Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page

అర్థములు
శ్రీ సూరి రామకోటిశాస్త్రి
(సంస్కృత కళాశాలధ్యక్షులు, తెనాలి)

పుట 4 ''దృష్టి ఘ్రాణ''

దృష్టి-చూపుయందు, ఘ్రాణ-ముక్కున, విషాన్‌-విషముగల, అష్ట-ఎనిమిది, ఫణాధరపతీన్‌ అపి - క్రూర సర్పములనుకూడ, దృష్ట్వా - చూచి, స్వయం - తానే, రోద్ధుం-ఎదిరించుటకు, చ్యావయితుం-పడవేయుటకు, ప్రమాపయితుమ్‌ అపి- చంపుటకును, అవ్యాహత పక్రమః-అకుణ్ఠిత పరాక్రమముకల, ఖగపతిః-పక్షిరాజు-అనగా గరుత్మంతుడు, మార్జాలాన్‌- పిల్లులను, నకులాంశ్చ- ముంగిసలను, సాహాయ్యకే-సాయమునందు, అపేక్షతేకిమ్‌? - అపేక్షించునా? కిమ్‌-లేదా, ప్రత్యర్థికులస్య - శత్రు(సర్ప) కులమునకు, సత్త్వదఃఇతి-ప్రాణము నిచ్చువాడని, మారుతం - వాయువును, ప్రద్వేష్టివా - ద్వేషించునా? (జడియునా?).

పుట 5 ''పద్మకోశ''

అధోముఖం-క్రిందుముఖముగల, పద్మకోశప్రతీకాశం-పుణ్డరీకారముగత, హృదయం చ అపి-హృదయము కలదు, తస్య అన్తే-దానిచివర, సూక్ష్మంసుషిరమ్‌-సన్నని రంధ్రము, తస్యాః శిఖాయాఃమధ్యే- ఆ శిఖ మధ్యమున, పరమాత్మా-పరమాత్మ, వ్యవస్థితః - నిలిచియున్నవాడు, సఃబ్రహ్మ-అతడు బ్రహ్మ, సఃశివః-అతడు శివుడు, సఃహరిః-అతడు విష్ణువు, సఃఇన్ప్రః - అతడు ఇంద్రుడు, సో2క్షరః-అతడు అక్షరుడు, పరమః-ఉత్కృష్టుడు, స్వరాట్‌-స్వయముగా ప్రకాశించువాడు.

పుట 7 ''స్వయం ప్రతిభాతవేదాః''

స్వయమ్‌-తమంత తమకే (అధ్యయనము అధ్యాపనము లేకయే), ప్రతిభాత-స్ఫురించిన, వేదాః-వేదములు కలవారు.

పుట 8 ''పిశాచో గుహ్యకఃసిద్ధః''

పిశాచః-మాంసము తినునది, గుహ్యకః-నిధులను రక్షించువాడు, సిద్ధః-ఓషది అఞ్జనాదులచు సిద్ధులుకలవాడు, భూతః-భూతి (ఐశ్వర్యము) కలవాడు, అమీ-వీరు, దేవయోనయః-దేవాంశ కలవారు.

పుట 8 ''విద్యాధరో2 ప్సరోయక్ష''

విద్యాధరః-గుటికాది తన్త్రవిద్యల నేర్చినవాడు, అప్సరః-జలమునుండి ఉద్భవించిన రూపవతులు, యక్షః-పూజ్యుడు, అందమైన కన్నులు గలవాడు, రక్షః-రక్షస్సు, గంధర్వః-గానకళాకుశలుడు, కింనరః-అశ్వముఖుడు, వీరు దేవయోనిగణములో చేరినవారు.

పుట 13 ''హరితల్పహరాంఘ్రి''

చంద్రనామా-చంద్రశర్మ అను పేరుగల, సగోవిన్దమునిః-గోవిన్దభగవత్పాదులు, హరితల్ప-శ్రీ మహావిష్ణువునకు పాన్పుగాను, హరాజ్ఘ్రినూపుర-పరమశివునకు కాలినూపురముగాను, క్ష్మాధర-భూమిని మోయు ఆదిశేషుడుగాను, సౌమిత్రి-లక్ష్మణస్వామిగాను, బల-బలరాముడుగాను, అత్రిజన్మా-ఆత్రేయుడు పతఞ్జలిగాను, ఉన్నవారు, అనగా శేషావతారమే.

పుట 15 ''సంస్కృతంనామ దైవీవాక్‌''

సంస్కృతము దేవభాష, వ్యాకరణ సంస్కారము కలది.

పుట 15 ''నవ్లుెచ్ఛిత''

నవ్లుెచ్ఛితవై-నాపభాషివై అపశబ్దములు నుచ్చరించరాదు శబ్దశుద్ధి ఆవశ్యకము.

పుట 16 ''గర్భేను సన్నను''

అహం-నేను, గర్భేనుసన్‌ - గర్భమునందుండియే, ఏషాందేవానామ్‌ - ఈ దేవతలయొక్క, విశ్వాజనిమాని-సమస్తమైన జన్మలను, ఆవేదంనను-తెలిసికొంటినిగదా! శతం పురః ఆయసీః మా అరక్షన్‌-ఇది వఱకు అనేక జన్మలు (శరీరములు) ఇనుపకోటలుగా బంధించిఉంచినవి; అథ-తరువాత(ఇపుడు), శ్యేనః-డేగవలె, జవసా-వేగముచే, నిరదీరయమ్‌-బయటపడితిని, ఇతి-అని, గర్భఏవ-మాతృగర్భమునందే, శయానః-పరుండి, వామదేవః-వామదేవుడు, ఏవమ్‌-ఇట్లు, ఉవాచ-పలికెను.

పుట 16 ''శాస్త్రదృష్ట్యా''

వామదేవవత్‌-వామదేవునివలె, శాస్త్రదృష్ట్యాతు-శాస్త్రానుసారి దర్శనముచేతనే, ఉపదేశః-ఉపదేశము.

పుట 17 ''జననీ జఠరా దివ''

యః-ఎవడు, జననీ జఠరాద్‌చ్యవన్‌ ఇవ-తల్లికడుపులో నుండి వెలువడుచునే, ఆత్మవిద్‌-ఆత్మవేత్తయై, జగతఃవిపద్భ్యః-ప్రపంచోపద్రవములనుండి, న అద్రవత్‌ - వెరవలేదో, తమ్‌-ఆ, అనహం-నిరహంకారుడు, ఆత్మవంతమ్‌-ఆత్మజ్ఞుడు, భగవంతం-పూజ్యుడు, ప్రశాంతం-ప్రశాస్తుడును అగు, శుకం-శుకమహరిని, అహం-నేను, ఆశ్రయే-ఆశ్రయింతును.

పుట 17 ''యం ప్రవజన్తమ్‌''

అపేతకృత్యమ్‌-కార్యములేని, అనుపేతమ్‌-ఉపనయనముకూడా కాని, ప్రవజన్తమ్‌-వదలి జయలుదేరిన, యం-ఏశుకుని, ద్వైపాయనః-వ్యాసులవారు (తండ్రి), విరహకాతరః-పుత్రుని ఎడబాటు సహించనివారై, పుత్రఇతి-నాయనా అని, అజుహావ-ఎలుగెత్తిపిలిచెనో, తరవః-వృక్షములు, అభినేదుః-ప్రతిధ్వనించినవో సర్వభూతహృదయం-సర్మప్రాణుల మనస్సును తానుగా ప్రవేశించిన, తం మునిం-ఆ మునిని (శుకయోగేంద్రుని) అనతః అస్మి-నమస్కరింతును.

పుట 19 ''యా బ్రహ్మాది''

యా-ఏ చిత్తు (చైతన్యము), బ్రహ్మాది పిపీలికాంత తనుషు-బ్రహ్మమొదలుకొని చీమవఱకు శరీరములందు, ప్రోతా-అలమినదై, జగత్సాక్షిణీ-జగత్తునకు ప్రకాశకమైనదో.

పుట 25 ''అత్రఅన్తరే నక్ర గృహీతపాద''

అత్ర అన్తరే-ఇంతలో, నక్ర-మొసలిచే, గృహీత-పట్టుకొనబడిన, పాద-పాదములగల.

పుట 25 ''గోవిన్దదేశిక''

చిరాయ-చాలకాలము, భక్త్యా-భక్తితో, గోవిన్దదేశికం-శ్రీగోవింద భగవత్పాదులను, ఉపాస్య-ఉపాసించి, తస్మిన్‌ - వారు, విదేహముక్త్యా-విదేహముక్తితో, నిజమహిమ్నిస్థితే-స్వమహిమ ప్రతిష్టితులుకాగా, అద్త్వెత భాష్యమ్‌ ఉపకల్ప్య-అద్త్వెతభాష్యరచనము చేసి, దిశో విజిత్య-దిగ్విజయముజేసి, సశఙ్కరార్యః-ఆ శఙ్కరాచార్యులు, కాంచీపురే-కంచియందు, స్థితిమవాప-నివసించిరి.

పుట 26 ఉదర మంతరం కురుతే

'అథ కస్య భయం భవతి తత్త్వేవ భయం విదుషో2మన్వానస్య'

తై-ఉ.బ్రహ్మవల్లి.

(యదా-ఎపుడు, ఏషః-ఈ సాధకుడు, ఏతస్మిన్‌-ఈ పరబ్రహ్మమునందు) ఉత్‌ అరం - కొలదియేని భేదమును, కురతేహి అథ-చేయునేని, తస్య-అలవానికి, భయం-భయము, భవతి-కలుగును, అమన్వానస్య-కొలదియేని భేదమున లేదని తలపని, విదుషః-విద్వాంసునకున్నూ, తత్‌ ఏవ భయం తు-అభయమే, భవతి-కలుగుచున్నది, భేదము కలదని అనుకొను చదువని వానికిని చదివిన వానికిని భయమేలని తాత్పర్యము.

పుట 27 ''ఇమం వివస్వతే''

అహం-నేను, అవ్యయం-వ్యయములేని, నాశనములేని, ఇమం యోగం-వెనుకటి రెండధ్యాయములచే చెప్పబడినయోగమును - సాధనమగు కర్మయోగమును సాధ్యమగు జ్ఞానయోగమును, వివస్వతే-సూర్యునికొరకు, ప్రాప్తవాన్‌-చెప్పితిని, వివస్వాన్‌-సూర్యుడు, మనవే-మనువు కొరకు, ప్రాహ-చెప్పెను, మనుః-మనువు, ఇక్ష్వాకవే-ఇక్ష్వాకువు అను తన కొమరునకు, అబ్రనీత్‌-చెప్పెను, (1) పరంతప-తేజశ్శౌర్యములచే శత్రువులను తపింపజేయునో యర్జునా, ఏవం ఇటులు, పరంపరాప్రాప్తం- క్షత్రియపరంపరగా వచ్చిన, ఇమం - ఈ యోగమును, రాజరయః-రాజరులు, విదుః-ఎరుగుదురు, సఃయోగః-ఆ జ్ఞానయోగము, మహతా-దీర్ఘమయిన, కాలేన-కాలముచే, ఇహ-ఇపుడు, నష్టః-నశించిన సంప్రదాయము కల దాయోను.(2).

పుట 27 ''బహుని మే వ్యతీతాని''

అర్జున-ఓ అర్జునుడా, మే - నాకును, తవచ-నీకును, బహూని-పెక్కు, జన్మాని-జన్మములు, వ్యతీతాని-కడచెను, అహం-నేను, తానిసర్మాణి-వానినన్నిటిని, వేద-ఎదుగుదును పరంతప-శత్రువులను తపింపజేయునో యర్జునా త్వం-నీవు, నవేత్థ- ఎరుగవు, ధర్మము అధర్మము మొదలగు వానిచే ఆవరింపబడిన జ్ఞానము కలవాడుగాన అర్జునుడెరుగడు, నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావుడుగాన అజ్జానశక్తి ఆవరింపలేదుగాన కృష్ణభగవాను డెరుగునని తాత్పర్యము.

పుట 28 ''దివ్యం దదామి'' (4వ. సం. చూ. 82 పే)

పుట 28 హరిర్యథైక...

యథా-ఎటులు, హరిః-విష్ణువు, ఏకఏవ-ఒక్కడే పురుషోత్తమః-పురుషోత్తముడని, స్మృతః-చెప్పబడెనో, త్య్రంబకేవ-శివుడే, మహేశ్వరః స్మృతః-మహేశ్వరుడని చెప్పబడెనో, న అపరః-బరుడు అటులు పురుషోత్తముడనియు మహేశ్వరుడనియు చెప్పబడడో, తథా-అటులు, మం-నన్ను, మునయః-మునులు, శతక్రతుం-శతక్రతువునుగా, విదుః-ఎరుగుదురు, నః-మామూపురయు, ఏషః-ఈ, త్రితయో2సి శబ్దః-మూడు మాటలును, ద్వితీయ గామీ నహి-రెండవవానిని పొందవు, అనగా చెప్పవు, ఈ మూడు శబ్దములును, హరిని, హరుని ఇంద్రుని తక్క తదితరులను చెప్పవు. అని తాత్పర్యము.

పుట 28 ''వేదాంతేషు''

జ్ఞానినః-జ్ఞానులు (అని అధ్యాహార్యము), వేదాంతేషు-ఉపనిషత్తులందు, యం-ఎవనిని, ఏకపురుషం-ఒక్కపురుషునిగను, రోదసీ-దివినిభువిని, వ్యాప్య-వ్యాపించి, స్థితం-ఉన్నవానిగను, ఆహుః-చెప్పుదురో (-''స ఏకో య ఏకః స రుద్రో యో రుద్రః స ఈశానోయ ఈ శానః భగవాన్‌ మహేశ్వరః'' అని అధర్వశిరము. ''ఏక ఏవ రుద్రో న ద్వితీయాయ తస్థే'' అని తైత్తిరీయము. 'యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తసై#్త్మ రుద్రాయ నమో అస్తు' అను తైత్తిరీయము. ఇతని విశ్వ వ్యాపకత్వము చెప్పును) యస్మిన్‌ యెవనియెడల, ఈశ్వరఇతి-ఈశ్వరుడను శబ్దము, అనన్యవిషయః-శివునికంటె ఇతరునకు విషయము కానిదై, యథార్థాక్షరః-అర్థమున కనురూపమగు అక్షరములు కలదో అనగా ¸°గికమో, (''క్లేశకర్మ విపాకాశ##యై రసరామృష్టః పురుష విశేష ఈశ్వరః'' అని పాతఞ్జలమును, 'ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర స్సర్వ భూతానాం' అని తైత్తిరీయమును చెప్పును) యః-ఎవడు, నియమిత ప్రాణాదిభిః-నియమింపబడిన ప్రాణాపానాదులుకల, ముముక్షుభిః - ముక్తికోరువారిచే , అంతః-హృదయములో, మృగ్యతే- వెతుకబడునో ('అథ యదిద మస్మిన్‌ బ్రహ్మపురే దహరం పుండరీకం వేశ్మ దహరోస్మి న్నంతర ఆకాశస్తస్మి న్యదంత స్తదన్యేష్టవ్యం యద్వావ విజిజ్ఞా సి తవ్యమ్‌' అని బృహదారణ్యకము) యః-ఎవడు, స్థిర భక్తి యోగ సులభః, స్థిర-అచల మయిన అనగా విషయములచే చలింపని, భక్తి-భక్తిచేతను, యోగధ్యానముచేతను, సులభః- సుఖముగా పొందదగిన, (స్థిర భక్తిపూర్వక ధ్యానైకగమ్యుడని అర్థము) సః-ఆ స్థాణుః-శివుడు, వః, నిఃశ్రేయసాయ, అస్తు-మీకు మోక్షమొసగుకాక!

పుట 29. ''కాలో స్మి''

లోకక్షయ కృత్‌-లోకములకు క్షయము చేయునట్టియు, ప్రవృద్ధః-మిగుల వృద్ధి బడిసినట్టియు, కాలః-కాలుడను, అనగా క్రియాశక్త్యుపహితుడనైన పరమేశ్వరుడను అని ఆనందగిరి, అస్మి-అగుచున్నాను, ఇహ-ఇపుడు, లోకాన్‌-ప్రాణులను, సమాహర్తుం-చంపుటకు, ప్రవృత్తః-ప్రవర్తించితిని, యే-ఏ, యోధాః-జోదులు, ప్రత్యనీకేషు-ఎదిరిసేనలందు, అవస్థితాః-ఉన్నారో, (తే) సర్వే-వారందరు, ఎవరిని జూచి నీవు చంపదగిన వారని అనుకొని భయవపడుచుంటివో అట్టి భీష్మాదులు, ఋతే2పిత్వా-నీవు లేకున్నను, న భవిష్యన్తి-బ్రతుకపోరు.

పుట 29. ''ఈశ్వర స్సర్వభూతానాం''

(కుశలః-నేర్పరి, అని అధ్యాహారము) యంత్రారూఢాని-యంత్రము నెక్కిన కొయ్యబొమ్మలు మొదలగు వానిని, మాయ యా ఇవ-మాయచేవలే (ఇవ అధ్యా) ఈశ్వరః-ఈశ్వరుడు, సర్వభూతాని-ఎల్లభూతములను, మాయయా-మాయచే, భ్రామయన్‌ సన్‌-భ్రమింపజేయుచుఉన్నవాడై, సర్వభూతానాం-ఎల్ల భూతములయొక్కయు, హృద్దేశే-హృదయదేశమునందు, తిష్టతి-ఉండుచున్నాడు (ఒకటవ సంపుటమున దీనికి వేరొక రీతిగా అర్థము కలదు. దానికిని దీనికిని తాత్పర్యభేదము కలుగునటుల అర్థమును గ్రహించునది. ఈ యర్థము శంకర భాష్యానుగుణము-16) భారత-ఓయర్జునుడా!, త్వంనీవు, సర్వభావేన-అన్ని విధముల, అనగా త్రికరణములచే, తమేవ-ఆ యీశ్వరునే, శరణం-గచ్ఛశరణుపొందుము, తత్‌ ప్రసాదాత్‌-ఆఈశ్వరుని అనుగ్రహమున, పరాం-దొడ్డ, శాంతిం-శాంతిని, శాశ్వతం-అచలమగు, స్థానం-పదమును ప్రాప్స్యసి-పొందగలవు.

పుట 30 ''యదాయదాహి'' (చూ. 1. సం. ము. 97 పేజి)

పుట 31 ''ఆరోగ్యం''

భాస్కరాత్‌-సూర్యునివలన, ఆరోగ్యం-ఆరోగ్యమును, అన్విచ్ఛేత్‌-కోరదగును, హుతాశనాత్‌-అగ్నివలన, శ్రియా-లక్ష్మిని, అన్విచ్ఛేత్‌-కోరదగును, ఈశ్వరాత్‌-ఈశ్వరునివలన, జ్ఞానం-జ్ఞానమును, అన్విచ్ఛేత్‌-కోరదగును, మహేశ్వరః-మహేశ్వరుడు, జ్ఞానదాతా-జ్ఞానమును ఇచ్చువాడు.

పుట 31 ''ఈశానస్సర్వ'' (చూ. 1. సం. యు. 20వ పేజి)

పుట 33 ''కలిః సాధుః''

కలిః-కలియుగము, సాధుఃమంచిది, మిగిలిన యుగములలో చాలకాలము తపస్సు చేయనిదే ఫలము సిద్ధింపదు. కలిలో అల్పకాలము తపస్సు చేసిన ఫలము సిద్ధము అని తాత్పర్యము.

పుట 36 ''నిసై#్త్య్రగుణ్య పథి''

నిసై#్త్ర గుణ్య-సత్త్వరజస్తమోగుణములు మూడును లేని, పథి-బాటలో, విచరతాం-నడచు వారికి, విధిఃకః-విధి యేమి? నిషేధఃకః-నిషేధ మేమి?

పుట 36 ''యో బ్రహ్మాణం''

యః-ఎవడు, పూర్వం-తొలత, బ్రహ్మాణం-హిరణ్యగర్భుని, విదధాతి-సృజించుచున్నాడో, యః-ఎవడు, తసై#్త్మ-అతని కొరకు, వేదాంశ్చ-వేదములనుగూడ ప్రహిణోతిచ-ఉపదేశముగూడ, చేయుచున్నడో, ఆత్మబుద్ధి ప్రకాశం-నాలోని బుద్ధిని ప్రకాశింప జేయునట్టి, తం-ఆ, దేవంహి-దేవునే, ముముక్షుఃవై-నిక్కముగా మోక్షము కోరువాడనై, అహం-నేను, శరణంప్రపద్యే-శరణు చొచ్చు చున్నాను.

పుట 36 ''త్రిధా హితం''

(జ్ఞానులు అధ్యా) త్రిధా-మూడుగా, హితం-ఉన్నదియు, విశ్వ-తైజస-ప్రాజ్ఞులను పేర పిండాండము నందును, విరాట్‌-హిరణ్య గర్భ-అవ్యాకృతులను పేర బ్రహ్మాండమునందును ముత్తైరగుల నున్నదనీ తాత్పర్యము, పణిభిః-బ్రహ్మావేత్తలచే, గుహ్యమానం-రహస్యముగ రక్షింపబడునదియు నగు, ఘృతం-బ్రహ్మతత్త్వమును, గని-తత్త్వమస్యాది వాక్య సముదాయమందు, అన్వవిందన్‌-అనుక్రమముగా పొందిరి. ఇంద్రః-పరమైశ్వర సంపన్నుడగు విరాట్పురుషుడు ఏకం-ఒకదానిని (జాగరణమును), జజాన-కలిగించెను, సూర్యః-తేజస్వియగు హిరణ్యగర్భుడు, ఏకం-స్వప్నమును, జజాన-కలిగించెను, వేనాత్‌-దుఃఖరహితుడుఅగుటచే కమనీయుడగు అవ్యాకృతునివలన, ఏకం-ఒకటి, అనగా నిదుర కలిగెనని అధ్యాహార్యము. ఇటుల స్వధయా-అనన్యాశ్రయమగు బ్రహ్మశక్తిచే, నిష్టతక్షుః-విరాడ్ఢిరణ్య గర్బావ్యాకృతులు జాగ్రత్‌ స్వప్నసుషుప్తులను కలిగించిరి, బ్రహ్మవేత్తలు విస్వతైజస ప్రాజ్ఞులు అను పేరుల తోడను విరాడ్ఢిరణ్యగర్భా వ్యాకృతులను పేరుల తోడను ఉన్నట్టియు రహస్యముగ గ్రహింప బడునట్టియు బ్రహ్మముఖ తత్త్వమస్యాది మహావాక్యాను సంధానముచే పొందరనియు విరాడాదులు మూవురును క్రమముగా జాగ్రత్‌ స్వప్న సుషుప్తులను బ్రహ్మ శక్తి విశిష్టులై సృజించిరనియు తాత్పర్యము.

పుట 37 ''యో దేవానాం''

యః--ఎవడు, దేవానాం-దేవతలకు, ప్రభవశ్చ-జన్మకారణమును, ఉద్‌ భవశ్చ-కారణమును(ఆయోనో)యః-ఎవడు, విశ్వాధిపః-విశ్వమునకు ప్రభువో, యః-ఎవడు, మహరిః-సర్వజ్ఞుడో, యంః-ఎవడు, పూర్వం-తొలుత, హిరణ్యగర్భం-హరణ్యగర్భుని, జనయామాస-సృజించేనో, సః-ఆ, రుద్రః-రుద్రుడు, నః-మమ్ము, శుభయా-మంచి, బుద్ధితో-అనగా జ్ఞానముతో, సంయునక్తు-కూర్చుగాక, రుద్రుడు దేవతలకునువారి వారి ఐశ్వర్యములకును కారణము, అతడీ విశ్వమునకును కారణము, ఏలిక, మరియు సర్వజ్ఞుడు, సృష్టికి మొదట అతడు హిరణ్యగర్భుని సృజించేను. అట్టి పరమేశ్వరుడు మాకు మంచిబుద్ధి నిచ్చుగాక అని అర్ధము. ఇది ఆంధ్రపాఠము. ద్రావిడపాటము ఇది ''యోదేవానాం రప్రథమం పురస్తాత్‌ విశ్వాధికః'' ఈపాఠమున-దేవతలు ముందున్న వాడనియు విశ్వముకంటె అధికు డనియు అర్ధము.

పుట 37 ''అతి కల్యాణ''

అతి-త్యాత్‌-మిగుల మంగళమగు రూపము కలవాడగుటవల్ల, నిత్య-సంశ్రయమాత్‌-ఎపుడును కల్యాణాశ్రయుడగుటవల్ల.

పుట 41 ''కేరళే శశలగ్రామే''

మహాదేవి-పార్వతీ! కేరళే-కేరళ##దేశమందలి, శశలగ్రమే-శశలమను ఊరిలో, విప్రపత్న్యాం-బ్రాహ్మణుని భార్యయందు అనగా ఒకానొక బ్రాహ్మణుని బార్యకు, శంకరాఖ్యః-శంకరుడను పేర, మదంశజః, ద్విజోత్తమః-నాయంశమున బ్రాహ్మణశ్రేష్టుడు, భవిష్యతి -పుట్టగలడు,

పుట44 ''వివలిజ్గం ప్రతిష్ఠాప్య''

సర్వజన్తూనాం-సమస్త ప్రాణుకు, మోక్షదః-మోక్షము నిచ్చునట్టి, బవనత్రయసుందరం-ముల్లోకములందు సుందరమగు, శివలింగం-శివలింగమును, చిదంబరసబాతటే-చిదంబరక్షేత్రసభాప్రదేశమున, ప్రతిష్ఠాప్య-ప్రతిష్ఠ చేయించి, కేదారే-బదరికా శ్రమకేదారక్షేత్రమున, ముక్తి లింగం-ముక్తి లింగమును, నీలకంఠే-నేపాళ##దేశంలోనీలకణ్ఠక్షత్రమున, వరేశ్వరం-వరలిఙ్గమును, కాంచ్యాంశ్రీకామకోటేతు-కాంచీపురంలో, కామకోటిక్షేత్రమున, యోగలింగం-యోగలింగమును, (అనుత్తరం-సర్యోత్తమమైన) శ్రీ శారదాఖ్యపీటేతు-శ్రీ శారదాపీఠము నందు, బోగనామకలింగం-భోగలిఙ్గమును (ప్రతిష్ఠజేసి).

పుట 46 ''గ్రంథ గ్రంథి''

ఇహ-ఈనైషధములో, క్వచిత్‌క్వచిదపి-అచ్చటచ్చట, మాయా-నాచేత, ప్రయత్నాత్‌-కడుయత్నమువలన (పూనికచే), గ్రంథగంథిః-గ్రంథమునందుముడి, వ్యాసి-ఉంచబడెను. ప్రాజ్ఞంమన్యమనాః-నేను తెలిసిన వాడను అనితలంచు, ఖలః-దుర్జనుడు, అస్మిన్‌ - ఈ గ్రంథముందు, హఠేనపఠితిః-మంకు పట్టుతోస్వయముగా చదివినవాడై, మాఖేలతు-ఆటలాడకుండుగాక, శ్రద్ధా రాద్ధగురుశ్లథీకృతదృఢగ్రంథిః-శ్రద్ధతో ఆరాధింప బడిన గురువుచే విడదీయబడిన గట్టిముడులుగల, సజ్జనః-సజ్జనుడు, కావ్యరసోర్మిమజ్జన సుఖవ్యాసంజనం-కావ్యరసతరఙ్గముల నోలలాడుచు, ఆనందానుభూతిని, సమాసాదయతు-పొందుగాక.

పుట 47 ''శబ్దార్త నిర్వచ''

సర్వత్ర-అంతట, నిర్వచనభావం-నిర్వచింప వీలగునను భావమును గూర్చి, అఖర్వగర్వాన్‌-అంతేలేని గర్వము కలవారిన, శబ్దార్థర్వచనఖండనయా-ఈ శబ్దమునకు ఇది అర్థము అను నిర్వచనమును ఖండించుటచే, నయంతః-త్రోసిపుచ్చుచు, దీరాః-దీరులు, యధోక్తమపి ఏతద్‌-ఇందు నేను చెప్పిన (దీనిని) మాటలను, కీరవత్‌ ఉక్త్యా-చిలుకవలె పలికి, లోకేషు-లోకములందు, దిగ్విజయ కౌతుకం-దిగ్విజయ కుతూహలమును, ఆతను ధ్వమ్‌-చేయడు.

పుట 47. ''ప్రాచీముపేత్య''

యతిరాజదృష్టాం-యతీన్ద్రులగు శ్రీమద్రామానుజులచే చూడబడి, ప్రాచీం పదవీం ఉపేత్య-ప్రాచీనమార్గమును సేవించి తత్సన్నికృష్ణమపి-దానికి చేరువలో నున్న దానిని కూడ, వామతయా-సుందరమగుటచే, శ్రయంతః-ఆశ్రయించినవారై, ప్రజ్ఞాయధోదితం ఇదం-ప్రజ్ఞచే నేను చెప్పిన ఈమాటలను, శుకవత్‌ పఠన్తః-చిలుకవలె, (చదువుచు) పలుకుచూ, ప్రచ్ఛన్న బౌద్ధవిజయే-అద్వైతులను జయించుటలో, పరితః-అంతట, యతద్వమ్‌-ప్రయత్నింపుడు.

పుట 48. ''పుణ్యశ్లోకో''

నలఃరాజా-నలమహారాజు, పుణ్యశ్లోకః-పుణ్యాత్ములచే కీర్తింపబడువాడు, యుధిష్ఠిరః-ధర్మరాజు, పుణ్యశ్లోకః-పుణ్యశ్లోకుడు, వైదేహి-జానకి, పుణ్యశ్లోకా-పుణ్యచరిత, జనార్దనః-శ్రీ మహావిష్ణువు, పుణ్యశ్లోకః-పుణ్యశ్లోకుడు.

పుట 49. ''సంచారిణీ''

పతింవరా-భర్తను వరించుటకు బయలుదేరిన, సా-ఆ ఇందుమతి, రాత్రౌ-రాత్రియందు, సజ్చారిణీ దీపశిఖేవ-నడయాడు దీపశిఖవలె, యంయం-ఏఏరాజును, వ్యతీయాయ-దాటి పోవుచుండెనో, ససభూమిపాలః-ఆ యా రాజు, నరేంద్రమార్గాట్టిఇవ-రాజమార్గమున క్షామము (మేడ) వలె, వివర్ణభావం-విచ్ఛాయతను, ప్రపేదే-పొందెను.

పుట 50. ''సాప్తుంప్రయచ్ఛతి''

లోకః-జనము, మతానామ్‌-సాంఖ్య, యోగ, పాఞ్ఛరాత్ర, పాశుపత, ఆద్వైత మతములలో, సత్యతరేపి-మిగులసత్యమైనను, అద్వైతతత్వై ఇవ-అద్వైత తత్త్వమునందువలె, సా- అ దమయంతి, నిషధరాడ్విమతే-నలవేషధారులు నలుగురుదేవతలు(ఇంద్రాగ్నియమ వరుణులు) అసలు నలుడు ఈ ఐదుగురిలో, ఆప్తుం-పొందుటకు, ప్రయచ్ఛతి-ఇచ్చిన, నపక్షచతుష్టమేవేషధారి నలచతుష్టయమున, తల్లాభశంసిన-అసలునలునిచెప్పు, పఞ్చమకోటిమాత్రే-ఐదవకోటి మాత్రమున, శ్రద్ధాంనదధే-విశ్వాసమును ధరించకపోయెను.

పుట 51 ''త్రయీ సాంఖ్యం''

త్రయీ-వేదమార్గము (అద్వైతము). సాంఖ్యం-ప్రకృతి పురుష వివేకముచే అపవర్గమను కపిలమతము, యాగః-చిత్త వృత్తి నిరోధముచే కైవల్యమును, పాతఞ్జల మతము, పశుపతి మతం-పాశుపతము (శైవము) వైష్ణవం-పాఞ్చరాత్రము, ఇతి-అను, ప్రభిన్నే ప్రస్థానే-వేరు వేరు మార్గములలో, ఇదం పరం-ఇది గొప్పది. అదఃపథ్యమ్‌-ఇదిహితమైనది, ఇతిచ-అని, రుచీనంవైచిత్యాత్‌-వారి వారి అభిరుచుల భేదమునుబట్టి, ఋజుకుటిల నానా పథజుషామ్‌-సూటిమార్గమును, లేదా వక్రమార్గములను చేపట్టిన, నృణామ్‌-మానవులకు, పయసామ్‌ అర్ణవఇవ-నదులకు వాగులకు సముద్రమువలె, త్వమ్‌ ఏకః-నీవు ఒక్కడవే, గమ్యః అసి-పొందదగిన వాడవు (గమ్యము) ఐతివి.

పుట 52. ''శబ్దజ్ఞానానుపాతీ''

శబ్దము మాత్రము ప్రయోగింపబడును. వస్తు శూన్యః-దానికి అర్థమైన వస్తువు లోకమున ఉండదు, బుద్ధిలో స్ఫురణ మాత్రముచే వ్యవహారము. వంధ్యాపుత్రుడు, గగనకుసుమము మొదలగునవి వికల్పములు.

పుట 54. ''సచ్చేత్‌ నబాధ్యేత''

సత్‌-మూడుకాలయులందు ఉండునది, చేత్‌-అయినచో, నబాధ్యేత-బాధింపబడకుండును, అసత్‌చేత్‌-కుందేటికొమ్మువలె, ఎప్పుడును లేనిది అగుచో, నప్రతీయేత-ప్రతీతము (భాసించినది) కాకుండును, శుక్తిరజతము అను ముత్తెపుచిప్ప వెండి సత్యముకాదు, ఏలననగా! ఇది రజతముకాదు అని తరువాత బాధింపబడుచున్న బ్రాన్తికాలమునప్రతీతమగుచున్నది. కనుక అసత్తును కాదు. ఇక నేమనగా అనిర్వచనీయము.

పుట 54 ''తత్త్వాన్యతాభ్యాం''

తత్త్వాన్యభ్యామ్‌-అనిర్వచనీయమ్‌, మాయ-అనిర్వచనీయము, అనగా పరమాత్మ స్వరూపముకాదు. పరమాత్మ కంటె వేరు అని చెప్పుటకు వీలుకాదు.

పుట 56 ''సత్యం చ''

సత్యంచ-వ్యావహారికప్రపఞ్చము, అనృతంచ-ప్రాతిభాసిక వస్తుజాతము, సత్యం-పరమసత్యము, అనగా బ్రహ్మ, అభవత్‌-ఆయెను.

పుట 56 ''తదేకో 2వశిష్టః''

అహం-నేను (అహంప్రత్యయాలమ్బనము). ఏకః-అద్వితీయుడు, అవశిష్టః-ప్రపఞ్చము నశింపగా మిగులునట్టి, కేవలః-నిర్థర్మకుడు (ధర్మములు లేనివాడు) అగు, శివః-పరమానన్ద బోధస్వరూపుడను, తద్‌-కాబట్టి.

పుట 57 ''శాన్తం, వివం''

చతుర్థం-తురీయము, శాన్తం-సర్వప్రపంచోపశమరూపము, శివం-ఆనన్దమ, అద్వైతం - ద్వైత(భేద) వర్జితము.

పుట 57 ''ఉన్మీలల్లీల నీలోత్పల''....

ఉన్మీలత్‌-వికసించిన, లీల-విలాసలుగల, నీలోత్పలదల-నల్లకలువ ఱకుల, పలినీ-తామరతీగె, మోద-పరిమళముచే, మేదస్వి-పుష్టమైన, పూర-ప్రవాహము యొక్క, క్రోడ-వక్షమున, క్రీడత్‌ -ఆడుచున్న, ద్విజాలీ-రాయంచల యొక్క, గరుత్‌- -ఱక్కలనుండి, ఉదిత-బయలుదేరిన, మరుత్పాలవాచాల వీచిః-గాలికి శబ్దముచేయుచున్న తరంగములు గల, వాఖానివహ-కొమ్మల సమూహమందు. నవహరిత్పర్నపూర్ణ-క్రొత్త ఆకుపచ్చ ఆకులచే నిండిన, ద్రుమాలీ-కొలని గట్టుమీద చెట్లచే, వ్యాలీఢోపాన్త-వ్యాప్తమయిన సమీప ప్రదేశములందు, శాన్త వ్యత-శ్రమాపనోదనంచేసికొనుచున్న, పథిక-బాటసారులయొక్క, దృశాం-చూపులకు, దత్తరాగః-ప్రీతికొలుపు, తటాకః-చెఱువు, ఏతేన-ఈరాజుచే, అఖాని-త్రవ్వబడెను.

పుట 58. ''సింధోఃజైత్రమ్‌''....

అయం-ఈ కాంచీపురప్రభువు, సింధోః జైత్రం-సముద్రమును గెలువజాలినదియు, పవిత్రం-పావనమైనట్టియు, తత్కీర్తి పూర్తాద్భుతం-అతని కీర్తివలె స్వచ్ఛమైన, అద్భుతమైన తటాకమును, అసృజత్‌ - నిర్మించెను, యత్ర-ఏ తటాకమున, జగన్తి-లోకములు, స్నాన్తి-స్నానముచేయుచున్నవో, కవయః-కవులు, వర్ణిపబోయి, కేవా?-ఎవరు, వాచం యమాః-మౌనముద్ర గలవారై, నసన్తి-కారో1, ఇందుః-చంద్రుడు, యద్బిందు శ్రయం-ఏతటాకజలబిందుశోభను, అఞ్చతి-పొందుచున్నాడో! యస్య జలం అవిశ్య-దేని జలమును ప్రవేశించి, దృశ్యేతనః-కనుపించనివాడై, జలదేవతా స్ఫటికభూః-స్ఫటిక లిఞ్గ స్వరూపుడుగా ఉన్న, అసౌ యోగేశ్వరః! ఈ చంద్ర మౌళీశ్వర యోగలింగమూర్తి, జాగర్తి-ప్రకాశించునో.

పుట 60 ''దేవసేనాపలిః''

దేవసేనాపతిః-దేవతలసేనకు అధిపతిదేవసేనా భర్త శూరః స్వామీ, గజముఖానుజః (గజానుని తమ్ముడు) ఇవి కుమారస్వామి నామములు.

పుట 61 ''జగతఃపితరౌ'' (చూ. 6. వ. సం.ము. 121వ పేజి)

పుట 61 ''సాధారణ స్మరజయే''

స్మరజయే-మన్మథజయము, నిటలాక్షాసాధ్యే-నొసటి కంటిచే సాధింపబడినది, సాధారణ-ఇరువురికి చెందినది కాగా, భాగః-భాగమగు, శివః-శివుడు, సమగ్రం యశః-కీర్తినంతయు, భజతునామ-పొందుగాక, జనని! తల్లీ! వామాంఘ్రిమాత్రకలితే-ఎడమకాలిచే చేయబడిన, త్వదీయే-నీ దగు, ఇహకాలజయే-ఈకాల (మృత్యు)జయమున, పురారేః-శివునకు, కావా ప్రసక్తిః-ఏమి సంబంధము?

పుట 62 ''అశక్యమంగాంతర''

అంతః కరణం-మనస్సు, యత్‌-ఎందువలన, అణుప్రమాణం-అణు పరిమాణముగలదో, అంగాన్తరవత్‌-ఇతరావయవము (కాలు, కన్ను) వలె, విభక్తుల-విభజించుటకు, అశక్యం-వీలుకానిది, శివయోః-పార్వతీ పరమేశ్వరులకు, సామాన్యభూతం-సాధారణమైన, తద్‌ఎకం-ఆ ఒక్కమనస్సు, గర్భదాసేమయి-పుట్టుక నుంచి దరిద్రుడనైన నా యందు, సానుగ్రమంస్వాత్‌-అనుగ్రహముతో కూడినది అగుగాక.

పుట 63 ''తచ్చ ప్రతీశరీరం బిన్నం''

తద్‌చ-ఆ మనస్సును, ప్రతివరీరం ఒకొక్కక్కదేహమున, భిన్నం-వేరైనది.

పుట 64 ''ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌''

ఆనన్దః-ఆనన్దము, బ్రహ్మఇతి-బ్రహ్మ అని, వ్యజానాత్‌-తెలిసికొనెను.

పుట 69 ''పతన్‌ పతన్‌ సౌధ'' ''యదీతి''

(అహం-నేను) సౌధతలాని-మేడ పైభాగములను, చ ఆరోరుహమ్‌-ఎక్కితిని, పతన్‌ పతన్‌ - పడుచు పడుచు, యదిశ్రుతయః ప్రమాణం భవన్తి - వేదములు ప్రమాణమే అయినచో, అస్మిన్‌సమస్థలే-ఈ చదునైన ప్రదేశమున, పతితః-పడినవాడనై, జీవేయమ్‌- బ్రతుకుదును, మజ్జీవనే-నేను బ్రదుకుటలో, తచ్ర్ఛుతిమాన్యతాగతిః-ఆ శ్రుతిప్రమాణమేదిక్కు, ''యది'' ఇతి సందేహపద ప్రయోగాత్‌-యది (ఐనచో) అను సందేహసూచకపదమును ప్రయోగించుట వలనను, వ్యాజేనశాస్త్రశ్రవణాచ్ఛహేతోః-మిషతో శాస్త్రమును వినుటవలనను, ఉచ్చదేవాత్‌-ఎత్తైనప్రదేశము నుండి, పతతః మమ - పడిననాకు, తదేక చక్షుః-ఒక కన్ను, వ్యనక్షీత్‌-నష్టమయినది, సావిధికల్సనా-అది దైవనిర్ణయము.

పుట 72 ''సేనానీ''

సేనానీః-సేనను నడుపువాడు, అగ్నిభూః-అగ్ని నుండి పుట్టినవాడు, గుహః-రక్షకుడు, (ఇవి కుమారస్వామి నామములు).

పుట 73. ''తవస్తన్యం''

ధరణి ధరకన్వే-పార్వతీ! తల్లీ!, తవ-నీయొక్క, స్తన్యం-చనుబాలు, హృదయతః-హృదయము నుంచి (అనుగ్రహముతో), పయః పారావారః-క్షీర ప్రవాహమై, సారస్వతమివ-సారస్వతమువలె, పరివహతి-ప్రవహించుచున్నది, మన్యే-తలంతును, దయావత్యా-కృపగలనీచేత, దత్తం-ఇవ్వబడిన, తవ-నీయొక్క, యత్‌-ఏ స్తన్యమును, ఆస్వద్య-త్రావి, ద్రవిడశిశుః-ద్రవిడ శిశువు, ప్రౌఢానాం కవీనామ్‌-మహాకవులలో, కమనీయః కవయాతా-మంచికవి, అజని-అయోనో.

పుట 74. ''ఉమాకోమల''

ఉమా కోమల హస్తాభ్యామ్‌-పార్వతీదేవి సుకుమార హస్తములచే, సంభావిత లలాటకం-గౌరవింపబడిన లలాటముకల, హిరణ్యకుణ్డలం-బంగారు! కుండలముల ధరించిన, పుస్కరస్రజం-పద్మమాలవేసికొని, కుమారం-కుమారస్వామిని, వందే-నమస్కరించుచున్నాను.

పుట 75. ''అత్వున్నతస్య''

అత్యున్నతస్య-మిగల ఎతైన, కావ్యద్రువ్యాసాచల మహీరుహః-వ్యాసాచలంమీద కావ్య వృక్షముయొక్క, అర్థ ప్రసూనాని-అర్థములనే పుష్పములను, అదాతుః-గ్రహించుటకు, అహం అసమర్ధః-నేను అసమర్ధుడను, అద్భుతమ్‌-అద్భుతము.

పుట 77. ''ఆప్రాచః''

ద్రుహిణ సుతన దప్లావితాద్‌-బ్రహ్మపుత్ర ప్రవహించు, అప్రాచఃకామరూపత్‌-తూర్పున అస్సాము ఎల్లగా, సింధు సాంద్రాత్‌ ప్రతీచః ఆ గాంధారాత్‌-పడమట సింధునదము ప్రవహించు గాంధారదేశము హద్దుగా, అవాచః రఘువర చరితాత్‌-దక్షిణమున శ్రీరామునిచే సంచరింపబడిన, ఆసేతోః-సేతువువరకు, ఉదీచః-ఉత్తర దిక్కున, తుహిన గహనతః కేదారాత్‌-హిమవత్పర్వతము అవధిగా, విద్వత్సమాజాఃయే యేసన్తి-ఏ ఏ పణ్డిత ప్రకాణ్డులు కలరో, తన్‌-వారిని, ఏషయన్నః-ఈ యత్నము, సుఖయతు-సుఖము కలిగించుగాక, సమజాన్‌-పశుతుల్యులను, చమత్కర్తుం-ఆనందింప చేయుటకు, కః-ఎవ్వడు, ఈష్టే-సమర్దుడగును.?

పుట 78. ''శ్రీరామంప్రతి''

శ్రీరామం ప్రతి-శ్రీ రాముని ఉద్ధేశించి, పుష్కరాభిధ మహాయక్షేణ-పుష్కరుడనుపేరుగల యక్షునిచే, వేదత్రయ వ్యాఖ్యానావసరే-మూడు వేదముల సారమును వ్యాఖ్యానించు సంద్భమున, శ్రీ విష్ణుధర్మోత్తరే-శోభాయుక్తమగు విష్ణు ధర్మోత్తర గ్రంథమున, విశిష్యకధితం-విశేషించి చెప్పబడినది, సుదుఘాం-చక్కగా పాలుపితుకునట్టి, ఏతాంధేనుం-ఈ ఆవును, ఉపహ్వయామి-చేరదీయుదును, ఇత్యుద్గతం-అని అవతరించిన, శఙ్కరాచార శిష్య చతుష్టయేన సహితం గురుణాం గురుంవందే-నలుగురు శిష్యులతో కూడిన, గురువులకు గురువగు శంకరాచార్యులను నమస్కరించెదను.

పుట 79. ''వరేష్వతీతేషు''

షట్సు శ##కేష్వర్సేషు అతీతేషు - ఆరు శక వరములు గడువగా, తిష్యే-కలియుగమున, భువి-భూలోకమున, అవతీర్ణం-అవతరించిన, శిషై#్యః చతుర్భిః సహితం-నలుగురు శిష్యులతో కూడిన, శివాదిపారం పరీకావధిం-శివుడు మొదలుగా గురుపరం పరకు అవధియగు, శంకరార్యం ఆనమాయః శఙ్కరులకు నమస్కారము చేయుదుము.

పుట 79. ''స్వశాఖో''

యతిః-సంన్యాసి, స్వశాఖో పనిషత్‌-పూర్వాశ్రమశాఖో పనిషత్తును, గీతాః-భగవద్గీతను, విష్టోర్నామసహస్రకం-విష్ణు సహస్రనామమును, శ్రీ రుద్రం-రుద్రపారాయణమును, పౌరుషం సూక్తం-పురుషసూక్తమును, నిత్యం-ప్రతిదినము, ఆవర్తయేత్‌-పారాయణము చేయవలయును.

పుట79. ''భగవద్గీతా''

భగవద్గీతా-భగవద్గీత, కిఞ్చదధీతా-కొంచెము చదువబడినను, గంగాజలలవ కణికాపీతా-గంగా జలము కొంచెము త్రాగబడినను. (పాపం పరిహరింపబడును)

పుట81. ''విద్యాసుశ్రుతి''

విద్యాసు-విద్యలలో, శ్రుతిః-వేదవిద్య, ఉత్కృష్టా-గొప్పది, శ్రుతా-వేదమున, రుద్రైకాదశనీ-ఏకాదశరుద్రము (నమకము), తత్ర పంచాక్షరీ-అందులో పంచాక్షరి (నమః శివాయ), తస్యాం-దానిలో, శివ ఇత్యక్షరద్వయం-శివ అను రెండు అక్షరములు

ప్రశస్తములు.

పుట 81. ''నమఃకపర్దినే''

కపర్దినేనమః-జటలు ధరించిన వానికి నమస్కారము, వ్యప్తకేశాయ-ముండిత శిరస్కుడగు శంకరాచార్యులకు నమస్కారము.

పుట 81. ''ఇతిహాస''

ఇతిహాస పురాణాభ్యాం-రామాయణ భారతాది ఇతిహాసములవలనను పురాణములవలనను, వేదం-వేదమును, సముప బృంహాయేత్‌-అర్ధవిశదాకరణ చేసి కొనవలయును, ఆల్పశ్రుతాత్‌-అల్పజ్ఞుని వలన, వేదః బిభేతి-వేదము భయపడును, (ఎందుకనగా) మాం అయం ప్రతరిష్యతి-వీడునన్ను మోసగించును, మరియొక రీతిగా అర్థము చెప్పును. అని

పుట 81. ''చతుర్భిః''

చతుర్భిః శిషై#్యః సహ-నలుగురు శిష్యులతో, శంకరః-శంకరురు (శివుడు) అపతరిష్యతి-అవతరించగలడు.

పుట81. ''వ్యాకుర్వన్‌''

వ్యాససూత్రార్థం-బ్రహ్మసూత్రములకు అర్థమును, వ్యాకుర్వన్‌-వ్యాఖ్యానము చేయుచు, శంకరః-శంకరుడు, శ్రుతః అర్థం యధా ఊచివాన్‌-వేదమునకు అర్థమును ఎట్లు చెప్పెనో, సఏవ-అదియే, శ్రుతేః-శ్రుతికి, న్యాయః అర్థః-న్యాయమైన అర్థము.

పుట 81. ''కరిష్యత్యవతారాణి''

నీలలోహితః శంకరః-పరమశివుడు, భూతానాం హిత కామ్యయా-ప్రాణి హితముకోరి, శ్రౌతస్మార్త ప్రతిష్టార్థం-శ్రౌతస్మార్త ధర్మముల ప్రతిష్టించుటకై, అవతారాణి కరిష్యతి-అవతరించగలడు.

పుట 82. ''శివేరుష్టే''

శివేరుస్టే-శివునికి అపచారము చేసి రోషము తెప్పింపగా, గురుః త్రాతా-గురువు రక్షించును. గురువునకు కోపము వచ్చిన, నకశ్చన-ఎవడును రక్షకుడులేడు.

పుట 82. ''అజ్ఞానాంతర్గహన''

అజ్ఞానాంతర్గహన పతితాన్‌-అజ్ఞానమనెడి కారడవిలోబడి, భవదన శిఖాతాపపాపఛ్యమానాన్‌-సంసారమనెడి దావాగ్ని జ్వాలతాపముచే ఉడికిపోవుచున్న, లోకాన్‌-లోకములను (ప్రాణులను), ఆత్మవిద్యోపదేశైః-ఆత్మజ్ఞానోపదేశములచే, త్రాతుం-రక్షించుటకు, మౌనం ముక్త్వా-మౌనమునువీడి, వటవిటపినో మూలతః నిష్పతన్తీ-మఱ్ఱిచెట్టు మొదట నుండి కదలివచ్చిన, శంభోఃమూర్తిః-శివుని మూర్తి, శంకారాచార్యరూపా-శంకరాచార్యరూపముగా, భువనే చరతి-లోకమున సంచారము చేయుచున్నది.

పుట 83. ''నమఃశంభ##వేచ''

శంభ##వే-నిత్య సుఖమునకు స్థానమగు శివునికొరకు, నమః-నమస్కారము, మయోభ##వేచనమః-సుఖస్వరూపునికి నమస్కారము, శం మయః-అను రెండు పదములు సుఖార్ధకములు, అయినను ఒకటి దుఃఖోపశమలక్షణమగు సుఖమును-రెండవది భావరూప సుఖములు బోధించును, నమఃశఙ్కరాయచ మయస్కరాయచైహిక సుఖమును ఆముష్మిక సుఖమునిచ్చు శివునకు నమస్కారము, నమః శివాయచ శివతరాచ-కల్యాణరూపునకు మఙ్గళ కరస్వరూపునకు నమస్కారములు.

పుట 89. ''దుర్భిక్షం దేవలోకేషు''

దేవలోకేషు-దేవతలు నివసించు పై లోకములలో, దుర్భిక్షమ్‌-కఱవు, మనూనామ్‌-మనుసంతతివారగు మానవులకు, ఉదకం గృహం-నివాసస్థానము సుభిక్షము, సర్వసమృద్ధము.

పుట 132. ''సతాం హి సందేహ పదేషు''

సతాం-సజ్జనులకు, సందేహ పదేషు వస్తుషు-సంశయా స్పదములకు విషయములందు అంతఃకరణప్రవృత్తయః-మనస్సుయొక్క పోకడలు, ప్రమాణం మి-ప్రమాణముకదా!.

పుట 143. ''వేదో2ఖిలో ధర్మమూలం''

ధరమూలం-ధర్మమునకు మొదటి ప్రమాణము. అఖిలఃవేదః-సమస్తమైన వేదము అయియున్నది, తద్విదాం-ఆ వేదవేత్తలయొక్క, స్మృతిశీలేచ-స్మృతిగ్రంథము, వారి నడువడియు, ప్రమాణము, ఆ తరువాత, సాధూనాం-శిష్టులయొక్క, అచారశ్చఏవ-ఆచారమును, ఆత్మనః తుష్టిః ఏవచ-మనస్సంతుష్టియు ప్రమాణములు.

పుట 96. ''బ్రహ్మసూత్ర పదైశ్చ''

క్షేత్రక్షేత్రజ్ఞయాధ్యాత్మ్యము, ఋషిభిః-వశిష్ఠాది మహరులచే, బహుధా-అనేక విధములుగా, గీతం-చెప్పబడినది, వివిదైః-నానా విధములగు, ఛందోభిః-ఋగాదివేదములచే, పృథక్‌-వివేచన చేయబడినది, ముతుమద్భదిః-యుక్తి యుక్తములగు, బ్రహ్మసూత్రపదైశ్చైవ-బ్రహ్మసూత్రపదములచేతను, వినిశ్చితం-నిశ్చయింపబడినది.

పుట 99. ''స విజయతి''

కవితాశ్రిత కాళిదాస భారవికీర్తిః-కవిత్వమున కాళిదాస భారవులకు సమానమైనకీర్తిగల, సః రవికీర్తింః - ఆ రవి కీర్తి, విజయతి - సర్వోత్కరతో ఉన్నాడు.

పుట 102. ''సర్వ వంద్యేన''

సర్వవంద్వేన్య-అందఱికి నమస్కరింపదగినవాడను, యతినా-సన్యాసిచే, ప్రసూః-తల్లి, సాదరం-ఆదరముతో, వంద్యాహి-నమస్కరింప దగినది కదా!

పుట 102 ''భిక్షాప్రదా''

విరక్తస్య-వైరాగ్యము కలవానికి (సన్యాసికి), భిక్షాప్రదాః-భిక్ష యిచ్చినవారే, జన్యః-తల్లులు, గురవః-జ్ఞానోపదేష్టలే, పితరః-తండ్రులు, శిష్యాః-శిష్యులే, కుమారకాః-కుమారులు, ఏకాన్త రమనహేతుః-ఏకాన్తమున ప్రీతికి కారణమగు, శాన్తిం-శాన్తిమే, దయితా-ప్రియారాలు.

పుట 103. ''భవతి!భిక్షామ్‌''

హ భవతి-ఓ పూజ్యురాలా! భిక్షాందేహి-భిక్షను ఇమ్ము.

పుట 105. ''శంకరః శంకరః సాక్షాత్‌''

శఙ్కరః-శఙ్కరాచార్యులు, సాక్షాత్‌ శఙ్కరః-సాక్షాత్‌ శంకరావతారము, వ్యాసః-వ్యాసులవారు, స్వయం నారాయణః-నారాయణావతారము, తయోః-వారిరువురికి, వివాదే సంప్రాస్తే-వాగ్వాదము వచ్చినపుడు, కింకరః అహం-కింకరుడనగు నేను, కిం కరోమి-ఏమిచేయుదును.

పుట 113. ''అన్నమయా''

ద్వివజర!-బ్రాహ్మణోత్తమా! అన్నమయాద్‌ అన్నమయం-శరీరమునుండి శరీరమును, అధవా - అట్లు కానిచో, చైతన్యాత్‌ చైతన్యమేవ-చైతన్యము నుండి చైతన్యమునే, దూరీకర్తుంకింవాఞ్ఛసి?-దూరముగా చేయుటకు కోరుచున్నావా?, గచ్ఛ గచ్ఛ ఇతి-దూరముగా పొమ్ము పొమ్ము అని కోరుచున్నావే, బ్రూహి-చెప్పుము.

పుట 113. ''విద్యా వినయ''

విద్యావినయ సంపన్నే బ్రహ్మణ-విద్యావినయములతో ఒప్పిన బ్రాహ్మణునందు, గవి-గోవుయందు, హస్తని-ఏనుగునందు, శుని-కుక్కయందు, శ్వపాకే-కుక్క మాంసముతిను వానియందు, పణ్డితాః-జ్ఞానులు, సమదర్శనః-సమదృష్టిగలవారు.

పుట 115. ''జాగ్రత్స్యప్న''

జాగ్రత్స్యప్న సుషుప్తిషు-మెలకువ, స్వప్నము, గాఢనిద్ర అను మూడు అవస్థలలో, స్థిరతరా-ఏకా కారముగా నిలచినదై, యానంవిదం-ఏ చైతన్యము, ఉజ్జృంభ##తే-ప్రకాశించుచున్నదో, యా-ఏ చైతన్యము, బ్రహ్మాది పిపీలికాంత తనుషు-బ్రహ్మ మొదలుకుని చీమవరకు ఉన్న శరీరములందు, ప్రోతా జగత్సాక్షిణీ-నెలకొని, జగత్తునకు ప్రకాశముగా ఉంటుంన్నదో!.

పుట 118. ''యత్సౌఖ్యాంబుధి''

యత్సౌఖ్యాంబుధి లేశ##లేశతః-ఏ ఆత్మానన్ద సముద్రలేశ##లేముచే, ఇమేశక్రాదయః-ఈ దేవేంద్రాదులు, నిర్వృతాః-తృప్తిగాంచిరో, నితరాం ప్రశాస్తకలనే చిత్తే-మిక్కిలి ప్రశాంతమగు చిత్తమున, యత్‌ లబ్ధ్యా-దేనిని పొంది, మునిఃనిర్వృతః-ముని సంతుష్టుడగునో, యస్మిన్నిత్యసుధాంబుధౌ- అమృత సముద్రమున, గలితధీః-మునిగిన బుద్ది గలవాడు, బ్రహ్మైవ-సాక్షాత్‌ బ్రహ్మయే అగునో, నబ్రహ్మవిద్‌-బ్రహ్మను తెలిసికొనినవాడు కాడో, యః కశ్చిత్‌ సః-వాడెవ్వడైనను సరే!, సురేంద్రవందితపదః-దేవతా శ్రేష్ఠులచే నమస్కరింపబడిన పాదములు గలవాడు, నూనంమనీషామమ-నిశ్చయముగా ఇది నా అభిప్రాయము.

పుట 125. ''నకదాచిత్‌''

కదాచిత్‌-ఎప్పుడును, జగత్‌-జగత్తు, అనీదృశం న-ఇట్టిది కాకపోదు-(ప్రళయమురాదు).

పుట 126. ''అకరణ''

అకరణ-చేయనిచో, ప్రత్యవాయ జనకం-అనర్ధము కలుగచేయునది, కరుణ-చేసినచో, అభ్యుదయం-అన్ని విధముల అభివృద్ది.

పుట 127. ''జాయమానో''

జాయమానః-పుట్టుచున్న, బ్రహ్మణుడు, త్రిభిః ఋణవాన్‌ జాయతే-మూడింటిచే ఋణవంతుడగును, బ్రహ్మచర్యేణ-నియమపూర్వక వేదాధ్యమునముచే, ఋషిభ్యః-ఋషుల కొరకు, యజ్ఞేన దేవేభ్యః-యజ్ఞముచే దేవతలకొరకు, ప్రజయా పితృభ్యః-సంతానముచే పితరుల కొరకు(ఋణము తీర్చవలసినవాడు).

పుట 127. ''కుర్వన్నేవ''

ఇహ-ఈలోకమున, కర్మాణి కుర్వన్నేవ-కర్మలను చేయునచే, శతం సమాః-నూరు సంవత్సరములు, జిజీవిషేత్‌-జీవింప కోరవలయును.

పుట 127. ''వీరహ''

యః-ఎవడు, అగ్నిం ఉద్వాసయతే-అగ్నిని విడిచి పెట్టునో, ఏషవీరహా-ఇతడు వీరహత్యా పాతకము చేసినవాడును.

పుట 128 ''ప్రవృత్తిర్వా''

ప్రవృత్తిః-వా-ఒక పనియందు ప్రవర్తించుటకానీ, నివృత్తిఃవా-ఒక పని నుండి మరలుటకానీ, నిత్యేన-వేదశబ్దము చేతకానీ, కృతకేనవా-లౌకిక శబ్దములచేత కానీ, పుంసాం-మానవులకు, యేన-దేనిచేత, ఉపదిశేత-ఉపదేశింపబడునో, తద్‌-అది, శాస్త్రం-శాస్త్రమని, అభిదీయతే-చెప్పబడును.

పుట 129. ''బర్హిషి రజతం నదేయ''

బర్హిషి-యజ్ఞమున, రజతం-వెండి, నదేయం-ఇవ్వరాదు.

పుట 130. ''స్వతః ప్రమాణం''

యత్ర-ఎచట, ద్వారస్తనీడాన్తర సంనిరుద్ధాః-గృహ ద్వారామందు పంజరబద్ధములైన, కీరాంగనాః-ఆడచిలుకలు, స్వతః ప్రమాణం పరతః ప్రమాణం-వేదములు స్వతః ప్రమాణమా? పరతః ప్రపమాణములా అని, గిరం వదన్తి-మాటలాడునో, తద్‌-అది, మణ్డన పణ్డితౌకః-మణ్డన పణ్డితుని గృహముగా, జానీహి-తెలిసికొనుము.

పుట 131. ''నాహం గంగా''

అహం గంగా న-నేను గంగనుకాను, కిస్తు-ఇకనేమన, గంగేశ మిశ్రః-గజ్గేశ పండితుడను.

పుట 132. ''నమః ప్రామాణ్య''

మత్కవిత్వా పహారిణ-నా కవిత్వమును హరించిన, ప్రామాణ్యవాదాయ-ప్రామాణ్య వాదమునకు, నమః-నమస్కారము.

పుట 132. ''అప్రామాణ్య''

అప్రామాణ్యగ్రహాస్కందితజ్ఞానం-జ్ఞానం ఆవిర్భవించే దశయందే, ఇది అప్రమాణం అని తెలిసి ఏర్పడినజ్ఞానం.

పుట 137. ''సర్వంకర్మాఖిలం''

సర్వంకర్మ-కర్మఅంతయు, జ్ఞానే-జ్ఞానమునందు, పరిసమాప్యతే-పరిసమాప్తి నొందును.

పుట 138. ''ఆనందో బ్రహ్మేతి''

ఆనందః-ఆనందము, బ్రహ్మ ఇతి-పరమాత్మ అని, వ్యజానత్‌-తెలిసికొనెను.

పుట 142 ''అభయం''

మత్తః-నావలన, సర్వభూతేభ్యః-అన్ని ప్రాణులకు, అభయం-భయము లేకుండుట.

పుట 146. ''విధితాఖిల''

విదితాఖిల శాస్తృసుధాలదే! సర్వశాస్త్ర సుధాసముద్రా! మహితోపనిషత్కధితార్థనిధే!-ఉపనిషద్వ్యాఖ్యాన చతురధీనిధీ! విమలం చరణం-స్వచ్ఛమైన (మీ) పాదమునకు, హృదయే కలయే-మనస్సునందు భావించెదను, శంకరదేశిక!-శఙ్కరాచార్యా! మే శరణం భవ-నాకు రక్షకుడవు కమ్ము.

పుట 146. ''కరుణావరుణాలయ''

కరుణావరుణాలయః-దయాసముద్రా! భవసాగర దుఃఖ విదూనహృదంమాం-సంసార సముద్రదుఃఖ తప్తహృదయుడగునన్ను, పాలయ-రక్షింపుము, అఖిల దర్శన తత్త్వ విదంరచయ-నన్ను అన్ని దర్శనముల తత్త్వమును తెలిసిన వానిగాజేయుము.

పుట 146. ''భవతాజనతా''

భవతా-నీ చేత, జనతా-జన సమూహము, సుహితా భవితా-హితము పొందగలదు, నిజభోద విచారణ చారుమతే-ఆత్మబోధ విచారణచే మనోజ్ఞమైన బుద్ధిగలవాడా, ఈశ్వర జీవవివేక విదలయ-నన్ను జీవేశ్వర స్వరూపగ్రహణ సమర్ధునిగా జేయుము.

పుట 146. ''భవఏవ''

భవాన్‌ భవఏవ-నీవు సాక్షాత్‌ శంకరుడవే, ఇతి-అని, మేచేతసి-నా మనస్సులో, నితరాం-మిక్కిలి, కౌతుకతా-కుతుహలముతో, సమజాయత-కలిగెను, మమమోహ మహాజలధిం-నా మోహమనెడి మహాసముద్రమును, వారయ-వారింపుము.

పుట 146. ''సుకృతే''

సుకృతే2ధికృతే-అధికారియగు పుణ్యాత్మునందు, భవతః-నీయొక్క, సమదర్శనలాలసతా-సమదర్శనప్రీతి, భవితా-కాగలదు, అతిదీనం ఇమంమాం పరిపాలయ-మిక్కిలి దీనడనగు, ఈ నన్ను రక్షింపుము.

పుచ 147. ''జగతీమవితుం''

జగతీం అవితుం-లోకరక్షణార్ధమై, కలితాకృతయా-ఆకారముల ధరించి, మహామహసః-మహానుభావులు, ఛలతః-వాజ్యముతో, విచరంతి-సంచరింతురు, గురో! అత్ర-ఇచట, అహిమాంశురివ-సూర్యునివలె, విభాసి-ప్రకాశించుచున్నావు.

పుట 147. ''గురుపుంగవ''

గురుపుఙ్గవ-గురుశ్రేష్ఠా, పుంగవకేతన-వృషధ్వజా, కో2పి సుధీః-ఎంత బుద్ధిశాలియుకూడా, తేసమతాం-నీ సమత్వమును, న అయతాం హి పొందుడు కదా, శరణాగత వత్సలా! తత్త్యనిధే!

పుట 147. ''విదితానమయా''

మయా-నాచేత, విదితా-తేదిగా, ఏకకలా-ఒక విద్యకూడా, నవిదితా-నేర్వబడలేదు, గురో! కించన కాఙ్చనం-కొద్ది బంగారముకూడ నా వద్ద, నాస్తి-లేదు, సహజం కృపాం-సహజమగు దయను, ద్రుతమ్‌ ఏవ-శీఘ్రముగానే, విదేహి-చేయుము.

పుట 148. ''త్వత్ర్పభుజీవ''

చేతోభృఙ్గ!-చిత్తభ్రమరమా, త్వత్ర్పభు జీవప్రియమిచ్చసిచేత్‌-నీకు ప్రభువగు జీవునకు ప్రియమాచరింపతలచినచో, నరహరిపూజాం-శ్రీ నృసింహపూజను, సతతంకురు-ఎల్లపుడు చేయుము, ప్రతి బింబాలంకృతిదృశికుశలః-ప్రతిబింబమునకు అలంకరించు విద్య నేర్చినవాడు, బింబాలం కృతిం అతనుతే-బింబమునకు అలంకారము చేయునుగదా!, విరసాయాం భవమరుభూమౌ-విరసమగు సంసారమనెడి చవిటినేలయందు, వృధాభ్రమసి-వ్యర్ధముగా తిరుగుచున్నావు, లక్ష్మీనరసింహా నఘపదసరసిజ మకరందం-శ్రీ లక్ష్మీనరసింహ పాదారవింద మకరందమును, భజభజ-సేవింపుము సేవింపుము.

పుట 149. ''ఘటోవామృత్పిండో''

ఘటోవా-కుండకానీ, మృత్పిండఃఅపి-మట్టిసుద్దయు, అణుః-అణువు, అపిచమణియు, ధూమః-పొగ, అగ్నిఃనిప్పు, అచలః-పర్వతము, పటఃవా-వస్తృముకానీ, తంతుర్వా-నూలుకానీ, కింఘోరశమనం పరిహరతి-భయంకరుడగు కాలుని అడ్డుకొనగలవా?, తరసా-వేగముతో, తర్కవచసా-తర్కవాక్యములచే, వృధాకంఠక్షోభం వహసి-వృధాగా కంఠక్షోభపడుచున్నావు. సుధీః-బుద్ధిశాలీ, శంభో-పదాంభోజంభజ-శివుని పాదారవిందముల భజింపుము, పరం సౌఖ్యంవ్రజ-పరమసౌఖ్యమును పొందుము.

పుట 147. ''సంప్రాప్తేసన్నిహితే''

సంప్రాప్తే సన్నిహితే-కాలము ఆసన్నమైనపుడు, ''డుకృఞ్‌ కరణ''-వ్యాకరణము, నహినహిరక్షతి-రక్షిపదు.

పుట 150. ''కాలకాల''

కాలకాలం-మృత్యుంజయుని, ప్రపన్నానాం-శరణుపొందిన వారికి, కాలఃకిన్ను కరిష్యతి-యముడేమి చేయగలడు?.


Jagathguru Bhodalu Vol-7        Chapters        Last Page