శ్రీమాత్రేనమః శ్రీశ్రియానందనాథగురవేనమః శ్రీమాత - గాయత్రీమాత శ్లో || ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణౖ ర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాం కుశకశాః శుభ్రం కపాలంగదాం శంఖం చక్ర మధారవింయుగళం హసై#్త ర్వహన్తీం భ##జే || అమ్మా! గాయత్రీ ! ముంచిముత్యాలు, పగడాలు, బంగారు, నీలము, స్ఫటికము ననువాని కాంతుల నొప్పు నీ మోములైదును, ముక్కనులతో వెలయుచున్నవి. షోడశ చంద్రకలాకాంతులతో గూడిన నీ రత్న కిరీటములు వింతశోభను గూర్చుచున్నవి. చతుర్వింశతి వర్ణమయతరంగ నిర్మితము నీ శరీరము. అందు వెల్వడు ప్రతిధ్వనులు సహస్రానేక మంత్రములకు నతీతమై, ఉపనిషత్ర్పతిపాద్యమైన, పరమోత్కృష్టతమైన,అమోఘమైన - శక్తిసంపన్నమైన వరములచే నుపసకుల ననుగ్రహించు వరదవు. భోవరోగార్తులై నిన్ను జేరి ప్రసన్నులైన సాధకుల ఆర్తిని హరించి, తుదకు పునరావృత్తి భయమును సైతము తొలగింతునని సూచించు అభయముద్రను ధరించితివి. ఓహో ! భయపడకుడు, కలగకుడు, సంసృతిబంధములో బెట్టి, మోహశృంఖలములు తగిల్చి, మిమ్ము బాధించు కామాది శత్రువులను, ఇదే పరిమార్తుననెడి రక్షణ సంసిధ్ధతను, నీయార్తి హరణ తత్పరత్వమును నీచేతుల పరికరములు అంకుశకశాగదాదులు. ప్రణవనాదము 'నేనే' యను సంకేతమే నీతాల్చిన శంఖము. విశ్వమందలి సర్వశక్తిసంపదకు మూలము నేనే; మీరు నిరంతరము పరిభ్రమించు సంసారచక్రము -- కళలు, ముహూర్తములు, నిమేషములు సూచించుచు సూర్యచంద్రుల గతుల నిర్దేశించు కాలచక్రము, నాశక్తి కధీనములే యని తెల్పుటకే చక్రమును ధరించితివి. శ్రు|| 'అథో నిష్ట్యా వివ స్త్వాంతే నాభ్యా ముపరి తిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ తస్యాంతే సుషిరగ్ ం సూక్ష్మం తస్మి& సర్వం ప్రతిష్ఠితమ్‌ః' గుండెకాయకు దిగువ, నాభికి ద్వాదశాంగుల పరిమాణమునకు పైని హృదయకమలము కలదు. అది జగదధిష్ఠానమగు పరబ్రహ్మస్థానము. ఆ హృదయకమలము అధోముఖమై నల్దెసల నాడులచే వ్యాపించి యున్నది. తత్సమీవముననే బిసతంతుతనీయసమైన, అతిసూక్ష్మాతి సూక్ష్మమగు రంధ్రము సుషుమ్న యనుసపేర గలదు. అందు మీమనమును లగ్నము చేయుడు. తనంతనే యెట్టి ప్రయత్నమును లేకయే యది యూర్థ్వముఖ మగును. ''బ్రహ్మరంధ్రాధోభాగమున, ఆజ్ఞాకమలమునకు ద్వాదశౄంగుల ప్రమాణ పరిమితిలో, ఊర్ధ్వముఖముగా సహస్రారకమలము గలదు. అదే అమృతధామము. అదే నానివాసము. నా యాశ్రయమును గోరిన మిమ్ముల నిట్టే యనాయాసముగా నట జేర్తును.'' అని సాధకులకు మార్గదర్శనమునకై ఉత్తేజ పఱచునవి నీ యిరుకేళ్ల ధరించిన యారెండుకమలములు. కరుణాస్వరూపిణీ! అరుణా ! భక్తకల్పద్రుమా ! నా యీ హృదయకమలమును నీకు అభిముఖముగా జేసికొన మానసిక దార్ఢ్యమును, జ్ఞానశక్తిని, తపోబలమును సహిష్ణుతను ప్రసాదింపుము. అమ్మా ! నీవు భక్తాభీష్ట ప్రదానశీలవు. నిత్యానందమయివి. నామరూప జగత్ర్పసవిత్రివి. అనుగ్రహింపుము తల్లీ ! ''నగాయత్ర్యాఃపరం మంత్రం న మాతుః పరదైవతమ్ '' వేదమాతా ! చతుర్వేద నిర్గలిత సారభూతము నీమనువు. అతక్షర మైన - నాశరహితమైన సగ్వేదాంత నిర్దిష్టమైన జగత్కారణమైన శ్రియానంద తత్త్వమును ఉపదేశింపుము. సర్వవర్ణాత్మికే ! మాతృకే ! గాయత్రీ సావిత్రీ సరస్వత్యాది పదాభిదేయవైన శ్రీరాజరాజేశ్వరిని నావు. నీదివ్య తత్త్వమును బోధించి నీవు నన్ను సర్వపాపవిముక్తుని జేయుము. శ్రీ మహారాజ్ఞీ ! శ్రీమత్సింహాసనేశ్వరీ ! ఓజోసి, సహోసి, బలమసి, భ్రాజోసి, దేవానాం ధామ నామాసి, విశ్వమసి, విశ్వాయుః, సర్వమసి, సర్వాయుః, అభిభూరోమ్, గాయత్రీ మావాహయామి, సావిత్రీ మావాహయామి, సరస్వతీ మావాహయామి, ఛందర్షీనావాహయామి, శ్రియమావాహయామి||' సర్వేంద్రియ శక్లుకు ప్రధానభూతమైన ఆదిశక్తిని నీవు. అరిషడ్వర్గ విజృంభణ దమనశక్తినవి నీవు. శరీరమందలి ధాతుశక్తివి, దీప్తినవి నీవే. ఇంద్రాగ్ని ప్రభృతి దేవమండలి దిక్కాలకశక్తినవి నీవే. సకల దేవతా నిలయమవు నీవే. చతుర్దశ భువనములు నీస్వరూపమే. విశ్వచేతన శక్తిని నీవే. స్థాపరజంగమాత్మక జీవకోటియొక్క ఆయుఃస్వరూపము నీవే. గాయత్రీ గాయానాత్మాత్' అని శ్రుతులచే ప్రశంసింపబడు నిన్ను - గాయత్రితని ఆవాహనచేసికొనుచున్నాను. జ్ఞానప్రకాశవు, జగత్ప్రసవిత్రివి, నిన్ను సావిత్రీ యని పిలుచుచున్నాను. 'కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి దుర్లభమ్' కార్తెలు మించకుండ ఆయావిత్తులు సల్లి సేద్యముచేయువారికిఁ గఱవులేదు. సద్గురూక్త క్రమమున అర్థానుస్మరణ ముతో మంత్రజపము చేయువారికిఁ బొందరానిది లేదు. -- శ్రియానంద వాగ్రూపశక్తిని గాన సరస్వతీ యని పిలుచుచున్నాను. తల్లీ ! అధికార తారతమ్యము నెన్నక, సర్వజీవకోటికి అందుబాటులో నుండునట్లు వాతయుదేవుని బ్రసాదించినటులే, జ్ఞానశక్తిని స్వాధీనము చేయుము. ఎల్లరకును సేవ్యవస్తువుగా వరుణదేవుని బ్రసాదించినటులే, జ్ఞానశక్తిని బ్రసాదింపుము. విశ్వకల్యాణమునకై సూర్యతేజస్సును ప్రసాదించినటులే శ్రేయః సాధన జ్ఞానతేజస్సును ప్రసాదింపుము. సర్వాపన్ని వారణ కారణభూతమైన, ప్రణవప్రతిపాద్యమైన పరమాత్మవు నీవు. గాయత్ర్యాది ఛందస్సులను విశ్వామిత్రాది మంత్రద్రష్టలను ప్రసన్నుల జేసికొని వారిని పురస్కరించుకొని ''ఓం తేజోసి శుక్రమమృత మాయుష్పాహి ఆయు ర్మేదేహి'' అని నాచేయు అభ్యర్థనమును మన్నింపుము తల్లీ ! గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ సంధ్యానామములతో వందనవేళ నుపాసింపఁబడు దేవత యెవరు ? దాని స్వరూప మెట్టిది ? 1. గాయతి చ త్రాయతేచ - ఛాందోగ్యము. 2. గాయత్రీ ఛందసామసి - కూర్మపురాణము. 3. గాయత్రీ ఛందసమహం - భగవద్గీత. 4. గాయం - ప్రాణమును త్రాతయతే - కాపాడునది= దీర్ఘాయురారోగ్యముల నిచ్చి రక్షించునది. కనుక గాయత్రి. గాయతం త్రాయత ఇతి గాయత్రీ. తన్నుగూర్చి గానము చేయువానిని గాపాడునది గాన గాయత్రి.
-- శ్రీ శ్రియానంద. 1. ''గాయత్రీనామ పూర్వాహ్ణే సావిత్రీ మధ్యమే దినే, సరస్వతీచ సాయాహ్నే సైవ సంధ్యా త్రిషుస్మృతా. 2. ప్రతిగ్రహా న్నదోషా చ్చ పాతకాదుపపాతకాత్, గాయత్రీ ప్రోచ్యతే తసమా ద్గాయంతం త్రాయతే యతః. 3. సవితుర్ద్యోత నాచ్చైవ సావిత్రీ పరికీర్తితా, జగతః ప్రసవిత్రీత్వా ద్వాగ్రూపత్వా త్సరస్వతీ. 4. సర్వాత్మనాహి యా దేవీ సర్వభూతేషు సంస్థితా, గాయత్రీ మోక్షహేతుర్వై మోక్షస్థానక లక్షణమ్|'' -- వశిష్టకల్పము. 1. ఆశ్రితులకు విశ్వత్వమును, వర్చస్సునున, వేదోక్తాయు ర్దాయమును ప్రసాదించునది గాయత్రి. సూర్యునందలి తేజస్సు జ్ఞానతేజస్సు నగుట సావిత్రి. నామరూప జగత్ర్పసవిత్రియగుట సరస్వతి. ఈ మువ్వురి యందును అంతర్గర్భితమై వీరి దివ్యమహిమలకు మూలకారణమగు అద్వితీయమగు దివ్యశక్తి, మాతృశక్తి శ్రీమాత శ్రీరాజరాజేశ్వరీదేవి. నామ భేదమే కాని వస్తుభేదములేదని పరమార్థ తత్త్వమది. దీనికి పరికరముగా బోధించునదే శ్రియానంద తత్త్వము. 2. 'దేవత' యను నామ మెటులు కలిగినది ః -- దేవ శబ్దమునకు స్వయంప్రకాశ పరమాత్మయని యర్థము. అది నిత్యశుద్ధ నిష్కలంక నిరతిశయ నిరవధిక తేజస్సు. అట్టి తేజోగుణము అధికాంశముగా ఎట్టి వస్తువునం దుండునో అదియే దేవత యనబడును. 3. సంధ్యావందన మనగా నర్థమేమి ? తనను గూర్చిన అనగా 'ఆత్మను' గూర్చిన యథార్థజ్ఞానముతో, తదేక మనస్సుతో తైలధారా సదృశముగా నిరవచ్ఛన్నముగా మననము చేయుచు ధ్యానింపబడునదియే సంధ్య. ఉపాస్యదేవయంతలి అవచ్ఛిన్న చైతన్యశక్తిని తనకంటె నబిన్నముగా భావించుటె సంధ్యాపదార్థము. జీవాత్మను ప్రత్యగాత్మగా అనుసంధానించుట సంధ్య. ముక్కు, కనుబొమలు అను రెండిటి చేరికయే సంధిస్థానము. అదే ఆజ్ఞాచక్రము. అందుండి మనమును సహస్రార చక్రమందలి పరాశక్తియందు అనుసంధించుటయే సంధ్య. వినమ్రభావమున దన్ను దరిజేర్పుమని అభ్యర్థించుటే వందనము. ఇదే సంధ్యావందనము. ఇదె సంధ్యోపాసనము. 4. జీవాత్మ ప్రత్యగాత్మల స్వరూపమేమి ? నిర్గుణము, నిర్మలము, నిరవయవము, శూన్యము నై నది యాకాశము. అది మేఘావృత మైనపుడు బహువిధరూపములతో గానబడును. ప్రయత్రములేక యే తమంతనే యామేఘము లాకాశమునావరించి వికృత మొనర్చినవి. అటులే శుద్ధనిరాకార నిర్గుణపర బ్రహ్మమునుందు మాయ (శక్తి) తనకుదానే తోచెను. శ్రు|| అజామేకాం లోమిత కృష్ణ శుక్లాం బహ్వీం ప్రజాం జనయ న్తీగ్ ం సరూపాం | అజోహ్యేకో జుషమాణో೭నుశేతే జహాత్యేనాం భుకత్భోగా మజో೭న్యః|| --- తైతిరీయ. ''అజ=పుట్టుకలేనిది.'' మాయ. ఇదే మూలప్రకృతి. అనాదియగుట దానికి పుట్టుకలేదు. మూలప్రకృతి యగుటనది ''ఏక'' అనుదగినది. మాయ చరాచరజీవకోటికి క్రియాశక్తి యగుటను 'ఏక' అనబడుచున్నది. తేజస్సు, జలము, అన్నము అను మూడు రూపములు నొందినపుడు, మూలప్రకృతిని లోహిత శుక్ల కృష్ణ వర్ణములతో గాంచనగును. శ్రు|| యదన్నే రోహితగ్‌ం రూపం - తేజస్తద్రూపం | యచ్ఛుక్లం తదపాం, యత్కృష్ణం తదన్నస్య || -- ఛకాందోగ్యము. ''మాయ త్రిగుణాత్మిక'' యనుదాని యర్థ మిదియే. సత్త్వగుణము శుక్లవర్ణము; రజోగుణము లోహితవర్ణము; తమోగుణము కృష్ణవర్ణము. ఇట్టి త్రయీమయి యగుటను మాయ. దేవతిర్యగాది రూపములను సహస్రానేక చరాచర జీవకోటిని జనింపజేయుచున్నది. అజుఁడు - పుట్టుకలేనివాడు. ఇతడే జీవుడు - మాయ వలె నితడును అనాదియే. శుద్ధ నిర్గుణ పరమాత్మయొక్క ప్రథమ బింబము 'ప్రత్మగాత్మ'. దాని ప్రతిబింబము జీవుడు. అనగా జీవుడు పరమాత్మయొక్క బింబ ప్రతిబింబము. కనుక ఇతనికి ఉత్పత్తి లేదు. అట్టి జీవుడు ఆసక్తుడు, విరక్తుడు అని ద్వివిదము. మయావృతుడై గుణత్రయ ప్రకోపముచే తుచ్ఛ విషయ సుఖముల సేవించుచు నిరంతరము తదాసక్తచిత్తముతో మోహజాలసంకీర్ణుడై 'ఆసక్తజీవుడు' అనబడుచున్నాడు. జననమరణ ప్రవాహరూపమగు సంసారమునొంది వివేకమును గోల్పోయి 'బద్ధజీవుడు' అగుచున్నాడు. అట్టి బద్ధ ఆసక్తజీవుడు సంస్కారవశమున, సత్సాంగత్యఫలితముగా సద్గ్రంథపఠనమున వివేకోదయమై సద్గురుపదకమలముల నాశ్రయించి 'యా- మా- సా మాయి యని గ్రహించి విశుద్ధసత్త్వగుణము నాశ్రయించి నిరంతరకృషిచే సాధనచే మాయను పరిత్యజించును. వివేకోదయమునకు పూర్వమే విరక్తి కలుగుటకు ముందే వలసినంతగా తృప్తిగా భోగముల ననుభవించి యుండుటచే జీవుడు 'భుక్తభోగః' అనబడుచున్నాడు. జీవాత్మ స్వరూ మిట్టిది. 1. శ్రు|| ''యదవభాసతే తదవిద్యోపాధికం, త్వం పదార్థః సః ప్రత్యగాత్మా''. ''సత్యం జ్ఞానమనంతం ఆనందం సర్వజ్ఞత్వాద్యుపేతం మాయోపాధికం తత్పదార్థః సః పరమాత్మా, సర్వోపాధి వినిర్ముక్తం నిర్విశేషచిన్మాత్రం సదద్వైత మానందం అమాయం బ్రహ్మ|| '' ----- సర్వసారోపనిషత్. 2. శ్రు|| పరజీవోపాధి మాయావిదే విహాయ తత్ - త్వం- పదలక్ష్యం - ప్రత్యగభిన్నం బ్రహ్మ|| --- పైంగలోపనిషత్. అవిద్యచే ఆచ్ఛాదితముగాని సద్వస్తువు బ్రహ్మము. నిత్యము, సత్యము, స్వగతాదిభేదరహితము, నామరూప రహితము ముక్కాలములందును ఎట్టి మార్పునులేక ''ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, స దేవ సౌమ్యేదమగ్ర ఆసీత్'' అని నిర్దేశింపబడిన బ్రహ్మ తత్పదవాచ్యము. రజోగుణ ప్రధానమగు అవిద్యోపాధి సహితుడై అంతః కరణమందు వ్యాపించి, ఆవిద్యయందు ప్రతిబింబించి నళినీ దళగత జలబిందువలె దానినంటక స్థూల సూక్ష్మ కారణ శరీరములకు సాక్షి గాను, ఈశరీరత్రయమునకు విలక్షణము గాను ఉన్న పదార్థము ప్రత్యగాత్మ. ఇదియే 'త్వం' పద వాచ్యము. 'తత్ - త్వం - అసి' అను మహావాక్యము సామవేదాంతర్గత ఛాందోగ్యచోపనిషత్తులోనిది. సద్వస్తువరూప పరమాత్మకును, దేహేంద్రియాదులకు సాక్షిగానున్న ప్రత్యగాత్మకును ఏకత్వమునున - ఏకభావనను అనుసంధానించునది 'అసి' అను పదము. పరమాత్మకును, ప్రత్యగాత్మకును ఎట్టి భేదమును లేదు. శ్రు|| 'మాయా చ విద్యాచ స్వయమేవ భవతి||' సత్త్వగుణ ప్రధానమైనపుడు మాయ - ఈశ్వరుడు. హిరణ్యగర్భుడు. రజోగుణ ప్రధానమైనపుడు అవిద్యా, ప్రత్యగాత్మ చిదాభాన; తమోగుణ ప్రధానమైనపుడు, కించిద్ జ్ఞ త్వాది గుణములుగల జీవాత్మ, చిదాశ్రయము. తమను ఆశ్రయించిన గుణత్రయ ప్రభావముచే మోహితులై, ఈశ్వరుడును జీవుడును భిన్నభిన్న ప్రకృతులు గలవారును, విరుద్ధ దీక్పథములు గలవారు నగుచుననారు. ఇరువురుకును ప్రాక్పశ్చిమములకు గల యంతరమున్నది. తత్ - త్వం పదవాచ్చులైన పరమాత్మ ప్రత్యగాత్మ లకు అట్టిభేదము లేదు. ఇరువురును దివ్యభావ సంపన్నులు. సత్యము, జ్ఞానము, ఆనందము, అనంతత్వము మున్న గు సమాన ధర్మములు గలవారు అవిద్యా మాయా స్వాధీనులు కారు. వారికి ఎట్టి యుపాధియు లేదు. సర్వపరిపూర్ణులు. వారివి నిర్విశేష చిన్మాత్ర స్వరూపములు. శుద్ధ నిర్గుణ నిష్కలంక సత్త్వగుణ ప్రధానులు. గాన పరమాత్మయే ప్రత్యగాత్మ. ప్రత్యగాత్మయే బ్రహ్మము. జీవుడు మాయాపాశ బద్ధుడు. తుచ్ఛసుఖలంపటుడు. సంస్కారవిహీనుడై జన్మారభ్య, పశుప్రాయుఁడై జీవత్వమున తానెవరో తెలిసికొనలేని స్థితిలోనున్నాడు. అట్టి బద్ధజీవునకు ఆసక్తజీవునకు జడత్వమును మాంద్యమును బోగొట్టుటకొక్కటే యుపాయము. అదియే ఆచార్యుడు చేయు శ్రౌతసంస్కారము. బ్రహ్మపదార్థమెట్టిది ? తానెవరు ? బ్రహ్మమునకును దనకును గల యంతర మేమి ? అచట జేరు దారియేది ? అను వివరములు తెలుపు నుపదేశ##మే బ్రహ్మోపదేశ మనబడును. ఈ శ్రౌత సంస్కారవిశేషమే ఉపనయనము అనబడును. ఉప - సమీపమునకు, నయనము =తీసికొనిపోవుట. అనగా పరమాత్మత త్తవమును దెలుపుట. అనగా తా నెవరో తెలియజెప్పుట. ఉపనయన మనబడును. జీవాత్మను ప్రత్యగాత్మయందు అనుసంధానించుచు చేయు ధ్యానమే- సవినయాభ్యర్థనమే సంధ్యానవందనము. ఇదే సంధ్యావిద్య, బ్రహ్మవిద్య, శ్రీవిద్య. ఈ విద్యను సవివరముగా బోధించునదే శ్రియానందతత్త్వము. ఇందు ఆరాధ్య దేవత గాయత్రి, సావిత్రి, సరస్వతి, త్రిపురసుందరి, షోడశి, శ్రీరాజరాజేశ్వరి యని పిల్వబడుచున్నది. ఇందుపాసింపబడు దేవతలు గాయత్రి, బాల, పంచ దశాక్షరీ, షోడశి. ఇందలి భేదము ఛందస్సునందు, వర్ణము లందేగాని, భావమునందును, అర్థమునుందును ఎట్టిభేదమును లేక అన్నిటియందును ప్రతిపాదింపబడు దివ్యశక్తి- ధ్యేయమైన భర్గస్సు (తేజస్సు) ఒక్కటియే. శక్తియన్నను తత్త్వమన్నను ఒక్కటే. మనము ఏరూపమున ఏదేవత నారాధించినను, అందిమిడియున్న దివ్యతత్త్వము, సత్పదార్థము ఒక్కటే. 5. సంధ్యాదేవతల నెట్టిరూపమున నుపాసింపవలెను ? ''గాయత్రీతు భ##వేద్రక్తా, సావిత్రీ శుక్లవర్ణికా | సరస్వతీ తథా కృష్ణా, ఉపాస్యా వర్ణ భేదతః ||'' గాయత్రి రక్కతవర్ణము, సావిత్రి శుక్లవర్ణము, సరస్వతి కృష్ణవర్ణము. రకక్తవర్ణము రజోగుణమును, శుక్లవర్ణము సత్త్వగుణమును, కృష్ణవర్ణము తమోగుణమును సూచించును. త్రిగుణాతీతమైన, యొక అనిర్వచనీయమైన, మహత్తరమైన దివ్యశక్తి యీ మువ్వురు దేవతల యందును సూత్రాత్మగానుండి అధిష్ఠాత్రియై ఉపాసకాభిష్టముల నెఱవేర్చుచుండును. (1) ప్రాతఃకాలమున:- గాయత్రీనామా, రక్తవర్ణా, హంసవాహనా, బ్రహ్మహృదయా, బాలరూపా, ఆహవనీయాగ్ని రూపావస్థానా, భూరాయతనా, జాగ్రద్వద్ధృతి, ప్రాతస్సవనే, బుగ్వేదే వినియోగః అనియు, ('2) మధ్యాహ్నసమయమున :- సావిత్రీనామా, శ్వేతవర్ణా, వృషభవాహనా, రుద్రహృదయా, ¸°వనరూపా, గార్హపత్యాగ్నిరూపస్థానా, అంతరిక్షాయతనా, స్వప్నన ద్ధృతిః, మాధ్యాహ్నికసవనేన, యజుర్వేదే వినియోగః అనియు, (3) సాయంకాలమున:- సాయంసంధ్యా, సరస్వతీ నామా, కృష్ణవర్ణా, గరుడవాహనా, విష్ణుహృదయా, వృద్ధరూఆప, దాక్షిణాగ్నిరూపస్థానా, ద్యావాయతనా, సుషుప్తివద్ధృతిః, సాయంసవనే, సామవేదే వినియోగః అనియు - నిట్లు మూడురూముల, మూడువేళల సగుణరూపమును భావించి ఉపాసనాఫలమును సాధకు లొందుచున్నారు. (6) గాయత్రీ ధ్యానమునకు మున్ను సూర్యభగవానునుపాసించుటేల? సృష్టి స్థితి లయ కారణభూతులు, ప్రతిభాశాలురు, త్రిమూర్తుల వీరు సూర్యభగవానునందు మూర్తీభవించిరి. కనుక ఇతడు త్రిమూర్త్యాత్మకుడు, త్రయీమయుడు, త్రిగుణాత్మధారి, జగచ్ఛక్షువు, ప్రత్యక్షదేవతము అగుటచేత తొలుత సూర్య భగవాను నుపాసించి, తర్వాత గాయత్రీ ధ్యానము చేయుబడుచున్నది. 7. 'ప్రానాపానవ్యానోదాన సమానా సప్రాణా శ్వేత వర్ణా' యని రూపకల్పన చేయబడినది. దీని యర్థ మేమి? (1) ప్రాగ్గమనము గలిగి నాసాగ్రమునందు వర్తించునది ప్రాణము. ఆవులింత లక్షణముగాగల 'దేవదత్తము' దీని కుప ప్రాణము. (2) అధోగమనము గలిగి పాయ్వాది స్థానములందు వర్తించునది అపానము. మెలకువ లక్షణముగాగల 'కూర్మము' దీని కుపప్రాణము. (3) విశ్వగ్గమనము గలిగి శరీరమునందంతటను వ్యాపించునది వ్యానము. బలుపు లక్షణముగాగల 'కృకరము' దీని కుపప్రాణము. (4) ఊర్ధ్వగమనము గలిగి కంఠమందు వర్తించి ఉత్ర్కమించునది ఉదానము. త్రేపులు లక్షణముగాగల 'ధనంజయము' దీనికి ఉపప్రాణము. (5) శరీరమధ్యమందుండి, అన్నపానముల రక్తముగా పరిణమింప జేయునది సమానము. ఆకలి లక్షణముగాగల 'నాగము' దీని కుపప్రాణము. ప్రాణాపానన్యానోదానములనెడి యైదును ముఖ్యప్రాణములు. నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయములు ఉపప్రాణములు. ప్రాణములు ఉపప్రాణములు వెరసి పదివాయువులచే పూరింపఁబడిన కాయముగలది శ్వేతవర్ణ. అనగా శుద్ధసత్వప్రధానమై స్ఫటికసదృశ వర్ణము గలది సావిత్రీ నామదేవత. 8. సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్ ల శత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పంచశీర్షోపనయనే వినియోగః అను వాక్యార్థమేమి ? 1. సాంఖ్యాయనో నామ కశ్చిదృషిః తేన సమానం గోత్రం యస్యాః సా సాంఖ్యాయన సగోత్రా|| సాంఖ్యాయనుడను బుషితో సమానుగోత్రము గలది గాయత్రి. కనుక సాంఖ్యాయన సగోత్ర. 2. గాయత్రీ మంత్రమునకు ఇరువది నాలుగక్షరములు. తత్, న, వి, తుః, వ, రే, ణి, యమ్, భ, ర్గో, దే, వ, స్య, ధీ, మ, హి, ధి, యో, యో, నః, ప్ర, చో, ద, యాత్. ఈ వర్ణముల సంపుటి గాయత్రీ మంత్రము. 3. 'త్రీణి పదాని యస్యాః సా త్రిపదా' మూడు వేదములనుండి ఒక్కొక్క పదమును (వాక్యమును) సంగ్రహించి కూర్చి మంత్రరూపమున సాధకులకు అనుగ్రహింపబడిన దివ్యమంత్రము. బుగ్వేదమునుండి ''తత్సవితుర్వరేణ్యమ్ '' యజుద్వేదమునుండి ''బర్గోదేవస్య ధీమహి '' సామవేదమునుండి ''ధియో యోనః ప్రచోదయాత్ '' అను మూడు పాదములు గలది త్రిపదాగాయత్రి కనుకనే సప్తకోటి మహామంత్రములను అధిగమించిన పరమోత్కృష్ట మహామం%్‌తరమని కొనియాడబడినది. 4. ప్రాగాది (తూర్పు మొదలగు) నాలుగు దిక్కలును, ఆకాశము పృథివియుజేరి ఆఱు కుక్షులుగా జెప్పబడినది. ఇవి దేవియొక్క విరాడ్రూపమును సూచించుచున్నవి. 5. వ్యాకరణము, శీక్షా, కల్పము, నిరుక్తము, జ్యోతిషము అను నైదు శాస్త్రములును హృదయమున గలది. ఇదియే పంచశీర్షములుగా చెప్పబడినవి. ఇవి దేవియొక్కసర్వశాస్త్ర విశారదత్వమును సూచించుచున్నవి. 6. బ్రహ్మచర్యవ్రతధారణకై సాధకునికి ఆచార్యునిచే చేయుబడు శ్రౌతకర్మ విశేష సంస్కారము ఉపనయనము. బ్రహ్మపదార్థమును అనగా ఆత్మతత్త్వమును గూర్చి ప్రారంభింపబడు అక్షరాభ్యాసము స్వీకారము ఉపనయనము. జీవాత్మ తా నెవరో యన జిజ్ఞానయే ప్రయత్నమే 'వినియోగము' అనబడును. 9. గాయత్రీదేవి పరబ్రహ్మముకంటె భిన్నకాదు. ఉభయమును వేర్వేరుగా కల్పించుచున్నను, రెండు నొక్కవస్తువే యనుచున్నారు కాదా. సప్రమాణముగా నిరూపింపగలరా ? 1. న భిన్నాం ప్రతిద్యేత గాయత్రీం బ్రహ్మనా సహ | సో೭హమస్మీత్యుపాసీత విధినా యేనకేనచిత్ || --- వ్యాసుడు. 2. బ్రహ్మాద్యాకారభేదేన యా೭భిన్నా కర్మసాక్షిణీ | గాయత్రీశ్వరశక్తిస్సా సంధ్యేత్యభిభహితా బుధైః || -- భారద్వాజుడు. సద్గురూపదిష్టమైర యేదేనొక విధిచేత ''నేను అతడే'' అనగా ''జీవాత్మయనబడు నేను పరమాత్మ యనువానికంటె వేఱుకాదు'' అను భావముతో బ్రహ్మశక్తియైన గాయత్రి నువాసింపవలయును. నిర్గుణబ్రహ్మము నిరవయవము. ఇట్టిదని నిర్ణయింప నలవికానిది. ''యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా|| --- తైతిరీయము. వాక్కులకును, మనస్సునకును అందదు. అట్టి నిర్గుణ బ్రహ్మమును సాధకులు చిరుతప్రయమున ప్రారంభదశలో ఉపాసింప వీలుపడదు. కనుక అతర్క్యమైన బ్రహ్మశక్తిని సగుణరూపమున గాయత్రీముఖమున నుపాసించుటను బ్రహ్మవేత్తలు నిర్దేశించిరి. గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ ఇత్యాది నామాంకిత దేవతలు సర్వసాక్షిని యగు శ్రీమాత రాజరాజేశ్వరి యొక్క అంశలు. పదము =అంశము - భాగము . త్రిపదా= మూడు భాగములు లేక మూడు రూపములు దాల్చిన మువ్వురు అని యర్థము. 'త్రిభిఃపురా సాత్రిపురా' - ఈ మువ్వురకును అధిష్ఠాత్రిగా నున్న శ్రీమాతయే - పరాశక్తియే శ్రీమహాత్రిపుర సుందరి, శ్రీరాజరాజేశ్వరి. తల్లీ ! వివిధనామములతో, వివిధరూపములతో ద్యోతితవగు నీవు, ఉపాసనాఫలముగా ఆనందప్రదవగు చున్నావు అను అభేదదృష్టితో, ఏకభావనతో అకుంఠితదీక్షతో నిశ్చల ధ్యానము చేయునపుడు సర్వోపనిషత్ర్పతిపాద్యమైన బ్రహ్మపద ప్రాపకత్వము నీదే యగును. 10. సూర్య భగవానుని స్వరూపమెద్ది ? శ్రు|| ఆదిత్యోవా ఏష ఏతన్మండలం తపతి | తత్రతా బుచ స్తదృచా మండలగ్ ం | సుబుచాం లోకో೭ధ య ఏష | ఏతస్మిన్మండలే అర్చిర్దీప్యతే | తాని సామాని | స సామ్నాం లోకో೭థ య ఏష | ఏతస్మిన్మండలే೭ర్చిషి పురుషః | తాని యుజూగ్ ంషి సయజుషాం మండలగ్ ం సయజుషాం | లోకసై#్సషా త్రయ్యేవ విద్యా తపతి య | ఏషో೭తరాదిత్యే హిరణ్మయః పురుషః || --- తైతిరీయము. ఋగ్యజుస్సామవేదములు మూడును పురుషాకృతిగొన్న ఆదిత్యుడు. అందలి ఋక్కులే ప్రకాశవంతములై మండలాకృతి నొందినవి. అందలి హిరణ్మయపురుషుడు త్రయీమయిడు. త్రిగుణాత్ముడు. ఆదిత్యపురుషుని ఋగభిమానిగాను, యజురభిమానిగాను, సామాభిమానిగాను ఉపాసింపవలయును. శ్ర|| ఆదిత్యోవై తేజ ఓజోబలం యశశ్చక్షః శ్రోత్రమాత్మా మనోమన్యుర్మనుర్మృత్యుః సత్యో మిత్రో వాయు రాకాశః ప్రాణోలోకపాలః కః కిం కం తత్సత్యమన్నమమృతో జీనో విశ్వః కతమ్‌ః స్వయంభు బ్రహ్మైతదమృత ఏష పురుష ఏషభూతానా మధిపతి ర్బ్రహ్మనః సాయుజ్యగ్‌ం సలోకతా మాప్నోత్యేతా సామేవ దేవతానాగ్‌ం సాయుజ్యగ్‌ం సార్షి తాగ్‌ం సమానలోకతా మాప్నోతి య ఏవం వేదేత్యువనిషత్ || -- తైతిరీయము. త్రయీమయుడు మాత్రమే కాడు. ఇతడు సర్వాత్మకుడు. ఇతడే తేజస్సు. బలవర్థకమగు ఓజస్సు. యశఃస్వరూపి. త్వక్చక్షుః శ్రోత్రాదు లితడే. మనోబుద్ధి చిత్తాహంకారములనెడి అంతఃకరణము లితడే. అరిషడ్వర్గమందు ప్రధానభూతమగు కోపము ఇతడే. జగత్పాలకులగు వై వస్వతాది మనువులు, సంహర్తయగు మృత్యువు, సత్యుడు, మిత్రుడు, ఆకాశాది పంచభూతములు, ప్రాణము, ఇంద్రాది దిక్కాలకులు, ప్రజాపతి, అనిర్వచనీయ, నిరవధికసుఖప్ర సత్యభాషణము, ఆహారవస్తువులు, మోక్షము, విశ్వజీవకోటి, వైశ్వానర, విశ్వతైజసప్రాజ్ఞులు, పరాపశ్యంతీ మద్యమావైఖరీరూపవాక్చతుష్టయము, జాగ్రత్స్వప్న సుషుప్తి తురీయ తురీయా తీతములనెడి యవస్థాపంచకము, ఆత్మతత్త్వ విద్యాతత్త్వ శివతత్త్వము లనెడి తత్త్వసంచయము (షట్త్రింశద్ర్బహ్మస్వరూపములు). అది, ఇది యననేల ? పిపలీలికాది శివాంతము - ఆస్తంబ బ్రహ్మపర్యంతము సకల చరాచర జీవకోటి యందును అంతర్యామి రూపమున నిండియుండుటచే 'పురుషు' డనబడుచున్నాడు. నిత్య నిరామయ నిష్కలంక పరిశుద్ధ పరబ్రహ్మ మితఁడు. ఏవం గుణ విశిష్టుడైన ఆదిత్యు నుపాసించి సాధకులు తమ భావనా దార్ఢ్యమును, ధ్యానబలమును, ఉపాసనాపటిమను బట్టి యధార్హముగా తాదాత్మ్యమును, సాలోక్యమును, సాయుజ్యమునున, గజాం తైశ్వర్యమును పడయుచున్నారు. శ్రు | ఘృణిస్సూర్య ఆదిత్యోంస ప్రభావాత్యక్షరమ్ | మధుక్షరంతి తద్రసం | సత్యం వైతద్రస మాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోమ్|| -- తైతిరీయము. జగదుత్పత్తికారణుడు, అనుపమాన ప్రభారాశి, నాశరహితుడు ఆదిత్యుడు. వియత్పథమున పయనించువాడు. ఆ మహానీయుని కరములచే ఆకర్షింపబడిన క్షారజలములు, మధురరసభరితములై నేలబడి నద నదీరూపమున ప్రవహించి జగజ్జీవన దాయకము లగుచున్నవి. అతడు సత్యపదార్థము. మధురాది రసజాతము. సముద్రాది జలాశయగతజలములు, అగ్నియందలి తేజస్సు, కళానిధి కాంతి, నక్షత్రాదుల నవనవజ్యోతి, సర్వ పదార్థసారము, అమృతము, వేదములు, భూరాదిలోకములు, ప్రణవస్వరూపము అతడే. 4వ. సాయం సంధ్యలో వరుణోపస్థానము గలదు. ప్రాతస్సంధ్యలో సూర్యోవస్థానము గలదు. ఈ రెండిటికిని సమన్వయ మెట్లు ? ఈ ప్రశ్నము తారకాచార్య సూరవరపు లక్ష్మీపతి శాస్త్రిగారి 'సంధ్యా సందేహ నివారిణి' నుండి గ్రహింపబడినది. వారు చెప్పిన సమాధానమును యథాతధముగా ఇందుల్లేఖించుచున్నాను. శ్రీ శాస్త్రిగారు బహుప్రయసమునకు లోనై నిః స్వార్థులై తమ యావదాస్తిని క్రింద నుదహరించిన గ్రంథప్రచురణమునకే వినియోగించి సాధకలోకమునకు ఆంధ్ర మహాజనులకు మహోపకారము చేసిరి. వారి ప్రచురణములు :- 1. తైత్తిరీయ సంధ్యోపాసనము, 2. సంధ్యాసందేహనివారిణి, 3. సంధ్యావందనము, 4. వైదిక సంధ్యాఫలితము. 5. సంధ్యా చిహ్నము. (ప్రాప్తిస్థానము : వెంకట పూర్ణ సదనము, మైలవరము, కృష్ణాజిల్లా.) సాధకలోకము శ్రీశాస్త్రిగారి గ్రంథముల నాదరించి ఉచితరీతిని వారికి సహాయమొనర్ప వినయపూర్వకముగా ప్రార్థించుచున్నాను. శ్రీ శాస్త్రిగారు పై ప్రశ్నకు విపులముగా పదిపుటల సమాధానము వ్రాసిరి. దిని సారాంశము నుదాహరించుచున్నాను. ''సూర్యుడు తేజోరాశి, అగ్నిపుంజము. అగ్ని శబ్దవాచ్చుడు పరమాత్మ. 'అగ్నే రాపః' అను శ్రుతిప్రమాణము వలన అగ్నివలన జలముద్భవించెను. కాన భర్గస్సును గుఱించి ప్రాతఃకాలములన నుపస్థానము చెప్పవలయును. సాయం కాలములనందు సూర్యుడు సముద్రమున మునుగుచు అస్తమించునట్లు దృగ్గోచరు డగును. సముద్రమునకును తజ్జలము నకును అధిదేవత వరుణుడు. వరునాలయ మనగా సముద్రము వరుణ = జలమునకును, తదధిదేవతకుననుచ ఆలయము =ఆకరము- నివాసస్థానము. కనుక సముద్రమునకు వరుణాలయమని పేరు. జలమునకు పూర్వరూప మగ్ని దేవుడు. అగ్నికి ఉత్తరరూపము జలము. తేజోమయుడగు భర్గుడు కానరామి వాని యుత్తర రూపమగు జలాధి దేవతయను వరుణుని ప్రార్థింపవలయును. '' మన యుపాస్యదైవమును గాంచక - సూర్యుడు లేనిచో తేజమును ఉష్ణమును మనకెటులు లభించునని యార్తులమై వరుణుని ప్రార్థింప, తనయందు మునిగినట్లు తోచిన సూర్యుని సముద్రము నుండియే యుదయించునట్లు అనుగ్రహించుచున్నాడు. 'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ' అనియు, 'అసావాదిత్యః సత్యం' అను శ్రుతులవలనను, ఆదిత్యుడు సత్యస్వరూపుడు, సత్యము బ్రహ్మస్వరూపము; బ్రహ్మమును సత్యాన్వేషణరూపమున నుపాసించెనేని తేజోమయిడగు పురమపురుష సందర్శనమగును. రాత్రి నభిమానించు దేవత వరుణఁడు. అతడు వర్షించి సకల సస్యములను మొలకెత్తించి ఫలింజేసి ఆ యాహారముచే సమస్త ప్రాణులను సృజింపజేయును గాన సాయంకాలము వరుణోపస్థానము చేయుదుము. అనగా వరుణ మంత్రములతో (ఋక్కులతో) ప్రార్థింతుము. వరుణుడును సూర్యునివలెనె మనలను పాలించును. సూర్యుడు తన కరసహస్రముచే సాగరజలము నింకింపజేసి, ఆవిరిగా మార్చి, మేఘముల నుత్పత్తిచేయగా ఇంద్రాగ్నిచే వరుణుడు వర్షరూపమున జీవులకు సహాయ మొనర్చినట్లు ఉపకరించును. సూర్య వరుణ లుభయలును జేయునది మన పరిపాలనమే; గాన నిరువురు నొకేరూపము. అయినను కాలమునుబట్టియు క్రియలనుబట్టియు నామభేద మేర్పడెను. వ్యవహారమున నామములు వేరయ్యు, పారమార్థికరూపమున భావనయు నొక్కటే కనుక సూర్య వరుణు లిరువురు సములు. కాలభేదముచే నామాంతరములతో బ్రార్థింతుము. కావున సమస్వయవిషయమున సంశయింపబనిలేదు. గాయత్రీ దేవికి మూడు వేలలందును మూడ భిన్న నామములు; భిన్నవర్ణములు; భిన్నరూపములు ఉన్నను మన ముపాసించునపుడు సంధ్యాదేవత యొక్క టేయని యెరుగుదుము. అటులే వేర్వేరు వేళ్లతో, వేర్వేరు కాలములం దుపాసించు రహస్యమిదియే. ఏది యెటులున్నను ఉపాస్య దేవత ఒక్కటే యని గుర్తించుటే పరమావధి. మిత్రుడు - సవిత - వరుణుడు - అగ్ని అనునవి ఒక్క యర్థమునే యిచ్చును. వరుణ సూర్యాగ్నులు పరమాత్మ స్వరూపములు అని గ్రహించి, యొక్క పరమాత్మనే ప్రార్థించుచున్నామని విశ్వసించి ధ్యానింపవలయును. సంధ్యోపాప్తి అయినతో డనే వడుగులు అగ్నికార్యమును గృహస్థులు ఔపాసనమును జేయుటయు అగ్నిరూప పరమాత్మ ధ్యానమే దీని సారాంశమనియు తెల్పి, ఇదియే దీని సమన్వయమని మనవి చేయుచు, ముగించుచున్నాము. (శ్రీ సూరవరపు లక్ష్మీ పతి శాస్త్రి, గాయత్రీ మంత్రార్థదీపిక.) గాయత్రీ మంత్రార్థమును ఉపాసకులు పలువిధములుగా భావించి, ధ్యానించి తత్ఫలము నొందుచున్నారు. అందు సూర్యోపాసకులు, దిగువ నుదాహరించిన తెరగున భావించుచున్నారు. ''మండలాంతరగతం హిరణ్నమయం భాసమాన వపుషం శుచిస్మితమ్, చండదీధితి మఖండ విగ్రమం చింతయే న్మునిసహస్ర సేవితమ్ ||'' గభస్తిమండలమును హిరణ్మయరూపమున సూర్యనామమున వ్యవహరింపబడు దివ్యశక్తి గాయత్రియే. ఉషఃకాలమున మందస్మిత దయాపూరిత ప్రసన్నవదనమున 'అరుణ'గా దర్శన మిచ్చునది గాయత్రి. మధ్యందిన మార్తాండమండలమున తీక్షకద్యోతద్యుతులతో విరాజిల్లు తేజంపుంజము సావిత్రీ దేవి. సహస్రాది మునిబృందము నిరంతరధ్యాన నిమగ్న చిత్రమున ఒడలుమఱచి ఆనందవారాశిలో తేలియాడు పరబ్రహ్మ తత్త్వము సరస్వతి. ఆ జగన్మాతయే జగచ్చక్షువై సూర్యరూపమున ప్రత్యక్షదర్శనమిచ్చుచున్నదని భావించి, పరబ్రహ్మతత్వమునకు స్త్రీ పుం భేదము లేదుగాన, పురుష రూపకల్పనచేసి, గాయత్రీ మంత్రమునకు ఈ దిగువ నుదాహరించినట్లు అర్థము చెప్పుచున్నారు. దేవ= ప్రకాశించుచున్న - తత్ - తస్య - ఆ, సవితుః= సూర్యునియొక్క, వరేణ్యం= శ్రేష్టమైన, భర్గః =తేజస్సును, ధీమహి= ధ్యానింతుము, యః =సూర్యుడు, నః= మాయొక్క, ధియః= బుద్ధులను, ప్రచోదయాత్= ప్రేరేపించుచున్నాడో- అసమాన తేజోవిరాజితుడగుట - దేవుడు అనబడుచున్నాడు. సర్వజనసుఖహేతుకమగు వర్ష కారకుడుగావున సవిత. సహస్రానేక కిరణములచే జగత్తునందు వ్యాపించి తరింపజేయువాడగుట సవిత. పెడమార్గమలు బట్టిన విషయాసక్తములైన చిత్తముల సత్కర్మానుష్ఠానమునందు ప్రేరేపించు జ్ఞానజ్యోతి సూర్యభగవానుడు. అట్టి మహామహిమాన్వితుని శ్రేష్ఠమగు 'భర్గస్సు'ను ధ్యానించెదము. శైవులు ధ్యానించుక్రమము : శ్రు|| అసౌయస్తామ్రో అరుణ ఉతబభ్ర స్సుమంగలః యేచే మాగ్‌ం రుద్రా అభితో దిక్షు | శ్రితాస్సహస్రశో వైసాగ్‌ం హేడఈమహే | అసౌ యో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశ న్నదృశ న్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మీడయాతినః నమోఅస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేఢుష | అధోయే అస్యన త్వానో೭హంతేభ్యో೭కరం నమః|| --- శతరుద్రీయము. సూర్యమండలాంతర్వర్తియగు పురుషుడు - పరమశివుడే యని శైవుల భావన. గ్రీవములు అనగా కిరణములు. తమ స్సంపర్కముచే నీలగ్రీవములుగల సూర్యుడ - నీలగ్రీవుడు. కాలకూటవిషయమును కంఠమున ధరించుటచే శివుడు నీలగ్రీవుడు. సంధ్యారాగా సంపర్కముచే - విశేషలోహిత కిరణములుగల సూర్యుడ విలోహితుడు. శుద్ధస్ఫటిక సంకాశ శ్వేతవర్ణము - పరశివునిది. సంధ్యానృత్య సందర్భమున పృథ్వీసంబంధ తామ్ర విమర్శాంశ విశేషించి ప్రకాశతనువున ద్యోతకమగునపుడు - శివుడు విలోహితుడు. అట్టి పరశివుడు - ఉదయమున అరుణవర్ణముతోడను, అటుపిమ్మట పింగళవర్ణముతోడను, ఆపిమ్మట శుభప్రదమగు హిరన్మయ రూపమునను ఆదిత్యరూపమున ప్రత్యక్షమై ఉపాసకులకు అభీష్టఫలసిద్ధి నొసంగుచున్నాడు. ఆమహాదేవుని ఆజ్ఞాను వర్తులై తదనుచరులు సాదృశ్యరూపములతో సర్వత్రవ్యాపించి జీవరాశికి వారివారి పుణ్యపాప కర్మానురూప ఫలప్రదానము చేయుచున్నారు. అట్టి రుద్రుడు కోపాతిశయమున మమ్ము బాధింపకుండుగాక ! కైలాసవాసి - పరశివుడు. ఆయనను బ్రహ్మవిదులు మాత్రమే గాంచగలరు. తదితరులకు చూడశక్యముగాదు. ఇట్టి రూపమనియు తెలియజాలరు. కనుక ఆబాలగోపాలము చూచి అర్చించి తరించునిమిత్తము. ఉమాసహాయుడై ఆదిత్యరూపమున ప్రత్యక్షమగుచున్నాడు. వారి దృష్టిలో గాయత్రి మంత్రార్థము ఈదిగువ నుదహరించిన తెఱగున నుండును. సవితుర్దేవస్య = సవితృరూప మండలాంతర్గత దేవుని యొక్క, వరేణ్యం= శ్రేష్ఠుడైన, తత్ -తం =ఆశివుని, ధీమహి =ధ్యానము చేసెదము. యః భర్గః =ఏశివుడు, నః =మమ్ము ధియః =అజ్ఞానమునుండి, ప్రచోదయాత్= పాదము జేర్చునో. ''సూర్య మండలాంతర్వర్తియగు పరశివుడు అజ్ఞానసాగరమునుండి ఉద్ధరించి జ్ఞానరూపమగు ఆవలిపారమును జేర్చిమోహపాశ బంధవిముక్తిని పొందించువాడు. '' అని ధ్యానించెదము. శ్లో|| ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాన్తం ధ్యాత్వా మునిర్గచ్ఛతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్ || (3) వైష్ణవులు ధ్యానించు క్రమము :- హరిః ఓం|| అథ నిత్యోనారాయణః బ్రహ్మానారాయన శివశ్చనారాయనః శక్రశ్చనారాయనః ద్యావాపృథివ్యౌచ నారాయణః కాలశ్చనారాయణః దిశశ్చనారాయణం ఊర్ధ్వశ్చనారాయణః అథశ్చ నారాయణః అన్తర్భహిశ్చ నారాయణః నారాయణ ఏవేదగ్‌ం సర్వమ్ | యద్భూతం యశ్చభవ్యమ్ నిష్కళంకో నిరఞ్జనో నిర్వికల్పో నిరాఖ్యాతశ్శుద్ధో దేవేకో నారాయణః స ద్వితీయో೭స్తి కశ్చిత్ య ఏవం వేదస విష్ణుదేవ భవతి స విష్ణురేవ భవతి || --- నారాయణోపనిషత్తు నారాయణుడే - ''య ఏషోం೭తరాదిత్యే హిరణ్యయః పురుషః '' ఆదిత్యమండలాంతర్గత పురుషుడై - సూర్య నారాయణుడు అని పిలువబడుచున్నాడు. శ్లో|| ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ నారాయణస్సరసిజాసన సన్నివిష్టః | కేయూరవాగ్మ్కర కుండలవాన్ కీరీటీ హారీ హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః || శ్రు|| య ఏషోం೭తరాదిత్యే హిరణ్యయః పురుషోదృశ్యతే | తస్య యథా కప్యాసం పుండరీక మేవ మక్షిణీ | పద్మమునందలి కర్ణికవలె - కంటిలోపాపవలె - ఆదిత్య మండలమధ్యగుడై - శిరమున రత్నకిరీటము, చెవులకు మకర కుండలములు, కేయూరకటకమండిత హస్తముల శంఖ చక్రగదా తోమరములు, కంఠమున దివ్యప్రభా భాసమాన రత్నహారములు ధరించి సువర్ణసదృస శుభగాత్రముతో చూడబడుచున్నాడు. ఇట్టి పురుషుని - దేవస్య= జగత్ర్కీడచే ఆనందించునట్టియు. నిరతియకాంతియుక్తుడైనట్టియు, సవితుః= సర్వస్రష్టయగు పరమాత్మునియొక్క, వరేణ్యం= మహాత్ములచే కోరదగిన, భర్గః= అజ్ఞానమనెడి చీకటిని నివారించెడి యే తేజస్సుగలదో - తత్= వేదాంత ప్రసిద్ధమైన ఆ తేజస్సును, వః= మాయొక్క, ధియః= బుద్ధులను ప్రచోదయాత్= ప్రేరేపించుచున్నదో. సకల చేతనా చేతనాత్మక జగత్ర్కీడచే ఆనందించువాడు ఆదిత్యమండలాంతర్వర్తి, తేజోమయుడు, పురుషోత్తముడు, నారాయణుడు. అట్టి సూర్యనారాయణుని ధ్యానించి, ''వేదా೭హమేతం పురుషం మహాన్తం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్'' అని కృతార్థులగుచున్నారు. శ్లో|| జన్మ మృత్యు వినాశాయ దుఃఖస్య త్రివిధస్య చ, ధ్యానేన పురుషోయస్తు ద్రక్ష్య స్స స్సూర్యమండలే || యోగి యాజ్ఞవల్క్యః. జనన మరణ రాహిత్యమునకు, ఆధ్యాత్మిక, ఆధిదైవిక, అధిభోతిక త్రయీవిధ దుఃఖనివారణకు సూర్యమండలమంది నారాయణుని ధ్యానముచే దర్శించవలెను. (4) బ్రహ్మవిదులదృష్టిలో గాయత్రీ మంత్రార్థము. దేవస్య =అఖండానందరసమైనట్టియు, సవితుః= జగత్కారణమైనట్టియు, తత్, తస్య =ఆ పరబ్రహ్మముయొక్క, వరేణ్యం= శ్రేష్ఠమైన, భర్గః= అవిద్యాదోష నివారకమగు తేజస్సును, ధీమహి= ఇట్టిదిగా ధ్యానము చేసెదము. యః= ఏ ప్రత్యగాత్మ, నః =మాయొక్క, ధియః= అంతఃకరణవృత్తులను, ప్రచోదయాత్= ప్రేరేపించునో, అఖండానందైకరసమై జగదుపాదానకారణమై, పరిపూర్ణజ్యోతిరూపమై, అంతఃకరణములందు ఆత్మధర్మా೭భాసకమై, సాక్షియో, ప్రత్యగాత్మయైయున్న పరబ్రహ్మమును ''సో೭హం'' ''అతడే నేను'' అని ప్రత్యగ్లక్షనానుసారముగా మేము ధ్యానించెదము. యః= లింగధర్మరమితమైన; సత్యజ్ఞానదాలక్షణములు గల యే పరమాత్మ; నః= చిరకాలమునుండి అభ్యాసమైన భిన్నభేదభావముగల మాయొక్క; ధియః= అంతఃకరణవృత్తులను, ప్రచోదయాత్ ప్రేరణచేయుచున్నదో, సత్యసవితుః= సకల జగదుత్పత్తి స్థితి సంహారకారకుడైన, అంతర్యామిరూపుడగు ప్రేరక స్వభావము గల; దేవస్య= ప్రకాశమానమైన పరమాత్మయొక్క; వరేణ్యం= ఏది జగత్తునకు ఆధారముగా నున్నదో, అట్టి ఆశ్రయించదగిన, సుఖస్వరూపమైన; భర్గః =స్వసాక్షాత్కారముచేత ఆవిద్యను, దాని కార్యవర్గమైన ఆవరణమును విక్షేపమును, సంసారమును, పాపములను దహించెడి; తత్= వాఙ్మనస్సులకు అగోచరమైన, సూర్యమండలముందు, ధ్యానించదగిన సకలవేదములందును, సకల లోకములందును, ప్రసిద్ధాముగానున్న ఆ బ్రహ్మస్వరూపమును; ధీమహి= నేను; ఆ బ్రహ్మస్వరూపుడనని అట్టిచో బ్రహ్మముతో తనకు అభేదము సిద్ధించుటకొఱకు 'అహం బ్రహ్మాస్మి' యని ధ్యానించు చున్నాము. ''అహం - బ్రహ్మాస్మి'' అను మమావాక్యార్థమును వివరింపుడు : శ్రు || పరిపూర్ణః పరాత్మా೭స్మిన్ దేహే విద్యాధికారిణి, బుద్ధేః సాక్షితయాస్థిత్వా స్ఫురన్నహ మితేప్యతే || శ్రు|| స్వతః పూర్ణః పరాత్మా೭త్ర బ్రహ్మశ##బ్దేన వర్ణితః, అస్మీత్యైక్య పరామర్శస్తేన బ్రహ్మభవామ్యహ్|| -- శుకరహస్యోషనిషత్తు. క్షణభంగురము, బుద్బుదప్రాయమునైనది మన శరీరము.పరిసర ప్రకృతిప్రభావమునకులోనై, వికారమును, అనగా మార్పును జెందునది. ఇదియే స్థూలశరీరము అనబడుచున్నది. ఇందు అంతర్గతమై, సూక్ష్మశరీరము గలదు. మనో, బుద్ధి, చిత్తాహంకారములును, అంతఃకరణ చతుష్టయమునకు సూక్ష్మశరీరము - కోశము; ఒర. సర్వస్వతత్త్వము. స్వప్రకాశత్వము ఆదిగాగల షడ్గుణౖశ్వర్యసంప్నము పరమాత్మ. దేశ కాల వస్తు భేదరహితము. త్రిగుణాత్మకమై, మాయావశ##మై, తన్ను మరచిన అంతఃకరణమునకు చిచ్ఛక్తిని, స్ఫురణశక్తిని, జ్ఞానశక్తిని, తేజస్సంపదను చేకూర్చుచు 'బుద్ధి' రూపమున ఉండు పరమాత్మయే 'సాక్షి' యని, 'అహం' అని చెప్పబడుచున్నది. 'అస్మి' అను పదము 'జీవాత్మ' 'పరమాత్మల ఏకత్వమును అనుంధానించుచున్నది. అహం + బ్రహ్మ అను ఈ రెండు పదములకు భేదములేదు. ఒకటి 'ఆత్మబ్రహ్మ', మరి యొకటి 'జీవబ్రహ్మ'. 'అహంబ్రహ్మాస్మి' అనునది మమావాక్య చతుష్టయమునందు ఒకటి. ఇది శుక్లయజుర్వేదాంతర్గత. బృహదారణ్య కోపనిషద్వాక్యము. ఉపనిషత్ర్పతిపాద్యమైన ''అహంబ్రహ్మాస్మి '' మహా వాక్యార్థమును 'బాల', 'త్రిపురా' అను నామాంతరములు గల మంత్రరాజము శాక్తసంప్రదాయమున ప్రతిపాదించుచున్నది. 'ఐం క్లీం సౌః' 'సౌః క్లీం ఐం' అను త్రిపురాద్వయము యొక్క అర్థము='నేను బ్రహ్మమును అగుచున్నాను' 'బ్రహ్మమే నేను అగుచున్నాను.' ఈ మంత్రమునకు ఉత్పత్తి ఐం క్లీం సౌః అను మూడు బీజాక్షరములు మాత్రమే. ఐనను వీనిని అనులోమ - విలోమ క్రమమున 'ఐం క్లీం సౌః' 'సౌః క్లీం ఐం' అని షడక్షరములుగా ఉపాసించుట శిష్టాచారము; శాక్త సంప్రదాయము. బీజము అనగా విత్తనము. మఱ్ఱి, రాగి, మామిడి మొదలగు బీజములు (విత్తనములు) సూక్ష్మాతి సూక్ష్మములై అవ్యక్తముగా ఊహింపశక్యముగాని మహావృక్షముల తయమందు ఇమిడ్చికొని యున్నవి. అటులనే ఇందు మూడు లేక నాలుగు వర్ణములు ఒకే వర్ణముగా సంపుటీకరింపబడి బీజరూమున మహాశక్తి సంపన్నములుగా అత్యంత శీఘ్రఫలదములుగా సాధకులకు అనుగ్రహింపబడినవి. 'ఐం క్లీం సౌః' అను త్రిపుటియందు ప్రథమబీజము 'ఐం' - 'అ+ ఈ అ +ం' అను నాలుగు వర్ణములు గలది. దీనికి వాగ్బీజము, సారస్వత బీజము అని నామములు. ఇందు 'అ' కారబిందువులు - బ్రహ్మను, పరశివుని సూచించును. 'ఈ' కారము - సరస్వతి, పరాశక్తులను సూచించును. ఇవి ఋగ్యజుస్సామములను వేదత్రయమును, సమిష్టిబీజము అగు 'ఐం - వాణీ హిరణ్యగర్భులను, పరాశక్తి, పరశివులను సూచించును. రెండవ బీజము. క్లీం= (క+ ల+ ఈ+ ం ) చతుర్వర్ణ సమన్వితము. కామకలాబీజము; మన్మధబీజములను నామములు. ఇందు 'క' కార+ 'ం' బిందువులు - ''విష్ణు'' ప్రతిపాదకములు. 'ల' కార 'ఈ' కారములు= ''లక్ష్మి'' ప్రతిపాదకములు. సర్వసమిష్టిగా - ''క్లీం'' బీజము లక్ష్మీ= నారాయణాత్మకము. మూడవ బీజము: ''సౌః ''= (స+ ఔ+ ః) వర్ణత్రయ సంకలితము. పరాశక్తిబీజము - శివశక్త్యాత్మకము. వాణీ హిరణ్యగర్భాత్మక; లక్ష్మీనారాయణాత్మక; శివ శక్త్యాత్మకమైన మహాసారస్వత బీజము. ''ఈ '' కారము, పరాశక్తి స్వరూపము. అట్టి పరాశక్తియందు, పరబ్రఱహ్ము నందు, పరమాత్మయందు జీవాత్మను సాధకుడు అనుసంధానించి, ధ్యానించి, తాదాత్మ్యమును జెంది; ''బ్రహ్మమే నేను, నేను బ్రహ్మమును'' అని ఢంకాపై దెబ్బకొట్టి చెప్పగలుగుచున్నాడు. పర్యవసానము - త్రిపదాగాయత్రి యగు సంధ్యామంత్రము - ఉపనిషత్ర్పతిపాద్య మహామంత్రవాక్యమగు ''అహం బ్రహ్మాస్మి''. శాక్తసంప్రదాయ ప్రతిపాద్యమగు బాల, త్రిపురామంత్రము = ''ఐంక్లీం సౌః'' ఒకే బ్రహ్మపదార్థమును ప్రతిపాదించు చున్నది. తదుపాసకులు, ఒకే ఫలితమును పొందుచున్నారు. పలుతావులనుండి, బహుదూరప్రదేశములనుండి, కొండలలో, సమతలములలో ప్రవహించి, అంత్యమున అనంత గంభీరసాగరమున విలీనమై, రూపమునే కోల్పోవు నదీమతల్లుల వలె భిన్నభిన్న వర్ణసంకలిత మంత్రములును భిన్నభిన్నసంప్రదాయ ప్రతిపాదకములైనను, అనుష్ఠించుమార్గములు వేరైనను, అంత్యమున ఒకేఒక గమ్యమును చేర్చుచున్నవి; ఒకేఒక బ్రహ్మమునుగూర్చి పలుకుచున్నవి. ఒకే ఒక మూలప్రకృతిని నిర్దేశించుచున్నవి. ఆమూలప్రకృతియే ''గాయత్రీ'' ''వ్యాహృతి'' ''సంధ్యా'' ''ద్విజబృందనిషేవితా'' యని లలితాసహస్ర నామములయందు ప్రతిపాదింపబడిన జగదేక మాత శ్రీరాజరాజేశ్వరి. శ్లో||
ఆధారే తరుణార్కకోటి రుచిరే వాగ్బీజ మిందు ప్రభం బీజం మాన్మథ మింద్రగోపసదృశం హృత్పంకజే సంస్థితమ్, రంధ్రే బ్రహ్మపదస్య శాక్తమపరం సోమప్రభా భాస్వరం యే ధ్యాయంతి పదత్రయం తవశివే తేయాంతి శైవంపదమ్|| ఎవరెట్టి రూపముల ధ్యానించినను ఆయారూపములతో ఆయాశక్తిసంపదలతో ప్రసన్నరూపమున గోచరించి దయార్ద్ర చిత్తమున అనుగ్రహించి అభీష్టసిద్ధిని ప్రసాదించునది శ్రీమాతయే. మనము ఆరాధించు బహువిధ సగుణ దేవతల యందలి చైతన్యశక్తి ఆమెయే. వారియందు ద్యోతమానమగు దివ్యతేజఃపుంజము ఆమెదే. నిర్గుణ బ్రహ్మోపాసనకు గాయంత్రీమంత్రజపము తొలి మెట్టు. సహస్రానేకజన్మల కావల దుర్లభ##మైన మానవజన్మ మనకు కలిగినది. జడప్రాయుడైన బాలునకు ఐదునుండి ఎనిమిది వర్షముల ప్రాయము లోపుననే అనగా ఇంకను పాపపంకిల వాతావరణమున కాలిడకముందే బ్రహ్మవేత్తల ఆదేశానుసారము అనుభవజ్ఞుల ఆశీర్వచనపురస్సరముగా శ్రుతిస్మృతి సమ్మతమైన వేదప్రతిపాద్యమైన సరణిని ఉపనయనసంస్కారము చేయబడుచున్నది. అందు ''ఓం|| ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్ని ర్దేవతా బ్రహ్మ ఇత్యార్షమ్ గాయత్రం ఛందం పరమాత్మం సరూపం సాయుజ్యం వినియోగం'' అని ఉపదేశింపబడుచున్నది. ''ఓం'' ఒక అక్షరము. అక్షరమైన నాశరహితమైన బ్రహ్మము. అట్టి పరమాత్మ స్వరూపమైన 'ఓం' కారమునకు, ప్రణవమునకు దేవత 'అగ్ని'. 'అగ్ని'యు బ్రహ్మమే. 'అర్షం' అనగా ఋషియు బ్రహ్మమే. ఛందస్సు గాయత్రి. అనగా గాయత్రీరూప బ్రహ్మశక్తియే. పరమాత్మం సరూపం=అనగా పరమాత్మస్వరూపము. పరమపద బ్రహ్మ సాయుజ్యము చెందుటకు, మోక్షపదమును చేరుటకు ''వినియోగం'' అ
నగా సర్వమును బ్రహ్మమయమేనని దిఙ్మాత్రముగా సూచింపబడినది. 13. గాయత్రీ శిరోమంత్ర మెట్టిది? దాని స్వరూపమేమి? ''ఓమాపోజ్యోతీ రసో೭మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం'' -ఇది గాయత్రీ శిరోమంత్రము. జలము, తేజస్సు. మధురాదిరసము, దేవతల యన్నము అగు అమృతము, ఋగ్యజుస్సామవేదములు, భూర్భువస్సువ రాది సప్తలోకములు అన్నియు ప్రణవప్రతిపాద్యములే. పృథివ్యప్తేజో వాయురాకాశములు, శబ్ద, స్పర్శ, రూప, రస గంధములు, ప్రకృతి, సప్తలోకములు (పరబ్రహ్మము) పర మాత్మయొక్క లీలావిభూతియే. ఆద్య ఓంకారము, అంత్య ఓంకారము ఈ రెండింటి అంతరమున చెప్పబడిన సమస్తమును బ్రహ్మమందు పుట్టి, బ్రహ్మమందు వృద్ధిచెంది, బ్రహ్మమందే లయమగును. జీవాత్మ, పరమాత్మలకు శేషిశేషభావము ప్రతిపాదించుచున్నది ప్రణవము. భగవదుపలక్షణము - చేతన జగత్తు. భగవదాయత్తము - అచేతన జగత్తు. త్రిపదాగాయత్రి ఋగ్యజుస్సామములనుండి ఉద్ధరింపబడినది. ప్రణవమందలి 'అ'కార 'ఉ'కార 'మ'కారములు ఋగ్యజస్సామములను, 'భూః' 'భువః' 'సువః' అను వ్యాహృతి త్రయమును, భూర్భువస్సువర్లోకములను; బ్రహ్మ విష్ణు రుద్రులను; అగ్ని, వాయువు, సూర్యుడు ఆదిగాగల జగత్ సృష్టి స్థితి లయకారణ భూత (పదార్థముల) శక్తి స్వరూపముల సూచించుచున్నవి. చతుర్దశ భువనములు, పంచభూతములు ఉన్నవి గదా? శిరోమంత్రమందు భూర్భువస్సువర్లోకత్రయమును అగ్ని ర్వాయు నూర్యులు అను మూర్తిత్రయమును మాత్రమే ఏల చెప్పినారు? తక్కినవాని మాట ఏమి? భూర్భువస్సువర్లోకములు మూడును, తదధినాయకులగు అగ్ని, వాయు, సూర్యులును ముఖ్యములగుట మిగిలిన వానిని అప్రధానముగాభావించి వ్యాహృతిత్రయమును, తదధిపతులు మాత్రమే బ్రహ్మవేత్తలచే గ్రహింపబడినారు. 'అ'కార 'ఉ'కార 'మ'కారములు - బ్రహ్మవిష్ణురుద్రులను, సృష్టి స్థితి లయములను సూచించుచున్నవి. అర్థమాత్ర - ఈ మూడువర్ణములకును శిరోభూతమైన జ్యోతిస్వరూపమగు శుద్ధ నిర్గుణ పరబ్రహ్మమగు పరాశక్తిని సూచించుచున్నది. పిపీలికాది శివాంతము ఆస్తంబ బ్రహ్మపర్యంతము సర్వమును ఆపరాశక్తియొక్క ఆనందక్రీడయే, ఇచ్ఛారూప క్రియా శక్తియే యని గాయత్రీ శిరోమంత్రము స్ఫురింపజేయుచున్నది. ఈ శిరోమంత్రమునే బ్రహ్మవిదులు ఆత్మపరముగా ఆత్మకు ఉపలక్షణముగా చెప్పినారు. ೧. ఆప్నోతీతి ఆపః=సర్వవ్యాపకత్వము. ೨. జ్యోతిః=ప్రకాశస్వరూపము. 3. రసము=సర్వాతిశాయిత్వము. ೪. అమృతం=మరణాది సంసారనిర్ముక్తత్వము అమృతము. ೫. భూర్భువస్సువరోం=సచ్చిదానందస్వరూపము. 14. సప్తవ్యాహృతులకు అర్థమేమి? సప్తవ్యాహృతులును ఆత్మయొక్క (బ్రహ్మము యొక్క) స్వరూప వివేషములనియే బ్రహ్మవేత్తలు సెలవిచ్చినారు. చిత్తగింపుడు. (1) భూః=సంవితుః, (2) భువః=స్వప్రకాశము, (3) సువః=సుఖస్వరూపము, (4) మహః=సర్వాతిశాయిత్వము, (5) జనః=సర్వకారణత్వము, (6) తపః=లోకేశస్వరూపము, (7) సత్యమ్=నిత్యమైన బ్రహ్మస్వరూపము అనగా ఆత్మయొక్క చిద్రూపము. కనుక 'భూరాది' సప్తవ్యాహృతులు 'ఆపోజ్యోతి'. ఇది శిరోమంత్రము. ఉభయములును పరమాత్మయొక్క శక్తిసామర్థ్య ప్రతిపాదకములు మాత్రమే. 15. 'ఋషి' యనగా నెవరు? తపోబలముచే నిరంతర సాధనాఫలితముగా మంత్రద్రష్టలై మంత్రఫలమును అనుభవించువారు ఋషులు. 16. ఛందశ్శబ్ద నిర్వచనమేమి? అక్షర పరిచితమైనది ఛందస్సు. మాత్రస్వరూపమును నిర్ణయించునది ఛందస్సు. వాక్కు దానికి స్థానము. ఛందోబద్ధమైనది మంత్రము. అట్టి మంత్రమే సాధకునికి శీఘ్ర ఫలప్రదమగును. 17. మంత్రజప సమయమున వస్త్రమును ఆచ్ఛాదన చేసి కొందురు. ఎందువలన? మంత్రమును ఉచ్చరించునపుడు జుష్టముగా కుండ అనగా యెంగిలిపడకుండ ఉండవలెను. శ్లో||
ఓంకారః పురుషశ్చైవ గాయత్రీ సుందరీ తథా, తయోస్సంయోగకాలేతు వస్త్రమాచ్ఛాద్య గణ్యతేః పురుషుడు ఓంకారము. గాయత్రి స్త్రీరూపము. జప కాలము స్త్రపురుష సంయోగ సమయముగా భావింపబడి వస్త్రాచ్ఛాదన అత్యావశ్యకమని పెద్దలు నిర్ణయించిరి. 18. ప్రణవోపాసన చేయునపుడు ఋషి, ఛందస్సుల నేల చెప్పుట లేదు? ''ఓం'' ఇత్యేకాక్షరం బ్రహ్మ-అక్షరమైన, నాశరహితమైన ఏకాక్షరప్రణవము బ్రహ్మపదవాచ్యము. ఇది ''తారవాచి'' అనగా సంసారార్ణవమునుండి తరింపజేయునది యని యర్థము. ఇది రక్షణార్థకమైన అవధాతువునుండి నిష్పన్నమైనది. ''యో೭యం సో೭హం'' అను పరమహంస మంత్రము నందు తచ్ఛబ్దవాచ్య పరబ్రహ్మము ''నేను'' అని బోధించు ''సో೭హం'' అను పదములందు హల్లులు 'స' కార 'హ' కారములు లోపింపగా-లుప్తముకాగా సంధివశమున ''ఓం'' అగును. శంకరభగవత్పాదుల అభిప్రాయము. సర్వసంగపరిత్యాగము చేసియేగదా సాధకులు తురీయాశ్రమమును స్వీకరించుట. సర్వవేదసారము ప్రణవము. ''తత్'' పదమును చేరుటకు వారికి ప్రణవము ఊతగఱ్ఱ, తక్కిన ఋషి ఛందస్సులు, తదధిష్ఠాన దేవతలు, బ్రహ్మమునందే లయమగుట - సాధకులు ప్రణవోపాసనావరసరమున ఋషి ఛందస్సు లను, దేవతను పేర్కొనుట లేదు. 19. చతుర్వింశత్యక్షరా త్రిపదా గాయత్రీ. ఈ మహామంత్రమునకు ఋషులు, ఛందస్సులు, దేవతలు, తత్త్వములు, శక్తులు, ముద్రలు, న్యాసములు కూడా చతుర్వింశతి కలవని చెప్పుదురు. వాని విరవములు తెలియజేయుడు. ఈ మహామంత్రములోని ఒక్కొకవర్ణము ఒక్కొక బీజము. కనుక ప్రత్యేక ఋషి ఛందోదేవతలు, వానిముద్రలు కలవు. వివరములు ఈదిగువ నుదాహరింతును. చిత్తగించుడు. ೧. ఛందస్సులు ఇరువదినాలుగు:- గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పఙ్త్కి, త్రిష్టుప్, జగతి, ఆదిజగతి, శక్వరి, ఆదిశక్వరి, త్రితి, అతిత్రితి, విరాట్, ప్రస్థర, పఙ్త్కి, కృతి, ప్రకృతి, ఆకృతి, వికృతి, సంకృతి, అక్షర పఙ్త్కి, భూః, భువః, జ్యోతిస్సు. ೨. ఋషులు ఇరువది నలుగురు:- వామదేవుడు, అత్రి, వశిష్ఠుడు, శుక్రుడు, కణ్వుడు, పరాశరుడు, విశ్వామిత్రులుడ, కపిలుడు, శౌనకుడు, యాజ్ఞవల్క్యుడు, భారద్వాజుడు, జమదగ్ని, గౌతముడు, ముద్గలుడు, వ్యాసుడు, లోమశుడు, అగస్త్యుడు, కౌశికుడు, వత్సుడు, పులస్త్యుడు, మండూకుడు, దుర్వాసుడు, నారదుడు, కశ్యపుడు. 3. దేవతలు ఇరువది నలుగురు :- అగ్ని, ప్రజాపతి, సౌమ్యుడు, ఈశానుడు, సవిత, ఆదిత్యుడు, బార్హస్పతి, మైత్రావరుణుడు, భగదేవత, అర్యముడు, గణశుడు, త్వష్ట, యుషా, ఇంద్రాగ్నులు, వాయువు, మిత్రావరుణుడు, విశ్వేదేవులు, మాతృకా, విష్ణువు, వసువులు, రుద్రుడు, కుబేరుడు, అశ్వని. ೪. తత్త్వములు ఇరువది నాలుగు:- భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దము, వాక్కు, పాణి, ఉపస్థ, పాయువు, పాదము, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, రసన, నాశిక, మనస్సు, అహంకారము, మహత్తత్త్వము (రజస్సు), తమస్సు (గుణత్రయము). ೫. శక్తులు ఇరువది నాలుగు:- వామదేవి, ప్రియ, సత్య, విశ్వ, భద్రవిలాసిని, ప్రభావతి, జయ, శాంతా, కాంతా, దుర్గ, సరస్వతి, విద్రుమ, విశాల, ఈశాని, వ్యాపిని, విమల, తమోహారిణి, సూక్ష్మా, విశ్వయోని, జయవశా, పద్మాలయా, పరాశోభా, పత్రము, త్రిపదా (తమస్సు). ೬. ముద్రలు ఇరువదినాలుగు. సుముఖము, సంపుటము, వితతము. విస్తృతము, ద్విముఖము, చతుర్ముఖము, పంచముఖము, షణ్ముఖము, అధోముఖము, వ్యాపకము, అంజలి, శకటము, యమపాశము, గ్రథితము, సమ్ముఖము, ఉన్ముఖము, ముష్ఠికము, మత్స్యము, కూర్మము, వరాహము, సింహాక్రాంతము, మహాక్రాంతము, ముద్గరము, పల్లవము. `ò. న్యాసములు ఇరువదినాలుగు:- రెండు కాలిబొటనవ్రేళ్ళు, రెండు మణికల్లు, రెండు మోకాలి క్రింది భాగములు (పిక్కలు), రెండు జంఘలు, గుహ్యము, బీజము, నడుము, నాభి, ఉదరము, కుడి ఎడమ స్తనములు, కుడి ఎడమ రొమ్ములు, కంఠము, ముఖము, నాశికారంధ్రములు, నాశిక, రెండు నేత్రములు, నొసలు, లలాటము, చుబుకము, ఊర్ధ్వోష్ఠము, అధరోష్ఠము, శిరము. ೮. ఫలితము - సర్వపాపపరిహారము :- పాపము, ఉపపాతకము, మహాపాతకము, శోకనాశనము, గర్భహత్య, అభోజ్యపదార్థభక్షణ, గురుపత్నీగమన, బ్రహ్మహత్య, పురుషహత్య, పశుహత్య, స్త్రీహత్య, గురుహత్య, మానసికముగా చేయు పాపములు, మాతాపితృహత్య, పూర్వ జన్మకృతపాపము, ప్రాణివధ, దానవాక్యభంగము ఆదిగాగల సర్వపాపములు పరిహారమగును. ఫలప్రాప్తి :- స్వర్గము, బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము, త్రిమూర్తిస్వరూపము. 20. మీరు ఇంత వివరముగా ఉదహరించిన ఇవి యన్నియు యేల అనుష్ఠింపబడుట లేదు? శ్రుతి స్మృతులకు అత్యంతప్రాధానము నిచ్చినవి కర్మకాండ ప్రతిపాదకములైన వేదుముల. విస్తృతములుగా శ్రుతి స్మృతులయందు ఇవి ఉదహరింపబడలేదు. అసలు యివి ముఖ్యాంగములుగానే అవి పరిగణించలేదు. వీనిని అనుష్ఠింపక బోయినను ఫలసిద్ధికి లోటు ఉండదని బహుశా మన పెద్దలు భావించి యుండవచ్చును. 21. అఘమర్షణమందు 'ద్రుపదాదిన' అను మంత్ర ముచే చెప్పబడిన పాపపురుష స్వరూప మెట్టిది? బ్రహ్మహత్య శిరము, భుజములు పరధనాపహరణములు, హృదయము విషయవాంఛా లోలత్వము అనబడు సురాపానము, పైన ఉదహరించిన ఈ పాపములను జేర్చునవే రెండుపాదములు. అభోజ్యపదార్థ భక్షణ, పశుహత్య, శిశుహత్య, మాతా పితృ భ్రాతృహత్యలు మొదలగు పాతకములు తదితర అంగములు. ఉపపాతకములన్నియు రోమములు అని చెప్పబడుచున్నవి. 22. గాయత్రీమాత పద్మమునందు ఉపవిష్టయైనటుల చెప్పబడుచున్నది. పద్మముయొక్క సంకేతమేమి? ధర్మమే పద్మము. తన్మూలము జ్ఞానము. కర్ణిక వైరాగ్యము. సాధకుడు వీనిని శ్రద్ధాభక్తులతో అనుకరించుచో, పట్టుదలతో, ఆచరణలో పెట్టుచో, దీక్షతో అనుష్ఠించుచో శ్రీమాత సాయుజ్యమును, సారూప్యమును, తాదాత్మ్యమును చెందవచ్చును. 23. గాయత్రీ మహామంత్రము చతుష్పదగదా? 'త్రిపద' గానే యేల ఉపదేశించుచున్నారు? తురీయపాదమును వదలుటకు కారణమేమి? ఇది ఉపాస్యముగాదా? ఋగ్యజుస్సామములనుండి త్రిపదాగాయత్రి సంగృహీతమైనది. నాలవదైన అధర్వణవేదమునుండి 'పరోరజసిసావదోం' అను తురీయపాదము గ్రహింపబడినది. త్రిపదాగాయత్రియే సర్వవేదసమ్మతముగా ఉపనీతునకు నిర్దేశింపబడినది. అధర్వణ వేదసరణిని మరల సంస్కరింపబడిన సాధకుడే ఈ తురీయపాదమును ఉపాసింప అర్హత కలవాడగును. 24. 'పరోరజసిసావదోం' అనగా అర్థమేమి? ೧. రజసే=సత్త్వరజస్తమోగుణాత్మిక ప్రకృతికంటె, పరః=అతీతుండును, ఓం=ప్రణవవాచ్యుండును అగు పరమాత్మ, సావత్=మాకు శుభము లిచ్చుగాత! -చల్లా లక్ష్మినృసింహశాస్త్రి. ೨. రజసః పరం - పరోరజః=తస్మిన్ పరోరజసి - మూలప్రకృతి కంటె వేఱుగానున్న ఏపరమాత్మ గలదో, సా=శ్రుతి స్మృతులయందు ప్రసిద్ధముగానున్న ఆ బ్రహ్మశక్తి, నః=మమ్ములను, సాధకపుంగవులను, గురుశిష్యులను, అవత్=తనసాయుజ్యమునిచ్చి రక్షించుగాక! 3. పరోరజసిసావదోం|| 'పరోరజసి సా అవతు ఏవం పదవిభాగః||' రజసః పరః పరోరజః తస్మిన్ పరోరజసి మూలప్రకృతేః పరః అగ్రేస్థితం యత్తేజః సంవిద్రూపం వా మూలప్రకృతేః పరః పురుషః తస్మిన్ సంవిద్రూపేణయా స్థితా సా సర్వోపనిషత్ర్పతిపాదిత బ్రహ్మశక్తిర్వా రజసః శబల బ్రహ్మాత్మిక పూర్వోక్త పాదత్రయాత్పరం శుద్ధబ్రహ్మమయ అసంగ చిద్రూపా ధృవకలానామ త్రిపురసుందరీవా నః సాధక పుంగవాన్ అవతు రక్షత్వితి అత్రజ్ఞానయోగప్రకరణ రజశ్శబ్ద తమశ్శబ్దౌ మూలప్రకృతి వాచకౌ|| శ్రు||
వేదాహమేతం పురుషం మహాన్తం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృత ఇహభవతి|| అత్రాపి - తమసః పరస్తాత్ - మూలప్రకృతేః యః పరస్తాత్ || అసంగత్వేన అన్యధాస్థితః తం పురుషం యస్సాధకః వేదసః|| ఇహ అస్మిన్నే వజన్మని అమృతః మరణధర్మ రహితో భవతి బ్రహ్మభూతో భవతీతి యావత్ అన్యచ్చ|| శ్రు||
ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్ధేభ్యశ్చ పరంమనః మనసశ్చ పరాబుద్ధిః బుద్ధేః పరతరం మహః మహతః పరమవ్యక్తం అవ్యక్తాత్పురుషః పరః పురుషాన్న పరం కించి త్సాకాష్ఠా సా పరాగతిః|| అత్రతు - అవ్యక్తనామక గుణత్రయ సంవలిత మూల ప్రకృతిరేవేతి|| శ్రుతిప్రమాణసిద్ధః సకలభావాతీత సచ్చిదానందస్వరూపిణీ పరాశక్తిః అనేకజన్మవాసనావాసిత భిన్న భేదయుక్తా న్నః అపరోక్షజ్ఞానరూప స్వసాయుజ్యం దత్వా అవతు, రక్షత్వితి - స్వస్వరూప జ్ఞానం దేహేతి ప్రార్థనారూపోయం తురీయ పాదార్థః|| -బ్రహ్మ శ్రీ సింహంభట్ల రామమూర్తిశాస్త్రి ఉపనిషత్తులయందు - అనేక విధముల కొనియాడబడిన కీర్తింపబడిన శ్లాఘింపబడిన చిచ్ఛక్తి బ్రహ్మశక్తి ''ఓం స్తుమః పుంవత్కరం కించిదరుణం - తరుణీమయం - కలాపంచదశారబ్ధం కమనీయం పరం మహః'' అని స్తుతింపబడిన అఖండామిత తేజోరాశి - భావాభావ కలావినిర్ముక్త - సర్వసంకల్పరహిత - షోడశీనామాంకిత - అనేకకోటిజన్మసంచిత పుణ్యపాప సంక్షయ మొనర్చి - తన దివ్యసాయుజ్యము నిచ్చి మమ్మురక్షించుగాక! ఈ తురీయపాదము శాక్తబంధులు ఉపాసించు షోడశి మంత్రమునకు తుల్యము. అర్థభేదమును లేదు. 25. తురీయపాదము 'షోడశి' మంత్రమునకు తుల్యమనినారు. బాగుగనే యున్నది. మరి పంచదశాక్షరి త్రిపదాగాయత్రికి తుల్యమని చెప్పబోవుచున్నారా ఏమి? ఔను. నిస్సందేహముగా పంచదశాక్షరి త్రిపదాగాయత్రీమంత్రమునే ప్రతిపాదించుచున్నది. త్రిపదాగాయత్రికి బ్రహ్మవేత్తలు చెప్పు అర్థమును చిత్తగింపుడు: ೧.
ఓం భూర్భువ స్సువః ఓం తత్సవితుర్వ రేణియమ్ | భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ||ఓం|| ೨.
ప్రేరయేత్తస్య యర్భర్గ స్తద్వరేణ్య ముసాస్మహే ||
విద్యారణ్యులవారు సెలవిచ్చిన క్రమము :-
1. తదిత్యవాఙ్మనో೭గమ్యం ధ్యేయం యత్సూర్యమండలే,
సవితు స్సకలోత్పత్తి స్థితి సంహారకారిణః,
వరేణ్య మాశ్రయణీయం యదాధార మిదంజగత్ ||
(న) భర్గః స్వసాక్షాత్కారేణా విద్యాతత్కార్యదాహకం,
దేవస్య ద్యోతమానస్య హ్యాసందాత్క్రీడతో೭పివా,
ధీమహ్యహం సఏవేతి తేనైవా భేదసిద్ధయే ||
(స్త్రీ) ధియోంతః కరణవృత్తేశ్చ ప్రత్యక్ర్పవణచారిణీః||
(పుం) య ఇత్యలింగధర్మం యత్సత్యజ్ఞానాది లక్షణం,
నో೭స్మాకం బహుధా೭భ్యస్త భిన్న భేదదృశాం తథా,
ప్రచోదయాత్ర్పేరయతు ప్రార్థసేయం విచార్యతే ||
2. ఖండరాజమునందు ఇటుల చెప్పబడినది :-
యస్సూర్యః ప్రేరయతి నో బుద్ధీర్దీప్తస్య తస్యవై,
ఖ్యాతం స్వరూపం ధ్యాయే మ సేవ్యం పాపదిభర్జకమ్ ||
అర్థః - యస్సవితా, నః=అస్మాకం; ధియః=బుద్ధి వృత్తేః; ప్రచోదయాత్=ప్రేరయతి, సవితుః=జగత్ర్పసవితుః; దేవస్య=దీప్తస్య; వరేణ్యం=సేవ్యం; భర్గః=అవిద్యా పాపాది భర్జకం; తత్=ప్రసిద్ధస్వరూపం, ధీమహి=ధ్యాయేమ; యః=పుంలింగము; ధియః=స్త్రీలింగము; భర్గః=నపుంసక లింగము.
శ్రీసాయణాచార్యులవారు గాయత్రీ మంత్రార్థమును ఈదిగువ నుదహరించిన తెఱగున సెలవిచ్చినారు.
శ్లో|| బుద్ధేః కర్మాణి వాస్మా೭కం యః ప్రేరయతి తస్య తత్|
దేవస్య సవితుః ఖ్యాతం వరేణ్యం చింతయే మహః ||
అర్థః - యస్సవితా - నః=అస్మాకం, ధియః=ప్రజ్ఞాః, కర్మాణివా; ప్రచోదయాత్=ప్రేరయతి, తస్య=సవితుః, ప్రేరకస్య, అంతర్యామిణః; దేవస్య=ప్రకాశమానస్య (పరమాత్మనః), వరేణ్యం=వరణీయం (ప్రార్థనీయం), సుఖైకతాన రూపం, సర్వైసుఖసై#్స్యవ ప్రార్థనీయత్వాత్; భర్గః=సంసార దాహకం, తత్=సర్వేషు వేదేషు లోకేషుచ ప్రసిద్ధం బ్రహ్మ స్వరూపం, ధీమహి=ధ్యాయామః||
ఇటులనే యాజ్ఞవల్క్యమహర్షి, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఆదిగాగల మహర్షులు, బ్రహ్మవిదులు త్రిపదాగాయత్రికి బ్రహ్మవరముగా అనగా 'ఆత్మ' పరముగా అర్థముచెప్పి అటులనే ఉపాసింపవలసినదిగా ఆదేశించినారు.
అధునాతులలో హిందూమత ప్రచారకులలో అగ్రేసరులు అనేక బిరుదాంకితులు బ్రహ్మశ్రీ ప్రభాకర ఉమామహేశ్వరపండితులు ఇటుల సెలవిచ్చినారు. చిత్తగింపుడు. యః=(చరాచరంబగు నీసకలప్రపంచమునకు) ఏ, దేవః సవితా=దేవదేవుడు, సవితృ (సూర్య) నామమును ధరించి; అస్మాకం ధియః=మాసంబంధముపై మెలంగుబుద్ధులను మరియునింద్రియ వ్యాపారములను, ధర్మాదిగోచరాః=ధర్మము మున్నగువాని విషయమై గోచరింపజేయునవిగా, ప్రేరయేత్=ప్రేరేపించుచుండెనో, తస్య=ఆదేవదేవునియొక్క, యత్=ఏ, పరేణియం=శ్రేష్ఠమగు (కోరదగిన), భర్గః=తేజస్సుగలదో, తత్=అట్టిదివ్య శక్తిని, ఉపాస్మహే=ధ్యానించుచున్నాము.
సర్వసమిష్టిగా గాయత్రీ మంత్రార్థము :-
మనముఉపాసించు దేవతలు సూర్యభగవానుడేకానిండు, పరశివుడే యగుగాక, నారాయణుడే యనుడు వారియందు ఆభాసగా కాన్పించు దివ్యశక్తులు, మహిమలు, పరాశక్తి, తేజః సంపన్నములు మనము ధ్యానించునది ఆ 'భర్గ' స్సునే మాయాపరికల్పితములైన ఆవరణములయందు ద్యోతమానమగు, శ్రీమాత చిచ్ఛక్తినే ఉపాసించుచున్నాము.
ఇక పంచదశాక్షరీ మంత్రార్థమును గమనింపుడు. మంత్రోద్ధారక్రమము.
-త్రైలోక్యమోహనకవచము ననుసరించి.
శ్లో|| కామో భగోరమాశక్రః శంభు రగ్నిస్త్రిమూర్తిధృక్,
ప్రాణోజీవస్స్మర శ్శంభుః శక్రశ్శంభు స్తనూనపాత్,
వామనేత్రయుతో జీవః కామశ్శక్రో మహేశ్వరః
వహ్ని ర్వామాక్షి సంయుక్తో విద్యాదుర్వాస సాపురా,
ఆరాధితా, శత్రునాశ కృత్ జ్ఞేయా సుదుర్లభా ||
కామబీజ మనగా 'క' కారము. భగబీజమనగా 'ఏ' కారము. రమాబీజమనగా 'ఈ' కారము. శక్రబీజమనగా 'ల' కారము. శంభుబీజమనగా 'హ' కారము. శంభు, అగ్ని, త్రిమూర్తి రూపమయిన బీజ మనగా - ''హ్రీం'' కారము. ''క ఏ ఈ ల హ్రీం''.
ప్రాణబీజమనగా - 'హ' కారము. జీవబీజమనగా 'స' కారము. స్మరబీజమనగా 'క' కారము. శంభుబీజమనగా 'హ' కారము. శక్రబీజమనగా 'ల' కారము. శివబీజము, అగ్ని వామనేత్రబీజములతో కలసినదనగా ''హ్రీం'' అని అర్థము. ''హ స క హ ల హ్రీం''.
జీవబీజమనగా 'స' కారము. కామబీజమనగా 'క' కారము. శక్రబీజమనగా 'ల' కారము. మహేశ్వరబీజము, వహ్ని వామనేత్రబీజములతో కలసినదనగా - ''హ్రీం'' కారమని భావము. ''స క ల హ్రీం''
-''త్రైలోక్యమోహన కవచము''
''సమిష్ఠిగా=క ఏ ఈ ల హ్రీం; హ స క హ ల హ్రీం; ''స క ల హ్రీం'' ''త్రిఖండం మాతృకామంత్రం సోమసూర్యానలాత్మకం'' అఖండ సచ్చిదానందస్వరూపమగు పరబ్రహ్మశక్తి యొక్కతత్త్వమును సాధకులకు బోధించునిమిత్తము పరశివుడు చతుర్దశవిద్యల ప్రకటించినాడు. అవి చతుర్వేదములు; తదంగములు ఆరు; న్యాయ, మీమాంస, పురాణ, ధర్మశాస్త్రములు నాలుగు; వెరశి పదునాలుగు. వీనియందు అనగా చతుర్దశ విద్యలయందును అపౌరుషేయములైన ఋగ్యజుస్సామా೭ధర్వణములు ముఖ్యములు. అట్టి వేదములందు ఉదాహృతములైన సప్తకోటి అసంఖ్యాక మంత్రములయందును ముఖ్యమైనవి - గాయత్రి; పంచదశాక్షరి. ఇందు గాయత్రి స్పష్టా೭స్పష్టము. దీనికి ప్రకటగాయత్రి యను నామాంతరమును గలదు. పంచదశాక్షరికి గుప్తగాయత్రి యని పేరు. ఇది చాలా గోపనీయముగా నుంచబడినది.
''కామః యోనిః కమలా - వజ్రపాణః''
1. ''కామో యోనిః కమలా వజ్రపాణి ర్గుహా సకలా మాయయా చ పునః కోశా విశ్వమాతాదివిద్యోం''
-దేవ్యధరోపనిషత్తు.
2. కామో యోనిః కమలా వజ్రపాణి ర్గుహాహసా మాతరిశ్వా అభ్రం ఇంద్రః పునర్గుహా సకలా మాయయా చ పురూచ్చేషా విశ్వమాతాది విద్యా''. - త్రిపురోపనిషత్.
కామః='క' హసా='హ; స'
యోనిః='ఏ' మాతరిశ్వా='క'
కమలా='ఈ' అభ్రం='హ'
వజ్రపాణిః='ల' ఇంద్రః='ల'
గుహా='హ్రీం' పునరుహా='హ్రీం'
సకలా=స; క; ల; పురూచీ=పురాతని;
మాయా=హ్రీం; విశ్వమాతా=సకలజగజ్జనని-అవిద్య.
ఈవిద్య సర్వకారణ విద్యారూప యగుటవలన ఉత్తమ భక్తిశాలుర కెల్లరకు ఉపాసనీయ. గాయత్రీపాద త్రితయము (త్రైవర్ణికులచే వేఱుగాను జేర్పబడియు)గా జపింపదగినది. -''శ్రియానంద''.
''చత్వార ఈం బిభ్రతి క్షేమయంతః'' అని ఈ మంత్ర స్వరూపమును అతిగోప్యముగా చెప్పినారు.
''త్రికలాఢ్యాం - త్రిహృల్లేఖాం - ద్వి - ''హ'' - ''స'' స్వరభూషితాం
యోజపత్యం బతేవిద్యాం సో೭క్షరః పరమస్వరాట్||''
మూడు 'క' కారములు; మూడు 'ల' కారములు; మూడు 'హ్రీం' కారములు; రెండు 'హ' కారములు; రెండు 'స' కారములు; 'ఏ' 'ఈ' అను రెండు అచ్చులు = వెరశి పదునైదు బీజాక్షర సంకలితము. ఇది గుప్తగాయత్రి యని శంకరభగవత్పాదాదులు మర్మముగా చెప్పినారు.
శ్రీమచ్ఛంకర భగవత్పాద విరచిత సౌందర్యలహరి యందు ఈవిషయమున చెప్పబడినదిగూడ గమనార్హము.
శ్లో|| చతుష్షష్ట్యా తంత్రైః సకలమభి సంధాయభువనం
స్థిత స్తత్తత్సిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః,
పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటనా
స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతర దిదమ్||
- ''సౌందర్యలహరి''.
అమ్మా! శివుడు లోకమునకు అరువదినాలుగుతంత్రములను అవతరింపజేయగా, లోకులు క్షణికానందమునిచ్చు కొన్ని సిద్ధులనుగోరి కొన్ని తంత్రముల నవలంబించి తామే బుద్ధిహీనతచే బరమపురుషార్థమునకు దూరులై మోసపోయిరి. అది చూచి నీ వాతని (అనగా పరమశివుని) నిబ్బందిపెట్టగా సకల పురుషార్థసాధకమగు నీ పంచదశాక్షర మనువును లోకమున కవతరింపజేసెను. - ''శ్రియానంద''.
శ్లో|| శివః శక్తిః కామః క్షితి రథ రవిః శీతకిరణః
స్మరోహంసః శక్రస్తదను చ పరామార హరయః
అమీ హృల్లేఖాభిస్తిసృభి రవసానేషు ఘటితా
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్||
- ''సౌందర్యలహరి''.
మ|| శివశక్తిస్మరపృథ్వులొక్క తెగగాఁ, జిత్రాంశుచంద్రాత్మసం
భవహంసేంద్రులు వెండియొక్క తెగగా, బైనింబరాకామమా
ధవులా మూడవగుంపుగాగ, దుదలం దన్కింప హృల్లేఖల&
శివ! యావర్ణములంగకమ్ములు భవచ్ఛ్రీమంత్రరాణ్మూర్తికి&.
- 'శ్రియానంద''.
ఈపైన ఉదహరించిన శ్లోక, పద్యములు పంచదశాక్షర విద్యా త్రిఖండముల నుద్ధరించు చున్నవి. శ్రీ శ్రియానంద గురుజీ సెలవిచ్చిన అర్థవివరణమును ఈ దిగువ నుదహరించు చున్నారు. శివ, శక్తి, స్మర, పృథ్వులు=క, ఏ, ఈ, ల;
చిత్రాంశు, చంద్ర, ఆత్మసంభవ, హంస, ఇంద్రులు=హ, స, క, హ, ల, పరా, కామ, మాధవులు=స, క, ల;
ఈ విధముగానైన మూడు ఖండములకును, దుదలను హృల్లేఖలకు ''హ్రీం'' కారములను అమర్పగా, పదునైదు అక్షరముల మంత్రమయినది. ''క ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం'' అను మూడు కూటములలో మొదటిది వాగ్భవకూటము - సకలవిద్యాప్రదము.
రెండవది కామరాజకూటము - అర్థ కామదమైన భోగసాధనము.
మూడవది పరాకూటము - మోక్షప్రదము.
ఈ మాతృకామంత్రమే సోమ సూర్యానలాత్మకము, క్రియేచ్ఛాజ్ఞానశక్త్యాత్మకము, జాగ్రత్స్వప్న సుషుప్త్యాత్మకము తమోరజస్సత్త్వగుణాత్మకమునై యున్నది. శ్రుతిప్రమాణ మునుబట్టి యిది పేరికి పంచదశాక్షరియేగాని, షోడశాక్షరియే. అదెటులయినదో నా శ్రీసూక్తరహస్యార్థమున వివరింపబడినది. శ్రీమాతృకృపచే నా శ్రీవిద్యాభాష్యమునకు నెంతలో ముద్రణభాగ్యముపట్టిన నంతలో ననేక విశేషాంశములు చూడగలుగుదురు.
షోడశాక్షరిగా గౌరవింపబడినపుడు విద్య నాలుగుఖండములది. నాలుగవ ఖండము ''ఈం'' అనెడి లక్ష్మీబీజము. కొందరి మతముచే ''శ్రీం'' అనెడి లక్ష్మీబీజమును జేర్పగా షోడశాక్షరి యందురు. ఈ మున్నగు వివరణమునకే నా శ్రీసూక్త రహస్యార్థమును జూడమన్నది. గ్రంథబాహుళ్య భీతి నిందు వ్రాయనైతిని.
చంద్రునికళలందు పదునాఱవకలయే ''సాదా - పరా'' యనబడు మహానిత్య - అదే పరమాత్మస్వరూప. విద్యయందలి ''ఈం'' అనబడు రమాబీజమే పదునారవ బీజము. సామయులు దీనినే యాంతరమున నుపాసింతురు. ఇదియే చిత్కలారూప మహాత్రిపురసుందరి. నాదబిందు కలారూపము లైన మూడుఖండములను మీఱియున్న ''ఈం'' కారమే రమాబీజమగుటచేతను, శ్రీవాచకము కావుననే ''శ్రీవిద్య'' యని దీనికి బేరయ్యెను. -శ్రీ శ్రియానంద.
శ్రీమచ్ఛంకర భగవత్పాదులు - పంచదశీవ్యాఖ్య నిటుల సెలవిచ్చినారు - చిత్తగింపుడు.
అత్రాయం పదవిభాగః - క, ఏ, ఈల, హ్రీం; హ స, క హ ల, హ్రీం; స క ల, హ్రీం. అర్థస్తు:- ఇణోగతా విత్య స్మాద్ధాతోరిచ్, ఏ=మాయాత్మికే, పరదేవతే;
కే=బ్రహ్మవిషయే; హ్రియం ఛాందసత్వాచ్ఛాందసీతి పూర్వరూపం లజ్జాం లజ్జోపలక్షి తాష్ట పాశాత్మికా మవిద్యాం.
ఈల=నివర్తయ, ఈల ప్రేరణ ఇతిధాతోః కాపి లత్వా ల్లత్వం పరసై#్మ పదం ఛాందసం, హేర్లుక్, బ్రహ్మ విషయకాజ్ఞానం నివర్తయేత్యర్థః ||
కహలహ్రీం=కనదీప్తా విత్యస్మాద్ధాతోః హలగ్రహణ ఇతి ధాతో రపి;
కస్య = బ్రహ్మణః;
హలహ్రీం = గ్రాహకశక్తిం;
హస=ప్రకాశయ; హసిహస ఇతిధాతోః లోణ్మధ్యమః; బ్రహ్మపరోక్షబుద్ధిం ప్రకాశ##యేత్యర్థః;
సకలహ్రీం=సర్వాంతఃకరణవృత్తిం. ఈలేత్యనువృత్యా వ్యాఖ్యేయం;
ఈల=నివర్తయ; సకల వృత్త్యుపశాంత్యా೭ఖండ ప్రకాశ చిదానంద రూపోపపత్తిం సంపాద యేత్యర్థః||
సారాంశము:
శ్రీమాతా! పరాశక్తీ!
బ్రహ్మవిద్యా సంపాదనోత్సుకత నాకు గలదు. కాని మాయా೭వృతమైన, అష్టపాశాత్మికమైన అజ్ఞానము - అవిద్య - అనుక్షణమును నన్ను నిరోధించుచు పురోగమనము నడ్డుచున్నది. నీదివ్యతేజస్సును మూలమూలల ప్రసరింపజేసి నా యజ్ఞానాంధకారమును పటాపంచలు జేయుము.
నిన్ను తెలిసికొనవలెనను కుతూహలమును, నీ అంకమును చేరవలెనను ఉత్సాహమును నాయందు ఇనుమడింప జేయుము. మాయావృతమైనది నాయందలి జ్ఞానప్రకాశము. బ్రహ్మాపరోక్షవృత్తి - అవిద్యాగ్రస్తమైనది.
తల్లీ! జ్ఞానశక్తిని ప్రకాశింపజేయుము. అత్యంతప్రకాశ వంతమైన నీ భర్గస్సుచే నాహృదయకమలము ప్రఫుల్లమగును గాక! నిన్ను చేరు మార్గమునకు పెనుకొండలవలె అవరోధముగా నిలచిన సంశయమేఘములు విచ్ఛిన్నము లగునుగాక!
సర్వసమష్టిగా చతుష్పదా గాయత్రీ మహామంత్రము నకు సమన్వయముచేసి శ్రీ శ్రియానంద గురుజీ ఈదిగువ నుదహరించిన తెఱగున, పంచదశాక్షరిని వ్యాఖ్యానించినారు. చిత్తగింపుడు.
ప్రథమఖండమందు:-
'క - కే = సవితృదేవునందు నిష్ఠితమై;
ఏ=శుద్ధశివ శక్త్యాత్మకమై; వరేణ్యమై; భర్గః పదవాచ్యమైన - పరంజ్యోతిరూపముగా ధ్యానింపబడు
హ్రీం=విద్యపైన - అనగా - మహాత్రిపురసుందరి వైన నీవు - ఆవృత్తిచేత - హ్రీం=మా బుద్ధివృత్తిని;
ఈల=పరమార్థమైన పరంజ్యోతియందు ప్రవర్తింపజేయుము. ద్వితీయఖండమందు తురీయపాదార్థమును జెప్పుచున్నాను.
హసకల=రజస్తమోగుణాతీతమై - నిర్మలమై - ప్రసన్నమై - అనగా -
పరోరజసి:-
హల=హ వర్ణము శబ్దవాచియగుటచే
హ=శబ్దముచే - 'ల' ఆదానే - అను ధాతువువలన - శబ్దముచే గ్రహింపయోగ్యమైనది అని అర్థము.
అనగా ''హ్రీం'' ''సపదమోం'' అనుట. అటులే ''హసకల'' సర్వగుణాతీతమై ''హ'' శబ్దముయొక్క ''ల'' భేదనము ఎచటగలదో అది శబాస్పర్శి; అనగా మాటల కందనిది.
హ్రీం = ''అపదమోం'' అని అర్థము.
పరోరజసీ; ''హసకల'' - ''హలహ్రీం'' అనగా ''సాపదోం'' అని అర్థము. ''హ్రీం'' కార ''ఓం'' కారము లకు భేదములేదు. ''విద్యోం'' ''హ్రీం మోం'' ''హ్రీమిత్యుపనిషత్'' అను శ్రుతివలన ప్రణవ ఓంకారములు ఏకమేకాగా తదర్థకవస్తువును ఏకమేయని యర్థము.
తృతీయఖండమందు:
సకల=వాచ్యవాచకరూపమైన సర్వమును
హ్రీం=పరబ్రహ్మమే యని యర్థము.
- ''శ్రియానంద''.
సారాంశము:-
మహాత్రిపురసుందరీ!
విద్యవు నీవు. జ్ఞానస్వరూపిణివి. శ్రేష్ఠతమమగు నీ దివ్యతేజస్సు, ''భర్గస్సు'' - అఖండము, దుర్ణిరీక్ష్యము, అతర్క్యము, నిష్కలంకము, శివశక్త్యాత్మకము, అవాఙ్మానస గోచరము.
అట్టి భర్గస్సును సాధకజనుల కందుబాటులో నుండు నటుల నొకింత సవితృదేవునందు, సూర్యభగవానునియందు నిక్షిప్తమొనర్చితివి.
తుచ్ఛవిషయ సుఖలంపటమైన, వ్యామోహపాశనిబద్ధమైన, అజ్ఞానావృతమైన మా బుద్ధివృత్తులను పరమార్థతత్త్వ బోధకమైన యా పరంజ్యోతియందు ప్రవర్తింపజేయుము.
అమ్మా! నీవు పరబ్రహ్మస్వరూపిణివి. గుణత్రయము నకు అతీతవు. గురుకృపాదృష్టిపాతమైనపుడు బీజాక్షరస్వరూపమున శబ్దబ్రహ్మమవై ఇట్టె సాక్షాత్కరింతువు. అవిద్యా7 వృతులమైనపుడు అవాఙ్మానసగోచరవై ''అందని మ్రాని పండు'' వగుదువు.
సర్వశక్త్యాత్మకవు; సర్వతంత్రాత్మకవు; సర్వమంత్రాత్మకవు; అది ఇది యననేల వాచ్యవాచకరూపమైన సర్వమును నీవే. నిర్మల మందహాసరోచిస్సుల బరపి దయాప్రసన్న వదన ముతో మా బుద్ధివృత్తులను నీకభిముఖములుగా జేసికొనుము.
శ్రీ శ్రియానందగురుజీ 'స్వాత్మానుభవార్థ'ముగా అన్వయించిన వ్యాఖ్యనుకూడ గమనింపుడు.
ప్రథమ ఖండమందు:-
ఏ=(ఆ+ఈ)అః=కామేశ్వరుడు, వానియందైన
ఈ=కామేశ్వరి; 'అ' కారమందు 'ఈ' కారయోజనచే 'య' 'ఏ' యైనదిగాన కామేశ్వరాంకవాసినీ - పరదేవతా! నీవు క=ప్రత్యగాత్మయందు నాకుగల; హ్రీం=ఆవరణశక్తిని; ఈల=నివారింపుము.
ద్వితీయఖండమందు:- 'కహల హ్రీం'
క = పరబ్రహ్మముయొక్క
హలం = 'హల్' గ్రహణీయను ధాతువునుబట్టి; బ్రహ్మ గ్రాహికయైన
హ్రీం = శుద్ధబుద్ధివృత్తిని
హస = వికసింపజేయుము
'త్వం' పదలక్ష్యార్థ స్ఫురణముచేతనే - తత్పదలక్ష్యార్థా೭ఖండ చిన్మాత్రస్ఫురణమును కలిగింపుము అని యర్థము.
తృతీయఖండమందు :- 'సకల హ్రీం'.
సకలహ్రీం=ఆత్మానాత్మరూపమైన; సర్వద్వైతప్రపంచ బుద్ధిని యథార్థాత్మజ్ఞానముచే
ఈల = నివారింపుము
సారాంశము :- చిద్రూపవైన నీకును, నాకును, ప్రపంచ మునకును అభేదముచే చిన్మాత్రమైన బ్రహ్మమందే అధ్యస్త మగుటవలన 'బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి' అనుశ్రుతి వలన - నిస్మృత కంఠగత చామీకరన్యాయముచే శుద్ధ చిదానంద సన్మాత్రమవుగాక !
- శ్రీ శ్రియానంద.
'తత్త్వమసి' అను మహావాక్యార్థమును పంచదశాక్షరి ప్రతిపాదించుచున్నది అని మరికొందరు బ్రహ్మవిదులు చెప్పుచున్నారు. చిత్తగింపుడు.
ప్రథమఖండార్థము:- ఐం క ఏ ఈ ల హ్రీం.
ఐం - ఏ = మాయా తీతుడవగు ఓ చిచ్ఛక్తీ!
ఈల = పరిహరించుము; విసర్జించుము.
హ్రీం = భేదబుద్ధిని
క = అవిద్యావాసనచే బ్రహ్మపదార్థమును మరగుపరచు చున్నది.
నేను మాయావృతుడనైన జీవుడను; పరమాత్మకన్న భిన్నుడను - అను భేద ద్వంద్వభావమును నిర్మూలింపుము. మంత్రములోని ఈ ప్రథమఖండము వాచ్యార్థమైన 'త్వం' పదమును సూచించును. అవిద్యావాసన తొలగిపోగనే రెండవ ఖండమైన లక్ష్యార్థము గోచరించును.
రెండవ ఖండము:-
హసకహలహ్రీం:- హస=నన్ను పొందనిమ్ము. హ్రీం=(దివ్యమైన, సత్యమైన) జ్ఞానమును, క = (కస్య) బ్రహ్మము యొక్క, హల=(హలస్య) సర్వాంతర్యామియైన, సచ్చిదానందస్వరూపుడనైన నేను ఆ పరబ్రహ్మమును అగుచున్నాను. మాయోపాధి తొలగిపోగనే ఈశ్వరత్వభావన అలవడును.
మహావాక్యములోని 'తత్' అను పదము ఇట సూచితము. సర్వేశ్వరుడు ఈ 'తత్' పదలక్ష్యమునే నిర్దేశింపబడినాడు.
మూడవఖండము:- 'సకలహ్రీం'. ఇది మహావాక్యము నందలి 'అసి' అను పదమును సూచించుచున్నది.
హస=నన్నుపొందనిమ్ము, సకలహ్రీం=అఖండాకారవృత్తిని.
'తత్త్వమసి' యను మహావాక్యము - జీవబ్రహ్మలకు ఏకత్వమును ప్రతిపాదించుచున్నది. పంచదశాక్షరి యందలి నిగూఢార్థమిదియే. త్రిపదాగాయత్రియు దీనిచే తెలుపుచున్నది. ఇట్టి భావనము అలవరచుకొని సాధకుడు మననము చేయుచో బ్రహ్మాత్మైక్యభావన యలవడును. కనుకనే 'మంత్రసం కేతస్య వేత్తా శ్రీ విద్యామంత్రరహస్య భూతపద భావనా ప్రణాళిత మోహజాలః పరశివ ఏవభవతి' అని శ్రుతిస్మృతులు ముక్త కంఠమున చాటుచున్నవి. కనుకనే మంత్రద్రష్టలు -
'విద్యాకూటై శ్చతుర్భిశ్చ గాయత్ర్యా శ్చతురంఘ్రిభిః,
సమ్మేళననేమో జాపః కోటికోటి ఫలప్రదః||'
అని మహామంత్రద్వయము రెంటిని మేళవించి ఈ దిగువ నుదహరించిన తెఱగున ఉపాసించి కృతార్థు లగు చున్నారు.
శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం
తత్సవితుర్వ రేణియమ్
క ఏ ఈ ల హ్రీం
భర్గో దేవస్య ధీమహి
హ స క హ ల హ్రీం
ధియోయోనః ప్రచోదయాత్
స క ల హ్రీం
పరోరజసిసావదోం
సౌః ఐం క్లీం హ్రీం శ్రీం ||
26. గాయత్రీ మంత్రమును ద్విజత్వసాధనీ విద్యయందురు. కారణమేమి?
ఐదు మొదలుకొని - అష్టవర్ష ప్రాయముగల బాలునకు ఉపనయనదీక్ష నిచ్చి, బ్రహ్మోపదేశముచేసి బ్రహ్మవిదులు చతుర్వింశత్యక్షరా త్రిపదాగాయత్రిని ఉపాసింపవలసినదిగా ఆదేశించినారు. ఈ మహామంత్రము - (1) స్పష్ట (2) అస్పష్ట (3) అస్పష్టతర యని మూడు తెఱగులు గలది. అందు;
(1) స్పష్టా=అనగా త్రిపదాగాయత్రి. దీనికే ప్రకటగాయత్రియనియు, స్థూలమనియు నామాంతరములు గలవు. (3) అస్పష్ట యనగా పంచదశాక్షరీ మహామంత్రము. దీనికే సూక్ష్మమనియు, నామాంతరము గలదు. (3) అస్పష్టతర యనగా - ''పరోరజసిసావదోం'' యను గాయత్రీ తురీయ పాదము. దీనికి సూక్ష్మతర యనియు నామాంతరము గలదు.
త్రిపదాగాయత్రి - లఘుదీక్షయనియు, పంచదశాక్షరి - పూర్ణదీక్షయనియు, చతుష్పదాగాయత్రియు, షోడశాక్షరియు లేక ఈరెంటి సమ్మేళన మహామంత్రమును సంపూర్ణదీక్ష యనియు చెప్పబడుచున్నది.
త్రిపదాగాయత్రిని సగుణరూపమున ఉపాసించుచు అధికారము కలిగినకొలది యోగ్యత, అర్హత, సంపాదించుకొనిన కొలది సాధకుడు నిర్గుణబ్రహ్మ ప్రతిపాదకమైన తురీయపాద సహితముగ అనుష్ఠించుట శిష్టజనాచరణ మందున్నది.
''తత్'' పదలక్ష్యార్థమై జ్ఞాన సముపార్జనకు ఉద్ధరింపబడిన చతుర్దశ విద్యలందును అపౌరు షేయములైన చతుర్వేద ములు ముఖ్యములు. అందలి సారభూతమే చతుష్పదాగాయత్రి. ప్రకటగాయత్రి ఉపదేశము చేయబడినపుడు తత్పూర్వము జడప్రాయుడుగా, అనగా బ్రహ్మవిద్య విషయమై అజ్ఞానిగా నుండిన సాధకుడు - ద్విజన్మను అనగా రెండవజన్మను పొందినటులను, తరువాత కొంతకాలమునకు అర్హత ననుసరించి తురీయపాదము ఉపదేశింపబడినపుడు తృతీయజన్మను పొందినటుల చెప్పబడుచున్నాడు. ఇచట 'జన్మ' యనినపుడు 'అర్హత' యని భావించగునేమో. పాఠశాలలో విద్యార్థి ఒక తరగతి నుండి ఉత్తీర్ణుడై మరియొక తరగతికి పోవుటవంటిది ఈపద్ధతి. అనేక జన్మసంచిత పాపకర్మనుండి విడివడి నూతన జీవితమును అలవరచుకొనుటకు సాధనభూత మగుటవలన ఇది ''ద్విజత్వసాధనీ విద్య'' యని చెప్పబడుచున్నది.
27. గాయత్రీ మంత్రో పాసన చేయు క్రమమును వివరింపుడు.
వశిష్ట విశ్వామిత్ర కల్పములలో చెప్పబడిన క్రమమును ఇట నుదాహరించుచున్నాను.
ప్రథమమున ఒక లక్ష జపమునకు సంకల్పింపవలెను. అందు ముందుగా - ఇరువది వేలు త్రిపదాగాయత్రిని జపము చేయవలయును. అటుపిమ్మట తురీయపాద సహితముగా ఒక లక్ష జపము చేయవయలును. ఆపైని ఆమరణాంతము తురీయ పాదసహితముగానే పూర్ణగాయత్రిని త్రికాలములయందును ఉపాసింపవలయును.
28. పూర్ణగాయత్రి యనగా నేమి?
ప్రణవ వ్యాహృతిత్రయము; త్రిపదాగాయత్రి; తురీయ పాదము. ఇవి సంపుటీకరింపబడినపుడు ''పూర్ణగాయత్రి'' యని సంకేతము.
29. ప్రణవత్రయమనగా నేమి?
వ్యాహృతిత్రయ పూర్వమందును; ప్రథమ పదాది యందును, తురీయ పాదాదియందును గలది ప్రణవత్రయము.
వివరము:
ఓం | భూర్భువస్సువః |
ఓం | తత్సవితుర్వరేణియమ్, భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ |
ఓం | పరోరజసిసావదోం||
బ్రహ్మచారులు, గృహస్థులు ప్రణవత్రయసహితముగా గాయత్రిని జపింపవలయును.
30. బ్రహ్మచారులు, గృహస్థులు అనుష్ఠించు జపక్రమమును మాత్రమే చెప్పితిరి. వానప్రస్థులు, తురీయాశ్రమ మును స్వీకరించిన యతులు ఉపాసించు గాయత్రీ జపక్రమ మెట్టిది?
పంచప్రణవ సహితముగా వానప్రస్థులు ఉపాసించ వలయును. పంచప్రణవములు అనగా ఆద్యంత ప్రణవములు రెండు; త్రిపదముల ఆదియందు ఒక్కొక్కటి చొప్పున మూడు; వెరశి ఐదు ప్రణవములు అగును.
వివరములు :-
ఓం | భూర్భువస్సువః |
ఓం | తత్సవితుర్వరేణియమ్ |
ఓం | భర్గో దేవస్య ధీమహి |
ఓం | ధియోయోనః ప్రచోదయాత్ |
ఓం | పరోరజసిసావదోం.
పంచప్రణవ గాయత్రీ మంత్ర జపక్రమ మిదియే. ఇక యతులు ''ఓం'' అని ఏకప్రణవమును మాత్రమే ఉపాసింతురు. గాయత్రీ పాదత్రయము వ్యాహృతిత్రయమందు లయ మగును. ఆ వ్యాహృతిత్రయము ప్రణవమందలి 'అ' కార 'ఉ' కార 'మ' కారములయందు లీనమగును. శేషించినది ''ఓం'' అను అక్షరమెన నిత్యమెన, సత్యమైన, ఏకాక్షరమే. పరమాణు సదృశముగా అత్యంత శక్తివంతమైనది ప్రణవోపాసన సర్వసంగ పరిత్యాగులై వేదములనుగూడ పరిత్యజించిన మహానీయులు తత్సారభూతమైన ప్రణవమునే ఆలంబనగా గొని, ఊతగా జేసికొని ''తత్'' పదమును జెందుచున్నారు.
31. గాయత్రీ మంత్రమందలి ప్రథమపాదము ''తత్స వితుర్వరేణ్యం'' అనిగదా బహుధా జపింపబడుచున్నది. మరి మీరు ఇంకొక వర్ణమును అదనముగా జేర్చి ''తత్సవితుర్వ రేణియమ్'' అని చెప్పుచున్నారు. ఈ రెంటిలో ఏపద్ధతి సరియైనది? ''తత్సవితుర్వరేణ్యమ్;'' అని ప్రాణాయామ సమయమునను, అర్ఘ్యప్రదాన సమయమునను, తదితర సమయములందును చెప్పవలయును. జపావసరమున మాత్రమే ''తత్సవితుర్వ రేణియమ్'' అని చెప్పవలయును. ఇది శుక్లయజుర్వేదీయులగు వాజసనేయుల క్రమము. కనుక ఇటుల జెప్పబడినది.
3. ''యోనోధియః ప్రేరయతి పరమాత్మా సనాతనః'' అను వచనముచే త్రిపదాగాయత్రి బ్రహ్మ ప్రతిపాదకత్వము గదా? దేవీ ప్రతిపాదకత్వ మెటులగును? ఇందు ఉపాసింపబడునది పుంరూప దేవతయా? స్త్రీరూప దేవతయా?
స్త్రీరూపాం చింతయే ద్దేవీం పుంరూపం వా విచింతయేత్,
అధవా నిష్కలం ధ్యాయే త్సచ్చిదానంద లక్షణమ్ ||
- జ్ఞానార్ణవము.
పుం రూపత్వము, బ్రహ్మరూపత్వము శ్రీ జగన్మాతకే ప్రతిపాదింపబడినది. క్షిప్ర ప్రసాదలక్షణాన్విత యగుటను. మాతృవాత్సల్యాధిక్యతచేతను స్త్రీ రూపమునకే ప్రాముఖ్యము ఇవ్వబడినది. కనుకనే. శ్రీ శ్రియానంద గురుజీ, త్రిపదా గాయత్రికి చెప్పిన అర్థవివరమును దండాన్వయరూపమున నిటనుదహరించుచున్నాను.
ఏ కామేశ్వరుడు పరాశక్తి స్వరూపమైన తన ఏకాంతితో మా బుద్ధి వృత్తులను శుభకార్యములందు (బ్రహ్మ త్వావాప్తి ప్రయత్నమందు) బ్రేరణముజేయునో అట్టి పూర్వోక్త సవితృమండల మధ్య గతుడైన స్వయంప్రకాశుడైన శ్రీకామేశ్వరుని శ్రేష్ఠమైన అనగా పత్నీత్వముచే గాంక్షణీయమైన శివ కామేశ్వరీ నామకమైన తేజస్సును ధ్యానించుచున్నాము.
- శ్రియానంద.
33. మీరు గాయత్రీ మంత్రమునకు పలువిధములైన అర్థములను చెప్పినారు. ఇందు ఏది అనుసరించదగినది?
ఏభావమున ఎటుల ఉపాసించినను, ఫలితార్థము ఒకటియే. ఈ విషయమున బహ్వృచోపనిషత్తు ఏమని చెప్పుచున్నదో గమనింపుడు.
''అధ ఏషా బ్రహ్మసంపత్తిః - భావా೭భావకళా వినిర్ముక్తా చిద్విద్యా೭ద్వితీయ బ్రహసంపత్తిః - సచ్చిదానంద లహరీ మహాత్రిపురసుందరీ బహిరంతర సుప్రవిశ్యయమేకైవ విభాతి, యదస్తి సన్మాత్రం యద్విభాతి చిన్మాత్రం యత్ర్పియ మానందం తదేతత్సర్వాకారా మహాత్రిపురసుందరీ - త్వం చాహంచ సర్వం విశ్వం సర్వదేవతేతరత్సర్వం మహాత్రిపుర సుందరీ సత్యమేకం లలితా೭೭ఖ్యం వస్తు తదద్వితీయమ్; అఖండార్థం పరంబ్రహ్మ పంచరూప పరిత్యాగా దస్వరూప పహాణతః, అధిష్ఠానం పరం తత్త్వమేకం సచ్ఛిష్యతే మహదితి; ప్రజ్ఞానం బ్రహ్మేతివా అహం బ్రహ్మాస్మీతివా భాష్యతే తత్త్వమసీత్యేవ సంభాష్యతే అయమాత్మా బ్రహ్మేతివా బ్రహ్మైవాహ మస్మీతివా యో೭హమస్మీతివా సో೭హ మస్మీతివా యో೭సౌ సో೭హమస్మీతివా యాభాష్యతే సైషా షోడశీ శ్రీవిద్యా పంచదశాక్షరీ శ్రీమహాత్రిపురసుందరీ బాలాంబికేతి బగళేతి మాతంగీతి స్వయం వరకల్యాణీతి భువనేశ్వరీతి చాముండేతి చండేతి వారాహీతి తిరస్కరణీతి రాజమాతంగీతి వా శుకశ్యామళేతివా లఘుశ్యామళేతివా అశ్వారూఢేతివా ప్రత్యంగిరా ధూమావతీ సావిత్రీ గాయత్రీ సరస్వతీ బ్రహ్మానందకళేతి, ఋచో అక్షరేపరమే వ్యోమ& | యస్మి& దేవా అధి విశ్వే నిషేదుః | యస్తన్న వేద కిమృచా కరిష్యతి | య ఇత్తద్విదు స్తిమే సమాసత ఇత్యుపనిషత్ ||
- బహ్వృచోపనిషత్తు.
34. ఈ గ్రంథరచనకు గడంగుటలో మీఉద్దేశ్యమేమి?
దాత్రము - సర్వసంకట లతాతతికంచును, సార్థమైన గా
యత్రినే చిన్న నాఁడిడుదురయ్యది శాక్తముగాదె? గుప్తగా
యత్రి భవన్ముఖప్రవర; మయ్యది చేకొన శాక్తుడండ్రహా |
చిత్రము! నీకృప& బెడసి చీఁకటిలోబడె లోక ''మంబికా!''
- ''శ్రియానంద''.
''నీకృపన్ బెడసి చీకటిలోబడె లోక మంబికా:!'' యను శ్రీ శ్రియానందగురుజీ ఆవేదనయే ఈగ్రంథోత్పత్తికి కారణము.
ఛందోబద్ధములైన మంత్రాక్షరములు వేరుగానుండు గాక, అందలి నిగూఢార్థము ఒకే ఒక బ్రహ్మశక్తిని ప్రతి పాదించుచున్నది. సాధనయందలి అంతరములు, ప్రక్రియలు భిన్నములగుగాక! అంతమున ఒకే ఒక గమ్యమును జేర్చు చున్నవి. ఉపనిషన్మతము. శాక్తసంప్రదాయములు రెండు శాఖలై వేలకొలది సాధకులకు ఆశ్రయమిచ్చుచున్నవి. ఈ రెండు శాఖలకును ఉత్పత్తిస్థానము మూలము అగు వృక్షము (ఆత్మ) ఒకటే యని మనము గమనించుటలేదు. ఈ రెండు మతములును ఒకటే యని ప్రబోధించుటయే శ్రియానంద తత్త్వము. దీని వివరణకై వలసిన ప్రమాణములు స్థూలముగా చూపబడినవి. గంథ్రోత్పత్తికి కారణభూతమైన ఉద్దేశ్యము ఎంతవరకు నెఱవేఱినదో ఆంధ్రపాఠకలోకమే నిర్ణయించునుగాక!
35. గాయత్రీ మంత్రోపాసనచే ''తత్'' పదమును చేరుట ఎటులు?
ఛందోబద్ధమైనది గాయత్రీ మంత్రము. ఛాందోగ్యోపనిషత్తు ననుసరించి సాధకుని జీవితమును ఛందోబద్ధమే.
ఎటులన :-
ఇరువదినాలుగు అక్షరములు గలది గాయత్రీఛందము. నలువదినాలుగు అక్షరములు గలది త్రిష్టుప్ ఛందము. నలువది ఎనిమిది అక్షరములు గలది జగతీఛందము. గాయత్రీ, త్రిష్టుప్, జగతీఛందముల అక్షరములు (వర్ణములు) అన్నియు గలసి వెరశి నూట పదునాఱు. ఈ నూటపదునాఱు అక్షరములే వేదోక్తమైన ఆయుఃప్రమాణమనియు సాధకునకు నిర్ణయింపబడినది. ఇందు ప్రథమమమున ఉపనీతుడగుటకు పూర్వము ఐదునుండి ఎనిమిది సంవత్సరములు జడప్రాయముగా ఎట్టి సంస్కారమును లేక సాధకుడు ఉండును గనుక, అధికములో అధికము - ఎనిమిది వర్షములు - తక్కువ చేసినను మిగిలిన (నూటఎనిమిది) అష్టావింశతి వత్సరములును సాధకుడు బ్రహ్మ విదుల ఆదేశము ననుసరించి నియమబద్ధమైన జీవితమును గడపుచు అఖండమైన అమితమైన తేజోరాశిని ''భర్గస్సు''ను నిత్యమును విడువక ఉపాసించుచో ప్రాగ్జన్మకోటి పుణ్య పాప కర్మలు సందగ్ధమై నిత్యమును, నిర్వికారమును, నిరతిశయమును అగు 'తత్' పదమును, 'ఆత్మ' పదమును - ''పరబ్రహ్మ పదము''ను చేరును.
''తదే తత్ సత్యమ్'' ఇందు ఎట్టి సందియమునులేదు.
ఏష ఆదేశః - ఏష ఉపదేశః - ఏతదనుశాసనమ్.
ఓం తత్సత్.
శంనో మిత్ర శ్శం వరుణః | శంనో భవత్యర్యమా | శంన ఇంద్రో బృహస్పతిః | శంనో విష్ణు రురుక్రమః | నమో బ్రహ్మణ | నమస్తే వాయో | త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి | త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మా వాదిషమ్ | ఋతమవాదిషం | సత్య మవాదిషం | తన్మా మావేత్ | తద్వక్తారమావేత్ | ఆవేన్మాం | ఆవేద్వక్తారమ్ |
''ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః''
-*-