Sri Naradapuranam-I
Chapters
Last Page
అష్టమో7ధ్యాయః ఎనిమిదవ అధ్యాయము గంగామాహాత్మ్యమ్ సనక ఉవాచ : - ఏవమౌర్వాశ్రమే తే ద్వే బాహుభార్యే మునీశ్వర ! చక్రతే భక్తిభావేన శుశ్రూషాం ప్రతివాసరమ్. 1 గతే వర్షార్ధకే కాలే జ్యేష్ఠా రాజ్ఞీ తు యా ద్విజ ! త్యాః పాపమతిర్జాతా సపత్న్యాస్సంపదం ప్రతి. 2 తతస్తయా గరో దత్తః కనిష్ఠాయై తు పాపయా, న స్వప్రభావం చక్రే వై గరో మునిని షేవయా. 3 భూలేపనాదిభిస్సమ్యగ్యతస్సా తు దినం మునేః, చకార సేవాం తేనాసౌ జీర్ణపుణ్యన కర్మణా. 4 తతో మాసత్రయే7తీతే గరేణ సనహితం సుతమ్, సుషావ సుశుభేకాలే శుశ్రూషానష్ట కిల్బిషా. 5 అహో! సత్సంగతిర్లోకే కింపాపం న వినాశ##యేత్, న దదాతి సుఖం కింవా నరాణాం పుణ్యకర్మణామ్. 6 జ్ఞానాజ్ఞానకృతం పాపం యచ్చాన్యత్కారితం పరైః, తత్సర్వం నాశయత్యాశు పరిచర్యా మహాత్మనామ్. 7 జడో7పి యాతి పూజ్యత్వం సత్సంగాజ్జగతీతలే, కలామాత్రో7పి శీతాంశుశ్శంభునా స్వీకృతో యథా. 8 సత్సంగతిః పరామృద్ధిం దదాతి హి నృణాం సదా, ఇహాముత్ర చ విప్రేన్ద్ర సన్తః పూజ్యతమాస్తతః. 9 అహో మహద్గుణాన్వక్తుం కస్సమర్థో మునీశ్వర ! గర్భం ప్రాప్తో గరో೭జీర్ణో మాసత్రయమహో೭ద్భుతమ్.10 సనక మహర్షి పలికెను : - ఆ బాహుమహారాజు భార్యలిరువురు ఇట్లు ఔర్వమహర్షి ఆశ్రమమున భక్తిభావముతో ప్రతిదినము శుశ్రూష చేయుచుండిరి. ఆరునెలలు గడిచిన తరువాత బాహుమహారాజు పెద్దభార్య మనసులో చిన్నభార్య సంపదను చూచి (గర్భమును) ఈర్ష్య కలిగెను. ఆ ఈర్ష్యతో చిన్నభార్యకు విషమునిచ్చెను. అయినను ఔర్వమహర్షిని భక్తితో సేవించుచుండుట వలన ఆ విషము తన ప్రభావమును చూపలేకపాయెను. ప్రతిదినము అలుకుట, ముగ్గులు పెట్టుట మొదలగు సేవలను ఎంతో భక్తితో చిన్నభార్య చేయుచుండెను. ఆపుణ్యము విషమును కూడా ఆరగించెను. మూడునెలలు తరువాత శుశ్రూష వలన పాపములను బోనాడిన చిన్నభార్య శుభముహూర్తమున విషసహితముగా కుమారుని ప్రసవించెను. లోకమున సజ్జన సాంగత్యము ఏ పాపమును నశింపచేయదు? పుణ్యకర్మలను చేసిన నరులకు లభించని ఆనందమేముండును? మహాత్ముల పరిచర్య, తెలిసి తెలియక చేసిన పాపములను ఇతరులు చేసెడు ద్రోహములను నశింపచేయును. సత్సంగతి వలన జడుడు కూడా పూజ్యతను పొందును. చంద్రుడు ఒక కళారూముగా నున్ననూ శంకరునిచే స్వీకరించబడెనుకదా! సజ్జనసాంగత్యము ఎప్పుడూ మానవులకు ఉత్తమ వృద్ధినే ఇచ్చును. ఇహలోకమున, పరలోకమున మంచియే జరుగును. కావుననే సత్పురుషులు పూజ్యతములు, ఓ మునీశ్వరా ! మహాత్ముల గుణములను ఎవరు చెప్పగలరు ? గర్భమును చేరిన విషము మూడునెలలున్ననూ జీర్ణము కాక అట్లే యుండెను. 1 - 10 గరేణ సహితం పుత్రం దృష్య్వా తేజోనిధిర్మునిః, జాతకర్మ చకారసౌ తన్నామ సగరేతి చ.11 పుపోష సగరం బాలం తన్మాతా ప్రీతిపూర్వకమ్, చౌలోపనీతకర్మాణి తథా చక్రే మునీశ్వరః. 12 శాస్త్రాణ్యధ్యాపయామాస రాజయోగ్యాని మంత్రవిత్, సమర్థం సగరం దృష్ట్వా కించిదుద్భిన్నశైశవమ్.13 మన్త్రవత్సర్వశస్త్రాస్త్రం దత్తవాన్సము మునీశ్వరః, సగరశ్శక్షితస్తేన సమ్యగౌర్వర్షిణా మునే. 14 బభూవ బలవాన్ధర్మీ కృతజ్ఞో గుణవాన్సుధీః, ధర్మజ్ఞస్సో7పి సగరో మునేరమితతేజసః, 15 సమిత్కుశాంబుపుష్పాది ప్రత్యహం సముపానయత్, స కదాచిద్గుణనిధిః ప్రణిపత్య స్వమాతరమ్, ఉవాచ ప్రాంజలిర్భూపత్వా సగరో వినయాన్వితః. 16 తేజోనిధియైన ఔర్వమహర్షి విషముతో పుట్టిన కుమారుని చూచి జాతకర్మచేసి 'సగరుడు' అని నామకరణము చేసెను. సగరుని తల్లి ప్రేమతో ఆ బాలుని పోషించుచుండెను. ఔర్వమహర్షి చౌలమున ఉపనయనమును చేసెను. రాజులకు యోగ్యములైన శాస్త్రములను చదివించెను. శైశవమును దాటి సమర్థుడైన సగరుని చూచి మునీశ్వరుడు మంత్రములతో సర్వశస్త్రాస్త్రములను ప్రసాదించెను. ఇట్లు ఔర్వమహర్షిచే చక్కగా అన్ని విద్యలను నేర్చిన సగరుడు బలవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞుడు, గుణవంతుడు, మంచి బుద్ధి కలవాడు, ధర్మములను తెలిసినవాడు ఆయెను. ధర్మజ్ఞుడు కావున సగరుడు మహర్షికి సమిధలను, దర్భలను, జలమును, పుష్పములను ప్రతిదినము తెచ్చి ఇచ్చుచు సేవించుచుండెను. ఒకనాడు గుణనిధియైన సగరుడు తల్లి వద్దకు వచ్చి నమస్కరించి చేతులు జోడించి వినయముతో ఇట్లు పలికెను. 11 - 16 సగర ఉవాచ : - మాతర్గతః పితా కుత్ర కింనామా కస్య వంశజః, తత్సర్వం మే సమాచక్ష్వ శ్రోతం కౌతూహలం మమ. 17 పిత్రా విహీనా యే లోకే జీవన్తో7పి మృతోపమాః, దరిద్రో7పి పితా యస్య హ్యాస్తే ప ధనదోపమః. 18 యస్య మాతా పితా నాస్తి సుఖం తస్య న విద్యతే, 19 ధర్మహీనో యథా మూర్ఖః పరత్రేహ చ నిన్దితః, మాతాపితృవిహీనస్య ఆజ్ఞస్యాప్యవివేకినః, 20 అపుత్రస్య వృథా జన్మ ఋణగ్రస్తస్య చైవ హి, చంద్రహీనా యథా రాత్రిః పద్మహీనం యథా పరః, పతిహీనా యథా నారీ పితృహీనస్తథా శిశుః. 21 ధర్మహీనో యథా జన్తుః కర్మహీనో యథా గృహీ, పశుహీనో యథా వైశ్యస్తథా పిత్రా వినార్భకః. 22 సత్యహీనం యథా వాక్యం సాధుహీనా యథా సభా, తపో యథా దయాహీనం తథా పిత్రా వినార్భకః. 23 వృక్షహీనం యథారణ్యం జలహీనా యథా నదీ, వేగహీనో యథా వాజీ తథా పిత్రా వినార్భకః. 24 యథా లఘుతోరో లోకే మాతర్యాచ్ఞాపరో నరః, తథా పిత్రా విహీనస్తు బహుదుఃఖాన్వితస్సుతః. 25 సగరుడు పలికెను : - ''ఓ తల్లీ ! నా తండ్రి పేరేమి ? ఏ వంశమువాడు ? ఎచటికి వెళ్ళెను ? ఇదయంతయు వినవలయునని నాకు చాలా కుతూహలమున్నది. కావున చెప్పుము. ఈ లోకమున తండ్రిలేనివారు బ్రతికి యున్ననూ మరణించినవారితో సమానుడే. దరిద్రుడైనను తండ్రియున్నచో వాడు కుబేరునితో సమానుడే. తలిదండ్రులు లేనివారికి సుఖముండదు. ధర్మమును విడిచిన మూర్ఖునివలె ఇహపరములలో నిందించబడును. తలిదండ్రులు లేని వాని జన్మ, ఆజ్ఞానుని జన్మ, అవివేకి జన్మ పుత్రుడు లేని వాని జన్మ ఋణగ్రస్తుని జన్మ వ్యర్థము, చంద్రుడు లేని రాత్రివలె, పద్మములు లేని సరస్సువలె, పతిలేని స్త్రీవలె తండ్రిలేని శిశువు వ్యర్థుడు, ధర్మములేని జంతువువలె, కర్మచేయని గృహస్థునివలె, పశువులు లేని వైశ్యుని వలె తండ్రిలేని పిల్లవాడు వ్యర్థుడు. సత్యములేని వాక్యము వలె, సాధుజనులు లేని సభవలె, దయలేని తపస్సువలె, తండ్రిలేని పిల్లవాడు వ్యర్థుడు. చెట్లు లేని అడవివలె, నీరువేని నదివలె, వేగములేని అశ్వమువలె తండ్రిలేని పిల్లవాడు వ్యర్థుడు. యాచనాపరుడెట్లు అందరిలో చులకనౌనో అట్లే తండ్రిలేని పిల్లవాడు చాలా దుఃఖమును పొందును. 17- 25 ఇతీరితం సుతేనైషా శ్రుత్వా నిశ్శ్వస్య దుఃఖితా, సంపృష్ఠం తద్యథావృత్తం సర్వం తసై#్మ న్యవేదయత్. 26 తచ్ఛ్రుత్వా సగరః క్రుద్ధః కోపసంరక్తలోచనః, హనిష్యామీత్యరాతీన్స ప్రతిజ్ఞానుకరోత్తదా. 27 ప్రదక్షిణీకృత్య మునిం జననీం చ ప్రణమ్య సః, ప్రస్థాపితః ప్రతస్థే చ తేనైవ మునినా తదా. 28 ఔర్వాశ్రమాద్వినిష్క్రాన్త స్సగర స్సత్యవాక్ శుచిః, వసిష్ఠం స్వకులాచార్యం ప్రాప్తః ప్రీతిసమన్వితః. 29 ప్రణమ్య గురవే తసై#్మ వసిష్ఠాయ మహాత్మనే, సర్వం విజ్ఞాపయామాస జ్ఞానదృష్ట్యా విజానతే. 30 ఐన్ద్రాస్త్రం వారుణం బ్రాహ్మమాగ్నేయం సగరో నృపః, తేనైవ మునినావాప ఖడ్గం వజ్రోపమం ధనుః. 31 తతస్తేనాభ్యనుజ్ఞాతః సగరః సౌమనస్పవాన్, ఆశీర్భిరర్చితః పద్యః ప్రతస్థే ప్రణిపత్య తమ్. 32 ఏకేనైన తు చాపేన స శూరః పరిపంధనః,చ సపుత్రపౌత్రాస్ససగణానకరోత్ స్వరగవాసినః. 33 తచ్చాపముక్తబాణాగ్ని సంతప్తాస్తదరాతయః, కేచిద్వినష్టాః సంత్రస్తాస్తథా చాన్యే ప్రదుద్రువుః.34 కేచిద్విశీర్ణకేశాశ్చ వల్మీకోపరిసంస్థితా, తృణాన్యభక్షయన్కే చిన్నగ్నాశ్చ వివిశుర్జలమ్. 35 శకాశ్చ యవనాశ్చైవ తథా చాన్యే మహీభృతః, సత్వరం శరణం జగ్ముర్వసిష్ఠం ప్రాణలోలుపాః.36 జితక్షితిర్బాహుపుత్రో రిపూన్గురుసమీపగాన్, చారైర్విజ్ఞాతవాన్పద్యః ప్రాప్తశ్చార్యసన్నిధిమ్. 37 తమాగతం బాహుసుతం నిశమ్య మునిర్వసిష్ఠశ్యరణాగతాంస్తాన్, త్రాతుం చ శిష్యాభిహితం చ కర్తుం విచారయామాస తదా క్షణన. 38 చకార ముండాన్శబరాన్యవనాంల్లబ్బమూర్ధజాన్, అన్యాంశ్చశ్మశ్రలాన్సర్వాన్ముండా న్కేద బహిష్కృతాన్. 39 వసిష్టమునినా తేన హతప్రాయాన్నిరీక్ష్య సః ప్రహసన్ప్రాహ సగరస్స్వగురుం తపసో నిధిమ్. 40 ఇట్లు పుత్రుడైన సగరుడు పలుకగా విని తల్లి బరువుగా నిట్టూర్చి దుఃఖముతో జరిగినదంతయూ అతనికి తెలిపెను. తల్లి చెప్పిన దానిని వినిన సగరుడు కోపముతో ఎఱ్ఱబారిన కనులతో శత్రువులను చంపగలనని ప్రతిజ్ఞ చేసెను. ఔర్వమహర్షికి ప్రదక్షిణమును చేసి తల్లికి నమస్కరించి ఔర్వమహర్షి సాగనంపగా బయలుదేరెను. సత్యవాక్కు, పవిత్రుడు అయిన సనగరుడు ఔర్వమహర్షి ఆశ్రమమునుండి బయలువెడలి ప్రీతితో తమ కులగురువైన వశిష్ఠమహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. మహాత్ముడైన వసిష్ఠమహర్షికి నమస్కరించి జ్ఞానదృష్ఠితో అంతా తెలిసియున్న మహర్షికి అంతయూ వివరించెను. వసిష్ఠమహర్షి దయతో సగరునకు ఐన్ద్రాస్త్రమును, వారుణాస్త్రమును, బ్రహ్మాస్త్రమును, ఆగ్నేయమును, వజ్రాయుధమంతటి ఖడ్గమును ధనువును ఇచ్చెను. మంచిమనసుగల సగరుడు వసిష్ఠ మహర్షికి నమస్కరించి ఆశీర్వాదములను, అనుజ్ఞను పొంది వెంటనే బయలుదేరెను. మహాశూరుడైన సగరుడు ఒక్క ధనువుతోనే పుత్రపౌత్రబంధుగణములతో కూడియున్న శత్రువులను స్వర్గవాసులను చేసెను. సగరుని ధనువునుండి వెలువడిన బాణాగ్నికి భయపడిన శత్రువులు కొందరు నశించిరి. కొందరు పారిపొయిరి. మరికొందరు కేశములను విరబోసుకొని పుట్టమాద నిలుచుండిరి. కొందరు గడ్డిపరకలను నోట్లో పెట్టుకొనిరి. మరికొందరు నగ్నముగా నీటిలో ప్రవేశించిరి (ఓడిపోయిన వారు మేము నిస్సహాయుము అని తెలుపుటకు జుట్టు విరబోసుకొని పుట్ట నెక్కుట, గడ్డి పరకలను నోట్లో పెట్టకొనుట, నగ్నముగా నీళ్ళలో ప్రవేశించుట పరిపాటి.) శకులు, యవనులు, ఇతర రాజులు ప్రాణములయందాశతో వశిష్ఠమహర్షిని శరణువేడిరి. భూమిని గెలిచిన సగరుడు తన శత్రువులను గురుసమీపమును చేరిరని చారుల ద్వారా తెలుసుకొని గురువు సమీపమునుకు వెళ్ళెను. సగరుడు వచ్చెనని తెలిసిన వసిష్ఠమహర్షి శరణాగతులను కాపాడవలయునని తనశిష్యులకి హితమును చేయవలయునని నిశ్చయించుకొనెను. శబరులను తలవెంట్రుకలను గొరిగి, యవనులకు వెంట్రుకలను విరబోసి, ఇతర రాజులకు మీసములను తీసివేసి అందరిని వేదబహిష్కృతులను చేసెను. ఇట్లు వసిష్ఠముని చచ్చినవారితో సమానముగా చేసిన శత్రవులను చూచి సగరుడు నవ్వుచు తపోనిధియైన తన గురువుతో ఇట్లు పలికెను. సగర ఉవాచ : - భో భో గురో ! దురాచారానేతాస్రక్షసి తాన్వృథా, సర్వదాహం హనిష్యామి మత్పితుర్దేశహారకాన్. 41 ఉపేక్షత సమర్థస్సన్థర్మపరిపన్దినః, స ఏవ సర్వనాశాయ హేతుభూతో న సంశయః, 42 బాధస్తే ప్రథమం మత్తదుర్జనాస్సకలం జగత్, త ఏవ బలహీనాశ్చేద్భజన్తే7 త్యన్తసాధుతామ్. 43 అహో మాయాకృతం కర్మ ఖలాః కశ్మలచేసః, తాపత్కుర్వన్తి కార్యాణి యవత్స్యాత్ప్రబలం బలమ్. 44 దాసభావం చ శత్రూణాం వారస్త్రీణాం చ సౌహృదమ్, సాధుభావం చ సర్పాణాం శ్రేయస్కమో న విశ్వసేత్. 45 ప్రహాసం కుర్వతే నిత్యం యాన్దన్మాన్దర్శయన్ఖలాః, తానేవదర్శయన్త్యాశు స్వసామర్థ్య విపర్యయే. 46 పిశునా జిహ్వయా పూర్వం పరుషం ప్రవదన్తి చ, అతీవ కరుణం వాక్యం వదన్త్యే వ తథా೭ బలాః. 47 శ్రేయస్కామో భ##వేద్యస్తు నీతిశాస్త్రార్థకోవిదః, సాధుత్వం సమభావం చ ఖలానాం నైవ విశ్వసేత్. 48 దుర్జనం ప్రణతిం యాన్తం మిత్రం కైతవశీలినమ్, దుష్టాం భార్యాం చ విశ్వస్తో మృత ఏవ న కసంశయః. 49 మా రక్ష తస్మాదేతాన్వై గోరూపవ్యాఘ్రకర్మిణః, హత్వైతానఖిలాన్దుష్ఠాంస్త్వత్ర్పసాదాన్మ హీం భ##జే. 50 వసిష్ఠస్తద్వచశ్శ్రుత్వా సుప్రీతో మునిసత్తమః, కరాభ్యాం సగరస్యాంగం స్పృశన్నిదమువాచ హ. 51 సగరుడు పలికెను : - '' గురువర్యా ! దురాచారులగు వీరిని రక్షించుట వ్యర్థము. నా తండ్రి రాజ్యమును హరించిన వారిని నేను తప్పక వధించెదను. ధర్మ శత్రువులను ఉపేక్షించుటయే సర్వనాశనమునకు హేతువగును. సంశయముతో పనిలేదు. దుర్జనులు మదించి మొదట జగత్తునంతటిని బాదింతురు. వారే దుర్బలులైనప్పుడు సాధుభావమును ప్రదర్శింతురు. కల్మషహృదయులైన దుర్జనులు వంచనచే తమ బలము పెరుగువరకు సేవచేసెదరు. శత్రువుల దాస భావమును, వేశ్యల అనురాగమును, పాముల సాధుత్వమును మేలుకోరువాడు నమ్మరాదు. తాము బలముతో ఉన్నప్పుడు పరిహసించుచు చూపిన దంతములనే బలహీనులు కాగానే దౌన్యముతో చూపెదరు. లోభులు మొదట నాలుకతో పరుషముగా మాటలాడెదరు. వారే బలహీనులైనచో అదే నాలుకతో చాల దీనముగా మాటలాడెదరు. తన మేలు కోరువాడు, నీతిశాస్త్రార్థములను తెలిసినవారు దుర్జనుల సాధుత్వమును సమభావమును నమ్మరాదు. నమస్కరించుచున్న దుర్జనుని కపట స్వభావము కల మిత్రుని, దుష్టురాలైన భార్యను నమ్మినవాడు బ్రతికియు చనిపోయిన వానితో సమానమే. కావున గోరూపముతో నుండి పెద్దపులి పనులను చేయు వారిని కాపాడకుడు. వీరందరిని సంహరించి నీ అనుగ్రహముచే భూమిని సేవించెదను.'' 41- 51 వసిష్ఠ ఉవాచ : - సాధు సాధు మహాభాగ! సత్యం పదసి సువ్రత! తథా೭ పి మద్వచశ్శుత్వా పరాం శాన్తిం లభిష్యసి. 52 మయైతే నిహతాః పూర్వం త్వత్ప్రతిజ్ఞావిరోధినః, హతానాం హననే కీర్తిః కా కసముత్పద్యతే పద ! 53 భూమీశ జస్తవస్సర్వే కర్మపాశేన యన్త్రితాః, తథా೭ పి పాపైర్నిహతాః కిమర్థం హంసి తాన్పునః. 54 దేహస్తు పాపజనితః పూర్వమేవైనసా హతః, ఆత్మా హ్యభేధ్యః పూర్ణత్వాచ్ఛాస్త్రాణామేష నిశ్చయః. 55 స్వకర్మఫలభోగానాం హేతుమాత్రా హి జన్తవః, కర్మాణి దైవమూలాని దేవాధీనమిదం జగత్. 56 యస్మాద్ధైవం హి సాధూనాం రక్షితా దుష్టశిక్షితా, తతో నరైరస్వతన్త్రైః కిం కార్యం సాధ్యతే వద ! 57 శరీరం పాపసంభూతం పాపేనైవ ప్రవర్తతే, పాపమూలమిదం జ్ఞాత్వా కథం హస్తుం సముద్యతః. 58 ఆత్మా శుద్ధో పి దేహస్థో దేహీతి ప్రాచ్యతే బుధైః, తస్మాదిదం వపుర్భూప పాపమూలం న సంశయః. 59 పాపమూలవపున్హస్తుః కా కీర్తిన్తవ బాహుజ! భవిష్యతీతి నిశ్చిత్య నైతాన్హింసీస్తతస్సుత.60 ఇతి వాక్యం గురోశ్శ్రుత్వా విరరామ స కోపతః, స్పృశన్కరేణ సగరం సన్దనం మునయస్తదా. 61 అథాధర్వనిధిస్తస్య సగరస్య మహాత్మనః, రాజ్యాభిషేకం కృతవాన్మునిభిస్సహ సువ్రతైః.62 భార్యాద్వయం చ తస్మాసీత్కేశినీ సుమతిస్తథా, కాశ్యపస్య విదర్భస్య తనయే మునిసత్తమ! 63 రాజ్యే ప్రతిష్ఠితం దృష్ఠ్వా మునిరౌర్వస్తపో నిధిః, వనాదాగత్య రాజానం సంభాష్య స్వాశ్రమం య¸°. 64 కదాచిత్తస్య భూపస్య భార్యాభ్యాం ప్రార్థితో మునిః, వరం దదావపత్యార్థమౌర్వో భార్గవ మస్త్రవిత్. 65 క్షణం ధ్యానస్థితో భూత్వా త్రికాలజ్ఞో మునీశ్వరః, కేశినీం సుమతిం చైవ ఇదమాహ ప్రహర్షయన్. 66 వసిష్ఠ మహర్షి పలికెను : - '' ఓ మహానుభావా! బాగు ! బాగు! నీవు నిజమునే చెప్పుచున్నావు. అయిననూ నా మాట వినినచో ఉత్తమమైన శాంతిని పొందగలవు. నీ ప్రతిజ్ఞకు విరోధలైన వీరిని నేను మొదటనే చంపితిని. చంపినవారిని చంపుటలో ఏమి కీర్తిరాగలదో చెప్పుము. ఓ రాజా! అన్ని ప్రాణులు కర్మపాశముతో బంధించబడియుందురు. అయిననూ వారి పాపము వారిని చంపినది. వారిని మరల నీవెందుకు చంపెదవు. పాపము వలన కలిగిన దేహము మొదటే పాపముచే చంపబడింది. పూర్ణమైనందువలన ఆత్మనాశములేనిది. ఇది శాస్త్రనిశ్చయము. ప్రాణులు తాము చేసిన కర్మల ఫలమును అనుభవించుటకు నిమిత్తమాత్రములు. కర్మలకు మూలము దైవము. ఈ జగమంతయు దైవాధీనమే. దైవమేసాధువులను రక్షించునది. దుష్టులను శిక్షించును. కావున పరతస్త్రులైన మానవులు దేనిని సాధించగలరో చెప్పుము. పాపముచే పుట్టిన శరీరము పాపముచే ప్రవర్తించును. ఇదియంతయు పాపమూలమని తెలిసి చంపుటకేల సిద్ధపడెదవు. ఆత్మశుద్ధమైననూ దేహమున నుండుటచే దేహి అనుబడుచున్నది. కావున ఈ శరీరము పాపమూలమే. సంశయములేదు. పాపమూలమైన శరీరమును చంపిన నీకు ఏమి కీర్తి కలుగును? కావున వీరిని హింసించకుము''. ఇట్లు గురువగు వసిష్ఠ మహర్షి చెప్పిన మాటలను విని సగరుడు తన కోపమును ఉపసంహరించుకొనెను. చేతిచే శరీరమును స్పృశించి మునులు సగరుని అభినందించిరి. తరువాత అధర్వనిధియైన వసిష్ఠ మహర్షి ఇతరమునులతో కలిసి సగరునికి రాజ్యాభిషేకమును జరిపెను. ఆ నగరమహారాజునకు విదర్భమహారాజైన కాశ్యపుని పుత్రికలు కేశిని, సుమతి అనువారు భార్యలైరి. సగరునికి రాజ్యపట్టాభిషేకము జరుగుట తెలిసి ఔర్వమహర్షి వనమునుండి వచ్చి మాట్లాడి వెళ్ళెను. ఒకసారి భార్గవవంశజుడు మంత్రవేత్త అయిన ఔర్వమహర్షిని సగర మహారాజు భార్యలు కేసినీసుమతులు ప్రార్థించగా సంతోషించిన మహర్షి వారికి పుత్రులు కలిగెదరని వరమిచ్చెను. మరల క్షణకాలము ధ్యానించి త్రికాలజ్ఞడైన మహర్షి కేశినిని సుమతిని గూర్చి ఇట్లు పలికెను. ఔర్వ ఉవాచ : - ఏకా వంశధరం చైకమన్యా షడయుతాని చ, అపత్యార్థం మహాభాగే వృణుతాం చ యథేప్సితమ్.67 అథ శ్రుత్వా వచస్తస్య మునేరౌర్యస్య నారద ! కేశిన్యేకం సుతం వవ్రే వంశసన్తానకారణమ్. 68 తథా షష్ఠిసహస్రాణి సుమత్యాహ్యభవన్సుతా, నామ్నాసమంజః కేశిన్యాస్తనయో మునిసత్తమ! 69 అసమంజసస్తు కర్మాణి చాకరోన్మత్తచేష్టితః, తం దృష్ణ్వా సాగరాస్సర్వే హ్యసన్దుర్వృత్తచేతసః. 70 తద్భాలభావం సందుష్టం జ్ఞాత్వా బాహుసుతో నృపః చింతయామాస విధివత్పుత్రకర్మ విగర్హితమ్. 71 అహో కష్టతరా లోకే దుర్జనానాం హి సంగతిః, కారుకైస్తాడ్యతే వహ్నిరయస్సంయోగమాత్రతః. 72 అంశుమాన్నమ తనయో బభూవ హ్యసమంజసః, శాస్త్రజ్ఞో గుణవాన్ద్రర్మీ పితామహహితే రతః. 73 దుర్వృత్తాస్సాగరస్సర్వే లోకోపద్రవకారిణః, అనుష్ఠానవతాం నిత్యమన్తరాయా భవన్తి తే. 74 హుతాని యాని యజ్ఞేషు హవీంషి విధివద్ద్విజైః, బుభుజే తాని సర్వాణి నరాకృత్య దివౌకసః, 75 స్వర్గాదాహృత్య సతతం రంభాద్యా దేవయోషితః, భజన్తి సాగరాస్తావై కచగ్రహబలాత్కృతాః. 76 పారిజాతాదివృక్షాణాం పుష్పాణ్యాహృత్య తే ఖలాః, భూషయంతి స్వదేహాని మద్యపానపరాయణాః. 77 సాధువృత్తీస్సమాజహ్రుః సదాచారానాశయన్, మిత్తైశ్చ యోద్దుమారబ్దా బలినో7త్యన్త పాపినః. 78 ఏతద్దృష్ట్వాతి దుఃఖార్తా దేవా ఇన్ద్రపురోగమాః, విచారం పరమం చక్రురేతేషాం నాశ##హేతవే. 79 నిశ్చిత్య విబుధాస్సర్వే పాతాలాన్తరగోచరమ్. కపిలం దేవదేవేశం యయుః ప్రచ్ఛన్నరూపిణిః, 80 ధ్యాయన్తమాత్మనాత్మానం పరానన్దైకవిగ్రహమ్, ప్రణమ్య దండవద్భూమౌ తుష్టువుస్త్రి దశాస్తతః. 81 ఔర్వమహర్షి పలికెను : - ''మీ ఇద్దరిలో ఒకరికి వంశకరుడైన ఒక కుమారుడు కలుగును. ఇంకొకరికి అరవై వేలమంది కొడుకులు కలిగెదరు. ఎవరికెవరు కావలయునో కోరుకొనుడు''. ఔర్వమహర్షి మాటలను విని కేశిని ఒక కుమారుని కోరుకొనెను. సుమతి అరవైవేలమందిని కోరెను. అట్లే కేశినికి ఒక కుమారుడు, సుమతికి అరవై వేలమంది కుమారులు కలిగిరి. కేశిని కుమారుని పేరు అసమంజసుడు. అసమంజసనుడు మదించిన వాని వలె చెడుపనులను చేయుచుండెను. అసమంజసుని చూచి మిగిలిన సగరుని పుత్రులందరు చెడునడతను అలవాటు చేసుకొనిరి. అసమంజసుని బాలచేష్టలలో దౌష్ట్యమును చూచి సగరుడు చింతాక్రాంతుడాయెను. లోకములో దుర్జనసాంగత్యము కష్టములను కలిగించును. ఇనుముతో సంయోగమును పొందిన అగ్నికి సమ్మెట పోటు తప్పదు కదా? అసమంజసునికి అంశుమంతుడను కుమారుడు కలిగెను. అంశుమంతుడు అన్ని శాస్త్రములను తెలుసుకొనిన గుణవంతుడు, ధర్మజ్ఞుడు, తాత అయిన సగరుని హితమును కోరువాడుగా నుండెను. చెడునడత గల సగరుని పుత్రలందరు లోకమునకు ఉపద్రవమును కలిగించు చుండిరి. ధర్మమును అనుష్టించువారలకు విఘ్నములను కలిగించుచుండిరి. భ్రాహ్మణులు విధిపూర్వకముగా యజ్ఞములలో ఇచ్చిన హవిసన్సులను దేవతలను కాదని తామే స్వీకరించుచుండిరి. స్వర్గమునుండి రంభాదివేవతాస్త్రీలను బలవంతముగా జట్టుపట్టుకొని తీసుకొనివచ్చి అనుభవించుచుండిరి. వారందరు మద్యపానపరాయణులై స్వర్గమునుండి పారిజాతాదివృక్షములనుండి పుష్పములను తీసుకొనివచ్చి తమ దేహములను అలంకరించుకొనుచుండిరి. మంచి నడకగల వారిని అపహరించుకొని పోయిరి. సదాచారపరులను నశింపచేసిరి. బలవంతులు అత్యంతపాపులై మిత్రలతో యుద్ధము చేయనారంభించిరి. ఇంద్రుడు మొదలగు దేవతలు వీరి దౌర్జన్యములను చూచి మిక్కిలి దుఃఖముతో ఆర్తులై వీరిని నశింపచేయుటెట్లు అని ఆలోచించసాగిరి. చివరకి ఒక నిశ్చమయునకొచ్చిన దేవతలందరు పాతాలముననున్న దేవదేవేశుడైన కపిలమహర్షిని రహస్యముగా చేరుకొనిరి. ఎపుడూ ఉత్తమమైన ఆనందరూపముతో నుండి మనసులో పరమాత్మను ధ్యానించుచున్న కపిలమహర్షికి నమస్కరించి స్తోత్రము చేయనారంభించిరి. 67 - 81 దేవా ఊచుః :- నమస్తే యోగినే తుభ్యం సాంఖ్యయోగరతాయ చ, నరరూపప్రతిచ్ఛన్నవిష్ణవే జిష్ణవే నమః. 82 నమః పరేశభక్తాయ లోకానుగ్రహహేతవే, సంసారారణ్యదావాగ్నే ధర్మపాలనసేతవే.83 మహతే వీతరాగాయ తుభ్యం భూయో నమో నమః, సాగరై ః పీడితానస్మావస్త్రాయస్వ శరణాగతాన్. 84 దేవతలు పలికిరి : - '' యోగిని సాంఖ్యయోగమునందు ప్రీతిచెందువాడవు అయిన నీకు నమస్కారము. నరరూపముతో దాగియున్న విష్ణువునకు జయశీలునకు నమస్కారము. పరమాత్మభక్తుడవు, లోకారనుగ్రహకారణము, సంసారమను అరణ్యమునుకు దావాగ్నివి, ధర్మపాలనకు సేతువు అయిన నీకు నమస్కారము. రాగద్వేషములు లేని మహానుభావుడవైన నీకు నమస్కారము. సగరపుత్రులచే పీడించబడి నిన్ను శరణువేడిన మమ్ములను కాపాడుము''. కపిల ఉవాచ : - యే తు నాశమిహేచ్ఛన్తి యశోబలధనాయుషామ్, త ఏవ లోకాన్భాదన్తే నాత్రాశ్చర్యం సురోత్తమాః. 85 యస్తు భాధితుమిచ్ఛేత జనాన్నిరపరాధినః, తం విద్యాత్సర్వలోకేషు పాపభోగరతం సురాః.86 కర్మణా మనసా వాచా యస్త్వన్యాన్భాధతే సదా, తం హన్తి దైవమేవాశు నాత్ర కార్యా విచారణా. 87 అల్పైరహోభిరేవైతే నాశ##మేష్యన్తి సాగరాః , ఇత్యుక్తే మునినా తేన కపిలేన మహాత్మనా, 88 ప్రణమ్య తం యథాన్యాయం గతా నాకం దివౌకసః, కపిల మహర్షి పలికెను : - '' ఓ సురోత్తములారా ! తమ కీర్తని, బలమును, ధనమును ఆయుష్యమును నశింపచేసుకోగోరువారే లోకులను బాధింతురు. ఈ విషయమున ఆశ్చర్యముతో పనిలేదు. నిరపరాధులైన జనులను బాధించగోరువాడు అన్నిలోకములోను పాపభోగమునకు ఆశపడు వాడని తెలియవలయును. కర్మతో, మనసుతో, మాటతో ఎప్పుడూ ఇతరులను భాదించువానిని దైవమే త్వరలో నశింపచేయును. ఈ విషయమున విచారించవలసిన పనిలేదు. కొద్దిరోజులలోనే సగరపుత్రలు నశింతురు '' ఇట్లు కపిల మహర్షి చెప్పిన మాటలను వినిన దేవతలు కపిల మహర్షికి నమస్కరించి స్వర్గమునకు చేరిరి. 85 - 88 అత్రాన్తరే తు సగరో వసిష్ఠాద్యైర్మబహర్షిభిః, ఆరేభే హయమేధాఖ్యం యజ్ఞం కర్తుమనుత్తమమ్. 89 తద్యజ్ఞే యోజితం సప్తిమపహృత్య సురేశ్వరః, పాతాలే స్థాపయామాస కపిలో యత్ర తిష్ఠతి. 90 గూఢవిగ్రహశ##క్రేణ హృతమశ్వం తు సాగరాః, అన్వేష్టుం బభ్రముర్లోకాన్ భూరాదీంశ్చ సువిస్మితాః. 91 అదృష్టసప్తయస్తే చ పాతాలం గన్తు ముద్యతాః, చఖ్నుర్మహీతలం సర్వమేకైకో యోజనం పృథక్. 92 మృత్తికాం ఖనితాం తే చౌదధితీరే సమాకిరన్, తద్ద్వారేణ గతాస్సర్వే పాతాలం సగరాత్మజాః. 93 విచిన్వన్తి హయం తత్ర మదోన్మత్తా విచేతసః, 94 తత్రాపశ్యన్మహాత్మానం కోటిసూర్యసమప్రభమ్, కపిలం ద్యాననిరతం వాజినం చ తదన్తికే. 95 తతస్సర్వేతు సంరబ్ధా మునిం దృష్ట్వా తివేగితాః, హన్తుముద్యుక్తమనసో విద్రవన్తః సమాసదన్.96 హన్యతాం హన్యతామేష వధ్యతాం వధ్యతామయమ్, గృహ్యతాం గృహ్యతామాశు ఇత్యూచేస్తే పరస్పరమ్. 97 హృతాశ్వం సాధుభావనే బకద్ధ్యానతత్పరమ్, సన్తి చాహో ఖలా లోకే కుర్వన్త్యాడంబరం మ హత్. 98 ఇత్యుచ్చరన్తో జహసుః కపిలం తే మునీశ్వరమ్, సమస్తేన్ద్రియసందోహం నియమ్యాత్మానమాత్మని. 99 ఆస్థితః కపిలస్తేషాం తత్కర్మజ్ఞాతవాన్నహి. 100 ఆపన్నమృత్యవస్తే తు వినిష్టమతయో మునిమ్, పద్భిస్సంతాడయామాసుర్బాహుం చ జగృహుః పరే.101 తతస్త్యక్తసమాధిస్తు సమునిర్విస్మితస్తదా, ఉవాచ భావగంభీరం లోకోప్రదవకారిణః ఇంతలో సగర మహారాజు వసిష్ఠాది మహర్షులతో సాటిలేని అశ్వమేధయాగమును చేయుటకు ప్రారంభించెను. ఆ యజ్ఞమున ఏర్పరచిన యజ్ఞాశ్వమును ఇంద్రుడపహరించి పాతాలలోకమున కపిలమహర్షి ఉన్న ప్రాంతమున ఉంచెను. రహస్యరూపముతో ఇంద్రుడపహరించిన అశ్వమును వెతుకుటకు సగరపుత్రులు భూలోకాదికలోకములను తిరిగిరి. ఎచటను అశ్వము కనిపించనందున పాతాలమునకు వెళ్ళుటకు నిశ్చయించిరి. ఒక్కొక్కరు ఒక్కొక్కయోజన ప్రాంతమును భూమిన త్రవ్విరి. త్రవ్విన మట్టిని సముద్రతీరప్రాంతమున చల్లిరి. ఆ మార్గమున సగరాత్మజులందరూ పాతాలమునకు వెళ్ళిరి. మదముతో పిచ్చివారై, జ్ఞానహీనులై సగరపుత్రులు అచట గుఱ్ఱమును వెతుకుచు కోటిసూర్యకాంతితో ధ్యానములో నున్న మహానుభావుడైన కపిలమహర్షిని, అతని సమీపమున యజ్ఞాశ్వమును చూచిరి. అపుడు వారందరూ తొందరపాటుతో చాలావేగముగా కపిలమహర్షిని చంపుటకు సిద్ధపడి సమీపించిరి. ఇతనిని కొట్టండి! చంపండి. పట్టుకొండి, పట్టుకోండి అంటూ పలికిరి. అశ్వమును అపహరించి సాధువు వలె, కొంగవలె ధ్యానములో మునిగియున్నాడు. లోకమున కొందరు దుర్జనులు కపటముతో ఆడంబరముగా ప్రవర్తింతురు. ఇట్లు పలుకుచు కపిల మహర్షిని పరిహసించిరి. ఇంద్రియములను మనసును ఆత్మలో నియమించి సమాధిలో ఉన్న కపిలమహర్షికి వారి ప్రయత్నములు తెలియలేదు. బుద్ధినశించి, మృత్యువు సమీపించి న ఆ సగరపుత్రులు కపిలమహర్షిని పాదములతో కొట్టుచు, చేతులను పట్టుకొనిరి. అపుడు సమాధిని వదలిన కపిలమహర్షి ఆశ్చర్యముతో లోకోపద్రవమును చేయు సగరపుత్రులను గూర్చి గంభీర భావముతో ఇట్టు పలికెను. 89- 102 ఐశ్వర్యమదమత్తానాం క్షుథితానాం చ కామినామ్, అహంకారవిమూఢానాం వివేకో నైవ జాయతే. 103 నిధేరాధారమత్రేణ మహీ జ్వలతి సర్వదా, తదేవ మానవా భక్త్వా జ్వలన్తీతి కిమద్భుతమ్. 104 కిమత్ర చిత్రం సుజనం బాధన్తే యది దుర్జనాః, మహీరుహాంశ్చానుతటే పాతయన్తి నదీరయాః, 105 యత్ర శ్రీర్యౌవనం వాపి శారదా వాపి తిష్ఠతి, తత్రా శ్రీర్వృద్ధతా నిత్యం మూర్ఖత్వం చాపి జాయతే. 106 అహో కనక మహాత్మ్యమాఖ్యాతుం కేన శక్యతే, నామసామ్యాదహో చిత్రం ధత్తూరో7పి మదప్రదః. 107 భ##వేద్యది ఖలస్య శ్రీసై#్సవ లోకవినాశినీ, యథా సఖాగ్నేః పవనః పన్నగస్య యథా విషమ్. 108 అహో ధనమదాన్ధస్తు పశ్యన్నపి న పశ్యతి, యది పశ్యత్యాత్మ హితం స పశ్యతి న సంశయః 109 ఇత్యుక్త్వా కపిలః క్రుద్ధో నేత్రాభ్యాం ససృజే7నలమ్, స వహ్నిః సాగరాన్సర్వాన్భస్మసాదకరోత్ క్షణాత్. 110 యన్నేత్రజానలం దృష్ఠ్వా పాతాలతలవాసినః, అకాలప్రళయం మత్వా చుక్రుశుశ్శోకలాలసాః. 111 తదగ్నితా పితాస్సర్వే దన్దశూకాశ్చ రాక్షసాః సాగరం వివిశుశ్శీఘ్రం సతాం కోపో హి దుస్సహః 112 ''ఐశ్వర్యమదముతో మదించిని వారికి, ఆకలి గోన్నవారికి, కాముకులకు, అహంకారముచే మూఢులైన వారికివివేకము కలుగదు. నిధికి ఆధారమగుటచేతనే భూమి మండుచుండును. ఆ నిధినే మానవులనుభవించి మండుటలో ఆశ్చర్యమేమున్నది? దుర్జనులు సుజనులను బాధించుటలో వింతేమున్నది? నదీ వేగము ఒడ్డున ఉన్న చెట్లను పడవేయును కదా! ఐశ్వర్యము, ¸°వనము, తెలివి, ఉన్నచోట దారిద్య్రము, వార్ధక్యము, మూర్ఖత్వము కూడా వెంటనే ఉండును కదా! కనకపు మహాత్యము నెవ్వరు చెప్పగలరు? కనకమను నామ సామ్యముండుటచే ఉమ్మెంత కూడా మదమును కలిగించును కదా? అగ్నికి వాయువు మిత్రుడైనట్లు, పన్నగమునకు విషముండునట్లు, దుర్జనునకు సంపద కలిగినచో లోకవినాశము జరుగును. ధనమధముతో గుడ్డిలాడైనవాడు చూచుచున్ననూ చూడడు. ఆత్మహితమును చూచువాడే నిజముగా చూచువాడు." కోపించిన కపిలమహర్షి ఇట్లు పలికి కనుల నుండి అగ్నిని సృష్టించెను. ఆ అగ్ని సగరపుత్రులనందరిని క్షణకాలములో భస్మము చేసెను. కపిలమహర్షి కన్నులనుండి వెలువడిన అగ్నిని చూచి పాతాలమున నివసించువారు అకాలప్రలయమని భావించి శోకముతో ఆక్రోశించిరి. కపిలమహర్షి నేత్రాగ్నితో తపించి పోయిన రాక్షసులు సర్పములు త్వరగా సముద్రమున ప్రవేశించిరి. సత్పరుషుల కోపము సహించరానిది కదా! 103-112 అథ తస్య మహీపస్య సమూగమ్యాధ్వరం తదా, దేవదూత ఉవాచేదం సర్వం వృత్తం యి యక్షతే. 113 ఏతత్సమాకర్ణ్య వచః సగరః సర్వవిత్ప్రభుః , దైవేన శిక్షితా దుష్టా ఇత్యువాచాతిహర్షితః. 114 మాతా వా జనకో వాపి భ్రాతా వా తనయో 7పి వా, అధర్మం కురుతే యస్తు స ఏవ రిపురిష్యతే. 115 యస్త్వధర్మేషు నిరతః సర్వలోకవిరోధకృత్, తం రిపుం పరమం విద్యాచ్ఛాస్త్రాణామేష నిర్ణయః. 116 సగరః పుత్రనాశే7పి న శుశోచ మునీశ్వర! దుర్వృత్తనిధనం యస్మాత్సతాముత్సాహకారణమ్. 117 యజ్ఞేష్వనధికారత్వాదపుత్రాణామితి స్మృతేః. పౌత్రం తమంశుమంతం హి పుత్రత్వే కృతవాన్ప్రభుః. 118 అసమంజస్సుతం తం తు సుధియం వాగ్విదాం పరమ్, యుయోజ సారవిద్భూయో హ్యశ్వానయనకర్మ ణి. 119 స గతస్తద్బిలద్వారే దృష్ట్వా తం మునిపుంగవమ్, కపిలం తేజసాం రాశిం సాష్టాంగం ప్రణనామ హ. 120 కృతాంజలిపుటో భూత్వా వినయేనాగ్రతః స్థితః, ఉవాచ శాంతమనసం దేవ దేవం సనాతనమ్. 121 అపుడు యజ్ఞముచేయ నిచ్చయించి ఉన్న (యజ్ఞము చేయుచున్న) సగరమహారాజు వద్ద దేవదూత వచ్చి జరిగిన దంతయూ వివరించెను. సగరమహారాజు అంతయూ విని మిక్కిలి సంతోషముతో ''దుష్టులను దైవమే శిక్షించెను'' అని పలికెను. తల్లి అయిననూ, తండ్రి అయిననూ, సోదరుడైననూ, పుత్రుడైనను అధర్మము చేసినవాడు శత్రువే. అధర్మమునందు ఆసక్తుడై లోకులందరితో విరోధమును తెచ్చుకొనువాడు శత్రువే అగును అని శాస్త్ర నిర్ణయము. ఓ మునీశ్వరా! ప్రుత్ర నాశ##మైననూ సగరమహారాజు దుఃఖించలేదు. దుర్జనుని నాశము సత్పురుషులకు ఉత్సాహమును కలిగించును. పుత్రులు లేనివారికి యజ్ఞము చేయుటకు అధికారములేదని శాస్త్రము చెప్పుచున్నందున మనుమడైన అంశుమంతుని సగరమహారాజు పుత్రునిగా చేసుకొనెను. మంచిబుద్ధిగలవాడు, మాటలను తెలియువారిలో శ్రేష్టుడు అయిన అసమంజసపుత్రుని యజ్ఞాశ్వమును తెచ్చు టకు నియమించెను. అంశుమంతుడు బిలద్వారములోనికి వెళ్ళి తేజోనిధియైన కపిలమహర్షిని చూచి సాష్టాంగప్రణామము చేసెను. చేతులు జోడించి వినయముతో ఎదుట నిలిచి దేవదేవుడు సనాతనుడు శాంతమనస్కుడైన కపిల మహర్షిని గూర్చి పలికెను. 113-121 అంశుమానువాచ:- దౌశ్శీల్యం యత్కృతం బ్రహ్మన్మత్పితృవైః క్షమస్వ తత్, పరోపకారనిరతా క్షమాసారా హి సాధనః. 122 దుర్జనేష్వపి సత్త్వేషు దయాం కుర్వన్తి సాధనః. న హి సంహరతే జ్యోత్స్నాం తన్ద్రశ్చండాలవేశ్మనః . 123 బాధ్యమానో7పి సుజనః సర్వేషాం సుఖకృద్భవేత్, దదాతి పరమాం తుష్టిం భక్ష్యమాణో 7మరైశ్శశీ. 124 దారితశ్ఛిన్న ఏవాపి హ్యామోదేనైవ చందనః, సౌరభం కురుతే సర్వం తథైవ సుజనో జనః, 125 క్షాన్త్యా చ తపసాచారైస్త్వద్గుణజ్ఞా మునీశ్వరాః, సంజాతం శాసితుం లోకాంస్త్వాం విదుః పురుషోత్తమ! 126 నమో బ్రహ్మన్మునే తుభ్యం నమస్తే బ్రహ్మమూర్తయే, నమో బ్రహ్మణ్యశీలాయ బ్రహ్మధ్యానపరాయ చ. 127 ఇతి స్తుతో మునిస్తేన ప్రసన్నవదనస్తదా, వరం వరయ చేత్యాహ ప్రసన్నో7 స్మి తవానఘ !128 అంశుమంతుడు పలికెను:- ''ఓ మహర్షీ! మా పినతండ్రుల దుష్ప్పవర్తనను క్షమించుము. సజ్జనుల పరోపకారమునందు ఆసక్తులు. క్షమ గలవారు. సజ్జనులు దుష్టప్రాణుల యందు కూడా దయ చూపెదరు. చంద్రుడు చండాల గృహమున వెన్నెలను ప్రసరించకుండునా ? సజ్జనుడు బాదించబడుచున్ననూ అందరికి ఆనందమునే కలిగించును. దేవతలు ఆహారముగా తీసుకున్ననూ చంద్రుడు ఆహ్లదమునే కలిగించు కదా! చీల్చిననూ, నరికినను, చందన వృక్షము అందరిని, అన్నింటిని పరిమళవంతముచనే చేయును. సజ్జనుడును అట్లే చేయును. ఓర్పుతో, తపసుతో, ఆచారముతో నీ గుణములను తెలిసిన మునీస్వరులు లోకములను పాలించుటకే నీవవతరించితివని తెలియుదురు. ఓ మునీశ్వరా ! పరబ్రహ్మా ! నీకు నమస్కారము. బ్రహ్మమూర్తివి, బ్రాహ్మణప్రియుడవు అయిన నీకు నమస్కారము. బ్రహ్మధ్యానరహితుడవైన నీకు నమస్కారము. ఇట్లు అంశుమంతుడు స్తోత్రముచేయగా కపిలమహర్షి ప్రసన్నవదనముతో ''నీకు ప్రసన్నుడనైతిని. వరమును కోరుము'' అని పలికెను. 122-128 ఏవముక్తే తు మునినా హ్యంశుమాన్ప్రణిపత్య తమ్, ప్రాపయాస్మత్పితౄన్బ్రాహ్మం లోకమిత్యభ్యభాషత. 129 తతస్తస్యాతిసంతుష్టో మునిః ప్రోవాచ సాదరమ్, గంగామానీయ పౌత్రస్తే నయిష్యతి పి తౄన్దివమ్. 130 త్వత్పౌత్రేణ సమానీతా గంగా పుణ్యజలా నదీ, కృత్వైతాన్థూతపాపన్వై నయిష్యతి పరం పదమ్. 131 ప్రాపయైనం హయం వత్స యతస్స్యాత్పూర్ణమద్వరమ్, పితామహాన్తికం ప్రాప్య సాశ్వం వృత్తం న్యవేదయత్. 132 సగరస్తేన పశునా తం యజ్ఞం బ్రహ్మణౖస్సహ, విధాయ తపసా విష్ణుమారాధ్యాప పదం హరేః. 133 ఇట్లు కపిల మహర్షి పలుకగా అంశుమంతుడు నమస్కరించి ''మా పితరులను బ్రహ్మలోకమును పొందించుము'' అని ప్రార్థించెను. ఆ మాటకు మిక్కిలి సంతోషించిన కపిలమహర్షి ఆదరముతో నీ మనుమడు గంగను తీసుకొని వచ్చి నీ పితరులను స్వర్గమును చేర్చునని పలికెను. ''నీ మనువడు తీసుకొచ్చిన పవిత్రజలములు గల గంగానది నీ పితరులను పాపరహితులను చేసి పరమ పదమును చేర్చును. ఈ అశ్వమును నీ తాత వద్దకు చేర్చుము. ఈ అశ్వముతో యజ్ఞము పూర్తియగును.'' అంశుమంతుడు ఆ యశ్వమును తాత వద్దకు తీసుకొని వెళ్ళి జరిగినదంతయూ వివరించెను. సగరమహారాజు ఆ యశ్వముతో, బ్రహ్మణులతో యజ్ఞమును, విధిపూర్వకముగా పూర్తి చేసి, తపస్సుచే విష్ణువు నారాధించి పరమ పదమును పొందెను. 129-133 జజ్ఞే హ్యంశుమతః పుత్రో దిలీప ఇతి విశ్రుతః, తస్మాద్భగీరథో జాతో యో గంగామానయద్దివః. 134 భగీరథస్య తపసా తుష్టో బ్రహ్మ దదౌ మునే, గంగాం భగీరథాయాత్ర చింతయామాస ధారణ. 135 తతశ్చ శివమారాధ్య తద్ద్వారా స్వర్ణదీం భువం, ఆనీయ తజ్జలైః స్పృష్ట్వా పూతాన్నిన్నే దివం పితౄన్. 136 భగీరథాన్వయే జాతస్సుదాసో నామ భూపతిః, తస్య పుత్రో మిత్రసహః సర్వలోకేషు విశ్రుతః. 137 వసిశ్ఠాపాత్ప్రస్తస్స సౌదాసో రాక్షసీం తనూమ్, గంగాబిన్దునిషేవేణ పునర్ముక్తో నృపో7భవత్. 138 ఇతి శ్రీబృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే గంగామహాత్మ్యం నామ అష్టమో7ధ్యాయః అంశుమంతునికి దిలీపుడను పుత్రుడు కలిగెను. ఆ దిలీపునికి భగీరథుడను కుమారుడు కలిగెను. ఈ భగీరథుడే స్వర్గమునుండి గంగను తీసుకొని వచ్చెను. భగీరథుని తపస్సునకు మెచ్చిన బ్రహ్మ గంగను వరముగా నిచ్చెను. ఆ గంగను ఇచట ధరించగల వాడెవడని ఆలోచించి పరమశివుని ఆరాధించి శివుని ద్వారా దేవనదిని భూలోకమునకు తీసుకొని వచ్చి, ఆ గంగాజలముచే సగరపుత్రులను స్పృశింపచేసి పవిత్రులైన వారిని స్వర్గమునకు చేర్చెను. ఈ భగీరథుని వంశముననే సుదాసుడను రాజు పుట్టెను. సుదాసునికి మిత్రసహుడను పుత్రుడు కలిగెను. ఇతను అన్నిలోకములలో ప్రసిద్ధి చెందెను. వసిష్ఠమహర్షి శాపము వలన మిత్రసహుడు రాక్షస శరీరమును పొందెను. గంగాబిందువు స్పర్శచే రాక్షస శరీరమును విడిచి మరల రాజాయెను. 129-138 ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామాహాత్మ్యమను ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.