ఓం తత్ సత్ శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు దివ్యపాదారవిందములకు భారద్వాజసగోత్ర మాణిక్యాంబ, సోమేశ్వరుల జ్యేష్ఠపుత్రుడ అని పిండి జగన్నాధరావు సాష్టాంగప్రణా ములులాచరించి చేయు విన్నపములు. శారదాంబదయలేదను, శ్రీశంకరభగవత్పాదుల కృపతోడను. గోరఖ్ పూరు గీతాప్రెస్సు వారిచే ప్రచురింపబడిన ఉపనిషత్తులు బ్రహ్మసనాత్రముల హిందీ భావార్ధమును చదివి, ఆకలింపు చేసుకొన్నను. శ్రీమద్భగవద్గీత వ్యాఖ్యానములను అద్యయనముచేసిన విషయముల నంతటిని సారాంశరూపమున (Notes) గా వ్రాసికొనియుంటిని. పరిశీలించగా నిది సులభముగా జిజ్ఞాసువుల కర్థమగునని యెంచి శుద్ధరూపమున వ్రాసియుంటిని. ఈ సంగ్రహమునకు ప్రస్థాన త్రయసారసుధాచంద్రిక యను నామంబొప్పునని తలచితిని. సులభగ్రాహ్యమగు ఈ సారసుధాచంద్రికను శ్రీశ్రీశ్రీ కంచికామకోటిపీఠ పరమాచార్యులు, బ్రహ్మవీనులైనీ శ్రీశ్రీశ్రీ జగద్గురు చంద్రశేఖర సరస్వతులవారి భవ్యస్మృతికి సమర్పితసుమాంజలిని దయతోడ స్వీకరించి పుస్తకరూపమునీ జిజ్ఞాసువులగు సాధకులకు అనుగ్రహ పూర్వకముగా నందిచింన నేను కృతకృత్యుడనగుదును. నా జన్మ సార్థకమగును. నిష్కామ భావమున కామ కోటిపీఠాధీశ్వరులకు సమర్పించు ఈ రచనను ఈసేవకుని సేవగా భావించి దయతో స్వీకరించి నన్ను కృతార్థుడను చేయుదురని త్రికరణ శుద్ధిగా నమ్ము చుంటిని. భవదీయ అనుగ్రహప్రసాదంబు సదా ఆకాషించు చుసెలవు తీసుకొందును. గురుపదసేవాభిలాషి. అనిపిండి. జగన్నాధ రావు. హైదరాబాద్, ది/1-5-1998, బహ్మధాన్యనామ సంవత్సర వైశాఖశుక్ల పంచమి. శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి జయంతి సందర్భముగా సమర్పణ From A.jaganadharao, M.A. Hindi pandit Retd. Principal. 2 RT/40 Saidabad colony Hyderabad- 500059. ph.No. 4533704