Sri Naradapuranam-I
Chapters
Last Page
పంచచత్వారింశత్తమోధ్యాయః = నలుబదియైదవ అధ్యాయము బృహదుపాఖ్యానమ్ సూత ఉవాచ :- సనందనవచశ్శ్రుత్వా మోక్షధర్మాశ్రితం ద్విజాః, పునః పప్రచ్ఛ తత్త్వజ్ఞో నారదో೭ధ్యాత్మసత్కథామ్. 1 సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా! సనందనమహర్షి చెప్పిన మోక్షధర్మాశ్రితమగు అధ్యాత్మసత్కథను వినిన తత్త్వజ్ఞుడగు నారదుడు మరలనిట్లు పలికెను. 1 నారద ఉవాచ :- శ్రుతం మయా మహాభాగ ! మోక్షశాస్త్రం త్వయోదితమ్, న చ మే జాయతే తృప్తిర్భూయో భూయో೭పి శృణ్వతః. 2 యథా సముచ్యతే జంతురవిద్యాబంధనాన్మునే, తథా కథయ సర్వజ్ఞ ! మోక్షధర్మం సదాశ్రితమ్. 3 నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా ! నీవు చెప్పిన మోక్షశాస్త్రమును చక్కగా వింటిని కాని ఎన్ని మార్లు వినిననూ నాకు తృప్తి కలుగుట లేదు. ఓ సర్వజ్ఞుడా! అవిద్యాబంధమునుండి జీవుడు విముక్తుడగు మోక్షధర్మమును ఇంకనూ తెలుపుము. 2 - 3 సనంద ఉవాచ :- అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్, యథా మోక్షమనుప్రాప్తో జనకో మిథిలాధిపః. 4 జనకో జనదేవస్తు మిథిలాయా అధీశ్వరః, ఔర్ధ్వదేహికధర్మాణామాసీద్యుక్తో విచింతనే. 5 తస్య శతానామాచార్య వస తి సతతం గృహే, దర్శయంతః పృథగ్ధర్మాన్నానా పాషండవాదినః. 6 స తేషాం ప్రేత్యభావే చ ప్రేత్య జాతా వినిశ్చయే, ఆగమస్ధస్స భూయిష్ఠమాత్మవత్త్వేన తుష్యతి. 7 తత్ర పంచశిఖో నామ కాపిలేయో మహామునిః, పిరధావన్మహీం కృత్స్నాం జగామ మిథిలామథ. 8 సర్వసన్యాసధర్మాణస్తత్త్వ జ్ఞానవినిశ్చయే, సుపర్యవసితార్ధశ్చ నిర్ద్వన్ద్వో నష్టసంశయః. 9 ఋషీణామాహురేకం యం కామాదవసితం నృషు, శాశ్వతసుఖమత్యంతమన్విచ్ఛన్స సుదుర్లభమ్. 10 యమాహుః కపిలం సాంఖ్యా పరమర్షిం ప్రజాపతిమ్, స మన్యే తేన రూపేణ విఖ్యాపయతి హి స్వయమ్. 11 ఆసురేః ప్రథమం శిష్యం యమాహుశ్చిరజీవినమ్, పంచ స్రోతసి యస్సత్రమాస్తే వర్షసహస్రకమ్. 12 పంచస్రోతసమాగమ్య కాపిలం మండలం మహత్, పురుషావస్ధమవ్యక్తం పరమార్ధం న్యవేదయత్. 13 ఇష్టిమంత్రేణ సంయుక్తో భూమశ్చ తపసాసురిః, క్షేత్రక్షేత్రజ్ఞయోర్వ్యక్తిం విబుధే దేహదర్శనః. 14 యత్తదేకాక్షరం బ్రహ్మ నారారూపం ప్రదృశ్యతే, ఆసురిర్మండలే తస్మిన్ ప్రతి పేదే తమవ్యయమ్. 15 తస్య పంచశఖశ్శిష్యో మానుష్యా పయసా భృతః, బ్రాహ్మణీ కాపిలీ నామ కాచిదాసీత్కుటుంబినీ. 16 తస్యాః పుత్రత్వమాగత్య స్త్రియాస్స పిబతి స్తనౌ, తతశ్చకాపిలేయత్వం లేభే బుద్ధిం చ నైష్ఠికీమ్. 17 ఏతన్మే భగవానాహ కాపిలేయస్య సంభవమ్, తస్య తత్కాపిలేయత్వం సర్వవిత్త్వమనుత్తమమ్. 18 సామాత్యో జనకో జ్ఞాత్వా ధర్మజ్ఞో జ్ఞానినం మునే, ఉపేత్య శతమాచార్యన్మోహయామాస హేతుభిః. 19 జనకస్త్వభిసంరక్తః కాపిలేయానుదర్శనమ్, ఉత్సృజ్య శతమాచార్యాన్ పృష్ఠతో೭నుగామ తమ్. 20 తసై#్మ పరమకళ్యాణం ప్రణతాయ చ ధర్మతః, అబ్రవీత్పరమం మోక్షం యత్తత్సాంఖ్యం విధీయతే. 21 జాతినిర్వేదముక్త్వా స కర్మనిర్వేదమబ్రవీత్, కర్మనిర్వేదముక్త్వా చ సర్వనిర్వేదమబ్రవీత్. 22 యదర్ధం ధర్మసంసర్గః కర్మణాం చ ఫలోదయః, తమనాశ్వాసి కం మోహం వినాశి చలమధ్రువమ్. 23 దృశ్యమానే వినాశే చ ప్రత్యక్షే లోకసాక్షికే, ఆగమత్పరమస్తీతి బ్రువన్నపి పరాజితః. 24 అనాత్మా హ్యాత్మనో మృత్యుః క్లేశో మృత్యర్జరామయః, ఆత్మానం మన్యతే మోహాత్ తదసమ్యక్పరం మతమ్. 25 అథచేదేవమప్యస్తి యల్లోకే నోపపద్యతే, అజరో೭యమమృత్యుశ్చ రాజే మన్యతేయథా. 26 అస్తి నాస్తీతి చాప్యేతత్తస్మిన్నసితలక్షణ, కిమధిష్ఠాయ తద్బ్రూయాత్ లోకయాత్రావినిశ్చయమ్. 27 ప్రత్యక్షం హ్యేతయోర్మూలం కృతాంతో హ్యేతయోరపి, ప్రత్యక్షో హ్యాగమో భిన్నః కృతాంతో నా న కించన. 28 యత్ర తత్రానుమానే೭స్మిన్కృతం భావయతే೭పి చ, అన్యో జీవశ్శరీరస్య నాస్తికానాం మతే స్థితః. 29 రేతో వటకణికాయాం ఘృతపాకాధివాసనమ్, జాతిస్మృతిరయస్కాంతః సూర్యకాంతోంబుభక్షణమ్. 30 ప్రేతభూతప్రియశ్చైవ దేవతా హ్యుపయాచనమ్, మృతకర్మవివృత్తిం చ ప్రమాణమితి నిశ్చయః. 31 నన్వేతే హేతవస్సన్తి యే కేచిన్మూర్తసంస్థితాః, అమూర్తస్య హి మూర్తేన సామాన్యం నోపలభ్యతే. 32 అవిద్యా కర్మ తృష్ణా చ కేచిదాహు పునర్భవమ్, తస్మిన్నష్టే చ దగ్ధే చ చిత్తే మరణధర్మిణి. 33 అనో೭స్మాజ్జాయతే మోహస్తమాహుస్సత్త్వసంక్షయమ్, యదా సప్వరూపతశ్చాన్యో జాతితశ్శ్రుతితో೭ర్ధతః. 34 కథమస్మిన్న ఇత్యేవ సంబద్ధస్స్యాదసంహితః, ఏవం సతి చ కా ప్రీతిః, జ్ఞానవిద్యాతపోబలైః. 35 యదస్యా చరితం కర్మ సమాన్యాత్ప్రతిపద్యతే, అపి త్వయమిహైవాన్యైః ప్రాకృతైర్దుఃఖితో భ##వేత్. 36 సుఖితో దుఃఖితో వాపి దృశ్యాదృశ్యవినిర్ణయః, యథా హి ముసలైర్హన్యుశ్శరీరం తత్పునర్భవేత్. 37 వృథా జ్ఞానం యదన్యచ్చ యే నైతన్నోపలభ్యతే, ఋతుసంవత్సరౌ తిష్యః శృతోష్ణో೭థ ప్రియాప్రియే. 38 యథా తాపాని పశ్యంతి తాదృశస్సత్వంసంక్షయః, జరయాభిపరీతస్య మృత్యునా చ వినాశితమ్. 39 దుర్బలం దుర్బలం పూర్వం గృహస్యేవ వినశ్యతి, ఇంద్రియాణి మనో వాయుః శోణితం మాంసమస్ధి చ. 40 ఆనుపూర్వ్యా వినశ్యంతి స్వం ధాతుముపయాంతి చ, లోకమాత్రావిఘాతశ్చ దానధర్మఫలాగమే. 41 తదర్ధం వేదశబ్దాశ్చ వ్యవహారాశ్చ లౌకికాః, ఇతి సమఙ్మనస్యేతే బహవస్సంతి హేతవః. 42 సనందన మహర్షి పలికెను :- ఈ విషయమున మిథిలాధిపతియగు జనకుడు మోక్షమును పొందిన పురాతనమగు ఇతిహాసమును ఉదాహరించెదరు. మిథిలాధిపతియగు జనకుడు పారలౌకికధర్మములను చింతించుచుండెడివాడు. ఆ జనకుని ఇంటిలో ఎల్లపుడూ చాలామంది ఆచార్యులు నివసిచుచుండెడివారు. పాషండ ధర్మములను వాదించువారు పృధగ్ధర్మములను బోధించువారు పలు విధములుగా నుండెడివారు. ఆ జనకమహారాజు పరలోకస్థితియందు, పరలోక గమనమునందు జాత్యాది నిశ్చయము నందు విశ్వాసము కలవాడు జ్ఞాని కావున వారి వాదములను విని సంతోషించుచుండెడివాడు. కపిల మహర్షి వంశీయుడు పంచశిఖుడను మహర్షి భూమండలమునంతయూ తిరుగుచూ మిధిలా నగరమునకు వెళ్ళెను. సర్వసన్యాస ధర్మములను తెలిసిన వాడు తత్త్వజ్ఞాననిశ్చయమునందు అర్ధ పరిష్కారము చేయగలవాడు ద్వంద్వ భావమునధిగమించినవాడు సంశయరహితుడు ఋషులలో ముఖ్యుడు, తన సంకల్పముచే మానవులందు అవతరించినవాడు నగు కాపిలేయుడు బహుదుర్లభమగు శాశ్వాతానందమును అన్వేషించుచున్నాడు సాంఖయులచే కపిల మహర్షి ప్రజాపతియని చెప్పబడువాడు ఆరూపములో తనను తాను ప్రసిద్ధిని పొందించుకొనెను. ఈ కాపిలేయుడు ఆసురిమహర్షికి మొదటి శిష్యుడు చిరంజీవిగా పేర్కొనబడినవాడు పంచనదీ ప్రాంతమున సహస్ర వర్షాత్మకమగు సత్రము నాచరించుచుండెడివాడు. కాపిలేయాశ్రమమున్న పంచనదీ ప్రాంతమునకు అసురిమహర్షి వచ్చి మహాజ్ఞానియగు కాపిలేయునికి అవ్యక్త స్వరూపమును పురుష స్వరూపమును బోధించు పరమార్ధమును తెలియజేసెను. యాగమంత్రోచ్చారణచే తపస్సుచే ఆసురి క్షేత్రక్షేత్రజ్ఞుల స్వరూపమును శరీరాత్మజ్ఞానము కలవాడు కావున తెలిసియుండెను. ఏకాక్షరము నానారూపముగా కనపడు బ్రహ్మను ఆసురి ఆశ్రమమండలమున సాక్షాత్కరమును పొందకలిగెను. ఆయాసురి శిష్యుడే పంచశిఖుడను పేరుగలవాడు మానవ స్త్రీస్తన్యముతో పోషించబడినవాడుండెను. కాపిలి అను పేరుగల బ్రాహ్మణిస్త్రీకి పుత్రత్వమును చెంది కాపిలి స్తన్యపానమును చేసెను. కావున అతనికి కాపిలేయుడను పేరు కలిగెను. స్ధిరిమగు బుద్ధిని కూడా పొందెను. ఇది కాపిలేయుని పుట్టుక. నాకు భగవంతుడు తెలిపెను. అతని కాపిలేయత్వమును సాటిలేని సర్వజ్ఞత్వమును తెలియ చేసెను. మంత్రులతో కలిసి జనకమహారాజు కాపిలేయుని రాకను తెలిసి ధర్మజ్ఞుడు కావున ఎదురేగి అతిథి పూజగావించి అతని వెంటనున్న ఆచార్య శతమును హేతువాదముచే మోహింపచేసెను. జనకమహారాజు కాపిలేయుని దర్శించగోరి ఆచార్య శతమును విడిచి కాపిలేయుని వెంటవెళ్ళెను. ఇట్లు తననాశ్రయించిన జనకమహారాజునకు పరమకళ్యాణప్రదమగు మోక్షధర్మమును కాపిలేయుడు బోధించెను. ఈ జ్ఞానమునే సాంఖ్యమందురు. జాతి జ్ఞానమును, కర్మజ్ఞానమును, సర్వజ్ఞానమును బోధించెను. ధర్మసంబంధము కర్మఫలప్రాప్తి దేనికొఱకు చేయుచున్నామో ఆ దేహము అశాశ్వతము, వినాశము, చలము, అధ్రువము, లోకసాక్షికముగా ప్రత్యక్షముగా నశించుచున్ననూ శాస్త్ర జ్ఞానముచే ఉన్నది అని పలికిననూ పరాజితుడే అగును. ఆత్మజ్ఞానము లేక పోవుటయే ఆత్మకు మృత్యువు. శరీరమునకు జరాస్వరూపమగు కష్టము మృత్యువు. శరీరమునే ఆత్మయనుకొనుట మోహముచేతనే కాని సత్యము సముచితముకాదు. ఇదియిట్లున్ననూ లోకమున సంభవముకానిది. ఆత్మ అజరము అమరము. అట్లు దేహమును భావించుట రాజసభావము. ఇదియున్నది ఇది లేదు అని తమోలక్షణమగు శరీరమున లోకవ్యవహారమున దేనినాధారముగా చేసుకొని చెప్పవలయును? ఈ భావాభావమూలము మూలమగు నిశ్చయము. ప్రత్యక్షమే. ప్రత్యక్షము శాస్త్రము ఈ రెండు భిన్నములు. కావున ఏ నిశ్చయమూ కలుగదు. కావున ప్రత్యక్షము సంభవించదు కావున అనుమానముచే నిశ్చయించవలయును. కాని నాస్తికమతమున శరీరము కంటే భిన్నుడుగా జీవుడు కనపడడు. రేతశ్శోణిత సంయోగయూ ఘృతపాకస్ధితివంటిది. జాతి జ్ఞానము అయస్కాంతము వంటిది. అంబు భక్షణము సూర్యకాంతము, ప్రీతభూత ప్రియత్వము దేవయాచనము మృతులకు కర్మ నివృత్తి ప్రమాణమని నాస్తికుల నిశ్చయము. ఈ హేతువులన్నియూ మూర్తిమంతయుల విషయమున చెప్పబడినవి. స్వరూపము లేనిదానికి స్వరూపమున్నదానితో సంబంధమే లభించదు. అవిద్య, కర్మ, ఆశ పునర్జన్మకు కారణములని కొందరందురు. ఆ శరీరము నశించిననూ దహించినను ఇక ఉండెడిదేదియును లేదు. ఆ య విద్య నశించిననూ దానినుండి మరియొక మోహము పుట్టును. దీనినే సత్త్వసంక్షయమందురు. ఆత్మ శరీరమునకంటె స్వరూపముచే జాతిచే శ్రుతిచే అర్థముచే భిన్నమైనపుడు ఈ శరీరమున ఆయాత్మయే యున్నదని ఎట్లు నిశ్చయింతుము. ఇట్లు నిశ్చయించలేనిచో జ్ఞానవిద్యాతపోబలముచే ఏమి ప్రయోజనము? ఈ దేహసంబంధముచే చేయబడిన కర్మ ఇతనిదే అయినచో ఇతనే ఇక్కడే ఇతరులమైన ప్రకృతి ధర్మములచే ఎట్లు దుఃఖమును పొందును. సుఖముగలవాడు దుఃఖము గలవాడు అని చెప్పబడువాడు దృశ్యుడా? అదృశ్యుడా? అను నిర్ణయము జరుగవలయును. రోకళ్ళచే కొట్టి చంపబడిన శరీరము మరల ఎట్లు పుట్టును? కావున జ్ఞానము వృథా. కర్మలు తపస్సు వృథా. వాటిచే శరీరము లభించుట లేదు కదా? ఋతువు సంవత్సరము, మాసము శీతోష్ణములు ప్రియాప్రియములు వచ్చును, పోవును. వాటిని చూచుట చూడకపోవుట అనునది లేకుండుటయే సత్త్వసంక్షయము. వార్ధక్యముచే జీర్ణమైనది మృత్యువుచే నశించినది. గృహమున మొదటి దుర్బలమైనది నశించునట్లు శరీరమునకూడా దుర్బలమైనదే నశించును. ఇంద్రియములు, మనసు, వాయువు, రక్తము, మాంసము, అస్థులు క్రమముగా నశించి తమతమధాతువులను చేరును. దానధర్మములచే ఫలము లభించినచో లోకయాత్రకు విఘాతము కలుగును. కావున వేదశబ్దములు వ్యవహారములు కూడా లౌకికములే. ఇట్లు ప్రాణి తన మనసున పలువిధములైన హేతువులను కల్పించుకొని ఆలోచించుచుండును. 4 - 42 ఏతదస్తీతి నాస్తీతి న కశ్చిత్ప్రతిదృశ్యతే, తేషాం విమృశతామేవ తత్సమ్యగభిధావతామ్. 43 క్వచిన్నివసతే బుద్దస్తత్ర జీర్యతి వృక్షవత్, ఏవం త్వర్ధైరనర్ధైశ్చ దుఃఖితాస్సర్వజంతవః. 44 ఆగమైరపకృష్యంతే హస్తిపైర్హస్తినో యథా. 45 అర్ధాంస్తథా హంతి సుఖావహాంశ్చ లిహంత ఏతే బహవోపశుష్కాః, మహత్తరం దుఃఖమభిప్రపన్నా హిత్వా మిషం మృత్యువశం ప్రయాంతి. 46 వినాశినో హ్యధ్రువజీవినః కిం కింబంధుభిర్మిత్రపరిగ్రహైశ్చ, విహాయ యో గచ్చతి సర్వమేవ క్షణన గత్వా న నివర్తతే చ. 47 భూవ్యోమతోయానలవాయవో೭పి సదా శరీరం ప్రతిపాలయంతి, ఇతీదమాలక్ష్య రతిః కుతో భ##వేత్ వినాశినాప్యస్య న శర్మ విద్యతే. 48 ఇదమనుపధివాక్యమచ్ఛలం పరమనిరామయమాత్మసాక్షికమ్, నరపతిరభివీక్ష్య విస్మితః పునరనుయోక్తుమిదం ప్రచక్రమే. 49 ఇది యున్నది, ఇది లేదు అని ఏ ఒక్కడూ నిశ్చయించలేడు చక్కగా జ్ఞానము ననుసరించి విమర్శించు వారికి ఒకచోట బుద్ధి నిలుచును. శరీరము మాత్రము వృక్షము వలె జీర్ణించును. ఇట్లు అర్ధములచే అనర్ధములచే అన్ని ప్రాణులు దుఃఖితులై మావటివానిచే ఏనుగు వెల ఆశలచే ఆకర్షించబడుదురు. ఇట్లు సారములేని ఆశలచే ఆస్వాదించబడుచు సుఖములను కలిగించు పురుషార్ధములు స్వయముగా నశింపచేసుకొందురు. గొప్ప దుఃఖమును పొంది ఆహారమును విడిచి మృత్యువును పొందెదరు నశించునది శాశ్వతము కాని జీవితము గల ప్రాణులకు బంధువులతో మిత్రులతో ఏమి ప్రయోజనము? అంతటిని అన్నింటిని వదిలి క్షణములో వెళ్ళి మళ్ళీ తిరిగిరాడు కదా? ఈ శరీరమును భూమ్యాకాశ జలాగ్ని వాయువులు ఎపుడూ కాపాడుచుండును. ఈ విషయమును తెలిసినవాడెట్లు ఆనందించగలడు. వినాశియగు ఈ శరీరముతో సుఖమునెట్లు పొందగలడు? ఇట్లు ఉపాధిరహితము కల్మషరహితము పరమనిరామయమగు మహర్షి వాక్యమును వినిని జనకమహారాజు ఆశ్చర్యమును చెంది మరల తెలియుటకిట్లు పలికెను. 43 - 49 జనక ఉవాచ :- భగవన్యది న ప్రేత్య సంజ్ఞా భవతి కస్యచిత్, ఏవం సతి కిమజ్ఞానం జ్ఞానం వా కిం కరిష్యతి? 50 సర్వముచ్ఛేదనిష్ఠం స్యాత్ పశ్య చైతద్ద్విజోత్తమ ! అప్రమత్తః ప్రమత్తో వా కిం విశేషం కరిష్యతి. 51 అసంసర్గో హి భూతేషు సంసర్గో నా వినాశిషు, కసై#్మ క్రియత కల్పేత నిశ్చయః కో೭త్ర తత్త్వతః. 52 జనక మహారాజు పలికెను :- ఓ మహర్షీ! మృతి చెందిన తరువాత ఎవ్వరికీ జ్ఞానముండనిచో జ్ఞానాజ్ఞానములచే ప్రయోజనమేమి? సిద్ధాంతమంతయూ భంగము కావలసి వచ్చును. దీనిని చక్గకా పరిశీలించుడు. అప్రమత్తునికి ప్రమత్తునికి విశేషమేమి యుండును? భూతములయందు అసంగముకాని ప్రాణములయందు సంపదలయందు సంబంధముకాని ఎవరికొఱకు చేయబడుచున్నది? దేని కొఱకు చేయబడుచున్నది. ఈ విషయమున సిద్ధాన్తమెట్లుండును? 50 - 52 సనందన ఉవాచ :- తమసా హి మతిచ్ఛత్రం విభ్రాంతమివ చాతురమ్, పునః ప్రశమయన్వాక్యైః కవిః పంచశిఖో೭బ్రవీత్. 53 సనందన మహర్షి పలికెను :- అజ్ఞానముచే ఆవరించబడిన బుద్ధి కలిగి భ్రాంతుడై ఆతురుడైయున్న జనకుని మంచిమాటలచే శాంతింపచేయుచు పంచశిఖుడిట్లు పలికెను. 53 పంచశిఖ ఉవాచ :- ఉచ్చేదనిష్ఠా నేహాస్తి భావనిష్ఠా న విద్యతే, అయం హ్యపి సమాహారశ్శరీరేంద్రియచేతసామ్. 54 వర్తతే పృథగన్యోన్యమప్యుపాశ్రిత్య కర్మసు,ధాతవః పంచథా తోయం ఖే వాయు ర్జ్యోతిషొ ధరా. 55 తేషు భావేన తిష్ఠన్తి వియుజ్యంతే స్వభావతః, ఆకాశం వాయురూష్మా చ స్నేహో యశ్చాశు పార్ధివః. 56 ఏష పంచసమాహారః శరీరమపి నైకధా, జ్ఞానమూష్మా చ వాయుశ్చ త్రివిధః కాయసంగ్రహః. 57 ఇంద్రియాణీందియార్ధాశ్చ స్వభావశ్చేతనా మనః, ప్రాణాపానౌ వికారాశ్చ ధాతవశ్చాత్ర నిస్సృతాః. 58 శ్రవణం స్పర్శనం జిహ్వా దృష్టిర్నాసా తథైవ చ, ఇంద్రియాణీతి పంచైతే చిత్తపూర్వాగమా గుణాః. 59 తత్ర విజ్ఞానసంయుక్తా త్రివిధా చేతనా ధ్రువా, సుఖదుఃఖేతి యామాహురసౌ దుఃఖసుఖేతి చ. 60 శబ్దస్స్పర్శశ్చ రకూపం చ మూర్త్యర్ధమేవ తే త్రయః, ఏతే హ్యామరణాత్పంచ సద్గుణా జ్ఞానసిద్ధయే. 61 తేషు కర్మాణి సిద్ధిశ్చ సర్వతత్త్వార్ధనిశ్చయః, తమాహుః పరమం శుద్ధం బుద్ధిరిత్యవ్యయం మహత్. 62 ఇమం గుణసమాహారమాత్మభావేన పశ్యతః, అసమ్యగ్దర్శనైర్ధుఃఖమనంతం నోపశామ్యతి. 63 అనాత్మేతి చ యద్దృష్టం తేనాహం న మహేత్యపి, వర్తతే కిమధిష్ఠానాత్ ప్రసక్తా దుఃఖసంతతిః. 64 తత్ర సమ్యగ్జనో నామ త్యాగశాస్త్రమనుత్తమమ్, శృణుయాత్తచ్చ మోక్షాయ భాష్యమాణం భవిష్యతి. 65 త్యాగ ఏవ హి సర్వేపాముక్తానామపి కర్మణామ్, నిత్యం మిధ్యా వినీతానాం క్లేశో దుఃఖావహో మతః. 66 ద్రవ్యత్యాగే తు కర్మాణి భోగత్యాగే వ్రతాని చ, సుఖత్యాగే తపో యోగం సర్వత్యాగే సమాపనా. 67 తస్య మార్గో೭యమద్వైథస్సర్వత్యాగస్య దర్శితః, విప్రహాణాయ దుఃఖస్య దుర్గతిర్హి తథా భ##వేత్. 68 పంచ జ్ఞానేన్ద్రియాణ్యుక్త్వా మనష్షష్ఠాని చేతసి, బలపష్ఠాని వక్ష్యామి పంచ కర్మేంద్రియాణి తు. 69 హస్తౌ కర్మేంద్రియం జ్ఞేయం అథ పాదౌ గతీంద్రియమ్, ప్రజనానందయోర్మేఢ్రో విసర్గో పాయురింద్రియమ్ 70 వాక్చ శబ్దవిశేషార్ధమితి పంచాన్వితం విదుః, ఏవమేకాదశైతాని బుద్ధ్వా త్వవసృజన్మః. 71 కర్ణౌ శబ్దశ్చ చిత్తం చ త్రయశ్శ్రవణ సంగ్రహే, తథా స్పర్శే తథా రూపే తథైవ రసగంధయోః. 72 ఏవం పంచత్రికా హ్యేతే గుణాస్తదుపలబ్ధయే, యేనాయం త్రివిధో భావః పర్యాయాత్సముపస్థితః. 73 సాత్త్వికో రాజసశ్చాపి తామసశ్చాపి తే త్రయః, త్రివిధా వేదనా యేషు ప్రసృతా సర్వసాధినీ. 74 ప్రహర్షః ప్రీతిరానన్దః సుఖం సంశాన్తచిత్తతా, అకుతశ్చిత్కుతశ్చిద్వా చిత్తతస్సాత్త్వికో గుణః. 75 అతుష్టిః పరితాపశ్చ శోకో లోభస్తథా క్షమా, లింగాని రజసస్తాని దృశ్యంతే హేత్వ హేతుతః. 76 అవివేకస్తథా మోహప్రమాదస్స్వప్నతంద్రితా, కథంచిదపి వర్తంతే వివిధాస్తామసా గుణాః. 77 ఇమాం చ యో వేద విమోక్షబుద్ధిం ఆత్మానమన్విచ్ఛతి చాప్రమత్తః, న లిప్యతే కర్మఫలైరని ష్టైః పత్రం విషసై#్యవ లేన సిక్తమ్. 78 దృఢైర్హి పాశూర్వివిధైర్విముక్తః ప్రజానిమిత్తైరపి దైవతైశ్చ, యదా హ్యసౌ దుఃఖసౌఖ్యౌ జహాతి ముక్తస్తదాగ్ర్యాం గతిమేత్యలింగః. 79 శ్రుతిప్రమాణాగమమంగలైశ్చ శేతే జరామృత్యుభయాదతీతః, క్షీణ చ పుణ్య విగతీ చ పాపే తనోర్నిమిత్తే చ ఫలే వినష్టే, 80 అలేపమాకాశమలింగమేవమాస్థాయ పశ్యంతి మహత్యశక్తా, యథోర్ణనాభిః పరివర్తమానస్తంతుక్షయే తిష్ఠతి యాత్యమానః. 81 తథా విముక్తః ప్రజహాతి దుఃఖం విధ్వంసతే లోష్టమినాది మృచ్ఛన్, యథా రురుశ్శృంగమధో పురాణం హిత్వా త్వచం వాప్యురగో యధా చ. 82 మత్స్యం యథా వాప్యుదకే పతంతముత్సృజ్య పక్షీ నిపతత్యశక్తః. 83 తథా హ్యసౌ దుఃఖసౌఖ్యే విహాయ ముక్తః పరార్ధ్వాం గతిమేత్యలింగః. 84 ఇదమమృతపదం నిశమ్య రాజా స్వయమిహ పంచశిఖేన భాష్యమాణమ్, నిఖిలమభిసమీక్ష్య నిశ్చితార్ధః పరమసుఖీ విజహార వీతశోకః. 85 అపిచ భవతి మైధిలేన గీతం నగరముపహితమగ్నినాభివీక్ష్య, న ఖలు మమ హి దహ్యతే೭త్ర కించిత్ స్వయమిదమాహ కిల స్మ భూమిపాలః. 86 ఇమం హి యః పఠతి విమోక్షనిశ్చయం మహామునే సతతమవేక్షతే తథా, ఉపద్రవాననుభవతే హ్యదుఃఖితః ప్రముచ్యతే కపిలమివేత్య మైథిలః. 87 ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే పంచచత్వారింశత్తమో೭ధ్యాయః. పంచశిఖ మహర్షి పలికెను :- ఈ విషయమున ఉచ్ఛేదనిష్ఠకాని భావనిష్ఠకాని లేదు. ఇది శరీరేంద్రియ మనస్సుల సమాహారము. ఈ మూడు విడివిడిగా ఒకదానిని మరియొకటాశ్రయించి యుండును. జలము ఆకారము వాయువు అగ్ని భూమి యనునవి అయిదు ధాతువులు. అయిదింటిలో భావముతో నిలుచును. స్వభావముగా విడిపోవును. ఆకాశము వాయువు వేడి పార్ధివము జలము ఈ అయిదింటి సమాహారము శరీరము. ఈ శరీరముకూడా పలువిధములు. జ్ఞానము వేడి వాయువు అను మూడు వాయసమూహము. ఇంద్రియములు, ఇంద్రియార్ధములు, స్వభావము చేతనా, మనస్సు, ప్రాణాపానములు, వికారము. ఇచట ధాతువులు బయల్పడును. శ్రవణము, స్పర్శనము, జిహ్వా, దృష్టి, నాస అను నీ అయిదు ఇంద్రియములు చిత్తమునకు పూర్వమున కలుగు గుణములు. ఇచట విజ్ఞానసంయుక్తమగు చేతన ధ్రవము త్రివిధము. సుఖము, దుఃఖము, అసుఖదుఃఖము అని శబ్దము స్పర్శ రూపము అను మూడు మూర్త కొఱకే ఏర్పడును. ఈ అయిదు సద్గుణములు మరణపర్యంతము జ్ఞానసిద్ధి కొఱకుండును. ఈ సద్గుణములయందే కర్మలు సిద్ధి సర్వతత్వార్ధ నిశ్చయముండును. దీనినే పరమము, శుద్ధము, బుద్ధి అవ్యయము మహత్ అందురు. ఇట్లు గుణ సమామారమును ఆత్మభావముతో చూచువానికి చెడును మాత్రమే చూపించు అజ్ఞానముచే అంతులేని దుఃఖము శాంతించదు. నేనుకాను నాది కాదు అని అనాత్మగా చూడబడినదానికి అధిష్ఠానమేది? దుఃఖసంతతి ఎటనుండి వచ్చుచున్నది? ఈ విషయము మంచి జ్ఞానమగా సాటిలేని త్యాగ శాస్త్రము మాత్రమే. దానిని ఇతరులు చెప్పునపుడు మోక్షముకొఱకు వినవలయును. చెప్పబడిన అన్నికర్మలను విడుచుటయే బూటకపు వినయము గలవారికి దుఃఖమును కలిగించు కష్టము. ద్రవ్యమును త్యాగముచేసినచో కర్మలు, భోగములను త్యజించినచో వ్రతములు, సుఖమును త్యజించినచో తపము యోగము సిద్ధించును. అన్నిటిని విడిచిన వానికి అన్నియు ముగియును. ఇట్లు సర్వత్యాగమునకున్న ఏకైకమార్గమును వివరించితిని. దుఃఖనాశమునకు త్యాగమే ఏకైక మార్గము. త్యాగములేనిచో దుర్గతి ఏర్పడును. మనసుతో కలిసి ఆరగు పంచ జ్ఞానేంద్రియములను చెప్పి, ఇపుడు బలముతో ఆరగు పంచ కర్మేంద్రియములను చెప్పెదను. హస్తములు కర్మేంద్రియములు పాదములు గమనేంద్రియములు. మేఢ్రము జనన ఆనందేంద్రియము, పాయువు మలవిసర్జనేంద్రియము వాక్కు శ##బ్దేంద్రియము. ఇవి అయిదు కర్మేంద్రియములు. ఇట్లు పంచజ్ఞానేంద్రియములు పంచకర్మేంద్రియములు మనసుతోకలిసి ఏకాదశేంద్రియములగును. ఈ ఏకాదశేంద్రియములు బుద్ధితోకలిసి అన్ని వ్యవహారములను నడుపును. కర్ణములు శబ్దము చిత్తము అను మూడు శ్రవణ సంగ్రహమందురు. అట్లే స్పర్శరూపము, రసగంధములు అనువాటికి కూడా త్రికముండును. ఈ త్రికము గుణోపలబద్ధిని కూర్చును. ఈ త్రికముచే పర్యాయముగా భావత్రయముండును. సాత్త్విక రాజస తామసములను మూడుభావములే మూడువేదనలను కలిగించును. ఈ వేదనలే సంసారమున అన్నింటినీ సాధించును. ప్రహర్షము, ప్రీతి, ఆనందము, సుఖము శాంతచిత్తత సకారణముగా అకారణముగా చిత్తములో కలుగుట సాత్త్విక గుణము. అసంతోషము, పరితాపము, శోకము, లోభము, అసహనము ఇవికూడా అకారణముగా సకారణముగా కలుగుట రజోగుణమువలన కనిపించును. అవివేకము, మోహము, ప్రమాదము, నిద్ర, సోమరితనము మొదలగునవి సహేతుకముగా నిర్హేతుకముగా కలుగుట తమోగుణ చిహ్నములు. ఇట్లు అప్రమత్తుడై విముక్తి మార్గమును తెలిసినవాడు జలసిక్తమైన పత్రము విషలిప్తముకానట్లు అనిష్టములైన దుఃఖములతో సంబంధమును కలిగియుండును. దృఢములు పలువిధములగు పాశములనుండి విముక్తుడు కావలయును. ఈ పాశములు ప్రజానిమిత్తములు కావచ్చును దైవనిమిత్తములు కావచ్చును. ఇట్లు విముక్తుడై సుఖదుఃఖములను విడిచినచో శరీరత్యాగముచే ఉత్తమగతిని పొందును. శ్రుతిస్మృతి శాస్త్రప్రమాణములచే జ్ఞానమును సంపాదించి జరామృత్యువులకు అతీతుడై శరీరమునకు నిమిత్తములగు పుణ్యపాపములు నశించగా నిర్లేపము నిర్లింగము అగును ఆకాశమును మహత్తత్త్వమున దర్శింతురు. సాలెపురుగు తాను సృజించిన సూత్రము నశించిన తరువాత భ్రమణమును ఆపి స్థిరముగా నిలుచునట్లు జీవుడు స్థిరడగును. ఇట్లు ఇముక్తుడై దుఃఖమును పరిత్యజించును. లోష్టమునకు అంటుకొనియున్న మట్టివదులనట్లు వదులును. జింక తన పాత కొమ్మును వదిలినట్లు, పాము కుబుసమును విడుచునట్లు జీవుడు విముక్తుడై దుఃఖమును విడుచును. నీటిలోనున్న పక్షిని అందుకొనుటకు నీటిలోనికి వచ్చిన పక్షి మత్స్యమును గ్రహించలేక దానిని వదిలినచో ఆకాశమునకెగురును. అట్లు కదలనిచో పక్షికూడా నీటిలోపడి నశించును. అట్లే జీవుడు సంసారవిషయములను వదిలినచో దుఃఖవిముక్తుడగును. సంగమును వీడనిచో సంసారమున పడును. ఇట్లు పంచశిఖమహర్షి ఉపదేశించిన తత్త్వజ్ఞానమునువిని నిశ్చితార్ధము కలవాడై శోకమునువీడి పరమానందముతో విహరించెను. మరియు ఒక సమయమున శత్రువులు నగరమును ముట్టడించి నిప్పంటించి తగులబెట్టుచుండగా ఆ వార్త వినిన జనకమహారాజు నాదంటూ ఏదీలేదు నావస్తువేదీ దహించుటలేదు అని నిస్సంగముగా పలికెను. ఇట్లు పంచశిఖమహర్షి ఉపదేశించిన ఈ మోక్షమార్గమును చదివినవాడు తెలిసిన దానిని యథావిధిగా ఆచరించి ఆపదలనుకూడా దుఃఖించకనే అనుభవించి కపిలుని ఆశ్రయించిన జనకునివలె విముక్తుడగును. ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బృహదుపాఖ్యానమున నలుబదియైదవ అధ్యాయము సమాప్తము.