Sruthi Sourabham    Chapters    Last Page

12. వేదోపబృంహణము

''ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బృంహయేత్‌'

అను పురాణ వచనమును శ్రీకృష్ణ యజుర్వేద భాష్యోపోద్ఘాతములో శ్రీ సాయణాచార్యులుదాహరించారు.

'వేదోప బృంహణార్థాయ తావ గ్రాహయత ప్రభుః'

అని వాల్మీకి రామాయణంలో ఉంది. ఇతిహాస పురాణాలచే వేదార్థాన్ని విస్తరించుకోవాలి. అపుడే దానికి స్పష్టత ఏర్పడుతుంది. సందేహాలు తీరుతాయి.

శ్రీ కృష్ణయజుర్వేదారణ్యకంలో 5వ ప్రపాఠకంలో (1 అ.) ప్రవర్గ్య నిష్పత్తి ప్రకరణంలో ఒక ఉపాఖ్యానం ఉంది.

శ్రు - దేవావై సత్ర మాసత. ఋద్ధి పరిమితం యశస్కామాః.

తేబ్రువన్‌. యన్నః ప్రథమం యశ ఋచ్ఛాత్‌. సర్వేషాం

నస్త త్సహా సదితి. తేషాం కురుక్షేత్రం వేదిరాసీత్‌.

తసై#్య ఖాండవో దక్షిణార్ధ ఆసీత్‌. తూర్ఘ్న ముత్తరార్ధః.

పరీణ జ్జఘనార్ధః. మరవ ఉత్కరః. తేషాం మఖం వైష్ణవం యశ ఆర్ఛత్‌.

(వివృతి - ఋద్ధిపరిమితం = సాధన ద్రవ్య సమృద్ధ్యా పరితో నిర్మితం. మరవో జలరహితా భూప్రదేశా ఉత్కర రూపా అభవన్‌. వేదేరుత్తర భాగే పాంసు తృణాదయో యత్ర ప్రక్షిప్యన్తే సోయ ముత్కరః. తస్యాం వేద్యాముపతిష్ఠతాం తేషాం దేవానాం మధ్యే వైష్ణవం మఖం విష్ణు స్వామికం సత్రం యశః ప్రాప్నోత్‌. తస్మిన్‌ సత్రే విష్ణుశబ్ద వాచ్యో యజ్ఞాభిమానీ దేవో గృహపతిత్వేన దీక్షితః. అతో విష్ణుః సత్రం కృతవాన్‌ ఇత్యేవం విష్ణు నామ్నా యశ ఆర్ఛత్‌.)

శ్రు - తన్న్య కామయత. తేనా పాక్రామత్‌. తం దేవా అన్వాయన్‌. యశోవ రురుత్సమానాః. తస్యాన్వాగతస్య సవ్యాద్ధను రజాయత. దక్షిణాదిషవః. తస్మాదిషు ధన్వం పుణ్యజన్మ. యజ్ఞ జన్మాహి. తమేకగ్‌ం సంతం బహవో నాభ్య ధృష్ణువన్‌. తస్మాదేక మిషు ధన్వినం బహవో నిషు ధన్వా నాభి ధృష్ణువన్తి.

(వివృతి - తద్యశో మమైవాస్తు నాన్యేషామితి విష్ణుర్నితరామకామయత. తేన యశసా సహ ఇతరదేవ సకాశాత్స్వయమపాక్రామత్‌. తద్యశః అవరోద్ధుం దేవా విష్ణుమన్వ గచ్ఛేన్‌. నాభిధృష్ణువన్తి=అభిభవితుంనశక్నువన్తి.)

శ్రు - సోస్మయత. ఏకం మా సన్తం బహవో నాభ్య ధర్షి షురితి తస్య.

సిష్మియాణస్య తేజోపాక్రామత్‌. తద్దేవా ఓషదీషు న్యమృజుః. తే శ్యామాకా అభవన్‌. స్మయాకావై నామైతే. తత్స్మయాకానాగ్‌ం స్మయాకత్వం. తస్మా ద్దీక్షితే నాపి గృహ్యస్మేతవ్యం. తేజసోధృత్యై.

శ్రు - సధనుః ప్రతిష్కభ్యా తిష్ఠత్‌. తా ఉపదీకా అబ్రువన్‌ వరం వృణామహై. అథవ ఇమగ్‌ం రంధయామ. యత్రక్వచ ఖనామ. తదపోభి తృణ దామేతి. తస్మాదుపదీకా యత్ర క్వచ ఖనంతి. తదపోభి తృందంతి. వారే వృతగ్గ్‌ం హ్యాసాం. తస్య జ్యామప్యాదన్‌. తస్య ధనుర్విప్రవమాణగ్‌ం శిర ఉద వర్తయత్‌. తద్ద్యావా పృథివీ అను ప్రావర్తత. యత్ర్పావర్తత. తత్ర్పవర్గ్యస్య ప్రవర్గ్య త్వం. యద్ఘ్రాం ఇత్య పతత్‌. తద్ఘర్మస్య ఘర్మత్వం. మహతో వీర్య మపప్తదితి. తన్మహా వీరస్య వీరత్వం. యదస్యాః సమభరన్‌. తత్సమ్రాజ్ఞః సమ్రాట్త్వమ్‌.

(వివృతి - ప్రతిష్కభ్య = ధనుషః ఊర్ధ్వకోటిం చిబుకస్య అధస్తా త్కంఠ సమీపే దృఢ మవకృప్య, ఉపదీకాః = పిపీలికా సమానాః క్షుద్ర జంతవః వల్మీకస్య నిర్మాతారః, రంధయామః = సాధయామః

అపః అభిప్రాప్య తృణదామ = ద్రవీకరవామ,

తృందంతి = ద్రవీకుర్వన్తి, వారేవృతం = వరేణ సంపాదితం.

విప్రవమాణం = విస్తరేణ ఊర్ధ్వం ప్రవర్తమానం,

శిర ఉదవర్తయత్‌ = ఛిత్వా ఊర్ధ్వం ప్రావర్తయత్‌

అపప్తత్‌ = సారభూతం శిరః పతితం, సమభరన్‌=దేవాః తచ్ఛిరః సమాదాయపోషితవన్తః.)

శ్రు - తగ్గ్‌ స్తృతం దేవతాస్త్రేధావ్య గృహ్ణత. అగ్నిః ప్రాతస్సవనం. ఇంద్రోమాధ్యం దినగ్‌ం సవనం. విశ్వేదేవాస్తృతీయ సవనం. తేనాప శీర్ష్నా యజ్ఞేన యజమానాః. నాశిషో వారుంధత. న సువర్గం లోక మభ్య జయన్‌.

(వివృతి - స్తృతం = శిరోరాహిత్యేన హింసితం

+ అవారున్ధన్త = నప్రాప్తవన్తః)

శ్రు - తే దేవా అశ్వినా వబ్రువన్‌. భిషజౌ వైస్థః. ఇదం యజ్ఞస్య శిరః ప్రతి ధత్తమితి. తావ బ్రూతాం వరం వృణావహై. గ్రహఏవ నావత్రాపి గృహ్యతామితి. తాభ్యామేత మాశ్విన మ గృహ్ణన్‌. తావేతద్యజ్ఞస్య శిరః ప్రత్యధత్తాం. యత్ర్పవర్గ్యః. తేన సశీర్షాణ యజ్ఞేన యజమానాః. అవా శిషోరుంధత. అభి సువర్గం లోకమజయన్‌.

(వివృతి - ప్రతిధానం నామ శరీరే పునస్సంధానం.

ప్రవర్గ్య ఇత్యేతన్నామకం యత్కర్మ త దేవ యజ్ఞ శరీరే ప్రతిహితం శిరః)

శ్రు - యత్ర్పవర్గ్యం ప్రవృణక్తి. యజ్ఞసై#్యవ తచ్ఛిరః

ప్రతిదధాతి. తేన సశీర్ష్నా యజ్ఞేన యజమానః | అవాశిషో రుంధే. అభి సువర్గం లోకం జయతి. తస్మాదేష ఆశ్విన ప్రవయా ఇవ. యత్ర్పవర్గ్యః.

(వివృతి - ప్రవర్గ్యాఖ్య కర్మవిశేషః ఆశ్విన ప్రవయా ఇతి. ఆశ్విన మంత్రాః ప్రవయసః ప్రవృద్ధాః అస్మిన్‌ ప్రవర్గ్యే సోయమాశ్విన ప్రవయాః. ఇవ శబ్దః ఏవకారార్ధః)

దేవతలు సమృద్ధమయిన సాధన ద్రవ్యములతో యశస్సును కోరి సత్రయాగమును చేసిరి. ఈ యాగము వలన కలుగు కీర్తి వారందరికి కలుగవలెనని వారనుకొనిరి. వారికి కురుక్షేత్రము వేది అయినది. ఖాండవము దక్షిణార్థము, తూర్ఘ్నమను ప్రదేశముత్తరార్థము, పరీణత్‌ అనుచోటు వెనుక భాగము, నీరులేని మరు ప్రదేశము ఉత్కరము (యజ్ఞవేదికుత్తర భాగమున ధూళి, గడ్డి మొదలగునవి పడవేయు ప్రదేశము) అయ్యెను. ఆ సత్రమునందు యజ్ఞము నభిమానించు విష్ణువు యజమానునిగా యజ్ఞ దీక్షను స్వీకరించెను. కావున విష్ణువు యాగమును చేసెనను కీర్తి వచ్చెను. ఆ యశస్సుతో విష్ణు వచ్చటి నుండి వెడలి పోయెను. తమ అందరికి దక్కవలసిన కీర్తి విష్ణువొక్కనికి దక్కుట దేవతలకు నచ్చలేదు. కావున వారాయన వెంట బడిరి. కాని ఆయన నేమీ చేయలేకపోయిరి.

వారందరు తన నొక్కనిని ఏమియు చేయలేక పోవుటచే విష్ణువునకు నవ్వు వచ్చెను. నవ్వునపుడు అతని తేజస్సు వెలుపలికి వచ్చెను. దేవతలా తేజస్సును తమ శక్తిచే ఆకర్షించి ఓషధులలో ఉంచిరి. ఆ ఓషధులు శ్యామాకములు. కనుక దీక్షితుడు తన తేజస్సును రక్షించుకొనుటకు నోటిని మూసికొని నవ్వవలెను గాని నోరు తెరచి పైకి గట్టిగా నవ్వరాదు.

విష్ణువు తన ధనుస్సు పైకొనను గడ్డమునకు క్రింద కంఠము మీద ఆనించి నిలబడెను. (దేవతలాయనపై ప్రతీకారము కొరకు ఉపదీకలను పురుగులను ఆ నారి త్రాటిని కొరుకుడని కోరిరి.) ఆ పురుగులు మాకు వరము నిచ్చినచో కొరుకుదుమన్నవి. వాటి వరమిది. అవి త్రవ్విన చోట తడిసి ద్రవముగా కావలెను. వారు వరమిచ్చిరి. ఆ పురుగులు నారి త్రాటిని తిన్నవి. ధనుస్సుపైకొన పైకి విసురుగా తగులుటచే శిరస్సు తెగి ఎగిరి పడినది. ఆ యజ్ఞాధిష్ఠాన దేవత అయిన విష్ణువు శరీరమును దేవతలు మూడు భాగములుగా గ్రహించిరి. అందొక భాగమును అగ్ని గ్రహించెను. అది ప్రాతస్సవనము. రెండవ భాగమయిన మాధ్యందిన సవనమును ఇంద్రుడు గ్రహించెను. విశ్వే దేవతలు మిగిలిన తృతీయ సవనమును గ్రహించిరి. దేవతలు శిరస్సు లేని యజ్ఞమును చేసిరి. వారి కోరిక తీరలేదు. వారు స్వర్గమును పొందలేదు.

దేవతలు అశ్వినీ దేవతలతో నిట్లనిరి. ''మీరు ప్రసిద్ధ వైద్యులు. ఈ యజ్ఞ పురుషునికి శిరస్సు అతికించుడు''. అశ్వినులు వరమిమ్మని కోరిరి. అశ్వినీ దేవతలకు కూడ యజ్ఞములో సోమము నివ్వ వలెననెడి వారి కోరికను దేవతలంగీకరించిరి. అశ్వినీ దేవతలు ప్రవర్గ్యముతో యజ్ఞ పురుషునికి శిరస్సు నదికిరి. అపుడు దేవతలు యజ్ఞము సఫల మయ్యెను. వారి కోరికలు తీరెను. వారు స్వర్గమును పొందిరి.

ఈ గాథ ప్రవర్గ్యమును కర్మను ప్రస్తుతించుట కేర్పడినది. దీని వలన ఒక దినమందు చేయ దగిన ప్రాతస్సవన మాధ్యందిన సవన, తృతీయ సవన కర్మలు యజ్ఞ పురుషుడైన విష్ణు స్వరూపములనియు, ప్రవర్గ్య కర్మ ఆయనకు శిరస్సు వంటిదని తేలినది.

దేవీ భాగవత పురాణమున హయగ్రీవావతార కథ కనబడును.

హయగ్రీవావతారము - దేవీ భాగవతము

ఋషయః

ప్రశ్న : యమ్మూర్ధా మాధవ స్యాపి గతో దేహాత్పునః పరం

హయగ్రీవ స్తతో జాతః సర్వకర్తా జనార్దనః . . . .

తస్యాపి వదనం భిన్నం దైవయోగా త్కథం తదా

తత్సర్వం కథయాశుత్వం విస్తరేణ మహామతే.

సూతః : కదాచిద్దారుణం యుద్ధం కృత్వా దేవ స్సనాతనః

దశవర్ష సహస్రాణి పరిశ్రాంతో జనార్ధనః

సమేదేశే శుభే స్థానే కృత్వా పద్మాసనం విభుః

అవలంబ్య ధనుస్సజ్యం కంఠ దేశే ధరా స్థితం

దత్వా భారం ధనుష్కోట్యాం నిద్రామాప రమాపతిః

తదా కాలేన కియతా దేవాస్సర్వే సవాసవాః

బ్రహ్మేశ సహితా స్సర్వే యజ్ఞం కర్తుం సముద్యతాః

గతాస్సర్వేథ వైకుంఠం ద్రష్టుం దేవం జనార్దనం

దదృశుస్తే తదేశానం యోగనిద్రా వశం గతం

చిన్తామాపుస్సురా స్సర్వే బ్రహ్మరుద్ర పురోగమాః

తానువాచ తతశ్శక్రః కిం కర్తవ్యం సురోత్తమాః

నిద్రాభంగః కథం కార్యః చిన్తయన్తు సురోత్తమాః......

ఉత్పాదితా తదా వమ్రీ బ్రహ్మణా పరమేష్ఠినా

తయా భక్షయితుం తత్ర ధనుషోగ్రంధరాస్థితం

భక్షితేగ్రే తదా నిమ్నం గమిష్యతి శరాసనం

తదా నిద్రా విముక్తో సౌ దేవ దేవో భవిష్యతి

స వమ్రీం సందిదేశాథ దేవ దేవ స్సనాతనః

తమువాచ తదా వమ్రీ దేవ దేవస్య మా పతేః

నిద్రా భంగః కథం కార్యో దేవస్య జగతాం గురోః

కిం ఫలం భక్షణాద్దేవ యేన పాపం కరోమ్యహం

బ్రహ్మా : తవ భాగం కరిష్యామో మఖ మధ్యే యథా శ్రుణు

హోమ కర్మణి పార్శ్వేచ హవిర్దానా త్పతిష్యతి

తంతే భాగం విజానీహి కురు కార్యం త్వరాన్వితా

ఇత్యు క్తా బ్రహ్మణా వమ్రీ ధనుషోగ్రం త్వరాన్వితా

చఖాద సంస్థితం భూమౌ విముక్తా జ్యాతదా భవత్‌

ప్రత్యంచాయాం విముక్తాయాం ముక్తా కోటి స్తథోత్తరా

శబ్ద స్సమ భవ ద్ఘోరః తేన త్రస్తా స్సురా స్తదా

చింతామాపు స్సురా స్సర్వే కిం భవిష్యతి దుర్దినే

ఏవం చింతయతాం తేషాం మూర్ధా విష్ణో స్సకుండలః

గతస్స ముకుటః క్వాపిదేవదేవస్య తాపసాః

శిరోహీనం శరీరంతు దదృశాతే విలక్షణం

చింతాసాగర మగ్నాశ్చ రురుదు శ్శోక కర్మితాః

క్రందమానాం స్తదా దృష్ట్వాదేవాంశ్చైవ పురోగమాన్‌

బృహస్పతి స్తదోవాచ శమయన్వేదవిత్తమః

రుదితేన మహాభాగాః క్రందితేన తథాపికిమ్‌

ఉపాయశ్చాత్ర కర్తవ్యః సర్వథా బుద్ధి గోచరః

బ్రహ్మా : అవశ్యమేవ భోక్తవ్యం కాలేనాపాదితం చయత్‌

శుభం వాప్యశుభం వాపి దైవం కోతిక్రమేత్పునః

చింతయంతు మహామాయాం విద్యాం దేవీం సనాతనీం

సావిధాస్యతి నః కార్యం నిర్గుణా ప్రకృతిః పరా

ఇత్యుక్త్వావై సురాన్వేధా నిగమానాదిదేశహ

దేహ యుక్తాన్‌ స్థితానగ్రే సురకార్యార్థ సిద్ధయే

స్తువన్తు పరమాం దేవీం బ్రహ్మవిద్యాం సనాతనీం

తచ్ఛ్రుత్వా వచనం తస్య వేదా స్సర్వాఙ్గ సుందరాః

తుష్టువుః జ్ఞాన గమ్యాంతాం మహామాయాం జగత్థ్సితామ్‌

తానువాచ తదా వాణీచాకాశస్థా శరీరణీ

శృణ్వన్తు కారణం చాద్య యద్గతం వదనం హరేః

ఉదధేస్తనయాం విష్ణుః సంస్థితా మన్తికే ప్రియామ్‌

జహాస వదనం వీక్ష్య తస్యాస్తత్ర మనోరమమ్‌

తతః కోపయుతా జాతా మహాలక్ష్మీ స్తమో గుణా

కేనచిత్‌ కాలయోగేన దేవ కార్యార్థ సిద్ధయే

ప్రవిష్టా తామసీ శక్తి స్తస్యా దేహేతి దారుణా

శనకై స్సమువా చేదం ఇదం పతతు తే శిరః

స శీర్షం వాసుదేవన్తం కరోమ్యద్య యథా పురా

శిరోస్య శాపయోగేన నిమగ్నం లవణా మ్బుధౌ

పురా దైత్యో మహా బాహుర్హయగ్రీవోతి విశ్రుతః

తపశ్చక్రే సరస్వత్యా స్తీరే పరమ దారుణం

తదాహం తామసం రూపం కృత్వా తత్ర సమాగతా

సింహోపరి స్థితా తత్ర తమవోచం దయాన్వితా

వరం బ్రూహి మహాభాగ దదామి తవ సువ్రత

దృష్ట్వా రూపం మదీయం సప్రేమోత్ఫుల్ల విలోచనః

హర్షాశ్రు పూర్ణ నయన స్తుఎ్టావ సచ మాం తదా

శ్రీ దేవ్యువాచ : కింతే భీష్టం వరం బ్రూహి వాఞ్ఛితం యద్దదామి తత్‌

పరితుష్టాస్మి భక్త్యాతే తపసా చాద్భుతేనచ

హయగ్రీవః : యథామే మరణం మాతర్నభ##వేత్తత్తథా కురు

భ##వేయ మమరో యోగీ తథా జ్ఞేయ స్సురా సురైః

శ్రీదేవీ : జాతస్య హిధ్రువోమృత్యుర్ధ్రువం జన్మమృతస్యచ

ఏవం త్వం నిశ్చయం కృత్వామరణ రాక్షసోత్తమ

వరం వరయ చేష్టం తే విచార్య మనసాకిల

హయ : హయగ్రీవాచ్చమే మృత్యుర్నాన్యస్మా జ్జగదంబికే

ఇతిమే వాంఛితం కామం పూరయస్వ మనోగతం

శ్రీదేవీ : హయగ్రీవాదృతే మృత్యుర్నతే నూనం భవిష్యతి

ఇతి దత్వా వరం తసై#్మ అంతర్ధానం గతాతదా

సపీడయతి దుష్టాత్మా మునీన్వేదాంశ్చ సర్వశః

తస్మాచ్ఛీర్షం హయాస్యస్య సముద్ధృత్య మనోహరం

దేహేత్ర విశిరో విష్ణో స్త్వష్టా సంయోజయిష్యతి

హయగ్రీవో థ భగవాన్హనిష్యతి తమాసురం

దేవాస్తదాతి సంతుష్టా స్తమూచుర్దేవ శిల్పినమ్‌

కురు కార్యం సురాణాం వై విష్ణో శ్శీర్షాభి యోజనం

దానవ ప్రవరం దైత్యం హయగ్రీవో హనిష్యతి

ఇతి శ్రుత్వా వచస్తేషాం త్వష్టా వాతి త్వరాన్వితః

వాజి శీర్షం చకర్తా శు ఖడ్గేన సుర సన్నిధౌ

విష్ణోశ్శరీరే తే నాశు యోజితం వాజి మస్తకం

హయగ్రీవో హరిర్జాతో మహామాయా ప్రసాదతః

కియతా తేన కాలేన దానవో మద దర్పితః

నిహత స్తరసా సంఖ్యే దేవానాం రిపురోజసా

య ఇదం శుభమాఖ్యానం శృణ్వన్తి భువి మానవాః

సర్వ దుఃఖ వినిర్ముక్తాస్తే భవంతి న సంశయః

- దేవీ భాగవతము - 1 స్కం. 5 అధ్యాయము - 112 శ్లో.

దీని సారమిది. ఒకసారి జనార్దనుడు 10 వేల సంవత్సరములు దారుణ యుద్ధము చేసి అలసట పొందెను. ఒకచోట ధనుస్సును కంఠమందానుకొని పద్మాసనములో కూర్చుని యుండగా నిద్ర పట్టెను. అపుడు బ్రహ్మాది దేవతలు యజ్ఞము చేయదలచి జనార్దనుని దర్శించుటకు వైకుంఠమునకు వచ్చిరి. ఆ సమయమున యోగ నిద్రలో నున్న విష్ణువును మేల్కొల్పుటకు వమ్రి యను పురుగును బ్రహ్మ సృష్టించెను. అది 'నిద్రా భంగము చేయుట పాపము కదా! దానిని చేయుట వలన నాకు ఫలమేమి?' అన్నది. బ్రహ్మ ''హోమము చేయునపుడు ప్రక్కల పడిన హవిస్సు నీ కాహారమగు''నని వరమిచ్చెను. వమ్రి ధనురగ్రమును భక్షించెను. కావున నారి తెగి ధనువు కొన తగులుటచే విష్ణువు శిరస్సు తెగి ఎక్కడో పడినది. దేవతలు రోదించు చుండగా ఆ యాపద తొలగుటకు మహామాయను స్తుతించుడని వేదములకు బ్రహ్మఉపదేశించెను. వారు స్తుతించిరి. అపుడదృశ్యముగానున్న మహామాయ ఆ దేవతలతో 'ఒకప్పుడు తమోగుణావిష్ట అగు లక్ష్మీదేవి శాపముచే దైవ యోగమున నిట్లు జరిగినది. శ్రీహరి శిరస్సు లవణ సముద్రములో మునిగినది.

పూర్వము హయగ్రీవుడను దానవుడు సరస్వతీ తీరములో పరమదారుణ తపస్సు చేసెను. నేను తామస రూపముతో దర్శన మిచ్చితిని. 'తాను అమరుడు, సురాసురుల కజేయుడు కావలెనని అతడు కోరెను'. పుట్టిన వానికి మృత్యువు ధ్రువము కావున అది విడచి మఱియొకటి కోరుకొమ్మంటిని. అతడు'గుఱ్ఱపు శిరస్సు గలవానిచే తనకు మృత్యువు కలుగవలెనని కోరెను. నేనా వరము నిచ్చితిని. ఆ దుష్టుడు మునులను వేదములను పీడించుచున్నాడు. కావున విష్ణువునకిపుడు హయ శిరస్సును త్వష్ట ప్రజాపతి అదుకును. హయగ్రీవుడయిన విష్ణువు దైత్యుని సంహరించు''నని చెప్పెను.

దేవతల కోరిక చేత త్వష్ట త్వరగా హయ శిరస్సును విష్ణువున కదికెను. ఆయన హయగ్రీవ దైత్యుని వధించెను. ఇది దేవీభాగవతమందలి కథ.

ఈ రెండు గాథలందు యజ్ఞ ప్రసంగము, విష్ణువు విశ్రాంతి, విష్ణువు ధనురగ్రమును గడ్డమున కానించుకొని నిద్రించుట, దేవతల కోరికపై వమ్రి కొరుకుటచే ధనుస్సుకొన పైకి లేచి విష్ణు శిరస్సు తెగి పైకి ఎగిరి పడుట, శిరస్సును తిరిగి అదుకుట సమానాంశములు.

వీటిలో శ్రుతిలో ఉన్న కథ ప్రవర్గ్య సహితముగా యజ్ఞము నాచరించ వలెనని బోధించెను. దేవీ భాగవత కథ మహామాయా ప్రభావమును వెల్లడించును.

శ్రుతి కథలో విష్ణువునకు గర్వము కలుగుట. ఆయన అందరికి లభించవలసిన కీర్తి తానొక్కడే గ్రహించుట, ఆయన శిరస్సును తెగునట్లు చేసి దేవతలు యజ్ఞము చేయుట వింతగా కనబడును. విష్ణువు యజ్ఞ స్వరూపము. యజ్ఞమందు మూడు పూటలు చేయదగిన ప్రాత స్సవన, మాధ్యందిన సవన, తృతీయ సవనములాయన స్వరూపములు. ప్రవర్గ్యమాయన శిరస్సు. దేవతలు ప్రవర్గ్య రహితముగా యజ్ఞము చేయుటచే ఫలము కలుగలేదు. కావున ప్రవర్గ్యముతో యజ్ఞము చేయవలెనని దీని తాత్పర్యము. విష్ణువునకు గర్వము కలుగుట, శిరస్సు తెగుట మాయా ప్రభావముచే కల్గినవి. ఆ మాయ ఆయన శక్తియే. దానిచే ప్రవర్గ్య సహితముగా యజ్ఞమును చేయవలెనను జ్ఞానము లభించినది. అందరికి లభించవలసిన కీర్తి విష్ణువునకు లభించుట యనగా విష్ణువు యజ్ఞ స్వరూపుడు, యజ్ఞపతి అని బోధించుట.

వేదములో యజ్ఞ స్వరూపునిగా ఉన్న విష్ణువును పురాణములు హయగ్రీవునిగా, వేదరక్షకునిగా స్తుతించినవి.

'జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం

ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే'

అను ధ్యాన శ్లోకము హయగ్రీవుని సర్వ విద్యాధారునిగా కీర్తించుట గమనింపదగినది.

వేదంలోను పురాణాల్లోను గల ఉపాసనల్లో గూడా బాగా దగ్గర పోలికలు కనిపిస్తాయి. వైదికోపాసనల కంటే పురాణోపాసనలందు విస్తృతి కనబడుతుంది. శ్రీకృష్ణ యజురారణ్యకంలో స్వాధ్యాయ బ్రాహ్మణంలో బ్రహ్మోపస్థానం ఉంది. అన్ని యజ్ఞాల ఆరంభంలో ఆయుర్దాయాన్ని ప్రసాదించే బ్రహ్మోపస్థానాన్ని చేయాలని చెప్పారు. లేదా సాయంకాల సంధ్యావందనం తర్వాత ధ్రువ మండలం, శింశుమార చక్రం ధ్యానిస్తూ ఈ బ్రహ్మోపస్థానం చేయవచ్చు.

శ్రు - భూః ప్రపద్యే భువః ప్రపద్యే స్వః ప్రపద్యే

భూర్భువస్వః ప్రపద్యే బ్రహ్మప్రపద్యే బ్రహ్మకోశం ప్రపద్యేమృతం ప్రపద్యే మృతకోశం ప్రపద్యే చతుర్జాలం బ్రహ్మకోశం యం మృత్యుర్నావ పశ్యతి తం ప్రపద్యే దేవాన్ప్రపద్యే దేవ పురం ప్రపద్యే పరీవృతో వరీవృతో బ్రహ్మణా వర్మణాహం తేజసా కశ్యపస్య

(వివృతి - ప్రపద్యే = ప్రాప్నోమి, సూత్రాత్మనః కోశ స్థానీయః అవ్యక్తమ్‌, బ్రహ్మ = చతుర్ముఖ శరీరం తస్య కోశస్థానీయః బ్రహ్మలోకః

చతుర్జాలం = అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాః జాల వదావరకాః యస్య పంచమ కోశస్య. వరీవృతః = పునర్వేష్టితః కశ్యపస్య = ప్రేక్షకస్య అహమీదృశః, రక్షకోయం బ్రహ్మాతదుపస్థానేన మృత్యుంతరామీత్యర్థః)

శ్రు - యసై#్మ నమస్తచ్ఛిరో ధర్మో మూర్ధానాం బ్రహ్మోత్తరా హను ర్యజ్ఞోధరా విష్ణుర్‌ హృదయగ్‌ం సంవత్సరః ప్రజనన మశ్వినౌ పూర్వ పాదా వత్రిర్మధ్యం మిత్రా వరుణావపర పాదా వగ్నిః పుచ్ఛస్య ప్రథమం కాండం తత ఇంద్ర స్తతః ప్రజాపతి రభయం చతుర్థం

శ్రు. సవా ఏష దివ్య శ్శాక్వరః శిశుమార స్తగ్‌ంహ యఏవం వేద

(వివృతి - శాక్వరః = అత్యంత శక్తిమాన్‌, వేద = మనసాధ్యాయతి శిశూన్‌ మారయతి ముఖేన నిగిరతీతి శిశుమారః)

శ్రు. అప పునర్మృత్యుంజయతి జయతి స్వర్గం లోకం నాధ్వని ప్రమీయతే నాగ్నౌ ప్రమీయతే నాప్సు ప్రమీయతే నానపత్యః ప్రమీయతే లఘ్వాన్నో భవతి ధ్రువస్త్వ మసి ధ్రువస్యక్షిత మసి త్వం భూతానా మధిపతి రసి త్వం భూతానాగ్‌ం శ్రేష్ఠోసి త్వాం భూతా న్యుప పర్యావర్తన్తే నమస్తే నమ స్సర్వం తే నమో నమ శ్శిశు కుమారాయ నమః

(వివృతి - వేద = మనసాధ్యాయతి, లఘ్వాన్నః = లబ్ధాన్నః, సులభాన్నః ఉదఙ్ముఖోభూత్వాధ్రువం శిశుమార రూపేణ అవతిష్ఠేత్‌

ధ్రువః = వినాశ రహితః, ధ్రువస్య = ఆకాశాదేః జగతః, క్షితం = నివాస స్థానమసి, ఉపపర్యావర్తన్తే = ఉపేత్యపరితః సేవన్తే, సర్వం-త్వదీయాయ సర్వసై#్మ నమః, స్వామినేతుభ్యం నమః, శిశుకుమారాయ-శింశుమార కుమార రూపాయ ధ్రువాయనమః.)

భూమిని, భువర్లోకాన్ని, స్వర్గలోకాన్ని శరణు పొందుతున్నాను. చతుర్ముఖ బ్రహ్మను, బ్రహ్మలోకాన్ని సూత్రాత్మను, అవ్యక్తాన్ని సేవిస్తున్నాను. ఆనందమయ కోశాన్ని సేవిస్తున్నాను. ఇంద్రాది దేవతలను, వేద పురాన్ని సేవిస్తున్నాను. నేను పరబ్రహ్మ అనే కవచంతో అంతటా చుట్టుకోబడి ఉన్నాను. సర్వసాక్షి అయిన ఈశ్వరుని తేజస్సుతో చుట్టుకోబడి ఉన్నాను.

అందరిచే నమస్కరింపబడే పరబ్రహ్మ శింశుమార చక్రానికి శిరస్సు, ధర్మం శిరస్సుకు పై భాగం, చతుర్ముఖ బ్రహ్మ పై దవడ, యజ్ఞం క్రింది దవడ, విష్ణువు హృదయం, సంవత్సరం జననేంద్రియం, అశ్వినులు ముందు పాదాలు, అత్రిముని మధ్య శరీరం, మిత్రా వరుణులు వెనుక పాదాలు. అగ్ని తోకకు మొదటి భాగం. ఇంద్రుడు రెండో భాగం. ప్రజాపతి 3వ భాగం, భయరహితమయిన బ్రహ్మ 4వ భాగం.

ఇది దివ్యము, అత్యంత శక్తివంతము అయిన శింశుమారం.

దీనిని ధ్యానిస్తే అపమృత్యువు రాదు. స్వర్గలోకం పొందుతారు. దారిలో మరణించడం, అగ్నివల్ల నీటివల్ల మరణించడం, సంతతి లేకపోవటం ఉండదు. ఈ ఉపాసకుడికి సులభంగా ఆహారం లభిస్తుంది.

అన్ని యాగాలకు ఆరంభంలో ఈ బ్రహ్మోపస్థానం చేయడం ఆయుష్కరం. సాయంకాల సంధ్యావందనం తర్వాత ధ్రువ మండలం వైపు తిరిగి ఈ ప్రార్థన చేయాలి. తరువాత ధ్రువ మండలాన్ని చూస్తూ 'ఓ శింశుమారమా! నీవు నాశం లేనివాడివి. జగత్తుకు నివాస స్థానానివి. ప్రాణుల కధిపతివి. భూతాలలో శ్రేష్ఠమైన దానివి. భూతాలు నీ చుట్టు చేరి సేవిస్తున్నాయి. కావున నీకు నమస్కారం. నీకధీనమయిన ఈ జగత్తుకు నమస్కారం. నీకు వందనం. శింశుమార చక్రానికి కుమారుడవయిన ధ్రువుడా! నీకు నమస్కారం. నీకు అభివందనం. - తైత్తిరీయారణ్యకం - ప్ర. 2, పు. 196

శ్రీమద్భాగవతంలో ఈ జ్యోతిశ్చక్రోపాసన మరింత విస్తృతంగా ఉంది.

- శ్రీ మద్భాగవతం 5 స్కంధం - 23 అధ్యాయము 4 శ్లో.

కేచనైతజ్జ్యోతి రనీకం శింశుమార సంస్థానే భగవతో వాసుదేవస్య యోగధారణాయా మనువర్ణయంతి.

యస్య పుచ్ఛాగ్రేవాక్ఛిరసః కుండలీభూత దేహస్య ధ్రువ ఉపకల్పితః తస్యలాంగూలే ప్రజాపతి రగ్నిరింద్రో ధర్మ ఇతి. పుచ్ఛమూలే ధాతా విధాతాచ. కట్యాం సప్తర్షయః.

తస్య దక్షిణావర్త కుండలీ భూత దేహస్య యాన్యుదగయనాని దక్షిణ పార్శ్వాణ్యుప కల్పయంతి. దక్షిణాయనానితు సవ్యే. యథా శింశుమారస్య కుండలాభోగ సన్నివేశస్య పార్శ్వయో రుభయో రప్యవయవా స్సమ సంఖ్యా భవంతి. పృష్ఠేత్వజవీథి రాకాశ గంగాచ ఉదరతః.

పునర్వసు పుష్యే దక్షిణ వామయోః శ్రోణ్యో-రార్ద్రా శ్లేషేచ దక్షిణ వామయోః పాదయో-రభిజిదుత్తరాషాఢే-దక్షిణ వామయో ర్లోచనయో-ర్ధనిష్ఠా మూలంచ దక్షిణ వామయోః కర్ణయో-ర్మఖాదీన్యష్టౌ నక్షత్రాణి దక్షిణాయనాని వామ పార్శ్వే వక్త్రేషు యుంజీత-తథైవ మృగశీర్షాదీన్యుద గయనాని దక్షిణ పార్శ్వేషు ప్రాతిలోమ్యేన ప్రయుంజీత. శతభిషగ్జ్యేష్ఠే స్కంధయోర్దక్షిణ వామయో ర్న్యసేత్‌.

ఉత్తరహనావగస్త్యః - అధరహనౌ యమః - ముఖే చాంగారకః - శ##నైశ్చరః ఉపస్థే - బృహస్పతిః కకుది - వక్షస్యాదిత్యో - హృదయే నారాయణః - మనసి చంద్రః - నాభ్యాముశనా - స్తనయోరశ్వినౌ - బుధః ప్రాణాపానయోః - రాహుర్గళే - కేతవః సర్వాంగేషు - రోమసు సర్వే తారాగణాః

తదుహనై విష్ణోస్సర్వ దేవతామయం రూపం అహరహ స్సంధ్యాయాం ప్రయతో వాగ్యతో నిరీక్షమాణ ఉపతిష్ఠేత నమోజ్యోతిర్లోకాయ కాలాయనాయ అనిమిషాం పతయే మహాపురుషాయాభిధీమహీతి.

గ్రహర్‌క్ష తారామయ మాదిదైవతం

పాపాపహం మంత్ర కృతాం త్రికాలం

సమస్యతః స్మరతోవా త్రికాలే

నశ్యేత తత్కాలజ మాశు పాపమ్‌ 5 స్కం. - 23 అ

వ్యాఖ్య - ఉదగయనాని = అభిజిదాదీని పునర్వస్వన్తాని చతుర్దశ దక్షిణ పార్శ్వే. దక్షిణాయనాని పుష్యాద్యుత్తరాషాఢాంతాని చతుర్దశ వామ పార్శ్వే. పునర్వసు రుదగయనాంత్యం నక్షత్రం. పుష్యః దక్షిణాయనస్యాద్యం. ఆర్ద్రాశ్లేషేతయో ర్నిరంతరే అభిజిదుత్తరాషాడే ఉత్తర దక్షిణాయనయో రాద్యంత నక్షత్రే. శ్రవణ పూర్వాషాఢే తయోరుత్తర పూర్వే ధనిష్ఠా మూలంచ. తయోరప్యుత్తర పూర్వే మఖాదీని. యాన్యనూరాధాంతాని దక్షిణాయనాన్యష్టౌ. తాని వామ పార్శ్వేషు మృగశీర్షాదీని ప్రాతిలోమ్యేన పూర్వాభాద్ర పదాంతాని యాన్యుదగయన నక్షత్రాణ్యష్టౌ దక్షిణ పార్శ్వే. శతభిషగ్‌ జ్యేష్ఠే ఉత్తర దక్షిణాయనయో రవశిష్ట స్కంధయోః. నారాయణః అశ్వినౌచ కకుది గళ పృష్ఠే శృంగే)

శింశుమార చక్ర శిరస్సు క్రిందికి ఉంది. శరీరం చుట్టుకుని ఉంది. దాని తోక చివర ధ్రువుడు, కొన భాగానికి క్రింద ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్మదేవత, తోక మొదట ధాత, విధాత, మొలయందు సప్తర్షులు, కుడి ప్రక్క అభిజిత్తు మొదలయిన 14 నక్షత్రాలు, ఎడమ ప్రక్క పుష్యమి మొదలయిన 14 నక్షత్రాలు, వీపు యందు మూల పూర్వాషాడ, ఉత్తరాషాఢలు, పొట్టయందు ఆకాశగంగ ఉన్నాయి. కుడి ఎడమ కటి ప్రదేశములందు పునర్వసు పుష్యమి ఉన్నాయి.

కుడి ఎడమ పాదములందు ఆర్ధ్ర ఆశ్లేష ఉన్నాయి. కుడి ఎడమ ముక్కుల దగ్గర అభిజిత్తు ఉత్తరాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ కన్నుల దగ్గర శ్రవణం పూర్వాషాఢ ఉన్నాయి. కుడి ఎడమ చెవుల దగ్గర ధనిష్ఠ మూల ఉన్నాయి. ఎడమ ప్రక్క ఎముకలందు మఘ మొదలయిన 8 నక్షత్రాలున్నాయి. కుడి ప్రక్క ఎముకలందు పూర్వాభాద్ర మొదలుకొని మృగశిర వరకు ఉన్న నక్షత్రాలున్నాయి. శతభిషం, జ్యేష్ఠ కుడి ఎడమ స్కంధములందున్నాయి. పై దవడ యందు అగస్త్యుడు, క్రింది దవడ యందు యముడు, ముఖమనందు కుజుడు, గుహ్యావయవ మందు శని, మూపునందు బృహస్పతి, వక్షమందు సూర్యుడు, హృదయమందు నారాయణుడు, మనసు నందు చంద్రుడు, నాభియందు శుక్రుడు, స్తనములందు అశ్వినీ దేవతలు, ప్రాణాపానములందు బుధుడు, కంఠమందు రాహువు, అన్ని రంగములందు కేతువులు, రోమములందు తారలు ఉన్నాయి.

ఇది భగవంతుని సర్వదేవతామయ రూపం. ప్రతిదినం సంధ్యాకాలంలో మౌనంగా దర్శిస్తూ నిలబడి స్తుతించాలి. కాలానికి ఆశ్రయమయిన వాడు, దేవతల కధిపతి, జ్యోతిర్లోక రూపుడు అయిన మహాపురుషుని ధ్యానం చేస్తున్నామని భావించాలి. ఇలా శింశుమార స్వరూపుడయిన భగవంతునికి నమస్కరిస్తూ మూడుకాలల్లో స్మరించే నరుని పాపం నశిస్తుంది.

- శ్రీమద్భాగవతం - 5 స్కంధం, 23 అధ్యా.

సామ్యాలు

ఈ రెండింటిలో శింశుమార మనే పేరుతో జ్యోతిస్సమూహం ధ్యానించాలని చెప్పడం జరిగింది. పుచ్ఛాగ్రాది ప్రదేశాలలో ధ్రువాదులుండడం, సాయం సంధ్యాకాలంలో ఉపస్థానం సమానాంశాలు. భాగవత జ్యోతిశ్చక్ర వర్ణన వల్ల ఉపనిషత్తులోని ఉపాసన గూడా జ్యోతిశ్చక్ర ధ్రువులను శింశుమార చక్రంగా ఉపాసించాలని స్పష్టపడుతోంది. భాగవతం లోని వర్ణనం చూడనపుడు ఉపనిషత్తులోనిది అదృశ్యమయిన దేవతలకు ఉపాసన అనే భ్రాంతి కలుగుతుంది.

బృహదారణ్యకోపనిషత్తు ఆదిత్యునిలో అంతర్యామి వేరే ఉన్నాడని తెలుపుతుంది. 'య ఆదిత్యే తిష్ఠ న్నాదిత్యా దన్తరో యమాదిత్యో న వేద యస్యాదిత్యః శరీరం య ఆదిత్య మన్తరో యమయత్యేష త ఆత్మాన్త ర్యామ్యమృతః'.

(ఎవరాదిత్యుని యందున్నారో, ఆదిత్యుని కంటే లోపలి వాడో, ఎవని నాదిత్యుడెరుగడో, ఎవని కాదిత్యుడు శరీరమో, ఎవడాదిత్యుని లోపలనుండి ప్రేరేపించునో అతడే నీ ఆత్మ. అంతర్యామి, అమృతుడు.)

- బృహ - 3 అ. 7 బ్రా. 9 మం.

మార్కండేయ పురాణంలో దేవీ మాహాత్మ్యంలో శుంభనిశుంభుల వల్ల అధికారాలు కోల్పోయిన దేవతలు హిమాలయాలకు వెళ్ళి దేవిని స్తుతిస్తూంటే పార్వతి జాహ్నవీ స్నానానికి వచ్చింది.

శ్లో. సాబ్రవీత్తాన్‌ సురాన్‌ సుభ్రూర్భవద్భిః స్తూయతేత్రకా!

శరీర కోశతశ్చాస్యాః సముద్భూతా బ్రవీచ్ఛివా

స్తోత్రం మమైతత్క్రియతే శుంభ##దైత్య నిరాకృతైః

శరీర కోశాద్యత్తస్యాః పార్వత్యాః నిస్పృతాంబికా

కౌశికీతి సమస్తేషు తతో లోకేషు గీయతే

తస్యాం వినిర్గతాయాంతు కృష్ణా భూత్సాపి పార్వతీ

- మార్కండేయ - 82 అ. 41, 42, 43, 44 శ్లో.

(సుందరమయిన కనుబొమలు కల పార్వతి మీరెవరిని స్తుతిస్తున్నారని అడిగింది. అపుడామె శరీరాన్నుండి ఉద్భవించిన శివ 'యుద్ధంలో శుంభ##దైత్యునిచే ఓడిపోయిన దేవతలు నన్ను స్తుతిస్తున్నార' అని సమాధానం చెప్పింది. పార్వతి శరీర కోశాన్నుండి అంబిక ఈవలకు వచ్చింది కనుక ఆమె కౌశికి అని విఖ్యాతి పొందింది. తరువాత పార్వతి నల్లబడి పోయింది.)

పై బృహదారణ్యక శ్రుతిని, మార్కండేయ పురాణ గాథను సమన్వయించడం వల్ల అంబిక అంతర్యామి అయిన ఆత్మ స్వరూపిణి అని అవగతమవుతుంది.

'సదానంద పూర్ణః స్వాత్మైవ పరదేవతా లలితా'

(ఎల్లప్పుడూ ఆనందంతో నిండిన ఆత్మయే లలితా పరదేవత) అని భావనోపనిషత్తు కూడా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది.)

- భావనోపనిషత్తు - 28 వా.

శ్రీదేవ్యారాధనమంటే ప్రకృత్యారాధన అని కొందరనుకుంటారు. పై ఉపనిషత్పురాణాలు శ్రీదేవి ఆత్మరూపిణ అని ప్రకటిస్తున్నాయి.

మరుత్తులకు సప్తకపాల పురోడాశ నిర్వాపంలో వినియోగించే యాజ్యలో 'మరుత స్సుదానవః' అని వారికి సుదానవులు అనే విశేషణం ఉంది. దీనికి 'సుష్ఠుజలదాన పరాః' అని అక్కడి సందర్భాన్ని బట్టి భాష్యకారులు అర్థం చెప్పారు.

- శ్రీకృష్ణయజుర్వేదం - తైత్తిరీయ సంహిత - 1 ప్ర. 11 అ. 7 వ.

దీనిని శ్రీమద్రామాయణంలోని మరుత్తుల జనన వృత్తాంతంతో సమన్వయిస్తే మరుత్తులు దేవతలతో చేరడం వల్ల, దానవుల దుష్ట లక్షణాలు వారికి లేకపోవడం వల్ల 'మంచి దానవులు' అనే అర్థం లభిస్తుంది.

- శ్రీమద్రామాయణం-బాల - 47 అధ్యాయం

ఇక్కడ శ్రుతిలోను పురాణంలోను ఉండే అంశాలను కొన్ని భేదాలున్నాయి. వేద విషయాల కంటె పురాణ విషయాలు విస్తరంగా ఉన్నాయి. కాని సమంగా ఉన్న అంశాలు గూడా చాలా ఉన్నాయి.

బ్రహ్మసూత్ర భాష్యంలో వైశ్వానరాధికరణంలో ఛాందోగ్యోపనిషత్తులో ఉన్న వైశ్వానరోపాసనకు వాజసనేయక శ్రుతిలో ఉన్న వైశ్వానరోపాసనకు కొంచెం భేదం ఉన్నా, రెంటిలోను ప్రాదేశ మాత్రంలో ఉపాసన చెప్పబడడం వల్ల వాజసనేయక శ్రుతిలో చెప్పిన మూర్ధ ప్రభృతి చుబుకాంతమయిన అవయవాల యందు చేయదగిన ఉపాసననే ఛాందోగ్య శ్రుతి గూడా చెప్పిందని భాష్యకారులు చెప్పారు. ఈ విషయం 'సంపత్తేరితి జైమిని స్తథాహి దర్శయతి (1-2-31) అనే సూత్రం చెప్పింది.

ఛాందోగ్యంలో 'వైశ్వానరస్య మూర్ధైవ సుతేజాః చక్షుర్విశ్వరూపః' అని వైశ్వానరునకు మూర్ధ స్థానీయమయిన ద్యులోకము సుతేజస్త్వగుణము కల్గి యున్నట్లు, చక్షు స్థానీయుడైన సూర్యుడు విశ్వరూప గుణము కల్గియున్నట్లు చెప్పబడింది. వాజసనేయక శ్రుతిలో 'మూర్ధాన ముపదిశన్నువాచ ఏషవా అతిష్ఠా వైశ్వానర ఇతి' చక్షుషీ ఉపదిశన్నువాచ. 'ఏషవైసుతేజా వైశ్వానర ఇతి' అని ద్యులోకము అతిక్రమణ గుణమును కలిగియున్నట్లు సూర్యుడు తేజోగుణము కలిగి ఉన్నట్లు వర్ణించబడినది. ఇట్లు భేదం ఉన్నా వాజస నేయక శ్రుతిలో చెప్పబడిన మూర్ధాది చుబుకాంత ప్రాదేశ మాత్ర సంపత్తి వల్ల ఛాందోగ్యంలో కూడా ప్రాదేశ మాత్ర సంపత్తిగా అంగీకరించారు. కనుక వేద పురాణ గాథలలో కొంచెం భేదాలున్నా ఒక దానిలో కల్గిన సంశయాన్ని రెండో దాని ద్వారా తీర్చుకోవచ్చు.

విష్ణు సంబంధమయిన పురాణాలు చూస్తే విష్ణువే దేవుడని, శివ సంబంధమయిన పురాణాలు చూస్తే శివుడే దేవుడని భావన కల్గడం వల్ల పరస్పర సమన్వయం కల్గడానికి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇతర దేవతల పట్ల న్యూనతా భావం కలుగుతుంది. కాని ఉపనిషద్రూపమయిన శ్రుతులతో ఈ పురాణాలను సమన్వయిస్తే ''ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణోరూపకల్పనా' అన్నట్లు ఉపాసకుల ఏకాగ్ర భావన కోసం ఆయా పురాణాలలో ఆ మూర్తి ప్రశంస ఉన్నా పరతత్త్వం ఒకటే అనే నిర్ణయం కలుగుతుంది.

కేవలం వేద సంహితల్లో, ప్రధానంగా కర్మ కాండలో ఇంద్ర ప్రశంస అధికంగా కనబడడం చేత ఇంద్రుణ్ణి భగవంతుడుగా కొందరు భావిస్తున్నారు. ఉదా : వాసిష్ఠ గణపతి ముని మొదలయిన వారు. కాని శివ పురాణం విష్ణు పురాణం ఉన్నట్లు ఇంద్రుణ్ణి భగవంతునిగా ప్రతిపాదించే పురాణాలు కనబడవు. ఇంద్రుని జీవత్వాన్ని పురాణతిహాసాలు ప్రదర్శిస్తాయి. కనుక ఇంద్రుడు శతాశ్వమేధాది కర్మ విశేషించే ఔన్నత్యం పొందిన జీవుడే కాని భగవంతుడు కాడని చెప్పవచ్చు. బ్రహ్మసూత్ర భాష్యంలోని ఇంద్ర ప్రతర్దనాధికరణం కూడా ఈ విషయంలో ప్రమాణం. కనుక వేద విషయాలను పురాణతిహాసాల ద్వారా ఉపబృంహణం ప్రయోజనకరమే.

Sruthi Sourabham    Chapters    Last Page