వాలయమును నిర్మించెను. ఆ ఆలయమున నిత్యము సమ్మార్జనము చేయుచు దీపదానపరుడుగా నుండెను. నిత్యము హరినామపరుడు హరిసంసక్తమానసుడు హరిప్రణామనిరతుడు హరిభక్తజనప్రియుడుగా నుండెను. జయధ్వజమహారాజునకు వీతిహోత్రుడను పురోహితుడుండెను. వీతిహాత్రుడు జయధ్వజుని చరితమును చూచి ఆశ్చర్యమును పొందెను. ఒకప్పుడు విష్ణుతత్పరుడగు జయధ్వజుడు కూర్చొని యుండగా వేదవేదాంగపారగుడగు వీతిహాత్రుడు ఇట్లడిగెను. 10-16

వీతిహాత్ర ఉవాచ : -

రాజన్పరమధర్మజ్ఞ హరిభక్తపరాయణ ! విష్ణుభక్తిమతాం పుంసాం శ్రేష్ఠోసి భరతర్షభ

! 17

సమ్మార్జనపరో నిత్యం దీపదానరతస్తథా, తన్మే వద మహాభాగ ! కిం త్వయా విదితం ఫలమ్‌. 18

సంపాదనేన వర్తీనాం తైలసంపాదనేన చ, సంయుక్తోసి సదా భద్ర యద్విష్ణోర్గృహమార్జనే. 19

కర్మాణ్యన్యాని సంత్యేవ విష్ణోః ప్రీతికరాణి చ , తథాపి కిం మహాభాగ ఏతయోస్సతతోద్యతః. 20

సర్వాత్మానా మహాపుణ్యం నరేశ విదితం చ యత్‌, తద్భ్రూహి మే గుహ్యతమం ప్రీతిర్మయి తవాస్తి చేత్‌. 21

పురోధసైవముక్తస్తు ప్రహసన్స జయధ్వజః, వినయావనతో భూత్వా ప్రోవాచేదం కృతాంజలిః. 22

వీతిహోత్రుడు పలికెను : - పరమ ధర్మములను తెలిసిన మహారాజా ! హరిభక్త పరాయణా ! భరతవంశ##శ్రేష్ఠా ! హరిభక్తి కలవారిలో ఉత్తముడా ! ప్రతిదినము విష్ణుమందిరమున సమ్మార్జనమును చేయుచున్నావు. దీపదానమును చేయుచున్నావు. ఓ మహానుభావా ! ఇట్లు చేయుటకు నీకు తెలిసిన ఫలమేమిటో తెలుపుము. వత్తులను చేయుచు తైలమును మార్చి దీపదానము చేయుచు, సమ్మార్జనము చేయుచుందువు. శ్రీమహావిష్ణువునకు ప్రీతిని కలిగించు పనులు ఇతరములు చాలా కలవు కదా ! అయిననూ నీవీ రెండు పనులనే ఎందుకు చేయుచున్నావు ? అన్ని విధములుగా ఈ రెండు కార్యములు మహాపుణ్యతమములు అని నీకు తెలిసియే యుండును. నీకు నాయందు ప్రీతి కలదేని ఆ రహస్యమును నాకు తెలుపుము. ఇట్లు పలికిన పురోహితుని మాటలను విని జయద్వజుడు చిరునవ్వుతో చేతులు జోడించి వినయావనతుడై ఇట్లు పలికెను. 17 -

22

జయధ్వజ ఉవాచ : -

శృణుష్వ విప్రశార్దూల మయైవాచరితం పురా, జాతిస్మరాత్వాజ్ఞానామి శ్రోతృణాం విస్మయప్రదమ్‌. 23

ఆసీత్పురా కృయుగే బ్రహ్మన్స్వారోచిషాంతరే, రైవతో నామ విప్రేన్ద్రో వేదవేదాంగపారగః. 24

అయాజ్యయాజకశ్చైవ సదైక గ్రామయాజకః, పిశునో నిష్ఠురశ్చైవ, హ్యపణ్యానాం చ విక్రయీ. 25

నిషిద్ధకర్మాచరణాత్పరిత్యక్తస్స బంధుభిః, దరిద్రో దుఃఖితశ్చైవ శీర్ణాంగో వ్యాధితో భవత్‌. 26

స కదాచిద్ధనార్థం తు వృథివ్యాం పర్యటన్‌ ద్విజః, మమార నర్మదాతీరే శ్వాసకాప్రపీడితః. 27

తస్మిన్మృతే తస్య భార్యా నామ్నా బంధుమతీ మునే, కామచారపరా సా తు పరిత్యక్తాచ బంధుభిః. 28

తస్యాం జాతోస్మి చాండాలో దండకేతురితి శ్రుతః మహాపాపరతో నిత్యం బ్రహ్మద్వేషరపరాయణః. 29

పరదారపరద్రవ్యలోలుపా జంతుహింసకః, గావశ్చ విప్రా బహవో నిహతామృగపక్షిణః. 30

మేరుతుల్యసువర్ణాని బహున్యపహృతాని చ, మద్యపానరతో నిత్యం బహుశో మార్గరోధకృత్‌. 31

పశుపక్షిమృగాదీనాం జంతూనామంతకోపమః, కదాచిత్కామసంతప్తో గంతుకామో రతిం స్త్రియః. 32

శూన్యం విష్ణుగృహం దృష్ట్వా ప్రవిష్టశ్చ స్త్రియా సహ, నిశి కామోపభోగార్థం శయితం తత్ర కామినా. 33

బ్రహ్మన్స్వవస్త్రప్రాంతేన కియద్దేశః ప్రమార్జితః, యావంత్యః పాంశుకణికాస్తత్ర సంమార్జితా ద్విజ. 34

తావజ్జన్మకృతం పాపం తదైవ క్షయమాగతమ్‌, ప్రదీపస్థ్సా పితస్తత్ర సురతార్థం ద్విజోత్తమ. 35

తేనాపి మమ దుష్కర్మ నిశ్శేషక్షయమాగతమ్‌, ఏవం స్థితే విష్ణుగృహే హ్యాగతాః పురపాలకాః 36

జారో యమితి మాం తాం చ హతవంతః ప్రసహ్య వై, ఆవాం నిహత్య తే సర్వే నివృత్తాః పురరక్షకాః. 37

యదా తదైవ సంప్రాప్తా విష్ణుదూతాశ్చతుర్భుజాః, కిరీటకుండలధరా వనమాలావిభూషితాః. 38

దివ్యం విమానమారుహ్య సర్వభోగసమన్వితమ్‌, దివ్యదేహధరౌ భూత్వా విష్ణులోకముపాగతౌ. 39

దివ్య దేహదరౌ భూత్వా విష్ణులోకముపాగతౌ, తత్ర స్థిత్వా బ్రహ్మకల్పశతం సాగ్రం ద్విజోత్తమ. 40

దివ్యభోగసమాయుక్తే తావత్కాలం దివి స్థితౌ, తతశ్చ భూమిభాగేషు దేవయోగేషు వై క్రమాత్‌. 41

తేన పుణ్యప్రభావేన యదూనాం వంశసంభవః, తైనైవమేచ్యుతా సంపత్తథా రాజ్యమకంటకమ్‌. 42

బ్రహ్మన్కృత్వోపబోగార్ధం ఏవం శ్రేయోహ్యవాప్తవాన్‌, భక్త్వా కుర్వంతి యే సంతస్తేషాం పుణ్యం న వేద్మ్యహమ్‌. 43

తస్మాత్సమ్మార్జనే నిత్యం దీపదానే చ సత్తమ, యతిష్యే పరయా భక్త్యా హ్యహం జాతిస్మరో యతః. 44

యః పూజయేజ్జగన్నాధమేకాకీ విగత స్సృహః, సర్వపాపవినిర్ముక్తః ప్రయాతి పరమం పదమ్‌. 45

అవశేనాపి యత్మర్మ కృత్వేమాం శ్రియమాగతః, భక్తిమద్భిః ప్రశాంతైశ్చ కింపునస్సమ్యగర్చనాత్‌. 46

ఇతి భూపతేర్వచ శ్శ్రత్వా వీతిహోత్రో ద్విజోత్తమః, అనన్తతుష్టిమాపన్నో హరిపూజాపరోభవత్‌. 47

జయధ్వజమహారాజు పలికెను : - ఓ బ్రాహ్మణోత్తమా ! నేను పూర్వజన్మమున ఆచరించిన దానిని పూర్వజన్మజ్ఞానము కలదు కావున చెప్పుచున్నాను. వినువారలకాశ్చర్యమును గొలుపు ఆ వృత్తాంతమును వినుడు. పూర్వకాలమున కృతయుగమున స్వారోచిష మన్వంతరమున వేదవేదాంగపారగుడగు రైవతుడను బ్రాహ్మణుడుండెను. యాగము చేయుటకు అయోగ్యులైన వారిచే యాగమును చేయించెడివాడు. గ్రామయాజ్ఞికమును చేయుచుంచెడివాడు. లోభిత్వము కలవాడు, కఠినుడు, అమ్మకూడని వాటిని అమ్ముచుండెడివాడు. నిషిద్ధ కర్మముల నాచరించుటవలన బంధువులు వెలివేసిరి. దరిద్రుడై దుఃఖముతో జీర్ణ శరీరము కలవాడై వ్యాధిగ్రస్తుడాయెను. ఆ రైవతుడు ధనమును సంపాదించుటకు పర్యటించుచు నర్మదా తీరమున శ్వాసరోధముతో (ఉబ్బసము వ్యాధిచే) మరణించెను. అతని భార్య బంధుమతి భర్త మరణించిన తరువాత కామచారులుగా మారి బంధువులచే పరిత్యజించబడెను. ఆ బంధుమతియందు చండాలుని వలన నేను పుట్టితిని. నా పేరు దండకేతువు. నేను కూడా నిత్యము మహాపాపములను చేయుటలో ఆసక్తి కలవాడినై బ్రాహ్మణులను ద్వేషించుచు, పరదారలను పరద్రవ్యములను అపహరించుచు, జంతువులను హింసించుచుంటిని. నేను చాలామంది బ్రాహ్మణులను చాలా గోవులను చంపితిని. వేలకొలది మృగములను పక్షులను వదించితిని. లెక్కలేనంత సువర్ణాది ద్రవ్యము నపహరించితిని. మద్యపానముతో మత్తుడనై దారికాచి దొంగతనమును చేయుచుంటిని. ఒకప్పుడు కామార్తుడనై రత్యర్ధినై యువతిని వెంటతీసుకొని నగరమున శూన్యముగానున్న విష్ణుమందిరమును చూచి లెనికి ప్రవేశించితిని. రాత్రిపూట కామోపభోగము కొఱకు ఆ రాత్రి అక్కడ శయనించదలచి నా మీది వస్త్రముతో దేవాలయప్రాంతమున ధూళిని దూరముగా ఊడ్చితిని. సంభోగము కొఱకు అచట దీపమును వెలిగించితిని. నా వస్త్రముతో ఎన్ని ధూళికణములను ఊడ్చితినో అన్ని జన్మల పాపములు నశించినవి. దీపము వెలిగించుటచే మిగిలిన పాపములు తొలగినవి. ఇంతలో నగరపాలకులు విష్ణుమందిరమునకు వచ్చిరి నన్ను జారునిగా ఆ యువతిని జారిణినిగా తెలిసి బలాత్కారముతో కొట్టి వధించిరి. తరువాత పురపారకులు వెళ్లిపోయిరి. మేము మరణించిన వెంటనే మా సమీపమునకు చతుర్భుజులు, కిరీట కుండలధారులు, వనమాలావిభుషితులు అగు విష్ణుదూతలు విమానమును తీసుకొని వచ్చిరి. పావనులైన విష్ణుదూతలచే పంపబడిన విమానము నధిరోహించి, దివ్వదేహధారులమై విష్ణులోకమును చేరితిమి. ఓ బ్రహ్మణోత్తమా ! విష్ణులోకమున నూరు బ్రహ్మకల్పములు నివసించితిని. తరువాత అంతకాలము సర్వభోగసమన్వితమైన స్వర్గమున నివసించితిమి. తరువాత భూలోకమున క్రమముగా భోగముల ననుభవించితిని. ఆ పుణ్యప్రభావముచే యదువంశమున పుట్టితిని. ఆ పుణ్యము వలననే తరగని సంపద, కర్మవలననే ఇంతటిమేలు పొందితిని. భక్తిచే చేసిన వారికెంత పుణ్యము కలుగునో నేను తెలియజాలను. కావున నాకు పూర్వజన్మ జ్ఞానముండుటచే ప్రతినిత్యము భక్తితో దేవాలయ సమ్మార్జనమును, దేవాలయమున దీపమును వెలిగించుటను చేయుచున్నాను. ఒంటరిగా నిస్పృహడై జగన్నాథుని పూజించినచో సర్వపాపముల నుండి విముక్తుడై పరమ పదమును పొందును. నేను నా వంశములో లేకనే కామాసక్తుడనై చేసిన కర్మవలననే ఇంతటి భోగమును పొందితిని. ప్రశాంతులై భక్తిగలవారు చక్కగా పూజించినచో ఎంత పుణ్యము లభించునో చెప్పవలయునా ? ఇట్లు జయధ్వజ మహారాజు చెప్పిన మాటలను వినిన వీతిహోత్రుడు అఖండానందమును పొంది విష్ణుపూజాపరుడాయెను. 23-47

తస్మాచ్ఛృణుష్వ విప్రేన్ద్ర ! దేవో నారాయణోవ్యయః, జ్ఞానతోజ్ఞానతో వాపి పూజకానాం విముక్తిదః. 48

అనిత్యా బాంధవాస్సర్వే విభవో నైవ శాశ్వతః, నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః. 49

అజ్ఞో లోకో వృథా గర్వం కరిష్యతి మహోద్ధతః చ కాయస్సన్నిహితాపాయో ధనాదీనాం కిముచ్యతే. 50

జన్మకోటిసహస్రేషు పుణ్యం యైస్సముపార్జితమ్‌, సులభాస్సర్వయజ్ఞాశ్చ విష్ణుభక్తిస్సుదుర్లభా. 51

సులభం జాహ్నవీస్నానం తథైవాతిథిపూజనమ్‌, సులభాస్సర్వయజ్ఞాశ్చ విష్ణుభక్తిస్సుదుర్లభా. 52

దుర్లభా తులసీ సేవా దుర్లభస్సంగమస్సతామ్‌, సర్వభూతాదయా వాపి సులభాయస్య కస్యచిత్‌. 53

సత్సంగస్తులసీసేవా హరిభక్తిశ్చ దుర్లభా, 54

దుర్లభం ప్రాప్య మానుష్యం న తథా గమయేద్బుధః, అర్ఛయేద్ధి జగన్నాధం సారమేతద్ద్విజోత్తమ. 55

తర్తుం యదీచ్ఛతి జనో దుస్తరం భవసాగరమ్‌ హరిభక్తిపరోభూయాదేతదేవ రసాయనమ్‌. 56

భ్రాతరాశ్రయ గోవిందం మా విలంబం కురు ప్రియ. అసన్నమేవ నగరం కృతాంతస్య హి దృశ్యతే. 57

నారాయణం జగద్యోనిం సర్వకారణకారణమ్‌. సమర్చయస్వ విప్రేన్ద్ర యది ముక్తిమభీప్ససి. 58

సర్వాధారం సర్వయోనిం సర్వాంతర్యామిణం విభుమ్‌. యే ప్రపన్నా మహాత్మానస్తే కృతార్ధా న సంశయః. 59

తే వంద్యాస్తే ప్రపూజ్యాశ్చ నమస్కార్యా విశేషతః. యేర్చయంతిమహావిష్ణుం ప్రణతార్తిప్రణాశనమ్‌. 60

యే విష్ణుభక్తా నిష్కామా యజంతి పరమేశ్వరమ్‌, త్రిస్సప్తకులసంయుక్తాస్తే యాంతి హరిమందిరమ్‌. 61

విష్ణుభక్తాయ యో దద్యాన్నిష్కామాయ మహాత్మనే, పానీయం వా ఫలం వాపి స ఏవ భగవత్ప్రియః. 62

విష్ణుభక్తిపరాణాం తు శుశ్రుషాం కుర్వతే తు యే, తే యాన్తి విష్ణుభవనం యావదాభూతసంప్లవమ్‌. 63

యే యజన్తి స్పృహాశూన్యా హరిభక్తాన్‌ హరిం తథా, త ఏవ భువనం సర్వం పునంతి స్వాంఘ్రిపాంశునా. 64

తత్రైవ సర్వదేవాశ్చ తిష్ఠన్తి శ్రీ హరిస్తథా, 65

పూజ్యమానా చ తులసీ యస్య తిష్ఠతి, వేశ్మని తత్ర సర్వాణి శ్రేయాంసి వర్దన్త్యహరిహర్ద్విజ. 66

శాలగ్రామశిలారూపీ యత్ర తిష్ఠతి కేశవః,న బాదంతే గ్రహాస్తత్ర భూతా బేతాలకాదయః. 67

శాలగ్రామశిలా యత్ర తత్తీర్థం తత్తపోవనమ్‌, యతస్సన్నిహితస్తత్ర భగవాన్మసూదనః. 68

యద్గృహే నాస్తి దేవర్షే సాగ్రామశిలార్చనమ్‌, శ్మశానసదృశ్యం విద్యా త్తద్గృహం శుభవర్జితమ్‌. 69

పురాణన్యాయమీమాంసాధర్మశాస్త్రాణి చ ద్విజ, సాంగా వేదాస్తథా సర్వే విష్ణో రూపం ప్రకీర్తితమ్‌. 70

భక్త్యా కుర్వంతి యే విష్ణోః ప్రదక్షిణచతుష్టయమ్‌, తేయాంతి పరం స్థానం సర్వకర్మనిబర్హణమ్‌. 71

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ

పూర్వభాగే ప్రధమపాదే

విష్ణుమాహాత్మ్యం నామ

ఏకోనచత్వారింశోధ్యాయః

ఓ బ్రాహ్మణోత్తమా ! కావున అవ్యయుడైన శ్రీమన్నారాయణ దేవుని తెలిసి కాని తెలియక కా ని పూజించినచో ముక్తినొసంగును. బంధువులు నిత్యులుకారు. సంపదలు శాశ్వతములు కావు. నిత్యము మృత్యువు సన్నిహిఔహతముగా నుండును. కావున ధర్మమును సంపాదించుకొనుము. అజ్ఞానముతో నున్న లోకము ఉద్ధతులై గర్వమును ప్రసాదించును. ఎపుడూ అపాయము దగ్గరలోనుండునది శరీరము. ధనాదులు నశ్వరములని ఏమి చెప్పవలయును ? వేయి కోట్ల జన్మలచే సంపాదించిన పుణ్యము వలన దేవదేవుడగు జనార్దనునియందు నిర్మలమగు భక్తి కలుగును. గంగాస్నానము అతిథి పూజ అన్ని యజ్ఞములు సులభములే. విష్ణుభక్తి మాత్రము దుర్లభము, తులసిని సేవించుట సత్సంగము దుర్లభము. సర్వభూతదయ ఏ ఒక్కరికో సులభము. సత్సంగము తులసీ సేవ హరిభక్తి దుర్లభములు, బహుదుర్లభమగు మానవత్వమును పొంది వ్యర్ధముగా కాలమును గడుపరాదు. జగన్నాథుని అర్చించుటయే మానవ జన్మకు సారము. తరింప శక్యము కాని సంసారమును తరించగోరువారు హరిభక్తి పరులుకావలయును. హరిభక్తియే దివ్యౌషథము సోదరా ! గోవిందుని ఆశ్రయించుము మిత్రమా ! ఆలసించకుము. యమనగరము సమీపములోనే కనపడుచున్నది. ముక్తిని అభిలషించినచో జగత్కారణుడు. సర్వధారుడు, సర్వకారణుడు, సర్వాంతర్యామి, సర్వజగన్నాథుడు అగు శ్రీమన్నారాయణుని శరణు కోరిన వారు కృతార్థులగుదురు. సంశయించపనిలేదు. ప్రణతుల ఆర్తిని నశింపచేయు శ్రీమహావిష్ణువును పూజించు మహానుభావులు నమస్కరించదగినవారు పూజించదగినవారు. విశేషించి వంద్యులు. నిష్కాములైన విష్ణుభక్తులు పరమాత్మతను పూజించినవారు ఇరువది యొక్కటి తరముల వారితో కలసి హరి మందిరమును చేరెదరు. నిష్కాముడు మహాత్ముడు అగు విష్ణుభక్తునకు జలమును కాని ఫలమును కాని దానము చేసినవారు భగవత్ప్రియులు. విష్ణుభక్తిపరులను సేవించువారు విష్ణులోకమును చేరి ప్రళయకాలము వరకు నివసింతురు. నిస్పృహులై హరిభక్తులను సేవించువారు తమ పాదరజముచే ఈ ప్రపంచముననే పావనము చేతురు. శ్రీహరిని పూజించువారు నివసించు గృహమున సర్వదేవతలు శ్రీహరి నివసించును. పూజించబడు తులసి యున్న గృహమున ప్రతిదినము శ్రేయః పరంవృద్ధి చెందును. శాలగ్రామ శిలారూపియగు శ్రీహరి నివశించు ప్రాంతమున భూతభేతాల గ్రహములు బాధించజాలవు. శాలగ్రామశిల నివసించు ప్రాంతము పుణ్యతీర్థము తపోవనము . భగవానుడు అచటనే నివసించును కదా ! శాలగ్రామశిలార్చనములేని గృహము శుభవర్జితమైన స్మశాన తుల్యమేయగును. వేదవేదాంగములు పురాణములు, న్యాయమీమాంసా ధర్మశాస్త్రములు శ్రీమహావిష్ణు ప్రతిరూపములుగా తెలియును. భక్తితో శ్రీమహావిష్ణువునకు నాలుగు ప్రదక్షిణములను చేయువారు సర్వకర్మ వినాశకమగు పరపదమును పొందెదరు. 48-71

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

పూర్వభాగమున ప్రథమపాదమున

విష్ణుమాహాత్మ్యమను

ముప్పది తొమ్మిది అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page