Sri Naradapuranam-I
Chapters
Last Page
త్రిచత్వారింశో7ధ్యాయః = నలుబది మూడవ అధ్యాయము బ్రాహ్మణాచారనిరూపణమ్ భరద్వాజ ఉవాచ :- యది ప్రాణపతిర్వాయుర్వాయురేవ విచేష్టతే, శ్వసిత్వా భాషతే చైవ తతో జీవో నిరర్థకః. 1 య ఊష్మ భావ ఆగ్నేయో వహ్నిర్నైవోపలభ్యతే, అగ్నిర్జరయతే చైతత్తదా జీవో నిరర్థకః. 2 జంతోః ప్రమ్రియమాణస్య జీవో నైవోపలభ్యతే, వాయురేవ జహాత్యేనమూష్మభావశ్చ నశ్యతి. 3 యది హయుమయో జీవః సంశ్లేషో యది వాయునా, వాయుమండలవత్పశ్యేద్గచ్ఛత్సహ మరుద్గణౖః. 4 సంశ్లేషో యది వాతేన యది తస్మాత్ప్రణశ్యతి, మహార్ణవవిముక్తత్వాదన్యత్సలిలభాజనమ్. 5 కూపే వా సలిలం దద్యాత్ప్రదీపం వా హుతాశ##నే, క్షిప్రం ప్రవిశ్య నశ్యేత యథా నశ్యత్యసౌ తథా. 6 పంచధారణకే హ్యస్మిన్ శరీరే జీవితం కృతమ్, యేషామన్యతరాభావాచ్చతర్ణాం నాస్తి సంశయః. 7 నశ్యంత్యాపోహ్యనాహారాద్వాయారుచ్ఛ్వాస నిగ్రహాత్, నశ్యతే కోష్ఠభేదార్థదగ్నిర్నశ్యత్యభోజనాత్. 8 వ్వాధివ్రణపరిక్లేశైర్మేదినీ చైవ శీర్యతే, పీడితే7న్యతరూహ్యేషాం సంఘాతో యాతి సంచతామ్. 9 తస్మిన్పంచత్వమాపన్నే జీవః కిమనుధావతి, కిం ఖేదయతి వా జీవః కిం శృణోతి బ్రవీతి చ. 10 ఏషా గౌః పరలోకస్థం తారయిష్యతి మామితి, యో దత్వా మ్రియతే జంతుః సా గౌః కం తారయిష్యతి. 11 గౌశ్చ ప్రతిగ్రహీతా చ దాతా చైవ సమం యది, ఇహైవ విలయం యాన్తి కుతస్తేషాం సమాగమః. 12 విహగైరుపభుక్తస్య శైలాగ్రాత్పతితస్య చ, అగ్నినా చోపయుక్త్య కుతస్సంజీవనం పునః. 13 ఛిన్నస్య యది వృక్షస్య న మూలం ప్రతిరోహతి, జీవన్యస్య ప్రవర్తన్తే మృతః క్వ పునరేష్యతి. 14 జీవమాత్రం పురా సృష్టం యదేతత్పరివర్తతే, మృతా మృతాః ప్రణశ్యంతి బీజాద్బీజం ప్రణశ్యతి. 15 ఇతి మే సంశయో బ్రహ్మన్ హృదయో పరిధావతి. తం నివర్తయ సర్వజ్ఞ యతస్త్వామాశ్రితో హ్యహమ్. 16 భరద్వాజ మహర్షి పలికెను :- వాయువే ప్రాణపతి, వాయువే చేష్టలు చేసినచో, వాయువే శ్వాసతీసుకొనుట, వాయువే మాటలాడుట చేసినచో ఇక జీవుడు చేయునదేమి? జీవుడు నిరర్థకుడగునా? అగ్ని సంబంధమైన వేడి అగ్ని వలననే కలిగినచో అగ్నియే ఆహారమును శరీరమును జీర్ణము చేసినచో జీవునితో ప్రయోజనమేమి? మరణించు
జీవుడు లభించుటలేదు. జంతువును వాయువు వదులుచున్నది. వేడి నశించుచున్నది. జీవుడు వాయుమయుడు. వాయువుతో సంశ్లేషించును. వాయుమండలమువలె చూడవలయును. మరుద్గణములతో కలిసి వెళ్ళవలయును. వాయువుతో కలిసియుండుట జీవితము, వాయు నాశము మరణము అనిచెప్పినచో నీటి సమూహము సముద్రము. సముద్రమనగా నీటికి పాత్ర తప్ప విడిగా సముద్రము లేదనునట్లయినది కదా? నీరు బావిలో ఉండును. దీపము అగ్నినిచ్చును. బావిలో నీరు దీపములోని అగ్ని క్షణములో నశించునట్లు జంతువులోని వాయ్వగ్నులు కూడా నశించవచ్చును కదా? పంచ భూతసంఘాతాత్మకమగు ఈ శరీరమున ఒకటి లేకున్ననను మిగిలిన నాలుగుండుటలో సంశయము లేదు కదా? అహారమును తీసుకోనిచో నీరు నశించును. గాలిని బిగబట్టిన వాయువు నశించును. భోజనముచేయనిచో అగ్ని నశించును. వ్యాధులచే, గాయములచే, పరిశ్రమచే భూమి నశించును. ఇట్లు ఈ అయిదింటిలో ఏ ఒక్కటి పీడించిననూ అయిదు నశించును కదా? ఇట్లు పంచత్వమును పొందినచో (మరణించినచో) జీవుడు దేనిననుసరించును? దేనిని బాధించును, దేనిని వినును, ఏమి మాట్లాడును? ఈ గోవు పరలోకమున నున్న తరింప చేయును అని భావించు ఒకడు గోవును దానము చేయును. దానము చేసినవాడు మరణించిన పిదప ఆవును ఎవరిని తరింపచేయును? దానము చేయబడిన గోవు, దానము చేసినవాడు, దానమును స్వీకరించిన వాడు ఈ లోకముననే మృతి చెందును కదా! వారెట్లు ఎపుడు ఎక్కడ కలియుదురు? పక్షులచే భక్షించబడిన జంతువు, పర్వతము నుండి పడి మరణించిన జంతువు, అగ్నిచే దహింపబడిన జంతువు మరల ఎట్లు బ్రతుకును? సమూలముగా నరికివేసిన వృక్షము మరల చిగురించనట్లు బ్రతుకునపుడు పనులు చేసిన వారు మరణించి మరల ఎట్లు వచ్చును? ఎక్కడికి వెళ్ళును? పూర్వమున జీవి మాత్రమే సృజించబడినది. ఆ జీవమే తిరుగుచున్నదని కదా చెప్పితిరి. చనిపోయినవారు చనిపోయిన వెంటనే నశించుచున్నారు. ఒక బీజము మరియొక బీజమును నశింపచేయుచున్నది అయినపుడు తిరిగి వచ్చునదేది పరలోకమునకు వెళ్ళునదేది? కావున ఓ బ్రాహ్మణోత్తమా? నా మనసులో ఈ సంశయమేర్పడినది. నిన్నాశ్రయించితిరి కావున నాసంశయమును సర్వజ్ఞుడవగు నీవు తొలగించుము.
సనందన ఉవాచ:-
ఏవం పృష్టస్తదానేన స భృగుర్బహ్మణస్సుతః, పునరాహ మునిశ్రేష్ఠ, తత్సందేహనివృత్తయే. 17
సనందన మహర్షి పలికెను. ఇట్లు భరద్వాజ మహర్షి ప్రశ్నించగా బ్రహ్మపుత్రుడగు భృగు మహర్షి అతని సందేహనివృత్తి కొఱకు మరల ఇట్లు పలికెను.
భృగురువాచ :-
న ప్రాణాసన్తి జీవస్య దత్తస్య చ కృతస్య చ, యాతి దేహాంతరం ప్రాణీ శరీరం తు వశీర్యతే. 18
న శరీరాశ్రితో జీవస్తస్మిన్నష్టే ప్రణశ్యతి, సమిధామగ్నిదగ్దానాం యథాగ్నిర్దృశ్యతే తథా. 19
భృగు మహర్షి పలికెను :- దానము చేసిన వానికి కార్యములను చేయువానికి జీవునకు ప్రాణములు లేవు. ప్రాణి అనగా జీవుడు మరో దేహమున ప్రవేశించును. శరీరము మాత్రమే నశించును. జీవుడు శరీరమునాశ్రయించి ఉండువాడు కాడు. శరీరము నశించినచో నశించువాడు కాడు. అగ్నిచే సమిధలు దహించబడును. అనగా అగ్ని సమిధల నాశ్రయించి యుండునది కాదు. సమిధలచే నశించునది కాదు. సమిధల స్వరూపనాశములో అగ్ని కనపడదు కావున అగ్ని కనపడదు కావున అగ్ని నశించినది అని భావింతుము. 18 -19
భరద్వాజ ఉవాచ :-
అగ్నేర్యథా తస్య నాశాత్తద్వినాశో న విద్యతే, ఇంధనస్యోపయోగాంతే న వాగ్నిర్నోపలభ్యతే. 20
నశ్యతీత్యేవ జానామి శాంతమగ్నిమనిన్థనమ్, గతిర్యస్య ప్రమాణం వా సంస్థానం వా న విద్యతే. 21
భరద్వాజ మహర్షి పలికెను : - సమిధల నాశముచే అగ్ని నశించకపోవచ్చును. కాని సమిధలను పూర్తిగా దహించిన తరువాత అగ్ని అచట కనపడుట లేదు కదా ! సమిధలు లేనపుడు అగ్ని శాంతించును కావున నశించుననే భావించుచున్నాను. సమిధలు లేనప్పుడు అగ్ని గతి ప్రమాణము స్థితి యుండుట లేదు కదా? 20 -21
భృగురువాచ :-
సమిధాముపయోగాంతే స చాగ్నిర్నోపలభ్యతే, నవ్యతీత్యేవ జానామి శాంతమగ్నిమనింధనమ్. 22
గతిర్యస్య ప్రమాణం వా సంస్థానం వా న విద్యతే, సమిధాముపయోగాంతే యథగ్నిర్నోపలభ్యతే. 23
ఆకాశానుగతత్వాద్ధి దుర్గ్రాహ్యా హి నిరాశ్రయః, తథా శరీరసంత్యాగే జీవో హ్యాకాశవత్థ్సితః. 24
న నశ్యతే సుసూక్ష్మత్వాద్యధా జ్యోతిర్న సంశయః, ప్రాణాన్దారయతే హ్యాగ్నిస్సజీవ ఉపధార్యతామ్. 25
వాయు సంధారణో హ్యగ్నిర్నశ్యత్యుచ్ఛ్వాసనిగ్రహాత్, తస్మిన్నష్టే శరీరాగ్నౌ తతో దేహమచేతనమ్. 26
పతితం యాతి భూమిత్వమయనం తస్య హి క్షితిః, జంగమానాం హి సర్వేషాం స్థావరాణాం తథైవ చ. 27
ఆకాశం పవనో7న్వేతి జ్యోతిస్తమనుగచ్చతి, తేషాం త్రయాణామేకత్వాద్ద్వయం భూమౌ ప్రతిష్ఠతి. 28
యత్ర ఖం తత్ర పవనస్తత్రాగ్నిర్యత్ర మారుతః, అమూర్తయస్తే విజ్ఞేయా మూర్తమంతశ్శరీరిణః. 29
భృగు మహర్షి పలికెను :- సమిధల ఉపయోగము తరువాత అగ్ని కనిపించదు. సమిధలు లేని అగ్ని శాంతించును కావున నశించుననే భావింతును. గతి ప్రమాణము సంస్థానము కూడా లభించదు. సమిధల ఉపయోగము తరువాత అగ్ని లభించునట్లు ఆకాశానుగతమైనది నిరాశ్రయమైనది సూక్ష్మమగుటవలన తెలియ జాలము. అట్లే శరీరమును విడిచినపుడు జీవుడు ఆకాశము వలె ఉండును. అతి సూక్ష్మమైన దగుటచే జ్యోతివలె నశించదు. అగ్ని ప్రాణములను ధరింపచేయును. అతనే జీవుని గా తెలియుము. వాయుసంధారణ మగు అగ్ని ఉచ్ఛ్వాస నిగ్రహము వలన నశించును. ఆ శరీరాగ్ని నశించినపుడు దేహము అచేతనమగును. దేహమునకు ఆధారము భూమి కావున భూమి మీదనే పడును. ఈ విషయము స్థావరజంగమములకు అన్నింటికి సమానము. వాయువు ఆకాశముననుసరించును. అగ్ని వాయునుననుసరించును ఆకాశవాయగ్నలు ఒకటి కావున వాయ్వగ్నులు భూమియందుండును. ఆకాశమున్నచోట వాయువుండును. వాయువున్నచోట అగ్నియుండును. ఈ మూడు మూర్తిమంతములు కావు. శరీరులు మాత్రము మూర్తిమంతులు. 22 - 29
భరద్వాజ ఉవాచ :-
యద్యగ్నిమారుతౌ భూమిః ఖమాపశ్చ శరీరిషు, జీవః కిం లక్షణస్తత్రేత్యేతదాచక్ష్వ మే7నఘ ! 30
పంచాత్మకే పంచరతౌ పంచవిజ్ఞానసంజ్ఞకే, శరీరే ప్రాణినాం జీవం వేత్తుమిచ్ఛామి యాదృశమ్. 31
మాంసశోణితసంఘాతే మేదస్స్నాయ్వస్థిసంచయే, భిద్యమానే శరీరే తు జీవోనైవోలభ్యతే. 32
యద్యజీవశరీరం తు పంచభూతసమన్వితమ్, శారీరే మానసే దుఃఖే కస్తాం వేదయతే రుజమ్. 33
శృణోతి కథితం జీవః కర్ణాభ్యాం న శృణోతి తత్, మహర్షే మనసి వ్యగ్నే తస్మాజ్జీవో నిరర్థకః. 34
సర్వే పశ్యంతి యద్దృశ్యం మనోయుక్తేర చక్షుషా, మనసి వ్యాకులే చక్షుః పశ్యన్నపి న పశ్యతి. 35
న పశ్యతి న చాఘ్రాతి న శృణోతి న భాషతే, న చ స్పర్శమసౌ వేత్తి నిద్రావశగతః పునః. 36
హృష్యతి క్రుధ్యతే కో7త్ర శోచత్యుద్వితే చకః, ఇచ్ఛతి ధ్యాయతి ద్వేష్టి వాక్యం వాచయతే చ కః. 37
భరద్వాజ మహర్షి పలికెను :- దేహధారులలో అగ్ని వాయూ భూమ్యాకాశ జలములే యున్నచో అచట జీవుని గుర్తించు చిహ్నమేమిటో నాకు తెలుపుము పంచాత్మక, పంచరతము, పంచవిజ్ఞాన సంజ్ఞకమైన ప్రాణుల శరీరమున జీవుడెట్టి వాడో తెలియగోరుచున్నాను. మాంసము, నెత్తురు, కొవ్వు, చీము, నరములు, ఎముకలు కలిసియున్న శరీరమున జీవుడు కనపడుటలేదు. అనగా శరీరమును చీల్చి చూచిన మాంసాదులు కనపడుచున్నవే కాని జీవుడు కనపడుట లేదని భావము. జీవుడులేని శరీరమే పంచభూతమయమైనచో శారీరిక మానస దుఃఖమును తెలియునదెవ్వరు? జీవుడు చెవులతో వినును. కాని మనసు పరాకుగా ఉన్నప్పుడు వినలేడు. కావున జీవుడు నిరర్తకుడే కదా? మనసుతో కలిసిన కంటితో అందరూ చూతురు. మనసు వ్యాకులముగా నున్నపుడు చూచుచున్ననూ కనపడదు. నిద్రావశములో నున్నపుడు చూడజాలడు వాసన చూడజాలడు, వినజాలడు, మాటలాడడు, స్పర్శను తెలియజాలడు. ఈ శరీరమున సంతోషించువాడు, కోపించువాడు, విచారించువాడు, బాధపడువాడు, కోరువాడు, ధ్యానించువాడు, ద్వేషించువాడు, మాటలాడువాడు ఎవరు? 30 -37
భృగురువాచ :-
తం పంచసాధారణమత్ర కించిచ్ఛరీరమేకో వహతే7ంతరాత్మా,
స వేత్తి గంధాంశ్చ రసాఞ్ఛృతీంశ్చ స్పర్శం చ రూపంచ గుణాంశ్చ యే7న్యే. 38
పంచాత్మకే పంచగుణప్రదర్శీ స సర్వగాత్రానుగతో7ంతరాత్మా,
స వేత్తి దుఃఖాని సుఖాని చాత్ర త ద్విప్రయోగాత్తు న వేత్తి దేహమ్. 39
యదా న రూపం న స్పర్వో నోష్మభావశ్చ పావకే, తదా శాంతే శరీరాగ్నౌ దేహత్యాగేన నశ్యతి. 40
ఆపోమయమిదం సర్వమాపో మూర్తశ్శరీరిణామ్, తత్రాత్మా మానసో బ్రహ్మా సర్వభూతేషు లోకకృత్. 41
ఆత్మానం తం విజానీహి నిత్యం లోకహితాత్మకమ్, తస్మిన్యస్సంశ్రితో దేహే హ్యబ్బిందురివ పుష్కరే. 42
క్షేత్రజ్ఞం తం విజానీహి నిత్యం లోకహితాత్మకమ్, తమోరజశ్చ సత్త్వం చ విద్ది జీవగుణానిమాన్. 43
అచేతనం జీవగుణం వదంతి స చేష్టతే చేష్టయతే చ సర్వమ్, అతః పరం క్షేత్రవిదో వదంతి ప్రావర్తమద్యో భువనాని సప్త. 44
న జీవనాశో7స్తి హి దేహభేదే మిథ్యైతదాహుర్మన ఇత్యబుద్ధాః, జీవస్తు దేహాంతరితః ప్రయాతి దశార్థతస్తస్య శరీరభేదః. 45
ఏవం భూతేషు సర్వేషు గూఢశ్చరతి సర్వదా, దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్వా సూక్ష్మయా తత్త్వదర్శిభిః. 46
తం పూర్వాపరరాత్రేషు యుంజానప్సంతతం బుధాః, లబ్దాహారో విశుద్ధాత్మా పశ్యత్యాత్మానమాత్మని. 47
చిత్తస్య హి ప్రసాదేన హిత్వా కర్మ శుభాశుభమ్, ప్రసన్నాత్మాత్మని స్థిత్వా సుఖమానన్త్యమశ్నుతే. 48
మానసో7గ్నిః శరీరేషు జీవ ఇత్యభిదీయతే, సృష్టిః ప్రజాపతేరేషా భూతాధ్యాత్మవినిశ్చయే. 49
అసృజద్బ్రాహ్మణానేవ పూర్వం బ్రహ్మా ప్రజాపతిః, ఆత్మతేజో7భినిర్వృత్తాన్బాస్కరాగ్నిసమప్రభాన్. 50
తతస్సత్యం చ ధర్మం చ తథా బ్రహ్మ చ శాశ్వతమ్, ఆచారం చైవ శౌచం చ స్వర్గాయ విదధే ప్రభుః. 51
యక్షకాక్షసనాగాశ్చ పిశాచా మనుజాస్తథా, బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రాణామసితస్తథా. 52
భృగు మహర్షి పలికెను. పంచభూతసాధారణాత్మకమగు శరీరమును ఒక్క అంతరాత్మయే వహించును. ఆ యంతరాత్మయే గంధమును రసమును శబ్దమును స్పర్శను, రూపమును, గుణములను ఇతరములను తెలియును. ఈ అంతరాత్మ పంచాత్మకమగు శరీరమున పంచగుణములను చూపుచు అన్ని అవయవములలో అనుగతమైయుండును. అంతరాత్మయే సుఖములను దుఃఖములను తెలియును. అంతరాత్మ వియోగము జరిగినచో దేహము తెలియజాలదు. అగ్నిలో రూపము స్పర్శ ఊష్మభావము లోపించి శరీరాగ్ని శాంతించినప్పుడు దేహత్యాగముతో అంతరాత్మ నశించును. ఈ ప్రపంచమంతయూ జలమయమే. శరీరులకు జలమే మూర్తి నిచ్చును. ఆ జలమున లోకకారకుడగు మానస బ్రహ్మయే ఆత్మ. అతనినే సర్వ లోకహితాత్మకమగు ఆత్మగా తెలియుము. ఈ ఆత్మ దేహమున పద్మదళమున నీటిబిందువు వలె సంగరహితముగా నుండును. ఈ ఆత్మయే నిత్యము లోకహితాత్మకమగు క్షేత్రజ్ఞుడు. తమోరజస్సత్త్వములు జీవగుణములుగా చెప్పెదరు. జీవగుణము అచేతనమని అదియే చేయును చేయించును. అతనికంటే పరుడు క్షేత్రవిత్తు. ఇతనే ఏడులోకములను ప్రవర్తింపచేయును. దేహము భిన్నమైనను జీవనాశము జరుగదు. ఇదియంతయు మిథ్య అని అజ్ఞానులందురు. జీవుడు దేహమున అంతరముగానుండును. జీవునకు అయిదు శరీర భేదములుండును. ఇట్లు జీవుడు అన్ని ప్రాణులలో గూఢముగా సంచరించుచుండును. తత్త్వదర్శులు మాత్రమే ఉత్తమమగు సూక్ష్మబుద్ధిచే గ్రహించగలరు. జ్ఞాని పుర్వాపరరాత్రులందు యోగముచో ఆహారమును పొంది విశుద్ధమైన మనస్సు కలవారై ఆత్మదర్శనమును చేయగలరు. చిత్త ప్రసాదముచే శుభాశుభ కర్మలను వదిలి ఆత్మలో ప్రసన్న మనస్కునిగా ఉండి అనంతమైన సుఖమును పొందును. శరీరములందుండు మానసాగ్నియే జీవుడని పిలువబడును. భూతాధ్యాత్మనిశ్చయము కొఱకు ప్రజాపతి చేసిన సృష్టి ఇది. ప్రజాపతియగు బ్రహ్మ మొదట బ్రాహ్మణులనే సృజించెను. వారందరు బ్రహ్మతేజస్సును నింపుకొని భాస్కరాగ్ని సమతేజస్కులు గా నుండిరి. తరువాత స్వర్గము కొఱకు సత్యధర్మములను, ఆచారమును, శౌచమును సృజించెను. తరువాత దేవదానవ గంధర్వదైత్యాసుర మహారగులు, యక్షులు, రాక్షసులు, నాగులు, పిశాచములు, మానవులు బ్రాహ్మణ క్షత్రియవైశ్య శూద్రులు సృజించబడిరి.
భరద్వాజ ఉవాచ :-
చాతుర్వర్ణ్యస్య వర్ణేన యది వర్ణో విభిద్యతే. 53
స్వేదమూత్రపురీషాణి శ్లేష్మా పిత్తం సశోణితమ్, త్వన్వః క్షరతి సర్వేషాం కస్మాద్వర్ణో విభజ్యతే. 54
జంగమానామసంఖ్యేయా స్థావరాణాం చ జాతయః, తేషాం వివిధ వర్ణానాం కుతో వర్ణవినిశ్చయః. 55
భరద్వాజ మహర్షి పలికెను :- వర్ణముతో చాతుర్వర్ణ్యములని వర్ణభేదమును చేయుచున్నరు. స్వేదము, మూత్రము, పురీషము, శ్లేష్మ, పిత్తము, రక్తము ఇవి అందరిలో సమముగా ప్రవహించుచుండును. అయినపుడు వర్ణ విభాగమెందులకు? స్థావర జంగములు అసంఖ్యేయములుగా నున్నవి. వాటిలో జాతులు అసంఖ్యేయములుగా నున్నవి. వాటిలో వర్ణనిశ్చయమెట్లు చేయుదురు? 53 - 55
భృగురువాచ :-
న విశేషో7స్తి వర్ణానాం సర్వం బ్రహ్మమయం జగత్, బ్రహ్మణా పూర్వసృష్టం హి కర్మణా వర్ణతాం గతమ్. 56
కామభోగాః ప్రియాస్తీక్షాః క్రోధతా ప్రియసాహసాః, త్యక్తస్వకర్మరక్తాంగాస్తే ద్విజాః క్షత్రతాం గతాః. 57
గోభ్యో వృత్తిం సమాస్థాయ పీతాః కృష్యుపజీవినః, స్వధర్మాన్నాను తిష్ఠన్తి తే ద్విజా వైశ్యతాం గతాః. 58
హింసానృతపరా లుబ్దాస్సర్వకర్మోపజీవినః, కృష్ణాశ్శౌచపరిభ్రష్ఠాస్తే ద్విజాశ్శూద్రతాం గతాః. 59
ఇత్యేతైః కర్మభిర్వ్యాప్తా ద్విజా వర్ణాన్తరం గతాః, బ్రహ్మణా ధర్మతంత్రస్థాస్తపస్తేషాం న నశ్యతి. 60
బ్రహ్మధారయతాం నిత్యం వ్రతాని నియమాంస్తథా, బ్రహ్మ చైవ పురా సృష్టం మే న జానన్తి తద్విదః. 61
తేషాం బహువిధాస్త్వనాస్తత్ర తత్ర ద్విజాతయః, పిశాచా రాక్షసా ప్రేతా వివిధా వ్లుెచ్ఛజాతయః. 62
సా సృష్టిర్మానసీ నామ ధర్మతంత్రపరాయణా. 63
భృగు మహర్షి పలికెను :- వర్ణములలో విశేషమేమియును లేదు. ఈ జగత్తంతయు బ్రహ్మమయమే. బ్రహ్మ సృష్టించిన ప్రాణులు వారి కర్మలచే వర్ణములను పొందిరి. కామ భోగములు కలవారు, పీతిపాత్రులు, కఠినులు, కోపముకలరు, సాహసప్రియులు, స్వకర్మలను వదిలిన రక్తవర్ణము కల ద్విజులు క్షత్రియులైరి. గోపోషణము వృత్తిగా స్వీకరించి వ్యవసాయమును చేయుచు వచ్చినవారై తమ ధర్మములను అనుష్ఠించని ద్విజులు వైశ్యులుగా మారిరి. హింసను అసత్యమును స్వీకరించి లోభులు అన్నికర్మలచే బ్రతుకును సాగదీయుచు నల్లవారై శౌచ పరిభ్రష్టులైన ద్విజులు శూద్రులైరి. ఇట్లు ఆయా కర్మలచే ద్విజులే ఆయా వర్ణములను పొందిరి. ధర్మశాస్త్రమును అనుసరించిన వారు బ్రాహ్మణులు వారికి తపస్సు ఎప్పుడూ నశించదు. నిత్యము పరబ్రహ్మను వ్రతములను నియమములను ధరించువారు బ్రహ్మణులు. వీరినే బ్రహ్మ మొదట సృష్టించెనని జ్ఞానులు తెలియుదురు. ఈ ద్విజులే ఆయా ప్రదేశములలో బహు విధములుగా మారిరి. పిశాచులు, రాక్షసులు, ప్రేతలు, పలు వ్లుెచ్ఛ జాతులుగా నుండిరి. ఈ సృష్టి బ్రహ్మమనసు నుండి ఏర్పడినది. ధర్మమునాధారముగా చేసుకొనినది. 56 - 63
భృగురువాచ :-
బ్రాహ్మణః కేన భవతి క్షత్రియో వా ద్విజోత్తమ, వైశ్యశ్శూద్రశ్చ విప్రర్షే తద్భ్రూహి వదతాం వర! 64
భరద్వాజ మహర్షి పలికెను :- ఏ కర్మచే బ్రాహ్మణులగుదురు? ఏ కర్మచే క్షత్రియులు వైశ్యులు శూద్రులు గా మారుదురో తెలుపుము. 64
భృగురువాచ :-
జాతకర్మాదిభిర్యస్తు సంస్కారైస్సంస్కృతశ్శుచిః, వేదాధ్యయనసంపన్నో బ్రహ్మకర్మస్వవస్థితః. 65
శౌచాచారస్థితస్సమ్యగ్విద్యాభ్యాసీ గురుప్రియః, నిత్యవ్రతీ సత్యపరస్స వై బ్రహ్మణ ఉచ్యతే. 66
సత్యదానమథో7ద్రోహ ఆనృశంస్యం కృపా ఘృణా, తపస్యాం దృశ్యతే యత్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః. 67
క్షత్రజం సేవతే కర్మ వేదాధ్యయనసంగతః, దానాదానరతిర్యస్తు స వై క్షత్రియ ఉచ్యతే. 68
విశత్యాశు పశుభ్యస్తు కృష్యాదానరతిశ్శుచిః, వేదాధ్యయనసంపన్నస్స వైశ్య ఇతి సంజ్ఞితః. 69
సర్వభక్షరతిర్నిత్యం సర్వకర్మకరో7శుచిః, త్యక్తవేదస్త్వనాచారస్స వై శూద్ర ఇతి స్మృతః. 70
శూద్రే చైతద్ఖవేలక్ష్మ ద్విజే తచ్చ న విద్యతే, న వై శూద్రో భ##వేచ్ఛూద్రో బ్రాహ్మణో బ్రాహ్మణో న చ. 71
సర్వోపాయైస్తు లోభస్య క్రోధస్య చ వినిగ్రహః, ఏతత్పవిత్రం జ్ఞానానాం తథా చైవాత్మసంయమః. 72
వర్జ్యౌ సర్వాత్మనా తౌ హి శ్రేయోఘాతార్ధముద్యతౌ, నిత్యక్రోధాచ్ఛ్రియం రక్షేత్ తపో రక్షేత్తు మత్సరాత్. 73
విద్యాం మానాపమానాభ్యాం ఆత్మానం తు ప్రమాదతః. 74
యస్య సర్వే సమారంభా నిరాశీర్బంధనా ద్విజ, త్యాగే యస్య హుచితం సర్వం స త్యాగీ స చ బుద్దిమాన్ 75
అహింస్రస్సర్వభూతానాం మైత్రాయణగతశ్చరేత్, పరిగ్రహాత్పరిత్యజ్య భ##వేద్బుద్ధ్యా జితేంద్రియః. 76
అశోకస్థానమాతిష్టేత్ ఇహ చాముత్ర చాభయమ్, తపో నిత్యేన దాంతేన మునినా సంయతాత్మనా. 77
అజితం జేతుకామేన వ్యాసంగేషు హ్యసంగినా, ఇంద్రియైర్గృహ్యతే యద్యత్తత్తద్వ్యక్తమితి స్థితిః. 78
అవ్యక్తమితి విజ్ఞేయం లింగగ్రాహ్యమతీంద్రియమ్, అవిశ్రంభేణ మంతవ్యం విశ్రంభే ధారయేన్మనః 79
మనః ప్రణన గృహ్ణీయాత్ప్రాణం బ్రహ్మణి ధారయేత్, నిర్వేదాదేవ నిర్వాణం న చ కంచిద్విచింతయేత్ 80
సుఖం వై బ్రాహ్మణో బ్రహ్మ నిర్వేదేనాధిగచ్ఛతి, శౌచే తు పతతం యుక్తస్సదాచారసమన్వితః 81
స్వనుక్రోశశ్చ భూతేషు తద్ద్విజాతిషు లక్షణమ్, సత్యవ్రతం తపశ్శౌచం పత్యం విసృతే ప్రజా 82
సత్యేన ధార్యతే లోకః స్వస్సత్యేనైన గచ్ఛతి, అనృతం తమసో రూపం తమసానీతేహ్యధః 83
తమోగ్రస్తా న పశ్యంతి ప్రకాశం తమసావృతాః, సుదుష్ట్ర కాశ ఇత్యాహుర్నరకం తమ ఏవ చ. 84
సత్యానృతం తదుభయం ప్రప్యతే జగతీచరైః, తత్రాప్యేవంవిధా లోకే వృత్తి సత్యానృతే భ##వేత్. 85
ధర్మాధర్మౌ ప్రకాశశ్చ తమో దుఃఖసుఖే తథా, శారీరైర్మానపైర్దుఃఖై సుఖైశ్చాప్యసుఖోదయైః 86
లోకసృష్టం ప్రపశ్యన్తో న ముహ్యంతి విచక్షణాః, తత్ర దుఃఖవిమోక్షార్ధం ప్రయతేత విచక్షణః. 87
సుఖం హ్యనిత్యం భూతానాం ఇహలోకే పరత్ర చ, రాహుగ్రస్తస్య సోమస్య యథా జ్యోత్స్నా న భాసతే. 88
తథా తమో7భిభూతానాం భూతానాం నశ్యతే సుఖమ్. 89
తత్ఖలు ద్వివిధం సుఖముచ్యతే. శరీరం మానసం చ.
ఇహ ఖల్వముష్మింశ్చ లోకే వస్తుప్రవృత్తయః సుఖార్ధమభిధీయన్తే.
నహీతఃపరత్రాపవర్గఫలాద్విశిష్టతరమస్తి.
స ఏవ కామ్యో గుణవిశేషో ధర్మార్ధగుణారంభః తద్దేతురస్యోత్పత్తిసుఖప్రయోజనార్ధమారంభాః. 90
భృగు మహర్షి పలికెను :- జాతకర్మాది సంస్కారములతో సంస్కరించబడి శుచియై వేదాధ్యయన సంపన్నుడై,, బ్రహ్మకర్మ నిష్ఠుడై, శౌచాచారములు కలవాడై చక్కగా విద్యాభ్యాసము చేయుచు, గురు ప్రియడై నిత్యము వ్రతపరుడై, సత్యపరుడైన వాడు బ్రాహ్మణుడనబడును. సత్యం, దానము, అద్రోహము, అక్రూరత్వము, దయ, జాలి, తపస్సు ఉన్నవాడు బ్రాహ్మణుడనబడును. క్షత్రియ కర్మలను సేవించుచు, వేదాధ్యయనమును చేయుచు దానము నందు ఆదానమునందు ప్రీతి కలవాడు క్షత్రియుడనబడును. పశు పోషణము చేయుచు వ్యవసాయము నందు ప్రీతికలవాడై పవిత్రుడై, వేదాధ్యయన సంపన్నుడు వైశ్యుడనబడును. అన్నిటిని భక్షించుటలో ప్రీతి కలవాడు, అన్నిపనులను చేయుచు అశుచియై వేదాధ్యయమమును వదిలి ఆచార శూన్యుడు శూద్రుడనబడును. పైన చెప్పిబడిన లక్షణములు శూద్రుని గుర్తింప చేయు ఈ లక్షణములు ద్విజునిలో కనపడవు. ఆయాకర్మలననుసరించియే బ్రహ్మణత్వాదులను నిర్ణయించవలయును కాని శూద్రుడు శూద్రుడే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే అని వంశమున జన్మించిన మాత్రమున చెప్పరాదు. అన్ని ప్రయత్నములచే క్రోధలోభములను నిగ్రహించుటయే జ్ఞానములలో ఉత్తమ జ్ఞానము. అట్లే మనో నిగ్రహమును అలవరుచుకొనవలయును. శ్రేయస్సును భంగపరుచు క్రోధలోభములను అన్నివిదములుగా వదలవలయును. కోపమునుండి సంపదను, మాత్సర్యము నుండి తపస్సును కాపాడుకొనవలయును, మానావమానములనుండి విద్యను, ప్రమాదమునుండి ఆత్మను రక్షించుకొనవలయును. ఆశా బంధరహితములగు ప్రయత్నములు కలవాడు, సర్వమును త్యాగమున అర్పించువాడు మాత్రమే నిజమగు త్యాగి, బుద్ధిమంతుడు, అన్నిభూతముల విషయమున హింసను వదిలి స్నేహముతో ప్రవర్తించవలయును. పరిగ్రహమును విడిచి జితేంద్రియుడు కావలయును. ఇహపరలోకములలో శోకరహిత స్థితిని సాధించవలయును. అట్లు సాధించులకు నిత్యతపము, ఇంద్రియనిగ్రహము, మౌనము, మనోనిగ్రహములు ముఖ్యోపాయములు. జయించశక్యము కాని మనసును జయించకోరువాడు విషయసంగమును పరిత్యజంచవలయును. ఇంద్రియములచే గ్రహించబడునదంతయు వ్యక్తమనబడును. అతీంద్రియము లింగమాత్రగ్రాహ్యము అవ్యక్తమనబడును. విశ్రంభము (తొట్రుపాటు) లేక మననము చేయవలయును. తొట్రుపడు మనసును నిగ్రహించవలయును. ప్రాణముతో మనసును నిగ్రహించవలయును. ప్రాణమును పరబ్రహ్మలో నిలుపవలయును. వైరాగ్యము వలననే ఆనందము లభించును. దేనిని గూర్చి చింతించరాదు. బ్రాహ్మణుడు వైరాగ్యము చేతనే ఆనందమును పొందగలడు. ఎపుడూ శౌచాచారములు కలవాడై అన్నిప్రాణులయందు దయ కలిగి యుండుట ద్విజ లక్షణము. సత్యవ్రతమే తపస్సు, సత్యమే శౌచము. సత్యము వల్లనే సృష్టి జరుగుచున్నది. సత్యము చేతనే లోకము ధరించబడుచున్నది. సత్యము చేతనే స్వర్గమును పొందగలడు. అసత్యము తమో రూపము. తమస్సుచే పతితుడగును. తమోగ్రస్తులై తమస్సుచే ఆవరించబడిన వారు ప్రకాశమును చూడజాలరు. ప్రకాశము ఏమాత్రము లేని తమస్సే నరకమనబడును. జగత్తును సంచరించు వారు సత్యాసత్యముల నాశ్రయింతురు. లోకవృత్తి కూడా సత్యానృతములలో నుండును. ధర్మాధర్మములు, ప్రకాశతమములు సుఖదుఃఖములు శారీరిక మానసిక దుఃఖములు, దుఃఖములను కలిగించు సుఖములు వీటితో లోకప్రవృత్తిని చూచువారు మోహములో పడరు. వివేకము కలవాడు దుఃఖమోక్షము కొఱకు ప్రయత్నించ వలయును. ప్రాణులకు ఇహపరములలో సుఖము అనిత్యమే. గ్రహణము పట్టిన చంద్రుని వెన్నెల ప్రకాశించనట్లు తమోగ్రస్తులగు ప్రాణులకు సుఖము ప్రకాశించదు. సుఖము శారీరము మానసమని రెండు విధములు. ఇహపరములందు వస్తు ప్రవృత్తులు సుఖము కొఱకే చెప్పబడినవి. ఇహపరములలో కూడా అపవర్గము కంటే విశిష్టమైనది లేదు. ఆ అపవర్గమే కోరదగిన గుణ విశేషము. ధర్మాచరణము అపవర్గహేతువు. అన్నిప్రయత్నములు సుఖమును పొందుటకొఱకే కొనసాగుచుండును. 65 - 90
భరద్వాజ ఉవాచ :-
వదైతద్భవతాభిహితం సుఖానాం పరమా స్థితిరితి. 91
న తదుపగృహ్ణీమో న హ్యేషామృషీణాం మహతి స్థితానాం. 92
అప్రాప్య ఏష కామ్యగుణవిశేషో న చైనమభిశీలయంతి. తపసి శ్రేయతే త్రిలోకకృద్బ్రహ్మ ప్రభురేకాకీతిష్ఠతి.
బ్రహ్మచారీ న కామసుఖేష్వాత్మానమవదధాతి. 93
అపి చ భగవాన్విశ్వేశ్వర ఉమాపతిః కామమభివర్తమానమనంగత్వేన సమమనయత్. 94
తస్మాద్భూమౌ న తు మహాత్మాభిరంజయతి గృహీతో న త్వేష తావద్విశిష్టో గుణవిశేష ఇతి. 95
నైతద్భగవతః ప్రత్యేమి భవతా తూక్తం సుఖానాం, పరమాస్త్స్రియ ఇతి లోకప్రవాదో హి ద్వివిధః. 96
ఫలోదయస్సుకృతాత్సుఖమవాప్యతే7న్యధా దుఃఖమితి. 97
భరద్వాజ మహర్షి పలికెను :- సుఖములకే ఉత్తమ స్థితి యని మీరు చెప్పి యుంటిరి. కాని దానిని మేము అంగీకరించుట లేదు. మహర్లోకమున నున్న ఋషులకు సుఖమను ఈ కామ్య గుణ విశేషము పొందకూడనిదిగా చెప్పబడియున్నది. ఋషులు ఈ సుఖమును కోరుటలేదు. తపోలోకమున మూడు లోకములను సృజించిన బ్రహ్మ ప్రభువు ఒంటరిగా ఉండెనని వినుచుంటిమి. బ్రహ్మచారిగా ఉండెను. కామ సుఖములయందు తనను తాను నియోగించుకొనలేదు మరియు పూజ్యుడగు శివుడు తనలో కామమును కలిగించగోరు మన్మధుని అనంగునిగా చేసెను. కావున భూలోకమున కూడా మహానుభావులు సుఖముచే ఆనందించుటలేదు. అంతేకాదు. సుఖము విశిష్ట గుణమని కూడా గ్రహించబడలేదు మరియు సుఖమునకు పరమావధి స్త్రీలు అని. కాని లోకమున వ్యవహారము రెండు విధములుగా నున్నది. సుకృతము వలన ఫలదయమైన సుఖము లభించును, లేనిచో దుఃఖము కలుగును అని. 91 - 97
భృగురువాచ :-
అత్రోచ్యతే అనృతాత్ఖలు తమః ప్రాదుర్భూతమ్. తతస్తమోగ్రస్తా అధర్మమేవానువర్తంతే.
న ధర్మం క్రోధలోభమోహమీ మాంసానృతాదిభిరవచ్ఛనన్నాః ఖల్వస్మింల్లోకే నాముత్ర సుఖమాప్నువంతి.
వివిధవ్యాధిరుజోపతాపైరవకీర్యన్తే. వధబంధనపరిక్తేశాదిభిశ్చ క్షుత్పిపాసాశ్రమకృతైరుపతా పైరుపతప్యన్తే.
వర్షవాతాత్యుష్ణశీతకృతైశ్చ ప్రతిభ##యైః శరీరదుఃఖైరుపతప్యన్తే బంధుధనవినాశవిప్రయోగకృతైశ్చ
మానపైశ్శోకై రభిభూయంతే జరామృత్యు కృతైశ్చాన్యైరితి యస్వేతైః. 98
శారీరం మానసం నాస్తి న జరా నచ పాతకమ్, నిత్యమేవ సుఖం స్వర్గే సుఖం దుఃఖమహో భయమ్. 99
నరకే దుఃఖమేవాహుస్సుఖం తత్పరమం పదమ్, పృథివీ సర్వభూతానాం జనిత్రీ తద్విధా స్త్స్రియమ్. 100
పుమాన్ప్రజాపతిస్తత్ర శుక్రం తేజోమయం విదుః, ఇత్యేతల్లోకనిర్మాతా ధర్మస్య చరితస్య చ. 101
తపసశ్చ సుతప్తస్య స్వాధ్యాయస్య హుతస్య చ, హుతేన శామ్యతే పాపం స్వాధ్యాయే శాంతిరుత్తమా. 102
దానేన భోగానిత్యాహుస్తపసా స్వర్యమాప్నుయాత్, దానం తు ద్వివిధం ప్రోక్తం పరత్రార్థమి హైవ చ. 103
సద్భ్యో యద్దీయతే కించిత్ తత్పరత్రోపతిష్ఠతే, అసద్భ్యో దీయతే యత్తు తద్దానమిహ భుజ్యతే. 104
యాదృశం దీయతే దానం తాదృశం ఫలమశ్నుతే. 105
భృగు మహర్షి పలికెను :- అసత్యమునుండి తమస్సు పుట్టినది. ఆ తమస్సుచే ఆవరించబడినవారు అధర్మమునే అనుసరింతురు. ధర్మముననుసరించరు. క్రోధలోభమోహ మీమాంసాఅనృతాదులచే కప్పబడినవారు ఇహమున పరమున సుఖమును పొందలేరు. పలు విధములగు వ్యాధులచే బాధలచే కలిగిన ఉపతాపములతో ఆవరించబడుదురు. చంపుట, బంధించుట, కష్టములు, ఆకలి దప్పులు, పరిశ్రమ మొదలగు వాటిచే తపించెదరు. వర్షము, గాలి, అత్యుష్ణము, అతిశీతము మొదలగు భయములచే శరీర దుఃఖములచే బాధపడుదురు. బంధనాలవినాశము తడబాటు మొదలగు మానసిక దుఃఖములచే కృశింతురు, జరా మృత్యువు మొదలగు ఇతర దుఃఖములచే ఆక్రమించబడుదురు. స్వర్గమున శారీక మానస దుఃఖములుండవు. ముసలితనము, పాపములండవు. నిత్యము సుఖమే యుండును. అన్నిప్రాణులకు జన్మనిచ్చునది పృథివి. స్త్రీ అట్టిదే. పురుషుడు ప్రజాపతి. శుక్రుము తేజో మయము. ఇదియే ధర్మమునకు చరితమునకు లోకనియమము. చక్కగా తపము నాచరించుట స్వాధ్యాయము హోమము. ఇవియే ధర్మచరిత్ర నియమములు. హోమముచే పాపము శమించును. స్వాధ్యాయముచే శాంతి కలుగును. దానమువలన భోగములు లభించును. తపముచే స్వర్గము లభించును. దానము రెండు విధములు. పరలోకార్థము ఇహలోకార్థము అని సత్పాత్రదానము కొంచమైనను పరలోకము ఫలించును. అసత్పాత్రదానము ఇహలోకమున ఫలించును. దానానుగుణమగు ఫలమే లభించును. 98 - 105
భరద్వాజ ఉవాచ :-
కిం కస్య ధర్మాచరణం కిం వా ధర్మస్య లక్షణమ్, ధర్మః కతివిధో వాపి తద్భవాన్వక్తుమర్హతి. 106
భరద్వాజ మహర్షి పలికెను :- ఎవరు ఏ ధర్మమునాచరించవలయును? ధర్మమునకు లక్షణమేమి? ధర్మమెన్ని విధములు? దీనినంతటిని తెలుప ప్రార్థన. 106
భృగురువాచ :-
స్వధర్మాచరణ యుక్తా యే భవన్తి మనీషిణః, తేషాం స్వర్గఫలావాప్తిర్యో7న్యధా స విముహ్యతే. 107
భృగు మహర్షి పలికెను :- స్వధర్మము నాచరించు బుద్ధిమంతులను స్వర్గము లభించును లేని యెడల వారు మోహపాశ బద్ధులగుదురు. 107
భరద్వాజ ఉవాచ:-
యదేతచ్చాతురాశ్రమ్యం బ్రహర్షివిహితం పురా, తేషాం స్వే స్వే సమాచారాస్తన్మే వక్తుమిహార్హసి. 108
భరద్వాజ మహర్షి పలికెను :- బ్రహర్షి విహితములైన నాలుగాశ్రమములో ఏయే ఆశ్రమముల వారు ఏ ధర్ములనాచరించవలయునో తెలుపుడు.
భృగురువాచ :-
పూర్వమేవ భగవతా బ్రహ్మణా లోకహితమనుతిష్ఠతా, ధర్మసంరక్షణార్థమాశ్రమాశ్చత్వారో7భినిర్దిష్టాః. 109
తత్ర గురుకులనాపమేవ ప్రథమమాశ్రమమాహరన్తి, సమ్యగత్ర శౌచసంస్కారనియమవ్రతవినియతాత్మా,
ఉభే సంధ్యే భాస్కరాగ్నిదైవతాన్యుపస్థాయ విహాయ తద్ధ్యాలస్యం గురోరభివాదనవేదాభ్యాసశ్రవణ పవిత్రీ
కృతాంతరాత్మా త్రివణముపస్పృశ్య బ్రహ్మచార్యగ్నిపరిచరణగురుశుశ్రూషానిత్యభిక్షాభైక్ష్యాదిసర్వ వివేదితాంతరాత్మా
గురువచననిదేశానుష్ఠానాప్రతికూలో గురుప్రసాదలబ్దస్వాధ్యాయతత్పరః స్యాత్ భవతి చాత్ర శ్లోకః. 110
గురుం యస్తు సమారాధ్య ద్విజో వేదమవాప్నుయాత్, తస్య స్వర్గఫలావాప్తిః సిద్ధ్యతే చాస్య మానసమ్. 111
ఇతి గార్హస్థ్యం ఖలు ద్వితీయమాశ్రమమం వదన్తి. 112
తస్య సదాచారలక్షణం సర్వమననువ్యాఖ్యాస్యామః,
సమావృతానాం సదాచారాణాం సహధర్మచర్యఫలార్థినాంగృహాశ్రమో విధీయతే. 113
ధర్మార్థకామావాప్తిర్హ్యత్ర త్రివర్గసాధనమపేక్ష్య అగర్హితకర్మణా ధనాన్యాదాయ స్వాధ్యాయోపలబ్ధ
ప్రకర్షేణ వా బ్రహ్మర్షినిర్మితేన వా అద్భిస్సాగరగతేన వా ద్రవ్యనియమాభ్యాసదైవతప్రాసాదోపలబ్ధేన వా ధనేన గృహస్థో గార్హస్థ్యం వర్తయేత్. 114
తద్ది సర్వాశ్రమాణాం మూలముదాహరన్తి గురుకులవాసినః పరివ్రాజకా యే7న్యే సంకల్పితవ్రతనియమ
ధర్మానుష్ఠానినస్తేషామప్యంతరా చ భిక్షాబలిసంవిభాగాః ప్రవర్తంతే. 115
వానప్రస్థానం చ ద్రవ్యోపస్కార ఇతి ప్రయశః ఖల్వేతే సాధవః సాధుపధ్యోదనాస్స్వాధ్యాయ ప్రసంగి స్తీర్థాభిగమనదేశదర్శనార్ధం పృథివీం పర్యటన్తి. 116
తేషాం ప్రత్యుత్థానాభిగమనమనసూయావాక్యదానసుఖ సత్కారాసనసుఖశయనాభ్యవహారసత్క్రియా చేతి.
భవతి చాత్ర శ్లోకః. 117
అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే, స దత్వా దుష్క్రతం తసై#్మ పుణ్యమాదాయ గచ్ఛతి. 118
అపి చాత్ర యజ్ఞక్రయిభిర్ధేవతాః ప్రీయంతే, నివాపేన పితరో విద్యాభ్యాసశ్రవణధరణన ఋషయ అపత్యోత్పాదనేన ప్రజాపతిరితి. శ్లోకౌ చాత్ర భవతః. 119
వాత్సల్యాస్సర్వభూతేభ్యో వాయోశ్రోత్రస్తథా గిరా, పరితాపోపఘాతశ్చ పారుష్యం చాత్ర గర్హితమ్. 120
అవజ్ఞానమహంకారో దంభ##శ్చైవ విగర్హితః, అహింసా సత్యమక్రోధం సర్వాశ్రమగతం తపః. 121
అపి చాత్ర మాల్యాభరణవస్త్రాభ్యంగనిత్యోపభెగనృత్యగీతవాదిత్రశ్రుతిసుఖనయనస్నేహరామా
దర్శనానాం ప్రాప్తిర్భక్ష్యబోజ్యలేహ్యపేయచోష్యాణామభ్యవహార్యాణాం వివిధానాముపభోగః. 122
స్వవిహారసంతోషః కామసుఖావాప్తిరితి. 123
త్రివర్గగుణనిర్వృత్తిర్యస్య నిత్యం గృహాశ్రమే, స సుఖాన్యనుభూయేహ శిష్టానాం గతిమాప్నుయాత్. 124
ఉంఛవృత్తిర్గృహస్థో యస్స్వధర్మాచరణ రతః, త్యక్తకామసుఖారంభస్స్వర్గస్తస్య న దుర్లభః. 125
వానప్రస్థాః ఖల్వపి ధర్మమనుసరంతః పుణ్యాని తీర్థాని నదీప్రస్రవణాని స్వభ##క్తేష్వరణ్యషు మృగవరాహమహిష శార్దూలవనగజాకీర్ణేషు తపస్యంతే అనుసంచరంతి. 126
త్యక్తగ్రమ్యవస్త్రాభ్యవహారోపభోగా వన్యౌషధిఫలమూలపర్ణపరిమితవిచిత్రనియతిహారాస్థానాసనిచో
భూపాషాణసికతాశర్కరావాలుకాభస్మశాయినః కాశకుశచర్మవల్కలసంవృతాంగాః కేశశ్శశ్రునఖరోమ
ధారిణో నియతకాలోపస్పర్వనాః శుష్కబలిహామకాలానుష్ఠాయినః, సమిత్కుశకుసుమాపభారసంమార్జన
లబ్దవిశ్రామాః శీతోష్ణపవనవిష్టమ్భవిభిన్నసర్వత్వచో వివిధనియమయోగచర్యానుష్ఠానవిహితపరిశుష్క
మాంసశోణితత్వగస్థిభూతాధృతిపరా న్సత్వయోగాచ్ఛరీరాణ్యుద్వహంతే. 127
యస్త్వేతాం నియతచర్యాం బ్రహ్మర్షివిహితాం చరేత్, స దహేదగ్నివద్ధోషాఞ్జయేల్లోకాంశ్చ దుర్జయాన్ 128
పరివ్రాజకానాం పునరాచారాస్తద్యథా. విముచ్యాగ్నిం ధనకలత్రపరిబర్హసంగేషకవాత్వనం స్నేహపాశానవ
ధూయ పరివ్రజంతి. సమలోష్టాశ్మకాంచనాస్త్రివర్గప్రవృత్తేష్వసక్తబుద్ధయః. 129
అరిమిత్రోదాసీనానాం తుల్యదర్శనాః స్థావరజరాయుజాండజ ప్వేదజానాం భూతానాం వాజ్మనః కర్మభి రనభి
ద్రోహిణో7నికేతాః సర్వతపులినవృక్షమూలదేవాయతనాన్యనుసంచరన్తో వా సార్ధము పేయుర్న గరం,
గ్రామం వా న క్రోధదర్పలోభమోహకార్పణ్యదంభపరివాదాభిమాననిర్వృత్కతహింసా ఇతి. భవంతి చాత్రశ్లోకాః. 130
అభయం సర్వభూతేభ్యోదత్త్వా యశ్చరతే మునిః, న తస్య సర్వభూతేభ్యో భయముత్పద్యతే క్వచిత్. 131
కృత్వాగ్నిహోత్రస్వశరీరసంసథం శరీరమగ్నిం స్వముఖే జుహోతి, విప్రస్తు భైక్షోపగతైర్హవిర్భిశ్చితాగ్నినా సంవ్రజతె హి లోకాన్. 132
మోక్షాశ్రమం యశ్చరతు యదోక్తం శుచిస్స్వసంకల్పితయుక్తబుద్ధిః,
అనింధనం జ్యోతిరివ ప్రశాన్తం స బ్రహ్మలోకం శ్రయతే ద్విజాతిః. 133
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే
ద్వితీయపాదే భృగుభరద్వాజసంవాదే
బ్రాహ్మణాచార నిరూపణం నామ
త్రివత్పారింశో7ధ్యాయః
భృగు మహర్షి పలికెను :- పూర్వకాలముననే లోకహితమును చేయదలచిన బ్రహ్ ధర్మసంరక్షణము కొఱకు నాలుగాశ్రమములను నిర్ధేశించెను. ఆ నాలుగాశ్రమములలో గురుకులవాసము మొదటి ఆశ్రమమని చెప్పుచున్నారు. ఈ గురుకులవాసమున చక్కగా శౌచసంస్కార నియమవ్రతములచే మనసును నిగ్రహించి ఉభయ సంధ్యలందు సూర్యాగ్నులను ఆరాధించి సోమరితమును ఆలస్యమును విడిచి గురువునకు అభివాదము చేయుచు, వేదాభ్యాసముచే, శ్రవణముచే అంతరాత్మను పవిత్రము చేసుకొని మూడువేళలలో స్నానాదికములను నిర్వర్తించి, బ్రహ్మచర్యమును అగ్నిపరిచర్యను గురుశుశ్రూషను, నిత్యభిక్షాచరఱమును, భిక్షచే సంపాదించిన దానిని గురువునకు నివేదించి అంతరాత్మను గుర్వధీనముచేసి గురువు చెప్పిన మాటను ఆజ్ఞగా పరిపాలించు, వ్యతిరేకించకుండుటచే గుర్వనుగ్రహమును పొంది, అనుగ్రహముచే గురువు ఇచ్చిన స్వాధ్యాయమును అభ్యసించవలయును. ఈ విషయమున ఒక శ్లోకము కలదు. గురువునారాధించి వేదమును పొందిన వానికి స్వర్గ ఫలము లభించును, సిద్ధి లభించును అని ఆ శ్లోకమునకర్థము.
ఇక రెండవది గృహస్థాశ్రమము అని చెప్పెదరు. గృహస్థాశ్రమ సదాచారములను ఇపుడు చెప్పెదను. సదాచారము కలిగి సహధర్మాచరణ ఫలమును కోరువారి కొఱకు గృహస్థాశ్రమము విధించబడియున్నది. గృహస్థాశ్రమమున దర్మార్ధకామావాస్తిని త్రివర్గ సాధనమును అపేక్షించి సత్కర్మలచే ధనమును సంపాదించి స్వాధ్యాయము వలన పొందిన జ్ఞానముచే, బ్రమ్మర్షి నిర్మిత మార్గముచే కాని, సాగరజలములచే కాని, ద్రవ్యనియమాభ్యాసముచే దైవానుగ్రహముచే కాని పొందిన దనముచే గృహస్థులు గృహస్థాశ్రమమును కొనసాగించవలయును. గృహస్థాశ్రమమే అన్ని ఆశ్రమములకు మూలముగా పేర్కొందురు. గురుకులవాసులకు పరివ్రాజకులకు సంకల్పించిన వ్రత నియమ ధర్మానుష్ఠానములను చేయు ఇతరులకు భిక్షా బలి సంవిభాగము గృహస్థాశ్రమముననే చేయబడును. వానప్రస్థులకు కూడా ద్రవ్యోపస్కారమును చేయవలయును. సామాన్యముగా సాధువులు చక్కని పథ్యమైన ఆహారమును తీసుకొనుచు, స్వాధ్యాయప్రవచనమును చేయుచు తీర్థాభిగమనము కొఱకు పుణ్యక్షేత్ర దేశ దర్శనము కొఱకు భూమినంతయు పర్యటింతురు. అట్టి వారికి లేచి ఎదురేగి అభివామచరించి అపూయారహితముగా మాటలాడి ఆనందమును కలిగించు సత్కారములనాచరించి, ఆసనశయనాదులనేర్పరిచి చక్కని ఆహారమునొసంగి సన్మానించవలయును. ఈ విషయమున ఒక శ్లోకము కలదు. అతిధి నిరాశతో ఇంటినుండి వెడలినచో తన దుష్కృతమును గృహస్థున కొసంగి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళును అని శ్లోక భావము. ఈ గృహస్థాశ్రమమున యజ్ఞములచే దేవతలు, తర్పణముచే పితృదేవతలు, విద్యాభ్యాసశ్రవణధారణములచే ఋషులు, సంతానోత్పత్తిచే ప్రజాపతి ప్రీతి చెందెదరు. ఇచట రెండు శ్లోకములను చెప్పెదరు. సర్వభూతములయందు వాత్సల్యమును చూపవలయును. శ్రోత్రములచే దుర్భాషలను వినరాదు. వాక్కుచే పరుషముగా మాట్లాడరాదు, పరితాపమును పొందరాదు. ఎదుటివారిని బాధించరాదు. అవమానము అహంకారము, దంభము ఈ మూడు నింద్యములు. అహింసా, సత్యము, అక్రోధము, తపస్సు అనునవి నాలుగాశ్రమములలో నాచరించదగినవి మరియు ఈ గృహస్థాశ్రమమున మాల్యాభరణ వస్త్ర అభ్యంగన, నిత్యోపభోగ, నృత్యగీత వాద్యములచే చెవులకు నేత్రములకు ఆనందమును కలిగించుచు, ఆరామదర్శనాదులను చేయుచు, భక్ష్య భోజ్యలేహ్య పేయ చోష్యాది రసవంతములగు ఆహారమునను స్వీకరించుచు వివిధ భోగానుభవముండును. విహారముచే సంతోషము, కామ సుఖావాప్తి కూడా యుండును. గృహస్థాశ్రమమున త్రివర్గగుణములను నివృత్తి చేయువారు ఇహమున సుఖముల ననుభవించి పరమున సద్గతిని పొందుదురు. ఉంఛవృత్తి నవలంబించి స్వధర్మాచరణమును చేయుచు కామసుఖములను వదిలిన గృహస్థుడు సులభముగా స్వర్గమును పొందును.
వ్యాసప్రస్థాశ్రమమును స్వీకరించిన వారు కూడా ధర్మమును అనుసరించుచు, పుణ్యతీర్థములను, పుణ్యజలములను సేవించుచు, మృగ వరాహ మహిష శార్దూల వనగజాది సేవితమగు అరణ్యములలో తపస్సును చేయుచు సంచరించుచుండ వలయును. గ్రామ్యవస్త్రములను ఆహారమును పరిత్యజించి వన్యములగు ఓషధి ఫలమూల పర్ణాదులచే ఆహారనియమమును అభ్యసించి భూమిపై కూర్చొనుచు, పాషాణములపై, ఇసుకపై, గులకరాళ్ళపై. నదీరీరములందు, భస్మాదులయందు, ధూళిలో శయనించుచు కాశకుశ చర్మవల్కలాదులను వస్త్రములుగా ధరించుచు, కేశశ్మశ్రునఖ రోమాదులను ధరించి నియమబద్ధముగా కాలకృత్యములను, సంధ్యా బలిహోమాదులను అనుష్ఠించుచు, సమిధలను, పుష్పములను,జలములను సంగ్రహించుకొనుచు, సమ్మార్జమాదులచే తమ నివాసమును పవిత్రముగా నుంచుకొనుచు, విశ్రమించుచు చలి, వేడి, గాలి మొదలగు ప్రకృతి సహజమైన స్పర్శలకు చలించక, పలునియమములతో యోగానుష్ఠానముచే శరీరము నందలి మాంసాస్థి రక్త చర్మాదులను శుష్కింప చేయుచు ధైర్యము కలవారై సత్త్వయోగముచే శరీరమును ధరించియుందురు. ఇట్లు బ్రహ్మర్షులచే విధించబడిన నియమములనాచరించువారు అగ్నివలె పాపమును దహించి అన్నిలోకములను జయించును.
ఇక ఇపుడు సన్యాసాశ్రమాచారములను వివరించెదను. అగ్నిని పరిత్యజించి ధన భార్యాలింగనాది భోగములను వీడి సంసారమునందలి వ్యామోహమును త్రోసి పుచ్చి సన్యసించవలయును. బంగారమును మట్టిగడ్డను ఒకేవిధముగా చూచుచు త్రివర్గములయందు ఆసక్తులుకాక శత్రుమిత్ర ఉదాసీనుల విషయమున సమదృష్టిని ప్రదర్శించుచు అన్నివిధములగు ప్రాణులకు కరణత్రయముచే ద్రోహమునాచరించక స్థిరనివాసహీనులై పర్వత శిఖరములందు, వృక్షమూలములందు, దేవాలయములందు నివంసించుచు సంచరించుచు దారిలో కరపడిన గ్రామమును కాని నగరమును కాని వెళ్ళవలయును. కామక్రోధలోభమోహమదమత్సరములను, దైన్యదంభపరివాదములను, హింసను విడిచి యుండవలయును. ఈ విషయమున ఈ శ్లోకములను చెప్పెదరు. సర్వభూతములకభయము నిచ్చుచు చరించువానికి ఏ
ప్రాణి వలన భయము కలుగదు. అగ్నిని శరీరమున నిలిపి, శరీరమున గల అగ్నిని ముఖమున హోమము చేసి, భిక్షాటనము వలన లభించిన దానిని భుజించుచు అనగా ముఖమున నున్న అగ్ని కర్పించుచు, చితాగ్నిచే పరలోకములను చేరును. ఇట్లు సంకల్పబుద్ధిచే యథోక్తవిధిగా సన్యాసాశ్రమము నాచరించిన వారు ఇంధనములు లేని అగ్నివలె ప్రశాంతులై బ్రహ్మలోకమును చేరును. 109 - 133
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వాభాగమున ద్వితీయపాదమున
భృగుభరద్వాజ సంవాదమున బ్రాహ్మణాచార నిరూపణమును
నలుబది మూడవ అధ్యాయము సమాప్తము