Sri Ramacharitha    Chapters   

తొలి పలుకు రమారమి నాలుగువందల సంవత్సరములకు పూర్వము గోస్వామిచే గానముచేయబడిన మానసము విశ్వ విఖ్యాతి చెందినది.
బాలకాండ వర్ణముల వాని అర్థజాలముల, రసముల, ఛందస్సుల, మంగళముల కర్తలగు వాణీ వినాయకులకు వందనమొనర్తును.
అయోధ్యకాండ

వామ అంకమున పర్వతరాజపుత్రి, శిరమున గంగ, లలాటమున బాలచంద్రుడు, గళమున గరళము, వక్షస్థలమున సర్పరాజు శోభించు భస్మవిభూషణుడు, సురవరుడు, సర్వాధిపుడు, సంహారకర్త, సర్వవ్యాపకుడు, శివుడు, శశిసన్నిభుడు, శ్రీ శంభుడు సర్వదా నన్ను రక్షించుగాత !

అరణ్యకాండము [ధర్మవృక్షమునకు మూలము, వివేక సాగరమునకు ఆనందప్రదుడగు పూర్ణ చంద్రుడు, వైరాగ్యకమలమునకు భాస్కరుడు, పాపమును ఘోరాంధకార విధ్వంసకుడు, తాపత్రయహరుడు, మోహరూప మేఘజాలమును విచ్ఛిన్నమొనర్చి  
కిష్కింధాకాండము

మల్లెపూవువలె, నీలకమలమువలె నుందరులు, అతిబలులు, విజ్ఞానధాములు, శోభాఢ్యులు, వరధనుర్ధారులు, వేదసన్నుతులు, గోబ్రాహ్మణప్రియులు, మాయామానుషరూపధారులై, సద్ధర్మకవచ స్వరూపులై, లోకహితులై, పీతాన్వేషణ తత్పరులై పథికులైన, రామలక్ష్మణు లిరువురు మాకు భక్తిని ప్రసాదింతురుగాక !

xసుందరకాండ

శాంతుడు. శాశ్వతుడు, అవ్రమేయుడు, పాపరహితుడు. మోక్షరూప శాంతి ప్రదాత, నిరంతర బ్రహ్మ శివ శేషసంసేవ్యుడు, వేదాంతవేద్యుడు, విభుడు. సురగురుడు, మాయామానవ స్వరూపుడు, శ్రీహరి, కరుణాకరుడు, భూపాలచూడామణి, రఘువరుడుఅగు రాముడను నామము కలిగిన జగదీశ్వరునికి నమస్కరింతును,

లంకాకాండము కామరిచే సేవింపబడువాడు, భవభయములను హరించువాడు, కాలమును మదగజమునకు సింహస్వారూపుడు, యోగీంద్రుడు, జ్ఞానగమ్యుడు, గుణనిధి, అజేయుడు, నిర్గుణుడు, నిర్వికారుడు, మాయాతీతుడు, సురేశ్వరుడు, ఖలవధనిరుతుడు,

ఉత్తరకాండము

నెమలి కంఠద్యుతినిపోలు నీలవర్ణుడు, సురవరుడు, విప్రపాదకమల చిహ్నములచే విలసిల్లువాడు, శోభాఢ్యుడు, పీతవస్త్రధారి, సరసజనయనుడు, సర్వదా సుప్రసన్నుడు, ధనుర్బాణపాణీ, కపిసమూహయుతుడు, సోదర పంపేవ్యమానుడు, రఘువరుడు, పుష్పకారూఢుడు, జనకీపతి అగు రఘువరునికి శ్రీరామునికి నమస్కరింతును.

Sri Ramacharitha    Chapters