Varahamahapuranam-1    Chapters   

సప్తాధికశత తమోధ్యాయః - నూట ఏడవ అధ్యాయము

హోతా ఉవాచ - హోతపలికెను.

లవణధేనుం ప్రవక్ష్యామి తాం నిబోధ మహీపతే.

రాజా! లవణధేనువును గూర్చి చెప్పెదను. వినుము.

అనులిప్తే మహీవృష్ఠే కృష్ణాజినకుశోత్తరే. 1

ధేనుం లవణమయీం కృత్వా షోడశప్రస్థసంయుతామ్‌,

చతుర్భి ర్వత్సం రాజేన్ధ్ర ఇక్షుపాదాం చ కారయేత్‌. 2

అలికిన నేలపై జింకర్మము, దర్భాసనములపై పదునారు తూముల ఉప్పుతో ఆపురూపమును చేయవలయును. నాలుగు తూములతో దూడను చేయవలయును. ఆవునకు కాళ్లు చెరకుగడలు.

సౌవర్ణముఖశృంగాణి ఖురా రౌప్యమయా స్తథా,

ముఖం గుడమయం తస్యా దన్తాఃఫలమయా నృప. 3

జిహ్వాం శర్కరయా రాజన్‌ ఘ్రూణం గంధమయం తథా,

నేత్రే రత్నమయే కుర్యాత్‌ కర్ణౌ పత్రమ¸° తథా,

శ్రీఖండశృంగకోష్ఠౌచ నవనీతమయాః స్తనాః. 4

సూత్ర పుచ్ఛాం తామ్ర పృష్ఠాం దర్భరోమాం పయస్వినీమ్‌,

కాంస్యోపదోహాం రాజేన్ధ్ర ఘణ్టాభరణభూషితామ్‌. 5

బంగారుముఖము, కొమ్ములు, వెండిగిట్టలు, బెల్లపునోరు, పండ్లదంతములు, చక్కెరనాలుక, గంధపుముక్కు, రత్నము కన్నులు, ఆకుల చెవులు, మంచిగంధపు కొమ్ములు, కడుపు, వెన్నపొదుగు, త్రాటితోక, రాగిపిరుదులు, దర్భపురోమములుగల ఆవును కల్పింప వలయును. పాలుపితుకుటకు రాగిపాత్రను ఉంచవలయును. ఘంటలతో ఆభరణములతో అలంకరింపవలయును.

సుగంధపుష్పధూపైశ్చ పూజయిత్వా విధానతః,

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన బ్రాహ్మణాయ నివేదయేత్‌. 6

మంచి వాసనగల పూవులతో ధూపములతో విధిప్రకారము పూజించి జమిలి వస్త్రములు కప్పి బ్రాహ్మణున కొసగవలయును.

గ్రహణ వాథ సంక్రాన్తే వ్యతీపాతే తథాయనే,

నక్షత్ర గ్రహపీడాసు సర్వకాలం ప్రదాపయేత్‌. 7

గ్రహణము, సంక్రాంతి, వ్యతీపాతము, అయనము, నక్షత్ర గ్రహపీడాసమయములు అనువానిలో ఈ దానము చేయవలయును. లేదా ఎప్పుడైనను చేయవచ్చును.

ద్విజాయ సాధువృత్తాయే కులీనాయ చ ధీమతే,

వేదవేదాంగవిదుషే శ్రోత్రియా యాహితాగ్నయే. 8

ఈదృశాయ ప్రదాతవ్యా తథామత్సరిణ నృప,

జప్తవ్యమేవ మన్త్రంతు పుచ్ఛదేశోపవిశ్య చ. 9

మంచినడవడి, కులము, బుద్ధి, వేదవేదాంగముల పాండిత్యము, వేదవిద్య, అగ్నిహోత్రనిత్యార్చన కలబ్రాహ్మణునకు, ముఖ్యముగా ఇతరులయెడ మత్సరబుద్ధి లేనివానికి, ఈ గోవు నొసగవలయును.

ఛత్రకోపానహౌ దే¸° ముద్రికా కర్ణమాత్రకౌ,

ఆచ్ఛాద్య వస్త్రముగ్మేన దక్షిణాం కంబలం దదౌ. 10

గొడుగు, చెప్పులు, ఉంగరము, కుండలములు, దక్షిణ, శాలువ అనువానిని వస్త్రములజంటతో కప్పి యొసగవలయును.

ఇమాం గృహాణ భోవిప్ర ధేనుం కామదుఘాం శుభామ్‌

భరస్వ కామై ర్మాం దేవి రుద్రరూపే నమోస్తు తే. 11

ఓయి విప్రా! ఈ కామములను పిదుకు గోవును శుభ##మైన దానిని గ్రహింపుము. తల్లీ! రుద్రరూపా! నీకు నమస్కారము. నావాంఛలన్నింటితో నన్ను భరింపుము.

రరాజ సర్వభూతానాం సర్వదేవనమస్కృతా,

కామం కామదుఘే కామం లవణధేనో నమోస్తు తే. 12

నీవు సర్వభూతములలో మిక్కిలిగా విరాజిల్లుచున్నావు. సర్వదేవతలు నీకు నమస్కరింతురు. నీవు కామములను తీర్చు ధేనువవు. లవణధేనూ! నీకు నమస్కారము.

దత్వా ధేనుం లవణం వర్జ్య మేకాహం చైవతిష్ఠతి,

స్వయం త్రిరాత్రం విప్రేణ తథైవ లవణాశినా. 13

లవణధేను దాత ధేనువునొసగి లవణమును మాత్రము తిని, తక్కిన యన్నింటిని వదలి ఒకదినముండవలయును. పుచ్చుకొన్న విప్రుడు మూడురోజులు లవణభోజియై యుండవలయును.

సహస్రేణ శ##తేనాథ స్వశక్త్యా కనకేన తు,

దత్త్వేమాం స్వర్గ మాప్నోతి యత్ర దేవో వృషధ్వజః. 14

వేయియో నూరో బంగారుకాసులు తనశక్తి ననుసరించి దక్షిణ నొసగ వలయును. శంకరుడున్న భూమికి దీనివలన అరుగును.

య ఇదం శృణుయాద్‌ భక్త్యా శ్రావయేదపి మానవః,

ముచ్యతే సర్వపాపేభ్యో రుద్రలోకం చ గచ్ఛతి. 15

దీనిని భక్తితో వినువాడును, వినిపించువాడును, సర్వపాపములనుండి విడివడి రుద్రలోకమున కరుగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే సప్తాధికశతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూట ఏడవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters