Dharmakruthi Chapters
Last Page కీ||శే|| చల్లా శేషాచల శర్మగారి ఆధ్వర్యమున జరిగిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకరాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి వివిధ జయంత్యుత్సవములలో ఆవిష్కరింపబడిన గ్రంథములు. సప్తాశీతితమ జన్మదినోత్సవాభినందన సంచిక శ్రీమద్దులపల్లి మాణిక్యశాస్త్రి, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు మొ||లగు పండితుల వ్యాసములు, మరియు శ్రీ స్వామివారు అనుగ్రహ భాషణములతో - (1980) నడయాడు దైవము కంచి ఋషీంద్రులు - Sri TMP Mahadevan వ్రాసిన The Sage of Kanchiకి తెలుగు అనుకృతి, శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారి 'సువర్ణోపదా' మరియు శ్రీ స్వామివారి దివ్య సందేశములతో (1982) శ్రీవిద్యా పంచదశ మాలా మంత్రోద్ధారః శ్రీమధ్బాస్కర రామకృత 'గురుకలా' వ్యాఖ్యా సమేతముగా శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి (రేపల్లె) సంపాదకత్వములో శ్రీ స్వామివారి 90వ జన్మదినోత్సవ సందర్భముగా ప్రచురింప బడిన పారాయణ విధి (1984) మహాస్వామి శ్రీవారి జన్మదినోత్సవముల సందర్భముగా శ్రీతాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి ప||ప|| జనార్థనానంద సరస్వతీస్వామి మొదలగు బ్రహ్మజ్ఞుల ఉపన్యాసములు శ్రీవారితో అనుభవములున్న పెద్దలు వ్రాసిన వ్యాసములు శ్రీస్వామివారు చెప్పిన ధార్మిక కధలకు అనువాదములతో మహాస్వామివారి జయంత్యుత్సవ అభినందన సంచిక (1993). మరియు : ఆచార్యవాణి : శ్రీ కంచి మహాస్వామి వారి అనుగ్రహభాషణములకు తెలుగు అనుకృతి - సనాతన ధర్మము (శ్రీ విశాఖగారు) వేదములు (శ్రీ పింగళి సూర్యసుందరం గారు) అను రెండు భాగములుగా (1993, 1997.)