Sri Naradapuranam-I    Chapters    Last Page

షట్పంచాశత్తమో7ధ్యాయః = యాబదియారవ అధ్యాయము

సంహితానిరూపణమ్‌

సనందన ఉవాచ :-

క్రమాచ్చైత్రాదిమాసేషు మేసాద్యాస్సంక్రమా మతాః, చైత్రశుక్లప్రతిపది యో వారస్సనృపస్మృతః. 1

మేషప్రవేశే సేనానీ కర్కటే సస్యపో భ##వేత్‌, సమోధ్యధీశ్వరస్సూర్యో మధ్యమశ్చోత్తమో విధుః. 2

నేష్టః కుజో బుధో జీవో భృగుస్త్వతిశుభంకరః, అధమో రవిజో వాచ్యో జ్ఞాత్వా చైషాం బలాబలమ్‌. 3

దండాకారే కబంధే వా ధ్వాంక్షాకారేధకీలకే, దృష్టేర్కమండలే వ్యాధిర్భ్రాన్తిశ్చోరార్థనాశనమ్‌. 4

ఛత్రధ్వజపతాకాద్యసన్నిభస్తిమితైర్ధ్వనైః, రవిమండలగైర్ధూమైః సస్ఫులింగైర్జగత్కయః. 5

సితరక్తైఃపీతకృష్ణైర్వర్ణైర్విప్రాదిపీడనమ్‌, ఘ్నంతి ద్విత్రిచతుర్వర్ణైర్భువి రాజజనాన్మునే. 6

ఊర్ధైర్భానునకరైస్తామ్రైర్నాశం యాతి చమూపతిః, పీతైర్నృపసుతశ్శ్వేతైః పురోధాశ్చిత్రజైర్జనాః. 7

ధూమ్రైర్నృపః పిశంగైస్తు జలదాధోముఖైర్జగత్‌, శుభోర్కశ్శిశిరే తామ్రః కుంకుమాభా వసన్తికే. 8

గ్రీష్మశ్చాపాండురశ్చైవ విచిత్రో జలదాగమే, పద్మోదరాభశ్శరది హేమంతే లోహితచ్ఛవిః. 9

పీతశ్శీతే సితే వృష్టే గ్రీష్మే లోహితభారవిః, రోగానావృష్టిభయకృత్‌ క్రమాదుక్తో మునీశ్వర. 10

ఇంద్రచాపార్ధమూర్తిస్తు భానుర్భూపవిరోధకృత్‌, శశరక్తనిభే భానౌ సంగ్రామో న చిరాద్భువి. 11

మయూరపత్రసంకాశో ద్వాదశాబ్దం న వర్షతి, చంద్రమాసదృశో భానుః కుర్యాద్భూపాంతరం క్షితౌ. 12

ఆర్కే శ్చామే కీటభయం భస్మాభే రాష్ట్రజం తథా, ఛిద్రేర్కమండలే దృష్టం మహారాజవినాశనమ్‌. 13

ఘటాకృతిః క్షుద్భయకృత్‌, పురహా తోరణాకృతిః, ఛత్రాకృతౌ దేశహతిః, ఖండభానుర్నృపాంతకృత్‌. 14

ఉదయాస్తమయే కాలే విద్యుదుల్కాశనిర్యది, తదా నృపవధో జ్ఞేయస్త్వధవా రాజవిగ్రహః. 15

పక్షం పక్షార్ధమర్కేందుపరివిష్టావహర్నిశమ్‌, రాజానమన్యం కురుతో లోహితాంబుదయాస్తగౌ. 16

ఉదయాస్తమయే భానురాచ్ఛిన్నశ్శస్త్రసన్నిభైః, ఘనైర్యుద్ధం ఖరోస్త్రాద్యైః పాపరూపైర్భయప్రదమ్‌. 17

సనందన మహర్షి పలికెను :- చైత్రము మొదలు ఫాల్గునము వరకు పన్నెండు నెలలలో వరుసగా మేషము మొదలు మీనము వరకు పన్నెండు సంక్రమణములుండును. చైత్రశుద్ధప్రతిపత్‌ ఏవారమున వచ్చునో ఆగ్రహమే ఆ సంవత్సరమునకు రాజగును. మేషసంక్రమణము ఏ వారమున ప్రవేశించునో ఆగ్రహము సేనాపతియగును. కర్కటసంక్రమణము ఏవారమున వచ్చునో ఆగ్రహము సస్యాధిపతి యగును. సూర్యుడు రాజుగా గల సంత్సరము మధ్యమము. చంద్రుడు రాజుగా గల సంవత్సరము ఉత్తమము. కుజుడు బుధుడు బృహస్పతి రాజుగా ఉన్న సంవత్సరము మంచిది కాదు. శుక్రుడు రాజుగా ఉన్నచో మిక్కిలి శుభమును కలిగించును. శనిరాజుగా ఉన్నచో అధమము. ఇట్లు ఈ గ్రహముల బలాబలమునుతెలిసి విశేష ఫలమును చెప్పవలయును. సూర్యమండలమున దండాకారముకాని, కబంధాకారము కాని, ధ్వాంక్షాకారము కాని, కీలకముకాని కనపడినచో వ్యాధి, భ్రాంతి, చోరుల వలన అర్థనాశము జరుగును. ఛత్రద్వజపతాకాద్యాకారములుకాని స్ఫులింగములతో పొగవలె సూర్యమండలమున కనబడినచో ప్రపంచనాశము సంభవించును. తెలుపు ఎరుపు రంగులు, పసుపు నలుపు రంగులు కనబడినచో వప్రాదులకు పీడకలుగును. రెండు, మూడు, నాలుగు రంగులు ఒకేసారి కనబడినచో రాజులను ప్రజలను నశింపచేయును. తామ్రవర్ణములు గల సూర్యకిరణములు ఊర్థ్వముగా కనబడినచో సేనాపతి నశించును. పీతవర్ణము కలవైనచో రాజపుత్రుడు, తెలుపు వర్ణము కలవైనచో పురోహితుడు, చిత్రవర్ణమున్నచో ప్రజలు నశింతురు. ధూమ్రవర్ణము కలిగి యున్నచో రాజు, పిశంగవర్ణము కాని, మేఘవర్ణముకాని కలిగి అధోముఖముగా నున్నచో జగత్తు నశించును. శిశిరరుతువున సూర్యుడు తామ్రవర్ణగుడైనచో శుభకరుడగును. వసంతరుతువున కుంకుమవర్ణుడు శుభకరుడు. గీష్మర్తువులో ఆపాండురవర్ణము కలిగియున్న శుభకరుడు. వర్షఋతువులో చిత్రవర్ణుడు, శరదృతువున పద్మోదరవర్ణుడు, హేమంతఋతువులో లోహిత వర్ణుడు శుభకరుడు. శీతకాలమున పీతవర్ణుడు, వర్షర్తువులో శ్వేతవర్ణుడు, గ్రీష్మమున లోహిత వర్ణుడు, క్రమముగా రోగమును, అనావృష్టిని, భయమును కలిగించునని చెప్పబడినది. ఇంధ్రధనువులో అర్థభాగము వంటి ఆకారముగల సూర్యుడు రాజులకు విరోధమును కలిగించును. కుందేటి నెత్తురు వర్ణముగల సూర్యుడు భూమండలమున త్వరలో యుద్ధము జరుగునని తెలుపును. నెమిలిపింఛము రంగు కలిగియున్నచో పన్నెండు సంవత్సరములు భూమిమీద వర్షము కురియును. సూర్యుడు చంద్రునివలె యున్నచో కొత్తరాజును ఏర్పరచును. సూర్యుడు శ్యామవర్ణుడైనచో కీట భయము, భస్మవర్ణుడైనచో రాష్ట్రమువలన భయము, అర్కమండలమున ఛిద్రము కనపడినచో మహారాజనాశము, ఘటాకారముననున్నచో ఆకలిభయమును, తోరణాకారమున నున్నచో పట్టణనాశనమును, ఛత్రాకారమున నున్నచో దేశమునకు హానిని, ఖండభానువు రాజనాశనమును కలిగించును. సూర్యోదయ సమయమున, అస్తమయ సమయమున మెరుపులు, ఉల్కాపాతము, పిడుగు పాటు సంభవించినచో రాజవధ కాని, రాజులకు విరోధముకాని జరుగును. పక్షముకాని పక్షార్థముకాని పగలు రాత్రి సూర్యచంద్రులకు పరివేషము కనబడినచో ఉన్న రాజు పోయి కొత్తరాజు వచ్చును. అస్తమయ సమయమున శస్త్రముల ఆకారముకల మేఘములచే సూర్యుడు కప్పబడియున్నచో యుద్ధము సంభవించును. గాదిదలు, ఒంటెలు వంటి ఆకారముగల మేఘములచే కప్పబడినచో భయమును కలిగించును.

యామ్యశృంగోన్నతశ్చన్ద్రశ్శుభదో మీనమేషయోః, సౌమ్యశృంగోన్నతశ్శ్నేష్ఠో నృయుఙ్మకరయోస్తథా. 18

ఘటోక్షస్తు సమః కర్కచాపయోశ్శరసన్నిభః, ఛాపవత్కౌర్మహర్యోశ్చ శూలవత్తులకర్కయోః. 19

విపరీతోదితశ్చంద్రో దుర్భిక్షకలహప్రదః, ఆషాఢద్వయమూలేన్ద్రధిష్ణ్యానాం యామ్యగశ్శశీ. 20

అగ్నిప్రదస్తేయచరవనసర్పవినాశకృత్‌, విశాఖామిత్రయోర్యామ్యపార్శ్వగః పాపగశ్శశీ. 21

మధ్యమః పితృదైవత్యే ద్విదైవే సౌమ్యగశ్శశీ, అప్రాప్యపౌష్ణభాద్రౌద్రామదుక్షావిశశీ శుభః. 22

మధ్యగో ద్వారదక్షాణి అతీత్య నవవాసవాత్‌, యమేంద్రాహీశనోయేశ మరుతశ్చార్థతారకాః. 23

ధ్రువాదితిద్వివాస్స్యురధ్యర్ధాంశ్చాపరాస్సమాః, యామ్యశృంగోన్నతో నేష్టశ్శుభశ్శుక్లే పిపీలికా. 24

కార్యహనిః కార్యవృద్ధిర్హానివృద్ధిర్యథాక్రమమ్‌, సుభిక్షకృద్విశాలేందురవిశాలోఘనాశనః. 25

అధోముఖే శస్త్రభయం కలహో దండసన్నిభే, కుజాద్యైర్నిహతే శృంగే మండలే వా యథాక్రమమ్‌. 26

క్షేమాద్యం వృష్టిభూపాల జననాశః ప్రజాయతే, సత్యాష్టనవమరేషు సోదయాద్విక్రమే కుజే. 27

తద్వక్రముష్ణసంజ్ఞం స్యాత్ప్రాజాపీడాగ్నిసంభవః, దశ##మైకాదశే ఋక్షే ద్వాదశర్వాగ్రతీపయః. 28

కూక్రం వక్రముఖం జ్ఞేయం సస్యవృష్టివినాశకృత్‌, కుజే త్రయోదశే ఋక్షే ద్వాదశర్వాగ్రతీపయః. 29

బాలాస్యచక్రం తత్తస్మిన్‌ సస్యవృష్టివినాశనమ్‌, పంచదశే షోడశ##ర్కే వక్రే స్యాద్రుధిరాననమ్‌. 30

దుర్భిక్షం క్షుద్భయం రోగాన్‌ కరోతి క్షితినందనం, అష్టాదశే సప్తదశే తద్వక్త్రం ముసలాహ్వయమ్‌. 31

దుర్భిక్షం ధనధాన్యాదినావనే భయకృత్సదా, ఫాల్గున్యోరుదితో భౌమో వైశ్వేదేనే ప్రతిపగః. 31

అస్తగశ్చతురాస్యార్కే లోకత్రయవినాశకృత్‌, ఉదితశ్శ్రవణ పుష్యే వక్తృగోశ్వానహానిదః. 32

యద్దిగ్గోభ్యుదితో భౌమస్తద్దిగ్భూపభయప్రదః, మఘామధ్యగతో భౌమస్తత్ర చైవ ప్రతీపగః. 34

ఆవృష్టిశస్త్రభయదః పీడ్యం దేవా నృపాంతకృత్‌, పితృద్విదైవధాతౄణాం భిద్యంతే గండతారకాః. 35

దుర్భిక్షం మరణం రోగం కరోతి క్షితిజస్తదా, త్రిషూత్తరాసు రోహిణ్యాం నైరుతే శ్రవణ మృగే. 36

అవృష్టిదశ్చరన్భౌమో దక్షిణ రోహిణీస్థితః, భూమిజస్సర్వధిష్ణ్యానాముదగామీ శుభప్రద. 37

యామ్యగోనిష్టఫలదో భ##వేద్భేదకరో నృణామ్‌, వినోత్పాతేన శశినః కదాచిన్నోదయం వ్రజేత్‌. 38

అనావృష్ట్యగ్నిభయకృత్‌ అనర్థనృపవిగ్రహః, వసువైష్ణవవిశ్వేన్దుధాతృభేషు చరన్బుధః. 39

భినత్తి యది తత్తారాం బాధావృష్టిభయంకరః, ఆర్ద్రాదిపితృభాంతేషు దృశ్యతే యది చంద్రజః. 40

తదా దుర్భిక్షకలహరోగానావృష్టిభీతకృత్‌, హస్తాదిషట్సు తారాసు విచరన్నిందునందనః. 41

క్షేమం సుభిక్షమారోగ్యం కురుతే రోగనాశనమ్‌, అహిర్భుధ్న్యార్యమాగ్నేయయామ్యగేషు చరన్బుధః. 42

భిషక్తరంగవాణిజ్యవృత్తీనాం నాశకృత్తదా, పూర్వత్రయే చరన్సౌమ్యో యోగతారాం భినత్తి చేత్‌. 43

క్షుచ్ఛస్త్రానలచౌరేభ్యో భయదః ప్రాణినాం తదా, యామ్యాగ్నిధాతృవాయవ్యధిష్ణ్యేషు ప్రాకృతా గతిః. 44

రౌద్రేన్దుసార్పపిత్ర్యేషు జ్ఞేయా మిశ్రాహ్వయా గతిః, భాగ్యార్యమేజ్యాదితిషు సంక్షిప్తా గతిరుచ్యతే. 45

గతిస్తీక్షాజచరణాహిర్బుధ్న్యభాశ్రిభేషు యా, యోమాతికాతివిశ్వాంబుమూలమత్స్యైన్యజస్య చ. 46

ఘోరా గతిర్హరిత్వాష్ట్రవసువారుణభేషు, చ, ఇంద్రాగ్నిమిత్రమార్తండభేషు పాపాహ్వయా గతిః. 47

ప్రాకృతాద్యాసు గతిషు హ్యుదితోస్తమితోపి వా, యావన్యైవ దినాన్యేష దృశ్యస్తావత్యదృశ్యగః. 48

చత్వారింశత్క్రమాత్త్రింశద్రవీన్దూ భూసుతో నవ, పంచదశైకాదశభిర్దివసైశ్శశినందనః. 49

ప్రాకృతాయాం గతస్సౌమ్యః క్షేమారోగ్యసుభిక్షకృత్‌, మిశ్రసక్షిప్తయోర్మధ్యే ఫలదోన్యాసు వృష్టిదః. 50

వైశాఖే శ్రావణ పౌషే ఆషాఢేభ్యుదితో బుధః, జగతాం పాపఫలదస్త్వితరేషు శుభప్రదః. 51

ఇషోర్జమాసయోశ్శస్త్రదుర్భిక్షాగ్నిభయప్రదః, ఉదితశ్చన్ద్రజశ్శ్రేష్ఠో రతస్ఫటికోపమః. 52

ద్విభాటజోదిమాస్తస్య పంచమైకాదశస్త్రిభాత్‌, యన్నక్షత్రోదితో జీవస్తన్నక్షత్రాఖ్యవత్సరః. 53

కార్తికో మార్గశీర్షశ్చ నృణాం దుష్టపలప్రదః, శుభప్రదౌ పౌషమాఫ° మధ్యమౌ ఫాల్గునో మధుః. 54

మాధవశ్శుభదో జ్యేష్ఠో నృణాం మధ్యఫలప్రదః, శుచిర్మధ్యో నభ##శ్శ్రేష్ఠో భాద్రశ్శ్రేష్ఠః క్వచిన్నరః. 55

అతిశ్రేష్ఠ ఇషః ప్రోక్తో మాసానాం ఫలమీదృశమ్‌, సౌమ్యే భ##గే చరన్భానాం క్షేమారోగ్యసుభిక్షకృత్‌. 56

విపరీతో గురుర్యామ్యే మధ్యే చరతి మధ్యమమ్‌, పీతాగ్ని శ్యామ హరిత రక్త వర్ణోంగిరాః క్రమాత్‌. 57

వ్యాధ్యగ్నిచౌరశస్త్రాస్త్రభయదః ప్రాణినాం భ##వేత్‌, అనావృష్టిం భూమ్ననిభః కరోతి సురపూజితః. 58

దివాదృష్టో నృపవధ్యామయం వా రాష్ట్రనాశనమ్‌, సంవత్సరశరీరం స్యాత్‌ కృత్తికా రోహిణీ తథా. 59

నాభిస్త్వాపాటయుగలమాద్రీహృత్కుసుమం మఘా దుర్భిక్షాగ్నిమరుద్భీతిశ్శరీరం క్రూరపీడితే. 60

నాభ్యాం క్షుత్తృడ్భయం పుష్యే సమ్యఙ్మూలిఫలక్షయః, హృదయే శస్యనిధనం శుభం స్యాత్సంయుతైశ్శుభైః. 61

సస్యవృద్ధిః ప్రజారోగ్యం యుద్ధం జీవాత్యవర్షణమ్‌, ఇతి ద్విజాతిమధ్యాంతు గోనృపస్త్రీసుఖం మహత్‌. 62

నిస్స్వనావృష్టిఫణిభిర్వృష్టిస్స్వాస్ఫ్యం మహోత్సవః, మహార్ఘమపి సంపత్తిర్దేశనాశోతివర్షణమ్‌. 63

అవైరం రోగమభయం రోగభీస్సస్యవర్షణ, రోగో ధాన్యం నభోదృష్టిర్మఘాద్యృక్షగతే గురౌ. 64

సౌమ్యమధ్యమయామ్యేషు మార్గేషు వీధికాత్రయమ్‌, శుక్రస్య దస్రభా జ్ఞేయం పర్యాయైశ్చ త్రిభిస్త్రిభిః. 65

నాగే భైరావతాశ్చైవ వృషభోష్ట్రఖరాహ్వయాః, మృగాంజదహనాఖ్యాస్స్యుర్యామ్యాంతా వీధయో నవ. 66

సౌమ్యమార్గే చ తిసృషు చరన్వీథిషు భార్గవః, ధాన్యార్ధవృష్టిసస్యానాం పరిపూర్తిం కరోతి హి. 67

మధ్యమార్గే చ తిసృషు సర్వమప్యధమం ఫలమ్‌, పూర్వస్యాం దిశి మేషస్తు శుభదః పితృపంచకే. 68

స్వాతిత్రయే పశ్చిమాయాం తస్యాం శుక్రస్తథావిధః, విపరీతే త్వనావృష్టిర్వృష్టికృద్ఛుధసంయుతః. 69

కృష్ణాష్టమ్యాం చతుర్దశ్యాం అమాయాం చ యదా సితః, ఉదయాస్తమనం యాతి తదా జలమయీ మహీ. 70

మిథస్సప్తమరాశిస్ధ్సే పశ్చాత్ప్రాగ్వీధిసంస్ధితౌ, గురుశుక్రావనావృష్టిదుర్భిక్షసమరప్రదౌ. 71

కుజజ్ఞజీవరవిజా శుక్రస్యాగ్రేసరా యది, యుద్ధాతివాయుదుర్భిక్షజలనాశకరా మతాః. 72

జలమిత్ర్యార్యమహీన్ద్రా నక్షత్రేషు సుభిక్షకృత్‌, సచ్ఛస్త్రావృష్టిదో మూలేహిర్భుధ్న్యాన్త్య భయోర్భయమ్‌. 73

శ్రవణానితి హస్తార్ద్రౌ భరణీ భాగ్యభేషు, చ, చరఞ్ఛనైశ్చరో నౄణాం సుభిక్షారోగ్యసస్యకృత్‌. 74

ముఖే చైకం గుదే ద్వే చ త్రీణికే నయనే ద్వయమ్‌, హృదయే పంచరుక్షాణి వామహస్తే చతుష్టయమ్‌. 75

వామపాదే తథా త్రీణి దక్షిణ త్రీణి ఖాని చ, చత్వారి దక్షిణ హస్తే జన్మభాద్రవిస్థితిః. 76

రోగో లాభస్తథా హానిర్ణాభస్సౌఖ్యం చ బంధనమ్‌, ఆయాసశ్శ్రేష్ఠయాత్రా చ ధనలాభః క్రమాత్ఫలమ్‌. 77

బహుధారవిజస్త్వేతద్వక్రగః ఫలమీదృశమ్‌, కరోత్యేవ సమస్సామ్యం శీఘ్రగేషూత్క్రమాత్ఫలమ్‌. 78

విష్ణుచక్రోత్కృత్తశిరాః పంగుః పీయూషపానతః అమృత్యుతాం గతస్తత్ర ఖేటత్వే పరికల్పితః. 79

వరణధాతురర్కేన్దూ తుదతే సర్వపర్వణి, విక్షేపావనతేర్వంగాద్రాహుర్దూరగతస్తయోః. 80

దక్షిణ దిక్కున శృంగమున్నతముగా నున్న చంద్రుడు మీనమేషములలో నున్నచో శుభప్రదుడు. మిధున మకరరాశులలో ఉత్తరదిశగా శృంగోన్నతుడగు చంద్రుడు ఉత్తముడు. కుంభ వృషభ రాశులలో చంద్రుడు సముడుగా ఉన్నచో ఉత్తముడు కర్కధనూరాశులలో నున్నచో సముడుగా నుండును. ధనువు వలె వృశ్చిక సింహరాశులలో నున్నపుడు తులా కర్కటకరాశులలో శూలము వలె, విపరీతముగా ఉదయించిన చంద్రుడు దుర్భిక్ష కలహములను కలిగించును. పూర్వాషాఢ ఉత్తరాషాఢా నక్షత్రములలో మూలా జ్యేష్ఠా నక్షత్రములలో నున్న చంద్రుడు దక్షిణదిశలో నున్నచో అగ్నినిచ్చి చోరులను చరప్రాణులను వనములను సర్పములను నశింపచేయును. విశాఖా అనూరాధా నక్షత్రములో నుండి దక్షిణ పార్శ్వభాగమున నుండు చంద్రుడు పాపుడగును. మఘా నక్షత్రములోని చంద్రుడు మధ్యముడు. విశాఖా నక్షత్రమున సౌమ్యుడు. పుష్యమి పూర్వాభాద్రా నక్షత్రాదులోని చంద్రుడు శుభప్రదుడు. జ్యేష్టా నక్షత్రము నుండి తొమ్మిదన నక్షత్రములను వాటి భరణి జ్యేష్ఠ ఆశ్లేషా నక్షత్రములలో కాని, మరుత్తులు అర్ధతారకలు పునర్వసు, విశాఖా నక్షత్రములు అర్ధ ఫలప్రదములు. ఇతర నక్షత్రములు సమములు. దక్షిణ శృంగోన్నతుడు ఇష్టుడు కాజాలడు. శుక్లపక్షమున పిపీలికారమున శుభుడు. కార్యహాని, కార్యసిద్ధి అనునవి క్రమముననుసరించి జరుగును. విశాల చంద్రుడు సుభిక్షమును కలిగించును. అవిశాల చంద్రుడు పాపములను నశింపచేయును. చంద్రుడు అధోముఖముగా నున్నచో శస్త్రభయము, దండాకారమున నున్నచో కలహము సంభవించును. కుజాదులచే శృంగము నిహతమైనను, మండలము నిహతమైనను యథాక్రమముగా క్షేమాదులు వృష్టి, భూపాలనాశము జలనాశము కలగును.

ఆశ్లేషా మఘా నక్షత్రములో కుజుడు ఉదయించి బలవంతుడుగా నుండి వక్రగతుడైనచో ఆ వక్రమునకు ఉష్ణము అని పేరు. దీని వలన ప్రజాపీడ, అగ్నిభయము కలుగును. పదియవ పదకొండవ పన్నెండవ నక్షత్రములలో ఉదయించిన కుజుడు వక్రుడైనచో దానిని కూక్రము అందురు. సస్యమును వర్షమును నశింపచేయును. కుజుడు పదమూడవ నక్షత్రమున నుండుట కాని, పదునాలుగవ నక్షత్రమున వక్రించినచో దానిని బాలాస్య చక్రమందురు. ఇందు సస్యమును వృష్టిని నశింపచేయును. పదునైదు పదునారు నక్షత్రములలో వక్రుడైనచో రుధిరాననమందురు. దీని వలన దుర్భిక్షము, క్షద్భయము, రోగములు కలగును. పదునేడవ పదునెనిమిదవ నక్షత్రమున వక్రించినచో ముసలమందురు. దీని వలన దుర్భిక్షము, ధనధాన్యాది నాశనము, భయమును కలిగించును. పూర్వఫల్గునీ ఉత్తర ఫల్గునీ నక్షత్రములలో ఉదయించి ఉత్తరాషాఢా నక్షత్రమున వక్రించినచో అట్లే రోహిణీ నక్షత్రమున అస్తమించినచో లోకత్రయమును నశింపచేయును. శ్రవణా నక్షత్రమున ఉదయించి పుష్యమీ నక్షత్రమున వక్రగతిని పొందినచో శ్వానములకు హానిని కలిగించును. కుజుడు ఏ దిక్కున ఉదయించిన ఆ దిక్కులోని రాజులకు భయమును కలిగించును. మఘానక్షత్రమధ్యన చరించును అచటనే వక్రి అయినచో అనావృష్టి శస్త్రభయము, కలహము రాజక్షయము జరుగును. మఘా విశాఖా రోహిణీ నక్షత్రముల యోగతారకలను కుజుడు భేదించినచో దుర్భిక్షము, మరణము, రోగములు కలుగును. ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, మూల, శ్రవణా మృగశిరా నక్షత్రములలో కుజుడు చరించినచో, అట్లే రోహిణీ నక్షత్రమునకు దక్షిణ దిశగా యున్నచో అనావృష్టిని కలిగించును. కుజుడు అన్ని నక్షత్రములకు ఉత్తరదిక్కున చలనము కలిగియుండు శుభప్రదము దక్షిణదిశగా వెళ్ళినచో అనిష్టఫలమునిచ్చును. రాజులలో భేదమును కలిగించును. ఉత్పాతము లేకుండా ఒక్కొక్కసారి స్వచ్ఛమైన ఆకాశమున బుధుడు ఉదయించినచో అనావృష్టి భయమును, అగ్నిభయమును రాజులలో విరోధమును కలిగించును. ధనిష్ఠాశ్రవణము, ఉత్తరాషాఢా, మృగశిరా, రోహిణీ నక్షత్రములలో చరించు బుధుడు యోగతారలను భేదించినచో, ప్రజలలో కలహములు అనావృష్టి కలిగి భయమును కలిగించును.

ఆర్ద్రానక్షత్రము నుండి మఘా నక్షత్రము వరకు బుధుడు చరించునపుడు దుర్భిక్షమును, కలహములను, రోగమును, అనావృష్టిని, భీతిని కలిగించును. హస్త నుండి జ్యేష్ఠానక్షత్రము వరకున్న ఆరు నక్షత్రములలో చరించు బుధుడు క్షేమమును, సుభిక్షమును, ఆరోగ్యమును, రోగనాశమును కలిగించును. కృత్తికా, భరణీ నక్షత్రములలో చరించు బుధుడు, వైద్య, తరంగ, వాణిజ్య వృత్తులను నశింపజేయును. పూర్వఫల్గునీ పూర్వాషాఢ, పూర్వాభాద్రా నక్షత్రములలో చరించు యోగ తారను భేదించినచో ఆకలి వలన, శస్త్రముల వలన, అగ్ని వలన, చోరుల వలన ప్రాణులకు భయమును కలిగించును. భరణి కృత్తిక, రోహిణి, చిత్తా నక్షత్రములలో ప్రకృత గతి, ఆరుద్ర, మృగశిరా, ఆశ్లేష, మఘా నక్షత్రములలో మిశ్రగతి ఉండవలయును. పూర్వఫల్గుని, ఉత్తరఫల్గునీ, పుష్యమి, పునర్వసు నక్షత్రములలో సంక్షిప్తగతి చెప్పబడినది. ఉత్తరాభాద్ర నక్షత్రమున తీక్షాజచరణగతి భరణి, పుష్యమీ, ధనిష్ట, శతభిష నక్షత్రములలో ఘోరగతి. జ్యేష్టా, కృత్తిక, విశాక, హస్త నక్షత్రములలో పాపగతి యనబడును. ప్రాకృతాదిగతులలో ఉదయించినను, అస్తమించినను ఎన్నిదినములు కనపడునో అన్నియే దినములు కనపడడు. నలుబది దినములు సూర్యుడు, ముప్పది దినములు చంద్రుడు, కుజుడు తొమ్మిదిదినములు, పదిహేను లేదా పదకొండు దినములు బుధుడుండును. బుధుడు ప్రాకృత గతిలో ఉన్నచో క్షేమమును, ఆరోగ్యమును సుభిక్షమును కలిగించును. మిశ్ర సంక్షిప్తగతులలో నున్ననూ ఫలప్రదుడు. ఇతర గతులలో నున్నచో వృష్టినిచ్చును.

వైశాఖ మాసమున, శ్రావణ మాసమున, పుష్యమాసమున, ఆషాఢమాసమున ఉదయించిన బుధుడు జగత్తునకు పాప ఫలమునిచ్చును. ఇతర మాసములలో నుదయించినచో శుభప్రదుడు. ఆశ్వయుజ కార్తీక మాసములలో ఉదయించినచో శస్త్ర, దుర్భిక్ష అగ్ని భయములను కలిగించును. రజత స్ఫటిక వర్ణముతో ఉదయించిన బుధుడు శ్రేష్ఠుడు. బృహస్పతి ఏ నక్షత్రమున ఉదయించునో ఆ నక్షత్రము పేరే ఆ సంవత్సరమునకు ఉండును. కార్తీక మార్గశీర్ష మాసములలో ఉదయించినచో నరులకు దుష్టఫలములనిచ్చును. పుష్యమాఘమాసములలో ఉదయించినచో శుభప్రదుడు. ఫాల్గుణ చైత్ర మాసములు మధ్యమములు. వైశాఖ మాసము శుభప్రదము. జ్యేష్ఠమాసము మధ్యమము. ఆషాఢము మధ్యమము: శ్రావణము శ్రేష్ఠము. భాద్రపదము ఉత్తమము. ఆశ్వయుజమాసము అత్యుత్తమము. ఇది మాసముల ఫలము. నక్షత్రములకు ఉత్తరదిశగా సంచరించు బృహస్పతి క్షేమమును ఆరోగ్యమును సుభిక్షమును ప్రసాదించును. భరణీ నక్షత్రమున చరించును విపరీత ఫలమునిచ్చును. మధ్యలో మధ్యమముగా చరించును. పీత, అగ్ని, శ్యామ, హరిత, రక్తవర్ణములు కల బృహస్పతి క్రమముగా వ్యాధి, అగ్ని, చోర, శస్త్ర, అస్త్ర భయములను కలిగించును. భూమ్నవర్ణము కల బృహస్పతి అనావృష్టిని కలిగించును. పగటి పూట బృహస్పతి కనిపించినచో రాజమరణము, రాష్ట్రమును నశింపచేయు రోగమును కలిగించును. సంవత్సరము శరీరముగా నుండును. కృత్తికా రోహిణి నాభి, ఆర్ద్రపాదయుగలము, మఘహృదయము. శరీరమును క్రూరగ్రహములు పీడించినచో దుర్భిక్షము, అగ్నివాయు భయము కలుగును.

నాభిలో ఉన్నపుడు ఆకలిదప్పుల భయము, పుష్యమీ నక్షత్రమున నున్నచో మూలఫలనాశము హృదయేశనిధనము సంభవించును. శుభగ్రహములచే శరీరము కూడియున్నచో శుభము కలుగును. సస్యవృద్ధి ప్రజారోగ్యము కలుగును. బృస్పతి అతిచారముచే యుద్ధము సంభవించును. మధ్యలో నున్నచో గో, నృప, స్త్రీ సుకము కలుగును. అవృష్టి ఫణులచే వృష్టి, స్వాస్ధ్యము మహోత్సవము జరుగును. మహార్ఘమగు సంపద, దేశనాశము, అతివృష్టి, అద్వేషము, రోగము అభయము రోగభయము సస్యవర్షణమున కలుగును. మఘ మొదలగు నక్షత్రములలో బృహస్పతి యున్నచో, రోగము, ధాన్యము కలుగును. శుక్రునికి అంగారకుని వలన ఉత్తర దక్షిణ మధ్య దిశలలో మూడుగతులుండును. నాగ ఇభ ఐరావత, వృషభ, ఉష్ట్రఖర, మృగ, అంజ, దహనములు అని దక్షిణ దిశతో ముగియు తొమ్మిది వీధులుండును. శుక్రుడు ఉత్తర మార్గమున నుండు మూడు వీధులలో తిరుగుచు ధాన్య, అర్థ వృష్టి సస్యములకు పరిపూర్ణతను కలిగించును. మధ్యమార్తమున నుండు మూడు వీధులలో చరించుచున్నచో అధమ ఫలము సంభవించును. తూర్పుదిక్కులో నుండు మేఘము మఘాది పంచకమున శుభదము. స్వాతి నుండి మూడు నక్షత్రములలో పశ్చిమదిక్కున నుండు శుక్రుడు అట్టిఫలితమునే కలిగించును. విపరీతముగా నున్నచో అనావృష్టి సంభవించును. బుధునితో కలిసియున్నచో వృష్టిని కలిగించును. బహుళాష్టమీ తిథిన, చతుర్దశీ తిథినాడు, అమావాస్యనాడు, శుక్రుడు ఉదయించిననూ, అస్తమించిననూ భూమి జలమయమగును. ఒకరికొకరు ఏడవరాశిలో ఉంటూ పశ్చిమ తూర్పు వీధులలో ఉన్న గురుశుక్రులు అనావృష్టిని, దుర్భిక్షమును, యుద్ధమును కలిగింతురు. శుక్రునికి అగ్రభాగమున కుజుడు, బుధుడు, బృహస్పతి శని చరించుచున్నచో యుద్ధము, వాయువును దుర్భిక్షమును జలనాశమును కలిగింతురు.

పూర్వాషాఢ, అనూరాధ, ఉత్తర ఫల్గుని, ఆశ్లేష జ్యేష్టా నక్షత్రములలో శుక్రుడున్నచో సుభిక్షమును కలిగించును. ఉత్తరాభాద్ర రేవతీ నక్షత్రములలో నున్నచో భయము. మూలలో నున్నచో వృష్టిని కలిగించును. శ్రవణా, స్వాతి, హస్త ఆర్ద్ర, భరణి, పూర్వఫల్గునీ నక్షత్రములలో చరించు శని నరులకు సుభిక్షమును ఆరోగ్యమును, సస్యమును కలిగించును. శని శరీరాకారమున నక్షత్రముల స్థితి ఇట్లుండును. ముఖమున ఒక నక్షత్రము, గుదమున రెండు నక్షత్రములు, లింగమున మూడు నక్షత్రములు, నేత్రమున రెండు నక్షత్రములు, హృదయమున అయిదు నక్షత్రములు, వామహస్తమున నాలుగు, వామపాదమున మూడు, దక్షిణ పాదమున మూడు, దక్షిణ హస్తమున నాలుగు. ఇది జన్మనక్షత్రము నుండి శని స్థితి. రోగము, లాభము, హాని, లాభము, సౌఖ్యము, బంధనము, ఆయాసము, శ్రేష్ఠయాత్ర, ధనలాభము ఇవి పైన చెప్పిన స్థితుల వలన వరుసలో కలుగు లాభములు. శని ఎక్కువగా వక్రగతిగా నుండును. కావున ఈ ఫలము చెప్పబడినది. సమగతియున్నచో సమఫలమునే యొసంగును. అతిచారమున్నచో ఫలవ్యుత్క్రమము జరుగును. విష్ణుచక్రముచే ఛేదించబడిన శిరస్సు కలవాడు, కుంటివాడు, అమృత పానమును చేసినందున అమరత్వమును పొందినవాడు గ్రహముగా కల్పించబడెను. ప్రతిపర్వకాలమున సూర్యచంద్రులను బాధించుచుండును. ఇతనే రాహువు. ఈ రాహువు. ఈ రాహువు విక్షేపము చేయబడుటవలన, అవనతి వలన సూర్యచంద్రులకు దూరముగా నుండును.

షణ్మాసవృద్ధ్యా గ్రహణం శోధయేద్రవిచంద్రయోః, పర్వేశాస్తు సథా తస్యదేవా రవ్యాదితః క్రమాత్‌. 81

బ్రహ్మేంద్వింద్రధనాధీశవరుణాగ్నియమాహ్వయాః, పశుసస్యద్విజాతీనాం వృద్ధిర్బ్రాహ్మే తు పర్వణి. 82

తద్వదేవ ఫం సౌమ్యే శ్లేష్మపీడా చ పర్వణి, విరోధో భూభుజాం దుఃఖం ఐన్ద్రే సస్యవినాశనమ్‌. 83

ధనినాం ధనహానిస్స్యాత్కౌబేరం ధాన్యవర్ధనమ్‌, నృపాణామశివం క్షేమమితరేషాం చ వారుణ. 84

ప్రవర్షణం సస్యవృద్ధిః క్షేమం హౌతాశపర్వణి, అనావృష్టిస్సస్యహానిర్దుర్భిక్షం యామ్యపర్వణి. 85

వేలాహీనే సస్యహానిర్నృపాణాం దారుణం రణమ్‌, అతివేలే పుష్పహానిర్భయం సస్యవినాశనమ్‌. 86

ఏకస్మిన్నేవ మాసే తు చంద్రార్కగ్రహణం యదా, విరోధో ధరణీశానామర్ధవృష్టివినాశనమ్‌. 87

గ్రస్తోదితావస్తమితౌ నృపధాన్యవినాశదౌ, సర్వగ్రస్తావినేందూ తు క్షుద్వాధ్యగ్నిభయప్రదౌ. 88

సౌమ్యాయనేక్షత్ర విప్రానితరాన్హన్తి దక్షిణ, ద్విజాతీం శ్చక్రమాద్ధన్తి రాహుదృష్టోరగాదితః. 89

తథైవ గ్రామభౌదాస్స్యు మోక్షభేదాస్తథా దశ, నో శక్తా లక్షితుం దేవాః కిం పునః ప్రాకృతా జనాః. 90

ఆనీయ ఖేటాన్గణితాన్‌ తేషాం వారం విచిన్తయేత్‌, శుభాశుభాన్యైః కాలస్య గ్రాహయామో హి లక్షణమ్‌. 91

తస్మాదన్వేషణీయం తత్‌, కాలజ్ఞానాయ ధీమతా, ఉత్పాతరూపాః కేతూనాముదయాస్తమయా నౄణామ్‌. 92

దివ్యాంతరిక్షాభౌమాస్తే శుభాశుభఫలప్రదాః, యజ్ఞద్వజాస్త్రభవనరక్షావృద్ధిం

గజోపమాః. 93

స్తమ్భశూలాంకుశాకారా ఆంతరిక్షాః ప్రకీర్తితాః, నక్షత్రాంశస్థితా దివ్యా భౌమా యే భూమిసంస్థితాః. 94

ఏకోపి భిన్నరూపస్స్యాత్‌ జంతుర్నామ శుభాయ వై, యావన్తో దివసాన్కేతుర్దృశ్యతే వివిధాత్మకః. 95

తావన్మాసైః ఫలం యచ్ఛత్సష్టౌ సారవ్యవత్సరైః, యే దివ్యాః కేతవస్తేపి శశ్వజ్జీవఫలప్రదాః. 96

హ్రస్వస్స్నిగ్ధస్సుప్రసన్నః శ్వేతకేతుస్సువృష్టికృత్‌, క్షిప్రాదస్తమయం యాతి దీర్ఘకేతురవృష్టికృత్‌. 97

అనిష్టదో ధూమకేతుశ్శక్రచాపసమప్రభః, ద్విత్రిచతుశ్శూలరూపస్స చ రాజ్యాంతకృన్మతః. 98

మణిహారస్తు వర్ణాభా దీప్తిమంతోర్కసూనవః, కేతవశ్చోదితాః పూర్వపరయోర్నృపహానిదాః. 99

వంసుకబింబక్షితిజచ్ఛుకతుండాదిసన్నిభాః, ముతాశనోదితాస్తేపి కేతవః ఫలదాస్స్మృతాః. 100

భూసుతా జలతైలాభా వర్తులా క్షుద్భయప్రదాః, సుభిక్షక్షేమదాశ్శ్వేతకేతవస్సోమసూనవః. 101

పితామహాత్మజః కేతుస్త్రివర్ణస్త్రిదశాన్వితః, బ్రహ్మదండాద్ధూమకేతుః ప్రజానామంతకృన్మతః. 102

ఐశాన్యాం భార్గవసుతాః శ్వేతరూపాస్త్వనిష్టదాః, అనిష్టదాః పంగుసుతా విశిఖా కమకాహ్వయాః. 103

వికచాఖ్యా గురుసుతా వేష్టా యామ్యే స్థితా అపి, సూక్ష్మాశ్శుక్లా బుధసుతాశ్చౌరరోగభయప్రదాః. 104

కుజాత్మజాః కుంకుమాఖ్యా రక్తాశ్శూలాస్త్వనిష్టదాః, అగ్నిజా విశ్వరూపాఖ్యా అగ్నివర్ణాస్సుఖప్రదాః. 105

అరుణాశ్శ్యామలాకారా అర్కపుత్రాశ్చ పాపదాః, శుక్రజా ఋక్షసదృశాః కేతవశ్శుభదాయకాః. 106

కృత్తికాసు భవో ధూమకేతుర్నూనం ప్రజాక్షయః, ప్రాసాదవృక్షశైలేషు జాతో రాజ్ఞాం వినాశకృత్‌. 107

సుభిక్షకృత్కౌముదాఖ్యః కేతుః కుముదసన్నిభః, ఆవర్తకే తు సంధ్యాయాం శశిరనిష్టదాయకః. 108

బ్రహ్మదేవమనోర్మానపిత్ర్యం సౌరం చ సావనమ్‌, చాంద్రమానం గురోర్మానమితి మానాని వై నవ. 109

ఏతేషాం నవమానానాం వ్యవహరోత్ర పంచభిః, తేషాం పృథక్పృథక్కార్యం వక్ష్యతే వ్యవహారతః. 110

గ్రహాణాం నిఖిలశ్చారో గృహ్యతే సౌరమానతః, వృష్టేర్విధానం స్త్రీగర్భస్సావనేనైవ గృహ్యతే. 111

ప్రవర్షణం సమే గర్భౌ నాక్షత్రేణ ప్రగృహ్యతే, యాత్రో ద్వాహవ్రతక్షౌరే తిథివర్షేశనిర్ణయః. 112

పర్వవాస్తూపవాసాది కృత్స్నం చాంద్రేణ గృహ్యతే, గృహ్యతే గురుమానేన ప్రభవాద్యబ్దిలక్షణమ్‌. 113

తత్తన్మాసైర్ద్వాదశభిస్తత్తదష్టౌ భ##వేత్తతః, గురుమధ్యమచారేణ షష్ట్యబ్దాః ప్రభవాదయః. 114

ప్రభవో విభవశ్శుక్లప్రమోదోథ ప్రజాపతిః, అంగిరాశ్శ్రీముఖో భావో యువా ధాతా తథైవ చ. 115

ఈశ్వరో బహుధాన్యశ్చ ప్రమాధీ విక్రమో వృషః, చిత్రభానుస్సుభానుశ్చ తారణః పార్ధివోవ్యయః. 116

సర్వజిత్సర్వధారీ చ విరోధీ వికృతః ఖరః, నందనో విజయశ్చైవ జయో మన్మథదుర్ముఖౌ. 117

హేవిలంబో విలంబశ్చ వికారీ శార్వరీ లవః, శుభకృచ్ఛోభనః క్రోధీ విశ్వావసుపరాభవౌ. 118

ప్లవంగః కీలకస్సౌమ్యస్సామాప్తశ్చ విరోధకృత్‌, పరిభావీ ప్రమాదీ చ ఆనందో రాక్షసోనలః. 119

పింగలః కాలయుక్తశ్చ సిద్ధార్ధో రౌద్రదుర్మతీ, దుందుభీరుధిరోద్గారీ రాక్తాక్షః క్రోధనః క్షయః. 120

ప్రతి ఆరునెలలకు సూర్యచంద్రుల గ్రహణమును పరిశోధించవలయును. ఈ పర్వలకు సూర్యుని నుండి వరుసగా సత్యదేవులు అధిపతులు. బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, యముడు అనువారలు అధిపతులు. బ్రాహ్మపర్వమున పశుసస్యబ్రాహ్మణ వృద్ధి జరుగును. చంద్ర పర్వమున కూడా ఇట్టిఫలితమే కలుగును. ఈ పర్వమున శ్లేష్మ పీడ యుండును. ఇంద్రపర్వమున రాజులకు పరస్పర విరోధము, సస్యనాశము, ధనవంతులకు ధననాశము కలుగును. కౌబేర పర్వలో ధాన్యవృద్ధి రాజులకు మాత్రము అశుభము కలుగును. వరుణపర్వలో రాజభిన్నులకు క్షేమము కలుగును బాగుగా వర్షించును. సస్యవృద్ధి క్షేమము కలుగును. అగ్నిపర్వలో అనావృష్టి, సస్యహాని, దుర్భిక్షము కలుగును. యమపర్వలో కాలము కాని కాలమున సస్యహాని రాజులకు పరస్పర యుద్ధము, పుష్పహాని, భయము, సస్యనాశము కలుగును. ఒకేనెలలో సూర్యచంద్రులకు గ్రహణము సంభవించినచో రాజులకు పరస్పర విరోధము, అర్ధనాశము, వృష్టినాశము కలుగును. గ్రస్తులైన ఉదయించిన సూర్య చంద్రులు, గ్రస్తులై అస్తమించిన సూర్యచంద్రులు నృపనాశమును, ధాన్యనాశమును చేయుదురు. సూర్యచంద్రులు సంపూర్ణముగా గ్రసించబడినచో (సంపూర్ణగ్రహణము) ఆకలి, వ్యాధి, అగ్ని భయమును కలిగింతురు. ఉత్తరాయణమున గ్రహణమేర్పడినచో క్షత్రియులను బ్రాహ్మణులను నశిపంచేయును. దక్షిణాయనమున ఏర్పడినచో ఇతరులను నశింపచేయును. రాహుదృష్టమగు ఉరగాదుల వలన బ్రాహ్మణులను నశింపచేయును. అట్లే గ్రామభేదములు మోక్షభేదములు పదియున్నవి. ఈ భేదములను దేవతలే తెలియలేరు. ఇక ప్రాకృత జనులెట్లు తెలియగలరు. గ్రహగణితములను తీసుకొని వారి భాగములను ఆలోచించవలయును. కాలముయొక్క లక్షణమును శుభాశుభ మధ్యమములచే గ్రహించవలయును. కావున మానవులు కాలజ్ఞానము కొరకు కేతువుల ఉదయాస్తమయములను ఉత్పాతరూపములను పరిశీలించవలయును.

దివ్యములు, అంతరిక్షములు భౌమములని ఆ ఉత్పాతరూపములు మూడువిధములు. ఇవియే శుభాశుభఫలములనిచ్చునవి. యజ్ఞధ్వజ, అస్త్ర, భవనముల రక్షను వృద్ధి పరుచునవి గజోపమములైన కేతువులు స్తమ్భ, శూల, అంకుశాకారములతో నుండు కేతువులు అంతరిక్షములనబడును. నక్షత్రాంశలలో నుండునవి దివ్యములు. భూమిపైనున్న వాటిని భౌమములందురు. జంతువు యొక్క నామము ఒకటైనను భిన్నరూపము నొందినచో శుభమును కలిగించును. కేతువు పలురూపములతో ఎన్నిదినములు కనపడునో అన్నిమాసములు ఫలమునిచ్చును. దివ్యములైన కేతువులు కూడా జీవులకు ఫలముల నిచ్చునవే. హ్రస్వము, స్నిగ్ధము సుప్రసన్నము అగు శ్వేతకేతువు సువృష్టిని కలిగించును. ఇంద్రధనువు వంటి కాంతిగల ధూమకేతువు అనిష్ట ఫలము నొసంగును. ద్విశూల, త్రిశూల, చతుశ్శూలరూపమగు కేతువు రాజ్యమును నశింపజేయును.

పలువర్ణములు కల మణిహారములు మిక్కిలి కాంతి గలవి సూర్యుని నుండి పుట్టునవి. తూర్పు పశ్చిమ దిశలలో ఉదయించిన కేతువులు రాజులకు హానిని కలిగించును. వంసుక, బింబ, క్షితిజ, శుకతుండముల వలెనుండు కేతువులు అగ్నినుండి పుట్టునవి. ఇవి కూడా ప్రాణులకు ఫలముల నొసంగును. జలము వలె, తైలము వలె గుండ్రగా నుండు కేతువులు భూపుత్రులు. ఇవి ఆకలి, భయములను కలిగించును. చంద్రుని నుండి పుట్టిన శ్వేతకేతువులు సుభిక్షమును క్షేమమును కలిగించును. పితామహుని నుండిన కేతువు మూడువర్ణములు, మూడు దశలు కలిగియుండును. బ్రహ్మదండము నుండి పుట్టిన ధూమకేతువు ప్రజలను నశింపచేయును. ఈశాన్యదిక్కున ఉదయించు శ్వేతకేతువు శుక్రుని వలన పుట్టునది. ఇది అనిష్టమును కలిగించును. శనిపుత్రులగు కమకములను పేరు గల శిఖములేని కేతువులు కూడా అనిష్టమునే కలిగించును. గురుపుత్రులగు వికచములను పేరుగల కేతువులు దక్షిణదిక్కున నుండునవైనను ఇష్టఫలములనే ఒసంగును. బుధుని నుండి పుట్టిన కేతువులు సూక్ష్మములు శుక్లములు చోర, రోగ భయములను కలిగించును. కుజుని నుండి పుట్టిన కేతువులు కుంకుమ అను పేరుగలవి రక్తవర్ణములు గలవి. శూలాకారముతో నుండునవి అనిష్టమును కలిగించును. అగ్నివలన పుట్టునవి విశ్వరూపములు అను పేరుగలవి అగ్నివర్ణములు సుఖమును కలిగించును. సూర్యపుత్రులు అరుణములనునవి శ్యామలాకారమున నుండునవి పాపఫలమునే ఇచ్చును. శుక్రుని వలన పుట్టినవి నక్షత్రము వలె నుండునవి శుభఫలము నొసంగును. కృత్తికలలో పుట్టు ధూమకేతువు ప్రజాక్షయమును కలిగించును. ప్రాసాద వృక్ష శైలములలో పుట్టిన కేతువులు రాజులను నశింపచేయును. కలువ వలె నుండు కుముదమను పేరు గల కేతువు సుభిక్షమును చేయును. సంధ్యాసమయమున పుట్టు ఆవర్తకేతువు అనిష్టఫలము నొసంగును.

కాలమానము తొమ్మిది విధములు. బ్రహ్మమానము, దేవమానము, మనుమానము, పితృమానము, సౌరమానము, సావనమానము, చాంద్రమానము, నక్షత్రమానము, గురుమానము అని ఈ నవమానముల వ్యవహారము అయిదింటిచే చేయబడును. ఈ మానములకు వ్యవహారము ననుసరించి వేరువేరుగా చెప్పబడును. సౌరమానముననుసరించి అన్నిగ్రహముల అన్నిచారములను గ్రహించెదరు. వర్షవిధానము, స్త్రీగర్భవిషయమును సావనమానముచే గ్రహించెదరు. ప్రవర్ధణమును, సమగర్భములను నక్షత్రమానముచే గ్రహించెదరు. యాత్రలు, వివాహము, వ్రతములు, క్షౌరము, తిథి, వర్షాధిపతి నిర్ణయము, పర్వము, వాస్తు, ఉపవాసాదులు చాంద్రమానముచే చేయబడును. ప్రభవాది సంవత్సర లక్షణములను గురుమానముచే తెలియుదురు. ఆయా పన్నెండు మాసములచే, ఆయా అష్టకములు ఏర్పడును. గురుమధ్యమ చారముచే ప్రభవ మొదులకొని అరువది సంవత్సరములుండును. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగిరా, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధీ, విక్రమ, వృష, చిత్రభాను, సుభాను, తారణ, పార్ధివ, అవ్యయ, సర్వజిత్‌, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నంద, విజయ, జయ, మన్మథ, దుర్ముఖ, హేమలంబ, విలంబ, వికారి, శార్వరి, లవ, శుభకృత్‌, శోభన, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సామాప్త, విరోధకృత్‌, పరిభావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగల, కాలయుక్త, సిద్ధార్ధ, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి. రక్తాక్షీ, క్రోధన క్షయ అనునవి అరువది సంవత్సరములు.

నామతుల్యఫలాస్సర్వే విజ్ఞేయాష్షష్టి వత్సరాః, యుగం స్యాత్పంచభిర్వర్షై యుగాన్యేవంతు ద్వాదశ. 121

తేషామీశాః క్రమా జ్ఞేయా విష్ణు ర్దేవపురోహితః, పురందరో లోహితశ్చ త్వష్టాహిర్బుధ్న్యసంజ్ఞకః. 122

పితరశ్చ తతో విశ్వే శశీన్ద్రాగ్న్యశ్వినో భగః, తధా యుగస్య వర్షేశాస్త్వగ్నినేందువిధీశ్వరాః. 123

అదాబ్దేశ చమూనాథ సస్యపానాం బలాబలమ్‌, తత్కాలం గ్రహచారం చ సమ్యక్‌ జ్ఞాత్వా ఫలం వదేత్‌. 124

సౌమ్యాయనం మాసషట్కం మృగాద్యం భానుభుక్తితః అహ స్సురాణాం తద్రాత్రిః కర్కాద్యం దక్షిణాయనమ్‌. 124

గృహప్రవేశ##వైవాహప్రతిష్ఠామౌంజిబంధనమ్‌, మఘాదౌ మంగళం కర్మ విధేయం చోత్తరాయణ. 125

యామ్యాయనే గర్హితం చ కర్మయత్నాత్ప్రశస్యతే, మాఘాదిమాసౌ ద్వౌ ద్వౌ చ ఋతవశ్శిశిరాదయః. 127

మృగాచ్ఛిశిర వసంతశ్చ గ్రీష్మాస్స్యు శ్చోత్తరాయణ, వర్షా శరచ్చ హేమంతః కర్కాద్వై దక్షిణాయనే. 128

చాంద్రో దర్శావిధిస్సౌరస్సంక్రాంత్యా సావనో దినైః, త్రింశద్భిశ్చన్ద్రభగణో మాసో నాక్షత్రసంజ్ఞకః. 129

మధుశ్చ మాధవశ్శుక్ర శ్శుచిశ్చాథ నభస్తతః, నభస్య ఇష ఊర్జశ్చ సహాశ్చైవ సహస్యకః. 130

తపాస్తపస్యః క్రమశః శ్చైత్రాదీనాం సమాహ్వయాః, యస్మిన్మాసే పౌర్ణమాసీ యేన ధిష్ణ్యేన సంయుతా. 131

తన్నక్షత్రాహ్వయో మాసః పౌర్ణమాసీ తదాహ్వయా, తత్పక్షౌ దైవపిత్రాఖ్యౌ శుక్లకృష్ణౌ తథాపరే. 132

శుభాశుభే కర్మణి చ ప్రశస్తౌ భవతస్సదా, క్రమాత్తిథీనాం బ్రహ్మగ్నీ విరించివిష్ణుశైలజాః. 133

వినాయకయమౌ నాగచంద్రౌ స్కందోర్కవాసవౌ, మహేన్ద్రవాసవౌ నాగ దుర్గా దండధరాహ్వయః. 134

శివవిష్ణూ హరిరవీ కామస్సర్వః కలీ తతః, చంద్ర విశ్వే దర్శ సంజ్ఞ తిథీశాః పితర స్స్మృతాః. 135

నందా భద్రా జయారిక్తా పూర్ణాస్స్యుస్తిథయః పునః, త్రిరావృత్త్యా క్రమాజ్ఞేయా నేష్ట మధ్యష్టదాస్సితే. 136

కృష్ణపక్షే త్విష్టమధ్యా నిష్టదా క్రమశస్తదా, అష్టమీ ద్వాదశీ షష్ఠీ చతుర్ధీ చ చతుర్దశీ. 137

తిథయః పంచ రంధ్రాఖ్యా హ్యతిరూక్షాః ప్రకీర్తితాః, సముద్రమనురంధ్రాకతత్త్వసంఖ్యాస్తు నాడికాః. 138

త్యాజ్యాస్స్యుస్తాసు తిథిషు క్రమాత్పంచ చ సర్వదా, అమావాస్యా చ నవమీ హిత్వా విషమసంజ్ఞికా. 139

తిథయస్తు ప్రశస్తాస్స్యు ర్మధ్మమా ప్రతిపత్సితా, షష్ఠ్యాం తైలం తథాష్టమ్యాం మాసం క్షౌరం కలే స్ధిరౌ. 140

పూర్ణిమా దర్శయోర్నారీ సేవనం పరివర్జయేత్‌, దర్శే షష్ఠ్యాం ప్రతిపది ద్వాదశ్యాం ప్రతిపర్వసు. 141

నవమ్యాం చ న కుర్వీత కదాచిద్దన్తధావనమ్‌, వ్యతీపాతే చ సంక్రాంతావేకాదశ్యాం చ పర్వసు. 142

అర్కభౌమదినే షష్ఠ్యాం నాభ్యంగో వైధృతా తథా, యః కరోతి దశమ్యాం చ స్నానమామలకైర్నరః. 143

పుత్రహానిర్భవేత్తస్య త్రయోదశ్యాం ధనక్షయః, అర్థపుత్రక్షయస్తస్య ద్వితీయాయాం న సంశయః. 144

అమాయాం చ నవమ్యాం చ సప్తమ్యాం చ కులక్షయః, యా పౌర్ణిమా దివా చంద్రమతీసానుమతీ స్మృతా.145

రాత్రౌ చంద్రవతీ రాకాప్యమావాస్యా తథా ద్విధా, సినీవాలీ చేందుమతీ కుహూర్నేందుమతీ మతా.146

కార్తికే శుక్లనవమీత్వాదిః కృతయుగస్య చ, త్రేతాదిర్మాధవే శుక్లే తృతీయు పుణ్యసంజ్ఞితా.147

కృష్ణ పంచదశీ మాఘే ద్వాపరాదిముదీరితా, కల్యాది స్క్యాత్కృష్ణపక్షే నభస్య త్రయోదశీ. 148

ఈ అరువది సంవత్సరములు తమతమ పేరుకు తగిన విధముగానే ఫలముల నొసంగెను. అయిదు సంత్సరములకొక యుగమని పేరు. ఇట్లు పన్నెండు యుగములుండును. ఆయుగములకు అధిపతులు వరుసగా విష్ణువు, బృహస్పతి, పురందరుడు, లోహితుడు, తృష్టా, అహిర్భుద్న్యుడు, పితృదేవతలు, విశ్వేదేవతలు, చంద్రుడు, అగ్ని, అశ్వినీ దేవతలు, భగుడు, అని తెలియవలయును. యుగములోని అయిదు సంత్సరములకు వరుసగా అగ్ని, నరుడు, చంద్రుడు, బ్రహ్మ, శంకరుడు అధిపతులు. ఇపుడు సంత్సరాధిపతి, సేనాపతి, సస్యాధిపతుల బలాబలములను, ఆ సమయమున నున్న గ్రహచారమును బాగుగా తెలుసుకొని ఫలమును చెప్పవలయును. ఉత్తరాయణము ఆరు మాసములు. మకరమునుండి మిధునము వరకు సూర్యభక్తి వలన నుండును. ఈ ఉత్తరాయణము దేవతలకు పగలు దేవలకు రాత్రి దక్షిణాయనము. ఇది సూర్యుడు కర్కాటక రాశియందు ప్రవేశించిననాటినుండి మొదలగును. ధనూరాశ్యంతము వరకుండును. గృహప్రవేశము, వివాహము, ప్రతిష్ఠ, మౌంజీబంధనము మొదలగు శుభకర్మలను ఉత్తరాయణమును మాఘాది మాసములలో చేయవలయును. దక్షిణాయనమున శుభకర్మలను చేయుట నిందించబడినది. మాఘము నుండి రెండు రెండు నెలలు శిశిర, వసంత, గ్రీష్మఋతువులుండును. కర్కటకసంక్రమణనుండి ఆరునెలల దక్షిణాయనకాలమున వర్ష, శరత్‌, హేమంత ఋతువులుండును. అమావాస్యనుండి ఉండునది చాంద్రమానము సంక్రమణము నుండి చెప్పునది సౌరమానము, దినములతో చెప్పునది సావనమానము, చంద్రనక్షత్ర గణములు ముప్పదితో చెప్పు మాసము నక్షత్రమానమనబడును. చైత్రాది మాసములకు వరుసగా మధు, మాధవ, శుక్ర, శుచి, నభస్‌, నభస్య, ఇష, ఊర్జ, సహాః, సహస్యక తపః, తపస్య అనునవి పేర్లు. ఏ నెలలోని పూర్ణిమ ఏ నక్షత్రముతో కలిసియుండునో ఆ నక్షత్రము పేరే ఆ మాసమునకుండును. పూర్ణిమకు కూడా ఆ పేరే యుండును. ఆ మాసమున దేవ పక్షము, పితృపక్షము అని రెండుపక్షములుండును. ఇట్లే శుక్లపక్షము, కృష్ణపక్షము అని మరి రెండు పేర్లు కూడా కలవు. ఈ రెండు పక్షములు శుభాశుభ కర్మలకు ప్రశస్తములుగా పేర్కొనబడినవి. ఇట్లే పదిహేనుతిథులకు అధిపతులుగా వరుసగా బ్రహ్మ, అగ్ని, విరించి, విష్ణు, శైలజా, వినాయక, యమ, నాగ, చంద్ర, విశ్వేదేవ, ధర్మ, అను వారలు మరియు పితృదేవతలుగా తెలయవలయును. నందా, భద్రా, ఇయా, రిక్తా, పూర్ణా అని తిథులు అయిదు విధములు. అయిదింటిని మూడావృత్తులచే తిథులను తెలియవలయును. శుక్ల పక్షమున అనిష్టము మధ్యన కలిగి ఇష్టములనిచ్చును. కృష్ణపక్షమున ఇష్టమధ్యలై అనిష్టమునిచ్చును. అష్టమి, ద్వాదశి, షష్ఠి, చతుర్థి, చతుర్దశి, అను అయిదు తిథులను రంద్రములు అని పేరు. ఇవి చాలా క్రూరములుగా పేర్కొనబడినవి. స

ముద్ర మనురంథ్ర తత్త్వసంఖ్యలు గలవినాడికలు. ఆయా తిథులలో క్రమముననుసరించి ఈ నాడికలను విడువలయును. అమావాస్య, నవమిలను విడిచి మిగిలిన బేసి తిథులు ప్రశస్తములైనవి.

శుక్లప్రతిపత్‌ మధ్యమము. షష్ఠి తిథిన తైలమును, అష్టమి తిథిన మాంసమును, నవమీ తిథిన కారమును, పూర్ణిమా అమావాస్యలలో స్త్రిని సేవించరాదు. అమావాస్య తిదినాడు, షష్టినాడు, ప్రతిపత్తున, ద్వాదశి తిధిన, ప్రతిపర్వలో, నవమి తిథిన, దన్తధావనము చేయరాదు. వ్యతీపాత్తున, సంక్రాంతిన ఏకాదశిన, ప్రతిపర్వలో ఆదివారము, మంగళవారము, షష్ఠితిథినాడు, వైధృతినాడు అభ్యంగనము చేయరాదు. దశమీ తిథిన వుసిరికాయలతో స్నానము చేసినచో పుత్రహాని, త్రయోదశిన చేసినచో ధనక్షయము కలుగును. ద్వితీయా తిథిన చేసినచో ధనక్షయము, పుత్రక్షయము జరుగును. అమావాస్యనాడు, నవమీనాడు, సప్తమినాడు చేసినచో కులక్షయమగును. పగలుకూడా చంద్రుడున్న పూర్ణిమను సానుమతి యందురు. రాత్రి చంద్రుడున్న పూర్ణిమను రాకా యందురు. అట్లే అమావాస్య కూడా రెండు విధములు. చంద్రుడు కల అమావాస్యను సివీనాలి యని, చంద్రుడు లేని యమావాస్యను కుహూ అని యందురు. కార్తికశుక్లనవమి కృతయుగాది వైశాఖశుద్ధ తదియ త్రేతాయుగా. దీనినే పుణ్యా అని పేరు. మాఘబహుళ పంచమి ద్వాపరయుగాది. భద్రపద బహుళ త్రయోదశి కలియుగాది.

ద్వాదశ్యూర్జే శుక్లపక్షే, నవమ్యచ్ఛేశ్వయుజ్యపి, చైత్రే భాద్రపదే చైవ తృతీయా శుక్లసంజ్ఞితా.149

ఏకాదశీ సితా పౌషే హ్యాషాడే దశమీ సితా, మాఘే చ సప్తమీ శుక్లా న భ##స్యేత్వసి తాష్టమీ. 150

శ్రావణ మాస్యమావాస్యా ఫాల్గునే మాసి పౌర్ణిమా, ఆషాడే కార్తికే మాసి జ్యేష్ఠే చైత్రే చ పౌర్ణిమా. 151

మన్వాదయో మానవానాం శ్రాద్ధేష్వత్యంత పుణ్యదా, భాద్రే కృష్ణత్రయోదశ్యాం మఘామిన్దుః కరే రవిః.152

గజచ్ఛాయా తదా జ్ఞేయా శ్రాద్ధే హ్యత్యన్త పుణ్యదా, ఏకస్మిన్వారే, తిస్రస్తిధయస్స్యాత్తిధిక్షయః.153

తిధిర్వారత్రయే త్వేకా హ్యధికా ద్వే చ నిందితే, సూర్యాస్తమనపర్యన్తం యస్మిన్వారే తు యా తిధిః.154

విద్యతే సా త్వఖండా స్యాన్న్యూనా చేత్ఖండసంజ్ఞితా, తిధేః పంచదశో భాగః క్రమాత్ప్రతిపదాదయః.155

క్షణ సంజ్ఞాస్తదర్ధాని తాసామర్థ ప్రమాణతః, రవిస్థ్సిరశ్చన్ద్రః క్రూరో వక్రోఖిలో బుధః.156

లఘురీజ్యో మృదుశ్శుక్రస్తీక్షోష్ణదినకరాత్మజః, అభ్యక్తో భానువారే య స్స నరః క్లేశవాన్భవేత్‌.157

ఋక్షేశే కాంతిభాగ్భౌమే వ్యాది సౌభాగ్యమిందుజే, జీవే నైవం సితే హాని మందే సర్వసమృద్ధయః.158

లంకోదయాత్స్యాద్వారాది తస్మాదూర్ధ్వ మధోపి వా, దేశాన్తర స్వచరార్ధ నాడీభిరపరే భ##వేత్‌. 159

బలప్రదస్య ఖేటస్య కర్మ సిద్ధ్యతి యత్కృతమ్‌, తత్కర్మ బలహీనస్య దుఃఖేనాపి న సిద్ధ్యతి.160

ఇందుజ్ఞజీవశుక్రాణాం వాసరాస్సర్వకర్మసు, ఫలదాస్త్వితరే క్రూరే కర్మస్వభిమతప్రదాః.161

రక్తవర్ణౌ రవిశ్చంద్రో గౌరో భౌమస్తు లోహితః, దూర్వావర్ణో బుధో జీవః పీతశ్శ్వేతస్తు భార్గవః. 162

కృష్ణస్సౌరి స్స్వవారేషు స్వస్వవర్ణక్రియా హితాః, అద్రి బాణాశ్చ యస్తర్క పాతాలవసుధాధరాః.163

బాణాగ్నిలోచనా నిహ్య వేదబాహు శిలీముఖాః, త్ర్యేకాహయో నేత్రగోత్ర రామాశ్చన్ద్ర రసార్తవః.164

మలికాశ్చోపకులికా వారవేలాస్తథా క్రమాత్‌, ప్రహరార్ధ ప్రమాణాస్తే విజ్ఞేయా సూర్యవాసరాత్‌.165

యస్మిన్వారే క్షణో వార దృష్టస్తద్వాసరాధిపః, అద్యష్షష్ఠో ద్వితీయోస్మా త్తత్షష్ఠస్తు తృతీయకః.166

షష్ఠ ష్షష్ఠశ్చేతరేషాం కాలహారాధిపాస్స్మృతాః, సార్ధనాడీ ద్వయేనైవ దివారాత్రౌ యథాక్రమాత్‌.167

వారప్రోక్తం కర్మకార్యే త్తద్గ్రహస్య క్షణపి సన్‌, నక్షత్రేశాః క్రమాద్దస్ర యమవహ్నిపితామహాః.168

చంద్రేశాదితిజీవా హి పితరో భగ సంజ్ఞకః, అర్యమార్కత్వష్టృమరుత్‌ శక్రాగ్నిమిత్రవాసవాః.169

నైరుత్యుదకవిశ్వేజగోవిందవసుతోయపాః, అజైకపాదహిర్భుద్న్యా పూషా చేతి ప్రకీర్తితాః.170

పూర్వాత్రయం మఘాహ్యగ్ని విశాఖా యమమూలభమ్‌, అధో ముఖం తు నవకం భానౌ తత్ర విధీయతే.171

బిలప్రవేశగణితభూతసాధకలేఖనమ్‌, శిల్పకర్మకలాకూపనిక్షేపోద్ధరణాని యత్‌.172

మిత్రేన్దు త్వాణష్ట్ర హస్తేన్ద్రా దితి భాంత్యశ్వినాయుభమ్‌, తిర్యఙ్మఖాఖ్యం నవకం భానౌ తత్ర విధీయతే.173

హలప్రవాహగమనం గంత్రీపత్రగజోష్ట్రకమ్‌, ఖరగోరథనౌయాన లులాయ హయ కర్మ చ. 174

బ్రహ్మ విష్ణు మహేశార్య శతతారా వసూత్తరాః, ఊర్ధ్వాస్యం నవకం భానాం ప్రోక్తమత్ర విధీయతే.175

నృపాభిషేకమాంగల్యవారణధ్వజి కర్మ చ, ప్రాసాదతోరణారామప్రాకరాద్యం చ సిద్ధ్యతి.176

స్థిరే రోహిణ్యుత్తరాఖ్యం క్షిప్రం సూర్యాశ్విపుష్యభమ్‌, సాధారణం ద్విదైవత్యం వహ్నిభం చ ప్రకీర్తితమ్‌.177

వస్వాదిత్యంబుపుష్యాణి విష్ణు ఖేచరసంజ్ఞితమ్‌, మృద్విందుమిత్రచిత్రాంత్యముగ్రం పూర్వా మఘాత్రికమ్‌.178

మూలార్ద్రాహీన్ద్రభం తీక్షం స్వనామ సదృశం ఫలమ్‌, చిత్రాదిత్యాంబు విష్ణ్వంబాం త్యాధిమిత్ర వసూడుషు. 179

సమృగే జ్యేషు బాలానాం కర్ణవేధ క్రియా హితా, దస్రేన్ద్వదితి తిష్యేషు కరాదిత్రితయే తధా.180

గజకర్మాఖిలం యత్తి ద్విధేయం స్థిరభేషు చ, వాజి కర్మాఖిలం కార్యం సూర్యవారే విశేషతః. 181

చిత్రావరుణవైరించిత్ర్యత్తరాసు గమాగమమ్‌, దర్శాష్టమ్యాం చతుర్దశ్యాం పశూనాం న కదాచన. 182

మృదు ధ్రువ క్షిప్రచర విశాఖా పితృభేషు చ, హలప్రవాహం ప్రథమం విదధ్యాన్మూలభే వృషైః.183

హలాదౌ వృషనాశాయ భత్రయం సూర్య ముక్తభాత్‌, అగ్రే వృద్ధ్యై త్రయం లక్ష్మ్యై సౌమ్య పార్శ్వ చ పంచకమ్‌.184

శూలత్రయోపి నవకమ్‌ మరణాయ చ పంచకమ్‌, శ్రియై పుష్ట్యై త్రయం శ్రేష్ఠం స్యాచ్చక్రే లాంగలాహ్వయే. 185

మృదు ధ్రువ క్షిప్రభేషు పితృవాయువసూడుషు, సమూలభేషు బీజోప్తిరత్యుత్కృష్ట ఫలప్రదా.186

భ##వేద్ఖత్రితయం మూర్ధ్ని ధాన్యనాశాయ రాహుభాత్‌,చ గలే త్రయం కజ్జలాయ వృద్ధ్యై చ ద్వాదశోదరే. 187

నిస్తండులత్వం లాంగూలే భచతుష్టయ భీతిదమ్‌, నాబౌ వహ్నిః పంచకం యద్భీజోప్తావతి చింతయేత్‌.188

స్థిరేష్వదితి సార్పాంత్య పితృమారుత భేషు చ, న కుర్యాద్రోగముక్తస్య స్నానమాహీన్దుశుక్రయోః.189

ఉత్తరాత్రయమైత్రేన్ద్ర వసువారుణభేషు చ, పుష్యార్కపౌష్ణధిష్ణ్యేషు నృత్యారంభః ప్రశస్యతే.190

పూర్వార్ధయుంజి షడ్బానే పౌష్ణబాదుదభాత్తతః, మధ్యయుంజి ద్వాదశారాణన్ద్రభాన్నవభావి చ. 191

పరార్ధయుంజి క్రమశః సంప్రీతిర్ధమృతేర్మిధః, జిఘన్యా స్తోయ పార్ద్రా హి పవనాంతనాకపాః.192

క్రమాతి ద్విదైవత్యా బృహత్తారాః పరాస్సమాః, తాసాం ప్రమాణఘటికా స్త్రింశన్నపతి ద్యష్టయః.193

క్రమాదభ్యుదితే చంద్రే నయత్యర్ఘసమాని చ, అశ్వగ్రీంద్వీజ్య నైఋత్య త్వాష్ట్రజత్త్యుత్తరా భవాః. 194

పితృద్విదైవ వస్వాఖ్యా స్తారా స్స్యుః కులసంజ్ఞికాః, ధాతుజ్యేష్ఠాదితి స్వాతి పౌష్ణార్కహరిదేవతాః.195

అజాహ్యంత్యక భౌజంగ తారాశ్చైవాకులాహ్యయాః, శేషాః కులాకులాస్తారా స్తాసాం మధ్యే కులోడుషు.196

ప్రయాతి యది భూపాల స్తదాప్నోతి పరాజయమ్‌, భేషూపకులసంజ్ఞేషు జయమాప్నోతి నిశ్చితమ్‌.197

సంధిర్వాపి తయోస్సామ్యం కులాకులగణోడుషు, అర్కార్కి భౌమవారే చేభద్రాయా విషమాంఘ్రిభమ్‌.198

త్రిపుష్కరం త్రిగుణదమ్‌ ద్విగుణం యమలా హి భమ్‌, దద్యాత్తద్దోష నాశాయ గోత్రయం మూల్యమేవ వా. 199

ద్విపుష్కరే ద్వయం దద్యా న్నదోనష స్త్యృక్ష భేపి వా, క్రూరవిద్ధో యతో వాపి పుష్యో యది బలాన్వితః. 200

వినా పాణిగ్రహం సర్వమంగలేష్విష్ట దస్సదా, రామాగ్ని ఋతుబాణాగ్ని భూవేదాగ్ని శ##రేషు చ. 201

నేత్రబాహుశ##రేంద్విందుబాహువేదాగ్నిసంకరాః, వేద నేత్రాగ్నభ్ధ్యగ్ని శతబాహునేత్రరదాఃక్రమాత్‌. 202

తారా సంఖ్యాశ్చ విజ్ఞేయా దస్రాదీనాం పృథక్‌ పృథక్‌, యా దృశ్యన్తే దీప్తతారా స్వగణ యోగతారకాః. 203

కార్తికశుక్ల ద్వాదశి, ఆశ్వయుజశుద్ధ నవమి, చైత్రశుద్ధ తదియ, భాద్రపదశుద్ధ తదియ, పుష్యశుద్ద ఏకాదశి, ఆషాఢశుద్ధ దశమి, మాఘశుద్ధ సప్తమి, బాద్రపద బహుళాష్టమి, శ్రవణామావాస్య, ఫాల్గున పూర్ణిమ, ఆషాఢ కార్తిక జ్యేష్ఠ, చైత్ర పూర్ణిమలు అను ఈ పదునాలుగు మన్వాదికాలములు. మానవులు ఈ దిలములలో శ్రాద్ధము చేసిన మిక్కిలి పుణ్యవంతులగుదురు. భాద్రపద బహుళ త్రయోదశిన చంద్రుడు మఘా నక్షత్రమున, సూర్యుడు హస్తా నక్షత్రమున ఉన్నచో దానిని గజచ్ఛాయ అందురు. శ్రాద్ధమును చేసినచో అధిక పుణ్యమును ప్రసాదించును. ఒకే దినమున మూడు తిథులు వచ్చినచో తిథిక్షయము. మూడుదినములలో ఒకే తిథి వచ్చినచో ఒకటి అధిక, రెండు తిథులు నిందితములు. సూర్యాస్తమయపర్యంతము ఏ దినమున ఏ తిథి యుండునో ఆ తిథి ఆఖంబతిథి యనబడును. తక్కువగా యున్నచో ఖండతిథి యందురు. తిథియొక్క పదిహేనవ భాగము వరుసగా ప్రతిపదాదులని తెలియవలయును. వాటిలో సగ భాగము క్షణము అనబడును. ఇట్లు వాటిలో అర్థప్రమాణముననుసరించి సూర్యుడు స్థిరుడు, చన్ద్రుడు, బుధుడు క్రూరుడు వక్రుడు, బృహస్పతి లఘువు, శుక్రుడు మృదువు, శని తీక్షుడు అని సిద్ధాన్తము. భానువారమున అభ్యంగనమును చేసుకొనిన మానవుడు కష్టములపాలగును. సోమవారమున చేసినచో కాంతిమంతుడగును, మంగళవారమున చేసినచో వ్యాధి కలుగను. బుధవారము చేసినచో సౌభాగ్యవంతుడగును. గురువారము చేసినచో అనిష్టము. శుక్రవారము చేసినచో హాని, శనివారము చేసినచో సర్వసమృద్ధులు కలుగును. లంకోదయము నుండి వారాది యగును. దాని తరువాత కాని ముందు కాని దేశాన్తరమున స్వచరార్థనాడులతో తక్కినవియగును. గ్రహము బలయుతుడుండగా చేసిన పని చక్కగా నెరవేరును. అదే గ్రహము బలహీనముగా నున్నపుడు కష్టపడి చేసిననూ సిద్ధించదు. సోమ బుధ గురు శుక్రవారములు అన్నిపనులకు శుభ్రప్రదములు. మిగిలిన వారములు క్రూరములు. సూర్యుడు రక్తవర్ణుడు, చంద్రుడు గౌరవర్ణుడు. అంగారకుడు లోహిత వర్ణుడు, బుధుబు దూర్వావర్ణుడు, గురువు పీతవర్ణుడు, శుక్రుడు శ్వేతవర్ణుడు, శని కృష్ణవర్ణుడు. తమ తమ వారములలో తమ తమ వర్ణములను పనులను చేయుచుందురు. అద్రి, బాణ, పాతాల, పర్వత, బాణ, అగ్నిలోచన, వేద, బహు, బాణ, నేత్ర, గోత్ర, నామ, చన్ద్ర, రస, ఋతువుల సంఖ్యలో అనగా 7, 5, 1, 7, 5, 3, 2, 4, 2, 5, 2, 7, 3, 1, 9, 6 ఈ సంఖ్యలు గలవి వారవేల లగును. ఈ వేళలకు కులికా ఉపకులిక అను పేర్లుండును. అది వారమునుండి వరుసగా అన్నివారములలో ఈ వేళలు సగము ఝాముకాలము ఉండును. ఏ వారమున ఆవారాధిపతి క్షణకాలము చూడబడునో అది ఆద్యవేళ, దానినుండి ఆరవది రెండోవేళ, దాని నుండి ఆరవది మూడవవేళ ఇట్లు ఆరు ఆర్లు చేసినచో ఏడువేళలు వచ్చును. మిగిలిన వాటిని ఆయా గ్రహములు హోరాధిపతులగుదురు. రెండున్నర నాడులచే క్రమముననుసరించి పగలు రాత్రులు ఏర్పడును. ఆ గ్రహము యొక్క క్షణములో ఆవారములో చెప్పబడిన కర్మను చేయవలయును. ఆయా నక్షత్రములకు క్రమముగా దస్ర, యమ, వహ్ని, పితామహ, చంద్ర, ఈశ, అదితి, బృహస్పతి, సర్ప, పితృ, భగ, అర్యమ, అర్క, త్వష్కృ, మరుత్‌, శక్ర, అగ్ని, మిత్ర, వాసన, నైరుతి, ఉదక, విశ్వేదేవ, లిజ, గోవింద , వసు జలాధిపతి, అజైకపాత్‌, అహిర్బుధ్న్య, పూష అను వారలు పూర్వఫల్గుని, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, మఘ, కృత్తిక, విశాఖ, భరణి, మూలా అను తొమ్మిది నక్షత్రములలో అధోముఖ నవకమని, ఈ నవకములో సూర్యుడు ప్రవేశించి యున్నపుడు బలప్రవేశ, గణిత, భూతసాదన లేఖనమయు, శిల్పకర్కమ, కలా, కూప, నిక్షేసోద్ధరణము మొదలగునవి విదించబడినవి అనగా చేయవడలయును. అనూరాధ, మృగవిర, చిత్త, హస్త, జ్యేష్ఠ, పునర్వసు, రేవతి, అశ్వని, స్వాతి అనునీ తొమ్మిది తిర్యఙ్ముఖ నవకమందురు. ఈ తొమ్మిది నక్షత్రములలో సూర్యుడున్నపుడు, హల, ప్రవాహగమన, గంత్రీపత్ర, గజ, ఉష్ట్ర, ఖర, గో, రథ, నౌయాన, తిలాయ, హయ, కర్మలు చేయవలయునని విధించబడినవి. రోహిణి, శ్రవణం, ఆరుద్ర, ఉత్త్రఫల్గుని శతభిష, దనిష్ఠ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుష్యమి అను తొమ్మిది ఊర్ధ్వముఖమను నవకమనబడును. ఈ తొమ్మిది నక్షత్రములలో సూర్యుడున్నచో రాజ్యాభిషేక, మాంగల్య, గజ, ధ్వజకర్మలు, ప్రాసాద, తోరణ. ఆరామ, ప్రాకారాదులను చేయబడవలయును. రోహిణి, ఉత్తర, హస్త, అశ్విని, పుష్యమి, ఈ నక్షత్రములు స్థిరములని, విశాఖ, కృత్తికలు సాధారణములని చెప్పబడినవి ధనిష్ఠ, పునర్వసు, పూర్వాషాఢ, పుష్యమి, ఈ నక్షత్రములు చర నక్షత్రములనబడును. మృగశిర, అనూరాధ, చిత్ర, రేవతి, అనునవి మృదునక్షత్రములు, పూర్వాషాడ, పూర్వాభాద్ర, పుబ్బ, మఖా నక్షత్రములు ఉగ్రములు. మూలా, ఆర్ద్రా, ఆశ్లేష, జ్యేష్ఠా నక్షత్రములు తీక్షణములు. ఈ నక్షత్రములు తమ తమ పేర్లకు తగిన ఫలములనిచ్చును. చిత్త,పునర్వసు, పూర్వాషాఢ, శ్రవణం, రేవతి, అనూరాధ,ధనిష్ఠ, మృగశిర, పుష్యమి, నక్షత్రములలో, బాలురకు చౌలమును చేయవలయును. అశ్వని, మృగవిర, పునర్వసు పుష్యమి, హస్త, చిత్త, స్వాతి నక్షత్రములలో, స్థిరనక్షత్రములలో గజకర్మ చేయవలయును. సూర్యవారమున (అదివారమున) అశ్వకర్మను చేయవలయును. చిత్త, శతభిష, రోమిణి, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర నక్షత్రములలో గమనాగమనములను చేయవలయును. అమావాస్య, అష్టమి, చతుర్దశీ తిథులలో పశువుల పనిని చేయరాదు. మృదు, ధ్రువ, క్షిప్ర, చర నక్షత్రములలో, విశాఖా మఘా నక్షత్రములలో, మూలానక్షత్రమున వృషభములతో మొదటి నాగలిని లాగించవలయును. (భూమిని దున్నవలయును) పైన చెప్పిన నక్షత్రములనుండి మూడు నక్షత్రములలో హస్త నక్షత్రమున హలాదిచే దున్నించినచో వృషభములు నశించును. అగ్రభాగముతో దున్నించిన వృషభములు వృద్ధిచెందును. మూటితో దున్నించిన సంపద చేకూరును. ఉత్తరభాగమున పంచకమును చేయవలయును. శూలత్రయమున నవకము, పంచకము మరణమును కలిగించును. సంపదకు పుష్టికి త్రయము శ్రేష్ఠము. లాంగల నామక చక్రములో మూడునాగళ్ళచే దున్నించుట ఉత్తమము. మృదు, ధ్రువ క్షిప నక్షత్రములలో, మఖ, స్వాతి, ధనిష్ఠ మూలానక్షత్రములలో విత్తనము వేసినచో పంట పుష్కలముగా వచ్చును. రాహునక్షత్రమునుండి మూడు నక్షత్రములు శిరస్థానమున నుండును. కావున ధాన్యనాశము కలుగును. కంఠస్థానమున నుండు మూడు నక్షత్రములు చెడు ఫలమునిచ్చును. ఉదర స్థానమున నుండు పన్నెండు నక్షత్రములు వృద్ధిని ప్రసాదించును. లాంగూలస్థానమున నున్న నక్షత్రములలో విత్తనచో తండులశూన్యత్వమును కలిగించును. నాభిస్థానమున నున్న అయిదు నక్షత్రములలో విత్తినచో అగ్ని భయము కలుగునని శాస్త్రనిర్ణయము. స్థిరనక్షత్రములలో, పునర్వసు, ఆశ్లేష, రేవతి, మఘ, స్వాతి నక్షత్రములలో రోగముక్తునికి స్నానమును చేయించరాదు. ఆశ్లేష, మృగశిర, పుష్యమీనక్షత్రములలో కూడా చేయించరాదు. ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అనూరాధ, జ్యేష్ఠ, ధనిష్టా శతభిషా నక్షత్రములలో నృత్యారంభము ప్రశస్తముగా పేర్కొనబడినది. అట్లే పుష్యమి, హస్త, రేవతీ నక్షత్రములు కూడా నృత్యారంభమునకు ఉత్తమములు. పూర్వార్ధముతో కలిసియున్న ఆరు నక్షత్రములు, రేవతీ, ఉత్తరానక్షత్రములు మధ్యభాగములు కలిసియున్న పన్నెండు నక్షత్రములు జ్యేష్ఠనుండి తొమ్మిదినక్షత్రములు. పరార్థముచే కలిసిచున్న నక్షత్రములు క్రమముగా దంపతులకు ప్రీతిని పెంచునవి. శతభిష, ఆర్ధ్రా, ఆశ్లేష, స్వాతి, భరణి, జ్యేష్ఠా నక్షత్రములు అధమములు. పునర్వసు, విశాఖా నక్షత్రములు, బృహత్తారలు సమములు. ఈ నక్షత్రముల ప్రమాణఘడియలు క్రమముగా ముప్పది, తొంబది, పదునారుగా తెలియవలయును. చంద్రోదయము తరువాత వరుసగా అర్ఘసమములను గ్రహించవలయును. అశ్విని, మృగశిర, పుష్యమి, మూల చిత్త, ఉత్తరా, మఘా, విశాఖ, ధనిష్ఠా నక్షత్రములకు కులమని పేరు. రోహిణి. జ్యేష్ఠా, పునర్వసు, స్వాతి, రేవతి, హస్త, శ్రవణ, ఆశ్లేష. నక్షత్రములకు అకులములని పేరు. మిగిలిన నక్షత్రములకు కులాకులములని పేరు. కులసంజ్ఞకల నక్షత్రములలో రాజు యుద్ధమునకు బయలుదేరి వెళ్ళినచో పరాజయమును పొందును. ఆకుల నక్షత్రములలో యుద్ధమునకు వెళ్ళినరాజు విజయమును పొందును. నక్షత్రసంధిలో వెళ్ళినను, కులాకుల నక్షత్రములలో వెళ్ళినను అట్టి ఫలమునే పొందును. ఆది శని మంగళ వారములలో, భద్రానక్షత్రములయొక్క విషమ పాదములలో త్రిపుష్కరమున అయినచో త్రిగుణములను కలిగించును. ఉత్తరాషాఢ ఆశ్లేషా నక్షత్రములలో ద్విగుణఫలము లభించును. ఈ దోషము తోలగుటకు మూడు గోవులను కాని, మూడుగోవుల మూల్యమును కాని దానమును చేయవలయును. ద్విపుష్కరమున చేసినచో రెండు గోవులను దానము చేయవలయును. త్రిపుష్కరమున దానము చేసినచో దోషమంటదు. పుష్యమీ నక్షత్రము క్రూరనక్షత్రములచే విద్ధయైననూ, క్రూర నక్షత్రములచే కలిసియున్ననూ వివాహమును తప్ప ఇతర శుభకార్యములను చేయవచ్చును. 3, 3, 6, 5, 3, 1, 4, 3, 5, 2, 2, 5, 1, 1, 2, 4, 3, 4, 2, 3, 4, 3, 100, 2, 2, 32. ఇవి అశ్వనీ మొదలగు నక్షత్రములకు వేరువేరుగా వరుసగా తారాసంఖ్యలని తెలియవలయును. వీటిలో దీప్తతారలుగా కనపడునవి తమ తమ గణములలో యోగతారలుగా పిలువబడును.

వృషో వృక్షశ్చ భాయామ్యధిష్ణ్యేయమకరస్తరుః, ఉడుంబరశ్చాగ్నిధిష్ణ్యే రోహిణ్యాం జంబుకస్తరుః. 204

ఇందుభాత్ఖాదిరో జాతః కృష్ణప్లక్షశ్చ రౌద్రహాత్‌, సంభూతో7దితి భాద్వంశః పిప్పలః పుష్యసంభవః. 205

సర్పదిష్ణ్యాన్నాగవృక్షో వటః పితృభసంభవః, పాలాశో భాగ్యభాజ్జాత అక్షశ్చార్యమసంభవః. 206

అరిష్టవృక్షో రవిభాత్‌ శ్రీ వృక్ష స్త్వాష్ట్ర సంభవః, స్వాత్యృక్ష జో7ర్జునో వృక్షో ద్విదైవత్యాద్వికం తతః. 207

మిత్రభాద్వకులో జాతో విష్టిః పౌరందరజః, సర్జవృక్షో మూలభాచ్చ వంజులో వారిధిష్ణ్యజః. 208

పనసో వైశ్వబాజ్జాతశ్చార్క వృక్షశ్చ విష్ణుభాత్‌, వసుధిష్ణ్యాచ్ఛమీవృక్షః కదంబో వారుణరజః. 209

అజాహే శ్చూత వృక్షో7భూద్భుధ్న్యజః, పిచుమందకః, మధువృక్షః పౌష్ణధిష్ణ్యా ధిష్ణ్య వృక్షాః ప్రకీర్తితాః. 210

యస్మిఞ్చనైశ్చరో ధిష్ణ్యే తద్వృక్షో7ర్య్చః ప్రయత్నతః, యోగీశా యమవిశ్వేన్దుధాతృజీవనిశాకరాః. 211

ఇంద్రతోయాహ్నివహ్న్య ర్కభూమిరుద్రకతోయపాః, గణశరుద్రధనదత్వష్ట్ర మిత్రషడానవాః. 212

సావిత్రీ కమలా గౌరీ నాసత్యా పితరో7దితిః, వైధృతిశ్చ వ్యతీపాతో మహాపాతావుభౌ సదా. 213

పరిఘస్య చ పూర్వార్థం సర్వకార్యేషు గర్హితమ్‌, విష్కంభ వజ్రయోస్తిస్రః షడ్వా గండాతిగండయోః. 214

వ్యాగఘాతే నవశూలే తు పంచ నాడ్యో హి గర్హితాః, అదితీందుమఘాదహ్యశ్వ మూలమైత్రేజ్యభాని చ. 215

జ్ఞేయాని సహచిత్రాణి మూర్ధభాని యధాక్రమమ్‌, లిఖేదూర్ధ్వ గతామేకాం తిర్యగ్రేఖా స్త్రయోదశ. 216

తత్ర ఖార్జూరికే చక్రే కథితం మూర్థ్ని భే న్యసేత్‌, భాజ్యైకరేఖా గతయోః సూర్యాచంద్రమసోర్మిధః. 217

ఏకార్గలో దృష్టిపాతశ్చాభిజిద్వర్జితాని వై, వినాడీభి ర్ద్వాదశీఖీరహితం ఘటికాద్వయమ్‌. 218

యోగం ప్రకరణం యోగాః క్రమాత్తు సప్తవింశతిః, ఇన్ద్రః ప్రజాపతిర్మిత్రస్త్వష్టాభూ హరితి ప్రియా. 219

కీనాశః కలి రుద్రాఖ్యో తిథ్యార్దే శాస్త్వహిర్మరుత్‌, బవాదివణిజాంతాని శుభాని కరణాని షట్‌. 220

పరీతా విపరీతా వా విష్టిర్నేష్టా తు మంగలే, ముఖే పంచగలే చైకా వక్షస్యేకాదశ స్మృతః. 221

నాభౌ చతస్రః షట్‌ కట్యాం తిస్రః పుచ్ఛాఖ్య నాడికాః, కార్యహానిర్ముఖే మృత్యుర్గలే వక్షసి నిస్స్వతా. 222

కట్యామున్మత్తతా నాభౌ చ్యుతిః పుచ్ఛే ధ్రువం జయః, స్థిరాణి మధ్యమాన్యేషాం మధ్యనాగ చతుష్పదౌ. 223

దివా ముహూర్తా రుద్రాహి మిత్ర పితృ వసూదకమ్‌, విశ్వే విధాతృబ్రహ్మేన్ద్రరుద్రాగ్నివసుతోయయపాః. 224

అర్యమా భగ సంజ్ఞశ్చ విజ్ఞేయా దశ పంచ చ, ఈశా జపాదాహిర్భుధ్న్యపూషాశ్వియమవహ్నయః. 225

ధాతృ ఇంద్రాదితీజ్యాఖ్యా విష్ణ్వర్కత్వష్టృవాయవః, అహ్నః పంచదశో భాగస్తధా రాత్రిప్రమాణతః. 226

ముహూర్తమానం ద్వరా వ క్షణర్‌క్షాణి సమేశ్వరమ్‌, అర్యమా రాక్షసబ్రాహ్మౌ పిత్ర్యాగ్నే¸° తధాభిజిత్‌. 227

రాక్షసాఖ్యే బ్రాహ్మపిత్ర్యౌ భర్గాజాంశా వినాదిషు, వారేషు వర్జనీయాస్తే ముహూర్తాశ్శుభకర్మసు. 228

యేషు ఋక్షేషు యత్కర్మ కధితం నిఖిలం చ తత్‌, తద్ధైవత్యే ముహూర్తే7పి కార్యం యాత్రాదికం సదా. 229

భూకంపస్సూర్యభాత్సప్త మర్‌క్షే విద్యుచ్చ పంచమే, శూలో7ష్టమే చ దశ##మే శనిరష్టాదశే తతః. 230

కేతుః పంచదశే దండ ఉల్కా ఏకోనవింశతౌ, నిర్ఘాత పాత సంజ్ఞశ్చ జ్ఞేయస్స నవపంచమే. 231

మోహనిర్ఘాతకంపాశ్చ కులిశం పరివేషణమ్‌, విజ్ఞేయా ఏకవింశూదారభ్య చ యథాక్రమమ్‌. 232

చంద్రయుక్తేషు భేష్వేషు శుభకర్మ న కరయేత్‌, సూర్యభాత్సర్వ పిత్ర్యర్‌క్షం త్వాష్టమిత్రాప్తభేషు చ. 233

స విష్ణు భేషు క్రమశో హస్త భాచ్చంద్ర సంయుతః, ధిష్ణ్యే తావతి సత్యత్ర దుష్టయోగః పతత్యసౌ. 234

చండీశ చండాయుధాఖ్య స్తస్మిన్నేనా చరేచ్ఛుభమ్‌, త్రయోదశ స్యుర్మలిన సంఖ్యయా తిధి వారయోః. 235

క్రకచో నామ యోగో7యం మంగలేష్వతి గర్హతిః, సప్తమ్యామర్కవారశ్చేత్ప్రతిపత్సౌమ్యవాసరే. 236

సంవర్త యోగో విజ్ఞేయ శ్శుభ కర్మ వినాశకృత్‌, ఆనందః కాలదండాఖ్యో ధూమ్రధాతృసుధాకరాః. 237

ధ్వాంక్షధ్వజాఖ్యశ్రీవత్స వజ్రిముద్గరఛత్రకాః, మిత్రమానసపద్మాఖ్య లుంబకోత్పాత మృత్యవః. 238

కాణసిద్ధి శుభా మృత్యు ముసలాంతకకుంజరాః, రాక్షసాఖ్య వరస్థైర్య వర్ధమానాః క్రమాదమీ. 239

యోగాస్స్వసంజ్ఞఫలదా అష్టావింశతి రీరితాః, రవివారే క్రమాదేవ దస్రభాదిందుభాద్విధౌ. 240

సార్పాద్భౌమే బుధే హస్తాత్‌ మైత్రభాత్సురమంత్రిణి, వైశ్వదేవాద్భృగుసుతే వారుణాత్‌ భాస్కరాత్మజే. 241

హస్తర్‌క్షంచ ఖార్విందౌ చంద్రభం దస్రభం కుజే, సౌమ్యే మిత్ర భమాచార్యం తిష్యః పౌష్ణం భృగోస్సుతే. 242

రోహిణీ మన్దవారే చ సిద్ధయోగాహ్వయా అమీ, ఆదిత్యభౌమయోర్నందా భద్రాశుక్ర శశాక యోః. 243

జయా సౌమ్యే గురౌ రికత్‌ఆ శనౌ పూర్ణేతి నో శుభాః, నన్దా తిథి శ్శుక్రవారే సౌమ్య భద్రా కుజే జయా. 244

రిక్తామందే గురోర్వారే పూర్ణాసిద్ధాహ్వయా అమీ, ఏకాదశ్యామిందువారో ద్వాదశ్యామర్కవాసరః. 245

షష్ఠే గురౌ తృతీయాజ్ఞే7ష్టమీ శుక్రే శ##నైశ్చరే, నవమీ పంచమీ భౌమే దగ్ధయోగాః ప్రకీర్తితాః. 246

భరణ్యర్కదినే చంద్రే చిత్రా భౌమే తు విశ్వభమ్‌, బుధే శ్రవిష్ఠార్యమభే గురౌ జ్యేష్ఠా భృగోర్దినే. 247

రేవతీ మందవారే తు గ్రహజన్మర్‌క్ష నాశనమ్‌, విశాఖాదిచతుర్వర్గ అర్కవారాదిషు క్రమాత్‌. 248

ఉత్పాతమృత్యుకాణాఖ్య సిద్ధియోగాః ప్రకీర్తితాః, తిధివారోద్భవా నేష్టా యోగా వారర్‌క్షసంభవాః. 249

హూణవంశఖసేష్వన్యదేశేష్వతి శుభప్రదాః, ఘోరాష్టాక్షీ మహోదర్యో మందామందాకినీ తథా. 250

మిశ్రా రాక్షసి కా సూర్యవారాదిషు యథాక్రమమ్‌, శూద్రతస్కరవైశ్యక్ష్మాదేవభూపగవాం క్రమాత్‌. 251

అనుక్తానాం చ సర్వేషాం ఘోరాద్యాస్సుఖదాస్స్మృతాః. పూర్వాహ్ణె నృపతీన్హన్తి విప్రాన్మధ్యందినే విశః. 252

అపరాహ్ణె స్తగే శూద్రన్ప్రదోషే చ పిశాచకాన్‌, నిశి రాత్రించరాన్నాట్యకారానపరరాత్రికే. 253

గోపానుషసి సంధ్యాయాం లింగినో రవిసంక్రమః, దివాచేన్మేషసంక్రాన్తి రనర్ధకలహప్రదా. 254

రాత్రౌ సుభిక్షమతులం సంధ్యయోర్వృష్టినాశనమ్‌, హరిశార్దూలవారాహఖరకుంజరమాహిషాః. 255

అశ్వశ్వాజవృషాః పాదా యుధాః కరణవాహనాః, భుశుండీ చ గదా ఖడ్గీ దండం ఇష్వాస తోమరౌ. 256

కుంత పాశాం కుశాస్త్రీషూన్బిబర్తి కరయోన్త్వినః, అన్నం చ పాయసం భైక్ష్యం సయూషం చ పయోదధి. 257

మిష్టాన్నం గుడమధ్వాజ్యశర్కరావవతో హవిః, వవో వీవణిజే విశ్వాం బాలవే గోచర స్థితౌ. 258

కౌలవే శకునౌ భానుః కింస్తుఘ్నే చోరసంస్థితః, చతుః పాదే తిలే నాగే సుప్తః క్రాంతిం కరోతి హి. 259

ఇక ఇపుడు ఆయా నక్షత్రములవలన వచ్చిన వృక్షములను చెప్పుచున్నాము. అశ్వని వలన వృషవృక్షము భరణీ నక్షత్రమున యమకరవృక్షము, కృత్తికా నక్షత్రమున మేడిచెట్టు, రోహిణీ నక్షత్రమున జంబుకవృక్షము, మృగశిరా నక్షత్రమువలన చండ్రచెట్టు, ఆర్ద్రా నక్షత్రమువలన నల్లజువ్వి, పునర్వసు నక్షత్రమువలన వెదురు, పుష్యమీ వలన పిప్పలము, ఆశ్లేష వలన నాగవృక్షము, మఘా వలన మఱ్ఱిచెట్టు, పుబ్బా నక్షత్రమువలన మోదుగు, ఉత్తరా నక్షత్రమువలన అక్షవృక్షము, హస్త వలన అరిష్టవృక్షము, చిత్తా నక్షత్రమువలన శ్రీవృక్షము, స్వాతివలన అర్జునవృక్షము, విశాఖా నక్షత్రమువలన వికంకతవృక్షము, అనూరాధా నక్షత్రమువలన పొగడచెట్టు, జ్యేష్ఠా నక్షత్రము వలన విష్టి వృక్షము మూలా నక్షత్రము వలన సర్జవృక్షము, పూర్వాషాఢా నక్షత్రమువలన కంజల వృక్షము ఉత్తరాషాఢా నక్షత్రము వలన పనస వృక్షము, శ్రవణా నక్షత్రము వలన జిల్లేడు, ధనిష్ఠా నక్షత్రము వలన జమ్మిచెట్టు, శతభిషా నక్షత్రము వలన కదంబ వృక్షము, పూర్వాభాద్ర నక్షత్రము వలన మామిడిచెట్టు, ఉత్తారభాద్రా నక్షత్రము వలన వేపచెట్టు, రేవతి వలన ద్రాక్షచెట్టు పుట్టినవి. ఈ వృక్షములన్నియు నక్షత్రముల వలన ఏర్పడినవిగా తెలియవలయును. యేనక్షత్రమున శని ఉండునో ఆ వృక్షమును ప్రయత్నపూర్వకముగా అర్చించవలయును. యోగేశులు, యముడు, విశ్వేదేవతలు, చంద్రుడు, భూమి, రుద్రుడు, వరుణుడు, గణశుడు, రుద్రుడు, కుబేరుడు, త్వష్ట, మిత్రుడు కుమారస్వామి, సావిత్రి, లక్ష్మి, గౌరి, అశ్వనీ దేవతలు, అదితి, పితృదేవతలు వీరిని అర్చించవయలును. వైధృతి వ్యతీపాత్‌లు మహాపాతములనబడును.

పరిఘా యోగముయొక్క పూర్వార్ధము ఏకార్యములకు పనికిరాదు. విష్కంభ వజ్ర యోగములయొక్క మూడు నాడికలు, గండ, అతిగండ యోగముల ఆరు నాడికలు, వ్యాఘాతమున తొమ్మిది నాడులు, శూలమున అయిదు నాడులు. అశుభ ఫలప్రదములు. పునర్వసు, మృగశిర, మఘా, అశ్విని, మూల, అనూరాధ, పుష్యమీ, చిత్తా నక్షత్రములు వరుసగా మూర్ధాస్థాన నక్షత్రములని తెలియవలయును. పైభాగమున ఒక రేఖను, అడ్డముగా పదమూడు రేఖలను గీయవలయును. ఆ ఖార్జూర చక్రమున పైన చెప్పబడిన నక్షత్రములను మూర్ధస్థానమున ఉంచవలయును. ఒకే రేఖలో నుండు సూర్య చంద్రులకు పరస్పరము దృష్టిపాతమున్నచో ఏకార్గలమందురు. అభిజిత్తును వదిలి పన్నెండు వినాడులు లేని రెండు ఘడియలు యోగమందురు. అట్లే కరణము అందురు. ఈ యోగములు వరుసగా ఇరువది యేడుండును. ఇంద్రుడు, ప్రజాపతి, మిత్రుడు, త్త్వష్టా, భూమి, హరితిప్రియా, యముడు, కలి, రుద్రుడు, నాగము, వాయువు అనువారలు తిధ్యర్దేశులుగా తెలియవలయును. బవ మొదలుకొని వణిజమువరకు ఆరు శుభకరణములు. శుభకార్యములను పరీతమగు విష్టికాని విపరీతమగు విష్టికాని ఇష్టప్రదము కాజాలదు. ముఖమున అయిదు, కంఠమున ఒకటి, వక్షస్థ్సలమున పదకొండు, నాభిస్థానమున నాలుగు, కటి స్థానమున ఆరు, పుచ్ఛమున మూడు నాడికలుండును. ముఖనాడికలలో కార్యమును ప్రారంభించినచో కార్యహాని, గల స్థాన నాడికలలో ప్రారంభించిన మృత్యువు, వక్షస్థ్సలనాడికలలో అర్థహాని, కటి స్థాననాడికలలో ఉన్మాదము, నాభి స్థాననాడికలలో చ్యుతి, పుచ్ఛ నాడికలలో ప్రారంభించిన జయము కలుగును. మధ్యభాగమున నున్న నక్షత్రములు స్థిరములు. అవియే మధ్యనాగ చతురష్పదములనబడును. ఆరుద్ర, ఆశ్లేష, అనూరాధ, మఘా, ధనిష్ఠ, పూర్వాషాడ, ఉత్తరఫల్గుని, పూర్వఫల్గుని. ఉత్తరాషాఢ, రోహిణి, జ్యేష్ఠా, ఆర్ద్ర, కృత్తిక, ధనిష్ఠ, శతభిషం అను ఈ పదిహేను నక్షత్రములు దివాముహూర్తములని తెలియవలయును. ఆర్ద్ర, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణీ, జ్యేష్ఠ, పునర్వసు, పుష్యమి, శ్రవణము, హస్త, చిత్త, స్వాతి, నక్షత్రములు ఒకదినములో పగలులో పదిహేనవభాగము, అట్లే రాత్రిలోని పదిహేనవ భాగము ముహూర్తమానమగును. క్షణములు నక్షత్రములు సరిగా చూడవలయును. ఉత్తరఫల్గుని, మూల, రోహిణి, మఘా, కృత్తిక, అభిజిత్‌ ఈ నక్షత్రములలో భరణి మఘానక్షత్రములు రాక్షసములను పేరు గలవి. సూర్యాదులలో భర్గ, అజాంశలు గా నుండును. శుభకర్మలను చేయునపుడు ఆయా వారములలో పైన చెప్పబడిన ముహూర్తములను వదులవలయును. యే నక్షత్రములలో ఏ పనిని చేయవలయునని చెప్పబడినదో ఆ విధముగా ఆయాదేవతలున్న ముహూర్తములలోనే యాత్రాదికములను చేయవలయును. హస్తా నక్షత్రము నుండి ఏడవ నక్షత్రమున అనగా మూలా నక్షత్రమున భూకంపము, హస్త నుండి అయిదవ నక్షత్రమున అనగా అనూరాధా నక్షత్రమున విద్యుత్‌, 8, 10 యవ నక్షత్రములలో అనగా పూర్వాషాఢా శ్రవణా నక్షత్రములలో శూలము, 18వ నక్షత్రమున అనగా జ్యేష్ఠానక్షత్రమున శని, పదిహేనవ నక్షత్రమున కేతువు, పందొమ్మిదవ నక్షత్రమున ఉల్కాపాతము, 9, 5 నక్షత్రములలో నిర్ఘాతపాతమను సంజ్ఞలను తెలియవలయును. మోహము, నిర్ఘాతపాతము, కంపము, కులిశము, పరివేషణము అనునవి 21 వ నక్షత్రము నుండి వరుసగా ఆయా నక్షత్రములలోనివి అని తెలియవలయును! పైన చెప్పబడిన ఈ నక్షత్రములలో చంద్రుడున్నచో శుభకార్యములు చేయకూడదు. హస్త మఘ చిత్త, అనూరాధ, అప్త నక్షత్రములలో శ్రవణమున క్రమముగా హస్తనుండి చంద్రునితో కూడియున్నదో, అంత వరకు ఆనక్షత్రమున దుష్టయోగమనబడును. వాటిలో చండీశ, చందాయుధా యోగములున్నపుడు ఈ యోగములలోనే శుభకార్యములనాచరించవలయును. తిథి వారములు మలినములు పదమూడుండును. దీనిని క్రకచయోగమందురు. శుభకార్యములను ఈ క్రచ యోగమున ఆచరించరాదు.

ఆదివారమున సప్తమి, బుధవారమున ప్రతిపత్తు ఏర్పడినచో సంవర్తయోగమందురు. ఈ యోగము శుభకర్మలను నశింపచేయును. ఆనందము, కాలదండము, ధూమ్రము, ధాతృ, సుధాకర, ధ్వాంక్ష, ధ్వజ, శ్రీవత్స, వజ్ర, ముద్గర, ఛత్రకమిత్ర, మానస, పద్మ, లుంబన, ఉత్పాత, మృత్యువు, కాణ, సిద్ధి, శుభ, అమృత్యు, ముసల, అంతక, కుంజర, రాక్షస, వర, స్థైర్య, వర్ధమానము అనునవి ఇరువది ఎనిమిది యోగములు. తమ పేరులో నున్న ఫలమునొసంగునవి. ఆదివారమున క్రమముగా అశ్వని మృగశిరలలో చంద్రుడున్నను, ఆశ్లేషలో కుజుడున్ననూ, హస్తా నక్షత్రమున బుధుడున్ననున అనూరాధలో బృహస్‌ంపతి యున్ననూ, ఉత్తరాషాఢలో శుక్రడున్ననూ, శతభిషమున శని యున్ననూ, హస్తలో చంద్రుడు, మృగశిరా అశ్వినులలో కుజుడున్ననూ, అనూరాధలో బుధుడున్నను పుష్యమిలో బృహస్పతి యున్ననూ, రేవతిలో శుక్రుడున్ననూ, శని వారమున రోహిణీ నక్షత్రము వచ్చిన చో ఇవియన్నియూ సిద్ధయోగములనబడును. ఆది మంగళవారములలో నందా, శుక్ర సోమవారములలో భద్రా, బుధవారములో జయా, గురువారము రిక్త, శనివారము పూర్ణ ఉన్నచో శుభప్రదములు. శుక్రవారమున నందాతిథి, బుధవారమున భద్రా, మంగళవారమున జయ, శనివారమున రిక్త, గురువారమున పూర్ణా యున్నచో సిద్ధయోగములందురు. ఏకాదశి తిథి సోమవారము, ద్వాదశి ఆదివారము గురువారము షష్ఠి, బుధవారము తృతీయ, శుక్రవారము అష్టమి, శనివారము నవమి, మంగళవారము పంచమి. ఇవి దగ్ధ యోగములనబడును. ఆదివారము భరణీ నక్షత్రము, సోమవారము చిత్తానక్షత్రము, మంగళవారము ఉత్తరాషాఢ, బుధవారము శ్రవణము, గురువారము ఉత్తర ఫల్గుని, శుక్రవారము జ్యేష్ఠా, శనివారము రేవతి యున్నపుడు గ్రహోదయము జరిగినచో నక్షత్రనాశమును కలిగించును. విశాఖ నుండి నాలుగు వర్గములు ఆదివారము నుండి వరుసగా ఏర్పడినచో అదే వరుసలో ఉత్పాత, మృత్యు, కాణ, సిద్ధియోగములనబడును. తిధివారములు కలిసినపుడు ఏర్పడిన యోగము శుభప్రదము కాదు. వార నక్షత్రముల కలయిక వలన ఏర్పడిన యోగములు ఇతరదేశములలో శుభప్రదములు. ఘోరా, అష్టాక్షీ, మహోదరీ, మందా, మందాకినీ, మిశ్రా, రాక్షసీ అను యోగములు ఆదివారాది వారములలో వరుసగా ఉండును. శూద్ర, తస్కర, వైశ్య, బ్రాహ్హణ, క్షత్త్రియ, గోవులకు ఇంకా చెప్పువాటికి అన్నిటికి వరుసగా ఘోరాది యోగములు సుఖప్రదములు. పూర్వాహ్ణమున రాజులను, మధ్యాహ్నమున బ్రాహ్మణులను, అపరాహ్ణమున వైశ్యులను, ప్రదోషకాలమున శూద్రులను, రాత్రి పిశాచములను, అపరరాత్రమున రాక్షసులను, నాట్యకారులను, ఉషః కాలమున గోపాలురను, సంధ్యకాలమున బ్రహ్మచారులను సూర్యసంక్రమణము ఏర్పడినచో నశింపచేయును. మేష సంక్రమణము పగలు వచ్చినచో అనర్ధములను కలహములను కలిగించును. రాత్రివచ్చినచో సుభిక్షము, సంధ్యాకాలమున వృష్టినాశము కలగును. సింహము, శార్దూలము, వరాహము, ఖరము, కుంజరము, మహిషము, అశ్వము, కంచరగాడిద, వృషభము ఇవి పాదాయుధములు, కరణములు వాహనములుగా నుండును. భుశుడి గద, ఖడ్గము, దండము, ధనుస్సు, తోమరము. కుంతము, పాశము, అంకుశము, అస్త్రములు, బాణములు విటిని చేతులలో సూర్యుడు ధరించును. అన్నము పాయసము, భైక్ష్యము, పాలు, పెరుగు, మిష్టాన్నము గుడము, తేనే, నెయ్యి, శర్కర, హవిస్సు ఇవి ఆహారము. సూర్యుడు చరరాశిలో ఉండగా పక్షులు వైశ్యులు బవకరణమున బావమున సూర్యుడున్నచో కాలవమున శకునిలో సూర్యుడున్నచో, కింస్తుఘ్నమున చోరులలో నున్నను, చతుః పాదమున, తలమున, నాగమున పరున్నచో క్రాంతిని చేయును.

ధర్మాయుర్వృష్టిషు సమం శ్రేష్ఠం నష్టం ఫలం క్రమాత్‌, ఆయుధం వాహనాహారౌ యజ్జాజీయం జనస్య చ. 260

స్వాపోపవిష్టా స్తిష్ఠన్తస్తే లోకాః క్షేమమాప్నుయః, అంధకం మందసంజ్ఞంచ మధ్యసంజ్ఞం సులోచనమ్‌. 261

పాపీయాద్గణయేధ్ఖాని రోహిణ్యాది చతుర్విధమ్‌, స్థిరభేష్వర్కసంక్రాన్తి ర్జేయా విష్ణుపదాహ్వయా. 262

షడశీతి ముఖా జ్ఞేయా ద్విస్వభావేషు రాశిషు, తులా ఘటా జయో ర్ఞేయో విషువత్సూర్యసపుమః. 263

యామ్యాయనే స్థిరేత్వాద్యాః పరాస్సౌమ్యేందు మూర్తిభైః, మేధ్యా విఘవతి ప్రోక్తాః పుణ్యనాడ్యస్తు షోడశ. 264

సంధ్యా త్రినాడీ ప్రమితార్కబింబో ర్ధ్వోదయాస్తతః, ప్రాక్పశ్చాద్యామ్య సౌమ్యే చేత్పుణ్యం పూర్వపరే7హని. 265

నరః ప్రాప్నోతి తద్రాశౌ శితాంశోస్సాధ్వసాధు చ, సంక్రాన్తేః పరతో భానుర్ఖుక్త్వా యావద్భిరంశ##కైః. 266

రవేరయనసంక్రాన్తిస్తదా తద్రాశి సంక్రమాత్‌, సంక్రాన్తి గ్రహతెంవా జన్మన్యుభయపార్వాయోర్‌క్షః. 267

ప్రతోద్వా హాదికేష్వేవ ద్వయం నేష్టంతు తత్ర్కమాత్‌, తిలోపరి లిఖేచ్చక్రం త్రిశూలం త్రికోణకమ్‌. 268

తత్ర హేమ వినిక్షిప్య దద్యాద్దోషాపవృత్తయే, తారాబలేన శీతాంశుర్బలవాంస్తద్వశాద్రవిః. 269

బలీ సంక్రమమాణస్తు తద్వత్కేటాబలాధికాః, శుభోర్కో జన్మతస్స్యాయ దశషటు మునిశ్వర 270

నవపంచాంఋరిష్పస్థై ర్వ్యర్కిభిర్వధ్యతె న చేత్‌, త్ర్యయారిషు కుజ శ్శ్రేష్ఠో జన్మనా చేన్న విధ్యతే. 271

వ్యయేష్వంకస్థితై స్సౌరి స్సౌమ్యసూర్యై శ్ళుభోషధాత్‌, శుభో జన్మర్‌క్షత శ్చంద్రోద్యానాంగాయారి స్వత్రిషు. 272

యధేష్టాంత్యాంబు ధర్మస్థై ర్విబుధైర్విధ్యతే న చేత్‌, జ్ఞస్స్వాయార్యష్ట స్వాయేఘ జన్మతశ్టేన్న విధ్యతె. 273

ధీత్ర్య కాదిగజాంతస్థై శశాంకరహితైశ్శుభైః, జన్మరాశేర్గురుశ్శ్రేష్ఠ స్వాయగ్యో ధ్యస్తగో న చేత్‌. 274

జన్మరాశేర్గురుశ్రేష్ఠ స్వాయగోళి - ధ్యస్తగో న చేత్‌, విధ్యరైత్యాష్ట ఖాబుత్రిగతైః ఖేటైర్మునీశ్వర. 275

జన్మభాదా సుతాష్టాంకాం త్యాయేష్విష్టోభృగోస్సుతః, చేన్నవిద్ధోష్టసప్తాంగం ఖాంకాద్యాయారిరామగైః. 276

తస్మా ద్వేధం విచార్యాథ కథవీయం శుభాశుభమ్‌, వామభేదవిధానేన దుష్టో7పి స్యాచ్చుభంకరః. 277

సౌమ్యేక్షితోకలిష్టఫలః శుభదః పాపవీక్షితః ని ష్ఫలౌతౌ గ్రహౌ స్వేన శత్రుణా చ విలోకితౌ. 278

నీచరాశిగతస్స్వస్య శత్రోః క్షేత్రగతో7పివా, శుభాశుభఫలం నైవ దద్యాదస్తమితో7పి వా. 279

గ్రహేషు విషమస్థేషు శాంతిం కుర్యాత్ప్రయత్నతః, హానిర్వృద్ధిర్గ్రహాధీనా తస్మాతూజ్యతమాగ్రహ్యాః. 280

మణి ర్ముక్తాఫలం విద్రు మాఖ్యం మరకతం తధా, పుష్పరాగం తధా వజ్రం నీలం గోమేద సంజ్ఞితమ్‌. 281

వైదూర్యం భాస్కరాదీనాం తుష్ట్యై ధార్యం యథాక్రమమ్‌, శుక్లపక్షాదిదివసే చంద్రో యస్య శుభప్రదః. 282

పక్షస్తస్య శుభదః కృష్ణపక్షో7న్యధ్యాశుభః శుక్లపక్షె శుభశ్చంద్రో ద్వితీయనవ పంచమే. 283

రిఃఫరంధ్రంబుసంస్థైశ్చే న్న విద్ధో గనే చరైః, జన్మసంపద్విపత్‌ క్షేమ ప్రత్యరిస్సాధకో వధః. 284

మిత్రం పరమమిత్రం చ జన్మ భాత్తు పునః పునః, జన్మత్రిపంచసప్తాఖ్యా స్తారానేష్టఫలప్రదాః. 285

శాకం గుడం చ లవణం సతిలం కాంచనం క్రమాత్‌, అనిష్టఫలనాశాయ దద్యాదేతద్ద్వజాయతే. 286

కృష్ణే బలవతీ తారా శుక్లపక్షే బలీ శశీ, చంద్రస్య ద్వాదశావస్థా రాశౌ రాశౌ యథాక్రమమ్‌. 287

యాత్రోద్వాహ్వాది కార్యేషు నామతుల్య ఫలప్రదాః, షష్ఠిఘ్నం గత చంద్రర్‌క్షం తత్కాల ఘటికాన్వితమ్‌. 288

వేదఘ్నమిఘ వేదాంత్యమవస్థా భ్మానుభ్మాగతః, ప్రవాస నష్టాఖ్యమృతా జయో హస్యం రతిం ముదా. 289

శని భుక్తి ర్జ్వరః కంపః సుస్థితి ర్నామ సన్నిభః పట్టబంధన యానోగ్ర సంధివిగ్రహభుషణమ్‌. 290

ధాత్వా కరం యుద్దకర్మ మేషలగ్నే ప్రశస్సాతి, మంగలాని స్థిరాణ్యంబువేశ్మకర్మ ప్రవర్తనమ్‌. 291

కృషివాణిజ్యపశ్వాది దుష్టలగ్నే ప్రసిద్ధ్యతి, కాలవిజ్ఞానశిల్పాని భూషణాహవసంశ్రవమ్‌. 292

గజోద్వాహాభిషేకాద్యం కర్తవ్యం మిదునోదయే, వాపికూపతటాకాదివారిబంధనమోక్షణమ్‌. 293

పౌష్టికం లిపిలేఖాది కర్తవ్యం కర్కటోదయే, ఇక్షుధాన్య వణిక్పణ్యకృషిసేవాదయ స్ద్సిరే. 294

సాహసాహవభూపాద్యం సింహలగ్నే ప్రసిద్ధ్యతి, విద్యా శిల్పౌషధం కృత్యం భూషణం చ చరస్థిరమ్‌. 295

కన్యాలగ్నే విధేయం చ పౌష్టికాఖిల మంగలమ్‌, కృషివాణిజ్యయానం చ పశూద్వాహవ్రతాదికమ్‌. 296

తులాయామఖిలం కర్మ తులాభారాశ్రితే చ యత్‌, స్థిరకర్మాఖిలం కార్యం రాజసేవాభిషేకనమ్‌. 297

చౌర్యకర్మస్దిరారంభ్మాః కర్తవ్యా వృశికోదయే, వ్రతోద్వాహప్రయాణాశ్వగజశిల్పకలాదికమ్‌;. 298

చరస్థిరవిమిశ్రం చ కర్తవ్యం కార్ముకోదయే, చాపబంధనమోక్షాస్త్ర కృషిగోశ్వాదికర్మ యత్‌. 299

ప్రస్థానం పశుదాసాది కర్తవ్యం మకరోదయే, కృషివాణిజ్యపశ్వంబుశిల్పకర్మకదిలా దికమ్‌. 300

జలపాత్రాస్త్రశస్త్రాది కర్తవ్యం కలశోదయే, వ్రతోద్వాహాభిషేకాంబు స్థాపనం సన్నివేశానామ్‌. 301

భూషణం జలపాత్రాశ్వకర్మ మీనోదయే శుభమ్‌, మేషాదిషు విలగ్నేషు శుద్ధేష్వేవం ప్రసిద్ధ్యతి. 302

క్రూరగ్రహేక్షితే ఘాగ్ర సంయుతే ఘాగ్రమేవ హి, గోయుగ్మ కర్మకన్యాంత్య తులా చాపధరాశ్శుభాః. 303

శుభరక్ష్‌త్వా శుభాసత్య ఇతరా పాపరాశయః. 304

ధర్మ, ఆయుష్య వృష్టులలో వరుసగా శ్రేష్ఠము, నష్టము, ఫలము అనునవి ఫలుములగా నుండును. సూర్యుని ఆయుధములు, వాహనములు, ఆహరములు ఎటువంటివో నిద్రంచుట కూర్చునుట, నిలబడుట ఎవరికి అలవాట్లు గానుండునో అటువంటి లోకములు క్షేమమును పొందగలవు. రోహిణి నుండి నాలుగు నక్షత్రములు అంధకము, మందము, మధ్యము సులోచనము అను సంజ్ఞలను పోలియున్నవి. ఈ నాలుగు పాటీయములుగా పరిగణించవలయును. స్థిరరాశులలో సూర్య సంక్రాంతి యేర్పడినచో విష్ణుపదమందురు. ద్విస్వభావరాశులలో సంక్రమణము జరిగినచో షడశీతిముఖ యందురు. తుల కుంభ మేషములలో సూర్య సంక్రమణమేర్పడినచో విషువత్‌ అందురు. దక్షిణాయనమున స్థిరరాశులలో ఏర్పడినపుడు మొదటివి, కర్కాటక కన్య మిథున రాశులలో ఏర్పడినపుడు తరువాత చెప్పినవి ఏర్పడును. విషువత్తులో పుణ్యనాడులు పదునాఱని చెప్పబడినవి. సంధ్యాకాలము నాడీత్రయపరిమితము. సూర్యబింబము ఉదయించుట, ఊర్ధ్వగతి మిగిలిన నాడులో జరుగును. దినమున పూర్వాహ్ణ పరాహ్ణములలో తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తర దిశలలో జరిగినచో పుణ్య మగును. ఎటువంటి చంద్రునితో భానుసంక్రాంతి ఏర్పడునో అట్టి ఫలముకలుగును. ఆరాశిలో చంద్రుని మంచి చెడులవలన కలుగు ఫలమునే మానవుడు పొందును. సంక్రాంతి తరువత సూర్యుడు ఎన్ని అంశల భుక్తుల తరువాత సూర్యుని ఆయన సంక్రాంతి కలుగునో అదే ఆరాశి సంక్రమణము వలన ఏర్పడును. సంక్రాంతి గ్రహము, నక్షత్రము కాని జన్మలో, రెండు పార్శ్వములలో ఉన్నచో వ్రతవివాహదులలో ఆక్రమముచే ఆ రెండు ఇష్టములు కావు. నువ్వుల మీద చక్రమును లిఖించవలయును. మూడుత్రిశూలములను మూడు కోణములుగా లిఖించి వాటిపై బంగారమునుంచి దోషనివృత్తికొరకు దానమును చేయవలయును. తారాబలముచే చంద్రుడు బలీయుడగును. చంద్రుని వలన సూర్యుడు బలీయుడగును. సంక్రమణము జరుగు సూర్యుడు ఖలియుడు. అట్లే గ్రహములు బలీయములు. శుభుడగు సూర్యుడు జన్మనుండి 3, 11, 10, 6, లో 9, 5, లలో, శనికంటే భిన్నగ్రహములచే వేధించబడనిచో శుభకరుడగును. 3, 11, 6 స్థానములలో కుజుడు శుభుడు. అదియును జన్మవిద్ధకానపుడు మాత్రమే. 12 వ స్థానమున అంకస్థితులతో శని బుధ సూర్యులచే చూడబడనపుడు కుజుడు శుభుడు. జన్మనక్షత్రమునుండి చంద్రుడు శుభుడు 7, 8, 6, 3 స్థానములలో అంత్యాంబు ధర్మస్థానములలోనుండు గ్రహములచే విద్ధలేనపుడు మాత్రమే. బుధుడు 1, 11, 6, 8 స్థానములలోనుండి జన్మ నుండి లిద్దలేనిచో 4, 3 మోదలగు గజాంతములలో ఉండి చంద్రుడులేని శుభగ్రహ విక్షణమున్నచో శుభుడగును. జన్మరాశినుండి గురుడు, అస్తగతుడు స్వాయగతుడు కానిచో శుభుడగును. 1, 9, 6, 3 స్థానములలోనున్న గ్రహములచే చూడబడినపుడు మాత్రమే. శుక్రుడు జన్మరాశి నుండి 4, 6, 8, 12, 11 ఉన్నచో శుభుడు. 7, 6, 1, 11, స్థానములలో విద్ధ లేనపుడు మాత్రమే.

గ్రహమునకు వేధ యున్నచో శుభము నీయజాలడు. కావున గ్రహవేధను చక్కగా పరశీలించిన తరువాతనే శుభాశుభఫలములను చెప్పవలయును. వామ భేదవిధానముచే దుష్టగ్రహము కూడా శుభమును కలిగించును. సౌమ్యగ్రహములచే చూడబడినచో అనిష్ట ఫలమును కలిగించును. పాపగ్రహములచే చూడబడినచో శుభములనిచ్చును. తనను తాను చూచుకొనినను, శత్రువు చేత చూడబడిననూ గ్రహములు నిష్ఫలములగును. నీచరాశిలో ఉన్ననూ, తన శత్రుక్షేత్రమున నున్ననూ అస్తగతుడైనను శుభాశుభఫలముల నీయజాలడు. గ్రహములు విషమ స్థానములలో నున్నపుడు ప్రయత్నపూర్వకముగా శాంతిని జరూపవలయును. శుక్లపక్షమున ద్వితీయ నవ పంచమ స్థానములలోని చంద్రుడు గ్రహముల వేధ లేకయున్నచో శుభుడు. జన్మతారనుండి వరుసగా ప్రతి తొమ్మిది నక్షత్రములకు జన్మ, సంపత్‌, విపత్‌, క్షేమ, ప్రత్యక్‌, సాధన, నైధన, మిత్ర పరమమిత్ర అని తారాబలమును తెలుపు పేర్లు. ఇట్లు ఈ తొమ్మిందింటినే మరల మరల చూడవలును. జన్మ, విపత్‌, ప్రత్యక్‌, నైధన తారలు అనిష్ట ఫలమునొసంగును. ఆనిష్టము నశించుటకు శానదానము, గుడదానము, లవణదానము, తిలదానము, సువర్ణదానము వరుసగా ఆయా తారలలో దానము చేవలును. కృష్ణపక్షమున తారలు బలము కలిగియుండును. శుక్లపక్షమున చంద్రుడు బలవంతుడుగా నుండును. చంద్రుని ప్రతిరాశిలో ఆ వరుసలోనే ద్వాదశావస్థలుండును. యాత్ర, వివాహాదికార్ములలో ఆయా అవస్థలు తమ పేరులో నున్న ఫలములనే ఇచ్చును. షష్ఠ ద్వాదశావస్థలుండును. యాత్ర, వివాహాదికార్యములలో ఆయా అవస్థలు తమ పేరులో నున్న ఫలములనే ఇచ్చును. షష్ఠ స్థానవేధయున్నది, చంద్రనక్షత్రము దాటినది ఆ%ా సమములలోని ఘటికలలో కూడినది. నాలుగుతో కొట్టబడినది 5, 4, 12 అవస్థలు సూర్యుభాగము వలన ప్రవాస, నష్ట, మృత, జయ, హాస్యం, రతి, మోసము, శని భుక్తి, జ్వరము, కంపము సుస్థితి అని చంద్రునికి 12 అవస్థలుండును. పట్టబంధము, యానము, ఉగ్రకర్మ, సంధివిగ్రహకర్మలు ఆభరణ ధారణము, ధాత్వాకరము, యుద్ధకర్మ ఈ పనులను మేష లగ్నమున చేయుట శుభప్రదము. శుభకార్యములు, స్థిరమైన కార్యములు, జలకర్మ, గృహకర్మ, కృషివాణిజ్యపశ్వాదికర్మలను దుష్టలగ్నమున చేయవలయును. కాలవిజ్ఞానము, శిల్పకర్మ భూషణధారణము, యుద్ధము, గజకార్యము, వివాహము, అభిషేకాది కర్మలను మిథున లగ్నమున చేయవలయును. వాపీకూపతటాకాది కర్మలను, వాటి బంధనమును, వాటి మోక్షమును, పౌష్టికకర్మను, లిపి లేఖనమును కర్కాటక లగ్నమున చేవలును.

ఇక్షు కర్మ, ధాన్యకర్మ, వాణిజ్యకర్మ, విక్రయకర్మ, వ్వవసాయము, సేవాదికర్మలు స్థిరలగ్నమును చేయవలయును. సాహసకార్యములను, యుద్ధమును, రాజకార్యములు మొదలగువాటిని సింహలగ్నమున చేయవలయును. విద్యాభ్యాసము, శిల్పకర్మ, ఔషధకర్మ, భూషణధారణ, చరస్థిర లగ్నములలో చేయవలయును. పౌష్టికకర్మలు, సర్వశుభ కార్యములు కన్యాలగ్నమున చేయవలయును. కృషికర్మను, వాణిజ్యకర్మను, యానకర్మ, పశుకర్మ, వివాహము, వ్రతాది కార్యములను తూలాభారాశ్రితమైన కర్మలను తులాలగ్నమున చేయవలయును. సమస్తములగు స్థిర కర్మలను, రాజ సేవను, రాజాభిషేకమును, చోరకర్మ, స్థిరములగు ప్రయత్నములను వృశ్చిక లగ్నముననాచరించవలయును. వ్రతములను, వివాహమును, ప్రయాణమును, అశ్వగజ కర్మలను, శిలకర్మలను, కళాకర్మలను, చరస్థిరకర్మలను ధనుర్లగ్నమున నాచరించవలును. చాప బంధనము, చాప మోక్షమును, అస్త్రకర్మను కృషికర్మ, గోకర్మ, అశ్వాదికర్మలు, ప్రస్థానము, పశుకర్మ, దాసకర్మలను మకర లగ్నమున చేయవలయును. కృషి, వాణిజ్య, పశు, జల, శిల్ప కలాదికములను, జలపాత, అస్త్ర శస్తాది కర్మలను కుంభలగ్నమున చేయవలయును. వ్రతములను వివాహమును, అభిషేకమును, జలస్థాపనము, సన్నివేశనము, భూషణములను జలపాత్ర, అశ్వకర్మలను మీనలగ్నమున చేయవలయును. మేషాది విలగ్నములు శుద్ధములుగా ఉన్నపుడు ఈ కర్మలనాచరించుట ప్రసిద్ధికలదు. క్రూరగ్రహములచే చూడబడినను, ఉగ్రగ్రహములున్ననూ క్రూరఫలితమే కలుగును. వృషభ, మిథున, కర్కాటక, కన్యా, మీన, తులా, ధనుర్లగ్నములు శుభప్రదములు. శుభ నక్షత్రములు శుభగ్రహములు ఉన్నపుడు శుభములు. ఇతర రాశులు పాపరాశులు.

గ్రహయోగావలోకాభ్యాం రాశిర్థత్తే గ్రహోద్భవమ్‌, ఫలం తాభ్యాం విహీనోసౌ స్వభావముపసర్పతి. 305

ఆదౌ సంపూర్ణ ఫలదం మధేమధ్యఫలప్రదమ్‌, అంతే తుచ్ఛ ఫలే లగ్నే సర్వస్మిన్నేపమేవ హి. 306

సర్వత్ర ప్రధమం లగ్నం కర్తుశ్చంద్రబలం తత:, కల్ప్యామదిందౌ బలిని సప్తమే బలినో గ్రహా:. 307

చంద్రస్య బలిమాధారమాధేయం చాన్య ఖేటకమ్‌, ఆధారభూతేనాధేయం ధీయతే పరిధిష్టనమ్‌. 308

చేదిందు శ్శుభద స్సర్వే గ్రహా శ్శుభఫలప్రదాః, అశుభ శ్చేదశుభదా వర్జయిత్వా ధనాధిపమ్‌. 309

లగ్న స్వాభ్యుదితా యేం శా స్తేష్వంశేషు స్థితో గ్రహః, లగ్నోద్భవం ఫలం ధత్తే ధనాతీతో ద్వితీయకమ్‌. 310

ఏవం స్థానేషు శేషేషు చైవమేవం ప్రకల్పయేత్‌, లగ్నం సర్వగుణోపేతం లభ్యతే7ల్పైర్దినైర్నహి. 311

దోషాల్పత్వం గుణాధిక్యం బహుసంతతమిష్యతే, దోషాద్దుష్టోహి కాలస్తమసి మార్టుం పితామహః. 312

అప్యశౌచ గుణాధిక్యం దోషాన్యత్తే తతో హి తే, ఆమరిక్తాష్టమీ షష్ఠీ ద్వాదశీ ప్రతిపత్స్వ పి. 313

పరిఘస్య చ పూర్వార్ధం వ్యతీపాతే స వైధృ తా, సంధ్యాసూపప్లవే విష్ట్యామశుభం ప్రధమార్తవమ్‌. 314

రుగ్ణా పతిప్రియా దు:ఖీ పుత్రిణ భోగినీ తధా, పతివ్రతా కేశయుక్తా సూర్వావారాదిషు క్రమాత్‌. 315

యామాగ్నిరౌద్రభాగ్యా హీ ద్వీశేంద్రాది హ్యుపద్విషాః, తారకా న హితా మాసా మధూర్జ శుచిపౌషకాః. 316

భద్రా చ సంక్రమో నిద్రా రాత్రిశ్చంద్రార్కయోర్గ్రహః, కులటా పాపభోగేఘ నింద్యర్‌క్షే నింద్యవాసరే. 317

తిలాజ్య దూర్వా జుహుయా గాయత్య్రాష్ట శతం బుధః, సువర్ణగోతిలాన్దద్యాత్‌ సర్వదోషాపనుత్తయే. 318

ఆద్యానిశశ్చ తస్రస్తు త్యాజ్యా హ్యపి సమాఃపరైః, ఓజరాశ్యంశ##గే చంద్రే లగ్నౌ పుంగ్రహవీక్షితే. 319

ఉపవీతీ యుగ్మతిధావనగ్నః కామయేత్త్స్రియమ్‌, పుత్రార్ధీ పురుషస్త్యక్త్వా పౌష్ణమూలాహి పిత్ర్యభమ్‌. 320

ప్రసిద్ధే ప్రధమే గర్భే తృతీయే వా ద్వితీయకే, మాసే పుంసవనం కార్యం సీమంతం చ యధా తధా. 321

చుతుర్ధే మాసి షష్ఠేవా ష్యష్టమే వా తదీశ్వరే, బలోపపన్నే దంపత్యో శ్చంద్రతారా బలాన్వితే. 322

అరిక్తా పర్వదివసే కుజజీవార్కవాసరే, తీక్ష మిశ్రార్క వర్జ్యేఘ పుంభాంశే రాత్రినాయకే. 323

శుద్ధేష్టమే జన్మలగ్నా త్తయోర్లగ్నౌ న నైధనే, శుభగ్రహయుతే దృష్టే పాపదృష్టి వివర్జితే. 324

శుభగ్రహేషు ధీ ధర్మ కేంద్రేష్వరిభ##వే త్రిషు, పాపేషు సత్సు చంద్రేన్త్య నిధనాద్యరివర్జితే. 325

కూరగ్రహాణామేకోపి లగ్నాదంత్యాత్మజాష్టగః, సీమంతినీం వా తద్గర్భం బలీహంతి న సంశయః. 326

తస్మిన్జన్మముబహూర్తేపి సూతకాంతేపి వా శిశోః, జాతకర్మ ప్రకర్తవ్యం పితృపూజనపూర్వకమ్‌. 327

సూతకాంతే నామకర్మ విధేయం తత్కులోచితమ్‌, నామ పూర్వం ప్రశస్తం స్యాన్మంగలై స్సుసమీక్షితై:, 328

దేశకాలోపఘాతాద్యై: కాలాతిక్రమణం యాదా, అనస్తగే భృగావీజ్యే తత్కార్యేచోత్తరాయణ. 329

చరస్థిరమృదుక్షిప్ర నక్షత్రే శుభవాసరే, చన్ద్రతారా బలోపేతే దివసే చ శిశోః పితుః. 330

శుభలగ్నే శుభాంశే చ నిధనే శుద్ధి సంయుతే, షష్ఠే మాస్యష్టమే వాపి పుంసా స్త్రీణాం తు పంచమే. 331

రిక్తాం దిక్షయం నన్దాం ద్వాదశీ మష్టమీ మన, త్యక్త్వాన్యతిధిషు ప్రోక్తం ప్రాశనం శుభవాసరే. 332

చరస్థిర మృదుక్షిప్ర నక్షత్రే శుభ##నైధనే, దశ##మే శుద్ధ సంయుక్తే శుభలగ్నే శుభాంశ##కే. 333

పూర్వార్ధే సౌమ్యఖేటేన సంయుక్తే వీక్షితేహివా, త్రిషష్ఠలాభ##గైక్రూరైః కేంద్రధీధర్మగైశ్శుఖైః. 334

వ్యయారినిధనస్థేచ చంద్రేన్నప్రాశనం శుభమ్‌, తృతియే పంచమే చాబ్దే స్వకులాచారతో పి.వా. 335

బాలానాం జన్మత శ్చౌలం స్వగృహ్యోక్త విధానతః, సౌమ్యాయనే నాస్తగయో సురారిసురమంత్రిణోః. 336

అపర్వరిక్తతిధిషుం శుక్రేజ్యజ్ఞేందువాసరే, దస్రాదితీజ్య చంద్రేంద్ర పూషఖాని శుభాని చ. 337

చౌలకర్మణి హస్తరాక్ష త్త్రీణి త్రీణి చ విష్ణుభాత్‌, పట్టబంధనచౌలాన్నప్రాశ##నే చోపనాయనే. 338

శుభదం జన్మనక్షత్రమశుభం త్వన్యకర్మణి, ఆష్ఠమే శుద్ధి సంయుక్తే శుభలగ్నే శుభాంశ##కే. 339

జన్మాష్టమేన శీతాంశౌ షష్ఠాష్టాంత్య వివర్జితే, ధదత్రికోణకేంద్ర స్థైశ్శుభై స్త్ర్యయారిగైఃపరైః. 340

అభ్యక్తౌ సంధ్యోర్నారే నిశి భుక్తావాన వి హవే, నోత్కటే భూషితేనైన యానే న నవమ్యే హ్ని చ. 341

క్షౌరకర్మ మహీపానాం పంచమే పంచమే హని, కర్తవ్యం క్షౌరనక్షత్రేప్యధ వాస్యోదేయ శుభమ్‌. 342

నృప విప్రాజ్ఞయా యజ్ఞే మరణ బంధమోక్షణ, ఉద్వాహెఖిల వో తిథిషు క్షౌరమిష్టదమ్‌. 343

కర్తవ్యం మంగలేష్పాదౌ మంగలాయ క్షురార్పణమ్‌, నవమే సప్తమే వాపి పంచమే దివసేపివా. 344

తృతీయే బీజనక్షత్రే శుభవారే శుభోదయే, సమ్యగ్గృహణ్యలంకృత్య వితానధ్వజతోరణౖః. 345

ఆశిషో వాచనం కార్యం పుణ్యం పుణ్యాంగనాదిభిః, సహ వాదిత్రనృత్యాద్యై ర్గత్వా ప్రాగుత్తరో దిశమ్‌. 346

తత్ర మృదం తతస్తీక్ణా గృహీత్వా పునరాగతః, మృణ్మయ్యేప్యధవా వైణపి పాత్రే ప్రపూరయేత్‌. 347

అనేకబీజసంయుక్తం తోయం పుష్ఫాభిశోభితమ్‌, ఆధానాదష్టమే వర్షే జన్మతో వాగ్రజన్మనామ్‌. 348

రాజ్ఞామేకాదశే మౌంజిబంధనం ద్వాదశే విశామ్‌, జన్మతః పంచమే వర్షే వేదశాస్త్రవిశారదః. 349

ఉపవీతి యతః శ్రీమాన్‌ కార్యం తత్రోపనాయనమ్‌, బాలస్య బలహీనోపి సితో జీవశ్శుభప్రదః. 350

యధోక్తవత్సరే కార్యం అనుక్తే నోపనాయనమ్‌, దృశ్యమానగురౌ శుక్రే శాఖేశే చోత్తరాయణ. 351

వేదానామధిపాశు జీవక్రభౌమబుధాఃక్రమాత్‌, శరద్గ్రీష్మవసంతేషు వ్యుత్క్రమాత్తు ద్విజన్మనామ్‌. 352

ముఖ్యం సాధారణం తేషం తపో మాసాది పంచసు, ప్వకులాచారధర్మజ్ఞో మాఘమాసే తు ఫాల్గునే. 353

విధిజ్ఞ శ్చార్ద వాంశ్చైత్రే వేదవేదాంగ పారగః, వైశాఖే ధనవాన్వేదశాస్త్రవిద్యావిశారదః. 354

ఉపనీతో బలాఢ్యశ్చ జ్యేష్ఠే విధివిదాం వరః, శుక్లపక్షే ద్వితీయా చ తృతీయా పంచమా తథా. 355

త్రయోదశీ చ దశమీ సప్తమి వ్రతబంధనే, శ్రేష్ఠాత్వేకాదశీ షష్ఠీ ద్వాదశ్యన్యాస్తుమధ్యమాః. 356

కృష్ణే ద్విత్రీషు సంఖ్యాశ్చ తిథ్యోన్యా హ్యతినిందితాః, ధిష్ణ్యాన్యర్కత్రాయంత్యేజ్య రుద్రాదిత్యుత్తరాణి చ. 357

విష్ణుత్రయాశ్విమిత్రాబ్జయోని భాన్యుపనాయనే, జన్మభాద్దశమం కర్మ సంఘాతరక్షంతు షోడశమ్‌. 358

అష్టాదశం సముదయం త్రయోవింశం వినాశనమ్‌, మానసం పంచవింశర్‌క్ష నాచరే చ్ఛుభ##మేషు తు. 359

ఆచార్య సౌమ్యకావ్యానాం వారాశ్శస్తాశ్శసీ నయోః, వారౌ తు మధ్యమౌ చైవ ప్రత్యౌన్యౌ నిందితౌ మతౌ. 360

త్రిధా విభజ్య దివసం తత్రాదౌ కర్మదైవికమ్‌, ద్వితీయే మానుషం కార్యం తృతీయేం శే చ పైతృకమ్‌. 361

కృషి వాణిజ్య పశ్వయి శిల్పకర్మకలాదికమ్‌. స్వనీచగే తదంశే నా స్వారిభౌ వా తదంశ##కే. 362

గురుశిఖి నోశ్చ శాఖేశే కలాశీలవివర్జితః, స్వాధిశత్రుగృహస్థే వా తదంశ##స్థేధ వా వ్రతీ. 363

శేఖేశే వా గురౌ శుక్రే మహాపాతకకృద్భవేత్‌, స్వోచ్చసంస్థే తదంశేవా స్వరాశౌ రాశిగే గణ. 364

శాఖేశే వా గురౌ శుక్రే కేంద్రగే వా త్రికోణగే, అతీవ ధనవాంశ్చైవ వేదవేదాంగపారగః. 365

పరమోచ్చగతే జీవే శాఖేశే వాథ వాసితే, వ్రతీ విశుద్ధే నిధనే వేదశాస్త్రవిశారదః. 366

స్వాధిమిత్ర గృహస్ధే వా తస్యోచ్చస్థే తదంశ##గే, గురౌ భృగౌ వా శాఖేశే విద్యాధనసమన్వితః. 367

శాఖాధిపతివారశ్చ శాఖాధిబలం శిశోః, శాఖాధిపతి లగ్నం చ దుర్లభం త్రితయం వ్రతే. 368

తస్మాద్వేదాంశ##గే చన్ద్రే వ్రతీ విద్యావిశారదః, పాపాంశ##గే స్వాంశ##గే వా దరిద్రో నిత్యదుఃఖితః. 369

శ్రవణాదిని నక్షత్రే కర్కాంశ##స్థే నిశాకరే, తదా వ్రతీ వేదశాస్త్ర ధనధాన్యసమృద్ధిమాన్‌. 370

శుభలగ్నే శుభాంశే చ నైధనే శుద్ధిసంయుతే, లగ్నే తు-నిధనే సౌమ్యైస్సంయుతే వా నిరీక్షితే. 371

ఇష్టైర్జీవార్కచంద్రాద్యై పంచభిర్చలిభిర్గ్రహైః, స్థానాదిబలసంపూర్ణై చతుర్భిర్వా శుభాన్వితైః. 372

ఈక్షన్నైవాత్రైకవింశ మహాదోషవివర్జితే, రాశయస్సకలాశ్శ్రేష్ఠాశ్శుభగ్రహయుతేక్షితాః. 373

శుభానవాంశక గతా గ్రాహ్యాస్తే శుభరాశయః, నకదాచిత్కర్కటాంశ శ్శుభేక్షితయుతోపివా. 374

తస్మాద్గోమిధునాంశాశ్చ తులాకన్యాంశకాశ్శుభాః, ఏవం విధే లగ్నగతే నవాంశే వ్రతమీరితమ్‌. 375

త్రిషదాయగతైః పాపై షడష్టాస్త్య వివర్జితైః, శుభై ష్షష్ఠాష్ట లగ్నాంత్య వర్జితేన హిమాంశునా. 376

స్వోచ్చసంస్థోపి శీతాంశుః వ్రతినో ది లగ్నగః, కరోతి శిశుం నిస్స్వం సర్వతః క్షయరోగిణమ్‌. 377

స్ఫూర్జితే కేంద్రగే భానౌ వ్రతినాం పితృనాశనమ్‌, పంచదోషోనితం లగ్నం శుభదం చోపనాయనే. 378

వినావసంతఋతునా కృష్ణపక్షే గలగ్రహే, అనధ్యాయే విష్టి షష్ఠ్యోర్నతు సంస్కారమర్హతి. 379

త్రయోదశ్యాదిచత్వారి సప్తమ్యాది దినత్రయమ్‌, చతుర్థీ వా శుభాఃప్రోక్తా అష్టావేతే గలగ్రహాః. 380

గ్రహయోగమువలు గ్రహవీక్షణమువలన రాశిగ్రహోద్భవమును ధరించును. అట్లే ఫలమును ధరించును. గ్రహయోగము, గ్రహవీక్షణములేని రాశి తన స్వభావమును అనుసరించును. రాశి ఆదిలో సంపూర్ణఫలమునిచ్చును. మధ్యలో మధ్యమ ఫలమునిచ్చును. లగ్నాంత్యమున తుచ్ఛఫలము నిచ్చును. అన్నిలగ్నములలో ఇదేవిధమగు ఫలముండును. అన్ని విషయములలోను మొదట లగ్నము, తరువాత కర్తకు చంద్రబలమును చూడవలయును. సప్తమస్థానమున బలయుతులగు విషయములుండవలయును. చంద్రబలము ఆధారము, ఇతరగ్రహముల బలము ఆధేయము. ఆధారముచే ఆధేయము ధరించబడును. చంద్రుడు శుభ్రప్రదుడైనచో అన్నిగ్రహములు శుభఫలములనే ఇచ్చును. చంద్రుడు అశుభ్రప్రదుడైనచో ఇతరగ్రహములుకూడా అశుభఫలమునే ఇచ్చును. ఒక్కధనాధిపుడు మాత్రమే చంద్రుని ఆధారము చేసుకొని ఫలములనొసంగుడు. లగ్నముయొక్క అంశలలోనున్న గ్రహములు లగ్నమునుండి వచ్చుఫలమును ధరించియుండును. ధనాతీతము ద్వితీయఫలము నొసంగును. ఇట్లు అన్నిస్ధానములు శేషములైన పిదప ఒకటి లగ్నమును నిర్ణయించవలుయను.

కొద్ది దినములో సర్వగుణయుతమగు లగ్నము లభించదు. తక్కువ దోషములు ఎక్కువ గుణములుకల లగ్నము శుభదాయకము. కాలము దోషములననే దుష్టమగును. ఆ దోషము చతుర్ముఖ బ్రహ్మకూడా తొలగించజాలడు. అశౌచగుణములెక్కువగానున్నమా దోషావహమే అగును. అశౌచగుణములను తెలిపెదను. ఆమరిక్తగు అష్టమి, షష్టీ, ద్వాదశి ప్రతిపత్తు, పరిఘుయొక్క పూర్వార్ధము, వ్యతీపాత్‌, వైధృతి, ఉభయ సంధ్యలు, ఉపప్లవము, విష్టి, ఋతువుయొక్క ప్రథముభాగము ఇవి యన్నియూ అశుభ ప్రదములు. ఈ దోషములుకల లగ్నము నిశ్చయించినచో అనిష్టము తప్పదు. ఆదివారము మొదలు శనివారము వరకు కల వారములలో వివాహము చేసినచో వరుసగా స్త్రీరోగముకలది, పతిప్రియ, దుఃఖముకలది, పుత్రవంతురాలు, భోగములుకలది, పతివ్రత, సుందరములగు కేశములు కలదియగును. భరణి కృత్తిక, ఆర్ద్ర, పుబ్బ, విశాఖ జ్యేష్ఠ మొదలగు నక్షత్రములు, చైత్రము, కార్తీకము, జ్యేష్ఠము, పుష్యమాసములు హితకరములుకావు. భద్ర, సంక్రమణము, నిద్రా, రాత్రి, సూర్యచంద్రగ్రహణములు, అట్లే నింద్య నక్షత్రములలో నింద్యవారములలో వివాహము జరిపినచో కులటయగును. పాపభోగములందు అభిరుచి కలదియగును. ఈ దోషముల నివృత్తికి, తిలలచే, నెయ్యిచే దూర్వలచే గాయత్రిమంత్రముతో 800లు హోమమును చేయవలయును, సర్వదోష నివృతికి, బంగారమును, గోవులను, తిలలను దానము చేయవలయును, మొదటి నాలుగునిశలు సమములైనను విడువవలయును. చంద్రుడు బీజరాశి అంశగతుడై లగ్నమును పురుషగ్రహములు చూచుచున్నపుడు, ఉపవీతి అయి, సరితిథిలో నగ్నుడు కాకుండా స్త్రీని చేయవలయును. గర్భము తెలిసిన తరువాత రెండవనెలలో కాని మూడవనెలలోకాని సీమంతమువలె పుంసవనమును చేయవలయును. నాలుగవ, ఆరవ, ఎనిమిదవ మాసమునకాని మాసాధిపతి బలయుతుడుగా నున్నపుడు, దంపుతులకు తారాచంద్రబలమున్నపుడు శూన్యముకాని పర్వదివసమున, మంగళ, గురు, ఆదిత్య వారములలో తీక్ణగ్రహములతో కలిసియున్న సూర్యుని వదిలి చంద్రుడు పురుష నక్షత్రాంశలో ఉన్నపుడు, జన్మలగ్నమునుండి అష్టమ శుద్ధి యున్నపుడు ఇద్దరికి నైధనలగ్నము కానపుడు శుభగ్రహములు లగ్నమున నున్నపుడుకాని, శుభగ్రహముల వీక్షణమున్నపుడుకాని, పాపగ్రహములుకాని, పాపగ్రహదృష్టికాని లేనపుడు శుభగ్రహములు, 3, 4 స్థానములలో కేంద్ర స్థానములలో ఉన్నపుడు 6, 1 స్థానములలో పాపగ్రహములున్నపుడు, చంద్రుడు 12, 7, 6 స్థానములలో లేనపుడు సీమంతముకాని, పుంసవనమునుకాని చేయవలయును. ఒక్క క్రూరగ్రహముకాని 12వ స్థానమున, పుత్రస్థానమున, అష్టమస్థానమునకాని ఉన్నచో సీమంతినినికాని, ఆమె గర్భమునుకాని నశింపచేయును. పుత్రుడు కలిగిన తరువాత జన్మమూహూర్తమునకాని, జాతాశౌచము తొలగిన తరువాతకాని శిశువునకు జాతకర్మనాచరించవలయును. జాతకర్మకుముందు పితృదేవతలను పూజించవలయును. జాతాశౌచము తొలగిన తరువాత ఆయాకులములకు తగినవిధముగా నామకరణమును చేయవలయును. నామము మొదట ప్రశస్తి చెందినదై యుండవలయును. శుభగ్రహ వీక్షణమున్నపుడు చేయవలయును. దేశకాల విఘ్నములు కలిగి కాలాతిక్రమణమైనచో శుక్రుడు గురువు అస్తగులు కానపుడు, ఉత్తరాయణమున, చర స్థిర మృదు క్షిప్ర నక్షత్రములలో, శుభ వాసరమున, తారాచంద్రబలమున్నపుడు, శుభలగ్నమున, శుభాంశమున సప్తమశుద్ధియున్నపుడు, నామకరణమును చేయవలయును, పురుషుడైనచో ఆరవనెలలోకాని, ఎనిమిదవ నెలలోకాని, స్త్రీఅయినచో అయిదవనెలలో, ఏడవనెలలోకాని అన్నప్రాశనమును చేయవలయును. రిక్తతిథిని, దినక్షయమును, నన్దను, ద్వాదశిని, అష్టమిని వదలి, ఇతర తిథులలో శుభవాసరమున అన్నప్రాశనమును చేయవలయును. చరస్థిర మృదు క్షిప్ర నక్షత్రములలో సప్తమ స్థానమున శుభగ్రహములున్నపుడు, దశమ శుద్ధియుండగా శుభలగ్నమున, శుభాంశమున, పూర్వార్దమును సౌమ్యగ్రహము చూచుచున్నపుడు లేదా సౌమ్య గ్రహమున్నపుడు, క్రూరగ్రహములు మూడు ఆరు లాభస్థానములలో, శుభగ్రహములు కేంద్ర ధీధర్మస్థానములలో ఉన్నపుడు, చంద్రుడు 12, 6, 7 స్థానములలో ఉండగా అన్నప్రాశనము శుభప్రదము. బాలునికి మూడవ సంవత్సరమునకాని, అయిదవ సంవత్సరమునకాని, తమతమ కులాచారముననుసరించి, గృహ్యసూత్ర ప్రకారముగా చౌలకర్మ నాచరించవలయును. ఉత్తరాయణమున గురుశుక్రులు అస్తమించనపుడు, పర్వరిక్తతిథులు లేనపుడు, శుక్రగురు బుధ సోమవారములలో, అశ్విని, పునర్వసు, పుష్యమి, మృగశిర, జ్యేష్ఠా, రేవతి నక్షత్రములలో చేయవలయును. చౌలకర్మలో హస్తనుండి మూడు నక్షత్రములు, శ్రవణమునుండి మూడు నక్షత్రములు శుభప్రదము. పట్టబంధనము, చౌలము, అన్నప్రాశనమున, ఉపనయనమున జన్మనక్షత్రము శుభప్రదము. ఇతర కర్మలకు అశుభప్రదము. అష్టమశుద్ధి యుండవలయును. శుభలగ్నమును, శుభాంశమున, జన్మలగ్నము నుండి అష్టమస్థానమున చంద్రుడు లేనపుడు షష్ఠ, అష్టమ, అంత్యస్థానములలో లేనపుడు, శుభగ్రహములు ధన, త్రికోణ, కేంద్ర స్థానములలోనుండగా, ఇతర గ్రహములు మూడు ఆరు స్థానములలోనుండగా, ఉభయసంధ్యలలో కాక, అభ్యంగనముచేక, రాత్రికాక, భోజనమును చేయక, యుద్ధమున, ఉత్కటయోగమున, భూషణములు ధరించియుండగా, ప్రయాణము చేయుచుండగా తొమ్మిదవ దినమునకాక రాజులకు క్షౌరకర్మ చేయవలయును. అయిదవయేట అయిదవదినము, క్షౌరయోగ్యమగు నక్షత్రమున లేదా శుభోదయమున క్షౌరకర్మ చేయవలయును. నృపాజ్ఞచే, బ్రాహ్మణాజ్ఞచే, యజ్ఞమున, మరణమున, బంధమోక్షణ సమయమున వివాహమున అన్నివారములలో, అన్ని నక్షత్రములలో, అన్ని తిథులలో క్షౌరము చేసుకొనవచ్చును. శుభకార్యములలో మొదట శుభముకొరకు క్షురార్పణమును చేయవలయును. తొమ్మిదవ, ఏడవ, ఐదవ దినములలో తృతీయము బీజనక్షత్రముగానున్నపుడు శుభవారమున, శుభోదయమున, వితాన ధ్వజతోరణములచే చక్కగా ఇంటిని అలంకరించి, ఆశీర్వాదమును, పుణ్యాంగనలచే పుణ్యకర్మను చేయించవలయును.

వాద్య నృత్యములచే ఈశాన్యదిశకువెళ్ళి అచట తీక్షమైన ఉపకరణముచే మట్టిని తీసుకొని మరలవచ్చి, మృణ్మయపాత్రలోకాని, వెదురు పాత్రలోకాని ఆ మట్టిని నింపవలయును. అనేక బీజములతో కలిసియున్న నీటిని పుష్పాదులచే అలంకరింపచేసి, చల్లవలయునను. గర్భాధానమునుండికాని, పుట్టుకనుండికాని అష్టమ వర్షమున బ్రాహ్మణులకు, రాజులకు పదకొండవ యేట, వైశ్యులకు పన్నెండవ యేట మౌంజీ బంధనమును (ఉపనయనము) చేయవలయును. పుట్టుకనుండి అయిదవయేట, వేదశాస్త్ర విశారదుడగువాడు, ఉపవీతుడై, కాంతివంతుడై ఉపనయనమును చేయవలయును. బాలునికి శుక్రుడు జీవుడు బలహీనుడైనను శుభప్రదులే. చెప్పబడిన సంవత్సరములోనే ఉపనయనమును చేయవలయును. చెప్పబడనపుడు చేయరాదు. గురువు. శుక్రుడు కనపడుచున్నపుడు, ఉత్తరాయణకాలమున చేయవలయును. వేదములకు గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు అదిపతులు. ఇతరులకు శరత్‌, గ్రీష్మ వసంత ఋతువులలో చేయవచ్చును. బ్రాహ్మణులకు మాత్రము వ్యుత్క్రమముతో మాఘాదిపంచకమున చేయుట సాధారణనియమము. స్వకులాచారధర్మములను తెలిసినవాడు మాఘమునకాని పాల్గుణమాసమునకాని, విధులను తెలిసినవాడు, ధనవంతుడు చైత్రమాసమున, వేదవేదాంగ పారగుడు ధనవంతుడు వైశాఖ మాసమున, వేదశాస్త్ర విశారదుడు, ఉపనీతుడు, బలాఢ్యుడు జ్యేష్ఠమాసమున, విధులను బాగుగా తెలిసినవాడు శుద్ధద్వితీయ, తృతీయ, పంచమీ, త్రయోదశి, దశమీ. సప్తమీ తిథులు శుభప్రదములు. ఉపనయమునకు ఏకాదశి, షష్ఠీ, ద్వాదశీ శుభప్రదములు. ఇతర తిథులు నిందితములు. హస్తనుండి మూడు నక్షత్రములు, రేవతి, పుష్యమి, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తర, శ్రవణము నుండి మూడునక్షత్రములు, అశ్వని, అనూరాధ, మృగశిర, పుబ్బ నక్షత్రములు ఉపనయనమునకు శుభప్రదములు. జన్మనక్షత్రమునుండి పదియవనక్షత్రము కర్మ, పదునారవనక్షత్రము సంఘాతము, పదునెనిమిదవ నక్షత్రము సముదయము, ఇరువదిమూడవ నక్షత్రము వినాశనము, ఇరువదియైదవ నక్షత్రము మానసము. ఈ నక్షత్రములలో శుభాకార్యములను చేయరాదు. గురు బుధ శుక్ర సోమ, ఆదివారములు ప్రశస్తములు. ఉపనయనమునకు మధ్యనున్న వారములు శ్రేష్ఠములు. ఇతరములు నిందితములు, దినమును మూడు భాగములుగా విభజించి, వాటిలో మొదటి భాగమున దైవకర్మను, రెండవ భాగమున మానవకర్మను, తృతీయ భాగమున పితృకర్మను చేయవలయును. స్వనీచస్థానమునకాని, నీచాంశలోకాని, తన శత్రురాశిలోకాని, ఆయంశలోకాని గురు కుజులు శాఖేశుడున్నచో వటువు కలాహీనుడు శీలవర్జితుడు అగును తనకు శత్రుగృహమునకాని, ఆయంశలోకాని గురుడు శుక్రుడు శాఖేశులలో ఎవరున్ననూ ఉపనీతుడు మహాపాతకములను చేయువాడగును. స్వోచ్చస్థానమున నున్నపుడు, ఆంశలోను, స్వరాశిలో, స్వరాశిగత గణములో గురుశుక్రలున్ననూ, కేంద్రత్రికోణములందు గురు శుక్రులున్ననూ మిక్కిలి ధనవంతుడు, వేద వేదాంగపారగుడు అగును. గురువు పరమోచ్చలో ఉన్నపుడు, శాఖేశుడున్ననూ, శుక్రుడున్ననూ, సప్తమ శుద్ధియున్నచో ఉపనీతుడు వేదశాస్త్ర విశారదుడగును. గురువు, శుక్రుడు, శాఖేశుడు స్వోచ్చలోకాని, మిత్రగృహములోకాని, మిత్రునికి ఉచ్చస్థానమునకాని, ఉచ్చాంశలోకాని యున్నపుడు ఉపనయనము చేసినచో వటువు విధ్యాధన సమన్వితుడగును. శాఖాధిపతివారము, శాఖాధిప బలము, శాఖాధిపతి లగ్నము ఈ మూడు ఉపనయనమున దుర్లభములు. కావున చంద్రుడు వేదాంశలో ఉన్నపుడు ఉపనయనమును చేసినచో విద్వావిశారదుడగును. చంద్రుడు పాపాంశలో కాని స్వాంశలోకాని యున్నచో దరిద్రుడు నిత్యధుఃఖతుడు అగును. శ్రవణాది నక్షత్రములలో, చంద్రుడు కర్కటకాంశలో ఉన్నపుడు, ఉపనయనమును చేసినచో వేదశాస్త్ర సమృద్ధి, ధనధాన్య సమృద్ధి గలవాడగును. శుభలగ్నమున, శుభాంశమున, సప్తమశుద్ధి కలిగియున్న లగ్నమునకాని, సప్తమస్థానమున సౌమ్యగ్రహములున్ననూ, సౌమ్యగ్రహవీక్షణమున్ననూ ఇష్టులగు గురుసూర్య చంద్రాదిగ్రహములు అయిదు బలయుతులై, స్థానాది బలపూర్ణులైనను, నలుగురు శుభగ్రహములు కలిసియున్ననూ, ఏకవింశ మహాదోషములు లేకుండగానున్నచో, శుభ గ్రహములున్న రాశులుకాని శుభగ్రహములచే చూడబడిననూ శుభకరములు నవాంశగతములు అయిన శుభరాశులను అన్నింటిని గ్రహించవచ్చును. కాని కర్కటకాంశము శుభగ్రహములతో కూడియున్ననూ, శుభగ్రహములచే చూడబడుచున్ననూ వర్జింపదగినదే. కావున గోమిధునాంశములు, తులాకన్యాంశములు శుభములు. ఇట్లు లగ్నమును సిద్ధపరిచి నవాంశములను చూచి ఉపనయనమును ఆచరించవలయును. పాపగ్రహములు మూడు, ఆరు, పదకొండు స్థానములలోనుండి ఆరు ఎనిమిది పన్నెండు రాశులలో శుభగ్రహములు లేకుండగా, చంద్రుడు ఆరు, ఎనిమిది, లగ్న, పన్నెండు స్థానములలో లేకుండగా ఉండుట చాలా క్షయరోగిని చేయును. సూర్యుడు కేంద్రస్థానమున యున్నచో వటువుకు పితృనాశము సంభవించును. ఉపనయమునకు అనధ్యయన పంచదోషములులేని లగ్నము శుభప్రదము. వసంతఋతువులోతప్ప ఉపనయనము కృష్ణపక్షమునకూడా చేయవచ్చును. కాని అనధ్యయన దినములలో విష్టిలో షష్ఠలో ఉపనయనమును చేయరాదు. త్రయోదశినుండి నాలుగు దినములు సప్తమినుండి మూడుదినములు, చతుర్థి ఈ తిథులుగల గ్రహమునకు శుభప్రదములని చెప్పబడినవి.

క్షురికా బన్ధనం వక్ష్యే నృపాణాం ప్రాక్కరగ్రహాత్‌, వివాహోక్తేషు మాసేషు శుక్లపక్షేప్యనస్తగే. 381

జీవే శుక్రే చ భూపుత్రే చంద్రతారా బలాన్వితే, మౌంజీబంధోక్తతిథిషు కుజవర్జితవాసరే. 382

న చేన్నవాంశ##కే కర్తురష్టమోదయవర్జితే, శుద్ధేష్టమే విధౌ లగ్నే షష్ఠాష్టాంత్వివర్జితే. 383

ధనత్రికోణకేంద్ర స్థై శ్శుభైస్త్ర్యాయారిగైః పరైః, క్షురికాబహంధనం కార్యం అర్చియిత్వామరాన్పితౄన్‌. 384

అర్చయేతురికాం సమ్యక్‌ దేవతావాం చ సన్నిధౌ, తతస్సులగ్నే బధ్నీయాత్‌ కట్యాం లక్షణసంయుతామ్‌. 385

ఆయామార్ధాగ్రవిస్తార ప్రమాణనైవ చ్ఛెదయేత్‌, తచ్ఛేదఖండాన్యాయాస్స్యుర్ధ్వజాయే రిపునాశనమ్‌. 386

ధూమ్రాయే మరణం సింహే జయశ్శుని చ రోగితా, ధనలాభో వృషోత్యంతం దుఃఖీ భవతి గర్గభే. 387

గజాయేత్యంత సంప్రీతి ర్ధ్వాంక్షే విత్తవినాశనమ్‌, ఖడ్గపుత్రికయోర్మానం గణయేత్స్వాంలేన తు. 388

మానాంగులేషు పర్యాయామేకాదశ మితాం త్యజే, శేషాణామంగుళీనాం చ ఫలాని స్యుర్యథాక్రమమ్‌. 389

పుత్రలాభ శ్శత్రువధ స్త్రీలాభో గమనం శుభమ్‌, అర్థహానిశ్చార్థవృద్ధిః ప్రీతి సిద్ధి జయస్త్సుతిః. 390

స్థితో ధ్వజే వృషాయే వా నష్టా చే త్పూర్వతే వ్రణమ్‌, సింహే గజే మధ్యభాగే త్వంతభాగే శ్వకాకయోః. 391

ధూమ్రగర్దభయోర్నైవ వ్రణం శ్రేయోంత్‌ భాగగమ్‌, అధోత్తరాయణ శుక్ర జీవయోర్దృశ్యమానయో. 392

ద్విజాతీనాం గురోర్గేహాన్నివృత్తానాం యతాత్మనామ్‌, చిత్రోత్తరాదితీజ్యాంత్య హరిమిత్ర విధాతృషు. 393

భేష్వర్కేందు జ్ఞేజ్యశుక్ర వారలగ్నాంశ##కేషు చ, ప్రతిపత్పర్వరిక్తా మా చాష్టమీ చ దినత్రమ్‌. 394

హిత్వా న్యదివసే కార్యం సమావర్తన ముండనమ్‌, సర్వాశ్రమాణాం విప్రేన్ద్ర హ్యుత్తమోయం గృహాశ్రమః. 395

సుఖం తత్రాపి భామిన్యాం శీలవత్యాం స్థితం తతః, తస్యాస్సచ్ఛీల లబ్ధిస్తు సులగ్నవశతః ఖలు. 396

పితామహోక్తం సంవీక్ష్య లగ్నశుద్ధిం ప్రవచ్మ్యహమ్‌, పుణ్యహ్ని లక్షణోపేతం సుఖాసీనం సచేతసమ్‌. 397

ప్రణమ్య దేవవత్పృచ్ఛే ద్దైవజ్ఞం భక్తిపూర్వకమ్‌, తాంబూలఫలపుష్పాద్యై పూర్ణాంజలిరుపాగతః. 398

తత్ర చేల్లగ్నగః క్రూర స్తస్మాత్సప్తమగః కుజః, దంపత్యోర్మరణం వాచ్యం వర్షాణామష్టకాత్పురా. 399

యది లగ్నగతశ్చన్ద్ర స్తస్మాత్సప్తమగః కుజః, విజ్ఞేయం భర్తృమరణ మష్టవర్షాంతరే బుధైః. 400

లగ్నాత్పంచమగః పాపః శత్రుదృష్టశ్చ నీచగః, మృతపుత్రాధవా కన్యా కులటా వా న సంశయః. 401

తృతీయా పంచసప్తా య కర్మగో వా నిశాకరః, లగ్నాత్కరోతి సంబంధం దంపత్యోర్గురువీక్షితః. 402

తులాగో కర్కటాలగ్న సంస్తా శ్శుక్రేందుసంయుతాః, వీక్షితాః పృచ్చతాం నౄణాం కన్యాలాభో భ##వేత్తదా. 403

స్త్రీ ద్రేష్కాణ స్త్రీనవాంశే %ుగ్మలగ్నం సమాగతమ్‌, వీక్షితం చంద్రశుక్రాభ్యాం కన్యాలాభో భ##వేత్తదా. 404

ఏవం స్తీణాం భర్తృలబ్ధిః పుంలగ్నే పుంనవాంశ##కే, పృచ్చకస్య భ##వేల్లగ్నం పుంగ్రహైరవలోకితమ్‌. 405

కృష్ణపక్షే ప్రశ్నలగ్నా ద్యస్య రాశౌ శశీయదా, పాప దృష్టోధ వా రంధ్రే న సంబంధో భ##వేత్తదా. 406

పుణ్యౖర్నిమిత్తశమనైః ప్రశ్నకాలే తు మంగలమ్‌, దంపత్యోర శుభైరేతై రశుభం సర్వతో భ##వేత్‌. 407

పంచాంగశుద్ధిదివసే చంద్రతారాబలాన్వితే, వివాహభస్యోదయే వా కన్యావరణమన్వయైః. 408

భుషణౖఃపుష్పతాంబూలఫలైర్గంధాక్షతాదిభిః, శుక్ణాంబరైర్గీత వాద్యే విఘ్నాశీర్వచనై స్సహ. 409

కారయేత్కన్యకాగేహే వరఃప్రణవపూర్వకమ్‌, తదా కుర్యాత్పితా తస్యాః ప్రదానం ప్రీతిపూర్వకమ్‌. 410

కులశీలవయోరూపవిత్తవిద్యాయుతాయ చ, వరా చ రూపవతీం కన్యాం దద్యాద్యవీయసీమ్‌. 411

సంపూజ్య ప్రార్దయిత్వా చ శచీం దేవీం గుణాశ్రయామ్‌, త్రైలోక్యసుందరీం దివ్యగంధమాల్యాంబరావృతామ్‌. 412

సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్‌, అనర్ఘమణిమాలాభిర్భాసయంతీం దిగంతరాన్‌. 413

విలాసినీ సహస్రాద్యై సేవమానామహర్నిశమ్‌, ఏవం విధాం కుమారీం తాం పూజాంతే ప్రార్ధయేదితి. 414

దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని, వివాహే భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే. 415

యుగ్నేబ్దే జన్మత స్త్రీణాం ప్రీతిదం పాణిపీడనమ్‌, ఏతత్పుంసామయుగ్మౌబ్దే వ్యత్యయే నాశనం తయోః. 416

మాఘఫాల్గునవైశాఖజ్యేష్ఠమాసా శ్శుభప్రదాః, మధ్యమౌ కార్తీకో మార్గశీర్షో వై నిందితాఃపరే. 417

నా కదాచిద్వశర్‌##క్షే భానోరార్ద్రాప్రవేశనాత్‌, వివాహో దేవతానాం చ ప్రతిష్ఠాంచోపనాయనమ్‌. 418

నాస్తం గతే సితే జీవే న తయోర్బాలవృద్ధోయోః, న గుర్బా సింహరాశిస్థే సింహశకగత్యేపి వా. 419

పశ్చాత్ప్రాగుదితశ్శుక్రో దశత్రిదివసం శిశుః, వృద్ధః పంచదినం పక్షం గురుః పక్షం చ సర్వతః. 420

అప్రవృద్ధో హృషీకీశో యావత్తావన్న మంగలమ్‌, ఉత్సవే వాసుదేవస్య దివ్యసే నాన్యమగలమ్‌. 421

న జన్మమాసే జన్మర్‌క్షా న జన్మదివస్యేపి చ, ఆద్యగర్భ సుతస్యాధ దుహితుర్వాం కరగ్రహః. 422

నైవోద్వాహో జ్యేష్ఠపుత్రీ పుత్రయోశ్చ పరస్పరమ్‌, జ్యేష్ఠమాసే తయోరేక జ్యేష్ఠే శ్రేష్ఠశ్చ నాన్యధా. 423

ఉత్పాతగ్రహణాదూర్ధ్వం సప్తాహమఖిల గ్రహే, నాఖిలే త్రిదినం జ్యేష్ఠం త్రిద్యుస్పృక్‌ చ క్షయం తధా. 424

గ్రస్తాస్తే త్రిదినం పూర్వం పశ్చాద్గ్రస్తోదయేధవా, సంధ్యాయాం త్రిదినం తద్వన్నిశేధే సప్త ఏవ చ. 425

మాసాంతే పంశదివసాం స్త్యజేద్రిక్తాం తథాష్టమీమ్‌, వ్యతీపాతం వైధృతిం చ సంపూర్ణం పరిఘార్థకమ్‌. 426

పౌష్ణభత్ర్యుత్తరామైత్రమరుశ్చంద్రార్క పిత్రభైః, సమూలభైరవిద్ధసై#్త స్త్రీ కరగ్రహ ఇష్యతే. 427

వివాహే బలమావశ్యం దంపత్యోర్గురుసూర్యయోః, చేత్పూజా యత్నతః కార్యా దుర్బలగ్రహయోస్తయోః. 428

గోచరం వేధజం చాష్టవర్గజం రూపజం బలమ్‌, యథోత్తరం బలాధిక్యం స్థూలంగో చర మార్గజమ్‌. 429

చంద్రతారాబలం వీక్ష్య తతఃపంచాంగజం బలమ్‌, తిధిరేకగుణావారో ద్విగుణ స్త్రీగుణం చ భమ్‌. 430

యోగశ్చతుర్గుణః పంచగుణం తిధ్యర్ధపంజ్ఞితమ్‌, తతో ముహూర్తో బలవాన్‌ తతో లగ్నం బలాధికమ్‌. 431

తతో బలవతీ హోరా ద్రేష్కాణో బలవాంస్తతః, తతో నవాంశో బలవాన్‌ ద్వాదశాంశో బలీ తతః. 432

త్రింశాంశో బలవాంస్తస్మాద్వీక్ష్మమేతలాబలమ్‌, శుభేక్షితయుతాశ్శస్తా ఉద్వాహేఖిలరాశయః. 433

చంద్రార్కే జ్యాదయః పంచ యస్య రాశేస్తు ఖేచరాః, ఇష్టాస్తచ్ఛుభదం లగ్నం చత్వారోపి బలాన్వితాః. 434

రాజులకు పాణిగ్రహణమునకన్నా ముందు చేయవలసిన క్షురికాబంధనకర్మను గురించి ఇపుడు చెప్పెదను. వివాహమునకు చెప్పిన మాసములలో శుక్లపక్షమున, గురువు, శుగ్రుడు, కుజుడు, అస్తగతుడు కానపుడు తారాచంద్రబలమున్నపుడు, ఉపనయనమునకు చెప్పబడిన తిథులలో, మంగళవారముతప్ప ఇతరవారములలో, కర్తకు నవాంశగానపుడు, అష్టమోదయవర్జితమున, అష్టమ శుద్దియుండి, చంద్రుడు లగ్నముననుండి, ఆరు, ఏనిమిది. పన్నెండుస్థానములలో గ్రహములులేనపుడు శుభగ్రహములు, ధన, త్రికోణ కేంద్రస్థానములలోనుండి, ఇతర గ్రహములు మూడు, ఆరు, పదకొండు స్థానములలోనుండగా దేవతలను పితృదేవతలను పూజించి క్షురికాబంధనమును చేయవలయును. దేవతల సమిపమున క్షురికను చక్కగా పూజించవలయును. తరువాత లక్షణములుగల క్షురికను నడుమునకు కట్టవలయును. ఆయా మార్ధాగ్రవిస్తారప్రమాణముతో ఛేదించవలయును. ఆఛేదఖండములే ఆయములుగాను, ఆ విస్తారము ధ్వజపరిమాణమున్నచో శత్రునాశము, ధూమ్రపరిమాణమున్నచో మరణము, సింహపరిమాణమున్నచో జయము, కుక్క పరిమాణమున్నచో రోగము వృష పరిమానమున్నచో ధనలాభము, గర్దబ పరిమాణమున్నచో దుఃఖము, గజ పరిమాణమున్నచో మిక్కిలిప్రీతి, ధ్వాంక్షపరిమాణమున్నచో ధననాశము కలుగును. ఖడ్గిని పుత్రికను తన అంగుళములచే కొలువవలయును. ఎట్లు కొలచినదానిలో ఏకాదశ పరిమితిని వదలవలయును. మిగిలిన అంగుళిలకు వరుసగా ఇట్లు ఫలముండును. పుత్రలాభము, శత్రువధ, స్త్రీలాభము, గమనము, శుభము, అర్థహాని, అర్ధవృద్ధి, ప్రీతి, సిద్ధ, జము, స్తుతి ఇవి ఫలములు, ధ్వజపరిమాణమో, ఉండి నష్టమైనచో మొదటిదానివలన వ్రణముకలుగును. మధ్యభాగము సింహపరిమాణమో గజపరిమాణమో ఉండి, అంత్యభాగము శ్వానకాక పరిమాణమున్ననూ, చివరభాగము ధూమ్ర గర్ధభాగమునమువలన వ్రణముండుట శ్రేయోదాయకముకాదు. గురువుగారి ఇంటినుండు స్వగృహమునకువచ్చిన జితేంద్రియులగు బ్రాహ్మణులకు చిత్ర, ఉత్తర, పునర్వసు, పుష్యమి, రేవతి, శ్రవణము, అనూరాధ, రోహిణినక్షత్రములందు, సూర్యచంద్ర బుధ గురు శుక్ర వారములందు, లగ్నాంశములందు, ప్రతిపత్తు, పర్వదినమును, రిక్తదినమును, అమావాస్యను, అష్టమానుండి దినత్రయమును విడిచి, ఇతరదినములలో సమావర్తనమును, ముండనమును చేయవలయును. అన్ని యాశ్రములలో గృహస్థాశ్రమము ఉత్తమోత్తమము. ఈ గృహస్దాశ్రమమున శీలవతియగు స్త్రీయందు సుఖమును పొందగలడు. శీలవతియగు భార్య సులగ్నవశముననే లభించునుకదా. చతుర్ముఖ బ్రహ్మచెప్పిన దానిని చక్కగా ఆలోచించి సులగ్నమును చెప్పెదను. ఒక శుభదినమున సర్వలక్షణసంపన్నుడు సుఖాసీనుడు, జ్ఞానముకలవాడు అగు దైవజ్ఞుని భక్తితో దేవునివలే నమస్కరించి అడుగవలయును. తాంబూలఫలపుష్పాదులను దోసిటపట్టుకొని వెళ్ళవలయును. లగ్నమున క్రూరగ్రహమున్నను, సప్తమ స్థానమున కుజుడున్ననూ 8 సంవత్సరములలో పుణ్యదంపతుల మరణము సంభవించును. లగ్నము చంద్రుడుండి, సప్తమ స్థానమున కుజుడున్నచో భర్తృమరణము ఎనిమిది సంవత్సరములలో సంభవించును. లగ్నము నుండి అయిదవ స్థానమున పాపగ్రహముండి, శత్రువుచే చూడబడి నీచగతుడైనచో వధువునకు పుత్రులు మరణింతురు. లేదా వధువు కులటయగును. 3, 5, 7, 11, కర్మస్థానములలో చంద్రుడుండి గురువుచే చూడబడుచున్ననూ అడుగువారికి కన్యలభించును. స్త్రీలగ్నమున, ద్రేష్కాణలగ్నమున స్త్రీఅంశమున, నవాంశమున సరి లగ్నమువచ్చి చంద్ర, శుక్రులచే చూడబడినచో అడుగువారికి కన్యలభించును. ఇట్లే స్త్రీకి పుంలగ్నమున, పుంనవాంశమున పృచ్ఛకుని లగ్నము పుంగ్రహములచే చూడబడినపుడు భర్త లభించును. కృష్ణపక్షమున ప్రశ్నలగ్నమునుండి రాశిలో చంద్రుడుండి పాపగ్రహములచే చూడబడిననూ, రంధ్రమున నున్ననూ సంబంధము కుదురదు. ప్రశ్నకాలమున శుభనిమిత్తములు, శుభశకునములు కలిగినచో దంపతులకు శుభము కలుగును. అశుభనిమిత్తములు అశుభశకునములు కలిగినచో అశుభము జరుగును. పంచాంగములచే శుద్దిపొందిన దినమున చంద్రబలము తారాబలము ఉన్నపుడు, వివాహనక్షత్రోదయ కాలమునకాని కులస్థులచే కన్యావరణమును చేయవలయును. ఆభరణములచే పుష్పతాంబూల ఫలగంద్రాక్షతాదులచే, శుక్లాంబరములచే గీతవాద్యములచే, విఘ్ననివృత్తినిచేయు ఆశీర్వచనములతో, కన్నాగృహమున వరుడు ప్రణవపూర్వకముగా కన్యావరణమును చేయవలయును. అపుడు కన్యతండ్రి ప్రీతిపూర్వకముగా కన్యాదానమును చేయవలయును. కుల శీల వయో రూపధన విద్యాదులుకల వరునికి రూపవతియగు వరునికంటే చిన్నదగు కన్యను దానము చేయవలయును. గుణాశ్రయురాలు, త్రైలోక్యసుందరి, దివ్యగంధమాల్యాంబరవతి, సర్వలక్షణ సంయుక్త, సర్వాభరణ భూషిత, వెలకట్టలేని మణిహారములచే దిగంతములను శోభింపచేయుచున్న, వేలకొలది విలాసినులచే రాత్రింబవళ్ళు సేవించబడుచున్న కుమారియగు శశీదేవిని చక్కగాపూజించి, పూజ ముగియగానే ఇట్లు ప్రార్థించవలుయను. ఓ దేవేంద్రాణీ! దేవేంద్ర ప్రియభాలనీ! నీకు నమస్కారము. వివాహమున నాకు భాగ్యమును, ఆరోగ్యమును, పుత్రలాభమును ప్రసాధింపుము. స్త్రీలకు సరియేడులో పాణిగ్రహణము శుభప్రదము. అట్లే పురుషులకు బేసి ఏడులో శుభప్రదము. ఒకవేళ విపరీతముగా జరిగినచో అనగా స్త్రీకి బేసి ఏడులో, పురుషునికి సరియేడులో వివాహమును జరిపినచో అశుభప్రదము. వివాహమునకు మాఘ, ఫాల్గున, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములు శుభప్రదములు. కార్తీక మార్గ శీర్ష మాసములు మధ్యమములు. ఇతర మాసములు నిందితములు. వశన నక్షత్రములలో సూర్యుడు ఆర్ద్రా నక్షత్రమున ప్రవేశించిన తరువాత వివాహము, దేవతాప్రతిష్ఠ, ఉపనయనము చేయరాదు. శుక్రుడు గురువు అస్తగతులైనపుడు, బాలులుగా ఉన్నపుడు, వృద్ధులుగా ఉన్నపుడు, గురువు సింహరాశిలో ఉన్నపుడు, సింహాంశగతుడైనపుడుకూడా వివాహాదులను చేయరాదు. పశ్చాదుదితుడు, ప్రాగుదితుడు అగు శుక్రుడు ముప్పదిరోజులు శిశువుగానుండును. ఇరువది రోజులు వృద్ధుడుగా నుండును. గురువు పదిహేనురోజులు బాలుడుగా, పదిహేను రోజులు వృద్ధుడుగా నుండును. శ్రీమన్నారయణుని ఉత్సవము జరుగువరకు శుభకార్యములను చేయరాదు. వాసుదేవుని ఉత్సవ సమయమున ఇతర శుభములకొరకు చూడవలసిన అవసరమేలేదు. పుట్టిన మాసమున, జన్మనక్షత్రమున మొదటి పుత్రునకుకాని, పుత్రికకుకాని వివాహమును చేయరాదు. పెద్దకొడుకు, పెద్దకూతురుకు పరస్పరము జ్యేష్ఠమాసములో వివాహము జరుపరాదు. అనగా వధూవరులు ఇద్దరూ జ్యేష్ఠులుగా ఉండరాదని భావము. ఇద్దరిలో ఒకరు మాత్రమే జ్యేష్ఠమాసములో వివాహము జరుపరాదు. అనగా వధూవరులు ఇద్దరూ జ్యేష్ఠులుగా ఉండరాదని భావము. ఇద్దరిలో ఒకరు మాత్రమే జ్యేష్ఠులైనచో మంచిదే. ఇద్దరైన శుభప్రదముకాదు. ఉత్పాతములేర్పడిన తరువాత, గ్రహణము ఏర్పడిన తరువాత ఏడురోజులు వివాహమును జరుపరాదు. మూడుదినములు అత్యంతము అశుభప్రదములు. త్రిద్యుస్పృక్‌, క్షయదినము, గ్రహము గ్రస్తమైనపుడు, అస్తగుడైనపుడు ముందు మూడుదినములు ఉదయించిన తరువాత మూడు దిములు, గ్రహసంధిలో మూడుదిములు, నిశీధమున ఏడు దినములు, మాసమున చివరి అయిదుదినములు రిక్తతిథిని, అష్టమిని, వ్యతీపాతమును, వైధృతిని, సంపూర్ణముగా పరిఘార్థమును విడువవలయును. రేవతి, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అనూరాధ, స్వాతి, మృగశిర, హస్త, మఘా, మూల నక్షత్రములలో విద్ధలేనపుడు పాణిగ్రహణమును చేవలయును. వివాహమున దంపతులకు గురు సూర్యబలము ఆవశ్యకము. గురుసూర్యులు బలహీనులైనచో ప్రత్నముచే పూజ జరుపవలయును. గోచరము, వేధజము, అష్టవర్గజము, రూపజము అని ఈ బలములు ఉత్తరోత్తరము బలాధిక్యము కలవి. గోచర మార్గములవలన కలుగు బలము స్థూలబలము. మొదట చంద్రబలమును తారాబలమునుచూచి, తరువాత పంచాంగబలమును చూడవలయును. తిథి ఒక గుమము, వారము రెండు గుణములు, నక్షత్రము మూడురెట్లు, యోగము నాలుగురెట్లు తిథ్యర్ధము అయిదురెట్లు బలము. తరువాత ముహూర్తము బలీయము తరువాత లగ్నము బలాధికము, తరువాత హోర, ద్రేష్కాణము, నవాంశము, ద్వాదశాంశము, త్రింశాంశము, ఇట్లు ఉత్తరోత్తర బలీయములు. కావున వీటిని చక్కిగా చూడవలయును. శుభగ్రహములున్న, లేక వీక్షణమున్న అన్నిరాశులు శుభప్రదములే. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి, మొదలగు అయిదు గ్రహములు ఏరాశికి శుభులుగా నుందురో అది శుభప్రదమగు లగ్నము. నలుగురు బలీయులున్ననూ శుభప్రదమే.

జామిత్ర శుద్ధ్యేక వింశన్మహాదోషవివర్జితమ్‌, ఏకవింశతి దోషాణాం నామరూపఫలాని చ. 435

వక్ష్యంతేత్ర సమాసేన శృణు నారద సాంప్రతమ్‌, పంచాంగశుద్ధిరాహిత్యం దోషస్త్వాద్యః ప్రకీర్తితః. 436

ఉదయాస్త శుద్ధి ర్హానిర్ద్వితీయస్సూర్య సంక్రమః, తృతీయః పాపషడ్వర్గో భృగు ష్షష్ఠః కుజోష్టముః. 437

గుండాతం కర్తరీ రిషలు షడష్టేన్దుగతో గ్రహః, దంపత్యోరష్టమం లగ్నం రాశిర్విషఘుటీ తథా. 438

దుర్ముహూర్తో వారదోషః ఖార్జూరికసమాంఘ్రిభమ్‌, గ్రహణోత్పాతభం క్రూర విద్ధ్వరం క్రూరసంయుతమ్‌. 439

కునవాంశో మహాపాతో వైధృతిశ్చైకవింశతిః, తిథివారర్‌క్ష యోగానాం కరణస్య చ మేలనమ్‌. 440

పంచాంగమస్య శుద్ధిస్తు పంచాంగశుద్ధిరీరితా, యస్మిన్పంచాంగ దోషోప్తి తస్మింల్లగ్నే నిరర్ధకమ్‌. 441

త్యేజేత్పంచైష్టికంచాపి విషసంయుక్త దుగ్ధవత్‌, లగ్నలగ్నాంశకౌ స్వస్వ వీక్షితౌ యుతౌ. 442

న చే ద్వాన్యోన్పతినా శుభమిత్రేణ వాతతొతా. వరస్య మృత్యు స్స్యా త్తాభ్యాం సప్తసప్తోదయాంశకౌ. 443

ఏవం తౌ నయుతౌ దృష్టౌ మృత్యుర్వధ్వాః కరగ్రహే, త్యాజ్యా స్సూర్యస్య సంక్రాంతేః పూర్వతః పరత స్తథా. 444

వివాహాదిషు కార్యేషు నాడ్యష్షోడశ షోడశ, షడ్వర్గశ్శుభదశ్శ్రేష్ఠో వివాహస్థాపనాదిషు. 445

భృగుషష్ఠాహ్యయో దోషో లగ్నాత్షష్ఠ గతే సితే, ఉచ్చగే శుభసంయుక్తే తల్లగ్నం సర్వదా త్యజేత్‌. 446

కుజోష్టమో మహాదోషో లగ్నాదష్టమగే కుజే, శుభత్రయయుతం లగ్నం న త్యజేత్తుంగగోయది. 447

పూర్ణానందాఖ్యయో స్తిధ్యో స్సంధిర్నాఢీద్వయం యది, గండాంతం మృత్యుద జన్మ యాత్రోద్వాహవ్రతాదిషు. 448

కులీరసింహయోః కీటచాపయో ర్మీనమేషయోః, గండాతమంతరాలం స్యా ద్ఘటికార్ధం మృతిప్రదమ్‌. 449

సార్పేన్ద్రపౌష్ణభేష్వంత్‌ షోడశేశా భ సంధయః, తదగ్రిమే ష్వాద్యపాదా భానాం గండాంతసంజ్ఞికాః. 450

ఉగ్రం చ సంధిత్రితయం గండాంతం త్రివిధం మహత్‌, లగ్నాభిముఖయోః పాపగ్రహయో రృజు వక్రయోః. 451

సా కర్తరీతి విజ్ఞేయా దంపత్యోర్గలకర్తరీ, కర్తరీయోగదుష్టం యల్లగ్నం తత్పరివర్జయేత్‌. 452

అపి సౌమ్య గ్రహైర్యుక్తం గుణౖస్సర్వైస్సమన్వితమ్‌, షడష్టరిష్భగే చంద్రే లగ్నదోషస్స్వసంజ్ఞకః. 453

లగ్నగం వర్జయేద్యత్నాజ్ఞీవశుక్రసమన్వితమ్‌, ఉచ్చగే నీచగే వాపి మిత్రభే శత్రురాశిగే. 454

అపి సర్వగుణో పేతం దంపత్యోర్నిధనప్రదమ్‌, శశాంకే గ్రహసంయుక్తే దోషస్సంగ్రహ సంజ్ఞకః. 455

తస్మిన్సంగ్రహదోషే తు వివాహం నైవ కారయేత్‌, సూర్యేణ సంయుతే చంద్రే దారిద్య్రం భవతి స్ఫుటమ్‌. 456

కుజేన మరణం వ్యాధిస్సౌమ్యేన త్వనపత్యతా, దౌర్భాగ్యం గురుణా యుక్తే సాపత్యం భార్గవేణ తు. 457

ప్రవ్రజ్యా సూర్యపుత్రేణ రాహుణా మూలసంక్ష్యయః, కేతునా సంయుతే చంద్రే నిత్యం కష్టం దరిద్రతా. 458

పాపగ్రహయుతే చంద్రే దంపత్యోర్మరణం భ##వేత్‌, శుభగ్రహయుతే చంద్రే స్వోచ్చస్థే మిత్రరాశిగే. 459

దోషాయనం భ##వేల్లగ్నం దంపత్యోశ్శ్రేయపే సదా, స్వోచ్చగో వా స్వరగో నా మిత్రక్షేత్ర గతో పి వా. 460

పాపగ్రహయుత శ్చన్ద్రః కరోతి మరణం తయోః దంపత్యోరష్టమం లగ్నం అష్టమో రాశిరేవ చ. 461

యది లగ్నగత స్సోపి దంపత్యోర్మరణప్రదః, పరాశిశ్శుభసంయుక్తో లగ్నం వా శుభసంయుతమ్‌. 462

లగ్నం వివర్జయేద్యత్నాత్‌ తదంశాంశ తదీశ్వరామ్‌, దంపత్యోర్ద్వాదశం లగ్నం రాశిర్వా యది లగ్నగః. 463

అర్థహానిస్తయోరస్మాత్తదంశస్వామినం త్యజేత్‌, జన్మరాశ్యుదయశ్చైవ జన్మలగ్నోదయ శ్శుభః. 464

తయోరుపచయస్థానం లగ్నేత్యంత శుభప్రదమ్‌, ఖమార్గణా వేదపక్షా ఖరామా వేదమార్గణాః. 465

వహ్నిచంద్రారూపదస్రాః ఖ రామా వ్యోమబాహవః, ద్విరామా స్స్వాగ్నయ శ్శూన్య దస్రాః కుంజర భూమయః. 466

రూపపక్షావ్యోమదస్రా వేదచంద్రాశ్చతుర్దశ, శూన్య చంద్రా వేద చంద్రా షడృక్షా వేదబాహనః. 467

శూన్యదస్రా శూన్య చంద్రా పూర్ణచంద్రా గతేందవః, తర్కచంద్రా వేద పక్షా ఖరామాశ్చాశ్వి భాత్క్రమాత్‌. 468

ఆభ్యః పరాస్తు ఘటికా శ్చతస్రో విషసంజ్ఞితాః, వివాహాదిషు కార్యేషు విషనాడీం వివర్జయేత్‌. 469

భాస్కరాదిషు వారేషు యే ముహూర్తాశ్చ నిందితాః, వివాహాదిషు తే వర్జ్యా అ పి లక్షగుణౖర్యుతాః. 470

నిహితా వారదోషా యే సూర్యవారాదిషు క్రమాత్‌, అ పి సర్వగుణోపేతా స్తే వర్జ్యా స్సర్వమంగలే. 471

సప్తమ శుద్ధి యుండవలయును. ఏకవింశతి మహాదోషములు లేకుండవలయును. ఓ నారదా! ఏకవింశతి మహాదోషముల నామములను, రూపములను, ఫలములను సంగ్రహముగా చెప్పెదను. వినుము. పంచాంగ శుద్ధిలేకపోవుట మొదటి దోషము. ఉదాయాస్త శుద్ధిహాని రెండవ దోషము. సూర్యసంక్రమణము మూడవ దోషము. పాప షడ్వర్గము, షష్ఠ భృగువు, అష్టమ కుజుడు, గండాంతము, కర్తరీ, రిష్ఫము. షష్ఠ అష్టమ స్థానగత చంద్రుడు, దంపతులకు అష్టమ లగ్నము, విషఘటీ, దుర్ముహూర్తము, వార దోషము, ఖార్జూరికము సమాంఘ్రిభం, గ్రహణము, ఉత్పాతము, క్రూర గ్రహవేధగల నక్షత్రము, క్రూర గ్రహ సంయుతము, కునవాంశ, మహాపాతము, వైధృతి అనునవి ఇరువది యొకటి మహాదోషములు. తిథివారనక్షత్రయోగకరణములను పంచాంగములందురు. ఈ అయిదింటి శుద్ధి పంచాంగ శుద్ధి యనబడును. పంచాంగ దోషములున్న లగ్నము నిరర్ధకము. విషము కలిసిన పాలను వదిలినట్లు పంచైష్టిక లగ్నమును కూడా వదలవలయును. లగ్నము కాని లగ్నాంశముకాని ఆయా అధిపతులచే చూడబడిననూ, కూడియున్ననూ, పరస్పరాధిపతులతో చూడబడిననూ, కూడియున్ననూ, శుభగ్రహముచే కాని, మిత్రగ్రహముచే కాని చూడబడిననూ, కూడియున్ననూ వరునికి మృతి సంభవించును. ఇట్లే ఆయా అధిపతులచే సప్తమ స్థానము కాని, సప్తమాంశలుకాని, ఉదాయాంశలు కాని చూడబడిననూ కూడియున్ననూ, వారిద్దరూ కలిసి లేకున్ననూ చూపులేకున్ననూ వధువునకు మరణము సంభవించును. వివాహాది శుభకార్యములలో సూర్యసంక్రమణమునకు మొదటి పదునారు నాడికలను, తరువాతి పదునారు నాడికలను విడువవలయును. వివాహ, స్థాపనాది శుభకార్యములలో షడ్వర్గము శుభప్రదము శ్రేష్టము. లగ్నము నుండి ఆరవస్థానమున శుక్రుడున్నచో భృగు షష్ఠ దోషమని పేరు. శుక్రుడు ఆరవ స్థానమున నుండి ఉచ్చగతుడైనను, శుభగ్రహములచే కలిసియున్ననూ ఆ లగ్నమును వదిలి పెట్టవలయును. లగ్నము నుండి అష్టమస్థానమున నున్న కుజుడున్నచో కుజాపలుమమందురు. ఇది మహాదోషము. అష్టమస్థానముననున్న కుజుడు ఉచ్చగతుడై మూడు శుభగ్రహములచే కూడియున్నచో ఆ లగ్నమును విడువలసిన పనిలేదు. పూర్ణ, నందయను తిథుల సంధి నాడీద్వయమున్నచో యాత్ర, వివాహ, ఉపనయనాదులకు గండాంత దోషమనబడును. ఈ దోషము మృత్యుప్రదము. కర్కాటక సింహములకు, తులా ధనువులకు, మీన మేషములకు ఘటి కార్ధము అంతరాలకాలము గండాంత మనబడును. ఇది కూడా మృతి ప్రదమే. ఆశ్లేషా జ్యేష్ఠా, రేవతులలో షోడశాంశాధిపతులు, నక్షత్ర సంధులు, ఆ నక్షత్రములకు మొదటి నక్షత్రముల మొదటి పాదములు కూడా గండాంతములనబడును. మూడు సంధులు చాలా ఉగ్రములు. ఈ మూడు గండాంతములనబడును. ఇవి మూడు విధములుగానుండును. పాప గ్రహములు లగ్నాభిముఖములైనను, ఋజుగతులు కలవైననూ, వక్రగతులు కలవైననూ కర్తరి యందురు. ఈ కర్తరి దంపతుల కంఠమును ఖండించును. కర్తరీయోగదుష్టమగు లగ్నమును విడిచి పెట్టవలయును. సౌమ్యగ్రహములచే కూడియున్ననూ, సర్వగుణసమన్వితమైననూ షష్ఠ, అష్టమ, రిష్పస్థానములలో చంద్రుడున్నచో దానిని లగ్నదోషమందురు. గురుడు కాని శుక్రుడు కాని యున్న లగ్నమును ప్రయత్నముచే వదలవలయును. ఉచ్చగతుడైననూ, నీచగతుడైననూ మిత్ర గ్రహము శత్రురాశిలో యున్నచో అన్నిగుణములు కలదైననూ ఆ లగ్నము దంపతులకు మరణ ప్రదము. చంద్రుడు ఇతర గ్రహములచే కలిసి యున్నచో సంగ్రహ దోషమందురు. ఈ సంగ్రహ దోషమున్న లగ్నమున వివాహమును చేయరాదు. చంద్రుడు సూర్యునితో కలిసి యున్నచో దారిద్ర్యము కలుగును. కుజునిచే కలిసి యున్నచో మరణము సంభవించును. బుధునితో కలిసి యున్నచో వ్యాధి కలుగును. గురువుచే కలిసి యున్నచో నిస్సంతానము, దౌర్భాగ్యము కలుగును. శుక్రునిచే కలిసియున్నచో సపత్నీప్రదము. అంగారకునిచే కలిసియున్నచో సన్యాసము, రాహువుచే కలిసి యున్నచో మూలనాశము, కేతువుతో చంద్రుడు కలిసియున్నచో నిత్య కష్టములు, దారిద్య్రము కలుగును. చంద్రుడు పాపగ్రహములతో కలిసియున్నచో దంపతులకు మరణము సంభవించును. శుభగ్రహములచే చంద్రుడు కలిసియుండి ఉచ్చరాశిలో కాని మిత్రరాశిలో యున్నచో లగ్నము దోషాయనమైననూ దంపతులకు శ్రేయోదాయకమగును. చంద్రుడు స్వోచ్చగతుడైనను, తన నక్షత్రమున నున్ననూ, మిత్రగ్రహక్షేత్రములలో నున్ననూ పాపగ్రహములతో కూడియుయన్నచో దంపతులకు మరణమును కలిగించును. దంపతులకు అష్టమలగ్నము, అష్టమరాశి అయిననూ చంద్రుడు ఆ లగ్నమున నున్నచో దంపతులకు మృతిని కలిగించును. ఆ రాశి శుభగ్రహములు కలదైననూ, లగ్నము శుభగ్రహయుతమైనను ఆ లగ్నమును, లగ్నాంశమును, లగ్నాంశాధిపతి కలదానిని ప్రయత్నించి విడువవలయును. దంపతులకు ద్వాదశలగ్నమై, లగ్నతమైన రాశియైనచో దంపతులకు అర్థహాని కలుగును. కావున ఆ లగ్నాంశాధిపతిని విడిచిపెట్టవలయును. జన్మరాశ్యుదయము, జన్మలగ్నోగయము శుభప్రదము. ఆ రెంటికి వృద్ధిస్థానము మిక్కిలి శుభప్రదము. 1, 5, 3, 2, 1, 3, 3, 5, 3, 1, 7, 3, 1, 3, 1, 2, 2, 3, 3, శూన్యాము, 3, 9, 1, 1, 2, 1, 3, 4, 1, ఇవి పదునాలుగు స్థానములు శూన్యము, 1, 4, 1, 6, 27, 4, 2, శూన్యము 3, శూన్యము 1, పూర్ణచంద్రుడు, గతచంద్రుడు, తర్కచంద్రులు, వేదపక్షములు, ఖరామములు అని అశ్వని మొదలగు నక్షత్రముల కుండును. వీటి తరువాత నుండు నాలుగు ఘటికలు విషఘటికలనబడును. వివాహాది శుభకార్యములలో విషనాడులను విడువవలయును. ఆదివారము మొదలగు వారములలో నిందించబడిన ముహూర్తములను ఎన్ని గుణములు కలవైనను వివాహాదులలో వదలవలయును. భాస్కరాది వారములలో నుండు వారదోషములను కూడా సర్వగుణోపేతములైనను శుభకార్యములలో వదలవలయును.

ఏకార్గలాంఘ్రితుల్యం య త్తల్లగ్నం చ వివర్జయేత్‌, అపి శుక్రేజ్యసంయుక్తం విషసంయుక్తదుగ్ధవత్‌. 472

గ్రహణోత్పాతభం త్యాజ్యం మంగలేఘు ఋతుత్రయమ్‌, యావచ్చ శశినా భుక్త్వా ముక్తభం దగ్ధకాష్ఠవత్‌. 473

మంగలేషు త్యజేత్ఖేటైర్విద్ధం చ క్రూర సంయుతమ్‌, అఖిలరర్‌క్ష పంచగవ్యం సురాబిందుయుతం యథా. 474

పాద ఏవ శుభైర్విద్ధమశుభం నైవ కృత్స్నభమ్‌, క్రూరవిద్ధం యుతం ధిష్ణ్యం నిఖిలం నైవ మంగలమ్‌. 475

తులామిధునకన్యాంశా ధనురంత్యార్ధసంయుతాః, ఏతే నవాంశా శ్శుభదా వృషభస్యాంశకాః ఖలు. 476

అంత్యాంశాస్తేపి శుభదా యది వర్గోత్తమాహ్వయాః, అన్వే నవాంశా న గ్రాహ్యా యతస్తే కునవాంశకాః. 477

కునవాంశకలగ్నం య త్త్యాజ్యం సర్వగుణాన్వితమ్‌, యస్మిన్దినే మహాపాత త్తద్దినం వర్జయేచ్ఛుభే. 478

అపి సర్వగుణోపేతం దంపత్యోర్ముత్యుదం యతః, అనుక్తా స్స్వల్ప దోషాస్స్యు ర్విద్యున్నీహార వృష్టయః. 479

ప్రత్యర్కపరివేషేంద్ర చాపాంబుధర గర్జనాః, లత్తోపగ్రహపాతాఖ్యా మాస దగ్ధ్వాహ్వాయా తిథిః. 480

దగ్ధలగ్నాంధబధిర పంగుసంజ్ఞాశ్చ రాశయః, ఏవ మాద్యాస్తతస్తేషాం వ్యవస్థా క్రియతేధునా. 481

అకాలజా భవంత్యేతే విద్యున్నీహార వృష్టయః, దోషాయ మంగలే నూనమదోషాయైవ కాలతః. 482

బృహస్పతిః కేన్ద్రగతశ్శుక్రో వా ది వా బుధః, ఏకోపి దోష నిచయం హరత్యేవ సంశయః. 483

తిర్యక్పంచోర్ధ్వగాః పంచరేఖా ద్వే ద్వే చ కోణయోః, ద్వితీయే శంభుకోణగ్ని ధిష్ణ్యం చక్రే ప్రవిన్యసేత్‌. 484

భాన్యత్ర సాభిజిత్యేకరేఖా ఖేటేన విద్ధభమ్‌, పురతః పృష్టతోర్కాద్యా దినరం లత్తయంతి యత్‌. 485

ఆర్కావృతి గుణాద్యంగ బాణాష్టనవసంఖ్యభమ్‌, సూర్యభాత్సార్ప పిత్రాంత్య త్వాష్ట్రమిత్రోడువిష్ణుభమ్‌. 486

సంఖ్యయా దినభేతావత్‌ ఆశ్విభాత్పాతదుష్టభమ్‌, సౌరాష్ట్రే సాల్వదేశే తు లత్తితం భం వివర్జయేత్‌. 487

కలింగవంగదేశేషు పాతితం న శుభప్రదమ్‌, బాహ్లికే కురుదేశే చా న్యస్మిన్దేశే న దూషణమ్‌. 488

తిథయో మాసదగ్ధాశ్చ దగ్ధలగ్నాని యాన్యపి, మధ్యదేశే వివర్జ్యాని న దుష్టానీతరేఘ చ. 489

పంగ్వంధకాణలగ్నాని మాసశూన్యాశ్చ రాశయః, గౌడమాలవయోస్త్యాజ్యా అన్యదేశే న గర్హితాః. 490

దోషదుష్టం సదా కాలం సన్నిమార్టుం న శక్యతే, అపి ధాతురతో గ్రాహ్యం దోషాల్పత్వం గుణాధికమ్‌. 491

ఏవం సులగ్నే దంపత్యోః కారయేత్సమ్యగీక్షణమ్‌, హస్తోచ్ఛ్రితాం చతుర్హసై#్త శ్చతురస్రాం సమంతతః. 492

స్తంభైశ్చతుర్భిస్శుశ్లక్లైర్వామభాగే తు సన్నతామ్‌, సమండపాం చతుర్దిక్షు సోపానైరతిశోభితామ్‌. 493

ప్రాగుదక్ర్పవణాం రంభా స్తంభైర్హంపశుకాదిఖిః, విచిత్రితాం చిత్రకుంభై ర్వివిధైస్తోరణాంకురైః. 494

శృంగారపుష్పవిచయై ర్వర్ణకై స్సమలంకృతామ్‌, విప్రాశీర్వచనై పుణ్యస్త్రీభిర్దివ్యైర్మనోరమామ్‌. 495

వాదిత్రనృత్యగీతాద్యైర్హృదయానందినీం శుభాం, ఏవం విధాం సమారోహే న్మిధునం స్వాగ్ని వేదికామ్‌. 496

అష్టధా రాశికూటం చ స్వాదూడు గణరాశయః, రాశీశయోనివర్ణాఖ్య ఋతవః పుత్రపౌత్రదాః. 497

ఏకరాశౌ పృథగ్దిష్ణ్యే దంపత్యోః పాణిపీడనమ్‌, ఉత్తమం మధ్యమం భిన్నం రాశ్వేకత్వం యయోస్తయోః. 498

స్త్రీ ధిష్ణా దాద్యనవకే స్త్రీదూరమతినిందితమ్‌, ద్వితీయే మధ్యమం శ్రేష్ఠ తృతీయే నవకే నృభమ్‌. 499

తిస్రః పూర్వోత్తరా ధాతృ యామ్యమాహేశతారకాః, ఇతి మర్త్యగణ జ్ఞేయ స్స్యాదమర్త్యగణః పరః. 500

హర్యాదిత్యార్కవాయ్వాంత్‌ మిత్రాశ్వీజ్యేందుతారకాః, రక్షోగణః పితృత్వాష్ట్ర ద్విదైవాగ్నీన్ద్రతారకాః. 501

వసువారీశ మూలాహి తారకాభిర్యుతాస్తతాః, దంపత్యోర్జన్మభేదైక గణ ప్రీతిరనేకదా. 502

మధ్మమాదేవమర్త్యానాం రాక్షసానాం త్వయోర్మృతిః, మృత్యుష్షష్ఠాష్టకే పంచ నవమే త్వన పత్యతా. 503

నైస్స్వ్యద్విర్ద్వాదాశ్వేన్యేషు దంపత్యోః ప్రీతిరుత్తమా, ఏకాధిపే మిత్రభావే శుభదం పాణిపీడనమ్‌. 504

ద్విర్దాదశే త్రికోణ చ న కదాచిత్షడష్టకే, అశ్వేభ##మేషసర్పాహి హ్యోతుమేషోతుమూషకాః. 505

ఆఖుగోమహిషవ్యాఘ్ర కాలీవ్యాఘ్రమృగద్వయమ్‌, శ్వానః కపిర్బభ్రుయుగం సింహతురంగమాః. 506

సింహగోదంతినోభానాం యోనయస్యుర్యథాశ్విభాత్‌. 507

శ్త్వెణం బభ్రరగం మేష వానరౌ సింహవారణమ్‌, గోవ్యాఘ్రమాఖు మార్జారం మహిషాశ్వంచ శాత్రవమ్‌. 508

ఝుషాలి కర్కటా విప్రా స్త దూర్ధ్వాః క్షత్రియాదయః, పుంవర్ణరాశే స్స్రీరాశౌ సతిహీనే యథా శుభమ్‌. 509

చతుస్త్రిద్వ్యంఘ్రి భోత్ధాయాః కన్యాయాశ్చాశ్విభాత్క్రమాత్‌, వహ్నిభాదిందుభాన్నాడి త్రిచతుః పంచపర్వసు. 510

గణయేత్సంఖ్యయా చైకనాడ్యాం మృత్యుర్న పార్శ్వయోః, ప్రాజాపత్య బ్రాహ్మదైవా వివాహాశ్యార్షసంయుతాః. 511

ఉక్తకాలే తు కర్తవ్యా శ్చత్పారః ఫలదాయకాః, గంధర్వాసుర పైశాచ రాక్షసాఖ్యాస్తు సర్వదా. 512

చతుర్ధమభిజిల్లిగ్నముదయరాచ్చ సప్తమమ్‌, గోధూళికం తదుభయం వివాహే పుత్ర పౌత్రదమ్‌. 513

ప్రాచ్యా న చ కలింగానాం ముఖ్యం గోధూళికం స్మృతమ్‌, అభిజిత్సర్వ దేశేఘు ముఖ్యో దోష వినాశకృత్‌. 514

మధ్యందినగతే భానౌ ముహూంర్తోభిజిదాహ్వయః, నాశయత్యఖిలాన్దోషాన్పినాకీ త్రిపురం యథా. 515

పుత్రోద్వాహాత్పరం పుత్రీవివాహో న ఋతుత్రయే, న తయోర్వ్రతముద్వాహాన్మంగలే నాన్యమంగలమ్‌. 516

వివాహశ్చైకజన్యానాం షణ్మాసాభ్యంతరే యది, అసంశయం త్రిభిర్వర్షై స్తత్రైకా విధవా భ##వేత్‌. 517

ప్రత్యుద్వాహో నైవకార్యో నైకసై#్మ దుహితృద్వయమ్‌, న చైకజన్యయోః పుంసోరేవ జన్యేతు కన్యకే. 518

నైవం కదాచిదుద్వాహో నైకదా ముండన ద్వయమ్‌, దివా జాతస్తు పితరం రాత్రౌతు జననీం తథా. 519

ఆత్మానం సంధ్యయోర్హన్తి నాస్తి గండే విపర్యయః, సుతస్సుతా వా నియతం శ్వశురం హంతి మూలజః. 520

తదంత్యపాదజో నైవ తథాశ్లేషాద్యపాదజః, జ్యేష్ఠాంత్యపాదజౌ జ్యేష్ఠం బాలో హన్తి న బాలికా. 521

న బాలికాంబు మూలరే మాతరం పితరం తధా, సైంద్రీ ధవాగ్రజం హంతి దేవరం తు ద్విదైవజా. 522

ఆరభ్యోద్వాహదివసాత్‌ షష్ఠే వా ప్యష్టమే దినే, వధూప్రవేశ స్సంపత్తై దశ##మే సప్తమే దినే. 523

హాయనద్వితీయం జన్మ భలగ్న దివసానపి, సంత్యజ్య హ్యతి శుక్రేపి యాత్రావైవాహికీ శుభా. 524

శ్రీప్రదం సర్వగీర్వాణస్థాపనం చోత్తరాయణ, గీర్వాణ పూర్వగీర్వాణ మత్రిణోర్దృశ్యమానయోః. 525

విచైత్రేష్వేవ మాసేషు మాఘాదిషుచ పంచసు, శుక్లపక్షేషు కృష్ణేషు తదాదిష్వష్టసు శుభమ్‌. 526

దినేషు యస్య దేవస్య యాతిథి స్తత్ర చ, ద్వితీయాది ద్వయే పంచమ్యా తస్తిసృషు క్రమాత్‌. 527

దశమ్యాదేశ్చతసృషు పౌర్ణమాస్యాం విశేషతః, త్ర్యుత్తరాదితి చంద్రాంత్య హస్తత్రయ గురూడుషు. 528

సాశ్విధాతృజలాధీశ హరిమిత్రవసుష్వపి, కుజవర్జితవారేషు కర్తుస్సూర్యే బలప్రదే. 529

చంద్రతారా బలోపేతే పూర్వాహ్ణె శోభ##నే దినే, శుభలగ్నే శుభాంశే చ కర్తుర్ననిధనోదయే. 530

రాశయస్సకలాశ్శ్రేష్ఠా శుభగ్రహయుతేక్షితాః, పంచాష్టకౌ శుభౌలగ్నౌ నైధనే శుద్ధిసంయుతే. 531

లగ్నస్థా శ్చన్ద్రసూర్యార రాహుకేత్వర్కసూనవః, కర్తుర్మృత్యుప్రదా శ్చాన్యే ధన్యధాన్యసుఖప్రదాః. 532

ద్వితీయే నేష్టదాః పాపా సౌమ్యా శ్చన్ద్రశ్చ విత్తదాః, తృతీయే నిఖిలాః ఖేటాః పుత్రపౌత్రసుఖప్రదాః. 533

చతుర్ధే సుఖదాస్సౌమ్యా క్రూరాః ఖేటాశ్చ దుఃఖదాః, గ్లానిదాః పంచమే క్రూరా సౌమ్యాః పుత్రసుఖప్రదాః. 534

షష్ఠే శుభాశ్శత్రుదాస్స్యుః పాపా శ్శత్రుక్షయం కరాః, వ్యాధిదా స్సప్తమే పాపా సౌమ్యా శ్శుభఫలప్రదాః. 535

అష్టమస్థాః ఖగాస్సర్వే కర్తుర్మృత్యుప్రదాయకాః, ధర్మే పాపా ఘ్నంతి సౌమ్యా శ్శుభదా మంగలప్రదాః. 536

కర్మగా దుఃఖదాః పాపా సౌమ్యాశ్చంద్రశ్చ కీర్తిదాః, లాభస్థానగతాస్సర్వే భూరిలాభప్రదాగ్రహాః. 537

వ్యయస్థానగతాశ్శశ్వత్‌ బహువ్యయకరాగ్రహాః, హన్త్యర్థహీనాః కర్తారం మన్త్రహీనాస్తు ఋత్విజమ్‌. 538

స్త్రియం లక్షణహీనాస్తు న ప్రతిష్ఠా సమో రిపుః, గుణాధికతరే లగ్నే దోషస్స్వల్పతరో యది. 539

ఏకార్గలాంఘ్రి తుల్యమగు లగ్నమును విడువవలయును. ఇట్టిలగ్నము శుక్రబృహస్పతులచే కూడియున్నదైనను విషము కలిసిన పాలను విడిచినట్లు విడువవలయును. గ్రహణ నక్షత్రమును, ఉత్పాత నక్షత్రమును, మూడు ఋతువులను శుభకార్యములలో విడువవలయును. శశిభుక్తి తరువాత మిగిలిన నక్షత్రమును కూడా కాలిన కట్టెను విడిచినట్లు విడువవలయును. శుభకార్యములందు గ్రహవిద్ధమైన నక్షత్రమును క్రూరగ్రహముల నక్షత్రమును మధ్య బిందువు కలిసిన పంచగవ్యమును విడిచినట్టు విడువవలయును. శుభగ్రహవిద్ధమైన నక్షత్రములో అశుభ##మైన నక్షత్రపాదమునే విడువవలును కాని పూర్తి నక్షత్రమును విడువవలసిన అవసరము లేదు. క్రూరగ్రహములచే విద్ధయైనది, క్రూరగ్రహములు కలనక్షత్రము పూర్తిగా అశుభ##మే యగును. తులామిధున కన్యాంశలు, ధనూరాశిలోని అంత్యార్ధసంయుతములు ఈ నవాంశలు శుభప్రదములు. వృషభాంశలు వర్గోత్తమములైనచో అని కూడా శుభప్రదములే. ఇతర నవాంశలు కునవాంశలు కావున గ్రహించరాదు. కునవాంశకలగ్నము సర్వగుణాన్వితమైనను వదలవలసినదే. మహాపాతము సంభవించిన దినమును శుభకార్యములకు విడువదగియున్నది. ఈ దినము సర్వగుణోపేతమైనను దంపతులకు మృత్యుప్రదము కావున విడువదగినది. ఇంకను కొన్ని చెప్పని చిన్న చిన్న దోషములుండును. లగ్నసమయమున మెరుపులు ఉరుములు, మంచు కురియుట, సూర్య పరివేషము, ఇంద్రచాపము, లత్తా, ఉపగ్రహపాతము, మాస దగ్ధమను తిథి, దగ్ధలగ్నము, అంధరాశి, బధిర రాశి, పంగురాశి మొదలగునవి కలవు. ఈ దోషముల విషయమున ఇపుడు నియమములను చెప్పెదను. అకాలమున మెరుపులు, ఉరుములు, మంచు కురియుట జరిగినచో శుభకార్యములను చేయరాదు. సకాలమున జరిగినచో దోషము లేదు. కేంద్రస్థానమున బృహస్పతి కాని, శుక్రుడుకాని, బుధుడు కాని యున్నచో సమస్త దోషములను నశింపచేయును. అడ్డముగా అయిదు రేఖలు, నిలువుగా అయిదు రేఖలు, కోణములో రెండురెండు రేఖలు ద్వితీయమగు శంభుకోణమున కృత్తికా నక్షత్రమున చక్రమున నుంచవలయును. ఈ చక్రమున అభిజిత్తుతో కూడిన నక్షత్రముల నుంచవలయును. గ్రహవిధయైన నక్షత్రమును సూర్యాదులు ముందుకాని వెనుకకాని నిత్యనక్షత్రమును తాకినచో దానిని లత్తయందురు. అర్క ఆకృతి గుణాద్యంగబాణాష్ట నవసంఖ్యలు గల నక్షత్రమును హస్తా నక్షత్రమునుండి ఆశ్లేష, మఘా, రేవతి, చిత్త, అనూరాధ, మృగశిర శ్రవణా నక్షత్రములు సంఖ్యచే నిత్యనక్షత్రమున అశ్వని నుండి పాత నక్షత్రము దుష్టనక్షత్రము ఇవి వదలదగినవి. సౌరాష్ట్రసాల్వదేశములలో లత్తితనక్షత్రమును విడువవలయును. కలింగవంగదేశములో పాతిత నక్షత్రము శుభప్రదము కాదు. బాహ్లిక మరుదేశాదులలో దోషము లేదు మాసదగ్ధములగు తిథులు, దగ్ధలగ్నముల మధ్యదేశమున దుష్టములు ఇతర దేశములలో దోషప్రదములు కావు. పంగు, అంధ, బధిర కాణలగ్నములు, మాసశూన్యములగు రాశులు గౌడ మాలవ దేశములలో వదల దగినవి ఇతర దేశములలో దుష్టములు కావు. దోషదుష్టమగు కాలమును చుతుర్ముఖబ్రహ్మకూడా సరి చేజాలడు కావున స్వల్పదోషములు అధికగుణములు కల లగ్నమును చూడవలయును. కావున ఇట్లు వివాహమునకు శుభలగ్నమును చక్కగా పరిశీలించి నిర్ణయించవలయును. తరువాత హస్త మాత్రోన్నతముగా హస్తచతుష్టయ విస్తారముగా చతురస్రాకారముగా, నాలుగు చెక్కని స్తంభములచే వామ భాగమున సన్నతరగునట్లుగా మండపము కలదిగా, నాలుగు దిక్కులలో సోపానములు కలదిగా, తూర్పు ఉత్తర దిక్కులలో ప్రవణముగా, అరటి స్తంభములతో హంసశుకాదిచిత్రములలో చిత్రించచబడి, చిత్రకుంభములు తోరణములు అంకురాదులు కలిగి, శృంగారపుష్పరాశులచే, పలువర్ణములతో అలంకరించబడి, బ్రాహ్మణాశీర్వచములు, ముత్తియిదువల ఆశీర్వచనములతో సుందరమైనది, వాదిత్ర నృత్యగీతాదులచే హృదయమును ఆనందింపచేయు శుభప్రదమైన, అగ్నిహోత్రము కలిగియున్న కళ్యాణవేదికను వధూవరులు చేరవలయును. అష్టరాశికూటములు, నక్షత్రగణములు, రాశులు, రాశీశులు, యోనులు, వర్ణములు, ఋతువులు పుత్రపౌత్రప్రదములు. ఒకేరాశియందు వేరు నక్షత్రములున్న వధూవరులకు పాణిగ్రహణము ఉత్తమము. భిన్నరాశులైనచో మధ్యమము ఒకేనక్షత్రము ఒకే రాశి అయినచో వారికి వివాహము చేయుట ప్రాణహనిని కలిగించును. స్త్రీ నక్షత్రము నుండి మొదటి నవకమున స్త్రీ దూరమైనచో అతినిందితము రెండవ నవకమున మధ్యమము శ్రేష్ఠము. తృతీయ నవకమున నృతో శ్రేష్ఠము. పూర్వఫల్గుని, పూర్వాభాద్ర, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, భరణి, ఆర్ద్రానక్షత్రములు మర్త్యగణములని తెలియవలయును. ఇతర నక్షత్రములు అమర్త్యగణములు, శ్రవణము, పునర్వసు, హస్త, స్వాతీ, రేవతీ అనూరాధ, అశ్వని పుష్యమీ, మృగశిరా లక్షత్రములు దేవగణములు మఘ, చిత్త, విశాఖ, కృత్తిక, జ్యేష్ఠా నక్షత్రములు, ధనిష్ఠ, శతభిష, మూల, ఆశ్లేష, నక్షత్రములు రాక్షసగణములు.

దంపతుల జన్మనక్షత్రమొకటే గణములోనిది అయినచో బహుప్రీతి కలుగును. దేవమానవగణములైనచో మధ్యమము. దేవరాక్షసగణములైనచో దంపతులకు మృతి సంభవించును. దంపతులకు షష్టాష్టకములున్నచో మృత్యువు, పంచనములైనచో సంతాన రాహిత్యము, రెండు పన్నెడు అయినచో దారిద్ర్యము, ఇతరములైనచో పరస్పరము ప్రీతి కలుగును. ఇద్దరి రాశ్యధిపతులు ఒక్క గ్రహమే అయిననూ, మిత్రగ్రహమైనమా పాణిగ్రహణము శుభప్రదము. రెండు పన్నెండుగా ఉన్ననూ త్రికోణస్ధానముననున్ననూ శుభ##మే. షషాష్టకము మాత్రము పనికి రాదు. అశ్వము, గజము, మేషము, సర్పము, సర్పము, మార్జాలము, మేషము, మార్జాలము, మూషకము, మూషకము, గోవు, మహిషము, వ్యాఘ్రము, కాలి, వ్యాఘ్రము, మృగములు, శ్వానము, వానరము, బభ్రయుగము, వానరము, సింహము, అశ్వము, సింహము, గోవు, గజము, ఇవి అశ్వనిమొదలగు నక్షత్రములకు వరుసగా యోనులు. శ్వానహరిణములు, బభ్రువు గజము, మేషవానరములు, సింహగజములు, గోవ్యాఘ్రములు, మార్జార మూషకములు, మహిషాశ్వములు, శత్రువులు. మీనవృశ్చిక, కర్కటములు, బ్రాహ్మణజాతి. తరువాతవి క్షత్రియాదులు పురుషుని రాశికి స్త్రీ రాశి తక్కువనచో శుభప్రదము. అశ్వీనీ నక్షత్రము నుండి వరుసగా లెక్కించినపుడు కన్యా నక్షత్రము నాలుగు మూడు పాదద్వయములైనచో, కృత్తికనుండి, మృగశిర నుండి మూడు నాలుగు అయిదు పర్వలలో నాడీ గణనము చేయవలయును. అట్లు గణనచేసినచో ఏకనాడి అయినచో మృత్యుప్రదము. పార్శ్వనాడి అయినచో అశుభము కాదు. ప్రాజా పత్యము, బ్రాహ్మము, దైవము, అను వివాహములు ఋషిప్రోక్తములు. ఈ వివాహములను విధించబడిన కాలమున చేయవలయును. ఈ నాలుగు వివాహములు సత్ఫల దాయకములు. గంధర్వ, అసుర, పైశాచ, రక్షస వివాహములను ఏసమయమునందైన జరుపవచ్చును. ఉదయనక్షత్రము నుండి ఏడవది, చతుర్థము ఆభిజిల్లగ్నము, గోధూళిలగ్నమున పైరెండు వివాహములు జరిపిన పుత్రపౌత్రాభివృద్ధి జరుగును. ప్రాచ్యదేశవాసులకు గోధూళిలగ్నము ముఖ్యము కళింగేదేశస్ధులకు మాత్రముపనికి రాదు. అభిజిల్లగ్నము అన్ని దేశములలోని వారికి ముఖ్యము. సర్వదోషనివారకము. సూర్యుడు మధ్యందినగతుడైనపుడు అభిజిన్ముహూర్తమనబడును.

శంకరుడు త్రిపురములను నశింపచేసినట్లు అభిజిల్లగ్నము అన్నిదోషములను నశింపచేయును. పుత్రుని వివాహమును చేసిన తరువాత ఆరు నెలలకు వరకు పుత్రికా వివాహమును చేయరాదు. అట్లే పుత్రుని ఉపనయనమును, పుత్రికా వివాహమును ఒకేసారి జరుపరాదు. ఒక శుభకార్యమున ఇంకొక శుభకార్యము జరుపరాదు ఒకే తండ్రి బిడ్డలకు ఆరునెలలలోపు వివాహము జరిపినచో ఆ ఇద్దరిలో ఒకరు మూడు సంవత్సరములలో భర్తను కోల్పోవును. ప్రతివివాహము అనగా తన కూతురును ఒకరి కొడుకుకిచ్చి, ఆతని కూతురును తన కొడుకుకు చేసుకొనుట పనికిరాదు. అట్లే ఒకే వరునికి ఇద్దరు పుత్రికలనిచ్చి వివాహము చేయరాదు. ఒకని కొడుకులకు ఒకని బిడ్డలను (ఇద్దరికి ఇద్దరిని) ఇచ్చి వివాహము చేయరాదు. అట్లే ఒకసారి ఇద్దరికి ఉపనయనము చేయరాదు. శిశువు పగలు పుట్టినచోతండ్రిని, రాత్రి పుట్టినచో తల్లిని, సంధ్యాకాలమున పుట్టినచో తనను చంపుకొనును. గండములకు అన్యధా భావము లేదు. మూలా నక్షత్రమున పుట్టిన పుత్రుడు కాని, పుత్రిక కాని మామను కన్యదానమును చేసిన వానిని చంపును. మూలా నక్షత్రమున చివరి పాదమున పుట్టినచో ఈ హాని జరుగదు. ఆశ్లేషా మొదటి పాదమున పుట్టినవాడు, జ్యేష్ఠాంత్యపాదమున పుట్టిన వాడు కూడా ఇదే చేయును. పుత్రిక మాత్రము చేయదు. పూర్వాషాఢా మూలా నక్షత్రములలో పుట్టిన బాలిక తల్లిదండ్రులకు హాని కలిగించదు. జ్యేష్ఠా నక్షత్రమున పుట్టిన బాలిక భర్త అన్నను చంపును. విశాఖా నక్షత్రమున పుట్టినది భర్త తమ్ముని చంపును. వివాహదినమునుండి ఆరవ, ఎనిమిదవ దినమున వధూప్రవేశమును జరిపిన సకలసంపదలు కలుగును. ఏడవ పదవదినమున కూడా జరుపవచ్చును. రెండు సంవత్సరముల జన్మమును, నక్షత్రలగ్నదివసములను వదిలి, అతిశుక్రుడున్ననూ వివాహయాత్ర శుభప్రదము. ఉత్తరాయణమున దేవతాప్రతిష్ఠ సంవత్ప్రదము. గురు శుక్రులు అస్తగులు కానపుడు దేవదైత్యప్రతిష్ఠ ఉత్తమము. చైత్ర భిన్నమాసములలో, మాఘాది పంచమాసములలో శుక్లకృష్ణపక్షములలో మొదటి ఎనిమిది తిథులలో చేసినచో శుభప్రదము. యే తిథికి యే దేవత అధిపతియో ఆ తిథిలో ఆ దేవతా ప్రతిష్ఠ జరుపవలయును. ద్వితీయనుండి రెండు పంచమి నుండి మూడు వరుసగా దశమి నుండి నాలుగు, విశేషించి పూర్ణిమ నాడు, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢా, ఉత్తరాభాద్ర, పునర్వసు, మృగశిర, రేవతి, హస్త చిత్త స్వాతి గురు నక్షత్రములలో, అశ్విని, రోహిణి, శతభిష, శ్రవణం, అనూరాధా నక్షత్రములలో, మంగళవారము తప్ప మిగిలిన వారములలో కర్తకు సూర్యుడు బలయుతుడుగా నున్నపుడు, చంద్రతారా బలముండగా శుభదినమున పూర్వాహ్ణమున, శుభలగ్నమున, శుభాంశలో, కర్తకు నిధనస్థానగతగ్రహోదయము కానపుడు అన్నిరాశులు శుభప్రదములే. కాని శుభగ్రహములు కలవి గాని శుభగ్రహ వీక్షణము కాని యుండవలయును. పంచాష్టకమున శుభలగ్నమున, సప్తమశుద్ధియున్నపుడు శుభము. చంద్రసూర్యకుజరాహుకేతుశనులు లగ్నమున నున్నచో మృత్యుప్రదులు. ఇతరులున్నచో ధనధాన్య సుఖములను ప్రసాదించును. ద్వితీయ స్థానమున పాపగ్రహములున్నచో అనిష్టమును కలిగించును. సౌమ్యగ్రహములు చంద్రుడు ఉన్నచో సంపదలనిచ్చును. మూడవస్థానమున అన్ని గ్రహములు పుత్రపౌత్ర సుఖముల నొసంగును. చతుర్ధమున సౌమ్యగ్రహములు సుఖమును, క్రూరగ్రహములు దుఃఖమునొసంగును. పంచమమున క్రూరులు హానిని, శుభులు పుత్ర సుఖములను, షష్ఠమున శుభులు శత్రువులను పాపులు శత్రునాశమును, సప్తమమున పాపులు వ్యాధిని, సౌమ్యులు శుభమును, అష్టమమున అన్నిగ్రహములు మృత్యువును, నవమమున పాపులు మృత్యువును, సౌమ్యులు శుభమును, దశమమున పాపులు దుఖమును, సౌమ్యులు చంద్రుడు సుఖమును, కీర్తిని, ఏకాదశమున అన్నిగ్రహములు బహులాభమును, ద్వాదశమున వ్యయమును కలిగించును. అర్థహీనమైనచో కర్తను, మన్త్రహీనమైనచో ఋత్విజులను, లక్షణహీనులైనచో స్త్రీని చంపును. కావున దేవతా ప్రతిష్ఠవంటి శత్రువులేడు. లగ్నమున గుణములధికములు, దోషములు స్వల్పములున్నచో శుభప్రదము.

సురణాం స్థాపనం తత్ర కర్తురిష్టార్ధ సిద్ధిదమ్‌, నిర్మాణాయతనగ్రామ గృహాదీనాం సమాసతః. 540

క్షేత్రమాదౌ పరీక్షేత గంధవర్ణరసాంశ##కైః మధపుష్పావ్లు పిశిత గంధం విప్రానుపూర్వకమ్‌. 541

సితం రక్తం చ హరితం కృష్ణవర్ణం యథాక్రమమ్‌, మధురం కటుకం తిక్తం కషాయకరసం క్రమాత్‌. 542

అత్యంత వృద్ధిదం నౄణాం ఈశానప్రాగుదప్లవమ్‌, అన్యదిక్షు ప్లవే తేషాం శశ్వదత్యంత హానిదమ్‌. 543

సమగర్తారత్ని మాత్రం ఖనిత్వా తత్ర పూరయేత్‌, అత్యంత వృద్ధిరధకే హీనే హాని స్సమే సమమ్‌. 544

తధానిశాదౌ తత్కృత్వా పానీయేన ప్రపూరయేత్‌, ప్రాతర్దృష్టే జలే వృద్ధిస్సమం పంకే క్షయః క్షయే. 545

ఏవం లక్షణసంయుక్తం సమ్యక్‌క్షేత్రం సమీక్ష్యతే, దిక్సాధనాయ తన్మధ్యే సమం మండలమాలిఖేత్‌. 456

ద్వాదశాంగులకం శంకుం స్థాప్యే క్షేత్తత్ర దిక్క్రమమ్‌, చతురస్రే కృతే క్షేత్రే షడ్వర్గపరిశోధితే. 457

రేఖామార్గే చ కర్తవ్యం ప్రాకారం సుమనోహరమ్‌, ఆయామేషు చతుర్దిక్షు ప్రాగాదిషు చ సత్స్వపి. 548

అష్టావష్టౌ ప్రతిదివం ద్వారాణి స్సుర్యథాక్రమమ్‌, ప్రదక్షిణ క్రమాత్తేషాం అమూని చ ఫలాని వై. 549

హానిర్నైస్స్వ్యం ధనప్రాప్తి నృపపూజా మహద్ధనమ్‌, అతి చైర్యమతిక్రోధో భీతిర్దిశి శచీపతేః. 550

నిధనం బందనం భీతి వర్ధాప్తిర్ధనవర్ధనమ్‌, అనాతంకం వ్యాధిభయం నిస్సత్వం దక్షిణాదిశి. 551

పుత్రహాని శ్శత్రువృద్ధి ర్లక్ష్మీప్రాప్తి ర్ధనాగమః, సౌభాగ్యమతిదౌర్భాగ్యం దుఃఖం శోకశ్చ పశ్చిమే. 552

కలత్రహానిర్నిస్సత్వం హానిరధాన్యధనాగమః, సంపద్వృద్ధి ర్మాసభీతి రామయం దిశి శీతగోః. 553

ఏవం గృహాదిషు ద్వారవిస్తారా ద్ద్విగుణోచ్ఛ్రితమ్‌, పశ్చిమే దక్షిణ వా పి కపాటం స్థాపయేద్గృహే. 554

ప్రాగారంతః క్షితిం కుర్యా దేకాశీతి పదం యథా, మధ్యే నవపదే బ్రహ్మ స్థానం తదితినిందితమ్‌. 555

ద్వాత్రింశదంశాః ప్రాకార సమీయాంశా స్సమన్తతః, పిశాచాంశే గృహారంభో దుఃఖశోకభయప్రదః. 556

శేషాంశా స్స్యుశ్చ నిర్మాణ పుత్రపౌత్ర ధనప్రదాః, శిరాస్స్యు ర్వాస్తునో రేఖా దిగ్విదిఙ్మధ్యసంభవాః. 557

బ్రహ్మభాగాః పిశాచాంశాః శిరాణాం యత్ర సంహతిః, తత్ర తత్ర విజానీయా ద్వాస్తునో మర్మసంధయః. 558

మర్మాణి సంధయో నేష్టాః స్వస్థ7ప్యేవం నివేశ##నే, సౌమ్యఫాల్గున వైశాఖ మాఘ శ్రావణ కార్తికాః. 559

మాసాస్స్యుర్గృహ నిర్మాణ పుత్రారోగ్యధనప్రదాః, అకారాదిషు భాగేషు దిక్షు భాగాదిషు క్రమాత్‌. 560

ఖరో7శ్వో7థ హరిశ్శ్వాఖ్యః సపాంశు గజశాశకాః, దిగ్వర్గాణామియం యోనిః స్వవర్గాత్పంచ మోరిపుః. 561

సాధ్యవర్గః పురః స్థాప్యః పృష్ఠత స్సాధకం న్యసేత్‌, వ్యత్యయే నాశనం తస్య ఋణ మధ్యం ధనాచ్ఛుభమ్‌. 562

ఆరభ్య సాధకం ధిష్ణ్యం సాధ్యం యావచ్చతుర్గుణమ్‌, విభ##జేత్సప్తభిశ్శేషం సాధకస్య ధనం తదా. 563

విస్తార ఆయామగుణో గృహస్య పదముచ్యతే, తస్మాద్ధనా ధనాయర వారాంశా స్సంఖ్యయా క్రమాత్‌. 564

ధనాదికం గృహం వృద్ధ్యై ఋణాధికమశోభనమ్‌, విషమాయ శ్శుభాయైవ సమాయో నిర్ధనాయ చ. 565

ధనక్షయ స్తృతీయరే పంచమరే పరః క్షయః, ఆత్మక్షయ స్సప్తమరే భవత్యేవ హి భర్తృభాత్‌. 566

ద్విర్ద్వాదశో నిర్ధనాయ త్రికోణమసుతాయ చ, షట్కాష్టకం మృత్యవేస్యాచ్ఛుభదారాశయః పరే. 567

సూర్యాంగారక వారాంవా వైశ్వానర భయప్రదాః, ఇతరే గ్రహవారాంశాః సర్వకామార్ధసిద్ధిదాః. 568

నభస్యాదిషు మాసేషు త్రిషు త్రిషు యథాక్రమమ్‌, పూర్వాదికశిరోవామ పార్శ్వే శాయా ప్రదక్షిణమ్‌. 569

చరాహ్వయా వాస్తు పుమాన్‌ చరత్యేవం మహోదరః, యద్దిఙ్ముఖో వాస్తు పుమాన్‌ కుర్యాత్తద్దిఙ్ముఖం గృహమ్‌. 570

ప్రతికూలముఖం గేహం రోగశోకభయప్రదమ్‌, సబలో ముఖగేహానాం ఏష దోషో న విద్యతే. 571

వృత్యేటికాం స్వర్ణరేణు ధాన్యశైవలసంయుతమ్‌, గృహమధ్యే హస్తమాత్రే గర్తే న్యాసాయ విన్యసేత్‌. 572

వస్త్వాయామ దలం నాభిస్తస్మాదధ్యంగులత్రయమ్‌, కుక్షి స్త్మస్మిన్యసేచ్ఛంకుం పుత్రపౌత్రవివర్ధనమ్‌. 573

చతుర్వింశత్త్రయో వింశత్షోడశద్వాథవాంగులైః, విప్రాదీనాం కుక్షిమానం స్వర్ణవస్త్రాద్యలంకృతమ్‌. 574

ఖదిరార్జునశౄలోత్ధం యుగయంత్రం తరూద్భవమ్‌, రక్తచందనపాలాశ రక్తశాలివిశాలజమ్‌. 575

శంకుం త్రిధా విభాజ్యాద్యం చతురస్రం తతః పరమ్‌, అష్టాస్రంచ తృతీయాసౌ మన్వస్రం మృదుమంత్రణమ్‌. 576

ఏవం లక్షణసంయుక్తం పరికల్ప్య శుభే దినే, షడ్వర్గశుద్ధిసూత్రేణ సూత్రితే ధరణీతలే. 577

మృదుధ్రువక్షిప్రఖేషు రిక్తామావర్జితే దినే, వ్యర్కార చరలగ్నేషు పాపే చాష్టమ వర్జితే. 578

నైధనే శుద్ధిసంయుక్తే శుభలగ్నే శుభాంశ##కే, శుభేక్షితే7థవా యుక్తే లగ్నే శంకుం వినిక్షిపేత్‌. 579

పుణ్యాహఘోషైర్వాదిత్రైః పుణ్యపుణ్యాంగనాదిభిః, స్వత్రికేంద్ర త్రికోణ్థౖ శ్శుభైస్త్స్యయారిగైః పరైః. 580

లగ్నాంశాష్టారి చంద్రేణ దైవజ్ఞార్చన పూర్వకమ్‌, ఏకద్విత్రిచతుశ్శాలా స్సప్తశాలా దశాహ్వయాః. 581

తాః పున ష్షడ్విధా శ్శాలా ప్రత్యేకం దశషడ్విధా, ధ్రువం ధాన్యం జయం నందం ఖరం కాంతం మనోరమం. 582

సుముఖం దుర్ముఖం క్రూరం శత్రుం స్వర్ణప్రదం క్షయమ్‌, ఆక్రందం విపులాఖ్యం చ విజయం షోడశం గృహమ్‌. 583

గృహాణి గణయేదేవం తేషాం ప్రస్తార భేదతః, గురో రధో లఘుస్థ్సాప్యః పురస్తాదూర్ధ్వవన్న్యసేత్‌. 584

గురుభిః పూరయేత్పశ్చాత్‌ సర్వలఘ్వవధీర్విదిః, కుర్యాల్లగుపదే7లిన్దం గృహద్వారాత్ప్రదక్షిణమ్‌. 585

పూర్వాదిగేష్వలిందేషు గృహభేదాస్తు షోడశ, స్నానాగారం దిశి ప్రాచ్యాం ఆగ్నేయ్యాం పాకమందిరమ్‌. 586

ప్రతీచ్యాం భోజన గృహం వాయువ్యాం ధాన్యమందిరమ్‌, యామ్యాం చ శయనాగారం నైఋత్యాం శాస్త్రమందిరమ్‌. 587

కౌబేర్యాం దేవతాగారం ఈశాన్యాం క్షీరమందిరమ్‌, శయ్యామూత్రాస్త్ర తద్విచ్చ భోనం మంగళాశ్రయమ్‌. 588

ధాన్యస్త్రీభోగవిత్తం చ శృంగారాయతనాని చ, ఈశాన్యాది క్రమస్తేషాం గృహనిర్మాణకం శుభమ్‌. 589

ఏతేష్వేతాని శస్త్రాణి స్వంస్థాప్యాని స్వదిక్ష్వపి, ధ్వజో ధూమ్రో7థసింహశ్శ్వా సౌరమేయః ఖరో గజః. 590

ధ్వాంక్షశ్చైవ భవంత్యష్టౌ పూర్వాదిపాః క్రమాదమీ, ప్లక్షోదుంబరచూతాఖ్యా నింబస్తు హి విభీతకాః. 591

యే కంటకా దుగ్ధవృక్షా వృక్షాశ్వత్థ కపిత్థకాః, అగస్తి సింధువాలాఖ్య తింతిడీకాశ్చ నిందితాః. 592

పిత్తవాగ్రజ దేహస్యాత్పశ్చిమే దక్షిణ తథా, గృహపాదా గృహస్తంభా స్సమా శ్శస్తాశ్చ నాసమాః. 593

నాత్యుచ్ఛ్రితం నాతి నీచం కుడ్యోత్సేధం యథారుచి, గృహోపరి గృహాదీనాం ఏవం సర్వత్ర చింతయేత్‌. 594

అట్టి లగ్నమున దేవతాప్రతిష్ఠ కర్తకు అభీష్టములను ప్రసాదించును. దేవాలయమును, గ్రామమును గృహమును మొదలగువాటిని నిర్మించుటకు ముందుగా భూమిని గంధవర్ణరసాదులచే పరీక్షించవలయును. విప్రాశీర్వచన పూర్వకముగా మధు పుష్ప ఆవ్లు పిశిత గంధమును తెలుపు ఎరుపు ఆకుపచ్చ నలుపు వర్ణమును వరుసగా మధుర కటుక తిక్త కషాయకర రసములను కలుపుట వలన ఈశాన్య పాక్‌ ఉత్తర ప్లవముగా నున్నచో మానవులకు మిక్కిలి అభివృద్ధిని కలిగించును. ఇతర దిక్కులలో ప్లవముగా (పల్లముగా) ఉన్నచో అత్యంతహానిని కలిగించును. సమముగా అరత్ని మాత్రప్రమాణముగా గర్తమును తవ్వి నింపవలయును. అధికముగా ఉన్నచో వృద్ధితగ్గినచో హాని కలుగునని తెలియవలయును. అట్లు సాయంకాలము ఆగర్తమును జలముతో నింపవలయును. మరునాడు ఉదయము జలమున్నచో వృద్ది, బురదయున్నచో సమఫలము, నీరు పూర్తిగా ఇంకి పోయినచో క్షయము కలుగునని తెలియవలయును. ఇట్లుచక్కగా పరీక్షించి సలక్షణమైన భూమిని నిర్ణయించి, ఆ భూమిలో దిక్కులను తెలియుటకు సమమండలమును లిఖించవలయును. ద్వాదశాంగుల పరిమాణముగల శంకును స్థాపించి దిగ్విభాగమును చూడవలయును. ఇట్లు క్షేత్రమును చతురస్రముగా చేసి షడ్వర్గలచే పరిశోధించి రేఖామార్గమున ప్రాకారమును సుందరముగా నిర్మించవలయును. నాలుగు దిక్కులలో విస్తారమున్ననూ ప్రతిదిక్కులో ఎనిమిది ద్వారములుండవలయును. ఆ ద్వారములకు ప్రదక్షిణక్రమముగా ఈ ఫలములుండును. హాని, దారిద్ర్యము, ధనప్రాప్తి, రాజపూజ, మహాధనము, అతిచౌర్యము, అతిక్రోధము, భీతియనునవి ఇంద్రుని దిక్కులోని ద్వారములకు ఫలములు. నిధనము, బంధనము, భీతి, ధనప్రాప్తి, ధనవృద్ధి, విఘ్నరాహిత్యము, వ్యాధి భయము, నిస్సత్వము, దక్షిణదిక్కులో కలుగును. పుత్రహాని, శత్రువృద్ధి, లక్ష్మీప్రాప్తి, ధనాగమము, సౌభాగ్యము, అతిదౌర్భాగ్యము, దుఃఖము శోకము పశ్చిమదిక్ఫలములు. కలత్రహాని, నిస్సత్త్వము, హాని, ధాన్యాగమము, సంపద్వృద్ధి, మాసభీతి, రోగము ఇవి చంద్ర దిక్ఫలములు. (ఉత్తరదిక్కు) ఇట్లు గృహాదులలో ద్వారములు విస్తారమునకు రెట్టింపు ఔన్నత్యముగా నుండవలయును. ఇంట్లో పశ్చిమమునకాని, దక్షిణమున కాని కవాటమునుంచవలయును. ప్రాకారములోపల ఎనుబది యొక్క అడుగుల భూమి నుంచవలయును. ఆ భూమి మధ్యభాగమున తొమ్మిదడుగుల భూమి బ్రహ్మస్థానమనబడును. ఈ బ్రహ్మస్థానము అతినిందితము. ప్రాకారమున ముప్పదిరెండంశలుండును. పిశాచాంశమున గృహారంభమును చేసినచో దుఃఖమును, శోకమును భయమును కలిగించును. దిక్కుల విదిక్కుల మధ్యనున్న రేఖలు వాస్తు పురుషుని శిరస్సులుగా నుండును. శిరముల సమూహమున్న బ్రహ్మభాగములు పిశాచాంశలగును. అట్లే వాస్తుపురుషుని మర్మసంధులను కూడా తెలియవలయును. ఇట్లు మంచిగా నున్నను వాస్తు పురుషుని మర్మములు సంధులు ఇష్టప్రదములు కాజావు. మాఘ ఫాల్గున వైశాఖ శ్రావణ కార్తిక మాసములలో గృహనిర్మాణమును చేసినచో పుత్ర, ఆరోగ్య ధనములు కలగును. దిగ్భాగములలో వరుసగా అకారాది భాగములందు ఖరము, అశ్వము, సింహము, శ్వానము, పాంశు, గజము, శశము ఇవి దిగ్వర్గముల యోనులు. తమ వర్గము నుండి అయిదవ వర్గము శత్రుస్థానము ముందుభాగమున సాధ్యవర్గమును స్థాపించవలయును. తరువాత వెనుక భాగమున సాధక వర్గము నుంచవలయును. దీనికి విపరీతముగా చేసినచో నాశనము జరుగును. ఋణస్థానము మధ్యమము. ధనస్థానము శుభప్రదము. సాధక నక్షత్రమున సాధనావాసమును ప్రారంభించి సాధనమునకు నాలుగు రెట్లధికముగా సాధ్యమును చేసి ఏడింటిచే భాగించగా శేషము సాధకునికి ధనమగును. విస్తారము ఆయామగుణముగా నుండుట గృహస్థానమగును. కావున ధన అధన, ఆయ, నక్షత్రవారాంశలు సంఖ్యాక్రమమున చూడవలయును. ధనాధికముశేషమైనచో గృహము వృద్ధి ప్రదము. ఋణాధికము శేషమైనచో శుభప్రదము కాదు. విషమాయము శుభమును, సమాయము నిర్ధనమును కలిగించును. మూడవ నక్షత్రమున ధన క్షయము, అయిదవ నక్షత్రమున అధిక క్షయము, ఏడవ నక్షత్రమున ఆత్మక్షయము, కర్తృనక్షత్రము నుండి జరిగియే తీరును. రెండు పన్నెండు నిర్ధనమును, త్రికోణము సంతాన రాహిత్యమును, 6 - 8 మృత్యువును ప్రసాదించును. ఇతర రాశులు శుభప్రదములు. ఆది మంగళ వారాంశలు అగ్నిభయమును కలిగించును. ఇతర గ్రహాంశలు వారాంశలు సర్వకామార్ధ సిద్ధిప్రదములు. శ్రావణాది మాసములలో మూడు మూడులలో యథాక్రమముగా పూర్వాదికము శిరస్సువామపార్శ్వేశునికి అప్రదక్షిణముగా చరనామముచే వాస్తు పురుషుడు మహోదరునిగా చరించుచుండును. వాస్తుపురుషుడు ఏ దిఙ్ముఖుడుగా నుండునో గృహమును ఆ దిఙ్ముఖముగా నిర్మించవలయును. ప్రతికూల దిఙ్ముఖముగా నిర్మించినచో రోగశోకభయములను కలిగించును. వాస్తుపురుషుడు బలీయుడైనచో ఈ దోషము లేదు. ఈటికను స్వర్ణరేణువును, ధాన్యశైవలసంయుతముగా గృహమధ్యమమున హస్త మాత్ర ప్రమాణము గల గర్తమున న్యాసము కొరకుంచవలయును. వస్త్వాయామదలమును నాభియందురు. దానికంటే అంగుళత్రయాధికభాగము కుక్షి యగును. ఆ కుక్షిలో శంకునుంచవలయును. ఇట్లు చేసినచో పుత్రపౌత్రవృద్ధి కలుగును. 24, 23, 16, 12 అంగుళములు కుక్షి ఉండుట బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యముల ప్రమాణము. శంకున స్వర్ణవస్త్రాదులచే అలంకరించి, ఖదిర, అర్జున, శాల వృక్షముల నుండి చేసిన దానిని, యుగ యంత్రమును సిద్ధము చేసి, రక్తచందన, పాలాశ, రక్తశాల, విశాలములనుండి పుట్టిన దానిని శంకువును మూడు భాగములుగా విభజించి, మొదటి భాగమున చతురస్రాకారముగా, రెండవ భాగమును అష్టాస్రముగా, తృతీయ భాగమును మన్వస్రముగా నిర్మించవలయును. మృదువుగా మన్త్రణముగా నుండవలయును. ఇట్లు శంకును లక్షణ సంయుక్తముగా సిద్ధము చేసి శుభదినమున షడ్వర్గశుద్ధి సూత్రముచే చుట్టబడిన ధరణీ తలమున మృదు, ధ్రువ, క్షిప్ర నక్షత్రములలో రిక్త అమావర్జిత దినమున సూర్యుకుజచర భిన్నమగు లగ్నమున పాపగ్రహములు అష్టమస్థానమునలేనపుడు, సప్తమ శుద్ధిని చూచి, శుభలగ్నమున, శుభాంశమున శుభగ్రహ వీక్షణమున్నపుడు, లేదా శుభగ్రహములతో కూడియున్నపుడు శంకున్యాసమును చేయవలయును. పుణ్యాహఘోషములతో, వాదిత్రములతో, పవిత్రులగు పుణ్యాంగనలతో స్వత్రికేంద్ర త్రికోణస్థానములందు శుభగ్రహములుండగా 3, 6, 11 స్థానములలో ఇతర గ్రహములుండగా లగ్నాంశాష్టాది చంద్రునిచే, దైవజ్ఞులను అర్చించి, ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశ్శాల, సప్తశాల దశశాలలుగా నిర్మించవలయును. ఈ శాలలు మరల షడ్విధములు. ధ్రువము, ధాన్యము, జయము, నందము, ఖరము, కాంతము, మనోరమము, సుముఖము, దుర్ముఖము, క్రూరము, శత్రువు, స్వర్ణప్రదము, క్షయము. ఆక్రందము, విపులము, విజయము అని పదునారు పేర్లు గృహములు కుండును. గృహముల విస్తార భేదములచే ఈ పేర్లతో లెక్కించవలయును. గురువుకు క్రిందుగా లఘువు నుంచవలయును. ముందు ఊర్ధ్వముగా నుంచవలయును. తరువాత గురువులతో పూరించవలయును. లఘు పదమున అళిందమును చేయవలయును. గృహద్వారము నుండి ప్రదక్షిణముగా పూర్వాదులందున్న అలిందములందు షోడశ గృహభేదము లేర్పడును. తూర్పున స్నానాగారము, ఆగ్నేయమున పాకశాల, పశ్చిమమున భోజనశాల, వాయవ్యమున ధాన్యశాల, దక్షిణమున శయనా గరము, నైఋతిలో శాస్త్రాగారము, ఉత్తరమున దేవాగారము, ఈశాన్యమున క్షీరమందిరముండవలయును. శయ్యామూత్రాస్త్రశాలలు భోజనాలయములుండుట శుభావహము. ధాన్య, స్త్రీ భోగ, ధన, శృంగారశాలలు ఈశాన్యాదిక్రమముగా నిర్మించుట శుభప్రదము. ఈ శాలలో ఆయాదిక్కులలో ఆంగూశస్త్రముల నుంచవలయును. ధ్వజము, ధూమ్రము, సింహము, శునకము, సారమేయము ఖరము గజము, ధ్వాంక్షము అను ఎనిమిది పూర్వాది దిక్పాలకులు. జమ్మి, మేడి, మామిడి, వేప, తుహి, విభీతకము, కంటక వృక్షములు, దుగ్ధవృక్షములు,రాగి, వెలగ చెట్లు ఆగస్తి, సిందువాలవృక్షములు, చింతచెట్లు ఇంట్లో ఉండరాదు. పశ్చిమ దక్షిణములలో పిత్తవాక్‌ రజోదేహుడుగా నుండును. గృహపాదములు, గృహస్తంభములు సమములుగా నుండవలయును. విషమములుగా నుండరాదు. ఎక్కువ ఎత్తు, ఎక్కువ వంపు కాక గోడ యథేష్టముగా నుండవలయును. గృహములమీది గృహములు కూడా ఇట్లే ఉండవలయును.

గృహాదీనాం గృహశ్రావం క్రమశో7ష్ట విధం స్మృతమ్‌, పాంచాల మానం వైదేహం కౌరవం చ కుజన్యకమ్‌. 595

మాగధం శూరసేనం చ గాంధారవంతకా స్స్మృతాః, స చతుర్బాగవిస్తార ముత్సేధం యత్తదుచ్యతే. 596

పాంచాల మాతులానాం చ హ్యుత్తరోత్తర వృద్ధితః, వైదేహా దీన్యశేషాణి మానాని స్యుర్యథాక్రమమ్‌. 597

పాంచాలమానం సర్వేషాం సాధారణమతః పరమ్‌, అవంతిమానం విప్రాణాం గాంధారం క్షత్రియస్య చ. 598

కౌజన్యమానం వైశ్యానాం విప్రాదీనాం యథోత్తరమ్‌, యథోదితం జలస్త్ర్యాఖ్యం ద్విత్రిభూమిక వేశ్మనామ్‌. 599

ఉష్ట్రకుంజరశాలానాం ధ్వజాయే ప్యథవా గజే, పశుశాలాశ్చ శాలానాం ధ్వజాయే ప్యథవాగజే. 600

ద్వారశయ్యాశనా మత్ర ధ్వజా స్సిహవృషధ్వజాః, వాస్తుపూజా విధిం వక్ష్యే నవ వేశ్మప్రవేశ##నే. 601

హస్త మాత్రా లిఖేద్రేఖా దశపూర్వా దశోత్తరాః, గృహమధ్యే తండులోపర్యేకవింశతిపదం భ##వేత్‌. 602

పంచోత్తరాన్వక్ష్యమాణాం శ్చత్బారింశత్సురాన్లిఖేత్‌, ద్వాత్రింశద్శా హ్యత పూజ్యా స్తత్రాంతస్థా స్త్రయోదశ. 603

తేషాం స్ధానాని నామాని వక్ష్యామి క్రమ శో7ధునా, ఈశానకోణతో బాహ్యే ద్వాత్త్రింశత్త్రిదశా అమీ. 604

కృపీట యోనిః పర్జన్యో జయన్తః పాక శాసనః, సూర్య శ్శశీ మృగాకాశౌ వాయుః పూషా శ##నైచరతిః. 605

గృహాక్షతో దండధరో గాంధర్వో భృగురాజకః, మృగః పితృగణాధీశః తతో దైవారికాహ్వయః. 606

సామస్సూర్యో7దితి దితీ ద్వాత్త్రంశత్త్రిదశా అమీ, అధోశనాది కోణస్ధా శ్చత్వారస్తత్సమీపగాః. 607

ఆప స్సావిత్ర సంజ్ఞశ్చ జయో రుద్రఃక్రమాదమీ, ఏకాంతరాస్స్యు ప్రాగాద్యా పరితో బ్రహ్మణస్సృతాః. 608

అర్యమా సవితా బింబ వివస్వాన్వసుధాధిపః, మిత్రో7థ రాజయక్ష్మా చ తథా పృధ్వీధరాహ్వయః. 609

ఆపవత్సో7ష్టమః పంచ చత్వారింశస్సురా అమీ, ఆపశ్త్చేవాపవత్సశ్చ పర్జన్యో7గ్నిః దితిః క్రమాత్‌. 610

యద్దిక్కానాం చ వర్గో7యం ఏవం కోణష్వశేషతః, తన్మధ్యే వింశతిర్బాహ్యా ద్విపదాస్తే తు సర్వదా. 611

అర్యమా చ వివస్వాంశ్చ మిత్రః పృథ్వీ ధరాహ్వయః, బ్రహ్మణః పరితో దిక్షు చత్వార స్త్రీపదా స్సృతాః. 612

బ్రహ్మణం చ తథైకద్విత్రిపదానర్చయేత్సురాన్‌, వాస్తు మంత్రేణ వాస్తుజ్ఞో దూర్వాదధ్యక్షతాదిభిః. 613

బ్రహ్మమంత్రేణ వా శ్వేతవస్త్రయుగ్మం ప్రదాపయేత్‌, ఆవాహనాది సర్వోపచారాంశ్చ క్రమశస్తథా. 614

నైవేద్యం త్రివిధాన్నేన వాద్యైస్సహ సమర్పయేత్‌, తాంబూలం చ తతఃకర్తా ప్రార్థయే ద్వాస్తుపూరుషమ్‌. 615

వాస్తుపురుష నమస్తే7స్తు భూశయ్యా నిరత ప్రభో, మద్గృహం ధనధాన్యాదిసమృద్ధం కురు సర్వదా. 616

ఇతి ప్రార్ధ్య యధా శక్త్యా దక్షిణామర్చ కాయచ, దద్యాత్తదగ్రచే విప్రేభ్యో భోజనం చ స్వశక్తితః. 617

అనేన విధినా సమ్యక్‌ వాస్తు పూజాం కరోతి యం, ఆరోగ్యం పుత్రలాభం చ ధనం ధాన్యం లభేన్నరః. 618

అకృత్వా వాస్తుపూజాం యః ప్రవిశేన్నవమందిరమ్‌, రోగాన్నానావిధాన్ల్కేశానశ్నుతే సర్వసంకటమ్‌. 619

అకపాట మనాచ్ఛన్న మదత్తబలిభోజనమ్‌, గృహం న ప్రవిశేదేవం విపదామాకరం హి తత్‌. 620

గృహములు మొదలగు వాటికి గృహ శ్రావము క్రమముగా అష్టవిధములు చెప్పబడినవి. పాంచాలమానము, వైదేహమానము, కౌరవమానము, కుజనమానము, మాగధమానము, శూరసేనమానము, గాంధారమానము, అవంతికామానము అని. చతుర్భాగ విస్తారము ఉన్నతముగనున్నది పాంచాలమానమనబడును. ఉత్తరోత్తర వృద్ధిగా నుండు నవి వైదేహది మనములగును. పాంచాలమానము సర్వసాధారణము. బ్రాహ్మణులకు అవంతిమానము, క్షత్రియులకు గాంధారమానము, వైశ్యులకు కుజనమానము, ఆశ్రయణీయము. బ్రాహ్మణాదులకు యథోత్తరముగా, యథోక్తముగా జలస్త్యాణ్యములను ద్విత్రిభూమికగృహములకు, ఉష్ట్రకుంజరశాలలకు ధ్వజాయము గజయామములు చెప్పబడినవి. ద్వార శయ్యాభోజనశాలలు ఆయామములు ధ్వజసింహ వృష ధ్వజాయామములు విధించబడినవి. నూతన గృహప్రవేశసమయమున చేయవలసిన వాస్తుపూజా విధానమును చెప్పెదను వినుము. గృహ మధ్యమున బియ్యము మిద ఇరువది ఒకటి అడుగుగల కొలతతో హస్త మాత్రముగా పూర్వ భాగమున పది ఉత్తరభాగమున పది రేఖను గీయవలయును. అయిదు తరువాత చెప్ప బోవు ఇరువదినాలుగు మంది దేవతలను లిఖించవలయును. బాహ్యభాగమున ఈశాన్యకోణము నుండి 32 మంది దేవతలు వీరు. శివుడు, పర్జన్యుడు, జయన్తుడు, ఇంద్రుడు, సూర్యుడు చంద్రుడు, మృగము, ఆకాశము, వాయువు, పూష, నైఋతి, గృహక్షతుడు, దండధరుడు, గాంధర్వుడు, భృగు, ఆజకుడు, మృగుడు, పితృ, గణాధీశుడు, దైవారికుడు, సోముడు, సూర్యుడు, అదితి, దితి. ఉశనాది కోణమునుండి ఉండు నలుగురు దేవతలు వేరు. అపుడు, సావిత్రుడు, జయుడు, రుద్రుడు అనువారలు. తూర్పు మొదలుకొని ఏకాంతరులు చుట్టూ బ్రహ్మలుందురు. అర్యమా, సవిత, వివస్వాన్‌ వసుధాధిపుడు. మిత్రుడు, రాజయక్ష్మ, పృథ్వీధరుడు, ఆపపతి అష్టమము. ఇట్లు 45 మంది దేవతలు. ఆప, ఆపవత్స, పర్జన్య, అగ్ని దితి, అని ఇది ఒకదిగ్వర్గము ఇట్లు అన్నికోణములలో సంపూర్ణముగా నుండును. ఈ మధ్యలో బాహ్యులు ఇరువదిమంది ద్విపాదులు. అర్యమా, వివస్వాన్‌, మిత్రుడు, పృధ్వీధరుడు, అని బ్రహ్మచుట్టు నాలుగు దిక్కులలో నలుగురు త్రిపాదులు. బ్రహ్మను కూడా ఒకటి, రెండు మూడు పాదములు కలవానినిగా పూజించవలయును. వాస్తును తెలిసినవాడు వాస్తుమంత్రముచే దూర్వాదధ్యక్షతాదులకే, బ్రహ్మమంత్రముచే కాని, శ్వేతవస్త్రయుగ్మమును ఇప్పించవలయును. క్రమముగా ఆవాహనాది సర్వోపచారములను చేసి, త్రివిధాన్నమును నైవేద్యము చేసి, వాద్యములచే చక్కగా పూజించవలయును. తరువాత తాంబూలమును సమర్పించి వాస్తుపురుషుని ప్రార్థించవలయును. ఓ వాస్తుపురుషా! నీకు నమస్కారము. నీవు భూశయ్యానిరతుడవు. నాగృహమును ధనధాన్యసమృద్ధముగా చేయుము. ఇట్లు యథాశక్తిగా ప్రార్థించి అర్చకునికి దక్షిణనీయవలయును. తరువాత శక్తిననుసరించి బ్రాహ్మణులకు భోజనతాంబూలదక్షిణలను సమర్పించవలయును. ఇట్లు తన శక్తిమేరకు విధిగా చక్కగా వాస్తు పూజను చేయువాడు ఆరోగ్యమును పుత్రలాభమును ధనధాన్యములను పొందగలడు. ఇట్లు వాస్తు పూజను ఆచరించక నూతన గృహప్రవేశమును చేసినచో రోగములను బహువిధకష్టములను పొందును. ఎప్పుడూ సంకటముల పాలగుచుండును. తలుపులేని, ఆచ్ఛాదనము లేని, పూజచేయని, భోజనము పెట్టని కొత్త ఇంటిలోనికి ప్రవేశించకూడదు. అట్లు ప్రవేశించినచో ఆపదల పాలగును.

అధో యాత్రా నృపాదీనామభీష్టఫలసిద్ధయే, స్యాత్తథా తాం ప్రవక్ష్యామి స్సమ్యగ్విజ్ఞాతన్మనామ్‌. 621

అజ్ఞాతజన్మనాం నౄణాం ఫలాప్తిర్ఘుషవర్ణవత్‌, ప్రశ్నోదయనిమిత్తాద్యై స్తేషామపి ఫలోదయః. 622

షష్ఠ్యష్టమీ ద్వాదశీషు రిక్తామా పూర్ణిమాసు చ, యాత్రా శుక్లప్రతిపది నిర్ధనాయ క్షయాయ చ. 623

మైత్రాదితీం ద్వర్కాంత్యాశ్విహరితిష్యవసూడుషు, ఆసప్త పంచ త్ర్యాద్యేషు యాత్రా భీషఫలప్రదా. 624

న మందేందు నే ప్రాచీం న వ్రజేద్దక్షిణం గురౌ, పితార్కయోర్నప్రతీచీం నోదీచీం జ్ఞారయోర్దినే. 625

ఇంద్రా జపాద చతురా స్యార్యమరాణి పూర్వతః, శూలాని సర్వద్వారాణి మిత్రార్కేజ్యాశ్వ భాని చ. 626

క్రమాద్దిగ్ద్వార భానిస్యు స్సప్తసప్తాగ్ని ధిష్ణ్యతః, పరిఘం లంఘయోద్దండం నాగ్నిశ్వసనదిగ్గమమ్‌. 627

ఆగ్నేయం పూర్వ దిగ్ధిష్ణ్యై ర్విదిశ##శ్చైవ మేవ హి, దిగ్రాశయస్తు క్రమశో మేషాద్యాశ్చ పునఃపునః. 628

దిగీశ్వరే లలాటస్ధే యాతుర్నపునరాగమః, లగ్నస్థో భాస్కరః ప్రాచ్యాం దిశియాతుర్లలాటగః. 629

ద్వాదశైకాదశశ్శుక్రో7 ప్యాగ్నేయ్యాం తు లలాటగః, దశమస్థః కుజో లగ్నాత్‌ యామ్యాం యాతుర్లలాటగః. 630

నవమాష్టమగో రాహు ర్నైఋత్యాం తు లలాటగః, లగ్నాత్సప్తమగ స్సౌరిః ప్రతీచ్యాం తు లలాటగః. 631

షష్ఠః పంచమగ శ్చన్ద్రో వాయవ్యాం చ లలాటగః, చతుర్ధ స్థానగ స్సౌమ్య శ్చోత్తరస్యాం లలాటగః. 632

ద్విత్రిస్థానగతో జీవ ఈశాన్యాం వై లలాటగః, లలాటం తు పరిత్యజ్య జీవితేచ్ఛుర్వ్రన్నరః. 633

విలోమగో గ్రహో యస్య యాత్రా లగ్నోపగో యది, తస్య భంగప్రదో రాజ్ఞ స్తద్వర్గో7పి విలగ్నగః. 634

రవీంద్వయనయోర్యాతమనుకూలం శుభప్రదమ్‌, తదభావే దివారాత్రౌ యాయాద్యాతు ర్వధో7న్యధా. 635

మూఢే శుక్రే కార్యహానిః ప్రతిశుక్రే పరాజయః, ప్రతిశుక్ర కృతం దోషం హంతుం శక్తా గ్రహా న హి. 636

వాసిష్ఠ కాశ్యపే యాత్రి భారద్వాజాస్సగౌతమాః, ఏతేషాం పంచగోత్రాణాం ప్రతిశుక్రో న విద్యతే. 637

ఏకగ్రామే వివాహే చ దుర్భిక్షే రాజవిగ్రహే, ద్విజక్షోభే నృపక్షోభే ప్రతిశుక్రో న విద్యతే. 638

నీచ గో7రి గృహ స్థో వా వక్రగో వా పరాజితః, యాతుర్భంగప్రదశ్శుక్ర స్స్వోచ్ఛస్థజ్జే జయప్రదః. 639

స్వాష్టలగ్నేష్ట రాశౌ వా శత్రుభాత్త్వష్టమే7పి వా, తేషామీశస్ధ రాశౌ వా యాతుర్మృత్యుర్న సంశయః. 640

జన్మే శాష్మ లగ్నాశౌ మిధో మిత్రే వ్యవస్థితా, జన్మరాశ్యష్టమరోత్థ దోషా నశ్యంతి భావతః. 641

క్రూరగ్రహేక్షితో యుక్తో ద్విస్స్వభావో7పి భంగదః, యానే స్థిరోదయే నేష్టో భవ్యయుక్తే క్షితస్స్వయమ్‌. 642

వస్త్వంత్యార్ధాది పంచరే సంగ్రహం తృణకాష్ఠయోః, యామ్యదిగ్గమనం శయ్యా న కుర్యాద్గేహగోపనమ్‌. 643

జన్మోదయే జన్మభేవా తయోరీశస్యభే7పి వా, తాభ్యాం తయోరర్కేంద్రేషు యాతు శ్శత్రుక్షయో భ##వేత్‌. 644

శీర్షోదయే లగ్నగతే దిగ్లగ్నే లగ్నేగే7పి వా, శుభవర్గో7థ వా లగ్నే యాతు శ్శుత్రుక్షయస్తధా. 645

శత్రుజన్మోదయే జన్మ రాశేర్వా నిధనోదయే, తయోరీశస్థితే రాశౌ యాతు శ్శత్రుక్షయో భ##వేత్‌. 646

వక్రః పంధా మీనలగ్నే యాతుర్మీనాం శ##కే7పివా, నింద్యో నిఖిల యాత్రాసు ఘటలగ్నో ఘటాంశకః. 647

జలలగ్నో జలాంశో నా జలయోనే శ్శుభావహః, మూర్తిః కోశో ధన్వినశ్చ విహనం మంత్ర సంజ్ఞకమ్‌. 648

శత్రుమార్గస్తథాయుశ్చ మలోవ్యాపార సంజ్ఞికమ్‌, ప్రాప్తిరప్రాప్తిరుదయాత్‌ భావాస్స్యుర్త్వాదశైవ తే. 649

ఘ్నంతి క్రూరాస్త్ర్యాప్తి వర్గం భావాన్సూర్య మహీసుతౌ, న నిఘ్నతో హి వ్యాపారం సౌమ్యాః పుష్ణంత్యరిం వినా. 650

రాజులు మొదలగువారు చేయు యాత్రలు ఫలప్రదమగుటకేమి చేయవలయునో చెప్పెదను. పుట్టుక తెలిసిన వారి విషయమున అనగా జన్మతిథి వారనక్ష్రతములు తెలిసిన వారి విషయమున చెప్పెదను. జన్మతిథ్యాదులు తెలియని వారికి ఘుణాక్షరముల వలె ఫలముండును. అటువంటి వారికి ప్రశ్నకాలము, నిమిత్తము మొదలగు వాటిచే ఫలోదయమగును. షష్ఠి, అష్టమి, ద్వాదశి, రిక్త, అమావాస్య, పూర్ణిమ, శుద్ధ పాడ్యమి ఈ తిథులలో ప్రయాణము చేయుట నిర్ధనమును క్షయమును కలిగించును. అనూరాధ, పూనర్వసు, మృగశిర, హస్త, రేవతి, అశ్వని, శ్రవణము, పుష్యమి, ధనిష్ఠ నక్షత్రములలో, ఏడు వరకు అయిదు మూడు మొదలగు వాటి యందు ప్రయాణము చేసిన అభీష్టఫలము సిద్ధించును. శనిసోమవారములలో తూర్పుదిక్కునకు, గురువారము దక్షిణమునకు, ఆది శుక్రవారములలో పశ్చిమమునకు, మంగళ బుధవారములలో ఉత్తరమునకు ప్రయాణము చేయరాదు. జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, రోహిణి ఉత్తరఫల్గునీ నక్షత్రములు తూర్పుదిశకు శూలలు. అనూరాధ హస్త, పుష్యమి, అశ్వనీ నక్షత్రములు పూర్వాదిదిక్కులకు క్రమముగా దిగ్ద్వార నక్షత్రములు. కృత్తికా నక్షత్రము నుండి ఏడింటి చొప్పున లెక్కించుచు ఏడు ద్వారనక్షత్రములుగా తెలియవలయును. పరిఘమ దాటవలయును. ఆగ్నేయ వాయవ్య దిక్కులకు పరిఘలో వెళ్ళరాదు. ఇట్లే విదిక్కుల విషయమున కూడా తెలియవలయును. మేషాది రాశులు మరల మరల దిగాశ్రయములగును. దిగధిపతి లలాటమున నుండగా ప్రయాణము చేసినవాడు తిరిగిరాడు. ప్రయాణలగ్నమున భాస్కరుడుండగా తూర్పు దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును.

పదకొండు, పన్నెండు స్థానములలో నుండు శుక్రుడు ఆగ్నేయ దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నము నుండి పదియవస్థానమున నున్న కుజుడు దక్షిణ దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. తొమ్మిది ఎనిమిది స్థానములలో నుండు రాహువు నైఋతి దిశకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నము నుండి ఎడింట నుండు శని పశ్చిమదిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నము నుండి అయిదు, ఆరు స్థానములలోనుండు చంద్రుడు వాయవ్యదిశకు వెళ్ళువానికి లలాటమును నుండును. రెండు మూడు స్థానములలో నుండు గురువు ఈశాన్య దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. బ్రతుకు మీద ఆశగలవాడు లాటమును పరిత్యజించి వెళ్ళవలయును. యాత్రా లగ్న సమీవర్తిగాకాని, విలోమగతునిగా కాని గ్రమమున్నపుడు యాత్రచేయు రాజునకు కార్యభంగమును కలిగించును. ఇట్లే ఆవర్గయైనను విలగ్నుడైనను ఇదే ఫలితము కలుగను. ఉత్తరాయన దక్షిణాయనములలో యాత్ర అనుకూలము. శుభప్రదము అనగా సూర్యచంద్రాయనములలో వెళ్ళుట యని భావము. అట్లుకానిచో దివారాత్రులలో యాత్రచేయవలయును. అట్లు కానిచో యాత్రచేయువానికి మరణము సంభవించును. శుక్రమూఢమున వెళ్ళినచో కార్యహాని సంభవించును. ప్రతి శుక్రునిలో పరాజయము కలుగును. ప్రతిశుక్రుని వలన కలుగు దోషమును ఏగ్రహములు తొలగించలేవు.

వాసిష్ఠ, కాశ్యప, ఆత్రేయ, భరద్వాజ, గౌతమ గోత్రముల వారికి ప్రతిశుక్ర దోషములేదు. ఒకే గ్రామమున వివాహమున, కరువులో, రాజవిరోధమున, బ్రాహ్మణక్షోభకలిగినపుడు, రాజులకు క్షోభ##యేర్పడినపుడు ప్రతి శుక్రదోషము లేదు. శుక్రుడు నీచస్థానగతుడైనను, శత్రుక్షేత్రమున నున్ననూ, వక్రగతుడైనను యాత్రచేయువానికి కార్యభంగమును కలిగించును. ఉచ్చగతుడైనచో జయమును కలిగించును. తన లగ్నమునకు అష్టమస్థానగతుడైనను, ఇష్టరాశి గతుడైనను శత్రురాశి నుండి అష్టమస్థానగతుడైనను, వాటి అధిపతిరాశిలో నున్ననూ యాత్ర చేయువానికి మరణము సంభవించును. జన్మేశుడు, అష్టమ లగ్నేశుడు పరస్పరము మిత్రులుగా నున్నచో జన్మరాశికి అష్టమరాశివలన కలుగు దోషములు నశించును. క్రూరగ్రహములచే చూడబడిననూ, కూడబడియున్ననూ, ద్విస్వభావము కలదైనను కార్యభంగమును కలిగించును. స్థిరోదయమున యానము పనికిరాదు. శుభగ్రహములు కలిసియున్ననూ, చూపు కలిగియున్ననూ ఇదియే ఫలితము. అంత్యనక్షత్రము నుండి అయిదు నక్షత్రములలోతృణకాష్ఠ సంగ్రహము, దక్షిణ దిగ్గమనము, శయ్య, గృహరక్షణను చేయరాదు. జన్మోదయమున, జన్మనక్షత్రమున, ఈ రెంటి అధిపతుల రాశిలో నక్షత్రములో కాని ఆరెంటివలన, ఆరెంటిలో సూర్యుడు ఇంద్రుడున్నపుడు యాత్ర చేసినవారి శత్రువు మరణించును. శీర్షోదయము లగ్నగతమైనపుడు, దిగ్లగ్నము లగ్నగతమైనపుడు కాని శుభవర్గము లగ్నమైనపుడు కాని యాత్రచేయువారి శత్రువులు నశింతురు. శత్రు జన్మోదయమున జన్మరాశికి నిధనోదయమైనపుడు ఈ రెంటి అధిపతులుండురాశిలో యాత్రచేయువారి శత్రువులు నశింతురు. మీనలగ్నమున వక్రమార్గమున్నపుడు యాత్రచేయువానికి మీనాంశలో నున్ననూ కుంభలగ్నము, కుంభాంశము యాత్రకు నింద్యములగును. జలయోనికి జలలగ్నము, జలాంశము శుభావహము. ధన్వికోశము మూర్తి వాహనము మంత్ర సంజ్ఞకమగును. శత్రుమార్గము వారి ఆయువు మనోవ్యాపార సంజ్ఞను పొందును. ఉదయము నుండి ప్రాప్తి అప్రాప్తియని ద్వాదశ భావములుండును. క్రూరములు ఆప్తిమార్గమును నశింపచేయును. సూర్యుడు కుజుడు భావములను నశింపచేయును. శుభగ్రహములు వ్యాపారహానిని చేయజాలరు.

శుక్రో7స్తం చ న పుష్ణాతి మూర్తిం మృత్యుం చ చన్ద్రమాః, యామ్యదిగ్గమనం త్యక్త్వా సర్వకాష్ఠాసు యాయినామ్‌. 651

అభిజితణయోగో7య మభీష్టఫలసిద్ధిదః, పంచాంగశుద్ధిరహితే దివసే7పి ఫలప్రదః. 652

యాత్రాయోగా విచిత్రాస్తాన్యోగాన్వక్ష్యే యత స్తతః, ఫలసిద్ధి ర్యాగలగ్నాత్‌ రాజ్ఞాం విప్రస్య ధిష్ణ్యతః. 653

ముహూర్తశక్తితో7న్యేషాం శకునై స్తస్కరస్య చ, కేన్ద్రత్రికోణ హ్యేకేన యోగ శ్శుక్రజ్ఞ సూరిణామ్‌. 654

అధియోగో భ##వేద్ద్వాభ్యాం త్రిభిర్యోగాధియోగకః, యోగే7పి యాయినాం క్షేమం అధియోగే జయో భ##వేత్‌. 655

యోగాధియోగే క్షేమం చ విజయార్ధ విభూతయః, వ్యాపార శత్రుమూర్తిస్థై శ్చన్ద్రమందదివాకరైః. 656

రణ గతస్య భూపస్య జయలక్ష్మీః ప్రమాణికా, శుక్రార్క జ్ఞార్కి భౌమేషు లగ్నాధ్వస్తత్రి శత్రుషు. 657

గతస్యాగ్రే వైరి చమూ ర్వహ్నౌ లాక్షేవ లీయతే, లగ్నస్థే త్రిదశాచార్యే ధనాయస్థైః పరగ్రహైః. 658

గతస్య రాజ్ఞో7రిసేనా నీయతే యమమందిరమ్‌, లగ్నే శుక్రే రవౌలాభే చంద్రు బంధుస్థితే యదా. 659

గతో నృపో రిపూన్హన్తి కేసరీవేభసంహతిమ్‌, స్వోచ్చసంస్థే సితేలగ్నే స్వోచ్చే చంద్రే చ లాభ##గే. 660

హంతి యాతో7రిపృతనాం కేశవః పూతనామివ, త్రికోణ కేంద్రగా స్సౌమ్యాః క్రూరాస్త్ర్యాయారిగా యది. 661

యస్య యాతేరలక్ష్మీస్త ముపైతీవాభిసారికా, జీవార్కచంద్రాలగ్నారి రంధ్రగా యది గచ్ఛతః. 662

తస్యాగ్రే ఖలమైత్రీవ న స్థిరా రిపువాహినీ, త్రిషడాయేషు మందారౌ బలవంత శ్శుభా యది. 663

యాత్రాయా భూపతేస్తస్య హస్తస్థా శత్రుమేదినీ, స్వోచ్చస్థే లగ్నగే జీవే చంద్రే లాభగతే యది. 664

గతో రాజా రిపూన్హన్తి పినాకీ త్రిపురం యథా, మస్తకోదయగే శుక్రే లగ్నస్థే లాభ##గే గురౌ. 665

గతో రాజా రిపూన్హంతి కుమారస్తారకం యథా, జీవే లగ్నగతే శుక్రే కేంద్రే వాపి త్రికోణగే. 666

గతో దహత్యరీన్రాజా కృష్ణవర్త్మా యథా వనమ్‌, లగ్నగేజ్ఞే శుభే కేంద్రే ధిష్ణ్యేచోకులే గతః. 667

నృపాశ్శుష్యన్త్యరీన్గ్రీష్మే హ్రాదినీం వార్కరశ్మయః, శుభే త్రికోణ కేన్ద్రస్థే లాభే చంద్రే7థవా రవౌ. 668

శత్రూన్హంతి గతో రాజా హ్యంధకారం యథా రవిః, స్వక్షేత్రగే శుభే కేన్ద్రే త్రికోణాయుగతే గతః. 669

వినాశయత్యరీన్రాజా తూలరాశి మివానలః, ఇందౌ స్వస్థే గురౌ కేంద్రే మంత్రస్సప్రణవో గతః. 670

నృపో హన్తి రిపూన్సర్వా న్పాపాన్పంచాక్షరో యథా, వర్గోత్తమ గతే శుక్రే7 ప్యేకస్మిన్నేన లగ్నగే. 671

హరిస్మృతి ర్య థాఫ°ఘా న్హన్తి శత్రూన్గతో నృపః, శుభే కేన్ధ్రే త్రికోణ్థు చంద్రే వర్గోత్తమే గతం. 672

స గోత్రారీన్నృపాన్హంతి యథా గోత్రాంశ్చ గోత్రభిత్‌, మిత్రభే7థ గురౌ కేంద్రే త్రికోణ స్థే7థవా సితే. 673

శత్రూన్హన్తి గతో రాజా భుజంగాన్గరుడోయథా, శుభ##కేన్ద్ర త్రికోణస్థే వర్గోత్తమగతే గతః. 674

వినాశయత్యరీన్రాజా పాపాన్భాగీరధీయథా, యే నృపా యాన్త్యరీన్జేతుం తేషాం యోగైర్నృపాహ్వయైః. 675

ఉపైతి శాంతిం కోపాగ్ని శ్శత్రుయోషాశ్రుబిందుభిః, బలక్షయ పక్షదశమీ మాసేషు విజయాభిధా. 676

విజయస్తత్ర యాతౄణాం సంధిర్వా న పరాజయః, నిమిత్తశకువాదిభ్యః ప్రధానం హి మనోదయః. 677

తస్మాన్మనస్వినాం యత్నాత్‌ ఫలహేతు ర్మనోదయః, ఉత్సవోపనయోద్వాహ ప్రతిష్ఠాశౌచసూతకే. 678

అసమాప్తే న కుర్వీత యాత్రాం మర్త్యోజి జీవిషుః, మహిషోందురయోర్యుద్ధే కలత్ర కలిహార్తవే. 679

వస్త్రాదే స్సలిలే క్రోదే దురుక్తే న వ్రజేన్నృపః, ఘృతాన్నం తిలపిష్టాన్నం మాత్స్యాన్నం ఘృత పాయసం. 680

ప్రాగాది క్రమశో భుక్త్వా యాతి రాజా జయత్యరీన్‌, సజ్జికా పరమాన్నం చ కాంజికం చ పయోదధి. 681

క్షీరం తిలోదనం భుక్త్వా భానువారాదిషు క్రమాత్‌, కుల్మాషాంశ్చ తిలాన్నం చ దధిక్షౌద్రం ఘృతం పయః. 682

మృగమాంసం చ తత్సారం పాయసం చ ఖగం మృగమ్‌, శశ మాంసం చ షాష్టిక్యం ప్రియంగుకమపూపకమ్‌. 683

చిత్రాండజఫలం కూర్మ శ్వావిద్గోధాంశ్చ శాశ్వకమ్‌, హవిష్యం కృశరాన్నం చ ముద్గాన్నం యవపిష్టికమ్‌. 684

మత్స్యాన్నం చ విచిత్రాన్నం దధ్యన్నంద ప్రభాత్క్రమాత్‌, భుక్త్వా రాజే భాశ్వరథ నరైర్యాతి జయత్యరీన్‌. 685

హుతాశనం తిలైర్హుత్వా పూజయేత దిగీశ్వరమ్‌, ప్రణమ్య దేవభూదేవా నాశీర్వాదైర్నృపో వ్రజేత్‌. 686

యద్వర్ణవస్త్ర గంధాద్యైస్తన్మంత్రేణ విధానతః, ఇంద్రమైరావతారూఢం శచ్యా సహ విరాజితమ్‌. 687

వజ్రపాణిం స్వర్ణవర్ణం దివ్యాభరణభూషితమ్‌, సప్తహస్తం సప్తజిహ్వం షణ్ముఖం మేషవాహనమ్‌. 988

స్వాహాప్రియం రక్తవర్ణం స్రుక్స్రువాయుధధారిణమ్‌, దండాయుధం లోహితాక్షం యమం మహిషవాహనమ్‌. 689

శ్యామలాసహితం రక్తవర్ణైరూర్ధ్వముఖం శుభమ్‌, ఖడ్గచర్మధరం నీలం నిఋతిం నరవాహనమ్‌. 690

ఊర్ధ్వకేశం విరూపాక్షం దీర్ఘగ్రీవాయుతం విభుమ్‌, నాగపాశధరం పీతవర్ణం మకరవాహనమ్‌. 691

వరుణం కాలికానాథం రత్నాభరణభూషితమ్‌, ప్రాణినాం ప్రాణరూపం తం ద్విబాహుం దండపాణికమ్‌. 692

వాయుం కృష్ణమృగారూఢం పూజయేదంజనీ పతిమ్‌, అశ్వారూఢం కుంభపాణిం ద్విబాహుం స్వర్ణసన్నిభమ్‌. 693

కుబేరం చిత్రలేఖేశం యక్షగంధర్వనాయకమ్‌, పినాకినం వృషారూఢం గౌరీపతిమనుత్తమమ్‌. 694

శ్వేతవర్ణం చంద్రమౌలిం నాగయజ్ఞోపవీతినమ్‌, అప్రయాణ స్వయం కార్యా ప్రేక్షయా భూభుజస్తథా. 695

కార్యం నిగమనం ఛత్రం ధ్వజశస్త్రాస్త్రవాహనైః, స్వస్థానాన్నిర్గమస్థానం దండానాం చ శతం ద్వయమ్‌. 696

చత్వారింశ ద్ద్వాదశైవ ప్రస్ధిత స్స స్వయం గతః, దినాన్యేకత్ర న వసేత్‌ సప్తషడ్వాపరో జనః. 697

పంచరాత్రం చ పురతః పునర్లగ్నాంతరే వ్రజేత్‌, అకాలజేషు నృపతి ర్విద్యుద్గర్జితవృష్టిషు. 698

ఉత్పాతేషు త్రివిధేషు సప్తరాత్రేషు న వ్రజేత్‌, రత్నాకుడ్య శివాకాక కపోతానాం గిరస్తథా. 699

ఝరే&ుభుక్‌ హేమ వక్షీర స్వరాణాం వామతో గతిః, పీత కార భరద్వాజ పక్షిణాం దక్షిణా గతిః. 700

చాపం త్యక్త్వా చతుప్పాత్తు శుభదా వామతో మతాః, కృష్ణంత్యక్త్వా ప్రయాణ తు కృకలాసేన వీక్షితః. 701

వారాహశశగోధాస్తు సర్పాణాం కీర్తనం శుభమ్‌, హృతేక్షణం నేష్టమేవా వ్యత్యయం కపిఋక్షయోః. 702

మయూర ఛాగ నకుల చాషా పారావతా శ్శుభాః దృష్టమాత్రేణ యాత్రాయాం వ్యస్తం సర్వం ప్రవేశ##నే. 703

యాయాత్రాసిద్ధిర్భవేద్దృష్టే శ##వే రోదనవర్జితే, ప్రవేశే రోదనయుత శ్శవశ్శవప్రదస్తథా. 704

పతిత క్లీబజటిల మత్తవాంతౌషధాదిభిః, అభ్యక్తవాసాస్థిచర్మాం గారా దారుణ రోగిభిః. 705

గుడకార్పాస లవణ రిపుప్రశ్నతృణోరగైః, వంధ్యాకుంజక కాషాయ ముక్తకేశ బుభుక్షితైః. 706

ప్రయాణసమయే నగ్నై ర్దృష్టస్సిద్ధిర్న జాయతే, ప్రజ్వలాగ్నీన్సుతురగం నృపాసనపురాంగనాః. 707

గంధపుష్పాక్షతచ్ఛత్ర చామరాందోలికం నృపః, భ##క్ష్యేక్షుఫలమృత్స్నాన్న మధ్వాజ్యదధిగోదయాః. 708

మద్యమాంస సుధాధౌత వస్త్రశంఖవృషధ్వజాః, పుణ్యస్త్రీపుణ్యకలశరత్నభృంగారగోద్విజాః. 709

భేరీ మృదంగం పటహ ఘంటావీణాది నిస్స్వనాః, వేదమంగలఘోషాస్స్యుర్యాయినాం కార్యసిద్ధిదాః. 710

శుక్రుడు అస్తమును పోషించడు. చంద్రుడు లగ్నమును ఆరవస్థానమును చంద్రుడు పోషించడు. దక్షిణ దిక్కుతప్ప ఇతరదిక్కులకు వెళ్ళువారికి ఈ నియమము వర్తించును. అభిజిత్‌క్షణయోగము సకలాభీష్టసిద్ధిని కలిగించును. పంచాంగ శుద్ధిరహితముగా నున్న దినసమున కూడా అభిజిద్యోగము ఫలప్రదమగును. యాత్రాయోగములు విచిత్రములుగా నుండును. ఇపుడా యోగములను చెప్పెదను. రాజులకు యాగలగ్నము వలన, బ్రాహ్మణునికి నక్షత్రము వలన, ఇతరులకు ముహూర్త బలము వనల, చోరులకు శకునముల వలన ఫలసిద్ధికలుగను. శుక్రుడు బుధుడు బృహస్పతి ఈ ముగ్గురిలో ఒకడు కేంద్రమున కాని త్రికోనమున కాని యున్నచో యోగమనబడును. ఇద్దరున్నచో తిధి యోగమనబడును. ముగ్గురున్నచో యోగాధియోగమనబడును. యోగమున యాత్రచేయువానికి క్షేమము, తిధియోగమున చేయువానికి జయము, యోగాధియోగమున చేయువానికి క్షేమము, విజయము, ధనము, సంపదలు కలగను. చంద్రుడు శని, సూర్యుడు 10, 6, 1 స్థానములలో నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజుకు విజయలక్ష్మి సిద్ధించును. శుక్రుడు, సూర్యుడు, బుధుడు, శని, కుజుడు లగ్న, అధ్వ, అస్త, త్రి, శత్రుస్థానములలో నున్నపుడు వెళ్ళిన రాజుముందు శత్రు సైన్యము అగ్నిలో లక్కవలె తరిగిపోవును. గురువు లగ్నమున నుండి, రెండు, పదకొండు స్థానములలో ఇతరగ్రహములుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు శ్రతు సైన్యమును నశింపచేయును. శుక్రుడు లగ్నమున, సూర్యుడు ఏకాదశ స్థానమున చంద్రుడు బంధుస్థానమున నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రుసైన్యమును సింహము ఏనుగుల గుంపును చంపునట్లు చంపును. లగ్నము స్వోచ్చమైనపుడు చంద్రుడు స్వోచ్చగతుడు, లేదా లాభగతుడైనపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు కృష్ణుడు పూతనను చంపినట్లు శత్రుసైన్యమును నశింపచేయును. శుభగ్రహములు త్రికోణ కేంద్ర గతులై, పాపగ్రహములు మూడు ఆరు పదకొండు స్థానములలో ఉన్నపుడు యుద్ధమునకు వెళ్ళినపుడు అభిసారిక వెంటపడునట్లు అపజయము కలుగను.

గురుడు, సూర్యుడు చంద్రుడు లగ్నశత్రురంధ్రస్థానములలో నుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజుముందు రి పుసైన్యము దుర్జనమైత్రి వలె స్ధిరముగా నుండజాలదు. శని కుజులు మూడు ఆరు పదకొండు స్థానములలో నుండి బలయుతులైనపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజునకు శత్రుసైన్యము అధీనమగును. గురువు ఉచ్చగతునిగా లగ్నమున నున్నపుడు చంద్రుడు లాభస్థానగతుడై యుండగా యుద్దమునకు వెళ్ళిన రాజు శంకరుడు త్రిపురాసురేని సంహరించినట్లు శత్రుసంహారమును గావించును. శుక్రుడు మస్తకోదయగతుడై గురువు లగ్నమున లేదా లాభస్థానమున నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు కుమారస్వామి తారకాసురుని సంహరించినట్లు శత్రువులను సంహరించును. గురువు లగ్నమున, శుక్రుడు కేంద్రమున కాని త్రికోణమున కాని యున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు అగ్నిహోత్రుడు వనమును దహించునట్లు శత్రుసైన్యమును దహింపచేయును. బుధుడు లగ్నమున నుండి, శుభగ్రహము కేంద్రమున నుండి, నక్షత్రము ఉపకులమున నుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజులు వేసవికాలములో సూర్యుడు నీటి మడుగులను ఎండజేసినట్లు శత్రు సైన్యమును శుష్కింపచేయును. శుభగ్రహములు త్రికోణమునకాని కేంద్రమునకాని యుండి లాభస్థానమున చంద్రుడుకాని సూర్యుడు కాని యున్నపుడు యుద్ధమును వెళ్ళిన రాజు సూర్యుడు చీకటిని హరింపచేసినట్లు శత్రువులను హరింపచేయును. శుభగ్రహము స్వక్షేత్రమునకాని, కేంద్రమున కాని, త్రికోణలాభస్థానములలో కాని యున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు అగ్నిహోత్రము దూదిని నశింపచేసినట్లు శత్రుసైన్యమును నశింపచేయును. చంద్రుడు స్వస్థానమున, గరువు కేంద్రమున నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు పంచాక్షరీ మంత్రము పాపములను హరింపచేయునట్లు శత్రువులను హరింపజేయును. శుక్రుడు వర్గోత్తమగతుడై, ఒక గ్రహము లగ్నములో నుండగా యుద్ధములకు వెళ్ళిన రాజు హరిస్మరణము పాపములను నశింపచేయునట్లు శత్రుసైన్యమును నశింపచేయును. శుభగ్రహము కేంద్రమున కాని త్రికోణము గాని యుండి చంద్రుడు వర్గోత్తమున నున్నపుడు యుద్ధమునకు బయలుదేరిన రాజు ఇంద్రుడు పర్వతములను కూల్చినట్లు శత్రువులను కూల్చును, గురువు మిత్రరాశిగతుడై, శుక్రుడు కేంద్రమున కాని త్రికోణమున కాని యున్నపుడు యుద్ధమును వెళ్ళినరాజు గరుడుడు సర్పములను సంహరించినట్లు శత్రువులను సంహరించును. శుభగ్రహము కేంద్రత్రికోణ స్థానగతుడై వర్గోత్తమమున నుండగా యుద్ధమునకు వెళ్ళినరాజు గంగ పాపములను హరించునట్లు శత్రువులను హరించును. ఇట్లు రాజులు రాజయోగములలో శత్రుసంహారమునకు వెళ్ళినచో వారికోపాగ్ని శత్రుస్త్రీల కన్నీటిచే శాంతించును. బలక్షయపక్షదశమి మాసములలో విజయయనబడును. ఈ విజయయోగమున యుద్ధమునకు వెళ్ళిన రాజునకు విజయము కాని శత్రువులతో సంధికాని జరుగును. పరాజయము మాత్రము సంభవించదు. నిమిత్తశకునాదుల వలన ముఖ్యమగు మనోదయము కలుగును. కావున బుద్ధిమంతులు ప్రయత్నముచే ఫలసిద్ధిని కలిగించు మనోదయమును సాధించెదరు. ఉత్సవము, ఉపనయనము, వివాహము, ప్రతిష్ఠాఆశౌచము, సూతకము ముగియకుండగా బ్రతుకగోరువాడు యాత్రకు బయలుదేర కూడదు. మహిషములన యుద్ధసమయమున, కళత్రకలహమున, కలత్రఋతు సమయమున, కట్టుకున్న వస్త్రము జారినపుడు. కోపమున్నపుడు, దుర్భాషలాడుచున్నపుడు రాజు యుద్ధమునకు బయలుదేరరాదు. నేతి అన్నమును, తిలపిష్టాన్నమును, మత్స్యాన్నమును, నేతిపాయసమును, తూర్పు మొదలగు దిక్కులలో వరుసగా భుజించి యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రువులను జయించును. సజ్జికను పరమాన్నమును, కాంజికమును, నీరు, పెరుగు, పాలు, తిలాన్నమును, ఆదివారము నుండు ఏడువారములలో క్రమము ననుసరించి భుజించవలయును. ఉలువలు, తిలాన్నను, పెరుగు . తేనె, నెయ్యి, పాలు, మృగమాంసము, దానిసారము, పాయసము , పక్షి , మృగము, కుందేటి మాంసము, షాష్టిక్యము, ప్రియంగు అపూపములు, చిత్రాండజఫలము, కూర్మము, ఏదు, ఉడుము, శాశ్వకము, హవిస్సు, కృసరాన్నము, పెసరపప్పు కలిపిన అన్నము, యవపిష్టము మత్స్యాన్నము, విచిత్రాన్నము, పెరుగన్నము, వీటిని అశ్వినీ నక్షత్రము నుండి ఇరువది ఏడు నక్షత్రములలో వరుసలో తిని రాజు రధ గజాశ్వపాదాలు దళములను తీసుకొని యుధ్ధమునకు వెళ్ళినచో శత్రువులను జయించగలుగును. అగ్నిహోత్రుని నువ్వులతో హోమముగావించి, దిక్పాలకులను పూజించి దేవతలకు, బ్రహ్మణులకు నమస్కరించి , వారి ఆశీర్వాదమును పొంది యుద్ధమునకు వెళ్ళవలయును. యే యే దేవతలకు ఏ యే వర్ణము గల వస్త్రముల గంధాదులచే, ఆయా మంత్రములచే యథావిధిగా పూజించవలయును. వజ్రాయుధమును ధరించి స్వర్ణవర్ణము కలిగి శచీదేవితో విరాజిల్లుచు, ఐరావతమునధిరోహించియున్న ఇంద్రుని, సప్తహస్తుడు, సప్తజిహ్వుడు, షణ్ముఖుడు, మేషవాహానుడు, స్వాహాప్రియుడు, రక్తవర్ణుడు, స్రుక్స్రువాయుధుడు అగు అగ్నిని , దండాయుధుడు, లోహితాక్షుడు, మహీషవాహనుడు, శ్యామలాసహితుడు, రక్తవర్ణములచే ఊర్ధ్వముఖుడు, శుభకరుడగు యముని, ఖడ్గచర్మధరుడు, నీలుడు, నరవాహుడు, ఊర్ధ్వకేశుడు, విరూపాక్షుడు, దీర్ఘగ్రీవుడు, ప్రభువు, అయిన నిఋతిని, నాగపాశధరుడు, పీతవర్ణుడు, మకరవాహనుడు, కాలికానాథుడు, రత్నాభరణభూషితుడు అగు వరుణుని ప్రాణుల పారణరూపమగు వాడు, ద్విబాహువు, దండపాణి ,కృష్ణమృగారూఢుడు ,అంజనీపతియగు వాయువును పూజించవలయును. అశ్వారూఢుడు కుంభపాణి, ద్విబాహువు, స్వర్ణవర్ణుడు, చిత్రలేఖేశుడు, యక్షగంధర్వ నాయకుడు అగుకుబేరుని , పినాకి, వృషారూఢుడు, గౌరీపతి, సర్వోత్తముడు, శ్వతవర్ణుడు, చంద్రమౌళి, నాగయజ్ఞోపవీతుడు, అగు శంకరుని యాత్రకు బయలు దేరు రాజులు స్వయముగా పూజించవలయును. ఛత్రధ్వజశస్త్రాస్త్రవాహనములచే నిగమనమును చేయవలయును. తమస్థానమున నుండి నిర్గమ స్థానము రెండు వందల దండప్రమాణ దూరముండవలయును. బయలు దేరిన వాడు నలుబది కాని పన్నెండు కాని వెళ్ళవలయును. ఆరేడు దినములు ఒకే చోట యుండరాదు. అయిదు దినములకన్నా ఎక్కువవున్నచో మరల శుభలగ్నమును చూచికొని బయలు దేరవలయును. అకాలమున మెరుపులు ఉరుములు వర్షములు సంభవించినచో భౌమాదివ్యాకాశ ఉత్పాతములు సంభవించినచో ఏడు దినములు బయలు దేరరాదు. రత్న కుడ్యముల, జంబుకముల కాకుల, కపోతముల అరుపులు వినినచో వామగతి, పీత, కరాభరద్వాజ పక్షుల దక్షిణగతి చాపమును వదలి చతుష్పాత్తు వామభాగమున వెళ్ళినచో శుభప్రదము, కృష్ణ వర్ణమును వదలి ప్రయాణమున తొండ చూచినచో , వరాహము, కుందేలు, ఉడుము, సర్పకీర్తనము శుభము. కపి భల్లూకములు కనులు మూసుకొని వచ్చిన అరిష్టము , కొమయూర, మేషము, ముంగిస పిట్ట, పావురములు, శుభములు, యాత్రలో చూచిన శుభము. ప్రవేశమున చూచినచో వ్యత్యయము జరుగును.

రోదన వర్జితమైన శవమును చూచినచో యాత్రాసిద్ధి కలుగును. ప్రవేశసమయమున రోదన సహిత మగు శవము శవప్రదము, పతితులు, సపుంసకులు, జటిలులు, మత్తులు, వాంతము, ఔషధాదులు, తలస్నానమును చేసినవారు, వస్త్రములు , ఎముకలు, చర్మము, అంగారములు, దారుణరోగులు, గుడము పత్తి లవణము, శత్రువులు, ప్రశ్నలు, తృణము, సర్పములు, గోడ్రాలు . కుంజము, కషాయధారులు, వెంట్రుకలు విరబోసుకొనినవారు ఆకలి గొన్నవారు నగ్నులు ప్రయాణసమయమున చూడబడినతో కార్యసిద్ధి జరుగును. మండుచున్న అగ్ని ఉత్తమాశ్వములు, సింహాసనము, పౌరస్త్రీలు, గంధపుష్పాక్షతములు, ఛత్రచామర ఆందోళికలు, భక్ష్యములు ఇక్షులు, ఫలములు, మృత్సాన్నము, మధువు, ఆజ్యము, దధి గోదయము, మద్యమాంస సుధా ధౌతవస్త్ర శంఖవృషభధ్వజములు, పుణ్యస్త్రీపుణ్యకలశ రత్న భృంగార గోద్విజులు, భేరీ మృదంగ పటహ ఘంటా వీణా నాదములు, వేదమంగలఘోషలు ప్రయాణసమయమున కలిగినచో కార్యసిద్ది ప్రదాయకములు.

అదౌ విరుద్దశకునం దృష్ట్వా యా యీష్టదేవతామ్‌. స్మృత్వా ద్వితీయే విప్రాణాం కృత్వా పూజాం నివర్తయేత్‌. 711

సర్వదిక్షు క్షుతం నేష్టం గోక్షుతం నిధనప్రదమ్‌, అఫలం యద్బాలవృద్ధరోగి పైనాసికైః కృతమ్‌. 712

పరస్త్రీ ద్విజదేవస్యం న స్సృశేద్దిగజాశ్వకాన్‌, హన్యాత్పర పుర ప్రాప్తో న స్త్రీర్నిత్యం నిరాయుధాన్‌. 713

ఆదౌ సౌమ్యాయనే కార్యం నవ వాస్తు ప్రవేశనమ్‌, విధాయ పూర్వదివసే వాస్తుపూజా బలిక్రియమ్‌. 714

మాఘఫాల్గునవైశాఖ జ్యేష్ఠమాసేసు శోభనమ్‌, ప్రవేశో మద్యమో జ్ఞేయ స్సౌమ్యకార్తీకమాసయోః.715

శశీ జ్యాంతేషు వరుణ త్వాష్ట్రమిత్ర స్ధిరోడుషు. శుభః ప్రవేశో దేవేజ్య శుక్రయోర్దృశ్యమానయోః. 716

వ్యర్కార వారే తిథిషు రిక్తామావర్జితేషు చ, దివా వా యది వా రాత్రే ప్రవేశో మంగలప్రదః 717

చంద్రతారా బలోపేతే పూర్వాహ్ణే శోభ##నే దినే, స్థిరలగ్నే స్థిరాంశే చ నైధనే శుద్ధిసంయుతే. 718

త్రికోణ కేంద్రసం స్ధై శ్చ సౌమైస్త్ర్యాయారిగైః పరైః లగ్నాంత్యాష్టము షష్ఠస్థ వర్జితేన హిమాంశునా. 719

కర్తుర్వా జన్మభే లగ్నే తాభ్యాముపచే7పి వా, ప్రవేశలగ్నే స్యాద్వృద్ధి రన్యభే శోకనిస్స్వతా. 720

దర్శనీయం గృహం రమ్యం వివిధైర్మంగలస్వనైః కృత్వార్కం వామతో విద్వా న్భృంగారం చాగ్రతో విశేత్‌. 721

వర్షాప్రవేశే శశిని జలరాశిగతే7పి వా, కేంద్రగే వా శుక్లపక్షే చాతివృష్టి శ్శుభేక్షితే. 722

అల్పవృష్టిః పాపదృష్టే ప్రావృడాలే7చిరాద్భవేత్‌, చంద్రశ్చేద్భార్గవే సర్వమేవం విధగుణాన్వితే. 723

ప్రావృషీన్దు స్సితా త్సప్త రాశిగ శ్శుభవీక్షితః, మందాత్త్రికోణ సప్తస్థో యది వా వద్ధికృద్భవేత్‌. 724

సద్యో వృష్టికరశ్శుక్రో యదా బుధ సమీపగః, తయోర్మధ్యగతే భానౌ భ##వేద్యృష్టి వినాశనమ్‌. 725

మఘాదిపంచ ధిష్ణ్యస్థః పూర్వే స్వాతి త్రయే పరే, ప్రవర్షణం భృగుః కుర్యా

ద్విపరీతే న వర్షణమ్‌. 726

పురతః పృష్ఠతో భానో ర్గ్రహా యది సమీపగాః, తదా వృష్టిం ప్రకుర్వన్తి న తే చేత్ప్రతిలో మగాః. 727

నామాభగస్ధిత శుక్రో వృష్టి కృచ్ఛేత్తు యామ్యగః, ఉదాస్తేషు వృష్టి స్స్యా ద్భానోరార్ద్రా పవేశ##నే. 728

సంధ్యయో స్సప్యవృద్ధి స్స్యా త్సర్వసంపన్నృణాం నిశి, స్తోకవృష్టిరనర్ఘస్స్యాదవృష్టి స్సప్యసంపదః. 729

ఆర్ద్రోదయోగ్రభిన్నాచేద్భవే తి న సంశయః, చంద్రే జ్యేజ్ఞేధ వా శుక్రే కేంద్రే వృష్టి ర్వినశ్యతి. 730

పూర్వాషాఢాంగతో భానుర్జీమూతైః పరివేష్టితః, వర్షత్వార్ద్రాది మూలాంతం ప్రత్యక్షం ప్రత్యహం తథా. 731

వృష్టిశ్చేత్పౌష్ణభే తస్మాద్దశ##రేషు న వర్షతి, సింహే భిన్నే కుజో వృష్టి రభిన్నె కర్కటే తథా. 732

కన్యోదయే ప్రభిన్నేచే సర్వదా వృష్టిరుత్తమా, అహిర్చుబధ్న్యం పూర్వసప్యం పరసప్యా చ రేవతీ. 733

భరణీ సర్వసప్యా చ సర్వనాశాయ చాశ్వినీ, గురోస్సప్తమరాశిస్థః ప్రత్యగ్గో భృగుజోయదా. 734

తదాతివర్షణం భూరి ప్రావృట్కాలే బలోజ్ఘితే, ఆసప్తమర శశినః పరివేషగతోత్తరా. 735

విద్యుత్ప్రపూర్ణమండుకా స్వనావృష్టి ర్భవేత్తదా, యదా ప్రత్యజ్‌ నతా మేఘా ఖసప్తోపరిసంస్థితాః. 736

పతంతి దక్షిణస్థాయే భ##వేద్వృష్టి స్తదాచిరాత్‌, నఖైర్లిఖన్తో మార్జరా శ్చావనిం లోహసంయుతే. 737

రధ్యాయాం సేతుబంధాస్స్యు బాలానాం వృష్టిహేతవః, పిపీలికా శ్రేణయశ్ఛిన్నాః ఖద్యోతా బహవస్తదా,

ద్రుమాది రోహస్సర్పాణాం ప్రీతిర్దుర్వృష్టి సూచకాః. 738

ఉదయాస్తమయే కాలే వివర్ణో7ర్కో7థవా శశీ, మధువర్ణో7తి వాయుశ్చేదతివృష్టిర్భవేత్తదా. 739

ప్రయాణము చేయువాడు మొదట విరుద్ధశకునములను చూచినచో ఇష్టదేవతాస్మరణమును చేయవలయును. ద్వితీయమున చూచినచో బ్రాహ్మణ పూజను చేయవలయును. తుమ్ము ఏ దిక్కు నుండి వినవచ్చినను శుభము కాదు. గోవు తుమ్మినచో మృత్యుప్రదము. బాలులు, వృద్ధులు, రోగులు, పిసునారులు తుమ్మినచో ఫలభంగము జరుగును. పరస్త్రీలను బ్రాహ్మణ దేవధనమును స్పృశించరాదు. శత్రుపురమును ప్రవేశించి నిరాయుధులను స్త్రీలను తప్ప గజాశ్వయోధులను సంహరించవచ్చును. నూతనగృహ ప్రవేశమును ఉత్తరాయణమున చేయవలుయను. మొదటిరోజు వాస్తు పూజను, బలిక్రియలను చేయవలుయను. మాఘ ఫాల్గున వైశాఖ జ్యేష్ఠ మాసములు శుభప్రదములు. సౌమ్య కార్తికమాసములు గృహప్రవేశమునకు మధ్యమములు. జ్యేష్ఠ, పుష్యమి, రేవతి, శతభిష, చిత్త, అనూరాధ, స్థిరనక్షత్రములలో ప్రవేశము శుభప్రదము. గురుశుక్రులు కనపడుచున్నపుడు ప్రవేశము చేయవలుయును. ఆది మంగళవారములు తప్ప ఇతరవారములలో రిక్త అమాభిన్న తిధులలో పగలు కాని రాత్రికాని ప్రవేశము శుభప్రదము. చంద్రతారాబలములున్న శుభదినమున పూర్వాహ్ణమున, స్థిరలగ్నమున స్థిరాంశమున సప్తమశుద్ధి యున్నపుడు, శుభగ్రహములు కేంద్రత్రకోణ గతులైనపుడు ఇతర గ్రహములు 3, 11, 6 స్థానములలో ఉన్నపుడు, చంద్రుడు లగ్నమున, ద్వాదశమున, అష్టమ షష్ఠ స్థానములలో లేనపుడు కర్తకు జన్మరాశి లగ్నమైనపుడు, ఆరెండు వృద్ధిలో యున్నపుడు ప్రవేశలగ్నమైనచో వృద్ధి కలుగును. ఇతర లగ్నమున దుఃఖదారిద్ర్యములు కలుగును. వివిధ మంగల వాద్యములచే గృహమును సుందరముగా అలంకరించవలయును. సూర్యుని వామభాగమున నుంచి, భృంగారమును ముందుంచుకొని చంద్రుడు వర్షాప్రవేశమున, జలరాశిగతుడైనపుడు కేంద్రమున నున్నపుడు, శుక్ల పక్షమున అయినచో శుభగ్రహవీక్షణమున్నచో అతివృష్టి కలుగును. వర్షకాలమున పాపదృష్టి యున్నచో అల్పవృష్టి కలుగను. చంద్రుడు శుక్రునితో కలిసియుండి ఇతర గుణములన్నియూ ఇట్లే యున్నచో, వర్షకాలమున చంద్రుడు శుక్రుడున్న రాశినుండి సప్తమస్థానమున నున్నచో శుభదృష్టి ఉండగా, శని నుండి త్రికోణమున కాని సప్తమస్థానమున కాని ఉన్నచో, వృద్ధికారకుడగుచో, శుక్రుడు బుధసమీపవర్తి అయినచో సద్యోవృష్టిప్రదుడగును. బుధశుక్రుల మధ్యన సూర్యుడున్నచో వృష్టినాశ##మేర్పడును. శుక్రుడు మఘాది పంచకమున నున్నను, స్వాతిత్రయమున నున్ననూ విపరీత వృష్టిని, అతివృష్టిని కలిగించును. సూర్యునికి ముందుకాని వెనుక కాని గ్రహములు సమీపమున నున్నచో ప్రతిలోమగతి లేనపుడు వర్షమును కురిపింతురు. వామ భాగమున నున్న శుక్రుడు దక్షిణదిశగా వెళ్ళుచున్నపుడు వృష్టికారకుడగును. ఉదయాస్తమయములలో సూర్యుడు ఆర్ద్రా ప్రవేశమును చేసినచో వృష్టి కలుగును. సంధ్యాసమయమున ఆర్ద్రాప్రవేశ##మైనచో సస్యవృద్ధియగును. రాత్రి ప్రవేశించినచో నరులకు సర్వసంపదలు కలుగును. కొద్దిగా వర్షించును. ధరలు పెరుగును. ఆర్ద్రోదయము ఉన్న భిన్నమయినచో అవృష్టి సస్యసంపదలు కలుగును. చంద్రుడుకాని, గురువుకాని, బుధుడుకాని, శుక్రుడుకాని కేంద్రగతుడగుచో వృష్టినాశము కలుగును. సూర్యుడు పూర్వాషాఢలో చేరినపుడు మేఘ పరివేష్టితుడై ఆర్ద్రనుండి మూలా నక్షత్రము వరకు ప్రతిదినము ప్రత్యక్షముగా వర్షమును కలిగించును. రేవతిలో నుండగా వర్షము కురియును. పదినక్షత్రములలో వృష్టియుండదు. సింహమున కుజుడు భిన్నుడైనచో వర్షము కురియును. కర్కటమున భిన్నుడు కానున్న కురియును. కన్యోదయమున ప్రఖిన్నమగుచో సర్వకాలవృష్టి యుండును. ఉత్తరాభాద్రలో పూర్వసస్యము, రేవతిలో పరసస్యము, భరణిలో సర్వసస్యములు వృద్ధిచెందును. అశ్వినిలో సస్యనాశ##మేర్పడును. శుక్రుడు గురువునకు సప్తమరాశిలో నుండి ప్రత్యక్‌ గమనమును చేసినచో ప్రావృట్కాల బలము లేకున్ననూ అతివృష్టి మిన్నగా కలుగును. చంద్రుడు ఏడవనక్షత్రము వరకు పరివేషగతుడగుచో మెరుపులు ఉరుములు కలిగి అనావృష్టి కలుగును. మేఘములు పశ్చిమ భాగమున వంగి ఖసప్తకమునకు ఉపరిభాగమున నున్నచో, దక్షిణస్థములుగా పతనమగుచో త్వరలో వర్షించును. లోహసంయుతమున మార్జారములు గోళ్ళతో భూమిని గీయునపుడు, నడుచుదారిలో సేతువు కట్టవలసినంత వర్షమేర్పడును. చీమలు బారు విడనపుడు ఎక్కువ మిడుతలున్నపుడు, సర్పములు చెట్లెక్కునపుడు దుర్వృష్టి కలుగును. ఉదయాస్తమకాలమున చంద్రుడుకాని సూర్యుడుకాని వివర్ణుడైనచో మధువర్ణుడైనను అతివాయువు, అతివర్షము సంభవించును.

ప్రాజ్ఞ్మఖస్య తు కూర్మస్య నవాంగేఘ ధరామిమామ్‌, విభజ్య నవధా ఖండే మండలాని ప్రదక్షిణమ్‌. 740

అంతర్వేదా శ్చపాంచాల స్త స్యేదం నాభిమండలమ్‌, ప్రాచ్యామాగధలాటోత్ధా దేశాస్తన్ముఖ మండలమ్‌. 741

స్త్రీ కలింగ కిరాతాఖ్యా దేశాస్తద్బహుమండలమ్‌, అవన్తీ ద్రవిడా భిల్లా దేశాస్తత్పార్శ్వ మండలమ్‌. 742

సింధుకాశి మహారాష్ట్ర సౌరాష్ట్రాః పుచ్ఛమండలమ్‌, పులిన్ద చీన యవన గుర్జరాః పాదమండలమ్‌. 743

కురు కాశ్మీర మాద్రేయ మత్స్యాస్తత్పార్శ్వ మండలమ్‌, ఖసాంగ బంగబాహ్లీక కాంభోజాః పాణి మండలమ్‌. 744

కృత్తికాదీని ధిష్ణ్యాని త్రీణి త్రీణి క్రమాన్న్యసేత్‌, నాభ్యాదిషు నవాంగేషు పాపైర్దుష్టం శుభైశ్శుభమ్‌. 745

దేవతా యత్రా నృత్యంతి పతంతి ప్రజ్వలంతి చ, ముహూ రుదంతి గాయన్తి ప్రస్విద్యంతి హసన్తి చ. 746

వమంత్యగ్నిం తథా ధూమం స్నేహం రక్తం పయోజలమ్‌, అధోముఖాథితిష్ఠన్తి స్థానాత్థ్యానం వ్రజన్తి చ. 747

ఏవమాద్యా హి దృశ్యన్తే వికారాః ప్రతిమాసు చ, గంధర్వనగరం చైవ దివానక్షత్రదర్శనమ్‌. 748

మహూల్కాపతనం కాష్ఠతృణరక్తప్రవర్షణమ్‌, గాంధర్వం గేహదిగ్ధూమం భూమికంపం దివా నిశి. 749

అన్నగ్నౌ చ స్ఫులింగాశ్చ జ్వలనం చ వినేన్ధనమ్‌, నిశీన్ద్రచాపమండూకం శిఖరే శ్వేతవాయసః. 750

దృశ్యంతే విశ్పులింగాశ్చ గోగజాశ్వేష్ట్రగాత్రతః, జంతవో ద్విత్రిశిరసో జాయంతే వాపి యోనిషు. 751

ప్రాతస్సూర్యశ్చతసృషు హ్యర్దితా యుగపద్రవేః, జంబూకగ్రామసంవాసః కేతూనాం చ ప్రదర్మనమ్‌. 752

కాకానామాకులం రాత్రౌ కపోతానాం దివా ది, అకాలే పుష్పితా వృక్షా దృశ్యంతే ఫలితా యది. 753

కార్యం తచ్ఛేదనం తత్ర తతశ్శాంతి ర్మనీషిభిః, ఏవమాద్యా మహోత్పాతా బహవస్థ్సాననాశదాః. 754

కేచిన్మృత్యుప్రదాః కేచిచ్ఛత్రుభ్యశ్చ భయప్రదాః, మధ్యాద్భయం యశో మృత్యుః క్షయః కీర్తి స్సుఖాసుఖమ్‌. 755

ఐశ్వర్యం ధనహానిశ్చ మధుచ్ఛన్నం చ వాల్మికమ్‌, ఇత్యాదిషు చ సర్వేఘాత్పాతేషు ద్విజసత్తమ. 756

శాంతిం కుర్యాత్ప్రయత్నేన కల్పోక్తవిధినా శుభమ్‌, ఇత్యేతత్కధితం విప్ర జ్యోతిషం తే సమాసతః. 757

అతః పరం ప్రవక్ష్యామి ఛన్దశ్శాస్త్ర మనుత్తమమ్‌. 758

ఇతి శ్రీబృహన్నారదీయపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే

ద్వితీయపాదే షట్పంచాశత్తమో7ధ్యాయః

తూర్పుముఖముగా నున్న కూర్మము యొక్క నవాంగముల యందు ఈ భూమిని నవఖండములుగా విభజించి మండలములుగా ఏర్పరిచిరి. అంతర్వేదములు పొంచాలములు ఆ కూర్మమునకు నాభిమండలము. ప్రాచ్యమాగధ లాటదేశములు కూర్మమునకు ముఖమండలము. స్త్రీ కలింగ కిరాతదేశములు బాహుమండలము. అవన్తిద్రవిడ భిల్లదేశములు ఒక పార్శ్వమండలము. సింధు, కాశి, మహారాష్ట్ర, సౌరాష్ట్రములు పుచ్ఛమండలము. పులిన్ద, చీన, యవన, గుర్జరదేశములు పాదమండలములు. కురుకాశ్మీర, మాద్రేయ మత్స్యదేశములు రెండవపార్శ్వమండలము. ఖసాంగ, బంగ బాహ్లీక కాంభోజదేశములు పాణిమండలము. ఇట్లు నాభి మొదలు కొని యున్న నవాంగములలో ఒక్కొక్క అవయవమునందు కృత్తికనుండి మూడు మూడు నక్షత్రముల నుంచవలయును. ఈ కూర్మాంగములందే దేవతలు నృత్మమును చేతురు. పడుదురు. జ్వలించుచుందురు. మాటిమాటికి రోదనము చేతరు గానము చేతరు స్వేదమును కలిగియుందురు నవ్వుదురు నిప్పులను కక్కుచుందురు ధూమమును కక్కుచుందురు. స్నేహమును, రక్తమును, పాలను, నీటిని కక్కుచుందురు అధోముఖులుగా నుందురు. ఒకస్థానము నుండి మరియొక స్థానమునకు వెళ్ళెదరు. ఇటువంటి వికారములు దేవతాప్రతిమలలో కూడా కనిపించుచుండును. గంధర్వనగరమును, పగలు నక్షత్రములను చూచుట, మహోల్కాపతనము, కాష్ఠ, తృణ, రక్తముల వర్షము, గాంధర్వము, దేహదిగ్ధూమము రాత్రిపగలను భూమికంపము అగ్నిలేనపుడు కూడా నిప్పురవ్వలు కలుగుట, కట్టెలు లేకుండా అగ్నిమండుట, రాత్రి ఇన్ద్రచాపము కనపడుట, శిఖరములందు తెల్లకాకులు కనపడుట, గో, గజ, అశ్వ, ఉష్ట్రముల శరీరముల నుండి స్ఫులింగములు వచ్చుట, రెండు, మూడు తలలు కల జంతువులు పుట్టుట, ప్రాతఃకాల సూర్యుడు నాలుగు దిక్కుల నుండి ఒకేసారి కనపడుట, నక్కలు ఊరిలో ఉండుట, ఆకాశమున కేతువులు కనపడుట, రాత్రిపూట కాకుల కలకలము, పగలు పావురముల కలకలము, అకాలమున పూచిన పండిన చెట్లు కనపడుట, ఇవియన్నియు మహూత్పాత సూచకములు. కావున బుద్ధిమంతులు అకాలమున కనపడిన పూలను పండ్లను వెంటనే కోయవలయును. ఈ ఉత్పాతములు నాశసూచకములు కొన్నిమృత్యుప్రదములు. కొన్ని శత్రువుల వలన భయమును కలిగించునవి. మధ్య నుండి అయినచో భయము, యశస్సు మృత్యువు, క్షయము, కీర్తి, సుఖము, దుఃఖము, ఐశ్వర్యము, ధనహాని ఈ ఫలములు పుట్టను తెనె కప్పియున్నచో కలుగును. కావున ఈ అన్ని ఉత్పాతముల విషమున కల్పోక్త విధిచే ప్రత్నముతో శాంతిని జరుపవలయును. ఓ బ్రాహ్మణోత్తమా! నీకు ఇట్లు సంగ్రహముగా జ్యోతిషాంగమును బోధించితిని. ఇక ఇపుడు సాటిలేని మహిమగల ఛందశ్శాస్త్రమును చెప్పెదను.

ఇది శ్రీబృన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున

బృహదుపాఖ్యానమున ద్వితీపాదమున

యాబదియారవ అధ్యాము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page