Prathyaksha Daivamu    Chapters    Last Page

నమస్సుమాంజలి

ఓ స్వామీ!

శ్రీ కాంచీపుర పీఠ మెంతయు

రహించెన్‌ మీదు సారథ్య దీ

క్షా కైంకర్యమునన్‌ - జయేంద్రయతి

విస్తారించె మీ లక్ష్యముల్‌

మీకై వారసులైరి శంకరయతుల్‌

మేధా సురాచార్యులు -

ఈ లోకక్షేమకర త్రయమ్ము నెపు

డంఘ్రుల్‌ మ్రొక్కి ప్రార్థించెదన్‌.

లోకా స్సమస్తా స్సుఖినో భవంతు.

ఇది శ్రీ రాజరాజేశ్వరీ లక్ష్మీ నృసింహ పర

దేవతా వరప్రసాద లబ్ధ కవితా లేశ, కోన

సీమ ద్రావిడ శాఖీయ, పంచార్షేయ ప్రవ

రాన్విత భార్గవస గోత్ర, ఆపస్తంబ

సూత్ర, యజు శ్శాఖాధ్యాయీ

పణతుల వంశోద్భవ సుప్రసిద్ధ

వైద్యాచార్య శ్రీ సుబ్బరామ

యార్య శ్రీమతి సుబ్బ రత్నాంబా తృతీయ

వరపుత్ర రామేశ్వర

శర్మ నామధేయ

విరచితంబైన

ప్రత్యక్ష దైవ కృతి

* సంపూర్ణము *

Prathyaksha Daivamu    Chapters    Last Page