Sri Naradapuranam-I    Chapters    Last Page

ఏకోనషష్ఠితమో7ధ్యాయః యాబదితొమ్మిదవ అధ్యాయము

సనందన ఉవాచ:-

తతస్స రాజా సహితో మన్త్రిభిర్ద్విజసత్తమ!, పురః పురోహితం కృత్వా సర్వాణ్యంతఃపురాణి చ. 1

శిరసా చార్ఘ్యమాదాయ గురుపుత్రం సమభ్యగాత్‌, మహదాసనమాదాయ సర్వరత్నవిభూషితమ్‌. 2

ప్రదదౌ గురుపుత్రా శుకాయ పరమోచితమ్‌, తత్రోపవిష్టం తం కార్ణిం శాస్త్రదృష్టేన కర్మణా. 3

పాద్యం నివేద్య ప్రథమం సార్ఘ్యంగాం చ న్యవేదయత్‌, స చ తాం మంత్రతః పూజాం ప్రతిగృహ్య ద్విజోత్తమః. 4

పర్యపృచ్ఛన్మహాతేజా రాజ్ఞః కుశలమవ్యయమ్‌, ఉదారసత్త్వాభిజనో రాజాపి గురుసూననే. 5

ఆవేద్య కుశలం భూమౌ నిషసాద తదాజ్ఞయా, సో7పి వైయాసికిం భూయః పృష్ట్వా కుశలమవ్యయమ్‌. 6

కిమాగమనమిత్యేవ పర్యపృచ్ఛద్విధానవిత్‌.

సనందన మహర్షి పలికెను. అంతట జనక మహారాజు మంత్రులచే సమస్తాంతఃపుర జనముచే కూడి పురోహితుని ముందుంచుకొని శిరస్సుతో అర్ఘ్యమును తీసుకొని గురుపుత్రుని చేరెను. సర్వరత్నవిభూషితమగు ఉత్తమాసనమును గురుపుత్రుడగు శుకమహర్షి కొసంగెను. ఆసనముపై కూర్చొని యున్న వ్యాసపుత్రునికి శాస్త్రవిధానముతో మొదట పాద్యమునిచ్చి తరువాత అర్ఘ్యమును గోవును సమర్పించెను. బ్రాహ్మణోత్తముడగు శుకమహర్షి మంత్రుయుక్తమగు పూజను స్వీకరించి జనకమహారాజును అంతటా కుశలమునడిగెను. ఉదార స్వభావము కల జనకుడు కూడా గురుపుత్రునికి తమ క్షేమ సమాచారమును నివేదించి శుకమహర్షి అనుమతిని బొంది భూమి మీద కూర్చొనెను. తరువాత శుకమహర్షిని కుశలమడిగి రాకకు కారణమేమని విధానమును తెలిసిన జనకుడు అడిగెను.

పిత్రాహముక్తో భద్రం తే మోక్షధర్మార్ధకోవిదః. 7

విదేహరాజో హ్యాద్యో మే జనకో నామ విశ్రుతః, తత్ర త్వం గచ్ఛ తూర్ణం వై స తే హృదయసంశయమ్‌. 8

ప్రవృత్తౌ చ నివృత్తౌ చ సర్వం ఛేత్స్యత్యసంశయమ్‌, సో7హం పితుర్నియోగాత్త్వాముపప్రష్టుమిహాగతః. 9

తన్మే ధర్మభృతాం శ్రేష్ఠ యథావద్వక్తుమర్హతి, కిం కార్యం బ్రాహ్మణనేహ మోక్షార్ధశ్చ కిమాత్మకః. 10

కథం చ మోక్షః కర్తవ్యో జ్ఞానేన తపసాపి వా. 11

శుక మహర్షి పలికెను:- ఓ జనక మహారాజా! నీకు శుభమగుగాక! నా తండ్రి వేదవ్యాసుడు నాతో నాకంటే ముందువాడు విదేహ రాజగు జనకుడు మోక్షధర్మార్ధ కోవిదుడు. నీవు త్వరగా అతని వద్దకు వెళ్ళుము. అతను నీ సంశయములను తొలగించగలడు. ప్రవృత్తి మార్గమున నివృత్తి మార్గమున కలుగు అన్నిసందేహములను తొలగించగలడు అని చెప్పెను. అట్లు నా తండ్రి ఆజ్ఞవలన నేను నిన్ను అడుగుటకు ఇచటికి వచ్చితిని. కావున ఓ ధర్మజ్ఞుడా! బ్రాహ్మణుడు ఏమి చేయవలయును? మోక్షము ఏ స్వరూపము? మోక్షమును జ్ఞానముచే సాధించవలుయునా? తపస్సు చే సాధించవలయునా? ఎట్లు సాధించవలయును?

జనక ఉవాచ:-

యత్కార్యం బ్రాహ్మణనేహ జన్మప్రభృతి తచ్ఛృణ, కృతోపనయనస్తాత భ##వేద్వేదపరాయణః. 12

తపసా గురువృత్త్యా చ బ్రహ్మచర్యేణ చాన్వితః, దేవతానాం పితౄణాం చ హ్యతృష్టశ్చానసూయకః. 13

వేదానధీత్య నియతో దక్షిణామపవర్త్య చ, అభ్యనుజ్ఞామనుప్రాప్య సమావర్తేత వై ద్విజః. 14

సమావృత్తస్తు గార్హస్ధ్యే పదాలో నియతో వసేత్‌, అనసూయుర్యథా న్యాయం ఆహితాగ్నిరనాదృతా. 15

ఉత్పాద్య పుత్రపౌత్రాంశ్చ వన్యాశ్రమపదే భ##వేత్‌, తానేవాగ్నీన్యథాన్యాయం పూజయన్నతిథిప్రియః. 16

సర్వానగ్నీన్యథాన్యాయం ఆత్మన్యారోప్య ధర్మవిత్‌, నిర్ద్వంద్వో వీతరాగాత్మో బ్రహ్మాశ్రమపదే వసేత్‌. 17

జనక మహారాజు పలికెను :- బ్రాహ్మణుడు పుట్టినప్పటి నుండి చేవలసిన దానిని వినుము. ఉపనయనమును చేసుకొని వేదపరాయణుడు కావలును. గురువును సేవించుచు, తపస్సుచే బ్రహ్మచర్యముచే కూడినవాడై, ఆశ అసూయలేనివాడై దేవతలకు పితృదేవతలను ఆరాధించవలయును. జితేంద్రియుడై వేదాధ్యయనమును గావించి దక్షిణను సమర్పించి గురువాజ్ఞను పొంది ఇంటికి తిరిగిరావలయును. ఇల్లు చేరి వివాహము చేసుకొని భార్యతో నియమబద్ధ జీవితమును గడుపవలయును. ఆహితాగ్ని అయి అసూయను వదిలి శాస్త్రబద్ధముగా వ్యవహరించుచు పుత్రులను పౌత్రులను పొంది వానప్రస్థాశ్రమమును స్వీకరించవలుయను. ఆయగ్నినే న్యాయానుసారముగా పూజనుసలుపుచు అతిథిప్రియుడై అన్ని అగ్నులను ఆత్మలో ఆవేశింపచేసుకొని ధర్మములను తెలిసినవాడై ద్వంద్వములను వీడి, వైరాగ్యము నలవరుచుకొని బ్రహ్మాశ్రమమున వసించవలయును.

శుక ఉవాచ :-

ఉత్పన్నే జ్ఞానవిజ్ఞానే ప్రత్యక్షే హృది శాశ్వతే, న వినా గురుసంవాసాత్‌ జ్ఞానస్యాధిగమస్స్మృతః. 18

కిమవశ్యం తు వస్తవ్యమాశ్రమేషు న వా నృప, ఏతద్భవంతం పృచ్ఛామి తద్భవాన్వక్తుమర్హతి. 19

శుక మహర్షి పలికెను :- హృదయమున శాశ్వతమైన జ్ఞానము కలిగి విజ్ఞానము ప్రత్యక్షముకాగా అని చెప్పినచో గుర్వాశ్రమమున నివసించక జ్ఞానమును పొందలేరు కదా. ఆశ్రమమున తప్పక యుండవలయునా? అవసరము లేదా? ఈ విషమును మీరు చెప్పవలయును.

జనక ఉవాచ :-

న వినా జ్ఞానవిజ్ఞానే మోక్షస్యాధిగమో భ##వేత్‌, న వినా గురుసంబంధాత్‌ జ్ఞానస్యాధిగమస్తథా. 20

ఆచార్యః ప్లావితా తస్య జ్ఞానమం ప్లవ ఇహోచ్యతే, విజ్ఞాయ కృతకృత్యస్తు తీర్ణస్తత్రోభయం త్యేజేత్‌. 21

అనుచ్ఛేదాయ లోకానామనుచ్ఛేదాయ కర్మణామ్‌, కృత్వా శుభాశుభం కర్మ మోక్షో నామేహ లభ్యతే. 22

భావితైః కారణౖశ్చార్య బహుసంసారయోనిషు, ఆసాదయతి శుద్ధాత్మా మోక్షం హి ప్రథమాశ్రమే. 23

తమాసాద్య తు ముక్తస్య దృష్టార్ధస్య విపశ్చితః, త్రిధాశ్రమేషు కోన్వర్దో భ##వేత్పరమభీప్సతః. 24

రాజసాంస్తామసాంశ్చైవ నిత్యం దోషాన్విసర్జయేత్‌, సాత్త్వికం మార్గమాస్ధాయ పశ్యేదాత్మానమాత్మనా. 25

సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మనీ, సంపశ్యన్నైన లిప్యేత జలేవారిచరో యథా. 26

పక్షివత్పవనాదూర్ధ్వమముత్రానన్త్యమశ్నుతే, విహాయ దేహం నిర్ముక్తో నిర్ద్వన్ద్వశ్శుభసంగతః. 27

అత్ర గాధాః పురా గీతాశృణు రాజ్ఞా యయాతినా, ధార్యతే యా ద్విజైస్తాత మోక్షస్త్రవిశారదైః. 28

జ్యోతిశ్చాత్మని నాన్యత్ర రత్నం తత్రైన చైవ తత్‌, స్వయం చ శక్యం తద్ద్రష్టుం సుసమాహితచేతసా. 29

న బిభేతి పరో యస్మాత్‌ న బిభేతి పరాచ్చ యః, యశ్చ నేచ్ఛతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే స తు. 30

యదా భావం న కురుతే సర్వభూతేషు పాపకమ్‌, పూర్వైరాచరితో ధర్మశ్చతురాశ్రమసంజ్ఞకః. 31

అనేన క్రమయోగేన బహుజాతిసుకర్మణామ్‌, కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా. 32

సంయోజ్య తపసాత్మానమీర్ష్యాముత్సృజ్య మోహినీమ్‌, త్వక్త్వా కామం చ లోభం చ తతో బ్రహ్మత్వమశ్నుతే. 33

యదా శ్రావ్యే చ దృశ్యే చ సర్వభూతేషు చావ్యయమ్‌, సమో భవతి నిర్ద్వన్ద్వో బ్రహ్మ సంపద్యతే తదా.34

యదా స్తుతిం చ నిన్దాం చ సమత్వేన చ పశ్యతి, కాంచనం చాయసం చైన సుఖదుఃఖే తథైవ చ. 35

శీతముష్ణం తథైవార్ధమనర్ధం ప్రియమప్రియమ్‌, జీవితం మరణం చైన బ్రహ్మ సంపద్యతే తదా. 36

ప్రసార్యేహ యథాంగాని కూర్మస్సంహరతే పునః, తథేంద్రియాణి మనసా సంయంతవ్యాణి భిక్షుణా. 37

తమః పరిగతం వేశ్మ యథా దీపేన దృశ్యతే, తథా బుద్ధిప్రదీ పేన శక్య ఆత్మా నిరీక్షితుమ్‌. 38

ఏతత్సర్వం ప్రపశ్యామి త్వయి బుద్ధిమతాం వర, యచ్చాన్యదపి నేత్తవ్యం తత్త్వతో వేత్తి తద్భవాన్‌. 39

బ్రహర్షే విదితశ్చాపి విషయాన్తముపాగతః, గురోశ్చైవ ప్రసాదేన తవ చైవోపశిక్షయా. 40

తస్య చైవ ప్రసాదేన ప్రాదుర్భూతం మహామునేః, జ్ఞానం దివ్యం సమాదీప్తం తేనాసి విదితో మమ. 41

అధికం తన విజ్ఞానమధికావగతిస్తవ, అధికం చ తవైశ్వర్యం తచ్చ త్వం నావబుధ్యసే. 42

బాల్యాద్వా సంశయాద్వాపి భయాద్యాపి విమేషజాత్‌, ఉత్పన్నే చాపి విజ్ఞానే నాధిగచ్ఛంతి తాం గతిమ్‌. 43

వ్యవసాయేన శుద్ధేన మద్విధైశ్చిన్నసంశయాః, విముచ్య హృదయగ్రంథీనార్తిమాసాదయంతి తామ్‌. 44

భవాంశ్చోత్పన్నవిజ్ఞానస్ధ్సిరబుద్ధిరలోలుపః, వ్యవసాయాదృతే బ్రహ్మన్నాసాదయతి తత్పదమ్‌. 45

నాస్తి తే సుఖదుఃఖేషు విశేషో నాస్తి వస్తుషు, వౌత్సుక్యం నృత్యగీతేషు న రాగ ఉపజాయతే. 46

న బంధషు నిబంధస్తే న భ##యేష్వప్తి తే భయమ్‌, పశ్యామి త్వాం మహాభాగ తుల్యనిందాత్మసంస్తుతిమ్‌. 47

అహం చ త్వానుపశ్యామి యే చాన్యే7పి మనీషిణః, ఆస్ధితం పరమం మార్గే అక్షయం చాప్యనామయమ్‌. 48

యత్ఫలం బ్రాహ్మణస్యేహ మోక్షార్ధశ్చాపదాత్మకః, తస్మిన్వై వర్త సే విప్ర కిమన్యత్పరిపృచ్ఛసి. 49

జనక మహారాజు పలికెను :- జ్ఞానవిజ్ఞానములు లేనిచో మోక్షము లభించదు. అట్లే గురుసంబంధము లేనిచో జ్ఞానము లభించదు. ఆచార్యుడు తరింపచేయువాడు. జ్ఞానము పడవ. జ్ఞానము పొంది కృతకృతుడై తరింపచేయు వానిని పడవను విడిచి పెట్టవలయును. లోక సంగ్రహము కొరకు, కర్మసంగ్రహము కొరకు శుభాశుభకర్మలనాచరించిన తరువాత మోక్షము లభించును. సంసారమున బహు జన్మలలో కలిగిన కారణములచే కరణములచే చరింపవలయును. పరిశుద్ధాత్ముడు ప్రథమాశ్రమముననే మోక్షమునందగలడు, అట్లు మోక్షమును పొంది, ముక్తుడై జ్ఞానియై పండితుడైన వానికి, పరము యందు అభిలాష కలవానికి మిగిలిన మూడాశ్రమములచే పనియేమి? ఎల్లపుడు రాజస తామస దోషములను విడువవలయును. సాత్త్వికమార్గమున నిలిచి ఆత్మచే ఆత్మను చూడవలయును. అన్నిప్రాణులలో ఆత్మను, అన్నిప్రాణులను ఆత్మలో చూచుచు సంబంధమును పెట్టుకొనరాదు. దృష్టాంతము జలచరమునకు జలమంటదుకదా! ఆకాశమున వాయువుపైన పక్షివలె ఉన్నచో ఈ లోకమున ఆనస్త్యమును పొందగలడు. శీతోష్ణాది ద్వంద్వములను దాటి సంసార బంధనిర్ముక్తుడై శుభసంగతుడై దేహమును విడిచును. ఈ విషయమున యయాతి మహారాజు పూర్వము కొన్ని గాధలను చెప్పియుండెను. వాటిని వినుము. మోక్ష శాస్త్రార్ధ విశారదులకు బ్రాహ్మణులు ఆ గాధలను ఎప్పడూ హృదయమున ధరించుచుందురు. ఆత్మలోనే జ్యోతి ఉండును. మరియొక చోట ఉండదు. రత్నము అచటనే ఉండును. ఆత్మయే రత్నము. సావధానమనస్కుడు స్వయముగా ఆత్మదర్శనమును చేయగలడు. ఎవనికి పరము భయపడదో, పరము వలన ఎవడు భయపడడో, ఎవడు కోరడో, ద్వేషించడో వాడు బ్రహ్మ యగును. అన్ని భూతములందు పాపభావమును చేయని వాడు పూర్వులాచరించిన నాలుగాశ్రమములనాచరించువాడు, ఈ క్రమముతో బహుపుణ్యకర్మలను చేయువాడు, త్రికరణశుద్ధి కలవాడు బ్రహ్మయగును. మోహమును కలిగించు ఈర్ష్యను విడిచి, తపస్సుచే ఆత్మను సంయోజింపచేసి కామలోభములను విడిచినవాడు బ్రహ్మత్వమును పొందును. శ్రవ్య విషమున, దృశ్య విషయమున, సర్వభూతములయందు అవ్యయుని చూచుచు సమ బుద్ధి కలవాడై ద్వంద్వభావమునతిక్రమించిన వాడు బ్రహ్మయగును. స్తుతినిందలను సమముగా చూడగలిగిననాడు, బంగారమును ఇనుమును, సుఖదుఃఖములను, శోతోష్ణములను, అర్ధఅనర్ధములను, ప్రియాప్రియములను, జన్మమృత్యువులను సమములుగా చూడగలిగిననాడు బ్రహ్మకాగలడు. జ్ఞానియగువాడు తాబేలు తన అవయవములను బయటకు చాచి మరల లోనికి ముడుచుకొనునటుల మనసుచే ఇంద్రియములను ఉపసంహరింపచేసుకొనవలయును. చీకటి అలుముకున్న ఇంటిని దీపము ప్రకాశింపచేయునటుల బుద్ధిదీపముచే ఆత్మను చూడగలము. ఓ బుద్ధిమంతుడా! ఇది యంతయూ నీలో కనపడుచున్నది. ఇంకనూ తెలియవలసిన ఇతర విషయములను కూడా నీవు తెలిసియే యున్నావు. ఓ బ్రహ్మర్షీ! నీవు విషయములను త్యజించితివని నాకు తెలిసినది. గురువు గారి అనుగ్రహము వలన నీ శుశ్రూష వలన నీకు అంతయూ తెలిసినది. నాకు కూడా గురువుగారి అనుగ్రహము వలననే జ్ఞానము ప్రకాశించుచున్నది. ఆ దివ్య జ్ఞానముచే నీవు తెలియబడితివి. నీకు అధిక జ్ఞానము, అధికముగా గ్రహణశక్తి కలదు. నీ ఐశ్వర్యము కూడా అధికమే. కాని దానిని నీవు తెలియుట లేదు. బాల్యము వలననో, సంశయము వలననో, భయము వలననో, వ్యామోహము వలననో జ్ఞానము కలిగిననూ దానిని తెలియజాలరు. పరిశుద్ధమైన వ్యవసాయముచే, నాలాంటి వారిచే సంశయములను తొలగించుకొని హృదయగ్రంథులను విడిచి, ఆ యార్తిని పొందగలరు. నీవు కూడా జ్ఞానము కలవాడవు. స్థిరబుద్ధివి. విషయలోలుపుడవు కావు. కావున వ్యవసాయము లేనిదే బ్రహ్మపదము లభించదు. నీకు సుఖదుఃఖములందు విశేష బుద్ధి లేదు. వస్తువులందు, నృత్యగీతాదుల యందు ఔత్సుక్యము లేదు. రాగము కలుగుట లేదు. బంధువుల యందు బంధము లేదు. భయములందు భయమూ లేదు. ఓ మహానుభావా! నీవు నిందాస్తుతులను సమముగా చూచువాడవని నాకు తెలిసి పోయినది. నేను ఇతర జ్ఞానులు నీవు ఉత్తమము అక్షయము అనామయమగు మార్గముననుసరించువాడవని తెలిసియున్నారు. బ్రాహ్మణుడు పొందదగిన ఫలము, మోక్షార్ధము అయిన బ్రహ్మయందే యున్నావు. ఇంకనూ ఏమడుగుచున్నావు?

సనందన ఉవాచ :-

ఏతచ్ఛ్రుత్వా తు వచనం కృతాత్మా కృతనిశ్చయః, ఆత్మవాత్మానమాస్ధాయ దృష్ట్వా చాత్మానమాత్మనా. 50

కృతకార్యస్సుఖీ శాస్తస్తూష్ణీం ప్రాయాదుదజ్ఞ్ముఖః, శైశిరం గిరిమాసాద్య పారాశర్యం దదర్శ చ. 51

శిష్యానధ్యాపయంతం చ పైలాదీన్వేదసంహితాః, ఆరణీయో విశుద్ధాత్మా దివాకరసమప్రభః. 52

పితుర్జగ్రాహ పాదౌ చ సాదనం హృష్టమానపః, తతో నివేదయామాస పితుస్సర్వముదారధీః. 53

శుకో జనకరాజేన సంవాదం మోక్షసాధనమ్‌, తచ్ఛ్రుత్వా వేదకర్తాసౌ ప్రహృష్టేనాంతరాత్మనా. 54

సమాలింగ్య సుతం వ్యాసం స్వపార్శ్వస్ధం చకార చ. 55

తతః పైలాదయో విప్రా వేదావ్వ్యాసాదధీత్య చ, శైలిశృంగాద్భువం ప్రాప్తా యాజనాధ్యాపనే రతాః. 56

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణ పూర్వభాగే

బృహదుపాఖ్యానే ద్వితీయభాగే

ఏకోనషష్ఠితమో7ధ్యాయః

సనందన మహర్షి పలికెను :- ఇట్లు శుకమహర్షి జనక మహారాజు మాటలను విని కృతాత్ముడై, దృఢనిశ్చయము గలవాడై ఆత్మచే ఆత్మను చేరి, ఆత్మను ఆత్మచే దర్శించి, కృతకృత్యుడై, ఆనందమును పొంది, శాంతుడై, ఊరకనే ఉత్తరాభిముఖుడై వెడలిపోయెను. హిమవత్పర్వతమును చేరి, పరాశర పుత్రుడగు వ్యాసమహర్షిని చూచెను. పైలాది బ్రాహ్మణులకు వేదమును అధ్యాపనము చేయుచున్న వ్యాస భగవానుని పాదములను, పరిశుద్ధాత్ముడు భాస్కరసమతేజుడు, అరణీగర్భ సంభూతుడగు శుకమహర్షి సంతోషముచే గ్రహించి ఉదారబుద్ధితో జనకమహారాజుతో జరిగిన మోక్ష సంవాదమునంతను నివేదించెను. వేదకర్తగు వ్యాసుడు దానినంతటిని విని సంతోషించిన మనసుచే పుత్రుని ఆలింగనము చేసుకొని తన ప్రక్కన కూర్చుండబెట్టెను. పైలాది బ్రాహ్మణులు వేదవ్యాసమహర్షి వలన వేదాధ్యయనమును గావించి హిమవత్పర్వతము నుండి భూమండలమునకు చేరి యజ్ఞములను చేయించుచు, వేదాధ్యపనమును గావించుచుండిరి.

Sri Naradapuranam-I    Chapters    Last Page