Varahamahapuranam-1    Chapters   


విషయానుక్రమణిక

భూమిక.

ధర్మశాసనకర్తమనువు ఇతిహాస పురాణముల ద్వారమున వేదమును పెంపొందించుకొనవలయునని ఆదేశించెను. ''ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌'' - ఇచట సముపబృంహణ మనగా వేదార్ధము యొక్క

1-Chapter

శ్రీ మన్నారాయణునకు, నరులలో శ్రేష్ఠుడగు నరునకు, సరస్వతీదేవికి మ్రొక్కులిడి జయమును పఠింపవలయును.
2-Chapter ఆ విధముగా భూదేవి భక్తితో స్తుతింపగా తన దేహమునుండి వెలువడిన మాయను వెలుగొంద జేయుచు అదే వరాహరూపముతో నిలిచియుండెను.
3-Chapter మహర్షీ! జ్ఞానసంపన్నుడా! మరియొక జన్మమునందు జరిగిన ఆ విలాసమంతయు నాకు చెప్పుము. నాకెంతో వేడుకగా నున్నది.
4-Chapter ప్రభూ! ఈ నారాయణదేవుడు సర్వభావములతో పరమాత్ముడు. నిత్యుడు అగు దేవుడా? కాదా? నాకు తెలుపుము.
5-Chapter పూజ్యపాదులారా! మీరు నాదగు ఒక సందేహమును తీర్పవలయును. దానితో నాకు సంసార విముక్తి సంభవించును.
6-Chapter దేవా! ఆ వసువును, ఉత్తముడగు రైభ్యుడును బృహస్పతి ఉపదేశమును విని సంశయము తీర్చుకొని అటుపై ఏమి గావించిరి?
7-Chapter వసువు సిద్ధిపొందెనని విన్న మునివరుడు రైభ్యుడు ఏమిచేసెను? దేవా! ఇది నాకు పెద్ద సంశయము.
8-Chapter ఆ వసురాజుదేహమున పుట్టిన వ్యాదు డుండెనే అతడు తన వృత్తితో నాలుగువేల సంవత్సరముల కాలము గడపెను.
9-Chapter ఓ ధరణీ! లోకముల నన్నింటిని చక్కగా మనసున భావించిన ఆ భగవానుడు ఈ సర్వమును సృజించి యూరకుండెను. అంత సృష్టి పెంపొంద దొడగెను.
10-Chapter సర్గాది పంచకృత్యస్య లక్షణం బ్రూహి నౌ ప్రభో |
11-Chapter ఇట్టి సుందరమగు గౌరముఖుని యాశ్రమమును గాంచి దుర్జయు డిట్లు తలపోసెను.
12-Chapter అంతట సుప్రతీకమహారాజు విష్ణువుచేతి చక్రమునగ్నికి తన కొడుకు బూదియైన వార్త విని చింతించెను. అట్లు చింతించు చుండగా ఆతని కిట్లు బుద్ధిపొడమెను.
13-Chapter ఈ గొప్ప అచ్చెరువును గాంచి గౌరముఖు డేఫలము పొందెను? మణి నుండి పుట్టిన ఆ నాయకు లేఫలము పొందిరి?
14-Chapter ఓయి బ్రహ్మర్షీ!మేధావి, బ్రహ్మకొడుకు, సనకుని తమ్ముడు అగు సనందనుడు శ్రాద్ధమునకు యోగ్యులగు బ్రాహ్మణులను గూర్చి యిట్లు చెప్పెను. దానిని నీకు ఇప్పుడు చెప్పెదను. వినుము.
15-Chapter ప్రభూ! గౌరముఖుడు మార్కండేయునివలన ఇట్లు శ్రాద్ధవిధిని విని అటుపై ఏమిచేసెను?
16-Chapter ప్రభూ! అప్పుడు దేవరాజగు ఇంద్రుని దుర్వాసుడు నిన్ను సుప్రతీకుని కుమారుడు పోద్రోలగా మనుజులతో కలిసి నివసింతువని శపించెనుగదా!
17-Chapter ప్రభూ! త్రేతాయుగమున ఆమణివలన పుట్టిన నరవరులున్నారే, వారికి భగవంతుడు, మీరు రాజులగుదురని వరమొసగెనుగదా! వారి జన్మమెట్టిది? వారేమి కావించిరి? వారిపేరులేమి? నాకు తెలియజెప్పుము.
18-Chapter మహామునీ అగ్ని, అశ్వులు, గౌరి, గణపతి, నాగులు, కుమారస్వామి అనువారి పుట్టుక యెట్టిది?
19-Chapter రాజా! ప్రసంగమునుబట్టి నీకు విష్ణుమాహాత్మ్యమును చెప్పితిని. ఇప్పుడు తిథుల మహిమను చెప్పుచున్నాను. వినుము.
20-Chapter స్వామీ! మహాత్ముడగు బ్రహ్మ వలన అగ్ని ఇట్లు పుట్టెను. ఇక ప్రాణాపానముల స్వరూపముతో దేవతలగు అశ్వినులు ఎట్లు సంభవించిరి?
21-Chapter గొప్ప ప్రజ్ఞ గల ఓ మునీంద్రా! పరమాత్ముడైన పరమ పురుషుని వరదానమువలన గౌరీదేవి యెట్లు రూపము పొంది స్తుతులందినదో నాకు తెలియజెప్పుము.
22-Chapter అట్లు పరమేశ్వరుడగు రుద్రుడాకైలాసగిరి యందు నివసించు చుండగా ఒకప్పుడు గౌరీదేవి తండ్రిపగ మదిలో మొదలగా రుద్రునిపై కోపించెను.
23-Chapter మహర్షీ! గణపతి పుట్టుక కథ యేమి? అతనికి ఆ ఆకారమెట్లు వచ్చెను. నా మనస్సునకు బరువుగా నున్న యీ సంశయమును దీర్పుము.
24-Chapter దేవదేవా! భూధారీ! గొప్పబలము, పెద్ద ఆకారముగల సర్పములు ఆ పరమేశ్వరుని శరీరమును అంటియుండుటకు కారణమెయ్యది?
25-Chapter బ్రాహ్మణప్రవరా! మహామునీ! అహంకారమునుండి, కార్తికేయుడు ఎట్లు జన్మించెను? అడుగుచున్నాను. నాసంశయము తీర్పుము.

26-Chapter

ఓ బ్రాహ్మణోత్తమా! వెలుగునకు ఆకారమేర్పడుట యెట్లు? నీకు నమస్కరింతును. నాయీ సంశయమును తీర్పుము.
27-Chapter మునుపు గొప్పబలము గల పెనురక్కసి అంధకుడనువాడు కలడు. అతడు బ్రహ్మ యిచ్చిన వరము గర్వమున దేవతల నందరిని వశపరచుకొనెను.
28-Chapter మాయారూపిణి కాత్యాయని దుర్గ, మంగళరూప యెట్లు ఉదయించెను? ఆమె మొదటి స్థితిలో సూక్ష్మరూపముతో ఉండెను గదా! వేరు స్వరూపముతో ఎట్లు ఆవిర్భవించెను?
29-Chapter రాజా! ఈ కథను శ్రద్ధతో వినుము. బ్రహ్మ చెవుల నుండి దిక్కులెట్లు పుట్టినవో చెప్పెదను.
30-Chapter రాజా! పాపములను పోకార్చు మరియొకథ వినుము. అది వసుపతికి సంబంధించినది (వసుపతి-ధనములకు అధిపతి-కుబేరుడు) బ్రహ్మశరీరమున నున్న వాయువు, కుబేరుడుగా ఎట్లు పుట్టెనో చెప్పెదను.
31-Chapter మనువను పేరును, మనువుతనమును గ్రంథములలో కానవచ్చుచున్నది. ఒక ప్రయోజనము కొఱకు విష్ణువే యీ మనువు రూపమును దాల్చెను.
32-Chapter రాజా! నీకిపుడు గొప్పదియగు ధర్మము ఎట్లు పుట్టెనో, దాని మహిమ యెట్టిదో, దానికి సంబంధించిన తిథి యేమో వివరించెదను శ్రద్ధగా వినుము.
33-Chapter ధర్మము నిర్వహించుటలో సమర్థుడు, క్షమయే గొప్ప ఆయుధముగా ధరించినవాడు, గొప్పతేజస్సుగలవాడు అగు మహాతపుడను ఋషి ప్రీతితో 'రాజా! వినుము, మొట్టమొదటిదగు రుద్రుని పుట్టుకను
34-Chapter రాజా! నేను చెప్పుచున్న పితృదేవతల పుట్టుకను గూర్చి వినుము. మునుపు ప్రజాపతి యగు బ్రహ్మ వేరువేరు ప్రజలను సృజింపగోరిన వాడై చెదరని మనసుతో ఆప్రజల మూలద్రవ్యములను
35-Chapter బ్రహ్మమానసపుత్రుడు అత్రి. ఆతడు గొప్పతపస్సంపద గలవాడు. ఆతని పుత్రుడు చంద్రుడు దక్షున కల్లు డాయెను.
36-Chapter రాజా! మొదటి త్రేతాయుగమున మణివలన పుట్టిన రాజులుగా ప్రసిద్ధి చెందిన వారిని గూర్చి తెలిపెదను. నీవు ఆ వంశముననే కదా పుట్టితివి!
37-Chapter దేవా! విభో! సర్వప్రాణులకు భావింపదగిన స్వామీ! భక్తి గలనరులు, నారులు, నిన్నేతీరున ఆరాధింపగలరు. నాకిది యంతయు చెప్పుము.
38-Chapter ఆ కిరాతుడు మంగళ##మైన మార్గము నవలంబించి ఆహారము వదలి, ఆగురువును మనసులో స్మరించుచు తపస్సుచేసెను.
39-Chapter పూజ్యుడా! నీవు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవు. నీవు రెండు శరీరములను గూర్చి పలికితివి. వాని భేద మేమి. అవి ఏవి? అవి ఏవి? నాకు చెప్పుము.
40-Chapter అట్లే పౌషమాసమున దేవతలు సముద్రమును చిలికిరి. అప్పుడు స్వయముగా జనార్దనుడే తాబేలుగా ఆయెను.
41-Chapter ఓ మునీ! పరమధార్మికుడా! భూమిని తాల్చిన వరాహదేవుని మొదటి ద్వాదశిని గూర్చి వినుము. అది మాఘమాసమున శుక్ల పక్షమున వచ్చును.
42-Chapter అట్లే బుద్ధిమంతుడు పాల్గునమాసము శుక్లపక్షము ద్వాదశినాడు చెప్పిన పద్ధతి ప్రకారము ఉపవాసముండి హరినారాధింప వలయును.
43-Chapter మునీ! ఇట్లే చైత్రమాసమునను సంకల్పము చేసికొని దేవ దేవుడగు జనార్ధనుని ఆరాధింప వలయును.
44-Chapter వైశాఖమాసమున కూడ జను డిట్లే సంకల్పించి, మునుపు చెప్పినట్లు స్నానము మొదలగు నది ఆచరించి దేవాలయమున కరుగ వలయును.
45-Chapter మానవుడు జ్యేష్ట మాసమునందును ఇట్లే సంకల్పించి పరమదేవుని పెక్కు తీరులగు పూవులతో అర్చింప వలయును.

46-Chapter

మనుజుడు ఆషాఢమాసమునందును ఇట్లే సంకల్పించి విధి పూర్వకముగా ఆ పరమ దైవమును గంధ పుష్పములతో పెక్కు విధములుగా పూజింప వలయును.
47-Chapter శ్రావణ శుద్ధ ద్వాదశినాడు జనార్దనుడను పరమ దైవమును కొలువ వలయును.
48-Chapter అదే విధముగా భాద్రపదమాసము శుక్లపక్షమున ద్వాదశినాడును సంకల్పము చేసికొని విధి పూర్వకముగా పరమేశ్వరుని అర్చింప వలయును.
49-Chapter ఈ విధముగనే ఆశ్వయుజ మాసమున శుక్లపక్ష ద్వాదశి నాడు సంకల్పించి సనాతనుడగు పద్మనాభ##దేవుని అభ్యర్చింప వలయును.
50-Chapter మునిశ్రేష్ఠుడగు అగస్త్యుడు పుష్కరమను తీర్థమున కరిగి కార్తీకమాసమున మరల భద్రాశ్వుని మందిరమున కరుదెంచెను.
51-Chapter ధరణీ వ్రతమును గూర్చిన ఉత్తమమగు వాక్యమును దుర్వాసుని వలన విని సత్యతపుడు హిమవత్పర్వతము ప్రక్క భాగమునకు వెంటనే అరిగెను.
52-Chapter రాజా! ఆ మూడు వన్నెల పురుషుడు, పశుపాలుని తనయుడు స్వతంత్రతవలన 'అహమ్‌' అను మూడు రంగుల కుమారుని సృజించెను.
53-Chapter బ్రాహ్మణోత్తమా! నా ప్రశ్నకు నీవీ కథ చెప్పితివి. దాని విభూతి ఎట్లు ఏవని ఏ కార్యము చేత కలిగినది?
54-Chapter బ్రాహ్మణోత్తమా! విజ్ఞానము ఉత్పత్తిని కోరువానికి ఆరాధ్యుడెవరు? (ఎవనినారాధింపవలయును) ఆతని నారాధించు విధమెట్టిది? దీనిని నాకు ఉపదేశింపుము.
55-Chapter రాజా! వ్రతములలో మేలైన వ్రతమును చెప్పెదను వినుము. ఆశుభ##మైన వ్రతముతో విష్ణువు దక్కును. సంశయములేదు.
56-Chapter ఇటుపై మిక్కిలి శ్రేష్ఠమగు ధన్య వ్రతమును గూర్చి చెప్పెదను. దానిచేత అధన్యుడుకూడ వెనువెంటనే ధన్యుడగును.
57-Chapter ఇటుపై మిక్కిలి శ్రేష్ఠమగు కాంతివ్రతమును గూర్చి చెప్పెదను. దీని నాచరించి మునుపు చంద్రుడు తిరిగి కాంతిగలవాడాయెను.
58-Chapter మహారాజా! ఇటుపై సౌభాగ్యకరణమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది స్త్రీలకు, పురుషులకు సౌభాగ్యమును శీఘ్రముగా ప్రాసాదించును.
59-Chapter రాజా! నీకు అవిఘ్నకరమను వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము. అది చక్కగా చేసినచో విఘ్నము అనునది కలుగదు.
60-Chapter రాజా! ఇంక నీకు శాంతివ్రతమును గూర్చి చెప్పెదను వినుము. అది చేసినచో గృహస్థులకు ఎల్లవేళల శాంతి కలుగును.
61-Chapter మహారాజా! నీకిపుడు కామవ్రతమును చెప్పెదను. వినుము. దీనితో మనస్సులో తలచిన కామములు కూడ నెరవేరును.
62-Chapter మహారాజ! మిక్కిలి పుణ్యమైనది, పాపములన్నింటిని పటాపంచలు చేయునది అగు ఆరోగ్య వ్రతమను పేరుగల వ్రతమును తెలియజేసెదను.
63-Chapter మహారాజా! పుత్రప్రాప్తి వ్రతమను మరియొక పుణ్యవ్రతమును సంగ్రహముగా చెప్పెదను. వినుము.
64-Chapter ఇటుపై నీకు మిక్కిలి శ్రేష్ఠమైన శౌర్య వ్రతమును గూర్చి చక్కగా తెలిపెదను. దీనివలన పిరికి వానికిని అప్పటికప్పుడు గొప్ప శౌర్యము కలుగును.
65-Chapter సార్వభౌమ వ్రతమును గూర్చి సంగ్రహముగా చెప్పెదను. దీని నాచరించి రాజు వెంటనే సార్వభౌముడగును.
66-Chapter ఓ ధర్మజ్ఞా! నీ వెరిగినది గాని చూచినదిగాని ఆశ్చర్యమేమైన ఉన్నచో నాకు చెప్పుము. నాకు మిక్కిలి వేడుకగా నున్నది.
67-Chapter ఉత్తముడా! తెల్లని నల్లని స్త్రీలు ఇరువురున్నారని అందురు. వారెవరు? అందు పవిత్ర యెవ్వరు? నలుపు తెలుపుల ఇంతి ఎవరు? నలుపు తెలుపుల ఇంతి ఎవరు? ఈ పాపకుడు ఏడుగానయ్యెనట!
68-Chapter ఓమునీ! పరుడు, అపరుడు, సర్వగతుడు అయిన ఈ విష్ణుదేవుడు నాలుగు యుగములందు ఎట్టివాడు? ఆ పరమేశ్వరుని నెట్లు తెలిసికొననగును.
69-Chapter పూజ్యుడా! ద్విజశ్రేష్ఠుడా! నీ శరీరమున జరిగిన వింతయేమి? నీవు చిరంజీవివి ఎట్లయితివి? దీనిని నాకు చెప్పవలయును.
70-Chapter మునీ! నీవు ఆ అద్భుతలోకమును గాంచుటకు ఏవ్రతమును, ఎట్టితపమును, ఏ ధర్మమును చేసితివి?
71-Chapter ఆ పినాకి ఇట్లుచెప్పగా దేవతలు, ఋషులు, నేనును ఆ దేవునకు ప్రణమిల్లితిమి.
72-Chapter సర్వజ్ఞుడు, సర్వకర్త, భవుడు, పురాతనుడు, రుద్రుడు అగు పరమేశ్వరునికి ప్రణమిల్లి అగస్త్యుడు శ్రద్ధతో ఇట్లడిగెను.
73-Chapter మునివరా! వేడుకగొలుపు ఒక వృత్తాంతమును వినుము. నేను నీట మునిగినపుడు ఒక అపూర్వసంఘటన సంభవించినది.
74-Chapter సనాతనుడు, పురాణపురుషుడు శాశ్వతుడు, స్థిరుడు, అవ్యయుడు, విశ్వరూపుడు, అజుడు, శంభువు, ముక్కంటి, శూలపాణి అయిన ఆ రుద్రుని ఋషులందరు మరల ఇట్లు ప్రశ్నించిరి.
75-Chapter ఇటుపై జంబూద్వీపమును, అందలి సముద్రములను, ద్వీపములను గూర్చి విస్తరముగా ఉన్నదున్నట్లుగా చెప్పెదను.
76-Chapter ఆ మేరువునకు తూర్పున మిక్కిలి దీప్తి కలదియు, చక్రపాటమున వ్యాపించి యున్నదియు, పెక్కు ధాతువులతో విరాజిల్లునదియు నగు దేశమున చక్రపాటము నుండి వెలువడిన దేవతల రాజధానీ పురము కలదు.
77-Chapter ఆ పద్మపు దుద్దు మొదలు మేరువు నడిమి భాగమనియు, దాని కొలత వేల యోజనములనియు ననుకొంటిమి.
78-Chapter ఇప్పుడు నేను క్రమముగా ఆ నాలుగు పర్వత రాజముల సుందరములైన శిఖరములను గూర్చి చెప్పెదను. వినుడు. అందు పిట్టలకూతలు వినసొంపుగా నుండును. పెక్కుపక్షులు జతకట్టి తిరుగు చుండును.
79-Chapter సీతాంతము, కుముదము అనుకొండలనడుమ నున్న విశాలమైన భూమియందు అనేకపక్షులు, పెక్కుమృగములు ఆశ్రయించినది, మూడువందలయోజనముల పొడవు, నూరుయోజనముల వెడల్పు కలది,
80-Chapter అథదక్షిణ దిగ్వ్యవస్థితాః పర్వత ద్రోణ్యః సిద్ధాచరితాః కీర్త్యన్తే. శిశిర పతఙ్గయో ర్మధ్యే శుక్లభూమి స్త్రియా ముక్తలతాగలితపాదకమ్‌.
81-Chapter అతః పరం పర్వతేషు దేవానా మవకాశా వర్ణ్యన్తే, తత్రయో7సౌ శాంతాఖ్యః పర్వతస్యోపరి మహేన్ద్రస్య క్రీడాస్థానమ్‌. తత్ర దేవరాజస్య పారిజాతకవృక్షవనమ్‌.
82-Chapter ఇటు పై నదుల అవతారమును గూర్చి వినుడు. ఆకాశ సముద్రమని ప్రసిద్ధికెక్కిన సామమను పేరుగల దానినుండి ఆకాశమున ప్రవహించు నదియొకటి బయలుదేరెను. ఇంద్రుని యెనుగు దానిని కుదిలించి వేయుచుండును.
83-Chapter భద్రాశ్వములు, కేతుమాలములు అనువాని స్థితిని విస్తరముగా వర్ణించితిమి. నైషధమను పర్వతమునకు పడమరగా ఉన్న కులపర్వతములను, మమానదులను తెలియజెప్పుదుము. విశాఖము,
84-Chapter విప్రులారా! ఉత్తరదేశములయు, దక్షిణదేశములయు పర్వతములందు నివసించువారి వివరములను చెప్పుచున్నాను. చెదరని మనస్సులతో వినుడు.
85-Chapter ఇట్లు భూపద్మము స్వరూపమును వివరించితిని. ఇప్పుడు తొమ్మిది భేదములు గల భారతవర్షమును గూర్చి వినుడు. అవి ఇంద్రము, కేసరువు, తామ్రవర్ణము, గభస్తి, నాగద్వీపము, సౌమ్యము,
86-Chapter ఇటుపై మూడవదగు కుశద్వీపమును గూర్చి వినుడు. కుశద్వీపమును చుట్టి పాలనీరు కలదు. ఇదిశాకద్వీపమునకు రెండింతలుగా ఉన్నది. అందును ఏడు కులపర్వతములు కలవు. అన్నింటికి రెండేసి పేర్లు.
87-Chapter ఇక క్రౌంచద్వీపము నాల్గవది. కుశద్వీపము కంటె కొలతలో రెట్టింపుగా నుండును. అందును ఏడే ప్రధానములగు పర్వతములు. మొదటి క్రౌంచ పర్వతము విద్యుల్లతము. అదియే రైవతము. తరువాత మానసము.
88-Chapter మిగిలినమూడు ద్వీపములలో అయిదవదియగు శాల్మల ద్వీపమును గూర్చి చెప్పెదను. వినుడు. శాల్మలము క్రౌంచద్వీపమునకు రెట్టింపు అయినది.

89-Chapter

విభూ! దేవా! పరమాత్ముడు పుణ్యమూర్తి శివుడని కొందరందురు. ఇతరులు హరిని చెప్పుదురు. మరికొందరు. మరికొందరు బ్రహ్మను పలుకుదురు. వీరిలో పరదైవమెవరు? దీనిని నాకు చెప్పుము.
90-Chapter వరారోహా! మరియొక విషయము వినుము. శివుడు పరమేష్ఠియు నిర్దేశించిన ఆ త్రిశక్తికి సంబంధించిన మహా విధిని గూర్చి చెప్పెదను.
91-Chapter మందరమునకు తపస్సునకై అరిగిన ఆ రజోగుణము వలన ఏర్పడిన పరమశక్తి వైష్ణవి కౌమార వ్రతధారిణి యై ఒంటరిగా విశాల యను చోట తపస్సు చేయుచుండెను. తపము చేయుచుండగా పెద్ద కాలమునకు ఆమె మనస్సు కలతపడెను.
92-Chapter నారదు డట్టు పోగా దైత్యుడు అచ్చెరు వొందిన మనస్సుతో ఆ నారదుని ముఖమునుండి వినిన ఆ సుందరిని గూర్చియే చింతించుచుండెను.
93-Chapter ఇష్టమైన రూపము తాల్పగలవాడు, గొప్పబలముగలవాడును అగు మహిషరాక్షసుడు మదించిన ఏనుగనెక్కి మేరుపర్వతమునకు ప్రయాణము కట్టెను.
94-Chapter అంత మహిషుడు దూతగాపంపిన విద్యుత్ప్పభుడు దేవి సమీపమున కరిగి ఆ సుమధ్యమతో ఇట్లు పలికెను.
95-Chapter భూదేవీ! నీలగిరికి తపస్సునకై చెదరని మనసుతో అరిగిన, తమోగుణము వలన ఏర్పడిన రౌద్రియనుశక్తి పట్టిన వ్రతమును గూర్చి చెప్పెదను. వినుము.
96-Chapter వరాననా! ఇంక రుద్రవ్రతము పుట్టుకనుగూర్చి వినుము. ఆజ్ఞానముతో మానవుడు సర్వపాపములనుండియు ముక్తుడగును.
97-Chapter ప్రభూ! సత్యతపుడనువాడు మొదట బోయ అయి, తరువాత బ్రహ్మణుడై ప్రకాశించెను, అతడు తనశక్తిమేరకు ఆరుణి అనువానిని పెద్దపులిభయము వలన కాపాడెను. దుర్వాసుడు ఉపదేశింపగా హిమవత్పర్వతపు
98-Chapter అవ్యక్తము వలన జన్మించిన బ్రహ్మ శరీరమునుండి వెలువడిన ఆ మాయ గాయత్రి ఎనిమిదిభుజములు గలదియై వైత్రాసురునితో పోరాడెను. ఆమెయే దేవకార్యమును చేయగోరి నందమైనది.
99-Chapter రాజా! జలధేనువును గూర్చి చెప్పెదను పుణ్యదినమున విధిపూర్వకముగా గోమయముతో మండలముచేసి దానిపై గోవు చర్మమును ఉంచి దానినడుమ పూర్ణకుంభమును ఉంచవలయును. గంధముతో, కర్పూరము,
100-Chapter రాజా! రసధేను విధానమును సంక్షేపముగా చెప్పెదను. అలికిన నేలపై నల్లలేడి చర్మమును, దర్భాసనమును ఉంచి దానిపై చెరకురసము నింపినఘటమును ఉంచవలయును. దానిలో నాలుగవ భాగముతో
101-Chapter గుడధేనువును గూర్చి చెప్పెదను. ఇది కోరికల నన్నింటిని తీర్చునది. అలికిననేలపై లేడిచర్మము, దర్భాసనము పరచవలయును. దానిపై వస్త్రమునుంచి పుష్కలముగా బెల్లమును తెచ్చి దూడతో కూడిన ఆవు స్వరూపమును
102-Chapter అట్లే చక్కెరధేనువును గూర్చి ఉన్నదున్నట్లు చెప్పెదను. రాజా! వినుము. అలికిన నేలపై లేడిచర్మము, దర్భాసనము నుంచి నాలుగుబారువుల చక్కెరతో ఆవును చేయవలయును.
103-Chapter అలికిననేలపై లేడిచర్మము దుర్భాసనము నుంచి పదునారు నిండుకడవల తేనెతో ఆవును చేయవలయును, అందునాలుగవ భాగముతో దూడను కల్పింపవలయును.
104-Chapter ఆవుపేడతో అలికిన నేలపై గోచర్మము కొలతతో దర్భలను అన్నివైపుల పరచి దానిపై నల్లజింకతోలు నుంచవలయును.
105-Chapter ఆవుపేడతో అలికిన నేలపై గోచర్మమంత కొలతతో పూవులతో పాటుగా దర్భలు పరచి లేడిచర్మమును దర్భాసనమును ఉంచవలయును.
106-Chapter రాజా! వెన్న ఆవును గూర్చి శ్రద్ధతో వినుము. దానిని విని మానవుడు సర్వపాపమలనుండియు ముక్తుడగును. సంశయము లేదు.
107-Chapter అలికిన నేలపై జింకర్మము, దర్భాసనములపై పదునారు తూముల ఉప్పుతో ఆపురూపమును చేయవలయును. నాలుగు తూములతో దూడను చేయవలయును. ఆవునకు కాళ్లు చెరకుగడలు.
108-Chapter రాజా! ప్రత్తి ఆవును గూర్చి వివరించెదను. దాని నిచ్చుట వలన నరుడు మిక్కిలి శ్రేష్ఠమగు ఇంద్రలోకమున కరుగును.
109-Chapter రాజా! ఉత్తమమగు దానమాహాత్మ్యమును వినుము. దీనిని సంకీర్తించినంతమాత్రమున పార్వతీదేవి సంతోషమందును. విశేషించి విషువమునందును, అయనమునందును, కార్తీకమాసము నందును ఇది వినవలయును.
110-Chapter ఇక ఇటుపై యగు కపిలాధేనువును గూర్చి చెప్పెదను. దాని దానమువలన నరుడు అత్యంత శ్రేష్ఠమగు విష్ణులోకమును పొందును.
111-Chapter మహారాజా! ఇటుపై వరాహదేవుడు భూదేవికి మునుపు చెప్పిన ఉభయముఖ్యములగు ధర్మములను చెప్పెదను. అది నీపుణ్యఫలమును అగును. (ఉభయములు - పరము, ఇహము.)
112-Chapter లీలగా భూమిని ఉద్ధరించిన వరాహస్వామికి నమస్కారము. అట్లెత్తునప్పుడు ఆతని గిట్టలనడుమ చిక్కిన మేరుపర్వతము ఖణఖణలాడినది.
113-Chapter మునులు, వేదపండితులు మున్నగువారు ఇట్లు చక్కగా స్తుతించుచుండగా నారాయణుడు, దేవుడు, కేశవుడు, పరముడు, విభువు తుష్టుడాయెను.
114-Chapter అంత ఆభూదేవి పలుకు విని నారాయణదేవుడిట్లు పలికెను. దేవీ! స్వర్గసుఖమును కలిగించు కర్మమార్గమును నీకు చెప్పెదను.
115-Chapter పుణ్యులారా! నేను చెప్పిన తీరున కర్మములు ఆచరించు వాడు ఎట్లు సఫలత్వముపొందునో చెప్పెదను వినుము.
116-Chapter వసుంధరా! మరియొక గొప్పవింతను వినుము. ఇది ఆహార విధికి సంబంధించిన నిశ్చయము. ఏది ఆహారము, ఏదికాదు అను విషయమును గూర్చి వినుము.
117-Chapter భద్రా! ప్రాయశ్చిత్తము నున్నదున్నట్లు విధి ననుసరించి చెప్పెదను వినుము. మరియు ఏ తెలివితో నాభక్తునకు దాన మొసగవలయునో చెప్పెదను.
118-Chapter ఇట్లు సంసారమునుండి విముక్తి కలిగించు పూజా విధానమును విని భూదేవి ప్రసన్నమగుముఖముగల దేవునితో మరల ఇట్లు పలికెను.
119-Chapter దేవీ! నీవు నన్నింతకుముందడిగిన సంసారతరణమును గూర్చి మిక్కిలి రహస్యమగుదానిని చెప్పెదను వినుము.
120-Chapter ఓమాధవీ! దేనిచేత మనుజుడు గర్భవాసము పొందకుండునో ఆ సర్వధర్మ వినిశ్చయమును చెప్పెదను వినుము.
121-Chapter వసుంధరా! పశుపక్ష్యాది జన్మములందినవారు కూడ పాపమునుండి విడివడు మిక్కిలి రహస్యమును వినుము.
122-Chapter పిక్కటిల్లిన సత్తువగల ధర్మమును విని పరమాశ్చర్యమును పొందెను.
123-Chapter ఫాల్గునమాసపు శుక్లపక్ష ద్వాదశినాడు మంచి పరిమళముగల అడవి మొల్లలను, తెలుపుమించిన పసిమివన్నెగల వానిని గ్రహించి మిక్కిలి ప్రీతినొందిన అంతరాత్మతో మంత్రపూర్వకమైన విధానముతో భాగవతుడు
124-Chapter కొనియాడబడువ్రతములు గల భూదేవి ఆరుఋతువుల కర్మములను విని నారాయణ దేవునితో మరల ఇట్లనెను.
125-Chapter కొనియాడదగిన వ్రతములు గల ధరణి మాయాబలమును గూర్చి విని వరాహదేవునితో ఇట్లు పలికెను.
126-Chapter పెక్కు మోక్షధర్మ సాధకములగు ధర్మములను విని భూదేవి లోకనాథుడగు జనార్దనునితో ఇట్లు పలికెను.
127-Chapter ఓ వసుంధరా! ఇప్పుడు క్షత్రియునకు సంబంధించిన దీక్షను గూర్చి చెప్పెదను. వినుము ఆతడు ముందు నేర్చుకొన్న ఆయుదముల నన్నింటిని వదలి వేయవలయును. పిమ్మట ఆతనికి ముందు చెప్పిన మంత్రముతొ
128-Chapter నా పనులయందు శ్రద్ధకలవాడు నాకలంకారములను సమర్పించి తొమ్మిది వరుసలుగల తెల్లని జన్నిదమును నాకు అర్పింపవలయును.
129-Chapter ఇట్లు భూదేవి దీక్షను నారాయణుని ముఖము నుండి విని పవిత్రమైన మనస్సు కలదియై మరల విష్ణువుతో నిట్లు పలికెను.
130-Chapter ఉదయమున పలుదోముపుల్ల నుపయోగింపక (పండ్లు తోముకొనక) నా కడకు వచ్చువాని పూర్వపుణ్య మంతయు ఆ ఒక్కపాపముతో నశించును.
131-Chapter మిథునకర్మమును కావించి స్నానము చేయక నా వస్తువులను తాకు దుష్టబుద్ధి పదు నాలుగువేల యేండ్లు రేతస్సును త్రావును.
132-Chapter భూదేవీ! నన్ను తాకుచు మలమువంటి అపానవాయువును వదులువాడు, వాయువుచే పీడింపబడిన మనస్సు కవలవాడై అయిదేండ్లు ఈగయై, మూడేండ్లు ఎలుకయై, మూడేండ్లు కుక్కయై, తొమ్మిదేండ్లు తాబేలై పుట్టును.
133-Chapter భూమీ! నా అర్చనము చేయుచు మలమును విసర్జించు దోషమును గూర్చి నేను చెప్పుచున్నదానిని వినుము.
134-Chapter నా భక్తుడు నా మంత్రములను వదలి చెడు పలుకులు పలికినచో అట్టివాడు పండ్రెండు జన్మములు మూర్ఖుడగును.
135-Chapter ఎర్రని వస్త్రముతాల్చి నా కడకు అరుదెంచువాని సంసారముక్తి విధాన మెట్లుండునో, ఓ భూదేవీ! వినుము.
136-Chapter దేవీ! దీపము ముట్టుకొని నా పూజలు చేయుట అను దోషము వలన మానవుడు పాటునొందును.
137-Chapter స్వామీ! ఈ అపరాధ విశోధనమును విస్తారముగా వింటిని. ఇవి భగవంతునికి సంబంధించినది. శ్రేష్ఠమైనది ఆశ్చర్యకరమైనది. భాగవతులందరకు మిక్కిలి ప్రియమైనది. నా ప్రియము కొరకు,
138-Chapter సౌకరక తీర్థమునందలి ఈ పుణ్యమును, గుణస్తుతిని, మాహాత్మ్యమును, జాతుల మార్పును విని కమలపత్రాక్షి, సర్వ ధర్మములనెరిగిన వారిలో మిన్న అయిన భూదేవి పరమాశ్చర్యమును పొంది,

Varahamahapuranam-1    Chapters