Sri Naradapuranam-I    Chapters    Last Page

చత్వారింశోధ్యాయః = నలుబదియవ అధ్యాయము

విష్ణుమాహాత్మ్యమ్‌

సనక ఉవాచ : -

అతః పరం ప్రవక్ష్యామి విభూతిం వైష్ణవీం మునే, యాం శృణ్వతాం కీర్తయతాం సద్యః పాపక్షయో భ##వేత్‌. 1

వైవస్వతేంతరే పూర్వే శక్రస్య చ బృహస్పతేః, సంవాదస్సుమహానాసీత్తం వక్ష్యామి నిశామయ. 2

ఏకదా సర్వభోగాఢ్యో విబుధైః పరివారితః, అప్సరోగణసంకీర్ణో బృహస్పతిమభాషత. 3

సనక మహర్షి పలికెను : - ఓ మునీ ! ఇపుడు శ్రీమహావిష్ణు వైభవమును చెప్పెదను. ఆ వైభవమును చెప్పువారికి వినువారికి అన్ని పాపములు నశించును. పూర్వము వైవస్వత మన్వన్తరమున ఇంద్రునకు బృహస్పతికి గొప్ప సంవాదము జరిగియున్నది. దానిని చెప్పెదను వినుము. ఒకానొకప్పుడు సర్వభోగసమన్వితుడు సర్వదేవ పరివృతుడు, అప్సరోగణ సమేతుడగు ఇంద్రుడు బృహస్పతిని గూర్చి ఇట్లు పలికెను. 1-3

ఇన్ద్రఉవాచ : -

బృహస్పతే! మహాభాగ! సర్వతత్త్వార్ధ కోవిద! అతీతబ్రహ్మణః కల్పే సృష్టిః కీదృగ్విధా ప్రభో ! . 4

ఇంద్రస్తు కీదృశః ప్రోక్తో విబుథాః కీదృశాస్స్మతాః, తేషాం చ కీదృశం కర్మ యథావద్వక్తుమర్హసి. 5

ఇంద్రుడు పలికెను : - మహానుభావా ! సర్వతత్త్వార్ధకోవిదా ! బృహస్పతీ ! గడిచిన బ్రహ్మకల్పమున సృష్టి ఎట్లుండెను ? ఇంద్రుడెట్టి వాడుగానుండెను ? దేవతలెట్టి వారు ? ఎట్టిపనులను చేసియున్నారు ? దీనినంతటిని ఉన్నది ఉన్నట్టుగా తెలుపుము.

బృహస్పతిరువాచ : -

న జ్ఞాయతే మయా శక్ర పూర్వేద్యుశ్చరితం విధేః, వర్తమానదినస్యాపి దుర్జేయం ప్రతిభాతి మే. 6

మనవస్సమతీతాశ్చ తాన్వక్కుమపి న క్షమః, యో విజానాతి తం తేద్య కథయామి నిశామయ. 7

సుధర్మ ఇతి విఖ్యాతః కశ్చిదాస్తే పురే తవ, భుంజానో దివ్యభోగాంశ్చ బ్రహ్మలోకాదిహాగతః. 8

స వా ఏతద్విజానాతి కథయామి నిశామయ, ఏవముక్తస్తు గురుణా శక్రస్తేన సమన్వితః. 9

దేవతాగణసంకీర్ణస్సుధర్మనిలయం య¸°, 10

సమాగతం దేవపతిం బృహస్సతిసమన్వితమ్‌, దృష్ట్వా యతార్హం దేవర్షే పూజయామాస సాదరమ్‌. 11

సుధర్మేణార్చితశ్శక్రో దృష్ట్వా తచ్ఛ్రియముత్తమామ్‌, మనసా విస్మయావిష్ఠః ప్రోవాచ వినయాన్వితః. 12

బృహస్పతి పలికెను : - పూర్వకల్పమున జరిగిన చరితము నాకు తెలియదు. ఇపుడు జరుగుచున్నది కూడా తెలియశక్యముకాదు. గడిచిన మనువుల గూర్చి కూడా చెప్పజాలను, నీవడిగిన విషయమునంతటిని తెలిసిన వానిని చెప్పెదను వినుము. నీ పురములోనే సుధర్ముడను పేరుగలవాడు సుప్రసిద్ధుడున్నాడు. అతను బ్రహ్మలోకమునుండు ఇచటికి వచ్చి దివ్యభోగముల ననుభవించుచున్నాడు. ఆ సుధర్ముడు వీటినన్నిటిని తెలియును. బృహస్పతి ఇట్లు పలుకగా ఇంద్రుడు బృహస్పతితో దేవతాగణములతో కలిసి సుధర్ముని గృహమునకు వెళ్ళెను. బృహస్పతితో కలిసి వచ్చిన ఇంద్రుని చూచి సుధర్ముడు తగిన విధముగా పూజించెను. ఇట్లు ఆదరముతో సుధర్ముడు చేసిన పూజను స్వీకరించిన ఇంద్రుడు సుధర్ముని వైభవమును చూచి విస్మయము నొంది వినయముతో నిట్లు పలికెను. 6-12

ఇంద్ర ఉవాచ:-

అతీతబ్రహ్మతల్పస్య వృత్తాంతం వేత్సి చేద్బుధ, తదాఖ్యాహి సమాయాత ఏతత్ప్రష్టుం సయాజకః. 13

గతమింద్రం చ దేవాశ్చ యేన జానాసి సువ్రత, తద్వదస్వాధికః కస్మాదస్మద్భ్యోపి దివి స్థితః. 14

తేజసా యశసా కీర్త్యా జ్ఞానేన చ పరంతప, దానేన వా తపోభిర్వా కతమేతాదృశః ప్రభో

! 15

ఇత్యుక్తో దేవరాజేన సుధర్మా ప్రహసంస్తదా, ప్రోవాచ వినయావిష్టః పూర్వవృత్తం యథావిధి. 16

ఇంద్రుడు పలికెను : - జరిగిన బ్రహ్మకల్పవృత్తాన్తమును తెలిసినచో చెప్పుము. ఈ విషయమును అడుగుటకే బృహస్పతితో కలిసి వచ్చితిని. గతించిన ఇంద్రునిదేవతలను ఎట్లు తెలియుదువు ? స్వర్గములో నివసించియు మాకంటే అధికుడవైతివో చెప్పుము. తేజస్సుచే ఇతరసాధనములచే ఎట్లు ఇట్టివాడవైతివో తెలుపుము. ఇంద్రుడిట్లడుగా సుధర్ముడు నవ్వుచు వినయముతో పూర్వమున జరిగిన దానిని యథావిధిగా వివరించెను. 13-16

సుధర్మ ఉవాచ :-

చతుర్యుగసహస్రాణి బ్రాహ్మణో దిముచ్యతే, ఏకస్మిన్‌ దివసే శక్ర మనవశ్చ చతుర్దశ. 17

ఇంద్రాశ్చతుర్దశ ప్రోక్తా దేవాశ్చ వివిధాః పృధక్‌, ఇంద్రాణాం చైవ సర్వాషాం మన్వాదీనాం చ వాసవ. 18

తుల్యతా జేజసా లక్ష్మ్యా ప్రభావేణ బలేన చ, తేషాం నామాని వక్ష్యామి శృణుష్వ సుసమాహితః. 19

స్వాయంభువో మనః పూర్వం తతస్స్వారోచిషస్తథా, ఉత్తమస్తమసశ్చైవ రైవతశ్చాక్షుషస్తథా. 20

వైవస్వతో మనుశ్చైవ సూర్యసావర్ణిరష్టమః, నవమో దక్షసావర్ణిస్సర్వదేహహితే రతః. 21

దశమో బ్రహ్మసావర్ణి ర్ధర్మసావర్ణికస్తతః, తతస్తు రుద్రసావర్ణీ రోచమానస్తతస్స్మృతః. 22

భౌత్యశ్చతుర్దశఃప్రోక్త ఏతే హి మనవస్స్మృతాః, దేవానింద్రాశ్చ వక్ష్యామి శృణుష్వ విబుధర్షభ. 23

యామా ఇతి సమాఖ్యాతా దేవా స్స్వాయంభువోంతరే, శచీపతిస్సమాఖ్యాస్తేషామింద్రో మహామతిః. 24

పారావతాశ్చ తుషితా దేవాస్స్వారోచిషోంతరే, విపశ్చిన్నామ దేవేన్ద్రస్సర్వసంపత్సమన్వితః. 25

సుధామానస్తధా సత్యా శివాశ్చాథ ప్రతర్ధనాః, తేషామింద్రస్సశాంతిశ్చ తృతీయే పరికీర్తితః. 26

సుతా పాపాహరణశ్చైవ సుత్యాశ్చాసుధియస్తథా, తేషామిన్ద్రశ్శివః ప్రోక్తశ్శక్రస్తామసకేంతరే. 27

విభునామా దేవపతిః పంచమః పరికీర్తతః, అమితాభాదయో దేవాష్షష్టేపి చ తథా శృణు. 28

ఆర్యాద్యా విభూధా ప్రోక్తాస్తేషామిన్ద్రో మనోజవః, ఆదిత్యవసురుద్రాశ్చ దేవా వైవస్వతేంతరే. 29

ఇంద్రః పురందరః ప్రోక్తస్సర్వకామసమన్వితః, అప్రమేయాశ్చ విభుధాస్స తు పాద్యః ప్రకీర్తితాః. 30

విష్ణుపూజాప్రభావేణ తేషమింద్రో బలస్స్మతః, పారాద్యా నవమే దేవా ఇంద్రస్చాద్భుత ఉచ్యతే. 31

సువాసనాద్యా విబుధా దశ##మే పరికీర్తితాః, శాంతిర్నామ చ తత్రేన్ద్రస్సర్వభోగసమన్వితః. 32

విహంగమాద్యా దేవాశ్చ తేషామిన్ద్రో వృషస్స్మృతః, ఏకాదశీద్వాదశే తు నిబోధ కథయామి తే. 33

ఋభునామా చ దేవేన్ద్రో హరినాభాస్తథా సురాః, సుత్రామాద్యాస్తథా దేవాస్త్రయోదశ##మే న్తరే. 34

దివస్పతిర్మహావీర్యస్తేషామిన్ద్రః ప్రకీర్తితః, చతుర్దశే చాక్షుషాద్యా దేవా ఇన్ద్రశ్శుచిస్స్మృతః. 35

ఏవం తే మనవః ప్రోక్తా ఇంద్రా దేవాశ్చ తత్త్వతః, ఏకస్మిన్బ్రహ్మాదివసే స్వాధికారం ప్రభుంజతే. 36

లోకేషు సర్వసర్గేషు సృష్టిరేకవిధా స్మృతా, కర్తారో బహవస్సంతి తత్సంఖ్యాం వేత్తి కోవిదః. 37

మయి స్థితే బ్రహ్మలోకే బ్రహ్మణో బహవో గతాః, తేషాం సంఖ్యాం సంఖ్యాతుం శక్తోస్మ్యద్య ద్విజోత్తమ! 38

స్వర్గలోకమపి ప్రాప్య యావత్కాలం శృణుష్వ మే, చత్వారో మనవో తీతా మమ శ్రీశ్చాతివిస్తరా. 39

స్థాతవ్యం చ మయాత్రైవ యుగకోటిశతం ప్రభో ! తతః పరం గమిష్యామి కర్మభూమిం శృణుష్వ మే. 40

మయా కృతం పురాకర్మ వక్ష్యామి తవ సువ్రత, వదతాం శృణుతాం చైవ సర్వపాపప్రణాశనమ్‌. 41

సుధర్ముడు పలికెను : - నాలుగువేల యుగములు బ్రహ్మకు ఒకదినమని చెప్పబడినది. ఆ ఒక దినమును పదునాలుగు మంది మనువులు, పదునాలుగుమంది ఇంద్రులు ఉందురు. దేవతలు చాల విధములుగా నుందురు. ఇంద్రులు మనువులు తేజో బలప్రభావ సంపదలు సమముగా నుండును. వారి పేర్లను చెప్పెదను. సావదానముగా వినుము.

మొదటి మనువు స్వాయంభువ మనువు. తరువాత స్వారోచిషుడు. ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, వైవస్వత మనువు ఏడవవాడు. సుర్యసావర్ణి ఎనిమిదలవాడు. దక్షసావర్ణి తొమ్మిదవవాడు. బ్రహ్మసావర్ణి పదియవ మనువు. తరువాత ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రోచమాన్నుడు, పదునాలుగవవాడు భౌత్యుడు. ఈ పదునలుగురు మనువులు. ఇక ఇపుడు దేవతలను ఇంద్రులను చెప్పెదను వినుము. స్వాయంభువ మన్వంతరమున యాములను వారు దేవతలు. వారికింద్రుడు శచీపచి . స్వారోచిషమన్వంతరమున పారావతులు దేవతలు. వారికి సర్వసంపత్సమన్వితుడగు విపశ్చిత్తు ఇంద్రుడు. ఉత్తమ మన్వంతరమున సుధాములు సత్యులు శివులు ప్రతర్దనులు అనువారు దేవతలు. వారికింద్రుడు సుశాంతి. తామసమన్వన్తరమున సుతులు పారాహరులు సుత్యులు దేవతలు. వారికింద్రుడు శుభకరుడగు శక్రుడు, రైవతమన్వంతరమున అమితాభాదులు దేవతలు. వారికింద్రుడు విభువు. ఆరవమన్వంతరమున ఆర్యాదులు దేవతలు. వారికింద్రుడు మనోజవుడు. వైవస్వత మన్వంతరమున ఆదిత్య వసురుద్రాదులు దేవతలు. విష్ణుపూజా ప్రబావముచే బలిచక్రవర్తి వారికి ఇంద్రుడు. దక్షసావర్ణి మన్వంతరమున పారాదులు దేవతలు. అద్భుతుడు ఇంద్రుడు. బ్రహ్మసావర్ణిమన్వంతరమున సువాసనాదులు దేవతలు. సర్వభోగసమన్వితుడగు శాంతినామకుడు ఇంద్రుడు. రుద్రసావర్ణి మన్వంతరమున విహంగమాదుడు దేవతలు. వృషుడు ఇంద్రుడు. ధర్మసావర్ణిమన్వంతరమున విహంగమాదులు దేవతలు. ఋభుడనువాడు ఇంద్రుడు. రోచమాన మన్వంతరమున సుత్రామాదులు దేవతలు. దివస్పతి ఇంద్రుడు. భౌత్యమన్వంతరమున చాక్షుషాదులు దేవతలు శుచి ఇంద్రుడు . ఇట్లు పదునాలుగు మంది మనువులను ఇంద్రులను చెప్పితిని. దేవతలను కూడా తేవిపితిని. వీరందరు బ్రహ్మయొక్క ఒకదినమున తమ అధికారమును అనుభవింతురు. లోకములో అన్ని సృష్టులలో సృష్టి ఒకే విధముగా నుండును. సృష్టికర్తలు చాలమంది యుందురు. వారి సంఖ్యను జ్ఞానులు మాత్రమే తెలియుదురు. నేను బ్రహ్మలోకమున నుండగా చాలామంది బ్రహ్మలు గతించిరి. వారిని ఇప్పుడు లెక్కించజాలను. స్వర్గలోకమునకు వచ్చిన తరువాత నలువురు మనువులు గతించిరి. నా సంపద అతి విస్తరము. ఇంకను నేనిచట నూరు కోట్ల యుగములుండవలయును. అపుడు మరల కర్మభూమికి వెళ్ళెదను. నేను పూర్వము చేసిన సుకృతమును చెప్పెదను వినుము. చెప్పువారికి వినువారికి సర్వపాపములు తొలగును. 17- 41

అహమాసం పురా శక్ర గృధ్రః పాపో విసేషతః, స్థితశ్చ భూమిభాగే వై అమేద్యామిషభోజనః. 42

ఏకదాహం విష్ణుగృహే ప్రాకారే సంస్థితః ప్రబో, పతితో వ్యాధశాస్త్రేణ సాయం విష్ణోర్గృహాంగణ. 43

మయి కంఠగతప్రాణ భషణో మాంసలోలుపః, జగ్రాహ మాం స్వవక్త్రేణ శ్వభిరన్యైశ్చరన్ద్రుతః. 44

వహన్మాం స్వముఖేనైవ భీత్యోన్యైర్భషణౖస్తథా, గతః, ప్రదక్షిణాకారం విష్ణోస్తన్మందిరం ప్రభో! 45

తేనైవ తుష్టిమాపన్నో హ్యంతరాత్మా జగన్మయః, మమ చాపి శునశ్చాపి దత్తవాన్పరమం పదమ్‌. 46

ప్రదక్షిణాకారతయా గతస్యాపీదృశం ఫలమ్‌, సంప్రాప్తం విబుధశ్రేష్ఠ కింపునస్సమ్యగర్చనాత్‌. 47

ఇత్యుక్తో దేవరాజస్తు సుధర్మేణ మహాత్మానా మనసా ప్రీతిమాపన్నో హరిపూజారతో భవత్‌. 48

తథాపి నిర్జరాస్సర్వే భారతే జన్మలిప్సవః, సమర్చయంతి దేవేశం నారాయణమనామయమ్‌. 49

తానర్చయంతి సతతం బ్రహ్మద్యా దేవతాగణాః. 50

నారాయణానుస్మరణోద్యతానాం మహాత్మానాం త్యక్తపరిగ్రహాణామ్‌,

కథం భవత్యుగ్రభవస్య బంధస్తత్సంగ లుబ్ధా యది ముక్తిభాజః. 51

యే మానవాః ప్రతిదినం పరిముక్తసంగా నాలాయణం గరుడవాహనమర్చయన్తి,

తే సర్వపాపనికరైః పరితో విముక్తిం విష్ణోః పదం శుభతరం ప్రతియాన్తి హృష్టాః. 52

యే మానవా విగతరాగపరావరజ్ఞా నారాయణం సురగురుం సతతం స్మరన్తి,

ధ్యానేన తేన హతకిల్చిషచేతనాస్తే మాతుః పయోధరరసం న పునః పిబన్తి 53

యే మానవా హరికథాశ్రవణాస్తదోషాః కృష్ణాంఘ్రిపద్మభ##జే రతచేతనాశ్చ,

త వై పునంతి చ జగంతి శరీరసంగాత్‌ సంభాషణాదపి తతో హరి రేవ పూజ్యః. 54

హరిపూజాపరా యత్ర మహాన్తశ్శుద్ధబుద్ధయః, తత్రైవ సకలం భద్రం యథా నిమ్నే జలం ద్విజ. 55

హరిరేవ పరో బంధు ర్హరిరేవ పరా గతిః, హరిదేవ తతః పూజ్యో యతశ్చైతన్యకారణమ్‌. 56

స్వర్గాపవర్గఫలదం సదానన్దం నిరామయమ్‌, పూజయస్య మునిశ్రేష్ఠ పరం శ్రేయో భవిష్యతి. 57

పూజయంతి హరిం యే తు నిష్కామాశశుద్ధమానసాః, తేషాం విష్ణుః ప్రసన్నాత్మా సర్వాన్కామాన్ప్రయచ్ఛతి. 58

యస్త్వేతచ్ఛృణుయాద్వారపి పఠేద్వా సుసమాహితః, స ప్రాప్నోత్యశ్వమేధస్య ఫలం మునివరోత్తమ. 59

ఇత్యేతత్తే సమాఖ్యాతం హరిపూజాఫలం ద్విజ, సంకోచవిస్తరాభ్యాం తు కిమన్యత్కథయామి తే. 60

ఇతి శ్రీ బృహన్నారదీయపురాణ పూర్వభాగే

ప్రథమపాదే విష్ణుమాహాత్మ్యే

చత్వారింశోధ్యాయః

ఓ ఇంద్రా ! నేను పూర్వము విశేషించి పాపాత్మకమగు గద్దనై యుంటిని. అపవిత్రమైన అయోగ్యమగు మాంసమును భుజించుచు భూమిపై సంచరించుచుంటిని. ఒకపుడు నేను విష్ణుమందిర ప్రాకారమున నిలచియుంటిని. అంతలో వేటగాడు బాణముచే కొట్టగా మందిర ప్రాంగణమున పడితిని. నేను కొన ఊపిరితో నుండగా మాంసముపై ఆశగల శునకము తన నోటితో కరచుకొని మరికొన్ని శునకములు వెంటరాగా పరుగెత్తినది. ఇతర శునకముల భయముతో ఆ శునకము నన్ను నోటితో పట్టుకొని మందిరము చుట్టు ప్రదక్షిణ పద్ధతిలో తిరిగెను. జగన్మయుడు అంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు ఆ మాత్రమునకే సంతోషించి నాకు ఆ శునకమునకు పరమ పదమునిచ్చెను. ఆ సంకల్పితముగా ప్రదక్షిణారూపమున తిరిగిన దానికే ఇంత ఫలమున్నచో చక్కగా అర్చించినచో ఇకనేమి చెప్పవలయును ? ఇట్లు సుధర్ముడు చెప్పగా వినిన ఇంద్రుడు సంతోషించి హరిపూజాపరుడాయెను. అందువలనననే దేవతలందరు భారతభూమిలో జన్మించగోరి అనామయుడగు నారాయణుని పూజింతురు. నారాయణ పూజాపరులను బ్రహ్మాది దేవతలు పూజింతురు. దానమును గ్రహించని వారు మహానుబావులు నారాయణస్మరణ చేయువారికి సంసారబంధ మెట్లు కలుగును. వారి సంగతిని కోరువారు కూడా ముక్తిని పొందెదరు. ముక్తసంగులైగరుడవాహనుడగు నారాయణుని

ప్రతిదినము ఆర్చించువారు సర్వపాప వినిర్ముక్తులై పరమపదమును పొందెదరు. రాగమును పరనిందను పరిత్యజించి శ్రీమన్నారాయణుని ఆర్చించువారు పునర్జన్మను

పొందరు. హరికథాశ్రవణముచే పాపములను తొలగించుకొని కృష్ణపాదప్మములను పూజించుటయందు ఆసక్తిగలవారు జగత్తును పాపనము చేతురు. వారి స్పర్శతో సంభాషణతో పావనములగుదురు. కావున శ్రీహరిని పూజించవలయును. నిర్మలబుద్ధులు మహానుభావులు అగు హరిపూజాపరాయణులుండుచోటనే పల్లప్రాంతమున నీరుండునట్లు అన్ని శుభములుండును. శ్రీహరియే ఉత్తమ బంధువు. శ్రీహరియే ఉత్తమగతి. చైతన్యకారణమగు శ్రీరియే పూజ్యుడు. స్వర్గపవర్గఫలమునిచ్చు సదానందస్వరూపుడు, నిరామయుడు అగు నారాయణుని పూజించుము. ఉత్తమ శ్రేయస్సు లభించును. నిష్కాములై శుద్ధమానసులై శ్రీహరిని పూజించినవారికి శ్రీహరి ప్రసన్నుడై అన్ని కోరికలను తీర్చును. ఈ వృత్తాన్తమును వినినవారు చదివునవారు అశ్వమేధయాగఫలమును పొందెదరు. ఓ మునీంద్రా ! ఇట్లు నీకు సంగ్రహముగా విస్తరముగా హరిపూజాఫలమును చెప్పితిని. ఇంకనేమి చెప్పమందువో తెలుపుము. 42 - 60

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున

పూర్వభాగమున ప్రథమపాదమున

విష్ణుమాహాత్య్మమను

నలుబదియవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page