Sri Naradapuranam-I    Chapters    Last Page

సప్తపంచాశత్తమోధ్యాయః = యాబపదియేడవ అధ్యాయము

సంక్షిప్తఛందోవర్ణనమ్‌

సనందన ఉవాచ:-

వైదికం లౌకికం చాపి ఛందో ద్వివిధ్యముచ్చతే, మాత్రావర్ణవిభేదేన తచ్చాపి ద్వివిధం పునః. 1

మ¸° రసౌ తజౌ భనౌ గురుర్లఘురపి ద్విజ, కారణం ఛందపి ప్రోక్తాశ్ఛన్దశ్శాస్త్రవిశారదైః. 2

సర్వగో మగణః ప్రోక్తో ముఖలో యగణస్స్మృతః, మధ్యలో రగణశ్చైవ ప్రాంత్యగస్సగణో మతః. 3

తగణోస్తలఘుః ఖ్యాతో మధ్యగో జో భ ఆదిగః, త్రిలఘుర్నగణః ప్రోక్తస్త్రికా వర్మగణా మునే. 4

చతుర్ణాస్తు గణాః పంచ ప్రోక్తా ఆర్యాది సంమాతాః, సంయోగశ్చ విసర్గశ్చానుస్వారో లఘుతః పరః. 5

లఘోర్దీర్ఘత్వమాఖ్యాతి దీర్ఘోగో లోలఘుర్మతః, పాదశ్చతుర్ధభాగస్స్యాద్విచ్ఛేదో యతిరుచ్యతే. 6

సమమర్ధసమం వృత్తం విషమం చాపి నారద!, తుల్యలక్షణతః పాదచతుష్కే సమముచ్యతే. 7

ఆదిత్రికే ద్విచతుర్ధే సమమర్ధసమం తతమ్‌, లక్ష్మభిన్నం యస్య పాదచతుష్కే విషమం హి తత్‌. 8

ఏకాక్షరాత్సమారభ్య వర్ణైకైకస్య వృద్ధితః, షడ్వింశత్యక్షరం యావత్పాదస్తావత్పృథక్పృథక్‌. 9

తత్పరం చండవృష్ట్యాదిదండకాః పరికల్పితాః, త్రిభిష్షడ్భిః పదైర్గాథాః శృణు సంజ్ఞా యథోత్తరమ్‌. 10

ఉక్తాత్యుక్తా తథా మధ్యా ప్రతిష్ఠా న్యాసపూర్వికా, గాయత్రుష్ణిగనుష్ఠుప్చ బృహతీ పంక్తిరేవ చ. 11

త్రిష్ఠుప్చ జగతీచైవ తథాతిజగతీ మతా, శక్వరీ సాతిపూర్వా చ అష్ట్యత్యష్టీ తతస్స్మృతే. 12

ధృతిశ్చ విధృతిశ్చైవ వృతిః ప్రకృతిరాకృతిః, వకృతిస్సంకృతిశ్చైవ తధాతికృతిరుత్కృతిః. 13

ఇత్యేతా ఛందసాం సంజ్ఞా ప్రస్తారాద్భేదభాగికాః, పాదే సర్వగురౌ పూర్వాల్లఘుం స్థాప్య గురోరధ. 14

యథోపరి తథాశేషమగ్రే ప్రాగ్వన్య సేదపి. ఏష ప్రస్తార ఉదితః %ావత్సర్వలఘుర్భవేత్‌. 15

నష్టాంకార్ధే సమేలస్స్యాద్విషమే సైన సోర్ధ్వగః, ఉద్దిష్టే ద్విగుణా నాద్యాదంగాన్సంమీల్య లస్థితాన్‌. 16

కృత్వా సైకాన్వదేత్సంఖ్యామితి ప్రాహుః పురావిదః, వర్ణాన్సైనాన్వృత్తభవానుత్తరాధరతస్ధ్సితాన్‌. 17

ఏకాది క్రమతశ్చైకానుపర్యుపరి విన్యసేత్‌, ఉపాంత్యతో నివర్గేత త్యజన్నేకైకమూర్ధ్వతః. 18

ఉపర్యాద్యాద్గురోరేవమేకద్వ్యాదిలగాక్రియా, లగక్రియాంకపందోహే భ##వేత్సంఖ్యావిమిశ్రితే. 19

ఉద్దిష్టాంకసమాహారసై#్సకో వా జనయేదిమామ్‌, సంఖ్యైన ద్విగుణౖగోనా సద్భిరధ్వా ప్రకీర్తితః. 20

ఇత్యేతత్కించిదాఖ్యాతం లక్షణం చందసాం మునే, ప్రస్తారోక్తప్రభేదానాం నామానస్త్యం ప్రగాహతే. 21

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే బృహదుపాఖ్యానే

ద్వితీయపాదే సంక్షిప్తఛందోవర్ణనం నామ

సప్తపంచాశత్తమోధ్యాయః

సనందన మర్షి పలికెను:- ఓ నారద మహానునీ! ఛందస్సు వైదికము, లౌకికము అని రెండు విధములు. ఈ రెండు విధముల చందస్సు మాత్రా, వర్ణము అను భేదముచే మరల రెండు విధములు. ఛందశ్శాస్త్ర విశారదులు మగణము, యగణము, రగణము, సగణము, తగణము, జగణము, భగణము, నగణము అని ఎనిమిది గణములు. గురువు లఘువులు ఛందశ్శాస్త్రమునకు కారణములు అని చెప్పరి. మూడు గురువులు కలది మగణము. ఆది లఘువు యగణము. మధ్యలఘువు రగణము, అంత్యగురువు సగణము, అంత్యలఘువు తగణము, మధ్యగురువు జగణము, ఆది గురువు భగణము, మూడు లఘువులు కలది నగణము. ఒక్కొక్క గణమున మూడు వర్ణములుండును. నాలుగు లఘువులుకల గణములు అయిదున్నవీ ఆర్యాదిసమ్మతములు. సంయోగముకాని, విసర్గలు కాని, అనుస్వారము కాని లఘువు తరువాత ఉన్నచో ఆ లఘువు దీర్ఘమగును. దీర్ఘము గురువు. ల అనగా లఘువు. శ్లోకములోని నాలుగవభాగమును పాదమందురు. విచ్ఛేదమును యతి అందురు. వృత్తములు సమము, అర్థసమము, విషమము అని మూడు విధములు. నాలుగు పాదములు ఒకే లక్షణముతో నున్నెడల సమవృత్తమందురు. మొదటి మూడవపాదములు, రెండవ నాలుగవ పాదములు ఒకేవిధముగా నున్నచో అర్ధసమమందురు. ప్రతిపాదము వేరువేరు లక్షణములు కలిగియున్నచో విషమవృత్తమందురు. ఒక అక్షరము నుండి మొదలిడి ఒక్కొక్క అక్షరమును పెంచుచు ఇరువదియారు అక్షరముల వరకు పాదములు విడివిడిగా ఉండును. తరువాత చండవృష్టి మొదలగు దండదండకములు చెప్పబడినవి. మూడు ఆరు పాదములచే గాధలు చెప్పబడినవి. ఇపుడు వరుసగా ఆ ఛందస్సు పేర్లను చెప్పెదను వినుము. ఉక్త, అత్యుక్తా, మధ్యా, ప్రతిష్ఠా, సుప్రతిష్ఠ, గాయత్రీ, ఉష్ణిక్‌, అనుష్టుప్‌, బృహతి, పంక్తి, త్రిష్ఠుప్‌, జగతీ, అతిజగతి, శక్వరి, అతిశక్వరి, అష్ట, అత్యష్టా, ధృతి, విధృతి,కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంస్కృతి, అతికృతి, ఉత్కృతి అని ఛందస్సులకు సంజ్ఞలు ప్రస్తారమును బట్టి భేదమును పొందినవి. అన్నిగురువులు కలపాదమును తీసుకొని మొదటి నుండి గురువు క్రింద లఘువును నుంచవలయును. పైన చేసినట్లే ముందు కూడా మొదటి వలె నుంచవలయును. దీనినే ప్రస్తారమందురు. ఈ ప్రస్తారము అన్ని లఘువులు వచ్చేవరకు చేయవలయును. ప్రస్తారమున గురువునకు 8 చిహ్నముండును. లఘువునకు 1 చిహ్నముండును. నష్టాంకార్ధ సమమున లఘువుండును. విషమమున అదియే ఊర్ధ్వగమగును. ఉద్దిష్టమున మొదటినుండి రెట్టింపుగా అంకములను తీసుకొని లఘువులలో ఉన్నవాటిని కలిపి, ఆరెంటిని ఒకటిచేసి చెప్పవలును అని ప్రాచీనజ్ఞులు చెప్పెదరు. ఉత్తరాధరములుగా నున్న, వృత్తముల నుండి పుట్టిన వర్ణములను ఒకటి మొదలుకొని వరుసగా ఒక్కొక్కదాని ఉపరిభాగమున ఉంచవలును. చివరిదాని సమీపమున ఆపవలును. పై నుండి ఒక్కొక్క దానిని విడిచి పెట్టవలును. పై భాగమున మొదటి గురువునుండి ఒకటి రెండు మొదలగు లగక్రియలను చేయవలయును. అనగా లఘువు గురువులను ఉంచవలయును. లగక్రియాంక సందోహమును కలిపినచో సంఖ్యయగును. ఉద్దిష్టాంకము కాని సమహారము కాని, సైకము కాని ఈక్రియను కలిగించును. సంఖ్యయే ద్విగుణము, ఏకోనము అగును. అని సత్పురుషులు ఛందోమార్గమును బోధించిరి ఇట్లు కొంచెము ఛందస్సుల లక్షణమును చెప్పితిని, ప్రస్తారమున చెప్పబడిన భేదములకు అంతములేదని చెప్పబడినది.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున

బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున

సంక్షిప్త ఛందోవర్ణనమను

యాబదియేడవ ఆధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page