Sri Naradapuranam-I
Chapters
Last Page
చతుశ్చత్వారింశో7ధ్యాయః = నలుబది నాలుగవ అధ్యాయము భృగుభరద్వాజసంవాదః భరద్వాజ ఉవాచ:- అస్మాల్లోకాత్పరో లోకః శ్రూయతే నోపలభ్యతే, తమహం జ్ఞాతుమిచ్ఛామి తద్భవాన్వక్తుమర్హతి. భరద్వాజ మహర్షి పలికెను :- ఈ లోకముకాక పరలోకము కలదని వినబడుచున్నది కాని కనపడుట లేదు. ఆ పరలోకమును గూర్చి తెలియగోరుచున్నాను. మీరు తెలియజేయుడు. 1 భృగురువాచ :- ఉత్తరే హమవత్పార్శే పుణ్య సర్వగుణాన్వితే, పుణ్యః క్షేమ్యశ్చ కామ్యశ్చ స పరో లోక ఉచ్యతే. 2 తత్ర హ్యపాపకర్మాణశ్శుచయో7త్యంతనిర్మలాః, లోభమోహపరిత్యక్తా మానవా నిరుపద్రవాః. 3 స స్వర్గసదృథశో దేశస్తత్ర హ్యుక్తాశ్శుభాగుణాః, కాలే మృత్యుః ప్రభవతి స్పృశంతి వ్యాధయో న చ. 4 న లోభః పరదారేషు స్వదారనిరతో జనః, నాన్యో హి వధ్యతే తత్ర ద్రవ్యేషు చ న విస్మయః. 5 పరో హ్యధర్మో నైనాస్తి సందేహో వాపి జాయతే, కృతస్య తు ఫలం తత్ర ప్రత్యక్షముపలభ్యతే. 6 యానాశనాసనోపేతా ప్రసాదభవనాశ్రయాః, సర్వకామైర్వృతాః కేచిత్ హేమాభరణభూషితాః. 7 ప్రాణధారణమాత్రం తు కేషాంచిదుపపద్యతే, శ్రమేణ మహతా కేచిత్ కుర్వంతి ప్రాణధారణమ్. 8 ఇహ ధర్మపరాః కేచిత్కేచిన్నైష్కృతికా నరాః, సుఖితా దుఃఖితాః కేచిన్నిర్థనా ధనినో పరే. 9 ఇహ శ్రమో భయం మోహః క్షుధా తీవ్రా చ జాయతే, లోభశ్చార్థకృతాం నౄణాం యేన ముహ్యన్త్యపండితాః. 10 యస్తద్వేదోభయం ప్రజ్ఞః పాప్మనా న స లిప్యతే, సోపధే నికృతిః స్తేయం పరివాదో7భ్యసూయతే. 11 పరోపఘాతో హింసా చ పైశున్యమనృతం తథా, ఏతాన్సంసేవతే యస్తు తపస్తస్య ప్రహీయతే. 12 యస్త్వేతానాచరేద్విద్వాన్న తపస్తస్య వర్థతే, ఇహ చింతా బహువిధా ధర్మాధర్మస్య కర్మణః. 13 కర్మభూమిరియం లోకే ఇహ కృత్వా శుభాశుభమ్, శుభైశ్శుభమవవాప్నోతి తథా శుభమధాన్యథా. 14 ఇహ ప్రజాపతిః పూర్వాదేవాస్సర్షిగణాస్తథా, ఇష్టేష్టతపసః పూజా బ్రహ్మలోకముపాశ్రితాః. 15 ఉత్తరః పృథివీభాగః సర్వపుణ్యతమశ్శుభః, ఇహస్థాస్తత్ర జాయంతే యే వై పుణ్యకృతో జనాః. 16 యది సత్కారమిచ్ఛంతి తిర్యగ్యోనిషు చాపరే, క్షీణాయుషస్తథా చాన్యే నశ్యంతి పృథివీతలె. 17 అన్యోన్యభక్షణాసక్తా లోహమెహసమన్వితాః, ఇహైవ పరివర్తన్తే న చ యాన్త్యుత్తరాం దిశమ్. 18 గురూనుపాసతే యే తు నియతా బ్రహ్మచారిణః, పంథానం సర్వలోకానాం విజానన్తి మనీషిణః. 19 ఇత్యుక్తో7యం మయా ధర్మస్సంక్షిప్తో బ్రహ్మనిర్మితః, ధర్మాధర్మౌ హి లోకస్య వై వేత్తి స బుద్ధిమాన్. 20 భృగు మహర్షి పలికెను :- పవిత్రము సర్వ సుగుణయుక్తమగు హిమవత్పర్వతమునకు ఉత్తర భాగమున పుణ్యము క్షేమకరము, కామ్యప్రదమగునది పరలోకమని చెప్పబడును. ఆ పరలోకమున పాపకర్మరహితులు, పవిత్రులు అత్యంత పరిశుద్ధులు, లోభ##మెహములను పరిత్యజించినవారు. ఉపద్రవరహితులగు మానవులు నివసింతురు. ఆ ప్రదేశము స్వర్గసదృశము. అచట అన్ని శుభగుణములుండును. అచట సకాలమున మాత్రమే మృత్యువు ప్రాప్తించును. అచట వ్యాధి స్పర్శ ఉండదు. పరదారల యందు లోభముండదు. అచట జనమంతయు స్వదారనిరతులుగా నుందురు. ఇతరులెవ్వరూ వధించబడరు, ద్రవ్యకాంక్ష ఉండదు, అధర్మమే ఉండదు, సందేహములుండవు చేసిన పనులకు ప్రత్యక్షఫలమనుభవించబడును. అచటి జనులందరు వాహన ఆసన భోజన భవనాది భోగములు కలిగియుందురు. అన్ని కోరికలు తీర్చుకొనువారు, కొందరు హేమాభరణ భూషితులుందురు. కొందరు మాత్రము ప్రాణధారణ మాత్రమునే చేతురు. మరికొందరు చాలా ప్రయాసచే ప్రాణధారణ చేయుదురు. ఈ లోకమున కొందరు ధర్మపరులు, కొందరు అధర్మపరులుగా నుందురు. కొందరు సుఖితులు కొందరు దుఃఖితులు, కొందరు ధనవంతులు, కొందరు నిర్థనులుందురు. ఈ లోకమున శ్రమ, భయము, మోహము, తీవ్రమైన ఆకలి ఉండును. అర్థవిషయమున లోభముచే ఆజ్ఞానులు మోహపరవశులగుదురు. ఈ రెండు లోకములను గూర్చి తెలిసిన ప్రాజ్ఞుడు పాపములనంటడు, అపకారము, చౌర్యము, అపవాదము, అసూయ, పరోపఘాతము, హింస, లోభము అనృతము వీటిని సేవించువారి తపస్సు క్షీణించును. వీటినాచరించని వారి తపస్సు వృద్ధి చెందును. ఈ లోకమున ధర్మాధర్మకర్మల చింత పలు విధములుగా నుండును. ఇది కర్మభూమి. ఈ లోకమున శుభాశుభకర్మలనాచరించి శుభకర్మలకు శుభపలితమును, అశుభకర్మలకు, అశుభఫలములను పొందును. ఈ లోకమున ప్రజాపతి దేవతలు ఋషులు పూర్వమున యాగములను తపమునాచరించి బ్రహ్మలోకమును చేరిరి. ఈ పృథివి యొక్క ఉత్తర భాగము శుభము సర్వ పుణ్యమయము. ఇక్కడ పుణ్యమును చేసినవారు అక్కడ పుట్టెదరు. పాపమును చేసినవారు పశుపక్ష్యాదులలో జన్మింతురు. మరికొందరు అల్పాయుష్యము కలవారు ఈ లోకముననే నశింతురు. ఇచట ఒకరినొకరు భక్షించుచు లోభమోహయుక్తులై ఇచటనే తిరుగుచుందురు. ఉత్తర భాగమునకు వెళ్ళజాలరు. నియతులై బ్రహ్మచర్యముతో గురువులను సేవించు బుద్ధిమంతులు అన్నిలోకముల మార్గములను తెలియుదురు. ఇట్లు బ్రహ్మనిర్మితమైన ధర్మమును సంక్షేపముగా నీకు తెలిపితిని. లోకము యొక్క ధర్మాధర్మములను తెలిసినవాడు బుద్ధిమంతుడనబడును. 2 - 20 భరద్వాజ ఉవాచ :- అధ్యాత్మం నామ యదిదం పురుషస్యేహ చిన్త్యతే, యదధ్యాత్మం యథా చైతత్తన్మే బ్రూహి తపోధన! 21 భరద్వాజ మహర్షి పలికెను :- పురుషుని విషయమున అధ్యాత్మమని చెప్పబడుచున్నది కదా! అధ్యాత్మమనగా నేమి? దానినంతయూ విశదముగా తెలుపుము. 21 భృగురువాచ:- అధ్యాత్మమితి విప్రర్షే యదేతదనుపృచ్ఛసి, తద్వ్యాఖ్యాస్వామి తే తాత శ్రేయస్కరతమం సుఖమ్. 22 సృష్టిప్రళయసంయుక్తమాచార్యైః పరిదర్శితమ్, యజ్ జ్ఞాత్వా పురుషో లోకే ప్రీతిం సౌఖ్యం చ విందతి. 23 ఫలలాభశ్చ తస్య స్యాత్సర్వభూతహితం చ తత్, పృథివీవాయురాకాశమాపో జ్యోతిశ్చ పంచమమ్. 24 మహాభూతాదిభూతానాం సర్వేషాం ప్రభవాప్య¸°, యతస్సృష్టాని తత్రైవ తాని యాన్తి లయం పునః. 25 మహాభూతాని భూతేభ్యస్సాగరస్యోర్మయో యథా, ప్రస్యో చ యథాంగాని కూర్మస్సంహరతే పునః. 26 తద్వద్భూతాని భూతాత్మా సృష్టాని హరతే పునః, మహాభూతాని పంచైవ సర్వ భూతేషు భూతకృత్. 27 అకరోత్తేషు వై సమ్యక్ తం తు జీవో న పశ్యతి, శబ్దశ్శ్రోత్రం తథా ఖాని త్రయమాకాశయోనిజమ్. 28 వాయోస్స్పర్శస్తథా చేష్టా త్వక్చైవ త్రితయం స్మృతమ్, రూపం చక్షుస్తథా పాకస్త్రివిధం పాక ఉచ్యతే. 29 రసాః క్లేదశ్చ జిహ్వా చ త్రయో జలగుణాస్స్మృతాః, ఘ్రోయం ఘ్రాణం శరీరం చ ఏతే భూమిగుణాస్త్రయః. 30 మహాభూతాని పంచైవ షష్ఠం చ మన ఉచ్యతే, ఇంద్రియాణి మనశ్చైవ విజ్ఞాతాన్యస్య భారత. 31 సప్తమీ బుద్ధిరిత్యాహుః క్షేత్రజ్ఞః పునరష్టమః, శ్రోత్రం వై శ్రవణార్థాయ స్పర్శనాయ చ త్వక్స్మృతా. 32 రసాదానాయ రసనా గంధాదానాయ నాసికా, చక్షురాలోకనాయైవ సంశయం కురుతే మనః. 33 బుద్ధిరధ్యవసానాయ క్షేత్రజ్ఞస్సాక్షివత్థ్సితః, ఊర్ధ్వం పాదతలాభ్యాం యదవాక్చోదక్చ పశ్యతి. 34 ఏతేన సర్వమేవేదం విభునా వ్యాప్తమన్తరమ్, పురుషైరిన్ద్రియాణీహ వేదితవ్యాని కృత్స్నశః. 35 తమో రజశ్చసత్త్వం చ తే 7పి భావాస్తదాశ్రితాః, ఏతాం బుద్దిం నరో బుద్ధ్వా భూతానామగతం గతిమ్. 36 సమవేక్ష్య శ##నైశ్చైవం లభ##తే శమముత్తమమ్, గుణౖర్వినశ్యితే బుద్ధిర్భుద్ధేరేవిఏంద్రియాణ్యపి. 37 మనః పష్ఠాని భూతాని బుద్ధ్యభావే కుతో గుణాః, ఇతి తన్మయమోవైతత్ సర్వం స్థావరజంగమమ్. 38 ప్రలీయతే చోద్ధవతి తస్మాన్నిర్దిశ్యతే తథా, యేన పశ్యతి తచ్చక్షుశ్శణోతి శ్రోత్రముచ్యతే. 39 జిఘ్రతి ఘ్రాణమిత్యాహుః రసం జానాతి జిహ్వాయా, త్వచా స్పర్శయతి స్పర్శం బుద్దిర్విక్రియతే సకృత్. 40 యేన ప్రార్థయతే కించిత్తదా భవతి తన్మనః, అధిష్ఠానాత్తు బుద్ధేర్హి పృథగర్ధాని పంచథా. 41 ఇంద్రియాణీతి తాన్యాహుస్తాన్యదృవ్యో7ధితిష్ఠతి, పురుషే తిష్ఠతీ బుద్ధిస్త్రిఘ భావేషు వర్తతే. 42 కదాచిల్లభ##తే ప్రీతిం కదాచిదుపశోచతి, న సుఖేన న దుఃఖేన కదాచిదపి వర్తతే. 43 ఏవం నరాణం మనసి త్రిషు భావేషు వర్తతే, సేయం భావాత్మికా భావాంస్త్రీనేతాన్నాతివర్తతే. 44 సరితాం సాగరో భర్తా వేలానామివ వారిధిః, అతిభావగతా బుద్ధిర్భావైర్మనసి వర్తతే. 45 వర్తమానో మునిస్త్వేవం స్వభావమనువర్తతే, ఇంద్రియాణి సర్వాణి ప్రవర్తయతి సా సదా. 46. ప్రీతిస్సత్త్వం రజశ్శోకస్తమః క్రోధస్తు తే త్రయః, యే యే చ భావా లోకేస్మిన్సర్వేప్యేతేషు వై త్రిషు. 47 ఇతి బుద్దిగతాస్సర్వా వ్యాఖ్యాతాస్తవ భావనా, ఇంద్రయాణి చ సర్వాణి విజేతవ్యాని ధీమతా. 48 సత్త్వం రజస్తమశ్చైవ ప్రాణినాం సంశ్రితాస్సదా, త్రివిధా వేదనాశ్చైవ సర్వసత్త్వేషు దృశ్యతే. 49 సాత్త్వకీ రాజసీ చైవ తామసీ చేతి మానద, సుఖస్పర్శస్సత్త్వగుణో దుఃఖస్పర్శో రజోగుణః. 50 తమోగుణన సంయుక్తౌ భవతో వ్యావహారికౌ, తవ యత్ప్రీతిసంయుక్తం కాయే మనసి వా భ##వేత్. 51 వర్తతే సాత్త్వికో భావ ఇత్యాచక్షీత తత్తథా, అథ యద్దుఃఖసంయుక్తమప్రీతికరమాత్మనః.52 ప్రవృత్తం రజ ఇత్యేవ జానీహి మునిసత్తమ, అథ యన్మోహసంయుక్తమవ్యక్తవిషయం భ##వేత్. 53 అప్రతర్క్యమవిజ్ఞేయం తమస్తదుపధారయేత్, ప్రహర్షః ప్రీతిరానన్దస్సుఖం వా శాన్తచిత్తతా. 54 కథంచిదభివర్తన్త ఇత్యేతే సాత్వికా గుణాః, అతుష్టిః పరితాపశ్చ శోకో లోభస్తథా క్షమా. 55 లింగాని రజసస్తాని దృశ్యంతే దేహహేతుభిః, అపమానస్తథా మోహప్రమాదస్స్వప్నతంద్రితే. 56 కధంచిదభి వర్తంతే వివిధాస్తామసా గుణాః, దూషణం బహుధాగామి ప్రార్థనా సంశయాత్మకమ్. 57 మనస్స్వనియతం యస్య స సుఖీ ప్రేత్య చేహ చ, సత్త్వక్షేత్రజ్ఞయోరేతదన్తరం యస్య సూక్ష్మయోః. 58 సృజతే వా గుణానేక ఏకో న సృజతే గుణాన్, మశకోదుంబరౌ వాపి సంప్రయుక్తౌ యథా సదా. 59 అన్యోన్యమేతౌ స్యాతాం చ సంప్రయోగస్తధోభయోః, పృథగ్భూతా ప్రకృత్వా తౌ సంప్రయుక్తౌ చ సర్వదా. 60 యథా మత్స్యో జలం చైవ సంప్రయుక్తౌ తథైవ తౌ, న గుణా విదురాత్మానం స గుణాన్వేత్తి సర్వశః. 61 పరిద్రష్టా గుణానాం తు సంస్రష్టా మన్యతే తథా, ఇంద్రియస్తు ప్రదీపార్థం కురుతే బుద్ధిసత్తమైః. 62 నిర్విచేష్టైరజానద్భిః పరమాత్మా ప్రదీపవాన్, సృజే హి గుణాన్సత్త్వం క్షేత్రజ్ఞః పరిపశ్యతి. 63 సంప్రయోగస్తయోరేష సత్త్వక్షేత్రజ్ఞయోర్ధ్రువమ్, ఆశ్రయో నాస్తి సత్త్వస్య క్షేత్రజ్ఞస్య చ కశ్చన. 64 సత్త్వం మనస్సంసృజతే న గుణాన్వై కదాచన, రశ్మీం స్తేషాం సమనసా యదా సమ్యఙ్నియచ్ఛతి. 65 తదా ప్రకాశ##తే7స్యాత్మా ఘటే దీపో జ్వలన్నివ, త్యక్త్వా యః ప్రాకృతం కర్మ నిత్మమాత్మరతిర్యునిః. 66 సర్వభూతాత్మభూస్తస్మాత్సగచ్ఛేదుత్తమాం గతిమ్, యథా వారిచరః పక్షీ సలిలేన న లిప్యతే. 67 ఏవమేవ కృతప్రజ్ఞో భూతేషు పరివర్తతే, ఏవం స్వభావమేవైతత్ప్వ బుద్ధ్యా విహరేన్నరః. 68 భృగు మహర్షి పలికెను :- ఓ బ్రహ్మర్షీ! నీవడుగుచున్న అధ్యాత్మమును చక్కగా వివరించెదను. ఆ అధ్యాత్మమే శ్రేయస్కరము సుఖప్రదము. అధ్యాత్మము సృష్టి ప్రలయములచే కూడియుండునుది. ఆచార్యులచే ప్రదర్శించబడినది. అధ్యాత్మజ్ఞానము కలవాడు లోకమున ప్రీతిని సౌక్యమును పొందును. ఫలము లభించును సర్వభూతపాతమేర్పడును. పృథివి వాయువు ఆకాశము జలము అగ్ని అని పంచ మహాభూతములు. ఈ భూతములు అన్ని ప్రాణుల పుట్టుకకు నాశమునకు మూలములు ప్రాణులు దేని నుండి పుట్టునో దానిలో లయమగును. సాగరమున పుట్టిన ప్రాణులు భూతములలో లయమగును. తాబేలు తన అవయవములను బయటకు సారించి మరల తనలోనికి ఉపసంహరించుకొనునట్లు పంచభూతములు ప్రాణులను బయలుపరిచి మరల తనలో ఉపసంహరించుకొనును. ఇట్లే సర్వభూతాత్మకుడు తననుండి భూతములను సృష్టిచేసి మరల తనలో లీనము చేసుకొనును. పంచ మహాభూతములే అన్నిప్రాణులలో ప్రాణిత్వమును ఏర్పరుచును. ప్రాణులలోని భూతత్వమును జీవుడు చూడజాలడు. శబ్దము శ్రోత్రము ఇంద్రియములు అను నీ మూడు ఆకాశము నుండి పుట్టినవి. స్పర్శ చేష్ట త్వగింద్రియము ఈ మూడు వాయువు నుండి పుట్టినవి. రూపము చక్షువు పాకము ఈ మూడు తేజోమయములు. రసము, క్లేదము జిహ్వ ఈ మూడు జలగుణములు. వాసన గల వస్తువు, ఘ్రాణంద్రియము, శరీరము ఈ మూడు భూమి గుణములు. మహాభూతములు అయిదు. ఆరవది మనసు. ఈ సముదాయమునకు ఇంద్రియములు మనస్సు అని వ్యవహారము. ఏడవది బుద్ధి, క్షేత్రజ్ఞుడు ఎనిమిదవ వాడు. శ్రోత్రేంద్రియము వినుటకు, త్వగింద్రియము స్పృశించుటకు , రసమును గ్రహించుట రసనేంద్రియము, గంధమును గ్రహించుటకు నాసిక, నేత్రము చూచుటకు, మనసు సంశయించుటకు నేర్పడినవి. బుద్ధి నిశ్చయించును. క్షేత్రజ్ఞుడు సాక్షి వలె నుండును. ఊర్ధ్వభాగమును అధో భాగమును కూడా చూచును. ఈ విభువు చేతనే సమస్త ప్రపంచము వ్యాప్తమైనది. పురుషులు సమగ్రములుగా ఇంద్రియములను తెలియవలయును. రజస్సత్త్వతమో భాగములు కూడా ఇంద్రియాశ్రితములే. ఈ విధముల భూతముల సృష్టిని మూలమును నరుడు తెలిసి, జాగ్రత్తగా సమీక్షించి శాంతిని పొందవలయును. గుణములచే బుద్ధి నశించును. బుద్ధివలననే ఇంద్రియములు కూడా నశించును. మనసుతో కలిసి భూతములు ఆరు. బుద్ధిలేనిచో గుణములెట్లుండును. కావున ఈ స్థావర జంగమాత్మకమగు విశ్వమంతయు బుద్ధిమయమే. బుద్ధినుండే పుట్టును. బుద్ధియందే లయమగును. బుద్ధియే నిర్దేశించును. చూచుదానిని నేత్రమని, వినుదానిని శ్రోత్రమని, వాసన చూచుదానిని ఘ్రాణమని, రుచి చూచుదానిని రసనమని, స్పృశించుదానిని త్వక్ అని యందురు. బుద్ధియే ఒకేసారి ఇన్ని వికారములను పొందును. బుద్ధియే మనోరూపముర కోరికలను ప్రకటించును. అన్నిటికి అధిష్ఠానము బుద్ధి. బుద్ధికంటే విడిగా అయిదు అర్థములుండును. ఈ అర్థములనే ఇంద్రియములందురు. ఈ ఇంద్రియములను బుద్ధిఅదృశ్యముగా అధిష్ఠించియుండును. పురుషునితో ఉండు బుద్ధి భావత్రయమున నుండును. ఒకపుడు ప్రీతిని పొందును ఒకపుడు చింతించును. కేవలము సుఖముతోను, కేవలము దుఃఖముతోను ఎపుడూ ఉండదు. ఇట్లు మానవుల మనసులో మూడు భావములతో నుండు బావాత్మకమైన బుద్ధి భావత్రయమును దాటియుండదు. నదీపతియగు సముద్రము చెలియలికట్టను అతిక్రమించనట్లు, ఇట్లు భావాతీతము కాని బుద్ధి భావములతో కలిసి మనసులో నుండును. ఇట్లుండు మనసు తన భావమును అనుసరించియుండును. ఆ బుద్ధియే అన్ని ఇంద్రియములను ప్రవర్తింపచేయును. ప్రీతిసత్త్వము, శోకము రజస్సు,క్రోధము తమము. ఈ లోకములో నున్న అన్ని భావములు ఈ మూడింటిలోనే అంతర్భవించును. ఇట్లు బుద్ధిగతములగు భావనలన్నింటిని నీకు వివరించితిని. బుద్ధిమంతుడగు వాడు అన్ని ఇంద్రియములను జయించవలయును. సర్వకాలములందు సత్త్వరజస్తమస్సులు ప్రాణులను ఆశ్రయించియుండును. మూడు విధములగు వేదనలు కూడా అన్ని ప్రాణులలో నుండును. ఆవేదనలే సాత్త్వికీ రాజసీ తామసీ అని పిలువబడును. సుఖస్పర్శము సత్త్వగుణము. దుఃఖస్పర్శ రజో గుణము. ఈ రెండు తమోగుణములతో కలిసి వ్యవహారమును పొందును. ప్రీతియుక్తమైన భావన శరీరమున కాని మనసున కాని యున్నచో దానిని సాత్త్వికీ భావనగా తెలియుము. దుఃఖ సంయుక్తమగు భావన కలిగినచో మనసునకు అప్రీతికరమైనచో దానిని రాజసీ భావనగా తెలియును. దుఃఖ సంయుక్తమగు భావన కలిగినచో మనసునకు అప్రీతికరమైనచో దానిని రాజసీ భావనగా తెలియుము. మోహయుక్తము అస్పష్టము, తెలియరానిది ఊహించరానిదిగా భావన ఏర్పడినచో దానిని తామసీ భావనగా తెలియుము. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము, శాంతచిత్తత అనునవి సాత్త్విక గుణములు. అసంతోషము, పరితాపము, శోకము, లోభము, అసహనము, అనునవి రజోగుణములు. అవమానము, మోహము, ప్రమాదము, నిద్ర, సోమరితనము అనునవి తామస గుణములు ఇతరులను దూషించుట, చిత్తచాంచల్యము అవిశ్వసముతో ప్రార్థించుట (యాచించుట) కూడా తామసగుణములు. మనసును తన వశములో నుంచుకొనిన వాడు సుఖమును పొందగలడు. సూక్ష్మములైన బుద్ధి క్షేత్ర క్షేత్రజ్ఞులకున్న భేదమిది. ఒకటి గుణములను సృజించును మరొకటి సృజించదు. దోమ సాలె పురుగు వీటికి దృష్టాంతములు. ఒకదానికొకటిగా వేరుగా నుండును. రెండు కలిసి యుండును. ప్రకృతి కంటే విడిగా నుండును. ఎప్పుడూ కలిసియే యుండును. చేప, జలము కలిసియే యుండును కాని ఆ రెండు ఒకటిగా నుండవు వేరుగా నుండును. గుణములు ఆత్మను తెలియజాలవు. ఆత్మ అన్ని గుణములను తెలియును. ఆత్మయే గుణములను సృజించును దర్శించును. బుద్ధిమంతులు ఇంద్రియములను దీపముగా ఉపయోగించుకొందురు. చేష్టారహిరములచే జ్ఞానములు లేని వాటిచే ప్రకాశరూపుడు పరమాత్మ. సత్త్వము గుణములను సృజించును. క్షేత్రజ్ఞుడు దర్శించును. సత్వక్షేత్రజ్ఞుల సంయోగము మాత్రము నిశ్చితము. సత్త్వమునకు క్షేత్రజ్ఞునకు ఆశ్రయమేదీ యుండదు. సత్త్వము మనసును సృజించును కాని గుణములను సృజించదు. గుణ పగ్గములను మనసుచే నిగ్రహించినచో ఘటమున నున్న దీపము వలె ఆత్మ ప్రకాశించును. ప్రకృతి సంబంధములగు కర్మలను విడిచి నిత్యము ఆత్మయందు రమించు ముని ఉత్తమగతిని పొందును. నీటిలో తిరుగు పక్షి నీకు నంటనట్లు కృతప్రజ్ఞుడు భూతములలో తిరుగుచు భూతములనంటడు. ఇదియే స్వభావము. మానవుడు తన బుద్ధిచే విహరించవలయును. 21 - 68 అశోచన్న ప్రహృష్యంశ్చ సమో విగతమత్సరః, భావయుక్త్యా ప్రయుక్తస్తు స నిత్యం సృజతే గుణాన్. 69 ఊర్ణనాభిర్యథా సూత్రం విజ్ఞేయాస్తన్తువద్గుణాః, ప్రధ్వస్తా న నివర్తంతే నివృత్వర్నోపలభ్యతే. 70 ప్రత్యక్షేణ పరోక్షం తదనుమానేన సిద్ధ్యతి, ఏవమేకే వ్యవస్యంతి నివృత్తరితి చాపరే. 71 ఉభయం సంప్రధార్యైతద్వ్యవస్యేత యథామతి, ఇతీమం హృదయగ్రంధిం బుద్ధిచింతామయం దృఢమ్. 72 విముచ్య సుఖమాసీత న శోచేచ్ఛిన్నసంశయః, మలినాః ప్రాప్నుయుశ్శుద్ధిం యథా పూర్ణా నదీం నరాః. 73 అవగాహ్య సువిద్వాంసో విద్ది జ్ఞానభిదే తథా, మహానద్యా హి పారజ్ఞస్తప్యతే న తరన్యథా. 74 న తు తప్యతి తత్త్వజ్ఞః కూలజ్ఞస్తు తరత్యుత, ఏవం యే విదురధ్యాత్మం కైవల్యం జ్ఞానముత్తమం. 75 ఏవం బుద్ధ్వా నరస్సర్వో భూతానామగతిం గతిమ్, అవేక్ష్య చ శ##నైర్బుద్ధ్యా లభ##తే చ శమం తతః. 76 త్రివర్గో యస్య విదిత ప్రేక్ష్యః యశ్చ విముంచతి, అన్విష్య మనసా యుక్తస్తత్త్వదర్శీ నిరుత్సుకః. 77 న చాత్మా శక్యతే ద్రష్టుం ఇంద్రియేషు విభాగశః, తత్ర తత్ర విసృష్టేషు దుర్వాపేష్వకృతాత్మభిః. 78 ఏతద్బుద్ధ్వా భ##వేద్బుద్ధః కిమన్యద్బుద్ధలక్షణమ్, విజ్ఞాయ తద్ధి మన్యన్తే కృతకృత్యా మనీషిణః. 79 న భవతి విదుషాం తతో భయం యదవిదుషాం సుమహద్భయం భ##వేత్, న హి గతిరధికాస్తి కస్యచిద్వా సతి హి గుణ పవదత్యుతుల్యతామ్. 80 యః కరోత్యనభిసంధిపూర్వకం తచ్చ నిర్దహతి యత్పురా కృతమ్, న ప్రియం తదుభయం కుతః ప్రియం తస్య తజ్జనయతీహ కుర్వతః. 81 లోకమాయురభిసూయతే జనస్తస్య తజ్జనయతీహ కుర్వతః, తత్ర పశ్య కుశలాన్న శోచతే జాయతే యది భయం పదా సదా. 82 కలతలకు కుందక సంపదలకు సంతోషించక మాత్సర్యమును విడిచి అన్నిటిలో సముడై భావయుక్తమగు మనసుతో గుణములను సృజించును. సాలెపురుగు తాను సూత్రములను సృజించుటను పోలికగా తెలియును. సాలెపురుగు సృజించిన సూత్రములు నశించినవి మరల సృజించబడవు నశించినవి మరల లభించవు. ప్రత్యక్షముచే పరోక్షమును అనుమానముచే గ్రహించబడును. ఇట్లు కొందరు నిశ్చయించిరి ఇతరులు నివృత్తిని నిశ్చయించిరి. ఈ రెండు మతములను ఆలోచించి బుద్ధికి తోచినట్లు నిశ్చయించవలయును. ఇట్లు బుద్ధి చింతామయమైన హృదయగ్రంధిని దృఢముగా విచ్చేదమును చేసుకొని సంశయములు భిన్నములు కాగా ఆనందముగా నుండవలయును. నదిని చేరి మానవులు మలినమును తొలగించుకొనునట్లు హృదయగ్రంథి భేదముచే శుద్ధిని పొందెదరు. తీరమును తెలిసినవారు పరితపించక మహానదిని దాటగలిగినట్లు తత్వజ్ఞుడు పరితపించడు. ఇట్లు ఉత్తమజ్ఞానము, కైవల్యము అనబడు అధ్యాత్మమును తెలిసియుందురు. ఇట్లు భూతముల గమనాగమనములను తెలిసి బుద్ధిచే నిశ్చియంచి శాంతిని పొందవలయును. ఇట్లు త్రివర్గమును తెలిసి, జ్ఞానముచే బంధమును విడిచి, తెలియవలసిన దానిని అన్వేషించి తత్త్వదర్శియై ఉత్సుకుడు కాకా యుండవలయును. ఇంద్రియవిభాగముచే ఆత్మదర్మనము చేయాలడు దీనిని తెలిసినవాడు మాత్రమే బుద్ధుడగును. ఈ విషయమును తెలిసిన బుద్ధిబంతులు కృతకృత్యులౌదురు. తెలియని వారికి కలుగు భయము తెలిసినవారికి కలుగదు. దేనికైనను ఇంతకన్ననూ అధికమైన గతి యుండదు. గుణములున్నచో అసమానత్వము లభించును. సంగము లేక అన్వేషించువాడు పురాకృతమును దహింప చేయును. అట్టివానికి ప్రియము అప్రియము రెండు ఉండవు. ఈ లోకము ఆయువును గూర్చి అసూయ చెందును. అట్లు చేయువానికి ఆయువు అసూయనే కలిగించును. ఈ విషమమున జ్ఞాని విచారించడు. అజ్ఞానికి ప్రతిక్షణమున భయము కలగును. 69 - 82 భరద్వా ఉవాచ :- ధ్యానయోగం సమాచక్ష్వ మహ్యం తత్పదసిద్ధయే, యజ్‌జ్ఞాత్వా ముచ్యతే బ్రహ్మన్నరస్త్రివిదతాపతః. 83 భరద్వా మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! అధ్యాత్మపదమును సిద్ధించుటకు ధ్యానయోగమును తెలుపుము. అధ్యాత్మజ్ఞానముచే తాపత్రయ విముక్తుడగును. 83 భృగురువాచ :- హంత తే సంప్రవక్ష్యామి జ్ఞానయోగం చతుర్విధమ్, యం జ్ఞాత్వా శాశ్వతీం సిద్ధిం గచ్ఛన్తీహ మహర్షయః. 84 యథా స్వనుష్ఠితం ధ్యానం తథా కుర్వన్తి యోగినః, మహర్షయో జ్ఞానతృప్తా నిర్వాణగతమానసాః. 85 నావర్తంతే పునశ్చాపి ముక్తాస్సంసారదోషతః, జన్మదోషపరిక్షీణాస్స్వభావే పర్యవస్థితాః. 86 నిర్ద్వన్ద్వా నిత్యసత్త్వస్థా విముక్తా నిష్పరిగ్రహాః, అసంగాన్యవిధాదీని మనశ్శాంతికరాణిచ. 87 తత్ర ధ్యానేన సంక్లిష్టమేకాగ్రం ధారయేన్మనః, పిండీకృత్యేన్ద్రియగ్రామమాసీనః కాష్ఠవన్మునిః. 88 శబ్దం న విందేచ్ఛ్రోత్రేణ త్వచా స్పర్శం న వేదయేత్, రూపం న చక్షుషా విద్యాత్ జిహ్వయా న రసాంస్తథా. 89 ఘ్రేయాణ్యపి చ సర్వాణి జహ్యాద్ధ్యానేన తత్తవిత్, పంచవర్గప్రమాధీని నేచ్ఛేచ్చైతాని వీర్యవాన్. 90 తతో మనసి సంగ్రహ్య పంచవర్గం విచక్షణః, సమాదధ్యాన్మనో భ్రాంతమింద్రియైస్సహ పంచభిః. 91 విసంచారి నిరాలంబం పంచద్వారం బలాబలమ్, పూర్వధ్యానపథే ధీరస్సమాదధ్యాన్మనస్త్వరా. 92 ఇంద్రియాణి మనశ్చైవ యదా పిండీకరోత్యయమ్, ఏష ధ్యానపథః పూర్వో మయా సమనువర్ణితః. 93 తస్య తత్పూర్వసంరుద్ధ ఆత్మషష్ఠమనంతరమ్, స్ఫురిష్యతి సముద్రాంతా విద్యుదంబుధరే యథా. 94 జలబిందుర్యథా లోలః పర్ణస్థస్సర్వతశ్చలః ఏవమేవాస్య చిత్తం చ భవతి ధ్యానవర్త్మని. 95 సమూహితం క్షణం కించిద్ధ్యానవర్త్మని తిష్ఠతి, పునర్వాయుపధం భ్రాంతం మనో భవతి వాయువత్. 96 అనిర్వేదో గతక్లేశో గతతంద్రోహ్యమత్సరీ, సమాదధ్యాత్పునశ్చేతో ధ్యానేద ధ్యానయోగవిత్, 97 విచారశ్చ వితర్కశ్చ వివేకశ్చోపజాయతే, మునేస్సమాధియుక్తస్య ప్రథమం ధ్యానమాదితః. 98 మనసా క్లిశ్యమానస్తు సమాధానం చ కారయేత్, న నిర్వేదం మునిర్గచ్ఛేత్ కుర్యాదేవాత్మనో హితమ్. 99 పాంసుభస్మకరీషాణాం యథా వై రాశయశ్చితాః, సహసా వారిణా సిక్తా న యాంతి పరిభావనాః. 100 కించిత్స్నిగ్ధం యథా చ స్యాచ్ఛుష్కం చూర్ణమభావితమ్, క్రమేణ తు శ##నైర్గచ్ఛేత్ సర్వం తత్పరిభావనమ్. 101 ఏవమేవేంద్రియగ్రామం శ##నైశ్శం పరిభావయేత్, సంహరేత్క్రమశ##శ్చైవ సమ్యక్ తత్ప్రశమిష్యతి. 102 స్వయమేవ మనశ్చైవం పంచవర్గం మునీశ్వర, పూర్వం ధ్యానపథే స్థాప్య నిత్యయోగేన శామ్యతి. 103 న తత్పురుషకారేణ న చ దైవేన కేనచిత్, సుఖమేష్యతి తత్తస్య యదేవం సంయతాత్మనః. 104 సుఖేన తేన సంయుక్తో రంస్యతే ధ్యానకర్మణి, గచ్ఛన్తి యోగినో హ్యేవ నిర్వాణం తు నిరామయమ్. 105 భృగుమహర్షి పలికెను :- నీకు నాలుగు విధములుగానున్న జ్ఞానయోగమును చెప్పెదను. ఈ జ్ఞానయోగమును తెలిసిన మహర్షులు సిద్ధిని పొందెదరు. జ్ఞానతృప్తులగు నిర్వాణమును చెందిన మనసు గలవారై మహర్షులు యోగులు ధ్యానమును చక్కగా అనుష్ఠింతురు. సంసారదోషము నుండి ముక్తులై మరల జన్మించరు. జన్మదోషములను క్షీణించినవారై స్వభావమున నుందురు. నిర్ద్వంద్వులై నిత్యసత్త్వస్థులై ముక్తులై పరిగ్రహశూన్యులై మనశ్శాంతికరములైన అసంగాదులను అలవరచుకొని క్లిష్టమగు మనసును ఏకాగ్రముగా ధరించవలయును. మౌనముచే కాష్ఠమువలె ఆసీనుడై ఇంద్రియ సమూహమును ఒకచోట చేర్చవలయును. చెవులతో శబ్దమును వినారదు. త్వగింద్రియముచే స్పర్శను తెలియరాదు. కంటితో చూడరాదు. నాలుకతో రుచిని తెలియరాదు. నాసికతో వాసన చూడరాదు. తత్త్వజ్ఞేడు ధ్యానముతో అన్నింటిని పరిత్యజించవలయును. నిగ్రహముచే పంచేంద్రియములను పెడదారిపట్టించు శబ్దాదివిషయములందు కోరికను వీడవలయును. తరువాత పంచేంద్రియములను మనసున సంగ్రహించి భ్రాంతమగు మనసును మనసుచే సంధానమును చేయవలయును. అంతట తిరుగునది ఆధారరహితము పంచద్వారము బలాబలసంయుక్తము అయిన మనసును ధ్యానపథమున సంధానము చేయవలయును. ఇంద్రియములను మనసును ఒకటిగా సంధానము చేయుటయే నేను చెప్పిన మొదటి ధ్యాన మార్గము. తరువాత ఇంద్రియములను మనసును ఆత్మసంస్థమును చేయవలయును. అపుడు మేఘమున సముద్రాంతమున మెరయు మెరపువలె స్ఫురించును. ఆకు మీద నున్న జలబిందువు అంతటా లోలమై చంచలమై యుండునో అట్లే ఇతని మనసు ధ్యానమార్గమున నుండును. సావధానము చేసిన మనసు క్షణ కాలము ఏకాగ్రముగా నుండును. మరల ఆకాశమున వాయువువలె భ్రాంతమగును. నిర్వేదములేనివాడై క్లేశము లేనివాడై సోమరితనమును విడిచి మాత్సర్యము లేనివాడై ధ్యానయోగమును తెలిసి ధ్యానముచే మనసును సంధానమును చేయవలయును. అట్లు చేసినచో విచారము, వితర్కము, వివేకము కలగును. సమాధియుక్తడగు మునికి మొదటిది ధ్యానము. కష్టపడియైనను మనస్సమాధానమును కూర్చుకొనవలయును. ముని నిర్వేదమును పొందరాదు. ఆత్మ హితమును సంపాదించవలయును. ధూళి భస్మము, పేడ వీటి రాశులను నీటితో తడిపినచో చెదిరిపోక ముద్దగా మారును. తరువాత ఎండి మరల పొడిగా మారి చెదిరి పోవునో అట్లే మొదట ఇంద్రియపంచకమును ధ్యానముచే ముద్దగా చేసి సమాధిచే ఎండబెట్టి ఏకాగ్రతచే పొడిచేసి జ్ఞానముచే పారద్రోలవయును. ఇట్లు క్రమముగా ఇంద్రియసంహారమును చేసినచో శమించును. ఇట్లు మెల్లగా మనసును ఇంద్రియ పంచకమును మొదట ధ్యానమార్గమున నిలిపిన, నిత్యయోగముతో శమించును. ఇట్లు నియతాత్మయగు వానికి పురుషకారముతో కాని దైవముచే కాని సుఖము కలుగదు. ఆత్మనియమముచే మాత్రమే ఆనందమును పొందగలడు. ఆ ఆనందముచే కూడి ధ్యానమొనరించును. ఇట్లు యోగులు నిర్వాణమును చెందెదరు. సనందన ఉవాచ :- ఇత్యుక్తో భృగుణా బ్రహ్మన్భరద్వాజః ప్రతాపవాన్, భృగుం పరమధర్మాత్మా విస్మితః ప్రత్యపూజయత్. 106 ఏవం తే ప్రసవో విద్వన్ జగతస్సంప్రకీర్తితః, నిఖిలేన మహాప్రాజ్ఞ ! కిం భూయశ్శ్రోతుమిచ్ఛసి. 107 ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే ద్వితీయపాదే చతుశ్చత్వారింశత్తమోధ్యాయః సనంద మమర్షి పలికెను :- ఓ బ్రహ్మణోత్తమా! ఇట్లు భృగుమహర్షి భరద్వాజమహర్షికి ఉపదేశించగా పరమధర్మాత్ముడగు భరద్వాజ మహర్షి ఆశ్చర్యమును చెందినాడై భృగుమహర్షిని చక్కగా పూజించెను. ఓ జ్ఞానియగు నారదా! ఇట్లు నీవడిగిన జగదుత్పత్తి క్రమమును సంపూర్ణముగా వివరించితిని. ఇంకను ఏమి వినగోరెదవో తెలుపుము. 106, 107 ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున నలుబది నాలుగవ అధ్యాయము సమాప్తము.