Sri Naradapuranam-I    Chapters    Last Page

పంచాశత్తమోధ్యాయః = యాబదియవ అధ్యాయము

బృహదుపాఖ్యానమ్‌

సూత ఉవాచ :-

శ్రుత్వా సనందనస్యేత్ధం వచనం నారదో మునిః అసంతుష్ట ఇవ ప్రాహ భ్రాతరం తం సనందనమ్‌. 1

సూత మహర్షి పలికెను :- నారద మహర్షి ఇట్లు సనందనమహర్షి మాటలను విని సంతృప్తి పొందని వానివలె భ్రాతయగు సనందనుని ఇట్లు పలికెను. 1

నారద ఉవాచ :-

భగవస్సర్వమాఖ్యాతం యత్పృష్టం భవతో మయా, తథాపి నాత్మా ప్రీయేత శృణ్వన్హరికథాం ముహుః. 2

శ్రూయతే వ్యాసపుత్రస్తు శుకః పరమధర్మవిత్‌, సిద్ధిం సుమతీం ప్రాప్తో నిర్వణ్ణోవాంతరం బహిః. 3

బ్రహ్మన్పుంసస్తు విజ్ఞానం మహతాం సేవనం వినా, చ జాయతే కథం ప్రాప్తో జ్ఞానం వ్యాసాత్మజో శిశుః. 4

తస్య జన్మరహస్యం మే కర్మ చాప్యస్య శృణ్వతే, సమాఖ్యాహి మహాభాగ మోక్షశాస్తార్ధవిద్భవాన్‌. 5

నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా! నేనడిగిన విషయములన్నిటిని మీరు చెప్పితిరి. అయిననూ హరికథలను ఎన్నిమార్లు వినిననూ ఆత్మకు సంతృప్తి కలుగుట లేదు. వ్యాస పుత్రుడగు శుకుడు పరమధర్మములను తెలుసుకొని అంతరంగమున బహిరంగమున తృప్తిని మహాసిద్దిని పొందెనని వినియుంటిని. జీవునకి మహానుభావుల సేవ చేయనిదే విజ్ఞానము కలుగదు కదా? వ్యాస పుత్రుడు శైశవములోనే జ్ఞానమునెట్లు పొందెను? శురమహర్షి జన్మరహస్యమును, కర్మలను వినగోరు నాకు తెలుపుము. మీరు మోక్ష శాస్త్రార్ధములను తెలిసిన మహానుభావులు.

సనందన ఉవాచ :-

శృణు విప్ర ప్రవక్ష్యామి శుకోత్పత్తిం సమాసతః, యాం శ్రుత్వా బ్రహ్మత్త్వజ్ఞో జాయతే మానవో మునే. 6

న హయనైర్న పలితైర్నవిత్తేన న బంధుభిః, ఋషయశ్చక్రిరే ధర్మం యోనూచానస్స నో మహాన్‌. 7

సనందన మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? సంగ్రహముగా శుకోత్పత్తిని చెప్పెదను. వినుము. ఈ శుకోత్పత్తిని వినిన మానవుడు బ్రహ్మజ్ఞానమును పొందును. సంవత్సరములచే, ఫలితములచే, ధనముచే బంధువులచే ఋషులు ధర్మమునాచరించలేదు. అనూచానమునే ఆచరించిరి. అనూచానమే ఉత్తమము.

నారద ఉవాచ :-

అనూచానం కథం బ్రహ్మన్‌! పుమాన్భవతి మానద !, తన్మే కర్మ సమాచక్ష్వ శ్రోతు కౌతూహలం మమ. 8

నారద మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా మానవుడు అనూచానుడెట్లగను? అనూచానమనగానేమి? ఆ కర్మను చెప్పుము. వినవలయునని నాకు కోరికయున్నది.

సనందన ఉవాచ :-

శృణు నారద వక్ష్యామి హ్యనూచానస్య లక్షణమ్‌, యజ్‌ జ్ఞాత్వా సాంగవేదానామభిజ్ఞో జాయతే నరః. 9

శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం జ్యోతిషం తథా, ఛన్ధశ్శాస్త్రం షడేతాని వేదాంగాని విదుర్బుదాః. 10

ఋగ్వేదోథ యజుర్వేదస్సామవేదో హ్యధర్మణః, వేదాశ్చత్వార ఏవైతే ప్రోక్తా ధర్మనిరూపణ. 11

సాంగాన్వేదాన్గురోర్యస్తు సమధీతే ద్విజోత్తమః, సోనూచానః ప్రభవతి నాన్యధా గ్రంథకోటిభిః. 12

సనందన మహర్షి పలికెను :- ఓ నారదా? అనూచాన లక్షణమును చెప్పెదను. ఇనుము. అనూచాన లక్షణమును తెలియువాడు సాంగవేదములను తెలియగలడు. శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను ఈ ఆరు వేదాంగములను పండితులు తెలియుదురు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నీ నాలుగు వేదములని ధర్మనిరూపణమున చెప్పబడినవి. గురువు వలను సాంగవేదములను అధ్యయనము చేయు మనవోత్తముడు అనూచానుడనబడును. స్వయముగా కోటి గ్రంథములను చదివిననూ అనూచానుడు కాజాలడు.

నారద ఉవాచ :-

అంగానాం లక్షణం బ్రూహి వేదానాం చాపి విస్తరాత్‌, త్వమస్మాను మహావిజ్ఞస్సాంగేష్వేతేషు మానద! 13

నారద మహర్షి పలికెను :- వేదాంగముల లక్షణమును, వేదముల లక్షణమును విస్తరముగా తెలుపుము. ఓ మహానుభావా! నీవు సాంగవేదములందు విజ్ఞుడవు.

సనందన ఉవాచ :-

ప్రశ్నభారోయమతులస్త్వయా మమ కృతే ద్విజ, సంక్షేపాత్కథయిష్యామి సారమేషాం సునిశ్చితమ్‌. 14

స్వరః ప్రధానశ్శిక్షాయాం కీర్తితో మునిభిర్ద్విజైః వేదానాం వేదవిద్భిస్తు తచ్ఛృణుష్య వదామి తే. 15

ఆర్చికం గాధికం చైవ సామికం చ స్వరాన్తరమ్‌, కృతాంతే సర్వశాస్త్రాణాం ప్రయోక్తవ్యో విశేషతః. 16

ఏకాంతరో స్వరో హ్యప్సు గాధాసు ద్వ్యంతరస్స్వరః, సామసు త్య్రంతరం విద్యాదేదావతస్స్వరతోన్తరమ్‌. 17

ఋక్సామయజురంగాని యే యజ్ఞేషు ప్రయుంజతే, అవిజ్ఞానాద్ధి శిక్షాయాస్తేషాం భవతి విస్వరః 18

మన్త్రో హీనస్స్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్తో న తమర్ధమాహ,

స వాగ్వజ్రో యజమానం హినస్తి యథేన్ద్రశత్రుస్స్వరతోపరోధాత్‌. 19

ఉరః కంఠశ్శిరశ్చైవ స్థానాని త్రీణి వాఙ్మయే, సవనాన్యాహురేతాని సామ వాప్యర్ధతోతరమ్‌. 20

ఉరస్సప్తవివారం స్యాత్‌ తథా కంఠస్తథా శిరః, న చ శక్తోసి వ్యక్తస్తు తథా ప్రావచనావిధిః. 21

కఠకాలపవృత్తేషు తైత్తిరాహ్వరకేషు చ, ఋగ్వేదే సామదేదే చ వక్తవ్యః ప్రథమస్స్వరః. 22

ఋగ్వేదస్తు ద్వితేయేన తృతీయేన చ వర్తతే, ఉచ్చమధ్యమసంఘాతస్స్వరో భవతి పార్ధివః 23

తృతీయప్రధమక్రుష్టా కుర్వంత్వాహ్వరకాన్స్వరాన్‌, ద్వితీయాద్యాస్తు మంద్రాంతాః తైత్తిరీయాశ్చతుస్స్వరాన్‌. 24

ప్రథమశ్చ ద్వితీయశ్చ తృతీయోథ చతుర్ధకః, మంద్రః క్రుష్టో మునీశ్వరైరేతాన్కుర్వన్తి సామగాః. 25

ద్వితీయప్రథమావైతానాండిభాల్లవినౌ స్వరా, తథా శాతపథావేతౌ స్వరౌ వాజసనేయినామ్‌. 26

ఏతే విశేషతః ప్రోక్తా స్స్వరా సార్వవైదికాః ఇత్యేతచ్చచరితం సర్వం స్వరాణాం సార్వవైదికమ్‌. 27

సామవేదే తు వక్ష్యామి స్వరాణాం చరితం యథా, అల్పగ్రంథం ప్రభూతార్ధం సామవేదాంగముత్తమమ్‌. 28

తానరాగస్వరాగ్రామమూర్ఛనానాం తు లక్షణమ్‌, పవిత్రం పావనం పుణ్యం యథా తుబ్యం ప్రకీర్తితమ్‌. 29

శిక్షామాహుర్ద్విజాతీనాం ఋగ్యజుస్సామలక్షణమ్‌, సప్తస్వరాస్త్రయో గ్రామా మూర్ఛనాస్త్వేకవిశతిః. 30

తానా ఏకోనపంచాశదిత్యేతత్స్వరమండలమ్‌, షడ్జశ్చ ఋషభ##శ్చైవ గాంధారో మధ్యమస్తథా. 31

పంచమో ధైవతశ్చైవ విషాదస్సప్తమస్స్వరః, షడ్జమధ్యమగాంధారాస్త్రయో గ్రామాః ప్రకీర్తితాః. 32

భూర్లోకాజ్ఞాయతే షడ్జో భువర్లోకాచ్చ మధ్యమః, స్వర్గభ్రాచ్చైవ గాంధారో గ్రామస్ధానాని త్రీణి హి. 33

స్వరాణాం చ విశేషేణ గ్రామరాగా ఇతి స్మృతాః, వింశతిర్మధ్యమగ్రామే షడ్జగ్రామే చదుర్దశ. 34

తానాస్పంచ దశేచ్ఛంతి గాంధారే సామగాయినామ్‌, నదీ విశాలా సుముఖీ చిత్రాచిత్రవతీ ముఖా. 35

చాలా వాప్యధ విజ్ఞేయా దేవానా సప్తమూర్ఛనాః, ఆప్యాయనీ విశ్వభృతా చంద్రా హేమా కపర్దినీ. 36

మైత్రీ చ బార్హతీ చైవ పితౄణాం సప్త మూర్ఛనాః, షడ్జే తూత్తరమంద్రా స్యాదృషభే చాభిరూహతా. 37

అశ్వక్రాంతా తు గాంధారే తృతీయా మూర్ఛనా స్మృతా, మధ్యమే ఖలు సౌవీరా హృషికా పంచమే స్వరే. 38

దైవతే చాపి విజ్ఞేయా మూర్ఛనా తూత్తరా మతా, నిషాదే రజనీం విద్యాత్‌ ఋషీణాం సప్త మూర్ఛనాః. 39

ఉపజీవన్తి గంధర్వా దేవానాం సప్త మూర్ఛానాః, పితౄణాం మూర్చనాస్సప్త తథా యక్షా న సంశయః. 40

ఋషీణాం మూర్చనాస్సప్త యాస్త్విమా లౌకికాస్స్మతాఃచ, షడ్జః ప్రీణాతి వై దేవాన్‌ ఋషీన్ప్రీణాతి చర్షభః. 41

పితౄన్ప్రీణాతి గాంధారో గంధర్వాన్మధ్యమస్స్వరః, దేవనృషీన్పితౄంశ్చైవ స్వరః ప్రీణాతి పంచమః. 42

యక్షాన్నిషాదః ప్రీణాతి భూతగ్రామం చ ధైవతః, గానస్య తు దశవిఢా గుణవృత్తిస్తు తద్యథా. 43

సనందన మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! నీవు చాలా కష్టతరమగు ప్రశ్ననడిగితిని. వేదవేదాంగముల సారమును సంక్షేముగా నిశ్చితముగా చెప్పెదను. మునులు ద్విజులు శిక్షలో స్వరము ప్రధానమని చెప్పియున్నారు. వేదవిదులు వేదములలో చెప్పిన వాటిని తెలిపెదను. వినుము. ఆర్చికము గాధికము సామికము అని సర్వశాస్త్రసిద్ధాంతముగా విశేషించి ప్రయోగించవలయును. ఏకమాత్రవ్యవధానము కల స్వరము ఋక్కులలో, గాధలలో మాత్రాద్వయావ్యవధానము కలస్వరము, సామయున త్రిమాత్రవ్యవధానముగా నుండును. ఇదయే సామన్యముగా స్వరలక్షణము. యజ్ఞములలో ప్రయోగించబడు ఋక్సామయజురంగములలో శిక్షజ్ఞానము లేనిచో అపస్వరాము కలుగును. స్వరహీనము వర్ణహీనమగు మంత్రమును అపరిశుద్ధముగా పలికినచో అభిప్రేతమగు నర్ధమును చెప్పజాలదు. అట్లు దుష్టమగు వాగ్వజ్రము యజమానికి హాని కలిగించును. ఇంద్రశత్రుపదము అపస్వరముగా పలికినందున ఇంద్రుని శమింపచేయువాడు అను అర్ధమును కాక ఇంద్రునిచే శమింప చేయబడువాడు అనునర్ధమును బోధించునటుల. వాఞ్మయమున వక్షస్థ్సలము, కంఠము, శిఠము అని మూడు స్ధానములుండును. ఈ మూడింటినే సవనములందురు. అర్ధమాత్రాంతరమున్నచో సామ అనికూడా అందురు. వక్షస్ధ్సలము కంఠము శిరము సప్తవివరములు కలిగియుండును. వివరములులేనిచో స్వరము బయలుపరచ శక్యము కాదు. ఇదయే ప్రవచన విధి. కఠకాలాప వృత్తములలో తైత్తిర ఆహ్వరకములలో, ఋగ్వేదము ద్వితీయ తృతీయ స్వరములతో కూడ యుండును. ఉచ్చ మధ్యమ సంఘాతమే స్వరమనబడును. ఆహ్వరకములందు తృతియ ప్రధమ స్వరములను చెప్పవలయును. ద్వితీయమునుంéడి మంద్రము వరకు తైత్తిరీయ స్వరములందురు. సామగానము చేయు మునీశ్వరులు ప్రధమ ద్వితీయ తృతీయ చదుర్ధ మంద్ర క్రుష్ట స్వరములను ప్రయోగింతురు. ద్వితీయ ప్రధమ స్వరములు నాండిభాల్లవులనబడును. ఇవియే వాజసనేయులకు శాతపధస్వరములు. వైదికులందరూ ఈ స్వరములను విశేషించి చెప్పియున్నారు. ఇదియే సర్వవేదముల స్వరముల సంగ్రహ చరిత్ర.

ఇక ఇపుడు సావమేదస్వరముల చరితమును చెప్పెదను వినుము. సామవేదాంగము అల్పగ్రంధము విస్తరార్ధముగా నుండును. ఈ సామవేదములో తానరాగ స్వర గ్రామ మూర్ఛనా లక్షణములను తెలియుట పవిత్రము, పావనము, పుణ్యము. కావుననే నీకు చెప్పుచున్నాను. ద్విజులు అధ్యయనము చేయు ఋగ్యజుస్సామ లక్షణమునే శిక్షయందును. ఏడుస్వరములు, మూడుగ్రామములు, ఇరువది యొకటి మూర్ఛనలు, నలుబది తొమ్మిది తానమలు, ఇదియంతయు కలసి స్వరమండలమనబడును. షడ్జ, ఋషభి, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత నిషాదములను ఏడు స్వరములు. షడ్జ మధ్యమ గాంధారములు అను మూడు గ్రామములనబడును. షడ్జము భూలోకమునుండి పుట్టును. భువర్లోకమునుండి మధ్యమము పుట్టును. సువర్లోకము నుండి గాంధారము పుట్టును. ఈ మూడు గ్రామ స్థానములు. స్వరములకు విశేషముగా గ్రామరాగములకి పేరు. మధ్యమ గ్రామమున ఇరువది, షడ్జగ్రామమును పదునాలుగు, రాగములుండును. సామగానమును చేయువారు గాంధారమున పంచదశ తానములను చెప్పెదరు. నదీ, విశాలా, సుముఖీ, చిత్రా, చిత్రవతీ, ముఖా, బలా అను నీ ఏడు దేవ మూర్ఛనలు, ఆప్యాయినీ, విశ్వభృతా, చంద్రా, హేమా, కపర్దినీ, మైత్రీ, బార్హతీ అను ఏడు మూర్ఛనలు పితృదేవతలవి. షడ్జమున ఉత్తరమంద్రము, ఋషభమున ఆరోహణము, గాంధారమున అశ్వక్రాంతము, అను మూడవ మూర్ఛనయుండును. మధ్యమమున సౌవీర, పంచమ స్వరమున హృషీకా, ధైవతమున ఉత్తరామూర్ఛన యుండును. నిషాదమున రజనీ, ఇట్లు ఋషులకు ఏడు మూర్ఛనలుండును. దేవతల సప్త మూర్చనలనే గాంధర్వులు గానము చేతురు. పితృదేవతల మూర్ఛనలను యక్షులు గానము చేతురు. ఋషుల సప్తమూర్ఛనలే లౌకికములనబడుచున్నవి. షడ్జస్వరము దేవతలకు ప్రీతి కలిగించును. ఋషభ స్వరము ఋషులను ప్రీతులను చేయును. గాంధారము పితృదేవతలను ప్రీతులను చేయును. మధ్యమ స్వరము గంధర్వులను ప్రీతులను చేయును. పంచమ స్వరము దేవతలను పితృదేవతలను ఋషులను ప్రీతులను చేయును. యక్షులను నిషాదము, ప్రాణిసమూహమును దైవతము సంతోషపరచును. గానమునకు దశవిధములనుగా గుణవృత్తులుండును. వినుము.

రక్తం పూర్ణమలంకృతం ప్రసన్నం వ్యక్తం వికృష్టం, శ్లక్లం సమం సుకుమారం మధురమితి గుణాస్తత్ర

రక్తం నామ వేణువీణాస్వరాణామే కీభావం రక్తమిత్యుచ్యదే. పూర్లం నామ స్వరశ్రుతిపూరణా చ్ఛందః

పాదక్షరం సంయోగాత్పూర్ణమిత్యుచ్యతే. ఆలంకృతం నామ, ఉరసి శిరపి కంఠయుక్తమిత్యలంకృతం,

ప్రసన్నం నామాపగత గద్గదనిర్విశంకం ప్రసన్నమిత్యుచ్యతే. వ్యక్తం నామ పదపదార్థప్రకృతివికారాగమనోపకృత్తద్ధితసమాసధాతుని

పాతో పసర్గస్వరలింగం, వృత్తివార్తికవిభక్త్యర్ధవచనానాం సమ్యగుపపాదనం వ్యక్తమిత్యుచ్యతే.

విక్రుష్టం నామ ఉచ్చైరుచ్చారితం, వ్యక్తపదాక్షరం వికృష్టమిత్యుచ్యతే శ్లక్లం నామ

ద్రుతమివిలంబితముచ్చనీచప్లుత సమాహారహేలతాలోపనయాదిభిరుపపాదనాభిశ్లక్లమిత్యుచ్యదే.

సమం నామావాపనిర్వాపప్రదేవే ప్రత్యంతర స్ధానానాం సమాసః సమమిత్యుచ్యతే.

సుకుమారం నామ మృదుపదవర్ణస్వరకుహరణయుక్తం సుకుమార మిత్యుచ్యతే మధురం నామ

స్వభావోపనీతలలితపదాక్షరగుణ సమృద్ధం మధురమిత్యుచ్యతే ఏవమేవేతైర్దశభిర్గుణౖర్యుక్తం గానం భవతి.

భవంతి చాత్ర శ్లోకాః. 44

శంకితం భీషణం భీతం ఉద్ఘుష్టమనునాసికమ్‌, కాకస్వరం మూర్ధగతం తథా స్ధానవివర్జితమ్‌. 45

విస్వరం విరసం చైవ విక్లిష్టం విషమాహతమ్‌, వ్యాకులం తాలహీనం చ గీతదోషావ్చతుర్దశ. 46

ఆచార్యాస్సమమిచ్చంతి పదచ్చేదం తు పండితాః, స్త్రియో మదురమిచ్ఛంతి విక్రుష్టమితరే జనాః. 47

పద్మపత్రప్రభష్షడ్జ ఋషభశ్శుకపింజరః, కనకాభస్తు గాంధారో మధ్యమః కుందసన్నిభః 48

పంచమస్తు భ##వేత్కృష్ణః పీతకం ధైవతం విదుః, నిషాదస్సర్వవర్ణస్స్యాదిత్యేతాస్స్వరవర్ణతాః. 49

పంచమో మధ్యమష్షడ్జ ఇత్యేతే బ్రహ్మణా స్స్మృతాః, ఋషభో ధైవతశ్చపీత్యేతే వై క్షత్రియవుభౌ. 50

గాంధారశ్చ నిషాదశ్చ వైశ్యావర్ధేన వై స్మృతౌ, శూద్రత్వం విధినార్దేన పతితత్వాన్న సంశంయః. 51

ఋషభో మూర్ఛితవర్జితో ధైవతసహితశ్చ పంచమో యత్ర నిపతతి మధ్యమరాగే స నిషాదం షాడ్జవం విద్యాత్‌. 52

యది పంచమో విరమతే యగాంధారశ్చాంతరస్వరో భవతి, ఋషభో నిషాదసహితస్తం పంచమమీదృశం విద్యాత్‌. 53

గాంధారస్యాధిపత్యేన నిషాదస్య గతాగతైః, ధూవతస్య చ దౌర్బల్యాన్మధ్యమ గ్రామ ఉచ్యతే. 54

ఈషత్పృష్టో నిషాదస్తు గాంధారశ్చాధికో భ##వేత్‌, ధైవతః కంపితో యద్ర స షడ్జగ్రామ ఈరితః. 55

అంతరస్వరసంయుక్త కాకలిర్యత్ర దృశ్యతే, తం తు సాధారితం విద్యాత్‌ పంచమస్థం తు కైశికమ్‌. 56

కైశికం భావయిత్వా తు స్వరైస్సర్వైస్సమంతతః, యస్మాత్తు మధ్యే న్యాసస్తస్వాత్కైశికమధ్యమః. 57

కాకలిర్దృశ్యతే యత్ర ప్రాధాన్యం పంచమస్య తు, కశ్యపః కైశికం ప్రాహ మధ్యమగ్రామసంభవమ్‌. 58

గీతగేయం విదుః ప్రాజ్ఞా ధేతికారుప్రవాదనమ్‌, వేతి వాద్యస్య సంజ్ఞేయం గంధర్వస్య ప్రరోచనమ్‌. 59

యస్సమగానాం ప్రథమస్స వేణోర్మధమస్స్వరః, యో ద్వితీయస్స గాంధారస్తృతియస్త్వృషభస్స్మృతుః. 60

చతుర్థషడ్జ ఇత్యాహుః పంచమో ధూవతో భ##వేత్‌, ఫష్టో నిషాదో విజ్ఞేయస్సప్తమః పంచమస్స్మృతః. 61

షడ్జం మయూరో పదతి గానో రంభంతి చర్షభమ్‌, అజావి కేతు గాంధారం క్రౌంచో పదతి మధ్యమమ్‌. 62

పుష్పసాధారణ కాలే కోకిలా వక్తి పంచమమ్‌, అశ్వస్తు ధైవతం వక్తి నిషాదం వక్తి కుంజరః. 63

కంఠాదుత్తిష్ఠతే షడ్జః శిరసస్త్వృషభస్స్మృతః, గాంధారస్త్వనునాసిక్య ఉరసో మధ్యమస్స్వరః. 64

ఉరసశ్శిరసః కంఠాదుత్ధితః పంచమస్స్వరః లలాటాద్దైవతం విద్యాన్నిషాదం సర్వసంధిజమ్‌. 65

నాసాకంఠమురస్తాలుజిహ్వాదంతాశ్చ సంశ్రితాః, షడ్ఛ్యస్సంజాయతే యస్మాత్తస్మాత్షడ్జ ఇతి స్మృతిః. 66

వాయుస్సముత్థితో నాభేః కంఠశీర్షసమాహతః, నర్దత్యృషభవద్యస్మాత్తస్మాదృషభ ఉచ్యతే. 67

వాయుస్సముత్థితో నాభేః కంఠశీర్షసమాహతః, వాతి గంధవహాః పుణ్యో గాంధారస్తేనహేతునా. 68

వాయుస్సముత్ధితో నాభేరూరౌ హృది సమాహతః, నాభి ప్రాప్తో మధ్యవర్తీ మధ్యమత్వం సమశ్నుతే. 69

వాయుస్సముత్ధితో నాభేరూరో హృత్కంఠకాహతః, పంచస్ధానోత్ధిస్యాస్య పంచమత్వం విధీయతే. 70

ధేవతం చ విషాదం చ వర్జయిత్వా తు తావుభౌ, శేషాన్పంచ స్వరాంప్త్యన్యే పంచస్ధానోద్ధితాన్విదుః. 71

పంచస్ధానస్ధితత్వేన సర్వస్ధానాని ధార్యతే, అగ్నిగీతస్వరష్షడ్జ ఋషభో బ్రహ్మణోచ్యతే. 72

సోమేన గీతో గాంధారో విష్ణునా మధ్యమస్స్వరః, పంచమస్తు స్వరో గీతస్త్వయైవేతి నిధారయ. 73

ధైవతశ్చ నిషాదశ్చ గీతౌ తుంబురుణా స్వరౌ, ఆద్యస్య దైవతం బ్రహ్మ షడ్జస్యాప్యుచ్యతే బుధైః. 74

తీక్షదీప్తప్రకాశత్వాదృషభస్య హుతాశనః, గావః ప్రణీతే తుష్యంతి గాంధారస్తేన హేతునా. 75

శ్రుత్వా చైవోపతిష్ఠంతి సౌరభేయా న సంశయః, సోమస్తు పంచమస్యాపి ధైవతం బ్రహ్మరాట్‌ స్మృతమ్‌. 76

నిహ్రాసో యస్య వృద్ధిశ్చ గ్రామమాసాద్య సోమవత్‌, అతిసంధీయతే యస్మాదేతాన్పూర్వోత్ధితాన్స్వరాన్‌. 77

తస్మాదస్య స్వరస్యాపి ధైవతత్వం విధీయతే, నిషీదంతి స్వరా యస్మాన్నిషాదస్తేన హేతునా. 78

సర్వాశ్చాభిభవత్యేష యదాదిత్యస్య దైవతమ్‌. 79

రక్తము, పూర్ణము, అలంకృతము, ప్రసన్నము, వ్యక్తము, వికృష్టము, శ్లక్లము, సమము సుకుమారము, మధురము అని గానమున పదిగుణములుండును. వేణువీణా స్వరముల ఏకీభావము రక్తమనబడును. స్వరశ్రుతి పూరణము వలన ఛందఃపాదాక్షర సంయోగము పూర్ణమగును. ఉరోభాగమున శిరోభాగమున, కంఠయుక్తమగుచో అలంకృతమనబడును. గద్గదాది శంకలు లేని దానిని ప్రసన్నమందురు. పదపదార్ధ ప్రకృతివికార ఆగమ ఆదేశ కృత్తద్ధిత సమాస ధాతు నిపాత ఉపసర్గ స్వరలింగ వృత్తివార్తిక విభక్త్వర్ధవచనములను చక్కగా ఉపపాదించుట వ్యక్తమనబడును. పెద్దగా ఉచ్చరించబడి స్పష్టమగు అక్షరములు పదములు కలిగియుండుట విక్రుష్టమనబడును. ద్రుతము, అవిలంబితము ఉచ్చనీచ ప్లుత సమాహార హేలతాల ఉపనయాదులగు ఉపపాదనలచే కూడియున్నది శ్లక్లమనబడును. ఆవాస నిర్వాప ప్రదేశములందు ప్రత్యంతర స్ధాన సమాగమము సమమనబడును. మృదు పద వర్ణ స్వరనాద యుక్తము సుకుమారమనబడును. సమభావముచే కూర్చబడిన లలితపద అక్షర గుణ సమృద్ధము మధురమనబడును. ఇట్లు ఈ పదిగుణములచే కూడియున్న దానిని గానమందురు. ఈ విషయమున కొన్ని శ్లోకములు కలవు.

శంకితము, భీషణము, భీతము, ఉద్ఘుష్టము, అనునాసికము, కాకస్వరము, మూర్ధగతము, స్ధానవివర్జితము, విస్వరము, విరసము, విశ్లిష్టము, విషమాహతము, వ్యాకులము, తాలహీనము, అని గీతమునకు పదునాలుగు దోషములుండును. ఆచార్యులు సమముగా నుండవలయునని భావింతురు. పండితలు పదచ్ఛేదమును కోరెదరు. స్త్రీలు మధురగుణమును అభిలషింతురు. ఇతరజనులు విక్రుష్టమును కోరెదరు. (స్పష్టాక్షర పదవత్త్వము) షడ్జము యొక్క వర్ణము పద్మపత్రము వలెనుండును. ఋషభము చిలుక పచ్చన, గాంధారము కనక వర్ణము. మధ్యమము మల్లె పూవురంగు కలిగియుండును. పంచమము కృష్ణవర్ణము. ధైవతము పీతవర్ణము, నిషాదము సర్వవర్ణసంయుతము. ఇవి స్వరముల వర్ణములు. పంచమ మధ్యమ షడ్జస్వరములు బ్రాహ్మణ జాతివి. ఋషభ ధైవత స్వరములు క్షత్రియములు, గాంధార నిషాదములు వైశ్యజాతివి, గాంధార నిషాదమలు అర్ధ పతితములైనచో శూగ్రజాతికి చెందును. మూర్ఛ నావర్జితమై ధూవత సహితముగా ఋషభ పంచమములున్నపుడు మధ్యమరాగమున నిపలుంచనచో అదిషడ్జము వలన కలిగిన నిషాదమనబడును. పంచమ స్వరవిరామముతో గాంధారము అంతస్వరముగా నుండి నిషాదసహితమగు ఋషభమును పంచమమని తెలియవలయును. గాంధారస్వరాధిపత్యమున్నచో నిషాద స్వరాగమనాగమనములచే ధైవత దౌర్బల్యము వలన నుండునది మధ్యమ గ్రామమనబడును. కొంచెము నిషాద స్పర్శకలిగి, గాంధారము అధికముగానుండి, ధైవత కంపమున్నచో షడ్జగ్రామమగును. అంతర స్వరములతో కాకలి కనబడినచో నది పంచమస్దమగు కైశికమను సాధారణగ్రామమగును. అంతట అన్ని స్వరములచే కైశికమును భావించి మధ్యమమున నుంచినచో నది కైశికమధ్యమమనబడును. కాకలి స్వరముండి కూడా పంచమ ప్రాధాన్యము కలిగియున్నచో మధ్యమ గ్రామసంభవమగు కైశికమని కశ్యపుడు చెప్పెను. గంధర్వ శబ్దములోగకారము గేయమును, ధకారము కారువాదనమును, వకారము వాద్యమును చెప్పును సామగానము చేయువారికి ప్రధమస్వరము వేణువునకు మధ్యమ స్వరమగును. రెండవది గాంధారము, మూడవది ఋషభము, నాలుగవది షడ్జము, అయిదవది ధైవతము, ఆరవది నిషాదము, ఏడవది పంచమ స్వరము. మయూరము షడ్జమును పలుకును. గోవులు ఋషభమును, మేకలు గొఱ్ఱలు గాంధారమును, క్రౌంచము మధ్యమమును, పూవులు పూయు కాలమున కోకిల పంచమ స్వరమును పలుకును. అశ్వము ధైవతమును, ఏనుగు నిషాదమును పలుకును. షడ్జము కంఠమునుండి వెడలును, శిరస్సు నుండి ఋషభము, గాంధారము అనునాసికము నుండి, ఉరోభాగము నుండి మధ్యమ స్వరము, ఉరోభాగము నుండి, శిరస్సు నుండి కంఠము నుండి పంచమ స్వరము వెలువడును. లలాటమునుండి ధైవతము, సర్వసంధులనుండి నిషాదము వెలువడును. నాసిక, కంఠము, వక్షస్ద్సలము, తాలువు, జిహ్వా, దంతములు అను ఈ ఆరింటినుండి వెలువడును కావున షడ్జస్వరమందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠ శీర్షములచే కొట్టబడి ఋషభమువలె నినదించును కావున ఋషభమందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠశీర్షములచే కొట్టబడి పవిత్ర వాయువును వదులును కావున గాంధారమందురు. నాభినుండి పుట్టిన వాయువు వక్షస్థ్సలమున హృదయమున కొట్టబడి మరల నాభిదేశమున చేరి మధ్యవర్తి యగును కావున మధ్యమమనబడును. నాభి నుండి బయలు వెడలి వాయువు ఉరోహృత్కంఠములచే కొట్టబడి పంచస్థానములనుండి వచ్చును కావున పంచమమనబడును. ధైవత నిషాదములను వదిలి మిగిలిన అయిదు స్వరములు పంచస్ధానములనుండి పుట్టినవేయని తెలియుము. పంచస్థానములలో నుండియే అన్నిస్థానములను ధరించును. షడ్జము అగ్నిచే గాతనము చేయబడునది. బుషభమును బ్రహ్మ, గాంధారమును చంద్రుడు, మధ్మమును విష్ణువు, పంచమమును నీవు (నారదుడు) ధైవత నిషాదములను తుంబురుడు గానము చేయును. షడ్జమునకు అధిదేవత బ్రహ్మ, ఋషభమునకు అగ్ని, గాంధారమున గోవులు, పంచమమునకు చంద్రుడు, ధైవతమునకు బ్రహ్మ అధిదేవతలు, గ్రామమును చేరి చంద్రుని వలె హ్రాస వృద్ధులు కలది కావున తనకంటే మందున్న స్వరములచే సంధానము చేయబడుచున్నది కావున ఈ స్వరమును ధైవతమందురు. అన్ని స్వరములు చేరియుండును కావున నిషాదమని పేరు. ఈ నిషాదస్వరము అన్నిస్వరములను కప్పివేయును. కావున నిషాదమునకు సూర్యుడు దేవత.

దారవీగాత్రవీణా చ ద్వే వీణ గానజాతిషు. 80

సామనీ గాత్రవీణా తు తస్సాస్త్వం శృణు లక్షణమ్‌, గాత్రవీణా తు సా ప్రోక్తా యస్యాం గాయంతి సామగాః. 81

స్వరవ్యంజనసంయుక్తా అంగుల్యంగుష్ఠరంజితా, హస్తౌ తు సంయతౌ ధార్యౌ జానుభ్యాముపరిస్ధితా. 82

గురోరనుకృతిం కుర్యా నుదధాన్యాన్యమతిర్భవేత్‌, ప్రణవం ప్రాక్ప్రయుంజీత వ్యాహృతీస్తదన్తరమ్‌. 83

సావిత్రీం చానువచనం తతో వై గానమారభేత్‌, ప్రసార్య చాంగులీస్సర్వా రోపయేత్స్వరమండలమ్‌. 84

న చాంగులీభరంగుష్ఠమంగు ష్ఠేనాంగులీస్స్పృశేత్‌, విరళా నాంగులీః కుర్యాన్మూలే చైతాం న సంస్పృశేత్‌. 85

అంగుష్ఠాంగ్రేణ తా నిత్యం మధ్యమే పర్వణి స్పృశేత్‌, మాత్రా ద్విమాత్రవృద్ధానాం విభాగార్ధే విభాగవిత్‌. 86

అంగులీభిర్ద్విమాత్రం తు పాణస్సవ్యస్య దర్శయేత్‌, త్రిరేఖా యస్య దృశ్యేత సిద్ధిం తత్ర వినిర్దిశేత్‌. 87

స పర్వ ఇతి విజ్ఞేయశ్శేషమంతరమంతరమ్‌, పర్వాంతరం సామసు చ ఋక్షం కుర్యాత్తిలాంతరమ్‌. 88

స్వరాన్మధ్యమపర్వసు సునివిష్టం నివేశ##యేత్‌, న చాత్ర కంపయేత్కించిత్‌ అంగస్యావయవం బుధః. 89

అధస్తనం మృదం న్యన్య హస్తమాత్రే యధాక్రమమ్‌, అభ్రమధ్యే యథా విద్యుత్‌ దృశ్యతే మణిసూత్రవత్‌. 90

పృషచ్ఛేదవివృత్తీనాం యథా బాలేషు కర్తరీ, కూర్మోంగాని చ సంహృత్య చేతో దృష్టిం దిశన్మనః. 91

స్వస్ధః ప్రశాంతో నిర్భీకో వర్ణానుచ్చారయేద్బుధః, నాసికాయస్తు పూర్వేణ హస్తం గోకర్ణవద్ధరేత్‌. 92

నివేశ్య దృష్టిం హస్తాగ్రే శాస్తార్ధమనుచింతయేత్‌, సమ్యక్ప్రచారయేద్వాక్యం హస్తేన చ ముఖేన చ. 93

యథైవోచ్చారయేద్వర్ణాంస్తథైవైనాం సమాపయేత్‌, నాత్యాహన్యాన్న నిర్హణ్యాత్‌ న ప్రగాయే న్నకంపయేత్‌. 94

సమం సామాని గాయేత వ్యోమ్ని స్వేన గతిర్యథా, యథా సుచరతాం మార్గో మీనానాం నోపలభ్యతే. 95

ఆకాశే వా విహంగానాం తద్వత్స్వరగతా శ్రుతిః, యథా దధిని సర్పిస్స్యాత్‌ కాష్ఠస్ధో వా యథానలః. 96

ప్రయత్యేనోపలభ్యేత తద్వస్ప్వరగతా శ్రుతిః, స్వరాత్స్వరస్య సంక్రామం స్వరసంధిమనుల్బణమ్‌. 97

అవిచ్ఛిన్నం సమం కుర్యాత్‌ సూక్ష్మచ్ఛాయా తపోపమమ్‌, అనాగతమతిక్రాంతం విచ్ఛిన్నం విషమాహతమ్‌. 98

తన్వంతమస్ధితాంతం చ వర్జయేత్కర్షణం బుధః, స్వరస్ధ్సానాచ్చ్యుతో యస్తు స్వం స్థానమతివర్తతే. 99

విస్వరం సామగ బ్రూయుర్వరక్తమితి వీణినః, అభ్యాసార్ధే ద్రుతాం వృత్తిం ప్రయేగార్ధే తు మధ్యమామ్‌. 100

శిష్యాణాముపదేశార్ధం కుర్యాద్వృత్తం విలంబితామ్‌, గృహీతగ్రంథ ఏవం తు గ్రంథోచ్చోరణశైక్షకాన్‌. 101

హస్తేనాధ్యాపయేచ్చిష్యాన్‌ శైక్షేణ విధినా ద్విజః, క్రుష్టస్య మూర్ధని స్ధానం లలాటే ప్రధమస్య తు. 102

భ్రువోర్మధ్యే ద్వితీయస్య తృతీయస్య తు కర్ణయోః, కంఠస్థానం చతుర్ధస్య మంద్రస్య రసనోచ్యతే. 103

అతిస్వరస్య నీచస్య హృది స్ధానం విధీయతే, అంగుష్ఠస్యోత్తమే క్రుష్టో హ్యంగుష్ఠం ప్రధమస్స్వరః. 104

ప్రదేశిన్యాం తు గాంధార ఋషభస్తదనంతరమ్‌, అనామికాయాం షడ్జస్తు కనిష్ఠాయాం తు ధైవతః. 105

తస్యాధస్తాచ్చ యోన్యాస్తు నిషాదం తత్ర నిర్దిశేత్‌, అపర్వత్వాదమధ్యత్వాదవ్యయత్వాచ్చ నిత్యశః. 106

మంద్రో హి మందీభూతస్తు పరిస్వార ఇతి స్మృతః, క్రుష్టేన దేవా జీవన్తి ప్రథమేన తు మానుషాః. 107

పశవస్తు ద్వితీయేన గంధర్వాస్సరసస్త్వను, అండజాః పితరశ్చైవ చతుర్థస్వరజీవినః. 108

మంద్రత్వేనోపజీవన్తి హిశాచాసురరాక్షసాః, అతిస్వరేణ నీచేన జగత్థ్సావరజంగమాః. 109

సర్వాణి ఖలు భూతాని ధార్యంతే సామికైస్స్వరైః, దీప్తాయతా కరుణానాం మృదుమధ్యమయోస్తథా. 110

శ్రుతీనాం యోవిశేషజ్ఞో న స ఆచార్య ఉచ్యతే, దీప్తా మంద్రే ద్వితీయే చ ప్రచతుర్ధే తథైవ చ. 111

అతిస్వరే తృతీయే చ క్రుష్టే తు కరుణా శ్రుతిః, శ్రుతయో యా ద్వితీయస్య మృదుమధ్యాయతాస్స్మతాః. 112

తాసామపి తు వక్ష్యామి లక్షణాని పృథక్‌ పృథక్‌, ఆయతాత్వం భ##వేన్నీచే మృదుతా తు విపర్యయే. 113

స్వరే స్వరే మద్యమాత్వం తత్సమీక్ష్య ప్రయోజయేత్‌, ద్వితీయే. విరతా యా తు క్రుష్టశ్చ పరతో భ##వేత్‌. 114

దీప్తాం తాం తు విజానీయాత్‌ ప్రాధమ్యేన మృదుస్స్మృతః, ఆత్రైవ విరతా యా తు చతుర్ధేన ప్రవర్తతే. 115

తథా మంద్రే బవేద్దీప్తా సామ్నశ్చైవ సమాపనే. నాతితారశ్రుతిం కుర్యాత్‌ స్వరయోర్నాపి చాంతరే 116

తం చహ్రస్వే చ దీర్ఘే చ న చాపి ఘుటిసంజ్ఞకే, ద్వివిధా, గతిః పదాంతస్థితసంధిస్సహోష్మభిః. 117

స్ధానేషు పంచస్వేతేషు విజ్ఞేయం ఘుటిసంజ్ఞకమ్‌, స్వరాంతరావిరతాని హ్రస్వదార్ఘఘుటాని చ. 118

స్ధితిస్ధానేష్వశేషాణి శ్రుతివత్స్వరతో వదేత్‌, దీప్తాముదాత్తే జానీయాత్‌ దీప్తాం చ స్వరితే విదుః. 119

అనుదాత్తే మృదుర్జేయా గంధర్వాశ్శ్రుతిసంపదే, ఉదాత్తశ్చానుదాత్తశ్చ స్వరితప్రచితే తథా. 120

నిఘాతశ్చేతి విజ్ఞేయస్స్వరభేదశ్చ పంచథా, అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి ఆచికస్య స్వరత్రయమ్‌. 121

గానజాతులలో దారవీ గాత్రవీణ యని రెండు వీణలుండును. సామగానమును చేయునది గాత్రవీణయందురు. ఆ గాత్రవీణలక్షణమును చెప్పెదను వినుము. సామగానము చేయువారు దేనియందు గానము చేతురో దానిని గాత్రవీణయందురు. స్వరవంజనములతో కూడినదై అంగుళులచే అంగుష్ఠముచే రంజితమై జానువులపై హస్తములను కలిపి ఉంచవలయును. గురువును అనుకరించవలయును. లేనిచో భిన్నమతి యగును. మొదట ప్రణవమును ప్రయోగించవలయును. తరువాత భూః, భువః, సువః అను వ్యాహృతులను ప్రయోగించవలయును. తరువాత సావిత్రీమంత్రమును ప్రయోగించవలయును. అపుడు గానము నారంభించవలయును. అన్ని అంగుళులను చాచి స్వరమండలమును ఆరోపించవలయును. ఇతరాంగుళులతో అంగుష్ఠమును, అంగుష్ఠముతో ఇతరాంగుళులను స్పృశించరాదు. అంగుళులను ఎక్కువ వ్యవధానమునుంచరాదు. అంగుళుల మూలమును స్పృశించరాదు. అంగుష్ఠాగ్రముతో మధ్యమ పర్వను (రేఖను) సృశించవలయును. విభాగమును చక్కగా తెలిసిన వారు ఏకమాత్ర ద్విమాత్రావిభాగమును తెలుపుటకు అట్లు మధ్మ పర్వను స్పృశించవలయును. వామహస్తముయొక్క అంగుళులతో ద్విమాత్రాస్థితిని తెలుపవలయును. మూడు రేఖలున్న ప్రదేశమున స్వరసిద్ధిని చూపవలయును. అత్రి రేఖలున్నప్రదేశమునే పర్వయందురు. మిగినిన భాగము మధ్య భాగమందురు. సామవేదమున పర్వాంతరమును ఋగ్వేదమున తిలాంతరము నాచరించవలయును. మధ్యమ పర్వం యందు స్వరమును చక్కగా నివేశించవలయును. ఈ విషయము ఏ శరీరావయవము కొంచెము కూడా కదిలించరాదు. క్రిందమృత్తు నుంచి హస్తమాత్రమున యథాక్రమముగా మేఘముల మధ్యన మణిసూత్రము వలె నుండు మెరపు వలె పృషచ్ఛేద వివృత్తులకు బాలులలో కర్తరివలె, తాబేలు తన అవయవములను తనలో దాచుకొనినట్లు అన్ని వ్యాపారములను మాని మనసును నిలుపవలయును. స్వస్థుడై ప్రశాంతుడై భయము లేనివాడై జ్ఞాని వర్ణములను చర్చించవలయును. నాసిక యొక్క పూర్వభాగమున గోకర్ణము వలె హస్తమునుంచవలయును. హస్తాగ్రమున దృష్టినుంచి శాస్త్రార్ధమును చింతన చేయవలయును. హస్తముతో నోటితో చక్కగా వాక్యమును పలుకవలయును, వర్ణములనుచ్చరించుట సమాప్తిగావించుట ఒకే విధముగా చేయవలయును. ఎక్కువగా తక్కువగా రాగ ప్రస్తారము చేయరాదు. ఎక్కువగా ఉచ్చస్వరముతో గానము చేయరాదు. శరీరావయవములను స్వరములను కంపన చేయరాదు. ఆకాశమున వాయుస్థితివలె సామమును సమమగా గానము చేయవలయును. జలములో చక్కగా సంచరించుచున్ననూ మీనముల అడుగుల జాడ కనపడదో, ఆకాశమున విహరించుచున్నూ పక్షల పాద చిహ్నములు స్పష్టముగా తెలియవో అట్లె స్వరములో శ్రుతి ఉండి లేనట్లుండవలమును. పెరుగులోని నేతిని, కాష్ఠములోని అగ్నిని ప్రయత్నముచే పొందునట్లు స్వరములోని శ్రుతిని ప్రయత్నముచే తెలియవలయును. ఒక స్వరమునుండి మరొక స్వర సంక్రమమును స్వర సంధిని ఎదుటి వారిని క్షోభింపచేయక, విచ్ఛిత్తి కలుగనీయక కొద్దినీడతో కూడిన ఎండవలె సమముగా చేయవలయమును. అనాగతము, అతిక్రాంతము, విచ్చిన్నము, విషమాహతము, సూక్షాంతము, అంతములేకుండుటను కర్షణమును పండితుడు వర్ణించవలయును. స్ధానము నుండి చ్యుతమైన స్వరము తన స్థానమునతిక్రమించినచో సమాగాన మును చేయువారు విస్వరమందురు. వీణాగానము చేయువారు విరక్తమందురు. అభ్యాసము కొఱకు ద్రుత వృత్తిని, ప్రయోగము కొఱకు మద్యమావృత్తిని, శిష్యోపదేశము కొరకు విలంబిత వృత్తినాశ్రయించ వలయును. గ్రంథమును గ్రహించి గ్రంథమునుచ్చరించుట నేర్చుకొను వారికి శిక్షావిధిననుసరించి హస్తముతో అధ్యాపనమును చేయవలయును. క్రుష్టస్వరమునకు స్ధానము మూర్ధ, ప్రధమ స్ధానము లలాటము ద్వితీయమునకు స్ధానము భ్రూమధ్యము, తృతీయమునకు స్ధానము కర్ణములు. చతుర్ధస్థానము కంఠము. మంద్రమునకు స్థానము రసన (నాలుక) అతిస్వరము నీచ స్వరమునకు హృదయము స్థానము. అంగుష్ఠోత్తమ భాగమున క్రుష్టస్వరమును, అంగుష్టమున ప్రధమస్వరమును, ప్రదేశిని యందు గాంధారమును, దాది తరువాత బుషభమును, అనామిక యందు షడ్జమును, కనిష్టయందు ధైవతమును కనిష్టము క్రింది భాగమున నిషాదమును చూపవలయును. పర్వలు లేకుండుటచే, మధ్యములేకుండుటచే, వ్యయములేకుండుటచే ఎపుడూ మందీ భూతముగానుండు మంద్రము పరిస్వారమనబడును. క్రుష్టస్వరముచే దేవతలు, ప్రథమముచే మనుష్యులు, ద్వితీయముచే పశువులు, తృతీయముచే గంధార్వస్సరసలు, పక్షలు పితృదేవతలు నాలుగువస్వరముచే, పిశాచ అసుర రాక్షసులు మంద్రస్వరముచే, అతిస్వరముచే నీచముచే స్థావరజంగమాత్మకమగు ప్రపంచము జీవించుచున్నది. సామిక స్వరముతో అన్ని ప్రాణులు తమ ప్రాణములను నిలుపుకొనుచున్నవి. దీప్తాయత కరుణము, మృధుమధ్యమములను శ్రుతుల విశేషములను తెలియనివాడు ఆచార్యుడనబడడు. దీప్త శ్రుతిని మంద్రమున ద్వితీయమున చతుర్ధమున, అతి స్వరమున, తృతీయమున ప్రయోగించవలయును. క్రుష్టస్వరమున కరుణశ్రుతిని ప్రయోగించవలయును. ద్వితీయమునకు మృదుమధ్య ఆయత శ్రుతులను ప్రయోగించవలయును. ఆ శ్రుతుల లక్షణములను కూడా విడివిడిగా చెప్పెదను వినుము. నీచమున ఆయత శ్రుతి, ఉచ్చలో మృదుశ్రుతి స్వీయస్వరమున మధ్యమ శ్రుతిని చక్రగా విచారించి ప్రయోగించవలయును. ద్వితీయమున విరతమైనది, పరమున క్రుష్టమైగును. మొదట మృదువుగా నుండి విరతమై చతుర్ధస్వరమున ప్రవర్తించునది, మంద్రమున ప్రమోగించునది, సామసమాప్తిలో ఉపయోగించునది దీప్త శ్రుతియని తెలియవలయును. స్వరముల మధ్యన తార శ్రుతిని ప్రయోగించరాదు. ఊష్మలతో (శషసహ) పదాంత స్ధిత సంధికి రెండు గతులుండును. ఈ అయిదు స్ధానములను ఘుటి యని యందురు. స్వరాంతరావిరతముల హ్రస్వదీర్ఘ ఘుటికలు అనుశ్రుతి స్థానములలో శ్రుతులవలెను స్వరములను చెప్పవలయును. ఉదాత్తస్వరిత స్వరములలో దీప్తాశ్రుతిని, అనుదాత్తమున మృదుశ్రుతిని ప్రయోగించవలయును. శ్రుతి సంపదలో గంధర్వులు నిష్ణాతులు. ఉదాత్తము అనుదాత్తము, స్వరితము, ప్రచితము నిఘాతము అని స్వరభేదములు అయిదు విధములు, ఇకనిప్పుడు ఆచిక స్వరత్రయమును చెప్పెదను.

వినుము.

ఉదాత్తశ్చానుదాత్తశ్చ తృతీయస్స్వరితస్స్వరః, య ఏవోదాత్త ఇత్యుక్తస్స ఏవ స్వరితాత్పరః. 122

ప్రచయఃప్రోచ్యతేతజ్‌జ్ఞైర్న చాత్రాన్యత్స్వరాంతరమ్‌, వర్ణస్వరోతీ తస్వరస్స్వరితో ద్వివిధస్స్మృతః. 123

మాత్రికో వర్ణ ఏవం తు దీర్ఘస్తూచ్చారితాదను, స తు సప్తవిధో జ్ఞేయస్స్వరః ప్రత్యయదర్శనాత్‌. 124

పదేన తు ప విజ్ఞేయే భ##వేద్యో యత్ర యాదృశ-, సప్త స్వరాస్ప్రయుంజీత దక్షిణం శ్రవణం ప్రతి. 125

ఆచార్యైర్విహితం శాస్త్రం పుత్రశిష్యహితైషిభిః, ఉచ్చాదుచ్చతరం నాస్తి నాచాన్నీచతరం తథా. 126

వైస్వర్యస్వారసంజ్ఞాయాం కింస్ధానస్స్వర ఉచ్యతే, ఉచ్చనీచస్య యన్మధ్యే సాధారణమితి శ్రుతిః. 127

తం స్వారం స్వారసంజ్ఞాయాం ప్రతిజానంతి శైక్షికాః, ఉదాత్తే నిషాదగాంధారావనుదాత్తే ఋషభ##ధైవతౌ. 128

స్వరితప్రభవా హ్యేతే షడ్జమధ్యమపంచమాః, యత్ర కఖపరా ఊష్మా జిహ్వా మూలప్రయోజనాః. 129

తానప్యాజ్ఞాపయేన్మాత్రా ప్రకృత్యైవ తు సా కలా జాత్యఃక్షేప్రోభినిహితసై#్తరవ్యంజనేవచ. 130

తరో విరామః ప్రశ్లిష్టోపాదవృత్తశ్చ సప్తమః, స్వరాణామహమేతేషాం పృథ్వక్ష్యామి లక్షణమ్‌. 131

ఉద్దిష్టానాం తథాన్యాయముదాహరణమేవ చ, సపకారం సవం వాపి హ్యక్షరం స్వరితం భ##వేత్‌. 132

న చోదాత్తం పురో యస్య జాత్యస్స్వారస్స ఉచ్యతే, ఇఉవర్ణౌ యదోదాత్తావాపద్యేతే పవౌ క్వచిత్‌. 133

అనుదాత్తం ప్రత్యయే తు విద్యాత్కేప్రస్య లక్షణమ్‌, ఏ ఓ ఆభ్యాముదాత్తాభ్యామకారో నిహితశ్చయః. 134

అకారో యత్ర లుంపతి తమభినిహితం విదుః, ఉదాత్తపూర్వే యత్కించిచ్ఛందసి స్వరితం భ##వేత్‌. 135

ఏష సర్వబహుస్వారసై#్తరవ్యంజన ఉచ్యతే, అవగ్రహాత్పరం యత్ర సర్వితం స్యాదనన్తరమ్‌. 136

తిరో విరామం తం విద్యాదుదాత్తో యద్యవగ్రహః, ఇకారం యత్ర పశ్యేయురికారేణౖవ సంయుతమ్‌. 137

ఉదాత్తమనుదాత్తేన ప్రశ్లిష్టం తం విచారయ, సర్వే చేత్స్వరితం యత్ర వివృతా యత్ర సంహితా. 138

ఏతత్పాదాంతవృత్తప్య లక్షణం శాస్త్రనోదితమ్‌, తాన్యస్స్వారస్సజాత్యేన శ్రుత్యగ్రే క్టెప్ర ఉచ్యతే. 139

తేమన్వతాభినిహితసై#్తరవ్యం జన ఊతయే, తిరో విరామో విష్కషితే ప్రశ్లిష్టో హీ ఈ గో వర్ణః. 140

పాదవృత్తః కందవిదే స్వరాస్ససై#్తవమాదయః, ఉచ్చాదేకాక్షరోత్పూర్వాత్స్వరం యద్యదిహాక్షరమ్‌. 141

స్వారాణాం జాత్యవర్జానాం ఏషా ప్రకృతిరుచ్యతే, చత్వారస్త్వాదితస్స్వారా కం షం పు శ్ఫుతి శాస్త్రతః. 142

ఉదాత్తే చైకనీ చేవా జుహ్వోగ్నిస్తన్నిదర్శనమ్‌, ఇకారాంతే పదే పూర్వం ఉకారో పరతస్థ్సితే. 143

హ్రస్వం కంపం విజానీయాన్మేధావీ నాత్ర సంశయః, ఇకారాంతే పదే చైవోకారద్వయం పరే పదే. 144

దీర్ఘం కంపం విజానీయాత్‌ శాగ్ధూష్వితి నిదర్శనమ్‌, త్రయో దీర్ఘాస్తు విజ్ఞేయా యే చ సంధ్యక్షరేషు వై. 145

మన్యా యధా న ఇంద్రాభ్యాం శేషా హ్రస్వాః ప్రకీర్తితాః, అనేకాముదాత్తానామనుదాత్తః ప్రత్యయో యది. 146

శివకంపం విజానీయాత్‌ ఉదాత్తః ప్రత్యయో యది, యత్ర ద్విప్రభృతీని స్యురుదాత్తాన్యక్షరాణి తు. 147

నీచం వోచ్చం చ పరతస్తత్రోదాత్తం విదుర్బుధాః, న రేఫే నా హకారే వా ద్విర్భావో జాయతే క్వచిత్‌. 148

న చ వర్గద్వితీయేషు న చతుర్దే కదాచన, చతుర్ధం తు తృతీయేన ద్వితీయః ప్రథమేన తు. 149

ఆద్యమంత్యం చ మధ్యం చ స్వారాక్షరేణ పీడయేత్‌, అనన్త్యశ్చ భ##వేత్పూర్వో హ్యంతశ్చ పరతో యది. 150

తత్ర మధ్యే యమస్తిష్ఠేత్‌ సవర్ణః పూర్వవర్ణోః, వర్గాంత్యాన్శషసైస్సార్ధమంతస్థైర్వాపి సంయుతాన్‌. 151

దృష్ట్వా యమాని వర్తంతే అదేశికమివాధ్వగాః, తృతీయశ్చ చతుర్ధశ్చ చతుర్ధాదిపరం పదమ్‌. 152

ద్వౌ తృతీ¸° హకార శ్చ హకారాది పరం పదమ్‌, అనుస్వారోపధామూలా తాన్క్వచిత్క్రమతః పరమ్‌. 153

రహపూర్వసంయుతం చాప్యుత్తరం క్రమతోక్షరమ్‌, సంయోగో యత్ర దృశ్యేత వ్యంజనం విరతే పదే. 154

పూర్వాంగమాదితః కృత్వా పరాంగాదౌ నివేశ##యేత్‌, సంయోగే స్వరితం యత్ర ఉద్వాతః ప్రతనం యథా. 155

పూర్వాంగం తద్విజానీయాద్యేనారంభః పరం హి తత్‌, సంయోగాత్తు విజానీయాత్‌ పరం సంయోగనాయకమ్‌. 156

సంయుక్తస్య తు వర్ణస్య తత్పరం పూర్వమక్షరమ్‌, అనుస్వరః పదాంతశ్చ క్రమజం ప్రత్యయే స్వకే. 157

స్వరభక్తిస్తథా రేఫః పూర్వపూర్వాంగముచ్యతే, పాదాదౌ చాపాదాదౌ చ సంయోగావగ్రహేషు చ. 158

య శబ్ద ఇతి విజ్ఞేయో యోన్యస్స య ఇతి స్మృతః, పాదాదావప్యవిచ్ఛేదే సంయోగాన్తే చ తిష్ఠతామ్‌. 159

వర్జయిత్వా రహపాణాముపాదేశః ప్రదృశ్యతే, స్వసంయుక్తో గురుర్జేయస్సానుస్వరాగ్రమ స్స్ఫుటః. 160

అణుశేషే హ్రిగో వా పి యుగళాదిరవిస్ఫుటః. 161

యదుదాత్తముదాత్తం తద్యత్స్వరితం తత్పదే భవతి, యన్నీచం నీచమేవ తద్యత్ప్రచయస్థం తదపి నీచమ్‌. 162

అగ్నిస్సుతో మిత్రమిదం తథా వయమయా వహాః, ప్రియం దూతం ఘృతం చిత్తమతిశబ్దస్తు నీచతః. 163

అక్వేష్వేవ సుతేష్వేవ యజ్ఞేషు కలశేషు చ, శ##తేషు సపవిత్రేషు నీచాదుచ్చార్యతి శ్రుతిః. 164

హారివరణవరేణ్యషు ధారాపురుషేషు స్వరితరేఫః, విశ్వానరో నకారశ్చ శేషాస్తు స్వరితా నరాః. 165

ద్వౌవరుణౌ వ స్వరత ఉదుత్తమత్త్వం వరుణధారా చౌరుధారా, మురుధారా స్వ దోహతే. 166

మాత్రికం వా ద్విమాత్రం వా స్వర్యతే యదిహాక్షరమ్‌, తస్యాదితోర్ధమాత్రం వై శేషం తు పరతో భ##వేత్‌. 167

అదీర్ఘం దీర్ఘవత్కుర్యాత్‌ ద్విస్వరం యత్ప్రయుజ్యతే, కంపోత్స్వంతాభిగీతం హ్రస్వకర్షమమేవ చ. 168

నిమేషకాలో మాత్రా స్యాద్విద్యుత్కాలేతి చాపరే, ఋక్స్వరా తుల్యయోగా వా కైశ్చిదేవముదీర్యతే. 169

సమాసేవగ్రహం కుర్యాత్‌ పదం చాత్రానుసంహితమ్‌, యే తీక్షరాదికరణం పదాంతస్యేతి తం విదుః. 170

సర్వత్ర మిత్రపుత్రసఖిశబ్దా అ హిశతక్రతోరవగ్రాహ్యాః, ఆదిత్యవిప్రజాతవేదాశ్చ సత్పతిగోపతివృత్రహా సముద్రాశ్చ. 171

స్వరయుపువో దేవయవశ్చారితం దేవతాతపే, చికితిశ్చథ చైవ నావగృహ్ణంతి పండితాః. 172

వివృతయశ్చతస్రో వా విజ్ఞేయా ఇతి మే మతమ్‌, అక్షరాణాం నియోగేన తాసాం నామాని మే శృణు. 173

ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు స్వరములు ఉదాత్తమనునదే స్వరితము కంటే పరముగా నుండును. స్వంతము కంటే పరముగానున్న ఉదాత్తమును ప్రచయమందురు. ఇచట ఇంకొక స్వరముండదు. వర్ణస్వరము, అతీత సర్వము అని స్వరితము రెండు విధములు. మాత్రాస్వరము వర్ణస్వరము, దీర్ఘము అతీత స్వరమనబడును. ఈ స్వరము ప్రత్యయముననుసరించి ఏడు విధములగును. యెచట ఏ స్వరముండునో పదమును అనుసరించి తెలియవలయును. సమర్ధుడగు శ్రోతకు ఏడు స్వరములను ప్రయోగించవలయును. పుత్రుల శిష్యల హితమును కోరిన ఆచార్యులు శాస్త్రమునేర్పచిరి. ఉచ్చమునకంటే ఉచ్చతరము, నీచముకంటే నీచతరము లేదు.వైస్వర్యమున స్వారమున ఏస్థానమును స్వరముగా పలుకవలయునో తెలియుము. ఉచ్చనీచముల మధ్యమున నున్న దానిని సాధారణమందురు. గానశాస్త్ర శిక్షకులు స్వార సంజ్ఞలో ఈ సాధారణమునే స్వారమని యందురు. ఉదాత్తస్వరము నిషాదగాంధారములను, అనుదాత్తస్వరమున ఋషభ##దైవతములను ప్రయోగించవలయును. షడ్జమధ్యమ ధైవతములు స్వరితము నుండి పుట్టినవి. జిహ్వామూల ప్రయోజనములుగాగల కఖలు పరముగానున్న శషసహలను కూడా మాత్రా ప్రకృతి చేతనే ప్రయోగించవలయును. దానినే కల యందురు. జాత్యము, క్టైప్రము, అభినిహితము, అవ్యంజనము, తిరోవిరామము, ప్రశ్లిష్టము, అపాదవృత్తము అని మరియొక ఏడు స్వరములు గలవు. ఈ స్వరముల లక్షణములను విడిగా చెప్పెదను. ఈ స్వరములను ప్రయోగించు ఉద్దేశ్యములను ఉదాహరణములను కూడా చెప్పెదను. సకారముతో కాని వకారముతో కాని కూడియున్న యక్షరము స్వరితమగును. ముందు ఉదాత్తము లేనిచో జాత్యస్వారమందురు. ఇకార ఉకారములు ఉదాత్తములుగా నున్నను కొన్నిచోట్ల పకారవకారములు అనుదాత్త స్వరముకల ప్రత్యయము పరముగా నున్ననూ క్టైప్రస్వరమని తెలియవలయును. ఉదాత్తములైన ఏకార ఓకారములచే ఆకారము నుదాత్తమగుచో అకారము లోపించినపుడు అభినిహిత స్వరమందురు. ఉదాత్తపూర్వమగు ఏదో ఒక చంధస్సున స్వరితమొచ్చినచో, సర్వస్వరితములు కలది కూడా అవ్యంజన స్వరమనబడును. అవగ్రహము తరువాత స్వరితమున్నచో ఉదాత్తము అవగ్రహమైనచో తిరోవిరామమగును. ఇకారముచే ఇకారము కలిసియున్నచో ఉదాత్తము అనుదాత్తము చే కూడిన ప్రశ్లిష్ట మగును, స్వరిత స్వరమున సంహిత వివృతమైనచో పాదాత వృత్తముగా తెలియవలయును. తానస్వరము జాత్యముచే శ్రుత్యగ్రమున కలిసియున్నచో క్టైప్రమనబడును. అవియే అభినిహితమైనచో అవ్యంజనమనబడును. విష్కహితమున తిరోవిరామమగును. హీ ఈ గో వర్ణములు ప్రశ్లిష్టములనబడును. పాదవృత్తమున ఈ యేడు స్వరములను తెలియవలయును. ఉచ్చమగు ఒక అక్షరమునకంటే పూర్వమున స్వరము గలిగి యుండుట జాత్యవర్జితములగు స్వరములకిట్లుండుట స్వభావము. మొదట నాలుగు స్వారములుండును. కం షం, పుం, స్సు అనునవి. ఉదాత్తమున ఒక నీచ స్వరమున అగ్ని హోమము దృష్టాంతము. మొదట ఇకారాంతమగు పదమునుండి పరమున ఉకారమున్నచో దానిని హ్రస్వకంపమని తెలియవలయును. ఇకారాంత పదమన పరమున ఉకార ద్వయమున్నచో దీర్ఘకంపమని తెలియవలయను. సంధ్యక్షరములలో మూడు దీర్ఘములుండును. మిగిలినవి హ్రస్వములుండును. న ఇంద్రభ్యాం అనునపుడు మూడు దీర్ఘములున్నవి. మిగిలినవి హ్రస్వములు. అనేకోదాత్తములగు అనుదాత్తప్రత్యయమున్నచో శివకంపమని తెలియవలయును. రెండుకంటే ఎక్కువ ఉదాత్తక్షరములకు నీచము కాని ఉచ్చముకాని పరమగునపుడు అచట ఉదాత్తమునే చెప్పుకొనవలయును. రేఫయందు హకారమునందు ఎప్పుడూ ద్విత్వము రాదు. వర్గద్వితీయ వర్ణములందు వర్గ, చతుర్ధ వర్ణములందు కూడా ద్విత్వము రాదు. చతుర్థమును తృతీయముతో, ద్వితీయమును ప్రథమముతో కలిసియున్నపుడు ఆదిమద్య అంత్యవర్ణములను స్వరాక్షరముచే పీడించవలయును. అనస్త్యము పూర్వమున అంత్యము పరమున నున్నచో ఆ రెంటి మధ్యన నున్నదానిని యమమందురు. ఈ యమము పూర్వవర్ణముతో సవర్ణమగును. శషశలతో కాని యరలవలతో కాని వర్గాంత్యములచే కలిసి యున్నచో పరదేశమును బాటసారులు విడిచునట్లు యమములు నివర్తించును. తృతీయ వర్ణము చతుర్ధ వర్ణము చతుర్ధాది వర్ణములు పరముగా గలదిగా యున్నచో పదమగును. రెండు తృతీయ వర్ణములు హకారము హకారపరముగా నున్నచో పదమగును. ఈ పదములు అనుస్వారోపధామూలములుగా క్రమముగా పరములగును. పూర్వము రేఫహకారములతో సంయుతమైనచో క్రమముగా ఉత్తరాక్షరములుగానుండును. పదాంతమున సంయోగ మున్నచో అంత్యమున వ్యంజనముండును. మొదట ఆగమాదులను చేయవలయును. పరాంగమునందు ఆగమమును నివేశించవలయును. సంయోగమున స్వరితమున్నచోట ఉద్ధాతముగాని ప్రతనము కాని ఉన్నచో దానిని పూర్వాంగమని తెలియవలయును. ఆరంభించునది పరమగును. సంయోగమునకు పరముగానున్న దానిని సంయోగనాయకమందురు. సంయుక్తవర్ణమును పరమున పూర్వమున నున్న అక్షరము పదాంతరమగు అనుస్వరము స్వప్రత్యయమున క్రమజమందురు. స్వరభక్తి రేఫ పూర్వాంగమగును. పాదాది యందు అపాదాదియందు సంయోగమునందు అవగ్రహమునందు యశబ్దముగా తెలియుము. ఇతరము సయమగును. పాదాదిలో విచ్చిత్తి కలుగనిచో సంయోగాంతమున నున్న రేఫహకార పకారములను వదలి ఉపదేశము కనపడును. సంయుక్తమైన వర్ణము అనుస్వరయుక్తమగు వర్ణము గురువగును. దీనినే స్ఫుటమందురు. హ్రస్వశేషము హ్రీగో వర్ణములు యుగళాదులు అవిస్ఫోటమందురు. ఆ పదముననున్న ఉదాత్తము స్వరితము ఉదాత్తముగా స్వరితముగానే యుండును. నీచము నీచముగానే యుండును. ప్రచయుస్థము కూడా నీచమే యగును. అగ్ని, సుత, మిత్ర శబ్దములు ప్రియ, దూత, ఘృత చిత్త మతి శబ్దములలో నీచ స్వరముండును. అక్వసుత యజ్ఞ కలశ, శత పవిత్ర శబ్దములలో నీచ స్వరము నుండి ఉచ్చారణ ప్రారంభించవలయును. హారివరుణ వరేణ్య ధారా పురుష శబ్దములలోని రేఫ స్వరితమగును. విశ్వానర శబ్దమున నకారము, ఇతర శబ్దములలో నకార రేఫలు స్వరతములగును. వరుణ శబ్దమున వకారము నుండి రెండు వర్ణములు స్వరితములుండును. వరుణ ధారాశబ్దము ఉదాత్తమగును. ఇట్లే ఉరుధార ఓరుధారా శబ్దములలో తెలియవలయును. ఈ శబ్దములలో ఏకమాత్రికము, ద్విమాత్రికము స్వరితమగుచో మొదటిసగము ఉదాత్తమగును. మిగిలినది అనుదాత్తమగును. రెండు స్వరములు ప్రయోగించబడినచో దీర్ఘము కాని దానిని కూడా దీర్ఘముగా చేయవలయును. స్వరితమును కంపము చేయవలయును. హ్రస్వమును కర్షణము చేయవలయును. మాత్రయనగా నిమేషకాలము లేదా విద్యుత్కాలము అని తెలియవలయును. ఋక్స్వరములు కూడా ఇట్లే యుండునని కొందరు చెప్పెదరు. సమాసమున అవగ్రహమును (సంధి-విచ్ఛేదమును) చేయవలయును. పదమును అనుసంహితముగా పలుకవలయును. మిత్రపుత్ర సఖి శబ్దములు, అహి శత క్రతు శబ్దములు అవగ్రహములు కలవి. ఆదిత్య, విప్ర, జాత వేద, సత్పతి, గోపతి వృత్రహ సముద్ర శబ్దములు స్వరయుతములు. చికితములు ధకారము అవగ్రహములు కావు. ఇచట నాలుగు వివృతులునండునని నా అభిప్రాయము. ఈ వివృతులు అక్షరనియోగముచే ఏర్పడును. ఈ వివృతుల పేర్లను చెప్పెదను వినుము.

హ్రస్వాదివత్సానుపృతా వత్సానుసారిణీ చాగ్రే. 174

పాకవత్యుభయోర్హ్రస్వా దీర్ఘా వృద్దా పిపీలికాః, చతసృణాం వివృతీనాం అంతరం మాత్రికం భ##వేత్‌. 175

అర్ధమాత్రికమన్యేషాం అన్యేషామణుమాత్రికమ్‌. 176

ఆపద్యతే మకారో రేఫోష్మాసు ప్రత్యయోప్యనుస్వారమ్‌, పవేషు పరసవర్ణం స్పర్శేషు చోత్తమా పతిమ్‌. 177

నకారాంతే పదే పూర్వే స్వరే చ పరతస్థ్సితే, అకారం రక్తమిత్యాహుస్తకారేణ తు రజ్యతే. 178

నకారాంతే పదే పూర్వే వ్యంజనైశ్చ యవోహిషు అర్ధమాత్రా తు పూర్వస్య రజ్యతే త్వణు మాత్రయా. 179

నకారస్వరసంయుక్తశ్చతుర్యుక్తో విధీయతే, రేఫో రంగశ్చ లోపశ్చ సానుస్వారోపి వా క్వచిత్‌. 180

హృదయాదుత్తిష్ఠతే రంగః కాంస్యేన తు సమన్వితః, మృదుశ్చైవ ద్విమాత్రశ్చ దధన్వామితి నిదర్శనమ్‌. 181

యథా సౌరాష్ట్రికా నారీ అరామిత్యభిభాషతే, ఏవం రంగః ప్రయోక్తవ్యో, నాందైతన్మతం మమ. 182

స్వరా గడదబాశ్చైవ ఙణనమాస్సహోష్మభిః, చతుర్ణాం పదజాతీనాం పదాంత దశ కీర్తితాః. 183

స్వర ఉచ్చస్స్వరో నీచస్స్వరస్స్వరిత ఏవ చ, వ్యంజనా న తు వర్తన్తే యత్ర తిష్ఠతి స స్వరః. 184

స్వర ప్రధానం త్రైస్వర్యం ఆచార్యాః ప్రతిజానతే, మణివద్య్వంజనం విద్యాత్‌ సూత్రవచ్చ స్వరం విదుః . 185

దుర్బలస్య యథా రాష్ట్రం హరతే బలవాన్నృపః, దుర్బలం వ్యంజనం తద్వత్‌ హరతే బలవాన్స్వరః. 186

ఉభావశ్చ వివృత్తిశ్చ శషసా రేఫ ఏవ చ , జిహ్వామూలముపధ్మా చ గతిరష్టవిధోష్మమః. 187

స్వరప్రత్యయా వివృతిః సంహితాయాం తు యా భ##వేత్‌, విసరస్తత్ర మంతవ్యస్తాలవ్యశ్చాత్ర జాయతే. 188

సంధ్యక్షరే పరే సంధౌ ప్రాప్తలుప్తౌ యవౌ యది, వ్యంజనాఖ్యా వివృత్తిస్తు స్వరాఖ్యా ప్రతిసంహితా. 189

ఊష్మాంతే విరతే యత్ర సంభావో భవతి క్వచిత్‌, వివృత్తిర్యా భ##వేత్తత్ర స్వరాఖ్యాం తాం వినిర్దిశేత్‌. 190

యద్యోభావప్రసంధానమృకారాదిపరం పదమ్‌, స్వరాంతం తాదృశం విద్యాత్‌ యదన్యద్వక్తమూష్మణః. 191

ప్రథమా ఉత్తమాశ్చైవ పదాంతేషు యది స్ధితాః, ద్వితీయం స్థానమాపన్నాః శషప్రత్యయా యది. 192

ప్రథామానుష్మసంయుక్తాన్‌ ద్వితీయానివ దర్శయేత్‌, న చైతాన్ప్రతిజానీయాత్‌ యథా మత్స్యః క్షురో ప్సరాః. 193

ఛందో మానం చ వృత్తం చ పాదస్థానం త్రికారణమ్‌, ఋచస్స్వచ్ఛందవృత్తస్తు పాదాస్త్వక్షరమానతః . 194

ఋగ్వర్యాన్స్వరభక్తిం చ ఛందోమానేన నిర్దిశేత్‌, ప్రత్యయేత సహారేఫ మిమీతే స్వరభక్తయా. 195

ఋవర్ణే తు పృథగ్రేఫ ప్రత్యయస్తు వృథా భ##వేత్‌, విద్యాల్లఘమృకారం తు యది తూష్మాణసంయుతః. 196

ఊష్మణౖవ హి సంయుక్త ఋకారో యత్ర పీడ్యతే, గురువర్ణస్స విజ్ఞేయస్తృ చం చాత్ర నిదర్శనమ్‌. 197

ఋషభం చ గృహీతం చ బృహస్పతిం పృథివ్యాం చ, నిరృతి పంచమా హ్యత్ర ఋకారా నాత్ర సంశయః. 198

శషసహరాదౌ రేఫస్సవరభక్తిర్జాయతే ద్విపదసంధే, ఇ ఉ వర్ణాభ్యాం హీనా క్వచిదేకపదాక్రమవియుక్తా. 199

స్వరభక్తిర్ద్విధా ప్రోక్తా ఋకారే రేఫ ఏవ చ, స్వరోదా వ్యంజనోదా చ విహితాక్షరచింతకైః. 200

శషసేషు స్వరోదాయాం హకారే వ్యంజనోదయమ్‌, శషసే, ఉవివృతాం తు హకారే సంవృతాం విదుః . 201

స్వరభక్తిం ప్రయుంజాన స్త్రీన్దోషాన్పరివర్జయేత్‌, ఇకారం చాప్యుకారం చ గ్రస్తదోషం తథైవ చ. 202

సంయోగపరం ఛపరం విసర్జనీయం ద్విమాత్రకం చైవ, అధసాన్తికచనజ్‌ మసానుస్వారం ఘుటితం చ. 203

యస్యాః పాదః ప్రథమో ద్వాదశమాత్రస్తథా తృతీయోపి, అష్దాదశో ద్వితీయస్సమాపన్నః పంచదశమాత్రః. 204

యస్యా లక్షణముక్తం యా త్వన్యా సా స్మృతా విపులా. 205

అక్షరాణాం లఘుహ్రస్వమసంయోగ పరం యది, తత్సంయోగోత్తరం విద్యాత్‌ గురుదీర్ఘాక్షరాణి తు. 206

వివృత్తర్యత్ర దృశ్యేతే స్వారసై#్యవాగ్రతస్థ్సితః. 207

గురుస్వారస్స విజ్ఞేయః క్టైప్రస్తత్ర న విద్యతే, అష్టప్రకారం విజ్ఞేయం పదానాం స్వరలక్షణమ్‌. 208

హ్రస్వాదివత్తు, సానుసృతా, ముందు వత్సానుసారిణీస ఉభయత్రపాకవతి అని నాలుగు వివృతులు. ఈ నాలుగింటికి హస్వా, దీర్ఘా, వృద్ధా, పిపీలికా అని పేర్లు. నాలుగు వివృతులకు వ్యవధానము ఒక మాత్రయుండును. ఇతరములకు అర్ధమాత్రము, మిగిలిన వాటికి అణుమాత్రము వ్యవధానముండును. రేఫలో శషసహలలో మకారముండి ప్రత్యయమున అనుస్వారము, పర్వములలో పరసవర్ణము, స్పర్శలలో (క నుండి మ వరకు) ఉత్తమా పతిని, పూర్వము నకారాంత పదముండి పరమున స్వరమున్నచో తకారముతో కూడియున్న కారమును 'రక్తము' అని యందురు. పూర్వమునందు నకారాంత పదముండి యవహ మొదలగునవి వ్యంజనముచే కూడి యున్నపుడు పూర్వమున అర్ధమాత్ర. అణుమాత్రముతో రక్తమగును. నకార స్వర సంయుక్తము నాలుగింటిచే యుక్తమై విధించబడినపుడు రేఫరంగము లోపము కొన్నిచోట్ల సానుస్వారముగానుండును. రంగము హృదయమునుండి వెలువడును. కాంస్యముతో కూడి యుండును. మృదుస్వరముగా ద్విమాత్రముగానుండును. దీనికి ఉదాహరణము దధన్వాం అనునది. సౌరాష్ట్రికనారి 'అరాం' అని పలుకునట్లు రంగమును ప్రయోగించవలయును. ఇది నా అభిప్రాయము. శషసహలతో కూడిన గ,డ,ద,బ, లు ఙ, ణ నమలు స్వరములు (అచ్చులు) నాలుగు పదజాతులను పది పదాంతములు చెప్పబడినవి. ఉచ్చస్వరము, నీచస్వరము, స్వరిత స్వరము, అని. ఈ స్వరమున్న ప్రదే శమున వ్యంజములుండవు. ఈ మూడు సర్వరములు స్వరప్రధానములు గా ఆచార్యులు ప్రతిజ్ఞ చేసిరి. స్వరములు సూత్రముమువంటివి. వ్యంజనము మణివంటిదని తెలియుము. దుర్బలుడగు రాజు యొక్క రాజ్యమును బలవంతుడగు రాజు హరించునటుల దుర్బలమైన వ్యంజనమును బలవత్తైన స్వరము హరించును. ఉభావము, వివృత్తి శషసలు, రేఫ, జిహ్వా మూలములు, ఉపధ్మానీయములు అను ఎనిమిది ఊష్మల స్వరూపము. సంహితలో కలుగు స్వర ప్రత్యయ వివృతి ప్రదేశమున విసర్గలను చెప్పకొనవలయును. ఇచట తాలవ్యవర్ణములుండును. సంధ్యక్షరము పరముగా నున్నపుడు సంధిలో యకారవకారములు లోపించినచో అచట వ్యంజన వివృత్తి స్వరసంహిత యుండునని తెలియుము. ఊష్మాంతముచే పదము ముగియునపుడు సంభావమగుచో స్వరవివృతియని తెలియవలయును. ఉభావముచే కలిసిన ఋకారము ఆదియందున్న పదము పరముననున్నచో స్వరాంతవివృతి యనబడును. మిగిలిన ఊష్మలకు వ్యక్తి వివృతి కలుగును. పదాంతములందు ప్రథమాక్షరములు, చివరి అక్షరములు (వర్గలలో) ఉన్నచో శషస ప్రత్యయములు ద్వితీయ స్థానమును పొందినచో ఊష్మయుక్తములగు ప్రథమ వర్ణములను ద్వితీయ వర్ణముల వలె చూపవలయును. కాని వీటిని ద్వితీయములుగా నియమించరాదు. మత్స్య, క్షుర, అప్సర అనునవి దృష్టాంతములు. చంధస్సునకు మానము వృత్తము. పాదస్థానమునకు కారణత్రయముండును. ఋక్కులు స్వచ్చందవ్తత్తములుగా నుండును. అక్షరముల మానముననుసరించి పాదములుండును. ఋక్కులను స్వరభక్తిని ఛందోమానముచే చూపవలయును. స్వరభక్తితో రేఫలేని దానిని గుర్తించవలయును. ఋ వర్ణములో విడిగినుండు రేఫజ్ఞానము నిష్ప్రయోజనమేయగును. ఊష్మలచేకూడిన ఋకారమును లఘువుగా తెలియవలయును. ఊష్మలతో కూడిన ఋకారము పీడించబడినచో గురువుగా తెలియవలయును. ఇచట తృచ్‌ అనునది ఉదాహరణము. ఋషభ, బృహస్పతి, గృహీత, పృథివి, నిరృతి శబ్దములలో నున్న అయిదు ఋకారములు గురువులేయగును. ఈ విషయమున సంశయము లేదు. శషసహరలు ఆదియందు గల పదములలో నున్న రేఫద్విపద సంధిలో నున్న రేఫ స్వరభక్తి యగును. ఇ ఉ వర్ణరహితమైనది, క్రమ రహితమైన ఏకపదములోని ఋకారము కూడా స్వరభక్తి యగును. స్వరభక్తి రెండు విధములు. ఋకారమునందు రేఫయందు ఉండును నియమించబడిన అక్షరములను చింతించువారు ఈ స్వరభక్తిని స్వరోద వ్యంజనోద యని యందురు. శషసలలో నున్న స్వరభక్తిని స్వరోదయందురు. హకారమునున్న స్వరభక్తిని వ్యంజనోద యందురు. శషసలలోని ఋకారమును వివృతముగా హకారములోని ఋకారమును సంవృతముగా తెలియుదురు. స్వరభక్తిని ప్రయోగించువారు మూడు దోషములను వర్జించవలయును, ఇకారమును, ఉకారమును, గ్రస్తదోషమును, సంయోగ పరమైన ఛకారమును, విసర్గలను, ద్విమాత్రక వర్ణమును, అంతమున నున్న చ, న, జ్‌, మ, సకారములను, అనుస్వారమును, ఘుటితమును విడువవలయును. ఏ వృత్తములో ప్రథమపాదము తృతీయ పాదము ద్వాదశ మాత్రల కలదిగా, ద్వితీయపాదము అష్టాదశ మాత్రలు కలదిగా, చతుర్ధపాదము పంచదశ మాత్రలు కలదిగానుండునో దానిని విపుల వృత్తమందురు. సంయోగము పరమునందు లేని హ్రస్వాక్షరములు లఘువులని, సంయోగము పరమందున్న హ్రస్వాక్షరములు, దీర్ఘాక్షరములు గురువులని తెలియవలయును. స్వరమున కంటే ముందు వివృతి యున్నచో నది గురుస్వరముగా తెలియబడును. అచట క్షైప్ర స్వరముండదు. పదములలోని స్వరములు అష్టవిధములని తెలియుము.

అంతోదాత్తమాద్యుదాత్తమాదాత్తమనుదాత్తం నీచస్వరితమ్‌, మధ్యోదాత్తం స్వరితం ద్విరుదాత్తమిత్యే అష్టాపదసంజ్ఞాః. 209

అగ్నిస్సోమప్రవోవీర్య హవిషా స్వర్వనస్పతిః. 210

అంతర్మధ్యమయో తామ్యుదమనునిపాత్య ఆద్యాత్స్వరితముపసర్గే,

ద్విర్నీచమాఖ్యాత ఇతి స్వరితాత్పరాణి యానిస్యుర్ధారాపక్షరాణి తు. 211

సర్వాణి ప్రచయస్థాన్యుపోదాత్తం నిహన్యతే. 212

ప్రచయో యత్ర దృశ్యేత తత్ర హన్యాత్స్వరం బుధః, స్వరితః కేవలో యత్ర మృదుస్తత్ర నిపాతయేత్‌. 213

పంచవిధమాచార్యకం నామ సుఖం న్యాసః కరణం ప్రతిజ్ఞోచ్చారణా,

అత్రోచ్యతే శ్రేయః ఖలు వైశ్యాః ప్రతిజ్ఞాతోచ్చారణా యస్య కస్యచిత్‌,

వర్ణస్య కరణం నోపలభ్యతే ప్రతిజ్ఞా తత్ర వోఢవ్యా కరణం హి తదాత్మకమ్‌. 214

తుంబురుర్బవద్విశిష్ట విశ్వావస్వాదయశ్చ గంధర్వాః, సామసు నిభృతం కరణం స్వరసౌక్ష్మ్యాన్నైవ జానీయుః. 215

కౌక్షేయాగ్నిం సదా రక్షేత్‌ అశ్రీపాదర్శనం హేతుమ్‌, జీర్ణో హారః ప్రవృద్ధః ఖలూషసిన్బ్రహ్మ చింతయేత్‌. 216

శరద్విషువతోతీతాదుషష్యుత్ధానమిష్యతే, యావద్వాసంతికీ రాత్రిర్మధ్యా పర్యుపస్థితా. 217

ఆమ్రపాలాశబిల్వానామపామార్గశిరీషయోః, వాగ్యతః ప్రాతరుత్థాయ భక్షయేద్దంతధావనమ్‌. 218

ఖాదిరశ్చ కదంబశ్చ కరవీరకరంజయోః, సర్వే కంటకినః పుణ్యాః క్షీరిణశ్చ యశస్వినః. 219

తేనాస్య కరణ సౌక్ష్మం మాధుర్యం చోపజాయతే, వర్ణాంశ్చ కురుతే సమ్యక్‌ ప్రాచీనౌదావతిర్యథా. 220

త్రిఫలాం లవణాఖ్యేన భక్షయేచ్ఛిష్యకస్సదా, అగ్నిమేధా జనన్యేషా స్వరవర్ణకరీ తథా . 221

కృత్వా చావశ్యకాన్ధర్మాఙఠరం పర్యుపాస్య చ, పీత్వా మధు ఘృతం చైవ శుచిర్భూత్వా తతో వదేత్‌. 222

మంద్రేణోపక్రమేత్పూర్వం సర్వశాఖాస్వయం విధిః, సప్త మంత్రానతిక్రమ్య యథేష్టాం వాచముత్సృజేత్‌. 223

న తాం సమీరయేద్వాచం న ప్రాణముపరోధయేత్‌, ప్రాణానాముపరోధేన వైస్వర్యం చోపజాయతే. 224

స్వరవ్యంజనమాధుర్యం లుప్యతే నాత్ర సంశయః, కుతీర్ధాదాగతం దగ్ధమపవర్ణైశ్చ భక్షితమ్‌. 225

న తస్య పరమోక్షోస్తి పాపాహేరివ కిల్బిషాత్‌, సుతీర్ధాదాగతం జగ్ధుం స్వామ్నాతం సుప్రతిష్ఠితమ్‌. 226

సుస్వరేణ సువక్త్రేణ ప్రయుక్తం బ్రహ్మ రాజతి, న కరాలో న లంబోష్ఠా న చ సర్వానునాసికః. 227

గద్గదో బద్ధజిహ్వశ్చ ప్రయోగాన్వక్తుమర్హతి, ఏకచిత్తో నిరుద్ధాంతః స్నాతో గానవివర్జితః. 228

స తు వర్ణాన్ప్రయుంజీత దంతోష్ఠం యస్య శోభనమ్‌, పంచ విద్యాం న గృహ్ణంతి చండా స్తబ్ధాశ్చ యే నరాః. 229

అలసాశ్చ సరోగాశ్చ యేషాం చ విసృతం మనః, శ##నైర్విద్యాం శ##నైరర్ధాన్‌ ఆరోహేత్పర్వతం శ##నైః. 230

శ##నైరధ్వసు వర్తేత యోజనాన్న పరం ప్రజేత్‌, యోజనానాం సహస్రం తు శ##నైర్యాతి పిపీలికా. 231

అగచ్ఛన్వైనతేయోపి పదమేకం న గచ్ఛతి, న హి పాపహతా వాణీ ప్రయోగాన్వక్తుమర్హతి. 232

బధిర స్యేవ జల్పస్య విదగ్ధా వామలోచనా, ఉపాంశుచరితం చైవ యోధీతే విత్రసన్నివ. 233

అపి రూప సహస్రేషు సందేహేష్వేవ వర్తతే, పుస్తకప్రత్యయాధీతం నాధీతం గురుసన్నిధౌ. 234

రాజతే న సభామత్యే జారగర్భేవ కామినీ, అంజనస్య క్షయం దృష్ట్వా వల్మీకస్య తు సంచయమ్‌. 235

అవంధ్యం దివసం కుర్యాత్‌ దానాధ్యయనకర్మసు, యత్కీటైః పాంసుభిశ్శక్ణైర్వల్మీకః క్రియతే మహాన్‌. 236

న తత్ర బలసామర్ధ్యముద్యోగస్తత్ర కారణమ్‌, సహస్రగుణితా విద్యా శతశః పరికీర్తితా. 237

ఆగమిష్యతి జిహ్వాగ్రే స్థలాన్నిమ్నమివోదకమ్‌, హయానామివ జాత్యానాం అర్ధరాత్రార్ధశాయి నామ్‌. 238

న హి విద్యార్ధినాం నిద్రా చిరం నేత్రేషు తిష్ఠతి, న భోజనవిలంబీ స్యాన్న చ నారీనిబంధనః. 239

సముద్రమపి విద్యార్ధీ వ్రజేద్గరుడహంసవత్‌, అహిరివ గణాద్భీతస్సారహిత్యాన్నరకాదివ. 240

రాక్ష సీభ్య ఇవ స్త్రీభ్యస్స విద్యామధిగచ్చతి, న శఠాః ప్రాప్నువన్త్యర్ధాన్‌ న క్లీబా న చ మానినః. 241

న చ లోకరవా దీనా న చ స్వస్వప్రతీక్షకాః, యథా ఖనన్ఖనిత్రేణ భూతలం వారి విందతి. 242

ఏవం గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్ఛతి, గురుశుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వా. 243

అథవా విద్యయా విద్యా హ్యన్యధా నోపపద్యతే. 244

శుశ్రూషారహితా విద్యా యద్యపి మేధాగుణౖస్సముపయాతి, వంధ్యేవ ¸°వనవతీ న తస్య సాఫల్యవతీ భవతి. 245

ఇతి దిఙ్మాత్రముద్దిష్టం శిక్షాగ్రంథం మయా తవ జ్ఞాత్వా వేదాంగమాద్యం తు బ్రహ్మభూయాయ కల్పతే. 246

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే

బృహదుపాఖ్యానే ద్వితీయపాదే

పంచాశత్తమోధ్యాయః

అంతోదాత్తము, ఆద్యుదాత్తము, ఉదాత్తము, అనుదాత్తము, నీచస్వరితము, మధ్యోదాత్తము, స్వరితము, ద్విరుదాత్తము అని ఎనిమిది పదస్వరములపేర్లు. అగ్ని సోమ, ప్రవ, వీర్యం హవిషా, స్వ, వనస్పతి అను శబ్దముల లోపల మధ్యమున నున్న స్వరములు అనునిపాతము చేయబడి మొదటి దానికంటే పరముననున్నది స్వరితమని, ఉపసర్గలో ద్విరుదాత్తమని, అఖ్యాతమున నీచస్వరితమని, స్వరితము కంటే పరమందున్నవాటిని నిపాతములుగా తెలియవలయును. ప్రచయమున నున్న అన్నిస్వరములలో ఉదాత్తసమీపవర్తి అనుదాత్తమగును. ప్రచయమున్న ప్రదేశమున స్వరమును అనుదాత్తముగా పలుకవలయును. కేవల స్వరితమున్నచో మృదుస్వరమునుపయోగించవలయును. ఆచార్యులు చెప్పుట అయిదు విధములు. సుఖము, న్యాసము, కరణము, ప్రతిజ్ఞ, ఉచ్చారణము అని ఈ విషయమున శ్రేయోదాయకమగు పద్ధతిని చెప్పెదను. వైశ్యులు ప్రతిజ్ఞచే ఉచ్చరించుట యుక్తము. ఏ వర్ణమునకైనను కరణము లభించదు. ప్రతిజ్ఞ మాత్రమే స్వీకరించవలయును. కరణము కూడా ప్రతిజ్ఞాత్మకముగా నుండును. తుంబురుడు, నారదుడు, విశ్వావసువు మొదలగు గంధర్వులు సామములో నిక్షిప్తమగు కరణమును స్వర సూక్ష్మత వలన తెలియరు. జఠరాగ్నిని ఎప్పుడూ తగిన ఆహారపానీయములచే రక్షించవలయును. జీర్ణమగు ఆహారమునే భుజించవలయును. ఉషఃకాలమున లేచి బ్రహ్మను ధ్యానము చేయవలయును. వేదమును వల్లెవేయవలయును. శదదృతువు హేమంతర్తువు నందు మధ్య కాలమున మామిడి, మోదుగ మారేడు, ఉత్తరేణి శిరీష కాష్ఠములతో వాక్కును నియమించి, ప్రాతఃకాలమున లేచి దంతధావనమును చేయవలయును మేడి, కదంబము, కరవీరము, కరంజము, కంటకములు గల వృక్షములను, పాలుకారు వృక్షముల కాష్టములు దంతధావనమునకుపయోగించినచో పావనత్వమేర్పడుటే కాక స్వరములో సూక్ష్మత మాధ్యుర్యము కలుగును. తూర్పుదిక్కున నుండు మేఘము పలువర్ణములను చూపునట్లు కంఠము అన్నివర్ణములను చక్కగా పలుకగలుగును. శిష్యుడు త్రిఫలచూర్ణమును లవణములతో కలిపి సేవించవలయును. ఈ త్రిఫల జఠరాగ్నిని మేధస్సును కలిగించును నిత్యకృత్యములను నెరవేర్చి నిత్యధర్మములనాచరించి జఠరాగ్నిని తృప్తిపరిచి, తేనెను నెయ్యిని త్రాగి, పవిత్రుడై వేదాధ్యయనమును చేయవలయును. మొదట మంద్రస్వరముతో ప్రారంభించవయును. అన్ని వేదశాఖలలోను ఈ విధినే అనుసరించవలయును. సప్తస్వరములనతిక్రమించి యథేష్ఠముగా పలుకుటను విసర్జించవలకును. యథేష్ఠముగా పలుకరాదు. ఊపిరిని బిగబట్టరాదు. ఊపిరిని బిగబట్టుటచే వైస్వర్యము కలుగును. స్వరవ్యంజనములలో మాధుర్యము లోపించును. చెడుతీర్ధములను వచ్చినవాటిని, దగ్ధమైన వాటిని, అపర్ణములు కలవాటిని భక్షించినచో స్వరము చక్కగా రాదు. అటువంటివారికి పాపులకువలె పరిమోక్షము లేదు. మంచితీర్ధములనుండి వచ్చినవాటిని భక్షించినవారు చక్కగా వేదాధ్యయనమును చేయగలరు. వారివద్ద వేదము సుప్రతిష్ఠతమగును. మంచి స్వరముతో, మంచినోటితో ప్రయోగించిన వేదము శోభించును. పెద్దనోరు కలవాడు, వ్రేలాడు పెదవులు కలవాడు, అన్నివర్ణములను ముక్కుతో పలుకువాడు, బొంగరు గొంతు కలవాడు, నాలుకు కదల్చనివాడు, వేదాధ్యయనమును చేయరాదు. ఏకాగ్రచిత్తము గలవాడు. ఉద్వేగము లేనివాడు, స్నానము చేసి గానమును విడిచి, మంచి దంతోష్ఠములు కలవాడు వేదవర్ణములనుపయోగించవలయును. చండులు, స్తబ్ధులు, అలసులు, రోగము గలవారు, పలువిషయములందు మనసునుంచువారు ఈ అయిదుగురు వేదాధ్యయనమును చేయరాదు. విద్యను మెల్లగా అభ్యసించవలయును. ధనమును మెల్లగా సంపాదించవలయును. పర్వతమును మెల్లగా అధిరోహించవలయును. దారిలో మెల్లగా నడువవలయును. ప్రతిదినము ఒక యోజనమును మించి నడువరాదు. మెల్లగా కదలుచు చీమలు కొన్నివేల యోయనముల దూరమును చేరును. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనిచో గరుడుడు కూడా ఒక్క అడుగు దూరమును కూడా చేరలేడు. పాపములను పలుకు వాక్కుచే వేదములను పలుకరాదు. చెవిటి వానితో వదురుబోతుతో నెరజాణ పలుకు వలె యుండును. ఉపాంశు చరితమును భయపడుచు పలుకువాడు ఎన్నివేలమార్లు చదివిననూ సందేహముతోనే యుండును. గురువు సన్నిధిలో చదువక పుస్తకమును చూచి చదువబడినది జారుని వలన గర్భమును ధరించిన స్త్రీవలె సమాజమున గౌరవమును పొందజాలదు. ఎన్నిమార్లు పెట్టిననూ కరిగిపోవు కాటుకను, చీమలు ప్రయత్నముచే నేర్పరుచు పుట్టను చూచి దానాధ్యయన కర్మలయందు నిత్యము యత్న శీలుడై యుండవలయును. పురుగులు ధూళికణములతో మెత్తనిమట్టితో పెద్ద పుట్టను సిద్దము చేయును. ఆ పురుగులకు బలము కాని సామర్ధ్యము కాని లేదు. ప్రయత్నశీలతే కార్యసిద్ధికి కారణము నూరుమార్లు అధ్యయనము చేసి వేయిమార్లు వల్లె వేసినచో విద్య పల్లమునకు ప్రవహించునదివలె వచ్చును. జాత్యశ్వములు అర్థరాత్రి సగము నిద్రపోవునట్లు విద్యార్ధులు చాలాకాలము కనులకు నిద్ర యుండరాదు చాలాకాలము భోజనము చేయరాదు. నారీ నిర్బంధముండరాదు. సముద్రమును గరుడ పక్షులు, హంసలు దాటునట్లు విద్యార్ధులు వేదసాగరమును దాటవలయును. పాము వలెజనసమూహమునకు భయపడుచు, నగరమును వలె సాహిత్యమును చూచి భయపడుచు రాక్షసులకు వలె స్త్రీజనమునకు భయపడు విద్యార్ధి విద్ను పొందగలడు. శఠులు, దీనులు, వృధాభిబానులు, లోకముతో ఎక్కువగా మాటాడువారు, నపుంసకులు, తమను తాము చూచుకొను వారు అర్ధములను పొందజాలరు. గడ్డపారతో త్రవ్వుచు భూమిలో నీరును పొందినట్లు గురువులో నున్న విద్యను శుశ్రుషతో పొందగలరు. గురువును సేవించుటచే, పుష్కల ధనముచే కాని ఒక విద్య నిచ్చుటచే గాని విద్యను పొందవచ్చును. నాలుగవ మార్గము లేదు. గురువును సేవించక మేధాసంపత్తిచే విద్యను పొందిననూ గొడ్డురాలి ¸°వనము వలె సఫలము కాజాలదు. ఇట్లు సంగ్రహముగా శిక్షను నీకు తెలిపితిని. వేదమునకు మొదటి యంగమగు శిక్షను చక్కగా తెలుసుకొని చక్కగా వేదమును అభ్యసించవచ్చును.

ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున

బృహదుపాఖ్యానమున ద్వితీయ పాదమున

యాబదియవ అధ్యాయము సమాప్తము

Sri Naradapuranam-I    Chapters    Last Page