Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

శ్రీ భగవద్గీతా మథనము

శ్రీ

మహాభాగవత నవనీతము

ప్రథమ భాగము

గ్రంథ కర్త:

మామిళ్ళపల్లి నరసింహం,

B.sc.,(Hons), B.Ed.,

రసాయనశాస్త్ర ప్రధాన అధ్యాపకులు (రిటైర్డ్‌)

అనంతపురం. (ఆం. ప్ర.)

జనవరి 1989

వెల: రూ. 40.00

SRI BAGAVADGITA MATHANAMU

SRI MAHABHAGAVATA NAVANITAMU

by

Sri Mamillapalli Narasimham

ప్రథమ ముద్రణ: జనవరి 1989

సర్వస్వామ్యములు గ్రంథకర్తవే

ముఖపత్ర చిత్రీకరణ :

శ్రీ వెంకటేశ్వరరావు, కొడిగెనహళ్ళి - హిందూపురం.

ముద్రణ :

లేపాక్షి ఆర్ట్‌ ప్రింటర్స్‌, 3&4 శ్రీనివాస బిల్డింగ్స్‌,

పెనుకొండ రోడ్‌, హిందూపురం - 515 201 (ఎ.పి.)

This book is published with the

financial assistance by

Tirumala-Tirupati Devasthanams

under the scheme

"AID TO PUBLISH RELIGIOUS BOOKS"

Rs. 10,000-00

and also by Telugu University, Hyderabad.

Rs. 1000-00

సహృదయ సహకారము

ఈ గ్రంథ ప్రచురణకు తోడ్పడిన ఇతరదాతలు :

శ్రీ కె. రాధాకృష్ణయ్యగారు రూ. 1000-00

శ్రీ పి. ఎల్‌. ఎన్‌. రెడ్డిగారు 1000-00

శ్రీ సుంకప్పగారు, మండల్‌ ఆఫీసర్‌ 716-00

శ్రీ కొత్తూరు ఆర్యవైశ్య సంఘం, అనంతపురం 500-00

శ్రీ పాతూరు ఆర్యవైశ్య సంఘం, అనంతపురం 500-00

శ్రీ మేడా సుబ్బయ్యగారు 500-00

శ్రీ మేడా సుబ్రమణ్యంగారు 500-00

శ్రీ బసయ్యగారు 250-00

సర్వశ్రీ రూ.116/-లు ఇచ్చిన దాతలు

పరచూరి కృష్ణమూర్తిగారు తాళంకి కృష్ణమూర్తి గారు

బి. రామచంద్రన్‌గారు #9; కామర్తి బసణ్ణగారు

స్వామి కె. సి. వెంకటసుబ్బయ్యగారు #9; సింగనమల శంకరయ్యగారు

నల్లయ్యగారి గోపాలయ్యగారు గార్లదిన్నె ఓబన్న గౌడుగారు

పట్టాభిగారు ఎల్లనూరు ప్రకాశంగారు

మరియు శ్రీ కె. రామయ్యగారు-రూ.58-00

వినుతి

శ్లో|| సత్యజ్ఞాన సుఖస్వరూప మమలం క్షీరాబ్ధి మధ్యే స్థితం

యోగారూఢ మతిప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం

త్య్రక్షం చక్ర పినాకసా7భయవరాన్‌ బిభ్రాణ మర్కచ్ఛవిం

ఛత్రీభూత ఫణీంద్ర మిందు ధవళం లక్ష్మీనృసింహం భ##జే.

శ్లో|| సుధావల్లీ పరిష్వంగ సురభీకృత వక్షసే

ఘటికాద్రి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం||

A man would do nothing, if he waited until

he could do it so well that no one could find

fault with what he has done.

-Cardinal Newman

"అపశబ్ధంబుల గూడియున్‌ హరి చరిత్రాలాపముల్‌ సర్వపాప పరిత్యాగము సేయు" _పోతన

భాగవతము 1-97

అంకితం

శ్రీ ఘటికాచల లక్ష్మినరసింహస్వామి వారికి

అట్టమీది బొమ్మ

హరిహనాథుడు - రాజశేఖరుడు

బమ్మెర పోతన గృహదైవము శివుడు. అతని తలిదండ్రులు శివభక్తులు. అన్నయు శివభక్తుడే. ఒకనాడు పోతన ఈశ్వరధ్యానము సేయుచున్నప్పుడు "రాజశేఖరు" డగుపించెనట. "రాజ" అనగా చంద్రుడు, "శేఖరు" డనగా శిరమునందు కలవాడు. అందువలన చంద్రశేఖరుడైన శివుడు ఈశ్వరధ్యానము సేయుచున్న పోతన కగుపించెనని భావించవచ్చును.

కాని రాజశేఖర పదమునకు రాజులలో శ్రేష్ఠుడను అర్థముకూడ చెప్పుటకు వీలగుచున్నది. పోతనకు దర్శనమిచ్చిన రాజశేఖరుడు (రాజశ్రేష్ఠుడు) శ్రీరాముడు. "ఏను రామభద్రుండ, మన్నామాంకిత మగు కావ్యంబు రచింపు"మని రాముడు ఆదేశించెను. ఆ విధముగనే పోతన భాగవతమును రచించి శ్రీరామునకంకితము చేసినను శ్రీకృష్ణపరముగా భాగవతమున షష్యంతములు వ్రాసెను. శ్రీకృష్ణుడర్జునకు గీత నుపదేశించెను.

గమనింపదగిన దేమనగా శివకేశవ భేదము పాటింపక తిక్కనహరిహరనాథుని భావించినట్లే పోతన శివరామకృష్ణమూర్తి యగు రాజశేఖరుని భావించి అభేదభక్తి వ్యక్త పరచెను.

అట్టమీద బొమ్మ అభేదభక్తికి తార్కాణమగు రాజశేఖరుని సూచించుచున్నది.

"ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి"

విన్నపము

భగవత్తత్త్వార్థ ప్రతిపాదనమున గీతకు పిమ్మట భాగవతమని ఒక ''కవిత్వవేది'' (శ్రీ కల్లూరు వెంకటనారాయణరావుగారు) తాము రచించిన వాఙ్మయ చరిత్రలో తెలిపిరి. ఆ దృష్టితో భగవద్గీతను భాగవతమును పరిశీలించి. వేదోపనిషత్తుల సారమైన భగవద్గీతను సూత్రప్రాయమైన శాస్త్రముగను (Theory), వాఙ్మయావతారమైన భాగవతమును గీతలోని సూత్రములను భాగవతు లాచరణలో పెట్టిన జీవన విధానముగను (Practical) గమనించితిని.

శ్రీ గోపాలకృష్ణుడు గీతామృతమను దుగ్థమును, అర్జునుడను లేగదూడ సహాయమున పితికెను. ఆ పాలను మధింపగా భాగవతభక్తి నవనీతము లభించెను. దానిని పాఠకుల కందింప ప్రయత్నించితిని.

హిందూధర్మము శ్రుతి స్మృతి పురాణోక్తమగుటచేత వేదములకు ఉపనిషత్తులకు పురాణాలకు ఏకవాక్యత కలదని నిరూపించితిని.

పురాణ కథలకు సంకేతార్థములు తెలియక తప్పులెన్ను వారికి కనువిప్పు కలిగించి సంశయ నివృత్తి చేసితిని.

పండితులకును, పామరులకును, పరిశోధకులకును, విమర్శకుల కును, అన్ని మతములవారికిని, సంస్కృతమున వేదాంత గ్రంథము లను చదివి గ్రహింపజాలని వారికిని, భగవత్తత్త్వమును భక్తి రహస్యమును సరళ##మైన భాషలో అందించితిని. నాస్తికత ప్రబలిన ఈ కాలములో ఆస్తికత పెంపొందించి హిందూధర్మ రక్షణకు తోడ్పడ ప్రయత్నించితిని.

ఒరులు తప్పులు పట్ట వీలులేనట్లు వ్రాయవలెనన్న ఆ రచన

Sri Bhagavadgeetha Madanam-1    Chapters