Sri Tattvamu    Chapters   

షోడశాక్షరీ మంత్ర స్వరూపము

షోడశాక్షరీ మంత్రస్వరూపమెట్టిది? అర్థసహితముగా వివరింపుడు:

శ్లో|| హరిప్రియా మహామాయా కామవాక్ఛక్తి బీజకం,

తారం మాయా రమాబీజం వాగ్భవం చిత్తజన్మనః ||

విద్యాయాః స్వద్వితీయంచ తృతీయం శక్తిసంజ్ఞకం,

శక్తివాక్కామబీజాని మహామాయా హరిప్రియా,

బీజరూపా షోడశీయం సర్వసంపత్తిదా పరా ||

హరిప్రియాబీజము ''శ్రీం'' కారము. మాయాబీజము ''హ్రీం'' కారము. కామబీజము ''క్లీం'' కారము. వాగ్బీజము ''ఐం'' కారము. శక్తి బీజము ''సౌః'' అను వర్ణము. తారమనగా ''ఓం''కారము. మాయాబీజము ''హ్రీం''కారము రమాబీజము ''శ్రీం'' కారము. వాగ్బీజము ''ఐం''కారము. కామరాజ విద్యయొక్క ద్వితీయవర్ణము అనగా ''క్లీం''కారము. తృతీయబీజమనగా ''సౌః'' అను వర్ణము. శక్తిబీజ మనగా ''సౌః'' వర్ణము. వాగ్బీజమనగా ''ఐం''కారము. కామబీజ మనగా ''క్లీం''కారము. మహామాయాబీజమనగా ''హ్రీం''కారము. హరిప్రియా బీజమనగా ''శ్రీం'' కారము.

సర్వసమిష్టిగా మంత్రస్వరూపము:

''శ్రీం హ్రీం క్లీం ఐం సౌః, ఓం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః, సౌః ఐం క్లీం హ్రీం శ్రీం - మతాంతరమందు కూటత్రయ సహితము ఎట్లనగా:

శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం క ఐం ఈ ల హ్రీం హ స క హ ల హ్రీం స క ల హ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం అని యగును. - త్రైలోక్యమోహన కవచము.

మణికొందరు ఈ దిగువపద్ధతి నుపాసించుచున్నారు:

అష్టౌ బీజాక్షరాణ్యాదౌ పశ్చాత్‌ పంచదశీతతః,

పంచబీజాక్షరాప్యేషా శ్రీమహా షోడశీమతా ||

శ్రీమాయా కామవాక్ఛక్తి తారమాయా రమాఃక్రమాత్‌

విద్యా పంచదశీ పశ్చాత్‌ శక్తివా క్షామ చిద్రమాః,

అష్టావింశతి వర్ణేయం పూర్ణాపూర్ణ ఫలప్రదాం

బోధ దీప్తాది సంయుక్తా శ్రీమహా షోడశాక్షరీ.

శ్రీం హ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం - క ఏ ఈల హ్రీం - హసకహల హ్రీం సకల హ్రీం - సౌః ఐం క్లీం హ్రీం శ్రీం అను ఇరువది ఎనిమిది వర్ణసంకలితము. ''మహాషోడశాక్షరి'' యని పిలువబడుచున్నది.

ఇది పూర్ణము, పూర్ణఫలదము. ఇందలి విద్యాకూటములు మూడు వర్ణములుగా గ్రహించుచో ''షోడశాక్షరి'' యగును.

వామకేశ్వర తంత్రమునందు వివరింపబడిన శ్రీవిద్యా షోడశాక్షరీ మంత్రార్థము యథాతథముగా ఈ దిగువ నుదామరించుచున్నాను.

೧. ''శ్రీం'' ఇతి బిందు విశిష్ట 'శ' వర్ణేన సుఖశబ్దవాచ్య మానంద ముచ్యతే. మహామాయాత్మక 'ఏ' కారస్య బిందు ద్వయాత్మకత్వేన రేఫసై#్యక బిందురూప త్వేన సమష్ట్యా బిందు త్రయేణ గుణత్రయ ముచ్యతే. తథాచ శ్రీమితి ప్రథమబీజేన కాంస్యపాత్రస్థ జలమధ్య విలీన కాచవద్దృశ్యమాన గుణత్రయ విశిష్టా విద్యాశబల పర్యాయాంతర్లీన విమర్శలోక భావాపన్నం ప్రకాశాత్మకం బ్రహ్మప్రతిపాద్యతే.

೨. ''హ్రీం'' ఇతి ద్వితీయబీజే నావ్యక్త ముచ్యతే. అవ్యక్తం నామ జగత్కారణీ భూతా మాయా బ్రహ్మణ్యు చ్ఛ్రూణతా దశాయాం గుణత్రయస్య పరస్పరం మేళనానం తరం సంసృష్టగుణత్రయసంవలితం బ్రహ్మ ''హ్రీం'' ఇతి బీజేన ప్తరిపాద్యతే. మాయాబీజస్యావ్యక్త వాచకత్వం దధీచి సంహితాయాం విష్ణునా భువనేశ్వరీకల్పే ప్రతిపాదితం.

శ్లో|| జగదేతత్పూర్వమాసీ దవ్యక్తం ప్రకృతం ప్రియే,

జగదోవ్యక్త రూపాయా సావస్థా సముదాహృతా||

ప్రకృత్యవస్థా దేవేశిసాచ శక్తిశ్శివస్యతు,

శివాత్మికా೭೭ది జననీ చిద్రూపా భువనేశ్వరీ || ఇతి||

3. ''క్లీం'' ఇతి తృతీయబీజ ఘటకబిందుయుక్త 'క' కారేణ బ్రహ్మ ప్రతిపాద్యతే; ''కం'' బ్రహ్మేతి శ్రుతేః 'ల' కారస్యేంద్ర బీజత్వేన ''లం'' ఇతి పరమైశ్వర్యేతి ధాతునా 'ల' కారేణ పరమైశ్వర్య ముచ్యతే.

శ్రు|| ఇంద్రో మాయాభిః పురురూప ఈయత ఇతి. శ్రుత్యాచ మహామాయా బీజ విశిష్ట 'క' కార 'ల' కారాత్మక తృతీయేన బీజేన ప్రపంచసృజనేచ్ఛయా పరిచ్ఛిత్తిరూపేణాంకురిత మహత్తత్త్వాపర పర్యాయ మాయా విచ్ఛిన్న బ్రహ్మ ప్రతిపాద్యతే.

೪. ''ఐం'' ఇతి చతుర్థబీజేన షట్త్రింశత్తత్వ పరమాద్యర్ణ గర్భిణీ.

శ్లో|| సోహం భావాత్పరం బిందుం ప్రవిశ్య ధ్వనితాంగతః,

సోపి నాదాత్మికాం యోని మేత్యయాతి స్వశక్తితామ్‌||

ఇతి శంభు చండికా వచనాత్‌ నాదాత్మకం అహం భావాపన్నం అహంకారాత్మకం బ్రహ్మ ప్రతిపాద్యతే.

೫. ''సౌః'' ఇతి సకారేణ బ్రహ్మ ప్రతిపాద్యతే. విసర్గ విశిష్ట చతుర్దశ స్వరేణ శక్తిః ప్రతిపాద్యతే. తథాచ సముదాయేన స్త్రీ పుం భావాత్మకం అర్ధనారీశ్వరాత్మకం బ్రహ్మ ప్రతిపాద్యతే.

೬. ''ఓం'' ఇతి బీజేన పార్వతీ పరమేశ్వర ద్వంద్వ ముచ్యతే.

శ్రు|| సప్రపంచోయ మోంకారః సప్రపంచస్య శూలిన ఇతి శ్రుతేః.

`ò. ''హ్రీం'' ఇతి బిందువిశిష్ట ''హ'' కారస్య=అహమిత్యంతఃకరణ వృత్తిరూపత్వేన చ ఆది జీవస్వరూపస్య చతుర్ముఖ హిరణ్యగర్భరూప బ్రహ్మణః తద్బీజరూపత్వం కించ హకారస్య బ్రహ్మరూపత్వం కామకలా బీజేన సరస్వతీ ఏవం చ ''హ్రీం'' ఇతి సప్తమ బీజేన వాణీ హిరణ్యగర్భాత్మక ద్వంద్వం ప్రతిపాద్యతే.

೮. ''శ్రీం'' ఇతి అష్టమ బీజేన లక్ష్మీ నారాయణాత్మక ద్వంద్వం ప్రతిపాద్యతే. బిందుయుక్త శవర్ణేన పుం రూపత్వం రేఫ తురీయ స్వరాభ్యాం లక్ష్మీరూపత్వం ద్యోత్యతే. శివస్య దారుకావన విహారకాలే క్షరాబ్ధి మధన ప్రకరణపి విష్ణోః స్త్రీరూపత్వ ముక్తం; తేన కామకలా బీజేన లక్ష్మీనారాయణ ద్వంద్వం ప్రతిపాద్యతే.

೯, ೧೦, ೧೧. పంచదశీ కూటత్రయం నవమ దశమ ఏకాదశరూప బీజత్రయత్త్వేన గృహీతం.

೧೨, ೧3, ೧೪, ೧೫, ೧೬. పునః వ్యత్యస్త బీజపంచక విశిష్ట ''సౌః'' ''ఐం'' ఇతి శక్తివాగ్భవ బీజద్వయేన అగ్నీషో మాత్మక ద్వంద్వం ప్రతిపాద్యతే. ''స'' కారస్య చంద్రబీజ త్వాత్‌ వాగ్భవ బీజస్యోకార ప్రవృత్తికత్వేన మతాంతరాగ్ని బీజత్వేన చ బీజద్వయస్య అగ్నీషోమాత్మక ద్వంద్వం ప్రతి పాద్యతే. ''క్లీం'' ''హ్రీం'' ఇతి మదన మాయాబీజద్వయేన భూతపంచకం ''కం శిరోంబునోరితి కోశాత్‌'' 'క' కారస్య జలవాచకత్వం 'ల' కారస్య భూ వాచకత్వం మాయాబీజ ఘటక 'హ' కారేణ వియత్‌ ప్రతిపాద్యతే. తథాచ బీజ సముదాయేన సందంశినీ న్యాయేన పృథివ్యప్తేజో వాయు రాకాశాః ప్రతిపాద్యంతే. ''శ్రీం'' ఇతి బీజ ఘటక శవర్ణేవ సుఖం ప్రతిపాద్యతే. తథాచ ''శం'' సుఖం రాతి గృహ్ణాతీతి వ్యుత్పత్త్యా ''శ్రీ'' బీజేన ప్రతిబింబరూపేణ బ్రహ్మగ్రాహిణీ పరాశక్తిః ప్రతిపాద్యతే.

- నవమ, దశమ, ఏకాదశ బీజైః. -

హే పరబ్రహ్మాత్మికే హేమాయే ''హ్రీం'' లజ్జాం (అవిద్యాం) ఈల=నివర్తయ, కహలహ్రీం=బ్రహ్మాపరోక్ష వృత్తిం, హస=ప్రకాశయ, సకలహ్రీం=సకల విషయకాజ్ఞానం, ఈల=నివర్తయ, ఇత్యనుషంగః.

తథాచ యావన్మంత్రేణ.

కాంస్యపాత్రస్థ జలమధ్య విలీన కాచవ ద్దృశ్యమాన గుణత్రయ విశిష్టా విద్యా శబల పర్యాయ విమర్శలోక భావాపన్న ప్రకాశాత్మకో చ్ఛ్రూణ గుణత్రయాత్యంత సంవలిత ప్రపంచ సృజనేచ్ఛయాంకురిత మహత్తత్వాపరపర్యాయ షట్త్రింశద్గర్భాఢ్యం నాదాత్మక అహంభావాపన్న అహంకారాత్మక స్త్రీ, పుం భావాపన్న పార్వతీ పరమేశ్వరాత్మక వాణీ హిరణ్యగర్భాత్మక లక్ష్మీనారాయణాత్మక అగ్నీ షోమాత్మక పృథివ్యప్తేజో వాయ్వాకాశాత్మక ప్రతిబింబరూపేణ బ్రహ్మ గ్రాహక బ్రహ్మస్వరూపమాయే మదీయాజ్ఞాన నివృత్తి పూర్వక బ్రహ్మాపరోక్షవృత్తిం ప్రకాశయ ''ఇతి అఖండార్థః''.

ఇతి ఏవం రాజరాజేశ్వరీ శ్రీవిద్యా మహాషోడశాక్షరీ మంత్రార్థః స్పష్టః.

బ్రహ్మశ్రీ సింహంభట్ల రామమూర్తి శాస్త్రిగారిచే పైన ఉదహరించిన వ్యాఖ్య చేయబడినది.

సారాంశము:

పరాశక్తీ! శ్రీరాజరాజేశ్వరీ!

మాయాశక్తివి; ఆత్మశక్తివి; నీవే అవ్యక్త; మహత్తత్త్వ అహంకారములు నీవే.

శ్రీమాతా! అర్ధనారీశ్వరాత్మకవు; పార్వతీ పరమేశ్వరాత్మకవు; వాణీ హిరణ్యగర్భాత్మకవు; లక్ష్మీనారాయణాత్మకవు; అగ్నీషోమాత్మకవు; పృథివ్యాది పంచభూతాత్మకవు; ప్రతిబింబరూపమున బ్రహ్మగ్రాహక పదార్థమ వైతివి.

నాయందలి అవిద్యను పోగొట్టుము. అజ్ఞానమును నివర్తింపజేయుము. నా నిజస్వరూపమును మఱుగుపడిన యథార్థతత్త్వమును ప్రకాశింపచేయుము. నాకు బ్రహ్మాపరోక్ష వృత్తిని కలుగజేసి నీ సాయుజ్యమునిచ్చి కాపాడుము.

జయ జగదంబ శివే

జయ కామాక్షి జయజయాద్రిసుతే,

జయ మహేశదయితే

జయ చిద్గమనకౌముదీధారే.

-*-

Sri Tattvamu    Chapters