Sri Naradapuranam-I
Chapters
Last Page
షష్ఠో೭ధ్యాయః ఆరవ అధ్యాయము గంగామహాత్య్మమ్ సూత ఉవాచ:- భగవద్భక్తిమహాత్య్మం శ్రుత్వా ప్రీతస్తు నారదః, పునః పప్రచ్ఛ సనకం జ్ఞానవిజ్ఞానపారగమ్. సూత మహర్షి పలికెను:- భగవద్భక్తిమాహత్మ్యమును విని సంతోషించిన నారదమహర్షి మరల జ్ఞానవిజ్ఞానసంపన్నుడైన సనకమహర్షిని ఇట్లు అడిగెను. క్షేత్రాణాముత్తమం క్షేత్రం తీర్థానాం చ తథోత్తమమ్, పరయా దయయా తథ్యం బ్రూహి శాస్త్రార్థపారగ ! 2 నారద మహర్షి పలికెను:- ఓ శాస్త్రర్థపారగా! మిక్కిలి దయతో నాకు అన్ని క్షేత్రములలో ఉత్తమక్షేత్రమును గూర్చి, అన్ని తీర్థములలో ఉత్తమ తీర్థమును గూర్చి సత్యమును చెప్పుము. 2 సనక ఉవాచ:- శృణు బ్రహ్మన్పరం గుహ్యం సర్వసంపత్కరం పరమ్ , దుస్స్వప్ననాశనం పుణ్యం ధర్మ్యం పాపహరం శుభమ్. 3 శ్రోతవ్యం మునిభిర్నిత్యం దుష్టగ్రహనివారణమ్, సర్వరోగ్పరశమనమాయుర్వర్ధన కారణమ్. 4 క్షేత్రాణాముత్తమం క్షేత్రేం తీర్థానాం చ తథోత్తమమ్, గంగాయమునయోర్యోగం వదన్తి పరమర్షయః. 5 సితా సితోదకతీర్థం బ్రహ్మాద్యాస్సర్వదేవతాః, మునయో మనవశ్చైవ సేవన్తే పుణ్యకాంక్షిణః 6 గంగా పుణ్యనదీ జ్ఞేయా యతో విష్ణుపదోద్భవా, రవిజా యమునా బ్రహ్మంస్తయోర్యోగశ్శుభావహః. 7 స్మృతార్తినాశినీ గంగా నదీనాం ప్రవరా మునే, సర్వపాపక్షయకరీ సర్వోపద్రవనాశినీ. 8 యాని క్షేత్రాణి పుణ్యాని సముద్రాంతే మహీతలే, తేషాం పుణ్యతమం జ్ఞేయం ప్రయాగాఖ్యాం మహామునే. 9 ఇయాజ వేధా యజ్ఞేన యత్ర దేవం రమాపతిమ్, తథైవ మునయస్సర్వే చక్రుశ్చ వివధాన్మఖాన్. 10 సనకమహర్షి పలికెను:- ఓ బ్రహ్మణోత్తమా !పరమరహస్యము సర్వసంపదలను ప్రసాదించునది. దుస్స్వప్నములను నశింప చేయునది, పుణ్యకరము, ధర్మమును కలిగించునది, పాపములను హరించునది, శుభకరము, దుష్టగ్రహములను నివారించునది అయిన ఈ విషయము మునులందరూ వినదగినది. అన్ని రోగములను నివారించునది, ఆయుష్యమును పెంచునది. అన్ని క్షేత్రములలో ఉత్తమక్షేత్రము, అన్నితీర్థములలో ఉత్తమతీర్థము గంగాయమున సంగమ స్థలమగు ప్రయాగ అని పరమర్షులందరూ చెప్పెదరు. తెలుపు నలుపు నీరు గల ఈ ప్రదేశమును, తీర్థమును, బ్రహ్మ మొదలగు దేవతలు, మునులు, మనువులు పుణ్యమును కోరి సేవింతురు. విష్ణుపాదమునుండి పుట్టినది కావున గంగ పుణ్యనది. సూర్యుని వలన పుట్టినది యమునానది. ఆ రెంటి కలయిక అన్ని శుభములను చేకూర్చును. తలచిన వారి తారములను తొలగించు గంగ అన్ని నదులలో ఉత్తమమైనది. అన్ని పాపములను నశింపచేయునది. అన్ని ఉపద్రవములను హరింపచేయునది. సముద్రము వరకు వ్యాపించియున్న భూమండలమున నున్న అన్ని క్షేత్రములలో పరమ పవిత్రమైన క్షేత్రము ప్రయాగక్షేత్రము. ఈ ప్రయాగ క్షేత్రముననే బ్రహ్మ యజ్ఞములతో శ్రీమన్నారాయణుని పూజించెను. అట్లే మునులందరూ పలు విధములైన యజ్ఞముల నాచరించిరి. 3-10 సర్వతీర్థాభిషేకాణి యాని పుణ్యాని తాని వై, గంగాబిన్ద్వభిషేకస్య కలాం నార్హన్తి షోడశీమ్. 11 గంగా గంగేతి యో బ్రూయాద్యోజనానాం శ##తే స్థితః, సో ೭పి ముచ్యేత పాపేభ్యః కిము గంగాభిషేకవాన్. 12 విష్ణుపాదోద్భవా దేవీ విశ్వేశ్వరశిరస్థ్సితా, సంసేవ్యా మునిభిర్దేవైః కింపునః పామరైర్జనైః 13 యత్సైకతం లలాటే తు ధ్రియతే మనుజోత్తమైః, తత్రైవ నేత్రం విజ్ఞేయం విధ్వర్థాధ స్సముజ్జ్వలత్. 14 యన్మజ్జనం మహాపుణ్యం దుర్లభం త్రిదివౌకసామ్, సారూప్యదాయకం విష్ణోః కిమస్మాత్కథ్యతే పరమ్. 15 యత్ర స్నాతాః పాపినో೭ పి సర్వపాపవివర్జితాః, మహాద్విమానమారూఢాః ప్రయాన్తి పరమం పదమ్. 16 యత్ర స్నాతా మహాత్మానః పితృమాతృకులాని వై, సహస్రాణి సముద్ధృత్య విష్ణులోకే వ్రజన్తి వై. 17 స స్నాతః సర్వతీర్థేషు యో గంగాం స్మరతి ద్విజ, పుణ్యక్షేత్రేషు సర్వేషు స్థితవాన్నాత్ర సంశయః. 18 యత్ర స్నాతం నరం దృష్ట్వా పాపో ೭పి స్వర్గభూమిభాక్, యదంగస్పర్శమాత్రేణ దేవానామధిపో భ##వేత్ . 19 తులసీమూలసంభూతా ద్విజపాదోద్భవా తథా, గంగోద్భవా తు మృల్లోకాన్నయత్యచ్యుతరూపతామ్. 20 ఈ భూమండలమున నున్న సమస్త పుణ్యతీర్థాభిషేకము గంగా బింద్వభిషేకములోని 16 వ అంశతో కూడా సమానము కాదు. నూరు యోజనములు దూరములో (800 ల మైళ్ళు) నున్నవాడు కూడా గంగా గంగా అని గంగా నామమును స్మరించినచో పాపములనుండి విడివడునున్న గంగానదిని దేవతలు మునులు కూడా సేవింతురు. ఇక పామరుల విషయమేమి ? గంగానది యొక్క ఇసుక (మట్టి) లలాట భాగమున ధరించినచో అక్కడనే శివుని లలాటమున అర్థచంద్రునికి క్రింది భాగమున ప్రకాశించు మాడవనేతర్ముండునునని తెలియుము. గంగానదిలో మునిగి స్నానము చేయుట గొప్ప పుణ్యమును ప్రసాదించును. గంగాస్నానము దేవతలకు కూడా దుర్లభము. గంగాస్నానము విష్ణు సారూప్యమును ప్రసాదించును. ఇంతకంటే ఎక్కువగా చెప్పవలసినదేమున్నది. గంగానదిలో స్నానము చేసినచో పాపులు కూడా అన్ని పాపములను బోనాడి మహావిమానము నధిరోహించి పరమ పదమును పొందెదరు. గంగానదిలో స్నానము చేసినవారు వేల పితృకులములను మాతృకులములను ఉద్ధరించి విష్ణులోకమును చేరెదరు. గంగను స్మరించినవాడు అన్ని తీర్థములలో స్నానము చేసినవాడే . అన్ని పుణ్యక్షేత్రములలో నివాసము చేసినవాడే . ఈ విషయమున సంశయముతో పనిలేదు. గంగానదిలో స్నానమాడినవానిని దర్శించిన పాపి కూడా స్వర్గమును పొందును. గంగాజలమును తాకినవాడు దేవతలకు కూడా అధిపతి యగును. తులసీవృక్ష మూలమున ఉన్న మట్టి , బ్రహ్మణపాదమున ఉన్న మట్టి, గంగానదిలోని మట్టి జనులకు అచ్యుత సారూప్యమును ప్రసాదించును. 11-20 గంగా చ తులసీ చైవ హరిభక్తిరచంచలా. అత్యన్తదుర్లభా నౄణాం భక్తిర్థర్మప్రవక్తరి. 21 సద్ధర్మవన్తుః పదసంభవాం మృదం గంగోద్భవాం చైవ తథా తులస్యాః, మూలోద్భవాం భక్తియుతో మనుష్యో ధృత్వా శిరస్యేతి పదం చ విష్ణోః, 22 కదా యాస్మామ్యహం గంగాం కదా పశ్యామి తామహమ్, వాంఛత్యపి చయో హ్యేవం సో ೭పి విష్ణుపదం వ్రజేత్. 23 గంగాయా మహిమా బ్రహ్మన్వక్తుం వర్షశ##తైరపి, న శక్యతే విష్ణునాపి కిమన్యైర్బహుభాశితైః. 24 అహో! మాయా జగద్సర్వం మోహయత్యేతదద్భుతమ్, యతో వై నరకం యాంతి గంగానామ్ని స్థితే ೭పి హి . 25 సంసారదుఃఖవిచ్ఛేది గంగానామ ప్రకీర్తితమ్, తథా తులస్యా భక్తిశ్చ హరికీర్తిప్రవక్తరి. 26 సకృదపుచ్చరేద్యస్తు గంగేత్యేవాక్షరద్వయమ్, సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం సగచ్ఛతి. 27 యోజనత్రితయం యస్తు గంగాయామధిగచ్ఛతి, సర్వపాపవినిర్ముక్తః సూర్యలోకం సమేతి హి. 28 సేయం గంగా మహాపుణ్యా నదీ భక్త్యా నిషేవితా, మేషతాలిమృగార్కేషు పావయత్యఖిలం జగత్. 29 గోదావారీ భీమరథీ కృష్ణా రేవా సరస్వతీ, తుంగభద్రా చ కావేరీ కాలిందీ బాహుదా తథా. 30 వేత్రవతీ తామ్రపర్ణీ సరయూశ్చ ద్విజోత్తమ ! ఏవమాదిషు తీర్థేషు గంగా ముఖ్యతమా స్మృతా. గంగానది, తులసి, స్థిరమైన విష్ణుభక్తి మానవులకు మిక్కిలి దుర్లభములు. అట్లే ధర్మమును బోధించు వానియందు భక్తి కలుగుట కూడా దుర్లభ##మే. సద్ధర్మమును బోధించువాని పాదధూళిని, గంగనుండి వచ్చిన మృత్తికను, తులసిమాల మృత్తికను భక్తితో శిరసున దాల్చినవాడు విష్ణులోకమునకేగును. ''నేనెపుడు గంగానదికి వెళ్లెదను? ఎపుడు గంగానదిని చూచెదను''. అని మనసులో పరితపించువాడు కూడా విష్ణులోకమును చేరును. గంగా మహాత్మ్యమును కొన్ని వందల సంవత్సరములు శ్రీమహావిష్ణువునకు కూడా చెప్ప శక్యముకాదు. ఇక ఇతరులేమి చెప్పగలరు ? ఈ మాయ ప్రపంచమునంతటిని మోహింప చేయుచున్నది. ఎంత ఆశ్చర్యము. గంగానామమున్ననూ లోకులు నరకమునకు వెళ్ళుట ఎంత ఆశ్చర్యము ! గంగా నామము, తులసీ నామము, హరికథలను చెప్పువారియందు భక్తి సంసార దుఃఖమును సమూలముగా తొలగించును. 'గంగా' అను రెండు అక్షరములను ఒక్కమారు పలికినను అన్ని పాపములు తొలగి విష్ణులోకమును పొందును. గంగానదిలో మూడు యోజనములు పయనించినవాడు అన్ని పాపములను బోనాడి సూర్యలోకమును చేరును. పరమపవిత్రమైన ఈ గంగానదిని మేషతులామకరలలో సూర్యుడున్నప్పుడు సేవించినచో సమస్త జగత్తును పావనము చేయును. గోదావరి, భీమరథీ, కృష్ణ, రేవ, సరస్వతి, తుంగభద్ర, కావేరి, కాళింది, బాహుద, వేత్రవతి. తామ్రపర్ణి సరయూ మొదలగు పుణ్యతీర్థము లన్నింటిలో ప్రధానమైనది గంగానది. 21-31 యథా సర్వగతో విష్ణుర్జగద్వాప్య ప్రతిష్ఠితః, తథేయం వ్యాపినీ గంగా సర్వపాపప్రణాశినీ. 32 అహో గంగా జగద్ధాత్రీ స్నానపానాదిభిర్జగత్, పునాతి పావనీత్యేషా న కథం సేవ్యతే నృభిః. 33 తీర్థానాముత్తమం తీర్థం క్షేత్రాణాం క్షేత్రముత్తమమ్. వారాణసీతి విఖ్యాతం సర్వదేవనిషేవితమ్. 34 తే ఏవ శ్రవణ ధన్యే సంవిదాతే బహుశ్రుతమ్, ఇహ శ్రుతిమతాం పుంసాం కాశీ యాభ్యాం శ్రుత్వా೭ సకృత్. 35 యే యం స్మరన్తి సంస్థానమ్ అవిముక్తం ద్విజోత్తమ, నిర్ధూతసర్వపాపాస్తే శివలోకం వ్రజన్తి వై. 36 యోజనానాం శతస్థో ೭పి అవిముక్తం స్మరేద్యది. బహుపాతకపూర్ణో೭ పి పదం గచ్ఛన్త్యనామయమ్. 37 ప్రాణప్రయాణసమయే యో೭ విముక్త స్మరేద్ద్విజ, సో ೭పి పాపవినిర్ముక్తశ్శైవం పదమవాప్నుయాత్. 38 కాశీస్మరణజం పుణ్యం భుక్త్వా స్వర్గే తదన్తతః, పృథివ్యామేకరూడ్భూత్వా కాశీం ప్రాప్య చ ముక్తిభాన్. 39 బహునాత్ర కిముక్తేన వారాణస్యా గుణాన్ప్రతి, నామాపి గృహ్ణతి కాశ్యాశ్చతుర్వర్గో న దూరతః. 40 గంగాయమున యోర్యోగో೭ ధికః కాశ్యా అపి ద్విజ, యస్య దర్శనమాత్రేణ నరా యాంతి పరాం గతిమ్. 41 సర్వగతుడైన శ్రీమహావిష్ణువు జగత్తునంతటిని వ్యాపించియుండునట్లు ఈ జగత్తునంతటిని వ్యాపించియున్న గంగ అన్ని పాపములను నశింపచేయును. జగత్తును ధరించు గంగానది స్నానపానాదులతో జగత్తును పావనముచేయును. కావున పావనమైన గంగనెందుకు సేవించరు? వారణాసి అన్ని తీర్థములలో ఉత్తమతీర్థము, అన్ని క్షేత్రములలో ఉత్తమ క్షేత్రము. దేవతలందరిచే సేవించబడునది. చెవులున్నావారందరి చెవులలో కాశీనామమును చాలామార్లు విన్న చెవులే చాల శాస్త్రములను విన్న చెవులగును. కాశీనామమును నిశ్చల మనస్సుతో స్మరించువారు అన్ని పాపములను త్రోసి శివలోకమును చేరెదరు. నూరు యోజనముల దూరమున నున్నవాడు కూడా భక్తితో కాశీనామమును స్మరించినచో బహుపాతకములున్నవాడైనను నాశనము లేని లోకమును చేరును. ప్రాణములు పోవు సమయమున కాశీనామమును స్మరించువాడు పాపములను నశింప చేసుకొని శివలోకమును చేరును. కాశీస్మరణము వలన వచ్చిన పుణ్యమును స్వర్గమును అనుభవించి తరువాత పృథివికి చక్రవర్తి అయి కాశిని చేరి ముక్తిని పొందును. వారాణాసీ గుణములను ఏమని చెప్పవలయును. కాశీనామమున తలచిననూ ధర్మార్థకామమోక్షలను పురుషార్థ చతుష్టయము అందుబాటులో ఉండును. ఇంతటి మహిమ గల వారణాసి కంటే గంగా యమునా సంగమము ఉత్తమమైనది. ఈ సంగమమును చూచినంతనే ఉత్తమ గతిని పొందెదరు. 32-41 మకరస్థే రవౌ గంగా యత్ర కుత్రావగహితా, పునాతి స్నానపానాద్యైర్నయన్తీన్ద్రపురం జగత్. 42 యో గంగాం భజతే నిత్యం శంకరో లోకశంకరః, లింగరూపే కథం తస్యా మహిమా పరికీర్త్యతే. 43 హరిరూపధరం లింగం లింగరూపధరో హరిః, ఈషదప్యన్తరం నాస్తి భేదకృచ్చానయోః కుధీః. 44 అనాదినిధనే దేవే హరిశంకరసంజ్ఞితే, అజ్ఞానసాగరే మగ్నా బేదం కుర్వన్తి పాపినః. 45 యో దేవో జగతామీశః కారణానాం చ కారణమ్, యుగాన్తే జగదత్యేతద్రుద్రరూపధరో విభుః. 46 రుద్రో వై విష్ణురూపేణ పాలయత్యఖిలం జగత్, బ్రహ్మరూపేణ సృజతి తదత్త్యేవ స్వయం హరః. 47 హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః, భేదం కరోతి సో ೭భ్యేతి నరకం భృశదారుణమ్. 48 హరిం హరం విదాతారం యః పశ్యత్యేకరూపిణమ్, స యాతి పరమానన్దం శాస్త్రాణా మేష నిశ్చయః. 49 యో೭ సావనాదిస్సర్వజ్ఞో జగతామాదకృద్విభుః, నిత్యం సన్నిహితస్తత్ర లింగరూపీ జనార్దనః. 50 మకరసంక్రమణ కాలమున గంగానదిలో ఏ ప్రాంతమున స్నానము చేసినను, గంగా జలపానము చేసిననూ స్వర్గము లభించును. ఎల్లప్పుడు ధరించుచున్నందుననే శంకరుడు లోకమునకు శుభములను కలిగించగలుగుచున్నాడు. లింగ రూపమును ధరించి గంగాభిషేకము చేయుచున్నాడు. అటువంటి గంగా మహాత్మ్యమును ఎట్లు వర్ణించగలము. లింగమే హరి రూపము ను ధరించును. హరియే లింగ రూపమును ధరించును. ఈ రెండు రూపములకు ఏ మాత్రము భేదములేదు. భేదమును చెప్పువాడు దుష్టబుద్ధియే. హరి శంకరనామలతో నుండేడు దేవులు ఆద్యంతములు లేనివారే. అజ్ఞాన సముద్రమున మునిగిన పాపులు వారిద్దరికి భేదమును చెప్పెదరు. జగదీశ్వరుడు, అన్ని కారణములకు కారణమైన ఆదిదేవుడైన ప్రభువే యుగాంతకాలమున రుద్రరూపముతో ఈ జగత్తును సంహరింపచేయును. ఆ రుద్రుడే మరల విష్ణురూపముతో సమస్త ప్రపంచమును కాపాడును. బ్రహ్మరూపమున ప్రపంచమును సృష్టించును. దీనిని హరుడే స్వయముగ సంహరించును. హరిహరులలో బ్రహ్మలో భేదమును చూచువాడు, చెప్పువాడు నరకమును పొందును. హరిని హరుని బ్రహ్మను ఏకరూపముగా చూచువాడు పరమానన్దమును పొందునని శాస్త్రనిర్ణయము. ఆదిలేనివాడు సర్వజ్ఞుడు జగత్తును సృష్టించువాడు, ప్రభువు అయిన పరమాత్మలో లింగరూపియైన జనార్దనుడు అతర్లీనముగా ఉన్నవాడే. 42-50 కాశీవిశ్వేశ్వరం లింగం జ్యోతిర్లింగం తదుచ్యతే, తం దృష్ట్వా పరమం జ్యోతిరాప్నోతి మనుజోత్తమః. 51 కాశీప్రదక్షిణా యేన కృతా త్రైలోక్యపావనీ, సప్తద్వీపా సాబ్ధిశైలా భూః పరిక్రమితామునా. 52 ధాతుమృద్దారుపాషాణలేఖ్యాద్యా మూర్తయో೭ మలాః, శివస్య వాచ్యుతస్యాపి తాసు స్ననిహితో హరిః. 53 తలసీకాననం యత్ర యత్ర పద్మవనం ద్విజ ! పురాణపఠనం యత్ర తత్ర సన్నిహితో హరిః. 54 పురాణసంహితావక్తా హరిరిత్యభిధీయతే , తద్భక్తిం కుర్వతాం నౄణాం గంగాస్నానం దినే దినే. 55 పురాణశ్రవణ భక్తిర్గంగాస్నానపమా ద్విజ, తద్వక్తరి చ యా భక్తిః సా ప్రయాగోపమా స్మృతా. 56 పురాణధర్మకథనైర్యస్సముద్ధరతే జగత్, సంసారసాగరే మగ్నం స హరిః పరికీర్తితః. 57 నాస్తి గంగాసమం తీర్థం నాస్తి మాతృహమో గురుః, నాస్తి విష్ణుసమం దైవం నాస్తి తత్త్వం గురోః పరమ్. 58 వర్ణానాం బ్రహ్మణశ్రేష్ఠ స్తారకాణాం యథా శశీ, యథా పయోధిస్సింధూనాం తతా గంగా పరా స్మృతా. 59 నాస్తి శాంతిపమో బన్ధుర్నాస్తి సత్యాత్పరం తపః, నాస్తి మోక్షాత్పరో లాభో నాస్తి గంగాసమా నదీ. 60 కాశీ విశ్వేశ్వర లింగమును జ్యోతిర్లింగమందురు. ఆ జ్యోతిర్లింగమును దర్శించినవారు పరంజ్యోతిని చేరెదరు. మూడు లోకములను పవిత్రము చేయు కాశీని ప్రదక్షిణము చేసినవారు ఏడు ద్వీపములతో సముద్రములతో పర్వతములతో కూడియున్న భూమిని ప్రదక్షిణము చేసిన వారగుదురు. ధాతురూపము, మృద్రూపము, పాషాణరూపము, చిత్రరూపము అయిన శివుని ప్రతిమలు , విష్ణువు ప్రతిమలు పరమపావనములు. ఆ ప్రతిమలలో శ్రీహరి సన్నిహితముగా నుండును. తులసీ తోటలోను , పద్మములతోటలోను పురాణ పఠనముచోట శ్రీహరి సన్నిహితుడై యుండును. పురాణసంహితను చెప్పువారు సాక్షాత్తు శ్రీహరియే అని అనబడును. పురాణమును చెప్పువారియందు భక్తి నిలుపువారికి ప్రతినిత్యము గంగాస్నానము చేసిన ఫలితము లభించును. పురాణశ్రవణము నందలి భక్తి గంగాస్నానముతో సమము. పురాణమును చెప్పువారి యందున్న భక్తి ప్రయాగతో సమానము. సంసారసాగరములో మునిగియున్న జగత్తును పురాణ ధర్మములను చెప్పుచు ఉద్ధరించువారు సాక్షాత్తు శ్రీహరియే అని కీర్తించబడుదురు. గంగతో సాటివచ్చు తీర్థము లేదు. తల్లితో సాటివచ్చు గురువు లేడు. విష్ణువుతో సాటివచ్చు దైవము లేదు. గురువును మించిన తత్వము లేదు. నక్షత్రములలో చంద్రునివలె వర్ణములలో బ్రహ్మణుడు శ్రేష్ఠుడు. నదులలో సముద్రము వలె గంగానది ఉత్తమమైనది. శాంతితో సాటివచ్చు బంధువు, సత్యమును మించిన తపస్సు, మోక్షమును మించిన లాభము గంగతో సాటివచ్చు నది లేదు. 51-60 గంగాయాః పరమం నామ పాపారణ్యదవానలః, భవవ్యాధిహరా గంగా తస్మోత్సేవ్యా ప్రయత్నతః. 61 గాయత్రీ జాహ్నవీ చోభే సర్వపాపహరే స్మృతే, ఏతయోర్భక్తిహీనో యస్తం విద్యాత్పతితం ద్విజ. 62 గాయత్రీ ఛన్దసాం మాతా మాతా లోకస్య జాహ్నవీ, ఉభే తే సర్వపాపానాం నాశకారణతాం గతే. 63 యస్య ప్రసన్నా గాయత్రీ తస్య గంగా ప్రసీదతి, విష్ణుశక్తియుతే తే ద్వే సమ కామప్రసిద్ధిదే. 64 ధర్మార్థకామరూపాణాం ఫలరూపే నిరంజనే, సర్వలోకానుగ్రహార్థం ప్రవర్తతే మహోత్తమే. 65 అతీవదుర్లభా నౄణాం గాయత్రీ జాహ్నవీ తథా, తధైవ తులసీ భక్తిర్హరిభక్తిశ్చ సాత్త్వికీ. 66 అహో గంగా మహాభాగా స్మృతా పాపప్రణాశినీ, హరిలోకప్రదా దృష్టా పీతా సారూప్యదాయినీ. 67 యత్ర స్నాతా నరా యాంతి విష్ణోః పదమనుత్తమమ్. నారాయణో జగద్ధాతా వాసుదేవస్సనాతనః, గంగాస్నానపరాణాం తు వాంఛితార్థఫలప్రదః. 68 గంగాజలకణనాపి యస్సిక్తో మనుజోత్తమః, సర్వపాపవినిర్ముక్తః ప్రయాతి పరమం పదమ్. 69 యద్బిన్దుసేవనాదేవ సగరాన్వయసంభవః, విసృజ్య రాక్షసం భావం సంప్రాప్తః పరమం పదమ్. 70 ఇతి శ్రీ బృహన్నారదీయపురాణ పూర్వభాగే ప్రథమ పాదే గంగామహాత్మ్యం నామ షష్ఠో೭ధ్యాయః గంగానామము పరమ పవిత్రమైనది. పాపారణ్యమునకు దావాగ్నివంటిది. సంసారమను వ్యాధిని హరించగలది. కావున ప్రయత్నముతో సేవించదగినది. గాయత్రీ గంగ అను ఈ రెండు సర్వపాపములను హరించగలవి. ఈ రెంటియందు భక్తి లేనివానిని పతితులిగా తెలియుము. గాయత్రి ఛందోమాత, గంగ లోకమాత. ఈ రెండు సర్వపాపములను నశింపచేయును. గాయత్రి ప్రసన్నమైనచో గంగ ప్రసన్నమగును. ఈ రెండు విష్ణుశక్తితో కూడియుండును. కావున అన్ని కోరికలు తీర్చును. ఈ రెండు ధర్మార్థకామములను ఫలములము ఇచ్చును. అన్ని లోకములను అనుగ్రహించుటకు ప్రవర్తించుచున్నవి. గాయత్రి జాహ్నవి అను ఈ రెండు నరులకు పరమ దుర్లభములు. ఇట్లే సాత్త్వికమైన విష్ణుభక్తి, తులసీ భక్తి కూడా దుర్లభములే. మహానుభావురాలైన గంగను స్మరించినచో పాపములను నశింపచేయును. దర్శించినచో హరిలోకము లభించును. గంగాజలమును పానము చేసినచో విష్ణుసారూప్యమును ప్రసాదించును. గంగానదిలో స్నానము చేసినవాడు విష్ణులోకమును పొందును. జగత్తును ధరించువాడు, సనాతనుడు వాసుదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు గంగాస్నానము చేయువారు కోరిన పురుషార్థములనిచ్చును. గంగాజలబిందువును శిరసున ధరించినవాడు అన్ని పాపములను బోనాడి పరమ పదమును చేరును. గంగాజలబిందువును సేవించినందువలననే సగర వంశమున పుట్టిన సౌదాసుడు రాక్షసభావమును విడిచి మోక్షమును పొందెను. ఇది శ్రీబృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామహాత్య్మమను ఆరవ అధ్యాయము సమాప్తము.