Sri Naradapuranam-I
Chapters
Last Page
నవమో7ధ్యాయః = తొమ్మిదవ అధ్యాయము గంగామహాత్మ్యమ్ నారద ఉవాచ:- శప్తః కథం వసిష్టేన సౌదాసో నృపసత్తమః, గంగాబిన్ద్వభిషేకేణ పునః శుద్ధో7భవత్కథమ్. 1 సర్వమేతదశేషేణ భ్రాతర్మే వక్తుమర్హసి, శృణ్వతాం వదతాం చైవ గంగాఖ్యానం శుభావహమ్. 2 నారద మహర్షి పలికెను:- ''ఉత్తమ భూపాలుడైన సౌదాసుడు వసిష్ఠమహర్షి శాపమునెట్లు పొందెను? గంగా బిన్ద్వభిషేకముతో మరల ఎట్లు శుద్ధుడాయెను? దీని నంతటినీ వివరముగా నాకు చెప్పుము. గంగా చరితమును వినినవారలకు చెప్పినవారలకు శుభములు కలుగును. ''
1, 2 సనక ఉవాచ:- సౌదాసః సర్వధర్మజ్ఞః సర్వజ్ఞో గుణవాన్ శుచిః, బుభుజే పృథివీం సర్వాం పితృపద్రఞ్జయన్ప్రజాః. 3 సగరేణ యథాపూర్వం మహీయం సప్తసాగరా, రక్షితా తద్వదమునా సర్వధర్మావిరోధినా. 4 పుత్రపౌత్రసమాయుక్తః సర్వైశ్వర్యసమన్వితః, త్రింశదష్టసహస్రాణి బుభుజే పృథివీం యువా. 5 సౌదాసస్త్వే కదా రాజా మృగయాభిరతిర్వనమ్, వివేశ సబలః సమ్యక్ శోధితం హ్యాప్తమంత్రిభిః. 6 నిషాదైః సహితస్తత్ర వినిఘ్నన్మృగసంచయమ్, ఆససాద నదీం రేవాం ధర్మజ్ఞః స పిపాసితః. 7 సుదాసతనయస్తత్ర స్నాత్వా కృత్వాహ్నికం మునే, భుక్త్వా చ మంత్రిభిస్సార్థం తాం నిశాం తత్ర చావసత్. 8 తతః ప్రాతస్సముత్థాయ కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్, బభ్రామ మన్త్రిసహితో నర్మదాతీరజే వనే. 9 వనాద్వనాన్తరం గచ్ఛన్నేక ఏవ మహీపతిః, ఆకర్ణకృష్టబాణః సన్కృష్ణసారం సమన్వగాత్. 10 దూరసైన్యో7 శ్వమారూఢః స రాజానువ్రజన్మృగమ్, వ్యాఘ్రద్వయం గుహాసస్థమపశ్యత్సురతే రతమ్. 11 మృగపృష్ఠం పరిత్యజ్య వ్యాఘ్రయోః సంముఖం య¸°, ధనుస్సంహితబాణన తేనాసౌ శరశాస్త్రవిత్. 12 తాం వ్యాఘ్రీం పాతయామాస తీక్ష్‌ణాగ్రనతపర్వణా, తమా సా వ్యాఘ్రీ షట్త్రింశద్యోజనాయతా. 13 తటిద్వద్ఘోరనిర్ఘోషా రాక్షసీ వికృతాభవత్, పతితాం స్వప్రియాం వీక్ష ద్విశన్స వ్యాఘ్రరాక్షసః. 14 ప్రతిక్రియాం కరిష్యామీత్యుక్త్వా చాంతర్దదే తదా, రాజా తు భయసంవిగ్నో వనే సైన్యం సమేత్య చ. 15 తద్వృత్తం కథయన్సర్వాన్స్వాం పురీం సన్యవర్తత, శంకమానస్తు తద్రక్షః కృత్యాద్రాజా సుదాసజః. 16 పరితత్యాజ మృగయాం తతః ప్రభృతి నారద! 17 సనకమహర్షి పలికెను:- సౌదాసుడు సర్వధర్మములు తెలిసినవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. గుణవంతుడు. పవిత్రుడు తండ్రివలె ప్రజలను రంజింపచేయుచు పృథివిని అనుభవించుచుండెను. ఏడు సముద్రములతో కూడియున్న ఈ భూమిని పూర్వము సగరచక్రవర్తి పరిపాలించినట్లు సౌదాస మహారాజు ఏధర్మమునకు భంగము కలుగని విధముగా పరిపాలించుచు పుత్రులతో పౌత్రులతో కలిసి అన్ని సంపదలు కలవాడై అనుభవించెను. సౌదాసమహారాజు ఒకమారు వేటయందు కోరిక గలవాడై ఆప్తులైన మంత్రులు ముందుగా పరీక్షించిన అరణ్యమున ప్రవేశించెను. వేటగాళ్ళతో కలిసి మృగసమూహములను చంపుచు ధర్మము తెలిసిన సౌదాసుడు దప్పిగొని రేవానదిని చేరెను. సౌదాసమహారాజు రేవానదిలో స్నానము చేసి సంధ్యావందనాదికములను ముగించుకొని మంత్రులతో కలిసి భోజనము చేసి ఆ రాత్రి అచటనే గడిపెను. మరల ప్రొద్దుననే లేచి ప్రాతఃకాలకృత్యములను ముగించుకొని మంత్రులతో కలిసి రేవానదీ తీరప్రాంతారణ్యములలో తిరిగెను. తరువాత ఒక్కడే ఒక అరణ్యమునుండి మరొక అరణ్యమునకు వెళ్ళుచు చెవివరకు నారిని లాగి బాణమును ఎక్కుపెట్టి జింకవెంట వెళ్ళెను. అట్లు జింక వెంట గుఱ్ఱముమీద వెళ్ళుచున్న రాజు సైన్యమునకు చాలా దూరముగా వెళ్ళెను. అచట ఒక గుహలో సంభోగము చేయుచున్న పులుల జంటను చూచెను. జింకను విడచి పులుల కెదురుగా వెళ్ళెను. ఎక్కుపెట్టియున్న బాణముతో ఆడపులిని పడవైచెను. ఆ యాడపులి పడుచు ముప్పది యారు యోజనముల విశాలమగు శరీరము కల రాక్షసిగా మారి ఉరుమువలె భయంకరముగా ఆరిచెను. పడిపోయిన తన ప్రియురాలిని చూచి ఆ వ్యాఘ్రాసురుడు రాజును ద్వేషించి ''ప్రతీకారమును చేసెదను''. అని పలికి అచటనే అంతర్ధానమును చెందెను. సౌదాసమహారాజు భయమును చెంది అరణ్యమున తన సైన్యమును చేరి జరిగినదంతయూ వారికి తెలిపి నగరమునకు తిరిగి వెళ్ళెను. రాక్షసుని ప్రతీకారమును శంకించుచు సౌదాస మహారాజు అప్పటినుండి వేటను మానుకొనెను. 3-16 గతే బహుతిథే కాలే హయమేధమఖం నృపః. 17 సమారేబే ప్రసన్నాత్మా వసిష్ఠాద్యమునీశ్వరైః , తత్రః బ్రహ్మాదివేభ్యో హవిర్దత్వా యథావిధి. 18 సమాప్య యజ్ఞతనిష్క్రాంతో వసిష్ఠః స్నాతకో7పి చ, ఆత్రాన్తరే రాక్షసో7 సౌ నృపహింసితభార్యకః, 19 కర్తుం ప్రతిక్రియాం రాజ్ఞే సమాయాతో రుషాన్వితః. స రాక్షసస్తస్య గురౌ ప్రయాతే వసిష్ఠవేషం తు తదైవ ధృత్వా, 20 రాజానమభ్యేత్వ జగాద భోక్ష్యే మాంసం సమిచ్ఛామ్యహమిత్యువాచ. 21 భూయస్సమాస్థాయ స సూదవేషం, పక్త్వా మిషం మానుషమస్య ప్రాదాత్ , స్థితశ్చ రాజాపి హిరణ్యపాత్రే, ధృత్వా గురోరాగమనం ప్రతీక్షన్. 22 తన్మాంసం హేమపాత్రస్థం సౌదాహా వినయాన్వితః, సమాగతాయ గురవే దదౌ తసై#్మతు సాదరమ్ 22 తం దృష్ట్వా చింతయామాస గురుః కిమితి విస్మితిః, 23 అపశ్యన్మానుషం మాంసం పరమేణ సమాధినా, అహో7 స్య రాజ్ఞో దౌశ్శీల్యమభక్ష్యం దత్తవాన్మమ. 24 ఇతి విస్మయమాపన్నః ప్రమన్యురభవన్మునిః, అభోజ్యం మద్విఘాతాయ దత్తం హి పృథివీపతే! 25 తస్మాత్తవాపి భవతు హ్యేతదేవ హి భోజనమ్, నృమాంసం రక్షసామేవ భోజ్యం దత్తం మమ త్వయా. 26 తద్యాహి రాక్షసత్వం త్వం దతాహారోచితం నృప, ఇతి శాపం దదత్యస్మిన్సౌదాసౌ భయవిహ్వలః. 27 ఆజ్ఞపో భవతైవేతి సకంపో7స్య వ్యజిజ్ఞపత్, భూయశ్చ చింతయామాప వసిష్ఠస్తేన నోదితః. 28 రక్షసా వంచితం భూపం జ్ఞాతవాన్ దివ్యచక్షుషా, రాజాపి జలమాదాయ వసిష్ఠం శప్తుముద్యతః. 29 సముద్యతం గురుం శప్తుం దృష్ట్వా భూయో రుషాన్వితమ్, మదయంతీ ప్రియా తస్య ప్రత్యువాచాథ సువ్రతా. 30 చాలా దినములు గడిచిన తరువాత ప్రసన్నమైన మనస్సుగల సౌదాస మహారాజు వసిష్ఠాది మహర్షులతో అశ్వమేధయాగము చేయ నారంభించెను. ఆ యాగమున బ్రహ్మాది దేవతలను హవిస్సునిచ్చి యజ్ఞమును సమాప్తి గావించి, స్నానము చేయుటకై వసిష్ఠ మహర్షి (నదికి) వెళ్లెను. ఇంతలో సౌదాసునిచే భార్యను పోగొట్టుకొన్న వ్యాఘ్రారాక్షసుడు కోపముతో ప్రతీకారమును చేయుటకు వచ్చెను. ఆ రాక్షసుడు వసిష్ఠ మహర్షి వెళ్ళిన తరువాత వసిష్ఠ మహర్షి వేషమును ధరించి రాజు వద్దకు వచ్చి భోజనములో మాంసము కావలయునని పలికెను. తరువాత ఆ రాక్షసుడు వంటవాని వేషముతో మనిషి మాంసమును వండి రాజునకిచ్చెను. ఆ మాంసమను బంగారు పాత్రలో ఉంచి గురువుగారి రాకను ఎదురు చూచుచుండెను. వసిష్ట మహర్షి వచ్చిన వెంటనే సౌదాస మహారాజు ఆదరముతో ఆ మాంసమునుంచెను. దానిని చూచిన వసిష్ఠ మహర్షి ఆశ్చర్యముతో ఏమిటిది అని ఆలోచించెను. పరమ సమాధితో అది నరమాంసమని తెలిసుకొనెను. ''ఈ సౌదాసుని దుష్టత్వమెంత వింత. తినరాని దానిని నాకు భోజనముగా పెట్టెను!'' ఇట్లు ఆశ్చర్యమును చెంది మిక్కిలి కోపించెను. ''ఓ రాజా! నేను చెడిపోవుటకు తినరాని దానిని ఇచ్చితివి. కావున నీకు కూడా ఇదియే భోజన మగుగాక. రాక్షసుల కాహారమైన నరమాంసమును నాకు ఇచ్చితివి కావున ఆ ఆహరమునకు తగిన రాక్షసత్వమునే నీవు పొందుము.''ఇట్లు వసిష్ఠమహర్షి శాపమిచ్చుచుండగా సౌదాస మహారాజు భయముతో వణుకుచు మీరే మాంసాహారము నీయమని ఆజ్ఞాపించితిరి కదా అని పలికెను. ఆ మాటలను వినిన వసిష్ఠ మహర్షి మళ్ళీ ఆలోచించి దివ్యదృష్టితో రాక్షసుడు రాజును మోసగించెనని తెలుసుకొనెను. సౌదాస మహారాజు కూడా వసిష్ఠ మహర్షిని శపించుటకు జలమును తీసుకొనెను. చాలా కోపముతో వసిష్ఠ మహర్షిని శపించుటకు సిద్ధపడిన సౌదాసమహారాజును చూచి ఆతని ప్రియపత్ని మదయంతి ఇట్లు పలికెను. 17-34 మదయంత్యువాచ:- భో! భో ! క్షత్రియాదాయాద ! కాపం సంహర్తుమర్హసి, త్వయా యత్కర్మ భోక్తవ్యం త్ప్రాప్తం నాత్ర సంశయః.31 గురుం తుంకృత్య హుంకృత్య యో వదేన్మూఢధీర్నరః, అరణ్య నిర్జలే దేశే స భ##వేద్బ్రహ్మారాక్షసః. 32 జితేన్ద్రియా జితక్రోధా గురుశుశ్రూషణ రతాః, ప్రయాన్తి బ్రహ్మసదనమితి శాస్త్రేషు నిశ్చయః. 33 తయోక్తో భూపతిః కోపం త్యక్త్వా భార్యాం ననన్ద చ, జలం కుత్ర క్షిపామీతి చిన్తయామాస చాత్మనా. 34 తజ్జలం యత్ర సంసిక్తం తద్భవేద్భస్మనిశ్చతమ్ ఇతి మత్వా జలం తత్తు పాదయో ర్య్నక్షిపత్ స్వయమ్. 35 తజ్జలస్పర్శమాత్రేణ పాదౌ కల్మాషతాం గతౌ, కల్మాషపాద ఇత్యేవ తతః ప్రభృతి విశ్రుతః. 36 కల్మాషపాదో మతిమాన్ ప్రియయాశ్వసితస్తదా, మనసా సో 7తిభీతస్తు వవన్దే చరణౌ గురోః. 37 ఉవాచ చ ప్రపన్నస్తం ప్రాంజలిర్నయకోవిదః, క్షమస్వ భగవన్సర్వం నాపరాధః కృతో మయా. 38 తచ్ఛ్రుత్వోవాచ భూపాలం మునిర్నిశ్వస్య దుఃఖితః, ఆత్మానం గర్హయామాస హ్యవివేక పరాయణమ్. 39 అవివేకో హి సర్వేషామాపదాం పరమం పదమ్, వివేకరహితో లోకే పసురేవ న సంశయః. 40 రాజ్ఞా త్వజానతా నూనమేతత్కర్మోచితం కృతమ్, వివేకరహితో7జ్ఞో 7హం యతః పాపం సమాచరమ్. 41 వివేకనియతో యాతి యో వాకో వాపి నిర్వృతిమ్, వివేకహీన ఆప్నోతి యో వా కో వాప్యనిర్వృతిమ్. 42 ఇత్యుక్త్వా చాత్మనాత్మానం ప్రత్యువాచ మునిర్నృపమ్, నాత్యన్తికం భ##వేదేతద్ద్వాదశాబ్దం భవిష్యతి. 43 గంగాబిన్ద్వభిషిక్తస్తు త్యక్త్వా వై రాక్షసీం తనుమ్, పూర్వరూపం సమాపన్నో భోక్ష్యసే మేదినీమిమామ్. 44 తద్బిన్దు షేకసంభుతజ్ఞానేన గతకల్మషః, హరిసేవాపరో భూత్వా పరాం శాన్తిం గమిష్యసి. 45 మదయంతి పలికెను:- ''ఓ మహారాజా! కోపమును ఉపసంహరింపుము. నీవు అనుభవించ వలసిన దానినే పొందితిని. ఈ విషయమున సందేహముతో పనిలేదు. గురువును తిరస్కారముతో దూషించు మూర్ఖుడు అరణ్యమున నిర్జల ప్రదేశమున బ్రహ్మరాక్షసుడుగా పుట్టును. ఇంద్రియములను, క్రోధమును జయించినవారు, గురువుసేవలో ఆసక్తులైనవారు బ్రహ్మలోకమును పొందెదరని శాస్త్ర నిర్ణయము.'' ఇట్లు మదయంతి మాటలను వినిన సౌదాస మహారాజు కోపమును విడిచి పెట్టి మదయంతిని అభినందించెను. శాపమునకు గ్రహించిన జలమును ఎక్కడ చల్లవలయునని ఆలోచించెను. ఆ నీటితో చల్లిన ప్రదేశము భస్మమగుట నిశ్చితము. ఇట్లు నిశ్చయించి ఆ జలమును తన పాదములపై చల్లుకొనెను. ఆ జలము తాకగానే సౌదాస మహారాజు పాదములు కాలి మాడి కల్మషము లాయోను. అప్పటినుండి సౌదసునికి కల్మాషపాదుడను పేరు ప్రసిద్ధిగాంచెను. బుద్ధిమంతుడగు కల్మాషపాదుడు మదయంతిచే ఓదార్చబడి మనసులో చాలా భయపడుచు గురువు పాదములకు నమస్కరించెను. శరణువేడి చేతులు జోడించి వినయముతో నీతికోవిదుడైన కల్మాషపాదుడు ''ఓ మహానుభావా !క్షమించుము. నేను అపరాధము చేయలేదు'' అని పలికెను. ఆ మాటలను వినిని వసిష్ఠ మహర్షి బరువుగా నిట్టూర్చి దుఃఖించునవాడై అవివేకపరాయణుడైన తనను తాను నిందించుకొనెను. ''అన్ని ఆపదలకు మూలకారణము అవివేకమే. ఈ లోకమున వివేకము లేనివాడు పశుతుల్యుడే. సంశయముతో పనిలేదు. తెలియని రాజు ఉచితమైన పనినే చేసెను. వివేకరహితుడను ఆజ్ఞడనైన నేను పాపమును ఆచరించితిని. వివేకము కలవాడు ఏదో ఒక ఆనందమును పొందగలడు. వివేకము లేనివాడు ఏదో ఒక దుఃఖమును పొందగలడు''.ఇట్లు తనను తాను నిందించుకొని వసిష్ఠ మహర్షి ''ఈ రాక్షసత్వము శాశ్వతము కాదు పన్నెండు సంవత్సరములుండును. గంగా బిందువులో స్నానమాడి రాక్షసత్వమును విడిచి మొదటి రూపమును పొంది రాజ్యమును పాలించగలవు. గంగాబిందుస్పర్శచే కలిగిన జ్ఞానముచే పాపములు తొలగి శ్రీహరి సేవాపరుడవై ఉత్తమశాంతిని పొందగలవు. '' అని పలికెను. 31-45 ఇత్యుక్త్వా ధర్వవిద్భూపం వసిష్ఠః స్వాశ్రమం య¸°, రాజాపి దుఃఖసంపన్నో రాక్షసీం తనుమాశ్రితః. 46 క్షుత్పిపాసావిశేషార్తో నిత్యం క్రోధపరాయణః, కృష్ణపక్షపాద్యుతిర్భీమో బభ్రామ విజనే వనే. 47 మృగాంశ్చ వివిధాంస్తత్ర మానుషాంశ్చ సరీసృపాన్, విహంగమాన్ ప్లవంగాశ్చ ప్రశస్తాంస్తానభక్షయత్. 48 అస్థిభిర్భహుభిర్భూయః పీతరక్తకలేవరైః, రక్తాన్త ప్రేతకేశైశ్చ చిత్రాసీద్బూర్భయంకరీ. 49 ఋతుత్రయే స పృథివీం శతయోజన విస్తృతామ్, కృత్వాతి దుఃఖితాం పశ్చాద్వనాన్తరముపాగమత్. 50 తత్రాపి కృతవాన్నిత్యం నరమాంసాశనం సదా, జగామ నర్మదాతీరం మునిసిద్ధనిషేవితమ్. 51 అధర్వవేదమును బాగుగా తెలిసిన వసిష్ఠమహర్షి ఇట్లు పలికి తన ఆశ్రమమునకు వెడలిపోయెను. రాజు కూడా దుఃఖముతో రాక్షస శరీరమును పొంది మిక్కిలి ఆకలిదప్పులచే బాధపడుచు ఎల్లప్పుడూ కోపము కలవాడై కృష్ణపక్ష రాత్రివలె భయంకరరూపుడై జనులు లేని అరణ్యమున తిరుగుచుండెను. పలువిధములైన మృగములను, మానవులను, పాములను, పక్షులను, వానరులను భక్షించుచుండెను. పచ్చని ఎఱ్ఱని శరీరముతో చాలా ఎముకలతో ఎఱ్ఱని కొనలు గల కేశములతో భూమి విచిత్రముగా భయంకరముగా మారెను. ఆరునెలలు నూరు యోజనముల విశాలమైన భూమిని బాధించి దుఃఖింపచేసి తరువాత మరొక అరణ్యమునకు వెళ్ళెను. అచట కూడా ప్రతిరోజు నరమాంసభక్షణము చేయుచు మునులు సిద్ధులు సేవించుచున్న నర్మదా తీరమును చేరెను. 46-51 విచరన్నర్మదాతీరే సర్వలోక భయంకరః, అపశ్యత్కంచన మునిం రమన్తం ప్రియయా సహా. 52 క్షుధానలేన సంతప్తస్తం మునిం సముపాద్రవత్, జగ్రాహ చాతివేగేన వ్యాధ్యో మృగశిశుం యథా. 53 బ్రహ్మణీ స్వపతిం వీక్ష్య నిశాతరకరస్థితమ్ , శిరస్యంజలిమాదాయ ప్రోవాచ భయవిహ్వాలా. 54 అన్ని లోకములకు భయమును కలిగించువాడై సౌదాసుడు నర్మదాతీరమున తిరుగుచు ప్రియురాలితో రమించుచున ఒక మునిని చూచెను. ఆకలి అనెడు అగ్నిచే పరితపించుచున్న ఆ సౌదాసుడు ముని కొఱకు పరుగెత్తి వేటగాడు మృగశిశువును పట్టుకొనినట్లు పట్టుకొనెను. ఆ ముని భార్య రాక్షసుని చేతిలో నున్న తన భర్త ను చూచి భయముతో తొట్రు పడుచు చేతులు జోడించి రాక్షసునితో ఇట్లు పలికెను. బ్రాహ్మణ్యువాచ:- భో !భో !నృపతిశూర్దూల! త్పాహి మాం భయవిహ్వలామ్, ప్రాణప్రియప్రదానేన కురం పూర్ణం మనోరథమ్. 55 నామ్నా మిత్రసహస్త్వం హి సూర్యవంశసముద్భవః ,న రాక్షసస్తతో7 నాథాం పాహి మాం విజనే వనే. 56 యా నారీ భర్తృరహితా జీవత్యపి మృతోపమా, తథా 7పి బాలవైధవ్యం కిం వక్ష్యామ్యపరిమర్దన !57 న మాతా పితరౌ జానే నాపి బంధుం చ కంచన, పతిరేవ పరో బంధుః పరమం జీవనం మమ.58 భవాన్వేత్త్యఖిలాన్ధర్మాన్యోషితాం వర్తనం యథా, త్రాయస్వ బంధురహితాం బాలాపత్యాం జనేశ్వర ! 59 కథం జీవామి పత్యస్మిన్హీ వా హి విజనే వనే, దుహితాహం భగవతస్త్రాహి మాం పతిదానతః. 60 ప్రాణదానాత్పరం దానం న భూతం న భవిష్యతి, వదన్తీతి మహారప్రాజ్ఞాః ప్రాణదానం కురుష్వమే . 61 ఇత్యుక్త్వా సా పపాతాస్య రాక్షసస్య పదాగ్రతః,ఏవం సంప్రార్ద్యమానో7 పి బ్రహ్మాణ్యా రాక్షసో ద్విజమ్. 62 అక్షయక్షయత్కృష్ణసారశిశుం వ్యాఘ్రో యథా బలాత్. తతో విలప్య బహుధా తస్య పత్నీ ప్రతివ్రతా , పూర్ల శాపహతం భూవమశపత్క్రోధితా పునః. 63 పతిం మే సురతాసక్తం య్మాద్ధింసితవాన్బలాత్, తస్మాత్ స్త్రీసంగమం ప్రాప్తస్త్వమపి ప్రాస్స్యసే మృతిమ్. 64 శ##పై#్వవం బ్రాహ్మాణీ క్రుద్ధా పునశ్శాపాన్తరం దదౌ, రాక్షస్వం ధ్రువం తే7స్తు మత్పితిర్భక్షితో యతః. 65 సో 7పి శాపద్వయం శ్రుత్వా తయా దత్తం నిశాచరః, ప్రమన్యుః ప్రాహ విసృజన్కోపాదంగారసంచయమ్. 66 దుష్టేకస్మాత్ప్రదత్తం మే వృధా శాపద్వయం త్వయా ఏకసై#్యవాపరరాధస్య శాపస్త్వేకో మమోచితః. 67 యస్మాత్ క్షిపసి దుష్టాగ్య్రే !మయి శాపాన్తరం తతః, పిశాచయోనిమధ్యైవ యాహి పుత్రసమన్వితా. 68 తేనైవం బ్రాహ్మణీ శప్తా పిశాచత్వం తదా గతా, క్షుధార్తా సుస్వరం భీమా రురోదాపత్యసంయుతా. 69 రాక్షసశ్చ పిశాచీ చ క్రోశషన్తౌ నిర్జనే వనే, దగ్మతుర్నర్మదాతీరే వనం రాక్షససేవితమ్. 70 బ్రాహ్మణి పలికెను:- ''ఓ రాజశ్రేష్ఠా !భయముతో వణుకుచున్న నన్ను కాపాడుము. నా ప్రాణప్రియుని నాకిచ్చి నా కోరికను నెరవేర్చును. నీవు సూర్యవంశమున పుట్టినవాడవు. మిత్రసహుడు అను పేరు గల వాడవు. జాతిచే రాక్షసుడవుకావు. నిర్జనమైన అరణ్యములో అనాధగా ఉన్న నన్ను కాపాడుము. భర్త లేని స్త్రీ బ్రతికున్ననూ మరణించిన దానితో సమానమే. అందులో చిన్నతనములో వైధవ్యము మరీ సహించరానిది. నాకు తల్లిదండ్రులు లేరు. బంధువులు లేరు. నాకు భర్తయే బంధువు. భర్తయే జీవనము. నీకు అన్ని ధర్మములు తెలియును. స్త్రీ జీవనము తెలియును. కావున బంధువులు లేని దానిని చిన్నపిల్లవాని తల్లిని అయిన నన్ను కాపాడుము. భర్తలేనిదే ఈ నిర్జనారణ్యమున ఎట్లు బ్రతుకగలను? నేను నీకు కూతురు వంటిదానను. పతిదానము చేసి నన్ను కాపాడుము. ప్రాణదానమును మించిన దానము ఇదివరకు లేదు. ఇకముందు ఉండబోదు. ఇట్లు ప్రాజ్ఞులు చెప్పెదరు. కావున నాకు ప్రాణదానమును చేయుము''. ఇట్లు పలికి ఆ బ్రహ్మణి రాక్షసుని పాదాలముందు పడిపోయెను. ఆ ముని భ్రయ పలివిధములుగా విలపించి ఇదివరకే శాపముననుభవించుచున్న రాజును కోపముచే మరల శపించెను. సంభోగములోనున్న నాభర్తను హింసించితివి కావున నీవు కూడా స్త్రీసంగమసమయమున మృతి చెందెదవు. ఇట్లు శపించిననూ కోపము చల్లారక మరల ఇంకొక శాపమునిచ్చెను. నాభర్తను భక్షించితివి కావున నీవు రాక్షసత్వమునే ఎప్పటికీ వహించి యుండుము. ఈ రాక్షసుడు కూడా శాపద్వయమును విని బాగా కోపించి కనులనుండి నిప్పులను చెఱగుచు ఇట్లు పలికెను. ''ఓ దుష్టురాలా! నాకు రెండు శాపములను వ్యర్థముగా నిచ్చితివి. ఒక అపరాధమునకు ఒక శాపము యోగ్యము. నీవు రెండవ శాపమును ఇచ్చితివి కావున పుత్రునితో పాటు నీవు పిశాచత్వమును పొందుము. ''ఇట్లు రాక్షసుని శాపమును పొందిన ఆ బ్రహ్మణి వెంటనే పిశాచత్వమును పొందెను. ఆ బ్రహ్మణి పిశాచరూపముతో ఆకలితో పీడించబడి భయంకరముగా రోదించెను. ఆ నిర్జనారణ్యమున రాక్షసుడు, పిశాచి అరచుచు నర్మదా తీరమున రాక్షససేవితమైన అరణ్యమునకు వెళ్ళిరి. 55-70 ఔదాసీన్యం గురౌ కృత్వా రక్షాసీం తనుమాశ్రితః, తత్రాస్తే దుఃఖసంతప్తః కచ్ఛిల్లోకవిరోధకృత్. 71 రాక్షసం చ పిశాచీం చ దృష్ట్వా స్వవటమాగతౌ, ఉవాచ క్రోధబహులో వటస్థో బ్రహ్మరాక్షసః. 72 కిమర్థమాగతౌ భీమౌ యువాం మత్‌స్థానమీప్సితమ్, ఈదృశౌ కేన పాపేన జాతౌ మే బ్రువతాం ధ్రువమ్. 73 సౌదాసస్తద్వచశ్శ్రుత్వా తయా యచ్చాత్మనా కృతమ్, సర్వం నివేదయిత్వాసై#్మ పశ్చాదేతదూవాచ హ. 74 గురువును ఉపేక్షించి రాక్షస దేహమును పొంది దుఃఖించుచు లోక విరోధమును చేసిన ఒక బ్రహ్మరాక్షసుడు ఆ యరణ్యమున ఉండెను. తానున్న మఱ్ఱి చెట్టువద్దకు వచ్చిన రాక్షసుని, పిశాచిని చూచి కోపముతో ఇట్లు పలికెను. ''భయంకరులైన మీరు నా మఱ్ఱిచెట్టువద్దకెందుకు వచ్చతిరి. ఈ రూపమున ఏ పాపముతో పొందితిరో నాకు నిజమును చెప్పుడు''. ఆ బ్రహ్మరాక్షసుని మాటలను వినిన సౌదాసుడు తాను, పిశాచి చేసిన దానినంతయు తెలిపి తరువాత ఇట్లు పలికెను. 71-74 సౌదాస ఉవాచ:- కస్త్వం వద మహాభాగ! త్వయా వై కి కృతం పురా! సఖ్యుర్మమాతిస్నేహేన తత్సర్వం వక్తుమర్హసి. 75 కరోతి వంచనం మిత్రే యో వా కో వాపి దుష్టధీః, స హి పాపఫలం భుంఙ్కే యాతమాస్తు యుగాయుతమ్. 76 జన్తూనాం సర్వదుఃఖాని క్షీయన్తే మిత్రదర్శనాత్, తస్మాన్మిత్రేషు, మతిమాన్న కుర్వాద్వంచనం సదా. 77 కల్మాషపాదేత్యుక్తో వటస్థో బ్రహ్మరాక్షసః, ఉవాచ ప్రీతిమాపన్నో ధర్మవాక్యాని నారద. 78 సౌదాస మహారాజు పలికెను:-'' ఓ మహానుభావా !నీ వెవరవు? పూర్వము నీవేమి చేసితివి. మిత్రుడవైన నాకు మిక్కిలి స్నేహముతో దీనినంతటిని వివరించుము. మిత్రుని విషయమున మోసమును చేసినవాడు పాపఫలమును అనుభవించును. పదివేల యుగములు యాతనలననుభవించును. మిత్రుని చూచుట వలన ప్రాణులకు అన్ని దుఃఖములు తొలగిపోవును. కావున బుద్ధిమంతులెవ్వరూ మిత్రుని విషయమున మోసమును తలపెట్టరు''. ఇట్లు కల్మాష పాదుడు చెప్పిన మాటలను విని మఱ్ఱిచెట్టు మీదున్న బ్రహ్మరాక్షసుడు ప్రీతిచెంది ధర్మవాక్యమును పలికెను. 75-78 బ్రహ్మరాక్షస ఉవాచ:- అహమాసం పురా విప్రో మాగధో వేదపారగః, సోమదత్త ఇతి ఖ్యాతో నామ్నా ధర్మపరాయణః. 79 ప్రమత్తో7 హం మహాభాగ విద్యయా వయసా ధనైః ఔదాసీన్యం గురోః కృత్వా ప్రాప్తనావీదృశీం గతిమ్. 80 న లభే7 హం సుఖం కించిజ్జితాహారో7 తిదుఃఖితః, మయా తు భక్షితా విప్రాః శతశో7థ సహస్రశః. 81 క్షుత్పిపాసాపరో నిత్యమన్తస్తాపేన పీడితః, జగత్త్పాసకరో నిత్యం మాంసాశనపరాయణః. 82 గుర్వవజ్ఞా మనుష్యాణాం రాక్షసత్వప్రదాయినీ, మయానుభూతమేతద్ధి తతశ్శ్రీమాన్న చాచరేత్. 83 బ్రహ్మరాక్షసుడు పలికెను:- ''నేను పూర్వము వేదములము బాగుగా అధ్యయనము చేసిన బ్రహ్మణుడను. మగధదేశవాసిని. నా పేరు సోమదత్తుడు. నేను ధర్మపరాయణుడనుగా ఉంటిని. విద్యచేత, ధనముచేత, ¸°వనముచేత బాగుగా మదించిన నేను గురువు గారిని ఉపేక్షించి ఈ గతిని పొందితిని. ఆహారమును జయించికూడా సుఖమును పొందలేక దుఃఖమునే పొందుచున్నాను. నేను మొదట నూర్లుకొలది వేలకొలది బ్రాహ్మణులను భక్షించితిని. ఎల్లప్పుడూ ఆకలిదప్పుల బాధచే మనస్తాపముచే జగత్తునకు భయమును కలిగించుచు మాంసాహారమునందాసక్తుడనైతిని. మానవులు గురువును అవమానించినచో రాక్షసత్వము ప్రాప్తించును. నేను దీనిని అనుభవించితిని. కావున శ్రేయోభిలాషి గురువును అవమానించరాదు''. 79-83 కల్మాషపాద ఉవాచ:- గురుస్తు కీదృశః ప్రోక్తః కస్త్వయా శ్లాఘితః పురా, తద్వదస్వ సఖే సర్వం పరం కౌతూహలం హి మే. 84 కల్మాషపాదుడు పలికెను:- ''గురువు ఎటువంటివాడు? నీవు కొనియాడినదెవరిని ?దాని నంతటిని నాకు తెలుపుము. వినవలయునని చాలా కుతూహలమున్నది''. 84 బ్రహ్మరాక్షస ఉవాచ:- గురవస్సన్తి బహవః పూజ్యా వన్ద్యాశ్చ సాదరమ్, తానహం కథయిష్యామి శృణుషై#్వకమనాస్సకే. 85 అధ్యాపకశ్చ వేదానాం వేదార్థయుతిబోధకః, శాస్త్రవక్తా ధర్మవక్తా నీతిశాస్త్రోపదేశకః. 86 మన్త్రోపదేశవ్యాఖ్యాకృద్వేదసందేహహృత్తథా, వ్రతోపదేశకశ్చైవ భయత్రాతా7న్నదో హి చ . 87 శ్వశురో మాతులశ్చైవ జ్యేష్ఠభ్రాతా పితా తథా, ఉపనేతా నిషేక్తా చ సంస్కర్తా మిత్రసత్తమ. 88 ఏతే హి గురవః ప్రోక్తా పుజ్యా వందాశ్చ సాదరమ్. 89 బ్రహ్మరాక్షసుడు పలికెను:- ఓ మిత్రమా ! పూజించదగినవారు, ఆదరముతో నమస్కరించదగినవాడు, చాలామంది గురువులున్నారు వారిని గూర్చి నేను వివరముగా చెప్పెదను. ఏకాగ్రమనస్సుతో వినుము. వేదములను అధ్యపనము చేయువారు, వేదార్థమునకు సంగతిని బోధించువారు, శాస్త్రమును చెప్పువాడు, ధర్మమును చెప్పువాడు, నీతిశాస్త్రమును ఉపదేశించువాడు, మన్త్రమును ఉపదేశించువాడు, మన్త్రములను వ్యాఖ్యానము చేయువాడు, వేదములలో కలుగు సందేహములను పరిహరించువాడు, వ్రతములనుపదేశించువాడు, భయమునుండి కాపాడువాడు, అన్నముపెట్టువాడు, కన్యాదానమును చేసినమామ, మేనమామ, పెద్ద అన్న, కన్నతండ్రి, ఉపనయనము చేసినవాడు, నిషేకమును చేసినవాడు, సంస్కరించినవాడు- వీరందరూ గురువులే. వీరిని ఆదరముతో పూజించవలయును. నమస్కరించవయును. కల్మాషపాద ఉవాచ:- గురువో బహవః ప్రోక్తా ఏతేషాం కతమో వరః, తుల్యాః సర్వే7ప్యుత సఖే తద్యథావద్ధి బ్రూహి మే. 90 కల్మాషపాదుడు పలికెను:- ''ఓ !మిత్రమా! చాలా మంది గురువులను గూర్చి చెప్పితివి. వీరందరిలో ఎవరు శ్రేష్ఠులు లేదా అందరూ సమానులేనా? ఈ విషయమును నాకు యథావిధిగా తెలుపుము''. 90 బ్రహ్మరాక్షస ఉవాచ:- సాధు !సాధు !మహాప్రాజ్ఞ! యత్ పృష్టం తద్వదామి తే, గురుమాహాత్మ్యం కథనం శ్రవణం చానుమోదనమ్. 91 సర్వేషాం శ్రేయ ఆధత్తే తస్మాద్వక్ష్యామి సాంప్రతమ్, ఏతే సమానపూజార్హస్సర్వదా నాత్రసంశయః. 92 తథాపి శృణు వక్ష్యామి శాస్త్రాణాం సారనిశ్చయమ్, ఆధ్యాపకశ్చ వేదానాం మన్త్రవ్యాఖ్యాకృతస్తథ్రా. 93 పితా చ ధర్మవక్తా చ విశేషగురవస్మ్సృతాః, ఏతేషామపి భూపాల శృణుష్వ ప్రపరం గురుమ్. 94 సర్వశాస్త్రార్థతత్వజ్ఞైర్భాషితం ప్రవదామి తే, యః పురాణాని వదతి ధర్మయుక్తాని పండితః. 95 సంసారపాశవిచ్ఛేదకారణాని స ఉత్తమః, దేవపూజార్హకర్మాణి దేవతాపూజనే ఫలమ్. 96 జాయతే చ పురాణభ్య స్తస్మాత్తానీహ దేవతాః, సర్వవేదార్థసారాణి పూరాణానీతి భూపతే. 97 వదన్తి మునయశ్చైవ తద్వక్తా పరమో గురుః యస్సంసారార్ణవం తర్తుముద్యోగం కురుతే నరః. 98 శృణుయాత్స పురాణాని ఇతి శాస్త్రవిభాగకృత్, ప్రోక్తవాన్సర్వధర్మాంశ్చ పురాణషు మహీపతే. 99 తర్కస్తు వాదహేతుస్స్యాన్నీతిసై#్త్వహికసాధనమ్, పురాణాని మహాబుద్దే ఇహాముత్ర సుఖాయ హి. 100 యః శృణోతి పురాణాని సతతం భక్తిసంయుతః, సత్య స్యాన్నిర్మలా బుద్ధిర్భూయో ధర్మపరాయణా. 101 పురాణశ్రవణాద్భక్తిర్జాయతే శ్రీపతౌ శుభా, విష్ణుభక్తనృణాం భూప! ధర్మే బుద్ధిః ప్రవర్తతే. 102 ధర్మాత్పాపాని నశ్యన్తి జ్ఞానం శుద్ధం చ జాయతే, ధర్మార్థకామమోక్షాణాం యే ఫలాన్యభిలిప్సవః. 103 శృణయుస్తే పురాణాని ప్రాహురిత్థం పురావిదః, అహం తు గౌతమమునేః సర్వజ్ఞాద్బ్రహ్మావాదినః. 104 శ్రుతవాన్సర్వ ధర్మార్థం గంగాతీరే మనోరమే, కదాచిత్పరమేశస్య పూజాం కర్తుమహం గతః. 105 ఉపస్థితాయాపి తసై#్మ ప్రణామం నహ్యకారిషమ్, స తు శాన్తో మహాబుద్ధిర్గౌతమస్తేజసాం నిధిః. 106 మంత్రోదితాని కర్మాణి కరోతీతి ముదం య¸°, యస్త్వర్చితో మయా దేవః శివస్సర్వజగద్గురుః. 107 గుర్వవజ్ఞా కృతా యేన రాక్షసత్వే నియుక్తవాన్, జ్ఞానతో 7జ్ఞానతో వాపి యో 7వజ్ఞాం కురుతే గురోః. 108 తసై#్యవాశు ప్రణశ్యన్తి ధీవిద్యార్థాత్మజాః, క్రియాః శుశ్రూషాం కురుతే యస్తు గురూణాం సాదరం నరః. 109 తస్య సంపద్భవేద్భూప ఇతి ప్రాహుర్విపశ్చితః, తేన శాపేన దగ్ధో 7హమన్తశ్చైల క్షుధాగ్నినా. 110 మోక్షం కదా ప్రయాస్యామి న జానే నృపసత్తమ! ఏవం వదతి విప్రేన్ద్ర వటస్థే7 స్మిన్నిశాచరే, 111 ధర్మశాస్త్రప్రసంగేన తయోః పాపం క్షయం గతమ్. బ్రహ్మరాక్షసుడు పలికెను:- ''ఓ !ప్రాజ్ఞుడా !బాగుగా అడిగితివి. నీవడిగిన దానిని చెప్పెదను. గురువు మహాత్మ్యమును చెప్పుట, వినుట, ఆమోదించుట అందరికి మేలును చేకూర్చును. కావున నేను చెప్పెదను. నేను మొదట చెప్పిన గురువులు అందరు సమానముగా పూజించదగిన వారే. ఈ విషయమున సందేహము లేదు. అయిననూ సకలశాస్త్రనిశ్చయసారమును చెప్పెదను వినుము. వేదాధ్యాపకులు, మన్త్రములకు వ్యాఖ్యానము చేయువారు, తండ్రి, ధర్మమును చెప్పువారు విశేషించి గురువులు. వీరిలో కూడా శ్రేష్ఠులను చెప్పెదను వినుము. ఈ విషయమును అన్ని శాస్త్రార్థముల తత్త్వము తెలిసిన వారు చెప్పిన దానినే తెలిపెదను. సంసార పాశములను ఛేదించగల ధర్మములతో కూడిన పూరాణములను చెప్పువారు ఉత్తమ గురువులు. దేవతలను పూజించుటకు తగిన కర్మలు, దేవతలను పూజించుటవలన కలుగు ఫలము పూరాణముల వలన కలుగును. కావున పురాణములే దేవతలు. ఓ రాజా !పుణ్యములు అన్ని వేదార్థసారములని మునులు కూడా చెప్పుచున్నారు. కావున పురాణములను చెప్పువారు పరమ గురువులు. సంసార సాగరమను దాటుటకు ప్రయత్నము చేయువారు పురాణములను వినవలయునని శాస్త్రవిభాగములను చేసినవారు చెప్పుచున్నారు. ఓ రాజా! పురాణములలో అన్నిధర్మములను చెప్పియున్నారు. తర్కశాస్త్రము వాదమునకు కారణము. నీతి శాస్త్రము ఇహఫలసాదనము. పురాణములు ఇహపరములలో సుఖదాయకములు. ఎపుడూ భక్తితో పురాణములను వినువారలకు ధర్మపరాయణమైన, నిర్మలమైన బుద్ధికలుగును. పురాణములను వినుటవలన శ్రీహరియందు, శుభకరమైన భక్తి కలుగును. విష్ణుభక్తి గల వారలకు ధర్మమునందు బుద్ధి ప్రవర్తించును. ధర్మమువలన పాపములు నశించును. జ్ఞానము శుద్ధమగును. ధర్మార్థకామోక్షముల ఫలములను పొందగోరువారు పురాణములను వినవలయునని ప్రాజ్ఞులు చెప్పెదరు. నేను బ్రహ్మవాది సర్వజ్ఞుడు అయిన గౌతమమహాముని వలన సర్వధర్మార్థములను, సుందరమైన గంగాతీరమున వినియుంటిని. ఒకపుడు పరమేశ్వరుని పూజించుటకు నేను వెళ్ళితిని. అచటికి వచ్చిన గురువుగారికి నమస్కారమును చేయలేదు. తేజోనిధి, శాంతుడు మహాబుద్ధియైన గౌతమ మహర్షి మంత్రప్రోక్తవిధుల నాచిరించుచున్నాడని సంతోషించెను. కాని సర్వజగద్గురువైన శంకరుడు నా పూజలందుచు గురువు నవమానించినందున నాకు రాక్షసత్వమును ప్రసాదించెను. తెలిసికాని, తెలియకకాని గురువును అవమానించిన వారికి బుద్ధి, విద్య, తాను చేసిన సుకృతములు అన్నియూ నశించును. గురువును రాక్షసత్వము నుండి ఎపుడు విముక్తుడగుదునో తెలియును''. ఇట్లు మఱ్ఱిచెట్టుపై నున్న బ్రహ్మ రాక్షసుడు చెప్పుచుండగా ధర్మశాస్త్రముల చర్చ జరిపిరి కావున వారి పాపము నశించినది. 91-111 ఏతస్మిన్నన్తరే ప్రాప్తః కశ్చిద్విప్రో 7తిధార్మికః, 112 కళింగదేశసంభూతిః నామ్నా గర్గ ఇతి స్మృతః, వహన్గంగాజలం స్కంధే స్తువన్విశ్వేశ్వరం ప్రభుమ్. 113 గాయన్నామాని తసై#్యవ ముదా హృష్టతనూరుహః, తమాగతం మునిం దృష్ట్వా పిశాచీ రాక్షసౌ చ తౌ. 114 ప్రాప్తా నః పారణత్యుక్త్వా ప్రాద్రవన్నూర్ధ్వబాహవః, తేన కీర్తితనామాని స్రుత్వా దూరే%్ వ్యవస్థితాః 115 అశక్తాస్తం ధర్షయితుమిదమూచుశ్చ రాక్షసాః, అహో విప్రమహాభాగ! నమస్తుభ్యం మహాత్మనే. 116 నామకీర్తనమాత్మ్యాద్రాక్షసా దూరగా వయమ్. అస్మాభిర్భక్షితాః పూర్వం విప్రాః కోటి సహస్రశః నామప్రాపరణం విప్ర రక్షతి తావాం మహాభయాత్. 117 నామశ్రవణమాత్రేణ రాక్షసా అపి భో వయమ్, పరాం శాన్తిం సమాపన్నా మహిమ్నా హ్యచ్యుతస్య వై. 118 సర్వథా త్వం మహాభాగ రాగాదిహితో హ్యసి, గంగాజలాభిషేకేణ పాహ్యాస్మాత్పాతకోచ్చయాత్. 119 హరిసేవాపరో భూత్వా యశ్చాత్మానం తు తారయేత్, స తారయేజ్జగత్సర్వమితి శంసంతి సూరయః. 120 అపహాయ హరేర్నామ ఘోరసంసారభేషజమ్, కేనోపాయేన లభ్యేత ముక్తిస్సర్వత్ర దుర్లభా. 121 లోహోడుపేన ప్రతరన్నిమజ్జన్త్యుదకే యథా, తథైవాకృతపుణ్యాస్తు తారయన్తి కథం పరాన్. 122 అహో చరిత్రం మహతాం సర్వలోకసుఖావహమ్, యథా హి సర్వలోకానామానన్దాయ కలానిధిః. 123 పృథివ్యాం యాని తీర్థాని పవిత్రాణి ద్విజోత్తమ, తాని సర్వాణి గంగాయాః కణస్యాపి సమాని న. 124 తులసీదళసమ్మిశ్రమపి సర్షపమాత్రకమ్, గంగాజలం పునాత్యేవ కులానామేకవింశతిమ్. 125 తస్మాద్విప్ర మహాభాగ! సర్వశాస్త్రార్థకోవిద! గంగాజలప్రదానేవ పాహ్యస్మాన్పాపకర్మిణః. 126 ఇత్యాఖ్యాతం రాక్షసై సై#్తరంగామహాత్మ్యముత్తమమ్, నిశమ్య విస్మయావిష్టో బభూవ ద్విజసత్తమః. 127 ఇంతలో కళింగదేశమున పుట్టిన గర్గుడను పేరుగల అతి ధార్మికుడైన బ్రాహ్మణుడొకడు భుజముపై గంగా జలకలశమును మోయుచు జగన్నాథుడైన విశ్వేశ్వరుని స్తోత్రము చేయుచు, విశ్వేశ్వర నామ సంకీర్తనము చేయుచు ఆనందముచే వంటిపై పులకింతలు రాగా అచటికి వచ్చెను. అట్లు వచ్చిన బ్రహ్మణుని చూచి ఆ ఇద్దరు రాక్షసులు, పిశాచి మాకాహారము దొరగినదని పలికి చేతులు పైకెత్తి పరుగెత్తిరి. ఆ బ్రహ్మణుడు కీర్తించు పేర్లను విని దూరములో నిలిచిరి. ఆ బ్రహ్మణుని హింసించుటకు శక్తిలేనివారై ఆ రాక్షసులిట్లు పలికిరి. ''ఓ మహానుభావా! బ్రాహ్మణోత్తమా! మహాత్ముడవైన నీకు నమస్కారము. నామకీర్తన మహాత్మ్యములచే రాక్షసులమైన మేము దూరములో నుంటిమి. మేము ఇదివరకు వేలమంది బ్రహ్మణులను భక్షించితిమి. నీవు కీర్తించు నామకవచము నిన్ను గొప్ప ఆపదనుండి కాపాడుచున్నది. నీవు కీర్తించు నామములను వినినంతనే రాక్షసులమైన మేము కూడా శ్రీహరి మహిమచే గొప్పశాంతిని పొందితిమి. కావున నీవు అన్నివేళలా రాగద్వేషాదులు లేనివాడవే. ఓ మహానుభావా! గంగాజలమును మాపై చల్లి మమ్ములను పాపరాశినుండి కాపాడుము. హరిసేవాపరుడె తనను తరింప చేసుకొనినవాడు మొత్తము జగమును తరింపచేయునని జ్ఞానులు చెప్పుదురు. భయంకరమైన సంసారమునకు ఔషధమైన హరి నామమును వదలిపెట్టి అంతటా దుర్లభ##మైన ముక్తిని ఎట్లు పొందగలరు ?ఇనుముతో ఏర్పరిచిన పడవనెక్కి నదిని దాటగోరువారు నీట మునుగునట్లు పుణ్యములను చేయనివారు ఇతరులనెట్లు తరింపచేయగలరు ?మహానుభావుల చరిత్ర అన్నిలోకములకు ఆనందమునిచ్చును. చంద్రుడు లోకముల ఆనందము కొరకే కదా ఉదయించును. ఈ భూమండలమున పావనములైన పుణ్యతీర్థములన్నియు గంగా జలబిందువుతో సమానములు కావు. తులసీ దళముతో కలిసిన గంగాజల బిందువు ఆలగింజంతదైనను (21) ఇరువదియొక్క తరములను తరింపచేయును. కావున ఓ మహానుభావుడైన బ్రాహ్మణోత్తమా! అన్నిశాస్త్రార్థములు తెలిసినవాడా! గంగా జలమునిచ్చి పాపములు చేసిన మమ్ములను కాపాడుము''. ఇట్లు రాక్షసులు చెప్పిన గంగా మాహత్మ్యమును వినిన బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యమును పొందెను. 112-127 ఏషామపీదృశీ భక్తిర్గంగాయాం లోకమాతరి, కిము జ్ఞానప్రబావాణాం మాహతాం పుణ్యశాలినామ్. 128 అథాసౌ మనసా ధర్మం వినిశ్చిత్య ద్విజోత్తమః, సర్వభూతపితో భక్తః ప్రాప్నోతీతి పరం పదమ్. 129 తతో విప్రః కృపావిష్టో గంగాజలమనుత్తమమ్, తులసీదలసంమిశ్రం తేషు రక్షస్స్వలసేచయత్ 130 రాక్షసాస్తేన సిక్తాస్తు సర్షపోపమబిందునా, విసృజ్య రాక్షసం భావమభజన్దేవతోపమాః. 131 బ్రాహ్మణ పుత్రసంయుక్తా సోమదత్తస్తధైవ చ, కోటి సూర్యప్రతీకాశా బభూవుర్విబుధర్షభాః. 132 శంఖచక్రగదా చిహ్నహరిసారూప్యమాగతాః, స్తువంతో బ్రాహ్మణం సమ్యక్తే, జగ్ముర్హరిమందిరమ్. 133 రాజా కల్మాషపాదస్తు నిజరూపం సమాస్థితః, జగామ మహతీం చింతాం దృష్ట్వా తాన్ముక్తిగానఘాన్. 134 తస్మిన్రాజ్ఞి సుదుఃఖార్తే గూఢరూపా సరస్వతీ, ధర్మమూలం మహావాక్యం బభాషే7 గాధయా గిరా. 135 భో! భో !రాజన్మహాభాగ! న దుఃఖం గంతుమర్హసి, రాజంన్తవాసి భోగన్తే మహచ్చ్రేయో భవిష్యతి. 136 సత్కర్మధూతపాపా యే హరిభక్తిపరాయణాః, ప్రయాన్తి నాత్ర సందేహహస్తద్విష్ణోః పరమం పదమ్. 137 సర్వభూతదయా యుక్తా ధర్మమార్గప్రపర్తినః, ప్రయాన్తి పరమం స్థానం గురుపూజాపరాయణాః. 138 ఇతీరితం సమాకర్ణ్య భారత్యా నృపసత్తమః మనసా నిర్వృతిం ప్రాప్య సస్మార చ గురోర్వచః. 139 లోకమాతయైన గంగపై ఇటువంటి రాక్షసులకు కూడా అంతటి భక్తియున్నదనిన పుణ్యాత్ములు మహానుబావులు గొప్పజ్ఞానము కలవారికెంతుండనో ఏమి చెప్పగలము? అన్ని ప్రాణులకు హితమును కోరుభక్తుడు శ్రీవిష్ణువుయొక్క పరమపదమును చేరగలడను ధర్మమును మనసులో నిశ్చయించుకొనిన ఆ గర్గుడు వారిపై దయకలవాడై సాటిలేని మహిమ గల, తులసీ దళముతో కలిసియున్న గంగాజలమును ఆ రాక్షసులపై చల్లెను. ఆవగింజంత గంగాజల బిందువుచే తడుపబడిన ఆరాక్షసులు రాక్షస భావమును విడిచి దేవతల రూపమును పొందిరి. పుత్రునితో కూడియున్న బ్రాహ్మణి, సోమదత్తుడు కోటి సూర్యప్రకాశ ముగలవారై దేవోత్తములయిరి. శంఖచక్రగదా చిహ్నములతో హరి సారూప్యమునుపొంది ఆ బ్రాహ్మణుని బాగుగా స్తుతించుచు హరి మందిరమును చేరిరి. కల్మాషపాదుడగు మహారాజు కూడా నిజరూపమును పొంది సోమదత్తుడు బ్రహ్మాణి ఆమె పుత్రుడు మోక్షమును పొందుట చూచి తాను పొందలేనందుకు విచారించుచుండెను. అట్లు రాజు చింతించుచుండగా రహస్య రూపమున సరస్వతీదేవి ధర్మమూలమైన మహావాక్యమును స్పష్టమైన, గాఢరూపములోనున్న వాక్కుచే ఇట్లు పలికెను. ''మహానుభావుడవైన ఓ రాజా !దుఃఖించదగవు. నీవు కూడా కర్మభోగములను అనుభవించిన తరువాత గొప్పమేలును (ముక్తిని) పొందగలవు. సత్కర్మలచే పాపములు తొలగిన హరిభక్తి పరాయణులు పరమపదమును పొందెదరు. ఈ విషయమున సంశయించవలసిన పనిలేదు. అన్ని ప్రాణులయందు దయగలవారు ధర్మమార్గమున ప్రవర్తించువారు, గురుపూజా పరాయణులు పరమపదమును పొందగలరు''. ఇట్లు సరస్వతీదేవి చెప్పిన మాటలను వినిన రాజు మనసులో తృప్తిని పొంది గురువు గాలి మాటలను తలచెను. 128-139 స్తువన్గురుం చ తం విప్రం చైవాతిహర్షితః, పూర్వవృత్తం చ విప్రాయ సర్వం తసై#్మ న్యవేదయత్. 140 తతో నృపస్తు కాలింగం ప్రణమ్య విదివన్మునిమ్, నామాని వ్యాహరన్విష్ణోః సద్యో వారాణ సీం య¸°. 141 షణ్మాసం తత్ర గంగాయాం స్నాత్వా దృష్ట్వా సదాశివమ్, బ్రహ్మణీదత్తశాపాత్తు ముక్తో మిత్రసహో7భవత్. 142 తతస్తు స్వపురీం ప్రాప్తో వసిష్ఠేన మహాత్మనా, అభిషిక్తో మునిశ్రేష్ఠ స్వకం రాజ్యమపాలయత్. é పాలయిత్వా మహీం కృత్స్నాం భుక్త్వా భోగాంస్త్రియం వినా, వసిష్ఠాత్ప్రాప్య సంతానం గతో మోక్షం నృపోత్తమః. 144 నైతిచ్చిత్రం ద్విజశ్రేష్ఠ! విష్ణోర్వారాణసీం గుణాన్, గృణన్ శృణ్వన్ స్మరన్గంగాం పీత్వా ముక్తో భ##వేన్నరః. 145 తస్మాన్మ హిమ్నో విప్రేన్ద్ర గంగాయాః శక్యతే న హి, పారం దంతుం సురాధీశైర్భహ్మవిష్ణుశివైరపి. 146 యన్నామస్మరణాదేవ మహాపాతకకోటిభిః, విముక్తో బ్రహ్మసదనం నరో యాతి న సంశయః. 147 గంగా గంగేతి యో నాంమ సకృదప్యుచ్యతే యదా, తదైవ పాపనిర్ముక్తో బ్రహ్మలోకే మహీయతే. 148 ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణ పూర్వభాగే ప్రథమపాదే గంగామహాత్మ్యే నవమో7ధ్యాయః. గురువగు వసిష్ఠమహర్షిని బ్రాహ్మణశ్రేష్ఠుడగు ఆ గర్గుని శ్రీహరిని, స్తుతించుచు మిక్కిలి సంతోశముతో మొదట జరిగిన వృత్తాంతమునంతటిని ఆ బ్రాహ్మణులనకు తెలియజేసెను. తరువాత మిత్రసహా మహారాజు కాళింగునికి నమస్కరింతి శ్రీహరినామసంకీర్తనమును చేయుచు వెంటనే వారాణాసీ పట్టణమునకు వెళ్ళెను. ఆ పట్టణమున ఆరుమాసములు నివాసముచేసి గంగలో స్నానముచేసి సదాశివుని దర్శించి బ్రాహ్మణీ శాపమైన శాశ్వత రాక్షసత్యమునుండి విముక్తుడాయెను. ఆ తరువాత తన నగరమును చేరి మహానుబావుడైన వసిష్ఠ మహర్షిచే రాజ్యమున ప్రతిష్టించబడిన తన రాజ్యమును పరిపాలించెను. సమస్త భూమండలమును పరిపాలించి స్త్రీ భోగమును తప్ప అన్ని భోగములననుభవించి, వసిష్ఠ మహర్షి వలన సంతానమును పొంది మోక్షమును పొందెను. ఇది వింతయేమియు కాదు, వారాణాసి గుణములను శ్రీమహావిష్ణువు గుణమును కీర్తించుచు, వినుచు, స్మరించుచు గంగాజలమును పానము చేయుచు మానవుడు మోక్షమును పొందును. కావున ఓ బ్రాహ్మణోత్తమా! గంగా మహాత్మ్యమును వివరించుటకు ఇంద్రుడు, బ్రహ్మవిష్ణుమహేశ్వరులు కూడ శక్తులు కారు. గంగా నామస్మరణ మాత్రముననే మానవుడు పాతక రాశులనుండి విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. ఈ విషయమున ఎట్టి సంశయములేదు. ఒకసారైనా ''గంగా గంగా'' అని గంగా నామమును ఉచ్చరించినచో వెంటనే అన్ని పాపములనుండి విముక్తుడై బ్రహ్మలోకమున ప్రకాశించును. 140-148 ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున గంగామహాత్మ్యమున తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.