Sri Naradapuranam-I
Chapters
Last Page
ఏకోనపంచాశత్తమో೭ధ్యాయః=నలుబది తొమ్మిదవ అధ్యాయము బృహదుపాఖ్యానమ్ సనందన ఉవాచ :- నిశమ్య తస్యేతి వచః పరమార్ధసమన్వితమ్, ప్రశ్రయావనతో భూత్వా తమాహ నృపతిర్ద్విజమ్. 1 సనందన మహర్షి పలికెను :- రాజు ఇట్లు పరమార్ధమైన బ్రాహ్మణుని మాటలను విని వినయముచే వినమ్రుడై ఇట్లు పలికెను. 1 రాజోవాచ :- భగవన్యత్త్వయా ప్రోక్తం పరమార్ధమయం వచః, శ్రుతే తస్మిన్భ్రమంతీవ మనసో మమ వృత్తయః. 2 ఏతద్వివేకవిజ్ఞానం యది శేషేషు జంతుషు, భవతా దర్శితం విప్ర తత్పరం ప్రకృతేర్మహత్. 3 నాహం వహామి శిబికాం శిబికా మయి న స్థితా, శరీరమన్యదస్మత్తో యేనేయం శిబికా ధృతా. 4 గుణప్రవృత్తిర్భూతానాం ప్రవృత్తిః కర్మచోదితా, ప్రవర్తంతే గుణాశ్చైతే కిం మమేతి త్వయోదితమ్. 5 ఏతస్మిన్పరమార్ధజ్ఞ మమ శ్రోత్రపధం గతే, మనో విహ్వలతామేతి పరమార్ధార్ధతాం గతమ్. 6 పూర్వమేవ మహాభాగ! కపిలర్షిమహం ద్విజ, ప్రష్టుమభ్యుద్యతే గత్వా శ్రయః కిం త్వత్ర సంశ##యే. 7 తదంతరే చ భవతా యదిదం వాక్యమీరితమ్, తేనైవ పరమార్ధార్ధం త్వయి చేతః ప్రధావతి. 8 కపిలర్షిర్భగవతః సర్వభూతస్య వై కిల, విష్ణోరంశో జగన్మోహనాశాయ సముపాగతః. 9 స ఏవ భగవాన్నూనమస్మాకం హితకామ్యయా, ప్రత్యక్షతామనుగతస్తథైతద్భవతోచ్యతే. 10 తన్మహ్యం మోహనాశాయ యచ్ఛ్రేయః పరమం ద్విజ, తద్వదాఖిలవిజ్ఞానజలవీచ్యుదధిర్భవాన్. 11 రాజు పలికెను :- ఓ మహానుభావా! మీరు చెప్పిన పరమార్ధమయమైన మాటను వినిన తరువాత నా మానసిక ప్రవృత్తులు భ్రాంతి చెందుచున్నట్టుగా తోచుచున్నవి. మిగిలి ప్రాణిజాతములలో ఈ వివేకము విజ్ఞానము కానరాదు. మీరు చూపిన విజ్ఞానము ప్రకృతికి అతీతమైనది. నేను పల్లకిని మోయుట లేదు. పల్లకి నా మీదలేదు. పల్లకిని మోయు శరీరము నాకంటే భిన్నమైనది. ప్రాణుల గుణప్రవృత్తి కర్మచే ప్రేరేపించబడును. ఇట్లు గుణములు ప్రవర్తించునపుడు నాదేది? అని మీరంటిరి. ఓ పరమార్ధ జ్ఞానము కలవాడా? మీ మాటలు నా చెవిన పడినపుడు సంపూర్ణముగా పరమార్ధము తెలియనందున నా మనసు వ్యాకులమగుచున్నది. ఈ సంశయగ్రస్తమగు సంసారమునందు హితమును కలిగించునదేది? అని కపిలమహర్షిని అడుగుటకే నేను బయలుదేరి యుంటిని. ఈ మధ్యలో మీరు పలికిన మాట పరమార్ధమును తెలుసుకొనమని నా మనసును ప్రేరేపించుచున్నది. సర్వజగత్స్వరూపుడగు శ్రీమహావిష్ణువు అంశ##మే జగన్మోహనాశమునకు కపిలమహర్షిగా అవతరించెనని వింటిమి. ఆ భగవానుడు మాకు హితమును కూర్చు తలంపుచే ప్రత్యక్షమాయెనేమో? అని మీ మాటలు సందేహమును కలిగించుచున్నవి. కావున సమస్త విజ్ఞాన జలతరంగసముద్రమగు నీవు నా మోహము నశించుటకు ఉపయోగించు హితమునుపదేశించుము. 2 - 11 బ్రాహ్మణ ఉవాచ :- భూయః పృచ్ఛసి కిం శ్రేయః పరమార్ధే న పృచ్ఛసి, శ్రేయాంసి పరమార్ధాని హ్యశేషాణ్యవ భూపతే ! 12 దేవతారాధనం కృత్వా ధనసంపదమిచ్ఛతి, పుత్రానిచ్ఛతి రాజ్యం చ శ్రేయస్తసై#్యవ తన్నృప. 13 వివేకినస్తు సంయోగశ్శ్రేయో೭సౌ పరమాత్మనా, కర్మయజ్ఞాదికం శ్రేయస్స్వర్లోకఫలదాయి యత్. 14 శ్రేయః ప్రధానం చ ఫలే తదేవానభిసంహితే ఆత్మా ధ్యేయస్సదా భూప యోగయుక్తైస్తథాపరైః. 15 శ్రేయస్తసై#్యవ సంయోగశ్శ్రేయో యః పరమాత్మనః, శ్రేయాం స్యేవమనేకాని శతశో೭థ సహస్రశః. 16 సంత్యత్ర పరమార్ధాస్తు నత్వా తే శ్రూయతాం చ మే, ధర్మో೭యం త్యజతే కింతు పరమార్ధో ధనం యది. 17 వ్యయశ్చ క్రియతే కస్మాత్ కామప్రాప్త్యుపలక్షణః, పుత్రశ్చేత్పరమార్ధాఖ్యస్సో೭ప్యన్యస్య నరేశ్వర. 18 పరమార్ధభూతస్సో೭న్యస్య పరమార్ధో హి నః పితా, ఏవం న పరమార్ధో೭స్తి జగత్యత్ర చరాచరే. 19 పరమార్ధో హి కార్యాణి కరణానామశేషతః, రాజ్యాదిప్రాప్తిరత్రోక్తా పరమార్ధతయా యది. 20 పరమార్ధా భవంత్యత్ర న భవన్తి చ వై తతః, ఋగ్యజుస్సామనిష్పాద్యం యజ్ఞకర్మ మతం తవ. 21 పరమార్ధభూతం తత్రాపి శ్రూయతాం గదతో మమ, యత్తు నిష్పాద్యతే కార్యం మృదా కారణభూతయా. 22 తత్కారణానుగమనాత్ జాయతే నృప మృణ్మయమ్, ఏవం వినాశిభిర్ద్రవ్యైః సమిదాజ్యకుశాదిభిః. 23 నిష్పాద్యతే క్రియా యా తు సా భవిత్రీ వినాశినీ, అనాశీ పరమార్ధస్తు ప్రాజ్ఞైరభ్యుపగమ్యతే. 24 యత్తు నాశి న సందేహా నాశిద్రవ్యోపపాదితమ్, తదేవాఫలదం కర్మ పరమార్ధో మతో మమ. 25 ముక్తిసాధనభూతత్వాత్పరమార్ధో న సాధనమ్, ధ్యానమేవాత్మనో భూప పరమార్ధార్ధశబ్దితమ్. 26 భేదకారి పరేభ్యస్తు పరమార్ధో న భేదవాన్, పరమార్ధాత్మనోర్యోగః పరమార్ధ ఇతీష్యతే. 27 మిధ్యైతదన్యద్ద్రవ్యం హి నైతద్ద్రవ్యమయం యతః, తస్మాచ్ఛ్రేయాంస్యశేషాణి నృపైతాని న సంశయః. 28 పరమార్ధస్తు భూపాల సంక్షేపాచ్ఛ్రూయతాం మమ, ఏకో వ్యాపీ మసశ్శుద్ధో నిర్గుణః ప్రకృతేః పరః. 29 జన్మవృద్ధ్యాదిరహిత ఆత్మా సర్వగతో నృప, పరిజ్ఞానమయో సద్భిర్నామజాత్యాదిభిర్విభుః. 30 న యోగవాన్నయుక్తో೭భూన్నైవ పార్ధివ యోక్ష్యతి, తస్యాత్మపరదెహేషు సతో೭ప్యేకమయం హి తత్. 31 విజ్ఞానం పరమార్ధో7సౌ వేత్తి7నో తథ్యదర్శనః, వేణురన్థ్రవిభేదేన భేదష్షడ్జాదిసంజ్ఞితః. 32 అభేదో వ్యాపినో వాయోస్తథా తస్య మహాత్మనః, ఏకత్వం రూపభేదశ్చ బాహ్యాకర్మప్రవృత్తిజః. 33 దేవాదిభేదమధ్యాస్తే నాస్త్యేవాచరణో హి సః, శ్రుణ్వత్ర భూప ప్రాగ్వృత్తం యుద్గీతమృభుణా భ##వేత్. 34 అవబోధం జనయతో నిదాఘస్య ద్విజన్మనః బ్రాహ్మణుడు పలికెను :- మరల ఏమడుగుచున్నావు? శ్రేయస్సును పరమార్ధముగా నడుగుచుంటివా? అన్ని శ్రేయస్సులు పరమార్ధములుగానే చెప్పబడుచున్నవి. దేవతారాధనమును చేసి ధనసంపదను కోరును. పుత్రులను కోరును. రాజ్యమును కోరును. వారికవియే శ్రేయస్సులు. వివేకము కలవారికి మాత్రము పరమాత్మతో సంయోగమే శ్రేయస్సు. స్వర్గాది లోకఫలములనిచ్చు యజ్ఞాది కర్మలు కూడా శ్రేయస్సులే. ఫలమునాశించక చేయునది ప్రధానమగు శ్రేయస్సు. కావున యోగయుక్తలగు నరులు ఎల్లపుడు ఆత్మను ధ్యానించవలయును. ఇతరులు కూడా ఆత్మనే ధ్యానించవలయును. ఆత్మధ్యానమే నిజమగు శ్రేయస్సు. పరమాత్మ సంయోగమే శ్రేయస్సు. ఇట్లు కొన్నివందల వేల శ్రేయస్సులు కలవు. కాని ఇవియన్నియూ పరమార్ధములు కావు. నా మాటను వినుము. నిజముగా ధనమే పరమార్ధమగుచో ధనము నెందుకు విడుచుచున్నారు. కామఫలప్రాప్తి కొరకు వ్యయమెందుకు చేయుచున్నారు? పుత్రుడు పరమార్ధమైనచో అతడు కూడా ఇతరులకు ఈయబడుచున్నాడు. తీసుకొనువాడు పరమార్ధమన్నచో అతను కూడా ఇతరులకు తండ్రి యగును కదా? తండ్రి పరమార్ధమగుచో ఇతరుల కొరకేల తండ్రిని విడుచుచుంటివి? కావున ఈ జగత్తులో ఏ ఒక్కటీ నియతముగా పరమార్థమని చెప్పుటకు వీలు పడదు. సమస్త కారణములకు కార్యములను పరమార్ధముగా చెప్పబడుచున్నది. రాజ్యాది ప్రాప్తులను పరమార్ధములుగా చెప్పినచో పరమార్ధములగును. చెప్పనిచో పరమార్ధములు కాజాలవు. ఋగ్యజుస్సామములతో నిష్పన్నములగు యజ్ఞాదులు పరమార్ధములగుచో ఆవిషయమున నేను చెప్పుదానిని వినుము. కారణ భూతమగు మృదాదులచే నిష్పన్నమగునది కారణము ననుసరించి మృణ్మయమగును. అట్లే నశించు స్వభావముకల సమిధలు దర్భలు పుష్పములు మొదలగు ద్రవ్యములచే చేయబడు క్రియ కూడా వినాశియే యగును. పరమార్ధము నాశము లేనిదని పండితులంగీకరింతురు. నశించునది నశించుద్రవ్యములచే ఏర్పడినదనుట నిస్సందిగ్దమే. అది ఫలమునిచ్చునది కాదు. కావున ఫలము నీయని కర్మ పరమార్ధమని చెప్పవలయును. ముక్తికి సాధనమగు నదియే పరమార్ధమనిచో పరమార్ధము సాధనము కాజాలదు. ఆత్మధ్యానము మాత్రమే పరమార్ధమనబడును. ఇతరులు భేదమును కల్పింతురు కాని పరమార్ధమునకు భేదము లేదు. పరమార్ధమునకు ఆత్మకు సంయోగము మాత్రమే పరమార్ధము. మిగిలిన ద్రవ్యమును పరమార్ధమనుట మిధ్యయే యగును. పరమార్ధము ద్రవ్యమయము కాక పోవుటయే దానికి కారణము. కావున ఇవి యన్నియు శ్రేయస్సులు మాత్రమే కాని పరమార్ధములు కావు. పరమార్ధమును సంక్షేపముగా చెప్పెదను వినుము. ఒకడు, వ్యాపకుడు, సముడు, శుద్ధుడు, నిర్గుణుడు, ప్రకృతి కంటే పరుడు, జన్మవృద్ధ్యాది రహితుడు, సర్వగతుడు ఆత్మ. నామ జాత్యాదులచే సజ్జనులు తెలియుదురు. ఆత్మయే విభువు. ఆత్మయోగము కలది కాది, యుక్తము కాదు. యుక్తము కాబోదు. ఆ యాత్మ తన, ఇతర దేహములలో ఉన్ననూ ఒక్కటే కాని భిన్నము కాదు. ఆత్మను తెలియుటే పరమార్ధము. అసత్యమును చూచువారు దీనిని తెలియ జాలరు. వేణురంధ్రముల భేదములచే షడ్జాది స్వరభేదములు ఏర్పడును. కాని అన్నిరంధ్రములలో వ్యాపించియుండు వాయువు మాత్రము ఒక్కటే. అట్లే దేహాదులు భిన్నములైనను ఆత్మ ఒక్కటే. రూపభేదము బాహ్యకర్మప్రవృత్తులచే ఏర్పడినది మాత్రమే. రూపాది భేదములచే దేవాది భేదుమలను పొందును కాని ఆచరణలో మాత్రమే సమానమే. ఈ విషయమున పూర్వకాలమున జరిగినది ఋభువుచే చెప్పబడినది ఒకటి కలదు. వినుము. బ్రాహ్మణుడగు నిధాఘునకు చేసిన జ్ఞానోపదేశమది. 12 - 34 ఋభుర్నామా೭భవత్పుత్రో బ్రహ్మణః పరమేష్ఠినః. 35 విజ్ఞాతతత్త్వసద్భావో నిసర్గాదేవ భూపతే, తస్య శిష్యో నిదాఘో೭భూత్పులస్త్యతనయః పురా. 36 ప్రాదాదశేష విజ్ఞానం ప తసై#్మ పరయా ముదా, అవాప్తజ్ఞానతత్త్వప్య న తస్యాద్వైతవాసనా. 37 స ఋభుస్తర్కయామాస నిదాఘస్య నరేశ్వర, దేవకాయస్తటే వీర నాగరం నామ వై పురమ్. 38 సమృద్ధమతిరయ్య్‌ం చ పులసై#్యననివేశితమ్, రమ్యోపవనపర్యంతం స తస్యిన్పార్ధివోత్తమ. 39 నిదాఘనామా యోగజ్ఞస్తస్య శిష్యో೭భవత్పురా, దివ్యే వర్షసహస్తే తు సమతీతే೭స్య తత్పురమ్. 40 జగామ స ఋభుశ్శిష్యం నిదాఘమవలోకతుమ్, స తస్య వైశ్వదేవాంతే ద్వారాలోకనగోచరః. 41 స్థితస్తేన గృహీతార్ధో నిజవేశ్మ ప్రవేశితః, ప్రక్షాలితాంఘ్రిపాణిం చ కృతాసనపరిగ్రహమ్. 42 ఉవాచ స ద్విశ్రేష్టో భుజ్యతామితి సాదరమ్. పరమేష్ఠియగు బ్రహ్మకు ఋభువను పుత్రుడు కలడు. సహజముగా ఋభువ తత్త్వార్ధ జ్ఞానయు కలవాడు. ఆ ఋభువునకు పులస్త్యతనయుడగు నిదఘుడను వాడు శిష్యుడుగా ఉండెను. ఋభువు పరమానందముతో సమస్త విజ్ఞానయును బోధించెను. ఇట్లు తత్త్వ జ్ఞానయు కలిగిన నిదాఘనకు అద్వైత వాసన కలుగలేదని ఋభువు ఊహించెను. జ్ఞానమును పొందిన నిదాఘుడు నతన తండ్రివసించు నాగరమను పురమునకు వెళ్ళి నివసించెను. ఆ పురము దేవికానదీ తీరమున నుండెను. సర్వసంపత్సమృద్ధము, అతిసుందరము సుందరోపవనయుతము. ఆ నగరయున యోగజ్ఞుడగు నిదాఘుడు నివసించుచుండెను. దివ్యములగు వేయిసంవత్సరములు గడిచిన తరువాత తన శిష్యుడగు నిదాఘుని చూచుటకు ఋభువు వెడలెను. నిదాఘుడు వైశ్వదేవమును పూర్తిగావించిన పిదప ద్వారదేశయున ఋభుని చూచి లేచి ఎదురేగి స్వాగతము పలికి లోనికి తీసుకొని వచ్చి పాదప్రక్షాళముచేసి ఆసనయున కూర్చుండబెట్టి భుజించుడని పలికెను. 35 - 42 ఋభురువాచ :- భో విప్రవర్య భోక్తవ్యం యదత్ర భవతో గృహే, తత్కథ్యతా కదన్నేషు న ప్రీతిస్సతతం మమ. 43 ఋభువు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తయా! మీ గృహమున ఏమి తినవలయునో చెప్పుము. ఈ కుత్సితాన్నము నందు నాకు ప్రీతిలేదు. 43 నిదాఘ ఉవాచ :- పక్తుయావకవ్రీహీనామపూపానాం చ మే గృహే, యద్రోచతే ద్విజశ్రేష్ఠ తావద్భుంక్ష్వ యథేచ్ఛయా. 44 నిదాఘుడు పలికెను :- సత్తుపిండి, యవలు వ్రీహులచే చేయబడిన పదార్థములు అపూపములు నా ఇంటిలో సమృద్ధిగా నున్నవి. వాటిలో మీకు నచ్చిన వాటిని భుజించుడు. 44 ఋభురువాచ :- కదన్నాని ద్విజైతాని మిష్టమన్నం ప్రయచ్ఛ మే, సంయావపాయసాదీని చేక్షుకారసవంతి చ. 45 ఋభువు పలికెను :- ఇదియన్నియూ కదన్నములే. నాకు మిష్టాన్నమునిమ్ము భక్ష్యములను పాయసములను చెరుకు రసములను ఇమ్ము. 45 నిదాఘ ఉవాచ :- గృహే శాలిని మద్గేహే యత్కించిదతిశోభనమ్. 46 భోజ్యేషు సాధనం మిష్టం తేనాస్యాన్నం ప్రసాధయ, ఇత్యుక్తా తేన సా పత్నీ మిష్టమన్నం ద్విజస్య తత్. 47 ప్రసాధితవతీ తద్వై భర్తుర్వచనగౌరవాత్, తం భుక్తవంతమిచ్ఛాతో మిష్టమన్నం మహామునిమ్. 48 నిదాఘః ప్రాహ భూపాలప్రవ్రయావనతస్థ్సితః. 49 నిదాఘుడు పలికెను :- ఓ శాలినీ ! మన ఇంటిలో ఉన్న ఉత్తమ పదార్థములతో రుచికరమైన ఉత్తమాన్నమును సిద్ధము చేయుము అని భార్యతో పలుకగా నిదాఘుని భార్య రుచికరమైన ఆహారమును సిద్ధము చేసెను. ఋభుడు ఆ ఆహారమును భుజించెను. అపుడు నిదాఘుడు వినయముతో వినమ్రుడై ఋభునితో ఇల్లు పలికెను. 46 - 48 నిదాఘ ఉవాచ :- ఆపి తే పరమా తృప్తిరుత్పన్నా పుష్టిరేవ వా, అపి తే మానసం స్వస్ధం ఆహారేణ కృతం ద్విజ. 49 క్వ నివాసీ భవాన్వప్ర క్వ వాగంతుం సముద్యతః, ఆగమ్యతే చ భవతా యతస్తచ్చ నివేద్యతామ్ 50 నిదాఘుడు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! మీరు కోరిన రుచికరమైన ఆహారముతో మీకు తృప్తి పుష్టి కలిగినవా? మీ మనసుకు స్వస్ధత చేకూరినదా? మీరు ఎక్కడ నివసించుచున్నారు? ఎచటికి బయలుదేరుచున్నారు? ఎచటి నుండి వచ్చుచున్నారు? దయచేసి తెలుపుడు. 49 - 50 ఋభురువాచ :- క్షుధితస్య చ భుక్తే೭న్నే తృప్తిర్బ్రహ్మన్విజాయతే. 51 న మే క్షుధా భ##వేత్తృప్తిః కస్మాన్మాం ద్విజపృచ్ఛసి, వహ్నినా పార్ధివేనాదౌ దగ్ధే వై క్షుత్సా పార్ధివః 52 భవత్యంభసి చ క్షేణ నృణాం తృష్ణాసముద్భవః, క్షుత్తృష్ణే దేహధర్మాఖ్యే న మమైతే యతో ద్విజ! 53 తతః క్షుత్సంభవాభవాత్ తృప్తిరస్త్యేవ మే సదా, మనసస్స్వస్ధతా తుష్టిశ్చిత్తధర్మావిమౌ ద్విజ. 54 చేతసో యస్య యత్పృష్టం పుమానేభిర్న యస్యతే, క్వ నివాసస్తవేత్యుక్తం క్వ గంతాసి చ యత్త్వయా. 55 కుతశ్చాగమ్యతే త్వేతమ్ త్రితయే೭పి నిబోధ మే, పుమాన్సవర్గతో వ్యాపీత్యాకాశవదయం యతః. 56 కుతః కుత్ర క్వ గంతాసీత్యేతదప్యర్ధవత్కథమ్, సో೭హాం గంతా న చాగంతా నైకదేశనికేతనః. 57 త్వం చాన్యే చ న చ త్వం త్వం నాన్యే నైవాహమప్యహమ్, మిష్టాన్నే మిష్టమిత్యేషా జిహ్వా సా మే కృతా తవ. 58 కిం వక్ష్యతీత తత్రాపి శ్రూయతాం ద్విజసత్తమ, మిష్టమేన యదా మిష్టం తదేవోద్వేగకారణమ్. 59 అమిష్టం జాయతే మిష్టం మిష్టాదుద్విజతే జనః, ఆదిమధ్యావసానేషషే కిమన్నం రుచికారణమ్. 60 మృణ్మయం హి మృదా యద్వద్గృహం లిప్తం స్ధిరీభ##వేత్, పార్ధినో೭యం తథా దేహః పార్ధివైః పరమాణుభిః. 61 యవగోధూమముద్గాదిఘృతం తైలం పయో దధి, గుడః ఫలానీతి తథా పార్ధివాః పరమాణవః. 62 తదేతద్భవతా జ్ఞాత్వా మిష్టామిష్టవిచారి యత్, తన్మనశ్శమనాలంబి కార్యం ప్రాప్యం హి ముక్తయే. 63 ఇత్యాకర్ణ్య వచస్తస్య పరమార్ధాశ్రితం నృప, ప్రణిపత్య మహాభాగో నిదాఘో వాక్యమబ్రవీత్. 64 ప్రసీద మద్ధితార్ధాయ కథ్యతాం యస్త్వమాగతః నష్టో మోహస్తవాకర్ణ్య వచాంస్యేతాని మే ద్విజ. 65 ఋభువు పలికెను :- ఆకలిగొన్నవాడు అన్నమును భుజించినచో తృప్తి కలుగును, నాకు ఆకలి లేదు. తృప్తిలేదు. నన్నేల అడుగుచున్నావు? అగ్నిచే పార్ధివము దహించబడగా ఆకలి కలుగును. దానిని పార్ధవక్షుత్ అందురు. శరీరములోని నీరు తరిగినచే దప్పియగును. మనసు అగిగిన దానితో జీవునకు సంబంధములేదు. మీనివాసమోక్కడ? మీరెక్కడికి వెళ్ళుచున్నారు? ఎక్కడి నుండి వచ్చుచున్నారు? అని నీవడిగితివి. ఈ మాటి విషయమున నేను చెప్పుదానిని తెలియుము. జీవుడు ఆకాశము వలె అంతటా వ్యాపించియుండును. కావున ఎక్కడ, ఎచటినుండి? ఎచటికి? అను ప్రశ్నలకు అర్ధమెట్లుండును? జీవుడనగు నేను వెళ్ళువాడను కాను, వచ్చువాడను కాను. ఒకే ప్రదేశమున ఉండువాడను కాను. నీవు కాని ఇతరులు కాని ఇంతియే. నావు నీవు కావు. నేను నేను కాను ఇతరులు ఇతరులు కారు. రుచికరమైన ఆహారమును కోరినది జిహ్వ. రుచిన తెలుపునదికూడా జిహ్మయే. ఆ జిహ్వ ఏమి చెప్పునో వినుము. రుచికరమైనది నిజముగా రుచించినచో ఉద్వేగమును కలిగించును. రుచి లేనిది రుచి కలిగించును. రుచి కలిగిన ఉద్వేగము కలుగును. ఆదిమధ్యావసానములో అన్నము రుచి కారణమగునా? మట్టితో నిర్మించిన ఇంటిని మరల మట్టిచే చక్కగా పై పూత పూసినచో స్థిరముగా నుండును. అట్లే పార్ధివమైన ఈ దేహము పార్ధివ పరమాణువులచే దృఢమగును. యవలు, గోధుమలు, పెసలు, ఘృతము, లైలము, పాలు, పెరుగు గుడము ఫలములు ఇవియన్నియు పార్ధివ పరమాణు సంఘాతములే. దీనిని తెలుసుకొని మిష్టమో అమిష్టమో ఆలోచించుము. అట్లాలోచించినచో మనశ్శాంతి కలుగును. అపుడు ముక్తికి ప్రయత్నించవలయును. ఇట్లు ఋభువు పలికిన పరమార్ధయుక్తమగు వచనమును వినిన నిదాఘుడు ప్రణామముల నాచరించి ఇట్లు పలికెను. ఓ మహానుభావా? ప్రసన్నుడవు కమ్ము. మీరు నాకు హితమును కూర్చుటకే వచ్చియుంటిరి. ఓ బ్రాహ్మణోత్తమా? మీరు పలికిన మాటలను విన నా మోహము తొలిగినది. ఋభురువాచ:- ఋభురస్మి తవాచార్యః ప్రజ్ఞాదానాయ తే ద్విజ!, ఇహగతో೭హం దాస్యామి పరమార్ధం సుబోధితమ్. 66 ఏక ఏవమిదం విద్ది న భేది సకలం జగత్, వాసుదేవాభిధేయస్య స్వరూపం పరమాత్మనః. 67 ఋభువు పలికెను :- నేను ఋభుడను వాడను, నీ ఆచార్యుడను. నీకు జ్ఞానమును ప్రసాదించుటకు ఇటకొచ్చితిని. నీకు చక్కని పరమార్ధమును సులభముగా బోధించెదరు. ఈ జగత్తంతయూ ఒకటే. భిన్నము కాదు. ఈ ప్రపంచమంతయూ మరమాత్మయగు వాసుదేవుని స్వరూపమే. 66 - 67 బ్రాహ్మణ ఉవాచ :- తథేత్యుక్త్వా నిదఘేన ప్రణిపాతపురస్సరమ్, పూజితః పరయా భక్త్యా నిశ్చితః ప్రయ¸° విభుః 68 పునర్వర్షసహస్రాంతే సమాయాతో నరేశ్వర !, నిదాఘజ్ఞానదానాయ తదేవ నగరం గురుః. 69 నగరస్య బహిస్సో೭థ నిదాఘం దృష్టవాన్మునిమ్, మహాబలపరీవారే పురం విశతి పార్ధివే. 70 దూరస్ధితం మహాభాగ జనసంమర్ధవర్జకమ్, క్షత్కామకంఠమాయాంతమరణ్యాత్స సమిత్కుశమ్. 71 దృష్ట్వా నిదాఘం స ఋభురుపాగత్యాభివాద్య చ, ఉవాచ కస్మాదేకాంతే స్థీయతే భవతా ద్విజ. 72 బ్రాహ్మణుడు పలికెను :- నిదాఘుడు అట్లే అని పలికి పరమభక్తితో పూజించగా పూజను స్వీకరించి సంతృప్తితో వెడలిపోయెను. మరల వేయిసంవత్సరములు గడిచిన పిదప నిదాఘునకు జ్ఞానమునిచ్చుటకు ఆదే నగరమునకు వచ్చెను. నగరము వెలుపల ఋభువు మునిగా నున్న నిదాఘుని చూచెను. మహాసైన్యముతో రాజు నగరములోనికి ప్రవేశించుచుండగా జన సమ్మర్దములేని ఏకాంత ప్రాంతమున దూరముగా నున్న వానిని ఆకలి దప్పులచే శుష్కగాత్రునిగా అరణ్యమునుండి సమిధలను దర్భలను తెచ్చుచున్న నిదాఘుని చూచెను. అట్లు నిదాఘుని చూచిన ఋభువు నిదాఘుని సమీపించి అభివాదము చేసి నీవట్లేకాంతమున ఎందుకుంటివి? అని అడిగెను. నిదాఘ ఉవాచ :- భో విప్ర జనసమ్మర్దో మహానేష జనేశ్వరే, ప్రవివిక్షౌ పురే రమ్యే తేనాత్ర స్ధీయతే మయా. 73 నిదాఘుడు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! ఈ జానాధిపుడు నగరమును ప్రవేశించుచున్నపుడు చాలా జనసమూహమున్నది. కావున నేనిచట ఉంటిని. ఋభురువాచ :- నరాధపో೭త్ర కతమః కతమశ్చేతరో జనః కథ్యతాం మే ద్వజశ్రేష్ఠ త్వమిభిజ్ఞో మతో మమ. 74 ఋభువు పలికెను :- ఇక్కడున్న వారిలో రాజెవరు? ఇతరులెవరు? నీవు బాగా తెలిసిన వాడవు. కావున నాకు తెలుపుము. నిదాఘ ఉవాచ :- యో೭యం గజేన్ద్రమున్మత్తమద్రిశృంగసముచ్ఛ్రయమ్, అధిరూఢో నరేన్ద్రో೭యం పరితో యస్తదేతరః 75 నిదాఘుడు పలికెను :- పర్వత శిఖరము వలె ఎత్తుగానున్న గజేన్ద్రుని అధిరోహించియున్నవాడు రాజు. అతని చుట్టూ ఉన్నవారు ఇతర జనులు. ఋభురువాచ :- ఏతౌ హి గజరాజానౌ దృష్టౌ హి యుగపన్మయా, భవతా నిర్విశేషేణ పృథగ్వేదోపలక్షితా. 76 తత్కథ్యతాం మహాభాగ విశేషో భవతానయోః, జ్ఞాతుమిచ్ఛామ్యహం కో೭త్ర గజః కో వా నరాధిపః. 77 ఋభువు పలికెను :- నేను మాత్రము గజమును రాజును ఒకేమారు ఒకేనవిధముగా చూచుచున్నాను. నీవు మాత్రము విడిగా గుర్తించుచున్నావు. కావున ఓ మహానుభావా? ఈ గజరాజులకున్న భేదమును తెలుపుము. ఎవరు గజమో ఎవరు రాజో చెప్పుము. నిదాఘ ఉవాచ :- గోజో యో೭యమథో బ్రహ్మన్నుపర్యసై#్యష భూపతిః, వాహ్యావాహకసంబంధం కో న జానాతి వై ద్విజ. 78 నిదాఘుడు పలికెను :- ఓ బ్రాహ్మణా! క్రింద నున్నది గజము పైన ఉన్నవాడు రాజు. ఈ ఇద్దిరి కున్న వాహ్యవాహక సంబంధమును తెలియని వారెవరు? ఋభురువాచ :- బ్రహ్మన్నథాహం జానీయాం తథా మామవబోధయ, అధస్సత్త్వవిభాగం కిం కిం చోర్ధ్వమభిధీయతే. 79 ఋభువు పలికెను :- ఓ బ్రాహ్మణా నాకు తెలియునట్లు తెలుపుము. అధోభాగమనగా నేమి? ఊర్ధ్వభాగమనగానేమి? ఈ విభాగమును తెలుపుము. బ్రాహ్మణ ఉవాచ :- ఇత్యుక్త్వా సహసారుహ్య నిదాఘః ప్రాహ తం ఋభుమ్, శ్రూయతాం కథయామ్యేష యన్నాం త్వం పరిపృచ్ఛసి. 80 ఉపర్యహం యథా రాజా త్వమధః కుంజరో యథా, అవబోధయ తే బ్రహ్మన్దృష్టాంతో దర్శితో మయా. బ్రాహ్మణుడు పలికెను :- ఈ మాటను వినిన వెంటనే నిదాఘుడు ఋభువు నధిరోహించి నీవడిగిన దానిని చెప్పెదను వినుము. రాజువలె నేను పైన ఉంటిని. ఏనుగు వలె నేవు క్రిందనుంటివి. ఇపుడు ఈ దృష్టాంతముతో తెలియుము. ఋభురువాచ :- త్వం రాజేవ ద్విజశ్రేష్ఠ స్ధితో೭హం గజవద్యది, తదేవ త్వం సమాచక్ష్వ కతమస్త్వమహం తథా. 81 ఋభువు పలికెను :- నీవు రాజువలె నేను ఏనుగు వలె ఉన్నచో మొదట నీవెవరు? నేనెవరో తెలుపుము. బ్రాహ్మణ ఉవాచ :- ఇత్యుక్తస్సత్వరస్తస్య చరణావభివాద్య సః, నిదాఘః ప్రాహ భగవన్ ఆచార్యస్త్వమృభుర్మమ. 82 నాన్నస్యాద్వైతసంస్కారసంస్కృతం మానసం తథా, యథాచార్యస్య తేన త్వా మన్యే ప్రాప్తంమహం గురుమ్. 83 బ్రాహ్మణుడు పలికెను :- ఋభువు మాటలను వినిన నిదాఘుడు త్వరపడి వెంటనే క్రిందికి దిగి, పాదములపై బడి ప్రణమిల్లి మీరు మా ఆచార్యులగు ఋభువులు. ఇతరుల కిట్లు అద్వైత సంస్కారముగల మనసుండదు, కావున నేను మిమ్ములను ఆచార్యులనుగా గుర్తించితిని అని పలికెను. ఋభురువాచ :- తవోపదేశదానాయ పూర్వశుశ్రూషణాత్తవ, గురుస్నేహాదృభుర్నామ నిదాఘం సముపాగతః. 85 తదేతదుపదిష్టం తే సంక్షేపేణ మహామతే !, పరమార్థసారభూతం యత్తదద్వైతమశేషతః. 86 ఋభువు పలికెను :- నీవు మొదట చేసిన సేవలవలన నీకు ఉపదేశించుటకు గురుస్నేహముచే ఋభువు నిదాఘుని చేరెను. ఓ మహామతీ! పరమార్ధసారభూతమైన అద్వైతమును సమగ్రముగా సంక్షేపముగా నీకుపదేశించితిని. బ్రాహ్మణ ఉవాచ :- ఏవముక్త్వా దదౌ విద్యాం నిదాఘం స ఋభుర్గురుః, నిదాఘో೭ప్యుపదేశేన తేనాద్వైతపరో೭భవత్. 87 సర్వభూతాన్నభేదేన దదృశే స తదాత్మనః, తథా బ్రహ్మతనౌ ముక్తిమవాప పరమో ద్విజః. 88 తథా త్వమసి ధర్మజ్ఞ తుల్యాత్మరిపుబాంధవః, భవ సర్వగతం జ్ఞానం ఆత్మానమవనీపతే. 89 సితనీలాదిభేదేన యథైవం దృశ్యతే నభః, భ్రాంతదృష్టిభిరాత్మాపి తథైకస్సన్పృథక్ పృథక్. 90 ఏకస్సమస్తం యదిహాస్తి కించిత్ తదచ్యుతో నాస్తి పరం తతో೭న్యత్, సో೭హం స చ త్వం స చ సర్వమేతత్ ఆత్మా స్వయం భాత్యపభేదమోహః. బ్రాహ్మణుడు పలికెను :- ఇట్లు గురువగు ఋభువు నిదాఘుని గూర్చి పలికి అద్వైతవిద్యను బోధించెను. ఆ యుపదేశముచే నిదాఘుడు కూడా అద్వైతపరుడాయెను. అపుడు తనను ఇతర ప్రాణులను అభేదముగా చూడగలిగెను. అట్లు అద్వైత జ్ఞానముచే కొంతకాలమునకు నిదాఘుడు బ్రహ్మస్వరూపమును లీనమై ముక్తిని పొందెను. అట్లే నీవు కూడా ధర్మజ్ఞుడవై శత్రుమిత్రులలో సమభావము కలవాడవై ఆత్మ సర్వగతము ఏకము అని తెలియుము. ఒకటే ఆకాశము నలుపు తెలుపు బేధముచే ఎట్లు కనపుడుచున్నదో అట్లే భాంత్రదృష్టి గలవారికి ఒకే ఆత్మ భిన్నముగా కలనపడును. ఈ లోకమున ఉన్నదంతయూ ఒకే ఆత్మ. ఆత్మకంటే భిన్నమైనది మరియొకటి లేదు. అదియే అచ్చుత నామము. ఆ యచ్యుతుడే నేను. నీవు. ఈ సమస్త ప్రపంచము. ఆ పరమాత్మ భేదమోహశూన్యముగా నుండును. సనందన ఉవాచ :- ఇతీరితస్తేన స రాజవర్యస్తత్యాజ భేదం పరమార్ధదృష్టిః, స చాపి జాతిస్మరాణావబోధస్తత్త్రైవ జన్మన్నపవర్గమాప. 92 పరామార్ధాధ్యాత్మమేతత్తుభ్యముక్తం మునీశ్వర, బ్రాహ్మణక్షత్రియవిశాం శ్రోతౄణాం చాపి ముక్తిదమ్. 93 యథా పృష్టం త్వయా బ్రహ్మన్ తథా తే గదితం మయా, బ్రహ్మజ్ఞానమిదం శుద్ధం కిమన్యత్కథాయామి వై. 94 ఇతి శ్రీబృహన్నారదీయపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే ఏకోనపంచాశత్తమో೭ధ్యాయః సనందన మహర్షి పలికెను :- ఇట్లు బ్రాహ్మణుని ఉపదేశమును పొందిన ఆ రాజశ్రేష్ఠుడు పరమార్దదృష్టికలవాడై భేదదృష్టిని విడిచెను. ఆ బ్రాహ్మణుడు కూడా పూర్వజన్మజ్ఞానముచే ఆ జన్మలోనే మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా! ఇట్లు ఈ పరమార్ధమగు ఆధ్యాత్మజ్ఞానమును నీకు ఉపదేశించితిని. ఈ జ్ఞానము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు విను వారందరికీ మోక్షము ప్రసాదించును. నీవడిగినట్లు నేను చెప్పితిని. ఇదియే పరిశుద్ధమగు బ్రహ్మజ్ఞానము. ఇంకనూ ఏమి చెప్పవలయునో అడుగుము. ఇది శ్రీబృహన్నారదీయపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున రెండవపాదమున నలుబది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.