Sri Naradapuranam-I
Chapters
Last Page
పూర్వభాగే ద్వితీయపాదః ద్విచత్వారింశో ೭ ధ్యాయః = నలుబది రెండవఅధ్యాయము జగదుత్పత్తివర్ణనమ్ శ్రీ నారద ఉవాచ : - కుతస్సృష్టమిదం బ్రహ్మఞ్జగత్థ్సావరజంగమమ్, ప్రలయే చ కమభ్యేతి తన్మే బ్రూహి సనన్దన !
1 ససాగరస్సగగనస్సశైలః సబలాహకః, సభూమిస్సాగ్ని పవనో లోకోయం కేన నిర్మితః.
2 కథం సృష్టాని భూతాని కథం వర్ణవిభక్తయః, శైచా೭శౌచం కథం తేషాం ధర్మాధర్మవిధిః కథమ్. 3 కీదృశో జీవతాం జీవః క్వ వా గచ్ఛంతి యే మృతాః, అస్మాల్లోకాదముం లోకం సర్వం శంసతు మే భవాన్. 4 శ్రీ నారదమహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు ఎవరి వలన సృష్టించబడినది. ప్రలయకాలయమున ఎవరిలో లీనమగును. దానినంతటిని నాకు తెలుపుము. సాగరాకాశ##శైలమేఘ భూమ్యగ్ని వాయువులతో కూడిన ఈ లోకమును ఎవరు నిర్మించిరి. భూతములను వర్ణ విభాగమును ఆచార అనాచారములను ధర్మాధర్మవిధానములను ఎట్లు సృజించిరి. జీవించు వారిలో జీవుడు ఎట్టివాడు? మరణించినవారు ఎచటికి వెళ్ళెదరు? ఇహ లోకము నుండి పర లోకము వరకు అంతటిని నాకు చెప్పుము. సనందన ఉవాచ :- శృణు నారద వక్ష్యామి చేతిహాసం పురాతనమ్, భృగుణాభిహితం శాస్త్రం భరద్వాజాయ పృచ్చతే. 5 కైలాసశిఖరే దృష్ట్వా దీప్యమానం మహౌజపమ్, భృగుమహర్షిమాసీనం భరద్వాజో 7న్వపృచ్ఛత. 6 సనందన మహర్షి పలికెను :- ఓ నారద మహర్షి ! పూర్వము ప్రశ్నించిన భరద్వాజమహర్షికి భృగుమహర్షి చెప్పిన పురాతనశాస్త్రమును ఇతిహాసమును చెప్పెదను. వినుము, కైలాసశిఖరమున గొప్ప తేజస్సుచే ప్రకాశించుచు కూర్చొనియున్న భృగు మహర్షి సమీపించి భరద్వాజమహర్షి ఇట్లు ప్రశ్నించెను.
భరద్వాజ ఉవాచ : -
కథం జీవో విచరతి నానాయోనిషు సంతతమ్, కథం ముక్తిశ్చ సంసారాత్ జాయతే తస్య మానద! 7
యశ్చ నారాయణస్సృష్టా స్వయం భూర్భగవాన్స్వయమ్, సేవ్య సేవకభావేన వర్తేతే ఇతి తౌ సదా. 8
ప్రవిశంతి లయే సర్వే యమీశం సచరాచరాః, లోకానాం రమణస్సోయం నిర్గుణశ్చ నిరంజనః. 9
అనిర్దేశో7 ప్రతర్క్యశ్చ కథం జ్ఞాయేత కైర్మునే, కథమేనం పరాత్మానం కాలశక్తిదురన్వయమ్. 10
అతర్క్యచరితం వేదాస్త్సువన్తి కథమాదరాత్, జీవో జీవత్వముల్లంఘ్య కథం బ్రహ్మా సమన్వయాత్. 11
ఏతదిచ్ఛిమ్యహం శ్రోతుం తన్మే బ్రూహి కృపానిధే, ఏవం స భగవానృష్టో భరద్వాజేనా సంశయమ్. 12
మహర్షిర్బృహ్మసంకాశస్సర్వం తసై#్మ తతో7బ్రవీత్. 13
భరద్వాజ మహర్షి పలికెను :- ఓ మహర్షీ! జీవుడెప్పుడూ నానాయోనులందు ఎట్లు తిరుగుచుండును? జీవునికి సంసారము నుండి ఎట్లు ముక్తి లభించును? శ్రీమన్నారాయణుడే బ్రహ్మరూపముచే సృష్టించును. ఆ బ్రహ్మ, నారాయణుడు సేవకసేవ్య రూపముతో ఏల యుందురు? ప్రలయ కాలమున చరాచరములన్నియు ఎవనిలో లీనమగును? లోకనాధుడగు ఆ ప్రభువు నిర్గుణుడు నిరంజనుడు అనిర్దేశ్యుడు అప్రతర్కుడు అని ఎట్లు ఎవరిచే తెలియబడును? పరమాత్మ కాలశక్తి, దురన్వయుడు అతర్క్యచరితుడుగు పరబ్రహ్మను వేదములెట్లు ఆదరముతో స్తుతించును? జీవుడు జీవత్వమును లంఘించి ఎట్లు బ్రహ్మత్వామును పొందును? ఈ విషయమును తెలియగోరుచున్నాను. ఓ కృపానిధీ నాకు తోలుపుము. ఇట్లు భరద్వాజ మహర్షి అడుగగా బ్రహ్మసంకాశుడగు భృగు మహర్షి దానినంతటిని చెప్పెను. 7-13
భృగురువాచ :-
మానసో నామ యః పూర్వో విశ్రుతో వై మహర్షిభిః, అనాదినిధనో దేవస్తథా తేభ్యో7 జరామరః. 14
అవ్యక్త ఇతి విఖ్యాతశ్సాశ్వతో7 ధాక్షయో వ్యయః, యతస్సృష్టాని భూతాని జాయన్తే చ మ్రియంతి చ. 15
సో7సృజత్ప్రథమం దేవో మహాంతం నామ నామతః, ఆకాశమితి విఖ్యాతం సర్వభూతధరః ప్రభుః. 16
ఆకాశాదభవద్వారి సలిలాదగ్నిమారుతౌ. 17
అగ్నిమారుతసంయోగాత్తతస్సమభవన్మహీ, తతస్తేజోమయం దివ్యం పద్మం సృష్టం స్వయంభువా. 18
తస్మాత్పద్మాత్సమభవద్బ్రహ్మా వేదమయో విధిః, అహంకార ఇతి ఖ్యాతస్సర్వభూతాత్మభూతకృత్. 19
బ్రహ్మ వై స మహాతేజా య ఏతే పంచధాతవః, శైలాస్తస్యాస్థిసంఘాస్తు మేదోమాంసం చ మేదినీ. 20
సముద్రాస్తస్య రుధిరమాకాశముదరం తథా, సవపశ్చైవ విశ్వాసస్తేజో7 గ్నిర్నిమ్నగాశ్శిరాః. 21
అగ్నీషోమౌ చ చంద్రర్కౌ నయనే తస్య విశ్రుతే, నభశ్చోర్థ్వశిరస్తస్య క్షితిః పాదౌ భుజౌ దిశః. 22
దుర్విజ్ఞేయో హ్యచిన్త్యాత్మా సిద్ధైరపి న సంశయః, స ఏష భగవాన్విష్ణురనన్త ఇతి విశ్రుతః. 23
సర్వభూతాత్మభూతస్థో దుర్విజ్ఞేయో7కృతాత్మభిః, అహంకారస్య యస్సృష్టా సర్వభూతభవాయ వై. 24
తతస్సమభవద్విశ్వం పృష్టో7హం యదిహ త్వయా. 25
భృగుమహర్షి పలికెను :- పూర్వము మహర్షులచే మానసుడని చెప్పబడిన వాడు ఆద్వన్తములు లేనివాడు. అతని నుండి అజరామరము, శాశ్వతము అక్షయము అవ్యయము అగు అవ్యక్తము ప్రభవించెను. అవ్యక్తము నుండియే సర్వ భూతములు పుట్టుచున్నవి, మరణించుచున్నవి. ఆ అవ్యక్తము మొదట మహత్తత్వమును సృజించెను. ఈ మహత్తత్త్వమునకే సర్వభూతధరుడు ప్రభునగు ఆకాశమను పేరు. ఆకాశము నుండి జలము, జలము నుండి అగ్ని వాయువులు పుట్టెను. అగ్ని వాయువుల సంయోగమువలన భూమి పుట్టెను. అంతట పరబ్రహ్మ తేజోమయమగు పద్ముమును సృష్టించెను. ఆ పద్మమునుండి వేదస్వరూపుడు విధియను బ్రహ్మ పుట్టెను. అతనికే సర్వభూతాత్మ భూతములను చేయు అహంకారమని ప్రసిద్ధి. ఆ మహాతేజస్కునకే బ్రహ్మయని పేరు. పంచభూతములు పంచధాతువులు, పర్వతములు అస్థి సంఘములు, భూమిమేదో మాంసములు, సముద్రములు రుధిరము. ఆకాశము ఉదరము, వాయువు నిశ్శ్వాసము. తేజోమయమగు అగ్ని క్రింది శిరస్సు, అగ్నీషోములు చంద్రసూర్యులు బ్రహ్మకు నేత్రములు. ఆకాశము ఊర్ధ్వశిరము, క్షతిపాదములు, దిక్కులు భూజములు. ఆ బ్రహ్మ సిద్దులచే తెలియ శక్యము కానివాడు చింతించశక్యమైనవాడుకాడు. ఆ బ్రహ్మయే భగవంతుడగు విష్ణువు అనంతుడని ప్రసిద్ధుడు. సర్వభూతాంతర్యామి అజ్ఞానులకు తెలియరానివాడు అహంకారమును సృజించిన వాడే సర్వప్రాణులను సృజించెను. ఆ విష్ణువు నుండే ఈ విశ్వమంతయు పుట్టినది. ఇట్లు నీవడిగిన దానిని చెప్పితిని. 14 -25
భరద్వాజ ఉవాచ :-
గగనస్య దిశాం చైవ భూతలస్యానిలస్య చ, కాన్యత్ర పరిణామాని సంశయం ఛిన్థి తత్త్వతః. 26
భరద్వాజ మహర్షి పలికెను :- ఆకాశమునకు, దిక్కులకు, భూమికి, వాయువునకు ఏయే పరిణామము లేర్పడినవో నాకు తెలుపుము.
భృగురువాచ :-
అనన్తమేతదాకాశం సిద్ధదైవతసేవితమ్, రమ్యం నానాశ్రయాకీర్ణం యస్యాంతో నాధిగమ్యతే. 27
ఊర్థ్వం గతేరధస్తాత్తు చంద్రాదిత్యానపశ్యతః, తత్ర దేవాస్స్వయం దీప్తా భాస్కరాభాగ్నివర్చసః. 28
తే చాప్యంతం న పశ్యన్తి నభసః ప్రథితౌజసః, దుర్గమత్వాదనంతత్వాదితి మే వద మానద. 29
ఉపరిష్టోపరిష్టాత్తు ప్రజ్వలద్భిస్స్వయంప్రభైః, నిరుద్ధమేతదాకాశం హ్యప్రమేయం సురైరపి. 30
పృథివ్యంతే సముద్రస్తు సముద్రంతే తమస్స్మృతమ్, తమసోంతే జలం ప్రహుర్జలస్యాం తే 7గ్నిరేవ చ. 31
రసాతలాంతే సలిలం జలాంతే పన్నగాధిపాః, తదంతే పునరాకాశమాకాశాంతే పునర్జలమ్. 32
ఏవమంతం భగవతః ప్రమాణం సలిలస్య చ, అగ్నిమారుతతోయేభ్యో దర్జేయం దైవతైరపి. 33
అగ్నిమారుతతోయానాం వర్ణాః క్షితితలస్య చ, ఆకాశసదృశా హ్యేతే భిద్యంతే తత్త్వదర్శనాత్. 34
పఠితం చైవ మునయః శాస్త్రేషు వివిధేషు చ, త్రైలోక్యే సాగరే చైవ ప్రమాణం వివాతం యథా. 35
అదృశ్యో యస్త్వగమ్యో యః కః ప్రమాఱముదీరయేత్, సిద్ధానాం దేవతానాం చ పరిమీతా యదా గతిః. 26
తదాగణ్యమనన్తస్య నామానంతేతి విశ్రుతమ్, నామధేయానురూపస్య మానసస్య మహాత్మనః. 37
యదా తు దివ్యం యద్రూపం హ్రసతే వర్థతే పునః, కో7న్యస్తద్వేదితుం శక్తో యో7పి స్యాత్తద్విధో7పరః. 38
తతః పుష్కరతః సృష్టః సర్వజ్ఞో మూర్తిమాన్ప్రభుః, బ్రహ్మధర్మమయః పూర్వ ప్రజాపతిరనుత్తమః. 39
భృగుమహర్షి పలికెను :- సిద్ధదైవతములచే సేవించబడు ఈ ఆకాశము అనంతము, సుందరము, నానాశ్రయము. దీని అంతము తెలియ శక్యము కానిది. ఆకాశము యొక్క ఊర్థ్వ పరిమాణమును క్రిందుగా నున్న సూర్యచంద్రులు చూడజాలరు. సూర్యాగ్ని సమతేజస్కులు స్వయంప్రకాశులగు దేవతలు కూడా ప్రసిద్ధమైన కాంతి గల ఆకాశాంతమును చూడజాలరు. ఆకాశము దుర్గమము అనంతమగుటయే దీనికికారణము. పైపై భాగములు కూడ స్వయంప్రకాశకములగు తేజో రాశులచే ఈ ఆకాశము నిరుద్ధమైయున్నది. కావుననే దేవతలు కూడా దీనిని కొలువజాలరు. పృథివి చివర సముద్రము, సముద్రముల చివర తమస్సు, తమస్సు చివర జలము, జలము చివర అగ్ని యుండును. రసాతలము చివర జలము, జలము చివర పన్నగాధిపులు, వారి తరువాత మరల నాకాశము, ఆకాశము చివర మరల జలము. ఇట్లు భగవంతునకి జలమునకు అగ్నిమారుతములకు అంతమును దేవతలు కూడా తెలియజాలరు. అగ్నిమారుత జలముల భూమి యొక్క వర్ణములు ఆకాశ సదృశములుగా కనపడును. కాని తత్త్వరదర్శనము వలన భేదము కనపడును. వివిధ శాస్త్రములలో మునులు దర్శించిన విధముగా త్రైలోక్యములలో సాగరమునందు విధించబడిన ప్రమాణము అదృశ్యము అగమ్యము. కావున ఆ ప్రమాణము నెవ్వరు చెప్పగలరు? సిద్ధుల దేవతల పరిమాణమును నిర్ణయించు ఆకాశము అగణ్యము అంతము లేనిది కావున అనంతమని ప్రసిద్ధిచెందినది. ఈ నామధేయము మానసుని స్వరూపమునకు అనురూపము. అనంతము యొక్క దివ్యరూపము పెరుగుచుండును, తరుగుచుండును. అనంతుని వంటి వాడు మరొకడున్నపుడు మాత్రమే అనంత స్వరూపము తెలియనగును. అంతట పద్మము నుండి సర్వజ్ఞుడు మూర్తిమంతుడగు ప్రభువు సృజించబడెను. ఇతడే ధర్మ స్వరూపుడగు మొదటి ప్రజాపతియగు బ్రహ్మ. ఇతనికి సాటి మరియొకడు లేడు. 27 -39
భరద్వాజ ఉవాచ : -
పుష్కరో యది సంభూతో జ్యేష్టం భవతి పుష్కరమ్, బ్రహ్మణం పూర్వజం చాహ భవాన్సందేహ ఏవ మే. 40
భరద్వాజ మహర్షి పలికెను :- మొదట పుష్కరము పుట్టినది కావున పుష్కరమే జేష్టము కావలయును. కాని తాము బ్రహ్మ పూర్వజుడని చెప్పితిరి. కావున నాకు మరల సందేహమే కలుగుచున్నది. 40
భృగురువాచ :-
మానసస్యేహ యా మూర్తిః బ్రహ్మత్వం సముపాగతా, తస్యాసనవిధానార్ధం పృథివీ పద్మముచ్యతే. 41
కర్ణికా తస్య పద్మస్య మేరుర్గగనముచ్ఛ్రితః, తస్య మధ్యే స్థితో లోకాన్సృజత్యేష జగద్విధిః. 42
భృగుమహర్షి పలికెను :- మానసుని స్వరూపమే బ్రహ్మత్వమును పొందినది. ఆ బ్రహ్మకు ఆసనము కొఱకు ఏర్పరిచిన పృథివియే పద్మమనబడుచున్నది. పద్మము మధ్యనున్న నాళ##మే ఆకాశము వైపు పెరిగిన మేరుపర్వతము. ఆమేరు మధ్యనుండి ఈ బ్రహ్మ జగత్తును సృష్టించును. 41 -42
భరద్వాజ ఉవాచ :-
ప్రజావిసర్గం వివిధం కథం స సృజతి ప్రభుః, మేరుమధ్యే స్థితో బ్రహ్మా తద్బహిర్ద్విజసత్తమ. 43
భరద్వాజ మహర్షి పలికెను :- మేరు మధ్యన ఉన్న బ్రహ్మ మేరువునకు వెలుపల పలువిధములగు ప్రజాసృష్టినెట్లు చేసెను? 43
భృగురువాచ :-
ప్రజావిసర్గం వివిధం మనసో మనసా7సృజత్, సంరక్షణార్థం భూతానాం సృష్టం ప్రథమతో జలమ్. 44
యత్ప్రాణాస్సర్వభూతానాం సృష్టం ప్రథమతో జలమ్, యత్ప్రణాస్సర్వభూతానాం వర్థతే యేన చ ప్రజాః. 45
పరిత్యక్తాశ్చ నశ్చంతి తేనేదం సర్వమావృతమ్, పృథివీ పర్వతా మేఘా మూర్తిమంతశ్చ యే పరే. 46
పర్వం తద్వారుణం జ్ఞేయం ఆపస్తప్తంభిరే పునః. 47
భృగుమహర్షి పలికెను :- మానసబ్రహ్మ మనసుచే ప్రజాసర్గమును చేసెను. ప్రణుల రక్షణ కొఱకు మొదట జలమును సృజించెను. అన్ని ప్రాణులకు ప్రాణ భూతములు, ప్రాణులను పెంచునది, జలమే. జలము లేనిచో ప్రాణులన్నియూ నశించును. ఈ ప్రపంచమంతయూ జలముచే ఆవరించబడియున్నది. పృథివి, పర్వతములు, మేఘములు, మూర్తిమంతములగు పదార్థములన్నియూ వారుణములే, జలస్తంభనచే ఏర్పడినవి. 44 -47
భరద్వాజ ఉవాచ :-
కథం సలిలముత్పన్నం కథం చైవాగ్నిమారుతౌ, కథం వా మేదినీ సృష్టేత్యత్ర మే సంశయో మహాన్. 48
భరద్వాజ మహర్షి పలికెను :- జలము అగ్ని మారుతములు పృథివి ఎట్లు సృష్టించబడినవి? 48
భృగురువాచ :-
బ్రహ్మకల్పే పురా బ్రహ్మన్ బ్రహ్మర్షీణాం సమాగమే, లోకసంభవసందేహః సముత్పన్నో మహాత్మనామ్. 49
తే7తిష్ఠన్థ్యానమాలంబ్య మౌనమాస్థాయ నిశ్చలాః, త్యక్తాహారాః స్పర్థమానా దివ్యం వర్షశతం ద్విజాః. 50
తేషాం బ్రహ్మమయీ వాణీ సర్వేషాం శ్రోత్రమాగమత్, దివ్యా సరస్వతీ తత్ర సంబభూవ నభస్తలాత్. 51
పురా స్తిమితమాకాశమనన్తమచలోపమమ్, నష్టచన్ద్రార్కపవనం ప్రసుప్తమివ సంబభౌ. 52
తతస్సలిలముత్పన్నం తమసీవ తమః పరమ్, తస్మాచ్చ సలిలోత్పీడాదుదతిష్ఠత మారుతః. 53
యథా భవనమచ్ఛిద్రం నిశ్శబ్దమివ లక్ష్యతే, తచ్చాంభసా పూర్వమాణం స శబ్దం కురుతే7నిలః. 54
తథా సలిలసంరుద్ధే నభసాంతే నిరంతరే భిత్త్వార్ణవతలం వాయుః సముత్పతతి ఘోషవాన్. 55
ఏష వై చరతే వాయురర్ణవోత్పీడసంభవః, ఆకాశస్థానమాసాద్య ప్రశాంతిం నాధిగచ్ఛతి. 56
తస్మిన్వాయ్వమ్బుసంఘర్షే దీప్తతేజా మహాబలః, ప్రాదురాసీదూర్థ్వశిఖః కృత్వా నిస్తిమిరం తమః. 57
అగ్నిః పవనసంయుక్తః ఖం సమాక్షిపతే జలమ్, తదగ్నివాయుసంపర్కాద్ఘనత్వముపపద్యతే. 58
తస్యాకాశం నాపతితః స్నేహాత్తిష్టితి యో7పరః, స సంఘాతత్వమాపన్నో భూమిత్వమనుగచ్ఛతి. 59
రసానాం సర్వగంధానాం స్నేహానాం ప్రాణినాం తథా, భూమిర్యోనిరియం జ్ఞేయా యస్యస్సర్వం ప్రసూయతే. 60
పూర్వకాలమున బ్రహ్మకల్పమున బ్రహ్మర్షుల సమాగమము వారికి లోకముల సృష్టెట్లు జరిగెననెడు సందేహము కలిగెను. బ్రహ్మర్షులందరు నిశ్చలులై మౌనముగా ధ్యానమనవలంబించిరి. ఆహారమును స్వీకరించక పట్టుదలతో దివ్యములగు నూరు సంవత్సరములు నిలిచిరి. అప్పుడు వారికందరికి బ్రాహ్మీవాక్కు చెవులపడెను. ఆకాశము నుండి సరస్వతీదేవి ఆవిర్భవించెను. నిశ్చలము అనంతమయమైన ఆకాశము మొదట నుండెను. సూర్యచంద్ర వాయ్వాది శూన్యమై నిద్రించిన దాని వలె నుండెను. తమస్సున ఉత్కష్టమైన తమస్సు వలె ఆకాశము నుండి జలము పుట్టెను. సలిలపీడనము వలన వాయువు కలిగెను. ఛిద్రరహితమైన భవనము ఎట్లు నిశ్శబ్దముగా నుండును. అదే భవనము నీటితో నిండునపుడు వాయువు శబ్దమును కలిగించును. అట్లే సలిలిసంరోధము వలన నిరంతరమైన ఆకాశము నుండి చివర నున్న సముద్రములను భేదించుకొని ధ్వనించువాయువు సముత్పన్నమగును. సముద్రసంఘరణ వలన కలిగిన వాయువు అన్నిటిలో సంచరించును కాని ఆకాశ స్థానమును పొంది శాంతించదు. ఆ వాయుజలసంఘర్షము వలన ఉజ్జ్వలమైన ప్రకాశము కల మహాబలమగు ఊర్థ్వశిఖలు గల అగ్ని ఉత్పన్నమాయోను. అగ్నిచే తిమిరము నశించును. వాయువులో కలిసిన అగ్ని ఆకాశము నుండి జలమును ఆవిర్భవింపచేయును. ఆ జలము అగ్ని వాయు సంపర్కము వలన ఘనత్వమును పొందును. ఆ ఘనపదార్థము ఆకాశము నుండి పతనమై అంతరాలముగ స్నేహము వలన నిలుచును. ఆ ఘనీ భూత పదార్థము సంఘాత రూపమును పొంది భూమిత్వమును పొందును. సర్వగంధములకు సర్వరసములకు స్నేహములకు ప్రాణులకు ముఖ్యకారణము ఈ భూమియే అని తెలియును. భూమి నుండియే అన్నియూ పుట్టును. 49 - 60
భరద్వాజ ఉవాచ :-
య ఏతే ధాతవః పంచ రక్ష్యా యానసృజత్ప్రభుః, ఆవృతా యైరిమే లోకాః మహాభూతాభిసంజ్ఞితైః. 61
యదా7సృజత్సహస్రాణి భూతానాం స మహామతిః, పశ్చాత్తే ష్వేకభూతత్వం కథం సముపపద్యతే. 62
మానసుడు పంచ ధాతువులను సృజించెను. ఈ పంచ ధాతువులకే మహ భూతములను నామ మేర్పడెను. తరువాత లోకములనావరించెను. మహామతియైన మానస బ్రహ్మ వేల భూతములను సృజించెను కదా! సృజించిన తరువాత వాటియందు భూతత్వమెట్లు సంభవించును?
భృగురువాచ :-
అమితాని మహాష్టాని యాన్తి భూతాని సంభవమ్, అతస్తేషాం మహాభూతశబ్దో7యముపపద్యతే. 63
చేష్టా వాయుః ఖమాకాశమూష్మాగ్నిః సలిలం ద్రవః, పృథివీ చాత్ర సంఘాతః శరీరం పాంచభౌతికమ్. 64
ఇత్యతః పంచభిర్యుక్తైర్యుక్తం స్థావరజంగమ్, శ్రోత్రే ఘ్రాణో రసస్స్పర్శో దృష్టిశ్చేంద్రియసంజ్ఞితాః. 65
భృగుమహర్షి పలికెను :- అమితములు మహాష్టములగు భూతములు సంభవించును. కావుననే వాటికి మహాభూత శబ్దముచే వ్యవహారము కలిగినది. చేష్ట వాయువు, శబ్దమాకాశము, వేడి అగ్ని, ద్రవము సలిలము, సంఘాతరూపము పృథివి. కావున ఈ శరీరము పాంచభౌతికము. కావుననే స్థావరజంగమాత్మకమగు ఈ విశ్వమంతయు పంచభూతములతో కూడినదే. శ్రోత్రము, ఘ్రాణము, రసము, స్పర్శము, దృష్టి అను అయిదు ఇంద్రియములనబడును. 63 - 65
భరద్వాజ ఉవాచ :-
పంచభిర్యది భూతైస్తు యుక్తాస్థ్పార జంగమాః, స్థావరాణాం న దృశ్యంతే శరీరే పంచ ధాతవః. 66
అనూష్మాణామచేష్టానామ ఘనానాం చైవ తత్త్వతః, వృక్షాణాం నోపలభ్యన్తే శరీరే పంచ ధాతవః. 67
న శృణ్వంతి న పశ్యంతి న గంధ రసవేదినః, న చ స్పర్శం హి జానన్తి తే కథం పంచ ధాతవః. 68
అద్రవత్వాదనగ్నిత్వాదభూమిత్వాదవాయతః, ఆకాశస్యాప్రమేయత్వాత్ వృక్షాణాం నాస్తి భౌతికమ్. 69
బరద్వాజ మహర్షి పలికెను :- స్థావర జంగమములన్నియూ పాంచభౌతికములని చెప్పుచున్నారు కదా! కాని స్థావరముల శరీరమున పంచ ధాతువులు కనపడుట లేదు కదా! ఊష్మరహితములకు, చేష్టారహితములకు, ఘన పదార్థములకు వాస్తవముగా వృక్షముల శరీరమున పంచధాతువులు కనపడుటలేదు కదా! వృక్షములు వినలేవు, చూడలేవు, గంధమును, రసమును తెలియజాలవు. స్పర్శను కూడా తెలియవు. కావున వృక్షములు పాంచ భౌతికములెట్లగును? వృక్షములు ద్రవములు కావు, అగ్నివయములు కావు, భూమికావు వాయు రూపములు కావు. అప్రమేయాకాశరూపములు కావు. కావున వృక్షములకు పాంచ భౌతికత్వము లేదు. 66 -69
భృగురువాచ :-
ఘనానామపి వృక్షాణామాకాశో7స్తి న సంశయః, తేషాం పుష్పఫలవ్యక్తిర్నిత్యం సముపపద్యతే. 70
ఊష్మతో వ్లూయతే పర్ణం త్వక్ఫలం పుష్పమేవ చ, వ్లూయతే శీర్యతే చాపి స్పర్శస్తేనాత్ర విద్యతే. 71
వాంక్వుగ్న్యశనినిర్ఘోషై ఫలం పుష్పం విశీర్యతే, శ్రోత్రేణ గృహ్యతే శబ్దస్తస్మాచ్ఛృణ్వంతి పాదపాః. 72
వల్లీ వేష్టయతే వృక్షాన్సర్వతశ్చైవ గచ్ఛతి, న హ్యదృష్టశ్చ మార్గో7స్తి తస్మాత్పశ్యంతి పాదపాః. 73
పుణ్యా పుణ్యౖస్తథాగంధైర్థూపైఃశ్చ వివిధైరపి, అరోగాః పుష్పితాస్సన్తి తస్మాజ్జిఘ్రన్తి పాదపాః. 74
సుఖదుఃఖయోర్గ్రహణాచ్ఛిన్నస్య చ విరోహణాత్, జీవం పశ్యామి వృక్షాణామచైతన్యం న విద్యతే. 75
తేన తజ్జలమదత్తే జలమన్నంచ మారుతా, ఆహారపరిణామాచ్చ హ్రాసో వృద్ధిశ్చ జాయతే. 76
జంగమానాం చ సర్వేషాం శరీరే పంచధాతవః, ప్రత్యేకశః ప్రభిద్యంతే యైశ్శరీరం విచేష్టతే. 77
త్వక్చ మాంసం తథాస్థీని మజ్జా స్నాయుశ్చ పంచమః, ఇత్యేతదిహ సంఘాతం శరీరే పృథివీమయే. 78
తేజో హ్యాగ్ని స్తథా క్రోధశ్చక్షుష్మా తథైవ చ, అగ్నిర్జనయతే యచ్చ పంచాగ్నేయా శరీరణః. 79
శ్రోత్రం ఘ్రాణం తథాస్యం చ హృదయం కోష్ఠమేవ చ, ఆకాశాత్ప్రాణినామేతే శరీరే పంచ ధాతవః. 80
శ్లేష్మా పిత్తమథ స్వేదో వసా శోణితమేవ చ, ఇత్యాపః పంచధా దేహే భవంతి ప్రాణినాం సదా. 81
ప్రాణాత్ప్రీణయతే ప్రాణీ వ్యానాద్వ్యాయచ్చతే తథా, గచ్ఛత్యపానో7థశ్చైవ సమానో హృద్యవస్థితః. 82
ఉదానాదుచ్ఛ్వసితీతి పంచభేదాచ్చ భాషతే, ఇత్యేతే వాయవః పంచ వేష్టయంతీహ దేహినమ్. 83
భూమేర్గంధగుణాన్వేత్తి రసం చాద్భ్యశ్శరీరవాన్, తస్య గంధస్య వక్ష్యామి విస్తారాభిహితాన్గుణాన్. 84
ఇష్టశ్చానిష్టగంధశ్చ మధురః కటురేవ చ, నిర్హారీ సంహతస్స్నిగ్ధో రూక్షో విశద ఏవ చ. 85
ఏవం నవవిధో జ్ఞేయః పార్ధివో గంధవిస్తరః, జ్యోతిః పశ్యతి చక్షుర్భ్య స్స్పర్శం వేత్తి చ వాయునా. 86
శబ్దస్స్పర్శశ్చ రూపం చ రసశ్చాపి గుణాస్స్మృతాః, రసజ్ఞానం తు వక్ష్యామి తన్మే నిగదతశ్శృణు. 87
రసో బహువిధః ప్రోక్త ఋషిభిః ప్రథితాత్మభిః, మధురో లవణస్తిక్తకషాయో7వ్లుః కటుస్తథా. 88
ఏష షడ్విధవిస్తారో రసో వారిమయస్స్మృతః, శబ్దస్స్పర్వశ్చ రూపం చ త్రిగుణం జ్యోతిరుచ్యతే. 89
జ్యోతిః పశ్యతి రూపాణి రూపం చ బహుధా స్మృతమ్, హ్రస్వో దీర్ఘస్తథా స్ధూతశ్చతురస్రో7ణు వృత్తనాన్. 90
శుక్ల కృష్ణస్తథా రక్తో నీలః పీతో7రుణస్తథా, కఠినశ్చిక్కణ శ్లక్షః పిచ్ఛలో మృదు దారుణః. 91
ఏవం షోడశవిస్తారో జ్యోతీ రపగుణస్స్మృతః, తత్త్రైవ గుణమాకాశం శబ్ద ఇత్యేవ తత్స్మృతమ్. 92
తస్య శబ్దస్య వక్ష్యామి విస్తరం వివిధాత్మకమ్, షడ్జో ఋషభ గాంధారౌ మధ్యమో ధైవతస్తథా. 93
పంచమశ్చాపి విజ్ఞేయస్తథా చాపి నిషాదవాన్, ఏష సప్తవిధః ప్రోక్తో గుణ ఆకాశసంభవః. 94
ఐశ్వర్యేణ తు సర్వత్ర స్థితోపి పటహాదిషు, మృందగభేరీశంఖానాం స్తనయిత్నో రథస్య చ. 95
ఏవం బహువిధాకారశ్శబ్ద ఆకాశసంభవః, వాయవ్యస్తు గుణస్స్పర్శస్స్పర్శశ్చ బహుధా స్మృతః. 96
ఉష్ణశ్శీతస్సుఖం దుఃఖం స్నిగ్ధో విశద ఏవ చ, తథా ఖరో మృదుశ్లక్షో లఘర్గురుతరో7పి చ. 97
శబ్దస్పర్శే తు విజ్ఞే¸° ద్విగుణౌ వాయురిత్యుత, ఏమమేకాదశవిధో వాయవ్యో గుణ ఉచ్యతే. 98
ఆకాశజం శబ్దమాహురేభిర్వాయుగుణౖస్సహ, అవ్యాహతైశ్చైతయతి న వేతి విషమా గతిః. 99
ఆప్యాయం తే చ తే నిత్యం ధాతవసై#్తస్తు ధాతుభిః, ఆపో7గ్నిర్మారుతశ్చైవ నిత్యం జాగ్రతి దేహిషు. 100
మూలమేతే శరీరస్య వ్యాప్య ప్రాణానిహ స్థితాః, పార్థివం ధాతుమాసాద్య యథా చేష్టయతే బలీ. 101
శ్రితో మూర్థానమగ్నిస్తు శరీరం పరిపాలయేత్, ప్రణో మూర్థనివాగ్నౌ చ వర్తమానో విచేష్టతే. 102
స జస్తుస్సర్వభూతాత్మా పురుషస్స సనాతనః, మనో బుద్ధిరహంకారో భూతాని విషయశ్చ సః. 103
ఏవం త్విహ స సర్వత్ర ప్రాణౖస్తు పరిపాల్యతే, పృష్ఠతస్తు సమానేన స్వాం స్వాం గతిముపాశ్రితః. 104
వస్తిమూలం గుదం చైవ పావకం సముపాశ్రితః, వహన్మూత్రం పురీషం వాప్యపానః పరివర్తతే. 105
ప్రయత్నే కర్మనియమే య ఏకస్త్రిషు వర్తతే, ఉదాన ఇతి తం ప్రాహురధ్యాత్మజ్ఞానకోవిదాః. 106
సంధిష్వపి చ సర్వేషు సన్నివిష్టస్తథానిలః, శరీరేషు మనుష్యాణాం వ్యాన ఇత్యుపదిశ్యతే. 107
బాహుష్వగ్నిస్తు వితతస్సమానేన సమీరితః, రసాన్నవాహదోషాంశ్చ వర్తయన్నతి చేష్టతే. 108
అపానప్రాణయోర్మధ్యే ప్రాణాపానసమీహితః, సమన్వితస్త్వధిష్ఠానం సమ్యక్పచతి పావకః. 109
ఆస్యం హి పాయుపర్యన్తం అంతే స్యాద్గుదసంజ్ఞితే, రేతస్మస్మాత్ప్రజాయంతే సర్వస్రోతాంసి దేవానామ్. 110
ప్రాణానాం సన్నిపాతాచ్చ సన్నిపాతః ప్రజాయతే, ఊష్మా చాగ్నిరితి జ్ఞేయో యో7న్నం పచతి దేహినామ్. 111
అగ్నీ వేగవహః ప్రాణో గుదాంతే ప్రతిహన్యతే, స ఊర్థ్వ మాగమ్య పునః సముత్కిపతి పావకమ్. 112
పక్వాశయస్త్వథో నాభ్యా ఊర్ధ్వమామాశయస్స్మృతః, నాభిమూలే శరీరస్య సర్వే ప్రాణాశ్చ సంస్థితాః. 113
ప్రస్థితా హృదయాత్సర్వే తిర్యగూర్ధ్వమధస్తథా, వహంత్యన్నరసాన్యాడ్యో దశప్రాణ ప్రచోదితాః. 114
ఏష మార్గో7పి యోగానాం యేన గచ్ఛంతి తత్పదమ్, జతక్లమాస్సమా ధీరా మూర్థన్యాత్మానమాదధన్. 115
ఏవం సర్వేషు విహితప్రాణాపానేషు దేహినామ్, తస్మిన్సమిధ్యతే నిత్యమగ్నిస్థ్సల్యామివాహితః. 116
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే ద్వితీయపాదే
భృగుభరద్వాజసంవాదే జగదుత్పత్తి వర్ణనం నామ
ద్విచత్వారింశో7ధ్యాయః
భృగు మహర్షి పలికెను :- ఘన స్వరూపములైన వృక్షములలో కూడా ఆకాశమున్నది. సంశయము లేదు. వృక్షములకు పూవులుపూయుట పండ్లుకాయుట నిత్యము కనపడుచునేయున్నది. వేడివల్లనే ఆకులు, చర్మ, పండు, పూవువాడిపోవును వాడుచున్నది రాలుచున్నది కావున వృక్షములకు స్పర్శ ఉన్నది. వాయునుచే అగ్నిచే పిడుగుచే ఏర్పడిన ధ్వనులే పండ్లు పూవులు రాలిపడుచున్నవి. ధ్వనిని శ్రోత్రములచే మాత్రమే గ్రహించువలయును. ధ్వనిచే రాలుచున్నవి కావున చెట్లు శబ్దమును వినుచున్నవి. తీగలు చెట్టును చుట్టుకొని అంతటా పాకును, ముందుకు సాగవలయునన్న దృష్టి కావలయును కదా. తీగలు పాకుచున్నవి కావున చెట్లు చూచుచున్నవి. పవిత్రములైన అపవిత్రములైన గంధములచే, ధూపములచే వృక్షములు రోగరహితములుగా పుష్పితములుగా మనగలుగుచున్నవి కావున వృక్షములు వాసన చూచుచున్నవి. సుఖమును దుఃఖమును వాడుట విప్పారుటలచే అనుభవించుచున్నవి. నరికిన మరల చిగుర్చుచున్నవి. కావున వృక్షములకు ప్రాణమున్నది. అచైతన్యము లేదు. ప్రాణమున్నది కావున జలమును గహించుచున్నది, గ్రహించిన జలమును జీర్ణించుకొనుచున్నది. జీర్ణమగుచున్నది కావున వాయువును గ్రహించుచున్నది, తీసుకొనిన ఆహారమును జీర్ణము చేసుకొనుచున్నది. కావుననే ఆహారము మారినపుడు తరుగుట పెరుగుట సంభవించుచున్నది. అన్ని జంగముల శరీరములలో ప్రత్యేకించి పంచధాతువులు భిన్నములుగా ఉండును. పంచధాతువులచే శరీరము చేష్టలను కలిగియుండును. చర్మము, మాంసము, అస్థులు, మజ్జా (కొవ్వు) స్నాయువు అను అయిదింటి సమూహము పృథివీమయమగు శరీరమున ఉండును. తేజస్సు,అగ్ని, క్రోధము, నేత్రములు, ఊష్మము అను అయిదింటిని శరీరమున అగ్ని కలిగించును. శ్రోత్రము, ఘ్రాణము, ఆస్యము, హృదయము, కోష్ఠము అను అయిదు ధాతువులు ఆకాశమువలన శరీరమున సంభవించును. శ్లేష్మము, పిత్తము, స్వేదము, వసా, రక్తము అని జలము అయిదు విధములుగా శరీరముననుండును. ప్రాణి ప్రాణముచే తృప్తి పొందును. వ్యానముచే తృప్తిని బయలుపరుచును. అపానము అధోదేశమునుండి వెడలును. సమానము హృదయముననుండును. ఉదానముతో గాలి పీల్చుకొనును. ఇట్లు అయిదు వాయువులు శరీరమున వ్యాపించియుండును. దేహి భూమినుండి గంధగుణములను, జలమును రసములను గ్రహించును. ఇపుడు గంధగుణములను విస్తరముగా చెప్పెదను వినుము. ఇష్టము, అనిష్టము, మధురము, కటువు, నిర్హారి, సంహతము, స్నిగ్ధము, రూక్షము, విశదము అని పార్థివగంధములు తొమ్మిది విధములు. నేత్రములచే వెలుగును చూచును, వాయువుచే స్పర్శను తెలియును. శబ్ద స్పర్శరూపరసములు గుణములనబడును. ఇక ఇపుడు రస జ్ఞానమును చెప్పుచున్నాను వినుము. జ్ఞానులగు ఋషులు బహువిధరసములను చెప్పియున్నారు. మధురము, లవణము, కారము, వగరు, పులుపు, చేదు అను ఆరు రసములు జలమయములు. శబ్దస్పర్శరూపములు జ్యోతిర్గుణములందురు. వెలుగే రూపములను చూచును. ఆ రూపము బహువిధము, పొట్టి, పొడుగు, లావు, నాలుగుమూలము, అణువు, వృత్తము, తెలుపు, నలుపు, ఎఱుపు, నీలము, పసుపుపచ్చ, అరుణము, కఠినము, ముదురు, లేత, నునుపు, మెత్తన, భయమును కటిగించునది అని జ్యోతియొక్క రూపగుణములు పదునారు విధములు. ఆకాశమునకు ఒకటే గుణము. అదియే శబ్దము. ఇప్పుడు శబ్దములయొక్క వివిధ స్వరూపములను విస్తరముగా చెప్పెదను, షడ్జ, ఋషభ, గాంధార, మధ్యమ, ధైవత, పంచమనిషాదములని ఏడు విధములగు శబ్దగుణములు ఆకాశ సంభవములు. ఈశ్వర రూపముగా అంతట శబ్దమున్నను, పటహ, మృదంగ, భేరి, శంఖ, మేఘ రధాదులయందు కలుగు ధ్వని ఆకాశసంభవమే, వాయుగుణము స్పర్శ. స్పర్శ పలువిధములుగా నుండును. ఉష్ణ, శీత, సుఖ, దుఃఖ, స్నిగ్ధ, విశద, కఠిన, మృదు, శ్లక్ష, లఘు, గురువులు అనునవి శబ్దస్పర్శములు రెండింతలు వాయుస్పర్శలు. ఇట్లు వాయుగుణమగు స్పర్శ పదకొండు విధములు. ఈ వాయుగుములతో కలిసిన శబ్దము ఆకాశమువలన జనించును. సంఘర్షమువలన, సంఘర్షము లేక కూడా కలుగుట శబ్దముయొక్క విషమగతి. ఇట్లు పంచధాతువలచే ధాతువులు వృద్ది చెందించబడును. శరీరధారులయందు నీరు నిప్పుగాలి ఎప్పుడూ జాగరూకతతో నుండును, శరీరమునకు ఇవియే మూలములు. ప్రాణములను వ్యాపించియుండును. పార్ధివధాతువును పొందుటచే బలము గలవాడై చేష్టలు చేయును, శిరోస్థానముననున్న అగ్ని శరీరమును పరిపాలించుచుండును. ప్రాణము శిరమున వాని అగ్నిలోకాని నివసించుచు తిరుగుచుండును. ఆ ప్రాణమే ఆత్మరూపముగా సనాతన పురుషునిగా ఉండును. మనస్సు బుద్ధి అహంకారము భూతములు విషయములు అన్నియూ అతనే. ఇట్లు శరీర అంతట ప్రాణములచే పరిపాలించబడుచుండును. ఉపస్థమూలమును గుదమున ఉన్న అగ్నిని ఆశ్రయించు అపానము మూత్ర పురీషములను గ్రహించును, విసర్జించును, ప్రయత్నమునందు, కర్మలయందు, నియమములందు మూడింటియందు ఒకటిగా నుండునది ఉదానమనబడును. మనుష్య శరీరములలోని అన్ని సంధులలోనుండు దానిని వ్యానమందురు. బాహువులలో విస్తరించియున్న అగ్ని సమాన వాయువుచే ప్రేరేపించబడి రస అన్నాది దోషములను నివారించుచుండును. అపాన ప్రాణముల మధ్యమున ప్రాణాపానములచే చక్కగా వలిసి అధిష్ఠానమును చక్కగా పాకము చేయును. ఆస్యమునుండి పాయువువరకూ చివరి గుదమువరకు వ్యాపించియున్న అగ్ని వాయువుల సంయోగమువలన రేతస్సు జనించును. దానినుండి దేహిద్వారములు ఏర్పడును. ప్రాణముల సన్నిపాతముచే సన్నిపాత వ్యాధి ఏర్పడును. ఊష్మమే అగ్ని. ఈ అగ్నియే అన్నమును జీర్ణము చేయును. అగ్నివేగముతో తిరుగుచున్న ప్రాణము గుదాంతమున త్రిప్పిపంపబడును. అట్లు ఊర్ధ్వభాగమునకు వచ్చి అగ్నిని ప్రజ్జ్వలింపచేయును. నాభికి క్రింది భాగమున పక్వాశయముండును. నాభికి పైభాగమున ఆమాశయముండును. శరీరముయొక్క ప్రాణములన్నియు నాభిమూలమున నిలిచియుండును. హృదయమునుండి పైకి, క్రిందికి అడ్డముగా ప్రసరించియున్న నాడులు అన్నరసములను దశ ప్రాణముల బలముచే వహించుచుండును. ఈ నాడీ మార్గముననే యోగులు పరమపదములు చేరెదరు. వీరు శ్రమను బాధను జయించి సమవర్తులై ధీరులై శిరోభాగమున ప్రాణములను నిలిపి పరమధామమును చెరెదరు. ఇట్లు అన్ని ప్రాణులలో నియమముగా నుండు అగ్ని ప్రాణాపానాదులలో స్థాలిలో ఉంచిన పదార్థమువలె చక్కగా నిలిచి ప్రవహించుచు పెరుగుచు దేహిని చేష్టామయుని చేయును.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున
పూర్వభాగమున ద్వితీయపాదమున
భృగుభరద్వాజసంవాదమున
జగదుత్పత్తి వర్ణనమను
నలుబది రెండవ అధ్యాయము
సమాప్తము