Sri Naradapuranam-I    Chapters    Last Page

విషయాణు క్రమాణిక

భూమిక

పురాణకర్త

అష్టాదశ పురాణముల కర్త సత్యవతీ పుత్రుడగు వ్యాసమహర్షియని ప్రసిద్ధి కలదు. సత్యవతీ వరాశరపుత్రుడు వేదవ్యాస భగవానుడు. అయిననూ ఏ ఒక్క పురాణము నందునూ వేదవ్యాస భగవానుడు సాక్షాత్తుగా వక్తగా చెప్పబడలేదు. అన్ని పురాణములను వ్యాసభగవానుని శిష్యుడు లోమహర్షణ పుత్రుడగు సూతుడుకాని, సౌతికాని వక్తగా వర్ణించబడినది. వ్యాస భగవానుడు మాత్రము తిరస్కరిణీ విద్యచే అంతర్జాతీయనగతునివలె సేవించువారికి పరోక్షముగనే యుండును. నారదీయ మహాపురాణముకూడా నైమిషారణ్యమున సత్రాసీనులగు శౌనకాది మహర్షులకు సూతమహర్షిచే చెప్పబడినది. ఈ పురాణమున ఇదియొక విశేషము. సామాన్యముగా అన్ని పురాణములలో సిద్ధాశ్రమమున నున్న సూతుని సమీపించి వినయముతో సేవించుచు మహర్షులు అతని నుండి వినుచుందురు. సూత మహర్షి నైమిషారణ్యమునకు వెళ్ళి చెప్పుట కనబడదు. ఈ పురాణమున మాత్రము సూత మహర్షి నైమిషార్యణ్యమునకు వెళ్ళి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు వర్ణించబడినది.

పురాణములు అర్థవాదములు కావు. పురాణములు అర్థవాద ప్రధానములని గ్రాహకులలో ఎక్కువ మంది అభిప్రాయము. కాని అట్లు చెప్పుట నింద్యమని నారదీయ మహాపురాణమున పూర్వభాగమున మొదటి అధ్యాయమున 58-59 శ్లోకములలో చెప్పబడినది. '' సమస్త కర్మ నిర్మూల సాధనాని నరాధమః. '' పురాణాన్యర్థవాదేన బ్రువన్నరమశ్నుతే''.

అని సమస్త కర్మ నిర్మూల సాధనములగు పురాణములను అర్థవాదములని చెప్పు నరాధముడు నరకమును పొందును. అని పై శ్లోకమునకు భావము. కావున పురాణములు సకల కర్మ నిర్మూల సాధనములే కాని అర్థవాదములు కాజాలవు.

పురాణ పౌర్వాపర్య విచారము. పురాణ నిర్మాణక్రమ విషయమున ఈ పురాణమున సూచన లభించుచున్నది. మార్కేండేయ పురాణానస్తరము నారదీయ పురాణ నిర్మాణము జరిగెనని నిశ్చయముగా చెప్పవచ్చును. నారదీయ మహాపురాణమున పూర్వభాగమున నూట పదియవత అధ్యాయమున 32-33 శ్లోకములు ఈ విషయమున ప్రమాణములు.'' మార్కండేయ పురాణోక్తం చరితత్రియంద్విజ పఠనీయం నవదినం భుక్తిముక్తీ అభీప్సతా '' అని.

అనగా మార్కండేయ పురాణమున చెప్పబడిన మూడు చరితములను తొమ్మిదిని భుక్తిముక్తులను కోరువారు చదువ వలయును అని భావము. దీని వలన నారదీయ మహాపురాణము కంటే మొదటే మార్కండేయ పురాణ నిర్మాణము జరిగినదని తెలియుచున్నది. ఇట్లే శ్రీ మద్భాగవత మహాపురాణ నిర్మాణము తరువాతనే స్కాంద పురాణ నిర్మాణము జరిగినదని కూడా నిశ్చయముగా చెప్పవచ్చును. స్కాంద మహాపురాణమున వైష్ణవ ఖండమున శ్రీమద్భాగవత మహాత్మ్యమును చెప్పుటయే ఇందుకు ప్రమాణము.

ఇట్లే బ్రహ్మవైవర్త పురాణము వదియవదని నారదీయ మహాపురాణముననే తెలియుచున్నది.

''శృణు వత్స ప్రవక్ష్యామి పురాణం దశమం తవ| బ్రహ్మ వైవర్తకం నామ వేదభాగానుదర్శకమ్‌''

అని నారదీయ మహాపురాణమున పూర్వభాగమున 101అ. 1వ శ్లోకమున చెప్పబడినది. అనగా ఇపుడు వేద భాగాను దర్శకము దశమ పురాణమగు బ్రహ్మ వైవర్తకమును వినుము అని భావము. ఈ పురాణమున పూర్వభాగమున 109 అ- 30వ శ్లోకమున బ్రహ్మాండ పురాణము అష్టాదశమని చెప్పబడినది. అట్లే బ్రహ్మపురాణము మొదటిదని పూర్వభాగమున 92అ 30వ శ్లోకమున చెప్పబడినది. '' బ్రహ్మ పురాణం తత్రాదౌ సర్వలోక హితాయ వై వ్యాసేన వేదవిదుషా సమాఖ్యాతం మహాత్మనా'' అని. అనగా లోకహితమము కొరకు వేదవ్యాస మహర్షి మొదట బ్రహ్మపురాణమును చెప్పెనని భావము.

నారదోక్త పురాణ మహిమ

నారదీయ మహాపురాణమున పూర్వభాగమున 92వ అధ్యాయమున 22నుండి 26 శ్లోకములలో చెప్పబడినది.

''యస్మిన్ర్శుతే శ్రుతం సర్వం జ్ఞాతే జ్ఞాతం కృతే కృతమ్‌| పురాణమేకమేవాసీత్స ర్వకాలేషు మానద| || 22 ||

చతుర్వర్గస్య బీజం చ శతకోటి ప్రవిస్తరమ్‌ | ప్రకృత్తిస్సర్వశాస్త్రాణాం పురాణాదభవత్తతః

కాలేనాగ్రహణం దృష్ట్వా పురాణస్య మహామతిః || 23 ||

హరిర్వ్యాస స్వరూపేణ జాయతే చ యుగే యుగే | చతుర్లక్షప్రమాణన ద్వాపరే ద్వాపరే సదా || 24 ||

తదష్టాదశధా కృత్వా భూలోకే నిర్ధిశత్యపి | అద్యాపి దేవలోకే తు శతకోటిప్రవిస్తరమ్‌ || 25 ||

అస్త్యేవ తస్య సారస్తు చతుర్లక్షేణ వర్జ్యతే |

పురాణమును వినిన అన్నియూ వినినట్లు, తెలిసిన అన్నియూ తెలిసినట్లు, చేసిన అన్నియూ చేసినట్లు అగును. అన్ని కల్పములలో ఒకే పురాణముండెను. పురాణమే చతుర్వర్గమునకు బీజరూపము. పురాణము నూరు కోట్ల శ్లోకములు కలిగియున్నది. సర్వ శాస్త్రముల వ్రవృత్తి పురాణము వలననే జరిగినది. కాలక్రమమున పురాణమున గ్రహించువారు లేక పోవుటను చూచి మహామతి యగు శ్రీహరి వేద వ్యాస రూపమున ప్రతియుగమున పుట్టుచుండును. ప్రతి ద్వాపర యుగమున ఆ పురాణమును పదునెనిమిదిగా చేసి నాలుగు లక్షల శ్లోకములతో భూలోకమున చెప్పుచుండెను. ఈ నాటికి కూడా దేవలోకమున పురాణము శతకోటి ప్రవిస్తరముగా నున్నది. ఆ పురాణ సారము నాలుగు లక్షల శ్లోకములతో వర్ణించబడియున్నది.

నారదీయ పురాణము

నారదీయ మను పేరు ఎందువలన వచ్చెనని మొదట విచారింతము. సనక, సనన్దన, ననత్కుమార సనాతనులను నలువురు బ్రహ్మమానస పుత్రులు. వారిలో సనక మహర్షి ప్రధానుడు. సనక మహర్షియే ప్రధానకర్త. నారదమహర్షికి ఈ పురాణమును చెప్పిన వాడు సనక మహర్షియే. ఈ విషయమునే ఈ పురాణ పూర్వభాగమున 1వ అధ్యాయమున 35-36 శ్లోకములలో చెప్పబడినది.

''గీతం సనకముఖ్యైస్తు నారదాయ మహాత్మనే | పురాణం నారదీయాఖ్యమేతద్వేదార్థసంమితమ్‌''అని సనకాది మహర్షులు నారద మహర్షికి చెప్పినది నారదీయ పురాణము వేదార్థసంమితము అని భావము.

అయిననూ ఇంతమాత్రముచే నారదీయ మను పేరు కుదరదు. నారదునకు చెప్పినది కాని నారదుని గూర్చి చెప్పినది కాదు. కావున '' తమధికృత్య కృతం'' అను అర్థము కుదురదు కదా అను శంక కలదు. నిజమే కాని '' తమధికృత్య కృతం'' అని అర్థమున కాక ''తస్యేదం'' అనునర్థమున ''వృద్ధాచ్ఛః'' అని ఛవ్రత్యయము వచ్చిన నారదీయమని సిద్ధించును. కావున నామము సరిఅయినదే.

ఇక ఈ పురాణమునకు అధికారులు ఎవరు? ఎవరికి ఈ పురాణమును చెప్పవలయును? అను ప్రశ్నలకు సమాధానము మొదటి అధ్యాయములో చెప్పబడినది.

''సతామేవ ప్రవక్తవ్యం గుహ్యాద్గుహ్యతరం యతః || 47||

బ్రహ్మద్రోహవరాణం చ దంభాచారయుతాత్మనామ్‌ | జనానాం బకవృత్తీనాం న బ్రూయాదిదముత్తమమ్‌ || 48 ||

త్యక్తకామాదిదోషాణాం విష్ణుభక్తిరతాత్మనామ్‌ || 49 ||

సదాచారవరణాం చ వక్తవ్యం మోక్షసాధనమ్‌ || 50||

మృషా శృణోతి యో మూఢో దంబో భక్తివివర్జితః | సో పి తద్వన్మహాఘోరే నరకే వచ్యతే క్షయే. || 75 ||

పరమ రహస్యమగు ఈ పురాణమును సత్పురుషులకే చెప్పవలయును. బ్రహ్మ ద్రోహులకు, దంభాచార పరులకు, వంచకులకు ఈ పురాణమును చెప్పరాదు. కామాది దోషరహితులకు, విష్ణు భక్తిరతులకు, సదాచార వరులకు మాత్రమే మోక్షసాధనమగు ఈ పురాణమును చెప్పవలయును. దంభాచారము కలవాడు, భక్తి రహితుడు మూఢుడై కపటముగా వినినచో అక్షయమగు మహా ఘోర నరకమును పొందును - అని భావము.

ఈ పురాణమున అయిదు పాదములు 207 అధ్యాయములు కలవు. ఇతర గ్రంధములలో అధ్యాయములలో పాదములుండును. వాని పాదములలో అధ్యాయములుండవు. పాణినీయాష్టాధ్యాయము మొదలగునవి ఇందులకు ఉదాహరణములు. కాని ఈ పురాణమున పాదములలో అధ్యాయములుండుట విశేషము. ఈ నారదీయ మహాపురాణము రెండు భాగములుగా విభజించబడినది. ప్రథమ భాగము పూర్వభాగమని, ద్వితీయ భాగము ఉత్తర భాగమని వ్యవహరించబడినది. పూర్వభాగమునకు బృహదుపాఖ్యానమని పేరు-గలదు. కాని ఉత్తర భాగమునకు లఘ్వాఖ్యానమని పేరులేదు. పూర్వభాగమున బృహదుపాఖ్యానములు కలవు. ఉత్తర భాగమున కూడా బృహదుపాఖ్యానము కలదు. ఉత్తర భాగమున రుక్మాంగద మహారాజు చరితము అతిదీర్ఘముగా కలదు. భేదకారియగు విషయబేధము కూడా లేదు. ఇచట కూడా వ్రతోపవాస తిథి ఆశ్రమాదులు విస్తృతముగా వర్ణించబడినవి. ఉత్తర భాగమున మాంధాత పృచ్ఛకుడు. వసిష్ఠ మహర్షి వక్త. కావున నారదీయత్వమునకు భంగము కలుగును. ఉత్తర భాగము ఈ పురాణాను బంధముగా స్వతంత్ర గ్రంథమని చెప్పిననూ కాదనగల ప్రమాణము లభించదు. ఈ రెండు ఒకదానికి అవయవములు అని తెలియబడుట లేదు.

నారదీయ పురాణాను క్రమణిక :-

అనుక్రమణిక విషయ గ్రహణమునకు సహకరించును. ఈ సహకారము విషయ మునందాసక్తి కలిగించునని ఇచట అనుక్రమణికను చెప్పుచున్నాము. ఈ నారదీయ మహాపురాణమున పురాణాకారముతోనే అనుక్రమణికను రచించుట విశేషము. మనచే రచించబడిన అనుక్రమణిక సుందరమగా ప్రమాణబద్ధముగా ఉండుట సందేహాస్పదమే. కావుననే గ్రంథగతమైన దానిని యథాతథముగా చూపుచున్నాము. సులభముగా అర్థమగును కావున విడిగా అర్థము వ్రాయలేదు.

''శృణు విప్ర ప్రవక్ష్యామి పురాణం నారదీయకమ్‌ | పంచవింశతిసాహస్రం బృహత్కల్పకథాశ్రయమ్‌. పూ.97అ|| 1 ||

సూతశౌనకసంవాదః సృష్టిసంక్షేపవర్ణనమ్‌ | నానాధర్మకథాః పుణ్యాః ప్రవృత్తే సముదాహృతాః || 2||

ప్రాగ్భాగే ప్రథమే పాదే సనకేన మహాత్మనా | ద్వితీయే మోక్షధర్మాఖ్యే మోక్షోపాయనిరూపణమ్‌ || 3||

వేదాగానం చ కథనం శుకోత్పత్తిశ్చ విస్తరాత్‌ | సనన్దనేన కథితా నారదాయ మహాత్మనే || 4 ||

మహాతంత్రే సముద్ధిష్టం పశుపాశవిమోక్షణమ్‌ | మంత్రాణాం శోధనం దీక్షామంత్రోద్ధారశ్చ పూజనమ్‌ || 5||

ప్రయోగాః కవచం నామ సాహస్రం స్తోత్రమేవ చ | గణశసూర్యవిష్ణూనాం శివశక్త్యో రనుక్రమాత్‌ || 6||

సనత్కుమారమునినా నారదాయ తృతీయకే | పురాణలక్షణం చైవ ప్రమాణదానమేవ చ || 7||

వృథక్పృథక్సముద్దిష్టం దానకాలపురస్పరమ్‌ | చైత్రాదిసర్వమాసేషు తిథీనాం చ వృథక్పృథక్‌ || 8 ||

ప్రోక్తం ప్రతిపదాదీనాం వ్రతం సర్వాషునాశనమ్‌ | సనాతనేన మునినా నారదాయ చతుర్థకే || 9 ||

పూర్వభాగో యముదితో బృహదుపాఖ్యానదిసంజ్ఞితః | అస్యోత్తరవిభాగే తు ప్రశ్న ఏకాదశీవ్రతే || 10 ||

వసిష్ఠేన మాంధాతుః సంవాదః పరికీర్తితః | రుక్మాంగదకథా పుణ్యా మోహిన్యుత్పత్తి కర్మ చ || 11 ||

వసుశావశ్చ మోహిన్యై పశ్చాదుద్ధరణ క్రియా | గంగాకథా పుణ్యతమా గయాయాత్రానుకీర్తనమ్‌ || 12||

కాశ్యా మహాత్మ్యమతులం పురుషోత్తమవర్ణనమ్‌ | యత్రావిధానం క్షేత్రస్య బహ్వాఖ్యానసమన్వితమ్‌ || 13 ||

ప్రయాగస్యాథ మహాత్మ్యం కురుక్షేత్రస్య తత్పరమ్‌ | హరిద్వారస్య చాఖ్యానం కామోదాఖ్యానకం తథా || 14 ||

బదరీతీర్థమాహత్మ్యం కామాక్షాయస్తథైవచ | ప్రభాసన్య చ మహాత్మ్యం పుష్కరాఖ్యానకం తథా || 15 ||

గౌతమాఖ్యానకం పశ్చాద్వేదపాదస్తవస్తతః | గోకర్ణక్షేత్రమాహాత్మ్యం లక్ష్మణాఖ్యానకం తథా || 16 ||

సేతుమాహాత్మ్యకథనం నర్మదాతీర్థవర్ణనమ్‌ | అవన్త్యాశ్చైవ మహాత్మ్యం మధురాయాస్తతః పరమ్‌ || 17 ||

బృన్దావనస్య మహిమా వశోర్బ్రహ్మన్తికే గతిః మోహినీ చరితం పశ్చాత్‌ ఏవం వై నారదీయకమ్‌ || 18 ||

విష్ణు శివుల అభేద బుద్ధి

విష్ణు పరమగు పురాణములు, శివపరపురాణములు చాలా కలవు. పురాణములలో కొన్నింట విష్ణువు ప్రధానము. మరి కొన్నింట శివుడు ప్రధానము. విష్ణువును ఆశ్రయించిన వారు శివుని ఆశ్రయించినవారు ఇరువురూ భక్తులే. ద్వివిధ భక్తులు ఒకరినొకరు ద్వేషించుకొనుచుందురు. కాని ఈ నారదీయ మహాపురణము శివ విష్ణువులలో అభేద బుద్ధిని ఉపదేశించును. కావున ప్రపంచమున ద్వేష భావమును నశింపచేసి శాంతిని వర్థిల్ల చేయుటకు సమర్థమగును. శివ విష్ణవుల ఏకతను బోధించు కొన్ని శ్లోక పాదములను ఇచట చూపుచున్నారు.

'' శివ స్వరూపీ శివభక్తి భాజామ్‌ యో విష్ణు స్వరూపీ హరిర్భాగవతానామ్‌. పూజ 2- 28

శివేతి నీలకంఠేతి శంకరేతి చ యస్స్మరేత్‌ | సర్వభూతో నిత్యం సో భ్యర్చ్యో దివిజైన్స్మృతిః పూ.భా. 30 - 56 శ్లో ||

వ్యాహరన్తి చ నామాని హరేశ్శంభోర్మహాత్మనః | రుద్రాక్షాలంకృతా యే చ తే వై భాగవతోత్తమాః పూ.భా.50-69 శ్లో||

హరిరూపధరం లింగం లింగరూపధరో హరి ః | ఈషదవ్యన్తరం నాస్తి భేదకృచ్ఛానయోః కుధీ: పూ.భా. 6అ- 44 శ్లో||

అనాదినిధనే దేవే హరిశంకరసంజ్ఞితే | అజ్ఞానసాగరే మగ్నా భేదం కుర్వన్తి పాపినః పూ.భా.6అ - 45 శ్లో||

హరిరూపో మహాదేవః శివరూపో జనార్థనః | ఇతి లోకన్య నేతా యస్తం నమామి జగద్గురుమ్‌. పూ. || అ30 శ్లో ||

దేవతాయతనం యస్తు కురుతే కారయత్యపి | శివస్యాపి హరేర్వాపి తస్య పుణ్యఫలం శృణు పూ 13 అ.1

మమ మూర్త్యన్తరం శంభుం రాజన్నోత్రైస్స్వశక్తితః స్తుహి........ పూ.17అ 71

లోకవాదో హి సుమహాన్‌ శంభుర్నారాయణప్రియః | హరిప్రియస్తథాశమ్భుః పూ-79అ -140

ఇట్లు శివకేశవులకు అభేదము నుపదేశించినదీ నారదీయ మహాపురాణము.

భక్తి

పూజించదగినది వారి యందలి అనురాగమే భక్తి యని సామాన్యముగా భక్తి లక్షణము. నారదీయ మహాపురాణమున భక్తి వైవిధ్యము నానా ఫల విధాయకత్వము చెప్పబడినది. ఇచట సంగ్రహముగా ఈ విషయమునే చూపుచున్నాము. పరలోక ఫలమును కోరువారు శ్రీహరికి భక్తి పూర్వక నివేదన వరముగా సర్వ కర్మలను ఆచరించవలయును. భక్తి హీనులకు నరులు చేయు దానహోమతపాదులచే శ్రీహరి ప్రీతి చెందజాలడు. భక్తిలేనివారు చేయు మేరు పర్వత పరిమాణ సువర్ణకోటి దానములు కూడా ధనహానిని మాత్రమే కలిగించును. భక్తి హీనులు చేయు తపము కాయశోషణమునకే ఉపకరించును. భక్తిహీనులు చేయు యజ్ఞము భస్మహవ్యము మాత్రమే. భక్తి రహితులుచేయు సహస్రాశ్వమేధ యాగములు నిష్ఫలములు. మానవులకు శ్రీహరి భక్తి కామధేనువు వంటిది. భక్తియుండగా కూడా అజ్ఞానులు సంసార విషయమును పానము చేయు చుండుట ఎంత వింత? అసూయ గలవారు చేయు భక్తిదానాది కర్మలు నిష్ఫలములు. అట్టివానికి శ్రీహరి దూరముగా నుండును. భక్తిచే సర్వకర్మలు సిద్ధించును. కర్మలచే శ్రీహరి ప్రీతి చెందును. శ్రీహరి ప్రీతి చెందిన జ్ఞానము కలుగును. జ్ఞానము వలన మోక్షము కలుగును. భగవద్భుక్తుల సంగతిచే భక్తి కలుగును. పూర్వజన్మ సుకృత పరంపరచే భగవద్భక్త సంగతి లభించును. మహానుభావుల సేవ చేయనిదే శ్రీహరి భక్తి లభించదు. విష్ణుభక్తి విహీనులు చేయు తపములు వ్రతములు వేదాధ్యయనము, యజ్ఞములు, శాస్త్రపఠనము, తీర్థసేవనము అన్నియూ వ్యవర్థములే. విష్ణుభక్తి గల చండాలుడు కూడా బ్రాహ్మణునికంటే అధికుడే. విష్ణుభక్తిలేని బ్రాహ్మణుడు కూడా చండాలుని కంటె అధముడు. గంగా స్నానము, అతిథా పూజనము సర్వయజ్ఞములు సులభములే. కాని విష్ణభక్తి మాత్రము బహుదుర్లభము. జగద్ధాతయగు శ్రీహరి యందు భక్తిలేని వారి కుల శీల విద్యా జీవనములు వ్యర్థములు. పురుషోత్తముని యందు భక్తిగలవాడు ధన్యుడు, శుచి, విద్వాంసుడు, వక్త, ధర్మశీలుడు, జ్ఞాని, దాత, సత్యవాది యగును.

ఈ భావములను తెలిపిన నారదీయ మహాపురాణములోని శ్లోకములను చూడుడు:-

పరలోకఫలం ప్రేప్సుః కుర్యాత్కర్మాణ్యతన్ద్రితః | నివేద్య హరయే భక్త్యా తత్ఫలం హ్యక్షయం స్మృతమ్‌ పూ. 3అ -73

న దానైర్న తపోభిర్వా యజ్ఞైర్వా బహుదక్షిణౖః భక్తిహీనైర్మునిశ్రేష్ఠ| తుష్యతే భగవాన్హరిః పూ. 4.అ.7

మేరు మాత్ర సువర్ణానాం కోటికోటి స్సహస్రశః | దత్తా చాప్యర్థనాశాయ యతో భక్తి వివర్జితా || 8 ||

అభక్త్యా యత్తవస్తప్తం కేవలం కాయశోషణమ్‌ | అభక్త్యా యద్ధుతం హవ్యం భస్మని న్యస్తహప్యవత్‌ || 9 ||

అశ్వమేధసహస్రం వా కర్మవేదోదితం కృతమ్‌ | తత్సర్వం నిష్ఫలం బ్రహ్మన్యదిభక్తివివర్జితమ్‌ || 11 ||

హరిభక్తి ః పరా నౄణాం కామధేనూపమా స్మృతా| తస్యాం సత్యాం పిబస్త్య జ్ఞానస్సంసారగరలం హ్యహో || 12 ||

అసూయోపేతమనసాం భక్తిదానాదికర్మ యత్‌ | అవేహి నిష్ఫలం బ్రహ్మంస్తేషాం దూరతరో హరి ః || 13 ||

భక్త్యా సిద్ధ్యన్తి కర్మాణి కర్మభిస్తుష్యతే హరిః | తస్మింస్తుష్టే భ##వేజ్‌ జ్ఞానం జ్ఞానాన్మోక్షమవాప్యతే 4అ. 32

భక్తిస్తు భగవద్భక్తసంగేన ఖలు జాయతే | తత్సంగః ప్రాప్యతే పుంభిస్సుకృతైః పూర్వసంచితైః || 33||

వినాపి మహతాం సేవాం హరిభక్తిర్హి దుర్లభా పూ. 23- 46

కింవై వేదైర్మఖై శ్శాసై#్తః కింవా తీర్థనిషేవణౖ ః | విష్ణుభక్తివిహీనానాం కిం తపోభిర్వ్రతైరపి పూ. 30-11,12

చండాలోపి మునిశ్రేష్ఠ విష్ణుభక్తో ద్విజాధికః | విష్ణుభక్తివిహీనశ్చ ద్విజో పి శ్వపచాధమః పూ.34-41

సులభం జాహ్నవీస్నానం తథైవాతిథిపూజనమ్‌ | సులభా స్సర్వయజ్ఞాశ్చ విష్ణుభక్తిస్సుదుర్లభా పూ. 39-52

కిం తేషాం కులశీలేన విద్యయా జీవితేన వా | యేషాం న జాయతే భక్తిర్జగద్ధాతరి కేశ##వే ఉ 53- 60

లోకే సధన్యస్యశుచిస్సవిద్వాన్‌

న ఏవ వక్తా న చ ధర్మశీలః |

జ్ఞాతా స దాతా స చ సత్యవక్తా

యస్యాస్తి భక్తిః పురుషోత్తమాఖ్యే ఉ 54 - 12

ఆచార ప్రాధాన్యము

''ఆచారః పరమో ధర్మశ్ర్శుత్యుక్త స్స్మార్త ఏవ చ '' అని మనుస్మృతిలో చెప్పిన విధముగా శ్రుతిస్మృతి విహితమగు ఆచారము పరమ ధర్మని ఋషులందరూ అంగీకరించిన విషయమే. నారదీయమహాపురాణమున కూడా '' ఆచారః పరమో ధర్మః '' పూ.భా. 4అ.22 శ్లోకమున చాటబడినది. ఇంకను ఇచట ఆచార విషయమున చాలా చెప్పబడినది. ఆ శ్లోకములను సంగ్రహముగా ఇచట చూచెదము.

యస్స్వాచారపరిభ్రష్టస్సాంగవేదాన్తగో పి వా | హరిభక్తిపరో వాపి హరిధ్యానపరో పి వా

భ్రష్టో యస్స్వా శ్రమాచారాత్‌ పతితస్సో భిధీయతే పూ. 4అ - 24

వేదోవా హరిభక్తిర్వా భక్తిర్వాపి మహేశ్వరౌ | ఆచారాత్పతితం మూఢం న పునాతి ద్విజోత్తమ || 25 ||

యస్స్వధర్మం పరిత్యజ్య భక్తిమాత్రేణ జీవతి | న తస్య తుష్యతే విష్ణురాచారేణౖవ తుష్యతి పూ. 15- 53

భాగవత లక్షణము

పురాణములు భాగవత లక్షణమును పలు విధములుగా చెప్పుచున్నవి. నారదీయ మహాపురాణమును చెప్పబడిన భాగవత లక్షణమును తెలియుటకు ఇచట చెప్పిన కొన్ని శ్లోకములను చూపుచున్నాము.

యే హితాస్సర్వభూతానాం గతాసూయా అమత్సరాః | వశినో నిస్స్పృహాశ్శాన్తాస్తే వై భాగవతోత్తమాః పూ. 5-50

కర్మణా మనసా వాచా పరపీడాం న కుర్వతే | అపరిగ్రహశీలాశ్చ తే వై భాగవతా స్స్మృతాః || 51 ||

మాతాపిత్రోశ్చ శుశ్రుషాం కుర్వన్తి యే నరోత్తమాః | గంగావిశ్వేశ్వరధియా తే వై భాగవతోత్తమాః || 53 ||

ఆత్మ వత్సర్వభూతాని యే వశ్యన్తి నరోత్తమాః | తుల్యాశ్శత్రుషు మిత్రేషు తే వై భాగవతత్తోమాః || 67 ||

అన్యేషాముదయం దృష్ట్యా యేభినన్దన్తి మానవాః | హరినామవరా యే హి తే వై భాగవతోత్తమాః || 61 ||

శివే చ పరమేశ చ విష్ణౌ చ పరమాత్మని | సమబుద్ధ్యా ప్రవర్తన్తే తే వై భాగవతా స్స్మృతాః || 72 ||

సర్వ భూతములందు హితబుద్ధి గలవారు అసూయామత్సరములు లేనివారు, జితేన్ద్రియులు, స్పృహా శూన్యులు, శాంతులు భాగవతోత్తములు, మనో వాక్కాయములచే పరపీడ నాచరించని వారు ఇతరుల నుండి దేనిని గ్రహించని వారు భాగవతోత్తములు. గంగా విశ్వేశ్వర బుద్ధిచే మాతా పితరులను సేవించువారు భాగవతోత్తములు. అన్ని ప్రాణులను తనవలె చూచువారు, శత్రువుల యందు మిత్రులందు సమబుద్ధి గలవారు భాగవతోత్తములు, ఇతరుల అభివృద్ధిని జూచి అభినందించువారు హరినామ సంకీర్తన పరులు భాగవతోత్తములు, పరమేశ్వరుడగు శివుని యందు పరమాత్మయగు శ్రీహరి యందు సమ బుద్ధి తో ప్రవర్తించువారు భాగవతోత్తములన బడుదురు. ఇది పై శ్లోకముల భావము.

ఉత్తమ గురువు

గురువులందరూ పూజ్యులే వంద్యులే. అయిననూ వారందరిలో పురాణమలను ప్రవచించు గురువు ఉత్తముడని నారద మహాపురాణమున చెప్పబడినది.

యః పురాణాని వదతి ధర్మయుక్తాని పండితః | సంసారపాశవిచ్ఛేదకారణాని న ఉత్తమః పూ. 9- 95- 96

కలి వర్జ్య ధర్మములు

వరాశర మహర్షి కలియుగమున విడువదగిన ధర్మములను విస్తరముగా, తెలిపెను. నారదీయ మహాపురాణమున కూడా కొన్నింటిని సంగ్రహముగా తెలిపెను. చూడుడు -

సముద్ర యత్రా స్వీకారః కమండలువిధారణమ్‌ | ద్విజానామసమవర్ణాను కన్యాసూవయమస్తథా ప. 24-13

దేవరాచ్చ సుతోత్పత్తిర్మధువర్కేవశోర్వధః | మాంసాద్యశనం తథా శ్రాద్ధే వానప్రస్థా శ్రమస్తథా || 14 ||

దత్తాక్షతాయాః కన్యాయా పునర్దానం వరాయ చ | నైష్ఠికం బ్రహ్మచర్యం చ నరమేధాశ్వమేధకౌ || 15 ||

మహాప్రస్థానగమనం గోమేథశ్చ తధా మఖః | ఏతాన్థర్మాన్కలియుగే వర్జ్యాన్యాహుర్మనీషిణః || 16 ||

సముద్రయాత్ర, కమండలు ధారణము, బ్రాహ్మణులు జాతీయ కన్యలను వివాహమాడుట, భర్త తమ్ముని వలన సంతానోత్పత్తి, మధుపర్కమున పశువధ, శ్రాద్ధమున మాంస భక్షణము, వాన ప్రస్థాశ్రమము, ఒక వరునికి దానము చేయబడిన కన్యను మరల మరోక వరునకి దానము చేయుట, నైష్ఠిక బ్రహ్మచర్యము, నరమేథము, అశ్వమేథము, గోమేథము, మహాప్రస్థాన, గమనము, యాగము ఈ ధర్మములను కలియుగమున విడువవలయును.

మధుపర్కమున పశువథను ఇచట నిషేదించిరి. కాని గృహ్యకారులు మాత్రము మాంస రహితముగా మధుపర్కము ఉండరాదని చెప్పిరి. ఇతర పురాణములందు పరివ్రాజకత్వమును నిషేధించిరి. ఇచట వాన వ్రస్థమును కూడా నిషేదించిరి. నైష్ఠిక బ్రహ్మచర్యమును నిషేదించుటలో ఆచరించువారి అసామర్థ్యము, వ్రత భంగమున ప్రత్యవాయ బాహుల్యము కారణము కావచ్చును. ఉభయ భ్రష్టతను నివారించుట పురాణకారుల ఉద్ధేశ్యము కావచ్చును.

అవివాహ్య కన్యలు

ఈ పురాణమున చెప్పబడిన వివాహమునకు యోగ్యులుకాని కన్యలను సంక్షేపముగా చెప్పెదము:-

రోగిణీం చైవ వృత్తాక్షీం నరోగకులసంభవామ్‌ | అతికేశామకేశాం చ వాచాలాం నోద్వహేద్భుధః పూ. 26 - 5

కోవనాం వామనాం చైవ దీర్ఘదేహం విరూపిణీమ్‌ | న్యూనాధికాంగీమున్మత్తాం పిశునాం నోద్యహేద్భుధః || 6 ||

స్థూలగుల్ఫాం దీర్జగజంఘాం తథైవ పురుషాకృతిమ్‌ | శ్మశ్రువ్యంజనంయుక్తాం కుబ్జాం చైవోద్వహేన్నచ || 7 ||

సదా రోదనశీలాం చ పాండురాభాం చ కుత్సితామ్‌ | కానశ్వాసాదినం యుక్తాం నిద్రాశీలాం చ నోద్వహేత్‌ || 8 ||

దీర్ఘనాసాం చ కితవాం తనూరుహవివభూషితామ్‌ | గర్వితాం బకవృత్తిం చ సర్వధా నోద్వహేద్బుధః || 9 ||

రోగము కలదానిని, తిరుగుడు కనులు కలదానిని, రోగము కల కులములో పుట్టిన దానిని, అతికేశను, వాచాలురాలను కోవనను, పొడవైన-శరీరము గలదానిని, విరూపిణిని, పెళ్ళాడరాదు. అంగవికలురాలను, అంగాధిక్యము కలదానను, ఉన్నత్తురాలను కొండెములు చెప్పుదానను, స్థూలగుల్ఫను, దీర్ఘ జంఘను, పురుషాకారము కలదానను, మీసములు గడ్డములు మొదలగు పురుషచిహ్నములు కలదానను, కుబ్జను వివాహ మాడరాదు. రోదన శీలను, పాండుర వర్ణము కలదానను, కుత్సితు రాలను, కాన శ్వాసాది సంయుక్తను, నిద్రాశీలను, దీర్ఘనాసను, కితవురాలను, శరీర మందంతట కేశములు కలదానను, గర్వితను, వంచకురానలు, ఎప్పుడూ వివాహ మాడరాదు. రోగకులమున పుట్టిన దానిని అనుచోట కల రోగ శబ్దమునకు, క్షయ, అమయ అపస్మార, శ్విత్రి, కుష్టు రోగములను గ్రహించవలయును. ఇతర స్మృతులలో చెప్పబడని కోపన, వామన, దీర్ఘదేహ, ఉన్మత్త, పిశున, పురుషాకృతులను ఈ పురాణమున విశేషముగా చెప్పిరి. సోదరులు లేని కన్యను వివాహ మాడరాదని మనుస్మృతిలో చెప్పినది ఇచట చెప్పబడలేదు.

భారత మహిమ పూ. 27- 72

క్షీరోదధేరుత్తరం యద్ధి మాద్రేశ్చైవ దక్షిణమ్‌ | జ్ఞేయం తద్భారతం వర్షం సర్వకర్మఫలప్రదమ్‌ || 73 ||

అత్ర కర్మాణి కుర్వన్తి త్రివిధాని తు నాదర | తత్ఫలం భుజ్యతే చైవ భోగభూమిధనక్రమాత్‌ ||47||

భారతే తు కృతం కర్మ శుభం వా శుభ##మేవ వా | తత్ఫలం క్షయి విప్రేన్ద్ర భుజ్యతే న్యత్ర జన్తుభిః || 48 ||

అద్యాపి దేవా ఇచ్ఛన్తి జన్మ భారతభూతలే | సంచితం సమహత్పుణ్యం అక్షయ్యమమలం భ##వేత్‌ || 49 ||

కదా లభామహే జన్మ వర్షే భారత భూమిషు | కదా పుణ్యన మహతా యస్యామః పరమం పదమ్‌ || 50 ||

శ్రీ నారదీయ మహాపురాణమున చెప్పబడిన భారత మహిమ ఇది. క్షీర సాగరమునకు ఉత్తరమున హిమాలయమునకు దక్షిణమున కలది భారత వర్షమని తెలియవలయును. ఈ భారత వర్షము సర్వకామ ఫల ప్రదము. ఈ భారత వర్షమున మనోవాక్కయములగు త్రివిధ కర్మలను చేయుదురు. తత్ఫలములను అనుభవించెదరు. అనుభవము భోగభూమి ధన క్రమమున జరుగును. భారత వర్షమున చేయబడిన శుభా శుభ కర్మలన్నియు క్షయశీలములు. ఆ కర్మ ఫలములను పరమున అనుభవించెదరు. భారత భూతలమున పుట్టవలయునని ఇప్పటికీ దేవతలు కోరుచుందురు. ఇచట సంపాదించిన మహాపుణ్యము అక్షయము, అమలము శుభముగా నుండును. భారత భూములలో ఎపుడు పుట్టెదము ? మహాపుణ్యముతో ఎపుడు పరమ పదమునకు వెళ్ళెదము అని దేవతలు ఆకాక్షించెదరు అని భావము.

మోక్షదాయిక పంచపురులు అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారవతీ పురి అను సప్త పురులు మోక్షదాయికలు.

అతిథి పరిచర్య

అతిధిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే | స తసై#్మ దుష్కృతం దత్త్వా పుణ్యమాదాయ గచ్ఛతి పూ. 27 - 72

అజ్ఞాతగోత్రనామానమన్యగ్రామాదుపాగతమ్‌ | వివశ్చతో తిథిం ప్రాహుః విష్ణువత్తం ప్రపూజయేత్‌ || 73 ||

అతిధి నిరాశుడై ఇంటి నుండి వెళ్ళిన ఇంటి యజమానికి తన దుష్కృతమునిచ్చి అతని పుణ్యమును తీసుకొని వెళ్ళును. గోత్ర నామమము తెలియని వాడు ఇతర గ్రామము నుండి వచ్చిన వానిని అతిథి యందురు. అతనిని శ్రీ మహావిష్ణువు వలె పూజించవలయును.

సత్యగరిమ

నారదీయ మహాపురాణమున సత్యగరిమ ఇట్లు స్తుతించబడినది

సత్యేన ధార్యతే లోకస్సత్యేనైన గచ్ఛతి | అనృతం తమసో రూపం తమసా నీయతే హ్యధ : పూ 43 - 82

సత్యేన సూర్యస్తవతి శశీ సత్యేన రాజతే | సత్యే స్థితా క్షితిర్భూప సత్యం ధారయతే జగత్‌. ఉ 23 - 86

సత్యేన వాయుర్వహతి సత్యేన జ్వలతే శిఖీ | సత్యాధారమిదం సర్వం జగత్థాపరజంగమమ్‌ || 87 ||

న సత్యాచ్ఛలతే సింధుర్న వింధ్యో వర్థతే నృప | స గర్భం యువతీ ధత్తే వేలాతీతం కదాచన || 88 ||

సత్యే స్థితా హి తరవః ఫలపుష్పప్రదర్శినః | దివ్యాదిసాధనం నౄణాం సత్యాధారం మహీపతే || 89 ||

అశ్వమేధనహస్రేభ్యన్సత్యమేవ విశిష్యతే || 90 ||

ఈ లోకము సత్యముచే ధరించబడుచున్నది. సత్యముతోనే స్వర్గమునకు వెళ్ళును. అసత్యము తమోరూపము, తపస్సు అథః పతనము గావించును. సత్యముచే సూర్యుడు తపించును. చంద్రుడు సత్యముచే ప్రకాశించును. ఈ భూమి సత్యములోనే నిలిచియున్నది. సత్యమే జగత్తును ధరింప చేయుచున్నది. సత్యముచే గాలి వీచును. సత్యము చే నిప్పుమండును. స్ధావర జంగమాత్మకమగు ఈ సకల జగత్తునకు సత్యమే ఆధారము. సత్యము నుండి సముద్రము చలించదు. సత్యము వలననే వింధ్య పర్వతము పెరుగుట లేదు. సత్యము వలననే ఆకాలములో యువతి గర్భమును ధరించజాలదు. సత్యములో నిలిచినందుననే వృక్షములు ఫలములను పుష్పములను ప్రదర్శించు చున్నవి. మానవులు దివ్యలోకములను సత్యము చేతనే సాధించగలుగుచున్నారు. వేయి అశ్వమేధ యాగముల కంటె సత్యము విశిష్ఠమైనది. ఇది నారద పురాణమున వర్ణించబడిన సత్యగరిమ.

భారతవర్షనామధేయనిమిత్తమ్‌ | అసీత్పురా మునిశ్రేష్ఠ భరతో నామ భూపతిః

ఆర్షభో యస్య నామ్నేదం భారతం ఖండం ముచ్యతే పూ 48 - 5

పూర్వము ఋషభుని పుత్రుడు భరతుడను మహారాజుండెను. అతని పేరు ఈ ఖండమునకు భారతఖండమని పేరు కలిగినది. ఇతర పురాణములలో కొన్నింటి దుష్యస్త శకుంతలా పుత్రుడగు భరతుని వలన భారతదేశమును పేరు కలిగినదని చెప్పబడుచున్నది.

వ్యాకరణ నిరూపణము

నారదీయ మహాపురాణమున పూర్వభాగమున యాబది రెండవ అధ్యాయమున సంక్షిప్తముగా వ్యాకరణము నిరూపించబడినది. ఆచారము దేని వలన కలుగును అని నారద మహర్షి యడుగగా ననన్దన మహర్షి శిక్షాదులగు వేదాంగముల నుపదేశించును. ఈ సందర్భములో వ్యాకరణమును కూడా పరిమితముగా వ్యాఖ్యానము గావించెను. కొన్ని సందర్భములలో పాణినీయ సుత్రాంశములను పేర్కొనును. భాష్యాను వాదకములగు కారికలను కూడా సంకలనము చేయును. కొన్నిపాణినీయ సూత్రాంశములను చూడుడు.

1. లక్షణత్థంభూత

2. అభిరభాగే

3. స్వామీశ్వరాధిపతి

4. తుమర్ధాద్భావ

5. ద్వితీయా చతుర్థీ చేష్టాయాం గతి కర్మణి. ఇత్యాదులు. ఇక కారికలను చూడుడు:-

గౌణ కర్మణి దుహ్యాదే: ప్రధానే నీహృకృష్వహామ్‌ | బుద్ధిభక్షార్థయో శ్శబ్దకర్మకాణాం నిజేచ్ఛయా ప్రయోజ్య కర్మణ్యన్యేషాం ణ్యన్తానాం లాదయో మతాః

ఇచట వ్యాకరణ సంక్షేప నిక్షేపము ఎవరికొరకు అని ఒక సంశయము కలుగును. బాలుల కొరకని చెప్పుటకు వీలుపడదు. బాలులు ఉపనీతులై గురువు నాశ్రయించి గురుముఖము నుండి శిక్షను గ్రహించి శైక్షులై వ్యాకరణమును కూడా సూత్ర వార్తిక వృత్త్యాత్మకముగా అభ్యసించెదరు. కాని నర్గ ప్రతినర్గాది నానా విషయకమగు పురాణమును అభ్యసించ ప్రయత్నించరు. ప్రౌఢుల కొరకనుటకు కూడా వీలు పడదు. ఇచట సామాన్య జ్ఞానము మాత్రమే చెప్పబడినది కాని గభీరమగు వ్యాకరణ శాస్త్రార్థ విచారము చేయబడలేదు. సుప్తిన్త వదములు నిర్దేశించబడినవి. విభక్త్యర్థములు చెప్పబడినవి. ఉదాత్తాదులు, ధాతువులు గణానుసారముగా చెప్పబడినవి. కావున ఇది ప్రౌఢులకు ఉపయోగపడదు. బాలులకు అవసరములేదు కావున ఏమి ప్రయోజనము అని. కాని నారదీయ మహాపురాణమున వ్యాకరణమును సంక్షేపముగా చెప్పుట అంగములతో కూడిన వేదాధ్యయనము చేయవలయునని చెప్పిన విధి వాక్యమును అనుసరించి వేదాంగ స్వరూప బోధన వరమని గ్రహించవలయును.ఇదే విధానము ఇతరాంగములకు ఇతర విషయములకు కూడా అన్వయించును.

ఏది పరతత్త్వము? ఈశ్వరుడెవరు ?తత్ర వస్తుత ఏకం తు శివాఖ్యం చిత్రశక్తికమ్‌. వూ 63-47

దృక్శక్తిర్యత్ర న్యగ్భూతా క్రియాశక్తిర్విశిష్యతే| ఈశ్వరాఖ్యం తు తత్తత్త్వం ప్రోక్తం సర్వార్థసాధకమ్‌ 63-32-33

యత్ర క్రియా హి న్యగ్భూతా జ్ఞానాఖ్యోద్రేకమశ్నుతే | తత్తత్త్వం చైవ విద్యాఖ్యం జ్ఞానరూపం ప్రకాశకమ్‌ 33-44

పరతత్త్వము శివాఖ్యము. దర్శన క్రియాత్మక శక్తులు విడిగా పొడనూవుచు సర్వార్థ సాధకముగా నుండునదే ఈశ్వర స్వరూపము, విడిగా క్రియాతత్త్వము జ్ఞానోద్రేకమును పొంది జ్ఞానరూపముగా స్వయం ప్రకాశమగునది విద్యాతత్త్వము.

ఇట్లు పరతత్త్వము శివము. పరమాత్మ జ్ఞాన స్వరూపము స్వయం ప్రకాశమని తెలుపబడినది.

కార్తవీర్యుడు పూజ్యుడు.

శ్రీ నారదీయ మహాపురాణమున పూర్వభాగమున 76,77 అధ్యాయములలో 253 శ్లోకములలో చాలా విస్తృతముగా హై హయ ప్రభువగు మాహిష్మతీవతీ, సహస్ర బాహువగు కార్తవీర్యుని మహిమ వర్ణించబడినది. కార్తవీర్యుని సేవించవలయునని చెప్పబడినది. ఈ కథను చెప్పిన వారు సాక్ష్యాత్తు సనత్కుమారులు. సనత్కుమారులు కూడా దత్తాత్రేయుని నుండి వినినట్లు చెప్పుటచే ఈ వృత్తాంతము అసత్యమని కాని ఆధునికమని కాని చెప్పజాలము. దేవత్వమును ఆపాదింతి కార్తవీర్య మాహాత్మ్యము సమగ్రముగా చెప్పబడినది. కార్తవీర్య కవచము కూడా మహాతంత్ర గుప్తముగా బోధించబడినది. కార్తవీర్యునకు సర్వజ్ఞత్వము, సర్వప్రదత్వము, కృతిత్వము రాజరాజేశ్వరత్వము కూడా ప్రకర్షణముగా ప్రతిపాదించబడినది. ఇట్లు అనితర సాధారణమగు దేవత్వము దత్తాత్రేయ ప్రసాదము వలన లభించినదని చెప్పుటచే పరోక్షముగా దత్తాత్రేయ ప్రభావము బోధించబడినదిగా గ్రహించవలయును. దత్తాత్రేయ మహిమను ఉపదేశించుటకే కార్తవీర్య మహిమ వర్ణించబడినదని తెలియవలయును. కార్తవీర్యుడు చక్రావతారమని చెప్పబడినది. కాని ఏ సందర్భములో చక్రము కార్యవీర్యునిగా అవతరించెనో తెలువలేదు. ప్రసంగానుసారమగు కథనం మాత్రమే బోధించిరి.

జలక్రీడా

శ్రీ నారదీయ మహాపురాణమున పూర్వభాగమున డెబ్బది తొమ్మిదవ అధ్యాయమున హరి హరుల, మునుల, రాక్షసుల జలక్రీడ విస్తరముగా వర్ణించబడినది. ఇచట హరిహరుల నర్మాలావములు కూడా వర్ణించబడినవి. ఈ జలక్రీడా సమయమున ఆకాశమున నున్న హనుమంతుడు నృత్యమును గావించును. గర్జించును. గానము చేయును. వీణను మీటును. హనుమంతుని వీణా వాద్యమును విని శంకరుడు కూడా పాడుటకు మొదలిడును. అంతట గౌతమాదులు తాళములను మ్రోగింతురు. హనుమంతుడే గానము చేయును. హనుమంతుని గీత మాధుర్యముచే మోహమును పొందిన హర్యాదులు అందరూ తమ గానమును మానివేతురు. హనుమంతుని గానముచే అచట అద్భుతము జరుగును. గౌతముని గృహమున శుష్కములగు దారుమయ వస్తు జాత మంతయూ చిగుర్చును. సంగ్రహముగా ఇచట చెప్పబడిన విషయమిది.

ఇపుడు ఇచట మనకొక సంశయము కలుగును. ఈ జల క్రీడా వర్ణనలో వ్యాసభగవానుడు బోధించదలచిన విషయమేమిటి? అని మనుష్యులవలె దేవతలు కూడా జలక్రీడా ప్రియులు నర్మాలాపన వరులు అని బోధించుటయా? మానవులకు దేవతలకు భావసామ్యమున్నదని అంత అవసరము కాదు కావున దీనితో మానవులకు కలుగు ప్రయోజనము శూన్యము. ఈ విషయమును తెలుసుకొనవయునని మానవులు అభిలషించరు కూడా. వాస్తవమును చెప్పదలచినచో జలక్రీడాది ప్రాకృత కర్మలందు దేవతలు కూడా ఆనందించెదరను భావనయే మానవులకు కలుగదు. కావున ఆ విషయమును తెలియ నుత్సుకులు కాజాలరు. కావున ఈ వర్ణనకు ప్రయోజనము శూన్యమా? అను సందేహము కలుగక మానదు.

కాని శ్రీమన్నారయాణుని అవతార రూపమగు వేదవ్యాస భగవానుడు నిష్ప్రయోజనమగు వర్ణనను కాని అల్ప ప్రయోజనమగు వర్ణనను కాని చేయజాలరు. నిశిత పరిశీలన చేసినచో ఈ విషయము ఇందలి ప్రయోజనము తేట తెల్లమగును. ఈ కథా వర్ణనలో వ్యాసభగవానుడు మనకు మూడు విషయములను బోధించ సంకల్పించెను. ఈ జలక్రీడ కైలాసమున కాక గౌతమ మహర్షి గృహమున చెప్పుటలో శంకరుని భక్తవాత్సల్యము, భక్త పరతంత్రతను మనకు బోధించదలచెను. అంతియే కాదు భగవంతుడు భక్తుల సమీపమును తన ఆధిక్యమును మన న్యూనతను చూడక మనతో సమానత్వమును మనలో ఒకడుగా నుండుటకు మాత్రమే చేయును. ఇది శంకరుని భక్త సౌలభ్యమయును బోధించును.

ఇక హరి హరుల నర్మాలాపములు హరిహరా భేదమున సూటిగా బోధించును. మనము అజ్ఞానముతో హరిహరులలో భేద భావమును, న్యూనాధిక్యములను చూచెదము. వారిలో మాత్రము ఆ భావనలేదని మననకు బోధించుటయే ఉద్దేశ్యము.

శంకరుని జలక్రీడను మాత్రమే వర్ణించక ఆ సమయమున హనుమంతుని నృత్య గానములను కూడా వర్ణించుటచే భగవంతుడు ప్రాకృతులవలె ప్రవర్తించుట వీలున్నంతెక్కువగా భక్తులకు తన దర్శనమును, దర్శనము వలన కలుగు అద్వితీయానందమును ప్రసాదించుటయే ముఖ్యోద్దేశ్యము. హనుమంతుని గానమునను తాను కూడా పాడుట ఆడుట భక్తులయెడ భవునకున్న ఆవ్యాజ కృపను తెలుపుట మరియెక ప్రయోజనము. ఇవియన్నియూ కాక హనుమంతుని గీతనాట్య పారీణతను బోధించుట ఎండినదారుమయ వస్తువులు చిగుర్చుట సంగీత ప్రభావమును మనకు కనులకు కట్టించుటయే మరియెక ప్రయోజనము. ఇట్లు గానప్రభావము, శంకరునికి భక్తులకు గల అపార వాత్యల్యమును తెలియజేయుట అట్లు తెలియుట వలన భగవంతుడు మనకు అందుబాటులో లేదను భ్రమను తొలగించుట వ్యాస భగవానుని ఉద్దేశ్యము. ఈ విషయమును తెలిసినచో వ్యాస భగవానుని ఉద్దేశ్యము ఈ విషయమును తెలిసినచో భక్తులు శంకరుని ఆరాధించి అభీష్టములను పొందెదరు అని ఉపదేశము చేయుటకే ఇట్లు జలక్రీడా వర్ణన చేయబడినది.

శివుడు పార్వతిని అలంకరించుట

శ్రీ నారదీయ మహాపురాణమున ప్రాకృతులగు కాముకుల అనుదాత్తములగు ఔపచారిక క్రియలు (చేష్టలు) కూడా వర్ణించబడినవి. ఈ చేష్టలను దేవతలాచరించి నటుల చూపబడినవి. ఈ వర్ణనలు భక్తులకు ప్రవన్నులకు ఏ విధముగా ఉపకరించనివిగా అనర్ధకములుగా కనపట్టును. పూర్వభాగమున డెబ్బది తొమ్మిదవ అధ్యాయమున పార్వతి వారించుచున్ననూ శివుడు పార్వతీదేవికి కొప్పుముడుచుటను వ్యాసభగవానుడు వర్ణించును. ఇట్లు చేయు శివుడు పార్వతీదేవి కోకముడిని కూడా సవరించినటుల చెప్పెను. ఈ వర్ణనలు పై పైన చూచిన కాముకుల చేష్టలవలె కనపట్టును. కాని అంతర పరీక్ష చేసినపుడు మాత్రమే మనకు వాస్తవము తెలియును. ఒక మహర్షి అందులో వేద వ్యాస మహర్షి ఇట్టి వర్ణనలను ఏ పరమార్థములేనిదే చేయజాలడు. ఈ వర్ణనలో వేదాస్త తత్త్వనిగూడార్థము నిక్షిప్తమైయున్నది. భగవంతుడు పురుషునకు ప్రతికృతి. లేదా ఉపలక్షణము. పార్వతి ప్రకృతికి ప్రతీక . కొప్పులో పూలను తురిమినట్లు చెప్పుట ఈ అర్థమును సూచించుటకే. ప్రకృతిని ఋతుకాలములలో పుష్పాదులచే అలంకరింపచేయువాడు పురుషుడే అని మనకు బోధించుటయే వ్యాసమహర్షి ఆశయము. అంతియే కాదు. ధర్మమునకు విరుద్ధముకాని కామమును నేనని భగవంతుడు చెప్పియున్నాడు. ధర్మవిరుద్ధము కాని దానికి రహస్య మవసరములేదు. అందువలననే శంకరుడు భక్తుల ముందే పార్వతిని అలంకరించినటుల వర్ణించెను. ఇట్లు పరమార్థమును సూచించుటకే వర్ణించెను. కాని పార్వతీపరమేశ్వరుల కాముక చేష్టలు మహర్షి విషయములు కాజాలవు. వారు కూడా మనవలె ఇంద్రియలోలులు అని భావించజాలము ఇంద్రియలోలులైనచో భగవచ్ఛబ్దవ్యవదేశ్యులు కాజాలరు కదా?

శివుని సంధ్యోపాసన

ఈ అధ్యాయముననే మరియొక అంశము కూడా పరిశీలించదగినది కలదు. భగవానుడగు శంకరుడు యథాకలమున సంధ్యావందన మాచరించును. అపుడు శ్రీహరి ఇట్లు ప్రశ్నించుట:-

సర్వైర్నమస్యతే యస్తు సర్వైరేవ సమర్చ్యతే | హూయతే సర్వయజ్ఞేషు న భవాన్‌ కిం జపిష్యతి?

రచితాంజలయస్సర్వే త్వామేవైకముపాసతే| న భవాన్దేవదేవేశః కసై#్శ విరచితాంజలిః

నమస్కారాది పుణ్యానాం ఫలదస్త్వం మహేశ్వరః | తవకః ఫలదో వన్ద్యః కోవా

త్వత్తోధికో వద 79-196-199

అందరిచే నమస్కరించబడు, అందరిచే పూజించబడు, అన్ని యజ్ఞములలో హవిన్పులందించబడు నీవు దేవిని జపించు చుంటివి? చేతులు జోడించి అందరూ నిన్నే ఉపాసింతురు. అట్టి దేవదేవుడవగు నీవు ఎవరికి చేతులను జోడించుచుంటివి? నమస్కారాది పుణ్యకర్మలకు ఫలమునిచ్చు నీకు ఫలము నిచ్చువాడెవ్వడు? నీకంటె అధికుడెవడు?అని పై శ్లోకములకు భావము అపుడు శివుడు నిష్కపటముగా ఇట్లు బదులు పలుకును.

ధ్యాయే న కించిద్గోవిన్ద! నమస్య్వే హం న కించన| కింతు నాస్తికజన్తూనాం ప్రవృత్త్యర్థమిదం మయా

దర్శనీయం హరే చైతద్‌ అన్యధా పావకారిణః తస్మాల్లోకోపకారార్థమిదం సర్వం కృతం మయా 200-201

గోవిన్దా! నేనెవరినీ ధ్యానించుట లేదు. ఎవరికీ నమస్కారించుట లేదు. నాస్తికులను కర్మలందు ప్రవర్తింప చేయుటకు నేనిట్లు చేసి ఛూపుచుంటిని . నేనిట్లు చేయనిచో వారు పాపముల నాచరింతురు. కావున లోక సంగ్రహము కొరకు నేనిట్లు చేయుచుంటిని అనునది శంకరుని సమాధానము. సకల జగద్రక్షకుడగుటచే శంకరుడు లోకులకు కర్తవ్యమును బోధించి వారిని కర్మభ్రష్టులు కాకుండా చూచుట శంకరుని కర్తవ్యము. మన కొరకు మనము సత్కర్మలనాచరించుటకు తాను స్వయముగా ఆచరించి చూపుటలో శంకరుని అవ్యాజ వాత్సల్యము మన హృదయ ఫలకమున నిలుచును. ఈ విషయము తెలియని వారు శంకరునిది నటన, కపటము, ఆడంబరము వంచనగా భావింతురు. అది వారి దృష్టి లోపమే కాని వాస్తవము కాజాలదు.

హరిశ్చంద్రుడు

ఇక్ష్వాకు వంశ సంభూతుడు అయోధ్యాపురవాసి హరిశ్చన్ద్ర మహారాజుండెను. హరిశ్చన్ద్ర మహారాజ చరితము ఉదాత్తముగా ఈ పురాణమున ఇప్పటి రాజులకు ఉద్బోధకముగా ఇతర పురాణములో వలె వర్ణించబడినది.

శ్రూయతే కిల రాజాసీద్ధరిశ్చన్ద్రో వరాననే| చాండాలమందిరావాసీ భార్యా తనయవిక్రయీ ఉ.14-57

అసత్య వచనాద్భీతో దుఃఖాద్దుఃఖాస్తరం గతః| తస్య సత్యేన సంతుష్టా దేవాశ్శక్రపురోగమాః ||58||

వరేణ ఛన్దయాఞ్చక్రుర్హరిశ్చన్ద్రం మహీపతిమ్‌ | తేన సత్యవతా చోక్తా దేవా శ్శక్రపురోగమాః

యది తుష్టా హి విబుధా వరం మే దాతుమర్హథ ||59||

ఏషా హి నగరీ నర్వా నద్రుమా స సనరీనృపా | నబాలవృద్ధతరుణా సనారీ నచతుష్పాదా|| 60||

ప్రయాతు కృతపాపోసి స్వర్గతిం నగరీ మమ| అయోధ్యా పాతకం గృహ్య గన్తాహం నరకం ధ్రువమ్‌ || 61||

ఏకాకీ న హి గచ్ఛామి పరిత్యజ్య జనం క్షితౌ | స్వర్గం విబుధశార్దూలా

స్స త్యమేతన్మయేరితమ్‌ || 62 ||

హరిశ్చన్ద్రుడను రాజు కలడు. ఇతను భార్యా తనయులను అమ్ముకొని చండాల గృహమున నివసించెను. అసత్య వచనమునకు భయపడి పరమ దుఃఖమును పొందెను. హరిశ్చన్ద్రుని సత్యవచనమునకు సంతోషించిన ఇంద్రాది దేవతలు వరమును కోరుకొమ్మని అడిగిరి. అపుడు హరిశ్చన్ద్రుడు వారితో ఇట్లు పలికెను. ఓ దేవతలారా? మీరు నా యెడ ప్రీతి చెందినచో నాకీ వరమును ప్రసాదించుడు. ఈ అయోధ్యానగరము వృక్షములతో క్రిమికీటకాదులతో బాల వృద్ధ యువకులతో స్త్రీలతో పశుపక్ష్యాదులతో పాపమును ఆచరించిననూ స్వర్గమును చేరవలయును. అయోధ్యాపాతకమును స్వీకరించి నేను నరకమునకు వెళ్ళెదను. ఈ ప్రజలను భూమిపై విడిచి నేనొంటిగా స్వర్గమునకు వెళ్ళజాలము. ఇది ముమ్మాటికి నిశ్చయము.

ఇది పై శ్లోకములకు భావము. ఈ వర్ణనతో హరిశ్చన్ద్ర మహారాజు సత్యనిష్ఠ ప్రజావాత్సల్యము మన హృదయమున నిలిచి పోవును.

శిక్షా నిరూపణము

శ్రీ నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున పందొమ్మిదవ అధ్యాయము శిక్షా నిరూపణమని ప్రసిద్ధి చెందినది. ఈ అధ్యాయమున రుక్మాంగదుని పుత్రుడగు ధర్మాంగదుడు చేయు రాజ్యపరిపాలన పద్ధతి వర్ణించబడినది. సంగ్రహముగా ధర్మాంగదుడుని చేసిన ధర్మవ్యవస్థ నిరూపించబడినది. ఇట్లు రాజ్యాపాలన ధర్మపాలన ఆనాటి సమాజస్థితిని కనులకు కట్టినట్లు నిలపెను కావున ఇతిహాస ప్రియులు తప్పక చదువవలసినదని మూల శ్లోకములనే ఇచట చూపుచున్నాము.

తస్త్రం తదఖిలం చక్రే నిత్యం పితృవచస్థ్సితః ||26||

దుష్టనిగ్రహణం చక్రే శిష్టానాం పరిపాలనమ్‌ | అటనం సర్వదేశేషు వీక్షణం సర్వకర్మణామ్‌ || 27||

వేదనంవీక్షణః చక్రే తులామానం దినేదినే | గృహే గృహే నరాణాం చ చక్రే సంరక్షణః నృపః || 29||

స్తనంధయీ క్వచిద్బాలస్త్సనహీనో నరోదితి| శ్వశ్రూర్వధ్వాన కుత్రాపి వ్రరోదిత్యవమానితా || 30||

పిత్రాజ్ఞాబద్ధుడై అఖిల రాజ్యతంత్రమును నిర్వహించెను. దుష్టశిక్షణను శిష్టరక్షణమును గావించెను. సర్వదేశములలో పర్యటించి సర్వకర్మలను పర్యవేక్షించెను. ప్రతిదినము వేద సంవీక్షణమును, తులామానమును ప్రతిగృహమున మానవుల సంరక్షణను గావించెను. పాలుత్రాగు పసిపాపలు పాలకొరకు రోదించుటలేదు. కోడలుచే అవమానించబడి ఏ అత్తా రోదించుట లేదు.

ఇది పై శ్లోకముల భావము, కోడలిచే అవమానించబడి ఏ అత్తా రోదించుట లేదు అను ఒక వాక్యమే రుక్మాంగద రాజ్యమున గృహస్ధులందరూ సుఖ శాంతులతో తులతూగుచున్నారని తెలుపుచున్నది. పాలు త్రాగు బాలులు పాలకొరకు ఏడ్చుటలేదు. అను వాక్యముచే రాజ్యమున ప్రజలందరూ ఆరోగ్యముతో తులతూగుచున్నారని తెలుపును. ఈ రెండు సంఘటనలే ధర్మాంగద పాలన ఎంత చక్కగా యున్నదో బోధించుచున్నది. అత్తాకోడళ్ళ సఖ్యత అఖిల రాజ్య సౌహార్దమునకు తార్కాణముగా చూపుటయే వ్యాస భగవానుని చాతుర్యమును కనులకు గట్టునట్లు చేయును.

శంకరస్తవము

శ్రీ నారదీయ మహాపురాణమున ఆయా సందర్భములలో నానా దేవతా పరమగు స్తోత్రములు అనేకములు పఠించబడినవి. పూర్వభాగమున తొంబది యొకటవ అధ్యాయమున చేయబడిన మహేశ స్తోత్రమునకు సాటివచ్చునది మరియొకటి కానరాదు. ఈ స్తోత్రము ఎక్కువ విస్తీర్ణముగా చెప్పబడలేదు కావున మొత్తమును ఇచట చూపుచున్నాము.

ధరాంబ్వగ్ని మరుద్వ్యోమ సఖేశేన్ద్వర్క ముర్తయే| సర్వ భూతాంతరస్థాయ శంకరాయ నమో నమః || 216||

శ్రుత్యస్తకృతవాసాయ శ్రుతయే శ్రుతి జన్మనే | అతీన్ద్రియాయ మహసే శాస్వతాయ నమో నమః || 220||

స్థూల సూక్ష్మ విభాగాభ్యామనిర్దేశ్యాయ శంభ##వే| భవాయ భవనసంభూతదుఃఖాహన్త్రే నమోనమః || 221||

తర్కమార్గాతిదూరాయ తపసాం ఫలదాయినే| చతుర్వర్గవదాన్యాయ సర్వజ్ఞాయ నమోనమః || 222||

ఆదిమధ్యాన్తశూన్యాయ నిరస్తాశేషభీతయే| యోగిధ్యేయాయ మహతే నిర్గుణాయ నమోనమః || 223||

విశ్వాత్మనే వివిక్తాయ విలనచ్చన్ద్రమౌలయే | కన్దర్పదర్పనాశాయ కారహన్త్రే నమోనమః ||224||

విప్రాశనాయ విహారత్‌ వృషస్కన్ధముపేయుషే | సరిద్దామ నమాబద్ధ కపర్దాయ నమోనమః || 225||

శుద్ధాయ శుద్ధభావాయ శుద్ధానామన్తరాత్మనే |పురాన్తకాయ పూర్ణాయ పుణ్యనామ్నే నమోనమః ||226||

భక్తాయ నిజభక్తానాం భుక్తిముక్తి ప్రదాయినే| వివానసే నివాసాయ విశ్వేషాం వతయే నమః || 227||

త్రిమూర్తిమూలభూతాయ త్రినేత్రాయ త్రిశూలినే | త్రిధామ్నే ధామరూపాయ జన్మదాయ నమోనమః || 228||

ఇది సంగ్రహముగా శివస్తోత్రము. నిజముగా ఇది స్తవరాజమే. ఈ స్తోత్రమున పరివృత్తిని సహించని పదములు శబ్దవరి పాకమునకు నిదర్శనములు. ఈ స్తోత్రమున ఒక పదము కూడా అనపేక్షితము అసందర్భము, దాంభికము, పరిహర్యముగా లభించదు. అనుప్రాసముతో మాధుర్యము, విరోధాభానముచే అర్థగౌరవము సిద్ధించినది. శంకరుడు నగా ధరాదిమూర్తిగా నున్నను ధరాద్యన్తర్వర్తియగు విలక్షమ తత్త్వము. శంకరుడు వేదాన్తవేద్యుడు, వేదాన్త స్వరూపుడు, వేదాన్త కారణము కూడా. తేజోరూపుడైననూ ప్రకాశము కాడు. అవ్యక్తుడు కావున వ్యక్తతను చెందడు. శంకరుడు బాహ్యశుద్ధుడు అస్తశ్శుద్ధుడు. శుద్ధుల కంతరాత్మ . కేవలము సౌమ్యుడు మాత్రమే కాడు. సేవకుడు కూడా కావున అసామాన్యుడు. స్వయముగా విప్రస్త్రుడు. దిగంబరుడు నగ్నుడు . సాధన శూన్యుడు. కాని సర్వజీవులకు వానమును ప్రసాదించును. మూడు లోకములలో వ్యాపించి ఉండు వాడు అనగా త్రిధాముడు అనగా మూడు లోకములను ఆధారము చేసుకొని యుండువాడు అయిననూ సర్వమునకు ఆధారభూతుడు. ఇతనికి మరియొక విశిష్ట లక్షణము కలదు. ప్రియురాలికి అర్థదేహమును ఇచ్చినవాడు. ఇతర దేవదానవులు తమ తమ ప్రియురాళ్ళకు ఆధీశులుగా నుందురు. వారియందు ప్రీతియున్ననూ వారికి ప్రభువులు. ప్రియురాళ్ళను వారి సొత్తుగా భావించెదరు. శ్రుతి కూడా శంకరుని చకితునిగా చెప్పును కాని అతను మానవ బుద్ధికి గోచరుడు కాడు. అట్టివానిని ఎట్లు స్తుతించగలము?

శివస్తవరాజమునకు ఇది సంక్షేప వ్యాఖ్యానము. విస్తర భయముచే చెప్పవలసినది చాలా యున్ననూ చెప్పుట లేదు.

సృష్టి ప్రారంభకాలము

సామాన్యముగా మానవుడు సృష్టి ప్రారంభకాలమును తెలియగోరును. కాని తెలియదు. శ్రీ నారదీయ మహాపురాణము సృష్టి ప్రారంభకాలమును ఇట్లు తెలియజేయుచున్నది. చైత్రే మాసే జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని"

ఉపవాస ప్రతిషేధము

కొన్ని కొన్ని ప్రదేశములలో కాలములలో ఉపవాస విధి చెప్పబడుచున్నది. కొన్నిచోట్ల ఉపవాస నిషేధము కూడా చెప్పియున్నారు. చూడుడు:- గుర్విణీనాం గృహాస్థానాం క్షీణాం రోగిణాం తథా ఉ 23-75

శిశూనాం వలిగాత్రాణాం న యుక్తం నముపోషణమ్‌| యజ్ఞభాగోద్యతానాం చ సంగ్రామక్షితి సేవినామ్‌ || 76||

గర్భవతులు, గృహస్థులు, కృశాంగులు, రోగగ్రస్తులు, శిశువులు, వృద్ధులు, ఉపవసించరాదు. యజ్ఞమును చేయసిద్ధపడిన వారు, యుద్ధభూమి నాశ్రయించి యున్నావారు ఉపసించరాదు.

రాజగుణ వర్ణనము

రాజులకుండవలసిన విశేషగుణములను రుక్మాంగదుడు తన పుత్రుడగు ధర్మాంగదునకు ప్రశ్నముఖముగా ఉపదేశించును. పుత్రుని చూచుటకు వచ్చిన రుక్మాంగదమహారాజును రాజపరివృతుడగు ధర్మాంగదుడు దూరమునుండి ఎదురేగును భక్తిస్నేహములతో నమస్కరించును. ఆ సమయమునస్నేహార్ధ్రచిత్తుడగు రుక్మాంగదమహారాజు ధర్మాంగదుని సకల విధక్షేమమును అడుగుచు సున్నితముగా బోధించును. చూడుడు :-

కచ్చిత్పాసి వ్రజాస్సర్వాః కచ్చిద్దండయసే రిపూన్‌ | న్యాయాగతేన విత్తేన కోశం పుత్ర బిభర్షి చ || 21||

కచ్చిద్విప్రేష్వత్యధికా వృత్తిర్దత్తానపాయినీ | కచ్చిత్తేకాక్తశీలతత్వం కచ్చిద్వక్తా న నిష్ఠురమ్‌ || 22||

కచ్చిద్వచనకర్తాన్తనయాశ్చ పితున్సదా|| 23||

కచ్చిద్వధూ శ్శ్వ శ్రూవాక్యే వర్తతే శాసనే తవ| కచ్చిద్వివాదాన్విపై#్రస్తు నమం నేక్షన ఆత్మజ || 24||

కచ్చిద్గావో నరుధ్యన్తే విషమే వివిధైస్తృణౖః | తులామాని సర్వాణి హన్నాదీనాం సదేక్షసే ||25||

కుటింబినం కరైః పుత్ర నాత్యర్థమభిదూయసే | కచ్చిన్న ద్యూతపానాది వర్తతే విషయే తవ || 26||

కచ్చిద్భన్నరసైర్లోకా భిన్నవాక్యైః పురే తవ | న దానైర్జీర్ణవసై#్రశ్చ నోవజీవన్తి మానవాః ||27||

కచ్చిచ్చావరరాత్రేషు నదా నిద్రాం విముంచసి||30||

కచ్చిత్పమర్థన్తనయః పితరం న హి యాచతే| న వర్ణసంకరో రాజ్యే కేషాంచిదభవత్పునః ||31||

న కంచుకవిహీనా తు భ##వేన్నారీ న భర్తృకా ||32||

గృహాన్నిష్క్రమణం స్త్రీణాం మాస్తు రాజ్యే మదీయకే| మా నకేశా హి విథావా మాన్త్యకేసా నభర్తృకాః||33||

మా ప్రతీహ సదాక్రోశీ మారణ్యా సగరాశ్రయాః | సామాన్యవృత్త్యదాతా మే రాజ్యే వసతు నిర్ఘృణః || 34||

గోపాలో నగరాకాంక్షీ నిర్గుణస్తూపదేశకః | ఋత్విగ్వా శాస్త్రహీనశ్చ మా మే రాజ్యే వసేదిహ ||35||

యో హి నిష్పాదయేన్నీలీం నీలీరంగాతిసేచకః | నిర్వాస్యౌ తావుభౌ పాపౌ యో వై మద్యం కరోతి చ || 36||

ఇది రాజ గుణవర్ణనమును పేరుతో రాజు చేయవలసిన రాజ్యపరిపాలనమును గురించి, రాజ్యమున నుండదగిన ప్రజల ప్రవృత్తిని స్పష్టముగా బోధించిరి. ఇపుడిక పై శ్లోకముల భావమును చూడుడు.

ప్రజల నందరినీ చక్కగా పరిపాలించుచున్నావా? శత్రువులను దండించుచున్నావా? న్యాయముగా వచ్చు ధనముచే కోశమును నింపుచున్నావా? బ్రహ్మణులకు అపాయము లేని జీవనమునిచ్చుచున్నావా? నీ శీలము అందరికి ప్రియముగా నున్నదా ?ఎవరితోనూ కఠినముగా మాటలాడుటలేదు కదా? తండ్రి ఆజ్ఞను తనయులు పాటించుచున్నారా? కోడలు అత్తమాటను వినుచున్నదా? బ్రహ్మణులతో వివాదమును పెట్టుకొనుట లేదుకదా? అన్నాది వస్తు సంచయ తులామానములను చక్కగా పరిశీలించుచున్నావా బహుకుటుంబము కల వానిని పన్నులచే పీడించుట లేదు కదా? నీ రాజ్యమున ద్యూత పానాదులు లేవుకదా? భిన్నరుచులు కల మానవులు భిన్న వాక్యములచే కలహించుటలేదు కదా ? దానములచే జీర్ణ వస్త్రములచే నీ ప్రజలు జీలించుట లేదు కదా? అపర రాత్రులందు నిద్రించుట లేదు కదా? సమర్థులగు పుత్రులు తండ్రిని యాచించుట లేదు కదా? నీరాజ్యములో వర్ణ సంకరము జరుగలేదు కదా ? భర్తృమతియగు స్త్రీ కంచుక విహీనగా యుండుట లేదు కదా? నా రాజ్యమున స్త్రీలు ఇంటినుండి బయటకు వెడలుట లేదు కదా? విధవలు నకేశలుగా భర్తృమతులు వికేశలుగా నుండట లేదు కదా? సన్యాసి చింతించుటలేదు కదా ?అరణ్య వాసులు నగరమును ఆశ్రయించుట లేదు కదా? సామాన్య జీవనమును ఈయలేని నిర్దయుడు నారాజ్యమున నుండరాదు. గోపాలకుడు నగరవాసమును అభిలషించుటలేదు కదా? ఉపదేశకుడు గుణహీనునిగా ఉండుటలేదు కదా? శాస్త్రహీనుడగు ఋత్విజుడు నారాజ్యమున నుండరాదు. నీతిని సిద్ధముచేయువాడు నీలిరంగాతి సేచకుడు మద్యమును చేయువాడు నా రాజ్యము నుండి వెడలగొట్ట బడవలయును.

ఈ శ్లోకములలో ప్రజల కర్తవ్యమును ప్రభువు కర్తవ్యములను స్పష్టముగా ఉపదేశించెను. ఇంతకు పూర్వము కూడా ధర్మపాలన ప్రకరణము చెప్పునపుడు కూడా తులామానమును సమీక్షించు విషయమున బోధించిరి. ఇచట కూడ బోధించిరి. ఇట్లు ఒకే విషయమును రెండుమార్లు చెప్పుటచే రాజు కర్తవ్యములలో తులామాన సమీక్షణమెంతయో తెలియుచున్నది. అవసరమగు వస్తువు అవసరమునకంటే తక్కువగా ఎవ్వరికీ అందరాదు. అది రాజ్యపాలనలో ముఖ్యాంశము.

పాపదశకము

శ్రీ నారదీయ మహాపురాణమున దశవిధ పాపములు స్పష్టముగా తెలుపబడినవి చూడుడు.

అదత్తానాముపాదానాం హింసా చైవావిధానతః | పరదారోవసేనా చ కాయికం త్రివిధం స్మృతమ్‌ ఉ. 43.61

పారుష్యమనృతం వాపి పైశున్యం చాపి సర్వశః | అసంబద్ధప్రలావశ్చ వాచికం స్యాచ్చతుర్విధమ్‌ || 62||

వరద్రవేష్వభిధ్యానం మనసానిష్టచిన్తనమ్‌| వితధాభినివేశశ్చ మానసం త్రివిధం స్మృతమ్‌ || 63||

దానము చేయని వస్తువులను తీసుకొనుట, విధి వర్జితమగు హింస, వరదారలను సేవించుట అను మూడు కాయిక పాపములు. కఠినముగా మాటలాడుట, అసత్యమును చెప్పుట, కొండెములు చెప్పుట. అసంబద్ధముగా మాటలాడుట అను నాలుగు వాచిక పాపములు. పరద్రవ్యములయందాశ, మనసుచే అనిష్టచిన్తనము, వ్యర్థమగు అభినివేశము అను మూడు మానస పాపములు .ఇట్లు పాపములు పది విధములు.

సముద్రము - తీర్థరాజము

తావద్గర్జన్తీ తీర్థాని మాహాత్మ్యైసై#్స్వః పృథక్పృథక్‌ | యావన్న తీర్థరాజస్య. మాహాత్మ్యం వర్జ్యతే ద్విజైః ఉ58-16

పుష్కరాదీని తీర్థాని ప్రయచ్ఛన్తి న్వకం ఫలమ్‌ | తీర్థరాజస్సముద్రస్తు సర్వతీర్థఫరప్రదః || 17||

బ్రహ్మణులు తీర్థరాజమగు సముద్ర మాహాత్మ్యమును వర్ణించు వరకే ఇతర తీర్థములు గర్జించు చుండును. పుష్కరాది తీర్థములు స్వస్వ ఫలములను మాత్రమే ప్రసాదించును. తీర్థరాజమగు సముద్రము మాత్రము సర్వతీర్థ ఫలమును అనుగ్రహించును.

శ్రీ కృష్ణ మాహాత్య్మము

శ్రీ నారదీయ మహాపురాణమున శ్రీ కృష్ణ భగవానుడే పరతత్త్వమని చెప్పబడినది. శ్రీ కృష్ణ భగవానుడు ప్రకృతికి పురుషునకు నియన్త. విధిని విధించువాడు. సంహర్తయగు రుద్రునకు సంహర్తగా చెప్పబడినది. ఉ.58-44. ఇతర పురాణములలో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా భగవానుడని చెప్పబడినది. ఈ పురాణమున మాత్రము ఇతర శబ్దములతే ఇట్లు చెప్పబడినది.

దేవి సర్వేణ వతారాస్తు బ్రహ్మణః కృష్ణరూపిణిః | అవతారీ స్వయం కృష్మస్సగుణో నిర్గుణన్స్వయమ్‌ || 46||

బ్రహ్మరూపియగు శ్రీకృష్ణుని అవతారములే ఇతర దేవతలు. శ్రీకృష్ణ భగవానుడు మాత్రము స్వయముగా అవతారి. సగుణుడు. నిర్గుణుడు కూడా.

బ్రహ్మాండోత్పత్తి వర్ణనమ్‌

శ్రీ నారదీయ మహాపురాణమున పరతత్త్వమగు శ్రీకృష్ణ భగవానుని దేహ భూతములు సత్త్వరజస్తమో గుణములు. ప్రకృతి శ్రీకృష్ణ భగవానుని శక్తిగా పేర్కొనబడినది. ఉ 58-59. బ్రహ్మ విష్ణు శివాదులు ప్రాకృతులు గుణ నిర్మితులుగా చెప్పబడిరి. ||47||

ఈ జగత్ప్రిక్రియ యంతయూ సాంఖ్య ప్రక్రియ ననుసరించి భిన్నము అభిన్నమూ అగును. సాంఖ్యమునవలె ఇచట కూడా పురుషుడు నిర్గుణుడు సాక్షియని యంగీకరించబడును. ||51||

పురుషుని నుండి మహాత్తత్త్వము 51, 52 ఇది సాంఖ్యమున కంటే వైధర్మము.

పురుష ప్రేరితమగు మహాత్తత్త్వము నుండి వైకారికము, తైజనము తామసము అనబడు మూడు విధములగు అహంకారములు కలిగినవి. ఈ విషయమున పురుష ప్రేరణ విశిష్టముగా పేర్కొనబడినది. వైకారికమునకు సాత్త్వికమని, తైజసమునకు రాజసమని మరియొక పేరు కలదు.

వైకారికాన్మనో జజ్ఞే దేవా వైకారికా దశ || 54||

దిగ్వాతార్కవ్రచేతోశ్వి బ్రహ్మాన్ద్రోపేన్ద్రమిత్రకా || 55||

ఇట్లు విలక్షణముగా దిగాద్యుత్పత్తి ఇచట చెప్పబడినది. పూర్వభాగమున 63వ అధ్యాయమున 70, 71 శ్లోకములలో తైజ సాహంకారము నుండి జ్ఞానేన్ద్రియములు మనస్సుతో సహా కలిగినవని చెప్పియున్నా దానితో ఈ ప్రసంగము భేదించును. పూర్వభాగమున తామసహాంకారము నుండి తన్మాత్రలు పుట్టిన వని చెప్పి యుండిరి. ఇచట శబ్దమునకు ఆ విధానము చెప్పబడినది. స్పర్శము ఆకాశము నుండి పుట్టినదని చెప్పబడినది. అట్లే వాయువు నుండి రూపము కలిగినది చెప్పబడినది చూడుడు.

ఆకాశాదభత్స్పర్శన్తస్మా ద్వాయురభూత్సతి ||57||

వాయోతభూత్తతో రూపమ్‌ ||58||

కాల మాయాంశ లింగముల నుండి స్పర్శాది గుణముల నుండి అచేతనమగు అండము కలిగినది.

నమభూచ్చేతనం జాతం దరేణ విశతానతి || 60||

తస్మాదండాద్విరాడ్జజ్ఞే సోశయిష్ట జలాస్తరే | ముఖాదీన్యన్య జాతాని విరాజోవయా అపి ||62||

మరియొక చోట జలములు నారాయణునకు నివాసములని చెప్పబడినది. ఇట్లు శ్రీ నారదీయ మహాపురాణమున కొంత యథా పూర్వకముగా కొంత విలక్షణముగా బ్రహ్మండోత్పత్తి వర్ణించబడినది.

ఈశ్వర స్వరూపమ్‌

అనిర్దేశ్యం తు యద్వస్తు తన్నిర్దేష్టుం న చ క్షమమ్‌ | ఉపలక్షణమేతద్ధి యన్నిదేశనమైశ్వరమ్‌ ఉ 59-36

శాస్త్రం వేదాశ్చ సుభ##గే వర్ణయన్తి యదిశ్వరమ్‌| తత్సర్వం ప్రాకృతం విద్ధి నిర్దేష్టుం శక్యమేవ చ || 37||

అనిర్దేశ్యం తు యద్వస్తు తన్నేతీతి నిషిధ్యతే | నిషేధశేషస్స విభుః కీర్తితశ్శరణా గతైః ||38||

శాస్త్రం నియామకం భ##ద్రే! సర్వాషాం కర్మణాం భ##వేత్‌ | కర్మీ తు జీవః కథిత ఈశ్వరాంశో విభు స్స్వయమ్‌ ||39||

నిర్దేశించరాని వస్తువును నిర్దేశించ జాలము. ఈశ్వరుని నిర్దేశించి చెప్పునదంతయూ కేవలము ఉపలక్షణము మాత్రమే. శాస్త్రములచే వేదములచే వర్ణించబడు స్వరూపమంతయు ప్రాకృతము. నిర్దేశించ జాలినది మాత్రమే. నిర్దేశించ జాలని దానిని 'న' అని నిషేధించుచున్నారు. కావున ప్రభువును ఆశ్రయించిన వారు ప్రభువును ఆశ్రయించిన వారు ప్రభువు నిషేధ శేషమని చెప్పుచుందురు. అన్ని కర్మలకు నియామకము శాస్త్రమే. జీవుడు కర్మలనాచరించువాడు స్వయముగా విభువు ఈశ్వరాంశగా పేర్కొనబడును. ఇది సంగ్రహముగా ఇచట చెప్పబడిన ఈశ్వర స్వరూపము.

మర్త్య లోకమున గంగావతరణ కాలమ| జ్యేష్ఠే మాసి క్షిత సుతదినే శుక్ల పక్షే దశమ్యాం

హస్తే శైలాదవతరసదసౌ జాహ్నవీ మర్త్యలోకమ్‌ ఉ40-21

జ్యేష్ఠ శుక్ల దశమీ మంగళవారము హస్తా నక్షత్రమున గంగ భూలోకమున అవతరించిన కాలము.

''వైశాఖ శుక్ల సప్తమ్యాం జహ్నూనా జాహ్నవీ నెకా | క్రోధాత్పీతా పునస్త్యక్తా కర్ణరంధ్రాత్తు దక్షిణాత్‌ ఉ41-37

వైశాఖ శుక్ల సప్తమీ తిథియందు జహ్ను మహర్షి కోపముతో గంగను పానము గావించి మరల దక్షిణ కర్ణరంథ్రము నుండి విడిచెను. ఇది జహ్నుమహర్షి గంగను పానము చేసిన కాలము అనగా గంగావతరణము తరువాత ఇంచుమించు పదకొండు నెలలకు జహ్ను మహర్షి గంగాపానము గావించెనని ఇచటి వాక్యములు తెలుపుచున్నవి.

దశహరా తిథి

జ్యేష్ఠే మాసే తు దశమీ శుక్ల పక్షస్య మోహిని ! హరతే దశపాపాని తస్మాద్దశహరా స్మృతా ఉ. 60-13

జ్యేష్ఠ శుక్ల దశమి దశపాపములను హరించును కావున దశహరయన బడును. ఈ విషయము హరియానా ప్రాంతమున సుప్రసిద్ధము. ఆశ్వయుజ శుద్ధ దశమి కూడా ఈ కారణము వలననే దశహరా యనబడుచున్నది. అని ఊహా . తీర్థ ఫలమును పొందజాలని వారు శ్రద్ధా రహితులు, పాపార్తులు, నాస్తికులు, సంశయములు, కలవారు, హేతు వాదులు ఈ అయిదు విధముల వారు తీర్థయాత్రా ఫలమును పొందజాలరు. ఉ.62-16

తీర్థయాత్ర చేయదగినవారు

యజ్ఞాధికారే వ్యథవా నివృత్తే వివ్రస్తు తీర్థాని భ్రమేచ్చ నామ|

తీర్థేష్వలం యజ్ఞఫలంహి యస్మాత్ప్రోక్తం మునీంద్రైరమలస్వభావైః ఉ. 62-22

యస్యేష్టియజ్ఞేష్వధికారితాస్తి వరం గృహం గృహజధర్మాస్చ సర్వే |

ఏవం గృహస్థాశ్రమసంస్థితస్య తీర్థే గతిః పూర్వతరైర్నిషిద్థా | సర్వాణి తీర్థాన్యపి చాగ్నిహోత్రతుల్యాని నైవేతి వదన్తి కేచిత్‌ 23

బ్రాహ్మణుడు యజ్ఞాధికారము లేనిచో తీర్థయాత్రలను చేయవచ్చును. పరిశుద్ధ స్వభావులగు మునీన్ద్రులు తీర్థములలో యజ్ఞఫలము గలదని చెప్పుచున్నారు. హోమయాగములందు అధికారము గలవారికి గృహము గృహధర్మములే ఉత్తమములు. సర్వతీర్థములు అగ్నిహోత్ర తుల్యములు కాజాలవని కొందరు చెప్పుచున్నారు.

తీర్థమున ప్రతిగ్రహనిన్ద

తీర్థేన ప్రతిగృహ్ణీయాత్పుణ్యష్వాయతనేషు చ | నిమిత్తేషు చ సర్వేషు హ్యప్రమత్తో భ##వేద్ద్విజః ఉ.63-123,124

పవిత్ర తీర్థములలో పుణ్యక్షేత్రములలో, దేవాలయములలో ఏ నిమిత్తమున కాని బ్రాహ్మణుడు దానమును తీసుకొనరాదు. అప్రమత్తుడై యుండవలయును.

పుష్కర తీర్థ మహిమ

పుష్కరే దుర్లభం స్నానం పుష్కరే దుర్లభం తవః ఉ.71-45

పుష్కరే దుర్లభం దానం పుష్కరే దుర్లభా స్థితిః ||46||

పుష్కరమున స్నానము, తపము, దానము, ఉనికి బహు దుర్లభములు.

వేదపాదస్తవము

శ్రీ నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున డెబ్బది మూడవ అధ్యాయమున జైమిని మహర్షిచే చేయబడిన వేదపాదస్తవమని మహాస్తవము కలదు. నూట పదునాలుగు శ్లోకములు కల ఈ స్తోత్రము అతిరమణీయము. ప్రతి పద్యమున ఋగాది వేద మన్త్రపాదములు అస్తమున పొదగబడి వేదపాదస్తవమను పేరు సార్థకమైనది. దారమున మణులను గ్రుచ్చినట్లు స్తోత్రమున వేద పాదములను చేర్చుటచే ఈ స్తోత్రము విలక్షణము. ఇట్లు వేద మన్త్ర పాదములను శ్లోకములలో కూర్చుటలో మిక్కిలి చాతుర్యము కనపడును. వేదమున ఆదరము కూడా పెరుగును. ఏ ఒక్క శ్లోకములో కూడా అన్వయా భావము లేదు. కృత్రిమత్వము కానరాదు. బ్రహ్మణాలు అరణ్యకములు ఉపనిషత్తులు వేదభాగములే అను మతము నాశ్రయించి వాటిలోని పాదములను ఇచట సంగ్రహించిరి. ఇట్టి విచిత్రమగు ఈ పెద్ద స్తోత్రమును ఇచట చూపిన గ్రంథ విస్తరము కాగలదు కావున రెండు మూడు శ్లోకములను సంపూర్ణముగా చూపి మిగిలిన స్తోత్రములోని వేద మంత్ర పాదములను మాత్రమును చూపెదను. కుతూహలమున్నవారు గ్రంథమున స్తోత్రమును చదువు కొనవచ్చును.

అథానందార్ణవే మగ్నో దృష్ట్వా నృత్యం మహేశితుః జైమినిర్వేదపాదేన స్తవేనాస్తౌత్సమాహితః 73-28

విరించి విష్ణు గిరిశ ప్రణతాంఘ్రి నరోరుహే | జగత్సూతే నమస్తుభ్యం దేవికాంపిల్య వాసిని ||29||

ఉమాకోమల హస్తాబ్జి సంభావిత లలాటకమ్‌ | హిరణ్య కుండలిం వన్దే కుమారం పుష్కరస్రజమ్‌ ||31||

నమశ్శివాయ సాంబాయ నమశ్శర్వాయ శంభ##వే వా. సం 16-28

నమో కటాయ రుద్రాయసదసస్పతయే నమః ఆశ్వశ్రే. 5-3-22

పాద భిన్నాయ లోకాయ మౌలిభిన్నాండభిత్తయే | భుజప్రాన్తదిగన్తాయ భూతానాం వతయే నమః అశ్వ శ్రే 1.4.9

ఇట్లే ఇతర వేదమన్త్ర పాదములను చూడుడు.

పశూనాం పతయే నమః వా. సం. 16-27. 73-35

జగతాం పతయే నమః వా. సం. 16-18.73-36

క్షేత్రాణాం పతయే నమః వా. సం. 16-28 37

అన్నానాం పతయే నమః వా. సం. 16-18

నమో మీఢుష్టమాయ చ వా. సం. 16-29 73-38

పుష్టానాం పతయే నమః వా. సం. 16-17 39

దిశాం చ పతయే నమః వా. సం. 16-17 40

విశ్వరూపాయ వై నమః తై. ఆ. 10-12- 1 41

నద్యోజాతాయ వై నమః తై. ఆ. 10-43-1 42

నమో రుద్రాయ మీఢూషే తై. ఆ. 3-7-8-1 43

సహస్రాక్షాయ మీఢూషే వా. సం. 16-8 44

నుమృడీకాయ మీఢూషే ఋ. 1-136-6 45

ఆషాడాయ సహమానాయ మీఢూషే తై. బ్రా 2-8-6-8 46

నదనస్పతిమదుతమ్‌ ఋ. 1-18-6 47

పురుషం కృష్ణపింగలమ్‌ తై. ఆ. 10-12-1 49

తమీశానం జగతస్తస్థుషస్పతిమ్‌ ఋ. 1-89-5 50

జేతారమవరాజితమ్‌ ఋ. 1-11-2 51

ఇమాని త్రీణి విష్టపా ఋ. 8-91-5 52

ఋచస్సామాని జజ్ఞిరే ఋ. 10-90-9 53

యోవిశ్వాభి విపశ్యతి ఋ. 3-62-9 54

ధాతా యథా పూర్వమకల్పయత్‌ ఋ. 10-90-3 56

ఇన్ద్రజ్యేష్ఠా మరుద్గణాః ఋ. 1-23-8 57

దేవానః వూషరాతయః ఋ 1-23-8 58

సంజానానా ఉపాసతే ఋ. 10-191-2 59

యా తే రుద్ర శివా తనూః వా. సం. 16 60

నమస్తే రుద్ర మన్యవే వా. సం. 16 61

బాహుభ్యాముత తే నమః వా. సం. 16-1 62

నమస్తే ఆస్తు ధన్వనే తై. నం. 4-5-1-1 63

ఉతోత ఇషవే నమః వా. సం. 16-4 64

ఇదంతే భ్యో7కరం నమః ఋ. 10-85-17 65

దరిద్రం నీలలోహితమ్‌ వా. సం. 16-47 67

త్వదన్యం విందామి రాథసే ఋ. 8-24-12 68

అస్మాకమవితా భవ ఋ. 1-187-2 69

పురాణామన్‌ పురుష్టుత ఋ. 8-93-17 70

భూరిదా భూరి దేహినః ఋ. 4-32-20 71

వసుస్పార్హం తథాభర ఋ. 8-45-40 72

రాయా విశ్వ పుషా సహ ఋ. 8-26-40 74

బలం ధేహి తనూఘనః ఋ. 3-53-18 75

దేవేశ హరిమాణం చ నాశయ ఋ. 1-50-11 76

నిబాథస్వ మహా అసి ఋ. 8-64-2 77

రక్షాణో బ్రహ్మణస్పతే ఋ. 1-18-3 78

ఉతభ్రాతోతనన్సఖా ఋ. 10-186-2 79

యన్మయా దుష్కృతం కృతమ్‌ తై. ఆ. 10-1-18 80

త్వమస్మాకం తవన్మసి ఋ. 8-92-32 81

గాయేత్వా నమసా గిరా ఋ. 8-46-17 82

వశ్యేమ శరదశ్శతమ్‌ ఋ. 7-66-16 83

జీవేమ శరదశ్శతమ్‌ ఋ. 7-66-16 84

నందామ శరదశ్శతమ్‌ తై. ఆ. 4-4-25- 85

మోదామ శరదశ్శతమ్‌ తై.ఆ. 4-42-5 86

భవామ శరదశ్శతమ్‌ తై.ఆ. 4-42-5 87

శృణుయామ శరదశ్శతమ్‌ వా. సం. 36-24 88

వ్రబ్రవామ శరదశ్శతమ్‌ వా. సం. 36-24 89

అజితాస్స్యామ శరదశ్శతమ్‌ తై.ఆ. 4-42-5 90

యువానం విశ్చతిం కవిమ్‌ ఋ.8-44-26 91

సుభానం శుక్రశోచిషమ్‌ ఋ. 8-23-20 92

నీలగ్రీవో విలోహితః రా. సం. 16-7 93

తువిగ్రీవో అనానతః ఋ. 8-64-7 94

ఉపాసై#్మ గాయతానరః ఋ. 7-14-1 95

బ్రూహి జయతామివ దుందుభిః ఋ. 1-28-5 96

గౌరో నతృషితః పిబ ఋ. 1-16-5 97

యోషా జారమిన ప్రియమ్‌ ఋ. 9-32-5 98

మహోమహిం సుష్టుతి మీదయామి ఋ. 2-33-8 99

ఆషాఢముగ్రం సహమానమాభిః ఋ. 6-81-1 100

నమో జఘన్యాయ చ బుధ్నియాయచ వా. సం. 16-32 101

యతః ప్రసూతా జగతః ప్రసూతిః తై.ఆ. 10-1-1 102

యస్మాత్పరం నావరమస్తి కించిత్‌ తై.ఆ. 10-10-3 103

యస్మిన్నిదం సంచితవిచైతి సర్వమ్‌ తై.ఆ. 10-1-1 104

హిరణ్య దన్తం శుచివర్ణమారాత్‌ ఋ. 5-2-3 105

అణోరణీయాన్మహతో మహీయాన్‌ తై.ఆ. 10-10-1 106

అధస్విదాసీ 3 దుపరిస్విదాసీత్‌ ఋ. 10-129-5 107

భిషక్తమం త్వాం భిషజాం శృణోమి ఋ. 2-33-4 109

పశ్చాత్పురస్తాదధరా దుదక్తాత్‌ ఋ. 10-87-21 110

ననావా దురితా తరేషు ఋ. 6-68-8 111

ఓజిష్ఠయా దక్షిణయేవరాతిమ్‌ ఋ. 1-169-4 112

యదిక్షితాయర్యది వావరూతః ఋ. 10-161-2 113

హిరణ్యరూపన్సహిరణ్యనందృక్‌ ఋ. 2-35-10 115

ఆదిత్య వర్ణం తమనః వరస్తాత్‌ వా. సం. 31-18 116

వేదాన్త విజ్ఞాననునిశ్చితార్థాః తై. ఆ. 10-10-3 117

భూతస్య జాతః వతిరేక ఆసీత్‌ ఋ. 10-121-1 118

శ్రీణా ముదారో ధరుణోరయీణామ్‌ ఋ. 1045-5 119

హిరణ్యగర్భన్సమవర్తతాగ్రే ఋ. 10-121-1 120

దివాననక్తం పతితో యువాజని ఋ. 1-144-4- 121

శివాయ స్వాదుష్కిలాయం మధుమాఉతాయమ్‌ ఋ. 6-47-1 122

స్తుహి శ్రుతం గర్తనదం యువానమ్‌ ఋ. 2-33-11 123

యక్ష్యామహో సౌమనసాయ రుద్రమ్‌ ఋ. 5-42-11 124

పితేవ పుత్రాస్ప్రతినోజుషన్వ ఋ. 7-54-2 125

దేవస్త్రాతా త్రాయతామవ్రయచ్ఛన్‌ ఋ. 1-106-7 126

తత్త్వా యామి బ్రహ్మాణా వన్దమానః ఋ. 1-124-11 127

ఉధూషుణో వసోమహో మృశస్వ శూరరాధసే ఋ. 8-70-9 128

రయిం పురుం పిశంగ నందృశమ్‌ ఋ. 2-41-9 129

నయస్య హస్యతే సఖా న జీయతే కదాచన ఋ. 10-152-1 130

కవిం కవీనా మువమశ్రవస్తమమ్‌ ఋ. 2-23-1 132

సుబ్రహ్మణ్యో మ్‌ ఋ. 10-114-3 134

చతుష్కవర్దా యువతి స్పుపేశాః ఋ. 8-101-16 135

వచోవిదం వాచముదీరయన్తీమ్‌ ఋ. 6-95-3 136

ప్రియం నఖాయం పరిషన్వజానా ఋ. 1-92-9 137

ఏషా నేత్రీ రాథనస్సూనృతానామ్‌ ఋ.7.76.7 139

యయాతి విశ్వా దురితా తరేమ ఋ. 8.42.3 140

సరస్వతీ వాను భగా దద్విరసు. ఋ. 8.21.17 140

ఇవి వేద పాదస్తవములోని వేదమంత్ర పాదములు, ఈ పాదములు శ్లోకమున నాలుగవ పాదముగా కూర్చబడినవి. ఈ పాదార్థముతో అన్వయించు అర్థమును మిగిలిన మూడు పాదములలో చెప్పుటయే చాతుర్యము. రమణీయము. కావున ఈ స్తోత్రమును ప్రతి ఒక్కరూ చదువ తీరవలయును. ఇట్లు చదివిన వేద మంత్ర పారాయణ పుణ్యము కూడా లభించును.

ఇక శ్రీ నారదీయ మహాపురాణమున పేర్కొనదగిన ఇంకొక విశేషాంశము కలదు. పూర్వభాగమున అరువది నాలుగవ అధ్యాయము నుండి తొంబదియొకటవ అధ్యాయము వరకు ఇరువది ఎనిమిది అధ్యాయములలో మహాతంత్ర శాస్త్రము పేర్కొనబడినది. ఈ తంత్రమున ఆదిత్య అంబికా విష్ణు శివ గణపతి మంత్రములను నిగూఢముగా చెప్పెను. నవగ్రహ మంత్రములు కూడా చెప్పబడినవి. సకల దేవతా పూజా విధానము చెప్పబడినది. కార్తవీర్య మంత్రము కవచము విస్తరముగా చెప్పబడినది. హనుమదవతార కథ, హనుమత్స్యరూపము హనుమన్మన్త్రము కవచము చెప్పబడినది. అయితే ''మన్త్రం యత్నేన గోపయేత్‌'' అను నియమమును అనుసరించి ఏమంత్రమును స్పష్టముగా చెప్పబడినవి. తంత్ర శాస్త్రమున అయా వర్ణములకు గల సంకేత నామములతో బీజములకు గల సంకేత నామములతో మన్త్రములను చెప్పెను. వ్యాస మహర్షి ఆశయమునకు భంగము కలుగకూడదని తంత్ర శాస్త్రమును యథావదను వాదమును చెసితిని. పూర్తిగా ఆశాభంగము కలుగకుండా కొన్ని మంత్రములను మాత్రము వివరించితిని. తంత్ర శాస్త్రమునకు కూలంకషముగా అధ్యయనము చేసి యున్నవారు మాత్రమే సంపూర్ణముగా వివరించగలరు. అట్టి వారికి మాత్రమే అర్థమగునట్లు వ్యాస భగవానుడు వ్రాసెను. కావున చదువరులు గమనించగలరు.

సుభాషితావళి

శ్రీ నారదీయ మహాపురాణమున చక్కని లోకప్రవాదములు ఉపదేశ ప్రదములు సుజ్ఞాన ప్రదములు రసిక జనమనోభి రామములు సహృదయ హృదయతల స్పర్శులగు సుభాషితములు కోకొల్లలు. అట్టివాటిని ఒక చోట చేర్చి పాఠకులు ఆనందము కొఱకు గ్రంథ విస్తారమును కూడా లెక్కించక ఇచట చూపుచున్నాము.

రవిర్హి రశ్శిజాలేన దివా హన్తి బహిన్తమః | సన్తస్సూక్తిమరీచ్య్వో ంధస్చాస్తర్థ్వాన్తం హి సర్వదా 4-37

సూర్యుడు పగటిపూట బయటనున్న చీకటిని తన కాంతులతో హరించును. సత్పురుషులు సూక్తి కిరణములతో లోపల నున్న చీకటిని ఎల్లప్పుడూ తొలగింతురు.

న శంక స్సర్వదా దుఃఖీ నిశ్శంకస్సుఖమాప్నుయాత్‌ 4-75

శంకించువాడు ఎప్పుడూ దుఃఖమును పొందును. సందేహములు లేనివాడు సుఖములను పొందును.

సతతం బాధ్యమానో పి విషయోఖ్యైరరాతిభిః | అవిధాయాత్మనో రక్షామన్యాన్దేష్టి కథం సుధీః 4-71

కామాది శత్రువులచే ఎల్లప్పడూ బాధించబడుచున్ననూ తనను కాపాడుకో జాలని బుద్ధిమంతుడు ఇతరులనేల ద్వేషించును?

¸°వనం ధనసంపత్తిః ప్రభుత్వ మవివేకితా | ఏకైక మప్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్‌ 7-15

¸°వనము. ధన సంపద, అధికారము, అవివేకము ఈ నాలుగింటిలో ఒకటే ఎంతో అనర్థమును కలిగించును. ఒక నాలుగూ ఉన్నచోనేమి చెప్పవలయును?

వివేకం హన్త్య హంకారః 7:30

వివేకమును అహంకారము నశింప చేయును. 7-39

అపకీర్తి నమో మృత్యు ర్లోకేష్వన్యో న విద్యతే 7-41

నాస్తి నిందానమం పాపం నాస్తిమోహసమాసవః 7-42

నాస్తి రాగ నమః పాశః నాస్తి సంగ సమం విషమ్‌ 7-67

కి మత్ర చిత్రం యత్సన్తః పరార్థ ఫలకాంక్షిణః న హి ద్రుమాశ్చ భోగార్థం ఫలన్తి జగతీ తలే 7-67

యత్ర నన్తః ప్రవర్తన్తే తత్ర దుఃఖం న బాధతే | వర్తతే యత్ర మార్తండః కథం తత్ర తమో భ##వేత్‌ 7-71

అపకీర్తితో సాటివచ్చు మృత్యువు , ఈ లోకమున ఇంకొకటి యుండదు.

నిందతో సమమగు పాపము మోహసమమగు మద్యము రాగసమమగు పాశము సంగ సమమగు విషము లేదు. సత్పురుషులు పరోపకారమునకు ప్రయత్నించుటలో వింతేమున్నది? వృక్షములు తమ అనుభవమునకు వండవు కదా ! సత్పురుషులు తిరుగాడు చోట దుఃఖములు బాధించ జాలవు. సూర్యుడున్న చోట చీకటెట్లుండును?

చంద్రహీనా యథా రాత్రిః పద్మహీనం యథా నరః | పతిహీనా యథానారీ పితృహీనస్త థా శిశుః 8-21

దరిద్రోపి పితా యస్య సహ్యాస్తే ధనదోపమః 8-19

ధర్మహీనో యథా జన్తుః కర్మహీనో యథా గృహీ | పశుహీనో యథా వైశ్య స్తథా పిత్రా వినార్భకః 8-22

సత్యహీనం యథా వాక్యం సాధుహీనా యథా సభా | తపో యథా దయాహీనాం తథా పిత్రా వినార్భకః 8-23

వృక్షం హీనం యథారణ్యం జలహీనా యథా నదీ | వేగ హీనో యథా వాజీ తథా పిత్రా వినార్భకః 8-24

చంద్రుడు లేని రాత్రివలె పద్మములు లేని సరస్సువలె, భర్తలేని స్త్రీ వలె తండ్రిలేని కొడుకుండును. దరిద్రుడైనను తండ్రి ఉన్న పుత్రుడు ధనవంతుడే. ధర్మహీనమగు జంతువు కర్మహీనుడగు గృహస్థుడు, పశుహీనుడగు వైశ్యుడు తండ్రిలేని కొడుకు సమానులు. నిజములేని మాట, సజ్జనులు లేని సభ , దయలేని తపస్సు తండ్రిలేని కొడుకు సమానము చెట్లు లేని అడవి, నీరులేని నది, వేగము లేని అశ్వము, తండ్రిలేని కొడుకు సమానులు.

దాన భావం చ శత్రూణాం వారస్త్రీణాం చ సౌ హృదమ్‌ | సాధు భావం చ సర్పాణాం శ్రేయస్కామో న విశ్వసేత్‌ 8-45

అహో కష్టతరా లోకే దుర్జనానాం హి సంగతిః | కారుకైస్తాడ్యతే వహ్నిరయన్సంగయోగమాత్రతః 8-72

నిధేరాధారమాత్రేణ మహీ జ్వలతి సర్వదా | తమేవ మానవా భుక్త్వా జ్వలన్తీతి కిమద్భుతమ్‌ 8-104

కిమత్ర చిత్రం సుజనం బాధన్తే యది దుర్జనాః| మహీరుహాంశ్చానుతటే పాతయన్తి నదీరయాః 8-105

ఆహా కనకమాహాత్మ్యమాఖ్యాతుం కేన శ##క్యేతే | నామసామ్యాదహో చిత్రం ధత్తూరోపి మదప్రదః 8-107

శత్రువుల దాన్య భావమును, వేశ్యల స్నేహమును, సర్పముల సాధు భావమును మేలు కోరువాడు నమ్మరాదు. లోకమున దుర్జనుల సహవాసము కష్టమునుకలిగించును. ఇనుముతో కలిసియున్న అగ్నిని సమ్మెటలతో కొట్టెదరు కదా? నిధియున్న భూమి ఎప్పుడూ మండుచుండును. ఆ నిధిని అనుభవించు మానవుడు మండుటలో వింతేమున్నది? దుర్జనులు సజ్జనులను బాధించుటలో వింతేమున్నది. తీరమునున్న చెట్లను నదీ ప్రవాహము పడగొట్టును కదా? కనక మహిమను ఎవ్వరూ చెప్పగలరు ? కనకమను పేరున్నందున ఉమ్మెంత కూడా మదమును కలిగించును.

క్షమాసారా హి సాధనః 8-122

దుర్జనేష్విపి సత్త్వేషు దయాం కుర్వన్తి సాధవః | న హి సంహరతే జ్యోత్స్నాం చన్ద్రశ్చండాలవేశ్మనః 8-123

దారితశ్ఛిన్న ఏవాపి హ్యామోదేనైవ చన్దనః | సౌరభం కురుతే సర్వం తథైవ సుజనో జనః 8-125

ప్రాణాదానాత్పరం దానం న భూతం న భవిష్యతి 9-61

ఆత్మబుద్ధిస్సుఖకరీ గురుబుద్ధిర్విశేషతః | వరబుద్ధిర్వినాశాయ స్త్రీ బుద్ధిః వ్రలయంకరీ 11-94

హరిర్హరతి పాపాని దుష్టచితైరపి స్మృతః | అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః 11-100

అశాయా దాసా యే దాసాస్తే సర్వలోకస్య | ఆశాదాసీ యేషాం తేషాం దాసాయతే లోకః 11-151

మానో హి మహతాం లోకే ధనమక్షయ ముచ్యతే 11-152

ధనం ధర్మఫలం విప్ర ధర్మో మాధవతుష్టికృత్‌ | తరవః కిం న జీవన్తి తేపి లోకే పరార్థకాః 12-24-25

సర్వలోకహితానక్తాస్సాధవః పరికీర్తితా 16-35

యదృచ్ఛాలాభసంతుష్టి స్సా శాన్తిః పరికీర్తితా 16-35

సాధు జనులు దుర్జనులను కూడా దయతో చూతురు. చంద్రుడు చండాలుని ఇంటిలో కూడా వెన్నెలను ప్రసరించును కదా ? చీల్చిననూ, నరికిననూ చందన వృక్షము తన పరిమళముతో అంతటిని అన్నిటిని సుగంధము చేయును. ప్రాణదానమును మించిన దానము లేదు. ఉండబోదు. ఆత్మబుద్ధి సుఖము నిచ్చును. గురుబుద్ధి విశేష సుఖప్రదము. పరబుద్ధి వినాశమును ఇచ్చును. స్త్రీ బుద్ధి ప్రళయ కారి. దుర్జనులు స్తుతించిననూ శ్రీహరి పాపములను హరించును. తెలియక ముట్టిననూ అగ్ని కాల్చును కదా? ఆశకు దాసులైన వారు అన్నిలోకములకు దాసులగుదురు. ఆశను దాసిగా చేసుకొన్న వారికి లోకమే దాస్యమును చేయును.

మహానుభావులకు అభిమానమే తరగని ధనము. ధనము ధర్మఫలము. ధర్మము మాధవుని సంతోషింప చేయునది. చెట్లు బ్రతుకుట లేదా? అవి కూడా పరోపకారమునే చేయుచున్నవి. సర్వలోక హితమును కోరువారే సాధువులనబడెదరు. దైవ వశమున లభించినదానితే తృప్తి చెందుటయే పరమశాంతి యనబడును.

వివేకస్త్రిషు లోకేషు సంపదామాదికారణమ్‌ 20-59

శ్రుతి ప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్వివర్యయః 20-62

నాస్తి గంగానమం తీర్థం నాస్తి మాతృనమో గురః | నాస్తి విష్ణున మంషు దైవం తపో నానశనాత్పరమ్‌ 23-30

నాస్తి క్షమాసమా మాతా నాస్తి కీర్తినమం ధనమ్‌ | నాస్తి జ్ఞాననమో లాభో న చ ధర్మనమః పితా 23-31

కర్తా కారయితా చైవ సర్వం విష్ణు స్సనాతనః 28-88

అవశ్యమేవ భోక్తవ్యం కర్మణాం హ్యక్షయం ఫలమ్‌| నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శ##తైరపి 31-69

అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌ 31-70

యోగస్తు ద్వివిధః ప్రోక్తః కర్మజ్ఞానప్రభేదతః | క్రియాయోగం వినా నౄణాం కర్మయోగో న సిద్ధ్యతి 33-31,32

తత్త్వం గురునమం నాస్తి న దేవః కేశవాత్పరః 34-9

మూడు లోకములలో వివేకమే సంపదలకు మూలకారము. శ్రుతి బోధించునది ధర్మము. తద్విపరీతము అధర్మము, గంగతో సమానమగు తీర్థము, తల్లితో సమానమగు గురువు, విష్ణుసముడగు దైవము, నిరాహారమును మించిన తవము లేదు. ఓర్పుతో సమానమగు తల్లి, కీర్తి సమమగు ధనము, జ్ఞాన సమమగు లాభము ధర్మ సముడగు పితలేడు. చేయువాడు, చేయించువాడు అంతయూ శ్రీ మహావిష్ణువే. కర్మల ఫలము తప్పక అనుభవించియే తీరవలయును. కర్మయోగము, జ్ఞానయోగము, అని యోగము రెండు విధములు, క్రియా యోగము లేనిదే జ్ఞానయోగము. సిద్ధించదు. గురుసమమగు తత్త్వము కేశవుని మించిన దైవము లేదు.

మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః 34-58

జీర్యన్తి జీర్యతః కేశా దన్తా జీర్యన్తి జీర్యతః | చక్షుశ్శ్రోత్రం చ జీర్యేతే తృష్ణైకా తరుణాయతే 35-21

అనతాముభోగాయ దుర్జనానాం విభూతయః | పిచుమన్దః ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే 36-13

ఆహా సదువభోగాయ సజ్జనానాం విభూతయః | కల్పవృక్ష ఫలం సర్వం అమరైరేవ భుజ్యతే 36-19

నఖ్యం సాప్తసదీనం స్యాదిత్యాహుర్ధర్మకోవిదాః 36-32

నతాం సాప్తపదీ మైత్రీ సత్సతాం త్రివదీ తథా| సత్సతామపి యే నన్తస్తేషాం మైత్రీ పదే పదే 36-33

సుజనో న యాతి వైరం పరహితబుద్ధిర్వినాశ కాలేపి| ఛేద్యేపి చన్దన తరుః సురభయతి ముఖం కుఠారస్య 37-35

మృగ మీన నజ్జనానాం తృణ జల సంతోష విహిత వృత్తీనామ్‌ | లుబ్ధక ధీవర పిశునా నిష్కారణం వైరిణో జగతి 37-38

కామస్సమృద్ధిమాయాతి నరాణాం పాప కర్మిణామ్‌| కామస్సంక్షయమాయాతి నరాణాం పుణ్యకర్మణామ్‌ 37-45

మానవులకు మనసే బంధమోక్ష కారణము. వృద్ధునికి కేశములు నెరయును. దంతములు పోవును. కనులు చెవులు జర్ణించును. ఆశ మాత్రము ¸°వనముతో నుండును. దుర్జనుల సంపదలు దుర్జనుల భోగమునకే. వేపచెట్టు పండ్లను కాకులు మాత్రమేభుజించును. సజ్జనుల సంపదలు సజ్జనుల అనుభవమునకే యుండును. కల్ప వృక్ష ఫలములను దేవతలు మాత్రమే భుజింతురు. ఏడు అడుగుల నడుకతో సఖ్యమేర్పడునని ధర్మకోవిదులు చెప్పెదరు. సజ్జనులకు ఏడడుగులు కలిసి నడిచిన మైత్రి ఏర్పడును. ఇంకా ఉత్తములకు మూడు అడుగులతో ఏర్పడును. వారిలోనూ ఉత్తములకు ప్రతి అడుగున మైత్రి ఏర్పడును. సజ్జనుడు ద్వేషమును కలిగియుండును. వినాశకాలమున కూడా పరుల హితమునే కోరును. చందన వృక్షము తనను నరుకు గొడ్డలికిక కూడా పరిమళమునిచ్చును. తృణముతో బ్రతుకులేడికి, జలములో బ్రతుకు చేపలకు, సంతోషముతో జీవించు సజ్జనునకు వేటగాడు, బెస్తవాడు, కొండెములు, చెప్పువారు నిష్కారణ శత్రువులు. పాపకర్ముల కామము పెరుగుచుండును. పుణ్యకర్ముల కామము తరుగుచుండును.

స హాయన్తేర్నవలితై ర్న విత్తేన బంధుభిః | ఋషయ శ్చక్రిరే ధర్మం యో నూచానస్స నో మహాన్‌ 50-7

పంచ విద్యాం న గృహ్ణన్తి చండాస్త్సబ్ధాశ్చయే నరాః | అలసాశ్చ సరోగాశ్చ యేషాం చ విసృతం మనః 50-221

శ##నైర్విద్యాం శ##నైరర్థా నారోహాత్పర్వతం శ##నైః | శ##నై రధ్వసు వర్తేత యోజనాన్న వరం వ్రజేత్‌ 50-222

యోజనానాం సహస్రంతు శ##నైర్యాతి పిపీలికా| ఆగచ్ఛన్వైనతేయో పి వదమేకం న గచ్ఛతి 50-223

అంజనస్య క్షయం దృష్ట్వా వల్మీకస్య తు సంచయమ్‌| అవన్ధ్యం దివనం కుర్యాత్‌ దానాధ్యయన కర్మసు 50-227

యత్కీటః పాంసుభిశ్నక్ణైర్వల్మీకః క్రియతే మహాన్‌ | న తత్ర బలసామర్థ్య ముద్యోగస్తత్ర కారణమ్‌ 50-228

హయానామివ జాత్యానా మర్థరాత్రాధిశాయినామ్‌ | న హి విద్యార్థినాం నిద్రా చిరం నేత్రేషు తిష్ఠతి 50-230

అహెరివ గణాద్భీత స్సౌహిత్యాన్నరకాదిక| రాక్షసీభ్య ఇవస్తీభ్యస్స విద్యామధిగచ్ఛతి 50-232

యథా ఖనన్‌ ఖనిత్రేణ భూతలం వారి నిన్దతి | తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధి గచ్ఛతి 50-234

గురుశుశ్రూషయా విద్యా పుష్కలేన దనేన వా| అథవా విద్యయా విద్యా

హ్యన్యథా నోప పద్యతే 50 - 235

సంవత్సరములచే, వార్థక్యములచే, ధనముచే బంధువులచే, ఋషులు ధర్మము నాచరింపలేదు. పారంపర్యముగా వచ్చునదే ధర్మము. అదియే ఉత్తమము. చండులు. స్తబ్ధులు, అలనులు, రోగులు, చంచల మనస్కులు విద్యను పొందజాలరు. విద్యను ధనమును మెల్లగా పొందవలయును. పర్వతమును మెల్లగా నధిరోహించవలయును. బాటలో మెల్లగా నడువ వలయును. ఒకసారి యోజనము(8మైళ్ళు) మించి నడువరాదు. మెల్లగా నడుచు చీమ వేయి యోజనముల దూరమును కూడా చేరును. కదలక యున్నచో గరుడుడు కూడా ఒక అడుగు ముందుకు చేరజాలడు. జాగ్రత్తగా కూడ బెట్టినట్లుగా ఉన్న అంజనాద్రి కరిగి పోవుటను, ఏమీ లేకనే పుట్ట పెరుగుటను చూచి ప్రతి దినమును దానాధ్యయన కర్మలచే సఫలము కాలించవలయును. చీమ దుమ్మురేణువులతో గొప్ప పుట్టనేర్పరచును. ఇచట బలము సామర్థ్యము కారణము కాదు. ప్రయత్నమే ముఖ్యకారణము. ఉత్తమాశ్వములు అర్థరాత్రి కాలమున మాత్రమే నిదురించునట్లు విద్యార్థులు నేత్రమువపై నిదుర చాలాకాము నిలువదు. జన సమూహమును పామును చూచినట్లు భయపడువాడు, నరకమునకు వలె స్నేహమునకు భయపడువాడు, స్త్రీలను రాక్షసులుగా చూచి భయపడువాడు మాత్రమే విద్యను పొందగలడు. గడ్డపారతో భూమిని త్రవ్వి నీరును పొందునట్లు గురువును సేవించుట వలన కాని, పుష్కల ధనముచేత కాని, ఒక విద్యను నిచ్చుట వలన కాని విద్యను పొందవచ్చును. మరియొక మార్గము దొరకదు.

న ద్రష్టవ్యా విశేషా హి విక్షేపా హి ప్రసంగినః 58-52

న వినా జ్ఞాన విజ్ఞానే మోక్షస్యాధిగమో భ##వేత్‌ | న వినా గురుసంబంధాత్‌ జ్ఞానస్యాధిగకమస్తథా 59-16

నాస్తి విద్యానమం చక్షు ర్నాస్తి విద్యా నమం తవః నాస్తి రాగనమం దుఃఖం నాస్తి త్యాగనమం సుఖమ్‌ 60-43

నిత్యం క్రోధాత్తపో రక్షేత్‌ మత్సరాత్‌| విద్యాం మానావమానాభ్యం ఆత్మానం తు ప్రమాదతః 60- 48

అస్పృశంస్యం పరో ధర్మః క్షమా చ పరమం బలమ్‌ 60-49

న హింస్యాత్సర్వభూతాని 60 - 53

సంసారం పశ్యతే జస్తుసత్కథం నావబుధ్యతే | అహితే హితసంజ్ఞస్వం అధ్రువే ధ్రువసంజ్ఞకః 60 - 62

అనర్ధే వార్థసంజ్ఞస్త్వం కిమర్థం నావబుధ్యసే | సంవేష్ట్యమానం బహుభిర్మోహతస్తుభిరాత్మజైః 60 - 63

ప్రసంగము చేయు వాని విశేషములను చూడరాదు. జ్ఞాన విజ్ఞానములు లేనిదే మోక్షము లభించదు. గురు సంబంధము లేనిదే జ్ఞానము లభించదు. విద్యతో సాటి వచ్చు నేత్రము, విద్యతో సాటి వచ్చు తవము మరియొకటి లేదు. రాగముతో సాటివచ్చు దుఃఖము, త్యాగముతో సాటివచ్చు సుఖము మరియొకటి లేదు. ఎల్లప్పుడూకోపము నుండి తపస్సును, మత్సరము నుండి సంపదను, మానావమానముల నుండి విద్యను, ప్రమాదము నుండి ఆత్మ ను కాపాడవలయును. ఇతరుల దుఃఖమును చూచి జాలిపడుట పరమ ధర్మము. ఓర్పు ఉత్తమ బలము.

ఏ ప్రాణులను హింసించరాదు.

ప్రాణి సంసారమును చూచును కాని ఆ సంసారమును తెలియజాలకుండుట గొప్పవింత. హితము కాని దానిని హితముగా, ధ్రువము కాని దానిని ధ్రువముగా అనర్ధమును అనర్ధముగా భావించు నీవు సత్యము నేల తెలియకున్నావు? నీలో కలిగిన మోహతస్తువులచే నీవే బంధింపబడుచున్నావని ఏల తెలియకున్నావు?

అలం పరిగ్రహెణహ దోషవాన్హి పరిగ్రహః | కృమిర్హి కోశకారస్తు వధ్యతే స్వపరిగ్రహాత్‌ 60- 64-65

యదా సర్వం పరిత్యజ్య గస్తవ్యమవశే నవై | అనర్థే కిం ప్రసక్తస్త్వం స్వమర్థం నానుతిష్ఠసి 60 - 68

న హి త్వాం ప్రస్థితం కశ్చిత్పృష్ఠ త్వో సుగమిష్యతి | సుకృతం దుష్కృతం చ త్వాం గచ్ఛస్తమనుయాస్యతః 60- 70

నిబందినీ రజ్జురేషా యా గ్రామే వసతే రతిః 60-72

త్యక్త్వా ధర్మమధర్మం చ హ్యుభే సత్యానృతే త్యజ | త్యజ ధర్మమనంకల్పాదధర్మం చాపన్యహింసయా 60 - 76

హర్ష స్థాన సహస్రాణి శోకస్థాన శతాని చ | దివసే దివసే మూఢమావిన్తి న పండితమ్‌ 61 - 2

అనిష్టసంప్రయాగాచ్ఛ విప్రయోగాత్ర్పియస్స చ | మనుష్యా మానరకసైర్ధుః ఖైర్యుజ్యన్తే యే ల్ప బుద్ధయః 61 - 3

బైషజ్యమే తద్ధుఃఖస్య యదేతన్నానేఉ చింతయేత్‌ 61 -10

అనిత్యం జీవితం రూపం ¸°వనం ద్రవ్య సంచయః | ఆరోగ్యం ప్రియసంవాసో న గృద్యేత్పండితః క్వచిత్‌ 61 -12

సర్వే క్షయాన్తా నిచయా పతనాన్తా సముచ్ఛ్రయాః | సంయోగా విప్రయోగాన్తా మరణాస్తం చ జీవితమ్‌ 61-36-37

దానమును స్వీకరించుట దోషము కావున దానమును పరిగ్రవహించరాదు. కోశకారమగు కృమి స్వపరిగ్రహము వలననే వధించబడును కదా. అన్నిటిని విదడిచి వెళ్ళుట తప్పనపుడు అనర్థమున నేల ప్రవర్తించెదవు. నీ ప్రయోజనము నెందుకు విచారించవు? పరలోకమునకు బయలు దేరుచున్న నీవెంట నీవు చేసిన పుణ్య పాపములు తప్ప మరేవి రాజాలవు. విషయ సుఖాభిలాషయను రజ్ఞువు నిన్ను బంధించి వేయును. కావున ధర్మాధర్మములను సత్యాసత్యములను విడిచిపెట్టుము. సంకల్పత్యాగముతో ధర్మమును, అహింసచే అధర్మమును విడిచిపెట్టుము. వేయి సంతోష కారణములు, నూరు దుఃఖ కారణములు ప్రతి నిత్యము మూర్ఖుని పొందును. పండితుని పొందజాలవు. అనిష్టములు కలుగుటచే ఇష్టములు తొలగుటచే అల్ప బుద్ధులగు మానవులు మానసిక దుఃఖములను పొందెదరు. ఎక్కువగా ఆలోచించకుండుటయే దుఃఖమునకు తగాని ఔషదము. జీవితము, రూపము, ¸°వనము, ద్రవ్య సముపార్జనము, ఆరోగ్యము, ప్రియా సమాగము ఇవియన్నియూ అనిత్యములే. కావున పండితుడు వీటి కొరకు ఆశపడరాదు. పెరుగుట తరుగుట కొరకే. అభివృద్ధినాశనము కొరకే. కలయిక విడిపోవుటకే. జీవితము మరణము వరకే యుండును.

వ్యాధిబిర్భక్ష్యమాణానాం త్యజతాం విపులం ధనరమ్‌ | వేదనా నావకర్షన్తి యతమానాశ్చికిత్సకాః 61-58-59

తే చాపి వివిధా వైద్యాః కుశలా సంభృతౌషధాః | వ్యాధిభిఃపరికృష్యన్తే మృగా వ్యాఘ్రైరివార్దితాః 61-59

తే పిబన్తి కషాయాంశ్చ సర్పీంషి వివిధాని చ | దృశ్యన్తే జరయాభిన్నా నాగైర్నాగా ఇవోత్తమాః 61- 60

శ్వాపదాశ్చ దరిద్రాశ్చ ప్రాయోనార్తా భవన్తి తే 61- 61

మహచ్ఛ కర్మ వైషమ్యం దృశ్యతే కర్మ సంధిషు | వహన్తి శిభికామన్యే యాస్త్యన్నే శిబికారుహః 61-69

కర్తోపాదానకరణౖ వినా కార్యే నదృశ్యతే 63-42

మానుషణం దుర్లభం ప్రాప్య సర్వలోకోపకారకమ్‌ |యస్తారయతి నాత్మానాం తస్మాత్పాపతరో త్రకః 63-104

ఆహారశ్చైవ నిద్రా చ భయం మైధునమేవ చ |పశ్వాదీనాం చ సర్వేషాం సాధారణమితీరితమ్‌ 63- 105

దీపప్రియః కార్తవీర్యో మార్తాండో నతివల్లభః | స్తుతిప్రియో మహావిష్ణుర్గణ శన్తర్పణ ప్రియః 76- 115

దుర్గార్చనప్రియా నూనం అభిషేకప్రియశ్శివః 76-116

అర్థీ దోషం న పశ్యతి 96-95

వ్యాధులచే పీడించబడుచు విపులముగా ధనమును వ్యయము చేయువారి వ్యాధులకు చికిత్సకై ప్రయత్నము చేసి కూడా వైధ్యులు బాధలను తగ్గించలేకున్నారు. ఆ వైద్యులు కూడా కుశలులు, సమృద్ధిగా ఔషథములు కలవారైనను వ్యాఘ్రములచే పీడించబడు లేళ్ళవలె వ్యాధులచే పీడించబడుచునే యున్నారు. వారుకూడా పలువిధములుగా కషాయములను ఔషధములను సేవించుచుందురు. ఏనుగులచే భేదించబడు యేనుగులవలె వారుకూడా ముసలితనముచే భిన్నులగుదురు. తొడేళ్ళు దరిద్రులు సామాన్యముగా ఆర్తులు కారు. కర్మసంధులలో ఎంతో కర్మవైషమ్యము కనపడుచున్నది. కొందరు పల్లకిని మోయుదురు. మరికొందరు పల్లకిని ఎక్కి సంచరింతురు. కర్తా ఉపాదానము (మూలకారణము) కరణములు లేనిచో కార్యము సంభవింపదు. సర్వలోకోపకారక మగు మానవ జన్మను పొంది కూడా ఆత్మను తరింప చేయని వానికంటే పాపాత్ముడెవడుండును. ఆహారనిద్రా భయమై ధునములు సర్వప్రాణులకు సాధారణములు.

కార్యవీర్యార్జునుడు దీప ప్రియుడు. సూర్యుడు నమస్కార ప్రియుడు. మహా విష్ణువు స్తుతి ప్రియడు. గణశుడు తర్పణ ప్రియుడు. దుర్గా అర్చన ప్రియ. శివుడు అభిషేక ప్రియుడు.

యాచకుడు దోషములను చూడజాలడు.

శర్కరామిశ్రితం క్షీరం కాద్రవేయే నియోజితమ్‌ | విషవృద్ధిం కరోత్యేవ తద్వత్సావకృతం భ##వేత్‌ ఉ 12-52-53

ఆత్మసౌఖ్యకరాః పాపా భవన్తి పరతాపినః 12-55

శశీ సూర్యో థ పర్జన్యో మేదినీహుతభుగ్జతిమ్‌ | చందనం పాదస్సన్తః వరోపకరణాయవై 12- 56

నిద్రా మూలమదర్మస్య నిద్రా పాపవివర్థినీ | నిద్రా దారిద్ర్యజననీ నిద్రా శ్రేయోవినాశినీ 16-30-31

పితురభ్యధికం కించిద్ధైవతం న సుతస్య వై | దేవాః పరాఙ్మఖాస్తన్య పితరం యో వమన్యతే 16- 39

ఏతత్సౌఖ్యం పరంలోకే ఏతత్స్వర్గ పదం ధ్రువమ్‌ | పితురభ్యదికః పుత్రో యద్భవేత్‌ క్షితిమండలే 16-41

శుచావమేధ్య పి శుభే సమం వర్షతి వారిదః| చాండాలపతితో చన్ద్రో హ్లాదయేచ్చ నిజైః కరైః 14-68-69

అభిఘాతేషు సర్వేషు శన్తం వారిప్రసేచనమ్‌ 14-11

అధవా క్లిన్నవస్త్రేణ సహసా బన్దనం హితమ్‌ 14 - 12

నిర్వ్యాపారో నియేగీ తు నియోగే యస్తు తిష్ఠతి | స్వామి విత్తం సమశ్నాతి స యాతి నరకం ధ్రువమ్‌ 3-37-38

శర్కరను కలిపిన పాలు పామునకు పోసిన విషమునే వృద్ధి చేయును. పాపులకు చేసిన ఉపకారము కూడా హానినే కలిగించును. పాపములు చేసిన వారికి సుఖమును ఇతరులకు పరితాపమును కలిగించును. ఇంద్రుడు సూర్యుడు వర్జన్యుడు భూమి అగ్ని జలము, చన్దనము, వృక్షములు, సత్పురుషులు పరోపకారమునకే యుందురు. నిద్ర దారిద్ర్యమునకు మూలము. నిద్ర పాపమును పెంపు చేయును. నిద్ర దారిద్ర్యమును కలిగించును. శ్రేయస్సులను నిద్ర నశింప చేయును. పుత్రునికి తండ్రిని మించిన మరియొక దైవము లేదు. తండ్రిని అవమానించు వానికి దేవతలు విముఖులౌదురు. ఈ భూమండలమున తండ్రిని మించిన తనయుడుండుట సౌఖ్యప్రదము స్వర్గప్రదము, పవిత్ర స్థలమున, అపవిత్రస్థలమున మేఘము సమానముగా వర్షించును. చంద్రుడు తన కిరణములచే చండాలులను పతితులను కూడా ఒకే రీతిగా ఆనన్ద పరచును. శరీరమున గాయమైనచో నీరులు చల్లవలయును. లేదా తడిబట్టతో కట్టుకట్టవలయును. సేవకునిగా నియమించబడినవాడు ఏ సేవను చేయక యజమాని నుండి వేతనమును తీసుకొనినచో నరకమును పొందును.

అథవా సత్యగాథేయం లౌకికీ ప్రతిభాతి నః | జనసంతాపకర్తాయ సో చిరేణోపతప్యతే 3-60-61

వృథా శూలాహి జననీ జాతాదేవ కుపుత్రిణీ 4-11

కృష్ణప్రణామీ న పునర్భవాయ 6-3

సన్మార్గే ఆవదాస్తే ప్రభవతి పురషస్తావదేవే న్ద్రియాణాం

లజ్జాం తావద్విధత్తే వినయమపి సమాలంబతే తావదేవ

భ్రూచాపాక్షేపయుక్తాశ్ర్శవణపథగతా నీలపక్ష్మాణ ఏతే | యావల్లీలావతీనాం సహృది ధృతిముషో దీష్టిబాణాః పతన్తి 7. 38

ధిక్తస్య మూఢమనసః కుకవేః కవిత్వం| యస్త్రీముఖం చ శశినం చ సమీకరోతి

భ్రూక్షేప విస్మిత కటాక్షనిరీక్షణాని | కోవ ప్రసాద హసితాని కుతశ్శశాంకే 7. 39

పీతం హి మద్యం మనుజేన నాథ కరోతి మోహం సువిచక్షణస్య | స్మృతా చ దృష్టా యువతీ నరేణ వియోహయేదేవ సురాధికాహి 7.40

విపతంతకనిభ##ద్రైవ సంస్థితస్య 17-11

న ధర్మస్తు దయాతుల్యో న జ్యోతిశ్ఛక్షుషా సమమ్‌ 22- 18

న ధర్మేణ నమం మిత్రమ్‌ 22 - 21

నారోగ్యసమమైశ్వర్యం స దేవః కేశవాత్పరః 22-22

జనులను పరితపింప చేయువాడు త్వరలోనే పరితపించుననునది మాకు నిజమే యనిపించుచున్నది. దుష్టపుత్రడు తల్లికి వ్యర్థముగా కడుపునొప్పిని కలిగించిన వాడగును. శ్రీ కృష్ణ భగవానుని నమస్కరించిన వానికి మరల జన్మరాదు. కనుబొమలు ముడిచి నల్లని కనురెప్పలు గల విలాసవతుల చూపులు హృదయమున ప్రవేశించి ధైర్యమును హరించు వరకే మానవుడు సన్మార్గమున నుండును. ఇంద్రియ నిగ్రహము కలిగియుండును. బిడియపడు చుండును. వినయమును కూడా అంతవరకే చూపును. స్త్రీ ముఖమును చంద్రుని సమానముగా వర్ణించు దుష్ట కవి కవిత్వము వ్యర్థము. కనుబొమలముడి, చిరునవ్వు, ఆశ్చర్యము, కోప ప్రసాద హిసితములగు కటాక్ష నిరీక్షణముల చంద్రునిలో ఎక్కడున్నవి? మద్యము పానము చేయబడినచో వివేకవంతుని కూడా మోహింప చేయును. యువతి తలచిననూ చూచిననూ మోహింప చూయును. కావున యువతి మద్యముకన్న అధికురాలు. స్థిరముగానున్న వానికి ఆపద కూడా క్షేమకారియే అగును. దయాతుల్యమగు ధర్మము నేత్రతుల్యమగు కాంతి, ధర్మతుల్యుడగు మిత్రుడు ఆరోగ్యతుల్యమగు ఐశ్వర్యము కేశవుని మించిన దైవము ఈ లోకమున లేదు.

విధినా విహితే మార్గే కిం కరిష్యతి పండితః ఉ 27-144

ఆపవర్గ్యస్స్మృతో ధర్మో ధన ధర్మైకసాధనమ్‌ 28-49

అలీకం నైవ వక్తవ్యం ప్రాణౖః కంఠ గతైరపి 38-55

దైవాధీనం జగత్సర్వమ్‌ 28-65

ధర్మః కామదుఘా ధేనుః సంతోషో నన్దనం వసమ్‌ 28-71

విద్యా మోక్షకరీ ప్రోక్తా తృష్ణా వైతరణీ నదీ 28-72

ధర్మసేవార్థకం నాంగనైర్మల్యహేతుకమ్‌ | హోమార్థం సేవనం వహ్నేర్న తు శీతాదిహానయే 31-13

స్మయస్తపో హన్తి 31 -31

బ్రహ్మహత్యా సురాపానం స్తేయం గుర్వంగనాగమః | మహాన్తి పాతకాన్యాహుః 31 -32

విఘ్నరాజ్ఞీ తు వై నారీ లోకేషు పరిగీయతే 35-30

పిష్టస్య పేషో న హి నీతియుక్తః 36-46

దృష్టే కార్యే జనస్సర్వః ప్రత్యయం కురుతే 37-24

వర్జ్యం పర్యుషితం తోయం వర్జ్యం పరుషితిదలమ్‌| స వర్జ్యం జాహ్నవీ తోయం సవర్జ్యం తులసీదలమ్‌ 37-26

కిమష్టాంగేన యోగేన కిం తపోభిః కి మధ్వరైః | వాన ఏవ హి గంగాయాం సర్వతో పి విశిష్యతే 38-38

విధి మార్గము నేర్పరచగా పండితుడేమి చేయగలడు. ధర్మము మోక్షమును సాధించును. ధర్మమును మాత్రమే సాధించునది ధనము. ప్రాణాపాయ స్థితిలో కూడా అబద్ధమాడరాదు. ఈ జగమంతయూ దైవాధీనము. ధర్మము కామధేనువు సంతోషము నన్దనవనము. విద్య మోక్షమును ప్రసాదించునదే. ఆశ నరకముకిచ్చును. స్నానమాడుట ధర్మమును సేవించుటనే కాని శరీరముల నివృత్తికి కాదు. హోమము కొరకే అగ్నిని సేవించుట. శీతమును తొలగించుకొనుటకు కాదు. గర్వము తపమును నశింపచేయును.

బ్రహ్మహత్య, మద్యపానము, చౌర్యము, గురుపత్నీ సమాగమము. ఇవి మహాపాతకములు. స్త్రీ విఘ్నములకు రాణియని లోకములలో చెప్పబడుచుండును. పిండిని ఇసురుటనీతి కాదు. కార్యమును చూచిన తరువాత జనము విశ్వసించును. సర్వవ్యాపకుడు జ్ఞానస్వరూపుడగు శ్రీ మహా విష్ణువే ద్రవ రూపముగా గంగా జలముగా మారెను. చాలా కాలము క్రింది జలమును పరిహరించవలయును. చాలా కాలము క్రిందటి దలమును పరిహరించవలయును. కాని గంగా జలమును తులసీదళమును వర్జింపరాదు. అష్టాంగయోగము తపము యాగము అన్నియూ వ్యర్థములే. గంగాతీరవానమే సర్వదా విశిష్ఠము.

ఆత్మస్తుతిర్న కర్తవ్యా కేనచిచ్చుభమిచ్ఛతా ఉ 7-33

'దేహాన' రోగో వశగా ప్రియా చ | గృహా విభూతిర్నృహరౌ చ భక్తిః

విద్వత్సు పూజా ద్విజదాన శక్తిః | మన్య్వేహమే తత్సుకృత ప్రసూతమ్‌ 10 - 68

చండాలయోనయసస్రః పురాణ కవయో విదుః | కుమారీ సభవాత్వేకా న గోత్రాపి ద్వితీయకా

బ్రహ్మణ్యాం శూద్రజనితా తృతీయా నృపపుంగవా 13.3-4

అసేవితా ప్రజేద్ధార్యా అదత్తం హి ధనం ప్రజేత్‌ 17- 51

అరక్షితం వ్రజేద్రాజ్యమనభ్యస్తం శ్రుతం వ్రజేత్‌ | నాలసైః ప్రాప్యతే విద్యా న భార్యా వ్రతసంస్థితైః 17- 52

నానుష్ఠానం వినా లక్ష్మీర్నాభ##క్తైః ప్రాప్యతే యశః | నోద్యమీ సుఖమాప్నోతి నాభార్యస్సంతతిం లభేత్‌ 17-53

నాశుచిర్థర్మమాప్నోతి న విప్నోతి న విప్రో ప్రియవాగ్థనమ్‌ | అపృచ్ఛన్నైవ జానాతి అగచ్ఛన్న క్వచిద్ర్వజేత్‌ 17-54

అశిష్యో న క్రియాం వేత్తి న భయం వేత్తి జాగరీ 17-55

ప్రభుః ప్రథమకల్పస్య యో ను కల్పేన వర్తయేత్‌ | సంపరాయికం తస్య దుర్మతేర్జాయతే ఫలమ్‌ 42-9-10

ఏకో మునిః కుంభకుశాగ్రహస్త ఆమ్రస్యమూలే సలిలం దదాతి |

ఆమ్రాశ్చ సిక్తాః పితరశ్చ తృప్తా ఏకాక్రియా ద్వ్యర్థకరీ ప్రసిద్ధా 46 - 7

సాధవస్సర్వలోకన్య సతతోవకృతౌ స్థితాః 52 -5

శుభమును కోరువాడు ఆత్మస్తుతిని చేయరాదు. రోగములేని దేహము, వశమున నుండు ప్రియురాలు, పండితులను పూజించుట, బ్రాహ్మణులను దానము చేయగల శక్తి ఇవియన్నయు పూర్వ సుకృత ఫలములు. మూడు విధములగు స్త్రీలు చండాలజాతులని పురాణములలో పండితులు చెప్పియున్నారు. కన్యకు పుట్టినది, సగోత్రలకు పుట్టినది శూద్రుని వలన బ్రాహ్మణ స్త్రీ యందు పుట్టినది. సేవించినచో భార్య వెడలిపోవును. దానము చేయని ధనము, రక్షించబడని రాజ్యము, అభ్యాసము చేయని శాస్త్రము వెళ్ళి పోవును. సోమరులు విద్యను పొందజాలరు. వ్రతములో నున్నవారు భార్యను పొందజాలరు. ఆచరణ లేనిదే సంపద నిలువదు. భక్తిలేనిచో కీర్తి లభించదు. ప్రయత్నించనివాడు సుఖించజాలడు. భార్యలేనివాడు సంతానమును పొందజాలడు. అపవిత్రడు ధర్మమును పొందజాలడు. కఠిన వాక్కుగల బ్రాహ్మణుడు ధనమును పొందజాలడు. అడుగనిదే తెలియజాలడు. నడువనివాడు గమ్యమును చేరజాలడు. శిష్యుడు కాని వాడు క్రియను తెలయజాలడు. మేలుకొని యున్నవాడు భయమును పొందజాలడు. కలశమును దర్భలను చేతధరించిన ఒక ముని మామిడి చెట్టు పాదులో తర్పణమును విడిచిన మామిడిచెట్లు తడియును, పితరులు తృప్తి చెందెదరు. ఇట్లు ఒకే క్రియ రెండు ప్రయోజనములను చేకూర్చును.

ఇవి శ్రీ నారదీయ మహాపురాణమున గల కొన్ని సుభాషితములు. ధర్మమును, దానమును, భగవానుని సేవను, కీర్తనను, వ్రతములను, పతివ్రతా ధర్మములను, సత్యభాషణమును గూర్చి చాలా సుభాషితములు కలవు. గ్రంథ విస్తర భీతిచే ఇచట చూపుటలేదు.

ఇట్లు శ్రీ నారదీయ మహాపురాణమున కల ముఖ్య అంశములు సంగ్రహణముగా ఇచట చూపబడినవి. శ్రద్ధాలువులు, జిజ్ఞానువులు, గ్రంథపఠనము నాచరించి ఐహికాముష్మిక ఫలభాక్కులు కాగలరని ఆశించుచున్నాము

ఇట్లు

అనువాదకుడు

డా|| కందాడై రామానుజాచార్యులు

ఎమ్‌.ఎ.పి.హెచ్‌.డి

Sri Naradapuranam-I    Chapters    Last Page