Sri Naradapuranam-I    Chapters    Last Page

సప్తమోధ్యాయః ఏడవ అధ్యాయము

గంగామహాత్మ్యమ్‌

నారద ఉవాచ :-

కోసౌ రాక్షసభావాద్ధి మోచితః సగరాన్వయే, సగరః కో మునిశ్రేష్ఠ! తన్మమాఖ్యాతుమర్హసి. 1

నారద మహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్ఠా ! సగరవంశమున రాక్షసభావమునుండి విముక్తుడైన వాడెవడు ? సగరుడెవరు ? ఆదియంతయు నాకు వివరించుము.

సనక ఉవాచ :-

శృణుష్వ మునిశార్దూల గంగామహాత్మ్యముత్తమమ్‌, యజ్జలస్పర్శమాత్రేణ పాలితం సాగరం కులమ్‌. 2

గతం విష్ణుపదం విప్ర సర్వలోకోత్తమోత్తమమ్‌.

éఅసీద్రవికులే జాతో బాహుర్నామ వృతాత్మజః బుభుజే పృథివీం సర్వాం ధర్మతో ధర్మతత్పరః. 3

బ్రహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రాశ్చాన్యే చ జన్తవః స్థాపితాః స్వస్వధర్మేషు తేన బాహుర్విశాంపతిః, 4

అశ్వమేధైరియాజాసౌ సప్తద్వీపేషు సప్తభిః అతర్పయద్భూమిదేవాన్‌ గోభూస్వర్ణాంశుకాదిభిః, 5

అశాసన్నీతిశాస్త్రేణ యథేష్టం పరిసన్ధినః, మేనే కృతార్థమాత్మానమన్యాతపనివారణమ్‌, 6

చందనాని మనోజ్ఞాని బలిం యత్సర్వదా జనాః భూషితా భూషణౖర్దివ్యైస్తద్రాష్ట్రే సుఖినో మునే, 7

అకృష్టపచ్యా పృథివీ ఫలపుష్పసమన్వితా, 8

వపర్ష భూమౌ దేవేన్ద్రః కాలే కాలే మునీశ్వర ! అధర్మనిరతాపాయే ప్రజా ధర్మేణ రక్షితాః 9

సనకమహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్ఠా ! ఉత్తమమైన గంగా మహాత్మ్యమును వినుము. గంగా జలస్పర్శ మాత్రముననే సగర వంశము పావనమైనది. అన్ని లోకములలో ఉత్తమమైన విష్ణులోకము చేరినది. సూర్యవంశమున వృక మహారాజపుత్రుడగు బాహువనువాడుండెను. బాహువు ధర్మతత్పరుడై ధర్మబద్ధముగా పృథివిని అనుభవించుచుండెను. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, చివరకి జంతువులు కూడా తమతమ ధర్మములనాచరించునట్లు బాహువు పరిపాలించుటచే బాహువు సర్వప్రాణులకు ప్రభువాయోను. ఏడు ద్వీపములలో ఏడు అశ్వమేధ యాగములను చేసెను. గోవులను, భూమిని, బంగారమును, వస్త్రములను దానము చేసి బ్రాహ్మణులను తృప్తి పరచెను. రాజనీతిచే శత్రువులను శాసించెను. ఇతరుల బాధలను తీర్చిన తనను కృతార్థనిగా తలచెను. బాహువుగా రాజ్యమున సుఖముగా నున్న ప్రజలు సుందరులైన చందనములను దివ్యములైన భూషణములను ధరించి ఆనందముగా నుండిరి. దున్నకనే పండెడు భూమి, పుష్పములతో ఫలములతో నిండుగా ఉన్న చెట్లు ఉండెను. సకాలమున ఇంద్రుడు భూమి మీద వర్షించెను. అధర్మము పూర్తిగా తొలగినందున ధర్మమే ప్రజలను కాపాడుచుండును.

ఏకదా తస్య భూపస్య సర్వంసంపద్వినాశకృత్‌ అహంకారో మహాన్‌ జజ్ఞే సాసూయో లోభ##హేతుకః. 10

అహం రాజా సమస్తానాం లోకానాం పాలకో బలీ, కర్తా మహాక్రతూనాం చ మత్తః పజ్యో స్తి కో పరః. 11

అహం విచక్షణః శ్రీమాన్‌ జితాస్సర్వే మమారయః, వేదావేదాంగతత్త్వజ్ఞో నీతిశాస్త్రవిశారదః. 12

అజేయోవ్యాహతైశ్వర్యో మత్తః కో న్యో ధికో భువి, అహంకారపర సై#్యవం

జాతాసూయా పరేష్వపి 13

అసూయతోభవత్కామస్తస్య రాజ్ఞో మునీశ్వర, ఏషు స్థితేషు తు నరో వినాశం యాత్యసంశయమ్‌. 14

¸°వనం ధనసంపత్తిః ప్రభుత్వమవికేకితా, ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయమ్‌. 15

తస్యాసూయా ను మహతీ జాతా లోకవిరోధినీ, స్వదేహనాశినీ విప్ర సర్వసంపద్వినాశినీ. 16

అసూయావిష్టమనసి యది సంపత్ప్రవర్తతే, తుషాగ్నిం వాయుసంయోగమివ జానీహి సువ్రత. 17

అసూయోపేతమనసాం దంభాచారవతాం తథా, పరుషోక్తిరతానాం చ సుఖం నేహ పరత్ర చ. 18

అసూయావిష్టచిత్తానాం సదా నిష్ఠురభాషిణామ్‌, ప్రియా వా తనయా వాపి బాంధవా అప్యరాతయః. 19

మనోభిలాషం కురుతే యః సమీక్ష్య పరస్త్రియమ్‌, స స్వసంపద్వినాశాయ కుఠారో నాత్ర సంశయః. 20

యస్స్వశ్రేయోవినాశాయ కుర్యాద్యత్నం నరో మునే, సర్వేషాం శ్రేయసం దృష్ట్వా స కుర్యాన్మత్సరం కుధీః. 21

మిత్రాపత్యగృహక్షేత్రధనధాన్యపశుష్వపి, హానిమిచ్ఛన్నరః కుర్యాదసూయాం సతతం ద్విజ. 22

కొంతకాలమునకు ఒక సమయమున ఆ బాహురాజమనసులో లోభము వలన జనించిన అసూయతో కూడిన గొప్ప అహంకారము కలిగెను. నేను ప్రజలందరికి ప్రభువను. ప్రజలందరిని కాపాడువాడను. బలవంతుడను. నేను మహాయాగములను చేసినవాడను. నాకంటే పూజించదగినవాడు ఇతరుడెవడున్నాడు? నేను వివేకము కలవాడును. ఐశ్యర్యము కలవాడను. శత్రువులనందరిని గెలిచితిని. వేదవేదాంగతత్త్వములను తెలిసినవాడను. నీతి శాస్త్రవిశారదుడును. నన్నెవరూ జయించలేరు. నా ఐశ్వర్యమునకు లోటులేదు. ఈ భూలోకమున నాకంటే గొప్పవాడెవడున్నాడు? ఇట్లు అహంకారము కలిగిన ఆరాజులో అసూయ పుట్టెను. అసూయవలన కామము కలిగెను. ఇట్లు అహంకారము, అసూయ, కామము ఈ మూడున్నచో మానవుడు వినాశమార్గమును ప్రవేశించును. ¸°వనము, ఐశ్వర్యము, అధికారము, అవివేకము, ఈ నాలుగింటిలో ఏ ఒక్కటున్ననూ అనర్థమును కలిగించును. ఇక నాలుగున్నచో ఏమి చెప్పవలయును ! లోకమునకు విరోధమును కలిగించు గొప్ప అసూయ ఆ రాజులో కలిగెను. ఈ అసూయ తన దేహమును అన్ని సంపదలను నశింపచేయును. అసూయ కలవానికి సంపద ఉన్నచో పొట్టులో (ఊకలో) పడిన అగ్నికి వాయువు తోడైనదని భావించుము. అసూయ కూడిన మనసు కలవారికి, బూటకపు ఆచారమును నటించువారికి, కఠినముగా మాటలాడువారికి ఇహమున, పరమున కూడ సుఖముండదు. అసూయ కలవారికి, ఎప్పుడూ కఠినముగా మాట్లాడు వారికి ప్రియులు, పుత్రులు, బంధువు కూడా శత్రువులే అగుదురు. పరస్త్రీ విషయములో మనసున అభిలాష కలిగినచో ఆ యభిలాష తన సంపద్వినాశనమునకు గొడ్డలి వంటిదని తెలియుము. తన మేలును చేతులారా చెడగొట్టుకొనువాడు ఇతరుల అభివృద్ధిని చూసి అసూయ చెందును. మిత్రులకు, సంతానమునకు, గృహమునకు, క్షేత్రములకు, ధనదాన్యపశువులకు కూడా హానికోరువాడే అసూయకలవాడగును. (అసూయ కలవాని మిత్రాదులకు కూడ హానిచేకూరునని భావము)10-22

అథ తస్యావినీతస్య హ్యసూయావిష్టచేతసః, హైహయాస్తాలజంఘాశ్చ బలినో రాతయో భవన్‌. 23

యస్యానుకూలో లక్ష్మీశః సౌభాగ్యం తస్య వర్ధతే, స ఏవ విముఖో యస్య సౌభాగ్యం తస్య హీయతే. 24

తావత్పుత్రాశ్చ పౌత్రాశ్చ ధనధాన్యగృహాదయః, యావదీక్షేత లక్ష్మీశః కృపాపాంగేన నారద! 25

అపి మూర్ఖాంధబధిరజడాః శూరా వివేకినః, శ్లాఘ్యా భవన్తి విప్రేన్ద్ర ప్రేక్షితా మాధవేన యే. 26

సౌభాగ్యం తస్య హీయేత యస్యాసూయాదిలాంఛనమ్‌, జాయతే నాత్ర సందేహో జంతుద్వేషో విశేషతః. 27

సతతం యస్య కస్యాపి యో ద్వేషం కురుతే నరః, తస్య సర్వాణి నశ్యన్తి శ్రేయాంసి మునిసత్తమ. 28

అసూయా వర్థతే తస్య యస్య విష్ణుః పరాఙ్మఖః ధనం ధాన్యం మహీ సంపద్వినశ్యతి తతో ధ్రవమ్‌. 29

వివేకం హన్త్యహంకారస్త్వవివేకాత్తు జీవినామ్‌, ఆపదస్సంభవన్త్యేవేత్యహంకారం త్యజేత్తతః. 30

అహంకారో భ##వేద్యస్య తస్య నాశోతివేగతః, అసూయావిష్టమనసస్తస్య రాజ్ఞః పరైస్సహ. 31

అయోధనమభూద్ఘోరం మాసమేకం నిరన్తరమ్‌, హైహయైస్తాలజం ఘైశ్చ రిపుభిస్స పరాజితః.32

అహంకారము, అసూయ గల బాహునకు హైహయవంశము వారు, తాల జంఘరాజులు శత్రువులుగా ఏర్పడిరి. శ్రీహరి అనుకూలుడుగా ఉన్నవానికి సౌభాగ్యము పెరుగును. శ్రీహరి విముఖడైనచో సౌభాగ్యము క్షీణించును. శ్రీమన్నారాయణుని కరుణాకటాక్షవీక్షమున్నంత వరకే పుత్రపౌత్రధనధాన్యగృహాదిసంపదలు నిలుచును. మూర్ఖులు, మూగవారు, గుడ్డివారు, చెవిటివారు, బుద్ధిహీనులు కూడా శ్రీనివాసుని కటాక్షము సోకినచో శూరులు, వివేకవంతులు కొనియాడదగిన వారు అగుదురు. అసూయద్వేషములు పుట్టి వాని సౌభాగ్యము క్షీణించిపొవును. జంతువులను ద్వేషించినచో విశేషముగా క్షయమగును. ఎప్పుడూ ఎవరినో ఒకరిని ద్వేషించువానికి అన్నిశ్రేయస్సులు నశించును. అసూయను పెంచుకొనిన వానికి శ్రీమహావిష్ణువు విముఖుడగును. అతని ధనము, ధాన్యము, సంపదలు, భూమి నశించును. ఇది నిశ్చయము. అహంకారము వివేకమును నిశింపచేయును. వివేకము నశించిన వారికి ఆపదలు సంభవించును. కావున అహంకారమును విడువవలయును. అహంకారమున్నవానికి త్వరగా నాశము కలుగును. కావున అసూయనిండిన బాహురాజునకు శత్రువులతో ఒకనెల రోజులు ఘోరముగా యుద్ధము జరిగెను. హైహయలు, తాలజంఘలు బాహురాజును యుద్ధమున ఓడించిరి. 23-32

స తు బాహుర్వనం గత్వా అన్తర్వత్న్యా స్వభార్యయా, అవాప పరమాం తుష్టిం తత్ర దృష్ట్వా మహాత్సరః. 33

అసూయో పూతమనస్తస్య భావం నిరీక్ష్య చ , సరోగతవిహంగాస్తే లీనాశ్చిత్రమిదం మహత్‌. 34

అహో కష్టమహోరూపం ఘోరమత్ర సమాగతమ్‌, విశన్తస్త్వరయా వాసమిత్యూచుస్తే ఏ విహంగమాః. 35

సోవగాహ్య సరో భూపః పత్నీభ్యాం సహితో ముదా, పీత్వా జలం చ సుఖదం వృక్షమూకలముపాశ్రితః. 36

తస్మిన్‌ బాహౌ వనం యాతే తేనైవ పరిరక్షితాః, దుర్గణాన్విగణయ్యాస్య ధిగ్ధిగిత్యబ్రువన్ప్రజాః. 37

యో వా కో వా గుణీ మర్త్యస్సర్వశ్లాఘ్యతరో ద్విజః, సర్వసంపత్సమాయుక్తోప్యగుణీ నిందితో జనైః. 38

అపకీర్తిసమో మృత్యుర్లోకేష్వన్యో న విద్యతే, యదా బాహుర్వనం యాతస్తదా తద్రాజ్యగా జనాః.

సంతుష్టిం పరమాం యాతా దపధౌ విగతే యథా, 39

నిన్దితో బహుశో బాహుర్మృతవత్కాననే స్థితః, నిహత్య కర్మ చ యశో లోకే ద్విజరోత్తమ. 40

నాస్త్యకీర్తిసమో మృత్యుర్నాస్తి క్రోధసమో రిపుః నాస్తి నిందాసమం పాపం నాస్తి మోహసమాసవః. 41

నాస్త్యసూయాసమాకీర్తిర్నాస్తి కామసమోనలః, నాస్తి రాగసమః పాశో నాస్తి సంగసమం విషమ్‌. 42

ఏవం విలప్య బహుధా బాహురత్యన్తదుఃఖితః, జీర్ణాంగో మనసస్తాపాత్‌ వృద్ధబావా దభూదసౌ. 43

అట్లు శత్రువులచే పరాజితుడైన ఆ బాహువు గర్భవతియైన తన భార్యతో అరణ్యమునకు వెళ్ళెను. అచట ఒక సరస్సును చూచి సంతోషించెను. అసూయ నిండియున్న మనసుగల ఆ బాహుమహారాజు మనోగత భావమును ఆ సరస్సు వద్ద ఉన్న పక్షులు చూచి ఆకుల మాటున దాగియుండి - ''ఇది చాలాకష్టము. ఇచటికి ఒక భయంకర రూపము వచ్చినది. త్వరగా మీ మీ నివాసములకు వెళ్ళుడు'' అని పలికినవి. ఇది చాలా గొప్ప చిత్రము. ఆ బాహుమహారాజు తనభార్యలతో ఆ సరస్సన స్నామాడి, సంతోషముతో నీరుత్రాగి ఆనందమునిచ్చు చెట్టునీడనచేరెను. ఆ బాహుమహారాజు అరణ్యమునకు వెళ్ళుచున్నపుడు అతినిచే పరిపాలించబడిన ప్రజలు అతని దుర్గుణములను లెక్కిం చుచు వ్యర్థము, వ్యర్థము అని నిందించిరి. ఎవరైనను మానవుడు గుణవంతుడుగానున్నపుడు అందరూ కీర్తింతురు. కాని అతనే దుర్గుణమును అలవరుచుకొనిన ఎన్ని సంపదలున్ననూ జనులు నిందింతురు. ఈ లోకమున అపకీర్తితో సాటియైన మృత్యువు మఱియొకటిలేదు. బాహుమహారాజు అరణ్యమునకు వెళ్ళగానేఅతని రాజ్యములోని ప్రజలు గ్రీష్మర్తువు గడిచినపుడు సంతోషించినట్లు సంతోషించిరి. ఓ బ్రాహ్మణోత్తమా ! ఇట్లు బాహుమహారాజు అందరిచే పలువిధములుగా నిందించబడి చచ్చిన వాని వలె అడవిలో యుండెను. లోకమున తాను సంపాదించిన కీర్తిని తన పనులచే హరింపచేసుకొనెను. అపకీర్తితో సాటియగు మృత్యువు మరియొకటుండదు. కోపముతో సాటి వచ్చు శత్రవు మరియొకడుండడు. ఇతరులను నిందించుటతో సమానమైన పాపము మరియొకటి లేదు. మోహముతో సమానమైన మద్యము ఇంకొకటిలేదు. అసూయతో సాటివచ్చు అపకీర్తి, కామముతో సాటియైన అగ్ని, రాగముతో సమానమైన పాశము, సంగముతో సాటివచ్చు విషము మరియొకటి లేదు. మోహముతో సమానమైన మద్యము ఇంకొకటిలేదు. అసూయతో సాటివచ్చు అపకీర్తి, కామముతో సాటియైన అగ్ని, రాగముతో సమానమైన పాశము, సంగముతో సాటివచ్చు విషము మరియొకటిలేదు. అత్యంతదుఃఖముతో బాహువు ఇట్లు విలపించి మానసిక

పరితాపము వలన శరీరము జీర్ణించి వృద్ధత్వమును పొందెను. 33- 43

గతే బహుతిధే కాలే ఔర్వాశ్రమసమీపతః, స బాహుర్వ్యాధినా గ్రస్తో మమార మునిసత్తమ ! 44

తస్య భార్యా చ దుఃఖార్తా కనిష్ఠా గర్భిణీ తదా, చిరం విలప్య బహుధా సహగన్తుం మనో దధే. 45

సమానీయ చ సైధాంసి చితాం కృత్వాతిదుఃఖితా, సమారోప్య తమారోఢుం స్వయం సముపచక్రమే. 46

ఏతస్మన్నన్తరే ధీమాన్‌ ఔర్వస్తేజోనిధిర్మునిః ఏతద్విజ్ఞాతవాన్సర్వం పరమేణ సమాధినా. 47

భూతాం భవ్యం వర్తమానం త్రికాలజ్ఞా మునీశ్వరాః, గతాసూయా మహాత్మానః పశ్యన్తి జ్ఞానచక్షుషా. 48

తపోభిస్తేజసాంరాశిరౌర్వః పుణ్యసమో మునిః, సంప్రాప్తస్తత్ర సాధ్వీ చ యత్ర బాహుప్రియా స్థితా. 49

చితామారోఢుముద్యుక్తాం తాం దృష్ట్వా మునిసత్తమః, ప్రోవాచ ధర్మమూలాని వాక్యాని మునిసత్తమ ! 50

చాలాకాలము గడిచిన తరువాత ఆ బాహువు వ్యాధిగ్రస్తుడై ఔర్వమహర్షి ఆశ్రమ సమీపమున మరణించెను. గర్భవతిగానున్న బాహువు చిన్నభార్య చాలా కాలము పలు విధములగా విలపించి సహగమనము చేయుటకు నిశ్చయించుకొనెను. ఎండు కట్టెలను తీసుకొనివచ్చి చితిని పేర్చి మిక్కలి దుఃఖముతో భర్తదేహమును చితిపై పరుంబెట్టి తాను చితిని ఆరోహించుటకు సిద్ధపడెను. ఇంతలో జ్ఞాని తేజోనిధియైన ఔర్వమహర్షి తన దివ్యసమాధిచే దీనినంతటిని తెలుసుకొనెను. అసూయలేని మహానుభావులైన మునీశ్వరులు త్రికాలజ్ఞులు కావున జ్ఞాననేత్రముతో భూతభవిష్యద్వర్తమానములను తెలియుదురు. తపస్సులచే తేజోరాశి పుణ్యమూర్తి అయిన ఔర్వమహర్షి బాహుప్రియురాలున్న ప్రదేశమునకు వచ్చెను. ఔర్వమహర్షి చితి మీదికి చేరుటకు సిద్ధముగానున్న బాహుభార్యను చూచి ధర్మములములైన కొన్నిమాటలును చెప్పెను.

ఔర్వ ఉవాచ :-

రాజపర్యప్రియే సాధ్వి మా కురష్వాతిసాహసమ్‌, తవోదరే చక్రవర్తీ శత్రహన్తాహి తిష్ఠతి. 51

బాలాపత్యాశ్చ గర్భిణ్యో హ్యదృష్టృఋతవస్తథా, రజస్వలా రాజసుతే నారోహతి చితాం శుభే. 52

బ్రహ్మహత్యాదిపాపానాం ప్రోక్తా నిష్కృతిరుత్తమైః, దంభినో నిందకస్యాపి భ్రూణఘ్నస్య న నిష్కృతిః. 53

నాస్తికస్య కృతఘ్యస్య ధర్మో పేక్షాకరస్య చ , విశ్వాసఘాతకస్యాపి నిషణ్కృతిర్నాస్తి సువ్రతే. 54

తస్మాదేతన్మహాపాపం కర్తుం నార్హసి శోభ##నే, యదేతద్దుఃఖముత్పన్నం తత్సర్వం శాంతిమేష్యతి. 55

ఇత్యుక్తా మునినా సాధ్వీ విశ్వస్య తదనుగ్రహమ్‌, విలలాపాతిదుఃఖార్తా సముహ్య ధవపత్కజౌ. 56

ఔర్వోపి తాం పునః ప్రాహ సర్వశాస్త్రార్థకోవిదః మారోదీ రాజతనయే శ్రియమగ్రే గమిష్యసి. 57

మా ముంచాస్రం మహాభాగే ప్రేతో దాహ్యోద్య సజ్జనైః తస్మాచ్ఛోకం పరిత్యజ్య కురు కాలోచితాం క్రయామ్‌. 58

పండితే వాపి మూర్ఖే వా దరిద్రే వా శ్రియాన్వితే, దుర్వృత్తే వా సువృత్తే వా మృత్యోస్సర్వత్ర తుల్యతా. 59

నగరే వా తథారణ్య దైవమత్రాతిరిచ్యతే. 60

యద్యత్పురాతనం కర్మ తత్తదేవేహ యుజ్యతే, కారణం దైవమేవాత్ర మన్యే సోపాధికా జనాః. 61

గర్భే వా బాల్యభావే వా ¸°వనే వాపి వార్థకే, మృత్యోర్వశం ప్రయాతవ్యం జన్తుభిః కమలాననే. 62

హన్తి పాతి చ గోవిన్దో జన్తూన్కర్మవశే స్థితాన్‌, ప్రవాదం రోపయన్త్యజ్ఞా హేతుమాత్రేషు జంతుషు. 63

తస్మాద్దుఃఖం పరిత్యజ్య సుఖినీ భవ సువ్రతే, కురు పత్యుశ్చ కర్మాణి వివేకేన స్థిరా భవ. 64

ఏతచ్ఛరీరం దుఃఖానాం వ్యాధీనామయుతైర్యుతమ్‌, సుఖాభాసం బహుక్లేశం కర్మపాశేన యంత్రితమ్‌. 65

ఇత్యాశ్వాస్య మహాబుద్ధిస్తయా కార్యాణ్యకారయత్‌, త్యక్తశోకా చ సా తన్వీ నతా ప్రాహ మునీశ్వరమ్‌. 66

ఔర్వమహర్షి పలికెను :- ఓ మహారాజపత్నీ ! సాధ్వీ ! ఇంత సాహసమును చేయకుము. నీగర్భములో శత్రుసంహారాము చేయువాడైన చక్రవర్తి యున్నాడు. బాలపుత్రులు గల స్త్రీ, గర్భవతి, రజస్వలకాని, రజస్వలగా ఉన్న స్త్రీ సహగమనము చేయరాదు. బ్రహ్మహత్యాదిపాపములు చేయువానికి, కపటికి, నిందించువానికి ప్రాయశ్చిత్తమున్నది. కాని గర్భస్థ శిశువును హత్యచేసిన వారికి నిష్కృతిలేదు. నాస్తికునికి, కృతఘ్ననికి, ధర్మమునుపేక్షించువానికి, విశ్వాసఘాతకునికి నిష్కృతిలేదు. కావున ఈ మహాపాపమును చేయతగవు. ఇపుడు నీకు కలిగిన దుఃఖము తొలిగిపోవును. ఇట్లు ఔర్య మహాముని మాటలను వినిన ఆ సాధ్వి ఆ ముని అనుగ్రహమున్నదని విశ్వసించి భర్తపాదములను పట్టుకొని మిక్కిలి దుఃఖముతో విలపించెను. సర్వశాస్త్రార్థములను తెలిసిన ఔర్వమహర్షికూడా ఆమెతో మరల ఇట్లనెను. ఓ రాజపుత్రీ ! నీవు రోదించకుము. ముందు సంపదలను పొందగలవు. కన్నీరును విడువకు. సజ్జనులు మొదట చేయవలసిన పని ప్రేత దహనము. కావున దుఃఖమును విడిచి ఇపుడు ఉచితమైన పనిని చేయుము. పండితుడైనను, మూర్ఖుడైనను, దరిద్రుడైనను, శ్రీమంతుడైనను, మంచివానియందు, చెడువాని యందును మృత్యువు ఒక్కతీరుగానే ప్రవర్తించును. నగరమున కాని అరణ్యమున కాని మృత్యువు ఒకే తీరుగా వచ్చును. ఈ విషయమున దైవము ప్రబలము. పూర్వజన్మలో చేసిన కర్మనే ఈ లోకమున అనుభవింతురు. ఏదో సాకును చెప్పు మానవులు ఎట్లు భావించిననూ ఈ విషయమున దైవమే కారణము. గర్భములో కాని, బాల్యమున కాని, ¸°వనమున గాని, వార్థక్యమున కాని ప్రాణుల మృత్యువశులు కావలసినదే. కర్మవశముననున్న ప్రాణులను గోవిందుడే కాపాడును. గోవిందుడే సంహరించును. నిమిత్తమాత్రమైన ప్రాణులపై అజ్ఞానులు నిందలు వేతురు. కావున దుఃఖమును విడిచి స్వస్థురాలవు కమ్ము. భర్తకు అంత్యక్రియలను చేసి వివేకముతో స్థిరముగా నుండుము. ఈ శరీరము వేలకొలది వ్యాధులకు దుఃఖములకు నిలయము. కర్మపాశముతో నియమించబడి సుఖముగా తోచుచు బహదుఃఖములను కలిగించును. ఇట్లు ఓదార్చి ఆ సాధ్వితో అంత్యక్రియలు చేయించెను. దుఃఖమును విడిచిన ఆ సాధ్వి ఔర్వమహర్షికి నమస్కరించి ఇట్లు పలికెను.

కిమత్ర చిత్రం యత్సన్తః పరార్థఫలకాంక్షిణః, న హి ద్రుమాశ్చ భోగార్థం ఫలన్తి జగతీతలే. 67

యో7న్యదుఃఖాని విజ్ఞాయ సాధువాక్యైః ప్రభోదయేత్‌, స ఏవ విష్ణుస్తత్త్వ స్థో యతః పరహితే స్థితః. 68

అన్యదుఃఖేన యో దుఃఖీ యో7న్యహర్షేణ హర్షితః, స ఏవ జగతామీశో నరరూపధరో హరిః. 69

సద్భిశ్శ్రుతాని శాస్త్రాణి పరదుఃఖవిముక్తయే, సర్వేషాం దుఃఖనాశాయ ఇతి సన్తో వదన్తి హి. 70

యత్ర సంతః ప్రవర్తన్తే తత్ర దుఃఖం న బాధతే, వర్తతే యత్ర మార్తండః కథం తత్ర తమో భ##వేత్‌. 71

ఇత్యేవం వాదినీ సా తు స్వపత్యుశ్చాపరాః క్రియాః చకార తత్సరస్తీరే మునిప్రోక్తవిధానతః. 72

స్థితే తత్ర మునౌ రాజా దేవరాడివ సంజ్వలన్‌, చితామధ్యాద్వినిష్క్రమ్య విమానవరమాస్థితః,73

ప్రపేదే పరమం ధామ నత్వా చౌర్వం మునీశ్వరమ్‌,

మహాపాతకయుక్తా వా యుక్తా వా చోపపాతకైః పరం పదం ప్రయాన్త్యేవ మహద్భిరవలోకితాః. 74

కరేవరం వా తద్భస్మ తద్ధూమం వాపి సత్తమ, యది పశ్యతి పుణ్యాత్మా స ప్రయాతి పరాం గతిమ్‌. 75

పత్యుః కృతక్రియా సా తు గత్వాశ్రమపదం మునేః, చకార తస్య శుశ్రుషాం సపత్న్యా సహ నారద ! 76

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే

గంగామాహాత్మ్యం నామ సప్తమో ధ్యాయః ''ఓ మహానుభావా ! సత్పురుషులు ఇతరుల హితము కొఱకు మాత్రమే తాము ఫలములనాశించెదరు. చెట్లు తమ అనుభవము కొఱకు పండ్లను కలిగియుండునా ? ఇతరుల దుఃఖమును తెలుసుకొని మంచిమాటలతో ఓదార్చువాడే ఇతరుల హితమును చేయువాడు కావున ఆతనే విష్ణుస్వరూపుడు. ఇతరుల దుఃఖమును చూచి దుఃఖించువాడు, ఇతరుల ఆనందమును చూచి ఆనందించువాడే జగన్నాథుడు. నరరూపమును ధరించిన శ్రీహరియే. సత్ఫురుషులు అభ్యసించిన శాస్త్రములు ఇతరుల దుఃఖమును తొలగించుట కొఱకే. అందరి దుఃఖములను నశింపచేయుటకే యని సత్పురుషులు చెప్పుచుందురు. సత్పురుషులు తిరుగాడు చోట దుఃఖము బాధించదు. సూర్యుడున్నచో చీకటెట్లుండును? ఇట్లు పలుకుచు ఆ బాహుమహారాజు చిన్నభార్య తన భర్తకు అంత్యక్రియలను ఆ సరస్సు తీరమున ముని చెప్పన విధముగా పూర్తి చేసెను. ముని అక్కడ ఉండగానే బాహుమహారాజు చితా మధ్యమునుండి దివ్యరూపముతో బయలువెడలి ఇంద్రుని వలె ఉత్తమ విమానము నధిరోహించి ఔర్వమహర్షికి నమస్కరించి పరమధామమును చేరెను. మహాపాతకములు చేసినవారైనను ఉపపాతకములు చేసినవారైనను మహాత్ముల చూపు సోకినచో పరమపదమును చేరెదరు. మృతుని దేహమును కాని, భస్మముకాని, చివరికి ధూమము కాని పుణ్యాత్ముడు చూచినచో ఉత్తమ గతిని పొంందును. ఇట్లు భర్తకు అంత్యక్రియలను పూర్తి చేసి సపత్నితో కలిసి ఔర్వమహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఆ మహర్షిని సేవించుచుండెను.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున

ప్రథమ పాదమున గంగా మహాత్మ్యమను

ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Naradapuranam-I    Chapters    Last Page