Sri Naradapuranam-I    Chapters    Last Page

ఏకపంచాశత్తమోధ్యాయః=యాబదియొకటవ అధ్యాయము

అథాత స్సంప్రవక్ష్యామి కల్పగ్రంథం మునీశ్వర ! యస్య విజ్ఞానమాత్రేణ స్యాత్కర్మకుశలో నరః. 1

నక్షత్రకల్పో వేదానాం సంహితానాం తథైవ చ, చతుర్ధస్స్యాదాంగిరసశ్శాంతికల్పశ్చ పంచమః. 2

నక్షత్రాధీశ్వరాఖ్యానం విస్తరేణ యథాతథమ్‌, నక్షత్రకల్పే నిర్దిష్టం జ్ఞాతవ్యం తదిహాపి చ. 3

వేదకల్పే విధానం తు ఋగాదీనాం మునీశ్వర ! ధర్మార్ధకామమోక్షాణాం సిద్ధ్యై ప్రోక్తం సవిస్తరమ్‌. 4

మంత్రాణామృషయశ్చైవ ఛందాస్యథం చ దేవతాః, నిర్దిష్టాస్సంహితా కల్పే మునిభిస్తత్త్వదర్శిభిః. 5

తథైవాంగిరసఃకల్పే షట్కర్మాణి సవిస్తరమ్‌, అభిచారవిధానేన నిర్దిష్టాని స్వయంభువా. 6

శాంతికల్పే తు దివ్యానాం భౌమానాం మునిసత్తమ, తథాంతరిక్షోత్పాతానాం శాంతయో హ్యుదితాః పృథక్‌. 7

సంక్షేపేణౌతదుద్దిష్టం లక్షణం కల్పలక్షణ, విశేషః పృథగేతేషాం స్ధితశ్శాఖాంతరేషు చ. 8

గుహ్యకల్పేషు సర్వేషాముపయోగితయాధునా, వక్ష్యామి తే ద్విజశ్రేష్ఠ ! సావధానతయా శృణు. 9

ఓంకారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా, కంఠం భిత్త్వా వినిర్యాతౌ తస్మాన్మాంగల్యకావిమౌ. 10

కృత్వా ప్రోక్తాని కర్మాణి తదూర్ధ్వాని కరోతి యం, సోథశబ్దం ప్రయుంజీత తదానన్త్యార్ధమిష్యతే. 11

కుశాః పరిసమూహాయ వ్యస్తశాఖాః ప్రకీర్తితాః, న్యూనాధికా నిష్పలాయ కర్మణోభిమతస్స చ. 12

కృమికీటపతంగాద్యా భ్రమంతి వసుధాతలే, తేషాం సంరక్షణార్ధాయ ప్రోక్తం పరిసమూహనమ్‌. 13

రేఖాః ప్రోక్తాశ్చ యాస్తిస్రః కర్తవ్యాస్సాస్సమాద్విజ, న్యూనాధికా న కర్తవ్యా ఇత్యేవ పరిభాషితమ్‌. 14

మేదినీ మేదసా వ్యాప్తా మధుకైటభ##దైత్యయోః, గోమయేనోపలేప్యేయం తదర్ధమితి నారద. 15

వంధ్యా దుష్టా చ దీనాంగీ మృతవత్సా చ యా భ##వేత్‌, యజ్ఞార్ధం గోమయం తస్యా నాహరేదితి భాషితమ్‌. 16

యే భ్రమంతి తదాకాశే పతంగాద్యా భయంకరాః, తేషాం ప్రహరణార్ధాయ మతం ప్రోద్ధరణం ద్విజ. 17

స్రువేణ చ కుశేనాపి కుర్యాదుల్లేఖనం భువః, అస్ధికంటకినస్సిద్ధ్యర్ధం బ్రహ్మణా పరిభాషితమ్‌. 18

ఆపో దేవగణాస్సర్వే తథా పితృగణా ద్విజ, తేనాద్భిరుక్షణం ప్రోక్తం మునిభిర్విధికోవిదైః. 19

అగ్నేరానయనం ప్రోక్తం సౌభాగ్యస్త్రీభిరేవ చ, శుభ##దే మృణ్మయే పాత్రే ప్రోక్ష్యాద్భిస్తం నిధాపయేత్‌. 20

అమృతస్య క్షయం దృష్ట్వా బ్రహ్మద్యైస్సర్వదైవతైః, వేద్యాం నిధాపితస్తస్మాత్‌ సమిద్గర్భే హుతాశనః. 21

దక్షిణస్యాం దానవాద్యా స్ధితా యజ్ఞస్య నారద ! తేభ్యస్సంరక్షణార్ధాయ బ్రహ్మణం తద్దిశి న్యసేత్‌. 22

ఉత్తరే సర్వపాత్రాణి ప్రణీతాద్యాని పశ్చిమే, యజమానః పూర్వతస్స్యుర్ద్విజాస్సర్వేపి నారద.23

ద్యూతే చ వ్యవహారే యజ్ఞకర్మణి చేద్భవేత్‌, కర్తోదాసీనచిత్తస్తత్కర్మ నశ్యేదితి స్ధితిః. 24

బ్రహ్మచార్యే స్వశాఖౌ హి కర్తవ్యే యజ్ఞకర్మణి, ఋత్విజాం నియమో నాస్తి యథాలాభం సమర్చయేత్‌. 25

ద్వే పవిత్రేత్య్రంగులేస్తః ప్రోక్షణీ చతురంగులా, ఆజ్యస్ధాలీస్త్య్రంగులాథ చారుస్ధాలీ షడంగులా. 26

ద్వంగులం తూపయమనమేకం సమ్మార్జనాంగులమ్‌, స్రువం షడంగులం ప్రోక్తం స్రుచం సార్ధత్రయాంగులమ్‌. 27

ప్రాదేశమాత్రా సమిధపూర్ణపాత్రం షడంగుళమ్‌, ప్రోక్షీణ్యా ఉత్తరే భాగే ప్రనీతాపాత్రమష్టభిః. 28

యాని కాని చ తీర్ధాని సముద్రాస్సరితస్తథా, ప్రణీతాయాం సమాసన్నాస్తస్మాత్తాం పూరయేజ్జలైః. 29

వేదికా వస్త్రహీనా చ నగ్నా సంప్రోచ్యతే ద్విజ, పరిస్తీర్య తతో దర్భైః పరిదధ్యాదిమాం బుధః. 30

ఇంద్రవజ్రం విష్ణుచక్రం వామదేవత్రిశూలకమ్‌, దర్భరూపతయా త్రీణి పవిత్రచ్చేదనాని చ. 31

ప్రోక్షణీ చ ప్రకర్తవ్యా ప్రణీతోదకసంయుతా, తేనాతి పుణ్యదం కర్మ పవిత్రమితి కీర్తితమ్‌. 32

ఆజ్యస్ధాలీ ప్రకర్తవ్యా ఫలమాత్రప్రమాణికా, కులాలచక్రఘటికం ఆసురం మృణ్మయం స్మృతమ్‌. 33

తదేవ హస్తఘటితం స్ధాల్యాది దైవికం భ##వేత్‌, స్రువే చ సర్వకర్మాణి శూభన్యప్యశుభాని చ. 34

తస్య చైవ పవిత్రార్ధం వహ్నౌ తాపనమీరితమ్‌, అగ్రే ఘృతేన వైధవ్యం మధ్యం చైవ ప్రజాక్షయః. 35

మూలే చ మ్రియతే హోతా తస్మాద్ధార్యం విచార్య తత్‌, అగ్నిస్సూర్యశ్చ సోమశ్చ విరించిరనిలో యమః. 36

స్రువే షడేతే దేవాస్తు ప్రత్యంగులముపాశ్రితాః, అగ్నిర్భోగార్ధనాశాయ సూర్యో వ్యాధికరో భ##వేత్‌. 37

నిష్ఫలస్తు స్మృతస్సోమో విరించిస్సర్వాకామధః, అనిలో వృద్ధిదః ప్రోక్తో యమో మృత్యుప్రదో మతః. 38

సంమార్జనోపయమనం కర్తవ్యం చ కుశద్వయమ్‌, పూర్వం తు సర్వశాఖం స్యాత్‌ పంచశాఖం తథాపరమ్‌. 39

శ్రీపణీ చ శమీ తద్వత్‌ ఖదిరశ్చ వికంకతః పలాశ##శ్చైవ విజ్ఞేయా స్రువే చైవ తథా స్రుచి. 40

హస్తోన్నితం స్రువం శస్తం త్రిదశాంగుళికం స్రుచమ్‌, విప్రాణాం చైతదాఖ్యాతం హ్యన్యేషామంగుళోనకమ్‌. 41

శూద్రాణాం పతితానాం చ ఖరాదీనాం చనారద, దృష్టిదోషవినాశార్ధం పాత్రాణాం ప్రోక్షణం స్మృతమ్‌. 42

అకృతే పూర్ణపాత్రే తు యజ్ఞచ్చిద్రం సముద్భవేత్‌, తస్మిన్పూర్ణీ కృతే విప్ర ! ¸్ఞుసంపూర్ణతా భ##వేత్‌. 43

అష్టముష్టి భ##వేత్కించిత్‌ పుష్కలం తచ్చతుష్టయమ్‌, పుష్కలాని తు చత్వారి పూర్ణపాత్రం విదుర్బుధాః. 44

హోమకాలే తు సంప్రాప్తే న దద్యాదాసనం క్వచిత్‌, దత్తేతృప్తో భ##వేద్వహ్నిశ్శాపం దద్యాచ్చ దారుణమ్‌. 45

ఆధారా నాసికా ప్రోక్తా ఆజ్యభాగా చ చక్షుషీ, ప్రాజాపత్యం ముఖం ప్రోక్తం కటిర్వ్యాహృతిభిస్స్మృతా. 46

శీర్షహస్తౌ చ పాదౌ చ పంచవారుణమీరితమ్‌, తథా స్విష్టకృతం విప్ర శ్రోత్రే పూర్ణాహుతిస్తథా. 47

ద్విముఖం చైకహృదయం చతుశ్శ్రత్రం ద్వినాసికమ్‌, ద్విశీర్షకం చ షణ్ణత్రం పింగలం సప్తజిహ్వకమ్‌. 48

సవ్యభాగే త్రిహస్తం చ చతుర్హస్తం చ దక్షిణ, స్రుక్‌స్రువౌ చాక్షమాలా చ యా శక్తిర్ధక్షిణ కరే. 49

త్రిమేఖలం త్రిపాదం చ ఘృతపాత్రం ద్విచామరమ్‌, మేషారూఢం చతుశ్శృంగం బాలాదిత్యసమప్రభమ్‌. 50

ఉపవీతసమాయుక్తం జటాకుండలమండితమ్‌, జ్ఞాత్వైవమగ్నిదేహం తు హోమకర్మ సమాచరేత్‌. 51

ఓ మునీశ్వరా! ఇక ఇపుడు కల్పగ్రంథమును చెప్పెదను. కల్పమును తెలుసుకొనిన మానవుడు కర్మకుశలుడు కాగలడు. వక్షత్ర కల్పము, వేదకల్పము, సంహితా కల్పము, ఆంగిరస కల్పము, శాంతి కల్పము అని అయిదు కల్పములు కలవు. నక్షత్రాధీశ్వరలను నక్షత్ర కల్పము విస్తరముగా వివరించిరి. ఇట్లు నక్షత్ర కల్పమును కూడా విస్తరముగా తెలియవలయును. వేదకల్పమున ధర్మార్ధకామ మోక్షముల సిద్ధికొఱకు ఋగాది చతుర్వేదములు విస్తారముగా చెప్పబడినవి. సంహితా కల్పమున మంత్రముల ఋషులు, ఛందస్సులు, దేవతలు తత్త్వము తెలిసిన మునులచే చెప్పబడినవి. అట్లే ఆంగిరస కల్పములో బ్రహ్మ ఆభిచారవిధానముచే షట్కర్మలను విస్తరముగా వివరించెను. శాంతి కల్పమున దివ్యభౌమ అంతరిక్షముల ఉత్పాతముల శాంతులు వివరించబడినవి. ఇది సంక్షేపముగా కల్పలక్షణము. శాఖాంతరములలో విడిగా ఈ కల్పముల లక్షణములు విస్తరముగా చెప్పబడినవి. గృహ్యకల్పమున అందరి ఉపయోగము కొఱకు చెప్పబడిన వాటిని ఇపుడు విస్తరముగా చెప్పెదను. సావధానముగా వినుము, పూర్వము బ్రహ్మకంఠమును బేధించుకొని ఓంకారము, అథయను శబ్దములు వెలువడినవి. కావున ఈ రెండు శబ్దములు శుభకరములు. ఇట్లు చెప్పబడిన కర్మలను ప్రారంభించు మానవుడు మొదట అథశబ్దమును ప్రయోగించినచో అనన్త ఫలము కలుగును. దర్భలు పరిసమూహము కొఱకు విడివిడి శాఖలుగా చెప్పబడినవి. తక్కువైనను, అధికమైనను అభిమత ఫలము నీయజాలవు. భూమి మీద కృమికీటపక్ష్యాదులు భ్రమించుచుండును కావున వాటి నుండి, వాటిని రక్షించుట కొఱకు పరిసమాహము చెప్పబడినది. మూడు రేకలు చెప్పబడినవి. ఆరేఖలు సమముగా నుంచవలయును. ఎక్కువగా చేయరాదు. ఈ భూమి మధుకైటభులను రాక్షసుల మేదస్సుతో నిండియున్నది. కావున భూమిని గోమయముతో అలుకవలయును, గొడ్రాలు, దుష్టురాలు, దీనాంగి, పుత్రులు చనిపోయిన స్త్రీ యజ్ఞము కొఱకు గోమయమును తేరాదు. ఆకాశమున తిరుగు భయంకరములగు పక్ష్యాదుల ప్రహరణము కొఱకు ప్రోద్ధరణము చెప్పబడినది. స్రువముతోకాని దర్భతో కాని భూమిని ఉల్లేఖనము చేయవలయును. అట్లు చేసినచో అస్ధి కంటకాదుల శుద్ధి కలుగునవి బ్రహ్మ చెప్పియుండెను. జలమే అన్ని దేవగణములు పితృగణములు. కావుననే విధిని తెలిసిన మునులు జలముచే ప్రోక్షణమును చేయవలయునని చెప్పిరి. సౌభాగ్యవతులగు స్త్రీలు మాత్రమే యజ్ఞాగ్నిని తేవలయును. పవిత్రమైన మృణ్మయపాత్రను నీటితో శుద్ధిచేసి పాత్రలో అగ్నినుంచి తేవలయును. బ్రహ్మదులగు దేవతలందరు అమృత క్షయమును చూచి దర్భలలోని అగ్నిని యజ్ఞవేదిలో నుంచిరి. యజ్ఞమునకు దక్షిణ దిక్కున దానవాదులుందురు. వారి నుండి రక్షణ కొఱకు బ్రహ్మను దక్షిణ దిక్కున నుంచవలయును. ప్రణీత మొదలగు పాత్రలను ఉత్తరమున నుంచవలయును. పశ్చిమమున యజమాని ఉండవలయును. మిగిలిన బ్రాహ్మణులందరు తూర్పుదిక్కున నుండవలయును. ద్యూతములో, వ్యవహారములో యజ్ఞకర్మలో కర్త ఉదాసీనచిత్తుడైనచో ఆ కర్మ నశించును. బ్రహ్మ ఆచార్యులు యజ్ఞకర్మలో యజమాని శాఖ గలవారే యుండవలయును. ఋత్విజుల విషయమున నియమము లేదు. లభించిన విధముగా ఏ శాఖవారి నైనను నియమించవచ్చును. మూడు అంగుళముల పరిమాణము గల రెండు పవిత్రములు కావలయును. ప్రోక్షణీ నాలుగంగుళములుండవలయును. ఆజ్యపాత్ర మూడంగుళములు, చరు పాత్ర ఆరంగుళములు గలదిగా నుండవలయును. ఉపయమనము రెండంగుళములు కలది, సమ్మార్జనము ఏకాంగుళముండవలయును, స్రువము ఆరంగుళములు కలది, స్రుచము మూడన్నర అంగుళములు కలది సమిధలు ప్రాదేశమాత్రములుగా నుండవలయును. పూర్ణపాత్రము ఆరంగుళములు కలది కావలయును. ప్రోక్షణి పాత్రకు ఉత్తర భాగమున ఎనిమిదిఅంగుళములు గల ప్రణీతి పాత్రనుంచవలయును. భూమండలముననున్న సమస్త నదులు సముద్రములు ప్రణీతిలో చేరియుండును. కావున ప్రణీతిపాత్రను నీటిచే నింపవయలును. వస్త్ర హీనమగు వేదిక నగ్నమనబడును. కావున దర్భలను పరిచి వస్త్రమును పరచవలయును. ఇంద్రవజ్రము, విష్ణుచక్రము, శివత్రిశూలము అను వాటిని దర్భలతో చేయవలయును. ఈ మూటినే పవిత్రఛేదనములందురు. ఇంద్రవజ్రము, విష్ణుచక్రము, శివత్రిశూలము అను వాటిని దర్భలతో చేయవలయును. ఈ మూటినే పవిత్రఛేదనములందురు. ప్రణీతజలముతో కూడిన ప్రోక్షణి చేయవలయును. అట్లు చేసినచో మహా పుణ్యమును ప్రసాదించును. కావుననే దానిని పవిత్రమందురు. పలమాత్రప్రమాణము కలదానిని ఆజ్యపాత్రనేర్పరుచవలయును. కులాల చక్రముతో నిర్మించబడిన మృణ్మయ పాత్రను ఆసురమందురు. ఆ పాత్రయే హస్తమున ధరించనిచో దైవికర్మకు యోగ్యమగు స్ధాల్యాదులుగా మారును. స్రువమున శుభాకర్మలన్నియూ నుండును. కావుననే పవిత్రత కొఱకు స్రువమును అగ్నిచే తప్తము చేయవలయును. స్రువమున అగ్రభాగమున ధరించినచో వైధవ్యము, మధ్యభాగమున సంతాన క్షయము మూలమున హోతృమరణము సంభవించును. కావున చక్కగా విచారించి ధరించవలయును. అగ్ని, సూర్యుడు, యముడు, చంద్రుడు, బ్రహ్మ, వాయువు అన నీ షడ్దేవతలు స్రువమున ప్రతి అంగుళమున నుందురు. అగ్ని భోగార్దనాశమును, సూర్యుడు వ్యాధిని, సోముడు ఫలరాహిత్యమును కలిగించును. బ్రహ్మ సర్వకామములనిచ్చును. వాయువు వృద్ధిని కలిగించును. యముడు మృత్యువునిచ్చును. సంమార్జన ఉపయనమములుగా రెండు దర్భలను ఏర్పరచవలయును. శ్రీపర్ణము, శమీ, ఖదిరము, వికంకము పలాశము అయిదు శాఖలను స్రువమున, స్రుచమున ఉంచవలయును. స్రువము హస్తపరిమితము, స్రుచము ముప్పదియంగుళముల పరిమాణముండవలయును. ఈ పరిమాణము బ్రాహ్మణులకు విధించబడినది. ఇతరులకు ఒక అంగుళము తక్కువగా నుండవలయును. శూద్ర పతిత ఖరాది దృష్టిదోషనివారనమునకు పాత్రలను ప్రోక్షించవలయును. పూర్ణపాత్రను ఏర్పరచనిచో యజ్ఞచ్ఛిద్రము కలుగును. పూర్ణపాత్రనుంచినచో యజ్ఞ పూర్తి జరుగును. అష్టముష్టి పరిమితములు నాలుగైనచో పుష్కలమనబడును. నాలుగు పుష్కలములను పూర్ణపాత్ర యందురు. హోమకాలమున ఎవరికి ఆసనము నీయరాదు. అట్లిచ్చినచో అగ్ని అసంతృప్తుడై దారుణ శాపమునిచ్చును. ఆధారపాత్రలను నాసికలందురు. ఆజ్యభాగములను చక్షువులందురు. ప్రాజాపత్యమును ముఖమని వ్యాహృతులను కటియని యందురు. పంచవారుణములను శీర్షము హస్తములు పాదములు అందురు. స్షిష్టకృతము పూర్ణాహుతి శ్రోత్రములందురు. రెండుముఖములు, ఒక హృదయములు, నాలుగు శ్రోత్రములు, రెండునాసికలు, రెండు తలలు, ఆరునేత్రములు, పింగళవర్ణము, ఏడు జిహ్వలు, వామభాగమున మూడు హస్తములు, దక్షిణ భాగమున నాలుగు హస్తములు, స్రుక్స్రువములు, జపమాల, శక్తిదక్షిణకరము నందు, మూడుమేఖణలలు, మూడు పాదములు, ఘృత పాత్రము, రెండు చామరములు కలిగియుండును. మేషవాహనము, నాలుగు శృంగములు, బాలసూర్యకాంతి కలిగి యుండును. ఉపవీతముతో కూడి యుండును. జటాకుండలమండితుడుగా నుండును. ఇట్లు అగ్ని దేహమును తెలుసుకొని హోమ కర్మనారంభించవలయును.

పయో దధి ఘృతం చైవ స్నేహపక్వం తథైవ చ, జుహుయాద్యస్తు హస్తేన స విప్రో బ్రహ్మహా భ##వేత్‌. 52

యదన్నం పురుపోశ్నాతి తదన్నం తస్య దేవతాః, సర్వకామసమృద్ధ్యర్ధం తిలాధిక్యం హవిర్మతమ్‌. 53

హోమే ముద్రాత్రయం ప్రోక్తం మృగీ హంసీ చ సూకరీ, అభిచారే సూకరీ స్యాత్‌ మృగీ హంసీ శుభాత్మకే. 54

సర్వాంగుళీభిః క్రౌడీ స్యాత్‌ హంసీ ముక్తకనిష్ఠికా, మధ్యమానామికాంగుష్ఠైః మృగీ ముద్రా ప్రకీర్తితా. 55

పూర్వప్రమాణయాహుత్యా పంచాంగులిగృహీతయా, దధిమధ్వాజ్యసంయుక్తం ఋత్విగ్భిర్జుహుయాత్తిలైః. 56

కుశాస్త్వనామికాసక్తాః కార్యస్స్యుః పుణ్యకర్మణి. 57

వినాయకః కర్మవిఘ్నసిద్ధ్యర్ధం వినియోజితః, గణానామాధిపత్యే చ రుద్రేణ బ్రహ్మణా తథా. 58

తేనోపసృష్టో యస్తస్య లక్షణాని నిబోధ మే, స్వమేవ గాహతేత్యర్ధం లం ముండాంశ్చ పశ్యతి. 59

కామాయ వాససశ్చైవ క్రవ్యాదాంశ్చాధిరోహతి, అంత్యజైర్గర్దభైరుష్ట్రైస్సహైవ త్రావ తిష్ఠతే. 60

వ్రజన్నపి తథాత్మానం మన్యతేనుగతం పరైః, విమనా విఫలా రంభస్సంసీదత్య నిమిత్తతః. 61

తేనోపసృష్టో లభ##తే న రాజ్యం రాజ్యనందనః, కుమారీ న చ భర్తారమపత్యం గర్భమంగనా. 62

ఆచార్యత్వం శ్రోత్రియశ్చ న శిష్యోధ్యయనం తథా, వణిగ్లాభం న చాప్నోతి కృషిం చాపి కృషీవలః. 63

స్నపనం తస్య కర్తవ్యం పుణ్యహ్ని విధిపూర్వకమ్‌, గౌరసర్షపకల్కేన స్వస్తివాచ్యాద్విజైశ్శుభాః. 64

అశ్వస్ధానాద్గజస్ధానాత్‌ వల్మీకాత్సంమాద్ధ్రదాత్‌, మృత్తికాం రోచనాం గంధాన్‌ గుగ్గులుం చాశు నిక్షిపేత్‌. 65

పాత్య్రాద్ధృతాహ్యేకవర్ణైశ్చతుర్భిః కలశైర్హ్రదాత్‌, చర్మణ్యానుడుహైరక్తే స్ధాప్యం భద్రాసనం తతః. 66

సహస్రాక్షం శతధారమృషిభిః పావనం కృతమ్‌, తేన త్వామభిషించామి పావమాన్యాః పునంతు తే. 67

భగం తే కరుణో రాజా భగం సూర్యో బృహస్పతిః, భగమింద్రశ్చ వాయుశ్చ భగం సప్తర్షయో దదుః. 68

యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని, లలాటే కర్ణయోరక్షోరాపస్తుదంతు సర్వదా. 69

స్నానస్య సార్షపం తైలం స్రువేణౌదుంబరేణ తు, జుహుయాన్మూర్ధని కుశాన్‌ సవ్యే చ పరిగృహ్య చ. 70

మితశ్చ సంమితశ్చైవ తథా శాలకటంకటౌ, కూష్మాండో రాజపుత్రశ్చేత్యంతే స్వాహాసమన్వితైః. 71

నామభిర్బలిమంత్రైశ్చ నమస్కారసమన్వితైః దద్యాచ్చతుష్పధే సూర్యే కుశనాస్తీర్య సర్వతః. 72

కృతాకృతాంస్తండులీశ్చ పలలౌదనమేవ చ, మత్స్యాన్పక్వాంస్తథైవామాన్‌ మాంసమేతావదేవ తు. 73

పుష్పం చిత్రం సుగంధం చ సురాం చ త్రివిధామపి, మూలవం పూరికాపూపాన్‌ తథైవోటస్రజోపి చ. 74

దధ్యన్నం పాయసం చైవ గుడపిష్టం సమోదకమ్‌, ఏతాన్సర్వానుపాహృత్య భూమౌ కృత్వా తతశ్శిరః. 75

వినాయకస్య జననీముపతిష్ఠేత్తతోంబికామ్‌, దూర్వాసర్షపపుష్పాణాం తద్వార్ఘ్యం పూర్ణమంజలిమ్‌. 76

రూపం దేహి యశో దేహి భగం భగవతి దేహి మే, పుత్రాన్దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చ దేహి మే. 77

ఉపస్ధాయ శివాం దుర్గాముమాపతిమథార్చమేత్‌, ధూపైర్దీపైశ్చ నైవేద్యైర్గంధమాల్యానులేపనైః. 78

తతశ్శుక్లాంబరధరశ్శుక్లాల్యానులేపనః, బ్రాహ్మణాన్భోజయేత్పశ్చాద్వస్త్రయుగ్మం గురోరపి. 79

ఏవం వినాయకం పూజ్య గ్రహాంశ్చైవ ప్రపూజయేత్‌, శ్రీకామశ్శాంతికామో వా పుష్టిబుద్ధ్యాయువీర్యవాన్‌. 80

సూర్యస్సోమో మహీపుత్రో బుధో జీవో భృగుశ్శనిః, రాహుకేతూ న వాప్యేతే స్ధాపనీయా గ్రహాః క్రమాత్‌. 81

తామ్రకాద్రతాద్రక్తచందనాత్స్వర్ణకాదపి, హేమ్నో రజతాదయస్సీసాత్కార్యా శుభాప్తయే. 82

స్వవర్ణైర్వా పటే లేఖ్యా గంధైర్మండలకేషు చ, యథావర్ణం ప్రదేయాని వాసాంసి కుసుమాని చ. 83

గంధాశ్చ బలయశ్చైవ ధూపో దేయశ్చ గుగ్గులుః, కర్తవ్యా మంత్రవంతశ్చ చరవః ప్రతిదైవతమ్‌. 84

ఆవృష్ణేన ఇ మందే వా అగ్నిర్మూర్ధాదివః క్రమాత్‌, ఉద్బుధ్యస్వేతి యదర్య తథైవాన్నాత్పరిస్రుతః. 85

శంనో దేవీస్తథా కాండాత్‌ కేతుం కృణ్వన్న కేతవః. 86

అర్కః పలావః ఖదిరస్త్వపామార్గోథ పిప్పలః, ఉదుంబరశ్శమీ దూర్వా కుశాశ్చ సమిధః క్రమాత్‌. 87

ఏకైకస్మాదష్టశతం అష్టావింశతిరేవ చ, హోతవ్యా మధుసర్పిభ్యాం దధ్నా క్షీరేణ వా పునః. 88

గుడౌదనం పాయసం చ హవిష్యం క్షీరషాష్టికమ్‌, దధ్యోదనం హలిశ్చూర్ణం మాంసం చిత్రాన్నమేవ చ. 89

దద్యాద్గ్రహక్రమాదేతద్ద్విజేభ్యో భోజనం బుధః, శక్తితోపి యథాలాభం సత్కృత్య విధిపూర్వకమ్‌. 90

ధేనుశ్శంఖస్తదానడ్వాన్‌ హీమకాసో హయః క్రమాత్‌, కృష్ణా గౌరాయసః భాగ ఏతా వై దక్షిణా స్స్మృతాః. 91

యస్య యస్య తు యద్ద్రవ్యం పలేనార్బ్యస్సతేన చ, బ్రహ్మన్నేషాం వరో దత్తః పుజితాః పూజయిష్యథ. 92

గ్రహాధీనా నరేంద్రాణాం ధనజాత్యుచ్ఛ్రయాస్తథా, భావాభావౌ చ జగతస్తస్మాత్పూజ్యతమా గ్రహాః. 93

ఆదిత్యస్య సదా పూజా తిలకం స్వామినస్తథా, మహాగణపతేశ్చైవ కుర్వన్సిద్ధిమవాప్నుయాత్‌. 94

కర్మణాం సఫలత్వం చ శ్రియం వాప్నోత్యుత్తమామ్‌. 95

అకృత్వా మాతృయాగం తు యో గ్రహార్చాం సమారభేత్‌, కుప్యంతి మాతరస్తస్య ప్రత్యూహం కుర్వతే తథా. 96

వసోః పవిత్రమంత్రేణ వసోర్ధారాం ప్రకల్ప్య చ, గౌర్యాద్యా మాతరః పూజ్యా మాంగల్యేషు శుభార్ధిభిః. 97

గౌరీ పద్మా శచీ మేధా సావిత్రీ విజయా జయా, దేవసేనా స్వధా స్వాహా మాతృకా వైధృతిర్ధృతి. 98

పుష్టిరృష్టిస్తథా తుష్టిరాత్మదేవతయా సహ, గణశేనాధికా హ్యేతా వృద్ధౌ పూజ్యాస్తు షోడశ. 99

ఆవాహనం తథా పాద్యమర్ఘ్యం స్నానం చ చందనమ్‌, అక్షతాంశ్చైవ పుష్పాణి ధూపం దీపం ఫలాని చ. 100

నైవేద్యమాచమనీయం చ తాంబూలం పూగమేవ చ, నీరాజనం దక్షిణాం చ క్రమాద్దద్యాచ్చతుష్టయే. 101

పాలు పెరుగు నెయ్యి నూనెతో వండిన దానిని చేతితో హోమమును చేసిన బ్రాహ్మణుడు బ్రహ్మహత్యా పాపమును పొందును. మానవుడు తాను భుజించు ఆహారమునే తన దేవతలకు సమర్పించవలయును. సర్వకామ సమృద్ధికి తిలాధిక్యములు కల హవిస్సును సమర్పించవలయును. హోమమున మృగీ, హంసీ, సూకరీయని మూడు ముద్రలుండును. అభిచార హోమమున మాత్రము సూకరీముద్రనుపయోగించవలయును. శుభకరయాగములో హంసీ, మృగీ ముద్రలను ఉపయోగించవలయును. చేతి అన్నివేళ్ళను కలిపినచో సూకరీ ముద్రయగును. కనిష్ఠికను వదిలినచో హంసీ ముద్రయగును. మధ్యమ అనామికాంగుష్ఠలను కలిపినచో మృగీ ముద్రయగును. మొదట చెప్పిన ప్రమాణముననుసరించి పంచాంగులములతో హవిస్సును దధిమధు ఆజ్యయుక్తముగా స్వీకరించి తిలలతో కలిపి ఋత్విక్కులు హోమమును చేయవలయును. శుభకర్మలలో దర్భలను అనామికాంగుళులతో ధరించవలయును. వినాయకుడు కర్మముల విఘ్నసిద్ధికి నియమించబడియుండెను. అట్లే గణాధిపత్యమున కూడా బ్రహ్మరుద్రులు వినాయకుని నియమించిరి. అట్టి వినాయకుడు స్పృశించిన వాని లక్షణములను తెలుపుచున్నాను వినుము. తన నీటిలోనే తాను మునుగును. కేశఖండనము చేయబడిన ముండులను చూచును. కామార్తుడై వస్త్రాభిలాషియై రాక్షసులనావేశించును. అంత్యజులతో రాసభములతో ఒంటెలతో కలిసి ఒకే చోట నివసించును. దారిలో నడుచుచు తననెవరో వెంబడించుచున్నారని తలంచును. ఎపుడూ వేదనచే నిండిన మనసు కలవాడై యుండును. ప్రారంభించిన ప్రతిపని విఫలమగును. కారణము లేకనే కలత చెందును. వినాయునిచే స్పృశించబడిన రాజపుత్రులు రాజ్యమును పొందజాలరు. కన్య భర్తను పొందలేదు. వివాహిత స్త్రీ సంతానమును పొందజాలదు. శ్రోత్రియుడు ఆచార్యత్వమును, శిష్యుడు అధ్యయనమును పొందజాలడు. వైశ్యుడు తన వ్యాపారమున లాభమును పొందజాలడు. రైతు పంటను పొందజాలడు. కావున వినాయకోపసృష్టుడైన వానికి శుభదినమున విధి పూర్వకముగా స్నపనమును చేయవలయును. పచ్చని ఆవాలచే బ్రాహ్మణులు స్వస్తి వాచనమును చేయవలయును. అశ్వశాలనుండి, గజశాలనుండి, పుట్టనుండి, నదీసంగమము నుండి, సరస్సునుండి, మట్టిని, రోచనమును, గంధమును, గుగ్గులును తెచ్చి నిక్షిప్తము చేయవలయును. ఒకేరంగు కల నాలుగు కలశములతో యోగ్యమగు హ్రదమునుండి జలమును తేవలయును. ఎఱ్ఱని వృషభ చర్మమున భద్రాసనమును స్ధాపించవలయును. వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని ఋషులు పావనము చేసిన జలముచే నిన్ను అభిషేకించెదను. పవమానదేవతలు నిన్ను పవిత్రుని చేయుదురు గాక. వరుణుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు నీకు ఐశ్వర్యమును ప్రసాదింతురు గావుత! నీకేశములలో, పాపిటలో శిరస్సులో, లలాటమున, చెవులలో, నేత్రములలో నున్న దౌర్భాగ్యమును జలము తొలగించుగావుత, స్నానము మేడిస్రువుము ద్వారా ఆవనూనెతో శిరస్సును సవ్యముగా దర్భలను గ్రహించి ఉంచవలయును. నాలుగు దారుల కూడలిలోల దర్భలను పరిచి అంతటా మితసంమిత శాలకంటకములను గుమ్మడికాయను రాజపుత్ర అను పదము అంతమందు కల మంత్రములతో, నమస్కారములతో నీయవలయును. ఉడికి ఉడకని బియ్యమును, మాంసమును అన్నమును, వండిన మత్స్యములను, వండని వాటిని సమర్పించవలయును. పలువిధములగు పుష్పములను, గంధమును, మూడువిధములగు సురనర్పించవలయును. మూలములను పూర్ణాపూపములను, పూలమాలలును, పెరుగన్నమును, పాయసమును బెల్లముతో కలిపిన పిండిని తగిన నీటితో కలిపి, వీటినన్నింటిని ఒకచోట చేర్చి, భూమియందుంచి నమస్కరించి, వినాయకుని తల్లియగు పార్వతిని ప్రార్ధించవలయును. గరక ఆవాలపూలచే పూర్ణాంజలిచే అర్ఘ్యము నీయవలయును. రూపమును, కీర్తిని, ఐశ్వర్యమును ప్రసాదించుము. పుత్రులను, ధనమును అన్నికోరికలనీయుము. అని శివుని పత్నియగు పార్వతిని పూజించి తరువాత శివుని ధూపదీప గంధమాల్యాదులచే నైవేద్యములచే పూజించవలయును. తరువాత తెల్లని వస్త్రములను, తెల్లని పుష్పమాలలను ధరించి బ్రాహ్మణులకు అన్నదానమును చేయువలయును. గురువుగారికి రెండు వస్త్రములను కూడా దానము చేయవలయును. ఇట్లు వినాయకుని పూజించి పిదప గ్రహములను కూడా పూజించవలయును. సంపదను, శాంతిని, పుష్టి బుద్ధి ఆయుష్యములను కోరువారు గ్రహములను పూజించవలయును. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నీ నవగ్రహములను క్రమముగా స్ధాపించవలయును. ఈ గ్రహములను రాగితో, వెండితో రక్తచందనముతో బంగారముతో, ఉక్కుతో, సీసముతో కాని శుభము కొఱకు చేయవలయును లేదా వస్త్రములందు వారి వారి వర్ణములతో లిఖించవలయును. మండలములలో కూడా లిఖించవచ్చును. ఆయా గ్రహములకు నియమించబడిన వర్ణములు గల వస్త్రములను పూవులను సమర్పించవలయును. గంధములను బలులను గుగ్గులు ధూపమును సమర్పించవలయును. మంద్రములతో చరువును సిద్ధము చేయవలయును. ''ఆకృష్ణేన'' అను మంత్రముతో సూర్యుని, 'ఇమం దేవా' అను మంత్రముతో చంద్రుని, ''అగ్నిర్మూర్ధా'' అను మంత్రముతో కుజుని, ''ఉద్బుధ్యస్వ'' అను మంత్రముచే బుధుని, ''యదర్య'' అను మంత్రముచే గురువును, ''అన్నాత్పరిస్రుతః'' అను మంత్రముచే శుక్రుని, ''శం నో దేవీ'' అను మంత్రముచే శనిని, ''కాండాత్‌'' అను మంత్రముచే రాహువును, ''కేతుం కృణ్వన్న కేతవ'' అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును. జల్లేడు. మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్తు కాని హోమమును చేయవలయును. అట్లే తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కాని హోమము చేయవలయును. బెల్లముకలిపిన అన్నమును, పాయసమును, హవిస్సును, క్షీరములను, దధ్యోదనమును, హవిశ్చూర్ణమును మాంసమును, చిత్రాన్నమును యథాక్రమమముగా ఆయాగ్రహములకర్పించవలయును. తరువాత బ్రాహ్మణులను భుజింప చేయవలయును. శక్తిననుసరించి యథావకాశముగా శాస్త్రముననుసరించి బ్రాహ్మణులను సత్కరించి, ధేనువును, శంఖమును, వృషభమును, తెల్లని వస్త్రమలును, గుఱ్ఱమును, కపిలగోవును, ఇనుము, మేక వీటిని యథాక్రమముగా దక్షిణగా సమర్పించవలయును. ఏ గ్రహమునకు ఏ ద్రవ్యము, ఫలము నిర్ణయించబడినదో ఆ ద్రవ్యాదులచే పూజించవలయును. ఇట్లు పూజించిన వారిని గ్రహములు అనుగ్రహించునని శాస్త్రము చెప్పుచున్నది. మానవుల ధన, జాతి అభివృద్ధులు గ్రహీధీనములే. జగత్తు స్థితినాశములు కూడ గ్రహాధీనములే కావున ఆయాగ్రహములను పూజించవలయును. ఎపుడూ సూర్యుని పూజించి, స్వామియైన మహాగణపతికి తిలకము నుంచిన వారు సిద్ధిని పొందెదదరు. అన్ని కర్మలు ఫలించును. సాటిలేని సంపదలను పొందును. మాతృదేవతల పూజ చేయక గ్రహపూజచేసినచో మాతృదేవతలు కోపింతురు. 'వసోః పవిత్రం' అను మంత్రముచే వసుధారను కల్పించి గౌరీమొదలగు మాతృదేవతలను శుభకర్మల యందు శ్రేయోభిలాషులు పూజించవలయును. గౌరీ, పద్మా, శచీ, మేధా, సావత్రీ, విజయా, జయ, దేవసేనా, స్వధా, స్వాహా, వైధృతి, ధృతి, పుష్టి, హృష్టి, తుష్టి, ఆత్మదేవత యను పదునారు మాతృదేవతలు, గణశునితో షోడశ మాతృకలను శుభకర్మలయందు వృద్ధి కోరకు పూజించవలయును. ఆ వాహనము పాద్యము, అర్ఘ్యము, స్నానము, చందనము, అక్షతలు, పుష్పములు, ధూపము, దీపము, పండ్లు, నైవేద్యము, ఆచమనీయము, తాంబూలము, పోకలు, నీరాజనము, దక్షిణలను మాతృదేవతల సంతోషము కొఱకు క్రమముగా నీయవలయును.

పితృకల్పం ప్రవక్ష్యామి ధనసంతతివర్ధనమ్‌, అమావాస్యాష్టకావృద్ధిః కృష్ణపక్షాయనద్వయమ్‌. 102

ద్రవ్యం బ్రాహ్మణసంపత్తిర్విషువత్సూర్యసంక్రమః, వ్యతీపాతో గజచ్ఛాయా గ్రహణం చంద్రసూర్యయోః. 103

శ్రాద్ధం ప్రతిరుచిశ్చైవ శ్రాద్ధకాలాః ప్రకీర్తతాః, అగ్య్రాస్సర్వేషు వేదేషు శ్రోత్రియో బ్రహ్మవిద్యువా. 104

వేదార్ధవిజ్జ్యేష్ఠసామా త్రిమధుస్త్రిసుపర్ణకః, స్వస్రీయ ఋత్విగ్జామాతా యాజ్యశ్వశురమాతులాః. 105

త్రిణాచికేతదౌహిత్రశిష్యసంబంధిబాంధవాః, కర్మనిస్ఠాస్తపోనిష్ఠా చాగ్నిబ్రహ్మచారిణః.106

పితృమాతృపరాశ్చైవ బ్రాహ్మణాశ్శాద్ధసంపదః, రోగీ న్యూనాతిరిక్తాంగః కాణః పౌనర్భవస్తథా. 107

అవకీర్ణో కుండగోలౌ కునఖీ శ్యావదంతకః, భృతకాధ్యాపకః క్లీమః కన్యాదూష్యభిశస్తకః. 108

మిత్రధ్రుక్‌ పిశునస్సోమవిక్రయీ పరివిందకః, మాతృపితృగురుత్యాగీ కుండాశీ వృషాలాత్మజః. 109

పరపూర్వాపతిసై#్సనః కర్మభ్రష్టాశ్చ నిందితాః నిమంత్రయీత పూర్వేద్యుర్బ్రాహ్మణానాత్మవాన్శుచిః. 110

తైశ్చైపి సంయతైర్భావ్యం మనోవాక్కాయకర్మభిః, అపరాహ్ణే సమభ్యర్చ్య స్వాగతేనాగతాంస్తు తాన్‌. 111

పవిత్రపాణిరాచాంతాన్‌ ఆసనే చోపవేశ##యేత్‌, విప్రాన్దైవే యథాశక్తి పిత్రేయుగ్మాంస్తథైవ చ. 112

పరాశ్రితే శుచౌ దేశే దక్షిణా ప్రవణం తథా, ద్వౌ దైవే ప్రాక్త్రయః పిత్రే ఉదగేకైకమేవ చ. 113

మతామహానామప్నేవం తత్ర వా వైశ్వదైవికమ్‌, పాణిప్రక్షాలనం దత్త్వా విష్టరార్ధం కుశానపి.114

ఆవాహయేదనుజ్ఞాతో విశ్వేదేవాస ఇత్యృచా, యవైరన్వావకీర్యాథ భాజనే స పవిత్రకే. 115

శన్నో దేవ్యా అపః క్షిప్త్వా యవోసీతి యవాంస్తథా, యా దివ్యా ఇతి మంత్రేణ హస్తే పాద్యం వినిక్షిపేత్‌, 116

దత్త్వోదకం గంధమాల్యం ప్రదాయాన్నం సదీపకమ్‌, అపసవ్యం తతః కృత్వా పితౄణాం సప్రదక్షిణమ్‌. 117

ద్విగుణాంస్తు కుశాన్దత్వా హ్యుశంతస్త్వితృచా పితౄన్‌, ఆవాహ్య తదనుజ్ఞాతో జపే దాయంతు నస్తతః. 118

యవార్ధాస్తు తిలైః కార్యా కుర్యాదర్ఘ్యాది పూర్వవత్‌, దత్వార్ఘ్యం సయవాంస్తేషాం పాత్రే కృత్వా విధానతః. 119

పితృభ్యస్ధ్సానమసీతి న్యేబ్జం పాత్రం కరోత్యధః, అగ్నౌ కరిష్యన్నాదాయ పృచ్ఛత్యన్నం ఘృతప్లుతమ్‌. 120

కురుష్యేత్యభ్యనుజ్ఞాతో దత్వాగ్నౌ పితృయజ్ఞవత్‌, హుతశేషం ప్రదద్యాత్తు భాజనేషు సమాహితః. 121

యథాలాభోపపన్నేషు రౌప్యేషు చ విశేషతః, దత్వాన్నం పృథివీపాత్రమితి పాత్రాభిమంత్రణమ్‌. 122

కృత్వేదం విష్నురిత్యన్నే ద్విజాంగుష్ఠం నివేశ##యేత్‌, సవ్యాద్హృతికాం గాయత్రీం మధు వాతా ఇతి త్యృచమ్‌. 123

జప్త్వా యథాసుఖం వాచ్యం భుంజీరంస్తేపి వాగ్యతాః,

అన్నమిష్టం హవిష్యం చ దద్యాదక్రోధనోత్వరః 124

ఆతృప్తేస్తు పవిత్రాణి జప్త్వాపూర్వజపం తథా, అన్నమాదాయ తృప్తాస్ధ్స శేషం చైవానుమాన్న చ. 125

తదన్నం వికిరేద్భూమౌ దద్యాచ్చాపస్సకృత్‌ సకృత్‌,సర్వమన్నముపాదాయ సతిలం దక్షిణాముఖః. 126

ఉచ్ఛిష్ఠసన్నిధౌ పిండాన్‌ దద్యాద్వై పితృయజ్ఞవత్‌, మాతామహానామప్యేవం దద్యాదాచమనం తతః. 127

స్వస్తివాచం తతః కుర్యాత్‌ అక్షయ్యోదకమేవ చ, దత్వా చ దక్షిణాం శక్త్యా స్వధాకారముదాహారేత్‌. 128

వాచ్యతామిత్యనుజ్ఞాతః ప్రకృతేభ్యస్స్వధోచ్చతామ్‌, బ్రూయురస్తు స్వధేత్యుకే భూమౌ పించేత్తతో జలమ్‌. 129

విశ్వేదేవాశ్చ ప్రీయంతాం విపై#్రశ్చోక్త ఇదం జపేత్‌, దాతారో నోభి వర్ధంతాం వేదాస్సంతతిరేవ చ. 130

శ్రద్ధా చ నో మా వ్యగమత్‌ బహు దేయం చ నోస్త్వితి,

ఇత్యుక్త్వాః ప్రియా వాచః ప్రణిపత్య విసర్జయేత్‌. 131

వాజే వాజే ఇతి ప్రీతః పితృపూర్వం విసర్జనమ్‌, యస్మింస్తే సంశ్రవాః పూర్వమర్ఘ్యపాత్రే నివేశితాః. 132

పితృపాత్రం తదుత్ధానం కృత్వా విప్రాన్విసర్జయేత్‌, ప్రదక్షిణమనువ్రజ్య భుంజీత పితృసేవితమ్‌. 133

బ్రహ్మచారీ భ##వేత్తాం తు రజనీం బ్రాహ్మణౖస్సహ, ఏవం ప్రదక్షిణావృత్త్యా వృద్ధౌ నాందీముఖాన్పితౄన్‌. 134

యజేత దధికర్కంధుమిశ్రాన్పిండాన్యవైః కృతాన్‌, ఏకోద్దిష్టం దేవహీనమేవార్ఘ్యైకపవిత్రకమ్‌. 135

ఆవాహనాగ్నౌ కరణరహితం హ్యపసవ్యవత్‌, ఉపవిష్టతామక్షయ్యస్ధానే విప్రవిసర్జతే. 136

అభిరమ్యతామితి వదేత్‌ బ్రూయుస్తేభరతాస్స్మ హ, గంధోదకం తిలైర్యుక్తం కుర్యాత్పాత్రచతుష్టయమ్‌. 137

ఆర్ఘ్యార్ధం పితృపాత్రేషు ప్రేతపాత్రం ప్రసేచయేత్‌, యే సమానా ఇతి ద్వాభ్యాం శేషం పూర్వవదాచరేత్‌. 138

ఏతత్సపిండీకరణమేకోద్దిష్టం స్త్రియా అపి, అర్వాక్సపిండీకరణం యస్య సంవత్సరాద్భవేత్‌. 139

తస్యాప్యన్నం సోదకుంభం దద్యాత్సంవత్సరం ద్విజే, మృతేహని తు కర్తవ్యం ప్రతిమాసం తు వత్సరమ్‌. 140

ప్రతిసంవత్సరం చైవ మాసవేకాదశేహని, పిండాంశ్చ గోజవిప్రేభ్యో దద్యాదగ్నౌ జలేపివా. 141

ప్రక్షిపేత్సత్సు విప్రేషు ద్విజోచ్ఛిష్టం న మార్జయేత్‌, హవిష్యన్నేన వై మాసం పాయసేన తు వత్సరమ్‌. 142

మాత్స్యా హరిణాకౌరభ్రశామనచ్ఛాగపార్షతైః, ఐణరౌరవవారాహశ##శైర్మాంసైర్యథాక్రమమ్‌. 143

మాసవృద్ధ్యాభితృప్యంతి దత్తైరిహ పితామహాః, ఖడ్గామిషం మహాకల్పిం మధు మున్నన్నమేవ చ. 144

లోహామిషం మహాశాకం మాంసం వాంఘ్రీణసస్య చ, యో దదాతి గయాస్ధశ్చ సర్వమానన్త్యమశ్నుతే. 145

తథా వర్షత్రయోదశ్యాం మఘాసు చ విశేషతః, కన్యాం కన్యావేదినశ్చ పశూన్వై సత్సుతానపి. 146

ద్యూతం కృషిం చ వాణిజ్యం ద్విశ##ఫైకఫాశంషాంస్తథా, బ్రహ్మవర్చస్వినః పుత్రాన్‌ స్వర్ణరూప్యే సకుప్యకే. 147

జ్ఞాతిశ్రేష్ఠ్యం సర్వకామానాప్నోతి శ్రాద్ధదస్సదా, ప్రతిపత్ప్రభృ తిష్వేకాం వర్జయిత్వా చతుర్దశీమ్‌. 148

శ##స్త్రేణ తు హతా యే వై తేభ్యస్తత్ర ప్రదీయతే, స్వర్గం హ్యపత్యమోజశ్చ శౌర్యం క్షేత్రం బలం తథా. 149

పుత్రాన్శేష్ఠాంశ్చ సౌభాగ్యం సమృద్ధిం ముఖ్యతాం శుభం, ప్రవృత్తం చక్రతాం చైవ వాణిజ్యప్రభృతీని చ. 150

ఆరోగిత్వం యశోవీతశోకతా పరమాం గతిమ్‌, ధనం విద్యాం భిషక్సిద్ధిం కుప్యగా అప్యజావికమ్‌. 151

అశ్వానాయుశ్చ విధివత్‌ యశ్శాద్దం సంప్రయచ్ఛతి, కృత్తికాదిభరణ్యంతం స కామానాప్నుయాదిమాన్‌. 152

ఆస్తికవ్శ్రద్దధానశ్చ వ్యపేతమదమత్సరః, వసురుద్రాదితిసుతాః పితరశ్శ్రాద్ధదేవతాః. 153

ప్రీణయంతి మనుష్యాణాం పితౄన్‌ శ్రాద్ధేన తర్పితాః, ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మొక్షం సుఖాని చ. 154

ప్రయచ్చంతి తథా రాజ్యం నృణాం ప్రీతాః పితామహాః, ఇత్యేవం కథితం కించిత్‌ కల్పాధ్యాయే విశేషతః. 155

జ్ఞాతవ్యం వైదికే తంత్రే పురాణాంతరకేపి చ, య ఇమం చింతయేద్విద్వాన్‌ కల్పాధ్యాయం మునీశ్వర. 156

సభ##వేత్కర్మకుశల ఇహాన్యత్ర గతిం శుభామ్‌, యశ్శృణోతి నరో భక్త్యా దైవే పిత్య్రే చ కర్మణి. 157

కల్పాధ్యాయం స లభ##తే దైవపిత్య్రక్రియాఫలమ్‌, ధనం విద్యాం యశః పుత్రాన్‌ పరత్ర చ గతిం పరామ్‌. 158

అతః పరం వ్యాకరణం తుభ్యం వేదముకాభిధమ్‌, కథయిష్యే సమాసేన శృణుష్వ సుసమాహితః 159

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణ పూర్వభాగే

బృహదుపాఖ్యానే ద్వితీయ పాదే

ఏకపంచాశత్తమోధ్యాయః

సంపదలను, సంతానమును వృద్ధిగావించు పితృకల్పమును ఇపుడు చెప్పెదను. ఉత్తరాయణ పుణ్యకామున దక్షిణయన పుణ్యకాలమున, అమావాస్యాతిథి యందు, అష్టకములలో, తథివృద్దిలో నున్నపుడు, ద్రవ్యము లభించినపుడు, సద్బ్రాహ్మణులు వచ్చినుపుడు, విషువత్కాలమందు, సూర్యసంక్రమణమున, వ్యతీపాద్యోగమునందు, గజచ్ఛాయలో, సూర్యచంద్రగ్రహణ కాలమున శ్రాద్ధమును చేయవలయునని ప్రీతి కలిగిన కాలమున శ్రాద్ధమునాచరించవలయును. ఈ సమయములు శ్రాద్ధకాలములుగా పెద్దలచే పేర్కొనబడినవి. ఉత్తమవంశ సంజాతుడు, సర్వవేదములను అధ్యయనము చేసినవాడు, శ్రోత్రియుడు, బ్రహ్మజ్ఞానము కలవాడు, యువకుడు, వేదార్ధజ్ఞుడు, సామవేదమును చదివిన వాడు, త్రిమధువు, త్రిసుపర్ణుడు, చెల్లెలు కొడుకు, ఋత్విజుడు, అల్లుడు, యాగము చేయువాడు, మామ, మేన మామ, త్రికాలములలో సంధ్యావందనము నాచరించువాడు, పుత్రికా పుత్రుడు, శిష్యుని సంబంధులు, బంధువులు, కర్మనిష్ఠులు, తపోనిష్ఠులు, పంచాగ్నిపరాయణులు, బ్రహ్మచారులు, పితృమాతృభక్తి గలవారు, అగు బ్రాహ్మణులు శ్రాద్ధమున నియోగించుటకు యోగ్యులు, రోగము కలవాడు, అంగవికలురు, అంగాధిక్యులు, గ్రుడ్డివారు, కవలలో తరువాత పుట్టినవాడు, దీనుడు, విధవాపుత్రుడు, వ్యభిచారిణీ పుత్రుడు, గోళ్ళను పెంచుకొనినవాడు, దంతధావనమును చేయని వాడు, వేతనము తీసుకొని విద్యను బోధించువాడు, నపుంసకుడు, కన్యను దూషించువాడు, పలువురిచే నిందించబడువాడు, మిత్రద్రోహి, లోభి, సోమరసమునమ్మువాడు, అన్నకంటే ముందు వివాహము చేసుకొనినవాడు. తల్లిని, తండ్రిని, గురువును త్యజించినవాడు, అయోగ్యుల భోజనము చేయువాడు, శూద్రుని వలన పుట్టినవాడు, స్త్రీకి రెండవ భర్తగా నున్నవాడు, మొదటి భర్తగా నున్నవాడు, చోరుడు, కర్మభ్రష్టులు శ్రాద్దమున నిమంత్రణమునకు అయోగ్యులు, శ్రాద్ధము చేయువాడు మనోనిగ్రహము కలవాడై, పవిత్రుడై మొదటి దినముననే బ్రాహ్మణులను నిమంత్రణ చేయవలయును. అట్లు నిమంత్రణ చేయబడిన బ్రహ్మణులు కూడా కాయిక వాచిక మానసిక నిగ్రహము కలిగియుండవలయును. శ్రాద్ధదినమున వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతము పలికి అపరాహ్ణకాలమున పూజించవలయును. పవిత్రమును ధరించి బ్రాహ్మణులకు ఆచమనమునిచ్చి ఆసనముల యందు కూర్చోబెట్టవలయును. విశ్వేదేవతల స్ధానమున శక్తిననుసరించి, పితృస్ధానమున బేసి సంఖ్యతో అనగా మూడు, అయిదు, మొదలగు సంఖ్యతో బ్రాహ్మణులను ఉంచవలయును. చక్కగా శుద్ధి చేయబడిన ప్రదేశమున దక్షిణాభిముఖముగా నుండి విశ్వదేవతలను ఇద్దరిని ప్రాఙ్ముఖముగా, పితృస్థానమున నియోగించిన ముగ్గురిని ఉత్తరాభిముఖముగా ఒక్కొక్కరిని కూర్చుండ బెట్టవలయును. మాతామహుల విషయమున కూడా ఇట్లే ఆచరించవలయును. హస్తప్రక్షాలణమునాచరించి ఆసనమునకు దర్భలనుంచ వలయును. బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది ''విశ్వేదేవాస'' అను ఋక్కుచే ఆవాహనము చేయవలయును. పవిత్రముతో కూడిన పాత్రయందు యవలను చల్లి ''శం నో దేవీ'' అను మంత్రముచే నీరునుంచి, ''యవోసి'' అనుమంత్రముచే యవలనుంచి, ''యా దివ్యా'' అను మంత్రముచే హస్తమున పాద్యము నర్పించవలయును. తరువాత ఉదకమునిచ్చి, గంధమాల్యముల నర్పించి దీపమునుంచి అన్నప్రదానము గావించవలయును. తరువాత అపసవ్యము చేసుకొని పితృస్ధానమున నియోగించిన వారికి ప్రదక్షిణము చేసి, రెట్టింపు దర్భలనిచ్చి, ''ఉశంతః'' అను మంత్రముచే అనుమతిన పొంది ఆవాహనము చేయవలయును. తరువాత పితృమంత్రమును జపించవలయును. పితృదేవతలకు యవలకు బదులుగా నువ్వులను వాడవలయును. ఆర్ఘ్యాదులను పూర్వము వలె నాచరించవలయును. యవలతో అర్ఘ్యమునిచ్చి పాత్రలో యవలను విధానముగా నుంచి ''పితృభ్యఃస్ధానమసి'' అను మంత్రముచే కొద్దిగా వేడిచేసిన పాత్రను తలక్రిందులుగా చేయవలయును. అన్నమును హోమము చేయునపుడు అనుమతిని పొంది నేతితో కలిపిన నేతితో కలిపిన అన్నమును హోమము గావించవలయును. హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో నుంచవలయును లభించిన విధముగా పాత్రలనుంచవలయును. బంగారు పాత్రలు శ్రేష్ఠములు, అట్లుపాత్రలలో అన్నము నుంచి ''పృథివీ తే పాత్రం'' అను మంత్రముచే పాత్రలను అభిమంత్రించవలయును. ''ఇదం విష్ణుః'' అను మంత్రముచే అన్నమున బ్రాహ్మణాంగుష్ఠమునుంచవలయును. వ్యాహృతులచే కూడిన గాయత్రీమంత్రమును, ''మధు వాతా'' అను మంత్రమును జపించి 'యథాసుఖం' అని చెప్పవలయును. బ్రాహ్మణులు కూడా మౌనముగా భుజించవలయును. కోపమును, త్వరను విడిచి ఇష్టమగు అన్నమును, హోమము చేసిన హవిస్సును, ఈయవలయును. తృప్తిచెందువరకు వడ్డించవలయును. వారు భోజనము చేయుచుండగా పూర్వము వలె గాయత్రీజపమును చేయుచుండవలయును. అన్నమును తీసుకొని తృప్తిచెందితిరా యని యడిగి, శేషాన్నమును అనుమతిని పొంది భూమి మీద చల్లవలయును. ఒక్కొక్కమారు జలము నీయవలయును. మొత్తము అన్నమును నువ్వులతో తీసుకొని దక్షిణాభి ముఖుడై బ్రాహ్మణులు భోజనము చేసిన ప్రదేశమునకు సమీపమున పితృ యజ్ఞము నందు వలె పిండ ప్రదానమును గావించవలయును. మాతా మహాదులకు కూడా ఇట్లే చేయవలయును. తరువాత ఆచమనమునకు జలము నీయవలయును. తరువాత స్వస్తివాచనము గావించి అక్షయోగకము నీయవలయును. శక్తిననుసరించి దక్షిణలనిచ్చి స్వధాకారమును చేయవలయును. వాచ్యతాం అని అనుమతిని పొంది, స్వధాకారమును చేయుడు అని పలికి బ్రాహ్మణులు స్వధా అని కలుకగా జలమును భూమిపై చల్లవలయును. విశ్వదేవతలు తృప్తి చెందుదురు గాక అని విప్రులు పలుకగా బ్రాహ్మణులు ఇట్లు జపించవలయును. ''దాతారో నోభి వర్ధన్తాం వేదాస్సంతతిరేవ చ, శ్రద్ధా చ నో మావ్యగమద్బహు దేయం చ నోస్తు'' అని అనగా మాకు దానము చేసినవారు, వేదములు, సంతతవృద్ధి చేందుగాక, మాలో శ్రద్ధలోపించకుండుగాక, మాకు చాలా ఇవ్వగల సంపదలు దాతలకు కలుగు గాక అని అర్ధము. ఇట్లు బ్రాహ్మణులు ప్రియవచనములను పలుకగా నమస్కరించి పంపించవలయును. ''వాజే వాజే'' అను మంత్రములచే ప్రీతిపూర్వకముగా మొదట పితృదేవతలను పంపవలయును. మొదట యవాదలు నుంచిన అర్ఘ్యపాత్రను (తలక్రిందులుగా నుంచిన దానిని) యథా ప్రకారముగా చక్కగా నుంచి తరువాత పంపవలయును. బ్రాహ్మణులకు ప్రదక్షిణముచేసి పంపిన తరువాత పితృభుక్తశేషమును తాము భుజించవలయును. ఆ రాత్రి శ్రాద్ధకర్తలు భోక్తలగు బ్రాహ్మణులు బ్రహ్మచర్యమును పాటించవలయును. ఇట్లు వృద్ధికార్యమున నాందీముఖ్యులగు పితృదేవతలను దధి కర్కంధు మిశ్రితములగు, యవలచే చేయబడిన పిండములచే పూజించవలయును. ఏకోద్దిష్టమున మాత్రము దేవస్ధానరహితముగా ఏకార్ఘ్యపాత్రముతో, ఆవాహనాగ్నికార్యరహితముగా నాచరించవలయును. అపసవ్యముతో చేయవలయును. స్థానోపవేశన సమయమున ''ఉపతిష్ఠతాం'' అని, విప్రవిసర్జనలో 'అభిరమ్యతాం' అని పలుకవలయును. బ్రాహ్మణులు ''అభిరతాస్స్మ'' అని పలుకవలయును. నువ్వులతో కలిపిన గంధోదకముతో నాలుగు పాత్రలనుంచవలయును. పితృపాత్రలయందలి జలముతో అర్ఘ్యము కొఱకు ప్రీతపాత్రను తడుపవలయును. ''యే సమానా'' అను మంత్రములతో రెండు పాత్రలతో తడుపవలయును. మిగినినదంతయు పూర్వము వలె నాచరించవలయును. ఈ సంపిండీ కరణము ఏకొద్దిష్టము స్త్రీవిషయమున కూడా నాచరించవలయును. ఇట్లు సంవత్సరము వరకు తరువాత సంపిండీకరణమును చేయవలయును. సంవత్సరము తరువాత మరణించినట్లు తెలిసిననూ తరువాత ఒక సంవత్సరము ఉదకుంభముతో అన్నదానమును బ్రాహ్మణునకు చేయవలయును. ఒక సంవత్సరము ప్రతిమాసమున చనిపోయిన దినమున శ్రాధ్దమును చేయవలయును. సంవత్సరము తరువాత ప్రతిసంవత్సరము చనిపోయినదినమున శ్రాద్ధమునాచరించవలయును. పిండములను గోవులకు కాని, మేకలకు కాని, బ్రాహ్మణులకు కాని ఈయవలయును. లేదా అగ్నిలో కాని జలమున కాని విసర్జించవలయును. సద్బ్రాహ్మణులకే దానమీయవలయును. బ్రాహ్మణులు తినగా మిగిలిన దానిని ఊడ్వరాదు. హవిస్సుకుయోగ్యమగు అన్నమును ఒకనెలహోమము చేయవలయును. పాయసముతో సంవత్సరము హోమమును చేయవలయును. చేపల, లేళ్ళ, పావురముల, ఇతర పక్షుల, మేకల,దుప్పుల, జింకల, ఏదుల, వరాహముల కుందేళ్ళ మాసంములతో యథాక్రమముగా ఒక్కొక్కనెలలో పితరుల నర్పించినచో పితృదేవతలు తృప్తి చెందెదరు. పితామహులు తృప్తి చెందెదరు. ఖడ్గమృగమాంసముతో చేయు పితృయజ్ఞము మహాకల్పమనబడును. తేనెచే మునుల ఆహారముచే కూడా శ్రాద్ధము చేయవచ్చును. డేగమాంసము మహాశాకము కోడిమాంసమునర్పించవచ్చును. గయాక్షేత్రమున పైన చెప్పబడిన వాటిచే శ్రాద్దమును చేసినచో ఉత్తమ ఫలములను పొందును. ఇట్లే వర్షర్తువులోని త్రయోదశితిథిన మఘలలో చేసినచో విశేషఫలమును పొందెదరు. ఇట్లు శాస్త్రోక్తముగా శ్రాద్ధమునాచరించి వారికి కన్యలు, పశువులు, సత్పుత్రులు, కలిగెదరు. ద్యూతమున, వ్యవసాయమున, వ్యాపారమున లాభమును పొందెదరు. రెండు గిట్టలుకల పశువులను, ఒకగిట్టగల పశువులను, బ్రహ్మతేజస్సుగల పుత్రులను, బంగారువెండి నాణములను, ఉత్తమ జ్ఞాతులను, సర్వకామములను పొందెదరు. ప్రతిపత్తు మొదలగు తిథులలో ఒక్క చతుర్దశిని వదిలి మిగిలిన తిథులలో, శస్త్రహతులైన వారికి శ్రాద్ధమునాచరించవలయును. ఇట్లు శ్రాద్ధము నాచరించిన వారు, స్వర్గమును, సత్సంతానమును, తేజస్సును, బలమును, శౌర్యమును, భూమిని, ఉత్తమ పుత్రులను, సౌభాగ్యమును, సమృద్ధిని, కీర్తిని, శుభమును, మంచినడవడిని, రాజ్యమును, వ్యాపారాదులలో లాభమును, ఆరోగ్యమును, కీర్తిని, దుఃఖరాహిత్యమును, ఉత్తమగతిని, ధనమును, విద్యను, మంచివైద్యుని, గోమహిష్యాది పశుసంపదను అశ్వములను పొందెదరు. కృత్తికాది భరణ్యంత నక్షత్రములలో శ్రాద్ధమునాచరించినవారు అన్ని కామనలను పొందగలరు. భగవంతుని యందు విశ్వాసము కలవాడై, శ్రద్ధకలవాడై, మదమత్సరములను విడిచి వసురుద్రాదిత్యులను, పితరులను, శ్రాద్ధదేవతలను తృప్తిపరచినచో, అట్లు ప్రీతి చెందిన శ్రాద్ధదేవతలు ఆయువును సంతానమును, ధనమును, విద్యను, సుఖములను, మోక్షమును ప్రసాదింతురు. ప్రీతిని చెందిన పితామహులు నరులకు రాజ్యమును ప్రసాదింతురు. ఇట్లు విశేషమగు కల్పాధ్యాయమును కొంచెము చెప్పితిని. వైదికతంత్రమున, ఇతర పురాణముల నుండి విస్తరముగా తెలియవలయును. ఇట్లు ఈ కల్పాధ్యాయమును చదువువారు, కర్మలలో కుశలులై ఇహపరలోకములలో సద్గతిని పొందెదరు. దైవకార్యములందు పతృకార్యములందు ఈ కల్పాధ్యాయమును వినువారు కల్పాధ్యాయమున చెప్పబడిన దేవపితృకార్యములన నాచరించిన ఫలమును పొందెదరు. ధనమును, విద్యను, ఉత్తమ కీర్తని, పుత్రులను, పరలోకమున సద్గతిని పొందెదరు. ఇక ఇపుడు వేదమునకు ముఖము అనబడు వ్యాకరణమును సంగ్రహముగా తెలపెదను సావధానముగా వినుము.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున

బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున

యాబదియొకటవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page