Sri Naradapuranam-I
Chapters
Last Page
పంచపంచాశత్తమో೭ధ్యాయః = యాబదియైదవ అధ్యాయము జాతకనిరూపణమ్ సనందన ఉవాచ :- మూర్ధాస్యబాహుహృత్కోడాంతర్బస్తివ్యంజసో నఖః. జానుజంఘాంఘ్రియుగలం కాలాంగాని క్రియాదయః. 1 భౌమాస్పుజిబుధేందుశ్చ రవిసౌమ్యాసితాః కుజాః, గరు మందార్కిగురవో మేషాదీనామధీశ్వరా. 2 హరే విషమ ఖేర్కేంద్వోః సమభే శశిసూర్యయోఓః, ఆదిపంచనవాధీశా ద్రేష్కాణంశాః ప్రకీర్తితాః. 3 పంచేష్టాష్ఠాద్రి పంచాంశా కుజార్కీజ్యజ్ఞ శుక్రగాః, ఓజే విపర్యయాద్గుగ్మే త్రింశాంశేశాః సమీరితాః. 4 క్రియణతౌలికార్కాద్యా మేషాదిషు నవాంశకాః, స్వభాద్ధ్వాదశభాగేశాః షడర్గం రాశిపూర్వకమ్. 5 గోజాశ్చ కర్కయుగ్మేన రాత్య్రాఖ్యా పృష్ఠకోదయాః, శేషా దినాఖ్యాస్తుభయం తిమిః క్రూరస్సౌమ్యః పుమాన్. 6 పుమాన్ స్త్రీచ క్లీబశ్చరస్థిరద్విస్వభావకాః, మేషాద్యాః పూర్వతో దిక్థ్సాస్స్వస్వస్థాన చరాస్తథా. 7 అజో క్షైణాంగనా కీటఝుషజూకా ఇనాదితః, ఉచ్చాని ద్విత్రిమనుయుక్ తిధీషు భనవాంశ##కైః 8 తత్తత్సప్తమనీచాని ప్రాఙ్మధ్యాంత్యాసకాః క్రమాత్, వర్గోత్తమాశ్చణరాధేషు భావాద్ద్వాదశ మూర్తిమాన్. 9 సింహోక్షా విస్త్రశ్చ తౌలి కుంభా స్సూర్యాస్త్రికోణభమ్, చతురస్రం తూర్యమృత్యు త్రికోణం నవ పంచమమ్. 10 రిః ఫాష్టషట్కం త్రికభం కేంద్రం ప్రాక్తుర్య సప్తఖమ్, నృపాదః కీటపశవో బలాఢ్యాః కేంద్రగాః క్రమాత్. 11 కేంద్రాత్పరం ఫణఫరం ఆపోక్లిమమతః పరమ్, రక్తశ్శ్వేతశ్శకునిభః పాటలో ధూమ్రపాండురౌ. 12 చిత్రః కృష్ణః పీతపింగౌ బభ్రుస్స్వచ్ఛప్రభాక్రియాత్, సామ్యాశాఖ్యప్లవత్వం స్యాద్ద్వితీయే వశిరర్కభాత్. 13 కాలాత్మార్కో మనశ్చన్ద్రః కుజస్సత్వం వచో బుధః, జీవో జ్ఞానం సుఖం శుక్రః కామో దుఃఖం దనేశజః. 14 నృపౌ రవీన్దూ నేతాసృక్ కుమారోజ్ఞః కవీజ్యకౌ, సచివో సూర్యజః ప్రేష్యో మతో జ్యోతిర్విదాం వరైః. 15 తామ్రశుక్ల రక్త హరిత్ పీత చిత్రాసితా రవేః, వర్ణావ అవ్యహ హరీన్ద్రా శచీ కౌధిపా రవేః. 16 రవిశుక్రారరాహ్వర్కేన్దువిదీజ్యా దిగీశ్వరాః, క్షీణన్ద్వర్కార రవిజాః పాపా పాపయుతో బుధః. 17 క్లీబౌ బుధార్కీ శుక్రేన్దూ స్త్రి¸° శేషా నరా స్స్మృతాః శిఖి భూమి పయో వారి వాసినో భూసుతాదయః. 18 కవీజ్యౌ కుజసూర్యౌ చ వేదో జ్ఞో వర్ణపాః క్రమాత్, సౌరోంత్యజాధిపః ప్రోక్తో రాహుర్మేచ్ఛాధిపస్తథా. 19 చంద్రార్కజీవాజ్ఞసితాకుజార్కీసాత్త్వికాదికాః, దేవతేంద్వగ్నిఖైలాభూకోసఖాయో పరాధిపాః. 20 వస్త్రం స్థలం నవం వహ్ని కహతం మద్యదం తథా, స్ఫుటితం రవితస్తామ్రం తారం తామ్రపునిస్తథా. 21 మేమకాంస్యాయసీ త్య్రంశైశ్శిఖిరాద్యాః ప్రకీర్తితాః, సౌరశుక్రారచంద్రజ్ఞగురుఘాద్యత్సు చ క్రమాత్. 22 త్య్రాశత్రికోణతుర్యాష్టసప్తమాన్యేన వృద్ధితాః, సౌరే జ్వారాపరే పూర్ణే క్రమాత్పశ్యంతి నారద. 23 అయనక్షణఘస్రర్తుమాసార్ధశరదో రవేః, కటుతిక్తక్షారమిస్రమధురావ్లుకషాయకాః. 24 త్రికోణాత్సాంత్యధాధర్మా యుస్సుఖఖోద్యపస్సుహృత్, జీవో జీవాజ్ఞా సితజ్ఞౌ వ్యర్కా వ్యారాః క్రమాదమీ. 25 వీంద్వర్కా వికుజేంద్వర్కా సుహృదో೭న్యే రవేర్ధృతాః, మిధో ధన వ్యయాయత్త్రిబంధువ్యాపారగస్సుహృత్. 26 ధ్యేకానుభుక్తా మయాన్ జ్ఞాత్వా మిశ్రీదీత్సహజాన్మునే, మత్కాలో೭ధిసుహృన్మిత్ర పూర్వకాన్కల్పయేత్పునః. 27 స్వోచ్చత్రికోణగేహా ప్రనవాంశైస్థానజం బలమ్, దిక్షుసౌమ్యేజ్యయోస్సూర్యా రయోస్సౌరే సితాజ్ఞయోః. 28 ఖాదృతూ దగనేన్యే తు వక్త్రే చంద్రసమాగమే, ఉత్తరస్థా దీప్తకరాశ్చేష్టా వీర్యయుతా మతాః. 29 నీశీందుకుజసౌరాశ్చ సర్వదా క్షోహ్ని చాపరే, క్రూరాః కృష్ణే సితే సౌమ్యా మతం కాలబలం బుధైః. 30 సౌరరాజ్ఞేజ్యశుక్రేందుసూర్యాధిక్యం పరస్పరమ్. పాపాస్తు బలినస్సౌమ్యా వివక్షాః కంటకోపగే. 31 క్లీచేతదూశనాద్వాడిచంద్రార్కంశసమంజనుః, స్వాంశే పాపాః పరాంశస్ధాస్సౌమ్యా లగ్నం వియోనిజమ్. 32 నిర్చలం చ తదాదేశ్యం వియోనేర్జన్మపంజితైః, శీర్షం వక్త్రగలే పాదావంసౌ పృస్ఠమురస్తథా. 33 పార్శ్వే కుక్షీత్వపానాంఘ్రీ మేఢ్రముష్కౌ తథా స్ఫిజౌ, పుచ్ఛం చతుష్పదాంగేషు మేషాద్యా రాశయస్స్మృతాః. 34 లగ్నాంశాద్గ్రహయగ్దృష్ట్వా వర్ణన్బలయుతాద్వదేత్, దృక్సమానప్రమాణాంశ్చ ఇష్టే రేఖాం స్వరస్థితైః 35 ఖగత్య్రంశే బలాగ్నేగే చరమాంశే గ్రహాన్వితే, వాంశే స్థలాంబుజస్సౌరేర్ద్వీక్షాయోగభవా ద్విజాః. 36 విప్రలైస్తనుచంద్రేజ్యార్కైస్తరూణాం జనిం వదేత్, స్ధలాంబుఖేదేశకృతశ్చేతరేషాముదాహృతః. 37 స్ధలాంబు చ పతిః ఖేటో లగ్నాద్యావన్మితే గృహే, తావంత ఏవ తరవః స్ధలజా జలజాస్తథా. 38 అంతస్సారా రవౌ సౌరే దుర్భగాః క్షీరణో విధౌ, భౌమే కంటకినో వృక్షా ఈజ్యౌజ్ఞే సఫలాఫలౌ. 39 పుష్పితా భార్గవే స్ధిగ్ధాశ్చంద్రే೭థ కటుకాః కుజే, అసుభ##రే శుభః ఖేటః శుభం వృక్షం కుభూమిజమ్. 40 సనందన మహర్షి పలికెను:- శిరస్సు, ఆస్యము, బాహువులు, హృదయము, క్రోడము, నఖములు, జంఘలు, అంఘ్రియుగలము ఇవియన్నియు కాలపురుషుని అంగములు. క్రియాదులు కూడా కాలాంగములే. మేషాది రాశులను అధిపతులను తెలియుము. మేషవృశ్చికములకు కుజుడు అధిపతి. వృషభ తులలకు శుక్రుడు అధిపతి. మిధున కన్యా రాశులు బుధుడు అధిపతి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సింహరాశికి సూర్యుడధిపతి. ధనుర్మీనములకు బృహస్పతి అధిపతి. మరకకుంభ రాశులకు శని అధిపతి. హోరలో సూర్యచంద్రులు విషమ నక్షత్ర గతులైనపుడు, చంద్ర సూర్యులు సమ నక్షత్రగతులైనపుడు ఆది పంచనావాధీశులు ద్రేష్కాణాధిపతులని చెప్పబడినది. పంచ ఇష్ట అష్టాది పంచాశలు కుజ శని గురు బుధ శుక్రగతములని తెలియవలయును. ఓజో విషయమున విపర్యయము వలన, యుగ్మమున త్రింశాంశేశులుగా చెప్పబడిరి. మేషాదిరాశులలో తులాకర్కాటకాదులు నవాంశలుగా తెలియవలయును. తమతమ నక్షత్రము నుండి ద్వాదశ భాగేశులు రాశిపూర్వకముగా షడర్గమును తెలియవలయును. వృషభ##మేషములు కర్కాటక మిధునములతో రాత్రి అను పేరుతో పృష్ఠకోదయములు. మిగిలిన రాశులు దినముగా పేర్కొనబడినవి. ఉభయములు తిమి, క్రూర, సౌమ్య పుమాన్ అను పేర్లచే వ్యవహరించబడును. పురుషుడు, స్త్రీ, నపుంసకుడు చరము. స్ధిరము, ద్విస్వభావములు కలవిగా నుండును. మేషాది రాశులు తూర్పుదిక్కున నుండును. తమతమ స్థానములలో తిరుగుచుండును. సూర్యాదిగ్రహములకు మేషాదిరాశులు ఉచ్చరాశులు ఇట్లుచెప్పెదరు. రవికిమేషము, చంద్రునికి వృషభము, కుజునికి మకరము, బుధునకి కన్య, గురునికి కటకము, శుక్రునికి, మీనము, శనికి తుల ఇవి ఉచ్చరాశులు. ప్రతిగ్రహమునకు తన ఉచ్చరాశికి సప్తమ రాశి నీచరాశిగా తెలియవలయును. అనగా రవికి తుల, చంద్రునికి వృశ్చికము, కుజునికి కటకము, బుధునికి మీనము, గురునికి మకరము, శుక్రునికి కన్య , శనికి మేషము ఇవి నీచరాశులు. ఇవి క్రమముననుసరించి, ప్రాక్, మధ్య, అంత్యాశలు కలవగును. వర్గోత్తమములు భావమువలన ద్వాదశమూర్తులు గలిగియుండును. ఇట్లే రవికి సింహము, చంద్రునికి, వృషభము, కుజునికి మేషము, బుధునికి కన్య గురువునకు ధనుస్సు, శుక్రునుకి తుల, శనికి కుంభము ఇవి మూలత్రికోణములనబడును. రాశికి, మరియు రాశినుండి నాలుగవ, ఏడవ పదియవరాశులకు కేంద్రములని పేరు. రాశికి , రాశినుండి అయిదవ, తొమ్మిదవరాశులకును కోణములని పేరు . క్రేంద్ర కోణములందున్న గ్రహములు ప్రబలులుగా ఉండును. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పాటలవర్ణము, ధూమ్రవర్ణము, పాండురవర్ణము. చిత్రవర్ణము, కృష్ణవర్ణము, పసుపుపచ్చ, పింగళవర్ణము, బభ్రువర్ణము, స్వచ్ఛవర్ణము, గ్రహములకు ప్రభాక్రియవలన ఏర్పడును. సూర్యుడు కాలస్వరూపుడు, చంద్రుడు, మనస్సు, కుజుడు సత్త్వము, బుధుడు వాక్కు, గురువు జ్ఞానము, శుక్రుడు సుఖము, కామము, శని దుఃఖము స్వరూపముగా కలవారు. సూర్యచంద్రులు రాజులు, కుజుడు అధికారి, బుధుడు యువరాజు, గురు శుక్రులు మంత్రులు. శని అనుచరుడు అని జ్యోతిర్విదులు సిద్ధాంతము. సూర్యునికి ఆయారాశి సంచారము ననుసరించి తామ్ర, శుక్ల, రక్త, హరిత్, పీత, చిత్ర, కృష్ణవర్ణములు కలుగుచుండును. రవి శుక్ర కుజ, రాహు, శని చంద్ర బుధ గురువులు వరుసగా అష్టదిక్కులకు అధిపతులు. క్షీణచంద్రుడు, రవి, కుజుడు, శని ఈ నాలుగు పాప గ్రహములు. పాపగ్రహములతో కలసినపుడు బుధుడు పాపుడగును. బుధుడు శని నపుంసకులు, శుక్రుడు చంద్రుడు స్త్రీలు, మిగిలిన గ్రహములు పురుషులు అని తెలియవలయును. అగ్నిభూమి, నీరు, వాయువులలో భూసుతాది గ్రహములు నివసించును. గురుశుక్రులు బ్రాహ్మణులు, రవి చంద్ర గురులు సాత్త్వికులు. బుధ శుక్రులు రాజసులు. కుజశని రాహుకేతువులు తామసులు. రవికి అగ్ని, చంద్రునికి జలము, కుజునకు, కుమారస్వామి, బుధునకు విష్ణువు, గురునకు దేవేంద్రుడు, శుక్రునకు శచీదేవి, శనికి బ్రహ్మ, రాహుకేతువులకు శివుడు అధిదేవతలు. వస్త్రము స్ధలము కొత్తది వహ్నికహతము మద్యదము, స్ఫుటితము, రవికి తామ్రము , తారము, తామ్రపుని. బంగారము, ఇనుము, ఉక్కు ఈమూడు అంశలతో నుండును. శశిరాదులు గుణములు. అనగా రవికి రాగి, ముదుగు బట్ట, దేహపు ఎముకలు దేవతాస్ధానము పూజా సంబంధములుండును. చంద్రునకు రత్నములు, క్రొత్తబట్ట, దేహరక్తము జలసమీపము స్నానప్రదేశములు. ఇట్లే ఇతర గ్రహములకు తెలియవలయును. శని శుక్రుడు కుజుడు చంద్రుడు బుధుడు గురువు ఉదయించుచుండగా క్రమముగా కేంద్రకోణ, చతుర్ఘ అష్ట సప్తమ స్థానములను వృద్ధిచెందించును. శని గురువు కుజుడు పూర్ణులుగా నున్నపుడు క్రమముగా చూతురు. అయన, క్షణ, ఘస్ర ఋతు మాస, షాణ్మాసములు సూర్యునికి కటు, తిక్త, క్షార, మధుర, ఆవ్లు, కషాయ రసములుండును. త్రికోణ స్ధానము నుండి ధర్మాయువు మిత్రుడు. గురుడు, గురు బుధులు, శుక్ర బుధులు, సూర్య రహితులు, కుజరహితులు క్రమముగా చంద్రసూర్య రహితులు, కుజచంద్రార్కర రహితులు, ఇతరులు సూర్యునికి మిత్రులు. పరస్పరముగా ధన, వ్యయ, ఆయ త్రిబంధు వ్యాపార గతుడైనచో మిత్రుడగును. ఏకాను భుక్తములుగా తెలుసుకొని సహజులుగా తెలియవలయును. ఆయాకాలములననుసరించి అధిసుహృత్ మిత్ర పూర్వకములను మరల కల్పించుకొనవలయును. తనకు ఉచ్చరాశులందు, త్రికోణరాశులందుండు వారు నవాంశలతో స్ధానముల వలన బలము కలుగును. దిక్కులలో బుధ బృహస్పతులకు, సూర్యకుజులకు, శని విషయమున శుక్రచంద్రులకు ఆకాశమునుండి ఋతువులలో, ఇతరులు సమాగమములో, ఉత్తరమున నున్నవారు దీప్తకారులగుదురు. ఇష్టులైనపుడు వీర్యయుతులగుదురు. రాత్రిపూట చంద్రకుజశనులు ఎల్లపుడు శుభకరులు. ఇతర గ్రహములు పగలు శుభకరులు. వీరు కృష్ణపక్షమున క్రూరులు, శుక్లపక్షమున సౌమ్యులని కాలబలములు బుధులు చెప్పెదరు. శని కుజ బుధ గురు శుక్ర చంద్ర సూర్యులకు పరస్పరాధిక్యము గల వారగుదురు. ఎప్పుడు పాపులు బలయుతులు. సౌమ్యులు స్దానాధీనులుగా నుందురు. క్లీఋలవిషయమున శుక్రుని కంటే చంద్రసూర్యాంశ సమముగానుండును. స్వాంశమున నున్న గ్రహములు పాపులు, పారంశమున సౌమ్యులు వియోనిజమైనపుడు లగ్నభేదమేర్పడును. వియోని జన్మ దుర్బలమగును. శిరస్సు, వక్త్రము, కంఠము, పాదములు, భుజములు, పృష్ఠభాగము, వక్షస్ధ్సలము, పార్శ్వములు, కుక్షి అపానము. చరణములు, మేఢ్రము ముష్కములు (వృషణములు) పుచ్ఛములు, మొదలగు అవయవములందు మేషాది రాసులుండునని తెలియవలయును. లగ్నాంశము నుండి గ్రహయోగమును చూచి బలయుతముగా వర్ణములను చెప్పవలయును. దృక్సమాన ప్రమాణములను ఇష్టమున నున్న రేఖను గుర్తు చేసికొనవలయును. నక్షత్రముల రాశుల త్య్రంశము బలాగ్రముగానున్నపుడు చరమాంశము గ్రహాన్వితముగా నున్నపుడు అంశములో స్ధలమున చంద్రుడు శనికి ద్వీక్షయున్నపుడు యోగభవులు ద్విజులగుదురు. విడిగా ఉన్న చంద్ర గురు సూర్యులచే వృక్షముల జన్మను చెప్పవలయును. స్ధలవృక్షముల జలవృక్షముల భేదము గ్రహముల స్ధితిననుసరించి ఇతరములకు కూడా చెప్పవలయును. లగ్నమునుండి ఎంతమానము గల గృహమున సూర్యుడు అధిపతిగా ఉన్నపుడు అదేసంఖ్యచే స్ధలజలములు జలజములగు వృక్షములుండును. రవి రాశ్యధిపతిగా ఉన్నపుడు అంతస్సారము గల వృక్షములు, శని అధిపతిగా ఉన్నపుడు దుర్భగములగు వృక్షములు, చంద్రుడు అధిపతిగా యున్నపుడు క్షీరములు గల వృక్షములు, కుజుడు అధిపతిగా ఉన్నపుడు ముళ్ళచెట్లు, గురువు అధిపతిగా ఉన్నపుడు పుష్పితములగు వృక్షములు, చంద్రుడధిపతిగా యున్నపుడు దట్టమగు వృక్షములు, కుజుడు అధిపతిగా యున్నచో కటురసము గల వృక్షములు అశుభనక్షత్రములో శుభగ్రహము శుభకరుడగును. కుభూమిలో పుట్టిన వృక్షము కూడా శుభకరమగును. కుర్వాద్విలోమగో వాపి స్వాంశోక్తపరగైస్సమీమ్, కుజేందుహేతుకం స్త్రీణాం ప్రతిమాసమిహార్తవమ్. 41 నేష్టస్ధేజే೭న్యథాస్తే స్త్రీయుక్తా సన్నరేక్షితే, పాపయుక్తేక్షితే ద్యూనే రుషా ప్రీత్యా శుభగ్రహైః. 42 శుక్రర్కేందుజై స్వాంసస్ధైరీజ్యచాంగత్రికోణ, భ##వేదపత్యం విప్రేన్ద్ర పుంసాం సద్వీర్యశాలినామ్. 43 అస్రేర్కేందౌ కుజార్కీ చేత్పుంస్త్రియోరామయప్రదౌ, వ్యయఖగోయుతౌ చైక దృష్ట్వా మృత్యుప్రదౌ తయోః. 44 శుక్రార్కౌ మాతృపితరౌ దివా నక్తంశశీనజౌ, మాతృష్వసృపితృవ్యాఖ్యౌ వాపద్మేజిసమ్ శుభౌ. 45 పాపదృష్టే శుభే క్షీణ తుంగే వా లగ్నగే యమే, క్షీణందుకుజసందృష్టే మృత్యుమేత్య గతా ధ్రువమ్. 46 యుగపద్వా పృథక్సంస్ధౌ లగ్నేందూ పాపమధ్యగౌ, యదా తదా గర్భయుతా నారీ మృత్యుమవాప్నుయాత్. 47 లగ్నాచ్చంద్రాచ్చ తుర్యస్ధైః పాపైర్నిధనగే కుజే, నష్టేందౌ కుజరవ్యోశ్చ బంధురిష్ఫగయోర్మృతిః. 48 తన్వస్ధసంస్ధయోర్భౌమరవ్యోశ్శస్త్రభవః క్షయః యన్మాసాధిపతిర్నష్టస్తన్మాసం సంస్రవే త్యజేత్. 49 లగ్నేదుగైశ్శుభై ఖేటైస్త్రికోణార్ధాస్త భూఖగైః, పాపైస్త్రిషష్ఠలాభ##స్ధై సుఖీ గర్భో రవీక్షితః. 50 ఓజభౌ పురుషాంశే೭ర్కే జ్యేన్దులగ్నైర్బలాన్వితైః, గుర్వర్కౌ విషమస్ధౌ వా పుంజన్మ ప్రవదేత్తదా. 51 యుగ్మభాంశస్ధితైసై#్తస్తు వక్త్రేన్దుభృగుభిస్తథా, యామస్ధానగహతైర్వాచ్యం స్త్రియో జన్మమనీషిభిః. 52 ద్వంగస్ధా బుధసందృష్టా స్వపక్షేయమలంకరాః, లగ్నం వినౌజభావస్థస్సౌరః పుంజన్మకృత్తదా. 53 మిదో రమీన్దూ జ్ఞార్కీవా పశ్యిత స్సమగం రవిః, వక్రోవాంగ విధూ ఓజే జజ్జౌ యగ్మాజసంస్ధితౌ. 54 కుజేక్షితే పుమాంశే చ దుహితా క్లీబజన్మదా, సమే సితేన్దూ ఓజస్ధా జ్ఞారాంగేజ్యా నృవీక్షితౌ. 55 లగ్నేందు సమగౌ యుగ్మ స్ధానే వాయమలంకరాః, గ్రహోదయ స్ధాన్ద్వ్యంగాంశా న్పశ్యతి జ్ఞే స్వభాగగే. 56 త్రితయం జ్ఞాంశకాద్యుగ్మభమిశ్రైస్సమమాదిశేత్, లగ్నే చాపాంత్యభాగస్ధే తదంశస్ధబలిగ్రహైః. 57 వీర్యాఢ్యజ్ఞార్కిసద్దృష్టైః కోశస్ధావహవోగినః, సితారే జ్యార్కచంద్రార్కిజ్ఞాంగే శోర్కేందవో೭ధిపాః. 58 మాసానాం తత్సమం వాచ్యం గర్భస్ధస్య శుభాశుభమ్, త్రకోణ జ్ఞే పరైర్నష్టైర్ద్విముఖాహ్నికపాస్వితః. 59 ఆవాగావాటాపశుభైర్ఖసంధిస్ధైః ప్రజాయతే, వీరాన్సగీశ్చ దష్టేధ్వష్టార్కాతభసంహితాః. 60 అరార్కీ చేజ్యభాంశస్ధౌ సదంతో గర్ఖకస్తదా, స్వభౌజే భువి మందార దృష్టే కుబ్జస్తు గర్భగః. 61 పంగుర్మీనే యమేంద్వారైదష్టేధాంగేభసంధిగే , పాపైర్జడో విధేగర్భశ్శుభదృష్టివివర్జితే. 62 మృగాంత్యగే వామనకః సౌరేంద్వార్క నిరీక్షీతే, ధీనయోదపగైస్త్ర్యశై పాపాసై#్తరసిరో హ్రదాః. 63 వరీందుయుక్తే సింహేగే మాహేయార్కినిరీక్షితే, నేత్రహీనామిస్రఖేటైర్దృష్టె బుద్బుదలోచనాః 64 వ్యయజో వామనయనం దక్షం సూర్యో వినాశ##యేత్, నేష్టాయోగాశ్శుభైర్దృష్టాః పాపాస్స్యుర్నాత్ర సంశయః. 65 మందే೭స్తే మందఖాంశేగే నిషేకేబ్దత్రయే జనిః, ద్వాదశాబ్దే శశిన్యేవం సుతావపి విచింతయేత్. 66 ఆదానేందు ద్వాదశాంసా పాపస్తద్రాశిభిః పురః శశాంకే జన్మభాగాది ద్విఘ్నమిష్టకలాస్స్మృతాః. 67 పితుః పరోక్షే జన్మ స్యాత్ ఇందౌ లగ్నమపశ్యతి. 68 మధ్యాద్భ్రష్టే೭ర్కే విదేశ##స్ధే జననే నారిజన్మ వై, మందేంగస్ధే కుజేస్తే చ జ్ఞే స్ఫుజి మధ్యగే విధే. 69 పాపాంగేబ్జే త్రిభాగేలౌ స్వాయగైస్సద్భిరుద్గతః, సూర్యాస్త దృష్టిగో వాపి జ్ఞేయో జ్యోతిర్విదాంవరైః. 70 చతుష్పదరగే భానౌ శేషైర్చయుతైః ఖగైః, కోశాదతో తు యమలౌ జాయేతే మునిసత్తమ. 71 సార్క్యారసింహా జ్ఞాజాంగే భాంశతుల్యాంగనాలయ, లగ్నమిందుం చ సార్కేందుం న పశ్యతి యదా గురుః. 72 స పాపగో೭ర్కో జాయో వా పరవీర్యప్రసూతికృత్, పాపభస్ధౌ పాపఖేటైః సూర్యారౌనత్రికోణగౌ. 73 విదేశగః పితా వృద్ధః ఖేవారాశివశాత్యయే, పూర్ణ ఇందౌ స్వభేంశేజ్ఞే శుభే భువ్యంబుజేతనౌ.74 ద్యూనస్ధే వా విధేయతేంగనా నారీ ప్రసూయతే, అబ్ధాంగమన్ఖగః పూర్ణేజ్యో వా పశ్యతి నారద. 75 స్వబంధలగ్నగస్సూతిస్సలిలే నాత్ర సంశయః, పాపదృష్టే యమే గుద్యాం జన్మాంగాజవ్యయస్ధితే. 76 కర్కాతిలగ్నగే సౌరే వటే జన్మాబ్జలీక్షితే, మందే జన్మగతే లగ్నే బుధసూర్యేందువీక్షితే. 77 క్రీడాస్దానే దేవగేహేప్యూషరే చ క్రమాజ్జనిః, శ్మశానే ల్గనదృగసృగ్రామ్యస్ధానేబ్జభార్గవౌ. 78 అగ్నిహోత్రగృహే జీవ్యో೭ర్కో భూషాభరణో గృహే, శిల్పాలయే బుధో జన్మ కుర్యాద్భలసమన్వితః. 79 భాసమానే సరే మార్గే స్ధిరే స్వరాంశ##గే గృహే, త్రికోణగేజ ఆరార్క్యోరస్తే వా సృజ్యతేం೭బయా. 80 గురుదృష్టే తు దీర్ఘాయుః పరం చ ప్రాప్యతే పునః, పాపదృష్టే విధౌలగ్నే೭స్తే కుజే తు వినశ్యతి. 81 భ##వే మజార్క్యోస్సందృష్టే పరహస్తగతస్సుఖీ, పాపేద్యతాయుర్భవతి మాసస్సార్ధైః పరైరపి. 82 పితృమాతృగృహేజన్మ తదధీశబలాన్మునే, తరుగేహే శుభే నీచే నైకస్ధదృష్టో లగ్నేందుః. 83 ఏతల్లక్షణసంపన్నా ప్రసూతిర్విజే తదా, మందరాంశే విధౌ తుర్యే మందదృష్టే೭బ్జగే೭పి వా.84 మందార్చనే వా తమసి శయనం నీచగే భువి, శీర్షే పృష్ఠోదయే జన్మ తద్వదేవ నివిర్దిశేత్. 85 అట్లే అశుభగ్రమున్నపుడు ఉత్తమ భూమికూడా ఉత్తమవృక్షమునకు జన్మనీయజాలదు. స్త్రీలకు ప్రతిమాసమున జరుగు ఋతు ధర్మము కూడా కుజ చంద్ర గ్రహముల ప్రభావమువలననే జరుగును. చంద్రుడు స్త్రీరాశికి ఇష్టరాశిలో ఉండునపుడు, బృహస్పతిచే చూడబడినపుడు స్త్రీకి పురుషునిచే సంయోగము లభించును. సప్తమ భావమున పాపగ్రహయోగమున్నపుడు రోషపూర్వక పతి పత్నీసంయోగము. సప్తమభావమున శుభగ్రహమయోగమునపుడు ప్రీతిపూర్వక సంయోగమేర్పడును. సంయోగకాలమున శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు నవమాంశలో ఉండి, బృహస్పతి కేంద్రమున కాని, త్రికోణస్ధనమునవ కాని యున్నచో సంతానప్రాప్తి నిశ్చితము. ఇట్లు సంయోగకాలమున కుజుడు శని సూర్యుని నుండి సప్తమ స్ధానమున నున్నచో పురుషునికి . చంద్రునినుండి సప్తమస్ధానమున నున్నచో స్త్రీకి రోగము సంభవించును. ఇట్లే గ్రహములు సూర్యునినుండి పన్నెండవ స్ధానమున, రెండవస్దానమునకాని యున్నచో పురుషునికి, చంద్రుని కలిసియున్నచో స్త్రీకి మృత్యువు సంభవించును. పగలు గర్భాధానమైనచో శుక్రుడు సూర్యుడు మాతాపితృగ్రహములగును. రాత్రిపూట గర్భాదానమైనచో చంద్రుడు శని మాతృపితృగ్రహములగును. పితృగ్రహము విషమరాశిలో ఉండుట తండ్రికి శుభము. మాతృగ్రహము సమరాశిలో నుండుట తల్లికి శుభము. పన్నెండవ స్ధానమున పాపగ్రములున్నపుడు, శుభగ్రహములకు బదులు పాపగ్రహములచే చూడబడుచున్నపుడు, లేదా లగ్నమున శని యుండి క్షీణ చంద్రునితే కుజునిచే చూచబడుచున్నపుడు గర్భాధానము జరిగినచో స్త్రీకి మృత్యువు సంభవించును. లగ్నము నుండి కాని , చంద్రుడు నుండి కాని చతుర్ధస్ధానమున పాపగ్రహమలుండిన, కుజుడు అష్టమ భావమున నున్నచో, లేదా లగ్నము నుండి నాలుగవస్ధానమున కాని పన్నెండవస్ధానమున కాని కుజుడు శని యున్నచో గర్భముతో స్త్రీకి కాని, కేవలము స్త్రీకి కాని మృత్యువు సంభవించవచ్చును. లగ్నమున కుజుడు సప్తమమున సూర్యుడు ఉన్నచో గర్భవతికి శస్త్రము వలన మరణము సంభవించును. గర్భాధాన సమయమున ఆయా మాసాధిపచి అస్తగతుడైనచో అస్తగతుడగు అధిపతిగల మాసమున గర్భపాతము సంభవించవచ్చును. గర్భాధానసమయమున లగ్నమున చంద్రునితో శుభస్ధానములలో శుభగ్రహములు, అశుభస్ధానమున పాపగ్రహమలున్నపుడు గర్భము సురక్షితముగా నుండును. సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు, లగ్నము ఈ నాలుగు విషమ రాశులైనపుడు, నవమాంశ##లైనపుడు, లేదా సూర్యుడు బృహస్పతి విషమరాశి గతులైనపుడు పుత్రుడు కలుగునని చెప్పవచ్చును. ఇట్లే ఈ గ్రహములే సమరాశిలో నవమాంశలలో ఉన్నపుడు, లేదా కుజుడు, చంద్రుడు శుక్రుడు సమరాశిలో నున్నచో స్త్రీ శిశివు కలుగునని చెప్పవచ్చును. ఈ గ్రహములే ద్విస్వభావరాశులలో ఉన్నపుడు, ఈ గ్రహముల మీద బుధుని దృష్టి ఉన్నపుడు కవల పిల్లలు కలుగుదురు. లగ్నము నుండి విషమ స్దానమున నున్న శని ప్రభావము వలన పుత్రుడు కలుగును. విషమ సమములగు రాశులలో నున్న సూర్యచంద్రులు లేదా శని బుధులు ఒకరినొకరు చూచుకున్నపుడు, లేదా సమరాశిలో నున్న సూర్యుని విషమరాశిలోనున్న కుజుడు చూచినపుడు, చంద్రుడు సమరాశిలో కాని లగ్న విషమరాశిలో కాని ఉన్నప్పుడు మరియు అట్టి చంద్రుని మీద కుజుని దృష్టి ఉన్నపుడు, , లేదా లగ్నము, చంద్రుడు శుక్రుడు మూడు పురుషరాశి నవమాంశలో ఉన్నపుడు గర్భధానమైనచో నపుంసకుడు పుట్టును. శుక్రచంద్రులు సమరాశిలో ఉండి, బుధుడు, కుజుడు, లగ్నము, బృహస్పతి విషమరాశులలో ఉంటూ పురుష గ్రహముచే చూడబడునపుడు గర్భాధానము జరిగినచో కవల పిల్లలు పుట్టెదరు. లేదా లగ్నము చంద్రుడు సమరాశిలో ఉండుట, లేదా బుధుడు, కుజుడు, లగ్నము గురుసమరాశి అయిననూ కవల పిల్లలు పుట్టెదరు. బుధుడు నవమాంశలో ఉండి, ద్విస్వభావరాశులగు గృహమున లగ్నమున చూచినచో ఒకేసారి ముగ్గురు సంతానము కలుగు అవకాశమున్నది. ఆ ముగ్గురిలో ఒకడు లగ్నసదృశుడు, ఇద్దరు బుధసదృశులగుదురు. ధనురాశి అంతమాంశము లగ్నమైనచో, ఆ యంశలో బలవంతుడగు గ్రహమున్నచో , బలవంతుడగు బుధునిచే కాని శనిచే కాని చూడబడినపుడు ముగ్గురికంటే ఎక్కువమంది సంతానము కూడా ఒకేసారి కలుగవచ్చును. గర్భధాన సమయదశ, మాసముల దశలకు అధిపతులను జ్యోతిషశాస్త్రమున చూపిరి. వారు క్రమముగా శుక్రుడు, కుజుడు, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శని, బుధుడు, ఆధీన లగ్నేశులు సూర్యుడు చంద్రుడు. ఏ నెలలో ఎట్లు సబలనిర్బల గృహములుండునో ఆయానెలలో అట్లే శుభాశుభప్రభావము గర్భముపైన గర్భవతిపైన ఉండునని చెప్పవలయును. బుధుడు త్రికోణ స్దానముననుండి ఇతరగ్రహములు నిర్భలులైనచో శిశువునకు రెండుముఖములు, నాలుగుచేతులు, నాలుగు కాల్లు మొదలగు ఆకారములు లభించును. చంద్రుడు వృషభరాశిలో ఉండి ఇతరగ్రహములు నిర్బలులైనచో బాలకుడు వికారాకారము గలవాడగును. గ్రహములపై శుభ గ్రహదృష్టిఉన్నచో బాలకుడు చాలాదినములకు మాట్లాడగలుగును. కుజుడు శని బుధుని రాశి నవమాంశలో ఉన్నచో శిశువు పండ్లతో పుట్టును. చంద్రుడు కర్కటకరాశిలో ఉండి లగ్నగతులై శని కుజుల దృష్టి కూడా చంద్రుని పై ఉన్నపుడు శిశు గర్భములోనే కుబ్జుడగును (మూడు వంకరలుగలవాడు) లగ్నము మీనరాశి అయి శనిచంద్రుడుకుజుల దృష్టి ఉన్నచో బాలకుడు కాళ్లులేనివాడుగా (కుంటివాడుగా) పుట్టును. పాపగ్రహములు. చంద్రుడు రాశిసంధిలో ఉండి, సుభగ్రహ దృష్టి లేనిచో బాలకుడు జడుడు (బుద్ధిహీనుడు) అగును. లగ్నము మకరరాశ్యంతిమాంశములో ఉండి శని చంద్ర సూర్యుల దృష్టి ఉన్నచో శిశువు పొట్టివాడగును. పంచమ నవను లగ్నముల ద్రేష్కాణమున అశుభ గ్రహములున్నచో కాళ్లులేని వాడుగా, చేతులు లేనివాడుగా పుట్టును. సూర్యచంద్రులు సింహలగ్నమున నుండి శని కుజుల దృష్టి కలిగియున్నచో గుడ్డివాడుగా పుట్టును. శుభా శుభగ్రహముల దృష్టి ఉన్నచో నేత్రములలో బిందువులేర్పడును. లగ్నమునకు ద్వాదశ భావమున చంద్రుడున్నచో ఎడమకన్ను, సూర్యుడున్నచో కుడి కన్ను నశించును. ఇట్లు పైన చెప్పబడిన గ్రహప్రభావమువలన కలుగు అశుభ ఫలములు ఆగ్రహములపై శుభగ్రహముల దృష్టి కలిగినచో ప్రభావము తగ్గును. గర్భాధానము లగ్నము యొక్క నవమాంశ##మై ఆగ్రహము సప్తమ భావమున ఉన్నచో శిశువు మూడు సంవత్సరములు తరువాత పుట్టును. శనికాక చంద్రుడు ఈ స్థితిలో ఉన్నచో పన్నెండు సంవత్సరముల తరువాత శిశువు పుట్టును. గర్భాధాన సమయమున చంద్రుడున్న ద్వాదశాంశ సంఖ్యలో ముందున్న రాశిలోనికి చంద్రుడు వెళ్ళినపుడు శిశువు పుట్టును. ద్వాదశాంశ యుక్తములగు అంశలను రెండుచే హెచ్చించి అయిదుచే భాగించినచో రాశిమానము తెలియును. చంద్రుడు జన్మలగ్నమును చూడనిచో శిశువు తండ్రిపరోక్షమున పుట్టును. సూర్యుడు చరరాశిలో మధ్యభావము నుండి వెనుకకో ముందుకో అయినచో తండ్రి దేశాంతరమున నున్నపుడు శిశువు పుట్టును. లగ్నమున శని సప్తమ భావమున కుజుడు ఉన్నచో, లేదా బుధ శుక్రుల మధ్యన చంద్రుడున్నచో తంద్రి లేనపుడు శిశివు కలుగును. పాపరాశియుక్తలగ్నమున చంద్రుడున్నపుడు,-- లేదా వృశ్చికరాశి ద్రేష్కాణముననున్నప్పుడు సర్పము పుట్టును. సూర్యుడు చతుష్పదరాశిలో ఉండి, ఇతర గ్రహములు బలము కలిగియున్నపుడు ఒకేమావిలో కవలలు పుట్టేదరు. శని కుజులు సింహరాశిగతులైనపుడు, బుధుడు మేషరాశి నవమాంశలో ఉన్నపుడు, భాంశముతో సమానముగా కన్యాలగ్నము కూడియున్నచో గురువు లగ్నమును చంద్రుని, సూర్యునితో కలిసియున్న చంద్రుని చూడనిచో, సూర్యుడు పాపగ్రహములతో కలిసియున్నపుడు స్త్రీ భర్తవీర్యముచే కాక ఇతర పురుష వీర్యముతో శిశువును ప్రసవించును. పాపగ్రహములు పాపరాశులలో ఉండి సూర్యుడు కుజుడు త్రికోణ స్థానములలో లేనితో శిశువు తండ్రి విదేశములకు వెళ్ళియుండును. లేదా వృద్ధుడుగా నుండును. రాశి అంత్యాంశమున గ్రహమున్నను, సూర్ణచంద్రుడున్నపుడు బుధుడు స్వరాశి నవమాంశలో ఉన్నప్పుడు, కుజుడు శుభగ్రహవీక్షణము కలిగియుండి లగ్నమున చంద్రుడున్నపుడు, చంద్రుడు రెండోస్థానముననున్నపుడు స్త్రీ శిశువు కలుగును. స్త్రీ ప్రసవించును. పూర్ణచంద్రుని బృహస్పతి చూచునపుడు, స్వగృహము లగ్నమై అందులో చంద్రుడున్నపుడు నీటిలో స్త్రీ ప్రసవించును. అనగా నీటిలోనే శిశివు పుట్టునని భావము. శని పాపగ్రహములచే చూడకబడునపుడు మేషరాశి వన్నెండవరాశిగా ఉన్నపుడు, శని కర్కాటకల్నముననున్నపుడు చంద్రుని దృష్టి ఉన్నపుడు గోతిలో శిశివు పుట్టును. స్త్రీ ప్రసవము గోతిలో అగునని భావము. శని జన్మలగ్నములో ఉండి బుధ సూర్య చంద్రులచే చూడబడినచో , క్రీడాస్థానమున, దేవాలయమున, మరుభూమిలో వరుసననుసరించి శిశువు పుట్టును. అనగా జన్మలగ్నముననుండు శనిని బుధుడు చూచిన క్రీడాస్థానమున, సూర్యుడు చూచిన దేవాలయమున, చంద్రుడు చూచిన మరుభూమిలో పుట్టునని భావము. కుజుడు లగ్నమును చూచినచో స్మశానమున శిశివు పుట్టును. చంద్ర శుక్రులు కలిసున్నచో గ్రామ్యస్థానమున పుట్టును. బృహస్పతి సూర్యులు కలిసున్నతో అగ్నిహోత్రగృహమున పుట్టును. బుధుడు లగ్నమున నున్నచో బలవంతుడై శిల్పాలయమున శిశుజన్మను కలిగించును. స్థిరమగు గ్రహములు తమ తమ రాశి నవమాంశములలో నున్నపుడు గృహమున శిశువు పుట్టును. కుజుడు శని త్రికోణస్థానములందున్నపుడు, లేదా అస్తంగతులైనపుడు కూడా గృహమున శిశివు పుట్టును. శిశువునకు గురు దృష్టి యున్నచో దీర్ఘాయుష్మంతుడు, ఉత్తముడు అగును. చంద్రుని పాపగ్రహములు చూచునపుడు, లగ్నమున కుజుడు అస్తమించినచో శిశివు త్వరలో మృతి చెందును. శిశువు పుట్టినపుడు కుజ శనులచే చూడబడినచో తల్లిదండ్రులవద్ద కాక ఇతరుల వద్ద నుండి సుఖవంతుడగును. పాపగ్రహవీక్షణమున్నచో కొన్ని నెలలలో మృతి చెందును. ఆయా లగ్నాధిపతుల ప్రభావము వలన పితృ గృహమున, లేదా మాతృగృహమున స్త్రీ ప్రసవించును. శుభగ్రహము నీచ స్థానముననున్నపుడు, లగ్నమున నున్న చంద్రుడు ఒకోస్థానమును చూడనపుడు వృక్షము క్రింద శిశివు కలుగును. ఇట్లు లక్షణములున్నచో ఏకాంతమున ప్రసవించును. శని రాశి నవమాంశములో నున్నపుడు, చంద్రుడు నాలగోస్థానమున నుండి, చంద్రుడు శనిచే చూడబడినపుడు కొద్ది వెలుగున్న చీకటిలో, నీచ భూస్థానమున శిశువు పుట్టును. శీర్శోదయము, పృష్ఠోదయము గల పుట్టుకను కూడా గ్రహముల ప్రభావము వలననే చెప్పవలయును. చంద్రాస్తసుఖఃగ పాపైర్మాతుః పీడాం సమాదిశేత్, జీర్ణోద్ధృతం గృహం మందే సృజి దగ్ధం నవా విధౌ. 86 కాష్ఠాఢ్యమదృఢం సూర్యే బహుశిల్పయుతం బుధే, చిత్రయుక్తం నవం శుక్రే దృఢే రమ్యే గురౌ గృహమ్. 87 ఘటాజకర్క్యలి ఘటే పూర్వే జ్ఞేజ్యగృహే హ్యుదక్, వృషే పశ్చాన్మృగే సింహే దక్షిణ వసతిర్భవేత్. 88 గృహప్రాచ్యాదిగౌ ద్వౌ ద్వౌ ద్వ్యంగాః కోణ, యవజాదయః, పర్యంకే వాస్తువత్పాదాస్త్రిషదంకాంత్యరాశయః. 89 చంద్రాగాంతరగైః ఖేటైః సూతికాస్సముదాహృతాః, చక్రాద్ధి బహిరంతశ్చ దృశాదృశ్యో పరే೭న్యధా. 90 లగ్నాశయసమానాంగో బాలిఖేటసమో೭పి వా, చంద్రనందాంశవద్వర్ణశ్శీర్షాద్యంగవిభాగయుక్. 91 శీర్షకం దక్మ్రలే నాసా కపోలహానవో ముఖమ్, కంఠాంసపార్శ్వహృద్దోషః క్రోడం నాభిశ్చ బాస్తికః. 92 శిశ్నాపాతే చ వృషణౌ జఘనే జానునీ తథా, జంఘే పాదౌ, చోభయత్ర త్ర్యంశైస్సముదితైర్వదేత్. 93 పాపయుక్తే వ్రణస్తస్మిన్నంగే లక్ష్మ చ తద్యుతే, సర్వాంశే స్థిరయుక్తే తు నైజ ఆగంతుకో೭న్యధా. 94 మందే೭నిలాశ్మజో భౌమే విషశస్త్రాగ్నిజో బుధే, భుజే೭ర్కే కాష్ఠపశుజో జేతుశ్శృంగ్యజయోనిజః. 95 యస్మింన్సంజ్ఞాస్త్రయః ఖేటా అంగే స్యుస్తత్ర నిశ్చితమ్ , వ్రణ శుఖభకృతః పృష్ఠే తనౌ రాశిసమాశ్రితే. 96 తిలకృన్మసకృదష్టసౌమ్యైర్యుక్తశ్చ లక్ష్మవాన్, చతురస్రః పింగదృక్చ పైత్తికో ೭ల్పకచో రవిః 97 వృతో వాతకఫీ ప్రాజ్ఞో మందవాక్ శుభదృక్ శశీ క్రూరదృక్తరుణో భౌమః పైత్తికశ్చపలస్తథా. 98 త్రిధానుపకృతిర్హాస్య రుచిరజ్ఞిః శ్లిష్టవాక్తథా, పింగకే శ్లక్షణో దీర్ఘ కఫీ ధీమాన్గురుర్మతః. 99 సువపుర్లోచనః కృష్ణ వక్రకేశో భృగుస్సుఖీ, దీర్ఘః కపిల దృఙ్మందో నిలీ ఖరకచోలసః. 100 స్నాయ్వస్ధిరక్తత్వక్శుక్రవసామజ్జాస్తు ధాతవః, మందార్కచంద్రసౌమ్యా స్ఫుజిజ్జీవకుభువః క్రమాత్. 101 చంద్రాంగపాపైర్భాంత్యస్ధై స్సేందుపాపచతుష్టయైః చక్రపూర్వాపరే పాపసౌమ్యైః కీటతనౌ మృతిః. 102 ఉదయాస్తగతౌ పాపౌ చంద్రః క్రూరయుతైశ్శుభైః, నచేద్దృష్టస్తదా మృత్యుర్జాతదస్య భవతి ధ్రువమ్. 103 క్షీణబ్జే వ్యయగే పాపైర్లగ్నాష్టస్ధైశ్శుభా న చేత్, కేంద్రేషు వాబ్జో సంయుక్తస్స్మరాంత్య మృతిలగ్నగః. 104 కేంద్రాద్యా హస్తసన్ఖేటైరదృష్టో మృత్యుదస్తథా, షష్ఠమే೭బ్జే೭స దృష్టే సద్యో మృత్యుశ్శుభేక్షితే. 105 సమాష్టకే మిశ్రఖేటైర్దృష్టేర్దృష్టే మృతిశ్శిశోః, క్షీణబ్జేంగే రంధ్రకేంద్రే పాపే పాపాంతరస్థితే. 106 భూద్యూనవిధనే వాబ్జే లగ్నే೭ప్యేవం శిశోర్మృతిః, పాపైశ్చంద్రాస్తగైర్మాత్రా సార్ధం సందృష్టిమంతరా. 107 శుభాదృష్టే భాంత్యగేబ్జే త్రికోణోపరతైః ఖలైః, లగ్నేస్ధే వా విధౌ పాపైరస్తస్ధైర్మృతిమాప్నుయాత్. 108 గ్రస్తే೭బ్జే೭సద్భిరష్టస్ధై సృజ్యవాత్మజయోర్మృతిః, లగ్నే రవౌ తు శస్త్రీణ సవీర్యాసద్భరష్టగైః. 109 కర్కేంద్వీజ్యయుతే లగ్నే కేంద్రే సౌమ్యే చ భార్గవే, శంషైస్త్ర్యరీశ గౌరాయురమితం భవతి ధ్రువమ్. 110 వర్గోత్తమే మీనలగ్నే వృషే೭బ్జే తత్త్వలిప్సకే, స్వతుంగస్ధేష్వశేషేషు పరమాయుః ప్రకీర్తితమ్. 111 శుభైర్దృష్టస్సవీర్యోగే కేంద్రస్ధే చాయురర్ధదః, స్వచ్చోబ్జే స్వరగౌస్సౌమ్యై స వీర్యోగాధిపే తనౌ. 112 షష్ఠ్యబ్దకేంద్రసామ్యౌష్టశుద్ధే సప్తతిర్గురౌ, మూలత్రికోణగౌస్సౌమ్యైర్గురౌచ స్వోచ్చసైమన్వితే. 113 లగ్నాధిపే బలయుతే త్యశీత్యబ్దం త్వాయురీరితమ్, స వీర్యే సత్సు కేంద్రేషు త్రింశచ్ఛుద్ధియుతే೭ష్టమే. 114 లయేశే ధర్మగే జీవేష్టస్ధే క్రూరేక్షితే జితాః, లగ్నాషమేశావష్టస్ధౌ భాద్దమాయుః వరౌ మతౌ. 115 లగ్నే శుభే జ్యౌగ్లాదృష్టౌ మృత్యౌ కశ్చన చాకృతిః, ధర్మాంగస్ధై శనౌ శుక్రే కేంద్రే೭బ్జే వ్యయధర్మగే. 116 శతాబ్దం గీష్పతౌ కర్కే కటకస్ధసితేజ్యయోః, లయేంశేంగే శుబైర్హీనేష్టమే ఖాబ్ధిమితం వయః. 117 లగ్నేశే೭ష్టమగేష్టేశే తనుస్ధే పంచవత్సరమ్, కవీ తజ్యయోగే సౌమ్యాబ్జౌ లగ్నే మృత్యౌ చ స్వేషవః. 118 ఏతద్యోగజమాయుస్స్యాదథ స్పష్టముదీర్యతే, సూర్యాధికబలే పైండం నిసర్గాచ్చ విధోర్బలే. 119 అంశాయుస్సబలే లగ్నే తత్సాధనమధో శృణు, గో೭బ్జాస్తత్త్వతిధీ సూర్యాస్తిధిస్వర్గా నఖాః క్రమాత్. 120 నఖా విధుర్ద్వావంకాశ్చ ధృతిస్స్వాక్షిఖమార్గణాః. 121 పిండే నిసర్గే ఖోచ్చేనో గ్రహష్షట్ఖాల్పకో యదా, చక్రశుద్ధస్తదా గ్రాహ్యా స్యాంశా ఆయుషి సంమతాః. 122 అంశోనాశంవృభీ కార్యా గ్రహం వక్రగతిం వినా, మందశుక్రౌ వినార్ధోనా గ్రహస్యాస్తంగతస్య చ. 123 హానిద్వయే೭ధికాః కార్యా యదా క్రూరాస్తదా తనౌ, విహాయారీనంశాద్యైర్హన్యాదాయుర్లవాన్ భ##జేత్. 124 భగణాంశైర్లబ్ధిహీనాస్తేషాం కార్యా విచక్షణౖః, పాపస్యాంశాస్సమగ్రోన సౌమ్యస్యార్ధవివర్జితాః. 125 స్పష్టాస్తేంశాః ఖషట్త్య్రాసా గుణయిత్వా స్వకైర్గణౖః, వర్షాణి శేషమర్కఘ్నం హారాత్సంమాసకాస్స్మృతాః. 126 తచ్ఛేషశ్చ త్రిగుణితః తేనైవాప్తం దినాని చ, శేషే షష్ట్యా హతే భ##క్తే హారేణ ఘటికాదికమ్. 127 హిత్వా భాజ్యంగభాగాదీన్ ఖలీకృత్య ఖఖాక్షిభిః, భేద్వర్ణాషి శేషే తు గుణితే ద్వాదశాదిభిః. 128 ద్విసప్తాంశే చ మాసాది లగ్నాయుర్జాయతే స్ఫుటమ్, అంశాయుషీ స లగ్నానాం ఖేటానామంశకా హృతాః. 129 ఖయుగైరాయురంశాస్స్యుస్తత్సంస్కారం వదామి తే. చంద్రుడు అస్తగతుడై పాపులతో కూడియున్నచో తల్లికి పీడను కలిగించును. శనితో కలిసియున్నచో జీర్ణమైన గృహము ఉద్ధరించబడును. సూర్యునిచే కలిసియున్నచో కాష్టములతో సుందరగృహముండును. బుధుడున్నచో గృహము బహు శిల్పయుతమగును. శుక్రుడున్నచో చిత్రయుక్తముగా నూతన గృహముండును. గురువు విషయమున దృఢము రమ్యముగా గృహముండును. బుధుడు కుంభ మేష కర్కాటక రాశులలో ఉన్నచో గురువు గృహమున కలిసియున్నచో ఉత్తర దిక్కును చూచుచున్నపుడు, వృషభమునుండి మృగశిరమున నుండి, సింహమును చూచినపుడు దక్షిణ దిక్కున నివాసముండును. గృహమున ప్రాచ్యాది దిక్కులలో రెండు రెండు గ్రహముల మేలనముండి, ద్విస్వభావరాశులలో, కోణస్థానరాశులలో ఉన్నచో ఫలితము మారి యుండును. పర్యంకమున వాస్తువు వలె పాదములుండును. త్రిషదంకాంత్య రాశులున్నపుడు, చంద్రుని అంగారకుని మధ్యలో గ్రహములచే కలిసున్నప్పుడు సూలికములు చెప్పబడినవి. చక్రము నుండి బహిర్భాగమున అంతర్భాగమున దృశ్యాదృశ్యముగా నుండును. మరియొక విధముగా అయినచో ఇతరలుండును. లగ్నాశయ సమానాంగముబాలిఖీటము సమముగా నున్నను చంద్రనవాంశమువలె వర్ణము కలిగి శిరస్సు మొదలగు అవయవ విభాగములచే కూడియుండును. శిరస్సు, నాసిక, కపోలములు, దవడలు, ముఖము, కంఠము, భుజములు, పార్శ్వములు, హృదయము, బాహువులు, క్రోడము, నాభి, బాస్తికము, శిశ్నము, వృషణములు, పిరుదులు, మోకాళ్ళు, పిక్కలు, పాదములు, రెండుచోట్ల కలిపి చెప్పవలయును. ఆయా అవయవముల అధిపతి పాపగ్రహములచే కలిసి యున్నచో ఆయా అవయవములకు వ్రణములు కలుగును. లేదా మచ్చలు ఏర్పడును. తమతమ రాశ్యంశమున స్ధిరయుక్తమైనచో నైజమగును. లేనిచో ఆగంతకుడగును. శనియున్నచో వాయు పాషాణముల వలన భయము కలుగును. కుజుడున్నచో విషశస్త్రాగ్నులవలన భయము కలుగును. సూర్యడు కోణస్ధానమునందున్నచో కాష్ఠముల వలన పశువుల వలన భయము కలుగును. మేషరాశిలో పుట్టినవారికి శృంగములు కలవాటి వలన భయము కలగును. ఏరాశిలో మూడు గ్రహములుండును అతనికి పృష్ఠమున వ్రణము నిశ్చితము. రాశినాశ్రయించి యున్నచో శరీరమున వ్రణము కలుగును. సౌమ్యగ్రహములచే కూడియున్నచో మచ్చలు కలవాడగును. చతరస్రాకారముగా పింగళవర్ణములు కల నేత్రములు కలవాడు పిత్తస్వభావము కలవాడు కొద్ది జుట్టుకలవాడుగా సూర్యుడుండును. చంద్రుడు వృత్తాకారము కలవాడు వాత కఫ ప్రకృతి కలవాడు, ప్రాజ్ఞుడు, చిన్నగా మాట్లాడగలవాడు, శుభకరమైన నేత్రములు గలవాడు. కుజుడు క్రూరదృష్టి కలవాడు, యువకుడు, పిత్తప్రకృతి కలవాడు చపల స్వభావము కలవాడు. బుధుడు మూడు విధముల స్వభావముకలవడు, హాస్య రుచి కలవాడు, శ్లిష్ట వాక్కు గలవాడు. గురువు పింగళ##కేశములు కలవాడు, శ్లక్షస్వభావము కలవాడు, పొడగరి, కఫ స్వభావము కలవాడు బుద్ధిమంతుడు. శుక్రాచార్యులు చక్కని శరీరము కలవాడు, చక్కని నేత్రములు కలవాడు, నల్లని ఉంగరాల జుట్టు కలవాడు సుఖము కలవాడు. శని పొడగరి, కపిల నేత్రములు కలవాడు, తక్కువ పొడుగు కఠినమైన జుట్టుకలవాడు, సోమరి. స్నాయువు, అస్తి, రక్తము, చర్మము, శుక్రము, వస మజ్జ అను ఏడు ధాతువులు శరీరమున ఉండును. ఈ ఏడు ధాతువులకు వరుసగా శని, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు అధిపతులు. రాశి అంత్యాంశలో చంద్రాంగ పాపులున్నపుడు, చంద్రునితోకలిసి నాలుగు పాపగ్రహములున్నపుడు, చక్రములోని పూర్వాపరములిందు పాపులు సౌమ్యులు కలిసియున్నపుడు లగ్నమున కీటమున్నపుడు మృతి తథ్యము. పాపగ్రహములు ఉదయీస్తగతులై క్రూరగ్రహములచే కలిసియున్న చంద్రుడు శుభగ్రహములచే చూడబడనిచో ఆ సమయమున పుట్టిన శిశువు నిశ్చయముగా వెంటనే మరణించును. క్షీణ చంద్రుడు పన్నెండవ స్థానమున నుండి పాపగ్రహములు లగ్నమునకు అష్టమస్ధానముననుండి, శుభగ్రహములు లేనిచో, కేంద్రస్ధానములందు గ్రహములతో కలిసి చంద్రుడున్నచో మృత్యువులగ్నమని తెలియుము. కేంద్రాది స్ధానములందు గ్రహముల వీక్షనము లేపుడు మృత్యువు కలుగును. షష్ఠస్ధానమున చంద్రుడు పాపగ్రహములచే చూడబడక శుభగ్రహములచే చూడబడునపుడు వెంటనే మృత్యువు కలుగును. సమాష్టకమున మిశ్రగ్రహములచే చూడబడినపుడు శిశువు మరణించును. క్షీణ చంద్రుడు అంశమున నున్నపుడు, రంధ్రకేంద్ర స్ధానములలో పాపులున్ననూ, పాపుల మధ్యలో నున్ననూ భూద్యూన నిదన స్ధానములలో చంద్రుడున్నపుడు, లగ్నమున నున్నపుడు కూడా శిశువు మృతి చెందును. చంద్రుడస్తగతుడైనపుడు పాపగ్రహములచే చూడబడినపుడు, శుభగ్రహములచే చూడబడనపుడు, రాశి అంత్యాంశమున చంద్రుడున్నపుడు త్రికోణస్ధానమున దుష్టగ్రహములు లేనిచో, లగ్నమున చంద్రుడున్నప్పుడు కూడా, పాపగ్రహములు అస్తమొందినపుడు శిశువు మృతి చెందును. చంద్రుడు గ్రసించబడినపుడు అష్టమస్ధానమున దుష్టగ్రహములున్నచో తండ్రికొడుకుల మృతి సంభవించును. లగ్నమున సూర్యుడుండి, బలవంతులగు దుష్టగ్రహములు అష్టమస్ధానమునున్నచో శస్త్రముచే మృతి సంభవించును. కర్కాటకరాశిలో బృహస్పతితో చంద్రుడు కలిసున్నచో, లగ్నమున కేంద్రమున బుధుడు శుక్రుడున్నపుడు, మిగిలిన గ్రహములు మూడవస్ధానమున, శత్రుస్ధానమున నున్నచో దీర్ఘాయువు లభించును. వర్గోత్తమము మీనలగ్నమైనచో, చంద్రుడు వృషభరాశిలో ఉన్నపుడు అన్నిగ్రహములు ఉచ్చస్ధానములలో నుండగా దీర్ఘాయువు నిశ్చయము. బలవంతుడగు గ్రహము శుభగ్రహములచే చూడబడినపుడు, కేంద్రమున నుండగా ఆయువును అర్ధమును ఇచ్చును. చంద్రుడు స్వోచ్చస్ధానమున నుండి శుభరాశులలో సౌమ్యగ్రహములు బలవంతులై, బలవద్గ్రహము లగ్నమున నుండగా కేంద్రస్ధానమున సౌమ్యులుండగా అరవై సంవత్సరములు ఆయుష్యముండును. అష్టమశుద్ధి కలిగి గురువు అనుకూలముగా నుండగా డెబ్బది సంవత్సరముల ఆయుష్యము మూలత్రికోణస్ధానములలో సౌమ్యగ్రహములుండి గురువు స్వోచ్చరాశిలో ఉండగా లగ్నాధిపుడు బలయుతుడైనచో యెనుబదివత్సరములు ఆయువు నిశ్చితము. కేంద్రమున బలయుతులైన గ్రహములుండి, కేంద్రమున శుభగ్రహములుండి అష్టమ శుద్ధియుండి, లయేశుడు ధర్మస్ధానమున నుండి, బృహస్పతి అష్టమస్ధానముననున్నచో, క్రూరగ్రహదృష్టిపడినచో జితులగుదురు. లగ్నాధిపతి అష్టామాధిపతి అష్టమ స్ధానమున నున్నపుడు ఆయుః కారకులగుదురు. లగ్నమున అశుభగ్రహము గురువు ఉన్నపుడు చంద్రుని దృష్టి యున్నపుడు మృత్యువునకు ఒక ఆకాశము ఏర్పడును. శని ధర్మాంగ స్ధుడైనపుడు, శుక్రుడు కేంద్రమునుండి చంద్రుడు పన్నెండవ స్ధానమున నున్నచో నూరుసంవత్సరము ఆయుష్యముండును. బృహస్పతి కర్కటకరాశిలో ఉన్నపుడు, కర్కటకమున శుకరబృహస్పతులున్నపుడు లయేశుడంగముననున్నపుడు, అష్టమమున శుభగ్రహములు లేనిచో దీర్ఘాయువు నిశ్చితము. లగ్నాధిపతి అష్టమస్ధానమున, అష్టమాధిపతి లగ్నమున నున్నచో అయిదుసంవత్సరములు ఆయుష్యము. శుక్రబృహస్పతి యోగమున, బుధ చంద్రులు లగ్నమున ఉన్నచో మృత్యువు నిశ్చితము. ఇది గ్రహయోగము వలన తెలియు ఆయుష్యము. ఇపుడు స్పష్టముగా చెప్పెదను వినుము. సూర్యాధిక బలమున్నచో పిండము ఆరోగ్యబలములు కలిగియుండును. చంద్రబలమున్నచో సహజముగా నుండును. లగ్నము బలయుతమైనచో అంశాయువు నిశ్చితము. ఆ అంసాయువును తెలియు విధానమును చెప్పెదను వినుము. గోబ్జములు తత్త్వతిధులు, సూర్యుడు, తిధి స్వర్గములు నఖములు క్రమముగా చేర్చబడవలయును. నఖములు, విధువు, రెండంకములు, ధృతి స్వాక్షిమార్గణములు చూడబడవలయును. పిండమునిసర్గముగా ఉన్నపుడు స్వోచ్చస్ధానమున ఏ గ్రహములేనపుడు ఆరవ స్ధానమున క్షీణబలయుతుడగు గ్రహమున్నపుడు చక్రశుద్ధిని స్వీకరించవలయును. చక్రశుద్ధి అంశములే ఆయుష్యమును తెలుపు ప్రమాణములు. అంశోనములు శత్రురాశిలో చేర్చబడి, వక్రగతిలేని గ్రహమును చూడవలయును. శని శుక్రులు అర్ధోనులు కాక అస్తంగత గ్రహమునకు హాని ద్వయమున్నచో అధికాంశలను కూర్చవలుయును. లగ్నమున క్రూరగ్రహములున్నపుడు శత్రువులను వదిలి, అంశాదులతో కొట్టివేసి ఆయువు భాగములను చూడవలయును. భగణాంశములతో హీనలబ్ధిని చూచి వాటిని విచక్షణతో పరిశీలించవలయును. పాపగ్రహాంశలను సమగ్రముగా తక్కువగా చేసి బుధగ్రహాంశలను సగము వదిలి ఆ అంశలను స్పష్టములుగా 1, 6, 3 సంఖ్యలచే భాగించి, తమ గణములతో గుణించి శేషమును సంవత్సరములుగా, పన్నెండుతో కొట్టి వేయగా వచ్చినవి నెలలుగా తెలియవలయును. అట్లు చేయగా మిగిలిన దానిని మూడురెట్లు చేసినపుడు వచ్చిన దానిని దినములుగా తెలియవలయును. శేషమును అరవైచే భాగించగా వచ్చినవి ఘటికాదులుగా తెలియువలయును. భాజ్యాంగ భాగములను విడిచి 1, 1, 2 తో గుణించగా వచ్చిన వివర్షములని, మిగిలిన దానిని ద్వాదశాదులచే గుణించగా ద్విసప్తాంశ మాసాదులుగా లగ్నాయువు స్ఫుటముగా తెలియును. లగ్నముల అంశలు ఆయుష్యము లగ్నాంశములచే గ్రహాంశలచే తెలియవలయును. ఖ యుగములచే ఆయురంశలు తెలియును. ఇపుడు నీకు ఆ సంస్కారమును గూర్చి తెలిపెదను. గ్రహో న లగ్నం షడ్రాత్యంచేత్సంస్కారో೭న్యథా న హి. 130 తదంశస్స్వాగ్రయో భక్తా లబ్ధోనో భూర్గుణో భ##వేత్, యదైకాల్యం తదాస్యాంశాస్స్వాగ్ర్యాప్తోనా చ భూర్గుణః. 131 సౌమ్యస్యార్ధేన పాపస్య సమగ్రేణతి నిశ్చయః, గుణకఘ్నాశ్చాయురంశాస్సంస్కారో೭యముదాహృతః. 132 ఆయురంశకలా భక్తాద్వింశత్యబ్దా ఇనాహతమ్, శేషం ద్విశతభక్తం స్యుర్మాసాశ్శేషా దినాదికమ్. 133 లగ్నాయురంశాస్త్రిగుణాదిగ్భక్తాస్స్యుస్సమాసతః, శేషేర్కాదిగుణ భ##క్తే దిగ్భర్మాసాదికం భ##వేత్. 134 సబలేంగే భతుల్యాబ్దై యుతమాయుర్భవేత్స్ఫుటమ్, అంశద్విఘ్నమక్షాంశం మాసాః ఖత్ర్యాది సంగుణాత్. 135 శేషా దినాదికం యోజ్యం నైతత్పిండనిసర్గయోః, లగ్నార్కచంద్రమధ్యే తు యో బలీ తద్దశా పురా. 136 తతః కేంద్రాదిగానాం తు ద్విత్ర్యాదౌ స బలస్య చ, బహ్వాయుర్యో వీర్యసామ్యేర్కాద్యుతస్య ప్రాద్యాచకః. 137 షడ్వర్గార్ధస్య త్రింశస్య త్రికోణగశ్చ స్మరగః, సప్తమాసస్య తూర్యస్య చతురస్రగతస్య చ. 138 క్రమః కేంద్రాదికో೭త్రాపి ద్విత్ర్యాదౌ స్వబలస్య చ, పాకపస్యాబ్దినాగాశ్చ హ్యర్ణవా సహగస్య చ. 139 త్రికోణస్ధస్య చాష్టాక్షిసూర్యాద్యూనగతస్య చ, తుర్యాష్టగస్య తు స్వర్గా గుణకాః పరికీర్తితాః. 140 దశాగుణౖర్హతా భక్త్యా గుణౖక్యేన సమాగతాః, శేషే೭ర్కాదిహతే భ##క్తే మాసాద్యైక్యైన నారద. 141 అంతర్దశాసు విదశాస్తాసు చోపదశాస్తథా, దశేంశ మిత్రస్వోచ్చక్షం గో೭బ్జో೭బ్ధ్యేకాదివృద్ధిగః. 142 శుభగో యద్భగస్తస్స్వాదిస్ధేన చ తద్ధికృత్, ప్రోక్తేతరస్ధానగతతత్తద్భావక్షయం కరః. 143 ఖగస్య యద్భవేద్ద్రవ్యం భావభేక్షణయోగజమ్, జీవికాదిఫలం సర్వం దశాయాం తస్య యోజయేత్. 144 విశన్యాపదశాయాం యో వైరిదృష్టో విపత్తికృత్, శుభమిత్రేక్షితశ్చేష్ట సద్వర్గస్ధశ్చ యో గ్రహః. 145 తత్కాలే బలవానాపన్నాశకృత్సముదాహృతః, యస్యాష్టవర్గజం చాపి ఫలం పూర్ణశుభం భ##వేత్. 146 యశ్చ మూర్తితనుగ్లావో వృద్ధిగస్వోచ్చసంస్థితః, స్వత్రికోణ సుహృద్ఖభస్ధస్తస్య మధ్యమసత్ఫలమ్. 147 శ్రేష్ఠం శుభతరం వాచ్యం విపరీతగతస్య తు, నేష్టముత్కటమిష్టం తు స్వల్పం జ్ఞాత్వా బలం వదేత్. 148 చరే సన్మధ్యదుష్టాఖ్యామంగభంగే విపర్యయాత్, స్ధిరే నేష్టేష్టమధ్యా చ హోరాయాస్త్ర్యంశ##కైః ఫలమ్. 149 స్వామీజ్యజ్ఞయుతా హోరా దృష్టా వా సత్ఫలావహా, వినాశదృష్ణయుక్తా చ పాపాంతరగతాన్యథా. 150 ప్రాగ్ధ్వాంక్షా బంధుమృత్యాయ తయోర్ద్యూనే రవిస్స్వభాత్, వక్రాత్స్వాదివశాచ్చార్కే శుక్రాద్యానాం తు షడ్రతః. 151 ధర్మధ్యాయారగో జీవాదికత్ర్యారిగో విధోః, పృధ్యంత్యధీతపాః సుజ్ఞా తతో వృద్ధ్యంత్యబంధురాః. 152 వృద్ధిగోంగాత్సధనధీ తపస్పస్వారాచ్ఛశీ శుభః, సద్వృద్ధ్యస్తాదిషు పృథా త్ససాష్టౌ పంచయోపగః. 153 షట్త్య్రాయ ధీస్ధో మందాచ్చ జ్ఞాద్ద్విత్త్య్రాయాంష్టకేంద్రగః, కేంద్రాష్టాయాంత్య ఇ జ్ఞాద్వా జ్ఞిజ్యాయాస్తత్రస్వేః కవేః. 154 వృద్ధావినాత్సాదిధియా మంగామాయారి గోధోః, కేంద్రాష్టపార్ధగస్స్వరాన్మందాద్మాష్టాయ కేంద్రగః. 155 షట్ త్రిధీభవతస్సౌమ్యాత్షడ్వాంశాష్టగో భృగోః, కర్మాయ వ్యయషష్ఠస్ధో జీవాద్భౌమశ్శుభస్స్మృతః. 156 కవేర్ధ్యాషష్ఠమోధ్యాయే సన్ జ్ఞోమందాన్సధీత్రయే, సాక్షాస్తే భూమిజాజ్జీవా ద్వ్యయారిభవమృత్యుగః. 157 ధర్మాయారిసతాంత్యేర్కా సాద్యత్రిస్వగతా స్వభాత్, షట్లాయాష్టాబ్ధిఖేష్విజ్యాత్సహాద్యేషు విలగ్నతః. 158 దిక్వాష్టాద్యస్తబంధ్యాయే కుజాత్ఖాత్సత్రిగే గురుః, సాత్ర్యంకే సన్రవేశ్శుక్రాద్ధీఖగో దిగ్ధవారిగః. 159 చంద్రాద్వీశార్ధ గోస్తేషు మందాద్ధీ త్రిషడంత్యగః, గో೭భిధీషట్ ఖ ఖాద్యాయే జ్ఞాత్సద్యూనే విలగ్నతః. 160 ఆశుతేశాష్టగోష్వంగః త్సాంతేష్వబ్జాత్సితశ్శుభం, స్వాత్సజ్ఞేషు త్రిధీగోబ్ధి దిక్చిద్రాసి గతారో೭ర్క జాత్. 161 రంధ్రాయ వ్యయగస్సూర్యాదోష్ట ధీఖే సగోర్గురో, జ్ఞాబ్ధిత్ర్యాయారి గోరాత్రి షట్‌ధ్యధ్యాంత్యగోషు చ. 162 త్రిధీశారిషు మందఖాత్ సాక్షాంత్యేషు శుభో సృజః, కేంద్రాయాష్ట ధనేష్వర్కా లగ్నాద్వృద్ధ్యాద్య బంధుషు. 163 గోధ్వష్టా పరిఖాంత్యేజ్ఞాచ్చంద్రాల్లాభత్రిషద్భతః, షడష్టాంత్యగతశ్శుక్రాద్గురోద్వీంశాంత్య శత్రుషు. 164 ఉక్తస్ధానేషు రేఖాదో హ్యనుక్తేషు తు బిందుదాః, జన్మ చాద్వద్వి మిత్రోచ్చ స్వభౌ ధిష్టం పరేష్వసత్. 165 కష్టమర్ధక్షయః క్లోశః సమతార్ధసుఖాగమః, ధనాస్తిస్సుఖమిష్టాప్తిరితిరేఖాఫలం క్రమాత్. 166 పితృమాతృద్విషన్మిత్రభాతృస్త్రీభృతకాద్రవే, స్వామిలగ్నాజయో స్స్వస్ధాద్భేంద్వర్క స్వయశోశయాత్. 167 తృణస్వర్ణాశ్వధోరణాద్యైరర్కాంశే వృత్తిమాదిశేత్, కృష్యంబుజస్త్రీబ్యో೭బ్జాంశేకాజే ధాత్వస్త్రసాహసైః. 168 కావ్యశిల్పాదిభిర్బోధే జైవే దేవద్విజాకరైః, శౌక్రే రజతగోరత్నైమాందే హింసాశ్రమాధమైః. 169 స్వాచ్చేష్వార్కీ తథా జ్యారైరుక్తైకాంగే నృపాధిపాః, లగ్నే వర్గోత్తమే ೭బ్జేవా చతురాదిగ్రహేక్షితే. 170 ద్వావింశభూపాస్తుంగేసృక్ చాపేర్కేందు యమస్తనౌ, భూకృత్తుంగగో೭ర్కేగేస్తే సాఆర్కోఖభే గురౌ. 171 యమేందుతుంగగౌ లగ్నౌ షష్టేర్కజ్ఞౌ తులా జగౌ, సితాసృజో గురౌ కర్కో సారాజే లగ్నగే నృపాః. 172 వృషేగేబ్జేర్కేజ్యసౌరైః సుహుజ్జాయాఖగైర్నృపః, మందే మృగాంగే త్ర్యర్యకాంశ##స్ధైరజాదిభిర్నృప. 173 సేజ్యా జేశ్వే మృగముఖే కుజే తుంగేర్కభాగవౌ, లగ్నే೭థ సౌజ్య కర్కేంగే జ్ఞాజశుక్రైర్భవోపగైః. 174 మేషేర్కే భూమిపా సేందౌ ఏషే షాంగ్రేర్క పపాసృజః, సింహకుంభమృగస్ధాశ్చేద్ఖూప సారే తనావజే. 175 ఆర్కే జీవే తనౌ వాపి నృపో೭ధో కుజభాస్కరౌ, ధీస్ధౌ గుర్విందుకవయో భూమౌ స్త్రంగే బుధే నృపః. 176 మృగాస్య లగ్నగై సౌరే జాబ్జరహరయస్సయాః, కవిక్షాతుల యుగ్మస్ధౌ భూపః కీర్తిమవాప్నుయాత్. 177 యస్య కస్యాపి తనయః ప్రోక్తైర్యోగైర్నృపో భ##వేత్, వక్ష్యమాణౖర్నృపసుతో జ్ఞేయో భూయో మునీశ్వర. 178 గ్రహాన లగ్నము షడ్రాంత్యమైననే సంస్కారము చేయవలయును. అట్లు కానిచో చేయరాదు. ఆయంశము నాలుగుచే భాగించగా వచ్చిన తక్కువ భాగము గుణమగును. ఎక్కువగా ఉన్నవి అంశములు తక్కువగా ఉన్నవి భూగుణమని తెలియవలయును. సౌమ్యగ్రహమునకు అర్ధభాగముచే, పాపగ్రహమునకు సమగ్రభాగముచే చేయవలయునని సిద్దాంతము. ఆరింటిని గుణభాగముచే కొట్టివేయబడినవి ఆయురంశములు. దీనినే సంస్కారమందురు. ఆయురంశ కలా భక్తమునుండి పన్నెండుచే కొట్టివేసి ఇరువదిచే భాగించబడినవి సంవత్సరములు. మిగిలిన దానిని ద్విశతముచే భాగించగా నెలలు, మిగిలినవి దినాదికములని తెలియవలయును. లగ్నాంశములను, ఆయురంశములను మూడుచే గుణించి 8చే భాగించినపుడు సంవత్సరములగును. మిగిలిన దానిని పన్నెండుచే గుణించి 8 చే భాగించగా మాసాదికములగును. బలవంతుడగు గ్రహమున్నరాశిలో సమానమగు సంవత్సరములు ఆయుష్యమని స్పష్టముగా తెలియును. అంశద్విఘ్నము, అక్షాంశము 1, 3 మొదలగు వాటిచే గుణించగా మాసములు తెలియును. మిగిలినవి దినాకదికములుగా తెలియవలయును. ఈ గణితము పిండ నిసర్గములకు చేయరాదు. లగ్నార్క చంద్రుల మధ్యలో ఏ గ్రహము బలీయమో ముందు ఆ దశ ప్రారంభమగును. తరువాత కేంద్రాది స్ధానములలో ఉన్న గ్రహముల దశలు రెండు మూడు మొదలగు వాటి యందు బలీయుని దశ వచ్చును. ఈ దశలలో కూడా కేంద్రదిస్థానములలో ద్వితీయ తృతీయస్థానములలో బలీయునితో క్రమము ప్రారంభమగును. బలీయులై సూర్యాదులతో కూడియున్న గ్రహములదశ ప్రారంభ##మైనపుడు దీర్ఘాయుష్మంతుడగును. విపరీతమైనచో యాచకుడగును. షడ్వర్గార్థము, త్రింశాంశ, త్రికోణస్థానములలో నున్న గ్రహదశ##యేర్పడినచే స్మరగుడగును. సప్తమాసములలో చతురస్రగతుడైనచే ఇచట కూడా కేంద్రాదిస్థానములలో ద్రిత్య్రాదులలో సబలగ్రహములక్రమమే ప్రారంభమగును. పాకాధిపుడైనచో నాలుగు ఎనిమిది స్థానములు, సహగుడైనచే నాలగు స్థానములు. త్రికోణ స్థానమున నున్న వానికి 8, 3, 12 సంఖ్యలీయవలయును. నాలుగు ఎనిమిది స్థానములలో ఉన్న వానికి స్వరగ్గుణితము చెప్పబడినది. దశాగుణములో హతములై భాగముచే గుణౖక్యముచే వచ్చినవగును. మిగిలిన భాగము అర్కాదిహతమైనచో మాసాద్యైక్యముచే భాగముచేయవలయును. అంతర్దశలలో విదశలు, విదశలలో ఉపదశలుండును. దశలో అంశమిత్ర స్వోచ్చరాశులలో నున్న చంద్రుడు నాలుగు ఒకటిమొదలగు వాటిచే వృద్ధినందినచో శుభకరుడగును. ఏరాశిలో ఉన్నపుడు ఆయా స్థానములకనుగుణముగా ఫలితములనిచ్చును. చెప్పిన స్థానముల కంటే భిన్న స్థానములలో నున్నచో ఆయా భావములను క్షీణింపచేయును. గ్రహమునకు యే ద్రవ్యముండునో అది భావాంశలో క్షణయోగము వలన కలుగును. జీవనఫలమంతయు దశలో కూర్చవలయును. విదశాది దశలలో శత్రుగ్రహముచే చూడబడు గ్రహము ఆపదలను కలిగించును. శుభగ్రహములచే, మిత్రగములచే చూడబడినచో, సద్వర్గలోనున్న గ్రహము ఇష్టుడగును. ఆ దశా కాలములో ఆగ్రహము బలయుతుడైనచో ఆపదలను నశింపచేయును. అతనికి అష్టవర్గజఫలము పూర్తిగా శుభ##మే యగును. లగ్నమున మూర్తిస్థానమున నున్నచంద్రుడు వృద్ధిచెంది వాడై స్వోచ్చరాశిలోనున్నచో, తనను త్రికోణస్థానమున మిత్రగ్రహములున్నచో మధ్యమఫము కలుగును. విపరీతగతుడైనచో శ్రేష్ఠము శుభతరమగు ఫలమును చెప్పవలయును. ఉత్కాటానిష్టమును, స్వల్పముగా తెలిసి బలమును చెప్పవలయును. చరరాశిలో ఉంటూ మధ్యలో దుష్టగ్రహములచే విపర్యమువలన అంగ భంగము జరిగినచో, స్థిరరాశిలో ఇష్టమగు అష్టమమధ్యలో నున్ననూ హోరాత్ర్యంశములతో ఫలమును చెప్పవలయును. రాశ్యధిపతి బృహస్పతి బుధులచే కలిసియున్నచో, లేదా చూడబడినచో సత్ఫలమునొసంగును. చూడబడిననూ కలిసియున్ననూ పాపగ్రహముల మధ్యన నున్నచో వినాశము తప్పదు. ప్రాగ్ధ్వాంక్షముగా నున్నచో బంధుమృత్యువు సంభవించును. సూర్యుడు ఇద్దరికంటే తక్కువగా ఉన్ననూ, శుక్రాదులు షడ్రతులైనపుడు నాలుగు ఆరు పదకొండు స్థానములలో బృహృస్పతి మొదలగు గ్రహములున్నూ, చంద్రునికి మూడింట ఆరింట ఉన్ననూ చెడుఫలము కలుగునని తెలియవలయును. వృద్ధిస్థానమగు రాశిలోకాని, పదకొండింట, ఆయిదింట చంద్రుడు తనరాశిలో ఉన్నచో శుభకరుడగును. ఆరు, మూడు, పదకొండు, అయిదు స్థానములలో నుండి శనికి బుధునికి రెండు మూడు పదకొండు కేంద్రస్థానములలో నున్ననూ కేంద్రము అష్టమ ఏకాదశ స్థానములలో నున్న బృహస్పతి కంటేను బుధుడు స్వస్థానముననున్న శుక్రుని కంటే బలీయుడగును. వృద్ధిలో ఉన్న సూర్యునికంటే మొదటి అయిదవ స్థానములలో నున్న పదకొండు ఆరుస్థానములలో నున్న చంద్రునికంటే, కేంద్రస్థానములలో అష్టమస్థానములో శుభరాశిలోనున్న శని కంటే గోష్ఠాఆయకేంద్రస్థానములలోనున్న గ్రహము బలీయము. ఆరు మూడు అయిదు స్థానములలో నున్న బుధుని కంటే ఆరు, అంశ, అష్టమస్థానములలో నున్న శుక్రుని కంటే, నాలుగు పందకొండు పన్నెండు స్థానములలో నున్న కుజుడు గురువు కంటే బలీయుడు. ఆరు పదకొండు స్థానములలో నున్న శుక్రునికంటే, అయిదు మూడుస్థానములలో నున్న శనికంటే బుధుడు బలీయుడు. అస్తగతుడైన కుజుని, కంటే బృహస్పతికంటే పన్నెండు ఆరుస్థానములలో నున్న గ్రహము మృత్యుప్రదుడు. నాలుగు పదకొండు ఆరుస్థానములలో నున్న అంత్యములోనున్న సూర్యునికంటే ప్రథమ తృతీయ స్థానములలోనున్న, ఆరు, ఒకటి, పదకొండు, ఎనిమిది, నాలుగు, స్థానములలోనున్న బృహస్పతికంటే భిన్నలగ్నములలోనున్న గ్రహములు బలీయములు. కోణస్థానములలో అష్టమస్థానములో ప్రథమస్థానముననున్న కుజునికంటే పన్నెండు మూడుస్థానమునున్న గురువు బలీయుడు. మూడువస్థానములో అష్టమస్థానమున నున్న సూర్యుని కంటే, మూడవ మొదటిస్థానమున, 8, 9, 6 స్థానములలోనున్న గ్రహము బలీయము. నాలుగు అయిదు రెండు స్థానములలో నున్న చంద్రుని కంటే, రెండు మూడు ఆరుస్థానములలోనున్న గ్రహము అదే స్థానములోనుండు శనికంటే బలీయుడు. ఒకటి, నాలుగు, అయిదు, ఆరు పదకొండు స్థానములలో నున్న గ్రహములు రెండు పన్నెండు స్థానములలో, భిన్న రాశులలో నుండు బుధునికంటే బలీయులు. రాశ్యంత్యాంశములలో నుండు చంద్రుని కంటే శుక్రుడు శుభకరుడు. తన రాశిలో బుధునితో నున్న గ్రహములలో మూడు అయిదు నాలుగు రెండు స్థానములలో, దిక్ భద్ర ఆసిగతుడగు గ్రహము శనికంటే, శుభకరుడు రంధ్ర, ఆయ, వ్యయస్థానగతుడు 8, 5, 3 స్థానములలో నుండు సూర్యునికంటే గురువు కంటే బలీయుడు. బుధుడు నాలుగు మూడు, పదకొండు, ఆరు, రెండు స్థానములలో, మూడు అయిదు ఆరు స్థానములలో నుండు శని రాశ్యంత్యాంశములలో నుండు కుజుని కంటే బలీయుడు. కేంద్ర, ఆయ, అష్ట ధనస్థానములలో నున్న సూర్యుడు లగ్నమునుండి వృద్ధి ఆద్యబంధువులలో గోఅధ్వఅష్టఅరి భస్థానములలో రాంశ్యంత్య భాగములలో నుండు చంద్రునికంటే లాభత్రిషట్ స్థానములలో నుండగా బలీయుడు. ఆరు, ఎనిమిది, అంత్యాంశగతుడు రెండు, అంత్యాంశలయందుండు గురువు కంటే శుక్రుని కంటే బలీయుడు. ఉక్తస్థానములలో రేఖల నీయవలయును. చెప్పని స్థానములలో బంధువుల నుంచవలయును. జన్మరాశి నుండి ద్విమిత్రోశ్చరాశులు స్వస్థానములైనచో శుభము. పరస్థానమైనచో అశుభమని తెలియ వలయును. అర్థక్షయము క్లేశము. సమత అర్థ సుఖమునిచ్చును. ధనాస్తి, సుఖము, ఇష్టాప్తి అని క్రమముగా రేఖాఫలమును చెప్పవలయును. సూర్యుని వలన పితృమాతృద్విషన్మిత్ర భ్రాతృస్త్రీ సేవనలు లభించెదరు. స్వాబగా ఉన్నను మేషలగ్నములోను స్వస్థానములోనున్న సూర్యచంద్రుల వలన కీర్తి ప్రతిష్ఠలు పెరుగును. తృణ, స్వర్ణ, అశ్వ, ధోరణాదులచే సూర్యాంశలో జీవనమును చెప్పవచ్చును. చంద్రాంశలో, కృషి, అంచుజస్త్రీలచే జీవనమును చెప్పవలయును. కుజాంశలో ధాతువులచే, ఆస్త్రములచే, సాహాసముచే జీవనము జరుగునని చెప్పవలయును. బుధాంశలో కావ్యశిల్పాదులచే జీవనము సాగునని, దేవ ద్విఆకరములచే గుర్వంశలో జీవనము సాగునని చెప్పవలయును. శుక్రుని అంశలో రజత గోరత్నములచే, శని అంశలో హింసాశ్రమ అధములతో జీవనము సాగునని చెప్పవలయును. సూర్యుడు తన ఉచ్చరాశులలో ఉండి గురుకుజులతో కలిసి యున్నచో రాజులగుదురు. లగ్నములోకాని, వర్గోత్తమమున కాని చంద్రుడుండి నాలుగు అంతకంటే ఎక్కువ గ్రహములచే చూడబడినచో రాజగును. ఉచ్చలో కుజుడు, ధనూరాశిలో సూర్యచంద్రులు, లగ్నమున శని ఉన్నచో రాజగును. ఉచ్చలో సూర్యుడు, స్వస్థానమున నుండు గురువు, శని చంద్రులు ఉచ్చలో నుండు నపుడు, లగ్నమున సూర్యుడు, షష్ఠస్థానమున బుధుడున్నచో, శుక్రుడు కుజుడు, గురువు కర్కటకముననున్నప్పుడు, కుజుడు మేషమున కాని లగ్నమున కాని యున్నచో రాజగును. సూర్యుడు, బృహస్పతి వృషభమున నున్నను, స్వస్థానమున బృహస్పతి యున్ననూ రాజగును. శని సింహమున, మూడు ఆరు స్థానముల రాశ్యంశమున మేషాదులున్ననూ రాజగును. మేషమున బృహస్పతితో కూడిన గ్రహమునుండి, సింహమున కుజుడుండిన, ఉచ్చరాశితో మేషము చూడబడునపుడు రాజగును. లగ్నమున బృహస్పతితో కూడి సూర్యుడున్నపుడు, బుధశుక్రులు మేషమున నున్నపుడు, మేషరాశిలో సూర్యుడుండి, కుజచంద్రులతో కలిసి యున్ననూ చూపు పడిననూ, శని కుజులున్ననూ, సింహమున కుంభమున మేషమున ఉన్నచో రాజగును. మేషలగ్నమై, మేషమున కుజుడున్ననూ రాజగును. సూర్యుడు, బృహస్పతి లగ్నమున నున్ననూ, సూర్యుడు కుజుడున్ననూ రాజగును. అయిదవస్థానమున గురువు చంద్రుడు శుక్రుడున్నచో, స్వస్థానమున మూడింటఉన్నను రాజగునని పండితులు చెప్పెదరు. సింహలగ్నజాతకుడు, సింహమున శనిచంద్రుడున్నపుడు, శుక్రుడు కుజుడు తులారాశిలో కాని, ద్విస్వభావరాశులలో కాని ఉన్నచో రాజు కీర్తిమంతుడగును. పైన చెప్పబడినయోగములచే ఎవరి పుత్రుడైననూ రాజు కావచ్చును. ఇపుడు చెప్పబోవుయోగములచే రాజ పుత్రుడు మాత్రమే రాజగునని తెలియును. స్వోచ్చే త్రికోణభగతేసై#్త్రద్యైర్బలయుతైర్నృపః, సింహ్వోర్కే మేషలగ్నేజే మృగే భౌమే ఘటేష్టమే. 179 చాపే జీవే ధరానాధస్స్యాధధ స్వరగే భృగౌ, పాతాలగే ధర్మణ్వబ్జే శుభదృష్టి యుతే మునే 180 త్రిలగ్నభాగైశ్శేషైర్దరాధీశః ప్రజాయతే, సౌమ్యే వీర్యుతేం೭గస్థే బలాఢ్యే శుభ##గే శుభే. 181 ధర్మార్థోపచయస్థైశ్చ శేషేర్మర్మయుతో నృపః, మేషూరణాయతనుగా శశిసూర్యసూరయః. 182 జ్ఞారౌ ధనేశితరవామిబుకే భూపతిస్తదా, వృషేగే೭బ్జో ధనారిస్థో జీవార్కలాభగాః పరే 183 సుఖే గురుః ఖే రవీందూ యమోలగ్నే భ##వే కరౌ, లగ్నే వక్రాసితౌ చంద్రే జ్యసితార్కబుధాః క్రమాత్. 184 సుఖాస్తు శుభఖాప్తిస్థా నరేశం జనయంత్యపి, కర్మలగ్నగఖేటస్య దశాయాం రాజ్యసంగతిః. 185 ప్రబలస్య దశాయాం వా శత్రునీచాదిగార్తిదాః, ఆసన్నకేంద్రద్వయగైర్వర్గదాఖ్యస్సకలగ్రహైః. 186 తన్వస్తదైశ్చ సకటం విహగో రాజ్యబంధుగైః శృంగాటకం ధిగౌగస్థైర్లగ్నాన్యస్థైర్హలం మతమ్. 187 వర్జోంగేస్థే సత్స్వసత్సు తుర్యగస్థైర్యవో೭న్యధా, విమిశ్రైః కమలం ప్రాహుర్వాయాకంటకబాహ్యగైః. 188 లగ్నాచ్చతుర్భగైర్యూపశ్శరస్తూర్యాచ్చతుర్భుగైః ద్యూనాద్వేదక్షగైశ్శక్తిం నర్దఖాదిచతుర్ధగైః. 189 లగ్నాత్క్రమాత్సప్తభ##గైః నౌకాకూటస్తు తుర్యతః, ఛత్రమస్తాత్స్వభాద్యాయోన్యస్మాదర్దేన్దునామకః 190 లగ్నాదేకాంతరంగైశ్చక్రమర్ధాత్సరిత్పతిః, ఝుహ్యుస్ధానేషు విణాద్యా సమసప్తరసంస్ధితైః, 191 వీణాదామపాశ##కేదారభూశూలయుగగోలకాః, గ్రహైస్సర్వైశ్చరభ##గై రాయోగః ప్రకీర్తితః. 192 స్ధిరస్థైర్ముసలం నామ ద్విశరీరగతైర్నలః, భాలాకేంద్రస్ధితైస్సౌమ్యై పాపైస్సర్ప ఉదాహృతః. 193 ఈర్యుర్ధ్వరుచీ రజ్జ్యాం ముసలే ధనమానయుక్, వ్యంగా స్ధిరా లోనలజో మోగీ స్రగ్జో హి జోర్దితః. 194 వీణోద్భవో೭తినిపుణః గీతనృత్యరుచిర్భృశమ్, దాతా సమృద్ధో దామస్ధః పాశజో ధనశాలయుక్. 195 కేదారోత్ధః కృషికరశూలే శూరోక్షతో ధనః యుగం పాషండయుర్గోలే విధనో మలినస్తథా. 196 భూపవంద్యపదశ్చక్రే సముద్రే నృపభోగయుక్, సభగాంగోర్ధచంద్రాత్సుఖీ శూరశ్చ చామరః. 197 మిత్రోపకారకృచ్ఛ్రతే కూటే చానృతబంధరాట్, తౌజస్సకీర్తిసుఖభాక్ మానవో భవతి ధ్రువమ్. 198 త్యాగే యజ్వాత్మవాన్ యూధే హింస్తో గుహ్యాధిపశ్శరైః శక్తౌ నీచో೭లసో నిస్స్వో దండే ప్రియవియోగభాక్. 199 వ్యర్కైస్స్వాంత్యో భయగతైః ఖైటై స్స్యాత్సునఫా నఫా, దురుధరా చైవ విధౌ జ్ఞేయః కేముద్రుమో೭న్యథా. 200 స్వోపార్జితార్ధభగ్దాతా సునఫాయాం ధనీ సుఖీ, నీరోగశ్శీలవాన్ల్యాత సువేషశ్చానషాభవః. 201 భోగీ సుఖీ ధనీ దానీ త్యాగీ దురుధురోద్భవః, కేము ద్రు೭మోతిమలినో దుఃఖీ నీచో೭థ నిర్ధనః. 202 యంత్రాశ్మకారంశో జోకో భౌమపుష్కరుర్తే ధ్వగస్సుజ్ఞః, సుకీర్తి నిపుణం విధ్వాంసం ధనినం తథా. 203 సో೭న్యోన్యనకార్యనిరతం సాస్ఫుజిచ్ఛస్త్రజీవినమ్, సమందో ధాతుకుశలం తథా భాండవిదం మునే. 204 కూటస్న్యా శవ పణ్యాఠం నసాసృగిందుః ప్రసూ ద్విషమ్, కుర్యాత్స జ్ఞో೭ర్ధనిపుణం నమ్రం సత్కీర్తిసంయుతమ్. 205 సజ్యోస్ధిరవయం వంశ్యం విక్రాంతం చ సమర్ధినమ్, ససితోసక వేత్తారం సార్కిపీనభవం మునే. 206 ఆరే సజ్ఞే బాహుయేధీ పురాధ్యక్షస్స గీష్పతౌ, పశుక్రే ద్యూతక్రర్హోయో೭నృతీ ద్యూతీ సమందకే. 207 సేజ్యే జ్ఞేనృత్యగీతాఢ్యే మయా దక్షస్సభార్గవే, సమందే లుబ్ధకః క్రూరో నరో భవతి నారద. 208 సశుక్రే వాక్పతౌ విద్వాన్ సాసితే೭న్నఘటంకరః, కవౌ సమంద మందాక్షావవనిశ్రయవిత్తవాన్. 209 ఏకస్ధైశ్చతురాద్యైస్తు ఖవార్ధైః ఖచరైః పృథక్, కుజజ్ఞేజ్యాజ శుక్రార్కిమసూర్యైః పరివ్రజేన్నరః. 210 శాక్యజీవకవృద్ధార్ధిచరకాఖ ఫలాశనః, తత్స్వామిభిః పరిజితైః ప్రవ్రాజ్యా ప్రచ్యుతిర్వభ##వేత్. 211 అదీక్షితాల్పస్తగతై సమలైస్తత్థ్సభక్తయః, జన్మపో೭న్యైర్యద్యదృష్టో మందం పశ్యతి నారద ! 212 మందో వా జన్మపం నష్టం తథా చ మందకాగణ, భౌమార్కాంశే సౌరదృష్టే చంద్రే వా దీక్షితో భ##వేత్. 213 సురూపో భూషితో೭శ్విన్యాం దక్షస్సత్యవచా యమే, బహుభుక్పదారగ్నౌ స్ధిరధీః ప్రియవాక్తథా. 214 బ్రహ్మే ధనీ మృగే భోగీ రౌద్రౌ హింస్రశ్శరో೭ఘకృత్, దాంతో రోగీ శుభే೭దిత్యాం పుష్యర్యజన్మా కవిస్సుఖీ. 215 ధూర్తశ్శఠః కృతఘ్నో೭హౌ పాపసర్వాశనో భ##వేత్, పత్రే భోగీ ధనీ భక్తో దాతా ప్రియవచా భ##గే. 216 ధనీ భోగీ నరోర్యమర్క్యే స్తేనో ధృష్టో ఘృణీకరే, చిత్రాంబరస్సుదృక్త్వాస్ట్రే న చ ధర్మదయాపరః. 217 ద్వీశే లుబ్ధః పటుః క్రోధీ మఢ్యౌ అటనో విదేశగః, శాక్రీ ధర్మపరస్తుష్టో మూలే మానీ ధనీ సుఖీ. 218 ఆప్యే మానీ సుఖీ హృష్టో వైశ్వే నమ్రశ్చ ధార్మికః, కర్ణే ధనే సుఖీ ఖ్యాతో దాతాశూరో ధనీవసౌ. 219 శ##తేరహంతా వ్యసనీ స్త్రీజితో జాహి భేదినీ, బుధ్నే వక్త సుఖీ కాంతః పౌష్ణే శూరో ధనీ శుచిః. 220 కామీ శూరః కృతజ్ఞోజే కాంతస్త్యాగీ క్షమీ వృషే, యుగ్మే స్త్రీద్యూతశాస్త్రజ్ఞస్త్రెణో హ్రస్వస్స్వభౌ విధౌ. 221 స్త్రీద్విట్ క్రోధీ హరౌ మానీ విక్రాంతస్థ్సిరధీస్సుఖీ, ధర్మీ శ్లక్షస్సుధీష్షష్ఠే ప్రాజ్ఞః ప్రాంశుర్ధనీ ఘటే. 222 రోగీ పూజ్యః క్షతీ కార్ష్యే కవిశ్శిల్పీజ్యభేధనీ, మృగే೭లసో೭టనస్స్వక్షో పరదారార్ధహృద్ఘటే. 223 సబలే ఖే భ##యే వాపి స బలే೭జేఖిలం ఫలమ్, అన్యథా విపరీతం తత్ ఫలమేవం పరే೭పి న. 224 ఖ్యాతస్త్సీద్విట్ ధనీ తీక్షోజ్ఞః కవిశ్శౌండికో ధనీ, పూజ్యో లుబ్ధకో೭ధనసఖో మేఫాదౌ భాస్కరే జనౌ. 225 నిస్స్వో೭ర్కఖీభూమిపుత్రే ధనీ చాంద్రే స్వఖేదనః, బుధే కృతజ్ఞోజైవే తు ఖ్యాతశ్శౌక్రే అన్యదారికః. 226 మృగే మహ్వాత్మజధనకుంభే దుఃఖ్యనృతీ ఖలః స్త్రీద్వేష్యస్స్వజనద్వేషీ నియరత్యస్సధీ ధనః. 227 సమానార్ధస్సపుత్రస్త్రీసర్ణసూర్యాదిఖే బుధే, సేనానీస్త్స్రర్ధపుత్రాఢ్య దక్షమైశ్య పరిచ్ఛదీ. 228 మండలేశస్సార్ధసుఖసర్గస్స్వామ్యర్కభాద్గురౌ, స్త్ర్యాప్తార్థో మందశోకాఢ్యో బంధుద్వేషీ ధనాఘవాన్. 229 సార్ధః ప్రాజ్ఞస్సమః ఖ్యాతీ స్త్రీజితో೭ర్కాదిభే భృగౌ, వ్యంగజార్ధస్స్వప్రసూకో విధమిత్రో సుఖత్రయః. 230 సత్పుత్రస్త్రీధనో రాజా గ్రామే శోకాదిఖేర్కజే, భూపజ్ఞగుణి పౌరాస్వా దృష్టేబ్జేజే సృగాదిభిః. 230 నిస్స్వస్త్సేన నృపాః ప్రజ్ఞ ప్రేష్యామలినృయుగ్మగే, ధాత్వా జీవీ నృపజ్ఞాభీతంతువాయా ధనాస్వభౌ. 231 యుయుత్సుకవిసూరీజ్య ధాతజీవదృగామయాః, జ్యోతిర్ఞాఢ్యే జ్యనుఖలు నృపే జ్ఞాదికర్హరౌ. 232 షష్ఠే శుభైర్నృపచమూనైపుణ్యవతితాశయాః, జూకే భూపస్వర్ణకారవణిజశ్శేషదృగ్యుతే. 233 ద్విపైతృకాబ్దిధ్వజినో వ్యంగాస్వక్షితిపా అలౌ, జ్ఞాతిక్ష్మాజనయాశ్చాపే సద్ఖిర్ధర్మీ శఠస్తథా. 234 భూపమండితసస్వేజ్యా మృగే భూయాన్యదారికౌ, కుంభే శేషైశ్చ హ్స్యజ్ఞ నృపజ్ఞాస్సద్భిరంత్యఖే. 235 హారే శరదలిస్ధైస్తు దృష్టో యుక్కశ్శశీ శుభః, త్ర్యంశే తత్పతిమిత్రగతైర్యుక్తే క్షితస్తథా. 236 స్త్ర్యాదిగ్రహములు బలయుతులై తమతమ ఉచ్చ స్ధానములలో కాని త్రికోణ స్ధానములందు కానియున్నచో రాజుకాగలడు. సిహంమున సూర్యుడు, మేషమున చంద్రుడు, మకరరాశిలో కుజుడు, కుంభరాశి అష్టమము, ధరూరాశిలో బృహస్పతి, స్వస్ధానమున శుక్రుడున్నచో జాతకుడు రాజగును. పాతాల ధర్మస్ధానములలోనున్న చంద్రుడు శుభగ్రహములచే చూడబడినచో మిగినలి గ్రహములు త్రిలగ్న భవస్ధానములలో నున్నచో రాజగును. బలయుతుడగు బుధుడు వృషభమున నుండగా, శుభగ్రహములు శుభస్ధానములలో నున్నప్పుడు, ధర్మధనస్ధానములలో మిగిలిన గ్రహములున్నపుడు రాజు ధర్మాత్ముడగును. మేష ఆయులగ్నములలో చంద్రుడు శని గురవులున్నచో ధనస్ధానమున (2) బుధకుజులున్నచో, శుక్రుడు హిబుకమున ఉన్నచో రాజగును. వృషభమున, కుంభమున చంద్రుడు, రెండవస్ధానమున ఆరవ స్ధానమున గురు శనులు, ఇతరులు పందకొండవ స్ధానముననున్నచో, నాలుగవస్ధానమున గురువు, సూర్యచంద్రశనులు లగ్నమున, భవమున, కరిలో ఉన్నపుడు, లగ్నమున శుక్రుడు శని, చంద్రుడు, గురువు, శుక్రుడు, సూర్యుడు బుధుడు క్రమముగా శుభులు శుభరాశిలో ఉన్నపుడు పుట్టినవాడు రాజగును. పదవస్ధానమున, లగ్నమున నున్నగ్రహముయొక్క దశలో రాజ్యము లభించుట కలదు. బలీయమగు గ్రహముయొక్క దశలో కాని శత్రుగ్రహములు నీచ స్ధానములలో నున్నపుడు ఆర్తిని కలిగించును. సూర్యుని సమీపమున సకల గ్రహములున్నచో వర్గదము అందురు. లగ్నమున గ్రహము అస్తగుడైనచో సకట యోగమందురు. రాజ్యబంధుస్ధానములలో గ్రహములున్నచో విహగయోగమందురు. అయిదవ స్ధానమున ఎనిమిదవ స్ధానమున గ్రహములున్నచో శృంగాటకయోగమందురు. లగ్నమున కంటే ఇతర స్ధానములలో గ్రహములున్నచో హలయోగమందురు. అంగమున శుభాశుభగ్రహములున్నపుడు వర్జయోగమందురు. నాలుగవ స్ధానమున నున్నచో యవయోగమందురు. గ్రహములు కలగాపులగముగాన్నచో కమలయోగమందురు. లగ్నమున నాలుగు గ్రహములున్నచో యూపయోగమందురు. నాలుగవ స్ధానమున నాలుగు గ్రహములున్నచో శరయోగమందురు. ఏడునాలుగు రెండవ స్ధానములలోనున్నచో శక్తి యోగమందురు. లగ్నమునుండి వరుసగా ఏడు స్ధానములలో గ్రహములున్నచో నౌకా యోగమందురు. లగ్నమున మాత్రమే యున్నచో కూటయోగమందురు. స్వస్థానమున గ్రహమస్తంగతుడైనచో ఛత్రయోగమందురు. ఇతర స్ధానములలో అస్తగుడైనచో అర్ధేందు యోగమందురు. లగ్నమునుండి ఒకటిని విడిచి తరువాతి రాశిలో గ్రహములున్నచో చక్రయోగమందురు. సమసప్తరాశులలో గ్రహములున్చచో వీణాదియోగములనబడును. వీణా దామ, పాశ, కేదార, శూల యుగ గోలకములని ఆరు యోగమలు. అన్ని గ్రహములు చర రాశులలో నున్నచో రాజయోగమని చెప్పబడినది. స్ధిరరాశులలో అన్ని గ్రహములున్నచో ముసలయోగమందురు. ద్విస్వభావరాశులలో నున్నచో నలయోగమందురు. కేంద్రమున సౌమ్యగ్రహములున్నచో భాలయోగమందురు. కేంద్రమున పాపగ్రహములున్నచో సర్పయోగమందురు. రజ్ఞుయోగమున పుట్టినవాడు ఈర్ష్యాలువు ప్రయాణమున రుచి గలవాడుగా నుండును. ముసల యోగమున పుట్టినవాడు ధనము గౌరవము కలవాడగును. వీణాయోగమున పుట్టినవాడు అతినిపుణుడు, గీతనృత్యము లందు మిక్కిలి అభిలాష కలవాడుగా నుండును. దామయోగమున పుట్టినవాడు సర్వసంపద్యుక్తుడు దాతయగును. పాశయోగమున పుట్టినవాడు ధనవందుడు శీలవంతుడగును. కేదారయోగమున పుట్టినవాడు వ్యవసాయము చేయువాడగును. శూలయోగమువ పుట్టినవాడు శూరుడు తరగని ధనము కలవాడగును. యుగయోగమువ పుట్టినవాడు పాషండులతో కలిసియుండును. గోలకయోగమున పుట్టినవాడు ధనహీనుడు మలినుడగును. చక్రయోగమున పుట్టినవాడు రాజులచే నమస్కరించదగినవాడగును. సముద్రయోగమున పుట్టినవాడు రాజభోగమలు కలవాడగును. అర్ధచంద్ర యోగమున పుట్టినవాడు సౌందర్యము కల అవయవములు కలవాడు సుఖీ, శూరుడు దీర్ఘాయుష్మంతుడగును. ఛత్రయోగమువ పుట్టినవాడు మిత్రులకు ఉపకారము చేయువాడగును. కూటయోగమున పుట్టినవాడు అసత్యవాదియగును. తేజోవంతుడు, కీర్తిమంతుడు, సుఖము కలవాడుగా నగును. యూధయోగమును పుట్టినవాడు త్యాగి, యాగము చేయువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, గుహ్యాధిపుడగుచో శరములచే హింసించువాడగును. శక్తియోగమున పుట్టినవాడు నీచుడు, అలసుడు, నిర్ధనుడు అగును. దండయోగమున పుట్టినవాడు ప్రియుల ఎడబాటును పొందును. సూర్యుడుకాక మిగిలిన గ్రహములు కుంభ మీన రాశులలో నున్నపుడు సునఫా, ఆనఫా యోగములందురు. చంద్రుడు మీనరాశిలోఉన్నపుడు దురుధరాయోగమనబడును. అట్లు కానిచో కేముద్రుమయోగమందురు. సునఫా యోగమున పుట్టినవాడు తాను సంపాదించిన ధనమును అనుభవించువాడు, దాత, ధనవంతుడు, సుఖవంతుడుగా ఉండును. ఆనఫా యోగమున పుట్టినవాడు రోగము లేనివాడు, శీలమంతుడు, ప్రసిద్ధిని పొందువాడు, చక్కని వేషము కలవాడగును. దురుధర యోగమున పుట్టిన వాడు. భోగవంతుడు, సుఖవంతుడు, ధనవంతుడు, దానము చేయువాడు, త్యాగము చేయువాడుగా నుండును. కేముద్రుమ యోగమున పుట్టినవాడు మిక్కిలి మురికిగా నుండువాడు దుఃఖము కలవాడు, నీచుడు, నిర్ధకుడుగా నుండును. కుజుడు పుష్కరాంశమున నుండగా పుట్టినవాడు యంత్రకారుడు, అశ్మకారుడు, చక్కని బాటలో నడుచువాడు, చక్కని జ్ఞానము కలవాడు, చక్కని కీర్తి కలవాడు, నిపుణుడు, విద్వాంసుడు, ధనవంతుడుగా నుండును. లగ్నమున సూర్యుడున్నచో అన్యోన్యకార్య నిరతుడగును,. శుక్రుడున్నచో శస్త్రజీవియగును. శనితో కలిసియున్చో ధాతుకుశలుడగును. కూటస్ధానమున తిరుగువాడు శవవిక్రేత కుజడున్నచో యగును. చంద్రుడున్నచో సంతాన ద్వేషియగును. బుధునితో కలిసున్నచో అర్ధనిపుణుడగును. వినయశాలి సత్కీర్తిమంతుడగును. గురువుతో కలిసియున్నచో స్ధిరవయస్కుడు, సద్వంశజుడు, విక్రాంతుడు సమర్ధుడగును. శుక్రుడున్నచో సుఖము తెలిసినవాడగును. శనియున్నచో బలిష్ఠుడగును. బుధునితో కలిసి కుజుడున్నచో బాహు యుద్ధము చేయువాడు, గురువుతో కలిసి యున్నచో పురాధ్యక్షుడు, శుక్రునితో కలిసి యున్నచో ద్యూతము నాడువాడు, శనితో కలిసి యున్నచో అబద్ధములాడువాడు, ద్యూతము నాడువాడు, గురువుతో కలిసి బుధుడున్నచో నృత్యగీత నిపుణుడు, శక్రునితో కలిసున్నచో మాయదక్షుడు, శనితో కలిసున్నచో పిసినారి క్రూరడగును. శుక్రునితో కలిసి గురువున్నచో విద్వాంసుడు శనితో కలిసున్నచో అన్నఘటకరుడు, శుక్రుడు మాత్రమే ఉన్నచో చిన్నకన్నులు కలవాడు, అరణ్యము వలన వచ్చు డబ్బుగలవాడగును. ఒకేస్ధానములో నలుగురు అంతకన్నా ఎక్కువగ్రహములున్నచో, కుజుడు, బుధుడు, బృహస్పతి, చంద్రుడు, శుక్రుడు శని సూర్యులున్నచో పరివ్రాజకుడగును. శాకములను కందమూలములను, ఫలములను తిను వాడగును. రాశుల అధిపతులు బలీయులైనచో ప్రవ్రజించినచో చ్యుతి కలుగదు. అదీక్షితుడు, అల్పుడు, అస్తగతుడు. బలీయులగు గ్రహములు కలసి యున్నచో వారి భాగములచే ఫలమును చెప్పవలయును. జన్మలగ్నాధిపతి ఇతర గ్రహములచే చూడబడనిచో మెల్లగా చూచును. జన్మలగ్నాధిపతిని శని చూచినచో నశించును. కుజ సూర్యాంశలు శనిచే చూడబడినచో, చంద్రుడు చూడబడినచో దీక్షితుడగును. అశ్వినీ నక్షత్రమున పుట్టినవాడు రూపవంతుడు ఆభరణభూషితుగా నుండును. భరణీ నక్షత్రమున పుట్టినవాడు సమర్ధుడు సత్యమును పలుకువాడగును. కృత్తికా నక్షత్ర జాతకుడు తిండిపోతు, స్థిర బుద్ధి కలవాడు, ప్రియముగా మాటలాడువాడగును. రోహిణీ నక్షత్ర జాతకుడు ధనవంతుడు, మృగశిరా నక్షత్రజాతకుడు భోగి, ఆర్ధ్రా నక్షత్ర జాతకుడు హింసాశీలి, శఠుడు, పాపకారి యగును. పునర్వసూ నక్షత్ర జాతకుడు ఇంద్రియనిగ్రహము కలవాడు, రోగి, శుభకరుడు, పుష్యమీ నక్షత్ర జాతకుడు కలి, సుఖి, ఆశ్లేషానక్షత్ర జాతకుడు ధూర్తుడు, శఠుడు, కృతఘ్నుడు, పాపి, అన్నిటిని తినువాడగును. మఘా నక్షత్ర జాతకుడు భోగి, ధని, భక్తుడు,పూర్వఫల్గునీ నక్షత్ర జాతకుడు దాత, ప్రియముగా మాట్లాడు వాడు, ఉత్తరా నక్షత్ర జాతకుడు ధని, భోగి, హస్తా నక్షత్రజాతకుడు చోరుడు, ధృష్టుడు, దైన్యము కలవాడగును. స్వాతి నక్షత్రజాతకుడు చిత్రాంబరధారి, చక్కని నేత్రములు గలవాడు, ధర్మపరుడు దయాపరుడు కాజాలడు. విశాఖా నక్షత్ర జాతకుడు లుబ్ధుడు శఠుడు, కోపిష్ఠి, అనూరాధానక్షత్ర జాతకుడు తిరుగుబోతు, విదేశములకు వెళ్ళువాడు, జ్యేష్ఠానక్షత్ర జాతకుడు ధర్మపరడు, సంతోషశీలి, మూలానక్షత్ర జాతకుడు అభిమానము కలవాడు, ధనవంతుడు, సుఖము కలవాడగును. పూర్వాషాఢానక్షత్రజాతకుడు అభిమాని, సుఖీ, సంతోషము కలవాడు, ఉత్తరాషాడా నక్షత్ర జాతకుడు వినయశీలి ధార్మికుడగును. శ్రవణా నక్షత్ర జాతకుడు ధనవంతుడు, సుఖవంతుడు, ధనిష్ఠా నక్షత్రజాతకుడు దాత, శూరుడు, ధనవంతుడగును. శతభిషా నక్షత్ర జాతకుడు శత్రుసంహారకుడు, వ్యసనములు కలవాడు,పూర్వాభాద్ర నక్షత్ర జాతకుడు స్త్రీలకు లొంగువాడగును. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడు వక్త, సుఖి, ప్రియుడు, రేవతీ నక్షత్ర జాతకుడు శూరుడు, ధనవంతుడు పవిత్రుడగును. మేష లగ్న జాతకుడు కామి, శూరుడు, కృతజ్ఞుడగును. వృషభలగ్న జాతకుడు ప్రియుడు, త్యాగి, ఓర్పుకల వాడగును. మిధున లగ్న జాతకుడు స్త్రీ విషయమును. ద్యూతమును, శాస్త్రములను చక్కగా తెలిసినవాడు, కర్కాటకలగ్న జాతకుడు స్త్రీస్వభావము కలవాడు, పొట్టివాడు అగును. సింహలగ్న జాతకుడు స్త్రీలను ద్వేషించువాడు, కోపిష్ఠి అభిమానము కలవాడు, విక్రమము కలవాడు, స్థిరబుద్ధి కలవాడు సుఖవంతుడగును. కన్యాలగ్న జాతకుడు ధర్మాత్ముడు, వినయము కలవాడు, మంచి బుద్ధికలవాడు, తులాలగ్న జాతకుడు ప్రాజ్ఞుడు, పొడగరి, ధనవంతుడగును. వృశ్చిక లగ్న జాతకుడు రోగి, పూజ్యుడు, గాయములు కలవాడు, ధనుర్లగ్న జాతకుడు కవి, శిల్పి, ధని యగును. మకర లగ్న జాతకుడు సోమరి, తిరుగుపోతు, మంచికనులు కలవాడు, కుంభ లగ్నజాతకుడు పరస్త్రీలను, పరధనమును హరించువాడు, మీన లగ్నజాతకడు బలవంతుడు, భయము కలవాడగును. ఏ లగ్నమున పుట్టినవాడైనను లగ్నాధిపతి బలయుతుడైనచో ఫలము సంపూర్ణముగా నుండును. బలహీనుడైనచో విపరీత ఫలములు కలుగును. చంద్రుడు బలయుతుడుగా నున్నను సకల ఫలములు లభించును. క్షీణ చంద్రుడైనచో విపరీత ఫలములు కలుగును. మేషము మొదలు మీనాంతమగు రాశులలో సూర్యుడన్నపుడు వరుసగా ఖ్యాతి గలవాడు, స్త్రీద్వేషి, ధనవంతుడు, తీవ్రస్వభావము కలవాడు, జ్ఞానము కలవాడు, కవి, శౌండికుడు, ధనవంతుడు, పూజ్యుడు, లుబ్ధుడు, దరిద్రులతో స్నేహము చేయువాడు, బలవంతుడు అగును. సూర్యుడు లగ్నమున నుండగా పుట్టినవాడు ధనహీనుడు, కుజుడున్నచో ధనవంతుడు, చంద్రుడున్నచో స్వభేదనుడు, బుధుడున్నచో కృతజ్ఞుడు, గురువున్నచో ఖ్యాతి కలవాడు, శుక్రుడున్నచో పరదార నిరతుడుగా నుండును. మకర లగ్న జాతకుడు బహపుత్రుడు మహుధనవంతుడుగును. కుంభలగ్నమున పుట్టినవాడు ధుఃఖవంతుడు, అసత్యవాది, ఖలుడగును. సూర్యునితో బుధుడు కలిసున్నచో స్త్రీలచే ద్వేషింబడువాడు, స్వజనులను ద్వేషించువాడు, దుఃఖములను పొందువాడు, బుద్ధిమందుడు, ధనవంతుడు, సమానార్ధుడు, పుత్రులు స్త్రీలు ఋణములు కలవాడుగా నుండును. సూర్యునితో బృహస్పతి కలిసున్నచో సేవాధిపతి, స్త్రీలు ధనము పుత్రులు కలవాడు, సమర్ధుడు, అధికారము కలవాడు, వస్త్రములు కలవాడు మండలాధిపతి, ధనము సుఖము కలవాడు, ఋణము ప్రభుత కలవాడుగా నుండును. సూర్యునితో శుక్రుడు కలిసున్నచో స్త్రీల వలన ధనమును పొందువాడు, తక్కువ దుఃఖము కలవాడు, బంధువులను ద్వేషించువాడు, ధనము పాపము గలవాడు, ధనవంతుడు, ఖ్యాతిగలవాడు, సముడు, ప్రాజ్ఞుడు స్త్రీలకు వశ్యుడగును. సూర్యునితో శని కలిసున్నచో విపరీత కార్యములచే ధనమును పొందువాడు, ఖప్రసూకుడు, విధిమిత్రుడు, సుఖత్రయము కలవాడు, సత్పుత్రులు, మంచిస్త్రీలు, మంచి ధనము కలవాడు, రాజు కాగలడు. కుజాదులచే చంద్రుడు చూడబడి మేషరాశిలో ఉన్నపుడు రాజు జ్ఞాని గుణవంతుడు, పౌరుల ధనమును స్వీకరించువాడగును. మిధునమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధనహీనుడు, చోరుడు, రాజుల సేవలు చేయువాడుగా నుండును. కర్కాటకమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధాతువుల నమ్ముకొని బ్రతుకువాడు, రాజాజ్ఞకు భయపడవాడు, బట్టలను నేసి బ్రతుకువాడు, ధనములేని వాడుగా నుండును. సింహమున చంద్రుడుండి ఇదరగ్రహములచే చూడబడినపుడు యుద్ధమునందు కోరిక గలవాడు, కవి, పండితుడు, యజ్ఞములచే, ధాతువులచే బ్రతుకువాడు, కంటి జబ్బులు కలవాడు, జ్యోతిశ్శాస్త్రజ్ఞానము కలవాడగును. కన్యలో చంద్రుడు శుభగ్రహములతో కలిసియున్నచో రాజు, సేనాపతి, నైపుణ్యము కలవాడు మంచిఆశయము కలవాడు గా నుండును. తులారాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూపబడినచో రాజు, స్వర్ణకారుడు, వాణిజ్యము చేయువాడుగా నుండును. వృశ్చికరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహముల దృష్టి ఉన్నచో ఇద్దరు తండ్రులు కలవాడు, సముద్రజీవి, సైన్యము గలవాడు, తన భూమిని కాపాడుకొన గలవాడుగా నుండును. ధనూరాశిలో చంద్రుడుండి శుభగ్రహవీక్షణమున్నచో జ్ఞాతులు కలవాడు, భూమి న్యాయములను చెప్పువాడు, శఠుడుగా నుండును. మకరరాశలో చంద్రుడుండి ఇతరగ్రహములచే చూడబడినపుడు రాజులచే సన్మానించబడువాడు. మిత్రులు గలవాడు, యజ్ఞములు చేయువాడుగా నుండును. కుంభరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు హాస్యజ్ఞాడు, నృపజ్ఞుడుగా నుండును. హారేసబుక్షదలములలో నుండి వారిచే చూడబడిననూ, కలిసియున్ననూ చంద్రుడు శుభుడు. త్య్రంశమున తదధిపతి, మిత్రరాశులలో నున్ననూ, చూడబడిననూ శుభకరుడే. ద్వాదశాంశే ఫలం ప్రోక్తం నవాంశె೭ప్యథ కీర్త్యతే, ఆరక్షేకో వధరుచిర్నియుద్ధకుశలో೭ర్ధవాన్. 237 కలహః క్షితిజాంస్ధే చ శౌక్రే మూర్ఖో೭న్యదారగః, కవిస్సుఖీ బుధాంశేరునటచౌరజ్ఞశిల్పినః. 238 స్వాంశేత్యల్పతనుస్సఖస్తపస్వీ లోభతత్పరః, క్రోధీ నిధీశో೭మాత్యో వా నృపో హింస్రో సుతో హరేః. 239 జీవాంశే హాస్యవిద్యోధా బలీ మంత్రీ చ ధార్మికః, అల్పాపత్యో దుఃఖితో ఖో దుష్టస్త్రీసౌరిభాగగే. 240 భానాహిద్వాదిదృష్టే తు తద్వదేవ ఫలం వదేత్, వర్గోత్తమే ఖీ పరమేభౌ ఫలముక్తశుభం క్రమాత్. 241 పుష్టం మధ్యం లఘు జ్ఞేయం యది చాంశపతిర్బలీ, రాశీక్షణఫలం రుద్ధ్వా దదాత్యంశఫలం స్ఫుటమ్. 242 శూరస్తబ్ధో వికలదృగ్నిర్ఘృణో೭ర్కే తను స్థితే, మేషే ధనీ తైమిరికస్సింహే రాత్ర్యంధ ఏవ చ. 243 నీచోధోస్వః కర్కగే೭ర్కే ఉద్వదాక్షస్తనుస్ధితే, ద్వితీయేర్కే బహుధనో నృపదండ్యో ముఖామయీ. 244 త్రిగే బుధో విక్రమీ చ విముఖః పీడితో భువి, ధనాపత్యోక్తి తో ధీస్ధే బలీ శత్రుజితో೭రిగే. 245 స్త్రీజితో ద్యూనసంస్ధే చ నిధనే೭ల్పాత్మ జో೭ల్పదృక్, సుతార్ధ సుఖభా భాగే దశ##మే శ్రుతశౌర్యవాన్. 246 లాభే బహుధనో మానీ పతితో ఖో వ్యయే రవౌ, మూకో೭ధో బధిరః ప్రేష్యో జేగే ఖాచ్చజగే ధనీ. 247 బుటుర్వా ధనవానర్ధే హింస్రో విక్రమగే భ##వేత్, సాధుభావస్సుఖగతే ధీస్ధే కన్యాప్రజో೭లసః. 248 అల్పాగ్నికామస్తీక్ణో೭రౌ ఈర్ష్యుస్తత్రిమదో జ్ఞఖే. వ్యాధిపీడాన్వితో మృత్యౌ భానుర్ధనగే మిత్రధనాన్వితః. 249 ధర్మధీ ధనయుగ్రాజ్యే ఖ్యాత ధీధనయుగ్ఖవేత్, క్షుద్రోం೭గహీనో వ్యయగే చంద్రే ప్రోక్తం ఫలం బుధైః. 250 లగ్నే కేజే క్షతతనుర్ధనగే తు కదన్నభుక్, ధర్మపాపసమాచారో೭న్యత్ర సూర్యసమో మతః. 251 విద్వాన్ ధనీ చ ప్రవరః పండిత స్సచివో೭రి యుక్, ధర్మజ్ఞో విస్తృత గుణో గాధో జ్ఞేయరతో೭ర్కవత్. 252 విద్వాన్స వాచ్చః కృపణీ సుఖాక్షో రిపుగృద్ధిమాన్, నీచస్తపస్వీ చష్ణవనీ లోభీ దుష్టస్తనౌ గురౌ. 253 స్మరీ సుఖీ విలగ్నస్దే కలహీ సురతోత్సుకః, సుఖితస్తనపస్యే చ భృగౌ జీవవద్యతః. 254 నిస్స్వో రోగీ కామవశో మలినశ్శైశవార్తియుక్, అలసో లగ్నగే మందే దర్మాత్స్వోచ్చగతే నృపః. 255 గ్రామాధిపస్సవిద్వాంశ్చ చార్వంగో೭న్యత్ర సూర్యవత్, పూర్ణముచ్చే೭థ పాదోనఫలం మూలత్రికోణ. 256 శుభగ్రహే దలం స్వర్కే మిత్రభేంఘ్రిమితం ఫలమ్, శత్రుభే೭ల్పం తథా నీచాస్తంగతే ఫలశూన్యతా. 257 ఖభారకాదికే ఖేటే కులతుల్యః కులాధికః, బంధుపూజ్యో೭థ ధనవాన్ సుఖీ భోగీ నృపః క్రమాత్. 258 పరవిత్తసుహృద్బంధుపోష్యాగణబలాధిపౌ, నృపశ్చ మిత్రభ##స్దేషు ఖేటేధ్రేష్కాదిషు క్రమాత్. 259 విషమర్కే೭ర్కహోరాయాం సంస్ధితే శుభ##భేషు చ, ఖ్యాతో మహోద్యమీ చాతితేజా ధీమాన్ధనీ బలీ. 260 శుభేషు చంద్రహోరాయాం స్ధితేషు సమరాశిషు, కాంతిమార్దవసౌభాగ్యభోగధీమాన్భవేన్నరః. 261 సూర్యహోరాగతః పాపః సమభేషు తు మధ్యమః, విషమర్కేషు భాస్కర్యా సౌమ్యానోక్తఫలప్రదాః. 262 స్వమిత్రత్య్రంశగశ్చన్ద్రస్సురూపం గుణినం నరమ్, కరోత్యన్నగతస్తద్వత్ తత్తుల్యగుణరూపిణమ్. 263 వ్యాలాయుధే చతుష్పాదాంజేషు చత్య్రంశ##కే తథా, తీక్షే೭తి హింస్రశ్చ భ##వేత్ గురుతల్పగతో೭టనః. 264 స్తేనో భోక్తా స ధనధీర్నృపః క్లీబశ్చ శత్రుహా, విష్టికృద్దాసవృత్తిశ్చ పాపో హింస్రామతిర్భవేత్. 265 మేషాదికోత్తమాంశేషు ద్వాదశాంశేషు రాశివత్, జాయాబలవిభూషాఢ్యస్సత్త్వ೭తిసాహసీ. 266 తేజస్వీ చ నరః ఖాయే త్రింశాంశే సృజి సంస్ధితే, ఆమయీ వా స్వభార్యాయాం విషమః పారదారికః. 267 దుఃఖీ పరిచ్ఛదయుతో మలినశ్చార్కజే స్వకే, సుఖధీ ధనకీర్త్యాలస్తేజస్వీ లోకపూజితః. 268 నీరగుహ్యభవాన్భోగీ జీవే ఖత్రింశభాగగే, మేధాకలాకావ్యశిల్పవివాదకపటాంచితః. 269 శాస్త్రార్ధసాహసయుతో బుధే స్వత్రింశభాగగే, బహ్మపత్యసుఖారోగ్యరోగరూపార్ధసంయుతః. 270 లలితాంగో విప్రకీర్ణేంద్రియస్స్యాద్ఖార్గవే స్వకే, శూరస్తబ్ధౌ చ విషమవధకౌ సద్గుణాన్వితా. 271 సుఖీ జ్ఞోచారుచేష్టాంగౌ చంద్రార్కౌ చేత్కుజాదిగౌ, మూలత్రికోణస్వరోచ్చే కంఠస్ధాస్తు చ యే గ్రహాః. 272 అన్యోన్యకారకాస్తేస్యు కర్మగస్తు విశేషతః, శుభం వర్గోత్తమే జన్మ వేసిస్ధానే వసద్గృహైః. 273 అశూన్యేషు చ కేంద్రేషు కారకాఖ్యగృహేషు చ, గురుజన్మేశ లగ్నేశాః, కేంద్రస్ధా మధ్యసౌఖ్యదాః. 274 పృష్టో భవ కోదపర్కస్తితాస్త్వంత్యాంతరాదిషు, ప్రవేశే భాస్కరకుజౌ భృగ్వీజ్యౌ మధ్యగౌ తథా. 275 చంద్రార్కీ ఫలదావంత్యే సదాజ్ఞిః ఫలదాయకః, లగ్నాత్పుత్రే కలత్రే వాబ్జాచ్ఛుభేశయుతే క్షితే. 276 స్యాత్తయోస్సంపదస్స్వస్వమన్యథా ధాంగతోదయః, రవౌ మీనేర్కజస్త్స్రీఘ్న పుత్రస్ధస్తు తథా కుజః. 277 సిమాతుక్యాష్టగైః క్రూరై యద్వా క్రూరాంతరే సితః, సద్గ్రహాయుతదృష్టశ్చేదగ్నిపాతాన్మృతిస్త్సియాః. 278 లగ్నాద్య పాణిగతయోః శశిరవ్యోస్సహ స్త్రియా, ఏకేన యస్య జన్మాహురథ సప్తమసంస్ధయోః. 279 నవధీగతయోర్వాపి వికలస్త్రీసితార్కయోః, కోణోదయే೭స్తాంత్యసంధౌ భృగోర్వంధ్యాపతేర్జనిః. 280 సుతభం చేన్న సౌమ్యాఢ్యమధాంత్యాస్తోదయరగైః, పాపే ధీస్ధే విధౌ క్షీణజన్మాసుతకలత్రిణః. 281 శనౌ ఖగే೭స్తే స శుక్రే తద్దృష్టే పారదారికః, తా చేత్సేందుస్త్రియా సార్ధం పుంశ్చలో జాయతే నరః. 282 భృగ్వబ్జయోరస్తగయోర్నరో భార్యాసుతో೭పి వా, నృస్త్రియోస్తు శుభైర్దృష్టౌ తాద్వా పరిణతాంగకౌ. 283 ఖాస్తాంబుగైరిందుశుక్రపాపైర్వంశ వినాశకః, శిల్పీ త్య్రేశే బుధయుతే కేంద్రసంస్థార్కివీక్షితే. 284 దాస్యాం జాతస్సౌరిభాగేరిః ఫగే భృగునందనే. నీచే೭ర్కే దోరస్తగయోర్దృష్టయోస్సూర్యజేన వా. 285 పాపదృష్టౌ శనికుజౌ అస్తగౌ వాతరుక్ప్రదౌ, కర్కాల్యంశగతే కేంద్రే పాపయుక్తే తు గుహ్యరుక్. 286 పాపాంతర గతేం೭గేబ్జే రవౌ ద్యూనే తు కుష్ఠయుక్, చంద్రే ఖే೭స్తంగతే భౌమే వికలో వేశిగే೭ర్కజే. 287 మిధో భాంశగయోశ్శూలీ రవీంద్వోర్యుతయోః కృశః, నిధనారి ధనాంత్యస్థా రవీంద్వారయమా యదా 288 చలద్గ్రహేణ దోషేణ కుర్వంత్యనయనం నరమ్, సౌమ్యాదృష్టా నవాయత్రి ధీగతాః పాపఖేచరాః. 289 కర్ణోపఘాతకాద్యూనేరదవైకృత్యకారకాః, లగ్నే గురౌ ద్యునే మందే వాతరోగార్దితో భ##వేత్. 290 సఖే೭స్తే వా కుజే జీవే లగ్నే వార్కియుతోదయే, కుజేన వాత్మజే ద్యూనే సజ్ఞేం೭త్యేబ్జే చ సోన్మదః. 291 ధీధర్మార్ధాంత్యగైపాపైర్ఖ సమస్యాన్నిబంధనమ్, సర్పశృంఖలయా శాఠ్యైద్దృక్కైర్బల్యశుభేక్షితైః. 292 సమందే೭బ్జే వక్రదృష్టే೭పస్మారీ దుర్వచాః క్షయీ, రవిమందకుజైస్స్వస్ధైః సౌమ్యదృష్టైస్సమండలైః. 293 భృతకాః పూర్మముదితైర్వరమధ్యాధమా నరాః, పంజనౌ తు ఫలం పణ్యస్త్రీణాం యోగ్యం వదేచ్చ తత్. 294 తత్స్వామిష్వఖిలం కార్యం తద్భర్తృమరణం మృతౌ, లగ్నేందుగం వపుశ్చైవ యాదయూపపీతద్యునే. 295 యుగ్నేషు లగ్నశశినోర్వనితాప్రకృతిస్థితా, సచ్ఛీలభూషణయుతా శుభసందృష్టయోస్తయోః. 296 పురుషకృతిశీలాఢ్యా తయోరోజస్థయోర్మతా, అథ పాపా గుణోనాశ్చ పాపవీక్షితయోస్తయోః. 297 కుజార్కీఙ్యజ్ఞశుక్రాణాం కురేక్రమశోం೭గనా, బాల్యదుష్టా తదా దాసీ సాధ్వీ మయావతీత్వరా. 298 దృష్టా వాకృతిశీలా స్యాత్తయోరోజస్థయోర్మతా, అథ పాపా గుణోనాశ్చ పాపవీక్షితయోస్తయోః. 299 దుష్టవాక్ పునర్భూస్సగుణా విజ్ఞాఖ్యాతాస్పుజిద్గ్రహో, బౌధే సమాయాక్లీబాచ సతీ గునవతీ చలా. 300 ఇంతవరకు ద్వాదశాంశఫలము చెప్పితిని. ఇపుడు నవాంశఫలమును చెప్పెదను. కుజాంశలో శుక్రుడున్నచో తనను తాను రక్షించుకొనువాడు, ఇతరులను చంపుటలో రుచిగలవాడు, ద్వంద్వయుద్ధకుశలుడు, ధనవంతుడు, కలహశీలి, మూర్గుడు, పరస్త్రీలోలుడగును. బుధాంశలో కవి, సుఖము గలవాడు, నటుడు, చోరుడు శిల్పి యగును. స్వాంశలో అప్పతనువు, సుఖము కలవాడు, తపస్వి లోభపరుడగును. కుజాంశలో కోపిష్టి, నిధీశుడు, అమాత్యుడు, రాజు, వాంసాశీలుడగును. బృహస్పతి అంశలో హాస్యము తెలిసినవాడు, యోధుడు, బలశాలి, మంత్రి, ధార్మికుడు అగును. శన్యంశలో అల్పసంతానము గలవాడు, దుఃఖితుడు, దుష్టస్త్రీసంగతి గలవాడగును. సూర్యుడు చంద్రాదులచే చూడబడినచో క్రమముగా శుభఫలము చెప్పబడినది. అంశాధిపతి బలయుతుడైనచో పుష్టము మధ్యమము, లఘుఫలమని తెలియవలయును. రాశీక్షణఫలమును ఆపి అంశఫలమును స్ఫుటముగా నిచ్చును. సూర్యుడు లగ్నమున నున్నచో శూరుడు, స్తబ్ధుడు, వికలదృష్టి కలవాడు, నిర్దయుడుగా నుండును. మేషణరాశలో సూర్యుడున్నచో ధనవంతుడు, గుడ్దివాడు, సింహరాశిలో ఉన్నచో రేచీకట్లు కలవాడు, కర్కటరాశలో ఉన్నచో నీచుడు, ధనహీనుడు, లగ్నముననున్నచో త్రిప్పుడు కనులు గలవాడగును. రెండవస్థానమున సూర్యుడున్నచో బహుధనము కలవాడు, నృపునిచే దండిచబడువాడు, ముఖామయము గలవాడగును. సూర్యుడు మూడవరాశిలో ఉన్నచో పండితుడు పరాక్రమవంతుడు, విముఖుడు, పీడించబడువాడగును. అయిదవస్థానమున నున్నచో ధనాపత్యములు కలవాడు, ఆరవరాశిలో ఉన్నచో శత్రువులచే పరాజయమును పొందువాడగును. ఏదవరాశలో ఉన్నచో స్త్రీలకు వశ్యుడు, 8వ స్థానమున నున్నచో అల్పసంతానము కలవాడు, అల్పదృష్టికలవాడగును. 9వ రాశిలో నున్న సుతఅర్థ సుఖము కలవాడు, 10వ రాశిలో ఉన్నచో శాస్త్రజ్ఞానము, శౌర్యము కలవాడు, పదకొండవస్థానమున సూర్యుడున్నచో బహుధనవంతుడు, గౌరము కలవాడు, 12వ రాశిలో ఉన్నచో పతితుడగును. లగ్నమున చంద్రుడున్నచో మూగవాడు, చెవిటివాడు, సేవకుడుగా నుండును. రెండవస్థానముననున్నచో ధనవంతుడు, వటువు, మూడవస్థానమున నున్నచో హింసాప్రియుడు, నాలుగవస్థానమున నున్నచో సాధుస్వభావము కలవాడు, అయిదవస్థానమున నున్నచో స్త్రీసంతానము కలవాడు సోమరి. ఆరవస్థానమున ఉన్నచో కొద్ది ఆకలి కొద్ది కామము కలవాడు, తీక్ణస్వభావము కలవాడు, ఏడవస్థానము నున్నచో ఈర్ష్యకలవాడు మదత్రయము కలవాడు, 8వ స్థానమున నున్నచో వ్యాధిపీడాయుతుడడు, 9వ రాశిలో నున్న మిత్రులచే ధనముచే కూడియుండువాడు. పదవరాశిలో యున్నచో ధర్మబుద్ధి ధనము కలవాడు, పదకొండవ స్థానములో నున్నచో ప్రసిద్ధి, బుద్ధి, ధనము కలవాడు, పన్నెండవరాశిలో చంద్రుడున్నచో క్షుద్రుడు అంగహీనుడగును. కుజుడు లగ్నమున నున్నచో గాయములు కల శరీరము కలవాడు, ధనస్థానమున నున్నచో దుష్టాన్నమును తినువాడు, కొంతధర్మము కొంత పాపమును ఆచరించువాడుగా నుండును. మిగిలిన స్థానములలో కుజుడున్నచో సూర్యుడిచ్చు ఫలములనే ఇచ్చును. బుధుడు లగ్నమున నున్నచో విద్వాంసుడు, ధనవంతుడు, ప్రవరుడు పండితుడు, మంత్రి, శత్రువులు కలవాడు, ధర్మము తెలిసినవాడు, విస్తృత గుణములు కలవాడు అగును. మిగిలిన స్థానములలో నున్నచో సూర్యుని వలెనే ఫలములు కలుగును. బృహస్పతి లగ్నమున నున్నచో విద్వాంసుడు, కృపణుడు, మంచినేత్రములు కలవాడు, శత్రువులు కలవాడు, నీచుడు, తపస్వీ, లోభి, దుష్టుడగును. శుక్రుడు లగ్నమున నున్నచో కాముకుడు, సుఖము కలవాడు, కలహ శీలుడు, సురతమునందు అభిలాష కలవాడు, సుఖించు వాడుగా నుండును. మిగిలిన స్థానములలో నున్నచో బృహస్పతి వలెనే ఫలములనిచ్చును. లగ్నమున శని యున్నచో నిర్ధనుడు, రోగి, కామవశుడు, మలినుడు, శైశవము న ఆర్తికలవాడు, సోమరి యగును. ఉచ్చస్థానమున నున్నచో రాజగును. గ్రమాదిపతి, విద్వాంసుడు, సుందరాంగుడు అగును. ఇతర స్థానములలో నున్నచో సూర్యునివలె ఫలములనిచ్చును. ఉచ్చస్థానములలో నున్నచో పూర్ణఫలము నొసంగును. మూలత్రికోణ స్థానములలో నున్నచో ఒక భాగము తక్కువ ఫలమునిచ్చును. శుభగ్రహము స్వస్థానమున నున్నచో పూర్ణఫలమును, మిత్రస్థానమున నున్నచో పాదఫలమును కలుగజేయును. శ్రతుస్థానమున నున్నచో అల్పఫలమునిచ్చును. నీచస్థానముననున్ననూ అస్తగతుడైనను ఏ ఫలమునీయజాలడు. ధ్రేష్కాణము, త్రికోణము మొదలగు స్థానములలో గ్రహములున్నచో క్రమముగా కులతుల్యుడు, కులాధికుడు, మంధుపూజ్యుడు, ధనవంతుడు, సుఖి, భోగి, రాజు అగును. అట్లే పరవిత్తమును హరించువాడు, మిత్రులను, బంధువులను పోషించువాడు, గణాదిపుడు, బలాధిపుడు అగును. మిత్రస్థానములలో నున్నచో రాజగును. విషమరాశిలో సూర్యహారలో శుభరాశులలో నుండగా ప్రసిద్ధి నొందువాడు, మహోద్యమము గలవాడు, అతి తేజోవంతుడు, ధీమంతుడు, ధనవంతుడు, బలవంతుడు అగును. శుభగ్రహములు సమరాశులలో నుండగా చంద్రహోరలో పుచ్చినవాడు కాంతి, మృదుత్వము, సౌభాగ్యము, భోగము, బుద్ధి కలవాడగును. పాప గ్రహము సూర్యహోరలో ఉండి, సమరాశులలో మధ్యమ గ్రహములున్నచో, విషమరాశులలో శని మొదలగు వారు కాని సౌమ్యగ్రహములు కాని ఉన్నచో పైన చెప్పబడిన ఫలములు నీయజాలవు. చంద్రుడు స్వమిత్ర గ్రహములతో కలిసున్నను, త్య్రంశగతుడైనను రూపవంతుని గుణవంతుని చేయును. మూడవస్థానమున నున్నచో అట్లే అంతటి గుణములు, రూపము కలవానిని చేయును. అంగారకుడు చతురంశలలో త్య్రంశలలో కాని యున్నచో తీక్షరాశిలో ఉన్నచో అతిహిసాశీలుడు, గురుతల్పగతుడు, తిరుగబోతు అగును. అట్లే చోరుడు, భోక్త, ధనవంతుడు, ధీమంతుడు, రాజు, నపుంసకుడు, శత్రుహంతకుడు, విష్టికారుడు, దాసవృత్తికలవాడు, పాపి, హింసాశీలుడు, బుద్ధిహీనుడు గా మేషాది ద్వాదశరాశులలో కాని వాటి ఉత్తమాంశలలో కాని ఉన్నచో పైన చెప్పిన ఫలములు కలుగును. జాయా బలవిభూషణాడ్యుడు, సత్త్వముకలవాడు, అతిసాహసి తేజస్విగా అంగారకుడు త్రింశాంశలోఉన్నచో అగును. శని స్వాంశలో కాని స్వరాశిలో కాని ఉన్నచో రోగిష్టి తన భార్యయందు విషముడు, పరదారలయందు ఆసక్తి కలవాడు, దుఃఖము కలవాడు, వస్త్రములు కలవాడు, మలినుడుగా నుండును. బృహస్పతి త్రింశాంశలో ఉన్నచో సుఖము, బుద్ధి, ధనము, కీర్తికలవాడు, తేజస్వీ, లోకపూజితుడు, నీటిలో పుట్టినవాటిని, రహస్యముగా లభించిన వాటిని అనుభింవించువాడుగా నుండును. బుధుడు త్రింశాంశలో ఉన్నచో మేధావి, కలాకోవిదుడు, కావ్యకర్త, శిల్పకారుడు, వివాదములు కపటము కలవాడు, శాస్త్రార్భజ్ఞుడు, సాహసి యగును. శుక్రుడు స్వాంశలో ఉన్నచో బహుసంతానము, సుఖము, ఆరోగ్యము, రోగము, సౌందర్యము ధనము కలవాడు, లలితాంగుడు, ఇంద్రియానుకూలముగా సంచరించువాడుగా నుండును. కుజాది గ్రహములతో సూర్యచంద్రులు కలిసున్నచో శూరుడు, స్తబ్ధుడు, విషమ వధను పొందువాడు, సద్గుణములు కలవాడు, సుఖమునందభిలాష కలవాడు, సుందరాంగములు కలవాడుగా నుండును. మూలత్రికోణ స్వస్థాన ఉచ్చస్థానములలో కంఠస్థానమున నున్న గ్రహములు పరస్పరము సహకారమందించువారు, విశేషించి కర్మసాధకులుగా నుందురు. విషమరాశులలో గ్రహములుండగా వర్గోత్తమమున జన్మించుట శుభకరము. కేంద్రములు శూన్యముగా నుండక, కారక గృహములలో గురు, జ్మేశ లగ్నేశులుండగా కేంద్రములో నున్న గ్రహములు మధ్యకు సౌఖ్యమును ఇచ్చెదరు. అంత్యాంత రాదులలో నున్న గ్రహములు, భాస్కర కుజుల ప్రవేశమున, శుక్రగురులు మద్యనుండగా, శని చంద్రులు అంత్యమున నున్నపుడు ఫలప్రదులగుదురు. బుధుడెప్పుడూ ఫలదాయకుడే. లగ్నమునుండి అయిదవస్థానమున ఏడవస్థానమున నున్నచంద్రుడు శుభగ్రహములతో కలిసియున్నను, శుభరాశ్యధిపతులతో చూడబడిననూ, సంపదలు సమృద్ధిగా కలుగును. స్వత్వముండును. సూర్యుడు మీనరాశిలో శనితో కలిసున్నచో స్త్రీని చంపును. అయిదవస్థానమున నున్న కుజుడు కూడా స్త్రీఘాతమును చేయును. నాలుగవస్థానమున ఎనిమిదవస్థానమున క్రూరగ్రహములున్నపుడు, క్రూరాంతరమున శుక్రుడున్నపుడు, సద్గ్రహములతో కలిసి ఉండక చూడబడనిచో పుట్టినస్త్రీకి అగ్నిపాతము వలన మృతి సంభవించును. సూర్యచంద్రులు లగ్నాద్యపాణి గతులైనపుడు, స్త్రీ గ్రహముతో కలిపసియున్నపుడు, సప్తమ స్థానమున నున్నపుడు, శుక్ర సూర్యులు తొమ్మిదవస్థానమున అయిదవస్థానమున నుండి వికల స్త్రీగతులైనపుడు, కోణోదయమున, అస్తాంత్యసంధిలో శుక్రుడున్నపుడు వంధ్యాపతి పుట్టును. అయిదవస్థానమున సౌమ్యగ్రహములు కలదికానపుడు, అంత్యాస్తుదయరాశులలో గ్రహములున్నపుడ, పాపగ్రహలుల అయిదింట ఉన్నపుడు, చంద్రుడు క్షీణ దశలో నుండగా అల్పాయుష్కులగు భార్యాపుత్రులుందురు. శని శుక్రునితో కలిసి ఉన్నను, శుక్రునిచే చూడబడినపుడు పుట్టినవాడు పరదారరతుడగును. శని శుక్రులు చంద్రునిలో కాని, స్త్రీగ్రహములతో కాని కలిసున్నచో పురుషుడు పుంశ్చలుడగును. శుక్రుడు చంద్రుడు అస్తగతులైనపుడు పురుషుడు కాని స్త్రీకాని, పుత్రుడుకాని, శుభగ్రహములచే చూడబడిన స్త్రీ పురుషులు పరిణతాంగులౌదురు. చంద్రుడు, శుక్రుడ, పాపగ్రహములు, తమరాశిలో అస్తగతులైనచో వంశవినాశకుడు జన్మించును. త్య్రంశాధిపతి బుధునితో కలిసి కేంద్రములోనున్న శనిచే చూడబడినపుడు శిల్పియగును. శని అంశలో భృగువీక్షణమున్నపుడు, లేదా భృగువు నీచలో ఉన్నపుడు, సూర్యచంద్రులు అస్తగతులైనను, శనిచే చూడబడిననూ దాసీపుత్రుడగును. పాపగ్రహములచే చూడబడిన శని కుజులు, లేదా అస్తగతులైన, శనికుజులు వాతరోగమును కలిగింతురు. కర్కాటక వృశ్చికాంశ గతము కేంద్రమైనపుడు, లేదా పాపగ్రహములు కేంద్రమున ఉన్నపుడు గుప్తరోగములు కలుగును. చంద్రుడు పాపగ్రహమధ్యమునున్నపుడు, సూర్యుడు ఏదవస్థానమున నున్నపుడు కుష్ఠురోగము కలుగును. చంద్రుడు తన స్థానమున నుండి, కుజుడు అస్తగతడై, శని విషమ రాశలో ఉన్నపుడు పుట్టినవాడు వికల మనస్కుడగును. గ్రహములు ఒకదాని అంశలో వేరొకటి ఉన్నపుడు శూలరోగము కలుగును. సూర్యచంద్రుడు కలిసియుండగా కృశాండగును. ఏడవస్థానమున సూర్యుడు, ఆరవస్థానమున చంద్రుడు, రెండవస్థానమున కుజుడు, అంత్యమున (12) శని ఉన్నచో చరగ్రహ గత దోషమువలన అంధుడు నిరశ్రయుడగును. పాపగ్రహములు తొమ్మిది పదకొండు, మూడు, అయిదు స్థానములలో ఉండి సౌమ్యగ్రహములచే చూడబడినచో చెవులకు హాని చేతురు. పాపగ్రహములు 7వ స్థానమున నున్నచో దంతములకు వికారమును కలిగింతురు. లగ్నమున గురువు 7వ స్థానమున శని యున్నచో వాతరోగముచే సీడించబడును. కుజుడు నాలుగుస్థానమున కాని, అస్తగతుడుగా కాని ఉన్నచో, బృహస్పతి లగ్నమున శనితో కలిసి ఉదయించినపుడు, కుజుడు అయిదవస్థానమున, ఏడవస్థానమున బుధునితోకలసి చంద్రుడున్నను ఉన్నాదావస్థను చెందును. 12వి స్థానమున చంద్రుడున్నను ఉన్మత్తుడగును. అయిదు. తొమ్మిది, రెండు, పన్నెండు స్థానములలో పాపగ్రహములున్నచో బంధనము కలుగును. సర్పశృంఖలతో పాపగ్రహములు చూచినపుడు, బలయుతులగు పాపగ్రహముల చూపున్నపుడు, శనితో కలిపియున్న చంద్రుడు వక్రదృష్టి గలవాడైనపుడు అపస్మారము కలవాడు, దుష్టవాక్కుగలవాడు, క్షయరోగము కలవాడగును. సూర్యుడు శని కుజులు స్వస్థానములలో నుండి సౌమ్యగ్రహములచే చూడబడినపుడు, మండలములతో కూడియున్నపుడు ఇతరులచే పోషించబడువారు వరుసగా ఉత్తమ మద్యమాధములుగా నుందురు. ఈ సమయమున పురుషుడు జన్మించినచో వేశ్యస్త్రీలకు తగిన ఫలమును చెప్పవలయును. స్త్రీలు తమభర్తలయందు సర్వకార్యభారమునుంచి, వారు మరణించినపుడు మరణించుట స్త్రీలఫలము. అట్లే వీరు కూడా యజమానులందు సర్వభారముంచి వారు మరణముతో మరణమును పొందెదరని చెప్పవలయును. చంద్రుడు లగ్నమున నున్నను, ఏడవస్థానమున నున్ననూ ద్విస్వభావరాశులలో కాని లగ్నమున కాని చంద్రుడున్నచో స్త్రీతన స్వభావముతో నుండును. లగ్నచంద్రుడు కాన సప్తమ చంద్రుడు కాని శుభగ్రహములచే చూడబడినపుడు పుట్టిన స్త్రీ సత్స్వభావము, ఆభరణములు కలిగియుండును. లగ్నసప్తమ చంద్రులు ఓజస్థులైనపుడు పురుషాకారము, పురుష స్వభానము కలదౌను. ఒక వేళ లగ్న, సప్తమ చంద్రులు పాపగ్రహములచే చూడబడినచో పాపులు, గుణహీనులు అవుదురు. కుజుని స్థానములో కుజుడు కాని, శనికాని, గురువుకాని, బుధుడు కాని, శుక్రుడు కాని యున్నచో వరుసగా స్త్రీ బాల్యమును దుష్టురాలు, దాసి, సాధ్వీ, మాయావతీ, తొందరపాటు గలదగును. పైన చెప్పబడిన గ్రహములచే చూడబడిననూ ఆ ఫలములే కలుగును. ఆ గ్రహములు బలయుతులైనచో మంచిరూపము, మంచిశీలము కలదగును. ఆ గ్రహములు పాపగ్రహములచే చూడబడినపుడ పాపులు గుణహీనులు అగుదురు. శుక్రుడు స్వస్థానమున నున్నచో దుష్టవాక్కు గలది, పునర్భూ, గుణవంతురాలు, విజ్ఞురాలు, ఖ్యాతి గలదియగును. బుధుడున్నపుడు సమురాలు, దీనురాలు, సాధ్వి, గుణవతి చంచలస్వభావము కలదగును. ద్వంద్వభే సై#్వరిణీ శఘ్నీ గుణాఢ్యా శిల్పికాధమా, వాచాటా కులటా సింహే రాశీపుంధీరగమ్యతా. 301 జైవే గుణాఢ్యాల్పిరతిర్గుణజ్ఞాజ్ఞానినీ సతీ, దాసీ నీచరతా సాధ్వీ మాందే దుష్టానపత్యకా. 302 లగ్నేందుయుక్తైస్త్రింశాంశై ఫలమేతద్బలానుగమ్, దృగ్గైర్మిధోంశే శుక్రార్కీ శౌక్రే చేద్వా ఘటాంశ##కే. 303 స్త్రీభిస్త్స్రీమైధునం యాతి మదనానలదీపితా, శూన్యే కాపురుషే ద్యూనే బలే క్లీబో న సదృశి. 304 బుధర్క్యోశ్చరభౌ నిత్యం పరదేశపరాయణః, తత్సృష్టా మందగే సూర్యే స్త్రీ బాలా విధవా కుజే. 305 పాపదృష్టే శనౌ ద్యూనే కన్యైవాపద్యతే జరామ్, ఆగ్నేయైర్విధవాస్తస్ధై పునర్భూమిశ్రకైర్భవేత్. 306 క్రూరే హీనబలే೭స్తస్థే పరిత్యక్తా నసద్దృశి, మిధోంశ##గైస్సితారౌ తు కరుతో೭న్యరతాం స్త్రియమ్. 307 శీతరశ్మిర్యదా ద్యూనే తదా భర్తురనుసయా, సౌరారర్కే లగ్నరతే సేందుశుక్రే తు బంధకే. 308 మాత్రాసార్ధమసద్దృష్టే తథా కౌజేంశ##కే೭స్తగే, మందదృష్టే వ్యాదియోనిస్సద్గ్రహాంశే పతిప్రియా. 309 మందరే వాంశ##కే ద్యూనే వృద్ధౌ మూర్గః పతిస్త్స్రియాః, స్త్రీలోలః క్రోధనః కౌజే బౌధే విద్వాంశ్చ నైపుణః. 310 జితేంద్రియో గుణీ జైవే చాంద్రే కామీ మృదుస్తథా, శౌక్రే సౌభాగ్యయుక్కాంథ స్సౌరేతమృదుకర్మకృత్. 311 శుక్రాబ్జయోర్లగ్నయో సుఖినీర్ష్యాసమన్వితా, జేన్ద్యోః కలాసు నిపుణా సుఖితా చ గుణాన్వితా. 312 శుక్రజ్ఞియోస్తు శుభగా కలాజ్ఞా రుచిరాంగనా, అనేకసౌఖ్యార్ధగుణా లగ్నే సౌమ్యత్రయే స్థితే. 313 క్రూరే೭ష్టమే೭ష్టమేశాంశే యస్య స్యాత్తద్వయస్సమే, వైధవ్యం చ మృతిస్తస్యాస్వయసత్స్వర్ధగేషు తు. 314 అల్పాపత్యత్వమబ్జేస్యా కన్యాలిహరిగోషు తు, సౌరే మధ్యబలే చంద్రశుక్రజ్ఞైర్బలివర్జితైః. 315 శేషైస్సవీర్యైరోజరే లగ్నే కురూపిణీ భ##వేత్, జీవారకవిసౌమ్యేషు బలిషు సమభౌ తనౌ. 316 విఖ్యాతా నైకశాస్త్రజ్ఞా వనితా బ్రహ్మవాదినీ, పాపే೭స్తే నవమస్థస్య ప్రవ్రజ్యామేతి భామినీ. 317 ఉద్వాహే వరణ ప్రశ్నే సర్వమేతద్విచింతయేత్, మృత్యస్థానం పశ్యతాం స్యాద్బలినా ధాతుకోపతః. 318 నృణాం మృత్యుహితం యుక్తం భాగాత్రోస్ధోపధభూరిభిః, స వీర్యైర్బహుజో೭గ్య్రక్షతజ్వరరుగుద్భవః. 319 క్షుతృడ్భవశ్చాష్టమస్దై సూర్యాద్యైశ్చ వరాదిషు, సరస్వాద్వప్రదేశేషు మృత్యుస్సూర్యమహీజయోః. 320 స్వబంధుస్ధితయోః పుంశఃశైలాగ్రాభిరుతస్య చ, మంధ్వస్తకర్మగైర్మందభూజైరృష్టే ప్రహౌ మృతిః. 321 స్త్రియాం హియోష్ణకరయోః స్వజనాత్పాపదృక్తయోః, తోయమృతో రవీదృతు స్యాంతాయాద్యుభయోదయే. 322 శస్త్రాగ్నిజో శుభాంతస్దే చంద్రే భౌమగృహస్ధితే, మృత్యుశ్చాథ మృగే చంద్రే కర్కే మందే జలోదరాత్. 323 స్త్రియామిందే రక్తశోధాత్సారే వాయ్వగ్నిపాతజః, పుత్రధర్మస్థయోర్బంధాత్పాపయోస్సదదృష్టయోః. 324 సయాసశం యనిగడైర్దృకైర్మృత్యౌ తు బంధనైః స్తియా సపాపే೭బ్జేద్యూనే సితే మేషే రవౌ తనౌ. 325 మరణం స్త్రీకృతే గేహే హ్యథ తుర్యౌ కుజే రవౌ, యమే ఖేం೭గత్రికోణ్దౖః క్షీణచంద్రా శుభైస్సకృత్. 326 తుర్యే೭ర్కే ఖే కుజే క్షీణచంద్రదృషటే సమిద్ధతః, రంధ్రఖాంగజలై క్షీణంద్వారార్కిరవిసంయుతైః. 327 లకుటేనాథ తైరేవ ఖాంకాంగతనయస్ధితైః, ధూమా నిబంధనైః కార్యాఃకుదనైర్మరణం భ##వేత్. 328 బంధ్వస్తఖసై#్తర్భౌమార్కమందైశ్శస్త్రాగ్నిరాజభిః సౌరేంద్వారై స్స్వాంబుసంస్దై క్షతక్రేమ్యంగయా తతః. 329 స్వేర్కే తుర్యే కుజేయానపాతాదధ కుజేస్తగే, యంద్రసీదునతః క్షీణచంద్రయుక్తే మృతిర్భవేత్. 330 భౌమార్కీ శీతకరిణౖర్జూకాజని శనిభాస్ధితైః క్షీణీం ద్వర్కమజైః ఖాస్తాంబుస్ధైర్వారకరైర్మృతిః. 331 బల్యారదృష్టే క్షీణందౌ మందే నిధనసంస్థితే, గుహ్యరుక్కృమిశస్త్రాగ్నిదారుజో మృత్యురంగిరాః 332 సౌరే೭ర్కేస్తే మృతో మందే క్షీణందౌ భువ్యసంయుతే, లగ్నధ్యాయాస్తపఃఖార్కభౌమచంద్రనిశాకరైః. 333 శైలశృంగస్వరుగ్రపాతైర్ను నిధనం భ##వేత్, దృక్కోంత్తరే తుర్ద్వావింసస్తత్పతిర్మృత్యుపో೭పి వా. 334 స్వగుణౖర్నిధనం కుర్యాద్బలవాన్యో ద్వయోర్భవేత్, లగ్నాంశే ససదృక్థ్సానే మృత్యుర్యోగే క్షణాదిభిః. 335 మోదోంతే నుదితాంశస్య తుల్యో ద్విఘ్నస్స్వపేక్షితే, శుభేక్షితే తు త్రిగుణః కల్ప్సమన్యత్స్వ బుద్ధితః. 336 వహ్న్యంబుభస్మసక్లేదశోషవ్యాలైర్మృతిస్ధితైః మందుతశ్చింతనీయశ్చ యథోక్తో మృత్యురంగినః. 337 గురుశ్శశాంకశుక్రౌ చ సూర్యభౌమౌ యమేందుజౌ, దేవపిత్రతిరక్తో೭థ నారకాన్కుర్యురష్టమే. 338 రవీన్దుబలవశ్రంశ నాథాచ్ఛ్రేష్ఠసమాధమాః, తుంగగసాందనూకేను గతిష్షడ్రంధ్రదృక్కపః. 339 ద్యూనస్థితో గురుర్వాసి రపుకేంద్రవినాశగః, స్వోచ్ఛ స్ధోంగే వ్యయే సౌమ్యభాగే మోక్షో బలాన్యతః. 340 ద్విస్వభావరాశులలో నున్నపుడు పుట్టిన స్త్రీ సై#్వరిణి, భర్తను చంపునది, గుణాఢ్యులు, శిల్పికా, అధమురాలు, వదరుబోతు, కులట అగును. సిహరాశిలో ఉన్నపుడు పురుష బుద్ధిగలది, అగమ్యురాలగును. బృహస్పతి అంశలో పుట్టిన స్త్రీ గుణాఢ్యురాలు, అల్పరతిగలది, గుణజ్ఞురాలు, జ్ఞానము కలది, సాధ్వి యగును. శని యంశలో పుట్టిన స్త్రీ దాసి, నీచులందు ప్రీతిగలది, సాధ్వి, దుష్టురాలు, సంతానము లేనిది యగును. శని లగ్నములో చంద్రునితో కలిసి ఉన్న త్రింశాంశల బలానుసారమగు ఫలితమిది. శుక్రశనులు దృగ్గోచరులై పరస్పరాంశలలో ఉన్నపుడు శుక్రుడు కుంభరాశ్యంశలో ఉన్నపుడు స్త్రీలతో స్త్రీ సంగమము చేయును. మదనాగ్ని తాపముచే దహించబడుచుండును. శూన్యముగా లగ్నమున్నపుడు దుష్టపురుషుడు జన్మించును. సప్తమరాశిలో బలయుతుడగు గ్రహమున్నచో నపుంసకుడు పుట్టును. బుధశనులు చరరాశిలో నున్నపుడు పుట్టినవాడు ఎప్పుడు పరదేశములందుండును. సూర్యుడు శనితో కలిసున్నపుడు పుట్టిన స్త్రీ అల్పగుణములు కలదిగా, కుజుడున్నపుడు బాల వితంతువగును. పాపగ్రహములచే చూడబడు శని సప్తమస్థానమున నున్నపుడు పుట్టిన కన్యగానే వృద్ధురాలగును. అగ్నిగ్రహములు భూమిగ్రహములతో కలిసున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను కోల్పోవును. క్రూర గ్రహము బలహీనుడై అస్తంగతుడేనపుడు, శుభగ్రహముల దృష్టిలేనిచో భర్తచే విడువబడును. శుక్రకుజులు పరస్పరాంశలలో ఉన్నపుడు పుట్టిన స్త్రీ భర్తకంటే పరపురుషుని యందు ప్రీతికలదగును. చంద్రుడు ఏడవస్థానమున నున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను అనుసరించి యుండును. శని కుజుల రాశులలోచంద్రునితో కలిసున్న శుక్రుడు లగ్నములో నుండగా పుట్టిన స్త్రీ బంధకి యగును. నాలుగువస్థానములో కుజాంశ అస్తగాంశలో ఉన్నపుడు, పాపగ్రహముల దృష్టియున్నపుడు, శనిదృష్టియున్నపుడు వ్యాధిగ్రస్తురాలగును. శుభగ్రహాంశలో మాత్రము భర్త యందు ప్రీతి గలదగును. శని గ్రహరాశిలో కాని, శన్యంశలో కాని, సప్తమాంశ వృద్ధిలో ఉన్నపుడు స్త్రీకి మూర్ఖుడు భర్తగా లభించును. కుజాంశలో పుట్టినవాడు స్త్రీలోలుడు కోపిష్టిగా యుండును. బుధాంశలో విద్వాంసుడు నిపుణుడుగా ఉండును. గుర్వంశలో జితేంద్రియుడు, గుణవంతుడు, చంద్రాంశలో కాముకుడు, మృదు స్వభావము కలవాడు, శుక్రాంశలో సౌభాగ్యవంతుడు, సుందరుడు, శన్యంశలో మృదుకర్మలను చేయువాడుగా నుండును. శుక్రచంద్రులు లగ్నములో నుండగా పుట్టిన స్త్రీ సుఖము కలది, ఈర్ష్యతో కూడియుండినదగును. లగ్నములో ముధచంద్రులున్నచో కలానిపుణురాలు, సుఖవంతురాలు, గుణవంతురాలు, శుక్రుడు బుధుడున్నచో శుభకరురాలు, కళలు తెలిసినది, సుందరాంగి యగును. లగ్నమున మూడు సౌమ్యగ్రహములున్నచో బహుసౌఖ్యములు, అర్ధములు గుణములు కలదిగా నుండును. క్రూరగ్రహము అష్టమస్థానమున నున్నచో, అష్టమాధి పత్యంశలో ఉన్నపుడు పుట్టినవాడు సమవయస్కురాలగు భార్యను పొందును. శుభగ్రహములు అర్ధగతములుగా నున్నపుడు పుట్టినస్త్రీకి వైధవ్యము మృతి సంభవించును. కన్యావృశ్చికము సింహము వృషభరాశులలో చంద్రుడున్నచో అల్పసంతానము కలదగును. శని మధ్య బలీయుడైనపుడు చంద్ర శుక్ర బుధులు బలహీనులుగా ఉన్నప్పుడు, మిగిలిన గ్రహములు బలీయములై ఓజ స్థానమున నున్నచో, లగ్నమున నున్ననూ కురూపిణి యగును. బృహస్పితి కుజుడు బుధుడు బలీయులై సమరాశులలో కాని లగ్నములో కాని ఉన్నపుడు పుట్టిన స్త్రీ విఖ్యాతురాలు, అనేక శాస్త్రజ్ఞురాలు, బ్రహ్మవాదిని యగును. పాపగ్రహము అస్తగతమైనపుడు, నవమ స్థానముననున్నపుడు పరివ్రాజకురాలగును. వివాహ సమయమున, కన్యావరణమున, కన్యనడుగునపడు పైన చెప్పిన విషయములనన్నింటిని విచారించవలయును. బలయుతమగు గ్రహము మృత్యుస్థానమును చూచునపడు ధాతుకోపము వలన నరులకు మృత్యుహితము యుక్తమగును. బలయుతులగు గ్రహములు అశుభస్థానములో నున్నపుడు అగ్నిచే గాయములచే, జ్వరముచే రోగములు కలుగును. సూర్యాదులు అష్టమస్థానమున నున్నచో ఆకలి దప్పులు ఎక్కువగా నుండును. సూర్యకుజులు పరగ్రహమస్థానములలో ఉన్నపుడు మృత్యువు సంభవించును. బంధు స్థానమున, కర్మస్థానమున, అస్తగులుగా శని కుజులున్నపుడు బంధువులలో నుండగా శైలాగ్రమున నుండగా మృతి సంభవించును. సూర్యచంద్రులు స్త్రీరాశిలో ఉన్నపుడు, మిత్రగ్రహములు పాపదృష్టికలిగియున్నపుడు పదకొండు పన్నెండు స్థానములలో సూర్యచంద్రులున్నపుడు, ఉదయావస్థలో ఉన్నపడు జలమున మరణము సంభవించును. అశుభరాశ్యంత్యాంశలో నున్నపుడు, కుజరాశిలో చంద్రుడున్నపుడు, మకరములో చంద్రుడు, శని కర్కాటకమున నున్నపుడు జలోదరవ్యాధిచే మరణించును. స్త్రీ రాశిలో చంద్రుడు, శని అవుభ స్థానమున నున్నపుడు వాయ్వగ్నిపాతము వలన మృతి సంభవించును. పాపగ్రహములు అయిదు తొమ్మిది స్థానములలో నున్నచో శుభగ్రహములు దృష్టిలేనపడు బంధనముచే ఆయసాదులచే మృత్యువు సంభవించును. పాపగ్రహములచే కూడియున్న చంద్రుడు స్త్రీరాశిలో యున్నపుడు, శుక్రుడు సప్తమి స్థానమున నున్నపుడు సూర్యుడు మేషమున కాని లగ్నమున కాని యున్నపుడు స్త్రీ వలన ఇంట్లోమరణము సంభవించును. కుజుడు కాని సూర్యుడు కాని నాలుగవస్థానమున నున్నపుడు. శని రాశ్యంశలో కాని త్రికోణస్థానములో కాని ఉన్నచో పాపగ్రహములతో కలిసి క్షీణ చంద్రుడున్నపుడు, సూర్యుడు నాలుగవస్థానమున నున్నపుడు, క్షీణచంద్రునిచే కుజుడు చూడబడినపుడు సమిధల చే మరణించును. క్షీణచంద్రుడు, అంగారకుడు, శని, సూర్యుడు, కలిసున్నచో రంధ్రాదులతో జలాదులో మృతి సంభవించును. మొదటి స్థానమున, రెండు మూడు స్థానములలో పైన చెప్పబడిన గ్రహములున్నచో లగుడముచే మృతి సంభవించును. పొగచే గడ్డపార మొదలగు పరికరములచే మృతి సంభవించును. బంధు స్థానమున, అస్తగునిగా, మొదటి స్థానమున కుజుడు సూర్యుడు శని ఉన్నచో శస్త్రములచే అగ్నిచే రాజులచే మృతి చెందును. శని, చంద్రుడు, కుజుడు స్వస్థానమున జలస్థానమున మొదటి స్థానమున సూర్యుడు నాలుగవస్థానమున కుజుడున్నచో వాహనము నుండి పడుట వలన మరణము కలుగును. కుజుడు అస్తంగతుడై క్షీణచంద్రునితో కలిసియున్నచో యంత్రాదులచే మృతి చెందును. కుజుడు, శని చంద్రుడు తులమేష మకర కుంభములలో ఉన్నచో, క్షీణచంద్రుడు సూర్యుడు, కుజుడు లగ్నమున, అస్తగుతుడుగా, జలస్థానమున ఉన్నచో వారజనము చేతిలో మృతి సంభివించును. క్షీణచంద్రుడు బలయుతుడగు కుజునిచే చూడబడినపుడు శని ఏడవ స్థానమున నున్నపుడు గుప్తరోగములచే, కృములచే, శస్త్రములచే అగ్నిచే దారువుచే మరణము సంభవించును అని అంగిర మహర్షి చెప్పెను. శని సూర్యుడు అస్తగంతులైనపుడు, శని ఏడవస్థానమున నున్నపుడు క్షీణచంద్రుడు భూస్థానమున నున్నపుడు, లగ్నమున, పతకొండవస్థానమున, అస్తంగతునిగా మొదటిస్థానమున సూర్యుడు, చంద్రుడు, కుజుడు చంద్రుడున్నచో పర్వతశిఖరముల నుండి పడుటచే మరణము సంభవించును. దృక్కోణములలో, నాలుగవస్థానములలో ఆయధిపతులున్నచో వారిలో బలవంతుడగు గ్రహప్రభావము వలన తనగుణముల వలననే తాను మరణించును. లగ్నాంశమునకు అధిపతి దృష్టిపడు స్థానమున నున్నచో యోగేక్షణలచే మృతి చెందును. అస్తంగతాంశలో నున్నగ్రహము అశుభగ్రములచే చూడబడినచో రెండు రెట్లు కీడు సంభవించును. శుభగ్రహములచే చూడబడినచో మూడు రెట్లు మేలు జరుగును. ఇతర విషయములను తమ తమ బుద్ధిచే ఊహించుకొనవలయును. మృత్యుస్థానమున గ్రహములున్నచో అగ్నిజల భస్మ, క్లిద, శోష, సర్పాదులచే మృతి సంభవించును. గ్రహములున్నరాశ్యంశములను బిందు మాత్రస్థానమును కూడా పరిశీలించి బుద్ధి వైభవముచే ఫలితమును చెప్పవలయును. అష్టమస్థానమున గురువుకాని, శుక్రచంద్రులు, సూర్యాంగారకులు, శని బుధులు కాని యున్నచో నరకమును కలిగించును. సూర్య చంద్రాది గ్రహములు బలవంతులతో కూడియున్నపుడు అంశాధిపతులతో కూడియున్నపుడు శ్రేష్ఠ, సమ, అధములగుదురు. గురువు ఏడవస్థానముననున్నచో రిపుస్థానమును కేంద్రస్థానమును నశింపచేయును. బృహస్పతి ఉచ్చలో ఉన్నపుడు, పన్నెండవస్థానమున బుధాంశయున్నచో ఇతర గ్రహముల బలము కూడా యున్నపుడు మోక్షము సంభవించును. ఆధానే జన్మాజ్ఞానే తు వృక్షతాం లగ్నతో వదేత్, పూర్వాపరార్ధైర్లగ్నస్య సౌమ్యే వాచ్యపనేజనిః. 341 లగ్నత్రికోణ ధీజ్యత్ర్యంశైర్వికల్పవయవాస్సమాః, గ్రీష్మోగే೭ర్కే పరై రమ్యాపనతాంపృతురర్కభాత్. 342 చంద్రజ్ఞజీవావృత్త్యస్యాః శుక్రారార్కిభిరన్యథా, దృక్కైరాద్యైః పూర్వమాసస్తిధిస్తత్రానుపాతతం. 343 విలోమ జన్మభాగైశ్చ వేలారాత్రి ద్యుసంజ్ఞకే, త్రికోణోత్తమ పార్యాం హి లగ్నంవా లభనాభ##నే. 344 యావదూనో విదుర్లగ్నాత్తావచ్చంద్రాచ్చ జన్మభౌ, గోహరీ యుగ్మవసుభౌ క్రియజకే మృగాంగనే. 345 దశాష్టసప్తవిషయే గుణ్యా శ్శేషాస్స్వసంఖ్యయా, జీవభౌమకవిజ్ఞాస్స్యు రథవాద్యాయరే జ్ఞవత్. 346 భానాం నిత్యో విధిః ఖేట వశావద్ధర్గణాస్తథా, సప్తఘ్నం భహృతం శేషమృక్షం నవధనార్ణతం. 347 ద్విఘ్నే సమర్తుమాసాస్స్యు పక్షతిధ్యౌ గజాహతే, సప్తఘ్నం హో నిశార్కాణీషు ఘ్నేగాం శేష్టహోరికా. 348 పుమాన్పరశుధృక్కృష్ణొ రక్తదృగ్రక్షితుం క్షమః, హృష్చర్తికపదాశ్వాస్యా రక్తవస్త్రా ఘటాకృతిః. 349 కపిలో హ్యంధదృక్రూరో రక్తవస్త్రః క్షతవ్రతః, క్షుత్తృషార్తో దుగ్ధపటో తానకుంచితమూర్ధజః. 350 మలినః క్షుత్పరోజాస్యో దక్షః కృషాదికర్మణి, ద్విపకాయస్సరభయా పింగలో వ్యాకులాంతరః. 351 శౌచికే రూపిణీ సాధ్వీ హ్యప్రజోచ్ఛ్రితపాణిరా, ఉద్యానే కవచీ ధన్వీ క్రీడేచ్ఛర్గరుడాననః. 352 నృత్యాదివిద్వరుణవద్బహురత్నోధనుర్ధరః, ద్విపాస్య కంఠః క్రోడాస్యః కాననే శరమాహికః. 353 ఆతవ్యశాఖాం పాలాశీం రౌతిమృర్ధాహి కర్కశా, చిపటాస్యో హి సంవీతో నౌస్థస్త్ర్యర్ధవ్రజఞ్జలే. 354 శ్వానరో జంబుకం గృధ్రం గృహీత్వా రౌతి శాల్మలౌ, ధన్వీ కృష్ణాజినీ సింహవాశ్వోన్నతమాతురః. 355 ఫలామిషఘ్నః కూర్చీ న భల్లాస్యః కపిచేష్టితః, పుష్పపూర్ణచ్ఛటా కన్యా విద్యేల్లా మలినాంబరా. 356 ధన్వీ వ్యయాపకృచ్ఛ్యామో లిపికృద్రామశో నరః, గౌరీ ధౌతాంశుకా త్సుచ్చా కుంభహస్తా సురాలయే. 357 మానోన్మాన్పాపసోతౌలీ భాండమల్పవిచింతకః, క్షుత్తృడ్యుతో నరః కుంభీ గృధ్రస్య స్త్రీసుతోపగః. 358 ధన్వీకింతరచేష్టస్తు హైమవర్మా మృగానుగః, సిందే కూజం వ్రజంతీ స్త్రీనానాసర్పసితం హి కా. 359 సౌక్యస్పృహాద్యావృతాంగీ భత్రర్ధకచ్ఛపాకృతిః, కూర్మాస్యో మలయే సింహః శ్వక్రోడమృగభీషకః. 360 వాస్యః శ్వకాయో ధానుష్కో రక్షంస్తాపసయజ్ఞియే, చంపకా భాసనే మధ్యా సింధురత్రివివర్ధినీ. 361 కూర్చాసనే చంపకాభో దండీ కౌశేయకాననీ, పరమోధో గృధ్రముఖః స్నేహమద్యాశనస్పృహః. 362 దగ్ధానస్థా లోహధరా సభూషా భాండకచ్చరా, భాండీ రోమశ్రవా శ్యామః కిరీటీ ఫలయంత్రధృక్. 363 నౌస్థో ధ్వౌసం విభూషార్ధా నానారత్నకరోంచతః స్థా బ్దేః మాలమాయాంతీ సయూధాం చంపకాననా. 364 గర్తే సర్పవృతో నమ్రో రుదంశ్చేరానలార్దితః, ఏతాదృశా క్రియాంశాతస్తు షట్త్రింశదుదితాః క్రమాత్. 365 ఏతత్సంక్షేపతః ప్రోక్తం జాతకం మునిసత్తమ, నిబోధ సంహితాం స్కంధం లోకకృత్యుపయోగినమ్. 366 ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే ద్వితీయపాదే బృహదుపాఖ్యానే జాతకనిరూపణం నామ పంచపంచాశత్తమో೭ధ్యాయః గర్భాధానము పుట్టుకతెలియనపుడు లగ్నమును బట్టిచెప్పవలయును. లగ్నము యొక్క పూర్వార్ధాపరార్ధములు సౌమ్యముగా నున్నపుడు ఫలములు చెప్పవలయును. లగ్నత్రికోణ స్థానమున అయిదవస్థానమున బృహస్పతి త్ర్యంశములతో వికల్పావయవములు సమముగా నుండును. సూర్యుడు గ్రీష్మగతుడైనపుడు ఇతరులు శుభస్థానగతులైనపుడు, సూర్యరాశినుండి చంద్ర బుధ బృహస్పతుల ఆవృత్తులతో ఒక ఫలితము, శుక్ర కుజ శనుల ఆవృత్తిచే మరొక ఫలితము సంభవించును. దృగ్గణితముననుసరించి కుజాదులచే పూర్వమాస తిథులను అనుపాతము వలన తెలియనగును. విలోమ జన్మభాగములచే కాలమున రాత్రిపగలు అను సంజ్ఞలు ఏర్పడును. త్రికోణ ఉత్తమ వర్గలననుసరించి లగ్నమును లగ్నాంశములను గుర్తించవలయును. లగ్నము నుండి చంద్రుడెంత తక్కువగా నుండునో అంత చంద్రుని నుండి తక్కువగా లగ్నరాశిని చూడవలయును. 1, 11 స్థానములు, సరిస్థానములు, అష్టమరాశులు, క్రియాజనము, మకర కన్యలు 10, 8, 7 విషయమున స్వసంఖ్యచే శేషమును గుణించవలయును. గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఆఘవాద్యాయరము లందు బుధునివలె అగును. రాశులకు నిత్యవిధి యుండును. గ్రహములవశము వలన అర్థగణములేర్పడును. ఏడుచే కొట్టివేయబడినదానిని పన్నెండుచే భాగించగా మిగిలిన దానిని నక్షత్రసంఖ్యచే నవ, ద్విసంఖ్యలచే ఋణముగొని రెండుచే భాగించగా సంవత్సర, ఋతుమాసములు ఏర్పడును. ఎనిమిదిచే కొట్టివేయగా పక్షములు తిధులేర్పడును. అయిదుచే భాగించగా పగలురాత్రులు వచ్చును. గోంశాష్టము హోరలగును. కృష్ణవర్ణుడు పరశుధారియగు పురుషుడు, రక్తనేత్రుడు రక్షణకు సమర్థుడు. స్త్రీ అయినచో హృష్టర్తి. సపాదములు గలది. అశ్వము కలది, రక్తవస్త్ర, ఘటాకారము కలదిగానుండును. కపిలుడు అంధదృష్టి కలవాడు, క్రూరుడు, రక్తవస్త్రుడు, క్షతవ్రతుడు, ఆకలిదప్పులచే ఆర్తుడు, తేల్లని వస్త్రములు కలవాడు, ఖండించబడిన పొట్టి వెంట్రుకలుకలవాడు, మలినుడు, క్షత్పరుడు, అజముఖుడు, కృష్యాదికర్మలలో దక్షుడు. ఏనుగువంటి శరీరము కలవాడు, సరభము వలన పింగలవర్ణుడు, వ్యాకులమైన మనసు కలవాడుగా పురుషుడుండును. శౌచము కలది, రూపవతి, సంతానములేనిది, బలిసియున్న చేతులు కలదిగానుండును. కవచమును ధనువును ధరించి నరుదాననముతో ఉద్యానమున క్రీడేచ్ఛ గలవాడు నృత్యాదులు తెలిసినవాడు, వరుణుని వలె బహురత్నములు కలవాడు, ధనుర్ధరుడు, ఏనుగు ముఖము కంఠము కలవాడు, క్రోధముఖము కలవాడు, అరణ్యమునందు శరములచే వేటాడువాడు, పలాశశాఖను ధరించువాడు శిరస్సు సర్పమువలె కఠినముగా నుండునది, చపలాస్యుడు, సంవీతుడు, నౌకలో ఉండువాడు, స్త్రీ కొరకు జలమును పయనించువాడు. సారమేయము లేదా నరుడు జంబుకమును గద్దను తీసుకొని బూరుగువృక్షము మీద నిలుచుని అరుచువాడు, ధనుర్ధారి, కృష్ణాజనమును ధరించువాడు, సింహమువలె అశ్వమువలె గంభీరుడు, ఉన్నతుడు, ఆర్తుడు, ఫలామిషములను హరించువాడు, కూర్చను ధరించువాడు, భల్లాస్యుడు, వానర చేష్టలు కలవాడు, స్త్రీ అయినచో పూలునిండిన బుట్టను ధరించునది, కన్య, మలినాంబరధారిణిగా తెలియవలయును. పురుషుడైనచో ధనుర్ధారి, వ్యయమును తొలగించువాడు, శ్యాముడు, లిపికారుడు, ఆరామమును చేయువాడు, నరుడు. స్త్రీ అయినచో గైరి, శుభ్రవస్త్రము కలది, మద్యశాలలో కుంభహస్త, అభిమానమును తొలగించువాడు, పాపిష్ఠుడు, భాండమును తాచువాడు, చింతకుడు, ఆకలిదప్పులు కలవాడు, మంభీ, గృధ్రాస్యుడు, స్త్రీసుతోపగుడు, ధనుర్ధారి, కింకరచేష్టుడు, బంగారు కవచము కలవాడు, మృగముల వెంటవెళ్ళువాడు, సముద్రమున అరుచుచు వెళ్ళు స్త్రీ నానాసర్పహస్త, సౌఖ్యమునందు అభిలాష కలది, శరీరమును కప్పుకొనునది, కచ్ఛపాకారము కలది, మార్మాస్యుడు, మలయపర్వతమున సింహము, శునకవరాహమృగములకు భయమును కలిగించువాడు, వాస్యుడు, శునక శరీరుడు, ధనుర్ధారి, తాపసుయజ్ఞములను రక్షించువాడు, చంపకము వంటి ఆసనమధ్యమున నుండునది, నదులను వృద్ధి పొందించునది, కూర్చాసనమున చంపక కాంతిగలవాడు, దండధారి, కౌశేయమును ధరించువాడు, ఉత్తముడు, గృధ్రముఖుడు, తైలమును మద్యమును సేవించుటలో అభిలాష కలవాడు, కాలిన బండిలో ఉండునది, లోహమును ధరించునది, భూషణములు కలది, భాండమును ధరించుచు తిరుగునది, భాండము కలది, రోమములు కల చెవులు కలది, శ్యాముడు, కిరీటము కలవాడు, ఫలయంత్రమును ధరించువాడు, నౌకలో ఉండువాడు, భుజములను అలంకరించుకొనుటకు నానారత్నములను చేతులలో ధరించి యున్నవాడు, పడవలో ఉండిన సముద్రతీరమునకు వచ్చుచు సైన్యముతో కూడియున్నది, చంపకముఖి, గోతిలో సర్పములచే చుట్టబడియున్నవాడు, నగ్నుడు, చోరులచే అగ్నిచే బాధించబడి ఏడ్చువాడు, అని పైన చెప్పబడిన ఈ ముప్పదియారు క్రియాంశలు క్రమముగా ఫలితములుగా నుండును. ఓ మునీశ్వరా! ఇది జాతకము. సంక్షేపముగా చెప్పితిని. లోకకృత్యములకు ఉపయోగించు సంహితా భాగమును ఒక తెలుసుకొనుము. ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బృహదుపాఖ్యానమున జాతకనిరూపణమను యాబదియైదవ అధ్యాయము ముగిసినది.