Sri Naradapuranam-I
Chapters
Last Page
చతుఃపంచాశత్తమో೭ధ్యాయః = యాబదినాలుగవ అధ్యాయము జ్యోతిషవర్ణనమ్ సనందన ఉవాచ :- జ్యోతిషాంగం ప్రవక్ష్యామి యదుక్తం బ్రహ్మణా పురా, యస్య విజ్ఞానమాత్రేణ ధర్మసిద్ధిర్భవేన్నృణామ్. 1 త్రిస్కంధం జ్యోతిషం శాస్త్రం చతుర్లక్షముదాహృతమ్, గణితం జాతకం విప్ర సంహితాస్కంధసంజ్ఞితాః. 2 గణితే పరికర్మాది ఖగమధ్యస్ఫుటక్రియే, అనుయోగశ్చన్ద్రసూర్యగ్రహణం చ ప్రకీర్తితమ్. 3 ఛాయా శృంగోన్నతివ్యతీపాతసాధనమీరితమ్, జాతకే రావిభేదాశ్చ గ్రహయోనిశ్చ యోనిజమ్. 4 నిషేకజన్మారిష్టాని హ్యాయుర్దాయో దశాక్రమః, కర్మాజీవం చాష్టవర్గే రాజయోగాశ్చ నాభసాః. 5 చంద్రయోగాః ప్రవ్రజ్యాఖ్యా రాశిశీలం చ దృక్ఫలమ్, గ్రహభావఫలం చైవాశ్రయయోగప్రకీర్ణకే. 6 అనిష్టయోగాత్ స్త్రీజన్మ ఫలం నిర్యాణమేవ చ, నష్టజన్మవిధానం చ తథా ద్రేష్కాణలక్షణమ్. 7 సంహితాశాస్త్రరూపం చ గ్రహచారో೭బ్దలక్షణమ్, తిథివాసరనక్షత్రయోగతిధ్యర్ధసంజ్ఞకాః. 8 ముహూర్తోపగ్రహాస్సూర్యసంక్రాంతిర్గోచరః క్రమాత్, చంద్రతారాబలం చైవ సర్వలగ్నార్తవాహ్వయః. 9 ఆధానపుంససీమన్తజాతనామాన్నభుక్తయః, చేల కర్ణ్యయనం మౌంజీ క్షురికాబంధనం తథా. 10 సమావర్తనవైవాహప్రతిష్ఠాసద్మలక్షణమ్, యాత్రాప్రవేశనం సద్యోవృష్టిః కర్మవిలక్షణమ్ 11 ఉత్పత్తిలక్షణం చైవ సర్వం సంక్షేపతో బ్రువే, ఏకం దశశతం చైవ సహస్రాయుతలక్షకమ్. 12 ప్రయుతం కోటిసంజ్ఞాం చార్బుదమబ్జం చ ఖర్వకమ్, నిఖర్వం చ మహాపద్మం శంకుర్జధిరేవ చ. 13 అంత్యం మధ్యం పరార్ధం చ సంజ్ఞా దశగుణోత్తరాః, క్రమాదుత్క్రమతో వాపి యోగః కార్యోత్తరం తథా. 14 హన్యాద్గుణన గుణ్యం స్యాత్ తేనైవోపాంతిమాదికాన్, శుద్ధేద్ధరో యద్గుణశ్చ భాజ్యాంత్యాత్తత్ఫలం మునే!. 15 సమాంకతో೭ధో వర్గస్స్యాత్తమేవాహుః కృతిం బుధాః, అంత్యాత్తు విషమాత్త్యక్త్వా కృతిం మూలం న్యసేత్పృథక్. 17 ఏవం ముహుర్వర్గమూలం జాయతే చ మునీశ్వర, సమత్య్రఙ్కహతిః ప్రోక్తో ఘనస్తత్ర విధిః పదే. 18 ప్రోచ్యతే విషమం త్వాద్యం సమే ద్వే చ తతః పరమ్, విశోధ్యం విషమాదంత్యాత్ ఘనం తన్మూలముచ్యతే. 19 త్రిఘ్నార్భజేన్మూలం కృత్యా సమం మూలే న్యసేత్ఫలమ్, తత్కృతిత్వేన నిహతాన్నిఘ్నీం చాపి విశోధయేత్. 20 ఘనం చ విషమాదేవం ఘనమూలం ముహుర్భవేత్, అన్యోన్యహారనిహతౌ హారాంశౌ తు సముచ్ఛిదా. 21 లవా లవఘ్నాశ్చ హరా హరఘ్నాహి సవర్ణనమ్, భాగప్రభాగే విజ్ఞేయం మునే శాస్త్రార్ధచింతకైః. 22 అనుబంధే೭పవాహే చైకస్య చేదధికోనకః, భాగాస్తలస్ధహారేణ హరం స్వాంశాధికేన తాన్. 23 ఊనేన చాపి గుణయేద్ఘనర్ణం చింతయేత్తథా, కార్యస్తుల్యహరాంశానాం యోగశ్చాప్యంతతో మునే. 24 అహారరాశౌ రూప్యం తు కల్పయేద్ధరమప్యథ, అంశాహతిశ్ఛేదఘాతహృద్భిన్నగుణనే ఫలమ్. 25 ఛేదం చాపి లవం విద్వన్ పరివర్త్య హరస్య చ, శేషః కార్యో భాగహారే కర్తవ్యో గుణనావిధిః. 26 హారాంశయోః కృతీ వర్గే ఘనౌ ఘనవిధౌ మునే, పదసిద్ధ్యై పదే కుర్యాత్ అథో ఖం సర్వతశ్చ ఖమ్. 27 ఛేదం గుణం గుణం ఛేదం వర్గం మూలం పదం కృతిమ్, ఋణం ఖం ఖమృణం కుర్యాత్ దృశ్యే రాశిప్రసిద్ధయే. 28 అధస్వాంశాధికోనే తు లవాఢ్యోనో హరో హరః, అంశస్త్వవికృతిస్తత్ర విలోమే శేషముక్తవత్. 29 ఉద్దిష్టరాశిస్సంక్షిప్తౌ హృతోంశై రహితో యుతః, ఇష్టఘ్నదృష్టేనైతేన భక్తరాశిరనీశితః. 30 యోగోంతరేణోనయుతోద్వితోరాశీతసంక్రమే, రాశ్యంతరహృతం వర్గోత్తరం యోసుతశ్చ తా. 31 గజగ్రీష్టకృతిర్వైకా దలితా చేష్టభాజితా, ఏకో೭స్య వర్గో దలితసై#్సకో రాశిః పరో మతః. 32 ద్విగుణ೭ష్టహృతం రూపం శ్రేష్ఠం ప్రాగ్రూపకం పరమ్, వర్గయోగాంతరే వ్యేకే ఈశ్యోర్వర్గౌస్త ఏతయోః. 33 ఇష్టవర్గకృతిశ్చేష్టఘనోష్టగ్రౌ చ సైకకౌ, ఏషీస్యానాముభే వ్యక్తే గణితం వ్యక్తమేవ చ. 34 గుణఘ్నమూలోనయుతః సపగుణార్దే కృతం పదమ్, దృష్టస్య చ గుణార్ధో న యుతం వర్గీకృతం గుణః. 35 యదా లవోనపుమ్రాశిర్దృశ్యం భాగోనయుగ్భువా, భక్తం తథా మూలగుణం తాభ్యాం సాధ్యో೭థ వ్యక్తవత్. 36 ప్రమాణచ్ఛే సజాతీయే ఆద్యంతే మధ్యగం ఫలమ్, ఇచ్చఘ్నమాద్యహృత్సేష్టం పలం వ్యస్తే విపర్యయాత్. 37 సనందన మహర్షి పలికెను :- పూర్వము బ్రహ్మ చెప్పిన జ్యోతిషాంగమును చెప్పెదను. జ్యోతిషమును తెలిసిన మానవులకు ధర్మసిద్ధి లభించును. ఈ జ్యోతిష శాస్త్రము మూడు స్కంధములు గలది. నాలుగు లక్షల శ్లోకములు గలవు. గణితము, జాతకము, సంహితయని మూడు స్కంధములు. గణిత భాగమున పరికర్మ మొదలుకొని ఆకాశ మధ్యమున నుండు క్రియా స్పుటము, గ్రహానుయోగము చంద్రసూర్యగ్రహణము, శృంగోన్నతి ఛాయలు, పాత సాధనము చెప్పబడినది. జాతక భాగమున రాశి భేదము, గ్రహకారణములు, గర్భాధాన, జన్మఅరిష్టములు, ఆయుర్దాయము, దశాక్రమము, జీవనమున చేయు కర్మ, అష్టవర్గము, ఆకాశమునకు సంబంధించిన రాజయోగములు, చంద్రయోగము, రాశిశీలము, దృక్ఫలము, గ్రహభావఫలము, ఆశ్రయయోగప్రకీర్ణకములు, అనిష్టయోగములు, స్త్రీ జన్మఫలము, నిర్యాణము, నష్టజన్మవిధానము, ద్రేష్కాణలక్షణము, చెప్పబడినవి. సంహితాభాగమున గ్రహచారము, అబ్దలక్షణము, తిథి, వాసర, నక్షత్ర, యోగ, తిధ్యర్ధ సంజ్ఞలు, ముహూర్తోప గ్రహములు సూర్యసంక్రమణము, తారా చంద్రబలములు, సర్వలగ్న ఋతువులు, గర్భాధాన, పుంసవన, సీమంత, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, మౌంజీ, క్షురికా బంధనము, సమావర్తనము, వివాహము, ప్రతిష్ఠా, గృహలక్షణములు యాత్రాగమనము, సద్యోవృష్టి, విశేషకర్మలు, ఉత్పత్తి లక్షణము అంతయూ చెప్పబడినది. దానిని నేను సంక్షేపముగా చెప్పెదను. ఒకటి, పది, శతము, సహస్రము, అయుతము, లక్ష, ప్రయుతము (పదిలక్షలు), కోటి, అర్బుదము (పదికోట్లు), అబ్జము, ఖర్వము, నిఖర్వము, మహాపద్మము, శంకు, జలధి, అంత్యము, మధ్య, పరార్ధము అని సంఖ్యల సంజ్ఞలు. ఈ సంజ్ఞలు మొదటి దాని కంటే తరువాత నున్నది పదిరెట్లని తెలియవలయును. క్రమముగా కాని ఉత్క్రమముగా కాని సంఖ్యాయోగముననుసరించవలయును. గుణము చేయబడిన దానిని గుణ్యమందురు. గుణ్యముచే ఉపాంతిమాదిమములను శుద్ధి చేయవలయును. హరించబడిన గుణమును భాగించుటచే చివరగా మిగిలినది ఫలమనబడును. సమమైన అంకములు గలది వర్గమనబడును. ఈ వర్గనే కృతి యందురు. విషమమైన అంత్యమునుండి కృతిని విడదీసి మూలముగా విడిగా నుంచవలయును. దీనిని రెట్టింపుచే భాగించగా వచ్చిన ఫలమును క్రమముననుసరించి మూలమున నుంచవలయును. అపుడు దాని కృతిని విడువవలయును. మరల మూలమున భాగించవలయును. ఇట్లు మాటిమాటికి చేసినచో వర్గమూలమేర్పడును. మూడంకములతో సమముగా భాగించవలయును. ఇట్లు భాగించగా వచ్చిన దానిని ఘనమందురు. మూటిలో మొదటి దానిని విషమమందురు. మిగిలిన రెండు సమములనబడును. తరువాత విషమమగు అంత్యమునుండి ఘనమును శుద్ధి చేయవలయును. ఇట్లు శుద్ధి చేయబడిన ఘనమే మూలమనబడును. ఇట్లు మూటిచే భాగించబడిన దానిని మూలముచే కలిపి, సమమైన దానిని మూలమున ఫలముగా నుంచవలయును. దానిని కృతిచే భాగించబడగా, దానిని కూడా శుద్ధి చేయవలయును. ఇట్లు విషమము నుండి ఘనమును, ఘనమునుండి ఘనమూలమును మాటి మాటికి శుద్ధిచేసి తేల్చవలయును. ఇట్లు ఒకదానిచే ఒకటి భాగించబడినపుడు, భాగాంశములను వేరు చేయవలయును. లవములు, లవఘ్నములు, హరములు హరఘ్నములు, అని శాస్త్రార్ధచింతకులు భాగప్రభాగములను తెలియవలయును. అనుబంధమున కాని అపవాహమున కాని ఒకదానికి ఎక్కువగా కాని తక్కువగా కాని యున్నపుడు చేతిలో నున్న హారభాగముచే విభజించి, హరమును స్వాంశాధిక్యముచే విభజించవలయును. తక్కువగా నున్నదానిచే కూడా గుణించవలయును. గుణించునపుడు ఘనమును (మూలమును) ఋణమును గుర్తుంచుకొనవలయును. చివరలో సమముగా నున్న హరాంశములను కలుపవలయును. హరముకాని రాశిలో కూడా హరమును కల్పించవలయును. అంశభాగమైనపుడు భాగించబడిన హరభాగమును గుణించినచో వచ్చునది ఫలమగును. హరమును పరివర్తనము చేసి భాగించగా వచ్చు భాగమును లవమని తెలియుము. భాగహారమున శేషమును చూపవలయును. వచ్చిన దానిని గుణించవలయును. హారాంశలలోని కృతని, వర్గమును ఘనవిధిలో ఘనమును విడిగా చూపవలయును. పదము సిద్ధించుటకు పదమున క్రింద, అంతట శూన్యము వచ్చునట్లు భాగించవలయును. భాగమును గుణముగ, గుణమును భాగముగా వర్గమును, మూలముగా, పదమును కృతిగా, ఋణమును శూన్యముగా శూన్యమును ఋణముగా చేసినచో రాశి తెలియును. స్వాంసము కంటే, అధికముగా కాని తక్కువగా కాని భాగమున్నపుడు లవమును తక్కువగా చేసినచో వచ్చినదానిని హరమందురు. ఈ విషయమున విలోమమున మాత్రము అంశము వికారమును చెందదు. శేషము మొదట చెప్పినట్లే చేయవలయును. ఉద్దేశించబడిన రాశి తగ్గినపుడు అంశములతో హరించబడును. అంశహారము కానిది యుతమనబడును. ఇట్లు ఇష్టమును భాగము చేయగా వచ్చిన దానితో భాగము చేయబడిన రాశిని కలుపరాదు. ఇట్లు కలుపక ఉన్నదానిని, తక్కువగా ఉన్నదానిని రెండుగా రాశులనేర్పరుచ వలయును. రెండు రాశులలోని భేదమును, వర్గము తరువాత నున్నదానిని ఒకటిగా చూడవలయును. హారమైనది అంశరహితమైనది యుతమగును. ఇష్టముచే హృతమైన దానతో భాగరాశితో కలుపవలయును. మరొక దానితో కలిసిన యుతమును భాగరాశిని సంక్రమింపచేయవలయును. ఇతర రాశితో హృతమైన దానిని వర్గము తరువాత నున్నదానిని రెండును విడిగా చూపవలయును. ఇవియే మూలము యుతములనబడును. దీనినే గజాగ్రీ, ఇష్టకృతి యందురు. ఇష్టముచే భాగింపబడినది దలితమనబడును. ఈ రెంటిలో ఒకవర్గము దలితము రెండవది పరరాశియనబడును. ఇష్టము కంటే రెట్టింపుచే హారామైనది శ్రేష్ఠరూపము. రెండవది పరరూపముఇదియే మొడటి రూపముతో కనపట్టును. వర్గయోగాంతరములు భిన్నముగా నుండును. ఈ రెంటిరాశులనే వర్గములుగా వ్యవహరించబడును. ఒకటి ఇష్టవర్గకృతి, మరియొకటి ఇష్టధనము. ఇష్టధనము ఉష్టగ్రము అని ఒకరాశికే రెండు పేర్లుండును. ఈ రెండు రాశులనే వ్యక్తములందురు. ఈ గణితమే వ్యక్తగణితమందురు. గుణించబడిన మూలము యుతము కాదు. గుణించబడినదానిలో సగభాగము పదమనబడును. గుణార్దముగా చూచినది కూడా యుతము కాదు. వర్గముగా చేయబడినది మాత్రమే గుణమనబడును. పుంరాశి లవ దృశ్యమైనపుడు భాగముకంటే తక్కువ దానిచే కలిసియుండును. ఇట్లు భాగించబడినది, మూలగుణము అను ఈ రెంటిచే వ్యక్తగణితమును సాధించవలయును. ప్రమాణము ఇచ్ఛ సమానముగా నున్నచో (సజాతీయములైనచో) ఆద్యంతములుగా నున్నచో ఫలము మధ్యమున నుండును. మొదటి హరము ఇచ్ఛను కొట్టివేయును. దీనినే ఇష్టఫలమందురు. విజాతీయములైనచో విపర్యయము వలన ఫలము అనబడును. పంచరాశ్యాదికే೭న్యోన్యపక్షం కృత్వా ఫలచ్ఛిదామ్, బహురాశివధం భ##క్తే ఫలం స్వల్పవధేన చ. 38 ఇష్టకర్మవధేర్మూలం చ్యుతం మిశ్రాత్కలాంతరే, మానఘ్నకాలశ్చాతీతకాలాఘ్నఫలసంహృతాః. 39 స్వయోగభక్తా నిఘ్నాస్స్యుస్సంప్రయుక్తదలాని చ, బహురాశిఫలాత్స్వల్పరాశిమాసఫలం బహు. 40 చేద్రాశివివరం మాసఫలాంతరహృతం చయః, క్షేపా మిశ్రహతాః క్షేపయోగభక్తాః ఫలాని చ. 41 భ##జేచ్ఛిదోంశైసై#్తర్మిశ్రైః రూపం కాలశ్చ పూర్తికృత్, పూర్ణో గచ్ఛేత్సమేధ్యవ్యే సమే వర్గోర్ధితేత్యతః. 42 వ్యస్తం గచ్ఛతం ఫలం యత్ గుణవర్గం భచహి తత్, వ్యేకం వ్యేకగుణాస్తం చ ప్రాఘ్నం మానం గుణోత్తరే. 43 భుజకోటికృతియోగమూలం కర్ణశ్చ దోర్భవేత్, శ్రుతికృత్యంతరపద కోటిర్దోః కర్ణవర్గయోః. 44 వివరాత్తత్కర్ణపదం క్షేత్రే త్రిచతురస్రకే, రాశ్యోరంతవర్గేణ ద్విఘ్నే ఘాతే యుతే తయోః. 45 వర్గయోగో೭థ యోగాంతం హంతి వర్గాంతరం భ##వేత్, వయాస ఆకృతి సంక్షణ్ణో వ్యాసా స్స్యాత్పరిధిర్మునే. 46 జ్యావ్యాసయోగవివరాహతమూలోనితో೭ర్ధితః, వ్యాసశ్శరశ్శరోనాచ్చ వ్యాసాచ్చరగుణాత్పదమ్. 47 ద్విఘ్నం ఈవాధ జీవార్ధవర్గే శరహృతే యుతే, వ్యాసోష్టతే భ##వేదేవం ప్రోక్తం గణితకోవిదైః. 48 చాపోననిఘ్నః పరిధిః ప్రగాఙ్లః పరిధేః కృతే, తుర్యాంశేన శరఘ్నేనాఘే నివాఘం చతుర్గణమ్. 49 వ్యాసఘ్నం ప్రభ##జే ద్విప్ర జ్యాకాశం జాయతే స్ఫుటా, జ్యాంఘ్రీషు ఘ్నవృత్తవర్గో7బ్ధిఘ్నసాఢ్యమౌర్విహృత్. 50 లభ్దోనవృత్తవర్గాద్రిపదే೭ర్ఘాత్పతితే ధనుః స్ధూలమధ్యపృవన్నవేథో వృత్తాంకాశేషభాగికః. 51 వృత్తాంగాంశకృతర్వేధనిప్రీయనకరామితౌ, వారవ్యాసహతం దైర్ఘ్యం వేధాంగులహతం పునః. 52 ఖఖేందురామవిహతం మానం ద్రోణాదివారిణః, విస్తరాయామవేధానామంగుల్యో೭న్యోన్యనాడిఘ్నాః. 53 రసాంకాభ్రాబ్ధభిర్భక్తాః ధాన్యే ద్రోణాదికా మితిః, ఉత్సేధవ్యాసదైర్ఘ్యాణాం అంగుళ్యాన్నస్య నో ద్విజ. 54 మిధోఘ్నాతి భ##జేత్స్వాక్షేశైర్ద్రోణాదిమితిర్భవేత్, విస్తారాద్యంగులాన్యేవ మిధోఘ్నాన్యపసాం భ##వేత్. 55 బాణభమార్గణౖర్లబ్ధం ద్రోణాద్యం మార్గమాదిశేత్, దీపశకుంతలఛిద్రఘ్నశ్శంకుర్మైనం భ##వేన్మునే. 56 నరోనదీపకశిఖౌచ్యభకో హ్మధ భోద్వనే, శంకౌనృదీపాఘశ్ఛిద్రఘ్నైర్దీపౌచ్యం నరాన్వితే. 57 వింశకుదీపౌచ్చ్య గుణాచ్ఛాయా శంకూధ్ధృతా భ##వేత్, దీపశంక్వంతరం చాథ ఛాయాగ్రవివరఘ్నభా. 58 మానాంతరద్రుద్భూమిస్స్యాదధో భూ నరాహతిః, ప్రభాప్తా జాయతే దీపశిఖౌచ్చ్యం స్యాత్త్రిరాశికాత్. 59 ఏతత్సంక్షేపతః ప్రోక్తం గణితే పరికర్మకమ్, గ్రహమధ్యాదికం వక్ష్యే గణితే నాతివిస్తరాత్. 60 పంచరాశ్యాదిక స్ధలములో ఫలమును విభజించు రాశులను పరస్పరముగా విభజించి రెండు పక్షమలును చేసి ఎక్కువరాశిగా ఉన్నదానిని భాగహరమును చేసి తక్కువదానిచే కొట్టబడిన దానిని ఫలముగా నిర్ణయించవలయును. ఇష్టకర్మఘాతమునకు కలిసి యున్న కలాంతరము నుండి చ్యుతమైనది మూలమగును. మాన నిఘాతమగు కలము అతీతకాలనిఘాతమగు ఫలముచే సమన్వయము చేయబడును. క్షేపములన్నియూ మిశ్రహతములగును. క్షేపయోగముచే భాగించబడినవి ఫలముగలగును. భిన్నమైన అంశములచే విభించవలయును. వాటితో కలిసియున్న రూపము కాలము పూర్తి చేయునదగును. పూర్ణభాగము సమభాగమును చెందును. వ్యంకమున సమమున వర్గమున అర్ధభాగము నిలీనమగును. వ్యస్తమును పొందుచున్న ఫలము ఏ గుణవర్గమును చేరినదో చూడవలయును. వ్యేకము, వ్యేకగుణమును పొందినది, ఎక్కువరాశిచే భిన్నమైనది ఉత్తరగుణమున మానమగును. (కొలబద్ద) రెండు భుజముల కలయికచే ఏర్పడినది భుజములకు కర్ణమగును. శ్రుతికృతుల మధ్యనయున్నది. భుజకోటి ద్వయమున నున్నది భుజభాగమగును. ఆ కృతి సంక్షేపమును భిన్నము చేసినది వ్యాసమగును. ఇదియే పరిధియనబడును. నారివ్యాసముల కలయికచే ఏర్పడిన వివరముచే ఆహతమగు మూలమునే అర్థితమందురు. గణితములో వ్యాసము శరము అని రెండు సంజ్ఞలుండును. శరము కంటే తక్కువగా నున్నదానికి, వ్యాసము కంటే శరగుణము కంటే అవతలనున్నది పదమనబడును. రెంటిచే విభించబడునది జీవము. శరహృతమగు యుతమున జీవార్ధము గా పేర్కొనబడును. వ్యాసభాగము అష్టవిధముగా భిన్నమగుచో నని గణితకోవిదులు చెప్పెదరు. ధనువు కంటే తక్కువదానిచే హతమగునది పరిధియనబడును. పరిధిని విభజించినచో ప్రదాఙ్లమగును. నాలగవ భాగమగు శరాంశముచే అర్థము చేయబడిన భాగము నాలుగరెట్లుండును. వ్యాసముచే శరాభాగముచే విభించబడినది వృత్తవర్గమగును. నాలుగింటిచే విభించబడిన వృత్తవర్గము, నాలుగింటిచే విభించబడినది వ్యాసమగును. ఈ వ్యాసమే జ్యాభాగమును హరించును. లబ్ధముకంటే తక్కువగానున్న వృత్త వర్గమున ఏడుచే కాని రెంటిచే కాని వెలగట్టినది పతితమగుచో ధనువగును. స్థూలమధ్య భాగమును పొందిన దానిని వేధ చేసినచో వృత్తాంక శేషభాగమగును. వృత్తాంగాంశము యొక్క కృతిచే విద్ధయైనది కరమితమగును. వారి వ్యాసహతమగునది మరల దీర్ఘనేధాంగుఘ్నమగును. మూడుమార్లు ఒకటిచే భాగించబడినది, మూడుచే భాగించబడినది ద్రోణమునుండి వారివరకుండు మానమగును. వైశాల్యము, పొడుగుగా ఉన్నవాటిని అంగుళములచే నాడులచే విభించవలయును. ఆరింటిచే ఏడింటిచే, నాలుగింటిచే విభజించబడినవి ధాన్యమున ద్రోణాదిమానము పరిగణించబడును. ఎత్తు, వెడల్పు, పొడుగును అంగులములచే కొలవవలయును. పరస్పరము ఒకదానితో వేరొకదానిని కలిపి విభజించవలయును. ఒకటితో తొమ్మిదితో, పన్నెండుతో విభజించినచో ద్రోణాది మనామేర్పడును. వెడల్పు మొదలగువాటిని అంగుళాదులతో లెక్కించవలయును. పరస్పరము కొట్టివేయబడినచో మాన నిర్ధరణ జరుగును. అయిదింటిచే, ఎనిమిదింటిచే, అయిదింటిచే విభాగము చేయగా లభించినది ద్రోణామానముగా నిర్దేశించవలయును. దీప శకుంతల ఛిద్రములచే కొట్టివేయబడినచో శంకువగును. నరభాగము కంటే తగ్గిన భాగము దీసశిఖము కంటే ఎక్కువ భాగములచే విభజించబడినది ఆకాశభాగమగును. శంకువునందు నరదీప అఘఛిద్రములచే కొట్టి వేయబడినవాటిచే దీపోచ్చ భాగమును నరాన్వితమగును. విశంకు దీప భాగములకంటే ఉన్నతమగునది గుణచ్ఛాయ శంకుచే ఉద్ధృతమగును. దీప శంకు మధ్యలోనున్నది ఛాయగ్ర వివరమును కొట్టివేయును. మానాంతరముచే కొలువబడు భూమి నరాహతమగును. ప్రభ##చే పొందబడినది దీపశిఖకంటే ఉచ్చయగును. ఇదియే రాశిత్రయమగును. ఇది సంక్షేపముగా గణితకర్మ చెప్పబడినది. ఎక్కువ విస్తరముగా కాకుండగా గ్రహమధ్యభాగము మొదలగు దానిని చెప్పెదను. యుగమానం స్మృతం విప్ర ఖచతుష్కరదార్ణవాః, తద్ధశాంస్తు చత్వారః కృతాఖ్యం పాదముచ్యతే. 61 త్రయస్త్రేతా ద్వాపరో ద్వౌ కలిరేకః ప్రకీర్తితః మనుకృతాబ్దసహితా యుగానామేకసప్తతిః. 62 విధేర్దినే స్యుర్విప్రేన్ద్ర మనవస్తు చతుర్దశ, తావత్యేవ నిశా తస్య విప్రేన్ద్ర పరికీర్తితా. 63 స్వయంభువా శరగతానబ్దాన్సంపీడ్య నారద, ఖచరానయనం కార్యమథ వేష్టయుగాదితః 64 యుగే సూర్యజ్ఞశుక్రాణాం ఖచతుష్కరదార్ణవాః, పూజార్కిగురుశుక్రాణాం భగణా పూర్వపాపినామ్. 65 ఇందోరసాగ్నిత్రిషు సప్త భూధరమార్గణాః, దస్రత్య్రాష్టరసాంకాశ్విలోచనాని కుజస్య తు. 66 బుధశీఘ్రస్య శూన్యర్తుఖాద్రిత్య్రంకనగేందవః, బృహస్పతేః ఖదస్రాక్షివేదస్త్రడహూయస్తథా. 67 శితశీఘ్రస్య యష్ణసత్రియమాశ్విస్వభూధరాః, శ##నేర్భుజగషట్పంచరసవేదనిశాకరాః. 68 చంద్రోచ్చస్యాగ్నిశూన్యాక్షివసుసర్పార్ణవా యుగే. వామం పాతస్య చ స్వగ్నియమాశ్విశిఖిదస్రకాః. 69 ఉదయాదుదయం భానోర్భూమే స్సాచేన వాసరాః, వసుద్వ్యష్టాద్రిరూపాంకసప్తాద్రితిధయో యుగే. 70 షడ్వహిత్రిహుతాశాంక తిథయశ్దాధిమాసకాః, తిధిక్షయా యమార్ధాక్షి ద్వష్టవ్యోమ శరాశ్వినః 71 ఖ చతుష్కా సముద్రాష్టకుర్పచరవిమాసకాః, షట్ త్ర్యగ్ని వేదాగ్ని పంచ శుభ్రాంశు మాసకాః. 72 ప్రాగార్తేః సూర్యమందస్య కల్పేసప్తాష్టవహ్నయః, కౌజస్య వేదస్వయమా బౌధస్యాష్టర్తువహ్నయః. 73 ఖ ఖరంధ్రాణి జైవస్య శౌక్రస్యార్ధగుణషవః, గో೭గ్నయశ్శనిమందస్య పాతానామథవా మతః. 74 మనుదస్రాస్తు కౌజస్య భాధస్యాష్టాష్ట సాగరాః, కృతాద్రి చంద్రా జైవస్య శౌక్రస్యాగ్నిఖనందకాః. 75 శనిపాతస్య భగణాః కల్పే యమరసర్తవః, వర్తమానయుగే పానవత్సరా భగణాభిధాః. 76 మాసీకృతా యుతా మాసైర్మధుశుక్లాదిభిర్గతైః. పృధక్ధాసిధిమాసాగ్రా సూర్యమాసవిభాజితాః. 77 అధాధిమాసకైర్యుక్తా దినీకృత్య దినాన్వాతాః, ద్విస్ధాస్తితిక్షయాభ్యస్తాశ్చాంద్రవాసరభాజితాః. 78 రధోనరాత్రిరహితాలంకార్యమర్ధరాత్రికః, సావనోద్యూగసోరర్కాదిర్దినమాసాబ్దయస్తతః. 79 సప్తభిః క్షపితశ్శేషస్సుర్యాద్యో వాసరేశ్వరః, మసాబ్దదినసంఖ్యాసం ద్విత్రిఘ్నం రూపసంయుతమ్. 80 సప్తోర్ధనావశేషౌ తౌ విజ్ఞే¸° మాసవర్షపౌ, స్నేహస్య భగణాభ్యస్తో దినరాశిః కువాసరైః 81 విభాజితో మధ్యగత్యా భగణాదిర్గ్రహో భ##వేత్, ఏవం హ్యశీఘ్రమందాచ్చ యే ప్రోక్తాః పూర్వపాపినః. 82 విలోమగతయః పాతాః స్తద్వచ్చక్రాష్విశోధితాః, యోజనాని శతాన్యష్టౌ భూకర్ణౌ ద్విగుణస్స్మృతః. 83 తద్వర్గతో దశగుణాత్పదభూపరిధిర్భవేత్, లంబజ్యాఘ్నస్వజీవాప్తస్ఫుటో భూపరిధిస్స్వకః. 84 తేన దేశాంతరాభ్యస్తా గ్రహభుక్తిర్విరాజితా, కలాది తత్ఫలం ప్రార్చ్యాః గ్రహేభ్యః పరిశోధయేత్. 85 రేఖా ప్రతీచింసస్థానే ప్రక్షి పేత్స్యుః స్వదేశతః, రాక్షసాతపదేవౌకవ్వైలయోర్మధ్యసూత్రగాః. 86 అవంతికారో హతికం తథా సన్నిహితం పరః, వారప్రవృత్తివాగ్దేశే క్షయార్ధే೭భ్యధికో భ##వేత్. 87 తద్దేశాంతరనాడీభిః పశ్చాదూనే వినిర్దిశేత్, ఇష్టనాడీ గుణా భుక్తిష్షష్ట్యా భక్తా కలాదికమ్. 88 గతే శోద్థ్యం తథా యోజ్యం గమ్యే తాత్కాలి కోగ్రహః, భచక్రలిప్తాశీత్యంశః పరమం దక్షిణోత్తరమ్. 89 విక్షప్యతే స్వపాతేన స్వక్రాంత్యంతాదనుష్ణగుః, తత్ర వాసం ద్విగుణితం జీవస్త్రిగుణితం కుజః. 90 బుధశుక్రర్కజాః పాతైర్విక్షిప్యంతే చతుర్గుణమ్. రాశిలిప్తాష్టమో భాగః ప్రథమం జ్యార్ధముచ్యతే. 91 తతో ద్విభక్తలబ్ధోనమిశ్రితం తద్ద్వితీయకమ్, ఆద్యేనైవ క్రమాత్పిండాన్భక్తాల్లబ్ధో నితైర్యుతాన్. 92 ఖండాకాస్స్యుచ్చతుర్వింశా జ్యార్ధపిండాః క్రమాదమీ, పరమాపక్రమజ్యా తు సప్తరంధ్రగుణందవః. 93 తద్గుణజ్యాత్రిజీవాప్తా తచ్చాపక్రాంతిరుచ్యతే, గ్రహం సంశోద్య మందోచ్చం తథా శీఘ్రాద్విశోధ్య చ. 94 శేషం కందపదం తస్మాత్ భుజజ్యాకోగటిరేవ చ, గతాద్భుజజ్యావిషమే గమ్యాత్కోటిః పదే భ##వేత్. 95 సమేతి గమ్యాద్బాహు జ్యాకోటిజ్యానుగతా భ##వేత్, లిప్తాస్తత్త్వ యమైర్భక్తా లబ్ధిజ్యాపిండకం గతమ్. 96 గతగమ్యాంతరాభ్యస్తం విభ##జేత్తత్త్వలోచనైః, తదావాప్తఫలం యోజ్యం జ్యాపిండే గతసంజ్ఞకే. 97 స్యాత్క్రమజ్యావిధిశ్చైవముత్క్రమ జ్యాగతా భ##వేత్, జ్యాం ప్రోహ్య శేషం తత్త్వతాశ్విహంతం తద్వివరోద్ధృతమ్. 98 సంఖ్యా తత్త్వాశ్విసంవర్గ్యసంయోజ్యం ధనురుచ్యతే, ఖేర్మందపరిశుద్ధ్యంశా మనవశ్శీతగోరదాః. 99 యుగ్మాంతే విషమాంతే తు నఖలిప్తో నిరూప్తయోః, యుగ్మాంతేర్ధాద్రయః ఖాగ్నిసురాస్సూర్యా నవార్ణవాః. 100 నాలుగు ఆకాశ సంఖ్యలగల వత్సరములు నాలుగు సముద్ర సంఖ్యగల వత్సరములు యుగమానము. దానిలో దంశాశములగు నాలుగు కలిసినపుడు కృతయుగము ఒక పాదమగును. మూడు దశాంశములు త్రేతాయుగము రెండవపాదమగును. రెండు దశాంశములు ద్వాపరయుగము మూడవపాదమగును. ఒక దశాంశము కలియుగము నాలుగవపాదమగును. డబ్బదియొక్కయుగములు ఒక మనువు కాలము. బ్రహ్మకు ఒకపూటలో పదునలుగురు మనువులు ఉందురు. బ్రహ్మరాత్రి కూడా అంతయే కాలముండును. బ్రహ్మకాలమును అయిదు భాగములుగా విభజించి అయిదవ భాగముచే ఖచరానయనమును చేయవలయును. ఇట్లు యుగాది నుండి చేయవలయును. ఒక యుగమున సూర్య బుధ శుక్రులకాలము యుగకాలముతో సమానము. శని గురు శుక్రులకాలము భగణ పూర్వకాలముగా గుర్తించవలయును. చంద్రునికి 577346 సంవత్సరముల కాలముగా తెలియవలయును. కుజునకు 226835 సంవత్సరములు కాలము. బుధునకు 1763160 సంవత్సరము. బృహస్పతికి 684281 సంవత్సరములకాలము. శిత శీఘ్రకాలము 712239 సంవత్సరముల కాలము. శనికి వేరొక కాలము 146561 సంవత్సరముల కాలము. ఉచ్చచంద్రునికి 418204 సంవత్సరముల కాలము. వామపాతకాలము 442241 సంవత్సరములు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకదినముగా భూలోకమున పరిగణింతురు. ఒక యుగమున 15727828 సంవత్సరములుండును. అధిమాసముల సంఖ్య 1524346 సంవత్సరములుగా నుండును. తిధి క్షయ కాలము 2518221 సంవత్సరకాలముండును. విమాసములు 1841111 సంవత్సరముల కాలముండును. మాసముల కాలము 1544336త సంవత్సరముల కాలముగా నుండను. సూర్యశనుల సంయోగకాలము 487 కల్పములుగా నుండును. కుజునకు 214, బుధకాలము 468, బృహస్పతికి 110, శుక్రునకు 560, శనిమందగతికి 54, లేదా పాతమునకు అని కూడా చెప్పవచ్చును. 142 కుపాతమునకు, బుధునకు 488, బృహస్పతికి 171, శుక్రునకు 914, శనిపాతమునకు 662 భగణములు, వర్తమానయుగమున పాతవత్సరములే భగణ నామముచే వ్యవహరించబడుచున్నవి. గడిచిన మధు శుక్లా మాసములచే మాసమానమేర్పడును. సూర్యాది గ్రహములకు విడిగా మాసనామము వ్యవహారమున కలదు. ఇపుడు అధిమాసములతో కలిసి యున్న మాసములను దినములుగా విభజించి, దినములతో కూడిన వాటిని రెట్టింపు చేసినచో చంద్రవాసరములొచ్చును. రాత్రిలేని పగలును మాత్రమే లెక్కించి, అర్ధరాత్రికాలమును కలిపి సావనమానము చేసినచో అర్కాది దినములు మాసములు, సంవత్సరములు కల్పించవచ్చును. మిగిలిన దానిని ఏడుతో భాగించినచో సూర్యాది వాసరములొచ్చును. ఆయావాసరములకు సూర్యాదులే అధిపతులు. మాసమును మొదలుకొని దినసంఖ్యవరకు లెక్కించిన దానిని రెంటితే భాగించి ఏడు కంటే ఎక్కువగా మిగిలిన సంఖ్యకు అధిపతియైన వారు మాసాధిపతియని, మూటితో భాగించినపుడు ఏడు కంటే ఎక్కువగావచ్చిన శేషసంఖ్యాధిపతియే సంవత్సరాధిపతిగా తెలియవలయును. కువాసరములతో కలిసిన దానిని భగణముతో రెట్టింపు చేసినచో దినరాశివచ్చును. సగముగా విభజించినపుడు వచ్చినసంఖ్యకు భ గణాది నుండి లెక్కించగా అధిపతియగు గ్రహము తెలియును. ఇట్లు పూర్వపాపులుగా అశీఘ్రలుగా, మందులుగా చెప్పబడిన గ్రహములకు విలోమగతి ఏర్పడినపుడు పాతమని చక్రగతిని బట్టి తెలియవలయును. ఎనిమిదొందల యోజనములు భూకర్ణములుగా చెప్పబడినవి. ఒకవర్గము కంటే రెండో వర్గము రెట్టింపుగా నుండును. ఆ వర్గము కంటే పదిరెట్లు నున్నది. భూపరిధి యగును. లంబము, జ్యాఘ్నము, స్వజీవాప్తముగానున్న స్ఫుటమగునది భూపరిధి. ఈ భూపరిధలో దేశాంతర భాగములను రెట్టింపు చేసి గ్రహభుక్తిచే విభజించినపుడు కలాదులు తెలియును. ఆ ఫలమును గ్రహములనుండి శోధించి తెలియవలయును. తమ ప్రాంతమునుండి రేఖకు పశ్చిమదిశగా గీసి ఆస్ధానమును సంఖ్యను వేయవలయును. రాక్షస, ఆతస, దేవనివాస, పర్వత మధ్యభాగముల నుండి సూత్రమున అనుసరించు ఆరోహణావరోహణలను చూచుచు దగ్గరగా నున్న సరో ప్రాంతమును గుర్తించి, వారప్రవృత్తికి స్ధానమైన వాక్ప్రాంతమున క్షయ భాగమునలోని సగముకంటే ఎక్కువ భాగమునుంచవలయును. ఆ దేశాంతర నాడులచే పశ్చిమభాగమున తక్కువగా నిర్దేశించవలయును. ఇష్టనాడీగుణములు కలది భుక్తియగును. ఈ భుక్తిని ఆరు సంఖ్యచే భాగించిన కలాదికమగును. పూర్తిగా పోయినపుడు శోధించవలయును. అట్లే యోగము చేయవలయును. ఇట్లు చేసినపుడు వచ్చునది తాత్కాలికగ్రహము. భక్తచక్ర లిప్తాంశము గలది అంశియగును. ధక్షణోత్తరముగా నున్నది అంశమగును. చంద్రుడు తన పాతముచే సంక్రాంత్యంతము వరకు విక్షేపము చేయబడును. దానికి రెట్టింపుగా బృహస్పతి, మూడురెట్లు కుజుడుండును. బుధ శుక్ర శనులు పాతములచే నాలుగు రెట్లు విక్షేపము చేయబడుదురు. రాశిలిప్తాష్టమ భాగము మొదట జ్యార్ధమనబడును. దానికంటే రెంటితో భాగించగా మిగినలి దానికంటే తక్కువగా నున్నది కలిసి రెండవ జ్యార్దమగును. మొదటిదానివలెనే క్రమముగా భాగముచే లభించిన శేషభాగములను లభించిన దానికంటే తక్కువగానున్న భాగములను కలిపినచో ఖండకములగును. ఇవి మొత్తము ఇరువదినాలుగు జ్యార్దపిండములుండును. క్రమముగా అన్నిటికంటే పరమైనది అపక్రమజ్యార్ధము 1607 గా తేలును. దీనికి మూడు రెట్లుగా గుణజ్యాయగును. చాపమును క్రాంతియందురు. గ్రహమును చక్కగా మందత్వమును, ఉచ్చత్వమును. శీఘ్రత్వాదులనుండి శోధించి మిగిలిన దానిని కందపదముగా పేర్కొనవలయును. దీని నుండి భుజము, జ్యా, కోటి భాగములనేర్పరచవలయును. గతమునుండి భుజ జ్యాభాగములను విషమముగా, గమ్యమునుండి కోటి పదములో నుండును. గమ్యమునుండి వచ్చిన భుజ జ్యా భాగము సమకుని, దానిననుసరించి వచ్చునది కోటిజ్యాయగును. తత్త్వయమలచే విభజించబడిన లిప్తలు జ్యాపిండమున లభింపచేయును. దీనినే గతమందురు. గతగమ్యములలోని బేధాభ్యాసమును తత్త్వజ్ఞానము కలవారు విభజించగలరు. అట్లు విభజించగావచ్చిన ఫలమును గతము అను సంజ్ఞకల జ్యాపిండమున కలుపవలయును. ఇట్లు క్రమజ్యావిధి యగును. ఇట్లే ఉత్క్రమ జ్యావిధి కూడా గతమనబడును. జ్యా భాగమునుశుద్ధి చేసి మిగినిన దానిని తత్త్వములో భాగించిగా వచ్చినది వివరోద్ధృతమగును. సంఖ్యాతత్త్వము యొక్క అంశులతో సంవర్గ్యములతో కలిపిన దానిని ధనువు అందురు. సూర్యుని మంద పరిధి అంశములు మనవులు. చంద్రునికి ఇట్లుండును. యుగ్మాంతమున విషమాంతమున నలిప్త భాగమే ఆరెంటికి భేదము. యుగ్మాంతమున 491233413 గా భాగములేర్పడును. ఓజేద్వ్యగా చ సుయమా రదారుద్రా గజాబ్ధయః, కుజాదీనామతశ్శౌధ్నా యుగ్మాంతేర్ధాగ్నిదస్రకాః. 101 గుణాగ్నిచంద్రాఖనగా ద్విరసా క్షేణిగో೭గ్నయః, ఓజాంతే ద్విత్రయో మతా ద్వివిశ్వే యమపర్వతాః. 102 ఖర్తుదస్రవిపద్వేదా శీఘ్రకర్మణి కీర్తితాః, ఓజయుగ్మాంతరగుణా భుజజ్యాత్రఙ్యయోద్ధృతాః. 103 యుగ్మవృత్తే ధనర్ణస్స్యాదోజాదూనే೭ధికే స్పుటమ్, తద్గుణ భుజకోటిజ్యే భగణాంశవిభాజితే. 104 తద్భుజజ్యాఫలధనుర్మాందం లిప్తాదికం ఫలమ్, శైఘ్ర్యకోటిఫలం కేంద్రే మకరాదౌ ధనం స్మృతమ్. 105 సంశోధ్యం తు త్రిజీవాయాం కర్కాదౌ కోటిజం ఫలమ్, తద్బాహుఫ0లవర్గైక్యాన్మూలకర్ణశ్చ లాభదః. 106 త్రిజ్యాభ్యస్తం భుజఫలం ఫలకర్ణవిభాజితమ్, లబ్ధస్య చాపం లిప్తాదిఫలశైఘ్ర్యమిదం స్మృతమ్. 107 ఏతదాదౌ కుజాదీనాం చతుర్ధే చైవ కర్మణి, మాంద్యం కర్మైకమర్కైర్ద్వౌ భౌమాదీనామథోచ్యతే. 108 శైఘ్రం మాంద్యం పునర్మాంద్యం శైఘ్ర్యం చత్వార్యనుక్రమాత్, అజాదికేంద్రేసర్వేషాం మాంద్యే శైఘ్ర్యై చ కర్మణి. 109 ధనం గ్రహాణాం లిప్తాదితులాదావృణమేవ తత్, అర్కబాహుఫలాభ్యస్తా గ్రహభుక్తి విభాజితాః. 110 భచక్రకలికాభిస్తు లిప్తాః కార్యా గ్రహే೭ర్కవత్, గ్రహభక్తః ఫలం కార్యం గ్రహవన్మందకర్మణి. 111 కర్కాదౌ తద్ధనం తత్ర మకరాదావృణం స్మృతమ్, దోర్జ్యోత్తరగుణా భుక్తిస్తత్త్వనేత్రోద్ధృతా పునః. 112 స్వమందపరిధిక్షుణ్ణా భగణాంశోద్ధృతాః కలాః, మందస్ఫుటకృతా భక్తి ప్రొహ్య శీఘ్రోచ్చభుక్తితః. 113 తచ్ఛేషం వివరేణాథ హన్యాత్త్రిజ్యాంకకర్ణయోః, చక్రకర్ణహృతం భుక్తే కర్ణే త్రిజ్యాధికే ధనమ్. 114 ఋణమానే೭ధికే ప్రొహ్య శేషం వక్రగతిర్భవేత్, కృతర్తుచంద్రైర్వేదేంద్రై శూన్యత్ర్యైకైర్గుణాష్టభిః. 115 శరరుద్రైశ్చతుర్యాంశు కేంద్రాం శైర్ఫూసుతాదయః, వక్రిణశ్చక్రశుద్ధైసై#్తరంశైరుజుతి వక్రతామ్. 116 క్రమజ్యా విషువద్భాఘ్నీక్షితిర్జ్యాద్వాదశోద్ధతా, త్రిజ్యాగుణా దినవ్యాసభక్తా చాపం చ శత్రవః 117 తత్కార్ముకముదక్రాంతౌ ధనహీనో పృథక్ క్షతే, స్వాహోరాత్రచతుర్భాగే దినరాత్రిదలే స్మృతే. 118 యామ్యకాంతా విపర్యస్తే ద్విగుణౖతే దినక్షయే, భభోగో೭ష్ట శతీర్లిప్తాస్వాశ్విశైలోస్తథా తిథేః. 119 గ్రహలిప్తా భగా భోగా భావి భుక్త్వా దినాదికమ్, రవీందుయోగలిప్తాస్తు యోగా భభోగభాజితాః. 120 గతగమ్యాశ్చ షష్టిఘ్నా భుక్తియోగాప్తనాడికాః, అర్కోన చంద్రలిప్తాస్తు తిథయో భోగభాజితాః. 121 గతగమ్యాశ్చ షష్ఠిఘ్నా నాతోశుక్తతరోద్ధతాః, తిథయశ్శుక్లప్రతిపదో ద్విఘ్నాసై#్సకా నగా హతాః. 122 శేషం బవో బాలవశ్చ కౌలవసై#్తతిలో గరః, వణిజో೭భ్రౌ భ##వేద్విష్టిః కృష్ణభూతా పరార్ధతః. 123 శకునిర్నాగశ్చ చతుష్పద కింస్తుఘ్నమేవ చ, శిలాతలే చ సంశుద్ధే వజ్రలేపే తథా సమే. 124 తత్ర శకాంగులైరిష్టైస్సమమండలమాలిఖేత్, తన్మధ్యే స్ధపయేచ్ఛంకుం కల్పనా ద్వాదశాంగులమ్. 125 తచ్ఛాయాద్రం స్పృశేద్యత్ర దత్తం పూర్వాపరాహ్ణయోః, తత్ర బంధుం విధాయోభౌ వృత్తే పూర్వాపరాభిధౌ. 126 తన్మధ్యే తిమినా రేఖా కర్తవ్యా దక్షిణోత్తరా, యమ్యోత్తరదిశోర్మధ్యే తిమినా పూర్వపశ్చిమా. 127 ద్వఙ్మధ్యమత్స్యైః సంపాద్యా విదిశస్తద్వదేదవ హి, చతురస్తం బహిః కుర్యాత్ సూత్రైర్మధ్యాద్వినిస్సృతైః. 128 భుజసూత్రాంగులైస్తత్ర దత్తైరిష్టప్రభా మతా, ప్రాకపశ్చిమా వ్రితా రేఖా ప్రోచ్చతే సమమండలమ్. 129 భ మండలం చ విషువత్ మండలం పరికీర్తితమ్, రేఖా ప్రాద్యపరా సాధ్యా విషువద్భాగ్రయా తథా. 130 ఇష్టఛాయా విషువతోర్మధ్యే హ్యగ్రాభిధీయతే, శంకుచ్ఛాయాకృతియుతేర్మూలం కర్ణో೭యవర్గతః. 131 ప్రోహ్య శంకుకృతే యుతే ఛాయా శంకువిపర్యయాత్, త్రింశత్కృత్యో యుగే భానాం చక్రం ప్రాక్పరిలంబతే. 132 తద్గుణాద్భదినైర్భక్త్యా ద్యుగణాద్యదవాప్యతే, తద్దోస్త్రిఘ్నాదశాఘ్నాంశా విజ్ఞేయా అయతాభిదాః. 133 తత్సంస్వ కృతాద్ధహాత్రాంతిచ్ఛాయావరదలాదికమ్, శంకుచ్ఛాయా హతే త్రిజ్యే విషువత్కర్కభాజితే. 134 లంబాక్షజ్యే తయోశ్చాయే లంబాక్షాదక్షిణౌ సదా, సాక్షార్కాపక్రమాయుతిర్దిక్సామ్యెంతరమన్యథా. 135 శేషహ్యానాంశాః సూర్యస్య తద్బాహుజ్యాధకోటిజాః, శంకుమానంగులాభ్యస్తే భుజత్రిజ్యే యథాక్రమమ్. 136 కోటిజ్యాయా విభజ్యాస్తే ఛాయాకర్ణా బహిర్దలే, స్వాక్షార్కనతభాగానాం దిక్సమ్యేంతర మన్యథా 137 దిగ్భేదోపక్రమశ్శేషస్తస్య జ్యాత్రిజ్యయాహతా, పరమోపక్రమజ్యాప్త చాపమేషాదిగో%్ రవిః. 138 కర్కదౌ ప్రోహ్య చక్రార్ధ తులాదౌ భార్ధసంయుతాత్, మృగాదౌ ప్రోహ్య చక్రాత్తు మధ్యాహ్నో೭ర్కస్స్ఫుటో భ##వేత్. 139 తన్మన్దమసకృద్వామం ఫలం మద్యో దివాకరః, గ్రహోదయాః ప్రాణహతాః ఖఖాష్టైకోద్ధతా గతిః. 140 చక్రాసనో లబ్ధయుతీ స్వాహోరాత్రాసకస్స్మృతాః, త్రిభద్యుకర్థార్ధగుణా స్వాహో రాత్రార్ధభాజితాః. 141 క్రమాదేక ద్విత్రిభాజ్యా తచ్చాపాని పృథక్పృథక్. 142 కుజాదులకు అయుగ్మాంతమున అయిదున్నరలో లెక్కించవలయును. 4126271146 గా సంఖ్యలు తెలియవలయును. ఓజాంతమున 7222232 సంఖ్యలు తెలియవలయును. గ్రహముల శీఘ్రకర్మలను 47261 సంఖ్యలు తెలుపును. ఓజో యుగ్మాంతర గుణములు భుజ, జ్యా త్రిజ్యలతో ఉద్ధరించబడును. యుగ్మవృత్తమున్నచో ధనమును అప్పుచేయువాడగును. ఓఙము కంటే తక్కువగా ఉన్నను, ఎక్కువగా ఉన్నను స్ఫుటఫలితము తెలియును. ఓజగుణమును భుజ, కోటి, జ్యా భాగములలో భగణాంశములతో విభజించినపుడు భుజ జ్యా ఫలము ధనువైనపుడు మందగతియని, లిప్తాదికములు ఫలముగా తెలియును. కేంద్రమున శైఘ్ర్యకోటి ఫలము, మకరాదులలో నైనచో ధనము ఫలమని చెప్పబడినది. త్రిజీవభాగమును శోధించినపుడు కర్కాదులలో నైనచో కోటిజము ఫలమగును. భుజ భాగ ఫలవర్గము ఐక్యమైనచో మూలమగుకర్ణము చలమనబడును. త్రిజ్యాభ్యస్తమే భుజఫలము ఇదియే ఫల భాగ కర్ణములో విభజించబడును. విభాగము చేసినపుడు లబ్ధమైన భాగము యొక్క చాపమే లిప్తాదులను తెలుపును. తీని ఫలము శైఘ్ర్యాదికమని తెలియుము. ఇట్లు కుజాదులకు చదుర్దకర్మలో మాంద్యము కర్మగా నుండును. సూర్యునిలో ఒకటి, కూజాదులకిపుడు చెప్పెదను. శ్రీఘ్రత, మాంద్యము, మరల మాంద్యము శ్రీఘ్రత ఇట్లు పరుసగా నాలుగు సంభవింటును. అన్ని గ్రహములకు మేషాని కేంద్రములందు మాంద్య శ్రీఘ్రకర్మలలో లిప్తాదుల ఫలము ధనముగా తెలియుము. తులాదులలో నైనచో ఫలము ఋణము. సూర్యభుజ ఫలమును రెట్టించినచో గ్రహభుక్తితో విభజించబడి భచక్రకలినాదులతో కలిసిన లిప్తలను సూర్యగ్రహమునందువలె చూడవలయును. మందకర్మలో గ్రహమువలె గ్రహభక్తమును ఫలముగా చేయవలయును. అట్లు చేసినపుడు కర్కాదులొచ్చినచో ధనమని, మకరాదులొచ్చినచో ఋణమని తెలియవలయును. భుజభాగము జ్యాభాగము తరువాత గుణభుక్తి చతురులైన వారిచే ఉద్ధరించబడినపుడు స్వమందపరిధచే క్షుణ్ణమై భతణాంశములచే ఉద్ధరించబడిన కలలు మందస్ఫుటములుగా చేయబడిన భుక్తి శీఘ్ర ఉచ్చ భుక్తిచే శోధించబడి మిగిలిన దానిని వివరముచే కొట్టివేయవలయును. ఈ కొట్టివేత కూడా త్రి జ్యాకంభాగమున కర్ణములయందు మాత్రమే చేయవలయును. చక్రకర్ణ హృతమే భుక్తిలో త్రిజ్యాధిక కర్ణములో నున్నచో ధనము ఫలమని చెప్పవలయును. తక్కువగా ఉన్నచో ఋణము ఫలముగా తేలును. అధికమున శుద్ధచేయగా మిగిలినది వక్రగతిగా తెలియవలయును. 6, 1, 4, 1, 0, 3, 1, 6, 8, 5, 11, లలో చతుర్ధాంశ##కేంద్రాంశములలో కుజాదులున్నపుడు వక్రులుగా, చక్రశుద్దాంశలచే రుజువక్రతలను తెలియవలయును. క్రమ జ్యాభాగము విష్ణువు వలె నక్షత్రముచే కొట్టి వేయవలయును. పన్నెండునుండి ఉద్ధరించబడిన క్షితిజ్యాభాగము, త్రిజ్యా భాగముచే గుణించినపుడు దినవ్యాస భక్తమైనచో చాపము వచ్చిన శత్రువృద్ధి ఫలమగును. ఆ చాపము ఉదక్రాంతమైనపుడు, విడివిడిగా కొట్టివేయబడినపుడు ధనహీనుడగును. తన తన అహోరాత్రముల చతుర్భాగమున దినరాత్రి భాగములుండును. యామ్యక్రాంతిలో, విపర్యస్తముగా నున్నపుడు, దినక్షయమున దీనిని రెట్టింపు చేయవలయును. నక్షత్రభుక్తి ఎనిమిదివందల లిప్తలు. తిథి భుక్తి 72గా ఉండును. గ్రహలిప్తలు నక్షత్ర భుక్తులు, నక్షత్రములు, భుక్త్యాదులచే దినాదికమును తెలియవలయును. సూర్యచంద్రయోగ లిప్తలు మాత్రము నక్షత్రభుక్తులచే విభజించబడినపుడుగా యోగములుగా తెలియును. గతములు గమ్యములు అరవైచే కొట్టివేసినచో భుక్తియోగముచే నాడీ విభాగములను పొందును. సూర్యలిప్తలకంటే తక్కువగానున్న చంద్రలిప్తలు భుక్తిచే విభజించబడి తిథులగును. ఇవి కూడా గతములు గమ్యములు అరవై సంఖ్యచే కొట్టబడును. ఇంతకంటే భుక్తి ఇక ఉండదు. శుక్ల ప్రతిపత్ మొదలగునవి తిథులు. రెంటితో కొట్టబడును. ఏడుతో కొట్టబడినచో ఒకటే యగును. మిగినినవి బవ, బాలవ, కౌలవ తైతుల, గరములను పేర్లను పొంది కరణములగును. అభ్రమున వణిజులున్నచో విష్టియగును. పరార్ధభాగము కృష్ణపక్షమగును. శకుని, నాగము, చతుష్పదము, కింస్తుఘ్నము అను నామము లేర్పడును. శిలాతలమువలె శుద్ధి చేసినపడు, వజ్రలేపమువలె సమముగా చేసి భాగమున ఇష్టమైన అంగుళులచే సమమండలమును లిఖించవలయును. ఆ మండల మధ్యభాగమున శంకువును స్థాపించవలయును. శంకువు ద్వాదశాంగులి పరిమితము కావలయును. శంకుచ్ఛాయాగ్రము తాకిన ప్రదేశము పూర్వాపరాహ్ణదత్తమగును. అచట బిందువునుంచి పూర్వఅపర అను పేర్లుగల రెండు వృత్తముల నేర్పరచవలయును. ఆ రెండు వృత్తముల మధ్యలో అంచుతో దక్షిణోత్తరము గా రేఖ నేర్పరచవలయును. దక్షిణోత్తర దిక్కుల మధ్యమున అంచుతో పూర్వపశ్చిమ దిశలకు ఒకరేఖను ఏర్పరచవలయును. దిక్కులమధ్యనున్న మత్స్యములచే విదిక్కులను కూడా గుర్తించవలయును. మధ్యభాగము నుండి వెడలిన సూత్రములచే బయటికి చతురస్రమును చేయవలయును. భుజ సూత్రాంగులములచే దత్తమగునది ఇష్టప్రభయనబడును. తూర్పు చశ్చిమములనాశ్రయించిన రేఖ సమమండలమనబడును. నక్షత్రమండలము కూడా విషువు వలె నుండునని చెప్పబడినది. తూర్పు పశ్చిమములలో నున్న రేఖకు విఫువువలె నక్షత్రాగ్ర భాగముగా సాధించవలయును. ఇష్టచ్ఛాయ విషువత్తుల మధ్యనున్నది అగ్రాయనబడును. శంకుచ్ఛాయా కృతిచే కూడిన దాని మూలము యవర్గనుండి కర్ణభాగమగును. శంకును పరిశుద్ధి చేసినపుడు మూలమని, శంకు విపర్యయము వలన ఛాయయని వ్యవహరించబడును. నక్షత్రచక్రము యుగమున ముప్పది భాగములుగా తూర్పభాగమున వ్రేలాడును. దానిని గుణించుట వలన నక్షత్రదినములతో విభజించుట వలన ఆకాశ భాగమున లభించు భాగము రెంటిలో మూటితో పదితో కొట్టివేయబడినపుడు ఆయనమేర్పడును. దానిని చక్కగా విభజించినపుడు కాంతి ఛాయలేర్పడును. ఇవియే శుక్లకృష్ణపక్షములు, త్రిఙ్యము శంకు ఛాయచే కొట్టబడినపుడు విషువత్ కర్కభాగము చేయబడినపుడ లంబాక్షజ్యా భాగములు వాటి ఛాయలగును. లంబాక్షములు ఎపుడూ దక్షిణమున నుండును. సాక్షాత్తు సూర్యినిచే కాని అపక్రమముగా కాని కలిసి యున్నది దిక్సామ్యమగును. లేనిచో భేదమేర్పడును. మిగిలినవి సూర్యాంశలు. ఇవియే భుజ జ్యా కోటి భాగముల వలన ఏర్పడునవి. శంకుమానమును అంగులములచే రెట్టింపు చేసి యథాక్రమముగా భుజములను త్రిజ్యమును సాధించవలయును. కోటి జ్యాభాగములచే విభజించగా లభించిన దానియందు బయటిదలమున ఛాయా కర్ణము ఏర్పడును. స్వాక్ష అర్కనత భాగములకు దిక్సమ్యము, ఇతరత్ర భేదమును గుర్తించవలయును. దిగ్భేతోపక్రమము శేషమగును. త్రిజ్యముచే కొట్టబడినది జ్యా భాగమగును. పరమోపక్రమమున జ్యా భాగమున పొందిన చాపమున సూర్యడు మేషాది రాశి గోచరుడగును. సంశుద్ధి చేసిన చక్రార్ధ భాగమువలన కర్కాది రాశి గోచరుడగును. నక్షత్రార్ధసంయుతి వలన తులాది గోచరుడగును. సంశుద్ధి చేయబడిన చక్రమువలన మృగాది నక్షత్రములలో మధ్యహ్న సూర్యుడు స్ఫుటముగా గోచరుడగును. ఆభాగము మందమైనను, చాలాసార్లు వామమైనను దివాకరుడు మధ్యమున నున్నడని ఫలము. ప్రాణహతులు గ్రహోదయమును తెలుపును. 1, 1, 8 సంఖ్యలచే కొట్టబడి గతిని తెలపును. చత్రాసువులు లబ్ధముతో కలిసి అహోరాత్రసువులు గా పేర్కొనబడును. మూడుమార్లు నక్షత్రాంశముచే ఆకాశంశముచే కర్ణభాగమున అర్ధభాగగుణములు అహోరాత్రార్ధభాగముచే విభజించబడును. విడిగా ఒకటి, రెండు, మూడు సంఖ్యలచే విభజించబడి వేరు వేరు చాపములుగా నుండును. స్వాధో೭ధః ప్రవిశేధ్యాత మేషాల్లింగోదయాసవః, స్వాగాష్టయో೭ర్ధా గోగైకాః శిరత్య్రైకం హిమాంసవః. 143 స్వదేశచరఖండోనా భవంతీ ష్టోదయాసవః, వ్యస్తా వ్యసై#్తర్యుతాసై#్తసై#్తః కర్కటాద్యాస్తతస్తు యః. 144 ఉత్క్రమేణ షడేవైతే భవన్తీష్టాస్తులాదయః, గతభోగ్యాసవః కార్యా సాయనా స్స్యేష్టభాస్కరాః. 145 స్వోదయాత్సుహతా భక్తా భక్తభోగ్యాస్స్వమానవతః, అభీష్టఘటికాసుబ్యో భోగ్యాసూన్ప్రవిశోధయేత్. 146 తద్వదేవేష్య లగ్నాసూన్ ఏవం వ్యాప్తాస్తథా క్రమాత్, శేషం త్రింశత్క్రమాద్వ్యస్తమశుద్ధేన విభాజితమ్. 147 భాగయుక్తం చ హీనం చ వ్యయనాంశం తనుః కుజే ప్రాక్పశ్చాన్నతనాడీభ్యస్తద్వల్లంకోదయాసుభిః. 148 భానౌ క్షయధనే కృత్వా మధ్యాల్లిగ్నం తదా భ##వేత్, భోగ్యాసూనూనకస్యాథ భక్తసూనధికస్య చ. 149 సపిండ్యాంతరలగ్నాసూనేవం స్యాత్కాలసాధనమ్, విరాహ్వర్కభుజాంశాశ్చేదింద్రాల్పాః స్యాద్గ్రహో విధోః. 150 తేషాం శివఘ్నాశ్శైలాప్తా వ్యావర్కాజశ్శరోంగులైః, అర్కం విధు విధుర్బూభా ఛాదయత్యథ ఛన్నకమ్. 151 ఛాద్య ఛాదకమానార్ధం శరోనం గ్రాహ్య వర్జితమ్, తత్స్వచ్ఛన్నం చ మానైక్యార్ధాంశషష్ఠం దశాహతమ్. 152 ఛన్నఘ్నమస్మాన్మూలంతు ఖాంగోనగ్లౌవపుర్హృతమ్. స్తిత్యర్ధం ఘటికాదిస్యాద్వ్యంగబాహ్వంశసంమితైః 153 ఇష్టైః ఫలైస్తదూనాఢ్యం వ్యగావూనే೭ర్కషడ్గుణః, తదన్యధాదికే తస్మిన్నేవం స్పష్టే సుఖాంత్యగే. 154 గ్రాసేన స్వాహతే ఛాద్యమానా మే స్యుర్విశోషకాః, పూర్ణాంతం మధ్యమత్రస్యాద్దర్శాంతేంజం త్రిభోనకమ్. 155 పృథక్తత్క్రాంత్యక్ష భాగసంస్కృతా స్యుర్నతాంశకాః తద్ద్విఘ్నాంశకృతిద్వ్యూనార్ధార్కాంశయుతా హరిః. 156 త్రిభానాంగార్కవిశ్లేషాంశోనఘ్నాః పురందరాః, హరాసప్తాలంబనం స్వర్ణ విత్రిభేర్కాధికోనకే. 157 విశ్వఘ్నలంబనకలాడ్యోనాస్తు తిథివహ్యగుః, శరోనో లంబనషడఘ్నె తల్లవాఢ్యోనవిత్రిభాత్. 158 నతాంశాస్తజాంసానేషు ప్రాధృతస్తద్వివర్జితః, శ##బ్దైర్లుర్లిపై#్త షడ్ఛిస్తు భక్తానతిర్నతాంశదిక్. 159 తయోర్నాట్యోహభిన్నైకదిక్శరస్ఫుటతాం వ్రజేత్, తతశ్చన్నస్థితిదలే సాధ్యే స్థిత్యర్ధషట్ల్రిభిః. 160 అంశైసై#్తర్విత్రిభిర్ద్విస్థం లంబనేతయో పూర్వవత్, సంస్కృతేస్తాభ్యాం స్థిత్యర్ధే అత్యంతం భవతస్థ్సుటే. 161 తాభ్యాం హీనయుతో ప్రధ్య దర్శః కాలౌ ముఖాంతగా, అర్కాద్యూనా విశ్వ ఈశా నవ పంచ దశాంశకాః. 162 కాలాంశాసై#్తరూనయుక్తే రవౌ హస్తోద¸° విధోః, దృష్ట్వా హ్యాదౌ ఖేటబింబం దుగౌచ్చ్యే లంబమీక్ష్య చ. 163 తలంబపాపబింబాంతర్దృగౌ వ్యాప్త రవిఘ్నభాః, అస్తే సావయవా జ్ఞేయా గతేష్యాస్తిధయో బుధైః. 164 వస్తే యుక్రాంతిభాగైశ్చ ద్విఘ్నా తిధ్యాహృతా స్ఫుటమ్, సంస్కారాదికలంబినం త్వంగులాద్యం ప్రజాయతే. 165 సేష్వాంశోనాః సితం తిథ్యో బలాన్నాశోన్నతం విధోః, శృంగమన్నత్ర ఉద్వాచ్యం బలనాంగులలేఖనాత్. 166 పంచత్వేగోంక విశిఖాశ్శేషకర్ణహృతాః పృథక్, వికృజ్యకాంగసిద్ధాగ్నిభక్తాల్లబ్ధోనసంయుతాః. 167 త్రిజ్యాధికోనే శ్రవణ వపూంషి స్యుర్హృతాః కుజాత్, రుజ్వోరనుజ్వోర్వివరం గత్యంతరవిభాజితమ్. 168 వక్రత్వే గతియోగా మం గమ్యే೭తీతే దినాదికమ్, ఖనత్యా సంస్కృతౌ వేఘాదక్సామ్యేన్యేంతరే యుతిః. 169 యామ్యోదకే ఖేట వివరం మానేక్యాద్దో೭ల్పకం యదా, యదా భేదో లంనాద్యం స్ఫుటార్ధం సూర్యపూర్వత్. 170 ఏకాయనగతౌ స్యాతాం సూర్యాచంద్రమసౌ యదా, తయుతే మండలే క్రాంత్యా తుల్యత్వే వైధృతాభేదః. 171 విపరీతాయనగతౌ చంద్రార్కౌ క్రాంతిలిప్తకాః, సమాస్తదా వ్యతీపాతో భగణార్ధే తపోయుతా. 172 భాస్కరేంద్వోర్భచక్రాంతచక్రార్ధావధిసంస్ధయోః, దృక్కల్పసాధితాంశాదియుక్త మోస్స్వావపక్రమౌ. 173 అధోజపదగమ్యేందోః క్రాంతిర్విక్షేపసంస్కృతా, యది స్యాదధికా భానోః క్రాంతేః పాతో గతస్తదా. 174 న్యూనాచేత్స్యాత్తదా భావీ వామం యుగ్మపదస్య చ, యదాన్యత్వం విధోః క్రాంతిః క్షేపాచ్చేద్యది శుద్ధ్యతి. 175 కాంత్యోర్జే త్రిజ్యయాభిస్తే పరమాయక్రమోద్ధతే, తచ్చాపాంతర్మర్ధవాయోర్జ్యాభావినశీతగౌ. 176 శోధ్యం చంద్రాద్గతే పాతే తత్సూర్యగతితాడితమ్, చంద్రభుక్త్యా హృత్ భానౌ లిప్తాదిశశివత్సలమ్. 177 తద్వచ్ఛశాంకపాతస్య ఫలం దేయం విపర్యయాత్, కర్మైతదసకృత్తావత్ క్రాంతీ యావత్సమే తయోః. 178 క్రాత్యోస్య మత్వే పాతో೭ధ ప్రక్షిప్తాంశోనితే విధౌ, హీనే೭ర్ధరాత్రికాఘాతో భావీతత్కాలికే೭ధికా. 179 స్థిరీకృతార్ధరాత్రర్ధౌ ద్వయోర్వివరలిప్తకాః, షష్ఠిశ్చాచంద్రభుక్తాప్తా పాతకాలస్యనాడికాః. 180 రవీంద్వోర్మానయోగార్ధం షష్ట్యా సంగుణ్య భాజయేత్, తయోర్భుక్త్యంతరేణాప్తం సిత్యర్ధం నాడికాదివత్. 181 పాతకాలస్థ్సుటో మాద్యస్సో೭పిస్ధిత్యర్ధవర్జితః, తస్య సంభవకాలస్స్యాత్తత్సంయోగోక్తసంజ్ఞకః. 182 ఆద్యంతకాలయోర్మధ్యే కాలో జ్ఞేయో೭తిదారుణః, ప్రజ్వలజ్జ్వలనాకారస్సర్వకర్మసు గర్హితః. 183 ఇత్యేతద్గణితే కించిత్ ప్రోక్తం సంక్షేపతో ద్విజ, జాతకం వచ్మి సమయాద్రాశిసంజ్ఞాపురస్సరమ్. 184 ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే జ్యోతిషవర్ణనం నామ చతుఃపంచాశత్తమో೭ద్యాయః మేషరాశి నుండి లంబోదయాసువులను క్రిందుగా శోధించి 8, 4, 2, 3 లతో విభజించి, 5, 3, 1 లుగా శేషము లంభించిన చంద్రలిప్తలని తెలియవలయను. తమ ప్రదేశభాగమున చరించుభాగమున కంటే తక్కువగా నున్నచో ఇష్టోదయాసువులగును.వ్యస్తములచే అవ్యస్తములచే కూడినవై కర్కటాదులగును. ఈ ఆరే ఉత్క్రమముగా తులాదులగును. స్వేష్టాంశలగు భాస్కరాంశలను భోగ్యాసువులను తీసివేయవలయును. తను తమ ఉదయమునుండి చక్కగా కొట్టివేయబడి విభజించబడి, భోగ్యములను విడిగా విభజించి తమ తమ మానముననుసరించి అభీష్టఘటికాసువులనుండి భోగ్యాసువులను శుద్ధిచేయవలయును. ఇట్లే ఏష్యలగ్నాసువులను కూడా శుద్ధిచేయవలయును. ఇట్లే క్రమముగా వ్యాప్తి చెందును. మిగిలిన దానిని 30 తో వ్యస్తమగుదానిని శుద్దిచేయబడని దానిచే విభజించి భాగయుక్తమును. భాగహీనమును వ్యయనాంశమును వేరుచేసి, కుజతనుక్రిగా గుర్తించవలయును. తూర్పుపశ్చిమములలో నినతనాడుల నుండి, అట్లే లంకోదయాసువులచే సూర్యునిలో క్షయ ధన భాగములనేర్పరిచినపుడు మధ్యలగ్నమేర్పడును. భోగ్యాసువులు తక్కువగానుండి, భుక్తసువులధికముగా నున్నచో అంతరలగ్నాసువులను చక్కగా శోధించి కాలమును సాధించవలయును. రాహువులేని సూర్యభుజాంశములున్నచో చంద్రగ్రహమున ఇంద్రాల్పములగును. వాటిని పదకొండుచే కొట్టివేసి ఏడును కలపి 5, 10 చే విభాగముచేసి అంశములను తెలియవలయును. సూర్యుని చంద్రుడు, చంద్రుని కుజుడు కప్పివేయును. ఛాద్య ఛాదక మానార్ధమునకు అయిదు తగ్గించి గ్రాహ్యవర్జితముగా దానిని స్వచ్ఛన్నమును చేసి మానైక్యార్దాంశములో ఆరవభాగమును అయిదలో కొట్టివేసి దానిని మూలముగా ఛన్నఘ్నమును స్వాంగోనముగా చంద్రతను హారమును నిలుపుటకు ఘటికదులుపయోగించును. ఇవి కూడా వ్యంగములైన భుజాంశసమ్మితములచే చేయబడును. ఇపుడు ఇష్టఫలములచే తక్కువగా నున్నదానిని సూర్యుని భాగములో ఆరుగుణములగును. ఒకవేళ ఎక్కువగా నున్నచో దానిలోనే భాగములేర్పరుచవలయును. ఇట్లు సుఖాంత్యభాగము స్పష్టమగును. గ్రాసముచే స్వాహతమైన దానిలో, ఛాద్యమానమానములో విశోషకములేర్పడును. ఇచ్చట పూర్ణాంతము మధ్యమమగును. దశాంతమున మూడు నక్షత్రములు తక్కువగా నుండును. విడిగా ఆయాక్రాంతి అక్షభాగములచే సంస్కరించినపుడు నతాంశములేర్పడును. విటిని రెంటితే కొట్టివేసినచో వచ్చిన అంశకృతులలో రెంటిని తగ్గించి సగము సూర్యాంశలతో కలిపి హారము చేయవలయును. మూడు నక్షత్రములతో తేలిన అంగాంశములనుండి సూర్యాంశలను విడదీసి వచ్చిన అంశలకంటే తక్కువ అంశలతో కొట్టివేసినచో ఇంద్రలిప్తలగును. తీసివేయగా పొందిన అంశలను ఆలంబనముగా చేసుకొని సూర్యాంశలకంటే అథికమా న్యూనమా చూచి విశ్వఘ్నలంబనకలల కంటే తక్కువగా నున్నచో తిథులగును అయిదు అంశలకంటే తక్కువగా ఉండి మొత్తము భాగమును ఆరుచే కొట్టివేసినచో ఆలవలలో తక్కువగా నున్నవి నక్షత్రాంశములగును. నతాంశములు వాటివలన కలిగిన అంశములు ప్రాధృతమగును. ప్రాధృతవర్జితమైనపుడు ఆరు చంద్రలిప్తలచే విభజించబడినవి నతాంశములు దిక్కును సూచించును. ఆ రెంటిలో భిన్నత్వమును చూచి ఒకదిక్కు స్ఫుటత్వమును పొందును. అపుడు కప్పివేసిన స్థితి పక్షమును సాధించదలిచినపుడు స్థిత్యర్ధముచే ఆరింటిచే మూడింటిచే అంశలను కనుగొని ఆయంశలచే జంటలుగా నున్న నక్షత్రాంశములు రెండింట ఉంచి వేరుచేయుట మొదటివలెనే అని తెలియవలయును. ఇట్లు సంస్కరించినచో వాటినుండి స్ధిత్యర్ధములు స్ఫుటమగును. వాటితో హీనమగునపుడు మధ్యదర్శము కాలములుగా ముఖాంతగములగును. సూర్యుని కంటే తక్కువగా నున్న విశ్వ ఈశాంశములు నవపంచదంశాంశకములే యగును. కాలాంశల కంటే తక్కిన అంశలతో సూర్యుడు కూడియున్నపుడు చంద్రుని అస్తోదయములగును. మొదట సూర్యబింబమును చూచి ఉచ్చవీక్షణమున లంబమును చూచి లంబ పాపబింబాంతర దృష్టులు సూర్యుని వ్యాపించు నక్షత్రములచే కొట్టబడినపుడు అస్తమయమునందు సావయవములు ఏష్యములేని తిథులు ఉండునని పండితులు తెలియవలయును. వ్యస్తముగా నున్నప్పుడు వ్యుత్క్రాంతి భాగములచే ద్విఘ్నతిథులతో ఆహృతములు స్ఫుటముగా తెలియవలయును. సంస్కారాది వలంబనము అంగులాద్యముగా కలుగును. అయిదంశలకన్నా తక్కువైనవై శుక్లపక్షము తిథులను తెలియవలయును. అట్లు కానిచో చంద్రునికి నాశోన్నతముగా గుర్తించవలయును. అంగులలేఖనమున శృంగమును వేరు ప్రదేశమున ఉన్నతముగా చూపవలయును. అయిదు అంశలున్నపుడు పదిహేను అంశలు శేషకర్ణహృతములను వేరుగా చూపవలయును. శ్రవణా నక్షత్రము త్రిజ్యము కంటే అధికము కాని న్యూనము కాని అయినపుడు కుజుని వలన తను భాగములు హరించబడును. ఋజు ఋజు భిన్నములు వివరమును గత్యంతరముచే విభాగము చేయబడి వక్ర ఋతువులు విషయమున గతియోగామమును గమ్యము అతీతమైనచో దినాదికమని తెలియవలయును. దక్షిణోత్తర ఖేట వివరము మానైక్యమున అల్పముగా నున్నచో, భేదలంబనము మొదటున్నపుడు స్పుటమును తెలియుటకు సూర్యుని విషయమున మొదట చేసినట్లే చేయవలయును. సూర్యచంద్రులు ఒకే అయనమున నున్నచో విషమముగా నున్నపుడు క్రాంతి మండలములని, సమముగా నున్నచో ధృతమని తెలియవలయును. సూర్యచంద్రులు విపరీతాయనమున నున్నచో క్రాంతిలిప్తలుగా తెలియవలయును. సూర్యచంద్రులు సములైనచో వ్యతీపాతమని, భగణార్ధమున తపోయుతులుగా తెలియవలయును. సూర్యచంద్రులు భచక్రాంతచక్రార్ధమున నున్నచో దృక్కల్పముచే సాధించబడిన అంశములతో కూడియున్నచో అపక్రమములని తెలియవలయును. చంద్రుడు ఉచ్చపదమున సూచించబడినపుడు క్రాంతి విక్షేప సంస్కృతమై సూర్యుని కంటే అధికముగా నున్నచో క్రాంతి పాతమగునని తెలియవలయును. న్యూనమైనచో వామభావిగా తెలియవలయును. చంద్రక్రాంతి విడిగా యుండి క్షేపముచే శుద్ధి పొందినచో క్రాంతి ఊర్జలు త్రిజ్యముతో భాగించబడి పరమాయక్రమోద్ధతములై చాప మధ్యభాగమున జ్యాభాగములో సూర్యచంద్రులున్నపుడు చంద్రునినుండి గతమగు పాతము సూర్యగతి తాడితమగుచో శోధించవలయును. సూర్యునిలో చంద్రభుక్తిచే లిప్తాదులు హృతమైనపుడ చంద్రుని వలెనే ఫలమును తెలియవలయును. ఇట్లే విపర్యయముగా చంద్రపాతఫలమును తెలియవలయును. ఇట్లు ఇద్దిరి క్రాంతులు సమముగా వచ్చువరకు ఇట్లు చాలామార్లు చేయుచుండవలయును. ఇట్లు రెండు క్రాతులు సమములైనపుడు చంద్రుడు ప్రక్షిప్తాంశకు తగ్గినపుడు పాతమునుతెలియవలయును. పాతములేనపుడు అర్ధరాత్రికాఘాతమగును. అధకమైనపుడు తాత్కాలికాఘాతమగును. అర్ధరాత్రార్ధములు స్థిరముగా చేసినపుడు సూర్యచంద్రుల వివరలిప్తలుగా తెలియవలయును. చంద్రుని భుక్తముకాని షష్టిపాతకాలనాడికలు. సూర్యచంద్రుల మానయోగము కొఱకు షష్టిచే గుణించి విభజించవలయును. ఇద్దరి భుక్త్యంతరముతో పొందిన అర్ధస్థితిని నాడికలవలె తెలియవలయును. మధ్యభాగము స్ఫుటమగు పాతకాలమగును. ఈ పాతకాలము స్థిత్యర్ధ వర్జితమైనపుడ పాతకాలసంభవకాలమగును. ఆ సంయోగము పైన చెప్పిన సంజ్ఞ కలదగును. ఈ అద్యంతకాలములు మధ్యకాలము అతిభయంకరమైన కాలమని తెలియుము. ఈ కాలము భగభగమండుచున్న అగ్నిహోత్రము వంటిది కావున అన్నికర్మలయందు ఈ కాలమును పరిత్యజించవలయును. ఇట్లు గణితభాగము కొంచెము సంక్షేపముగా చెప్పితిని. ఇక ఇపుడు రాశిసంజ్ఞాపూర్వకముగా జాతకభాగమును చెప్పెదను. ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున జ్యోతిషవర్ణనమను యాబది నాలుగవ అధ్యాయము సమాప్తము. ೭