Devi Kathalu         Chapters          Last Page

నివేదన

సృష్టిలోని అణువణువునా వ్యాపించి, సమస్త ప్రాణుల్లోనూ వ్యక్తమయ్యే చైతన్యమే పరాశక్తి. అలాంటి పరాశక్తికి నామరూపాలు లేవు. ఆ శక్తిని సాధకుడు తనకు నచ్చిన ఏదో ఒక రూపంలో భావిస్తాడు. నామరూపారకు అతీతమైన పరాశక్తిని సాధకుల సౌకర్యం కోసం అనేక నామరూపాలతో ప్రకాశిస్తూ, ఇష్టదైవాలుగా, అర్చామూర్తులుగా లోకంలో ప్రసిద్ధి పొందుతోంది. ఈ సత్యన్ని భారతీయ పురాణ వాఙ్మయం చక్కగా విశదీకరించింది.

మాతృమూర్తిగా స్త్రీ రూపంలో వ్యక్తమయ్యే పరాశక్తికి "దేవి" అని పేరు. ఆమె ''పంచకృత్య పరాయణ'' సృష్టి స్థితి సంహారాలు, తిరోధాన అనుగ్రహాలు ఆమె కార్యక్రమాలు.

''న మాతుః పరదైవతమ్‌'' అనే ఆర్యోక్తిని అనుసరించి భారతీయ సంస్కృతిలో దేవీ సమారాధన సంప్రదాయం రూపుదిద్దుకున్నది. అవాజ్యమైన ప్రేమ, వాత్సల్య, కారుణ్యాలకు, పవిత్రతకు మారు పేరు మాతృమూర్తి. అందుకే వేదకాలం నాటి ఋషులు దైవాన్ని తల్లిగా దర్శించారు. భక్తితో సేవించి, తరించారు. "మాతృదేవోభవ" అని కదా! శ్రుతివాక్యం.

పరతత్వాన్ని మాతృమూర్తిగా స్త్రీరూపంలో ఉపాసించే పద్ధతి వేదకాలం నుంచీ ఉన్నది. ఋగ్వేదంలో కన్పించే 'అదితి' సర్వలోక జనని, ఆమెను విశ్వధాత్రిగా, ముక్తి ప్రదాత్రిగా 'దేవీ సూక్తం' వర్ణిస్తోంది.

"అతః సంసారనాశాయ సాక్షిణీమాత్మరూపిణీం |

ఆరాధయేత్‌ పరాంశక్తిం ప్రపంచోల్లాస వర్జితాం||"

సంసారసాగరాన్ని తరించాలంటే ప్రపంచ విలాసాలకు అతీతమై నిలచిన ఆత్మస్వరూపిణి అయిన పరాశక్తిని ఆరాధించాలని "సూతసంహిత" వివరిస్తోంది.

"బ్రహ్మవిద్యా జగద్ధాత్రీ సర్వేషాం జననీ తథా|

యయా సర్వమిదం వ్యాప్తం త్రైలోక్యం స చరాచరమ్‌||"

సమస్త చరాచర జగత్తు అంతటా వ్యాపించి ఉన్న జగన్మాతయే బ్రహ్మా విద్యాస్వరూపిణి. అమెయే సర్వమునకూ మూలకారమ శక్తి- అని "దేవీమాహత్మ్యము" ప్రకటించింది.

కన్నతల్లి అందఱికి ఆరాధ్యదైవమే. జన్మనిచ్చిన తల్లికి గలస్థానం విశిష్టమైనది. సమస్త సృష్టికి జన్మనిచ్చిన 'తల్లులకు తల్లి' ఆయిన జగన్మాత బ్రహ్మాది దేవతలందఱికి అరాధ్యదైవం. ఈ దృక్పథంతో 'పరాశక్తి'ని విశ్వజననిగా, దేవిగా అభివర్ణించింది వ్యాసమహర్షి రచించిన "దేవీభాగవతము" సమస్త భువనాలకూ ఆధారమైన పరాశక్తి ప్రభావాన్ని సవిస్తరంగా వర్ణించిన పురాణం "దేవీభాగవతం" 18 వేల శ్లోకాలతో,12 స్కంధాలుగా వెలువడిన పురాణం ఇది.

దేవీ భాగవత టీకలో 'ఉపక్రమణిక' అందిస్తూ,

"ఆరాధ్యా పరమా శక్తిః సర్వైరపి సురాసురైః|
మాతుః పరతరం కించిన్నాధికం భువనత్రయే||

ధిగ్‌ధిగ్‌ధిగ్‌ ధిక్‌ తజ్జన్మ యోన పూజయతే శివాం|
జననీం సర్వజగతః కరుణారస సాగరామ్‌
"||

అని, కరుణారససాగర అయిన విశ్వజనని కంటె ఆరాధ్యదైవం లేదని, ఆమెను ఆరాధింపని వారి జన్మ వ్యర్థమని -నీలకంఠుడు నిష్కర్షగా నిర్ణయించాడు.

త్రిమూర్తులకు, త్రిశక్తులకు, అండ, పిండ, బ్రహ్మాండాలకు మూలమైన పరాశక్తి అద్భుత చరిత్రను వివరించిన పురాణం "దేవీభాగవతం".

ఈ పురాణంలో దేవి చరిత్రతోపాటు ఆమె అనుగ్రహానికి పాత్రులైన ఎందరో భక్తుల గాథలు, ఆమె సాగించిన దుష్టశిక్షణ వృత్తాంతాలు, ఆమె మహిమా విశేషాలు, ఆమె లీలావిలాస వైభవాలు, ఆమె నివాసస్థానము,ఆమె స్వరూప వివరణ, ఆమె అంశావతారాలు వివరాలు మొదలైన ఎన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. ఈ పురాణంలోని కొన్ని కథలను "దేవీకథలు" అనే పేరుతో సరళ##మైన వాడుక భాషలో అనువదించి, అందించే ఉద్ధేశంతో ఈ గ్రంథం వెలువడింది.

ఇందులో మొత్తం 18 కథలున్నాయి. దేవీశరన్నవరాత్రులలో ఉభయ సంధ్యలోనూ దేవీ పూజలలో ఒక్కొక్క కథ చొప్పున చదువు కోవడానికి వీలుగా 18 కథలను అందించడం జరిగింది. అంతేకాదు. ఆ దేవి అష్టాదశశక్తి పీఠాలలో సుప్రతిష్ఠిత అయింది కదా!అందుకు సంకేతంగా కూడ ఇందలి కథల సంఖ్యను భావించవచ్చు.

ఈ కథలను చదువుకొనే వేళలో మన మనస్సులలో కొన్ని సందేహాలు తలయెత్తే అవకాశం ఉంది. ఈ కథలలో అక్కడక్కడ పరస్పర వైరుధ్యం ఉన్నట్లు స్థూలదృష్టికి గోచరిస్తుంది ఒక్కొక్క కథలో ఒక్కొక్క దేవతామూర్తికి ప్రాధాన్యం ఉన్నట్లు తోస్తుంది. కాని, సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే, సత్యం వెల్లడి అవుతుంది. అంతరార్థం అవగతమవుతుంది. నామరూప భేదాలతో వేఱు వేఱు కథల్లో వేర్వేరుగా గోచరించేది నామరూపాలకు అతీతమై నిలచిన ఒకే పరాశక్తి తత్త్వం. సాధకుల అభిరుచి భేదాన్ని బట్టి, భక్తుల స్థాయీ భేదాన్ని బట్టి ఒక్కొక్క మనస్తత్త్వానికి ఒక్కొక్క రూపం, ఒక్కొక్కనామం ఆర్ధ్యమవుతూ, అందఱూ ఆ పరాశక్తి తత్త్వాన్నే ఆరాధించడానికి అవకాశం కలుగుతుంది.

ఈ కథలలో కొన్ని పాత్రలు, కథా సన్నివేశాలు ఇతర పురాణతి హాసాలలో అక్కడక్కడ ప్రస్తావింప బడినవై ఉండవచ్చు. కథా గతిలో గాని, పాత్రల స్వభావంలో గాని రెండు పురాణాలకూ మధ్య వ్యత్యాసం గోచరించవచ్చు. అటు వంటి సందర్భాలలో ఈ రెండింటిలో ఏది సత్యమో తేల్చుకోలేక పాఠకులు తికమక పడవచ్చు. కాని, ఆలోచించి చూడగా, సారాంశంలో మాత్రం రెండింటి మద్య వ్యత్యాసం కన్పించదు. కథ మారినా, అంతరార్థం మారదు. సన్నివేశం మారినా స c శం మారదు. బహుశః ఈ అభిప్రాయంతోనే వ్యాసమహర్షి "ఇతిహాస పురాణాని భిద్యంతే లోక గౌరవాత్‌" అని ఒకానొక సందర్భంలో ఒక వివరణ ఇచ్చాడు.

ఈ కథలలోని సంభావ్యత, సామాన్య పాఠకునికి సందేహాస్పదంగా తోస్తుంది. ఇదంతా వట్టి అభూత కల్పనగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో కూడా మనం గమనింత వలసిన అంశం ఒకటి ఉన్నది. అది పురాణ రచనా సంవిధానం. పురాణాల్లో కథ ముఖ్యాంశం కాదు. సారాంశ##మే ముఖ్యం. ఇందలి కథాంశాలకు 'అర్ధవాదం' అని అలంకారిక పరిభాష. తాను నిరూపించ దలచుకొన్న తత్త్వాన్ని కథా రూపంలో వివరిస్తాడు పురాణకర్త. సృష్టితత్త్వాన్ని వివరించడం పురాణాల లక్ష్యం . అందుకోసం సృష్టిలోని శక్తులను మానవీకరించి వర్ణించడం పురామ రచనా ప్రణాళికా విధానం. ఇక్కడి పాత్రలు, సన్నివేశాలు, కథాకాలము, కథారంగము మానవులకు, మానవలోకానికి, సంబంధించినవి కాకపోయినా, మానవులకు సంబంధించినవిగా అనిపించేటట్లు పురాణరచన సాగుతుంది. అధ్యయనం చేయవలసింది, అంతరార్థాన్ని అందుకోవలసింది, ఆచరించి తరించ వలసింది మానవులు కాబట్టి పురామ కథలు రచన ఆ తీరులో సాగుతూ ఉంటుంది. ఈ తత్త్వాన్ని గుర్తించి, కథలను చదువుకుంటే , కథలోని వైరుధ్యాన్ని వదలి అంతరార్థాన్ని మనసుకు పట్టించుకునే మార్గం సుగమమవుతుంది. ఈ దృష్టితో ఈ కథలను మనస్సు పెట్టి చదివినప్పుడు దేవీ మహిమా నిరూపణమే ఈ కథ లన్నీంటినీ ముడివేసిన ఏకతా సూత్రమని అర్థమవుతుంది.

ఈ గ్రంథ రచనకై ఎనేనుకొన్న కథల్లో మొట్టమొదటిది 'శుకమహర్షి' చరిత్ర.

గృహస్థాశ్రమ ప్రాధాన్యాన్ని వివరిస్తూనే వ్యాసమహర్షి జీవితంలో పరాశక్తి చేసిన లీలావినోదం ఈ కథకు ఇతి వృత్తం ఆ తరువాత నాలుగు కథల్లో దేవి సాగించిన రాక్షస సంహార విశేషాలు దర్శనమిచ్చి ఆమె చేసిన దుష్టశిక్షణను నిరూపిస్తాయి. దేవి అనుగ్రహానికి పాత్రులైన భక్తుల వృత్తాంతం తరువాతి మూడు కథలకు కథా వస్తువు, నవరాత్ర పూజా విధానము, దేవి పంచశక్తులుగా వ్యక్తమైన తీరు, దేవి అంశావతారాలు, సాధ్వీమణులుగా, దేవతామూర్తులుగా దేవి అవతరించిన కథా విశేషాలు. నదీ దేవతామూర్తుల వృత్తాంతాలూ ఆ తర్వాతి కథల్లో క్రమంగా కన్పించే ఇతి వృత్తాలు. దేవి నివాసస్థానమైన మణిద్వీపం 17వ కథగా వర్ణనాత్మకం కాగా, భువనేశ్వేరీ సందర్శనం చేయిస్తుంది చిట్టచివరి కథ. వివిధకోణాల్లో దేవీ వైభవాన్ని నిరూపించే కథలు దేవీ భాగవతంలో ఎన్నో ఉన్నాయి. వాటివో ప్రధానమైన 18 కథలను మాత్రం ఎన్నుకొని భవానువాదం చేసి అందిస్తోంది ఈ "దేవీ కథలు "అనే గ్రంథం. యథావకాశంగా ఈ కథల అంతరార్థాన్ని కూడా అందించే ప్రయత్నం చేశాను.

నా యందు అవ్యాజమైన వాత్సల్యంతో ఈ గ్రంథం పట్ల అమృత మయమైన తమ దృష్టిని ప్రసరింప జేసి, అమోఘమైన ఆశీస్సులను అనుగ్రహించిన శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శృంగేరీ శ్రీ శారదా పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థమహాస్వామి చరణులకు సప్రశ్రయంగా, సభక్తికంగా సహస్రాధిక ప్రణామాలు సమర్పించు కొంటున్నాను.

"దేవీ కథల"కు లేఖకురాండ్రుదా చి|| సౌ|| మల్లెల శివకామసుందరి, చి|| బొడ్డపాటి లక్ష్మీ కనకదుర్గ వ్యవహరించారు. వారికి సకలాభీష్టములను సిద్ధింపజేయ వలసిందిగా శ్రీమాతను పార్థిస్తూ , వారిరువురికీ సుమంగళ శుభాశీస్సులను అందిస్తున్నాను.

ఈ గ్రంథం వ్రాతపత్రి రూపొందుతున్న వేళలోనే గుడివాడ- మోడరన్‌ ఆర్క్‌ వెల్డింగ్‌ ప్రొప్రయిటర్‌ శ్రీ రవికుమార్‌ గారు తమంత తాముగా వెయ్యినూటపదహారు రూపాయలను విరాళంగా సమర్పించి, గ్రంథ ముద్రణకు ప్రేరమ కల్పించారు. సహృదయులు, ఉదారులు అయిన శ్రీ రవికుమార్‌ గారికి సకల శుభాలనూ, సమస్త సంపదలనూ అనుగ్రహించ వలసిందిగా రాజ రాజేశ్వరిని ప్రార్థిస్తున్నాను.

"దేవీ కథలు" ముద్రించాలనే ఆలోచన సాగుతూ ఉండగా బాపట్ల వాస్యవ్యులు, సహృదయులు, ఆత్మీయులు శ్రీమద్దాలి కృష్ణమూర్తిగారు

స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, పదివేల రూపాయలు అందించి, గ్రంథ ముద్రణకు అయాచితంగా ఆర్థిక భారాన్ని వహించారు. భగవతీ భక్తులు, వదాన్యులు అయిన శ్రీ కృష్ణమూర్తి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు ఆ పరాశక్తి సకల శుభాలనూ, ఆయురారోగ్య భాగ్యాలను ప్రసాదించు గాక!

అచ్చుతప్పులు సరిచేసి, గ్రంథాన్ని అందంగా అచ్చివేయించే కార్యభారాన్ని ప్రేమతో స్వీకరించి, ఓపికతో నిర్వహించిన మా ప్రియ శిష్యులు, సహృదయులు, "శాతవాహన చరిత్ర" కృతిపతులు, రిటైర్డు సీనియర్‌ తెలుగు పండితులు, పొన్నూరు వాస్తవ్యులు అయిన "భాషాప్రవీణ" శ్రీజొన్నలగడ్డ జానకిరామయ్య గారికి సర్వదాసుఖశాంతులను,ఆయురారోగ్య భాగ్యములను, ఇతో7ధిక విద్యాభివృద్ధిని, ఐహికాముష్మిక సంపదలను ప్రసాదించ వలసిందిగా "విశ్వజనని"ని ప్రార్థిస్తున్నాను.

గ్రంథాన్ని సకాలంలో సర్వాంగ సుందరంగా ముద్రించి యిచ్చిన పొన్నూరు శ్రీనటరాజ ప్రిటర్స్‌ యజమానులకు, సిబ్బందికి నా ధన్యవాదాలు.

దేవీ తత్వాన్ని మననం చేసుకొనేందుకు ఈ కథలు సహకరించ గలవని ఆశిస్తూ, ఇది దేవీ భక్తులకు నిత్యపారాయణ గ్రంథం కాగలదని ఆకాంక్షిస్తూ , ఈ చిఱుపొత్తాన్ని భక్తజనులకు అందిస్తున్నాను.

మచలిపట్నం
20-3-96
ధాత- ఉగాది
మల్లాప్రగడ శ్రీరంగారావు
రచయిత

 

 

అనుబంధము

దేవీ భాగవతము నవమస్కంధము

పంచమాధ్యాయములోని యాజ్ఞవల్క్య మహర్షి కృత

"సరస్వతీ స్తోత్రము"

వాగ్దేవతాయాః స్తవనం శ్రూయతాం సర్వకామదమ్‌|
మహామునిర్యాజ్ఞవల్క్యోయేన తుష్టావ తాం పురా||

గురుపాచ్చస మునిర్హత విద్యో బభూవ హ|
తదా
77 జగామ దుఃఖార్తో రవిస్థానం ను పుణ్యదమ్‌||


సంప్రాప్య తపసా సూర్యం లోలార్కే దృష్టి గోచరే|
తుష్టావ సూర్యం శోకేన రురోద చ ముహుర్ముహుః||
 

సూర్యస్తం పాఠయామాస వేదం వేదాంగమీశ్వరః|
ఉవాచ-స్తౌహి వాగ్దేవీం భక్త్యా చ స్మృతిహేతవే||

తమిత్య్యక్త్యా దీననాథో7 ప్యంతర్ధానం చకార సః|
మునిః స్నాత్వాచ తుష్టావ భక్తినమ్రాత్మకంధరః||


యాజ్ఞవల్క్య ఉవాచ

కృపాం కురు జగన్మాతర్మావమేవం హతతేజసమ్‌|
గురుశాపా త్స్మృతి విద్యాహీనం చ దుఃఖితమ్‌||

జ్ఞానం దేహి స్మృతి విద్యాం శక్తిం శిష్య ప్రబోధినీమ్‌|
గ్రంథకర్తృత్వ శక్తిం చ సుశిష్యం సుప్రతిష్ఠితమ్‌||


ప్రతిబాం సత్సభాయాం చ విచారక్షమతాం శుభామ్‌|
లుప్తం సర్వం దైవ యోగాన్నవీభూతం పునఃకురు||

యథా
7 కురం భస్మని చ కరోతి దేవతా పునః|
బ్రహ్మస్వరూపా పరమా జ్యోతీరూపా సనాతనీ||

సర్వవిద్యాధిదేవీ యా తసై#్య నాణ్యౖ నమో నమః|
విసర్గ బిందు మాత్రాసు యదదిష్ఠానమేవ చ||

తదిధిష్ఠాత్రీ చ యా దేవీ తసై#్యనీత్యై నమో నమః|
వ్యాఖ్యా స్వరూపా సా దేవీ వ్యాఖ్యాధిష్ఠాతృరూపిణీ.||

యయా వినా ప్రసంఖ్యావాన్సంఖ్యాం కర్తుం న శక్యతే|
కాలసంఖ్యా స్వరూపా యా తసై#్య దేవ్యై నమోనమః||

భ్రమసిద్ధాంత రూపా యా తసై#్య దేవ్యై నమో నమః|
స్మృతి శక్తి జ్ఞానశక్తి బుద్ధిశక్తి స్వరూపిణీ||


ప్రతిభాకల్పనా శక్తి ర్యా చ తసై#్య నమో నమః|
సనత్కుమారో బ్రహ్మణం జ్ఞానం పప్రచ్ఛ యత్ర వై||

బభూవ మూకవత్సో
7పి సిద్ధాంతం కర్తు మక్షమః|
తదా
77 జగామ భగవానాత్మా శ్రీకృష్ణ ఈశ్వరః||

ఉవాచ స చ తాం స్తౌహి వాణీ మిష్టాం ప్రజాపతే|
స చ తుష్టావ తాం బ్రహ్మ చాజ్ఞయా పరమాత్మనః||

చకార తత్ప్రసాదేవ తదా సిద్ధాంతముత్తమమ్‌|
యదాప్యంనంతం పప్రచ్ఛ జ్ఞానమేకం వసుంధరా||

బభూవ మూకవతో
7 పి సిద్ధాతం కర్తు మక్షయః|
తదా తాం చ స తుష్టావ సంత్రస్తః కశ్యపాజ్ఞయా||

తత శ్చకార సిద్ధాంతం నిర్మలమ్‌ భ్రమ భంజనమ్‌|
వ్యాసః పురాణసూత్రం చ పప్రచ్ఛ వాల్మీకిం యదా||

మౌనీభూత శ్చ సస్మార తామేవ జగదంబికామ్‌|
తదా చకార సిద్దాంతం తద్వరేణ మునీశ్వరః||

సంప్రాప్య నిర్మల జ్ఞానం భ్రమాంద్య ధ్వంసదీపకమ్‌|
పురాణ సూత్రం శ్రుత్వా చ వ్యాసః కృష్ణ కులోద్భవః||

తాం శివాం వేద దధ్యౌచ శతవర్షం చ పుష్కరే|
తదా త్వతో వరం ప్రాప్య సత్కవీంద్రో బభూవ హ||

తదా వేదవిభాగం చ పురాణం చ చకార సః|
యదా మహేంద్రః పప్రచ్ఛ తత్త్వజ్ఞానం సదాశివమ్‌||

క్షణం తామేవ సంచింత్య తసై#్మ జ్ఞానం దదౌ విభుః|
సప్రచ్ఛ శబ్దశాస్త్రం చ మహేంద్రశ్చ బృహస్పతిమ్‌||
 

దివ్యం వర్ష సహస్రం చ సత్వాం దధ్యౌచ పుష్కరే|
తదా త్వత్తో వరం ప్రాప్య దివ్యవర్షసహస్రకమ్‌||

ఉవాచ శబ్ధ శాస్త్రం చ తదర్థం చ సురేశ్వరమ్‌|
అధ్యాపితా శ్చ యే శిష్యా యైరధీతం మునీశ్వరైః||

త చ తాం పరిసంచిత్య ప్రవర్తంతే సురేశ్వరీమ్‌|
త్వం సంస్తుతా పూజితా చ మునీంద్రైర్మను మానవైః||

దైత్యేంద్రైశ్చ సురైశ్చాపి బ్రహ్మ విష్ణు శివాదిభిః|
జడీభూత స్సహస్రాస్యః పంచవక్త్ర శ్చ తుర్ముఖః||

తాం దేవీం కిమహం స్తౌమి తామేకాస్యేన మానవః|
ఇత్యుక్త్వా యాజ్ఞవల్క్యశ్చ భక్తి నమ్రాత్మ కంధరః||

ప్రణనామ నిరాహారో రురోద చ ముహుర్ముహుః|
జ్యోతీరూపా మహామాయా తేన దృష్టా
7వ్యువాచ తమ్‌.||

సుకవీంద్రో భ##వేత్యుక్త్వా వైకుంఠం చ జగామ హ |
యాజ్ఞవల్క్య కృతం వాణీస్తోత్ర మేతత్తు యః పఠేత్‌. ||

స కవీంద్రో మహావాగ్మీ బృహస్పతి సమో భ##వేత్‌|
మహామూర్ఖశ్చ దుర్బుద్ధి ర్వర్షమేకం యదా పఠేత్‌.||

స పండితశ్చ మేధావీ సుకవీంద్రో భ##వేద్ధ్రువమ్‌|

*****

 

 

Devi Kathalu         Chapters          Last Page