Sri Naradapuranam-I
Chapters
Last Page
ఏకచత్వారింశో೭ధ్యాయః = నలుబదియొకటవ అధ్యాయము నామమాహాత్మ్యమ్ నారద ఉవాచ : - ఆఖ్యాతం భవతాం సర్వం మునే తత్త్వర్థకోవిద ! ఇదానీం శ్రోతుమిచ్చామి యుగానాం స్థితిలక్షణమ్. 1 నారద మహర్షి పలికెను :- తత్త్వార్థములు తెలిసిన ఓ మహామునీ
సనక ఉవాచ : -
సాధు సాధు మహాప్రాజ్ఞ! మునే లోకోపకార ! యుగధర్మాన్ప్రవక్ష్యామి సర్వలోకోపకారకాన్. 2
ధర్మో వివృద్ధిమాయాతి కాలే కస్మింశ్చిదుత్తమ, తథా వినాశమాయాతి ధర్మ ఏవ మహీతలే. 3
కృతం త్రేతా ద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగమ్, దివ్యైర్ద్వాదశభిర్దేయం వత్సరైస్తత్ర సత్తమ. 4
సంధ్యా సంధ్యాంశయుక్తాని యుగాని సదృశాని వై, కాలతో వేదితావ్యాని ఇత్యుక్తం తత్త్వదర్శిభిః. 5
ఆద్యే కృతయుగం ప్రాహుః తతస్త్రేతావిధానకమ్, తతశ్చద్వాపరం ప్రాహుః కలిమంత్యం విదుః క్రమాత్. 6
దేవదానవగంధర్వా యక్షరాక్షసపన్నగాః, నాసన్క్రృతయుగేవిప్ర సర్వే దేవసమాస్స్మృతాః. 7
సర్వే హృష్టాశ్చ ధర్మిష్ఠా న తత్ర క్రయవిక్ర¸°, వేదానాం చ విభాగాశ్చ న యుగే కృతసంజ్ఞకే. 8
బ్రాహ్మణాః క్షత్రియ వైశ్యా శూద్రాస్స్వాచారతత్పరాః, సదానారయణపరాస్తపోధ్యానపరయాణాః. 9
కామాదిదోషనిర్ముక్తాః శమాదిగుణతత్పరాఃద, ధర్మసాధనచిత్తాశ్చ గతాసూయా ఆదాంభికాః. 10
సత్యవాక్యరతాస్సర్వే చతురాశ్రవమధర్మిణః, వేదాధ్యయనసంపన్నాః సర్వశాస్త్రవిచక్షణాః. 11
చతురాశ్రమయుక్తేన కర్మణా కాలయోనినా, అకామఫలసంయోగాః, ప్రయాంతి పరమాం గతిమ్. 12
నారాయణః కృతయుగే శుక్లవర్ణస్సునిర్మలః, త్రేతాధర్మాన్ప్రవక్ష్యామి శృణుష్వ సుసమాహితః. 13
ధర్మః పాండురతో యాతి త్రేతాయాం మునిసత్తమ, హరిస్తు రక్తతో యాతి కించిత్కశాన్వితా జనాః. 14
క్రియాయోగరతాస్సర్వే యజ్ఞకర్మసు నిష్ఠితాః, సత్యవ్రతా ధ్యానపరాః సదా ధ్యానపరాయణాః. 15
ద్విపాదో వర్తతే ధర్మో ద్వాపరే చ మునీశ్వర, హరిః పీతత్వమాయాతి వేదశ్చాపి విభజ్యతే. 16
అసత్యనిరతాశ్చాపి కేచిత్తత్ర ద్విజోత్తమాః, బ్రాహ్మణాద్యాశ్చ వర్ణాస్స్యుః కేచిద్రాగాదిదుర్గుణాః. 17
కేచిత్స్వర్గాపవర్గార్థం విప్రయజ్ఞాన్ప్రకుర్వతే, కేచిద్ధనాదికామాశ్చ
కేచిత్కల్మషచేతసః. 18
అల్పాయుషో భవిష్యంతి కేచిచ్చాపి మునీశ్వర, కేచిత్పుణ్యరతాన్దృష్ట్వా అసూయాం విప్రకుర్వతే. 20
కలిస్థితిం ప్రవక్ష్యామి తచ్ఛృణుష్వ సమాహితః, ధర్మః కలియుగే ప్రాప్తేపాదేనైకేన వర్తతే. 21
తామసం యుగామాసాద్య హరిః కృష్ణత్వమేతి చ, యః కశ్చిదపిధర్మాత్మా యజ్ఞాచారాన్కరోతి చ. 22
యః కశ్చిదపి పుణ్యాత్మా క్రియాయోగరతో భ##వేత్, నరం ధర్మరతం దృష్ట్వా సర్వే೭ సూయాం ప్రకుర్వతే. 23
వ్రతాచారాః ప్రణ్యశ్యన్తి జ్ఞానయజ్ఞాదయస్తథా, ఉపద్రవా భవిష్యంతి హ్యధర్మస్య ప్రవర్తానాత్. 24
అసూయానిరతాస్సర్వే దంభాచారపరాయణాః, ప్రజాశ్చాల్పాయుషస్సర్వా భవిష్యంతి కలౌ యుగే. 25
సనక మహర్షి పలికెను :- ఓమునీ ! నీవు లోకోపకారకుడవు, మహాప్రాజ్ఞుడవు, బాగుగా ప్రశ్నించితివి. అన్ని లోకములకు ఉపకరించు యుగధర్మములను చెప్పెదను. ఈ భూలోకమున ఒక సమయమున ధర్మము వృద్ధి పొందును. ఒక సమయమున క్షీణించును. కృత త్రేతా ద్వాపర కలులను నాలుగు యుగములు, పన్నెండు దివ్యవత్సరములచే సంధ్యా సంధ్యాంశయుక్తములుగా యుగములు సమములుగా నుండును. తత్త్వదర్శులు ఈ యుగములను కాలముచే తెలియవలయునని చెప్పిరి. మొదటిది కృతయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, నాలుగవది కలియుగము. కృతయుగమున దేవ దానవ గంధర్వ యక్ష రాక్షసపన్నగులు లేకుండిరి. అందరూ దేవసములుగా నుండిరి. అందరూ తుష్టి పుష్టి కలవారు. దర్మ మార్గ పరాయణులు. కృతయుగమున క్రయవిక్రమయులు లేకుండెను. వేదవభాగము కూడా కృతయుగమున లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వాచారపరులుగా నుండిరి. ఎపుడూ నారాయణ పరాయణులు, తపోధ్యాన పరాయణులు కామాది దోష రహితులు, శమాది గుణ సంపన్నులు. ధర్మసాధన చిత్తులు, అసూయారహితులు, దంభాచారము లేనివారు, సత్యవాక్యరతులు, నాలుగు ఆశ్రమ ధర్మములనాచరించువారు, వేదాధ్యయనసంపన్నులు సర్వశాస్త్ర విచక్షణులు, నాలుగు ఆశ్రమములను తగిన కర్మలనాచరించుచు కాలానుగుణముగా కోరకనే ఫలములను పొంది ఉత్తమగతిని పొందెదరు. కృతయుగమున శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణుడు సునిర్మలుడు. ఇక త్రేతాయుగ ధర్మములను చెప్పెదను వినుడు. ఓ మునిసత్తమా ! త్రేతాయుగమున ధర్మము పాండుర వర్ణమును పొందును. శ్రీహరి రక్తవర్ణుడగును. జనులు కొంచెము కష్టములను పొందెదరు. అందరూ క్రియాయోగరతులు యజ్ఞకర్మనిష్ఠులు, సత్యవ్రతులు, ధ్యానపరులు, ఎప్పుడూ ధ్యాన పరాయణులుగా నుందురు. ద్వాపరయుగమున ధర్మము రెండు పాదములుండును. హరి పీత వర్ణుడగును. వేదవిభాగము జరుగును. ద్వాపరయుగమున కొందరు ద్విజులు అధర్మనిరతులగుదురు. బ్రాహ్మణాదివర్ణములలో కొందరురాగాది దుర్గుణములు కలవారగుదురు. స్వర్గాపవర్గముల కొఱకు కొందరు బ్రాహ్మణ యజ్ఞముల నాచరింతురు. కొందరు ధనాదికమును కోరువారు కొందరు కల్మషచిత్తులుగా నుందురు. ద్వాపరయుగమున ధర్మాధర్మములు సమముగానుండును. అధర్మ ప్రభావముచే ప్రజలు క్షయమునొందెదరు. కొందరు అల్పాయుష్యము కలవారగుదురు. కొందరు పుణ్యమార్గమునుసరించు వారిని చూచి అసూయ చెందెదరు. ఇక కలియుగ స్వరూపమును చెప్పెదను వినుము. కలియుగమున ధర్మము ఒకపాదముతో నుండును. తామస యుగము కావున శ్రీహరి కృష్ణ వర్ణమును పొందును. ఎవరో ఒకరు ధర్మాత్ముడు యజ్ఞాచారపరుడగును. ఎవరో ఒకపుణ్యాత్ముడు క్రియాయోగపరుడగును. ధర్మపరునిచూచి అందరూ అసూయ చెందెదరు. వ్రతాచారములు జ్ఞానయజ్ఞాదులు నశించి పోవును. అధర్మము ప్రవర్తించుటచే ఉపద్రవములు సంభవించును. అందరూ అసూయాపరులు దంభాచార పరాయణులు అల్పాయుష్కులు కలియుగమున ఉందురు.
నారద ఉవాచ :-
యుగధర్మాస్సమాఖ్యాత్తాస్త్వయా సంక్షేపతోమునే ! కలిం విస్తరతో బ్రూహి త్వం హి ధర్మవిదాం వరః. 26
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రాశ్చ మునిసత్తమ, కిమాహారాః కిమాచారాః భవిష్యంతి కలౌయుగే. 27
నారదమహర్షి పలికెను :- ఓ ముని సత్తమా? తాము యుగధర్మములను సంగ్రహముగా చెప్పితిరి. ధర్మవిదులైన మీరు కలియుగ ధర్మమును వివరముగా తెలుపుడు. క్షత్రియ వైశ్య శూద్రులు ఏ ఆహారమును తీసుకొందురు? ఏ ఆచారమును
అవలంబించెదరు? 26-27
సనక ఉవాచ : -
శృణుష్వ మునిశార్దూల సర్వలోకోపకారక ! కలిధర్మాన్ప్రవక్ష్యామి విస్తరేణ యథాతధమ్. 28
సర్వే ధర్మా వినశ్యంతి కృష్ణే కృష్ణత్వమాగతే, తస్మాత్కలిర్మహాఘోరః సర్వపాతకసంకరః. 29
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రా ధర్మపరాఙ్ముఖాః, ఘోరే కలియుగే ప్రాప్తే ద్విజా వేదపరాఙ్ముఖాః. 30
వ్యాజధర్మరతాస్సర్వే అసూయానిరతాస్తథా, వృధాహంకారదుష్టాశ్చ సత్యహీనాశ్చ పండితాః. 31
అహమేవాధిక ఇతి సర్వే೭పి వివదంతి చ, అధర్మలోలుపాస్సర్వే తథా వైతండికా
నరాః. 32
అతస్స్వల్పాయుషస్సర్వే భవిష్యంతి కలౌ యుగే, అల్పాయుష్ట్కాన్మనుష్యాణాం న విద్యాగ్రహణం ద్విజ. 33
విద్యాగ్రహణశూన్యత్వాత్ అధర్మో వర్తతే పునః, వ్యుత్క్రమేణ ప్రజాస్సర్వే మ్రియంతే పాపతత్పరాః. 34
బ్రాహ్మణాద్యాస్తథా వర్ణాః సంకీర్యన్తే పరస్సరమ్, కామక్రోధపరా మూఢా వృధా సంతాపపీడితాః. 35
శూద్రతుల్యా భవిష్యంతి సర్వే వర్ణాః కలౌ యుగే, ఉత్తమానీచతాం యాంతి నీచాశ్చోత్తమతాం తథాగ. 36
రాజానో ద్రవ్యనిరతాస్తథాహ్యన్యాయవర్తినః, పీడయంతి ప్రజాశ్చైవ
కరైరత్యర్ధయోజితైః. 37
శవవాహా భవష్యంతి శూద్రాణాం చ ద్విజాతయః, ధర్మస్త్రీష్వపి గచ్ఛంతి పతయో జారధర్మిణః. 38
ద్విషంతి పితరం పుత్రా భర్తారం చ స్త్రియో೭ఖిలాః, పరస్త్రీనిరతాస్సర్వే పరద్రవ్యపరాయణాః. 39
మత్స్యామిషేణ జీవంతి దుహంతశ్చాప్యజీవినామ్, ఘోరే కలియుగే ప్రాప్తే సర్వే పాపరతా జనాః. 40
సతామసూయానిరతా ఉపహాసం ప్రకుర్వతే, సరిత్తీరేషు కుద్దాలైర్వాప
యిష్యంతి చౌషధీః. 41
పృథ్వీ నిష్ఫలతాం యాతి బీజం పుష్పం వినశ్యతి, వేశ్యాలావణ్యశీలేషు స్పృహాం కుర్వంతి యోషితః. 42
ధర్మవిక్రయిణో విప్రా స్త్రియశ్చ భగవిక్రయాః, వేదవిక్రయాకాశ్చన్యే శూద్రాచారరతా ద్విజాః. 43
సాధూనాం విధవానాం చ విత్తాన్యపహరంతి చ, న వ్రతాని చరిష్యంతి బ్రాహ్మణా ద్రవ్యలోలుపాః. 44
ధర్మాచారం పరిత్యజ్య వృథావాదైర్విషజ్జితాః, ద్విజాః కుర్వంతి దంభార్థం పితృశ్రాద్ధాదికాః క్రియాః. 45
అపాత్రేష్వేవదానాని ప్రయచ్ఛన్తి నరాధమాః, దుగ్ధలోభనిమిత్తేన గోషు ప్రీతిం చ
కుర్వతే. 46
న కుర్వన్తి తథా విప్రాః స్నానశౌచాదికాః క్రియాః, అకాలే ధర్మనిరతాః భవిష్యంతి ద్విజాధమాః. 47
సాధునిన్దాపరాశ్చైవ విప్రనిన్దాపరాస్తథా, కస్యాపి మనో విప్ర విష్ణుభక్తిపరం భ##వేత్. 48
యజ్వినశ్చ ద్విజానేవ ధనార్థం రాజకింకరాః, తాడయంతి ద్విజాన్దుష్టాః కృష్ణే కృష్ణత్వమాగతే. 49
దానహీనా నరాస్సర్వే ఘోరే కలియుగే మునే, ప్రతిగ్రహం ప్రకుర్వంతి పతితానామపి ద్విజాః. 50
సనకమహర్షి పలికెను :- సర్వలోకోపకారమును చేయగోరు మునిశ్రేష్ఠా! ఉన్నవి ఉన్నట్లుగా విస్తరముగా కలి ధర్మములను చెప్పెదను. వినుము. శ్రీహరి కృష్ణవర్ణమును పొందగా అన్నిధర్మములు నశించును. కావున కలియుగము సర్వ పాతక సంకరమగు మహాఘోరముగా తెలియుము. ఘోరమైన కలియుగమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరు ధర్మ పరాఙ్ముఖులుగా, బ్రాహ్మణులు వేదపరాఙ్ముఖులగుదురు. అందరూ కపటముతో ధర్మరతులవలె కనపడుదురు. అపసూయాపరులగుదురు. పండితులు వ్యర్థముగా అహంకారము కలవారై సత్యహీనులగుదురు. నేనే అందరిలో అధికుడనని అందరూ వాదింతురు. అందరూ అధర్మలోలుపులు, వితండులు అగుదురు. కావుననే కలియుగమున అందరూ అల్పాయుషులగుదురు. అల్పాయువులగుటచే విద్యాభ్యాసమును చేయజాలరు. విద్యాభ్యాసము లేనందున అధర్మము ప్రవర్తించును. పాపతత్పరులై ప్రజలు విపరీతముగా (పెద్దలముందు చిన్నలు) మరణింతురు. బ్రాహ్మణాది వర్ణసంకరము జరుగును. కామక్రోధమపరులు, మూఢులు, వృధాసంతాప పీడితులుగా మారి కలియుగమున అన్నివర్ణములవారు శూద్రతుల్యులగుదురు. ఉత్తములు నీచులగుదురు. నీచులు ఉత్తములుగా పరిగణింపబడుదురు. రాజులు ద్రవ్యము నార్జించుట యందు ఆసక్తులై అన్యాయవర్తనులై ఎక్కువ పన్నులు వేసి ప్రజలను పీడింతురు. ద్విజులు శూద్రుల శవవాహనులగుదురు. జార ధర్మమునవలంబించి భర్తలు ధర్మస్త్రీల సంగమమును చేతురు. తండ్రిని పుత్రుడు, భర్తను భార్య ద్వేషించును. అందరూ పరస్త్రీసంగమాసక్తులు పరద్రవ్యాపహరకులగుదురు. మత్స్యమాంసమును అమ్ముదురు. దూడలేని గోవులకు పాలు పిండి అమ్మి బ్రతుకుదురు. ఘోరమగు కలియుగమున అందరూ పాపరతులౌదురు. అసూయపరులై సజ్జనులను పరిహసింతురు. నదీతీరములలో గడ్డపాలరలతో త్రవ్వి చెట్లను నాటెదరు. పృధివి నిస్సారమగును. బీజములు ఫలములు నశించును. స్త్రీలు వేశ్యలవలె అలంకరించుకొనుటయందాసక్తులౌదురు. బ్రాహ్మణులు ధర్మమును, స్త్రీలు భగమును అమ్ముకుందురు. మరి కొందరు ద్విజులు శూద్రాచారపరులై వేదములనమ్ముకుందురు. సాధువుల ధనమును, విధవలధనమును అపహరింతురు. ద్రవ్యముపై ఆశ కలిగి బ్రాహ్మణులు వ్రతమునాచరించరు. ధర్మాచరణమును వదిలి వృధావాదముననే ఆయాసమును పొందెదరు. ద్విజులు దంభము కొఱకు పితృశ్రాద్ధాదికము నాచరింతురు. నరాధములు అయోగ్యులకే దానములు చేతురు, పాలమీది ఆశతో ఆవులయెడ ప్రీతిని చూపెదరు. బ్రాహ్మణులు స్నానశౌచాదికములనాచరించరు. ద్విజాధములు అకాలమున కర్మల నాచరింతురు. సాధునిందాపరులు విప్రనిందాపరులుందురు. ఏ ఒక్కని మనస్సు విష్ణుభక్తి పరము కాదు. యాగము చేయు బ్రాహ్మణులనే ధనము కొఱకు రాజకింకరులు కొట్టెదరు. ఘోరమైన కలియుగమున నరులందరు దానహీనులగుదురు. ద్విజులు పతితులనుండి కూడా దానములను స్వీకరించెదరు. 28 - 50
కలేః ప్రథమపాదే೭పి వినిన్దన్తి హరిం నరాః, యుగాన్తేచ హరేర్నాను నైవ కశ్చిద్వదిష్యతి. 51
శూద్రస్త్రీసంగనిరతా విధవాసంగలోలుపాః, శూద్రాన్నభోగనిరతా భవిష్యంతి కలౌ ద్విజాః. 52
విహాయ వేదసన్మార్గం కుపథాచారసంగతాః, పాషండాశ్చ భవిష్యంతి చతురాశ్రమనిందకాః. 53
న చ ద్విజాతిశుశ్రూషాం కుర్వంతి చరణోద్ధవాః, ద్వజితాధర్మాన్గృహ్ణని పాఖండాలింగినో೭ ధమాః. 54
కాషాయపరివీతాశ్చ జటిలా భస్మధూలితాః, శుద్రా ధర్మాన్ప్రవక్షంతి కూటయుక్తిపరాయణాః. 55
ద్విజాస్స్వాచారముత్సృజ్య పరపాకాన్నభోజినః, భవిష్యంతి దురాత్మానశ్శూద్రాః ప్రవ్రజితాస్తథా. 56
ఉత్కోచజీవినస్తత్ర భవిష్యంతి కలౌ మునే, ధర్మహీనాస్తు పాషండా కాపాలా భిక్షవో೭ధమాః. 57
ధర్మవిధ్వంసశీలానాం ద్విజానాం ద్విజసత్తమ ! శూద్రా ధర్మాన్ప్రవక్ష్యంతి హ్యధిరుహ్యోత్తమాసనమ్. 58
ఏ తే చాన్యేచ బహవో నగ్నరక్తపటాదికాః, పాషండాః ప్రచరిష్యంతి ప్రాయో వేదవిదూషకాః. 59
గీతవాదిత్రకుశలాః క్షుద్రధర్మసమాశ్రయాః, భవిష్యంతి కలౌ ప్రాయో ధర్మవిధ్వంసకా నరాః. 60
అల్పద్రవ్యా వృథాలింగా వృధాహంకారదూషితాః, హర్తారః పరవిత్తానాం భవితారో నరాధమాః. 61
ప్రతిగ్రహపరా నిత్యం జగదున్మార్గశీలినః, ఆత్మస్తుతిపరాస్సర్వే పరనిందాపరాస్తదా. 62
విశ్వస్తఘాతినః క్రూరా దయాధర్మవివర్జితాః, భవిష్యంతి నరా విప్ర కలౌ చాధర్మబాంధవాః. 63
పరమాయుశ్చ భరితా తదా వర్షాణి షోడశ, ఘోరే కలియుగే విప్ర పంచవర్షా ప్రసూయతే. 64
సప్తవర్షాష్టవర్షాశ్చ యువానో೭తఃపరే జరా, స్వకర్మత్యాగినస్సర్వే కృతఘ్నాః భిన్నవృత్తయః. 65
యాచకాశ్చ ద్విజా నిత్యం భవిష్యంతి కలౌ యుగే, పరావమాననిరతాః ప్రహృష్టాః పరవేశ్మని. 66
తత్రైవ నిందానిరతా వృధా విశ్రంభిణో జనాః, నిందాం కుర్వంతి సతతం పితృమాతృసుతేషు చ. 67
వదంతి వాచా ధర్మాంశ్చ చేతసా పాపలోలుపాః, ధనవిద్యావయోమత్తాః సర్వదుఃఖపరాయణాః. 68
వ్యాధితస్కరదుర్ఖిక్షైః పీడితా అతిమాయినః, ప్రపుష్యంతి వృధైవామీ నవిచార్య చ దుష్కృతమ్. 69
ధర్మమార్గప్రణతారం తిరస్కుర్వన్తి పాపినః, ధర్మమార్గే రతం చైవ వృధా విశ్రంభిణో జనాః. 70
భవిష్యన్తి కలౌ ప్రాప్తే రాజానో వ్లుెచ్ఛజాతయః, శూద్రా భైక్ష్యరతాశ్చైవ తేషాం శుశ్రూషణ ద్విజాః. 71
న శిష్యో న గురుః కశ్చిత్ న పుత్రో న పితా తథా, న భార్యా న పతిశ్చైవ భవితారో೭త్ర సంకరే. 72
కలౌ గతే భవిష్యంతి ధనాఢ్యా అపి యాచకాః, రసవిక్రయిణశ్చాపి భవిష్యంతి ద్విజాతయః. 73
ధర్మకంచుకసంవీతా మునివేషధరా ద్విజాః, అపణ్యవిక్రయరతా అగమ్యాగామినస్తథా. 74
వేదనిందాపరాశ్చైవ ధర్మశాస్త్రవినిన్దకాః, శూద్రవృత్త్యైవ జీవంతి నరకార్హా ద్విజా మునే. 75
అనావృష్టిభయం ప్రాప్తా గగనాసక్తదృష్టయః, భవిష్యంతి కలౌ మర్త్యాస్సర్వే క్షుద్భయకాతరాః. 76
కందపర్ణఫలాహారాస్తాపసా ఇవ మానవాః, ఆత్మానం తారయిష్యంతి అనావృష్ట్యాతిదుఃఖితాః. 77
కామార్తా హ్రస్వదేహాశ్చ లుబ్ధాశ్చాధర్మతత్పరాః, కలౌ సర్వే భవిష్యంతి స్వల్పభాగ్యా బహుప్రజాః. 78
స్త్రియస్స్వపోషణపరా వేశ్యా లావణ్యశీలికాః, పతివాక్యమనాదృత్య సదా೭ న్యగృహతత్పరాః. 79
దుశ్శీలా దుష్టశీలేషు కరిష్యంతి సదా స్పృహామ్, అసద్వృత్తా భవిష్యంతి పురుషేషు కులాంగనాః. 80
చౌరాదిభయభీతాశ్చ కాష్ఠయంత్రాణి కుర్వతే, దుర్భిక్షకరపీడాభిరతీవోపద్రుతా జనాః. 81
గోధూమాన్నయావాన్నాఢ్యే దేశే యాస్యంతి దుఃఖితాః, నిధాయ హృద్యకర్మాణి ప్రేరయంతి వచశ్శుభమ్. 82
స్వకార్యసిద్ధిపర్యంతం బంధుతాం కుర్వతే జనాః, భిక్షవశ్చాపి మిత్రాదిస్నేహసంబంధయంత్రితాః. 83
అన్నోపాధినిమిత్తేన శిష్యాన్గృహ్ణంతి భిక్షవః, ఉభాభ్యామథ పాణిభ్యాం శిరః కండూయనం స్త్రియః. 84
కుర్వంత్యో గురుభర్తౄణాం ఆజ్ఞాముల్లంఘయన్తి చ, పాషండజనసంగినః. 85
యదా ద్విజా భవిష్యంతి తదా వృద్ధిం కలిర్వ్రజేత్, యదా ప్రజా న యక్ష్యంతి న హోష్యంతి ద్విజాతయః. 86
తదైవ తు కలేర్వృద్ధిరనుమేయా విచక్షణౖః, అధర్మవృద్ధిర్భవితా బాలమృత్యురపి ద్విజ ! 87
సర్వధర్మేషు నష్టేషు యాతి నిశ్శ్రీకతాం జగత్, ఏవం కలేస్స్వరూపం తే కథితం విప్రసత్తమ. 88
హరిభక్తిపరానేష న కలిర్బాధతే క్వచిత్. 89
కలి యుగమున ప్రధమ పాదమున కూడా మానవులు శ్రీహరిని నిందింతురు. కలియుగాంతమున ఒక్కడు కూడా శ్రీహరి నామమును పలుకడు. శూద్ర స్త్రీ సంగమమున విధవా సంగమమున ఆసక్తులౌదురు. శూద్రాన్నమును భుజించుటయందు ఆసక్తులౌదురు. బ్రహ్మచర్యగృహస్థాది ఆశ్రమ చతుష్టయమును నిందించుచు వేదవిహిత సన్మార్గమును వదిలి దురాచారమును దుర్మార్గమును అనుసరించుచు పాషండులగుదురు. శూద్రులు ద్విజులను సేవించరు. పాషండులు చండాలులు ద్విజధర్మములను స్వీకరించెదరు. కాషాయవస్త్రములను ధరించి జటా ధారులై భస్మమును ధరంచిన శూద్రులు ధర్మములను బోధించెదరు. కూటయక్తి పరాయణులగుదురు. ద్విజులు స్వాచారమును విడిచి పరపాకాన్నమును భుజించుచుందురు. శూద్రులు దురాత్ములై పరివ్రాజకులౌదురు. కలియుగమున లజ్జావిహీన జీవనమును గడుపుదురు. ధర్మ హీనులగు పాషండులు, కాపాలులు, అధములగు భిక్షువులు కలియుగమున ఉత్కోచ జీవులగుదురు. ఓ బ్రాహ్మణోత్తమా ! ధర్మమును నశింపచేయు స్వభావము గల ద్విజులకు శూద్రులు ఉత్తమాసనమునధిరోహించి ధర్మ ప్రవచనమును చేతురు. వీరు ఇతరులు నగ్నముగా రక్తవస్త్రులుగా పాషండులు వేద దూషకులుగా తిరుగచుందురు. మానవులు గీత వాద్యములలో కుశలులై క్షుద్రధర్మములనాశ్రయించుచు ధర్మవిధ్వంసకులగుదురు. అస్వధనులు వ్యర్థలింగులు వ్యర్థాహంకారదూషితులు పరద్రవ్యాపహారకులగుదురు. నిత్యము ప్రతిగ్రహశీలురు జగత్తును చెడుదారిలో పయనింప చేయువారుగా ఆత్మస్తుతిపరులు పరనిందాపరులుగా అందరూ ఉందురు. నమ్మినవారిని చంపువారు ధయాధర్మవిహీనులు క్రూరులగుదురు. కలియుగమున మానవులు అధర్మ బంధువులగుదురు. కలియుగాంతమున మానవులకు పరమాయువు పదునారుసంవత్సరములుండును. స్త్రీలు అయిదు సంవత్సరముల వయసులో ప్రసవింతురు. ఏడెనిమిది సంవత్సరముల వయసు వరకే యువకులుగా ఉందురు. ఆ తరువాత వృద్ధులగుదురు. అందరూ స్వకర్మను త్యాగము చేయుదురు. కృతఘ్నులు ఇతరవృత్తుల నాశ్రయించువారగుదురు. కలియుగమున ద్విజులు నిత్యము యాచకులగుదురు. ఇతరులనవమానించుటలో ఆసక్తి కలవారు, పరావమానముతో ఆనందించువారు, ఇతరుల గృహనివాసులు వారు, అచటి వారిని నిందించువారు, వ్యర్థముగా గర్వించువారు నిత్యము మాతా పితరులను గురువులను నిందించువారు అయి ఉందురు. నోటితో ధర్మమునుచెప్పుచు మనసులో పాపములనాలోచింతురు. దనవిద్యా¸°వనాదులచే మత్తులై అన్నిదుఃఖములచే వ్యాకులులౌదురు. వ్యాధి తస్కర దుర్భిక్షములచే పీడించబడుదురు. అతివంచకులౌదురు. తాము చేయుచున్న పాపములనాలోచించకనే వ్యర్థముగా తమను తాము పోషించుకొనుచుందురు. పాపాత్ములు ధర్మమార్గప్రవర్తకులను దూషింతురు. ధర్మకార్యరతులను పరిహసింతురు. కలియుగమున వ్లుెచ్ఛజాతులవారు ప్రభువులౌదురు. శూద్రులు భిక్షాటనమును చేతురు. ద్విజులు శూద్రులను సేవింతురు. కలియుగమున వర్ణసంకర మేర్పడి శిష్యుడు గురువు, తండ్రి, కొడుకు, భార్య, భర్త ఎవ్వరూ ఉండరు. కలియుగమున ధనవంతులు కూడా యాచకులగుదురు. ద్విజులు రసవిక్రయిలౌదురు. ద్విజులు ధర్మమను కవచమును కప్పుకొని, మునివేషమును ధరించి అమ్మరాని వాటిని అమ్ముచు సంగమించరాని స్త్రీలను సంగమించుచు, వేదములను ధర్మశాస్త్రములను నిందించుచు శూద్రవృత్తిచే జీవించుచు అనరకార్హులగుదురు. అనావృష్టి ఏర్పడగా ఆకాశమువైపు చూపులను నిలుపుచు కలియుగమున మానవులందరూ ఆకల భయముచే దీనులౌదురు. కరువుచే మిక్కిలి పీడించబడుచు కందమూల ఫలహారములతో తమను తాము పోషించుకొందురు. కామార్తులు, హ్రస్వదేహులు, లోభులు, అధర్మతత్పరులుగా నుందురు. కలియుగమున ఇంచుమించు అందరు అల్పభాగ్యులు బహుసంతానవంతులౌదురు. స్త్రీలు తమను తాము పోషించుకొందురు. వేశ్యలు సౌందర్యమును పెంచుకొనుటకు ప్రయత్నింతురు. స్త్రీలు భర్తమాటను లెక్కించక ఎప్పుడూ ఇతరుల ఇండ్లలో నుండుటలో ఆసక్తిని చూపుదురు. దుశ్శీలురై దుశ్శీలురతో స్నేహమును చేతురు. పురుషుల విషయమున కులస్త్రీలు అసద్వ్యవహారమునాచరింతురు. చోరుల భయముచే కట్టెలతో తులుపులు యంత్రములను సిద్ధము చేసుకుందురు. కరువుచే పన్నుల బాధలచే మిక్కిలి పీడితులై గోధుమలు యవలు పుష్కలముగా పండు ప్రదేశములకు వలస వెళ్ళెదరు. మనసులో అకార్యములను ఆలోచిస్తూ శుభకార్యములను పలుకుచుందురు. కలియుగమున మానవులు తమకార్యము సిద్ధించువరకు బంధుత్వమును కలుపుకొందురు. భిక్షువులు కూడా మిత్రాదిస్నేహబంధముచే బంధితులగుదురు. సన్యాసులు అన్నోపాధినిమిత్తమున శిష్యులను కూర్చుకొందురు. స్త్రీలు రెండుచేతులతో తలను గోకుచుందురు. పెద్దల ఆజ్ఞను భర్త ఆజ్ఞను ఉల్లంఘింతురు. బ్రాహ్మణులు పాషండుల మాటలను పలుకుచు, పాషండులతో స్నేహమును గరపునపుడు కలివృద్ధిచెందును. ప్రజలు యజ్ఞములను ఆచరించనపుడు, బ్రాహ్మణులు హోమమును చేయనపుడు కలివృద్ధి చెందినదని వివేకులు ఊహించవలయును. అధర్మము వృద్ధిచెందును. బాలురు కూడా మృతి చెందుదురు. అన్నిధర్మములు నశించగా జగత్తు సంప్రదహితమగును. ఓ బ్రాహ్మణోత్తమా ఇట్లు కలి స్వరూపమును నీకు వివరించితిని. హరిభక్తిపరులను మాత్రము కలి బాదించజాలదు. 51 - 89
తతః పరం కృతయుగే త్రేతాయాం ధ్యానమేవ చ, ద్వాపరే యజ్ఞమేవాహుర్దానమేకం కలౌ యుగే. 90
యత్కృతే దశభిర్వర్షై స్త్రేతాయాం శరదా చ యత్, ద్వాపరే యచ్చ మాసేన అహ్యహోరాత్రేణ తత్కలౌ. 91
ధ్యాయన్కృతే యజన్యజ్ఞై స్త్రేతాయాం ద్వాపరే೭ర్చయన్, యదాప్నోతి తదాపోతికలౌ సంకీర్త్య కేశవమ్. 92
అహోరాత్రం హరేర్నామ కీర్తయంతి చ యే నరాః, కుర్వంతి హరిపూజాం వా న కలిర్బాధతే చ తాన్. 93
నమో నారాయణాయేతి కీర్తయంతి చ యే నరాః, నిష్కామా వా స కామా వా న కలిర్బాధతే చ తాన్. 94
హరినామపరా యే తు ఘోరే కలియుగే ద్విజ, త ఏవ కృతకృత్యాశ్చ న కలిర్బాధతే హి తాన్. 95
హరిపూజాపరా యే చ హరినామపరాయణాః, త ఏవ శివతుల్యాశ్చ నాత్ర కార్యా విచారణా. 96
సమస్తజగదాధారం పరమార్థస్వరూపిణమ్, ఘోరే కలియుగే ప్రాప్తే విష్ణుం ధ్యాయన్న సీదతి. 97
అహో అతిసుభాగ్యాస్తే సకృద్వై కేశవార్యకాః, ఘోరే కలియుగే ప్రాప్తే
సర్వధర్మవివర్జతే. 98
న్యూనాతిరిక్తదోషాణాం కలౌ వేదోక్తకర్మణామ్, హరిస్మరణమేవాత్ర సంపూర్ణత్వవిధాయకమ్. 99
హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ, ఇతీరయంతి యే నిత్యం న హితాన్భాధతే కలిః. 100
శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన, ఇతి జల్పంతి యే వాపి కలిస్తాన్నాపి బాధతే. 101
మహాదేవ విరూపాక్ష గంగాధర మృడావ్యయ, ఇత్థం వదంతి యే విప్రాః తే కృతార్థా న సంశయః. 102
జనార్దన జగన్నాథ పీతాంబరధరాచ్యుత, ఇతి వాప్యుచ్చరన్తీహ న చ తేషాం కలేర్భయమ్. 103
సంసారే సులభాః పుంసాం పుత్రదారధనాదయః, ఘోరే కలియుగే విప్ర హరిభక్తిస్తు దుర్లభా. 104
కర్మశ్రద్ధావిహీనా యే పాషండా వేదనిందకాః, అధర్మనిరతా నైవ నరకార్హా హరిస్మృతేః. 105
వేదమార్గబహిష్ఠానాం జనానాం పాపకర్మణామ్, మనశ్శుద్ధివిహీనానాం హరినామ్నైన నిష్కృతిః. 106
దైవాధీనం జగత్సర్వమిదం స్థావరజంగమమ్, యథా ప్రేరితమేతేన తథైవ కురుతే ద్విజ. 107
శక్తితస్సర్వకర్మాణి వేదోక్తాని విధాయ చ, సమర్పయేన్మహావిష్ణౌ
నారాయణపరాయణః. 108
సమర్పితాని కర్మాణి మహావిష్ణౌ పరాత్మని, సంపూర్ణతాప్రయాంత్యేవ హరిస్మరణమాత్రతః. 109
హరిభక్తిరతానాం చ పాపబంధో న జాయతే, అతో೭తిదుర్లభా లోకే హరిభక్తిర్దురాత్మనామ్. 110
అహో హరిపరా యే తు కలౌ ఘోరే భయంకరే, తే సుభాగ్యా మహాత్మానస్సత్సంగరహితా అపి. 111
హరిస్మరణనిష్ఠానాం శివనామరతాత్మనామ్, సత్యం సమస్తకర్మాణి యాంతి సంపూర్ణతాం ద్విజ. 112
అహో భాగ్యమహోభాగ్యం హరినామరతాత్మనామ్, త్రిదశైరపి తే పూజ్యాః కిమన్యైర్భహుభాషితైః. 113
తస్మాత్సమస్తలోకానాం హితమేవ మయోచ్యతే, హరినామపరాన్మర్త్యాన్ న కలిర్బాధతే క్వచిత్. 114
హరేర్నామైవ నామైవ నామైవ మమ జీవనమ్, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా. 115
కృతయుగములో తపము, త్రేతాయుగములో ధ్యానము, ద్వాపరయుగములో యజ్ఞము కలియుగములో దానము ఉత్తమములు. కృతయుగములో పది సంవత్సరములలో త్రేతాయుగములో ఒకసంవత్సరములో, ద్వాపరయుగములో ఒక మాసములో చేయుదానిని కలియుగములో ఒకదినములో చేయవచ్చును. కృతయుగములో ధ్యానముచేయుచు, త్రేతాయుగములో యజ్ఞముల చేయుచు, ద్వాపరయుగములో అర్చించుచు పొందు దానిని కలియుగమున శ్రీహరి నామసంకీర్తనచే పొందవచ్చును. రాత్రింబవళ్ళు హరినామమున కీర్తించు మానవులు హరిని పూజించు మానవులు కలిబాధలకు దూరముగా నుందురు. నిష్కాములు కాని సకాములు కాని నమో నారాయణాయ అని కీర్తించినచో వారిని కలి బాధించదు. ఘోరమగు లియుగమున హరినామపరులు మాత్రమే కృతకృత్యులు. వారిని కలి బాధించజాలదు. హరి పూజాపరులు హరినామపరాయణులు శివతుల్యులే. ఈ విషయమున ఆలోచించవలసిన పనిలేదు. ఘోరమైన కలియుగమున సమస్త జగదాధారుడు పరమార్థ స్వరూపుడు అగు విష్ణువును ధ్యానించినచో బాధలపాలు కారు. సర్వధర్మ వర్జితమగు కలియుగమున ఒకమారు కేశవుఔహనర్చించువారు భాగ్యవంతులు. కలియుగమున వేదోక్తకర్మలు న్యూనాతిరిక్తములైనచో శ్రీహరిస్మరణము మాత్రమే పరిపూర్ణత్వమును లభిపంచేయును. హరే, కేశవ! గోవిన్ద! వాసుదేవ! జగన్మయ ! అని నిత్యము స్మరించువారిని కలి బాధించదు. శివశంకర ! రుద్ర ! ఈశ ! నీలకంఠ! త్రిలోచన ! అని కీర్తించువారిని కూడా కలి బాధించ జాలదు. మహాదేవ ! విరూపాక్ష! గంగాధర ! మృడవ్యయ అని స్మరించు వారు కలియుగమున కృతార్థులు. జనార్దన ! జగన్నాథ ! పీతాంబరధర! అచ్యుత ! అని స్మరించువారిని కలిభయము కలుగదు. ఘోరమైన కలి యుగమున సంసారమున పుత్రధార ధనాదులు సులభములు. కాని హరిభక్తి మాత్రము దుర్లభము. కర్మ శ్రద్ధా
విహీనులు, పాఖండులు, వేదనిందకులు, అధర్మనిరతులైనను హరిస్మరణము చేసినచో నరకార్హులు కారు. వేద మార్గ బాహ్యులు పాప కర్ములు, మనశ్శుద్ధిహీనులు అయిన జనులకు హరినామమొక్కటే నిష్కృతి. స్థావర జంగమాత్మకమగు ఈ ప్రపంచమంతయు దైవాధీనము. కావున దైవప్రేరణ ఎట్లున్నచో అట్లే చేయును. కలియుగమున వేద విహితములైన కర్మలను శక్తిమేరకు ఆచరించి నరాయణపరాయణుడై శ్రీమహావిష్ణువునకు అర్పించవలయును. పరమాత్మయగు శ్రీమహావిష్ణువునకు అర్పించబడిన కర్మలు హరిస్మరణ మాత్రమున పరిపూర్ణములగును. హరిభక్తిరతులకు పాపబంధము సంభవించదు. కావుననే దుర్జనులకు హరిభక్తిరతులకు పాపబంధము సంభవించదు. కావుననే దుర్జనులకు హరి భక్తి దుర్లభము. ఘోరము భయంకరమగు కలియుగమున శ్రీహరి భక్తిపరులు సత్సంగరహితులైననూ భాగ్యవంతులే. హరిస్మరణనిష్ఠులకు శివనామరతాత్ములకు సమస్త కార్యములు పరిపూర్ణత్వమును పొందును. హరిభక్తిపరుల భాగ్యమే భాగ్యము. వారు దేవతల పూజలను కూడా అందుకొందురు. ఇంక ఇతరమునేల చెప్పవలయును. కావున సమస్త లోకవాసులకు హితమును చెప్పుచున్నాను. హరినామస్మరణమును చేయువారిని కలి బాధించదు. శ్రీహరి నామము మాత్రమే నాకు జీవనము. కలియుగమున హరినామము తప్ప మరియొక గతి లేనేలేదు. 90 - 115
సూత ఉవాచ :-
ఏవం స నారదో విప్రాస్సనకేన ప్రబోధితః, పరాం నిర్వృతిమాపన్నః పునరేతదువాచ హ. 116
సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా ! ఇట్లు సనకమహర్షిచే ప్రబోధితుడగు నారద మహర్షి పరమానందమును పొంది మళ్ళీ ఇట్లు పలికెను.
నారద ఉవాచ :-
భగవన్సర్వశాస్త్రజ్ఞ ! త్వయాతికరుణాత్మనా, ప్రకాశితం జగజ్జ్యోతిః పరంబ్రహ్మ సనాతనమ్. 117
ఏతదేవ పరం పుణ్యమేతదేవ పరం తపః, యస్స్మరేత్పుండరీకాక్షం సర్వపాపవినాశనమ్. 118
బ్రహ్మన్నానా జగచ్చైతత్ ఏకచిత్సంప్రకాశితమ్, త్వయోక్తం తత్ప్రతీయే೭హం కథం దృష్టాంతమంతరా. 119
తస్మాద్యేన యథా బ్రహ్మ ప్రతీతం బోధితేన తు, తదాఖ్యాహి యథా చిత్తం సేదత్థ్సితిమవాప్నుయాత్. 120
ఏతచ్ఛ్రుత్వా వచో విప్రా నారదస్య మహాత్మనః, సనకః ప్రత్యువాచేదం స్మరన్నారాయణం పరమ్. 121
నారద మహర్షి పలికెను :- పూజ్యుడా! సర్వశాస్త్రజ్ఞుడా! దయానిధివైన నీవు సనాతనము జగజ్జ్యోతి యగు పరబ్రహ్మస్వరూపమును తెలియజేసితివి. ఇదియే ఉత్తమ పుణ్యము. ఇదియే ఉత్తమ తపము. సర్వపాప వినాశకుడగు పుండరీకాక్షుని స్మరించుటయే ఉత్తమయజ్ఞము. ఓ మహర్షీ! బహువిధమగు ఈ జగత్తంతయూ ఒకె చిత్తుచే ప్రకాశితమని దృష్టాంతము లేకనే ఎట్లు విశ్వసించవలయును ? కావున దేనిచే ఎట్లు ఏ బోధచే తెలియునో చింతించు చిత్తము స్థైర్యము నెట్లు పొందునో ఆ విధమును కూడా తెలియజేయుము. ఇట్లు మహానుభావుడైన నారదుడు పలికిన మాటలను వినిన సనక మహర్షి పరమాత్మయగు నారాయణుని స్మరించుచు ఇట్లు బదులు పలికెను. 117 - 121
సనక ఉవాచ :-
బ్రహ్మన్నహం ధ్యానపరో భ##వేయం సనందనం పృచ్ఛ యథాభిలాషమ్,
వేదాంతశాస్త్రే కుశలస్తవాయం నివర్తయేద్వా పరమార్యవంద్యః. 122
ఇతీరితం సమాకర్ణ్య సనవస్య స నారదః, సనందనం మోక్షధర్మాన్ప్రష్టుం సముపచక్రమే. 123
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ
పూర్వభాగే ప్రథమపాదే
నామమాహాత్య్మం నామ
ఏకచత్వారింశో ೭ ధ్యాయః
ప్రథమపాదస్సమాప్తః
సనక మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! నేను ధ్యానములో నిమగ్నుడనగుచున్నాను. నీవు కోరిన విషయములను సనందనమహర్షిని ప్రశ్నించుము. ఆర్యవంద్యుడగు సనందన మహర్షి వేదాంతశాస్త్రమున కుశలుడు నీ సందేహమును తీర్చగలడు. ఇట్లు సనకమహర్షి పలికిన మాటలను వినిన నారదమహర్షి సనందమహర్షిని మోక్షధర్మములను అడుగ సంకల్పించెను.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున
పూర్వభాగమున ప్రథమపాదమున
నామమాహాత్మ్యమను
నలుబది యొకటవ అధ్యాయము సమాప్తము
మొదటిపాదము ముగిసినది.